Delhi Daredevils
-
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్‌తో అనుబంధం ఐపీఎల్‌కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్‌ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్‌కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్‌కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్‌లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే! -
‘ఉత్తరాది’ రాత మారుతుందా?
ఐపీఎల్లో పదకొండు సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా టైటిల్ ఆనందం దక్కని జట్లలో ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. లీగ్ తొలి ఏడాది 2008లో టాప్ స్టార్లతో అంచనాలను అందుకుంటూ తమ స్థాయిని ప్రదర్శించి ఈ రెండు టీమ్‌లు సెమీఫైనల్ చేరాయి. ఆ తర్వాత పది ప్రయత్నాల్లో ఎక్కువ సార్లు నిరాశే మిగిలింది. 2014లో రన్నరప్‌గా నిలవడం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో పంజాబ్ లీగ్ దశకే పరిమితమైంది. మరోవైపు ఢిల్లీ 2009లో సెమీస్, 2012లో ప్లే ఆఫ్స్ దశకు వెళ్లినా... 2013 నుంచి 2018 మధ్య ఆరేళ్లలో మూడుసార్లు చివరి స్థానంలోనే నిలవడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారడంతో పాటు సహాయక సిబ్బందిని కూడా చాలా వరకు మార్చుకొని కొత్త ఆశలతో బరిలోకి దిగుతుండగా... గతేడాది ఆరంభంలో అద్భుతంగా దూసుకుపోయి ఆ తర్వాత చతికిలపడ్డ∙పంజాబ్ పాఠాలు నేర్చుకొని మైదానంలోకి వస్తోంది. కుర్ర ‘త్రయం’... బలాలు: ఢిల్లీ బ్యాటింగ్ ప్రధానంగా నలుగురు భారత ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఈసారి జట్టు కొత్తగా తెచ్చుకుంది. ధావన్ రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అతనితో పాటు మరో ముగ్గురు యువ ఆటగాళ్లు జట్టు రాతను ప్రభావితం చేయగలరు. విధ్వంసక ఆటతో ఇప్పటికే భారత టీమ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రిషభ్ పంత్ ఆ జట్టు ప్రధాన బలం. పంత్‌తో పోటీ పడుతూ చెలరేగిపోగల శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో ఉన్నాడు. పంత్ గత ఏడాది ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధసెంచరీలు సాధించగా, అయ్యర్ నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వీరితో పాటు పృథ్వీ షా స్ట్రోక్ ప్లే కూడా కీలకం కానుంది. ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, బండారు అయ్యప్ప జట్టులో ఉన్నా... వారికి ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం లభిస్తుందనేది చూడాలి. విదేశీ ఆటగాళ్లలో భారీ హిట్టర్లయిన ‘కొలిన్ ద్వయం’ మున్రో, ఇంగ్రామ్ చెలరేగి శుభారంభం అందించగలరు. క్రిస్ మోరిస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంపై కూడా జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్లు బౌల్ట్, రబడ పేస్ బాధ్యత తీసుకుంటారు. భారత పేసర్లలో అవేశ్ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ కూడా ఈసారి సొంత జట్టు తరఫున ఆడుతున్నాడు. నేపాల్ లెగ్‌స్పిన్నర్ సందీప్ లమిచానే అందుబాటులో ఉన్నా... నలుగురు విదేశీయుల పరిమితిలో అతనికి అవకాశం దక్కడం అంత సులువు కాదు. బలహీనతలు: ధావన్ గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ తరఫున గొప్పగా ఏమీ ఆడలేదు. మరోవైపు నుంచి వార్నర్ జోరులో అతని లోపాలు తెలియలేదు. ఫామ్ కోల్పోవడంతోనే రైజర్స్ అతడిని వదిలేసుకుంది. ఇప్పుడు అతను ఎంత ప్రభావం చూపిస్తాడనేది ముఖ్యం. గత ఏడాది ఢిల్లీ తరఫు నుంచే మున్రో ఐదు ఇన్నింగ్స్‌లలో 3 సార్లు డకౌట్ కాగా, భారత్‌లో ఇంగ్రామ్ ఆటపై సందేహాలున్నాయి.నిరంతరాయంగా దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్న రబడ వరల్డ్ కప్‌కు ముందు అన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగే అవకాశం తక్కువ. ప్రధాన స్పిన్నర్లుగా భావిస్తున్న అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా ఇటీవలి ప్రదర్శన అంతంత మాత్రమే. టి20 క్రికెట్లో ఇషాంత్ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! మొత్తంగా చూస్తే మెరుపు బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేస్తే క్యాపిటల్స్ విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. రికీ పాంటింగ్ కోచ్‌గా, సౌరవ్ గంగూలీ సలహాదారుడిగా ఉన్న ఈ జట్టుకు వారి మార్గనిర్దేశనం ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. లీగ్‌లో ఉన్న ఎనిమిది టీమ్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టు ఇదే. ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్) 2018లో 14 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచి, 9 ఓడింది. జట్టు వివరాలు శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, హనుమ విహారి, మన్జోత్ కల్రా, నాథు సింగ్, రాహుల్ తేవటియా, అంకుశ్ బైన్స్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా, జలజ్ సక్సేనా, బండారు అయ్యప్ప (భారత ఆటగాళ్లు), రబడ, మోరిస్, లమిచానే, మున్రో, ఇంగ్రామ్, బౌల్ట్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్ (విదేశీ ఆటగాళ్లు). -
గంభీర్‌పై వేటు.. ఫ్యాన్స్ గుస్సా !
న్యూఢిల్లీ : వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అప్పుడే ఫ్రాంఛైజీలు తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. ఐపీఎల్-2019 కోసం తమ జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళనను మొదలెట్టాయి. అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో గుదిబండగా మారిన సీనియర్ ఆటగాళ్లను వదులుకోవడంలో కూడా ప్రాంఛైజీలు ఏ మాత్రం సంశయించడం లేదు. ఇప్పటికే కింగ్స్ పంజాబ్ యువరాజ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్.. కెప్టెన్ గౌతం గంభీర్‌నే వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు మహ్మద్ షమీ, సయాన్ గోష్, గురక్రిత్ సింగ్, నమాన్ ఓజా ఉండగా.. విదేశీ ఆటగాళ్లలో జాసన్ రాయ్, జూనియర్ డాలా, లియామ్ ప్లంకెట్, డానియల్ క్రిస్టియన్, గ్లేన్ మాక్స్‌వెల్‌లు ఉన్నారు. పంత్, అయ్యర్, పృథ్వీషాతో సహా 14 మందిని మాత్రమే ఢిల్లీ అట్టిపెట్టుకుంది. ఇక గంభీర్‌ను వదులుకోవడంపై అభిమానులు ఢిల్లీ ఫ్రాంఛైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్.. ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా? అని మండిపడుతున్నారు. గంభీర్ లేని ఢిల్లీ జన్మలో ఐపీఎల్ టైటిల్ నెగ్గదని శాపనార్ధాలు పెడుతున్నారు. ఇదో పిచ్చి నిర్ణయం అంటూ కామెంట్ చేస్తున్నారు. DD officials should use their brains while selecting the squad. Mark my words you can never win ipl without gambhir. I don't understand what u ppl think while selecting squad. — jasdeep (@jsdeepand) November 15, 2018 Only @GautamGambhir could have won you IPL. Another season to lose next year. Waste of team. Stupid of a franchise. You have hurt Delhi ppl over the years. — Bhavnoor (@BhavnoorSB) November 15, 2018 -
శిఖర్ ధావన్... సొంత గూటికి!
ఢిల్లీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడటం దాదాపు ఖాయమైంది. తద్వారా 11 ఏళ్ల తర్వాత అతడు సొంత నగరం తరఫున బరిలో దిగనున్నాడు. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ ఈ సారి ఫ్రాంచైజీ మారడానికి కారణం సన్ రైజర్స్ యాజమాన్యం తనకు చెల్లిస్తున్న ధర తక్కువని భావించడమే. 2018 సీజన్ వేలం సందర్భంగా ధావన్‌ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. రూ.5.2 కోట్ల ధరతో వేలంలో ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకుంది. ఇది తన స్థాయికి తగని ధరగా భావించిన ధావన్ అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ అతడిని విడుదల చేసింది. బదులుగా డేర్ డెవిల్స్ జట్టు సభ్యులైన విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు), షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు), యువ ఆటగాడు అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)లను తీసుకుంది. ఇందులో ధావన్ ధర మినహా మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో డేర్ డెవిల్స్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ధావన్ తొలి ఐపీఎల్ (2008)లో ఢిల్లీకే ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం రెండేళ్లు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2011 నుంచి హైదరాబాద్ (2011, 12లలో దక్కన్ చార్జర్స్, 2013 నుంచి సన్‌రైజర్స్) జట్టులో భాగంగా ఉన్నాడు. 2016లో ట్రోఫీ నెగ్గడంలో కీలకంగా నిలిచాడు. సన్‌రైజర్స్ తరఫున 91 ఇన్నింగ్స్‌లు ఆడి 125.13 స్ట్రైక్ రేట్‌తో 2,768 పరుగులు చేశాడు. -
మళ్లీ కోచ్‌గా కుంబ్లే రీ-ఎంట్రీ?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మరోసారి కోచింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈసారి అనిల్ కుంబ్లే బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు అయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచింగ్ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం సైతం స్పందించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కోసం టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ ఓనర్లలో ఒకరైన పార్థ్ జిందాల్ వెల్లడించినట్లు అహ్మదాబాద్ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. ‘వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించాలని కుంబ్లేను కోరుతున్నాం. దీనిపై కుంబ్లే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ కుంబ్లే మా జట్టులో కలిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తాం’ అని వారు తెలిపారు. కుంబ్లేను మెంటార్‌గా ఎంచుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీనే ఢిల్లీ యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుంబ్లే గనుక ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకుంటే, మరోసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేసినట్లు అవుతుంది. గతంలో అనిల్ కుంబ్లే-రికీ పాంటింగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్ టోర్నీ జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ కాస్త ముందుగానే నిర్వహించనున్నారు. -
అందుకే చెన్నై గెలిచింది : గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్-11 విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. సీఎస్కే యాజమాన్యం తమ కెప్టెన్ ధోనీని క్రికెట్ బాస్‌గా భావిస్తుందని.. ఫీల్డ్‌లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లో ఒక కెప్టెన్‌గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చాలా ఖరీదైన వ్యాపారమని.. ఫ్రాంచైజీ ఫీజు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు అంటూ యాజమాన్యం ఎంతో ఖర్చు పెడుతుందని గంభీర్ ఒక ప్రముఖ పత్రికలో రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అన్నిటికంటే ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని.. అయితే క్రికెట్‌ను కూడా ఒక వ్యాపారం లాగే భావిస్తారని.. పెట్టుబడికి తగిన లాభం వచ్చిందా లేదా అనే విషయం మీదే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఘాటుగా విమర్శించాడు. క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు. ‘కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యానని’ గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
‘నా కెరీర్లోనే అత్యంత చెత్త ఐపీఎల్’
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాడు టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్. అయితే ఐపీఎల్-11 (ప్రస్తుత) సీజన్ తన కెరీర్లోనే చెత్త ఐపీఎల్ సీజన్ అని ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాజీ కెప్టెన్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ ఇంటిముఖం పట్టాక.. కుటుంబంతో కలిసి చండీగఢ్‌లో ఉంటున్న గంభీర్ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ సీజన్లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యాను. శ్రేయస్ అయ్యర్‌కి కెప్టెన్సీ ఇచ్చారు. చివరికి ఏమైంది. ఢిల్లీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ నుంచి తప్పించాక నన్ను జట్టులోకి తీసుకోకపోగా.. గంభీర్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని వదంతులు ప్రచారం చేశారు. ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. రిటైర్మెంట్ పై నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు వైఫల్యాలతో పాటు నాపై వచ్చిన వదంతులు ఢిల్లీ జట్టులో మళ్లీ అవకాశం రాకుండా చేశాయంటూ’ గంభీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
బై...బై...ముంబై
ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా ముంబైను ముంచారు. ఈ సీజన్లో అందరికంటే ముందే ప్లే ఆఫ్ నుంచి ఔటైన డేర్‌డెవిల్స్ జట్టు వెళ్తూ వెళ్తూ తమ వెంట రోహిత్ సేననీ తీసుకెళ్లింది. న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్ పట్టాల నుంచి తప్పించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ 11 పరుగుల తేడాతో రోహిత్ సేనపై గెలిచింది. బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే... బౌలింగ్‌లో స్పిన్నర్లు సందీప్ లమిచానే (3/36), అమిత్ మిశ్రా (3/19), పేసర్ హర్షల్ పటేల్ (3/28) సమష్టిగా దెబ్బ తీశారు. మొదట డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. లూయిస్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. మిశ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రిషభ్ పంతే పెద్దదిక్కయ్యాడు... టాస్ నెగ్గిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపిం ది. ఓపెనింగ్ వైఫల్యంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (12) రనౌట్‌కాగా, మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్‌తో కలిసి రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ కూడా విఫలమైంది. కెప్టెన్ అయ్యర్ (6) మార్కండే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్‌తో పంత్ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 13వ ఓవర్లో జట్టు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ 34 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్ తర్వాత బుమ్రా, కటింగ్, హార్దిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ముస్తఫిజుర్ వేసిన 15వ ఓవర్లో పంత్ సిక్సర్, శంకర్ ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చారు. హార్దిక్ తర్వాతి ఓవర్లో పంత్ మరో రెండు సిక్సర్లు బాదేశాడు. జోరు పెరిగిన దశలో రిషభ్ ఇన్నింగ్స్‌కు కృనాల్ పాండ్యా తెరదించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అభిషేక్ జతగా విజయ్ శంకర్ పోరాడే లక్ష్యాన్ని ముంబై ముందుంచగలిగాడు. స్పిన్ ఉచ్చులో బ్యాట్లెత్తారు... ముంబై చావోరేవో తేల్చుకునే లక్ష్యం 175. సులువైంది కాకపోయినా... అసాధ్యమైంది మాత్రం కాదు. కానీ ముంబై బ్యాట్స్‌మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరంభంలో ఓపెనర్ లూయిస్ ఎదురుదాడికి దిగినట్టు... చివర్లో కటింగ్ (20 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినట్లు మరొక్కరు నిలబడితే గెలిచేది. కానీ ఆ ఒక్కడి పాత్రలో ఏ బ్యాట్స్‌మెన్ నిలబడనీయకుండా లమిచానే, మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. ఈ సీజన్లో నిలకడ కనబరిచిన సూర్యకుమార్ (12), విధ్వంసకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (7)లను లమిచానే ఔట్ చేస్తే... మధ్యలో ఇషాన్ కిషన్ (5), లూయిస్‌లను మిశ్రా పెవిలియన్ చేర్చాడు. కృనాల్ (4), రోహిత్ (13) పలాయనం చిత్తగించడంతో ముంబై కథ ముగిసింది. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు బ్యాట్‌ను ఊపేసినా మిశ్రా మాయలో పడేందుకు ఎంతో సేపు పట్టలేదు. 15వ ఓవర్లో అతని నిష్క్రమణతో ఆశలు ఆవిరికాగా... కటింగ్ మెరుపులతో ఏమూలనో మిణుకుమిణుకుమన్న ఆశల్ని చివరి ఓవర్లో హర్షల్ పటేల్ తుడిచేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 12; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 22; శ్రేయస్ అయ్యర్ (సి) కృనాల్ (బి) మార్కండే 6; రిషభ్ పంత్ (సి) పొలార్డ్ (బి) కృనాల్ 64; విజయ్ శంకర్ నాటౌట్ 43; అభిషేక్ శర్మ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–30, 2–38, 3–75, 4–139. బౌలింగ్: కృనాల్ 2–0–11–1, బుమ్రా 4–0– 29–1, హార్దిక్ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–34–0, మార్కండే 2–0–21–1, కటింగ్ 4–0–36–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (సి) శంకర్ (బి) లమిచానే 12; లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) మిశ్రా 48; ఇషాన్ కిషన్ (సి) శంకర్ (బి) మిశ్రా 5; పొలార్డ్ (సి) బౌల్ట్ (బి) లమిచానే 7; రోహిత్ (సి) బౌల్ట్ (బి) హర్షల్ 13; కృనాల్ (సి) సబ్–తేవటియా (బి) లమిచానే 4; హార్దిక్ (సి) సబ్–తేవటియా (బి) మిశ్రా 27; కటింగ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హర్షల్ 37; మార్కండే (బి) బౌల్ట్ 3; బుమ్రా (సి) బౌల్ట్ (బి) హర్షల్ 0; ముస్తఫిజుర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–12, 2–57, 3–74, 4–74, 5–78, 6–121, 7–122, 8–157, 9–163, 10–163. బౌలింగ్: లమిచానే 4–0–36–3, బౌల్ట్ 4–0–33–1, మ్యాక్స్‌వెల్ 2–0–19–0, హర్షల్ 2.3–0–28–3, ప్లంకెట్ 3–0–27–0, మిశ్రా 4–0–19–3. రిషభ్ పంత్ లమిచానే, మిశ్రా ప్రీతికెంత సంబరమో! కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముంబై ఓడిందని తెలియగానే తెగ సంబరపడిపోయింది. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని చెప్పింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్లో వైరల్ అయింది. అదేం ఆనందమో గానీ... అప్పటికింకా ఆమె జట్టు (పంజాబ్) చెన్నైపై గెలవనేలేదు. ప్లే–ఆఫ్ చేరనేలేదు... ఇంకా చెప్పాలంటే మ్యాచ్ అప్పుడే మొదలైంది. ముంబై ఓటమితో పంజాబ్ ప్లే–ఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ... తమకు ఏమీ కాని ఫలితంతో ముందుకు ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
కింగ్స్ పంజాబ్ ఇంటికి.. ప్లేఆఫ్‌కు రాయల్స్
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్లో ప్లేఆఫ్‌కు చేరాలన్న కింగ్స్ పంజాబ్ ఆశలు నెరవేరలేదు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఏడు విజయాలతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు కాగా, చివరిగా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. చెన్నై విజయంలో సురేశ్ రైనా(61 నాటౌట్; 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ చాహర్(39; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు)లు ముఖ్య భూమిక పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే అంబటి రాయుడు(1)వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వా డుప్లెసిస్(14), శ్యామ్ బిల్లింగ్స్(0)లు వరుస బంతుల్లో ఔట్ కావడంతో చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై నాల్గో వికెట్‌కు సురేశ్ రైనాతో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత హర్భజన్ సింగ్(19) పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రైనా-దీపక్ చాహర్‌ల జోడి చెన్నై స్కోరు బోర్డును చక్కదిద్దింది. వీరిద్దరూ 56 పరుగుల జోడించిన తర్వాత చాహర్ ఐదో వికెట్‌గా నిష్క్రమించాడు. దాంతో చెన్నై 114 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో రైనా-ధోని(16 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ల జంట మరో వికెట్ పడకుండా ఆడటంతో చెన్నై 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. అంతకుముందు కింగ్స్ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 16 పరుగులకే క్రిస్ గేల్(0), అరోన్ ఫించ్(4), కేఎల్ రాహుల్(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్ తివారీ(35) పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్ మిల్లర్(24) సైతం ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి.. కింగ్స్ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది. -
ఇంటిదారి పట్టీన ముంబైఇండియన్స్
-
లుంగి ఎంగిడి విజృంభణ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 16 పరుగులకే క్రిస్ గేల్(0), అరోన్ ఫించ్(4), కేఎల్ రాహుల్(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్ తివారీ(35) పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్ మిల్లర్(24) సైతం ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత స్వల్ప విరామాల్లో కింగ్స్ పంజాబ్ వికెట్లను చేజార్చుకుంది. కాగా, కరుణ్ నాయర్(54; 26 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) ఆదుకున్నాడు. దాంతో కింగ్స్ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి.. కింగ్స్ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది. -
ముంబైను ముంచేసిన ఢిల్లీ
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్ ముంచేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్ లక్ష్యం నెరవేరలేదు. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆదిలోనే సూర్యకుమార్ యాదవ్(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఎవిన్ లూయిస్(48; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఇషాన్ కిషన్(5), పొలార్డ్(7), రోహిత్ శర్మ(13), కృనాల్ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై హార్దిక్ పాండ్యా(27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.ఇక చివర్లో బెన్ కట్టింగ్(37) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో లామ్‌చెన్, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్ బౌల్ట్ వికెట్ దక్కింది. -
మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్లో..
-
ముంబై ఇండియన్స్‌కి మతిపోయేలా...
ఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పొలార్డ్ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, తనను తాను నియంత్రించుకుంటూ గాల్లోనే బంతిని మరో ఫీల్డర్ బౌల్ట్‌కు అందివ్వడం మరో ఎత్తు. ముంబై బౌలర్ లామ్‌చెన్ వేసిన 10వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ మీదుగా పొలార్డ్ భారీ షాట్ కొట్టాడు. ఆ సమయంలో బంతి గమనాన్ని అంచనా వేస్తూ పరుగెత్తూకొంటూ వచ్చిన మ్యాక్స్‌వెల్ బంతిని బౌండరీకి స్వల్ప దూరంలో ఒడిసిపట్టుకున్నాడు. కాగా, బౌండరీ లైన్‌పై నియంత్రించుకునే క్రమంలో బంతిని సమీపంలో ఉన్న బౌల్ట్ వైపు విసిరేశాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంతో పొలార్డ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ క్యాచ్‌పై మూడో అంపైర్ సాయం కోరగా, మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్‌కు ముందుగానే బంతిని విసిరినట్లు తేలడంతో పొలార్డ్ భారంగా పెవిలియన్ వీడాల్సి వచ్చింది. అయితే రోహిత్ శర్మ ఔట్ విషయంలో కూడా మ్యాక్స్‌వెల్-బౌల్ట్‌లు ఇదే సీన్ రిపీట్ చేశారు. హర్షల్ పటేల్ వేసిన 14 ఓవర్ ఐదో బంతికి రోహిత్ షాట్ కొట్టాడు. ఆ క్యాచ్‌ను ముందుగా అందుకున్న మ్యాక్స్‌వెల్.. బౌండరీ లైన్‌పై నియంత్రణ కోల్పోతున్నట్లు భావించి బౌల్ట్‌కు విసిరాడు. దాన్ని బౌల్ట్ పట్టుకోవడం, రోహిత్ పెవిలియన్ చేరడం ముంబై ఇండియన్స్‌కు మతిపోయేలా చేసింది. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే తరహా క్యాచ్‌ను మయాంక్ అగర్వాల్-మనోజ్ తివారీలు అందుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై లక్ష్యం 175
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్(64;44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(43 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మెరుపులకు తోడు మ్యాక్స్‌వెల్(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 38 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా(12), మ్యాక్స్‌వెల్ వికెట్లను కోల్పోయింది. మరో 27 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(6) కూడా నిష్క్రమించడంతో ఢిల్లీ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషబ్ పంత్- విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 64 పరుగులు జత చేసిన తర్వాత రిషబ్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత శంకర్-అభిషేక్ శర్మ(15 నాటౌట్;10 బంతుల్లో 1 సిక్స్)లు సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా, బూమ్రా, మయాంక్ మార్కండేలు తలో వికెట్ తీశారు. -
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డేవిల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగుల చేసిన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో పంత్ 684 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప 660 (2014 సీజన్లో) పరుగుల ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా పంత్ అధిగమించాడు. కేఎల్ రాహుల్ 652 (2018 సీజన్), జోస్ బట్లర్ 548(2018), దినేశ్ కార్తీక్ 510 (2013), ఆడమ్ గిల్‌క్రిస్ట్ 492 (2009)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సీజన్లోనే ముగ్గురు వికెట్ కీపర్లు( పంత్,రాహుల్, బట్లర్) అత్యధిక పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పంత్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
-
ముంబై ప్లే ఆఫ్ చేరేనా?
న్యూఢిల్లీ : ఐపీఎల్-11 సీజన్లో మరో రసవత్తర మ్యాచ్‌కు ఫిరోజ్-షా కోట్ల మైదానం వేదికైంది. ఢిల్లీడేర్‌డెవిల్స్ తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై జట్టులో మెక్లిగన్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ రాగా.. ఢిల్లీ జట్టులో అవేశ్‌ఖాన్ స్థానంలో ప్లంకెట్ తుది జట్టులోకి వచ్చాడు. గెలిస్తేనే.. ప్లే ఆఫ్ ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. గెలిస్తే ప్లే ఆఫ్.. లేకుంటే ఇంటికి వెళ్తోంది. ఇక ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అనూహ్య విజయం అందుకుని ఆశ్చర్యపరిచింది. ఈ విషయమే ముంబై ఇండియన్స్‌ను కలవర పరుస్తోంది. 13 మ్యాచుల్లో 6 మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకే ప్లే ఆఫ్ చేరే అవకాశాలున్నాయి. ఆ జట్టు రన్‌రేట్ రాజస్తాన్, కింగ్స్ పంజాబ్ జట్ల కన్నా మెరుగ్గా ఉంది. ఓడితే మాత్రం రాజస్తాన్, పంజాబ్(చెన్నైతో గెలిస్తే) జట్లలో ఓ జట్టుకు ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది. తుదిజట్లు ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా ఢిల్లీ: పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, హర్షపటేల్, అమిత్ మిశ్రా, లియామ్ ప్లంకెట్, సందీప్ లామిచ్చేన్, ట్రెంట్ బౌల్ట్ -
టీ20ల్లో ధోని అరుదైన రికార్డు
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 6వేల పరుగులు క్లబ్లో చేరిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత వికెట్ కీపర్‌గా ధోని గుర్తింపు పొందాడు. ఐపీఎల్-11 సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ధోని 6వేల పరుగులకు 10 పరుగుల దూరంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో ధోని 17 పరుగులు చేసిన విషయం తెలిసిందే. బౌల్ట్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ధోని వెనుదిరిగాడు. దీంతో అతడు టీ20 క్రికెట్లో 6 వేల పరుగులు సాధించినట్లైంది. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడు ధోని నిలిచాడు. సురేశ్ రైనా(7,708), విరాట్ కోహ్లీ (7,621), రోహిత్ శర్మ(7,303), గౌతమ్ గంభీర్(6,402)... ధోని కంటే ముందున్నారు. ఇక ఓవరాల్‌గా 11,436 పరుగులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలోఉండగా.. కివీస్ బ్యాట్స్‌మన్ మెక్కల్లమ్ 9,119 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. మరో ఐపీఎల్ రికార్డు చేరువలో.. ధోని కెరీర్లో ఇది 290వ టీ20 మ్యాచ్ కాగా... ఐపీఎల్లో 4వేల పరుగుల క్లబ్‌కు చేరువయ్యాడు. ఇప్పటి వరకు ధోని ఐపీఎల్లో సాధించిన పరుగులు 3,974. మరో 26 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్లో 4వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా చేరుతాడు. -
నవ్వు ఆపుకోలేకపోయిన ధోని..
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ఉన్న ధోని ఓ సందర్భంలో నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల కెప్టెన్లు ధోని, శ్రేయస్ అయ్యర్లు మైదానంలోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ టాస్ కోసం కాయిన్‌ను ఎగురవేశాడు. ఆ కాయిన్ ఆటగాళ్లకు చాలా దూరంలో పడింది. అంత దూరం కాయిన్ పడటం చూసిన ధోని నవ్వు ఆపుకోలేకపోయాడు. ధోనితో పాటు అక్కడ ఉన్నవారంతా కూడా నవ్వారు. అనంతరం టాస్ గెలిచిన ధోని.. ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ధోనిని చూసిన ఫ్యాన్స్.. నువ్వు అందుకే మిస్టర్ కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. -
ఢిల్లీ విజయ ఢంకా
ఓడిపోతే ఢిల్లీకి పోయేదేమీ లేదు! గెలిస్తే చెన్నైకు రన్‌రేట్ పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు! అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే లేదు...! దీనికి తగినట్లే ఆటలో మెరుపే లేదు...! పరుగులకు ఇబ్బంది పెట్టిన పిచ్‌పై ఆడుతున్నది టి20నా...? వన్డేనా...? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో నమోదైంది ఒకే ఒక్క అర్ధ శతకం...! ఢిల్లీనే సాధారణ స్కోరు చేసిందనుకుంటే... చెన్నై అతి సాధారణంగా ఆడి ఓడింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (16 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు; 1/23) ఆల్‌రౌండ్ ప్రతిభతో డేర్‌డెవిల్స్‌కు ఊరట విజయం దక్కింది. ఢిల్లీ: అదేంటో మరి... ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు సీజన్ చివర్లో కాని జోష్ రాదనుకుంటా...! వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు ఎప్పుడో దూరమై... ప్రేక్షకులకు ఏ కోశానా ఆసక్తి లేకుండా పోయిన వేళ... ఆ జట్టు పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఆశ్చర్యపర్చింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్షల్‌తో పాటు రిషభ్ పంత్ (26 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజయ్ శంకర్ (28 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో అంబటి తిరుపతి రాయుడు (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగతావారి నుంచి మెరుపులు లేకపోవడంతో చెన్నై ఆరు వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా (2/20), సందీప్ లమిచానే (1/21) ప్రత్యర్థిని కట్టిపడేశారు. అంతా చప్పచప్పగా... పంత్, హర్షల్ మినహా ఏ బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రేట్ 130 దాటలేదంటేనే డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ సాగిన తీరును చెప్పొచ్చు. ఓపెనర్లలో పృథ్వీ షా (17) పూర్తిగా తడబడుతూ ఆడాడు. చాలా బంతులు అతడి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) బ్యాట్ ఝళిపించలేకపోయాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 39/1. ఆ తర్వాత కూడా రిషభ్, అయ్యర్‌లను చెన్నై బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. హర్భజన్ వేసిన 10వ ఓవర్లో పంత్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో కొంత కదలిక వచ్చింది. కానీ, మరుసటి ఓవర్లోనే ఇన్‌గిడి ఇద్దరినీ అవుట్ చేశాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ... జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్ (5) బౌల్డయ్యాడు. గత మ్యాచ్‌లో గడగడలాడించిన అభిషేక్ శర్మ (2) ఈసారి చేతులెత్తేశాడు. 15 ఓవర్లకు స్కోరు 102/5. విజయ్ శంకర్, హర్షల్ అప్పుడో షాట్ ఇప్పుడో షాట్ కొడుతూ బండి నడిపించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో పనిపట్టారు. హర్షల్ మూడు, శంకర్ ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. విశేషమేమంటే బంతితో గిమ్మిక్కులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో పడేస్తాడని పేరున్న బ్రేవో... హర్షల్ ధాటికి భారీగా (0/52) పరుగులిచ్చుకున్నాడు. అతడు కొట్టిన నాలుగు సిక్స్‌లూ బ్రేవో బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. చెన్నై ఛేదించలేకపోయింది... లక్ష్యం మరీ పెద్దదేం కాదు. ప్రత్యర్థి బౌలింగ్ ఏమంత భీకరం కాదు. దీంతో ఛేదనను చెన్నై ఊదేస్తుందని అంతా భావించారు. కానీ, వారికీ పరుగులు గగనంగానే వచ్చాయి. 5 ఓవర్లకు స్కోరు 22 మాత్రమే. అయితే, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రాయుడు మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 22 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కానీ, మిశ్రా వస్తూనే వాట్సన్‌ను బుట్టలో వేశాడు. ఓ ఎండ్‌లో తనవంతుగా ఆడుతూ అర్ధ సెంచరీ (28 బంతుల్లో) అందుకున్న రాయుడు ... భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో మ్యాక్స్‌వెల్‌కు చిక్కాడు. అప్పటికీ ధోని (17), రైనా (15) ఉండటంతో గెలుపుపై ఆశలున్నాయి. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకుని, ఆసాంతం ఇబ్బందిగా కనిపించిన రైనాను సందీప్ లమిచానే పెవిలియన్‌కు చేర్చాడు. సమీకరణం 41 బంతుల్లో 73గా ఉన్న దశలో బిల్లింగ్స్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జడేజాను మరోసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లు ధోనికి షాట్లు కొట్టే చాన్సే ఇవ్వలేదు. దీంతో లక్ష్యం అంతకంతకు పెరుగుతూ పోయింది. 18వ ఓవర్లో ధోనిని అవుట్ చేసిన బౌల్ట్ ఐదు పరుగులే ఇచ్చాడు. 12 బంతుల్లో 50 పరుగులు చేయడం జడేజా(27 నాటౌట్), బ్రావో (1) తరం కాలేదు. -
సీఎస్కేపై డేర్‌డెవిల్స్ ప్రతీకారం
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. సీఎస్కే ఆటగాళ్లలో అంబటి రాయుడు(50;29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జడేజా( 26 నాటౌట్) మినహా ఎవరూ రాణించకపోవడంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ బౌలింగ్‌లో ఆకట్టుకుని సీఎస్కేను కట్టడి చేసింది. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీ షా(17),శ్రేయస్ అయ్యర్(19), మ్యాక్స్‌వెల్(5), అభిషేక్ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్ పంత్(38) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయ్ శంకర్(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షల్ పటేల్(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
సీఎస్కే లక్ష్యం 163
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడుతూనే ఇన్నింగ్స్ ఆరంభించింది. పృథ్వీ షా(17),శ్రేయస్ అయ్యర్(19), మ్యాక్స్‌వెల్(5), అభిషేక్ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్ పంత్(38) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయ్ శంకర్(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షల్ పటేల్(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ 26 పరుగులు పిండుకోవడంతో చెన్నై ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. -
ధోని..నువ్వు అందుకే మిస్టర్ కూల్
-
టాస్ గెలిచిన సీఎస్కే
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో చెన్నై ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 12 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్ర్రమించింది. ఇది ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్‌గానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా నష్టమేమీ ఉండదు. దాంతో ఇరు జట్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. చెన్నై ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, ఢిల్లీ రెండు మార్పులు చేసింది. డేవిడ్ విల్లే స్థానంలో లుంగి ఎంగిడి చెన్నై తుది జట్టులోకి రాగా, మ్యాక్స్‌వెల్, అవేశ్ ఖాన్లు ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు.