Dasari Manohar Reddy
-
మూడవసారి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైన దాసరి మనోహర్ రెడ్డి
-
పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్ దక్కెనా?
ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్ఎస్ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ► బీసీలు : 70% ► ఎస్సీలు: 14% ► ఇతరులు: 16% ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 1983 ఎన్నికలు: ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. 1984 ఉప ఎన్నికలు: 1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్‌సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా.. దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి. 2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు. దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల కలగా మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం. పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య. పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు. మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు. నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం. చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి. పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలు. రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు: పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ. పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం. సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు. ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి. పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పార్టీ... అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ.... తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ.... బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్‌లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ... ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భౌగోళిక పరిస్థితులు: ► పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది. ► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ..
సాక్షి, పెద్దపల్లి: ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఆ నియోజకవర్గాలకు భారీ మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేయడం జరిగింది. దీంతో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలతో చేదు అనుభవం ఎదురైంది. కొందరు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నియోజకవర్గానికి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో.. పెద్దపల్లి అభివృద్ధి కావాలంటే మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ.. మంచిది.. నువ్వు ఇక్కడకు వచ్చి మాట్లాడు.. అన్నారు. కాగా, వీరిద్దరూ మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కుటుంబం జలసమాధి : వీడిన మిస్టరీ
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, సోదరి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్యనారాయణరెడ్డి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్‌లో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ పరిశీలన అనంతరం అది స్వయంగా సత్యనారాయణరెడ్డి రాసిందేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నాలుగు నెలల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది.(చదవండి : కుటుంబం జలసమాధి : కొనసాగుతున్న విచారణ) కాగా, ఈ ఏడాది జనవరి 27న కరీంనగర్‌లోని బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి నుంచి సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కుమార్తె వినయశ్రీలతో కలిసి కారులో బయలుదేరారు. అయితే అదే రోజు వారి కారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి వీరి ఆచూకీ కనిపించకుండా పోయింది. అయితే ఈ ఘటన జరిగిన ఇరవై రోజుల తర్వాత కరీంనగర్ నుంచి గన్నేరువరం బయలుదేరిన ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అ ప్రమాదంలో మహిళ నీటిలో కొట్టుకుపోవడంతో.. ఆమె గాలింపు కోసం కాలువలోకి విడుదలను నిలిపివేశారు. ఈ క్రమంలోనే కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో సత్యనారాయణరెడ్డి కారు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సహస్ర కాదు వినయశ్రీ...
కరీంనగర్‌క్రైం/తిమ్మాపూర్(మానకొండూర్): పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, చెల్లి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. సత్యనారయణరెడ్డి కారు ఏ తేదీన, ఏ సమయంలో పడిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈమేరకు సీపీ కెమెరాల ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు. సత్యనారాయణరెడ్డి ఒక్కడే జనవరి 26న హైదరాబాద్ వెళ్లొచ్చినట్లు తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. జనవరి 26వ తేదీఉదయం 11.44 గంటలకు రేణిగుంట టోల్‌ప్లాజా నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాడని... తిరిగి సాయంత్రం 8.15 గంటలకు కరీంనగర్ వైపు వచ్చాడని గుర్తించారు. ఈమేరకు సీసీ ఫుటేజీలు స్వీకరించినట్లు ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి వెల్లడించారు. కాలువలో పడిన కారు ఫిట్నెస్ రిపోర్టు కోసం రవాణాశాఖ అధికారులను సంప్రదించామని తెలిపారు. వాహనానికి సంబంధించి ఏదైనా తప్పిదంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. రవాణాశాఖ అధికారుల నుంచి వాహనం కండీషన్ రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 27న కరీంనగర్‌లోనే.. కరీంనగర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ప్రకారం జనవరి 27న సాయంత్రం వరకు నారాయణరెడ్డి కారు పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం. దీంతో కరీంనగర్ బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వరకూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నమోదుకాని దృశ్యాలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా 27వ తేదీ సాయంత్రం బయల్దేరినట్లు అతడి షాపులో పనిచేసే వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 27 తేదీన అల్గునూర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కారు అటుగా వచ్చినట్లు కనిపించలేదని తెలిసింది. రాత్రి నమోదైన దృశ్యాల్లో వాహనాల నంబర్లు సరిగా కనిపించకపోవడంతో మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపా రు. 27 తేదీ సాయంత్రం వరకు మాత్రం కారు అటువైపు రాలేదని తేలడంతో కారు ఏ సమయంలో పడిందనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్‌డాటా వస్తే మరిన్ని విషయాలు... సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లకు సంబంధించి కాల్‌డేటా వివరాలు నేడు పోలీసులకు అందనున్నట్లు తెలిసింది. కాలే డేటా వస్తే వారు చివరి ఫోన్ ఎవరికి చేశారు. ఏం మాట్లాడారు.. ఎప్పుడు మాట్లాడారు. అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసుల భావిస్తున్నారు. సహస్ర కాదు వినయశ్రీ... సత్యనారాయణరెడ్డి–రాధ దంపతులతోపాటు కూతురు వినయశ్రీ మృతి గురించి తెలియగానే బీడీఎస్ చదువుతున్న వినయశ్రీ స్నేహితులు బాధపడ్డారు. వినయశ్రీతోపాటు ఆమె తల్లిదండ్రుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే వినయశ్రీ ఫొటోపై సహస్ర అని ఉండడంతో కొంతమంది సహస్ర అని భావించారు. అన్ని ధ్రువపత్రాల్లో మాత్రం వినయశ్రీగానే పేరు నమోదై ఉంది. బంధువులు కూడా వియశ్రీగానే రికార్డుల్లో ఉందని, పూర్తిపేరు అదే అని నిర్ధారించారు. -
జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా!
సాక్షి, కరీంనగర్ : అల్గునూర్ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనలో బయటపడ్డ మృతదేహాలు పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె వినయశ్రీ (21)గా గుర్తించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లిందని అంటున్నారు. (చదవండి : కుటుంబం జలసమాధి..) అనుమానాలివే..! అల్గునూర్ కెనాల్లో పడ్డ కారు జనవరి 26న ఉదయం 11.06 నిముషాలకు రేణిగుంట టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు రికార్డయింది. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ వైపు వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఇక 26న హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన సత్యనారాయణ రెడ్డి కుటుంబం మరుసటిరోజు 27న సాయంత్రం కరీంనగర్ నుంచి కారులో ఎటు బయలుదేరారు అనేది అనుమానం. కూతురు వినయశ్రీ చదువు కోసం హైదరాబాద్‌లో 26న సత్యనారాయణరెడ్డి ఇల్లు చూసొచ్చినట్లయితే 27న సాయంత్రమే ఎందుకు బయలుదేరారు అనే అనుమానం వ్యక్తమవుతోంది. (చదవండి : రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) టూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి 27న సాయంత్రం కారులో బయలుదేరారని సత్యనారాయణరెడ్డి వద్ద పనిచేసే గుమస్తా నర్సింగ్ తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయ్యారా? సాయంత్రం పూట ప్రమాదానికి గురైతే ఆ రూట్లో రద్దీగా ఉండే వాహనదారులు, జనం చూడలేదా అనేది అనుమానం. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాలు నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పరిధిలోని అల్గునూర్‌లో గల కాకతీయ కాలువలో జలసమాధి అయిన కుటుంబానికి సోమవారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తన చెల్లెలు రాధ మృతదేహంపై పుట్టింటి పట్టుచీరను కప్పి.. తోడబుట్టిన చెల్లెను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. రాధతో పాటు సత్యనారాయణరెడ్డి మృతదేహానికి పట్టుపంచ, కోడలు వినయశ్రీ మృతదేహంపై పట్టుచీర కప్పి చివరిసారి వీడ్కోలు పలుకుతూ విషాదంలో మునిగిపోయారు. కడసారిగా కన్నీటి వీడ్కోలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో బంధం, స్నేహం ఉన్న వారందరూ అలకాపూరికాలనీలోని శాంతినిలయంలో అంత్యక్రియలు జరగడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టుకొని ఏడ్చేందుకు మృతదేహాలు కుళ్లిపోవడంతో ఆప్యాయంగా కడసారి కన్నీటి వీడ్కోలు పలుకుదామంటే కూడా అవకాశం లేదని బంధువులు రోదించారు. అందరితో అత్మీయంగా... సత్యానారయణరెడ్డి కుటుంబం అందరితో ఆత్మీయంగా కలుపుగోలుగా ఉండేదని బ్యాంక్‌కాలనీలో ఆయన ఇంటి వద్ద ఉండేవారు తెలిపారు. నవ్వుతూ పలకరించేవాడని ఇరుగుపొరుగు ఉన్న వారు, వారి స్థిరాస్తి వ్యాపారం చేసే స్నేహితులు గుర్తుచేసుకొని బాధపడ్డారు. తన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందనప్పటి నుంచి మనోవేదనకు గురై రాధ పాఠశాలకు ఎక్కువగా వెళ్లడం లేదని, దాదాపుగా 80 శాతం వరకు మెడికల్ లీవ్‌లోనే ఉందని, ఇప్పుడు కూడా జనవరి 7 నుంచి మెడికల్ లీవ్పెట్టినట్లు మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ముగ్గురు మృతిచెందారని వార్త తెలియడంతోనే బ్యాంకుకాలనీలో మృతుల ఇంటికి పెద్ద ఎత్తున బంధువులు తరలివచ్చారు. తాళం వేసి ఉండడంతో ఘటనస్థలానికి వెళ్లారు. పోస్టుమార్టం జరిగే వరకూ ఉండి అలకాపూరి శ్మశానంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆత్మహత్యేనని అనుమానం..? జనవరి 25 తేదీన సుల్తానాబాద్‌కు చెందిన వస్త్రవ్యాపారి శ్రీనివాస్‌గౌడ్– స్వరూప దంపతులు ఆసుపత్రి కని వచ్చి తిరిగి సుల్తానాబాద్ వెళ్లే క్రమంలో కాకతీయ కాలువ వద్ద చేపలు కొనుగోలు చేసి తిరిగివెళ్లే క్రమంలో కాలువలో పడి మృతి చెందారు. అది జరిగినా రెండో రోజే సత్యనారాయణరెడ్డి కారు కాకతీయ కాలువలో పడటంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా సత్యనారాయణరెడ్డి బంధువులు కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు వారికి లేవని, అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదమేనని పేర్కొంటున్నారు. బ్యాంకుకాలనీలో సత్యనారాయణరెడ్డి ఇల్లు సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. జనవరి 27న మధ్యాహ్నం ఆయన దుకాణంలో పనిచేసే నర్సింగ్ అనే వ్యక్తిని పిలిపించుకొని కారులో బట్టలు, రైస్ కుక్కర్, సిలిండర్, బెడ్షీట్లతో పాటు పలు వస్తువులు పెట్టించుకున్నాడు. తర్వాత 3.15 నిమిషాలకు సత్యానారయణరెడ్డి భార్య రాధ ఫోన్లో నుంచి నర్సింగ్కు ఫోన్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని రూ.599 ప్యాకేజ్ వెయించాలని చెప్పాడు. అదే నర్సింగ్‌తో మాట్లాడిన చివరికాల్ కాగా, దాదాపుగా 4 నుంచి 5గంటల సమయంలో కరీంనగర్ నుంచి బయలు దేరినట్లు తెలుస్తోంది. 27 తేదీన సీసీ కెమెరాలు కరీంనగర్ నుంచి కాకతీయ కాలువ వరకు పోలీసులు పరిశీలిస్తే అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగి ఉంటుందనే విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. పలువురి పరామర్శ.. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంతో వారి బంధువులను పలువురు పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాడే మోశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కొట్టెపెల్లి గంగరాజు, నీర్ల శ్రీనివాస్, ఎస్టీ సంఘాల నాయకులు కుతాడి శివరాజ్, కుతాడి శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మాతంగి రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సముద్రాల శ్రీను, దండు అంజయ్య, మధు, మాట్లా శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24 గంటల్లో ఆరుగురి మరణవార్త.. 24 గంటల్లో మూడు ఘటనలకు సంబందించి మొత్తం ఆరుగురు మరణించారన్న వార్త విని కరీంనగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 16వ తేదీ ఉదయం కరీంనగర్ పట్టణం సుభాష్‌నగర్‌కు చెందిన దంపతులు శ్రీనివాస్, స్వరూప అల్గునూర్ బ్రిడ్జి వద్ద లారీ ఢీకొట్టడంతో కారు బ్రిజ్జి కిందపడి శ్రీనివాస్ మృత్యువాతపడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనుకోకుండా జారీ పడి చనిపోయాడు. అది మరువక ముందే అదే రోజు రాత్రి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తనలు కాకతీయ కాలువలో పడగా ప్రదీప్ ప్రమాదం నుంచి బయటపడగా, కీర్తన ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయి ప్రాణాలు వదిలింది. వీరి ఆచూకీ కనుక్కునేందుకు కాలువ నీటి ప్రవాహం తగ్గించడంతో 17 తేదీన ఉదయం సత్యనారయాణరెడ్డి కుటుంబంతో సహా కారులోనే మృతదేహాలు కుళ్లిపోయి బయటపడటం 24 గంటల్లో ఆరుగురు చనిపోయారని వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు చర్చింకున్నారు. -
కుటుంబం జలసమాధి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని కాకతీయ కాలువలో ఓ కుటుంబం జలసమాధి అయింది. కారు కాలువలో పడటంతో ముగ్గురు మృతిచెందారు. అయితే, సంఘటన జరిగిన 21 రోజుల తర్వాతే ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బైక్ కాలువలోకి దూసుకెళ్లి ఓ మహిళ గల్లంతయ్యారు. ఆమె కోసం గాలించేం దుకు నీటి ప్రవాహం తగ్గించడంతో ప్రమాదానికి గురైన కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా, అందులో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతులను పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)గా గుర్తించారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం చేశారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను బట్టి దీనిని ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నరేష్‌రెడ్డి తెలిపారు. కుమార్తెను హైదరాబాద్ తీసుకెళ్దామని... సత్యనారాయణరెడ్డి కరీంనగర్లో సాయితిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. బీటెక్ చదువుదున్న వారి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. త్వరలోనే చదువు పూర్తికానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు నెలలపాటు హౌస్‌సర్జన్ శిక్షణ ఇప్పించాలని తండ్రి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జనవరి 26న ఆయన హైదరాబాద్ వెళ్లి కుమార్తె కోసం కొంపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో కొన్ని సామాన్లు సర్ది ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటిరోజు సాయంత్రం 4 గంటల సమయంలో భార్య, కూతురుతో కలిసి బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి ఏపీ15బీఎన్ 3438 అనే నెంబర్ గల కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్లు స్విఛాప్ వచ్చాయి. దీంతో నాలుగైదు రోజుల తర్వాత వారి నివాసానికి వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురూ కలిసి కారులో వెళ్లినట్టు గుర్తించారు. అయినప్పటికీ అనుమానంతో ఇంటితాళం పగలగొట్టి లోపలకి వెళ్లి చూశారు. అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో ఏదైనా టూర్‌కి వెళ్లి ఉంటారని భావించి మరో తాళం వేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని ఓదారుస్తున్న సీపీ కమలాసన్‌రెడ్డి టూర్ వెళ్తున్నానని చెప్పిన వినయశ్రీ.. జనవరి 26వ తేదీ కంటే ముందు వినయశ్రీ ఇంటికి వచ్చింది. తాము టూర్‌కు వెళ్తున్నట్టు తన స్నేహితురాళ్లకు చెప్పింది. నాలుగైదు రోజులు గడిచినా ఆమె రాకపోవడంతో వారు ఫోన్ చేశారు. అది స్విఛాఫ్ వచ్చింది. సుమారు వారం రోజులకు ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తెలియంతో ఆయన తన చెల్లెలి కుటుంబం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. పనిమనిషిని అడగ్గా.. పది పదిహేను రోజులు టూర్ వెళ్తున్నట్టుగా తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న కొంపల్లిలో విచారించగా అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఫోన్ ట్రాకింగ్ చేసి చూస్తే కరీంనగర్‌లోనే సిగ్నల్ చూపించింది. అయితే, తరచూ యాత్రలకు వెళ్లే అలవాటున్న చెల్లెలు కుటుంబం దుబాయ్ వెళ్లి ఉండొచ్చని ఎమ్మెల్యే భావించినట్లు ఆయన బంధువులు తెలిపారు. అయితే ఇంత జరిగినా పోలీసులకు మాత్రం ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సత్యనారాయణరెడ్డి స్నేహితుడు ఒకరు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, సీఐ లేకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయకుండానే తిరిగి వచ్చారు. విషయం వెలుగుచూసింది ఇలా.. ఆదివారం రాత్రి పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన దంపతులు బైక్‌పై కరీంనగర్ నుంచి గన్నేరువరం బయల్దేరారు. అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బైక్ లైటు వెలుతురుకు భారీగా పురుగులు వచ్చాయి. అవి ప్రదీప్ కళ్లలో పడటంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఎల్ఎండీ పెట్రోలింగ్ పోలీసులు కాలువలో కొట్టుకుపోతున్న ప్రదీప్‌ను కాపాడారు. కీర్తన గల్లంతయ్యారు. దీంతో ఆమె కోసం గాలించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపివేయించారు. గజఈతగాళ్లు కీర్తన కోసం గాలించగా.. మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద ఆమె మృతదేహం లభించింది. కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో గతనెల 27న అందులో పడిపోయిన సత్యనారాయణరెడ్డి కారు బయట పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారుని బయటకు తీయించారు. కారు నెంబర్ ఆధారంగా అది సత్యనారాయణరెడ్డి పేరున ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా బావ అని తెలుసుకుని ఆయనకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చిన మనోహర్‌రెడ్డి.. కారును పరిశీలించి తన బావ కారుగా నిర్ధారించారు. అందులో ఉన్న మూడు మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లారని, అప్పటినుంచి తెలిసినవారి ఇళ్లలో ఆరా తీస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు పొరుగువారికి చెప్పారని, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని పేర్కొన్నారు. సంఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించారు. ఆత్మహత్యకు అవకాశం తక్కువే! సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ఇరుకుగా ఉన్న వంతెనపైకి రాకముందే కారు పూర్తిగా ఎడమవైపు వచ్చి కాలువలో పడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఒకవేళ రెయిలింగ్‌ను తాకి కారు ప్రమాదానికి గురై ఉంటే రోడ్డుపై వెళ్లేవారికి తెలిసేదని అంటున్నారు. జరిగిన సంఘటనను పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంచెం కూడా కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు అనామకులుగా చనిపోవాలని భావించరని, కారుతోపాటు కాలువలోకి వెళ్లాలనుకోరన్నది వారి వాదన. అక్కడ సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. కారులో సామాన్లు సర్ది వచ్చాను గతనెల 27న మా సార్లు వాళ్ళు ఊరెళుతున్నారని చెప్పడంతో బెడ్షీట్లు, రైస్కుక్కర్తోపాటు కొని సామాన్లు కారులో పెట్టి వచ్చాను. అదేరోజు సాయంత్రం సత్యనారాయణరెడ్డి సారు రాధ మేడం ఫోన్ నుంచి నుంచి కాల్ చేసి తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని, రీచార్జి చేయించాలని చెప్పారు. నేను వెంటనే రీచార్జీ చేయించాను. మరుసటిరోజు ఫోన్ చేస్తే స్విఛాఫ్ వచ్చింది. నాలుగైదు రోజులు ఫోన్ కలవకపోవడంతో మా సార్ స్నేహితులు, బంధువుల షాప్‌కు వస్తున్నాడా అని నన్ను అడిగారు. ఇన్నిరోజులుగా మా సార్ వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాను.– నర్సింగ్, సత్యనారాయణరెడ్డి షాపులో పనిచేసే వ్యక్తి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ నరెడ్డి సత్యనారాయణరెడ్డి కారు కాలువలో పడి, ఆయనతోపాటు భార్య రాధ, కుమార్తె వినయశ్రీ మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఘటనపై గతంలో మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఏ పోలీస్ స్టేషన్లోనూ మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుపుతాం. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఎలాంటి అనుమానాలు లేవని నిర్ధారించినందున ప్రమాదవశాత్తూ కారు కాలువలో పడి ఉంటుందని భావిస్తున్నాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ ప్రమాదమేనని తేలింది సత్యనారాయణరెడ్డి కుటుంబం చనిపోయిన ఘటన ప్రాథమిక విచారణలో ప్రమాదమే అని తేలింది. వీలైనంత తొందరగా విచారణ పూర్తిచేస్తాం. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయాలు దర్యాప్తులో బయటపడతాయి. – నితికాపంత్, ట్రైనీ ఐపీఎస్ -
‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’
సాక్షి, నిజామాబాద్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లో కారు మునిగిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వినయశ్రీ.. నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రాక్టికల్స్ ఉన్నందున అల్వాల్ షిప్ట్ అయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగివుండొచ్చని బంధువులు అంటున్నారు. అయితే తమ స్నేహితురాలు మరణించిందని తెలియడంతో ఆమె తోటి విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. తమతో ఎంతో స్నేహంగా ఉండే ఆప్తురాలు దూరం కావడంతో ఆవేదన చెందుతున్నారు. (రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!) చదువులో చురుగ్గా ఉండేదని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే వినయశ్రీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె స్నేహితులు అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. ఆదివారం వినయశ్రీ పుట్టినరోజు కావడంతో మెసేజ్‌లు పంపించామని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి ఉంటుందని అనుకున్నామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని అన్నారు. అందరితో మంచిగానే ఉండేదని, ఆమెతో ఎటువంటి సమస్యలు ఉండేవి కాదని తెలిపారు. బర్త్‌డే విషెస్‌లకు సమాధానం ఇవ్వకపోతే తీర్థయాత్రలో బిజీగా ఉందేమో అనుకున్నాం గానీ, ఇంత బాధాకరమైన వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. చదువుతో పాటు అన్నిట్లోనూ ముందుండే వినయశ్రీ ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోందన్నారు. మరో 9 నెలల్లో చదువు పూర్తవుతుందనగా ఆమె ఇలా మృత్యువు బారిన పడటం నమ్మలేకపోతున్నామని వినయశ్రీ క్లాస్మేట్స్ పేర్కొన్నారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాల్వలోకి దూసుకెళ్లిందా, ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. (పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) -
రాధ కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!
-
కారులో మూడు మృతదేహాలు..
సాక్షి, కరీంనగర్: అలగునూర్ సమీపంలో కాకతీయ కెనాల్లోకి కారు దూసుకుపోయి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు కెనాల్లోకి దూసుకువెళ్లిందా? లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కాకతీయ కెనాల్లో బయటపడింది. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. (చదవండి : పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!) గత నెల 27న సాయంత్రం మూడు గంటల నుంచి సత్యనారాయణ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. ఆ సమయంలోనే కారు కెనాల్లో పడితే రాజీవ్ రహదారిపై వెళ్లేవారు చూసేందుకు అవకాశం ఉండేది. అయితే ఈ ప్రమాదం సాయంత్రం వరకూ జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా సత్యానారాయణ రెడ్డి ...భార్య, కుమార్తెకు తెలియకుండా ముందుగా పథకం ప్రకారమే రాత్రి సమయంలో వేగంగా కారును కెనాల్లోకి దూసుకువెళ్లేలా చేశారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనపై ట్రైనీ ఐపీఎస్ నితిక పంత్ విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోనే మూడు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సత్యనారాయణరెడ్డి జనవరి 27న భార్య, కుమార్తెతో కలిసి ఇంటి నుంచి కారులో బయల్దేరారు. వీరంతా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దగ్గర బంధువులు. మృతురాలు రాధ ఎమ్మెల్యేకు సోదరి అవుతుంది. సత్యనారాయణ రెడ్డికి కరీంనగర్లో ఫర్టిలైజర్ షాపు ఉండగా, రాధిక స్కూల్ టీచర్. మూడేళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకును కోల్పోయినప్పటి నుంచి దంపతులు మానసికంగా కృంగిపోయారు. వైద్యం కోసం తరచూ హైదరాబాద్‌కి వెళ్లేవారని బంధువులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు వారి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు బ్యాంక్ కాలనీలోని వారి ఇంటి తాళాలు పగులగొట్టి చూసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒకవేళ విదేశాలకు వెళ్లి ఉంటారని భావించి విమానాశ్రయంలో ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అయితే పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. -
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి
-
భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
సాక్షి, కరీంనగర్ : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబ సభ్యులు అలగనూరు వద్ద మానేరు కాలువలో శవాలుగా తేలారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధ మృతి చెందారు. దాదాపు 20 రోజుల నుంచి ఆ కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆదివారం రోజున మానేరు కాలువలో ప్రమాదవ శాత్తు పడిన ఒక మోటార్ బైక్ ను వెలికితీయడానికి కాలువలో నీటిని నిలిపివేశారు. నీరు ఖాళీ కావడంతో అందులో కారు బయటపడింది. దాన్ని పోలీసులు తరిచి చూస్తే అందులో కుళ్లిన శవాలు బయటపడ్డాయి. లభించిన ఆధారాల మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం అని తేలింది. దాదాపు 20 రోజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం లేదు. (దూసుకొచ్చిన మృత్యువు) బైకు కోసం నీటిని ఖాళీ చేయగా అందులో ప్రమాదానికి గురైన కారు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి మూడు శవాలను బయటకు తీశారు. అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయి. కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లికి చెందిన రాధగా గుర్తించారు. ఆమె స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి. జనవరి 27 నుంచి ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని లోటు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని, తాజాగా కూడా అలాగే భావించామని పేర్కొన్నారు. గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే తమకెలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎలాంటి వివరాలు అందలేదని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఎమ్మెల్యే వియ్యంకుడి అడ్డగింత
సాక్షి, పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని మంగళవారం పెద్దపల్లిలో అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు వచ్చాడని ఆరోపిస్తూ.. స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే వియ్యంకుడికి అక్కడి నుంచి తప్పించారు. బయటివారు స్థానికంగా ఉండకూడదని ఉత్తర్వులున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా సమరం సాగుతోంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ పెద్దపల్లి పట్టణంలోని బండారికుంటకు చెందిన పలువురు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని, కట్కూరి సుధాకర్‌రెడ్డిలను మంగళవారం అడ్డుకున్నారు. బండారికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా డబ్బులను పంచేందుకే వచ్చారంటూ కాలనీకి చెందిన పలువురు యువకులు రాంరెడ్డిని అడ్డుకుని మీరు ఏ వార్డుకు చెందినవారు.. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారో.. చెప్పాలంటూ ప్రశ్నిస్తూ తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. సుల్తానాబాద్‌లో పోలీసులతో విజయరమణారావు వాగ్వాదం బుధవారం ఉదయం పోలింగ్ జరగనుండడంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే వచ్చారంటూ ఆరోపించిన యువకులు సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించే యత్నం చేయగా రాంరెడ్డి తన అనుకూలురైన వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు యత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి ఎమ్మెల్యే వియ్యంకుడిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయమై ఎస్ఐ ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాంగ్రెస్ నాయకులకు బెదిరింపులా..? సుల్తానాబాద్ (పెద్దపల్లి): సుల్తానాబాద్ కాంగ్రెస్ నేత అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్ ఇంటి గోడ దూకి పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి భయబ్రాంతులకు గురి చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. కొద్దిసేపు కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరగగా, అనంతరం సోదాలు నిర్వహించారు. 15వ వార్డుకు చెందిన ఓ అభ్యర్థి 45 చీరలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. 11వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు మద్యం బాటిళ్లు 48 తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎమ్మెల్యే ఊరు బాగుంది
పెద్దపల్లి: ‘పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఊరు పేరులోనే కాసులున్నాయి. కాసులపల్లి గ్రామం పంచసూత్రా ల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు. పెద్దపల్లి మండలంలోని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి స్వగ్రామం కాసులపల్లిలో ఆమె పర్యటించారు. అందంగా అలంకరించిన ప్రతి ఇంటిని ఆసక్తిగా తిలకించారు. మహిళలతో ముచ్చటించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతనిర్మాణంతో పాటు వాడవాడల్లో డ్రైనేజీ ఉన్న ఏకైక గ్రామంగా కాసుల పల్లి రికార్డుకు ఎక్కిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అభినందించారు. కలెక్టర్ శ్రీదేవసేన కృషి, పట్టుదలతోనే స్వచ్ఛ జిల్లా అవార్డు దక్కించుకున్నారని తెలిపారు. అన్ని గ్రామాలు కాసులపల్లిని ఆదర్శంగా తీసుకో వాలన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ టౌన్షిప్ హాలులో నిర్వహించిన కేరళ యుద్ధ విద్య (కళరిపయట్టు)ను తిలకించారు. స్వదేశీ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ప్రధానిమోదీ చొరవతోనే ఈ రోజు యోగాకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. కాళేశ్వరం అద్భుతం: కాళేశ్వరం ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీకి సంబంధించిన పనులను గవర్నర్ సందర్శించారు. నందిమేడారంలోని నంది ప్రాజెక్టు సర్జిఫూల్ విద్యుత్ పనులు, పంపుహౌస్ ద్వారా నీటి విడుదలను తిలకించారు. రైతులకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కితాబిచ్చారు. రైతులకు ఉపయోగపడేలా సాగునీటి ప్రాజెక్టు తక్కువ సమ యంలో పూర్తి కావడం అభినందనీయమన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్రయోజనాలను ఈఎన్సీ వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు. -
పెద్దపల్లి: మాట నిలబెట్టుకున్నా.. దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్న. రైతు బిడ్డగా రైతులకు కావాల్సిన చెరువులు, కుంటలు మరమ్మతు చేయించి రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన. రికార్డు స్థాయిలో మిషన్‌కాకతీయ పనులు జరిగాయి. పనులు చేశాను కాబట్టే మళ్లీ రెండోసారి ఓట్లు అడుగుతున్న. ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధిని చెట్టింపు చేస్తా.’ అని టీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు కోరుతున్న దాసరి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనపై అనేక విషయాలను వివరించారు. సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో నా వంతు పాత్రను గుర్తించిన ఓటర్లు 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాను. రైతులకు అవసరమైన సాగునీటి వనరులను అభివృద్ధి చేశాను. మానేరు వాగుపై మూడు చోట్ల చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా మానేరు నుంచి రైతులు పంటలకు నీళ్లు తీసుకుంటున్నారు. హుస్సేన్మీయా వాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యాంల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయించాను. పెద్దపల్లిపట్టణంలో ఎన్నోఏళ్లుగా ఇక్కడి ప్రజలు కలగంటున్న మినీ ట్యాంకు బండ్ నిర్మాణం వెనుక నా శ్రమని స్థానికులు గుర్తించారు. ప్రత్యేకించి నిబంధనల కంటే అదనంగా పనులు చేయించాను. మినీ ట్యాంకు బండ్ నిర్మాణంలో అవంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు చేయించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బొంపెల్లి తాగునీటి ఫిల్టర్ ప్రాజెక్టును పూర్తిచేయించి వాటి ద్వారా పెద్దపల్లి ప్రజలకు దాహర్తి తీర్చగలిగాను. గోదావరి జలలాను పెద్దపల్లి ప్రజలకు అందించాను. జిల్లా హోదా దక్కిన పెద్దపల్లిని తెలంగాణ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే కలెక్టరేట్ భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రెండు, మూడునెలల్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్కీం ద్వారా నియోజకవర్గంలో 62 వేల మందికి ప్రయోజనం కలిగింది. అలాగే 15 వేల మంది గొర్రెల కాపారుల కుటుంబాలకు ప్రయోజనం చే కూర్చాను. కల్యాణలక్ష్మి, షాదీముబరాక్ పథకాల ద్వారా 4,500 మంది ఆడబిడ్డల పెళ్లిల్లకు లబ్ధి చేకూర్చాను. నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, చికిత్స చేయించుకున్నవారికి రూ.10 కోట్లు మంజూరు చేయించాను. వివిధ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు వెచ్చించాను. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలతో పోలిస్తే తన పాలన సమయంలో 20 రెట్లు అభివృద్ధి చేశాను. ముఖ్యమంత్రితో అవార్డు మర్చిపోలేనిది.. పెద్దపల్లి నియోజకవర్గంలో పండ్ల మొక్కల నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రసంశలు అందుకోవడం మర్చిచిపోలేనిది. సాక్షాత్తు అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి తనకు హరితమిత్ర అవార్డును అందిస్తూ అభినందించిన తీరు గుర్తుండి పోయింది. పలు సందర్భాల్లో హరితహారం గురించి ప్రస్తావన వేళ తనను మంత్రి మండలి సైతం ఆదర్శంగా తీసుకోవడం వెనుక పెద్దపల్లి ప్రజల సహకారం ఉంది. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాల్సిందిగా కోరాను. తిరిగి రెండోసారి అధికారం అప్పగిస్తే గతం నేర్పిన అనుభవాలు పెద్దపల్లి అభివృద్ధికి తోడ్పాడుతాయని నమ్ముతూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్న. -
పెద్దపల్లి: నాయకుడి పూజలు ఫలించేనా?
సాక్షి,పెద్దపల్లి: పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి,సంతోషిమాత, చాముండీశ్వరీ ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజయ్య, నాయకులు కొట్టె సదానందం, మర్రిపల్లి సతీష్ తదితరులున్నారు. పెద్దపల్లి: దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల కారణంగా నిరాదరణకు గురైందని, రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమేనని దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల, కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు దాసరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మైలారపు నారాయణ, నూనె కుమార్, కుంభం సంతోష్, మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, పెద్ది రాజేషం పాల్గొన్నారు. చేరిక ఎలిగేడు: నారాయణపల్లి, సుల్తాన్పూర్, లాలపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు దాసరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లారాపు మల్లేశం(సుల్తాన్‌ఫూర్), సబ్బు తిరుపతి(నారాయణపల్లి), గట్టు రాజు, ముద్రవేని ఓదెలు, కవ్వంపల్లి సుమన్(సుల్తాన్పూర్), తీపిరెడ్డి రాంరెడ్డి(లాలపల్లి)తోపాటు వారి అనుచర వర్గం టీఆర్ఎస్లో చేరినట్లు నాయకులు పేర్కొన్నారు. మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, రాజేశం, రాయనర్సయ్య, తిరుపతిరెడ్డి, రాజేశం, కొండ వెంకన్న, రాజకొమురయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం వార్తల కోసం... -
పెద్దపల్లి: తికమకలేదు.. టీఆర్ఎస్దే అధికారం
‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి. దాసరి మనోహర్‌రెడ్డి గురించి చెప్పే అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు. అతను ఎంతో మంచి వ్యక్తి. ఇతరుల సొమ్ము ఆశించే వాడు కాదు. మంచివాళ్లను గెలిపిస్తే మంచిగుంటది. హరితహారంలో ఆయన జేబు నుంచి డబ్బులు పెట్టి, లక్షలాది మొక్కలు పంపిణీ చేసిండు. – పెద్దపల్లి సభలో గులాబీ దళపతి కేసీఆర్ ‘‘మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోంది. గతంలో పాలించిన వారి కంటే మంచిగ పనిచేస్తున్నడు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. లేటెస్ట్ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చింది. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. మధు విజయం ఆపలేరు.’’ – మంథని సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సాక్షి, పెద్దపల్లి/మంథని: గులాబీ దళపతి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వాద సభల్లో మాట్లాడారు. తికమకలేదని.. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడనుందని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా నాకు దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి’...అంటూ టీఆర్ఎస్ అధినేత ప్రజలను కోరారు. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య ఆయకట్టుకు సరిగా నీళ్లేనని అన్నారు. ఉద్యమ సమయంలో తాను వచ్చినప్పుడు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో నీళ్లు పోలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పుష్కలమైన నీళ్లు వస్తున్నాయని, చివరి ఆయకట్టుకు నీళ్లీస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరిభూములు, మొదటి భూములు అనే మాటే లేదన్నారు. కాలువ మొదటి, చివరి భూములు అంటే చంపేస్తానని ఇంజనీరింగ్ అధికారులకు చెప్పానన్నారు. మొదట ఎంత పారుతుందో చివరన కూడా అంతే పారాలన్నారు. వచ్చే టర్మ్‌లో తాను స్వయంగా పెద్దపల్లికి వచ్చి సమీక్ష చేపట్టి, ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హుస్సేనిమియా, మానేరు చెక్‌డ్యాంలన్నీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి పక్కనే పెద్దపల్లి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇక్కడి నుంచే పోతుందని, నీళ్లకు సమస్యే రాదన్నారు. నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనన్నారు. పెద్దపల్లి సభలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రఘువీర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పార్టీ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, గోపగాని సారయ్య తదితరులు పాల్గొన్నారు. పోడు సమస్య పరిష్కరిస్తా ‘తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి 58 ఏళ్లు అధికారంలో ఉండి పోడు భూముల సమస్య పరిష్కారం చేయలేదని.. ఢిల్లీల.. ఇక్కడ వాళ్ల పెత్తనమే. మరి ఎవరు అడ్డం వచ్చిండ్రు. వాళ్లకు సమస్య మీద చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో ‘పోడు సమస్య పరిష్కరించి హక్కులు కల్పిస్తా.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంథని ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం మొదలుకొని మంథని వరకు పోడు భూముల సమస్య కనిపించదని.. గిరిజనుల భూ సమస్య పరిష్కరించి రైతుబంధు వర్తింజజేస్తామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టు పడుతడు. ఎవరినో పంపిచుడు కాదు.. స్వయంగా తానే మంథని చీఫ్ సెక్రటరీతో సహా వచ్చి ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడే పుట్ట మధు ఇంట్లో ఉండి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అడవిని నరకొద్దని.. అటవీ సంపదను కాపాడుకోవాలన్నారు. గతంలో చాలా దుర్మార్గాలు జరిగాయని.. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని, వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని.. స్వీచ్ ఆన్ ఐతే మంథని నిత్య కల్యాణం, పచ్చతోరణమేనన్నారు. గోదావరి ఎప్పుడూ కళకళలాడుతుందని.. నీటి సంపద మంథని చుట్టూ అలుముకుంటుందన్నారు. మధు రెండు లిఫ్టులు కావాలన్నాడని.. రెండు కాదు మూడు మంజూరుచేసి నియోజకవర్గంలో అటవీ భూమి పోను ఒక ఇంచు కూడా ఎండకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోందని.. గతంలో పాలించిన వారి కంటే మొరుగ్గా పనిచేస్తున్నాడని కితాబిచ్చారు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, లేటెస్ట్ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చిందన్నారు. మంథని సభకు వచ్చిన జనం నియోజకవర్గం ప్రజళ్లా లేరని, రెండు జిల్లాల నుంచి వచ్చినట్టుగా ఉందన్నారు. ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. మధు విజయం ఆపలేరన్నారు. రాష్ట్రంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని బహిరంగసభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మంథని సభలో ప్రభుత్వ సలహాదారు వివేకానంద, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, టీబీజీకేఎస్ కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ షూటర్స్!
సాక్షి, పెద్దపల్లి : డబుల్ షూటర్లు.. ఎన్కౌంటర్ స్పెషలిస్టులు.. డబుల్ మర్డర్ దాదాల గురించి విన్నాం. ఈ ఎన్నికల్లో ట్రిపుల్ షూటర్ల గురించి చర్చమొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాలకు ట్రిపుల్ షూటర్ల పాత్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకంగా మారిన పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు చోటామోటా నాయకుల బెడద తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి విజయ రమణారావు, బీజేపీ నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ జాతకాన్ని పరీక్షించుకునే క్రమంలో ఛోటామోటా నాయకుల మాట కాదనలేకపోతున్నారు. అయితే వీరు పొద్దున ఓ నాయకుడు.. మధ్యాహ్నం మరో నాయకుడితో కలిసి వెళ్తుండడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు.. సీక్రెట్‌గా సపోర్ట్ చేస్తామంటూ ఎక్కడిక్కడ చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. మారుతున్న పరిణామాలు.. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అటూఇటూ ఉండే నాయకులు వ్యూహాలు మార్చుతున్నారు. పార్టీలు మార్చుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి శిబిరం నిత్యం చేరికలతో కళకళలాడుతోంది. ప్రచారానికి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు, బీజేపీ అభ్యర్థి గుజ్జులకూ విశేష స్పందన లభిస్తోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ వెంట వందల సంఖ్యలో వస్తున్నారు. చేరికలూ సాగుతున్నాయి. ఎన్నికల ప్రచార యాత్రతో మూడు పార్టీలు హోరెత్తిస్తున్నాయి. అయితే చోటామోటా నాయకులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. దాసరి వద్ద .. తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి సపోర్ట్ చేస్తామంటున్న వారంతా నాలుగున్నరేళ్ల కాలం పనితీరును ప్రస్తావిస్తూ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గుంపులుగా యువకులను తెచ్చి చేర్పిస్తున్నారు. మీరు వేయించిన రోడ్లు, ఇచ్చిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, పింఛన్లు, రైతుబంధు ఇలాంటి ఎన్నో ప్రయోజన స్కీంలు లక్షా 20 వేల మందికి ఇచ్చామని, అందులో లక్ష ఓట్లు పడ్డా తమదే గెలుపంటూ మద్దతు పలికే మాటలతో తమ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. విజయ్ వద్ద.. ఎస్సారెస్పీ నీళ్లొచ్చాయి.. ఆస్పత్రిలో చేరితే వచ్చి పలుకరించావు.. ఫోన్‌చేస్తే ఇంటికొచ్చావు.. ఇప్పుడు నేనెక్కడున్నానని కాదు.. మరో వారం ఆగితే మీవెంటే నడుస్తానంటూ.. సూక్తులు చెబుతున్నారు. రేపు రాత్రికి కలుస్తా, లేదంటే తెల్లవారక ముందు కలుస్తా. నీ గెలుపు కోసం నా వంతు పనిచేస్తా అంటూ హామీలిస్తూ నమ్మబలుకుతున్నారు. గుజ్జుల వద్ద... పోటీ పడుతున్న మరో అభ్యర్థి గుజ్జుల వద్ద మెప్పు పొందేందుకు ట్రిపుల్ షూటర్లు ప్రయత్నిస్తున్నారు. మీ పరిపాలనలో బ్రిడ్జీలు కట్టారు. మేమేం పని చెప్పినా చేసి పెట్టారు.. మా ఊరికి రోడ్లు మీరే వేయించారు.. మిమ్ముల్ని మరిచిపోతామా.. బేఫికర్‌గా ఉండండి.. ఆఖరునాడు చూడు అంతా మనకే అనుకూలమవుతుందంటూ ప్రత్యర్థి శిబిరంలో కనిపిస్తున్నారు. అయోమయం.. అటూఇటూ ఉంటున్న వారితీరు ఆసక్తిగా మారింది. అయితే తన వారు ఎవరు, మన వారు ఎవరు.. డబుల్ షూటర్‌ను మించిన వారు ఎవరో తేల్చుకోలేక అభ్యర్థులు.. నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మరిన్ని దాసరి మనోహర్ రెడ్డి వార్తల కోసం -
టీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ బల ప్రదర్శన
పెద్దపల్లి : నామినేషన్ చివరి రోజు పెద్దపల్లి పట్టణం ఒక్కసారిగా జనసంద్రమైంది. వేల సంఖ్యలో గులాబీ శ్రేణులు, ఖద్దరు దుస్తుల కాంగ్రెస్ కండువాలు, కోలాటం గ్రూపు మహిళాబృందాలు, డోల్ దెబ్బ కళాకారులు ఇలా పట్టణంలో ఎక్కడ చూసినా సోమవారం జనంతో కిక్కిరిసిపోయింది. నామినేషన్ వేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు పెద్దపల్లి పట్టణానికి అనుచరులతో చేరుకున్నారు. అప్పటికే నామినేషన్ సమర్పించిన తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సైతం ఉదయమే నామినేషన్ మరో సెట్ అందించి రంగంపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా కమాన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి స్థానిక రైల్వే స్టేషన్ ఏరియా నుంచి ర్యాలీ చేపట్టారు. కళాకారులు, డప్పు వాయిద్యాలు, డోల్‌దెబ్బ బృందాలు గులాబీ దళంతో కలిసి కమాన్ మీదుగా తిరిగి జెండా చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేరుకున్నారు. ఉదయం కాంగ్రెస్ ర్యాలీ కంటే మధ్యాహ్నం చేపట్టిన ర్యాలీ రెండింతలుగా ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పార్టీ అభ్యర్థులు ఇరువురు సైతం తమ బలాన్ని పదర్శించేందుకు భారీగా జనాన్ని ర్యాలీలో ఉండేలా చూశారు. పార్టీ అభ్యర్థుల ప్రచార రథాలు ముందుకు నడుస్తుండగా.. జనం, కళాకారులు అనుసరిస్తూ ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు పట్టణంలో రెండు ప్రధాన పార్టీల తమ బల ప్రదర్శనలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో కనిపించినట్లు స్థానికుల నుంచి వినిపించింది. గులాబీ దళం ప్రత్యేకించి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టడంతో పలుమార్లు ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండు కిలోమీటర్ల ప్రయాణం దాదాపు 2గంటలపాటు కొనసాగింది. దీంతో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బస్సులు ఇతర వాహనాల రాకపోకలకు తరచూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం స్వయంగా డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ వెంకటరమణరెడ్డి రాజీవ్ రహదారిపై విధులు నిర్వహించారు. డబుల్ ధమాకా కాంగ్రెస్, టీఆర్ఎస్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న వారిలో పార్టీ కార్యకర్తలు కానివారికి కైకిలి(కూలీ) చెల్లించినట్లు పలువురు తెలిపారు. ఉదయం ఒక పార్టీకి ప్రచారానికి వచ్చిన కూలీలు తిరిగి వెంటనే రెండో పార్టీలో తిరగడంతో ఈ పూట తమకు రెండు కూలీలు(కైకిల్లు) పడ్డాయంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కోవలో మహిళ కూలీలు ఎక్కువ కనిపించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు రెండు కైకిళ్లు వచ్చాయంటూ ఇంటిదారి పట్టారు. బీజేపీ వ్యూహాత్మక ప్రచారం భారీ ర్యాలీ జన సమీకరణను బీజేపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వాడుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రచారానికి వేలాదిగా వచ్చిన జనానికి గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి కళాకారుల బృందాలతో బీజేపీ రాజకీయాలను పాటల రూపంలో వినిపించారు. -
జీవనదిగా...మానేరు
సాక్షి, పెద్దపల్లి: కరువంటే తెలియని జిల్లాగా అభివృద్ధిచేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హుజూరాబాద్, పెద్దపల్లి అన్నాచెల్లెలాంటి ఊళ్లన్నారు. మానేరు ఎండిపోయి కాల్వశ్రీరాంపూర్, ఓదెల, వీణవంక రైతులు ఏటా అల్లాడిపోతున్నారని.. ఇక ముందు అలాంటి సమస్యలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించిందని గుర్తుచేశారు. మానేరుపై నాలుగుచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయని .. మరో నాలుగుచోట్ల నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే మానేరు జీవనదిగా మారుతుందన్నారు. ఇప్పటికే వర్షాకాలంలో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపించాయన్నారు. వచ్చే రెండేళ్లలో పెద్దపల్లి మానేరు, హుస్సేన్‌మియా వాగులు జలా హా రంగా కనువిందు చేస్తాయన్నారు. గతంలో రైతులు రాత్రి వేళ కరెంట్ కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని.. ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరాలతో ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలతో పాటు ఆడబిడ్డల పెళ్లీలకు అన్నదమ్ములు కూడా ఇవ్వని రీతిలో రూ.లక్ష కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించినట్లు చెప్పారు. బీజేపీ, మహాకూటమిలపై ఈటల ఆగ్రహం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేదని ఈటల మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో ఓట్లకోసం తిరుగుతున్న బీజేపీని నమ్మొద్దన్నారు. మహాకూటమిలో జతకట్టిన పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు. ఇక్కడ దాసరి.. అక్కడ కేసీఆర్ గెలవాలి.. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతం విముక్తి కావడానికి తన తండ్రి వెంకటస్వామి కృషి చేశారని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. ప్రాణాహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కూటమి వెనుక ఉన్న చంద్రబాబు కుట్రలను గమనించాలని సమావేశంలో భానుప్రసాద్‌రావు కోరారు. కూటమి తాళం చెవి చంద్రబాబు వద్ద ఉందన్నారు. సమావేశానికి స్థానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, నాయకులు కోట రాంరెడ్డి, డాక్టర్ టీవీరావు, నల్ల మనోహర్‌రెడ్డి, బాలజీరావు, పారుపెల్లి రాజేశ్వరి, సందవేన సునీత, గట్టు రమాదేవి, రఘువీర్‌సింగ్, అమ్రేష్, రాజు, రాజ్‌కుమార్, హన్మంత్, వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కొమురయ్య యాదవ్, మార్క్ లక్ష్మణ్, రమారావు, వెంకట్‌రెడ్డి, రమేష్, పురుషోత్తం, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పురాజు కుమార్, కొయడ సతీష్‌గౌడ్, తబ్రేజ్, సాబీర్‌ఖాన్, శ్రీనివాస్, చంద్రమౌళి, రాజేందర్‌యాదవ్ పాల్గొన్నారు. -
విషప్రచారం బారిన పడొద్దు: ఈటల
సాక్షి, పెద్దపల్లి: శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రా మీడియా, సోషల్ మీడియా చేస్తున్న విషప్రచారం బారిన పడొద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఈటల మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియా, ఆంధ్రా మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కొందరు సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దొంగ కెమెరాలు పెట్టుకొని ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటనల వీడియోలను మార్ఫింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషప్రచార బారిన ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టీడీపీలతోనే గతంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. ఆ పార్టీల పుణ్యమా అని ప్రజలు ప్రశాంతత లేకుండా గడిపారన్నారు. -
దాసరి మనోహర్ రెడ్డి - లీడర్