Denmark
-
డెన్మార్క్: ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు
కోపెన్హాగన్: డెన్మార్క్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసిన నేటికి (అక్టోబర్ 7 తేదీ) ఏడాది. ఈ నేపథ్యంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార భవనానికి సమీపంలో ఐదు రోజుల క్రితం రెండు పేలుళ్లు సంభవించిన తర్వాత మళ్లీ పేలుడు జరగటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో ఇద్దరు స్వీడిష్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు.The #blast occurred some 500 metres (yards) from the embassy in Copenhagen and came five days after two explosions near the building for which two Swedish nationals have been remanded in #custody.#IsraelEmbassy #denmark https://t.co/MynYeyyNzZ— The Daily Star (@dailystarnews) October 7, 2024 క్రెడిట్స్: The Daily Star‘‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధం ఉందా? లేదా? అనే విషయం పరిశీలిస్తున్నాం’’ అని కోపెన్హాగన్ పోలీసు ఇన్స్పెక్టర్ ట్రిన్ మొల్లెర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే.. ఈ పేలుడు ఘటన తుపాకీ కాల్పుల వల్ల సంభవించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.మరోవైపు.. డెన్మార్క్‌లో ఇటీవల అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని, స్టాక్‌హోమ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో సైతం ఆ దేశ ప్రమేయం ఉందని స్వీడన్ గూఢచార సంస్థ సపో అనుమానం వ్యక్తం చేసింది.చదవండి: కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు! -
డెన్మార్క్‌లో వరుస బాంబు పేలుళ్లు
కోపెన్హాగన్:డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం(అక్టోబర్2)ఉదయం జరిగిన ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డెన్మార్క్ పోలీసులు ప్రకటించారు.పేలుళ్లపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధవాతారణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుళ్లు చోటు చేసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల దాడులు -
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్‌లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
ఒలింపిక్స్‌లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్‌తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
ఇంగ్లండ్, డెన్మార్క్ మ్యాచ్ ‘డ్రా’
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గత రన్నరప్ ఇంగ్లండ్ జట్టు ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. డెన్మార్క్‌తో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున ఆట 18వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్ చేయగా... 34వ నిమిషంలో హిజుల్మండ్ గోల్‌తో డెన్మార్క్ జట్టు స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. గ్రూప్ ‘ఎ’లో స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో... గ్రూప్ ‘సి’లో స్లొవేనియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’గా ముగిశాయి. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హాగెన్/న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్‌హాగెన్‌లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్‌కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్ పార్లమెంట్‌కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్‌పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
కాదేదీ రికార్డుకనర్హం! కనుకే అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..
'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్‌లోని ఓ వ్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.' ‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. డెన్మార్క్‌లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం. ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..! -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్‌హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్‌హేగెన్‌లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్‌ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్‌తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్‌కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్‌లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
పబ్‌లో తొలి ప్రేమ ఇపుడు డెన్మార్క్ రాణిగా..అద్భుత లవ్ స్టోరీ
డెన్మార్క్ రాణి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో కానున్న డెన్మార్క్ రాణి మేరీ డొనాల్డ్సన్ ఎవరు, ఏంటి అనేదానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎవరీ మేరీ. ఒక సాధారణ యువతి యువరాణిగా , రాచకుటుంబంలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఎలా మారింది. ఈ వివరాలు చూద్దాం. మాజీ ఆస్ట్రేలియన్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ , రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్న టాస్మానియాకు చెందిన 28 ఏళ్ల యువతితో, డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ (ఫ్రెడ్) తో పరిచయం ప్రేమ పరిచయం ఒక అద్భుత కథ. 2000, సెప్టెంబరులో ఒక పబ్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. తొలిసారి ఆయనను కలిసినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు డెన్మార్క్ యువరాజు అని తనకు తెలియదని మేరీ 2003లో ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు తాను యువరాణి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెడ్‌తో మాట కలిసింది మొదలు మాట్లాడుకుంటూనే ఉన్నామంటూ తమ ప్రేమ కథను గుర్తుచేసుకున్నారు. తన ఫోన్ నెంబరు తీసుకోవడం, కలిసిన మరునాడే కాల్ చేయడం లాంటి సంగతులను ముచ్చటించారు. అలాగే ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమ, తన సోల్‌మేట్‌ను కలిసిన అనుభూతి కలిగిందని ఫ్రెడరిక్ చెప్పడం విశేషం. ఇదీ చదవండి: హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! ప్రేమ, వివాహం తరువాత రాచరికపు మర్యాదలకు, గౌరవాలకు భంగం కలగకుండా ప్రవర్తించిందామె. డానిష్ అనర్గళంగా మాట్లాడటంతోపాటు, తన సొంత ఊరిని, భాషను, యాసను మర్చిపోలేదు.అంతేకాదు ప్రిన్సెస్ మేరీ టాస్మానియాకు అద్భుతమైన రాయబారి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమీ రాక్లిఫ్ ఇటీవల ప్రకటించడం ఇందుకు నిదర్శనం. కోపెన్‌హాగన్‌లోని ఆస్ట్రేలియన్ ప్రవాసులు తమ దేశ బిడ్డ మేరీ డెన్మార్క్ క్వీన్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో, ప్రగతి శీలంగా ఉంటూ మహిళలు, పిల్లల హక్కులు, గృహహింసకు వ్యతిరేకంగా తన భావాలను పంచుకుంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్నారు. 23 ఏళ్ల తరువాత 51 ఏళ్ల వయసులో డెన్మార్క్ తదుపరి రాణిగా అవతరించబోతున్నారు. ఈ (జనవరి 14,2024) ఆదివారం భర్త ఫ్రెడరిక్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమె రాణి హోదాను దక్కించుకోనున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి? రాణి మార్గరెట్ -2పదవీ విరమణ వయసు, అనారోగ్య కారణాలు, 2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన ఆపరేషన్ తదితర కారణాల రీత్యా దేశ సింహాసనం నుంచి తప్పుకుంటూ డెన్మార్క్ రాణి మార్గరెట్ -2 (83) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజు తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే తన వారసుడిగా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని కూడా అదే రోజు వెల్లడించారు. "నేను ఎక్కువ వెలుగులో ఉంటాను కాబట్టి, కొంతమంది నా భర్త నా ప్రభావంలో ఉన్నారని అనుకుంటారు కానీ మేము అలా కాదు. ఒకరి నీడలో మరొకరం ఉండం, నిజానికి ఆయనే నా వెలుగు’’ - ప్రిన్స్ ఫ్రెడరిక్ ( 2017) బయోగ్రఫీలో మేరీ రాశారు. ఫిబ్రవరి 5, 1972న టాస్మానియా రాజధాని హోబర్ట్‌లో జన్మించారు మేరీ. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్ , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. గుర్రపు స్వారీ, ఆటల్లో మంచి ప్రవేశం ఉంది. లా అండ్ కామర్స్ చదివి మెల్బోర్న్, సిడ్నీలో ప్రకటన రంగంలో కరియర్‌ను స్టార్ట్ చేసింది.అలా ఆస్ట్రేలియాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నప్పుడు, 2000లో వేసవి ఒలింపిక్స్‌లో సిడ్నీలోని స్లిప్ ఇన్ బార్లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు అప్పటి 34 ఏళ్ల ఫ్రెడరిక్‌ను కలుసుకుంది.ఈ జంట అధికారికంగా 2003 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారు . అలాగే మే 14, 2004న కోపెన్హాగన్ కేథడ్రల్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రిన్స్ క్రిస్టియన్( 18) ప్రిన్సెస్ ఇసాబెల్లా(16), కవల పిల్లలు ప్రిన్స్ విన్సెంట్ ప్రిన్సెస్ జోసెఫిన్ (13) ఉన్నారు. ఇదీ చదవండి: ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్ -
డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. యూరప్‌లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. డెన్మార్క్‌లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్‌గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్‌తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు. ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్ -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్‌హాగన్‌ను ప్రపంచంలోని గ్రీన్‌సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్‌గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్‌తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్‌హాగన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్‌గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్‌గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్‌లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్‌డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్‌ను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్‌టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్‌ను ఓ లుక్కేసి రండి. -
ఆ్రస్టేలియన్ ఓపెన్ బరిలో వొజ్నియాకి
ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ టెన్నిస్ స్టార్ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడింది. -
మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
యూరప్‌లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్‌లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మితవాద సంస్థ ఖురాన్‌ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్‌లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్‌ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది. ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం దీనికిముందు డెన్మార్క్‌కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్‌ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్‌లలో కూడా ఖురాన్‌ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్లో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్‌హోమ్‌లోని ప్రధాన మసీదు బయట ఖురాన్‌ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్‌లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్ -
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
ఇన్ఫోసిస్ జాక్‌పాట్! రూ. 3,722 కోట్ల భారీ డీల్ కైవసం..
ఇన్ఫోసిస్ జాక్‌పాట్ కొట్టేసింది. డెన్మార్క్ దేశానికి చెందిన డాన్స్కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్‌ను దక్కించుకుంది. ఇందు కోసం 454 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 3,722 కోట్లు) డీల్ దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా తెలిపింది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ 900 మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, మరో మూడు సంవత్సరాల వరకు పునరుద్ధరించరించే ఆస్కారం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. యూకేకి చెందిన నేషనల్ ఎంప్లాయిమెంట్ సేవింగ్స్ ట్రస్ట్ (NEST) నుంచి 1.1 బిలియన్ డాలర్ల డీల్‌ను టీసీఎస్ దక్కించుకున్న కొన్ని రోజులకే ఇన్ఫోసిస్‌కు ఇంత పెద్ద డీల్ దక్కడం గమనార్హం. తమ మెరుగైన డిజిటల్, క్లౌడ్, డేటా సామర్థ్యాలతో డాన్స్కే బ్యాంకు కోర్ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ సహకరిస్తుందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డాన్స్కే బ్యాంకుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. యాక్సెంచర్‌పై గెలిచి.. పోటీలో ఉన్న యాక్సెంచర్ కంపెనీపై గెలిచి డాన్స్కే బ్యాంకు డీల్‌ను ఇన్ఫోసిస్ సాధించింది. ఈ డీల్‌లో భాగంగా భారత్‌లోని బెంగళూరులో ఉన్న డాన్స్కే బ్యాంక్ ఐటీ కేంద్రం కూడా ఇన్ఫోసిస్ నిర్వహణలోకి రానుంది. ఈ కేంద్రంలో సుమారు 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా గత మేలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ‘బీపీ’ నుంచి 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకోవడం తెలిసిందే. 2020 సంవత్సరం చివరిలో జరిగిన డైమ్లర్ ఒప్పందం తర్వాత ఇదే అతిపెద్ద డీల్. ఇదీ చదవండి: అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు -
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
2013 అక్టోబర్ 10న డెన్మార్క్‌లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్. ‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు. ► మనుషుల్ని కలవడానికి... ‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్‌లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు. ► రోజుకు 20 డాలర్లు డెన్మార్క్‌కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్‌షిప్‌తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్‌లో, ఫేస్బుక్లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు. ► ప్రతిదీ లెక్క థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్‌టుక్‌లు (ఆటో), 37 కంటైనర్ షిప్‌లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్బోట్లు, 2 క్రూయిజ్ షిప్‌లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె. అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’. -
‘మారాజు’లు.. ప్రపంచంలో ఇంకా రాచరికమున్న దేశాలివే..
ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బ్రిటన్ దేశపు రాణి ఎలిజిబెత్–2 మరణం, ఛార్లెస్–3 పట్టాభిషేకం నేపథ్యంలో.. రాచరికానికి సంబంధించిన పలు ప్రశ్నలు సమాజంలో వస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పార్లమెంట్లకు తల్లిలాంటిది బ్రిటన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న బ్రిటన్ ప్రజలకు రాచరికం పట్ల అంతులేని ఆకర్షణ ఉందని ఇటీవల ప్రస్ఫుటమయింది. మరణించిన రాణి ఎలిజబెత్ తర్వాత రాజుగా సింహాసనం ఎక్కిన ఛార్లెస్–3 కేవలం బ్రిటన్‌కే కాకుండా, మరో 14 దేశాలకూ రాజుగా (దేశాధినేతగా) ఉన్నారనే విషయం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ రాచరికమే ఉంది. కొన్ని దేశాల్లో రాజే సర్వాధికారి. మరికొన్ని దేశాల్లో పాక్షిక అధికారాలను కలిగి ఉంటారు. బ్రిటన్ పాలించిన వలస దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారు. మొత్తం 56 కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. వీటిలో 14 దేశాలు బ్రిటన్ రాజు/రాణినే తమ దేశ రాజు/రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన దేశాల్లో 36 పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాలకు సొంత రాచరికాలు ఉన్నాయి. బ్రిటన్ రాజునే తమ రాజుగా అంగీకరిస్తున్న 14 దేశాలు 1. కెనడా, 2. ఆస్ట్రేలియా, 3. న్యూజిలాండ్, 4. యాంటిగు అండ్ బాబోడ, 5. ది బహామస్, 6. బెలీజ్, 7. గ్రెనాడ, 8. జమైకా, 9. పాపువా న్యూ గీని, 10. సెయింట్ కిట్స్ అండ్ నెవస్, 11. సెయింట్ లూసియా, 12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, 13. సోలోమన్ ఐలండ్స్, 14. తువాలు మొత్తం 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. యూకేతో కలిపి మొత్తం 15 దేశాలకు రాజుగా బ్రిటన్ రాజు వ్యవహరిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఉన్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉండటం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయాలుగా ఉన్న దేశాలూ ఉన్నాయి. యూకే, జపాన్, కెనడా, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలే ఇందుకు ఉదాహరణలు. వెనుకబడిన సమాజం ఆనవాళ్లకు రాచరిక వ్యవస్థ గుర్తుగా ఉందనే వాదన చాలా దేశాలకు వర్తించడంలేదని ఆయా దేశాలు వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరు చెబుతోంది. రాచరిక వ్యవస్థ 3 రకాలు ఆయా దేశాల సంస్కృతి, భాషను బట్టి రాచరికంలో దేశాధినేతను రాజు, రాణి, అమీర్, సుల్తాన్ వంటి హోదాలతో వ్యవహరిస్తున్నారు. రాచరిక స్వభావం, వాటికున్న అధికారాలను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. రాజ్యాంగపరమైన రాచరికం కేవలం రాజ్యాంగ విధులు (సెరిమోనియల్ డ్యూటీస్) నిర్వర్తించడానికి మాత్రమే రాచరికం పరిమితమవుతుంది. రాజకీయ అధికారాలు ఏమీ ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి రాచరికం బ్రిటన్ (యూకే), జపాన్, డెన్మార్క్ దేశాల్లో ఉంది. పూర్తి రాచరికం దేశంలో రాజుదే పూర్తి అధికారం. చట్టాలను రూపొందించే, సవరించే, తిరస్కరించే అధికారం రాజు/రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాలను కూడా రాజే పర్యవేక్షిస్తారు. రాజకీయ నేతలను నామినేట్ చేస్తారు. సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటినీ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి. మిశ్రమ రాచరికం కొన్ని అంశాల్లో సంపూర్ణ అధికారాలను వినియోగించుకుంటూనే, కొన్ని అంశాల్లో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబితాలో జోర్డాన్, మొరాకో, లిక్టన్స్టైన్ తదితర దేశాలు ఉన్నాయి. - (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం -
Davis Cup 2023: తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
FIFA WC: ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి!
FIFA world Cup Qatar 2022: గత ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన అమెరికా జట్టు ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటి నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా ఇరాన్‌తో జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో అమెరికా 1–0తో గెలిచింది. ఆట 38వ నిమిషంలో క్రిస్టియన్ పులిసిక్ గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. 11వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న అమెరికా ఆరోసారి గ్రూప్ దశను అధిగమించింది. ప్రి క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో అమెరికా తలపడుతుంది. ఆస్ట్రేలియా 2006 తర్వాత... గత మూడు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ఆస్ట్రేలియా ఈసారి నాకౌట్ బెర్త్‌ను సంపాదించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1–0 గోల్‌తో డెన్మార్క్ జట్టును ఓడించింది. ఆట 60వ నిమిషంలో మాథ్యూ లెకీ ఆసీస్ జట్టుకు గోల్ అందించాడు. ఫిఫా వరల్డ్‌కప్-2022లో ఆస్ట్రేలియాకిది రెండో విజయం. దాంతో 2006 తర్వాత ఆస్ట్రేలియా ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. రెండు విజయాలతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచినా మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఫ్రాన్స్ జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాకు రెండో స్థానం ఖరారైంది. చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్‌ను గోల్‌పోస్ట్‌లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్మన్ క్రాస్ షాట్‌ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు. ప్రపంచకప్‌లో నేడు జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA WC: డెన్మార్క్‌కు చెక్ పెట్టిన ట్యునీషియా.. మెక్సికో- పోలాండ్ మ్యాచ్ కూడా
FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్‌లాంటి గొప్ప ఈవెంట్లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్ డెన్మార్క్జట్టును నిలువరించింది. రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్‌పోస్ట్ లక్ష్యంగా డెన్మార్క్ జట్టు ఐదుసార్లు షాట్లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయలేకపోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మరో ‘డ్రా’ దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. మెక్సికో జట్టు పోలాండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్ స్టార్ ప్లేయర్ లెవన్డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. వేల్స్‌ను గట్టెక్కించిన బేల్ 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను వేల్స్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 82వ నిమిషంలో వేల్స్ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్ బేల్ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి చేసిన గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్ దక్కింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో -
‘ఫ్రెంచ్ కిక్’ అదిరేనా!
తొమ్మిది దశాబ్దాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు టైటిల్ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్ వరుసగా 1958, 1962 ప్రపంచకప్‌లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన యూరోప్ జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశ దాటడంలో విఫలమవుతోంది. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్ జట్టు ఖతర్‌లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ఫ్రాన్స్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 4. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’ విన్నర్. ప్రపంచకప్‌లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్ లీగ్ టైటిల్‌ను సాధించి ‘ది బ్లూస్’ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్‌నకు దూరమైన 34 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ కరీమ్ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్ ప్రొఫెషనల్ లీగ్స్ చాంపియన్స్ లీగ్, లా లీగాలో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు టైటిల్ దక్కడంలో కరీమ్ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్ బెంజెమాతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు కిలియాన్ ఎంబాపె, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్ జట్టు ఈసారీ ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్ దశలో ఒక్క డెన్మార్క్ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్‌కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్ దశ దాటి నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత పొందాకే ఫ్రాన్స్ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. డెన్మార్క్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్స్ (1998). ‘ఫిఫా’ ర్యాంక్: 10. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎఫ్’ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న డెన్మార్క్ క్వాలిఫయింగ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్‌లో ఓడింది. 30 గోల్స్ సాధించి, కేవలం మూడు గోల్స్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్‌లో ఫ్రాన్స్ జట్టుతో మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్‌లలో డెన్మార్క్ గ్రూప్ దశను దాటి నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2006). ‘ఫిఫా’ ర్యాంక్: 38. అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్ జట్ల మ్యాచ్‌ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్ లీగ్స్‌లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్ అజ్దిన్ రుస్టిక్పై ఆసీస్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆసీస్ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే. ట్యునీషియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 30. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు గోల్స్ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్ మసాక్ని, నయీమ్ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్‌లతో జరిగే మ్యాచ్‌లే ఈ మెగా ఈవెంట్లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. –సాక్షి క్రీడా విభాగం -
ఆర్టిఫీయల్ ఇంటెలిజన్స్‌తో నడుస్తున్న రాజకీయ పార్టీ..ఎక్కడో తెలుసా?
రాజకీయ పార్టీ అన్నాక దానికో అధినేత ఉండాలి, కార్యకర్తలూ ఉండాలి. పార్టీకో సిద్ధాంతం, మేనిఫెస్టో వంటివి ఉండాలి. ఓటర్లను ఆకర్షించడం ఆషామాషీ పని కాదు. కాకలు తీరిన నేతలే ఒక్కోసారి బోల్తా పడతారు. అలాంటి అధినేతతో పనిలేని ఒక వింత రాజకీయ పార్టీ ఇటీవల డెన్మార్క్‌లో ప్రారంభమైంది. కృత్రిమ మేధ సూచనలతో పనిచేసే ఈ రాజకీయ పార్టీకి ‘డేనిష్ సింథటిక్ పార్టీ’ అని నామకరణం చేశారు. ‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘కంప్యూటర్ లార్స్’ ద్వారా సృష్టించిన కృత్రిమ మేధతో ఈ ఏడాది మే నెలలో కొత్త రాజకీయ పార్టీని– అదే డేనిష్ సింథటిక్ పార్టీని ప్రకటించింది. ఈ ఏడాది జరగనున్న డెన్మార్క్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కృత్రిమ పార్టీ పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. డెన్మార్క్ ఎన్నికల్లో 1970ల నాటి నుంచి పోటీ చేస్తున్నా, ఇంతవరకు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన చిల్లర రాజకీయ పార్టీల సిద్ధాంతాలన్నింటినీ వడగట్టి, ప్రోగ్రామ్ చేయడం ద్వారా ‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ ఈ కొత్త కృత్రిమ పార్టీకి రూపునిచ్చింది. ఎన్నికల్లో ఏనాడూ ఓటు వేయని 20 శాతం డెన్మార్క్ ఓటర్లకు ప్రత్యామ్నాయంగా ఉద్భవించడమే కాకుండా, పార్లమెంటులో కృత్రిమ మేధకు ప్రాతినిధ్యాన్ని దక్కించుకోవాలని ఈ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. -
ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు. అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్‌ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు. డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ये वीडियो देखिए… अमीर देशों में शिक्षा फ्री है। मुझे बहुत दुःख होता है कि हमारे देश में फ्री शिक्षा को ये नेता फ्री की रेवड़ी कहते हैं ये देश अमीर इसलिए बने क्योंकि ये फ्री शिक्षा देते हैं। अगर हर भारतीय को अमीर बनाना है तो भारत के हर बच्चे को अच्छी शिक्षा फ्री देनी ही होगी। pic.twitter.com/iAincN3phy — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2022 ఇటీవల మధ్యప్రదేశ్‌లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?