d srinivas
-
డీఎస్ కుటుంబానికి బొత్స పరామర్శ
నిజామాబాద్, సాక్షి: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకోసం సోమవారం ఉదయం ప్రగతి నగర్‌లోని డీఎస్ నివాసానికి బొత్స వెళ్లారు.కాంగ్రెస్‌లో ఉండగా డీఎస్‌తో బొత్సకు మంచి అనుబంధం ఉంది. డీఎస్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన కుటుంబ సభ్యుల్ని బొత్స ఓదార్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. జూన్ 30వ తేదీన హైదరాబాద్ నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
-
ఇక సెలవు.. ముగిసిన డీఎస్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు నాయలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో డీఎస్ ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులు సంజయ్ అరవింద్‌లను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక భూమిక పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రత్యేక చొరవతోనే 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్‌కు మంచి అనుబంధం ఉందని, బడుగు, బలహీన వర్గాల నేతలను ప్రోత్సాహించారని ప్రశంసించారు. డీఎస్ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అంతియ యాత్ర మొదలు కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి పాడెను మోశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
నిజామాబాద్ కు డి శ్రీనివాస్ భౌతికకాయం
-
ధర్మపురి శ్రీనివాస్ ప్రస్థానం
-
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ కన్నుమూత
-
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు, బీజేపీ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి కోసం దేవుడుని ప్రార్థించాలని అభిమానులను కోరారు.కాగా, ఎంపీ అర్వింద్ ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్రీనివాస్ అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు. My father, Sri D. Srinivas Garu has been admitted to the ICU of a private hospital due to a urinary tract infection and sodium loss. Please keep him in your thoughts and prayers. pic.twitter.com/6xZtEaP6SN— Arvind Dharmapuri (Modi Ka Parivar) (@Arvindharmapuri) June 1, 2024 -
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది. ‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం. :::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం!
ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే.. నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది. దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్‌కు బీజం పడినట్లయింది. సీఎం కేసీఆర్‌కు కౌంటర్.. పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రెండు సవాళ్లు ఇవే.. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్‌తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్‌కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్‌గానే మారింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్‌తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్‌ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
డీఎస్ ఇంట్లో రాజకీయ రచ్చ.. అన్న ఆరోపణలపై స్పందించిన అరవింద్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక వ్యవహారంపై ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తండ్రి మైల్డ్ పెరాలసిస్‌తో పాటు, చెప్పింది మర్చిపోయే డిమెన్షియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఆయనను గాంధీభవన్‌కు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పడం సబబు కాదన్నారు. ' మా నాన్న మైండ్ స్ట్రోక్ వచ్చి బాధపడితే కనీసం సోనియా గాంధీ గానీ ఇంకెవరు గానీ పలకరించినవాళ్లు లేరు. నా తండ్రి కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అని నేనే పలుమార్లు చెప్పాను. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లినా, కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్లినా నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇది సమయం కాదు.. జాయిన్ చేసుకునే పద్ధతి ఇది కాదు. సోనియానో , ఇంకెవరైనా ఆ స్థాయి వాళ్లో ఆయన ఇంటికే వెళ్లి కండువా కప్పితే భావ్యం తప్ప ఇది పద్ధతి కాదన్నదే నా ఉద్దేశం' అని అరవింద్ అన్నారు. కాగా.. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్ ఆదివారం గాంధీభవన్ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఒక్కరోజుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. తాను పార్టీలో చేరలేదని, కానీ చేరినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ లేఖను తన తమ్ముడు అరివింద్ బ్లాక్మెయిల్ చేసి రాయించాడని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి అనారోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం అన్నాదమ్ముల మధ్య పొలిటికల్ హీట్ పెంచింది. సంజయ్ ఆరోపణల నేపథ్యంలోనే అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా? -
కాంగ్రెస్‌లో చేరిక పంచాయితీ.. డీఎస్ తనయుల వార్! తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారా?
డీ శ్రీనివాస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. తన తమ్ముడు ధర్మపురి అరవిందే తండ్రిని బ్లాక్మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చుట్టూ ఉన్నవాళ్లపై తనకు అనుమానం ఉందని సంజయ్ చెప్పారు. డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ ఆదివారమే కాంగ్రెస్ గూటికి తిరిగివెళ్లారు. అయితే 24 గంటల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోదరుడు అరవింద్‌పై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీఎస్ రాజీనామానా వ్యవహారం కాస్తా ఆయన కుమారుల పంచాయితీగా మారింది. అన్న సంజయ్ ఆరోపణలపై తమ్ముడు అరవింద్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లోకి తిరిగి చేరిన సందర్బంగానే గాంధీభవన్ వెళ్లానని, కానీ తానూ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారని డీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది? -
కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పాటు ఆయన తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. డీఎస్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, గత కొంతకాలంగా సంజయ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. డీఎస్ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. అయితే, తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్‌తో పాటుగా సంజయ్ టిఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. గత కొద్దికాలంగా బీఆర్ఎస్కు సంజయ్ దూరంగా ఉంటున్నారు. డీఎస్ చేరికపై ట్విస్టు కాగా, డీఎస్ కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ స్వయంగా ప్రకటించారు. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డీఎస్ పేరుతో ప్రచారంలోకి వచ్చిన పత్రికా ప్రకటన ‘‘కాంగ్రెస్‌లో చేరుతున్నా కాబట్టే గాంధీభవన్‌కు వచ్చా. రాహుల్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్ చేరుతున్నా. నేను కాంగ్రెస్ వ్యక్తిని.. నన్ను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్‌పై అనర్హత వేటువేసే వారికి అసలు అర్హత ఉందా?. రాహుల్ ఊహించని దానికంటే గొప్పగా పనిచేస్తున్నారు’’ అని డీఎస్ అన్నారు. -
సీనియర్ నేత డీ.శ్రీనివాస్‌కు అస్వస్థత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు. మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f — Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023 -
రాజ్యసభ మాజీ ఎంపీ డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల
-
డీఎస్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల.. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరామర్శించారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తి కరమైన చర్చ సాగింది. వైఎస్సార్‌తో ఉన్న పాత అనుభవాలను డీస్ గుర్తు చేశారు. వైఎస్సార్‌పై తెలంగాణ ప్రజల అభిమానం చెక్కు చెదరలేదన్నారు. షర్మిలను బలమైన మహిళగా డీఎస్ పేర్కొన్నారు. షర్మిల కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైఎస్ సీఎం అవుతారని 2003లోనే చెప్పానని డీఎస్ గుర్తు చేసుకున్నారు. చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
మండవకు ‘రాజ్య’యోగం దక్కేనా..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధం అయింది. రెండు సాధా రణ స్థానాలు కాగా, ఒకటి ఉప ఎన్నిక. జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి శ్రీనివాస్ పదవీకాలం వచ్చే నెల 21న ముగియనుంది. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు సభ్యత్వం కాలపరిమితి ముగియనుంది. మరొక స్థానం విషయానికి వస్తే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి ఈ నెల 19 వర కు నామినేషన్ల గడువు ఉంది. మిగిలిన రెండు సాధారణ స్థానాలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే జిల్లా నుంచి డీఎస్ ఖాళీ చేస్తున్న స్థానాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ ఆశిస్తున్నారు. కాగా జిల్లా నుంచి ఇప్ప టికే రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి ఉన్నా రు. రాజ్యసభ సీట్లను ఆశించేవారి సంఖ్య అధికార పార్టీలో భారీగానే ఉంది. దీంతో అనేక స మీకరణాలు ప్రభావితం కానున్నాయి. ఈ మేర కు సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారేనే విషయ మై వివిధ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆశావహుల్లో ప్రధానంగా మండవ వెంకటేశ్వరరావు పేరు మాత్రమే వినిపిస్తోంది. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
మళ్ళీ కాంగ్రెస్ గూటికి డి. శ్రీనివాస్
-
ఓ కుటుంబ కథా చిత్రం..
-
కాంగ్రెస్‌లోకి రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్..!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ చేరడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ డీఎస్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే రెండు, మూడు రోజుల్లోనే ఇది వాస్తవరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డి.శ్రీనివాస్ కొనసాగుతున్నారు. త్వరలోనే డీఎస్ రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. కాగా, కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అధిష్టానం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: (గుడ్‌న్యూస్! హైదరాబాద్‌కి పెట్ కేర్.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..) 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్ స్వయంగా డీఎస్ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు. ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్ కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగానే ఉంటున్నారు. -
ఉత్తమ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉపఎన్నిక ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. మరో పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్ విసిరారు. ఉపఎన్నిక ఇన్చార్జ్గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. -
డీఎస్‌తో ఈటల భేటీ, రెండు గంటలపాటు చర్చలు!
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌తో బుధవారం భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు. చదవండి: ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం -
ఆస్తులు రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లోనే పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో నే కొత్తగా ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతోంది. క్రయ, విక్రయదారుల నమోదు నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ వరకు అన్నీ ఆన్లైన్లో పూర్తి చేసి.. నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే సులభంగానే ఈ ప్రక్రియ పూర్తవుతోందని తొలిరోజు పరిశీలన చెబుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా సాగుతుంది! వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సిటిజన్ లాగిన్, డెవలపర్స్, బిల్డర్స్‌కు ప్రత్యేక లాగిన్ ఇచ్చారు. అమ్మేవారు, కొనేవారు, సాక్షుల వివరాలను ముందుగా నమోదు చేయాలి. ఆ తర్వాత పీ టిన్ (ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్)ను నమోదు చేయాలి. అయితే ఆ ఆస్తి లేదా భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదై ఉంటేనే సదరు వివరాలు కన్పిస్తాయి. ఆ తర్వాత ఫ్లాట్ విస్తీర్ణం, నిర్మాణ విస్తీర్ణం కన్పిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, మార్కెట్ విలువ మేర ఫీజు, మ్యుటేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు స్లాట్ బుక్ అవుతుంది. స్లాట్ బుక్ కాగానే క్రయ, విక్రయదారులు, సాక్షులు నిర్దేశిత సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ స్లాట్ అడ్వైజరీ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రయ, విక్రయదారులు, సాక్షుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటారు. వెబ్సైట్ నుంచి సబ్రిజిస్ట్రార్లే ఒక ఫారంను డౌన్లోడ్ చేసి సంతకాలు చేయిస్తారు. మళ్లీ దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. మ్యుటేషన్ వివరాలు కూడా అందులో ఉంటాయి. సదరు ఆస్తికి సంబంధించిన ఈ–పాస్‌బుక్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ తర్వాత రూ.300 చెల్లిస్తే సదరు ఆస్తికి సంబంధించిన మెరూన్ రంగు పాసుపుస్తకం కొనుగోలుదారుడి ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలాంటి స్టాంపు పేపర్ అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వ లోగో, మాస్టర్హెడ్తో తెల్లకాగితం మీదే డాక్యుమెంట్ వస్తోంది. అయితే, ఈ డాక్యుమెంట్‌తో పాటు మెరూన్ రంగు పాసుపుస్తకం ఉంటేనే చట్టబద్ధం అవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా అన్ని వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే స్లాట్ బుక్ అవుతుంది. ఆంగ్ల పరిజ్ఞానం లేని వారు, నిరక్షరాస్యులు మీ–సేవకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 పేజీల డాక్యుమెంట్ వస్తుంది. ఇందులో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫీజు వివరాలు, క్రయవిక్రయదారులు, సాక్షుల వివరాలు, షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, సేల్ డీడ్ వస్తున్నాయి. ఇక, పాసు పుస్తకం కూడా 2 పేజీలు వస్తుంది. డీఎస్‌కు ‘ధరణి’ కష్టాలు! సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌కు ధరణి పోర్టల్ కష్టాలు తప్పలేదు. ఇటీవల తన వ్యవసాయ భూమిని విక్రయించిన ఆయన.. కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సోమవారం నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అయితే, రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ వెరిఫికేషన్ కోసం వేలిముద్రలు, ఐరిస్ సంబంధిత పోర్టల్‌లో సరిపోలకపోవడంతో సుమారు రెండు గంటల పాటు కార్యాలయంలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ రూరల్ మండలం సారంగపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న తన 3.5 ఎకరాల భూమిని ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన నవంబర్ 12న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు డీఎస్ వేలిముద్రలు, ఐరిస్ ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోలలేదు. దీంతో అప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి కాకుండానే వెనుదిరిగారు. డీఎస్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఐరిస్ ట్యాలీ కాలేదని భావించారు. దీంతో ఆయన ఇటీవల ఆధార్ కార్డులో తన వేలిముద్రలు, ఐరిస్‌ను అప్డేట్ చేసుకున్నారు. అప్డేట్ చేసిన ఆధార్ కార్డుతో సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాగా, ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తన వేలిముద్రలు, ఐరిస్ మ్యాచింగ్ కాలేదు. పలుమార్లు వేలిముద్రలు, ఐరిస్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు రెవెన్యూ అధికారులు సాంకేతిక నిపుణుడి సాయం తీసుకోవడంతో ఎట్టకేలకు వేలిముద్రలు, ఐరిస్ మ్యాచ్ అయ్యాయి. దీంతో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం డీఎస్ తహసీల్దార్ కార్యాలయానికి రావడం ఇది మూడోసారి.. తొలి రోజు రిజిస్ట్రేషన్లు 82 సాక్షి, హైదరాబాద్: మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. తొలిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరిగాయని, సాంకేతిక సమస్యలు ఎదురైనట్టు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. స్లాట్ బుక్ చేసుకోకుండానే కొందరు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారని, స్లాట్ బుక్ చేసుకొని వారికి రిజిస్ట్రేషన్లు జరపబోమని స్పష్టం చేశారు. మంగళవారం 58 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 155 రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్లాట్లు బుక్ అయ్యాయని వెల్లడించారు. అడ్డొచ్చిన అమావాస్య సెంటిమెంట్ సాక్షి, నెట్వర్క్: అమావాస్య సెంటిమెంట్‌కు తోడు సాంకేతిక సమస్యలతో తొలిరోజు ఆయా జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గందరగోళంగా కొనసాగింది. నిబంధనల మేరకు పలు పత్రాలను సమర్పించాల్సి ఉండటంతో చాలామంది వాటిని అందజేయలేక ఇబ్బందిపడ్డారు. సర్వర్ల మొరాయింపుతో పలుచోట్ల స్లాట్లు బుక్‌కాలేదు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 21 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కరీంనగర్లో 1 రిజిస్ట్రేషన్ కాగా, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కటీ కాలేదు. అరగంటలోనే పనైంది.. నా భర్త పేరిట ఉన్న ఆర్సీసీ భవనం (బిల్డింగ్) నా పేరిట దానపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. గతంలో దీనికోసం 3 నెలలు తిరిగి వేసారిపోయాం. కొత్త విధానంలో ముందే స్లాట్ బుక్ చేసుకుని.. ఈరోజు దుబ్బాక ఆఫీస్‌కు వెళ్లగా అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. – కాస్తి యాదమ్మ రాములు, ధర్మాజీపేట, దుబ్బాక మున్సిపాలిటీ -
దమ్ముంటే చర్యలు తీసుకోండి: డీఎస్
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పు చేశానని.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయినట్లా అని టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తనపై ప్రశాంత్‌రెడ్డి చేసిన విమర్శలను డీఎస్ తీవ్రంగా ఖండించారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. తన సస్సెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని డీఎస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనపై సోనియాగాంధీకి తప్పుడు నివేదిక ఇవ్వటం వల్ల తాను మనస్తాపంతో కాంగ్రెస్‌పార్టీని వీడానని డీఎస్ వెల్లడించారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు డీఎస్ బహిరంగ లేఖ -
సీఎం కేసీఆర్‌కు డీఎస్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పోరాటం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తోందని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం డీఎస్ బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. ‘కార్మికుల పోరాట పటిమ చూస్తోంటే లక్ష్య సాధనలో శ్రుతి మించకు.. ఎవరికి తల వంచకు’ అనే స్పూర్తి గోచరిస్తోందని లేఖలో తెలిపారు. ఆర్టీసీ కుటుంబాలు అండగా ఉండటం తెలంగాణ మట్టిలోనే ధైర్యం పరిమళిస్తుందని గుర్తుకు వచ్చిందన్నారు. ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచక నిలబడటంలో శౌర్యం కనిపిస్తుందన్నారు. ‘ప్రభుత్వంలోని ఏ సంస్థను అయినా ఎలా నడపాలి అనే విషయంలో ముఖ్యమంత్రిగా మీకు విశేష విచక్షణాధికారులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఆస్తుల పంపకం జరగక ముందే టీఎస్ ఆర్టీసీ పూర్తి చట్టబద్ధత కాకముందే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం సరి కాదు. సాధ్యం కూడా కాదన్న విషయం మీకు తెలియంది కాదు. హైకోర్టు చెప్పినట్టు ఉన్నత స్థాయిలో అధికారులు మీకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లనే అనుచితమైన సలహాలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించడం వల్లే ఈ అస్తవ్యస్త అసందిగ్ధ ఆందోళనకర వాతావరణం ఏర్పడిందని’ లేఖలో పేర్కొన్నారు తెలంగాణ కోసం ఉద్యమించిన ఆర్టీసీ పోరు బిడ్డల పట్ల మీ స్వభావానికి విరుద్దంగా ఇంత కఠినంగా మీరు వ్యవహరించడం చూస్తుంటే ఎవరిదో కుట్ర ఉన్నట్టు అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ బిడ్డలు ఎవరికీ తలవంచరూ అనే విషయం మీకు తెలియంది కాదని.. ఆర్టీసీ కార్మికులనే కాకుండా వారి కుటుంబాలను కూడా మీ ద్వారానే బెదిరించే దుస్సాహసానికి పాల్పడ్డ కుట్ర దారులు ఎవరో అర్థం కావడం లేదన్నారు. ‘కార్మికుల బలవన్మరణాలకు బాధ్యులలైన వారి మీద గుండె రగులుతోంది. కార్మికులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇంకా పంతాలు పట్టింపులకు పోకుండా వెంటనే కార్మికులందరికి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా వారిలో విశ్వసనీయతను కల్పించాలి. సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలను అంగీకరించాలి. వెంటనే ఆర్టీసీ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాను అప్పుడే తెలంగాణ ప్రజలు మీ నిర్ణయాన్ని హర్షిస్తారు’ అని లేఖలో పేర్కొన్నారు.