devineni nehru
-
దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు..
-
త్వరలో ‘దేవినేని’ మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'.. 'బెజవాడ సింహం' ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనందున డీటీఎస్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.... ఈ చిత్రంలో నటించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారన్నారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నారన్నారు. ఇక దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడని పేర్కొన్నాడు. (చదవండి: అందుకే నటించేందుకు ఒప్పుకున్నా) సురేష్ కొండేటి-వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడని, అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగిలిన పలు పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని, నేడు డిటీఎస్ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రంలో మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారని తెలిపారు. అయితే దేవినేని సినిమా బెజవాడలో ఇద్దరు మహనాయకుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ నాయకుల మధ్య స్నేహం, వైరంలో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించాడు. ఇక బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. అలాగే 1983లో విజయవాడకు మొదటి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా వెళ్లిన కేఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివ నాగు, నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి, కో.డైరెక్టర్: శివుడు వ్యవహరిస్తున్నారు. -
అందుకే నటించేందుకు ఒప్పుకున్నా
కోటి.. పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ తన చేతులతో స్వరాలు సమకూర్చిన ఆయన తొలిసారి లాఠీ పట్టి పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు. దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్న ‘దేవినేని’ సినిమాలో కోటి పవర్ ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు. 1983 విజయవాడ తొలి పవర్ఫుల్ ఎస్పీ కెఎస్ వ్యాస్‌గారి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 సంవత్సరాలు రాణించాను. శివనాగు వచ్చి ఎస్పీ పాత్ర చేయాలి అనగానే, ‘మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి’ అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. కెఎస్ వ్యాస్‌గారి పాత్ర చేయడం అరుదైన సంఘటన. నా పాత్రని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. . ‘‘1977లో దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ నుంచి మా సినిమా ప్రారంభం అవుతుంది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల షూటింగ్ జరుపుతున్నాం’’ అన్నారు రాము రాథోడ్. -
30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా
నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ నటి జమున కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. జమున మాట్లాడుతూ– ‘‘నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఇది కాకుండా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. శివనాగు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయాలనుకునే ముందు విజయవాడ మొత్తం తిరిగి వివరాలు తెలుసుకున్నాను. 1977లోని కథ ఇది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి, పెదనాన్నలాంటివారు నెహ్రూగారు. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు తారకరత్న. ‘‘దేవినేని చిత్రాన్ని నిర్మిస్తుండటం నా అదృష్టం’’ అన్నారు రాము రాథోడ్. -
ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన
విజయవాడ: విజయవాడ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.220 కోట్ల వ్యయంతో రమేష్ ఆస్పత్రి నుంచి స్కూబ్రిడ్జి వరకు రూ.1.47 కి.మీ. మేర ఆరు వరుసల్లో నిర్మించనున్నట్లు మంత్రి దేవినేని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్ చింతలు తీరతాయని, వారి చిరకాల వాంఛ తీరుబోతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4వేల కోట్లతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వంతెన అమరావతి నగరానికి గేట్ వేగా మారుతుందని ఎమ్మెల్యే గద్దె పేర్కొన్నారు. -
దేవినేని నెహ్రూ అంత్యక్రియలు పూర్తి
-
దేవినేని నెహ్రూ అంత్యక్రియలు పూర్తి
విజయవాడ: అధికార లాంఛనాలతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. గుణదలలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకు ముందు దేవినేని నివాసం నుంచి అంతియ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా దేవినేని నెహ్రు గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
నేడు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ సీని యర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)(62) సోమవారం ఉదయం 5.20 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనా రోగ్యంతో ఉన్న ఆయన కేర్ ఆస్పత్రిలో చికిత్స పొంది, రెండు రోజుల క్రితం డిశ్చార్జయి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. దేవినేనికి భార్య లక్ష్మి, కుమారుడు అవి నాష్, కుమార్తె ఉన్నారు. దేవినేని భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం విజయవాడ గుణదలలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. ఆయన అంత్యక్రియలు గుణదలలోని వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తారు. రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నేతగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన దేవినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లాలో కీలక రాజకీయ నేతగా గుర్తింపుపొందారు. దేవినేని విజయవాడలో 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్‌వో)ను స్థాపించారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. టీడీపీ తరçఫున 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ఎన్టీరామారావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 1995లో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి దింపేందుకు చంద్రబాబు చేసిన వైస్రాయ్ కుట్ర సమయంలో నెహ్రూ ఎన్టీరామారావు వెంట నిలిచారు. ఎన్టీఆర్ మరణానంతరం 1996లో లక్ష్మీపార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరఫున విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1999లో కంకిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచే కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లో విజ యవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కుమారుడు అవి నాష్ కూడా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో టీడీపీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి: ఏపీ సీఎం బాబు ఎన్టీఆర్‌కు నెహ్రూ అత్యంత సన్నిహితులని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. త్వరలోనే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేయాలని దేవినేని భావించారని.. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. దేవినేనికి దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తన రాజకీయ జీవితానికి ఇద్దర్నీ రెండు కళ్లుగా భావించేవారు. తనకు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించారని, వైఎస్ వ్యక్తిత్వం చూసి ఆయనకు ఆకర్షితుడ్ని అయ్యానని పలుమార్లు బహిరంగంగానే చెప్పేవారు. కాంగ్రెస్ పార్టీ వీడి రెండవసారి టీడీపీలో చేరేవరకు వైఎస్సార్ జిల్లాకు చేసిన సేవల్ని కొనియాడేవారు. బాబును, తెలుగుదేశంపార్టీ నేతల్ని ఘాటుగా విమర్శించేందుకు వెనుకాడేవారు కాదు. ఆయన పట్టిసీమను వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని స్వాగతించారు. కృష్ణాడెల్టా రైతు ఉద్యమాల్లో ముందుండేవారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం పనిచేయడం నెహ్రూ స్వభావం. ఆయన టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా ఎక్కువ కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1982 నుంచి 1996వరకు 14ఏళ్లు టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీలో కొనసాగారు. 1996 నుంచి 2016 వరకు 20 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. -
దేవినేని నెహ్రూకి చంద్రబాబు నివాళి
-
దేవినేని నెహ్రూకి లోకేష్ నివాళి
విజయవాడ : గుణదలలో దేవినేని నెహ్రు పార్థీవ దేహానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ నివాళులర్పించారు. అనంతరం నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనకంటూ మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి నెహ్రు అని కొనియాడారు. మంత్రిగా, ఎమ్మెల్యే గా నిరంతరం ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయనని, 45 రోజులుగా నాకు రాజకీయాల గురించి అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. సిద్దాంతాలను నమ్ముకున్న వ్యక్తి నెహ్రూ అని, ఆయన కుటుంబాన్ని, కార్యకర్తలను టీడీపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ.. బెజవాడ రాజకీయాలలో నెహ్రూ మరపురానీ వ్యక్తి అని, ఈ రోజు మన నుంచి దూరం అవ్వడం నిజంగా శోచనీయమన్నారు. నిత్యం ప్రజలో ఉండే వ్యక్తి నెహ్రూ..తన అనుకున్న వారి కోసం దేనికీ వెనుకాడబోని నాయకుని కోల్పోయామని చెప్పారు. -
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూత
-
అవినాష్‌కు ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : మాజీమంత్రి దేవినేని నెహ్రూ మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌తో ఆయన సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా దేవినేని నెహ్రూ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో జరగనున్నాయి. -
ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్ బాబు
హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్ కూడా నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. Devineni Nehru Garu 's sad demise is an irreparable loss to the politics. I will miss him! My most sincere condolences to the family. — Manoj Manchu ❤️ -
దేవినేని నెహ్రూ కన్నుమూత
-
‘వంగవీటి’ సినిమాపై రాజీపడం
- వంగవీటి రాధాకృష్ణ స్పష్టీకరణ - రాధాకృష్ణ, రత్నకుమారితో రామ్‌గోపాల్‌వర్మ చర్చలు - దేవినేని నెహ్రూతోనూ వర్మ భేటీ విజయవాడ: ‘వంగవీటి’ సినిమాపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కట్టుబడి ఉన్నామని, అందులో రాజీపడే ప్రసక్తి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రరుుంచిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌గోపా ల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ శనివారం విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. వివాద పరిష్కారంపై దాదాపు గంట పాటు జరిపిన ఈ సంప్రదింపుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కూడా పాల్గొన్నా రు. చర్చల సారాంశం మాత్రం స్పష్టం కాలేదు. అనంతరం వంగవీటి రాధాకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ, ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ‘వంగవీటి’ సినిమాపై తమ అభ్యంతరాలపై రాజీ పడేది లేదని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. కోర్టు నిర్ణయానికే కట్టుబడి ఉంటా.. వంగవీటి మోహన్‌రంగా కుటుంబసభ్యులతో తాము జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. సినిమా విషయంలో కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. రాధాకృష్ణ, రత్నకుమారితో చర్చల అనంతరం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ గుణదలలోని దేవినేని రాజశేఖర్ ( నెహ్రూ) నివాసానికి వెళ్లారు. వంగవీటి సినిమా ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాటాడుతూ ఆ సినిమాలో తనను విలన్‌గా చూపించినా వద్దనే హక్కు తనకు లేదన్నారు. -
సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు లేరు: వర్మ
ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన అనంతరం మధ్యాహ్నం దేవినేని నెహ్రుతో చర్చలు జరిపారు. నెహ్రుతో సమావేశం తరువాత మీడియా ముందుకు వచ్చిన వర్మ... వంగవీటి రాధతో జరిగిన చర్చలపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే రాధ ‘వంగవీటి’ సినిమా విడుదలపై అభ్యంతరాలు తెలిపారని, ఓ ఫిలిం మేకర్‌గా తనకు స్వేచ్ఛ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వంగవీటి రంగ మరణించిన రోజుకు కేవలం మూడు రోజుల ముందే సినిమా రిలీజ్ నిర్ణయం కేవలం యాధృచ్చికమే అన్నారు. వంగవీటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న వర్మ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమాపై తన ఆలోచనను మార్చుకోనన్నారు. కేవలం సినిమాలో సన్నివేశాల కారణంగా వివాదాలు పెంచుకునేంత మూర్ఖులెవరు లేరని ఆయన అన్నారు. (చదవండి....నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ) ఈ సమావేశంపై మీడియాతో మాట్లాడిన దేవినేని నెహ్రు... వర్మ తనకు కేవలం ఒకటిన్నర నిమిషం ట్రైలర్ మాత్రమే చూపించారని, మురళి, నెహ్రుల లుక్ ఎలా ఉందన్న విషయం మాత్రమే తాను అడిగారని తెలిపారు. అలాగే ఫిలిం మేకర్స్‌కు ఏదైనా తీసే హక్కు ఉందన్న నెహ్రు, వర్మ సినిమా ఎలా తీసినా ఎవరు చేయగలిగేది ఏం లేదన్నారు. గతంలో వర్మను కలిసినపుడు కమ్మ కాపు పాట తీసేయటం మంచిదని చెప్పానన్నారు. వంగవీటి సినిమా తరువాత విజయవాడలో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి లేదని, ప్రస్తుతం సినిమాలు చూసి కొట్టుకు చచ్చే పరిస్థితిలో సమాజం లేదన్నారు. -
సినిమాలు చూసి కొట్టు కునేంత మూర్ఖులు లేరు
-
ఏ ఎమ్మెల్యేతోనూ వర్గ పోరు లేదు
దేవినేని నెహ్రూ విజయవాడ (గుణదల) : తనకు జిల్లాలోని ఏ ఎమ్మెల్యేతోనూ వర్గపోరు లేదని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. తాను టీడీపీలో చేరిన15 రోజుల్లోనే వర్గపోరు అనడం సరికాదని పేర్కొన్నారు. ‘నేనంటే నేను’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై నెహ్రూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పార్టీ నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. అరాజకీయమైన రాజకీయ శక్తులన్నీ వైఎస్సార్ సీపీలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పత్రికలు, మీడియాతో విరోధం పెట్టుకోలేదని చెప్పారు. అయినా తనపై నిందారోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో తాను ఎన్నడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. -
నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు
-
‘నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు’
విజయవాడ : తనను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారని, వారిని న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. తనను ఎలా ఉపయోగించుకుంటారనేది అధినేత ఇష్టమన్నారు. తాను టీడీపీలో చేరినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై తనకేమీ సంబంధం లేదన్నారు. తాను టీడీపీలో చేరడం వారికి మింగుడు పడకపోతే...వాళ్ల గొంతులో నీళ్లు పోసి చంద్రబాబే మింగుడు పడేలా చేస్తారని దేవినేని నెహ్రూ వ్యాఖ్యలు చేశారు. తన రాకను జీర్ణించుకోలేనివారి సంగతి చంద్రబాబే చూసుకుంటారన్నారు. కాగా దేవినేని నెహ్రూతో పాటు ఆయన కుమారుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో ఇక కౌలుదారులు, అద్దెదారులు లేరు
ఏపీసీసీ రాఘువీరారెడ్డి దేవినేని నెహ్రూకు పశ్చాత్తాపం తప్పదని ఎద్దేవా విజయవాడ సెంట్రల్ : టీడీపీలోకి వెళ్లినందుకు దేవినేని నెహ్రూ పశ్చాత్తాపపడటం ఖాయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రరత్న భవన్‌లోజిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో ఇక కౌలుదారులు, అద్దెదారులు లేరు. ఉన్నవాళ్లంతా సొంతవాళ్లేనని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్‌పార్టీని వీడకముందు దేవినేని నెహ్రూ తనను కలిసి 2018 వరకు పార్టీని వీడనని చెప్పారన్నారు. పార్టీని వీడిన తరువాత కాంగ్రెస్ అద్దె ఇల్లు అని మాట్లాడటం బాధ కలిగించిందన్నారు. నెహ్రూ కౌలుదారుడని తాను గుర్తించలేకపోయామని కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయండి నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్‌కు నియామకపత్రాన్ని అందించారు. కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి మస్తాన్‌వలీ, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి , ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎన్.ఎస్.రాజా, టీజేఆర్ సుధాకర్ బాబు, గొడుగు రుద్రరాజు, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్‌రతన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘దేవినేని’చిచ్చు!
► చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఏమీటీ? విజయవాడ : మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) మంగళవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన నెహ్రూ తన కుమారుడు దేవినేని అవినాష్ భవిష్యత్తు కోసం తాను సుదీర్ఘకాలంపాటు వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీలోనే చేరారు. పార్టీ నుంచి ఏమీ ఆశించకుండానే చేరుతున్నానని దేవినేని నెహ్రూ చెబుతున్పప్పటికీ ఆయన కుమారుడు విషయంలో ఏదో స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది. అవినాష్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లనే పార్టీలో చేరారని చెబుతున్నారు. ఎన్టీఆర్ మరణంతో పార్టీకి దూరం.... ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పుడు కృష్ణాజిల్లా నుంచి చేరిన తొలి నేతల్లో దేవినేని నెహ్రూ ఒకరు. ఎన్టీఆర్ బతికున్నంత వరకు ఆయన్ను వెన్నంటి ఉన్నారు. ఆయన మరణానంతరం లక్ష్మీపార్వతి వెంట ఎన్టీఆర్ తెలుగుదేశంలో చేరారు. ఆ పార్టీ కనుమరుగు కావడంతో లక్ష్మీపార్వతి అనుచరులు టీడీపీలోకి వెళ్లినా చంద్రబాబు వ్యవహారశైలి నచ్చక నెహ్రూ కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శలు చేసిన దేవినేని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. టీడీపీ నేతలతో విభేదాలు.. దేవినేని నెహ్రూకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో విభేదాలు ఉన్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు దేవినేని నెహ్రూ వర్గానికి ఇసుక వార్ జరగుతోంది. బోడే ప్రసాద్ నియోజకవర్గంలో ఇసుక దందా చేస్తుంటే.. ఆయనకు ధీటుగా నెహ్రూ వర్గం కూడా ఇసుక రవాణాకు సిద్ధమౌతోంది. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు దేవినేని నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, దేవినేని నెహ్రూల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం గతంలో సాగింది. ఇక జిల్లా మంత్రి దేవినేని ఉమాను ఆంధ్రరత్నభవన్ వేదికగా నెహ్రూ పలుమారు విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరి పదవికి ఎసరు!? దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) టీడీపీలో చేరడం ఆ పార్టీలో పెద్ద చర్చనీయాశంగా మారింది. నియోజకవర్గాల పునః విభజన జరిగే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరు తమ సీటు కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు నియోకవర్గంలో ఎక్కువ భాగం పెనమలూరులో ఉంది. అందువల్ల ఆయన ఆ సీటు కోరవచ్చు. లేదా ఆయన ఇల్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్నందున విజయవాడ తూర్పు ఇవ్వమని డిమాండ్ చేయవచ్చు. గన్నవరం సీటు కోరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. నూజీవీడు సీటు నెహ్రూ తనయుడుకు పార్టీ కేటాయించే అవకాశాలు లేకపోలేదు. ఒకే గూటిలో దేవినేని కుటుంబం దేవినేని నెహ్రూ టీడీపీలో చేరడం వెనుక మంత్రి దేవినేని ఉమా హస్తం ఉందని టీడీపీలో ఆయన వ్యతిరేక వర్గం బాగా నమ్ముతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ను పార్టీలోకి తీసుకువస్తే జిల్లాలో తమ పట్టుమరింత పెంచుకోవచ్చని మంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇదే కుటుంబానికి చెందిన మరోక యువ నాయకుడు తెలుగుయువతలో పనిచేస్తున్నారు. దేవినేని కుటుంబమంతా టీడీపీ గూటిలోనే ఉన్నట్లయింది. -
సొంత గూటికి దేవినేని నెహ్రూ
-
దేవినేని బాజీ కన్నుమూత
విజయవాడ : టీడీపీ నాయకుడు దేవినేని బాజీ గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో మృతి చెందారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేవినేని నెహ్రుకు బాజీ స్వయానా సోదరుడు. -
అది ముగిసిన చరిత్ర..: వర్మతో నెహ్రూ
విజయవాడ (గుణదల): ‘బెజవాడ ఇప్పుడు పవిత్రంగా ఉంది.. 30 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలపై ఇప్పు డు సినిమా తీసి నగరంలో కల్మషాలు సృష్టించవద్దని’ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) హితవు పలికారు. ‘వంగవీటి’ సినిమా నిర్మాణంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన రాంగోపాల్‌వర్మ శనివారం గుణదలలో నెహ్రూను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. సినిమా అనేది వ్యాపారం.. ఎవరు ఎలాంటి అంశాన్ని అయినా ఎంచుకుని సినిమా తీయవచ్చన్నారు. రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు అప్పుడున్న పరిస్థితుల్లో కుల రాజకీయాలకు దారితీశాయని తెలిపారు. ముగిసిపోయిన ఆ చరిత్రను కొత్తగా పరిచయం చేయడం వల్ల ప్రయోజనం లేదని వివరించారు. బెజవాడ కమ్యూనిస్టులకు కంచుకోట.. సినిమా పరిశ్రమకు వెన్నెముక లాంటిదని.. పత్రికారంగానికి తలమానికమైనదని చెప్పారు. నగరంలో చోటుచేసుకున్న కొన్ని ఘర్షణలు.. వివాదాలు తెరకెక్కించడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు.