Cyberabad Commissionerate
-
రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ పాజిటివ్: పోలీసులు
సాక్షి, హైదరాబాద్: వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.డ్రగ్స్‌ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్ ,హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్.. మరో అరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.ఇక డ్రగ్స్ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్ నోహం, బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్, టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్, సానబోయిన వరుణ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.డ్రగ్స్ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అమన్ ప్రీత్ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదని అన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు. -
TS: ఐపీఎస్‌ల బదిలీలు.. రాచకొండ సీపీ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సీపీలు వీరే.. రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు హైదరాబాద్ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సీపీ.. అవినాశ్ మహంతి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్.. సందీప్ శాండిల్యా మరోవైపు.. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో ఆ కమిషనరేట్ పరిధిలో నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షాద్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు అమలు చేశారు. జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వాహనాలను ఒకే లేన్‌లో అనుమతించారు. మరో లేన్‌లో వచ్చే వాహనాలను అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్ రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్‌నగర్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి షాద్‌నగర్ వైపు వచ్చే వాహనాలను కేశంపేట క్రాస్ రోడ్, చటాన్‌పల్లి రైల్వే గేట్ మీదుగా మళ్లించారు. పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలను షాద్‌నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు మళ్లించారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా నేతలు తరలిరావడంతో ఆయా మార్గాలు రద్దీగా మారాయి. సోమవారం రెండోరోజు ఇలా.. ♦పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికిల్స్ షాద్నగగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్ మీదుగా వెళ్లాలి. ♦సిటీ నుంచి షాద్‌నగర్‌కు వెళ్లే వెహికిల్స్ కొత్తూరు వై జంక్షన్, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి. ♦జడ్చర్ల నుంచి షాద్‌నగర్ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికిల్స్ వన్‌వేలో వెళ్లాల్సి ఉంటుంది. శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. ♦మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ♦బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలు పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్‌గూడ, గొల్లపల్లి, కిషన్‌గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మూడో రోజు (నవంబర్ 1న).. ♦ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. ♦బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్‌పాస్, గగన్‌పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం -
telangana: ‘ఇల్లరికం’ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: ఇరు కుటుంబాల స్థితిగతులు, కాబోయే అత్తామామలకు మగ సంతానం లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఇల్లరికం వెళుతుంటారు. అంటే వివాహానంతరం పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లిపోవడం కాకుండా రివర్స్‌లో పెళ్లికొడుకు అత్తారింటికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతాడన్నమాట. అచ్చం ఇలాగే కాకపోయినా ఇల్లరికపుటల్లుడు మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఒకే జిల్లాలో పాతుకుపోతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత పదోన్నతులు పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదు. జోన్‌లోని ఇతర జిల్లాల్లో పనిచేసే అవకాశం ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే పోస్టింగ్‌లు చేస్తూ స్థానికంగా లభించిన పట్టుతో అక్రమార్జనకు పాకులాడే నేపథ్యంలో వివాదాస్పదమవుతున్నారు. కొత్తగూడెంలోని పాల్వంచలో జరిగిన వనమా రాఘవేంద్రరావు తరహా వ్యవహారాలకు ఇలాంటి అధికారులే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. సిఫారసులతో ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న వీరు.. తమను సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, కుటుంబీకులు చేసే అరాచకాలకు అందదండలందిస్తున్నారు. 70 శాతం ఇదే రీతి... రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా కమిషరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఇల్లరికపు అధికారులు వందల మంది ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు జోన్‌లోని తన స్వంత జిల్లా కాకుండా మిగిలిన ఏ జిల్లాలో అయినా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ అనేకమంది సబ్ ఇన్స్పెక్టర్గా మంచి రెవెన్యూ ఉన్న జిల్లాలను ఎన్నుకోవడం.. అక్కడే రిటైర్మెంట్ దాకా పాతుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా 70 శాతం మంది పోలీస్ అధికారులు ఒకే జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్ ఆ తర్వాత డీఎస్పీగానూ పదోన్నతి పొంది మళ్లీ అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. రాష్ట్ర స్థాయి హోదాలో డీఎస్పీగా తన స్వంత డివిజన్ తప్ప ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్నా తాను గతంలో పని చేసిన జిల్లాలోనే తాను ఎస్ఐ, సీఐగా పనిచేసిన సబ్‌డివిజన్ డీఎస్పీగా/ఏసీపీలుగానే పనిచేస్తున్నారు. మరికొంత మంది అధికారులైతే ఏకంగా అదనపు ఎస్పీగా కూడా అదే జిల్లాలో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయంపై గురి.. అక్రమాలకు దన్ను ఇలాంటి అధికారులు టౌన్‌కు గరిష్టంగా 20 కిలోమీటర్లు దూరంలోపే పోస్టింగ్ తీసుకుంటారు. పైగా కనీస ఆదాయం అంటే తమను సిఫారసు చేసినందుకు ఇచ్చిన సొమ్ముకు రెండు, మూడింతలు వచ్చే పోస్టింగ్‌లో మాత్రమే కొనసాగుతారు. కొంతమంది అధికారులు మైనింగ్ కార్యకలాపాలుండే ప్రాంతాల్లో వరుస పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. ఇంకొంత మంది ఇసుక దందా సాగే ప్రాంతాలను ఎంచుకొని మరీ ఆయా ఠాణాల్లోనే పనిచేస్తారు. ఇంకొంత మంది గ్యాబ్లింగ్, వ్యాపార నెలవారీ కమీషన్లు, వైన్స్, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇంకొంత మంది అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్ల కేంద్రంగా సాగే ఏరియా ఠాణాలను టార్గెట్ చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో సీఐ పోస్టింగ్‌కు సిఫారసు చేసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్కువలో తక్కువ రూ.20 లక్షలు తీసుకుంటున్నారంటే, ఆ పోస్టులో చేరి వారెంత అక్రమార్జనకు, ఎన్ని అవకతవకలకు పాల్పడతారో అర్ధం చేసుకోవచ్చు. దెబ్బతింటున్న పోలీసింగ్... ఎప్పటిప్పుడు అధికారుల మార్పు జరిగితే విధులు అంకితభావంతో పాటు పారదర్శకంగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే అధికారి ఏళ్ల పాటు స్టేషన్లు మార్చిమార్చి పోస్టింగ్‌లు చేయడం, పదోన్నతి తర్వాత మళ్లీ అదే అధికారి సూపర్విజన్ డ్యూటీలోకి రావడం ఇష్టారీతిన జరిగిపోతోంది వనమా రాఘవతో ముడిపడిన ఘటన వంటి ఉదంతాలకు ఇలాంటి అధికారుల వ్యవహారాలే పరోక్షంగా కారణమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్లో 42 మంది సెటిల్ ►ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ టౌన్ స్టేషన్లలో ఎస్ఐలుగా పనిచేసిన అధికారులే ఇప్పుడు సీఐలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ ఏసీపీ అధికారి గతంలో అక్కడే టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, రూరల్ సీఐగా పనిచేశారు. ఇలా 42 మంది అధికారులు ఈ జిల్లాలోనే సెటిల్ అయిపోయారు. వీరు స్టేషన్ మారడం మినహా మరో జిల్లాకు పోయి పనిచేసింది లేదు. ►ఉమ్మడి వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, ఎల్కతుర్తి, పరకాల, మామునూర్, జనగాం, ఘన్పూర్, వర్ధన్నపేట మహబూబాబాద్, పాలకుర్తి, భూపాలపల్లి.. ఇలా సబ్ డివిజన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన అధికారులే ప్రస్తుతం ఏసీపీలుగా, క్రైమ్ అధికారులుగా, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్ విభాగాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఖమ్మం టౌన్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆయాసర్కిల్స్/సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఆయా ప్రాంతాల్లోనే సీఐ, డీఎస్పీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 70% మంది ►ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ రూరల్, భైంసా, ఉట్నూర్ సబ్ డివిజన్లలో ఎస్ఐలుగా పనిచేసిన 70 శాతం మంది అధికారులు ఇప్పుడు అవే ప్రాంతాల్లో సీఐగా, ఆపై స్థాయి పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. ► ఉమ్మడి నిజామాబాద్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలు, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్నూర్ సబ్‌డివిజన్, సర్కిల్లో ఎస్ఐలు, సీఐలుగా పనిచేసిన అధికారులు అక్కడే సీఐలు, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్నారు. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ హెడ్‌క్వార్టర్‌లోని ఠాణాలు, కోదాడ, సూర్యాపేట, సాగర్, మాల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, హుజూర్నగర్, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి.. ఇలా పలు ఠాణాల్లో ఎస్ఐలుగా పనిచేసినవారు ఇప్పుడు సీఐలుగా, మరికొంత మంది డీఎస్పీలుగా అక్కడే పాతుకుపోయారు. ►ఉమ్మడి మహూబూబ్‌నగర్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలతో పాటు జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అమన్‌గల్, అమ్రాబాద్, వనపర్తి, గద్వాల్, దేవరకద్ర.. ఇలా సర్కిల్/సబ్డివిజన్లలో 60 శాతం అధికారులు ఇంతకుముందు అక్కడక్కడ పనిచేసిన వారే. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తదితర సర్కిల్, సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఇప్పుడు అక్కడే సీఐగా, సీఐగా చేసిన వారు డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. ► ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఒక పోలీస్‌స్టేషన్‌నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు మార్పు చెందుతున్నారు కానీ కమిషనరేట్‌ను వదిలీ మరో కమిషనరేట్ లేదా జిల్లాకు మాత్రం బదిలీ కావడం లేదు. ఇలా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో 90 శాతం అధికారులు తొలినాళ్లలో అక్కడే పనిచేసి, పదోన్నతి తర్వాత కూడా అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. -
హైదరాబాద్‌లో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ దారి మళ్లింపు కొనసాగుతుందని సంబందిత ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్‌యంసీ ప్రాజెక్ట్ విభాగం ఇంజినీరింగ్ అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్ ఆంక్షలపై ఆదేశాలు జారీ చేయగా..ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సైతం ఆదేశాలు జారీ చేశారు. గతకొంత కాలంగా బహదూర్‌పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ►అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ►ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాలపై 90 రోజుల పాటు ఆంక్షలు విధించనున్నారు. ►ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ►తొంబై రోజుల పాటు వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. ►కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతించడం లేదని...లైట్ మోటార్ వెహికిల్స్‌ను యధావిధిగా అనుమతించనున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ►ఆరాంఘర్ చౌరస్తా నుంచి బహదూర్‌పురా ద్వారా పురానాపూల్ చేరుకునే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ►బెంగుళూర్ హై వే కావడంతో ఈ రోడ్డులో టీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ►వీటికి తోడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలు నడుస్తుంటాయి. ►భారీ వాహనాలు బహదూర్‌పురా చౌరస్తా మీదుగా కాకుండా మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు, చాంద్రాయణగుట్ట, డీఎంఆర్ఎల్, మిధాని, ఐ.ఎస్.సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ద్వారా నల్గొండ క్రాస్ రోడ్డుకు చేరుకునేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) ►కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎప్పటి లాగే పురానాపూల్ నుంచి ఆరాంఘర్ చేరుకోవచ్చు. ►పాతబస్తీలో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు ఆరాంఘర్ వెళ్లడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ►ఆయా వాహనాలు దారుషిపా, పురానీహవేలీ, బీబీబజార్ చౌరస్తా,షంషీర్గంజ్,ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి,చాంద్రాయణగుట్ట చౌరస్తా ద్వారా ఆరాంఘర్ చేరుకోవడానికి వీలుంటుందన్నారు. ►మరో మార్గమైన నల్లొండ క్రాస్ రోడ్డు ద్వారా ఆరాంఘర్ వెళ్లాల్సి ఉంటుందంటున్నారు. ►90 రోజుల పాటు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ►ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పురానాపూల్ నుంచి ఆరాంఘర్ వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ►బహదూర్‌పురా చౌరస్తా వద్ద జరిగే మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణ పనుల సందర్భంగా అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని ట్రాఫిక్ డీసీపీ... ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. -
భారీ మోసం: రూపాయికే సరుకులు! ఎగబడిన కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బంపర్ ఆఫర్ అని ప్రకటించి సరుకులు ఆర్డర్ పెట్టి డబ్బులు చెల్లించిన అనంతరం డెలివరీ చేయకపోవడంతో వినియోగదారులు భారీగా నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని హైదరాబాద్ ప్రజలు మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాను ఎంచుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. తక్కువ ధరలకు నిత్యావసరాల సరుకులు అందిస్తామంటూ ‘జాప్ నౌ’ అనే వెబ్సైట్ ప్రకటన ఇచ్చింది. కొన్ని వస్తువులు కేవలం ఒక్క రూపాయికే అందిస్తామని వల వేశారు. క్యాష్ అండ్ డెలివరీ కాకుండా ఆన్లైన్ చెల్లింపు మాత్రమే చేయాలని నిబంధన విధించారు. ఆఫర్ బాగా ఉందని భావించిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ వెబ్సైట్లో ఆర్డర్లు ఇచ్చారు. తీరా డబ్బు చెల్లించి కొన్ని రోజులైనా వస్తువులు డెలివరీ కాలేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 5 ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్
సాక్క్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్ డెస్క్‌ను శుక్రవారం కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్జెండర్లతో ఇంటర్ఫేస్లో కమిషనర్ సజ్జనార్ సమావేశమయ్యారు. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతాకృష్ణన్ మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్లకు విద్య, ఉపాధి, అద్దెకు ఇళ్ళు, సన్నిహిత భాగస్వామి హింస, వీధిలో వేధింపులు వంటివి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ డెస్క్ ద్వారా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్జెండర్లు, వారి సంఘం ప్రజల్ని వేధించడం గానీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గానీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ట్రాన్స్జెండర్ల ద్వారా ఎలాంటి సమస్యలున్నా ప్రజలు డయల్ 100కు, వాట్సప్ నంబర్ 9490617444 ద్వారా తెలుపవచ్చన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్ డీసీపీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి, డబ్ల్యూసీఎస్‌డబ్ల్యూ విభాగం డీసీపీ సి.అనసూయ, ఏడీసీపీ క్రైమ్ కవిత, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పలువురు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. -
సిమ్ స్వాప్ చేసి లక్షలు కాజేస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సిమ్ స్వాప్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నఅంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దశాబ్ద కాలంగా మోసాలకు పాల్పడుతున్న మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రబ్బరు స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లు, నకిలీ లెటర్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి సిమ్ స్వాప్ దందా చేస్తూ రూ.కోట్లు కాజేశారని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పలు సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నంబర్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారని వివరించారు. ఆ లావాదేవీలు చేస్తున్న మొబైల్ సిమ్‌లను బ్లాక్ చేసి నిందితులు నగదు కాజేస్తున్నారని తెలిపారు. వీరి బారిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మోసపోయారు. వీరిద్దరి నుంచి రూ.11 లక్షలు కాజేశారని చెప్పారు. అయితే ఈ ముఠాకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక అకౌంట్లు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. కాజేసిన డబ్బులను బిట్‌కాయిన్, హవాలా ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారని వెల్లడించారు. -
కర్ఫ్యూ తెలిసి కూడా బయటకు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో రహదారులన్నీ బోసిపోయాయి. అయితే, కొన్ని చోట్ల ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈనేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా బయటకు ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. వారిని తిరిగి వెనక్కి పంపేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యూ. ప్రజలందరూ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలి. అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావద్దు. సైబరాబాద్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రోడ్లపైకి ఎవరు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేస్తున్నాం. రేపు ఆరు గంటల వరకు ప్రజలు ఇదే రీతిలో సహకరించాలి’అని పేర్కొన్నారు. -
దిశ నిందితుల ఎన్కౌంటర్.. ఆ పోలీసులకు రివార్డు!
హిసార్(హరియాణా) : దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రశంసలు కురిపించడమే కాకుండా పోలీసులకు రివార్డు కూడా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన రాహ్ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నట్టు నరేశ్ పేర్కొన్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు రివార్డు అందజేయనున్నట్టు తెలిపారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు రూ. లక్ష చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్ గ్రూప్ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశ ను కాల్చివేసిన ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులపైకి రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే మృతిచెందారు. -
నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..
సాక్షి, హైదరాబాద్ : అభం, శుభం తెలియని వెటర్నరీ వైద్యురాలు దిశపై దారుణానికి పాల్పడ్డ పదో రోజు నలుగురు మృగాళ్ల కథ ముగిసింది. దేశం నినదించిందే నిజమయింది. దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు చివరకు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే హతమయ్యారు. గత నెల 27న దిశను నిందితులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. కేసులో తాము పట్టపడకుండా తప్పించుకునేందుకు..దిశను తగలబెట్టారు. నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో విచారించారు. నవంబర్ 30న నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. చర్లపల్లి జైలుకు వారిని తరలించారు. ఈనెల 4న నిందితులను షాద్‌నగర్ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఘటనపై నిన్న నిందితులను సిట్ విచారించింది. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో గత రెండు రోజుల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటించాయి. మరోవైపు మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి ప్రాంతంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్గేట్ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు..? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది..?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నుండి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించారు. వీలుకాకపోవడంతో పక్కనే ఉన్న రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎన్కౌంటర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో దిశ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఒక ఎస్ఐ, ముగ్గురు మహిళా, నలుగురు పురుష కానిస్టేబుల్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్ టీమ్‌కు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గుంపుగా వచ్చి ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దిశ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇక దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. నిందితులకు సరైన శిక్ష పడిందని మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. కళాశాలల విద్యార్థినుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దిశ ఆత్మకు శాంతి కలిగిందని, కామాంధుల ఎన్‌కౌంటర్‌తో జనజీవన స్రవంతిలో ఉన్న మానవ మృగాల గుండెల్లో దడ పుట్టించేలా ఉందని అన్నారు. టపాసులు పంచుతూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చదవండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్ -
మోసపోయి.. మోసం చేసి..
సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ‘క్యూనెట్’సంస్థ మాదిరిగానే అక్రమాలకు పాల్పడిన మరో సంస్థ ‘సెర్ఫా’బాగోతం బట్టబయలైంది. క్యూనెట్ సంస్థలో చేరి నష్టపోయిన బాధితుడే సెర్ఫా సంస్థ యజమానిగా అవతారమెత్తి దేశవ్యాప్తంగా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. నగరంలోని మియాపూర్ వాసి ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు బుధవారం వలపన్ని నిందితుడ్ని పట్టుకున్నారు. నాడు మోసాలకు బాధితుడు.. నేడు సూత్రధారి శ్రీకాకుళం పొందూరు మండలం తానెం గ్రామానికి చెందిన బక్కి శ్రీనివాసరెడ్డి బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగరీత్యా 2012లో హైదరాబాద్ వచ్చాడు. ఈక్రమంలో క్యూనెట్ సంస్థలో చేరి రూ.13 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. దీంతో 2018లో క్యూనెట్ సంస్థ తరహాలోనే విశాఖపట్టణంలో సెర్ఫా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ప్రారంభించి మల్టీ లెవల్ మార్కెటింగ్ మొదలెట్టాడు. దీని బ్రాంచ్ ఆఫీసును నగరంలోని కూకట్‌పల్లిలో ప్రారంభించిన బక్కి శ్రీనివాస్‌రెడ్డి అనతి కాలంలోనే లక్షలు సంపాదించవచ్చంటూ తన మాయమాటలతో విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగులను ఆకర్షించాడు. తన కంపెనీలో చేరే వినియోగదారులు డీడీ ద్వారా కంపెనీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు చెల్లించాలని, ఆ తర్వాత యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తామని నమ్మపలికాడు. రూ.12,000 చెల్లించి సభ్యుడిగా చేరితే రూ.1,000, మరో ఇద్దరిని చేర్పిస్తే రూ.4,000 కమీషన్ వస్తుం దని ఆశచూపాడు. సంస్థలో చేరిన వారికి వెకేషన్ టూర్ ప్యాకేజీలు, నాసిరకమైన వాచ్‌లు, నాణ్యతలేని హెల్త్, డైటరీ, బ్యూటీ ఉత్పత్తులు ఇచ్చేవారు. వాస్తవానికి హోల్‌సేల్ మార్కెట్లో లభించిన ధరకు పదింతలు రేట్లు చెప్పి వీటిని వారి చేతికి అంటగట్టేవారు. కమీషన్ వస్తుందన్న ఆశతో ఈ కంపెనీలో చేరిన సభ్యులు మరికొంతమందిని ఈ సంస్థలో చేర్పించారు. ఇలా తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తో పాటు లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ కంపెనీలో ఐదువేల మంది వరకు సభ్యులుగా చేరారు. నగరవాసి ఫిర్యాదుతో.. అప్పటివరకు సెర్ఫా సంస్థ కార్యకలాపాలు సాఫీగానే సాగిపోవడంతో ఏ ఇబ్బందిలేకుండా పోయింది. అయితే ఈ కంపెనీలో సభ్యురాలిగా చేరిన నగరంలోని మియాపూర్‌వాసి కన్నెకంటి తులసి సంస్థ మోసాలపై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెర్ఫా డొంకంతా కదిలింది. సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం పోలీసులు రంగంలోకి దిగి సంస్థ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని వలపన్ని కూకట్‌పల్లిలోని అతడి కార్యాలయంలోనే అరెస్టు చేశారు. కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటుగా కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధమున్న ఇతర నిందితుల్ని కూడా అరెస్టు చేయాల్సి ఉందని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. -
ఒక్క నెల.. 4.8 కోట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు.. ఖాళీగా కనిపిస్తే చాలు వాహనదారులు రయ్యిమంటూ దూసుకుపోతు న్నారు. జామ్.. జామ్.. అంటూ సాగిపోతున్నారు. కానీ రెండు మూడ్రోజులకు ఈ–చలాన్ వచ్చి చుక్కలు కనిపించేలా చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని లేజర్‌గన్ స్పీడ్ కెమెరాల ద్వారా క్లిక్‌మనిపించి ఇంటికే చలాన్లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చలాన్ల జారీని పరిశీలిస్తే.. ప్రతి నెలా రూ.4.8 కోట్లు ట్రాఫిక్ పోలీసు విభాగానికి వాహన దారులు చెల్లిస్తున్నారు. ఇరు కమిషనరేట్ల పోలీసులు కలసి తొమ్మిది లేజర్‌గన్ కెమెరాల ద్వారా వాహనదారుల అధిక వేగాన్ని నిర్ధారిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ట వేగాన్ని 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్ జోష్ మాత్రం తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు తగ్గడంలేదు. ఈ ఏడాది జరిగిన 82 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది మృతి చెందారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా... ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో డ్రంకన్ డ్రైవ్ అని తేలడంతో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 1,836 వరకు కేసులు నమోదు చేశారు. వీరిలో 430 మందికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఇతరులకు న్యాయస్థానం రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అటు లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చడంపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెబుతున్నారు. ఆటోమేటిక్‌తో ఈ–చలాన్.. ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్ గన్ కెమెరాతో వాహనదారుల స్పీడ్‌ను గమనిస్తున్నారు. ఇకపై ఈ వెతలు తీరున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్పై ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ కెమెరా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్ జనరేట్ చేయనుంది. ఈ లేజర్ గన్ కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సందర్శించి పనితీరు తెలుసుకున్నారు. ఇది విజయవంతమైతే ఓఆర్ఆర్ అంతటా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఓఆర్ఆర్ విస్తీర్ణం : 158 కిలోమీటర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 2,31,795 సైబరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులు : 1,569 జరిమానా : రూ.23,92,75,225 రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 96,628 జరిమానా : రూ.9,97,90,880 7 నెలల కాలంలో వాహనదారులకు అందిన ఈ–చలాన్ల మొత్తం : రూ. 34కోట్లు -
మాదాపూర్‌లో కారు బోల్తా
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం›4.30 ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో అదే కారులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. కారును డ్రైవ్ చేసిన యువకుడు మద్యం సేవించి ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన సాయి విహిత (20) కూకట్‌పల్లిలోని హాస్టల్లో ఉంటోంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. అదే కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన కూకట్పల్లి వాసి సుచిత్‌బాబు (28) ఈమెకు స్నేహితుడు. ప్రాజెక్టు వర్క్ పని ఉందంటూ విహి త వారం రోజులుగా కాలేజీకి వెళ్లట్లేదు. శనివారం రాత్రి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం సుచిత్‌తో కలసి అతడి కారులో (ఏపీ37 ఎస్ 0444) హాస్టల్ నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం ఈ వాహనం మాదాపూర్‌లోని వంద అడుగుల రోడ్డులో ప్రయాణిస్తోంది. పర్వత్‌నగర్ చౌరస్తా, కల్లు కాంపౌండ్ చౌరస్తా మధ్య ఉన్న రెస్ట్రో హోటల్ వద్ద మితిమీరిన వేగం కారణంగా కారు అదుపు తప్పింది. అక్కడ ఉన్న ఓ ఆటోను వెనుక నుంచి ఢీకొంది. అప్పటికీ అదుపులోకి రాని కారు ఫుట్‌పాత్ ఎక్కి బోల్తా కొట్టింది. ఈ ప్రమా దంలో కారు నుంచి బయటకు పడిపోయిన విహిత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటోడ్రైవర్ చందర్‌కు కుడికాలు, మెడ వద్ద గాయాలయ్యా యి. ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి, విహిత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కారును వదిలి పారిపోయిన సుచిత్‌బాబు సెల్‌ఫోన్ అందులోనే పడిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ రికార్డుల్ని పరిశీలించారు. శనివారం తర్వాత అతడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లోని సంభాషణలు, కారులో లభించిన మద్యం సీసాల ఆధారంగా ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్‌గా అనుమానిస్తున్నారు. సుచిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే వీరి ద్దరూ ఎక్కడకు వెళ్లారు? ఏ సమయంలో వెళ్లారు? తదితర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సమన్వయ సమావేశం
-
పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి
-
విచారణకు హాజరైన టీవీ9 సీఎఫ్‌వో మూర్తి
సాక్షి, హైదరాబాద్ : తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్‌వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ ఏబీసీఎల్‌ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రవిప్రకాశ్, నటుడు శివాజీ, సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తికి నోటీసులు జారీ చేశారు. అయితే రవి ప్రకాశ్, శివాజీ నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానికి ఉత్కంఠ నెలకొంది.మరోవైపు ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐలు ఇవాళ ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. -
అనుక్షణం.. అప్రమత్తం
సాక్షి, సిటీబ్యూరో : నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మిళితమై ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎన్నికలు సాఫీగా జరిగేందుకు అమలుచేస్తున్న చర్యల పై ‘సాక్షి’కి ఆయన వివరించారు. చేవేళ్ల, మల్కాజిగిరితో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి కొన్ని ప్రాంతాలు వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ లోక్‌సభ స్థానాల్లో ప్రశాంత పోలింగ్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ భద్రత నీడలో.. కమిషనరేట్ పరిధిలోని 4,500 మంది విధుల్లో నిమగ్నమవుతున్నారు. 10 కంపెనీల పారామిలిటరీ బలగాల సేవల్నీ వినియోగిస్తున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ఏసీపీని ఇన్చార్జిగా నియమిం చాం. ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వ యం చేసుకోవల్సిన బాధ్యతను అప్పగించాం. ప్రజల్లో ఆత్మవిశ్వా సం నింపేందుకు కీలక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నాం. భద్ర త పరంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. నిరంతర నిఘా.. వివిధ ప్రాంతాల్లో 11 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. అక్రమంగా తరలిస్తు న్న నగదుపై దృష్టి సారించాం. మద్యం తరలిం పుపై నిఘా ఉంచాం. వీటికితోడు స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు, సంచార తనిఖీ బృందాలు, క్వి క్ రెస్పాన్స్ టీమ్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్ బృం దా లు పనిచేస్తున్నాయి. కమిషనరేట్ పరిధి లోని రౌడీషీటర్ల బైండోవర్లపై ఆయా ఠాణాల పోలీసులు దృష్టి సారించారు. లైసెన్స్ గన్లు కలిగిన వారు తమ ఆయుధాలను ఇప్పటికే ఆయా పోలీసు స్టేషన్లలో డిపాజి ట్ చేశారు. -
వైఎస్ వివేకా హత్య కేసు: వారిపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్ : తన తండ్రి హత్యపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. కొంతమంది కావాలనే తన తండ్రి పేరు, ప్రతిష్టలను దిగజార్చేలా నకిలీ వార్తలను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఈ మేరకు శుక్రవారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సైబారాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలను ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్‌లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పులు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోం శాఖ కార్యదర్శిలకు సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసును తప్పుదోవ పట్టించడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా.. నిందితులు ఎవరనే విషయం ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. తమ కుటుంబసభ్యులపై మితిమీరిన దృష్టి పెడుతూ అసలైన అనుమానితుల స్టేట్మెంట్లను, మెడికల్ రిపోర్టులను మార్చే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. సిట్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేని నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాని ప్రత్యేక సంస్థ ద్వారా విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంబంధిత కథనాలు వైఎస్ వివేకా హత్య కేసులో సర్కార్ వింత పోకడ మా నాన్న హత్యపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానాలున్నాయి’ పుట్టెడు దుఃఖంలో ఉన్న మాపై తప్పుడు వార్తలా? బాబు డైరెక్షన్..‘సిట్’ యాక్షన్! -
30 నుంచి కానిస్టేబుళ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి ఈ నెల 30 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. సివిల్/ ఏఆర్, టీఎస్ఎస్పీ, ఫైర్‌మన్, ఎస్పీ ఎఫ్ ఇలా ఆయా విభాగాల వారీగా ఎంపికైన కానిస్టేబుళ్లు సంబంధిత ప్రధాన కార్యాలయాల్లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎంపికైన కానిస్టేబుళ్ల వివరాలను http://www.cyberabadpolice. gov.in/ వెబ్సైట్లో పొందుపరిచారు. విధివిధానాలు ఇలా... ► ప్రతి ట్రైనీ కానిస్టేబుల్ రెండేసి చొప్పున ఖాకీ నిక్కర్లు, కట్ బనియన్లు వెంట తెచ్చుకోవాలి. ► దుప్పట్లను శిక్షణ కేంద్రంలో ఇస్తారు. దిండ్లు, బకెట్లు, మగ్గు, బూట్‌పాలిష్, తాళాలు వెంట తెచ్చుకోవాలి. ► భోజనం, ఇతర చార్జీల కింద రూ.6 వేలు డిపాజిట్ చేయాలి. భోజనం చార్జీలు తర్వాత తిరిగి ఇస్తారు. ► బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను శిక్షణ కేంద్రానికి తీసుకురావొద్దు. ► ఆధార్ కార్డు, 10 పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలి. ► కుటుంబసభ్యుల్ని శిక్షణ కేంద్రంలోకి అనుమతించరు. ► హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసిన అనంతరం ట్రైనీ కానిస్టేబుల్స్‌ని డీటీసీ/పీటీసీ/టీఎస్‌పీఏకు పంపిస్తారు. -
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలివీ.. దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని జీడిమెట్లకు, శంషాబాద్ డివిజన్ డీఐగా పనిచేసే బొల్లం శంకరయ్యను దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే, సైబర్ క్రైం విభాగంలో ఉన్న బాల కృష్ణారెడ్డిని బాచుపల్లి పీఎస్‌కు, వీఆర్‌లో ఉన్న పుష్పన్‌కుమార్‌ను శంషాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. -
చెట్లు నాటితే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
హైదరాబాద్ : చెట్లు నాటితేనే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన హరితహారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఏడాదికి 42 కోట్ల చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలతోపాటు 108 ప్రైవేట్ సంస్థలు హరితహారంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. -
శివారే.. సవాల్!
♦ సైబరాబాద్‌లో మొత్తం 3486 పోలింగ్ స్టేషన్లు ♦ 1422 సమస్యాత్మకంగా గుర్తింపు ♦ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న కమిషనరేట్ అధికారులు ♦ బందోబస్తు విధులకు 17 వేల మంది సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కంటే శివార్లలోనే ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారింది. సిటీ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3486 పోలింగ్ స్టేషన్లు ఉండగా... వీటిలో దాదాపు సగం సమస్యాత్మక జాబితాలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యాపార, స్థిరాస్తి వ్యవహారాల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అర్ధ, అంగబలాలు ఎక్కువే. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలకమైన ఈ ప్రాంతాల్లో పట్టుకోసం ‘సీటు’ సాధించాలనే పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉంటోంది. ఈ పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఎన్నికల బందోబస్తు కోసం 17 వేల మంది సిబ్బందిని వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్ అవసరమైన మార్పుచేర్పులు సూచిస్తున్నారు. నగరానికి పూర్తి భిన్నంగా... కోర్ సిటీలో చేసే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లకు... చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్(శివారు ప్రాంతాలు)లో తీసుకునే చర్యలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సువిశాలమైన పరిధి, విసిరేసినట్లు ఉండే కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయడం, పోటీలో ఉన్న వాళ్లు ఎరవేసే ప్రలోభాలను అడ్డుకోవడం పెనుసవాల్ లాంటిదే. మూడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లో 12 జీహెచ్ఎంసీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో 64 డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించి 1077 పోలింగ్ సెంటర్లలో 3486 పోలింగ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలింగ్స్టేషన్లను అధ్యయనం చేసిన పోలీసు విభాగం వీటిలో 1422 సమస్యాత్మకంగా ఉన్నట్లు తేల్చారు. గత చరిత్ర, పోటీలో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ జాబితా రూపొందించారు. సాధారణ పరిస్థితులు ఉండే పోలింగ్ స్టేషన్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్‌స్టేషన్... ఇలా నాలుగు రకాలుగా విభజించుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్లు ఉండగా... క్రిటికల్ కేటగిరీ కిందికి వచ్చే పోలింగ్స్టేషన్లు కేవలం శంషాబాద్ జోన్లోనే ఉన్నాయి. సెన్సిటివ్ పోలింగ్స్టేషన్లు ఎల్బీనగర్ జోన్లో, హైపర్ సెన్సిటివ్ మల్కాజ్‌గిరిలో ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. అదనపు బలగాలు 11 వేలు... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 7619 మంది సిబ్బందిలో రొటీన్ విధుల కోసం 30 శాతం మందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. మిగిలిన 5334 మందికి అదనంగా మరో 11 వేల మందిని ఇతర విభాగాలు, జిల్లాల నుంచి కోరుతూ డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. కమిషనరేట్ వ్యాప్తంగా 253 రూట్ మొబైల్స్, 65 స్ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తాయి. బందోబస్తు ఏర్పాట్లు ఇవీ... ►{పతి పోలింగ్ స్టేషన్లో క్యూ నిర్వహణకు కానిస్టేబుల్, ఓ అధికారి ► ఒకే బిల్డింగ్‌లో ఉన్న సాధారణ కేటగిరీ కిందికి వచ్చే ఒక పోలింగ్‌స్టేషన్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు అధికారులు ► ఒకే బిల్డింగ్‌లో రెండు పోలింగ్స్టేషన్లు ఉంటే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు అధికారులు ► ఒకే బిల్డింగ్‌లో మూడు పోలింగ్స్టేషన్లు ఉంటే ముగ్గురు కానిస్టేబుళ్లు, ముగ్గురు అధికారులు ► క్రిటికల్ పోలింగ్స్టేషన్ల వద్ద ఒక ఎస్సై, పదిమంది సాయుధ పోలీసులు ► హైపర్ సెన్సిటివ్ పోలింగ్‌స్టేషన్ వద్ద ఎస్సై, ఐదుగురు సాయుధులు ► సెన్సిటివ్ పోలింగ్‌స్టేషన్ వద్ద హెడ్-కానిస్టేబుల్,ఇద్దరు కానిస్టేబుళ్లు ► స్ట్రైకింగ్ ఫోర్స్‌లో ఐదుగురు సిబ్బంది ► స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లో ఏడుగురు ► బోర్డర్ చెక్‌పోస్టుల్లో ఎస్సై, ఆరుగురు సిబ్బంది ► ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ఏఎస్సై, హెడ్-కానిస్టేబుల్,ఇద్దరు కానిస్టేబుళ్లు ► స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లో ఏఎస్సై, హెడ్-కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు -
సైబరాబాద్‌లో ‘రికవరి’రికార్డు
⇒ స్వాధీనం చేసుకున్న సొత్తు 74 శాతం ⇒ ఛేదించిన కేసులు 68 శాతం ⇒ కొత్త సంస్కరణలతో ఉత్తమ ఫలితాలు: సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో చోరీ సొత్తు రికవరీ చేశారు. వరుసగా ఇలా నాలుగేళ్లు రికార్డు సొంతం చేసుకున్న ఘనత వీరికే దక్కింది. నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం పరిష్కారం చేసిన ఘనత కూడా వీరికే ఉంది. ఈ ఏడాది 74 శాతం రికవరీ సొత్తు స్వాధీనం చేసుకోగా, 68 శాతం కేసులను పరిష్కరించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్‌లో నేరాలు-ఘోరాలు, సాధించిన విజయాలపై 2014 వార్షిక నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్‌లో ఈ ఏడాది 24,922 కేసులు నమోదవగా, వాటిలో సొత్తు కోసం చేసిన చోరీలు 5343 ఉన్నాయన్నారు. వీటిలో 3620 కేసులు చేధించామన్నారు. చోరీ సొత్తులో రూ.22.76 కోట్లు (74 శాతం) రికవరీ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసుల ప్రత్యేక కృషితో పాటు జోన్ల వారీ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం, ఠాణాలలో క్రైమ్, శాంతి భద్రతలపై వేర్వేరు ఇన్స్పెక్టర్లను నియమించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇక శివ ఎన్కౌంటర్ తరువాత సైబరాబాద్‌లో గణననీయమైన స్థాయిలో చైన్ స్నాచింగులు తగ్గాయని ఆనంద్ తెలిపారు. మహిళా భద్రతకు తీసుకున్న చర్యలతో వారిపై దాడులు గతేడాదికంటే తగ్గాయన్నారు. కార్డన్ సెర్చ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. స్నేక్ గ్యాంగ్ నిందితులకు శిక్షలు పడే విధంగా చార్జీషీట్ వేశామని వివరించారు. రాత్రి పోలీసు పెట్రోలింగ్, ఓఆర్ఆర్, హైవేలపై కూడా పెట్రోలింగ్‌లో మార్పులు చేపట్టామన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగ్రాతుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు రవివర్మ, ఏఆర్ శ్రీనివాస్, కార్తికేయ, రమా రాజేశ్వరి, రమేష్ నాయుడు, రంగారెడ్డి, అవినాష్ మహంతి, అదనపు డీసీపీలు మద్దిలేటి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, వాసుసేన తదితరులు పాల్గొన్నారు. ఎస్ఓటీ సాధించిన ఘనత ఎస్‌ఓటీలు 2013లో 188 కేసులు చేధించి రూ.5,82,91,255 సొత్తును స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది 1084 కేసులను చేధించి రూ.12,30,31,349 సొత్తు స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించింది. ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పుష్పన్ కుమార్, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేంద్ర, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు, శివలు ఈస్ట్, వెస్ట్ బృందాలుగా ఏర్పడి 179 పేకాట శిబిరాలు, 160 వ్యభిచార కేంద్రాలు, 11 డ్రగ్స్ మాఫియా గ్యాంగ్‌లు, తొమ్మిది సట్టా కేంద్రాలపై దాడులు చేశారు. ఈ ఏడాది పురోగతి ⇒ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీటీపీ, ఎస్ఓటీ, సీఐ సెల్ విభాగాలను ఈస్ట్, వెస్ట్ జోన్లుగా రీ ఆర్గనైజేషన్ చేశారు. ⇒ జోన్ పరిధిలో కొత్తగా జోనల్ టాస్క్‌ఫోర్స్ టీములను ఏర్పాటు చేశారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్‌పై సిబ్బంది, రాత్రి గస్తీ, సీసీఎస్, అడ్మిన్ ఎస్ఐ లాంటి అంశాల్లో పురోగతి సాధించారు. ⇒ భూ వివాదాలపై ఎస్ఓపీ, కార్డన్ సెర్చ్, నాకాబందీ, డ్రకంన్ డ్రైవ్‌లు చేపట్టారు. ⇒ ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు. ⇒ ప్రాపర్టీ నేరాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 68 శాతం నేరాలను చేధించారు. 2014లో పెద్ద ఘటనలు ⇒ సిక్ చావుని అల్లర్లలో పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి. ⇒ కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ ఎన్కౌంటర్. ⇒ నకిలీ నోట్ల ముఠాను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు చేపట్టిన డెకాయి ఆపరేషన్‌లో నిందితుల దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు మృతి. పోలీసు కాల్పుల్లో ముస్తఫా అనే నిందితుడు మృతి. భవిష్యత్తు ప్రణాళిక ఇదీ.. ⇒ ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ విధానం ⇒ సిటిజన్ కనెక్ట్ యాప్ రూపకల్పన ⇒ సోషల్ మీడియా పోలీసింగ్ ⇒ కోర్టు మానిటరింగ్ విధానం అమలు ⇒ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెసర్స్ -
రాజీవ్‌గృహకల్పలో అలజడి
* పోలీసుల కార్డన్ సర్చ్ * 32 ద్విచక్రవాహనాల స్వాధీనం * పోలీసుల అదుపులో 12 మంది అనుమానితులు కుత్బుల్లాపూర్/ జగద్గిరిగుట్ట: అర్ధరాత్రి పోలీసుల బూట్ల చప్పుళ్లు.. ఒక్కసారిగా అలజడి.. తేరుకునే సరికి కార్డన్ సర్చ్ పేరిట పోలీసుల హడావుడి.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుని పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ అనుమానాలు నివృత్తి చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న కార్డన్ సర్చ్‌లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్పలో బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో విసృ్తత సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చి ఇలా ఆకస్మాత్తుగా సోదాలు చేయడం శుభ పరిణామమేనని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటువంటి సోదాలు జరిపితే సంఘ విద్రోహశక్తుల్లో భయం పుడుతుందని వారన్నారు. మూడు గంటలు.. అష్ట దిగ్బంధం.. జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్ప సముదాయంలో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు బాలానగర్ డీసీపీ ఆర్.శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసులు బృందాలుగా విడిపోయి ఇంటింటినీ సోదా చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 420 మంది పోలీస్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. గృహకల్ప చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని బయటకు, లోనికి వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసి మొత్తం 32 ద్విచక్ర వాహనాలు, పది ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకొని 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వందల కొద్దీ సిమ్‌కార్డులు... కార్డన్ సర్చ్ సందర్భంగా రాజీవ్ గృహకల్పలో ఉంటున్న ఓ వ్యక్తి వద్ద ఎయిర్‌సెల్‌కు సంబంధించిన వందల సిమ్‌కార్డులు దొరికాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరింత సోదా చేయగా అతని వద్ద పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు వేరే వ్యక్తుల డాక్యుమెంట్లు లభించాయి. వీటి వివరాలు పరిశీలించిన తర్వాత సిమ్ కార్డుల బాగోతంపై దృష్టి పెడతామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.