CPI (ML) Maoist
-
ఫైర్ బ్రాండ్ మరో మమత
మమతా బెనర్జీతో ఏ అమ్మాయినీ పోల్చలేం. 15 ఏళ్ల వయసుకే మమత రాజకీయాలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే విజేతగా నిలిచారు! మమత లోపల ఉన్న ఫైర్‌తో మాత్రం ప్రతి అమ్మాయినీ రిలేట్ చెయ్యొచ్చు. ఇంటి దగ్గర మనం రోజూ చూసే అమ్మాయిని, జేఎన్‌యు స్టూడెంట్ లీడర్ ఐషీ ఘోష్‌ని కూడా! 26 ఏళ్ల ఐషీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది! మే 2 న వెలువడే ఎన్నిక ఫలితాలలో జమూరియా నియోజకవర్గం నుంచి సి.పి.ఐ (ఎం) అభ్యర్థి ఐషీ గెలిచినట్లు వార్త వస్తే కనుక భవిష్యత్తులో ఏనాటికైనా ఒకరోజు దేశ ప్రజలు.. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఐషీ ఘోష్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు’’ అనే వార్తనూ వినబోతారు! మరీ టూ మచ్ అనిపిస్తే కనుక.. ఆ నిప్పును కొంచెం తాకి చూస్తే ఐషీ హౌమచ్చో తెలుస్తుంది. జేఎన్యులో ప్రస్తుతం పొలిటికల్ ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఐషీలోని ’చప్పున అంటుకునే’ గుణం గల చైతన్యశీలతే ఆమెను రాజకీయాల్లోకి రప్పిస్తోంది! 3ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నెలాఖరుకు గానీ నోటిఫికేషన్ విడుదల కాని ఏడో విడత ఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు, ఢిల్లీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు కారణం ఏడో విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగే జమూరియా నియోజకవర్గం నుంచి జేఎన్‌యు విద్యార్థి సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పోటీకి నిలబడటం! ఆమె సీపీఐ (ఎం) తరఫున పోటీ చేయబోతున్నప్పటికీ, ఏ పార్టీ నుంచి అని కాకుండా, అసలు ఆమె పోటీకి దిగడమే విశేషం అయింది. ‘‘నా మదిలో, నా హృదయంలో జేఎన్ యు ఉంది. పశ్చిమ బెంగాల్ బొగ్గు గనుల కార్మిక ఉద్యమ అనుభవం నన్ను రాజకీయాల్లోకి ప్రేరేపిస్తోంది’’ అంటున్నారు ఘోష్, తన ‘కొత్త’ రాజకీయ రంగ ప్రవేశం గురించి. ఇప్పటికే ఆమె విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. గత ఏడాది జనవరి 5 న ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీలోని పెరియార్ హాస్టల్లో ఆమెపై ప్రత్యర్థుల దాడి జరగడానికి కూడా ఆ చైతన్యశీలతే కారణం. దాడి అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ వెళ్లి ఆమెను అభినందించారు. ఆశీస్సులు అందించారు. ఆయనకన్నా ముందు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ వెళ్లి ‘వందనం.. అభివందనం’ అన్నారు! ఐషీ ఘోష్ ప్రస్తుతం ఎంఫిల్ రెండో సంవత్సరం చదువుతున్నారు. జేఎన్‌యు లో చదువుతూ ఒక విద్యార్థి అసెంబ్లీకి పోటీ చేయడం యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమం. వర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో ఆమె తన మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ∙∙ జేఎన్యులో తాము ఎందుకోసం అయితే పోరాడుతున్నామో, అదే ఉద్యమ పోరును తాను దేశ రాజకీయాల్లో కొనసాగించబోతున్నానని ఐషీ అనడంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పార్టీల దృష్టీ ఆమెపై మళ్లేలా చేసింది. మెరుగైన విద్య, ఉపాధి, మంచి జీవన ప్రమాణాలు ఆమె తొలి ప్రాధాన్యాలు. జమూరియా బరిలో దిగేందుకు ఇప్పటికే ఆమె తన హాస్టల్ గదిలోని సామగ్రి ని సర్దుకుని ఉన్నారు. జమూరియాకు గంటన్నర దూరంలోనే ఆమె స్వస్థలం దుర్గాపూర్. అది వేరొక నియోజకవర్గ పరిధి లో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు దుర్గాపూర్‌లోనే ఉంటున్నారు. తండ్రి దేబశిష్ ఘోష్ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ఉద్యోగి. కార్మిక నాయకుడు. తల్లి శర్మిష్ఠ ఘోష్ గృహిణి. ఇంట్లో ఐషీనే పెద్ద. చెల్లెలు ఇషిక కూడా ఢిల్లీలోనే అక్కడి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. ఐషీ ఘోష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల ఇంట్లో అందరూ సుముఖంగా ఉన్నారు. తండ్రయితే సంతోషంగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాలకు జమూరియా పేరుమోసిన ప్రాంతం. తన కూతురు గెలిస్తే అక్రమాలు తగ్గుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఐషీ వాటిని ఎలాగూ తగ్గిస్తారు. అయితే ఆమె ప్రధాన అజెండా వేరే ఉంది. ‘‘ఉన్నత విద్యల కోసం, పెద్ద జీతాల కోసం, మంచి జీవితం కోసం యువత పరాయి ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పశ్చిమ బెంగాల్ వృద్ధాశ్రమంలా మిగిలిపోతోంది. వాళ్లను ఆపడం కోసం ఉపాధి కల్పనపై మొదట నా పని ప్రారంభిస్తాను’’ అంటున్నారు ఐషీ. ఘోష్ దుర్గాపూర్‌లోనే ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. దుర్గాపూర్‌లో ఉండగా తండ్రితో పాటు స్థానిక బొగ్గు గనుల కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. ఇరవై ఏళ్ల వయసులో విద్యార్థిగా ఢిల్లీ వచ్చేశారు. ఎన్నికల అభ్యర్థిగా ఇప్పుడు మళ్లీ బెంగాల్ వెళుతున్నారు. ‘‘ఒకవేళ మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా జమూరియాను, ఎంఫిల్ విద్యార్థిగా జేఎన్‌యును ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు?’’ అనే ప్రశ్న ఇప్పటికే మొదలైంది. ‘‘బ్యాలెన్స్ చేసుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసం తో చెబుతున్నారు ఐషీ ఘోష్. ఆ ఆత్మ విశ్వాసం ఆమెలో ఫైర్ బ్రాండ్ మమతను ప్రతిఫలింపజేస్తోంది. గత ఏడాది ప్రత్యర్థుల దాడిలో గాయపడి, కోలుకుంటున్న సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఐషీఘోష్. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. -
పోలీసుల అదుపులో ఇద్దరు న్యూడెమోక్రసీ నేతలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన ఇద్దరు కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కమిటీ సభ్యుడు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సోమ భాస్కర్ అలియాస్ సూర్యం, జిల్లా కమిటీ సభ్యుడు బూర్క ప్రతాప్ అలియాస్ శ్యాంలను సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా అసరవెల్లి, మేడిపల్లి గ్రామాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది. సూర్యం దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన వ్యక్తి కాగా, శ్యాం కొత్తగూడ మండలం గంజేడు వాసి. సూర్యం సుమారు రెండు దశాబ్దాలుగా వామపక్ష ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల న్యూడెమోక్రసీ పార్టీలో, పార్టీ నాయకులకు దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇద్దరు కీలక నేతలు పోలీసుల అదుపులోకి చేరడం చర్చనీయాంశంగా మారింది. సూర్యం, శ్యాంలను అసరవెల్లి, మేడిపల్లి సరిహద్దులో ఓ ఇంట్లో సేద తీరుతుండగా పోలీసులు అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా.. వారిద్దరు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారన్న ప్రచారం ఉంది. అయితే ఈ విషయమై పోలీసులు మాత్రం మంగళవారం సాయంత్రం వరకు ్ర«ధుృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు పోలీసులకు చిక్కారా..? లేక లొంగిపోయారా..? అన్న చర్చ జరుగుతోంది. సూర్యం, శ్యాంను కోర్టులో హాజరుపర్చాలి సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సూర్యం, శ్యాంలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వీరిద్దరిని రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలు కలిగిస్తుందని తెలిపారు. -
సీపీఐ(ఎంఎల్) సీనియర్ నాయకురాలు మృతి
సాక్షి, శ్రీకాకుళం: సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ జయమ్మ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. 70 ఏళ్లుగా గిరిజన సాయుధ పోరాటంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో 35 సంవత్సరాలు అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అనంతరం 1995లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జనజీవనానికే మొగ్గు చూపారు. -
నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు
సాక్షి, కాళేశ్వరం: సీపీఐ (పీపుల్స్‌వార్) విప్లవోద్యమంలో ధ్రువతారలుగా వెలిగిన నాయకులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, శీలం నరేష్ అలియాస్ మురళి ఎన్కౌంటర్లో మరణించి నేటికీ (సోమవారం) 20 ఏళ్లు పూర్తవుతుంది. వీరు భూ స్వామ్య, సామ్రాజ్యవాద నిరంకుశ పాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ పీపుల్స్‌వాల్ అగ్ర నాయకులుగా ఎదిగారు. 1999 డిసెంబర్ 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్మూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసారు. ఈ ముగ్గురు నేలకొరిగిన కొమ్మూర్ ఎన్కౌంటర్ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్ పార్టీకి చరిత్రలో ఎప్పటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలింది. అప్పటి నుంచి పోలీసులు అగ్ర నేతలపై దృష్టి పెట్టి ఏరివేతనే ప్రారంభించారు. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న పీపుల్స్‌వార్ పార్టీ 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి పూర్తిగా బలహీన ప డుతూ వస్తుంది. రాష్ట్రంలో ఉనికి కోసం తాపత్రయ పడుతూ ఇటీవల కాటారం సబ్ డివిజన్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల పేరుతో కరపత్రాలతో వేస్తూ ఉనికి చాటుతున్నారు. అమరుల యాదిలోనే.. అగ్రనాయకుల జ్ఞాపకార్థ ఎన్‌కౌంటర్‌అయిన మరుసటి ఏడాది 2000 డిసెంబర్ 2న పీఎల్జీ ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)ను ఏర్పాటు చేశారు. వీరిని స్మరించుకునేందుకు ప్రతియేట డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టులు వా రోత్సవాలను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలతో గోదావరి తీర ప్రాంతాల్లో నిఘానే పెట్టారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాట కుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భద్రత..మహదేవపూర్ మండలంలో ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ, సరస్వతీ బ్యారేజీలతో పాటు లక్ష్మీపంపుహౌస్‌లకు ఇంటిలిజెన్స్ నిఘా విభాగం హెచ్చరికలతో భద్రతను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు నేటి నుంచి జరిగే మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత నదులను మావోయిస్టులు దాటకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోలను కట్టడి చేయడానికి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, జిల్లా గార్డులు కూంబింగ్‌తో పాటు తనిఖీలు చేస్తున్నారు. -
‘ఆగస్టు 15ను బ్లాక్ డేగా పాటించాలి’
సాక్షి, హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి అధికరణాలైన ఆర్టికల్ 370, 35 ఏ లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటాన్ని, కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని, ఆగస్టు 15ను ‘‘బ్లాక్ డే’’గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపు నిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సంఘ్ పరివార్ బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదుల బీజేపీ ప్రభుత్వం తమ పథకంలో భాగంగానే కొద్ది రోజుల ముందు నుండే ఆర్టికల్స్ 370, 35 ఏ లను రద్దు చేయటానికి ముందు కశ్మీర్ లోయను దిగ్భంధం చేశారని తెలిపింది. కేంద్ర హెం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వాన జాతీయ సలహాదారు అజిత్ ధోవల్, హెం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారని పేర్కొంది. ఉగ్రవాదుల దాడి ముప్పు ఉన్నదనే పేరుతో భారీ స్థాయిలో కశ్మీర్లో సైన్యాన్ని మోహరించి 144 సెక్షన్లు అమలు చేస్తూ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ నిషేదించి ప్రజలను బయట ప్రపంచంతో దూరం చేశారని వెల్లడించింది. అమర్నాథ్ యాత్రికులను, విద్యాలయాలను మూసివేసి విద్యార్థులను కశ్మీర్ నుంచి వెనక్కు పంపడం మెదలుపెట్టారని, మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్భంధంలోకి తీసుకున్నారని తెలిపింది. ఆ తర్వాతనే రెడ్ అలర్ట్‌ను ప్రకటించారని, భారత్ -పాకిస్తాన్ సరిహద్దులో బలగాలను మోహరించారని పేర్కొంది. ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు, ముస్లిం ప్రజలు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చార్టర్, భద్రతాసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్లో చట్టాలను మార్చవచ్చును కాని ఏకపక్షంగా చట్టాల్లో మార్పులు చేసే అధికారం భారత ప్రభుత్వానికి లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో 370,35ఏ ఆర్టికల్‌లను రద్దుచేయటాన్ని తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు, వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు జరుపుకోవటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మైనార్టీలు , దళితులు, ఆదివాసులు, అన్ని సెక్షన్ల ప్రజలు, వామపక్షాలు, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి సంస్థలు, వ్యక్తులు పార్లమెంటులో ఆమోదించి రద్దు చేసిన ఆర్టికల్‌లను పునరుద్ధరించే వరకు పోరాడాలని కోరింది. 370, 35 ఏ రద్దుకు నిరసనగా ఆగస్టు 15ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘బ్లాక్ డే’’గా పాటించాలని మరో సారి పిలుపునిచ్చింది. -
అభయారణ్యంలో ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్ నేత ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్ రీజినల్ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్ పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్లగూ డెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు. లింగన్నతోపాటు ఏరియా కమాండర్ గోపి, మరో ఐదుగురు దళ సభ్యులు 3 రోజులుగా అక్కడ మకాం వేశారు. పోలీసు బలగాలు కొన్ని రోజులుగా అదేప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. లింగన్న దళం అక్కడ ఉన్న ట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాం తానికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, లింగన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. లింగన్న మృతిచెందాడు. ఏరియా కమాండర్ గోపి, మరో ముగ్గురు దళసభ్యులు పారిపోయారు. మరో ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై రాళ్లదాడి ఉదయం 7 గంటల సమయంలో లింగన్న ఎన్కౌంటర్ జరగ్గా..మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో సమాచారం బయటకు రాకపోగా.. సంఘటన స్థలానికి ప్రజలను, మీడియాను పోలీసులు వెళ్లనివ్వలేదు. లింగన్న సొంతూరు రోళ్లగడ్డ కావడంతో ఆ ప్రాం తంలో తీవ్ర అలజడి నెలకొంది. గుండాల మండలంలోని రోళ్లగడ్డ, లింగగూడెం, దేవళ్లగూడెం, పోలిరెడ్డిగూడెం తదితర గ్రామాలకు చెందినవారు అటవీ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. సంఘటనాస్థలంలో వంట సామగ్రి తప్ప ఏమీ కనిపించలేదు. తమ అదుపులో ఉన్న మరో ఇద్దరు దళసభ్యులతో లింగన్న మృతదేహాన్ని మోయిస్తూ.. మరో మార్గం గుండా పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు ఆగ్రహంతో రాళ్ల దాడి చేయగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు తప్పించుకునేక్రమంలో లింగన్న మృతదేహాన్ని, అదుపులోకి తీసుకున్న ఇద్దరు దళ సభ్యులను వదిలి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు దళసభ్యులు గ్రామస్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన పోలీసులు ఆరు, ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులపై సైతం పోలీసులు చేయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గుండాలకు రాకుండా వేరే మార్గంలో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు పందిగుట్ట పక్కన గుట్టపై న్యూడెమోక్రసీ లింగన్న దళాలకు సంబంధించి మరో రెండు మృతదేహాలు ఉన్న ట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీసులు న్యూడెమోక్రసీ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 20 నెలల తర్వాత ఇల్లెందు ఏజెన్సీలో.. ఇల్లెందు డివిజన్ పరిధిలోని ఏజెన్సీలో 20 నెలల తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. 2017, డిసెంబర్ 14న టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక–మేళ్లమడుగు అటవీప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 9 మంది సీపీబాట (చండ్ర పుల్లారెడ్డి బాట) దళసభ్యులు మృతిచెం దారు. కాగా, ఉద్యమంలో 20ఏళ్లకు పైగా ప్రస్థా నం కలిగిన, అజ్ఞాతదళాలకు కమాండర్‌గా ఉన్న లింగన్న మృతితో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో ఆందో ళన నెలకొంది. ఆపార్టీ కీలకనేత ఆవునూరి మధు బుధవారం వరంగల్ జైలు నుంచి విడుదల కాగా.. కొన్ని గంటల ముందే లింగన్న ఎన్కౌంటర్ కావడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలం జైలులో ఉండి వచ్చారు. తిరిగి గత ఏప్రిల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే అజ్ఞాతంలోకి వెళ్లారు. లింగన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఏకపక్షంగా చంపేశారని ఎన్డీ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రీజియన్ కార్యదర్శి ఆవునూరి మధు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరు లింగన్న ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా గిరిజన హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న కమాండర్ లింగన్నను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపి హత్య చేశారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలి సాక్షి, హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇది ఎన్కౌంటర్ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్కౌంటర్ తర్వాత ఆరు పోలీస్స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు. -
‘హిందుత్వ ప్రచారంతోనే బీజేపీ గెలుపు’
సాక్షి, హైదరాబాద్: దేశభక్తి ఉన్మాదం, కార్పొరేట్ సహకారం, హిందుత్వ ప్రచారపు పరాకాష్టతో బీజేపీ మరోసారి గెలుపొందిందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో విమర్శించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాల నిర్వహణ, ఐక్యంగా ప్రతిఘటించడంలోనూ ప్రతిపక్షాలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు. 2014 మేనిఫెస్టో అమల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విపక్షాల ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించడం వంటి వ్యవహారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సగం స్థానాలే సాధించిందని చంద్రన్న వివరించారు. -
‘రాష్ట్రంలో నియంత పాలన’
ఆర్మూర్ : అమరవీరుల త్యాగాలతో ఆవిర్భవించిన రాష్ట్రంలో ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా కుటుంబ పాలనతో నియంతలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల ఆకాంక్షల దీక్ష దినంగా పాటిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సును శనివారం నిర్వహించారు. ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అంతకు ముందు ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడారు. సూర్యశివాజి, ఏపీ గంగారాం, రాజన్న, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కిషన్, సుమన్, నిఖిల్, గంగాధర్, నరేందర్, ప్రశాం త్, క్రాంతి,లక్ష్మి, అయేషా బేగం పాల్గొన్నారు. -
ముగ్గురు ఎన్డీ దళసభ్యుల అరెస్ట్
పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎంల్) న్యూడెమోక్రసీ రామన్న దళానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉత్తమకుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు అటవీ ప్రాంతంలో రాళ్లవాగు పరిసర ప్రాంతాల్లో దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ రఘవేంద్రరావు, ఎస్ఐ ఎం.రమేష్ సిబ్బంది శనివారం గాలింపు చేపట్టగా అనుమానాస్పద స్థితిలో తారసపడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎన్డీకి చెందిన రామన్న దళంలో సభ్యులుగా ఉన్న బూర్గంపాడు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన కోవాసి బుద్రు అలియాస్ సురేష్, అశ్వాపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడివి ఉంగి, ఎలియాస్ కవిత, రోజా, భవాని, పాల్వంచ మండలం రెడ్డిగూడేనికి చెందిన వీరమల్ల సురేష్‌ను అరెస్టు చేసి వారి వద్ద రైఫిల్, ఫిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ఏడాది నర్సంపేటలో జరిగిన రాయల భాస్కర్ హత్యకేసులో, 2017లో బోడు ప్రాంతంలో పోలీసులకు ఎన్డీ దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఈ ముగ్గురూ ఉన్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసరావు, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రాఘవేంద్రరావు, అశ్వారావుపేట సీఐ అబ్బయ్య, ఎస్ఐ ఎం.రమేష్ పాల్గొన్నారు. -
వారంతా ఐసీస్‌లో శిక్షణ పొందుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రకార్యకలపాలను ప్రోత్సహించేందుకు సిక్కు యువత పాకిస్తాన్లో ఐసీస్ సౌకర్యాలతో శిక్షణ పొందుతున్నట్టు కేంద్రహోం మంత్రిత్వశాఖ సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషితో కూడిన పార్లమెంటరీ కమిటీకి ఓ నివేదికను సమర్పించింది. కెనడా, ఇతర దేశాల్లో నివసిస్తున్న సిక్కు మతానికి చెందిన యువతకు భారత్ పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, హానికర సంఘటనలకు ప్రేరణపొందేలా చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా దుర్వినియోగంతో యవత అత్యధికంగా త్రీవవాద గ్రూపులకు దగ్గరవుతుందన్నారు. సిక్కు మిలిటెంట్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఐసీస్ కనుసన్నల్లో శిక్షణ పొందుతున్న కమాండర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలపాలకు ప్రయత్నిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. నిరుద్యోగులు, స్మగ్లర్లు, జైల్లో ఉన్న సిక్కు నేరస్తులను చేరదీసి పాకిస్తాన్లో ఐసిస్ సౌకర్యాలతో శిక్షణ ఇస్తున్నట్టు హోం మంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. దేశంలో గత కొద్ది రోజులుగా వామపక్ష తీవ్రవాదం పెరిగిపోతుందని, దీనివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పుందని తెలిపంది. 2004లో ఏర్పడిన సీపీఐ మావోయిస్ట్ అత్యంత శక్తి వంతమైన వామపక్ష తీవ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మాద్, ఇండియన్ ముజాహిద్దీన్, సిమీ లాంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై భద్రతాధళాలు దృష్టిసారించాయి. -
ఓటమిపై స్పందించిన సీపీఎం
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపుర ఎన్నికల ఓటమిపై సీపీఎం స్పందించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ డబ్బు, అధికారాన్ని ఉపయోగించి వామపక్షేతర శక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చిందని.. ఈ క్రమంలోనే అది విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘డబ్బును భారీ స్థాయిలో పంచి బీజేపీ అనైతిక రాజకీయాలను ప్రదర్శించింది. సీపీఎం, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవటంలో విజయం సాధించింది. అయినప్పటికీ వామపక్ష పార్టీ 45 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అందుకు త్రిపుర ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో కూడా స్పందించారు. త్రిపుర ఓటర్లు బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, 25 ఏళ్లుగా తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే బీజేపీ మోసపూరిత రాజకీయాలను ప్రశ్నించటం మాత్రం తాము ఆపబోమని.. దేశవ్యాప్తంగా బీజేపీ-ఆరెస్సెస్ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. Tripura voters have given their mandate for a BJP-IPTF government in the state. We thank the people of Tripura for giving us the opportunity to serve them for the past 25 years. We will continue to oppose BJP and its divisive agenda not only in Tripura but all over India. (1/n) — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 The Polit Bureau thanks the 45 per cent of the voters who extended support to the CPI(M) and the Left Front. The Party will carefully examine the reasons for this electoral setback and take necessary remedial measures. Full text: https://t.co/wjdhdqGrpU pic.twitter.com/BlDjCj81QS — Sitaram Yechury (@SitaramYechury) 3 March 2018 -
టార్గెట్ ముంబై!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోందా? ముంబైలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందం చేపట్టిన తనిఖీల్లో ఏడుగురు మావోయిస్టులు పట్టుబడటం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో మావోల పునర్నిర్మాణం చర్యలు నిజమేనని నిఘా వర్గాలు కూడా స్పష్టం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర కేంద్ర కమిటీలో ఉన్న 21 మంది నేతల్లో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారే ఉండటం దేశవ్యాప్తంగా పార్టీ పటిష్టతకు మావోలు సాగిస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడగానే గుర్తించాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు ముంబైలో కార్యకలాపాలు సాగిస్తుండటం వెనకున్న కారణాలపై ఆరా తీసేందుకు రాష్ట్ర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐబీ) ఒకటి ముంబై వెళ్లింది. కార్మిక ప్రాంతంలో షెల్టర్... తెలంగాణ, ఆంధప్రదేశ్, గుజరాత్, పుణే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతాలైన విక్రోలీ, రాంబాయ్, అంబేడ్కర్‌నగర్, కామ్రాజ్ నగర్లలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కార్మికులను తమ కోసం పనిచేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కమిటీ ఆదేశాలతో కొందరు మావోయిస్టులు రహస్యంగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అరెస్టయిన ఏడుగురు కూడా ఇదే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. నేతలందరి ఆవాసం అక్కడే... మావోయిస్టు నేత గణపతి గతంలో తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కున్నాడని, ఆ సమయంలో ముంబై వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు ఎస్ఐబీ గుర్తించింది. ఇప్పుడు అరెస్టయిన వారిని విచారిస్తే గణపతి ట్రీట్మెంట్ వ్యవహారంతోపాటు ఇతర కీలక నేతలంతా వారి నివాసాలనే షెల్టర్‌గా మార్చుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 2015 మే 10న సీపీఐఎంల్–నక్సల్బరీ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.మురళీధరణ్ అలియాస్ అజిత్ కూడా ఇక్కడే పట్టుబడ్డట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ 135 మందిలో ఉన్నారా? ముంబైలో ఏటీఎస్ అరెస్ట్ చేసిన ఏడుగురు మావోయిస్టు నేతలు అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ వ్యక్తుల జాబితాలో ఉన్నారా లేరా అనే విషయమై ఎస్ఐబీ అధికారులు ఆరా తీయనున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ముంబైలోనే నివసిస్తున్న వీళ్లు మావోయిస్టు పార్టీలో ఏ క్యాడర్లో పనిచేస్తున్నారు... వారి పేర్లు ఏమిటి తదితర వివరాలన్నింటిపై వివరాలు సేకరించనున్నారు. అజ్ఞాతంలో ఉన్న 135 మందిలో ఈ ఏడుగురు ఉన్నారా లేక ఇలాంటి వారు ఇంకెంత మంది స్లీపర్ సెల్స్‌గా ఉంటున్నారనే దానిపై విచారిస్తున్నామని ఎస్ఐబీ ఉన్నతాధికారులు తెలిపారు. గోల్డెన్ కమిటీలో ఆ ప్రాంతాలే... వ్యాపార కేంద్రాలకు చిరునామా అయిన గుజరాత్‌తోపాటు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్రలో పార్టీ పునర్మిణానికి గోల్డెన్ కారిడార్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తోంది. 2008లోనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అప్పటి సెంట్రల్ కమిటీ సభ్యుడు తుషార్ భట్టాచార్య అరెస్టుతో కాస్త డీలాపడినా ఆ తర్వాత మావోయిస్టు కీలక నేత కోబడ్ గాంధీ చర్యలతో పార్టీ పటిష్టమైంది. ఆ తర్వాత ఈ కమిటీ ప్రభావం గుజరాత్‌లోని అహ్మదాబాద్, వల్సాడ్, కచ్, బనస్కాంత, వడోదరా, సూరత్, డాంగ్ ప్రాంతాల్లో ఉండేది. పట్టణ ప్రాంతాల్లో పార్టీ విస్తృతే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశమని కోబడ్ గాంధీ 53 పేజీలతో ప్లీనరీ నిర్ణయాలను రూపొందించారు. అలాగే మహారాష్ట్రలోని ముంబై, పుణే, ఔరంగాబాద్ ప్రాంతాలను సైతం ఈ కమిటీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిసింది. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లతోపాటు మహారాష్ట్ర మొత్తం కూడా గతంలో రెడ్ కారిడార్ కమిటీలో భాగంగా ఉండేది. అయితే పట్టణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం కోసం సానుభూతిపరులను, పార్టీ క్యాడర్ రిక్రూట్మెంట్ కోసం గోల్డెన్ కారిడార్లోకి మహారాష్ట్రలోని ముంబై, పుణేలను తెచ్చినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. -
మావో పార్టీలో పునర్వ్యవస్థీకరణ
కోల్‌కతా: నిషేధిత సీపీఐ–మావోయిస్టు పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధ నేతలకు విరామం ఇచ్చి, వారి సేవలను ఇతర రంగాల్లో వినియోగించుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశమై ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ వివరాలున్న మూడు పేజీల సర్క్యులర్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వివిధ అనుబంధ విభాగాలకు అందజేసింది. ఉద్యమ అవసరాల రీత్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. భద్రతా బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్న ప్రాంతాల్లో చురుగ్గా వ్యవహరించలేని అజ్ఞాతంలో ఉన్న సీనియర్ నేతలను రక్షించుకోవటం కూడా కీలకమని అందులో పేర్కొంది. పార్టీ నిర్దేశించిన విధులను సరిగ్గా నిర్వహించలేని వృద్ధ నేతలను, శారీరకంగా చురుగ్గా లేని వారిని గుర్తించాలని ఆ సర్క్యులర్‌లో కోరింది. వారిని బాధ్యతల నుంచి తప్పించి పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు, ఇతర ప్రాంతాల్లో ఉద్యమ నిర్మాణం బాధ్యతలను అప్పగించాలని సూచించింది. అయితే, ఇందుకు వయో పరిమితిని మాత్రం నిర్దేశించలేదు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు 67 ఏళ్లు, తూర్పు ప్రాంత బ్యూరో ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా వయస్సు 72 ఏళ్లు, కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్ వాసవరాజ్కు 62 ఏళ్లు కావటం గమనార్హం. అయితే, ఇలాంటి ప్రక్షాళన మావోయిస్టు పార్టీకి కొత్తేమీ కాదని పశ్చిమబెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 1960–70లలో కూడా ఇలాంటివి జరగాయని తెలిపారు. అప్పట్లో సీనియర్ నేతల సేవలను ఉద్యమ సమావేశాలు వంటివి నిర్వహించటానికి వినియోగించుకున్నారన్నారు. -
దళిత నేతకు మావోయిస్టు మకుటం?
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ నాయకత్వం మారిపోతోందా?.. కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ హోదా నుంచి తప్పుకొని, ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారా..? ఈసారి దళిత వర్గానికి చెందిన వారికి పగ్గాలు అప్పగించాలని.. తద్వారా బలహీనవర్గాల్లోకి మరింతగా వెళ్లవచ్చని భావిస్తున్నారా? అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్ర కమిటీలో చిన్న వయసు వారికి బాధ్యతలు ఇవ్వనున్నారా..?.. ఈ ప్రశ్నలన్నింటికీ మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, నిఘా వ్యవహారాల్లో నిమగ్నమైన పోలీసువర్గాలు, కొన్ని జాతీయ ఆంగ్ల పత్రికలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు చెందిన పలు కీలక పత్రాలు లభించాయి. వాటిని విశ్లేషించగా మావోయిస్టు పార్టీలో నాయకత్వం మార్పు అంశం వెల్లడైనట్లు తెలిసింది. దీంతో మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పార్టీలో ఇటీవలి పరిణామాలతోపాటు, దళితవర్గానికి చెందిన వారికి నాయకత్వం అప్పగించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీకి పగ్గాలు అప్పగించనున్నట్లుగా పోలీసు వర్గాలు నిర్ధారించుకున్నట్లు తెలిసింది. కేంద్ర కమిటీలో చిన్నవారు.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 19 మందిలో తిరుపతి అలియాస్ దేవ్‌జీ అందరికన్నా వయసులో చిన్నవారు. దళిత వర్గానికి చెందిన ఆయన పార్టీ కేంద్ర కమిటీలో సీసీ మెంబర్‌గా ఉన్నారు. చదువుకునే రోజుల నుంచి తిరుపతి తన ప్రియ శిష్యుడు కావడంతో ఆయన వైపే గణపతి మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం దేశంలోని విప్లవ సంస్థలు మావోయిజాన్ని, అంబేడ్కరిజాన్ని కలిపి ఉద్యమం నిర్మించాలని మేధావులు సూచిస్తున్నారు. పలు సందర్భాల్లో విప్లవ సంస్థల్లోనూ అగ్రవర్ణాల పెత్తనం నడుస్తోందని పరోక్షంగా గణపతిని ఉదహరిస్తూ విమర్శలు కూడా వచ్చాయి. దాంతో మావోయిస్టు పార్టీలోని కేంద్ర కమిటీలో రిజర్వేషన్లు అమలు చేస్తూ మహిళలు, దళితులకు అవకాశమిచ్చారు. తాజాగా గణపతి తప్పుకోనుండటంతో అందరి దృష్టి దళితుడైన తిరుపతిపై పడింది. తెరపైకి 2007 ప్లీనరీ అంశాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పీపుల్స్‌వార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్యను 1992లో తొలగించారు. అప్పటినుంచి గణపతి ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 2004లో విప్లవ సంస్థలన్నీ కలసి ఏర్పాటైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగు తున్నారు. ప్రస్తుతం ఆయనకు వయసు మీదపడటం, అనారోగ్యం కారణంగా కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2007లో మావోయిస్టు పార్టీ నిర్వహించుకున్న ప్లీనరీ సందర్భంగా నాయకత్వం వహించేవారి వయసు 60 ఏళ్ల వరకే ఉండాలన్న చర్చ జరిగిందని... ఇప్పుడా అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గణపతి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అప్పట్లో కేంద్ర కమిటీలో ఉన్న నంబాళ కేశవరావు, ఎన్కౌంటర్లో చనిపోయిన ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్, ప్రస్తుతం జైలులో ఉన్న కోబాడ్ గాంధీలలో ఒకరు కార్యదర్శిగా ఎంపికకా వొచ్చని ప్రచారం సాగింది. ఇక వీరితోపాటు పార్టీ కేంద్ర కమిటీలో కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, వేణుగోపాల్‌రావు, అక్కిరాజు హరగోపాల్, మోడెం బాలకృష్ణ, ఒగ్గు సత్వాజీ, రావుల శ్రీనివాస్, పిప్పిరి తిరుపతి, జీనుగు నర్సింహారెడ్డిలతోపాటు బిహార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్, బిహార్ మావోయిస్టు పార్టీ యూనిట్ల నుంచి మరో పది మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మొత్తంగా వీరందరూ 50 ఏళ్ల పైబడిన వారే. 12 మందికి 60 ఏళ్ల వయసు కూడా నిండింది. మరో ‘కొండపల్లి’ కావొద్దని.. పీపుల్స్‌వార్ పార్టీ వ్యవస్థాపకుడైన కొండపల్లి సీతారామయ్య అనారోగ్యం, మతిమరుపుతో బాధపడటం, పార్టీలో పలు విభేదాలకు కారణంగా మారడంతో ఆయనను పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పించే వరకూ వెళ్లింది. 1992లో పదవి నుంచి తొలగించాక పలు సందర్భాల్లో ఆయన పరిస్థితి, ఆయన బయటకు వెళ్లిన తీరుపై పార్టీలోని సీనియర్లు ఆందోళనకు గురయ్యారు. దాంతో వయసు పైబడిన నాయకులకు అత్యున్నత స్థానం కల్పిస్తూ.. యువతకే నాయకత్వ బాధ్యతలు అప్పగిం చాలని 2007 ప్లీనరీలో మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడా అంశం తెరపైకి రావడంతో నాయకత్వ మార్పుకు బీజం పడినట్లు తెలుస్తోంది. రష్యాలో తప్పుకున్న లెనిన్.. చైనాలో కొనసాగిన మావో మావోయిస్టు పార్టీలో కొండపల్లి సీతారామయ్య పరిణామం తర్వాత నాయకత్వం వయసుపై చర్చలు సాగాయి. వృద్ధులు పార్టీని ఏలుతున్నారని.. చైనాలో మావో చనిపోయే వరకు కార్యదర్శిగా పనిచేసి, విప్లవం విజయవంతమైన తర్వాత దేశాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం ఉన్నారని వ్యాఖ్యానాలు వినిపించేవి. అటు రష్యాలో మాత్రం లెనిన్ అనారోగ్యానికి గురికావడంతో పార్టీ కార్యదర్శి పదవిని స్టాలిన్‌కు అప్పగించారు. ఆ దేశంలో విప్లవం విజయవంతం అయ్యేందుకు స్టాలిన్ సారథ్యం వహించారు. రష్యా, చైనాల విప్లవ ఉద్యమ స్ఫూర్తిగా భారత్‌లో మావోయిస్టు పార్టీని నడుపుతున్న గణపతి.. అనారోగ్యం కారణంగా లెనిన్ తరహాలో ఇతరులకు బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే కార్యదర్శి బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ రెడ్ ఆర్మీని నడుపుతూ, విదేశీ విప్లవ సంస్థలను సమన్వయపరుస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీకి నేతృత్వం వహించడం అసాధారణమైన విషయమని ఆ పార్టీకి చెందిన కొందరు మాజీలు పేర్కొంటున్నారు. నంబాళ కేశవరావు పేరు కూడా.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ కమాండర్‌గా ఉన్న నంబాళ కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను నియమించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో నిర్వహించిన మావోయిస్టు ప్లీనరీలో ఈ దిశగా చర్చించినట్లు తెలిసిందని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలుగా అరెస్టయిన మావోయిస్టుల విచారణలో, ఎన్కౌంటర్ల సందర్భంగా లభించిన పత్రాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీఎన్పేటకు చెందిన నంబాళ కేశవరావు ప్రస్తుతం పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) చీఫ్ కమాండర్‌గా ఉన్నారు. ఇక ఎంసీసీఐ నుంచి వచ్చిన ప్రశాంత్‌బోస్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిడుమ అలియాస్ వినోద్‌ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారు ఏపూరి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గోడ్డలి యాకయ్య అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద కర్రలతో కొట్టి చంపారు. దుండగులు మృతుడి జేబులో నక్సల్స్ పేరీట లేఖ వదిలి వెళ్లారు. యాకయ్య పల్లెల్లో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని, ఇతని వల్ల మహిళలకు గ్రామాల్లో రక్షణ లేకుండా పోతోందని తెలిపారు. అంతే కాకుండా భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు చేస్తూ అమాయక పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అందువల్లే ప్రజా కోర్టులో శిక్షిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రజలపై , మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఇదే శిక్షకు గురికాక తప్పదని సీపీఐ(ఎం ఎల్) పార్టీ పేరిట కామ్రేడ్ జగదీశ్ ఆ లేఖ ద్వారా తెలియజేశారు. -
'వ్యవస్థ మారకుండా సాధ్యంకాదు'
భద్రాద్రికొత్తగూడెం: అణచివేతలో భాగంగానే పాలకులు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మీడియాకు లేఖ విడుదల చేశారు. వ్యవస్థ మారకుండా నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని లేఖలో ఆయన పేర్కొన్నారు. -
పచ్చని అడవుల్లో నెత్తుటి చాళ్లు
గలగల పారే సీలేరు.. తోడుగా ఎన్నో సెలయేళ్లు.. దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు.. వాటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు.. అవి సృష్టించిన సమస్యలు.. అడవి బిడ్డల ఆకలికేకలు ఆ ప్రాంతాన్ని తుపాకీ గొట్టం ముందు నిలబెట్టాయి. విప్లవ పంథా వైపు నడిపించాయి. పచ్చని అడవులు నెత్తుటి చాళ్లుగా మారాయి. ఆ నేల.. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ జోన్(ఏవోబీ). ఏవోబీ జోన్ దశాబ్దాలుగా మావోలకు పెట్టని కోటగా.. పోలీసులకు పెనుసవాల్‌గా నిలిచింది. తొలిసారిగా అక్కడకు పోలీసులు చొచ్చుకెళ్లి జరిపిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా అతి పెద్దదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఏవోబీ, కటాఫ్ ఏరియా, ‘బలిమెల’ తదితర అంశాలపై ప్రత్యేక కథనాలు.. - ఫోకస్లో 1964 పశ్చిమబెంగాల్లోని నక్సల్బరీలో పురుడుపోసుకున్న ఉద్యమం 1982 ఈస్టు డివిజన్లో కార్యకలాపాలు 1985 విస్తరించిన ఉద్యమం.. 2004 పీపుల్స్ వార్ గ్రూపుగా మార్పు నక్సల్బరీ నుంచి... భూమి కోసం.. భుక్తి కోసం.. అన్న నినాదంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ అనే చిన్న గ్రామంలో 1964లో నక్సలైట్ ఉద్యమం పురుడు పోసుకుంది. ఈ ఉద్యమానికి శ్రీకర్త చారుముజుందార్. భూ స్వాముల కబందహస్తాల్లో చిక్కుతున్న పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలన్న ధ్యేయంతో ప్రారంభమైన నక్సల్ ఉద్యమం కాలక్రమంలో అనేక పరిణామాలకు లోనైంది. 1967లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు విస్తరించింది. దశాబ్దకాలంపాటు ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఉద్యమంపై 1977లో రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు ఉక్కుపాదం మోపారు. ఆయన స్వయంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు వచ్చి సాయుధ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ జరిపి ఉద్యమ నాయకులను వెతికి మరీ మట్టుబెట్టించారు. - సాక్షి, విశాఖపట్నం ప్రతినిధి ఉమాకాంత్, ఏవోబీ నుంచి ‘సాక్షి’ బృందం అక్కడ గతి తప్పిన ఉద్యమం తెలంగాణలో ఊపిరిపోసుకుంది. అలా 1982 నాటికి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. అప్పట్లో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల(ఆర్ఈసీ)లో చదువుకునే విద్యార్థులు నక్సలైట్ ఉద్యమం పట్ల బాగా ఆకర్షితులయ్యారు. దీంతో మొదట్లో తెలంగాణ కు చెందిన వారే ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. 1985 నాటికి ఉద్యమం బాగా విస్తరించింది. మేధావి వర్గం గిరిజనులకు అక్షరాలు నేర్పించేది. జరుగుతున్న శ్రమదోపిడీ గురించి వివరించి.. చైతన్యపరిచి తిరుగుబాటు చేయాలని సూచించేది. ఉద్యమాలు చేయించేది. దీంతో గిరిజనులు మావోయిస్టులతో మమేకం అయ్యారు. తమ కోసం నక్సలైట్లు ప్రాణాలు పణంగా పెడుతున్నారని నమ్మిన గిరిజనులు క్రమంగా నక్సలైట్ ఉద్యమంలో చేరడం మొదలు పెట్టారు. పోలీసుల నుంచి రక్షణ కల్పించేవారు. గిరిజనుడి నేతృత్వం నక్సలైట్ ఉద్యమంలో జాంబ్రీ అనే పేరుకు విశిష్ట స్థానం ఉంది. ఈస్టు డివిజన్లో ఒక గిరిజనుడు మొదటిసారిగా డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎది గాడు. అతడిని జాంబ్రీ అని పిలిచేవారు. 1989లో జరిగిన ఎన్కౌంటర్లో జాంబ్రీ మరణించారు. అయినా ఆ పేరుతో అనేకమంది పనిచేశారు. 1990 నాటికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 2004లో పునరేకీకరణ దశాబ్దాలపాటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో కొనసాగిన సీపీఐ(ఎంఎల్) వర్గాల పునరేకీకరణతో దేశవ్యాప్తంగా 2004 సెప్టెంబర్ 21న సీపీఐ(మావోయిస్టు) పార్టీ అవతరించింది. ఆంధ్ర నుంచి తూర్పు కనుమలు, దండకారణ్యం మీదుగా నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటే దీని లక్ష్యం. నక్సలిజం అప్పటి నుంచి మావోయిస్టు ఉద్యమంగా రూపుమారింది. విధ్వంసాలు పెరిగాయి. 2000 వరకు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నాగులకొండ, తాండవ, శబరి, కోరుకొండ దళాలు ఉండేవి. అప్పట్లో ఉద్యమమంతా కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లోనే కేంద్రీకృతమైంది. 2000లో అదిలాబాద్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్లో నరేష్, శ్యామ్, మురళీ అనే ముగ్గురు అగ్రనేతలు మరణించారు. అప్పట్నుంచి మావోయిస్టులు వ్యూహాలు మార్చారు. దళాలను వదిలిపెట్టి ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కోనలోవ, పలకజీడి, గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు ఏర్పాటయ్యాయి. వాటికి కార్యదర్శులు నేతృత్వం వహించేవారు. గత కొన్నేళ్లుగా తూర్పుగోదావరి పరిధిలోని కోనలోవ, పలకజీడి కమిటీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు కమిటీలున్నాయి. గతేడాది మే 4న జరిగిన మర్రిపాకల ఎన్కౌంటర్లో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఆజాద్ మరణించడంతో ఆ కమిటీ కూడా బలహీనపడింది. ఈస్ట్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేసి ఒడిశాలోని కొరాపుట్, మల్కన్‌గిరి, ఆంధ్రాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కు ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాతే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) జోన్ ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య బలిమెల రిజర్వాయర్‌ను ఆనుకొని ముంచంగిపుట్టు మండలం నుంచి ఇటు జీకేవీధి వరకు.. కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల మధ్య ఉన్న కటాఫ్ ఏరియాను షెల్టర్‌జోన్‌గా చేసుకొని మావోయిస్టులు ఇక్కడ నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మూడు రకాల మిలీషియా ఏర్పాటు 1999-2005 మధ్యలో ఈస్టు డివిజన్లో మావోయిస్టులు మూడు దశలో మిలీషియాలను ఏర్పాటు చేశారు. మొదట సాధారణ మిలీషియా దళాలనే ఏర్పాటు చేశారు. తర్వాత వాటిలోని సభ్యులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. మందుపాతరలను అమర్చడం, పేల్చడం, ఆ వెంటనే తప్పించుకోవడంలో కూడా తర్ఫీదు ఇచ్చారు. గ్రామాల్లో సాధారణ పౌరుల్లానే ఉండే మిలీషియా సభ్యులు పోలీసుల కదలికలను గమనిస్తూ.. అవసరమైనప్పుడు ముందుగానే అమర్చిన మందుపాతర్లను పేల్చేవారు. దీని తరువాత పీపుల్స్ మిలీషియాను ఏర్పాటు చేశారు. ప్రజలే మిలీషియాగా ఉంటారు. మావోయిస్టు పార్టీకి కళ్లు, చెవులుగా మసలిన మిలీషియా సభ్యులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం.. లొంగుబాట్లతో క్రమంగా ఈ సంఘాలు బలహీనపడ్డాయి. దీనికి ముందుగా విప్లవ ప్రజా కమిటీలు(ఆర్పీసీ)లుండేవి. కాఫీ తోటలే ఆయువుపట్టు ఒకప్పుడు మావోయిస్టులు భూమి కోసం.. గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేసేవారు. తర్వాత అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులతో ఆందోళన చేయించారు. గత ఎనిమిదేళ్ల నుంచి మావోయిస్టులు పంథా మార్చారు. మన్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎప్డీసీ) పరిధిలో ఉన్న పదివేల ఎకరాల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కొన్ని చోట్ల వారే పంపిణీ చేశారు కూడా. దీనిలో భాగంగా అప్పట్లో కాఫీ బోర్డు రేంజర్‌ను కాల్చి చంపారు. మర్రిపాకల నుంచి కుంకుంపూడి వరకు కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేశారు. పోలీసులకు భయపడి కొందరు గిరిజనులు వాటిని తీసుకోలేదు. బాక్సైట్ వ్యతిరేక పోరాటం పీపుల్స్‌వార్ ఉన్నప్పుడే 1999 నుంచి ఏవోబీలో బాక్సైట్ వ్యతిరేక పోరాటాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుంది. మావోయిస్టు పార్టీ ఏర్పడిన అనంతరం కూడా అదే పోరాటం కొనసాగిస్తోంది. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నియమగిరి కొండల్లోనూ, విశాఖ మన్యంలోనూ విస్తారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను వెలికితీసి అల్యూమినా కర్మాగారాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. బాక్సైట్ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, గిరిజనుల మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులను ముందుంచి మావోయిస్టులు ఉద్యమాలు నడిపిస్తున్నారు. 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను అరబ్దేశానికి అప్పగిస్తూ ఆదేశాలి చ్చింది. దీనిపై మావోలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 97 జీవోను తెరపైకి తెచ్చి తిరిగి బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు చేపట్టడంతో మావోయిస్టు ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. హత్యలు.. కిడ్నాప్‌లు.. ఎన్కౌంటర్లు పీపుల్స్‌వార్ కార్యకలాపాలు 1980 నుంచి మన్యంలో ఊపందుకున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి అటవీ ప్రాంతాల్లో పూర్తిగా వారి ఆధిపత్యమే ఉండేది. ఈ క్రమంలో పలుచోట్ల నక్సలైట్లకు, పోలీసులకు మధ్య అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎక్కువగా సీపీఐకి చెందిన నేతలను మావోయిస్టులు హతమార్చారు. మొదట ప్రముఖ మేధావిగా పేరు తెచ్చుకున్న మేకా సూరిబాబును, అనంతరం నూకినాయుడును చంపారు. దానికంటే ముందు సుబ్బారావును చంపేశారు. దీంతో పాటు ఒక పాస్టర్‌ను కూడా హతమార్చారు. ► 1988లో వడ్కాపూర్ చంద్రమౌళి అలియాస్ దేవన్న ఆధ్వర్యంలో నక్సలైట్లు తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కొద్దిరోజుల తరవాత వారిని వదిలిపెట్టారు. ► 1990 నుంచి 2000 మధ్య నక్సలైట్లు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రధానంగా విశాఖ జిల్లా దారకొండలోని ఔట్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో పలువురు పోలీసులు మరణించారు. ఇదే దశాబ్దంలో చింతపల్లి మండలం బూరుగుపాకలు ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు, జి.మాడుగుల మండలం గొందిపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ► 199192లో నక్సలైట్లు కొయ్యూరు అటవీ ప్రాంతానికి వెళ్లిన అప్పటి ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజులను కిడ్నాప్ చేశారు. 28 రోజులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యుడు క్రాంతి రణదేవ్‌ను వదిలిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. దీంతో రణదేవ్‌ను ప్రభుత్వం విడిచిపెట్టడంతో బాలరాజును నక్సలైట్లు వదిలేశారు. అప్పట్లో అదో సంచలనం. పౌరహక్కుల సంఘం నేతలు కొయ్యూరులో సుమారు నెల రోజుల పాటు ఉండిపోయారు. పోలీసు యంత్రాంగం అంతా కొయ్యూరు నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. ఆతర్వాత రిటైర్డ్ డీఎస్పీ పోతారెడ్డిని నక్సలైట్లు విశాఖలో హత మార్చారు. ► 1997లో చింతపల్లి మండలం లోతుగెడ్డ వద్ద మందుపాతరతో పోలీస్ జీపును పేల్చివేసిన ఘటనలో ఏడుగురు పోలీసులు ప్రాణాలు వదిలారు. అదే ఏడాది మంత్రి అయ్యన్నపాత్రడు తమ్ముడు శ్రీనును హతమార్చారు. ► 2002లో చోడవరం, అనకాపల్లి పట్టణ పోలీస్స్టేషన్లపై మావోయిస్టులు దాడి చేసి ముగ్గురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేశారు. చిట్టిబాబు అనే కానిస్టేబుల్‌ను ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. మిగిలిన ఇద్దరిని విడిచిపెట్టారు. ► 2004లో అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి మత్స్యరాస మణికుమారి భర్త, సీనియర్ టీడీపీ నేత వెంకటరాజును పాడేరులో మావోయిస్టు యాక్షన్‌టీం సభ్యులు హతమార్చారు. ► 2007లో విశాఖపట్నం జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ నేత సమిడ రవిశంకర్‌ను హుకుంపేటలో హతమార్చారు. ► 2008లో కూంబింగ్ అనంతరం బలిమెల రిజర్వాయర్ మీదుగా పడవలో తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు రాకెట్ లాంచర్‌తో దాడి చేశారు. ఆ దాడిలో 33 మంది గ్రేహౌండ్స్ సిబ్బందితో సహా 38 మంది పోలీసులు జలసమాధి అయ్యారు. ► 2011లో చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ నేత ఉగ్రంగి సోమలింగాన్ని, 2012లో పాడేరులో ఎస్బీ కానిస్టేబుల్ అప్పన్నను హతమార్చారు. ► 2015లో విశాఖ మన్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ హతమయ్యారు. -
సార్వత్రిక సమ్మెకు మావోయిస్టుల మద్దతు
తెలంగాణ : సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు తలపెట్టిన స్వారత్రిక సమ్మెకు మద్దతునిస్తూ, సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సిపిఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. నిత్యావసర ధరలను అదుపు చేయడం, కార్మిక చట్టాల అమలు, కార్మికులందరికీ సామాజిక భద్రత, రైల్వేలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ డిమాండ్లతో గత ఏడాది సెప్టెంబర్2న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టారు. ఏడాది గడిచిన ఈ డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చర్యలను తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో నిరుద్యోగ సమస్య, పేదరికాన్ని మరింత పెంచి ప్రజల బతుకుల్ని దుర్భర స్థితిలోకి నెట్టివేస్తున్నాయన్నారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలను సవరించాలనుకుంటున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వ విధానాలకు అనుకూలంగానే తమ విధానాలను అమలు చేస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేంత వరకు శ్రామిక శక్తిని ప్రదర్శించాలని లేఖలో పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగలుగా మార్చారన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులతో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకే ఈ ప్రభుత్వాలు దళారులుగా మారుతున్న దానికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. విప్లవోద్యమంపై సాగుతున్న ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండను కూడా వ్యతిరేకించాల్సిందిగా లేఖలో కోరారు. -
భారీ స్కెచ్.!
సాక్షి,విశాఖపట్నం: మన్యంలో మావోయిస్టులు భారీ స్కెచ్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ ప్రాభవాన్ని చాటుకోవడానికి ఇక దూకుడుగా వ్యవహరించాలని వారు భావిస్తున్నారనే అనుమానాలు తాజా పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. కాఫీ తోటలను వదిలిపోవాల్సిందిగా వారు చేసిన హెచ్చరికలు ఇప్పుడు మన్యంలో కలకలం రేపుతున్నాయి. కాఫీ తోటలు కేవలం ఓ సాకు మాత్రమేనని దీని వెనక మావోలు వ్యూహం వేరుగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై ఇప్పుడు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కాఫీ తోటలు, క్యారీలు సాకుగా... రెండు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీలో కలకలం రేగింది. జీకే వీధి మండలం పెదవలస గ్రామంలో రెండు రోజుల క్రితం మావోయిస్టుల కరపత్రాలు, బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. మన్యం సంపద కాజేయడానికి పోలీసులు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అరాచకం సష్టిస్తున్నారని వాటిలో రాశారు.ఏపీఎప్డీసీ అధికారులు కాఫీ తోటలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సపర్ల, చాపరాతిపాలెం, లంకపాకలు, బోనంగిపల్లి, సిరాబల, రంపుల,పెదవలస, కొమ్మంగి, వంగశార, చాపరాతిపాలెం ఎర్రమట్టిక్వారీని మూసివేయాలని లేదంటే క్వారీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న గడుతూరి బాలయ్యపడాల్, జి.శంకర్, జి.మురళి, కె.బాలరాజు, పి.దేముడులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట బ్యానర్లు, కరపత్రాల్లో తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉనికి కోసమేనా... అయితే ఇదంతా అవాస్తవమని, అక్కడ అలాంటివేవీ లేవని కొందరు కొట్టిపడేశారు. కానీ అధికారులు మాత్రం ఇదంతా వాస్తమమేనంటున్నారు. అయితే ఇక్కడ మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది.ఇటీవల గాలికొండ ఏరియా కమిటీ ముఖ్య నేతలను కోల్పోయి బలహీన పడింది. అలాంటి కమిటీ ఇంత దూకుడుగా ఎందుకు హెచ్చరికలు చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. వెనకబడింది కాబట్టే ఉనికి చాటుకోవడానికి ఈ ప్రయత్నం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మావోయిస్టుల నోట మళ్లీ ప్రజాకోర్డు అనే మాట రావడం మాత్రం పోలీసులను, గిరిజనులను కలవరపాటుకు గురిచేస్తోంది. కలవరపెడుతున్న చేదు జ్ఞాపకాలు ఏడాదిన్నర క్రితం బలపం పంచాయతీలో జరిగిన ఘటనను వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ గిరిజనుడిని చంపి మరొకరిని ప్రజాకోర్టులో హతమార్చేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా వారి ప్రయత్నాన్ని గిరిజనులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మావోలపై ఎదురు దాడిచేసి చంపేశారు. ఈ దుర్ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ దాడికి పాల్పడిన వారిని ప్రజాకోర్టులో హతమారుస్తామని మావోలు ప్రతిజ్ఞ కూడా చేశారు. కానీ తర్వాత వారి ప్రతిజ్ఞ నెరవేరే పరిస్థితులు మన్యంలో కనిపించలేదు. కూంబింగ్ పెరగడం, వరుసగా ముఖ్య నేతలను కోల్పోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజా కోర్టును తెరపైకి తేవడంతో మున్నుందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మార్క్సిజానికి పునరంకితం కావాలి
క్యాడర్‌కు గణపతి పిలుపు న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కొంత వెసలుబాటు దోరణి అవలింబించినప్పటికీ నక్సలిజం లక్ష్యానికి మాత్రం దూరం వెళ్లకూడదని చెప్పారు. నక్సలిజాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
రెండు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టుల పిలుపు
ఖమ్మం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4, 5 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సీపీఐ మావోయిస్టుల కమిటీ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ సీఎం హిందూ పాసిస్టులతో కుమ్మక్కై భూ స్వామ్య, నల్లదొరల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. -
కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట
వరంగల్ ఉప ఎన్నికపై మావోయిస్టు పార్టీ మండిపాటు సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య అహంకారానికి పరాకాష్ట అని సీపీఐ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ మండిపడ్డారు. దీన్ని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏడా దిన్నర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు, దళారి భూస్వామ్య వర్గాలకు కొమ్ము కాసిందే తప్ప పేదలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. ఈ మేరకు జగన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు ఎజెండానే తన ఎజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఫ్యూడల్ తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారన్నారు. ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచడానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలపై కనీ సం స్పందించకుండా నీరో చక్రవర్తి మాదిరిగా ఫామ్‌హౌస్‌లో తందనాలు ఆడుతున్నారన్నా రు. తెలంగాణలో ఉన్న అపారమైన ఖనిజ సంపద, వనరులను తమ వారికి దోచిపెట్టేం దుకు కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారన్నారు. అందుకే మావోయిస్టురహిత ప్రాం తంగా మలిచేందుకు ఆది లాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్న ఆదివాసీ గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వేలా ది గ్రేహౌండ్స్ బలగాలను దించి హంతక వేట కొనసాగిస్తున్నారన్నా రు. ములుగు ఏజెన్సీలో 1,500 ఎకరాలను మైనింగ్ మాఫియాకు కేటాయించడాన్ని వ్యతిరేకించినందుకే శ్రుతి, విద్యాసాగర్‌లను ఎన్కౌంటర్ చేశారన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. టీఆర్ఎస్ పాలకులు ఏముఖం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీతి తప్పిన దొం గలుగా పేరుపడ్డ తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వంటి వారిని మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తండ్రి అధికారంతో కళ్లు నెత్తికెక్కిన మంత్రి కేటీఆర్‌కూ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మోదీ ప్రభుత్వం తమ హంతక ముఠాలైన ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ వంటి శక్తులతో దళితులు, మైనారిటీలపై దాడులకు తెగబడుతోందని, వారూ మూల్యం చెల్లించక తప్పదన్నారు. -
ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసం
కఠ్మాండు: ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్ కు కొత్త ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ నేత కె.పి.శర్మ వోలి (ఖడ్గ ప్రసాద్ శర్మ) ఎన్నికయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్నికలో శర్మ.. 598 ఓట్లకుగానూ 338 ఓట్లు సాధించి ప్రత్యర్థి సుశీల్ కోయిరాలాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశాధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్.. నూతన ప్రధాని చేత ప్రమాణం చేయించడం ఇక లాంఛనమే. కాగా, ప్రధానిగా ఎన్నికయిన శర్మకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు పీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. సుశీల్ కోయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామాచేయడంతో నూతన ప్రధానిని ఎన్నుకోవడం అనివార్యమయింది. కాగా, రాజీనామా చేసినప్పటికీ కోయిరాలా.. నేపాలి కాంగ్రెస్ (ఎన్ సీ) తరఫున పదవికి పోటీలో నిలిచారు. అటు నేపాల్ మావోయిస్టు పార్టీ (యునైటెడ్ మార్క్సిస్టు, లెనినిస్టు) నుంచి కె.పి. శర్మ బరిలోకిదిగారు. సుశీల్ పేరును మాజీ ప్రధాని, సీనియర్ ఎన్‌సి నేత షేర్ బహదూర్ దూబే ప్రతిపాదించారు. ఏడేళ్ల సంప్రదింపుల అనంతరం నేపాల్‌లో గత సెప్టెంబర్ 20న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా మాదేసీ సహా కొన్ని మైనారిటీ వర్గాలు కొత్త రాజ్యాంగాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తునే ఉన్నాయి. ఆందోళనల్లో దాదాపు 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
'బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలి'
చర్ల (ఖమ్మం): సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పోస్టర్లు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో రహదారిపై బుధవారం దర్శనమిచ్చాయి. ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదని, ఆగస్ట్ 15ను బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలని మావోయిస్టులు ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీలపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, పీడిత ప్రజలైన ఆదివాసీలకు ఇంకా పూర్తి హక్కులు రాలేదని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం బదిలీ అయినా, పెట్టుబడి, భూస్వామ్య వర్గాల చేతుల్లో పరిమితమైందన్నారు. భారతదేశంలో ఇంకా అన్ని వర్గాలు, ప్రజలకు స్వాతంత్య్రం రానప్పుడు... స్వాతంత్యదినం అని ఎలా అంటారని ప్రశ్నించారు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
వరంగల్ క్రైం : సీపీఐ మావోయిస్టు అజ్ఞాత మహిళా నక్సలైట్, జనతనా సర్కార్‌లో వ్యవసాయ కమిటీ ఇన్చార్జి మచ్చ సుగుణ అలియాస్ అరుణ అలియాస్ శాంత శని వారం వరంగల్ ఓఎస్డీ సన్‌ప్రీత్‌సింగ్ ఎదుట లొంగిపోయూరు. ఈ మేరకు హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి మండలం పంబాపూర్‌కు చెందిన మచ్చ సుగుణకు 40 ఏళ్ల క్రితం మచ్చ సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీశ్‌తో వివాహమైంది. వివాహానంతరం వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు జన్మించాక మచ్చ సోమయ్య మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితుడై ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా చేరాడు. మచ్చ సుగుణ తన కుమార్తెలు, కుమారుల వివాహానంతరం తన భర్త ఆదేశాల మేరకు పార్టీలో చేరింది. మచ్చ సోమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీలో డీసీఎస్‌గా పనిచేస్తున్నాడు. మొదట పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాట్టూమ్ ఏరియా కమిటీలో పనిచేసింది. తర్వాత జనతనా సర్కార్ (ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అనుబంధ సంస్థ)లో కృషి అను వ్యవసాయ కమిటీలో ఏసీఎం స్థాయి లో పామెడ, కుంట, ఎర్రారం ఏరియాలో పనిచేసింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఏర్పడిన అంతర్గత విభేదాలు, పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతోపాటు ఆరోగ్య సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన నక్సలైట్లకు అందిస్తున్న ప్రోత్సాహానికి ఆకర్షితురాలై పోరుబాట వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని స్వచ్ఛందంగా లొంగిపోయింది. లొంగిపోయిన మచ్చ సుగుణపై రూ.లక్ష రివార్డు ఉంది. మచ్చ సోమయ్య లొంగిపోవాలి.. ఛత్తీస్‌గఢ్ డీసీఎస్‌గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మచ్చ సోమయ్య ఎక్కడ ఉన్నా, వెంటనే లొంగిపోవాలని సుగుణ ఈ సందర్భంగా తన భర్తను కోరింది.