E. S. L. Narasimhan
-
నా పేరు నరసింహన్
సాక్షి, హైదరాబాద్: ‘‘నా పేరు నరసింహన్. పేరుకు తగ్గట్టు పనిచేయాలి. లేకుంటే సార్థక నామధేయుడు అనరు. అందుకే అప్పుడప్పుడు నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది’’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చమత్కరించారు. గవర్నర్‌గా తొమ్మిదిన్నరేళ్లపాటు సేవలందించిన ఆయనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతి భవన్లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘కేసీఆర్ తెచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు, కేసీఆర్ కిట్స్ లాంటి పథకాల్లో మానవత్వం ఉంది. నీటిపారుదలశాఖ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్ విజన్ కనిపించింది. తెలంగాణలో శాంతిభద్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది. ప్రతి స్కీం గురించి నాకు చెప్పేవారు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించేవారు. డబ్బుందా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రానికి ఢోకా లేదని, ధనిక రాష్ట్రమని ధైర్యంగా ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేవి. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి స్క్రీన్‌పై పథకాల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధానికి కూడా చెప్పాను. కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే మంచి పథకాలు తేగలిగారు. ఆయనతో కలసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇద్దరం గంటల తరబడి చర్చలు చేసేవాళ్లం. మా మధ్య వాడీవేడి చర్చలు జరిగేవి. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. నేను ఎక్కడున్నా సరే... తెలంగాణ ఫలానా రంగంలో నంబర్ వన్‌గా నిలిచింది, ఫలానా విషయంలో టాప్‌గా ఉంది అనే వార్తలు చదివి సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్‌గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దీన్నెవరూ మార్చలేరు’’అని నరసింహన్ పేర్కొన్నారు. తమ్ముడిలా ఆదరించారు: కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి, స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో తనకు గొప్ప జ్ఞాపకాలున్నాయన్నారు. ప్రసంగం మధ్యలో చాలాసార్లు కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్‌గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండటానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం ఉండటంతో నరసింహన్... ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశా. ఆయనతో ఎంతో అనుబం ధం ఉంది. నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వ పథకాల మంచిచెడులను చర్చించేవారు. బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారు. ప్రతి పనీ విజయవంతం కావాలని తపన పడేవారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వివరించేవారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారు’’అని సీఎం పేర్కొన్నారు. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా విందు భోజనం... వీడ్కోలు సభ అనంతరం గవర్నర్ దంపతుల గౌరవార్థం సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. గవర్నర్ గౌరవార్థం పూర్తి శాకాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నాం అని అంతకుముందు సభలోనే సీఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్ దంపతులను కారు దాకా వెళ్లి కేసీఆర్ దంప తులు సాగనంపారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులకు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బేగం పేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ దంపతులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తోడ్కొని వెళ్లారు. అంతకు ముందు నరసింహన్ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. కల్వకుంట్ల... కలవకుంట గవర్నర్ చమత్కారం ‘‘చాలా మంది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురించి మాట్లాడతారు. వారంతా కలవకుంట మాట్లాడతారు. నేను కలసి మాట్లాడుతున్నాను’’అని నరసింహన్ చమత్కరించారు. ‘‘పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌లో నాకు కనిపించాయి. నమస్కారం చెబితే పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్ నా దగ్గరకు వచ్చి అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. అస్థికలు కలపడానికి హెలికాప్టర్లో పంపారు. ఇక్కడకు వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. ’’అని గవర్నర్ చెప్పారు. యాదాద్రికి నరసింహన్ మళ్లీ రావాలి... ‘‘యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతంగా కొనసాగుతున్నది. నరసింహన్ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండి పోతాయి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నరసింహన్‌కు ఇచ్చినట్లే కొత్త గవర్నర్‌కూ అదే గౌరవం ఇస్తామని, రాజ్ భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడుతామన్నారు. -
13న తిరుమలకు రాష్ట్రపతి రాక
సాక్షి, తిరుమల : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటన ఖరారైంది. శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఆ రోజు తిరుమలలో బస చేసి.. 14న ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నట్లు సమాచారం. -
ఇంటింటికి నవరత్నాలు: గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి : నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కొత్తగా కొలువుతీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సవాళ్లు అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయని, మానవ, భౌతిక వనరుల దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అసెంబ్లీ సమావేశాలు జూన్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనుండగా.. తొలి రోజు శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించగా.. రెండో రోజు స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూడో రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆహమ్మద్ మహమ్మద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: ఫిరాయింపులను ప్రోత్సహించం) గవర్నర్ ప్రసంగం హైలైట్స్.. 1. కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 2. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలి. 3. కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి. 4. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తాం. 5. టెండర్లపై జ్యూడీషియల్ కమిషన్ వేస్తాం.. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానం తెస్తాం. 6. ప్రజా సేవకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 7. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుతాం. 8. విభజన హామీలను నెరవేర్చడం మా ప్రభుత్వ లక్ష్యం 9. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తాం. 10. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం. గ్రామ వాలంటీర్లను ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. 11. నవరత్నాలే మా ప్రభుత్వ ప్రాధాన్యత. నవరత్నాలను ప్రతి ఇంటికీ చేరుస్తాం. 12. రైతుల సంక్షేమమే మా లక్ష్యం. రైతు భరోసా కింద రూ.12,500 అందజేస్తాం. అక్టోబర్ నుంచి రైతు భరోసా అమలు. రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయిస్తాం. వైఎస్సార్ బీమా కింద రూ.7 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని, పాడి పరిశ్రమ రంగాలను బలోపేతం చేస్తాం. 13. జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కాలపరిమితిలో పూర్తి చేస్తాం. కిడ్నీ, తలసేమియ రోగులకు రూ. 10 వేల పెన్షన్ అందజేస్తాం. 14. మద్యపానాన్ని దశలవారిగా నిషేధిస్తాం. 15. అమ్మఒడి కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తాం. 16. నామినేటెడ్ పనులను బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కేటాయిస్తాం. 17. కాపుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. 18. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 19. పెన్షనర్ల వయస్సును 65 నుంచి 60 కుదిస్తున్నాం. 20. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు కేటాయిస్తాం. 21. ప్రత్యేకహోదా కోసం మా పోరాటం కొనసాగిస్తాం. 22. సీపీఎస్ రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేశాం. 23. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ అందజేస్తాం. 24. సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి పేద విద్యార్థి మొత్తం ఫీజును మేమే భరిస్తాం. 25. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా విద్యార్థి బోర్డింగ్ వసతి కోసం ఏడాదికి రూ. 20 వేలు సమకూరుస్తాం. 26. వైఎస్సార్ చేయుత ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తాం. 27. గిరిజిన సంక్షేమశాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచాం. 28. అంగన్వాడి, హోంగార్డుల జీతాలను పెంచుతాం. 29. సుపరిపాలన అందించడానికి యాత్ర ఇప్పుడే మొదలైందని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. -
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్లు, నాయకుల బృందం రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది. దీంతో పాటు టీడీపీ హత్యా రాజకీయాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్ల జెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. చదవండి: వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రే! చిన్నాన్న తలపై ఐదుసార్లు గొడ్డలితో నరికారు.. -
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు
-
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. డేటా చోరీపై చంద్రబాబు చేసిన పనిని గవర్నర్‌కు వివరించారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం డేటా చోరీ.. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. సేవా మిత్ర టీడీపీకి సంబంధించిన యాప్. ఆ యాప్‌ను తయారు చేసింది ఐటీ గ్రిడ్స్ కంపెనీ. ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా?. కలర్ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్లలో ఎలా కనబడతోంది. ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక్తిగత వివరాలు ప్రయివేట్ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారు. రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారు. మేం ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్ కంపెనీలో డేటా దొరకడం సబబేనా?. ఇది నేరం కాదా?. ఓటర్ల డేటా, కలర్ ఫోటోలతో మాస్టర్ కాపీ ఎలా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్స్‌లో కనబడుతుంది. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధఙలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. వ్యక్తుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, కలర్ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా?. ఇలాంటి సైబర్ క్రైం రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా జరిగి ఉండదేమో. ఐటి గ్రిడ్స్ అనే కంపెనిపై దాడులు జరిగినపుడు అనేక వివరాలు బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐటీ గ్రిడ్స్ అనే సంస్ధ. ఈ యాప్ వద్ద ఉండకూడని డేటా ఉంది. ప్రైవేటు వ్యక్తులు సంస్థల వద్ద ఉండకూడని సమాచారం ఏ రకంగా కనబడతున్నాయి. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెని కంప్యూటర్లలో దొరకడం సబబేనా?. ఇది క్రైమ్ కాదా?. ఆధార్ వివరాలు కాకుండా ఓటర్ ఐడీ, డేటా విత్ కలర్ ఫోటోస్...మాస్టర్ కాపీ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు. ఏ రకంగా అది ఐటి గ్రిడ్స్ కంపెనీలో కనబడుతోంది. టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఏ రకంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా వారి వద్ద లభించాయి. ఇవి ఏరకంగా ప్రత్యక్షం అవుతున్నాయి. సేవామిత్రాలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి?. గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేయించారు. అవన్నీ కూడా సేవా మిత్రలో అనుసంధానం చేశారు. ఈ డేటాను టీడీపీ నేతలకు పంపారు. ఆ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారు. ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారు. వారికి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో మేం కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. మా స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయి. జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చాం. దానిలో భాగంగా ఫారం-7 పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించమని విచారణ చేసి ఆ నిర్ణయం తీసుకోమన్నాం. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాల్సిన వారు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేటు సంస్దల వద్ద ఆధార్, కలర్ ఓటర్ జాబితాలు, బ్యాంక్ అకౌంట్లు ఉండటం నేరం. ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఓటర్లను తొలగించడం, అక్రమంగా నకిలీ ఓట్లు నమోదు చేయించడం నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం దారుణం. ఈ విషయాలు అన్నీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా చేసింది జైలుకు వెళ్లాల్సిన నేరాలు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫారం 7 దరఖాస్తు చేయడం తప్పన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఐటి గ్రిడ్స్ చేయకూడని పనులు హైదరాబాద్‌లో చేస్తుంటే ఇక్కడే కేసు పెడతారు కదా. ఇదేదో ఆంధ్రాకు, తెలంగాణా రాష్ట్రాల మధ్య గొడవన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని అన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారధి, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని తదితరులు ఉన్నారు. -
గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సర్కార్ చేస్తున్న అరాచకాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. -
యాదగిరీశుడి సన్నిధిలో గవర్నర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సమేతంగా ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు చతుర్వేదాలు పఠిస్తూ 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు. రాష్ట్ర, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. ఈసారి నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. యాదగిరికొండ (ఆలేరు) : రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గర్భాలయ ద్వారం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామిఅమ్మవార్లకు సతీసమేతంగా సువర్ణ పుష్పార్చనగావించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు చతుర్వేదాల పఠనంతో సుమారు 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు. గవర్నర్ పర్యటన సాగిందిలా.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి ఆయన సాయంకాలం 5ః50 నిమిషాలకు వచ్చారు.అక్కడి నుంచి 5ః53 గంటలకు ఆయన గర్భాలయంలోకి ప్రవేశించారు.అక్కడ ఆయన సుమారు 20నిమిషాల పాటు గర్భాలయంలోని స్వామివారి చెంత పూజల్లో పాల్గొన్నారు. అనంతరం 6ః08 గంటలకు వెలుపలికి వచ్చారు. అక్కడినుంచి ఆలయ ముఖ మండపంలోని హుండీలో గవర్నర్ సతీమణి సుమారు రూ.5వేలు సమర్పించారు. 6ః15 గంటల నుంచి ఆశీర్వచనం ప్రారంభం చేశారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ మహాదాశీర్వచనం చేశారు. 6ః45 గంటల వరకు వేద పండితులు, ఘనాపాఠీలు, ఆలయ అర్చకులు కలిసి చతుర్వేదాలు, తిరుప్పావై పాశురాల పఠనంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. భారీ బందోబస్తు భువనగిరి అర్భన్ : గవర్నర్ రాక సందర్భంగా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వసంత పంచమిని పురస్కరించుకుని ఆయన సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వెళ్లే వరకు రహదారుల వెంట జడ్ ఫ్లస్ కేటగీరితో బందోబస్తును ఏర్పాటు చేశారు. యాదాద్రి నుంచి అవుషాపూర్ వరకు భద్రత కల్పించారు. వాహనాలు అదుపు చేసేందుకు అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు నియమించారు. వివాదాలకు తాగులేకుండా ప్రథమపౌరుడి పర్యటన సాఫీగా ముగియడంతో అధికా రయంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గవర్నర్ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్ , ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఏసీపీలు మనోహర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఈఓగీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఏఈఓ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ తదితరులు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరు బయల్దేరి వెళ్లారు. కాగా ప్రధాని హోదాలో పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావటం ఇదే తొలిసారి. మరోవైపు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రధాని పాల్గొంటారు. -
అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి : జగన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సుదీర్ఘంగా వివరించామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సమావేశనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాలనే గవర్నర్‌కు చెప్పడం జరిగింది. దాదాపుగా 59 లక్షల బోగస్ ఓట్లు ఎలా ఉన్నాయో.. వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో వివరించాం. ఇదికాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయాన్ని గవర్నర్‌కు ఆధారాలతో సహా తెలియజేశాం. దాని ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఎలా చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. పోలీసు శాఖను ఎలా రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారో కూడా వివరించాం. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా.. ‘ఒక వ్యక్తిని తానే పొడిచి.. మళ్లీ ఆ హత్యకు వ్యతిరేకంగా అతనే దీక్ష చేస్తే ఎలా ఉంటుందో.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కూడా అలానే ఉంది. ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏమైనా కారణం ఉందంటే అది చంద్రబాబు నాయుడు సీఎం కావడమే.. హోదాపై అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ఎటకారపు మాటలు.. ఈ అంశంలో ప్రతిపక్ష పోరాటాన్ని అవహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరికి గుర్తున్నాయి. ప్యాకేజీ తనవల్లే వచ్చిందని, ఈ ప్యాకేజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం, హోదాతో ఎక్కడైనా మేలు జరిగిందా అని చంద్రబాబు అన్న విషయాలు ప్రజలందరికి గుర్తున్నాయి. బీజేపీతో నాలుగేళ్ల సంసారంలో చంద్రబాబు.. ఆయన మంత్రులు ఏనాడు హోదాను అడగలేదు. ఇప్పుడు నల్లచొక్కాలు వేసుకుని ధీక్షలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అని వైఎస్ జగన్ విమర్శించారు. చదవండి: గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు -
ఏపీ సర్కార్‌కు చుక్కెదురు!
సాక్షి, అమరావతి : చుక్కల భూముల విషయంలో ఏపీ సర్కార్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఈ చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిరస్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్ తప్పుబట్టారు. కేవలం అసైన్మెంట్ ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. శాసన సభలో బిల్లు ద్వారా ఈ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకునేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించి.. రాష్ట్రపోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ ఇతర ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడుకలకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసారు. ఈ వేడకల్లో ఉత్తమ్‌తో పాటు శాసనసభపక్షనేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఘనంగా గణతంత్ర దినోత్సవం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వగా.. గవర్నర్ నరసింహన్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది. -
అందుకే వాళ్లను నగరం నుంచి బహిష్కరించాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతికి విఘాతం కలగవద్దనే కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌ను కలిసి, ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై ఆయన చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు బీమా పథకం ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. వర్షాల రాకతో ఎగువ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వరద ప్రవాహం ప్రారంభమైందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆందోళనకు దిగడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో కొన్ని వార్తా చానల్స్ వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. -
గవర్నర్.. మెట్రో జర్నీ
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలులో సాధారణ ప్రయాణికుడిలా జర్నీ చేసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదర్శంగా నిలిచారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్, భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సతీసమేతంగా నగర మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బేగంపేట్ మెట్రో స్టేషన్‌కు సాధారణ ప్రయాణికుడిలా భార్యతో కలసి వచ్చిన ఆయన అమీర్‌పేట్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో దిగి మరో రైలులో మియాపూర్ వరకు(కారిడార్–1) వెళ్లారు. ఆయన రాకను గుర్తించిన మెట్రో అధికారులు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే మియాపూర్ మెట్రోస్టేషన్‌కు పరుగున వచ్చి గవర్నర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికులకు కల్పించిన వసతులను చూపారు. తన పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని గవర్నర్ ఆదేశించడం గమనార్హం. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్ట్ సెంటర్, ఇనాగరల్ ప్లాజా, వాటర్‌లెస్ యూరినల్స్, ప్రజోపయోగ స్థలాలను గవర్నర్ దంపతులు పరిశీలించారు. స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రజోపయోగ స్థలాలు, అభివృద్ధి పనులను చూసి ముగ్ధులైన గవర్నర్ దంపతులు హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు ఓ మణిహారం అని, జీవించేందుకు అత్యంత అనువైన నగరమే కాదు, పీపుల్ ఫ్రెండ్లీ సిటీకి హైదరాబాద్ నిదర్శనంగా నిలుస్తోందని కొనియాడారు. మాస్కో తరహాలో మెట్రో స్టేషన్లను ఆర్ట్ మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని ఎన్వీఎస్‌రెడ్డికి సూచించారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్ చేత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ రాధాకృష్ణన్‌కు గవర్నర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జస్టిస్ రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, హైకోర్టు ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ న్యాయవాదులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. విభజన అనంతరం తొలి సీజే... రాష్ట్ర విభజన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ కావడం విశేషం. 2013 మే 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా... రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2015 మే 6న పదవీ విరమణ చేశారు. జస్టిస్ సేన్‌గుప్తా పదవీ విరమణ అనంతరం హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులు కావడం ఇదే తొలిసారి. సేన్‌గుప్తా పదవీ విరమణ తర్వాత జస్టిస్ దిలీప్ బి. బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా బాధ్య తలు చేపట్టారు. ఆయన 2015 మే 5న ఏసీజేగా బాధ్యతలు చేపట్టి 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. 2016 జూలై 30న పదోన్నతిపై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఏసీజేగా నియమితులయ్యారు. 2016 జూలై 30న ఏసీజేగా బాధ్యతలు చేపట్టిన రమేశ్ రంగనాథన్ రికార్డు స్థాయిలో 23 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. ఇంత సుదీర్ఘకాలంపాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తి హైకోర్టులో ఇప్పటివరకు ఎవరూ లేరు. ఇదీ జస్టిస్ రాధాకృష్ణన్ నేపథ్యం... జస్టిస్ రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళలో జన్మిం చారు. 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2006లో అదే హైకో ర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో పదోన్నతిపై ఛత్తీస్‌గఢ్ హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు సీజేగా ప్రమాణం చేసిన జస్టిస్ రాధాకృష్ణన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలబద్ద అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని, సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
గవర్నర్ తల్లికి నివాళులర్పించిన ప్రముఖులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి ఇటీవల మరణించారు. ఈనేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో పదమూడవ రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, చత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమన్సింగ్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
పవన్‌కు గవర్నర్ ఆహ్వానం
- రాజ్ భవన్లో 'ఎట్ హోం' కార్యక్రమం - హాజరుకానున్న ప్రముఖులు హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ‘ఎట్ హోం’ పేరిట తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్షనేతలు సహా అధికారులు అంతా హాజరవుతారు. ఈ సారి ఎట్ హోం కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయన రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. -
శంకరాభరణం ఓ ఆభరణం
‘‘ఈ రోజుల్లో సినిమాలు సమాజంపై మంచి ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు రావాలి. భారతీయ సినిమా స్థాయిని శంకరాభరణం పెంచింది. ‘శంకరాభరణం’ చిత్రపరిశ్రమలో అత్యద్భుత చిత్రం. ఇప్పుడు ‘బాహుబలి’లాంటి సినిమాలు వచ్చాయి. వాటి గొప్పదనం వాటికి ఉంటుంది. అయితే ‘శంకరాభరణం’ శంకరాభరణమే. సినీప్రపంచానికి ఆభరణం లాంటి సినిమా. విశ్యనాథ్గారు ఓ ఆభరణమే’’ అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు తెలుగు దర్శకుల సంఘం ఆయన్ను సన్మానించింది. సన్మాన పత్రాన్ని నటుడు తనికెళ్ళ భరణి చదివి, వినిపించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు రాష్ట్రాల గవర్నర్ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదగా కె. విశ్వనాథ్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇంకా జాతీయ అవార్డు గ్రహీతలు ‘శతమానం భవతి’ నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్, నిర్మాతలు యష్ రంగినేని తదితరులను సన్మానించారు. -
ప్రజలకు గవర్నర్ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు
70వ స్వతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని ఏపీ, తెలంగాణా ప్రజలకు ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నర్సింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దేశస్యాతంత్రం కొరకు తమ ప్రాణాలు అర్పించిన దేశభక్తులు అందించిన స్పూర్తితో ముందుకుసాగాలన్నారు. నిస్వార్దంగా వారు దేశం కొసం వారు అందించిన సేవలను కొనియాడారు. వారి త్యాగాలను ఎన్నటికి మరువలేమని, సమాజంలోని అన్ని వర్గాలకు స్యతంత్ర ఫలాలు సమానంగా అందేలా ప్రతిఒక్కరు పునరంకితం కావాలని ఆయన పిలుపిచ్చారు. -
నేడు జిల్లాకు గవర్నర్ రాక
పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటలకు రాజాం చేరుకుంటారు. 1:20 గంటలకు జి.ఎం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ క్యాంపస్‌కు చేరుకొని నాలుగు గంటల వరకూ అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజాం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి శ్రీకాకుళం అర్అండ్బీ వసతి గృహానికి చేరుకుంటారు. 15వ తేదీ (సోమవారం) ఉదయం 8.30 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సీతంపేట వెళ్తారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.20 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీతంపేట నుండి హెలీకాప్టర్‌లో విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు. -
18న బొల్లారానికి రాష్ట్రపతి రాక
ఈనెల 18న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ బొల్లారంలోని తన శీతాకాల విడిదికి వస్తుండటంతో.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలీసు అధికారులతో పాటు రక్షణ శాఖ సీనియర్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 18 నుండి 31 వరకు రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని.. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. షెడ్యూల్ ఇదే.. ఈనెల 18న డిల్లీ నుండి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్స్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ గవర్నర్ నర్సింహన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్ర పతికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 19న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగులో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హజరవుతారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలపెట్టిన చండీ యాగానికి కూడా రాష్ట్ర పతి హాజరు కానున్నారు. రాషప్రతి నిలయానికి అవసరమైన అన్ని సౌకర్యలు రక్షణ శాఖకు చెందిన మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కల్పిస్తున్నారు. కాన్వాయ్ రిహార్సిల్.. రాషప్రతి రాక సందర్భంగా బుదవారం పోలీసులు హకీంపేట నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సిల్ నిర్వహించారు. -
అమ్మవారి సేవలో గవర్నర్లు
-
బాలల చలన చిత్రోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.