date
-
Dussehra 2024: శరన్నవరాత్రుల సంబరం, దసరా ఎపుడు వచ్చింది?
వినాయక చవితి పండుగ వేడుక ముగించుకొని, బై..బై. గణేశా అంటూ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అలా ముగిసిందో లేదో మరో పండుగు సందడి మొదలైంది. అదే సరదాల దసరా పండుగ. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరి ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసా? ముహూర్తం ఎపుడు? తెలుసుకుందాం రండి.దసరా పండుగ, శుభ సమయం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ ఏడాది దసరా పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం, దశమి రోజున అక్టోబరు 12న విజయ దశమి వచ్చింది. 2వ తేదీనుంచి శరన్నవరాత్రులు ఆరంభం కానున్నాయి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా భవాని మహిషాసురుడిని సంహరించి ప్రజలకు శాంతిని చేకూర్చింది. అందుకే ఇది విజయదశమి అయిందని పెద్దలు చెబుతారు. అలాగే శ్రీరామడు రావణుడిని తుదముట్టించడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు కనుక విజయ దశమి అయిందని మరో కథనంలో చెబుతారు. విజయదశమి నాడు రావణ దహనం చేసి సంబరాలు చేసుకుంటారు. దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని, శమీ వృక్షంలో దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గమ్మ ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. ఇంటి ఆడపడుచులకు కూడా ప్రేమగా పంచుతారు.ముహూర్తం: గణేష్ చతుర్థి తరువాత అంతే ఉత్సాంగా నవరాత్రులు వేడుక చేసుకునేపండుగ దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది. -
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీ మారింది. అలాగే మూడో దశలో కాకుండా ఆరో దశలో (మే 25) ఓటింగ్ జరగనుంది. గతంలో ఇక్కడ మే 7న ఓటింగ్ నిర్వహించాలనుకున్నారు.అనంతనాగ్-రాజౌరీ స్థానానికి ఓటింగ్ తేదీని వాయిదా వేయాలని బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి. ఇటీవల కురిసిన మంచు, కొండచరియలు విరిగిపడటమే దీనికి కారణమని సమాచారం. మంచు కురియడానికి తోడు, కొండచరియలు విరిగిపడటం వలన అనంతనాగ్- రాజౌరిలను కలిపే మొఘల్ రహదారిని బ్లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగడం లేదని, దీనికితోడు ఓట్ల శాతం కూడా తగ్గే అవకాశం ఉందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ నేపధ్యంలోనే అందిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలో మార్పులు చేసింది. ఈ స్థానంలో ఇప్పటికే నామినేషన్ల దాఖలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాగా జమ్ముకశ్మీర్‌లోని రాంబన్, బనిహాల్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. మరొకరు కాలువలో కొట్టుకుపోయారు. వర్షాల కారణంగా 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్, బనిహాల్ మధ్య అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదానికి అధికారులు మూసివేశారు. -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా వస్తోన్న "ఏ చోట నువ్వున్నా"!
ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరో, హీరోయిన్స్‌గా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..' దర్శకుడు పసలపూడి కథ చెప్పినపుడు చాలా బాగా అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నటీనటుల కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్లను సెలెక్ట్ చేసుకున్నాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.' అని అన్నారు. -
ఓటీటీకి స్కంద మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'స్కంద'. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. (ఇది చదవండి: 40 ఏళ్ల బ్యూటీ.. లిప్‌లాక్ సీన్.. ఇంకా అవుట్ కాలేదు..!) అయితే ఈ సినిమా మొదట అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. కానీ అలా జరగలేదు. ఓటీటీకి రిలీజ్‌పై సస్పెన్ష్ నెలకొంది. స్కంద స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల కొత్త తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇంట్లో త్వరలోనే పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఆయన కూతురు ఐరా ఖాన్‌కు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంజ్ జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నుపుర్ శిఖరేతో డేటింగ్లో ఉన్న ఐరా గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్నా పెళ్లి తేదీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఐరా పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటూ అమిర్ ఖాన్ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. (ఇది చదవండి: రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!) అయితే తాజాగా తన కుమార్తె పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ హీరో. అభిమానుల ఊహగానాలకు తెరదించుతూ అమిర్ ఖాన్ పెళ్లి తేదీని వెల్లడించారు. జనవరి 3, 2024న నుపుర్ శిఖరేను ఇరా ఖాన్ వివాహం చేసుకోనున్నట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఐరా కష్టకాలంలో నుపుర్ తనకు అండగా నిలిచినట్లు అమీర్ వెల్లడించారు. నుపుర్ ఇప్పటికే మా ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఐరా పెళ్లి రోజు తాను చాలా ఎమోషనల్ అవుతాననని అన్నారు. అమిర్ మాట్లాడుతూ..'ఐరా జనవరి 3న పెళ్లి చేసుకోబోతోంది. ఆమె ఎంచుకున్న అబ్బాయి చాలా మంచివాడు. ఐరా డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు నుపుర్ అండగా నిలిచాడు. మానసికంగా ఆమెకు దృఢంగా మార్చాడు. ఐరా, నుపూర్‌లు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఒకరినొకరు చాలా బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది.' అని అన్నారు. కాగా.. ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. ఇరా, నుపుర్ 2020లో డేటింగ్ ప్రారంభించి.. తన రిలేషన్‌ను 2021లో అఫీషియల్‌గా చేసుకున్నారు. ఇటీవలే తన కూతురితో కలిసి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దయచేసి నిపుణుల సలహాలు తీసుకోమని అమిర్ సూచించారు. (ఇది చదవండి: నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్) -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!
త్వరలోనే మెగా ఇంట్లో సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ మెగా హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) అయితే ఇప్పటికే పెళ్లి తేదీ ఫిక్స్ అయిందంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరైన వరుణ్ తన పెళ్లి తేదీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వరుణ్ మాట్లాడుతూ... 'ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. ఈ ఏడాదిలోనే చేసుకుంటా. మా అమ్మ ఇంకా తేదీ ఖరారు చేయలేదు. పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయం. అంతే కాకుండా తేదీ ఓకే అయ్యాక వేదిక ఎక్కడనేది ఫిక్స్ చేస్తాం. నెక్ట్స్ మూవీ కోసం వెయిటింగ్. కానీ పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక సినిమాపై ప్లాన్ చేస్తా. డెస్టినేషనా లేదా అనేది ఫ్యామిలీతో డిసైడ్ చేస్తాం. లవ్ ప్రోపోజ్పై ప్రశ్నించగా.. ముందు తానే ప్రపోజల్ పెట్టింది. ' అని అన్నారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరుణ్ పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కించిన ‘గాండీవధారి అర్జున’ ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ తేజ్‌కు జంటగా సాక్షీ వైద్య నటించింది. (ఇది చదవండి: ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ) -
ఒక స్త్రీ జీవితం ఆధారంగా కేరాఫ్ దెయ్యం...
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. -
ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్లు కూడా అంతకంటే వేగంగా అడుగులు వేస్తున్నారు. గత సంవత్సరం గూగుల్ సంస్థ వినియోగదారుల భద్రత కోసం ఆధునిక ఫీచర్స్ పరిచయం చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్ యూజర్ల నుంచి ఎటువంటి డేటా సేకరిస్తున్నాయనే వివరాలు డేటా సేఫ్టీ అనే ఒక సెక్షన్లో తప్పకుండా వెల్లడించాల్సి ఉంది. అయితే దీనిని కూడా కొంత మంది హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'ప్రాడియో' అనే మొబైల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. కొందరు హ్యాకర్లు యూజర్ల డేటా దొంగలించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఆ సమాచారం కొన్ని చైనా సంస్థలకు చేరవేస్తున్నట్లు తెలిసింది. నిజానికి చైనాకు చెందిన వాంగ్ టామ్ అనే డెవలపర్ డిజైన్ చేసిన 'ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ', 'ఫైల్ మేనేజర్' అనే రెండు యాప్స్ యూజర్ల డేటాని దొంగలిస్తున్నట్లు తెలిసింది. ఈ యాప్స్ రియల్ టైమ్ యూజర్ లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్, నెట్వర్క్ ప్రొవైడర్ పేరు, సిమ్ ప్రొవైడర్ వంటి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ రెండు యాప్‌లను దాదాపు 10 లక్షల కంటే ఎక్కువమంది మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి మీకు తెలుసా?) ఇప్పటి వరకు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే తొలగించాలని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ యాప్‌లను సృష్టించిన సంస్థ మాత్రం తాము నిబంధనలను ఉల్లఘించలేదని, దానికి అనుకూలంగానే ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇలాంటి యాప్‌ల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. -
బిడ్డ ముందే బట్లర్ కు లవ్ ప్రపోజల్ చేసిన చాహల్..
-
డేట్‌కు ఎప్పుడు వెళదాం? యంగ్ హీరోకు ఫ్యాన్ ప్రపోజల్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్-2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శైలేస్ కొలను దర్శకత్వంలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు నుంచే మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.సీక్వెల్‌పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం, పెద్ద సినిమాలు లేకుండా సోలోగా రిలీజ్ కావడంతో హిట్-2 కలెక్షన్ల పరంగానూ సూపర్ హిట్టయ్యింది. ఇక ఈ సక్సెస్‌లో భాగంగా శేష్ అభిమానులతో ట్విట్టర్లో చిట్‌చాట్ సెషన్ నిర్వహించారు. ఆస్క్‌మి ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే ఓ లేడీ ఫ్యాన్ మాత్రం డైరెక్ట్‌గా డేటింగ్ ప్రపోజల్ చేసింది. మనం ఎప్పుడు డేట్‌కు వెళదాం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా అడివి శేష్ స్పందించాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా.. మనం ఇద్దరం కలిసి హిట్ 2 సినిమా చూద్దామా అంటూ ఆన్సర్ ఇచ్చాడు. డేట్‌కి అడగ్గానే ఏమాత్రం తడబాటులేకుండా శేష్ ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది. Idhigo occhestunna. Do you want to watch #HIT2 ? 🙃#AskSesh https://t.co/2LCxbtlIAa — Adivi Sesh (@AdiviSesh) December 3, 2022 -
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది. -
ఆ అమ్మాయిని చూసి పారిపోయాను: కోహ్లి
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎంటీవీ వీజే అనూశ దండేకర్ ఓ ప్రైవేల్ పార్టీలో యుక్త వయసులో ఉన్న కోహ్లిని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇది. దీనిలో అనూశ ర్యాపిడ్ ఫైర్ ఫార్మట్‌లో యంగ్ కోహ్లిని కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిలో ‘‘మీ జీవితంలో త్వరగా ముగిసిన భోజనం, స్నానం, డేట్’’ గురించి ప్రశ్నించింది. దానికి బదులుగా కోహ్లి ఒకమ్మాయితో బ్లైండ్ డేట్‌కి వెళ్లానని.. కానీ ఆమె అందంగా లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి పారిపోయాను అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. దీనిలో కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఒకసారి బ్లైండ్ డేట్‌కి వెళ్లాను.. కానీ అది కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది. ఆ అమ్మాయి అంత అందంగా లేదు. తనను చూడగానే అక్కడ నుంచి వెళ్లిపోయాను’’ అని కెమరా వైపు చూసి.. ‘‘సారీ.. కానీ ఆ అమ్మాయి అంత అందంగా లేదు’’ అని తెలిపాడు. ఇక ఈ ఇంటర్వ్యలూ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ల గురించి కూడా మాట్లాడాడు. అయితే అనుష్క గురించి కాదు. ‘‘ఏ హీరోయిన్ క్రికెట్ ఆడాలనుకుంటే మీరు చూడాలనుకుంటున్నారు’’ అనే ప్రశ్నకు కోహ్లి జెనిలియా అని సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. చదవండి: అది ఇంకా బాధించేది: విరాట్ కోహ్లి -
ఫస్ట్‌టైమ్ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్ ఏం చేశారంటే..
-
ఫస్ట్‌టైమ్ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్ ఏం చేశారంటే..
తొలిసారి డేట్‌కి వెళ్లిన ఓ జంటకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్నేహితులు. ఎంగేజ్మెంట్ లెవల్లో వారి ‘ఫస్ట్‌డేట్’ను సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే..నార్తర్న్ ఐర్లాండ్‌లోని డెర్రీకి చెందిన నీల్ హర్కిన్ (31), జీన్ మెక్ఆలే (31) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల తొలిసారి డేట్‌కి వెళ్లాలని నిర్ణయించుకొని లండన్డెరీలోని ఓల్డ్ డాక్స్ బార్కి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమాని, హర్కిన్ ప్రాణస్నేహితుడు లియామ్ షీల్స్ వారి ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. (చదవండి : పాముల సయ్యాట: ఒళ్లు గగుర్పొడిచే వీడియో!) అనుకున్నట్లే వారికి తెలియకుండా హోటల్లోని సెంట్రల్లో ఓ టేబుల్ వేయించాడు. మిగిలిన డేబుళ్లపై వారి స్నేహితులను కూర్చోబెట్టారు. లోపలికి వచ్చిన హర్కిన్ జంట.. అన్ని టేబుల్లో నిండిపోవడంతో సెంట్రల్లో ఏర్పాటు చేసిన టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్నారు. డిన్నర్ కూడా చేశారు. తిరిగి వెళ్లే క్రమంలో ఓ వేటర్ భారీ స్పార్క్లర్తో పాటు ప్రాసికో బాటిల్ తెచ్చి వారి టేబుల్‌పై పెట్టాడు. వెంటనే రెస్టారెంట్‌లోని ఇతర డైనర్లు చప్పట్లు కొడుతూ వారిని విష్ చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఆ జంట.. సిగ్గుపడుతూ తలలు కిందకు దించుకున్నారు. తామేదో డిన్నర్ చేసి వెళ్దామని వస్తే.. ఈ వేడుకలు ఏంటో వారికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుండగా, అందరూ చప్పట్లు కొడుతు వారిని అభినందిస్తున్నారు. తర్వాత తెలిసింది ఇది తన స్నేహితుల నిర్వాహకం అని. తమ ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసినందుకు తమ స్నేహితులకు ఆ జంట కృతజ్ఙతలు తెలిపింది. (చదవండి : వైరల్: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు!) -
బాతుకు స్వయంవరం; ఆదివారం ముహూర్తం
పలానా చదువుకున్న అమ్మాయికి తగిన వరుడు కావలెను అన్న ప్రకటనలు మనం రోజూ పేపర్లో చూస్తూనే ఉంటాం. కానీ ఓ చోట మాత్రం మరీ విడ్డూరంగా ఓ బాతుకు తోడు కావలెను అని ప్రకటించారు. దీనికి సంబంధించి బాతు యజమాని మారిస్ పోస్టర్లు అతికించాడు. తాను ఓ బాతును పెంచుకుంటుండగా దానితో కలిసి ఉండే సహచర బాతులు కొద్ది వారాల క్రితం మరణించాయి. దీంతో ఆ బాతు ఒంటరిగా మిగిలిపోయింది. దాని బాధను చూడలేని మారిస్ ఓ పథకం ఆలోచించాడు. ఒంటరిగా ఉంటున్న ఆడ బాతుకు వెంటనే ఓ తోడు అవసరమని భావించాడు. అందుకోసం బాతు బొమ్మ గీసి దానికి ఈడూజోడు సరిపోయే మగబాతు కావాలంటూ ఓ దుకాణంలో పోస్టర్ అతికించాడు. మీ దగ్గర మగబాతు ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించండి అంటూ తన అడ్రస్ కూడా అందులో పొందుపరిచాడు. ఈ స్వయంవరాన్ని ఆదివారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపాడు. పైగా బాతులు చక్కగా కలిసిపోడానికి, కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ప్రకటన తెలిసిన కొందరు వ్యక్తులు మా దగ్గరున్న బాతుల్లో ఒక్కటైనా నచ్చకపోతుందా అని ఆయన ఇంటి మెట్లు ఎక్కుతున్నారు. -
పరిమితి దాటిన హెచ్–1బీ వీసా దరఖాస్తులు
వాషింగ్టన్: 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తులు నిర్దేశిత పరిమితి అయిన 65 వేలను దాటిపోయాయని అమెరికా వీసా సేవల సంస్థ యూఎస్సీఐఎస్ ప్రకటించింది. తదుపరి దశలో లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి వీసాలు జారీ చేయనున్నారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం 2018, అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2న హెచ్–1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక కాలేకపోయిన దరఖాస్తుదారులకు ఫైలింగ్ రుసుమును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మాస్టర్స్(అడ్వాన్స్డ్ డిగ్రీ) విభాగంలోనూ పరిమితి 20 వేలకు సరిపడ హెచ్–1బీ దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. -
రజనీ 'లెక్క' ఇదేనా ?
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను డిసెంబర్ 31న చేస్తానని రజనీ చెప్పడంతో ఆయన అభిమానుల్లో ఓ సందిగ్ధం నెలకొంది. కొత్త నిర్ణయాలను నూతన సంవత్సరంలో తీసుకుంటారు. కానీ, రజనీ పాత ఏడాది చివరి రోజున వెల్లడిస్తానని చెప్పడంతో.. రజనీ రాజకీయ రంగ ప్రవేశ తేదీపై ఓ చర్చ కొనసాగుతోంది. డిసెంబర్31 రోజునే రాజకీయ ప్రవేశంపై ప్రకటన ఎందుకు? పుట్టిన రోజున ఎందుకు చెప్పలేదు? కొత్త సంవత్సరం రోజున చెప్పోచ్చు కదా? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీలో ఆధ్యాత్మికత పాలు కాస్త ఎక్కువ. మాస్ హీరోగా ఉన్న సమయంలో తన వందో చిత్రంగా రాఘవేంద్ర స్వామి జీవిత కథతో సినిమా రూపొందించడం సాహసమే. రాజకీయాల్లో పడిపోతున్న విలువల నేపథ్యంలో ఆధ్మాత్మికత తప్ప దేశాన్ని రక్షించే మార్గం మరోటి లేదని బలంగా నమ్ముతారు రజనీ. రజనీ న్యూమరాలజీ నమ్ముతారని తన అదృష్ట సంఖ్య ఎనిమిది అని అందుకే తేదీలో ఎనిమిది వచ్చే రోజును ఎంచుకున్నారని 31–12–2017(3+1+1+2+2+0+1+7=17=1+7=8) సంఖ్యానిపుణులు అంటున్నారు. అంతేకాకుండా రజనీ ఆల్‌టైం హిట్ చిత్రం భాషాలోనూ ఎనిమిది అంకె ప్రాముఖ్యత వచ్చేలా 'రా రా రామయ్య ఎనిమిదిలో లోకం ఉంది చూడయా' ఓ పాట కూడా ఉండటం విశేషం. దీనికి తోడు సంఖ్యా నిపుణులు కూడా రజనీకి ఎనిమిది అదృష్ట సంఖ్య అని చెబుతున్నారు. రజనీ రాజకీయ ప్రవేశం చేస్తారా? చేస్తే న్యూమరాలజీ తో విజయం సాధిస్తారా అని వేచిచూడాలి. -
డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా?
ఆన్లైన్లో పరిచయం అయిన అమ్మాయిని అతను డేట్‌కు పిలిచాడు. సరేనన్న ఆమెను.. సరదాగా ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమాకు తీసుకెళ్లాడు. అయితే, సినిమా పూర్తయిన వెంటనే అనూహ్యంగా లాయర్‌ను కలసి.. ఆ అమ్మాయిపై దావా వేశాడు. ఇంతకీ థియేటర్లో ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? అమెరికాలోని టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.. జైలుకు పంపాల్సిందే..’ అని నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. విషయంలోకి వెళితే.. అస్టిన్‌కు చెందిన బ్రెండన్ వెజ్మర్ అనే యువకుడికి.. ఆన్లైన్లో ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ కలసి మే 6న డేట్‌కు వెళ్లారు. అది.. అతని మొట్టమొదటి డేట్ అట! వాళ్లిద్దరూ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ సినిమా చూస్తుండగా.. ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై కూడా ఇచ్చింది. అలా ఓ 20 వెసేజ్లు రావడం, వాటన్నింటికీ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. పక్కనే కూర్చున్న బ్రెండన్‌కు ఈ మెసేజ్‌ల వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. ‘నా డబ్బులతో సినిమాకొచ్చి, నా పక్కనే కూర్చొన్న ఆమె.. వరుసగా మెసేజ్‌లు పంపించి, సినిమా చూడాలన్న నా హక్కును కాలరాసింది. హాలులో మొబైల్ వాడటం థియేటర్ పాలసీకి వ్యతిరేకం కూడా’ అని బ్రెండన్ కోర్టుకెక్కాడు. డేట్ కోసం ఖర్చుచేసిన 17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్ ద్వారా అమ్మాయిని డిమాండ్ చేశాడు. ఆ విధంగా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లడమేకాక, ఆమెపై దావా వేసిన బ్రెండన్ చర్యను వెర్రితనమని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? -
ఆయనతో డేట్‌కు రెడీ..: రకుల్
టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. తొలుత కోలీవుడ్‌లో నిరాదరణకు గురై టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుని ప్రముఖ హీరోయిన్గా ఎదిగిన ఈ ఉత్తరాది బ్యూటీ తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా స్పైడర్ చిత్రంలో నటిస్తోంది. తమన్నా, తాప్సీ, ఎమీ జాక్సన్ వంటి తారల్లా రకుల్ ప్రీత్ సింగ్‌కు బాలీవుడ్ మోహం పుట్టిందట. అక్కడ ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలన్న ప్రయత్నాలను ఇప్పటి వరకూ రహస్యంగా చేసిన ఈ బ్యూటీ తాజాగా డైరెక్ట్‌గానే రంగంలోకి దిగిందట. ఇటీవల మీకు నచ్చిన ఏ హీరోతో డేటింగ్ చేస్తారన్న ప్రశ్నకు హిందీ నటుడు రణ్‌వీర్‌సింగ్ అని తడుముకోకుండా ఠక్కున చెప్పింది. -
నీళ్లొస్తాయ్
కొవ్వూరు/నిడదవోలు/భీమవరం : జిల్లాలోని కాలువలకు నీటి విడుదలను మరో రెండు రోజులు పొడిగించారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి కాలువలను మూసివేయాలని నిర్ణయించారు. అయితే, వరి కోతలు పూర్తికాకపోవడం, శివారు ప్రాంతాల్లోని తాగునీటి చెరువులు నిండకపోవడంతో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నది నుంచి మరో రెండు రోజులపాటు నీరివ్వాలని నిర్ణయించారు. బ్యాంక్ కెనాల్ పరిధిలోని వడ్డిలంక కాలువ ద్వారా మంచినీటి చెరువుల్ని నింపాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ ఎన్.కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే 80 శాతంపైగా చెరువులను నీటితో నింపామని, రానున్న రెండు రోజుల్లో అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. పశ్చిమ డెల్టాకు ప్రస్తుతం 4,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటి విడుదలను నిలిపివేస్తారు. తిరిగి జూన్ 1వ తేదీన విజ్జేశ్వరంలోని గోదావరి హెడ్ స్లూయిస్ తలుపులు తెరుస్తారు. రొయ్యల చెరువులకు తరలించడంతో సమస్య ఎన్నడూ లేనివిధంగా ఈసారి రొయ్యలు, చేపల చెరువులకు నీటిని పెద్దఎత్తున తోడుకోవడంతో జిల్లాలోని మంచినీటి చెరువులకు కొరత ఏర్పడింది. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు బడా వ్యక్తులు ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్ల సాయంతో కాలువల్లోని నీటిని ఆక్వా చెరువుల్లో తోడుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, సెంట్రల్ డెల్టాలకు ఈనెల 10వ తేదీన కాలువల్ని మూసివేశారు. అదే రోజున పశ్చిమ డెల్టాకూ నీటి విడుదలను నిలిపివేయాల్సి ఉండగా.. చేలు, చెరువులకు వెళ్లాల్సిన నీటిని చేపలు, రొయ్యల చెరువులకు మళ్లించారు. దీంతో మంచినీటి చెరువులు నిండలేదు. ఈ నేపథ్యంలో కాలువల మూసివేతను మరో వారం రోజులపాటు పొడిగించి.. సోమవారం సాయంత్రం 6 గంట లకు నీటి విడుదలను నిలిపివేయాలని భావించారు. అయినప్పటికీ మంచినీటి చెరువులు నిండకపోవడం, శివారు ప్రాంతాల్లో వరి చేలు కోత దశకు చేరుకోకపోవడంతో మరో రెండు రోజులపాటు నీటి విడుదలను పొడిగించక తప్పలేదు. అయినా.. మంచినీటి చెరువులు పూర్తిగా నిండుతాయో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. -
స్కాలర్షిప్స్ దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వం ఏటా మైనారిటీ విద్యార్థులకు అందించే ఉపకార వేతన (2016–17) ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు మైనారిటీ కార్పొరేషన్ ఈడీ మహ్మద్ అంజాద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకుని సంబంధిత పాఠశాల, కళాశాలలో సమర్పించాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల్లోపుండి, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు కలిగిన మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్సైట్(టఛిజిౌl్చటటజిజీpట.జౌఠి.జీn)లో నమోదు చేసుకోవాలన్నారు. -
20న ఏపీసెట్ కీ విడుదల
ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) -2016 ప్రాథమిక కీని ఈనెల 20న ఏపీసెట్ వెబ్సైట్ www.apset.net.in లో ఉంచుతున్నట్లు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీ ని ఈనెల 25 వరకూ వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు పరీక్షలో వచ్చిన ప్రశ్నలపై ఎటువంటి సందేహాలున్నా ఈనెల 25వ తేదీలోగా apsetau@gmail.com మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపాలి. విద్యార్థులు తమ పరీక్ష హాల్‌టికెట్, ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని తెలుపుతూ సంబంధిత ఆధారాలను ఈమెయిల్‌కు జతపరచాలి. 25వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించరు.