England vs Bangladesh
-
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.అరంగేట్రంలోనే అదరగొట్టిటెస్టుల్లో ఒకటి, వన్డేల్లో ఆరు, టీ20లలో ఒక సెంచరీ సాయంతో ఈ మేర డేవిడ్ మలన్ పరుగులు స్కోరు చేశాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన మలన్.. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లిష్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు జోస్ బట్లర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ఇక పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన డేవిడ్ మలన్.. అగ్ర బ్యాటర్‌గా నిలిచాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ విధ్వంసకర వీరుడు కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. ఫాస్టెస్ట్ 1000అంతేకాదు.. న్యూజిలాండ్‌తో టీ20లో 48 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని సత్తా చాటాడు. ఈ క్రమంలో 2020 సెప్టెంబరులో ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచాడు డేవిడ్ మలన్.అంతేకాదు.. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా డేవిడ్ మలన్ రికార్డు సాధించాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులోనూ డేవిడ్ మలన్ సభ్యుడు.ప్రపంచకప్‌లో శతక్కొట్టివన్డేల్లోనూ మలన్ తన మార్కును చూపించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న అతడు 2022లో కేవలం 15 ఇన్నింగ్స్ వ్యవధిలోనే ఐదు సెంచరీలు బాది తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు.జేసన్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్ తుదిజట్టులో స్థానం పొందిన డేవిడ్ మలన్.. బంగ్లాదేశ్‌తో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన బ్యాట్ పవర్ చూపించాడు. అయితే, ప్రపంచకప్ టోర్నీ తర్వాత అతడికి జట్టులో చోటు కరువైంది. ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సెలక్టర్లు మలన్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం ప్రకటన విడుదల చేశాడు 37 ఏళ్ల డేవిడ్ మలన్.చదవండి: శ్రేయస్ అయ్యర్ బౌలింగ్.. భారీ సిక్సర్ బాదిన బ్యాటర్ -
CWC 2023: ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్
ధర్మశాలలో నిన్న ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి బంగ్లాదేశ్ తమ కోటా ఓవర్ల కంటే ఓ ఓవర్ వెనుపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బంగ్లాదేశ్ సభ్యులందరికీ ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఎహసాన్ రజా, పాల్ విల్సన్, థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్ కుమార ధర్మసేన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఛార్జ్ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. డేవిడ్ మలాన్ (140) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. రీస్ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాశించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించి, ప్రపంచకప్‌లో 300 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను ఛేదించిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. -
బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లండ్.. 364 పరుగుల భారీ స్కోర్
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ జట్టు తమ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి ఏకంగా 364 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ మలాన్(107 బంతుల్లో 140) విధ్వసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అతడితో పాటు జో రూట్(82), జానీ బెయిర్ స్టో(52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్లు మలాన్, బెయిర్ స్టో తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసక్రమంలో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో 400 పరుగుల మార్క్‌ను చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్ఫుల్ ఇస్లాం మూడు, టాస్కిన్ అహ్మద్, షకీబ్ తలా వికెట్ సాధించారు. చదవండి: CWC 2023 ENG VS BAN: డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు -
WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023-England vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్ తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మలన్ విధ్వంసకర శతకం ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో అర్ధ శతకం(52), డేవిడ్ మలన్ సునామీ సెంచరీ(140)తో అద్భుత ఆరంభం అందించారు. ఈ క్రమంలో బెయిర్‌స్టో స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 33.4 ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అదే జోష్‌లో అరుదైన ఘనత కూడా సాధించాడు. మరోసారి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్) రెండు పరుగులు తీసి.. గ్రాహం గూచ్ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1.జో రూట్- 898* 2.గ్రాహం గూచ్- 897 3.ఇయాన్ బెల్- 718 4.అలన్ లాంబ్- 656 5.గ్రేమ్ హిక్- 635. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
CWC 2023: డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకం.. పలు రికార్డులు నమోదు
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు.సెంచరీ తర్వాత గేర్ మార్చిన మలాన్.. మెహిది హసన్ మీరజ్ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో వరుసగా 4,6,6,4 పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను భారీ స్కోర్ దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు. మలాన్‌కు జతగా మరో ఎండ్‌లో జో రూట్ (45) ఉన్నారు. 33 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. కెరీర్లో 100వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేసి షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇంగ్లండ్.. బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సెంచరీతో మలాన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మలాన్ వన్డేల్లో వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మలాన్ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేయగా.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ 27 ఇన్నింగ్స్‌ల్లో 6 శతకాలు బాది మలాన్ వెనుక ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు మలాన్ మరో ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సెంచరీలు (4) చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా డేవిడ్ గోవర్ (1983), జానీ బెయిర్‌స్టో (2018)ల సరసన నిలిచాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే ఔటైన మలాన్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ తర్వాత మరింతగా చెలరేగిపోతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇది ఆరో సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అజేయమైన సెంచరీలతో కదంతొక్కగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు (డికాక్, డస్సెన్, మార్క్రమ్) శతక్కొట్టారు. తాజా శతకంతో మలాన్ వీరి సరసన చేరాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 239/1గా ఉంది. మలాన్ (128), రూట్ (55) క్రీజ్‌లో ఉన్నారు. -
CWC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. స్టోక్స్ లేకుండానే..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) ఇంగ్లండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా స్టోక్స్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మొయిన్ అలీ స్థానంలో రీస్ టాప్లే బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా స్థానంలో మెహది హసన్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు.. ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్‌కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ షాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), తౌహిద్ హృదొయ్, మెహది హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
ప్రపంచకప్ 2023లో ఇవాళ 2 మ్యాచ్‌లు.. హైదరాబాద్‌లో ఓ మ్యాచ్..!
వన్డే ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రస్తుత ప్రపంచకప్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని బోణీ విజయం కోసం ఎదురుచూస్తుండగా.. బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి మరో విజయం కోసం కసిగా ఎదురుచూస్తుంది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్.. ప్రపంచకప్‌లో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తుంది. స్టోక్స్ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన బెన్ స్టోక్స్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్టోక్సీ గత రెండు రోజులుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. శ్రీలంక జోరు కొనసాగించేనా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయంపాలైనప్పటికీ, ఆ జట్టులోని బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఇదే జోరును కొనసాగిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. -
ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే కాగా మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్–ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే. అసలు ఈ మనిషి కనబడటం లేదే! 2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్ 0–3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్- మైకేల్ వాన్ మధ్య ఓ రేంజ్లో ట్విటర్ వార్ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు. వైరల్ ట్వీట్ ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్‌కు కౌంటర్ వేశాడు. ‘లాంగ్ టైమ్ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్ అంటూ వసీం జాఫర్‌ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక బంగ్లా- ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్ (36 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... నజ్ముల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? Hello @MichaelVaughan, long time no see 😏 #BANvENG pic.twitter.com/3nimzfuHOw — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2023 -
వరల్డ్ ఛాంపియన్స్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ (ఫొటోలు)
-
ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా
టి20 ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు టి20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమికి బంగ్లా బదులు తీర్చుకున్నట్లయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్‌దాస్(57 బంతుల్లో 73, 10 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. షాంటో 47 పరుగులు, రోనీ తలుక్దర్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్లు చెరొక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ మలాన్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్ 40 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరు మినహా మిగతవారు రాణించడంలో విఫలం కావడం.. బంగ్లా బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తన్విర్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌లు తలా ఒక వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో రాణించిన లిటన్‌దాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. నజ్ముల్ హొసెన్ షాంటో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. Modhumoti Bank Limited T20i Series: Bangladesh vs England: 3rd T20i A Glimpse of Bangladesh's Bowling ✨#BCB | #Cricket | #BANvENG pic.twitter.com/VhGahbohNe — Bangladesh Cricket (@BCBtigers) March 14, 2023 Congratulation 3.0 Bangladesh #Bangladesh vs #England pic.twitter.com/ftK5pxEQVN — Tayyab Qureshi (@TayyabQ37980603) March 14, 2023 చదవండి: 'ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం' -
జగజ్జేత ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. పసికూనల చేతిలో దారుణ ఓటమి
టీ20 వరల్డ్ ఛాంపియన్, 2022 పొట్టి ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (మార్చి 12) జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో జగజ్జేతను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి (1-2) ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన బంగ్లా పులులు.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఆఖరి వన్డేలో, తొలి రెండు టీ20ల్లో వరుస విజయాలు సాధించారు. సొంతగడ్డపై ప్రత్యర్ధి ఎంతటి వారైనా తిరుగులేని ఆధిప్యతం ప్రదర్శించే బంగ్లా టైగర్స్..అండర్ డాగ్స్‌గా తమపై ఉన్న ముద్రను కొనసాగించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన.. ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా తంటాలు పడింది. బంగ్లా సంచలన స్పిన్నర్ మెహిది హసన్ మీరజ్ (4-0-12-4) ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. తస్కిన్ అహ్మద్ (1/27), ముస్తాఫిజుర్ (1/19), షకీబ్ అల్ హసన్ (1/13), హసన్ మహమూద్ (1/10) తలో చేయి వేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (25), మొయిన్ అలీ (15), బెన్ డక్కెట్ (28), సామ్ కర్రన్ (12), రెహాన్ అహ్మద్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నజ్ముల్ షాంటో (46 నాటౌట్), తౌహిద్ హ్రిదోయ్ (17), మెహిది హసన్ (20) రాణించడంతో సునాయాసంగా విజయతీరాలకు (18.5 ఓవర్లలో 120/6) చేరింది. స్వల్ప లక్ష్యంగా కావడంతో బంగ్లా టైగర్స్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడారు. ఫలితంగా మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, మొయిన్ అలీ, రెహాన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన మెహిది హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా..
టి20 క్రికెట్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన నజ్ముల్ హొసెన్ షాంటోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వన్డే సిరీస్‌ను ఓడిపోయామన్న బాధను మనుసులో పెట్టుకున్న బంగ్లా ఇంగ్లండ్‌ను తొలి టి20లో ఓడించి చావుదెబ్బ కొట్టింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ జాస్ బట్లర్(42 బంతుల్లో 67, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిలిప్ సాల్ట్(35 బంతుల్లో 38) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్ముద్ రెండు వికెట్లు తీయగా.. షకీబ్, నసూమ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నజ్ముల్ హొసెన్ షాంటో(30 బంతుల్లో 51, 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. తౌహిద్ హృదోయ్ 24 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (24 బంతుల్లో 34 నాటౌట్), అఫిఫ్ హొసెన్ (13 బంతుల్లో 15 నాటౌట్) జట్టున విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఆదివారం(మార్చి 12న) ఢాకా వేదికగా జరగనుంది. Winning moment of 1st T20i match#BCB | #Cricket | #BANvENG pic.twitter.com/bOQIY0sPew — Bangladesh Cricket (@BCBtigers) March 9, 2023 చదవండి: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్ -
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
వైట్ బాల్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న బంగ్లాదేశ్ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ మరో అరుదైన రికార్డు సాధించాడు. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (మార్చి 6) వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శన ((71 బంతుల్లో 75; 7 ఫోర్లు), (10-0-35-4))తో అదరగొట్టిన షకీబ్.. రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా, ఓవరాల్‌గా 14వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో షకీబ్‌కు ముందు కేవలం ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్ రజాక్ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టగా.. షకీబ్ 227 వన్డేల్లో 4.45 ఎకానమీ రేట్‌తో 300 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్ దిగ్గజం, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ (534) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వసీం అక్రమ్ (502), వకార్ యూనిస్ (416), చమిందా వాస్ (400), షాహిద్ అఫ్రిది (395), షాన్ పొలాక్ (393), గ్లెన్ మెక్‌గ్రాత్ (381), బ్రెట్ లీ (380), లసిత్ మలింగ (338), అనిల్ కుంబ్లే (337), సనత్ జయసూర్య (323), జవగల్ శ్రీనాథ్ (315), డేనియల్ వెటోరీ (305), షకీబ్ అల్ హసన్ (300), షేన్ వార్న్ (293) వరుసగా 2 నుంచి 15 స్థానాల్లో ఉన్నారు. బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ తొలి రెండు వన్డేల్లో గెలుపొందడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్ రహీమ్ (70), షకీబ్ (75) అర్ధసెంచరీలతో రాణించారు. జోప్రా ఆర్చర్ 3, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు, క్రిస్ వోక్స్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఇంగ్లండ్.. షకీబ్ (4/35) విజృంబించడంతో 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ విన్స్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా పర్యటనలో ఇంగ్లండ్ తదుపరి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మార్చి 9, 12, 14 తేదీల్లో 3 టీ20లు జరుగనున్నాయి. -
షకీబ్ ఆల్‌రౌండ్ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఛటోగ్రామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్ నుంచి బంగ్లా తప్పించుకుంది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో కేవలం 196 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. తైజుల్ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ అల్హసన్(75), రహీం(70), షాంటో హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు, సామ్ కుర్రాన్, రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. ఈ సిరీస్ అసాంతం అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు! -
పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ
బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థంగా అడ్డుకున్నాడు. బంతి రషీద్ ప్యాడ్‌కు దూరంగా బ్యాట్ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్‌గా కనిపిస్తుంది. మ్యాచ్ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్ ఇక్బాల్ డీఆర్ఎస్ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బంగ్లా క్రికెట్ జట్టుపై అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్ చెప్పండి.. బంగ్లా కెప్టెన్‌కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జేసన్ రాయ్ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్ మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc — Jon Reeve (@jon_reeve) March 3, 2023 Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs — Ralph Rimmer (@razorr69) March 3, 2023 Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e — Faiz Fazel (@theFaizFazel) March 3, 2023 చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్
ఢాకా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్(124 బంతుల్లో 132, 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బట్లర్ 76 పరుగులతో రాణించాడు. చివర్లో మొయిన్ అలీ 42 నాటౌట్, సామ్ కరన్(19 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు, షకీబ్ , తైజుల్ ఇస్లామ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయం ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. సెంచరీతో చెలరేగిన జేసన్ రాయ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. -
మలాన్ వీరోచిత శతకం.. పసికూనపై అతికష్టం మీద గెలిచిన ఇంగ్లండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 210 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను.. డేవిడ్ మలాన్ (145 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత శతకంతో పోరాడి గెలిపించాడు. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్.. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ఖరారు అనుకున్న దశలో మలాన్ తన అనుభవాన్ని అంతా రంగరించి, టెయిలెండర్ల సాకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ (29 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్)ను సమన్వయం చేసుకుంటూ మలాన్ పోరాడిన తీరు అమోఘం. మలాన్- రషీద్ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, మరో 8 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మలాన్, రషీద్ మినహా జేసన్ రాయ్ (4), ఫిలిప్ సాల్ట్ (12), జేమ్స్ విన్స్ (6), జోస్ బట్లర్ (9), క్రిస్ వోక్స్ (7), మొయిన్ అలీ (14), విఫలం కాగా.. విల్ జాక్స్ (26) కాస్త పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహదీ హసన్ మిరాజ్ 2, షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్‌గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 47.2 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (23), షాంటో (58), మహ్మదుల్లా (31) ఓ మోస్తరుగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, విల్ జాక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 3న ఇదే వేదికపై జరుగుతుంది. -
World Cup 2022: ‘హమ్మయ్య భారత్ ఓడిపోయింది’.. వెస్టిండీస్ సంబరాలు.. వైరల్
ICC Women World Cup 2022: తెలిసో తెలియకో ఒకరికి ఎదురైన పరాభవం మరొకరి పాలిట వరమవుతుంది. ఒకరి బాధ పరోక్షంగా మరొకరి సంతోషానికి కారణం అవుతుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ భారత్, వెస్టిండీస్ జట్లకు ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. మెగా ఈవెంట్ సెమీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆఖరి నిమిషంలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో రిక్త హస్తాలతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నో బాల్ రూపంలో దురదృష్టం వెంటాడంతో మిథాలీ సేనకు భంగపాటు తప్పలేదు. దీంతో భారత జట్టు బాధతో వెనుదిరగగా.. వెస్టిండీస్ మాత్రం సంబరాలు చేసుకుంది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన దక్షిణాఫ్రికా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించిన వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు.. మిథాలీ సేన ఓటమి పాలు కావడంతో ఎగిరి గంతేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో విండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4 అంటే సెమీస్ చేరే క్రమంలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌తో, భారత్ దక్షిణాఫ్రికాతో తలపడ్డాయి. ఆదివారం నాటి ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ విజయం సాధించి సెమీస్ చేరగా.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్ సెమీ ఫైనల్లో నిలిచింది. ఇదే వారి ఆనందానికి కారణమైంది. ఈ క్రమంలో వారి సంబరాలు అంబరాన్నంటాయి. హమ్మయ్య భారత్ ఓడిపోయిందన్నట్లుగా వారు సంతోషంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి.. సెమీస్ చేరిన ఇంగ్లండ్.. ఇక భారత్!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌పై 100 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తర్వాత సెమీస్ చేరిన మూడో జట్టుగా హీథర్‌నైట్ బృందం నిలిచింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఆదిలోనే డానియెల్ వ్యాట్(6) వికెట్ కోల్పోయినప్పటికీ... ఓపెనర్ బీమౌంట్ 33 పరుగులతో పర్వాలేదనిపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హీథర్‌నైట్ సైతం 6 పరుగులకే నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటర్ నటాలీ సీవర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. 40 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) మరోవైపు వికెట్ కీపర్ అమీ జోన్స్ ఆమెకు అండగా నిలబడింది. ఇక 72 బంతుల్లో 67 పరుగులు సాధించిన సోఫియా డంక్లే ఇంగ్లండ్ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో బ్రంట్ 24, ఎక్లెస్‌స్టోన్ 17 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు షమీమా సుల్తానా, షర్మిన్ అక్తర్ చెరో 23 పరుగులు సాధించి శుభారంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే మిడిలార్డర్ దీనిని కొనసాగించలేకపోయింది. దీంతో 48 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి బంగ్లా జట్టు ఆలౌట్ అయింది. దీంతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. సరిగ్గా వంద పరుగుల తేడాతో హీథర్‌నైట్ బృందం గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే ఇంగ్లండ్‌తో పాటు టాప్-4లో నిలుస్తుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప- 2022 ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు ఇంగ్లండ్- 234/6 (50) బంగ్లాదేశ్- 134 (48) View this post on Instagram A post shared by ICC (@icc) -
Eng Vs Ban: పాపం బంగ్లాదేశ్.. 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు!
England Beat Bangladesh By 8 Wickets Closer To Semis: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చెలరేగుతోంది. గ్రూప్–1లో అదరగొట్టే విజయాలతో ప్రత్యర్థులను బెదరకొట్టేస్తోంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్ బృందం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బకొట్టింది. అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతోంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. స్పిన్, పేస్, మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై అల్రౌండ్ పిడుగులు కురిపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! ఇంకెవరినీ ఇంగ్లండ్ బౌలర్లు 20 పరుగులైనా చేయనివ్వలేదు. టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. ఇంగ్లండ్ ‘పవర్’ప్లే... బంగ్లా డీలా! బంగ్లాకు టాస్ గెలిచిన ఆనందం బ్యాటింగ్‌కు దిగగానే ఆవిరైంది. కలిసొచ్చే పిచ్‌పై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ తిప్పేశాడు. పేసర్ మిల్స్ కట్టడి చేశాడు. ఓపెనర్లు లిటన్ దాస్ (9), నైమ్ (5)లను అలీ వరుస బంతుల్లోనే పెవిలియన్ చేర్చగా, షకీబ్ (4)ను వోక్స్ ఔట్ చేశాడు. దీంతో ‘పవర్ ప్లే’లో బంగ్లా మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లను కోల్పోతూనే ఇన్నింగ్స్ కుదేలైంది. ముష్ఫికర్ ఉన్నంతసేపు 10 ఓవర్లలో 6 పరుగుల రన్‌రేట్ కనిపించింది. 11వ ఓవర్లో 63 పరుగుల స్కోరు వద్ద అతన్ని లివింగ్‌స్టోన్ ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం మళ్లీ జోరందుకుంది. బ్యాటింగ్‌లో తల్లడిల్లిన బంగ్లా బౌలింగ్‌లో అయితే డీలా పడింది. ఓపెనర్ రాయ్ అటాకింగ్‌కు చెల్లాచెదురైంది. మరో ఓపెనర్ బట్లర్ (18; ఫోర్, సిక్స్)ను తక్కువ స్కోరుకే ఔట్ చేసిన బంగ్లాకు అదే తృప్తి మిగిలింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ అలీ 9; నైమ్ (సి) వోక్స్ (బి) మొయిన్ అలీ 5; షకీబ్ (సి) రషీద్ (బి) వోక్స్ 4; ముష్ఫికర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లివింగ్‌స్టోన్ 29; మహ్ముదుల్లా (సి) వోక్స్ (బి) లివింగ్‌స్టోన్ 19; ఆఫిఫ్ (రనౌట్) 5; నూరుల్ (సి) బట్లర్ (బి) మిల్స్ 16; మెహదీ హసన్ (సి) వోక్స్ (బి) మిల్స్ 11; నజుమ్ అహ్మద్ (నాటౌట్) 19; ముస్తఫిజుర్ (బి) మిల్స్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–63, 5–73, 6–83, 7–98, 8–124, 9–124. బౌలింగ్: మొయిన్ అలీ 3–0–18–2, వోక్స్ 4–0–12–1, రషీద్ 4–0–35–0, జోర్డాన్ 2–0–15–0, టైమల్ మిల్స్ 4–0–27–3, లివింగ్‌స్టోన్ 3–0–15–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) నజుమ్ అహ్మద్ (బి) షోరిఫుల్ ఇస్లామ్ 61; బట్లర్ (సి) నైమ్ (బి) నజుమ్ అహ్మద్ 18; మలాన్ (నాటౌట్) 28; బెయిర్‌స్టో (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో 2 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–39, 2–112. బౌలింగ్: షకీబ్ 3–0–24–0, ముస్తఫిజుర్ 3–0–23–0, షోరిఫుల్ ఇస్లామ్ 3.1–0–26–1, నజుమ్ అహ్మద్ 3–0–26–1, మెహదీ హసన్ 2–0–21–0. చదవండి: T20 World Cup 2021: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను: వార్నర్ -
T20WorldCup2021: ఇంగ్లండ్ ఘన విజయం
-
కన్ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్
England Player Dance Afrter Bangladesh Batsman Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఒక కన్ఫ్యూజ్ రనౌట్ నవ్వులు పూయించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ మహ్మదుల్లా షార్ట్‌ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న టైమల్ మిల్స్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మిస్‌ఫీల్డ్ జరిగింది. ఇక్కడే మహ్మదుల్లా రెండో పరుగుకోసం యత్నించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఆఫిఫ్ హొస్సేన్ సగం క్రీజువరకు వచ్చేశాడు. దీంతో మిల్స్ బంతిని వేగంగా బట్లర్‌కు త్రో విసిరాడు. అంతే హొస్సేన్ క్రీజులోకి చేరేలోపే బెయిల్స్ ఎగరడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఈ కన్ఫ్యూజ్ రనౌట్‌తో ఇంగ్లండ్ ఆటగాడు డ్యాన్స్ చేయడం మిగతావారికి నవ్వులు పంచింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. చదవండి: T20 WC 2021: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ Confusion galore between Mahmud Ullah and Afif via @t20worldcup https://t.co/BXVu58xBgr — varun seggari (@SeggariVarun) October 27, 2021 -
ENG Vs BAN: జేసన్ రాయ్ మెరుపులు.. ఇంగ్లండ్ ఘన విజయం
జేసన్ రాయ్ మెరుపులు.. ఇంగ్లండ్ ఘన విజయం సమయం 18: 33.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్(38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకంతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 14.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఆరంభంలోనే జోస్ బట్లర్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) ఔటైనప్పటికీ.. డేవిడ్ మలాన్(25 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) సహకారంతో రాయ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరో బెయిర్‌స్టో(4 బంతుల్లో 8 నాటౌట్; ఫోర్) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. జేసన్ రాయ్(61) ఔట్ సమయం 18: 23.. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ జేసన్ రాయ్(38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చాక పెవిలియన్ బాట పట్టాడు. షొరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో నసుమ్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో రాయ్ ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 114/2. క్రీజ్‌లో మలాన్(22), బెయిర్‌స్టో(2) ఉన్నారు. న్యూజిలాండ్ గెలవాలంటే 7 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే చేయాలి. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్(18) ఔట్ సమయం 17: 45.. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5వ ఓవర్ ఐదో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. నసుమ్ అహ్మద్ బౌలింగ్‌లో నయీమ్ క్యాచ్ పట్టడంతో బట్లర్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్) వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 40/1. క్రీజ్‌లో జేసన్ రాయ్(12 బంతుల్లో 18), డేవిడ్ మలాన్ ఉన్నారు. దారుణంగా విఫలమైన బంగ్లా బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు స్వల్ప లక్ష్యం సమయం 17: 16.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మరోసారి దారుణంగా విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. తైమాల్ మిల్స్ ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌల్ చేసి చివరి రెండు బంతుల్లో వికెట్లు తీశాడు. 19.5వ ఓవర్లో బట్లర్ క్యాచ్ పట్టడంతో నరుల్ హసన్(18 బంతుల్లో 16) పెవిలియన్ చేరగా.. ఆఖరి బంతికి ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్ 3 వికెట్లతో చెలరేగగా.. లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. 98 పరుగుల వద్ద బంగ్లా ఏడో వికెట్ డౌన్ సమయం 16: 57.. 17.1వ ఓవర్లో బంగ్లా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. తైమాల్ మిల్స్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మెహిది హసన్(10 బంతుల్లో 11; 2 ఫోర్లు) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 102/7. క్రీజ్‌లో నరుల్ హసన్(12), నసుమ్ అహ్మద్(3) ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. కెప్టెన్ ఔట్ సమయం 16: 46.. ఇన్నింగ్స్ 14.5వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మదుల్లా(24 బంతుల్లో 19; ఫోర్) వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 86/6. క్రీజ్‌లో నరుల్ హసన్(7), మెహిది హసన్ ఉన్నారు. 73 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ సమయం 16: 34.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుండడంతో బంగ్లా జట్టు ఒత్తిడికి లోనవుతుంది. దీంతో అనవసర పరుగుకు ప్రయత్నించి మరో వికెట్ చేజార్చుకుంది. 12.4వ ఓవర్లో అఫీఫ్ హొసేన్(6 బంతుల్లో 5; ఫోర్) రనౌట్‌గా వెనుదిరగడంతో 73 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(17), నరుల్ హసన్ ఉన్నారు. కష్టాల్లో బంగ్లాదేశ్.. 63 పరుగులకే 4 వికెట్లు డౌన్ సమయం 16: 25.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి బంగ్లా జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో చిక్కుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్ నాలుగో బంతికి లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్(30 బంతుల్లో 29; 3 ఫోర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మహ్మదుల్లా(13), అఫీఫ్ హొసేన్ ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/3 సమయం 16: 18.. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న బంగ్లాదేశ్‌ను ముష్పికర్ రహీమ్(27 బంతుల్లో 27; 3 ఫోర్లు), మహ్మదుల్లా(11 బంతుల్లో 12; ఫోర్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 60/3గా ఉంది. పెవిలియన్‌కు క్యూ కడుతున్న బంగ్లా బ్యాటర్లు సమయం 15:55.. మొయిన్ అలీ వేసిన రెండో ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి షకీబ్ అల్ హసన్(7 బంతుల్లో 4) పెవిలియన్ బాట పట్టాడు. 5.2 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 26/3. క్రీజ్‌లో ముష్ఫికర్ రహీమ్(8), కెప్టెన్ మహ్మదుల్లా ఉన్నారు. ఆదిలోనే బంగ్లాదేశ్‌కు షాక్.. వరుస బంతుల్లో వికెట్లు తీసిన మొయిన్ అలీ సమయం 15:41.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ వరుస బంతుల్లో లిటన్ దాస్(8 బంతుల్లో 9; 2 ఫోర్లు), మహ్మద్ నయీమ్(7 బంతుల్లో 5)ల వికెట్లు పడగొట్టాడు. దీంతో బంగ్లా 3 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో ముష్ఫికర్ రహీమ్(1), షకీబ్ అల్ హసన్ ఉన్నారు. అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించగా.. బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఈ నాలుగు మ్యాచ్‌లు టీ20 ప్రపంచకప్‌లలో తలపడినవే కావడం విశేషం. ఇక ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) ఇంగ్లండ్ ఓసారి ఛాంపియన్(2010)గా, మరోసారి రన్నరప్(2016)గా నిలువగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2007లో సూపర్-8 దశకు చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం. తుది జట్లు: ఇంగ్లండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్), డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్ బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), నరుల్ హసన్(వికెట్‌కీపర్), మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసేన్, మెహిది హసన్, షొరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్ -
వైరల్ : క్లీన్‌బౌల్డ్‌తో సిక్సర్ చూశారా?
లండన్ : క్లీన్‌బౌల్డ్ అయిన తర్వాత సిక్సర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును బంతి వికెట్లను తాకి మరి నేరుగా బౌండరీలైన్ బయట పడింది. బహుషా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సిక్సర్ చూసి ఉండరు. వికెట్ అయిన తర్వాత సిక్సర్ ఎలా అవుతుందంటారా? అవును అది సిక్సర్ కాదు వికెటే! కానీ కళ్లను మైమరిపించే ఈ అబ్బురం తాజా ప్రపంచకప్‌లోనే చోటుచేసుకుంది. శనివారం ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఔరా అనిపించింది. ఇంగ్లండ్ సంచలనం జోఫ్రా ఆర్చర్ మహత్యంతోనే ఇది జరిగింది.. చరిత్రకెక్కింది. (చదవండి: బంగ్లాపై ఇంగ్లండ్ అదరహో) ఇంతకు ముందు బ్యాట్స్‌మన్ హెల్మెట్‌కు తాకి సిక్సర్ వెళ్లడం చూశాం కానీ.. ఇలా బెయిల్స్ తాకి సిక్సర్‌గా వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ఈ బంతికి బలవ్వగా.. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆర్చర్ ఏకంగా గంటకు 144 కిలోమీటర్ల వేగంతో లైన్ అండ్ లెంగ్త్‌తో బంతిని వేయడంతో అది వికెట్లను తాకి నేరుగా 59 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీలో పడింది. ఇక ఈ డెలివరి పట్ల ఆర్చర్ తెగ ఆనందపడిపోయాడు. ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, ఇది తన వేగానికి సంకేతమని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్వీట్ చేయడంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. -
బంగ్లాపై పంజా విసిరిన ఇంగ్లండ్
కార్డిఫ్ : పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఇంగ్లండ్.. సంచలనాల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా విరుచుకుపడింది. దీంతో బంగ్లా 106 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లా-ఇంగ్లండ్ మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించింది. తొలుత జేసన్ రాయ్ (153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం షకీబుల్ హసన్(121; 119 బంతుల్లో 12ఫోర్లు, 1 సిక్సర్)వీరోచితంగా పోరాడినప్పటికీ బంగ్లాకు విజయాన్ని అందించలేకపోయాడు. షకీబ్ మినహా ఏవరూ రాణించకపోవడంతో బంగ్లా 48.5 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. భారీ శతకంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జేసన్ రాయ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 387 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. ఆర్చర బౌలింగ్‌లో సౌమ్య సర్కార్(2) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం తమీమ్(19) తన చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు షకీబ్, రహీమ్‌లు మరోసారి బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆది నుంచి షకీబ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. రహీమ్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ప్లంకెట్ బౌలింగ్‌లో రహీమ్(44) వెనుదిరుగుతాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా షకీబ్ తన ఒంటరి పోరాటం కొనసాగించాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో ఎనిమిదో శతకం సాధించాడు. అనంతరం స్కోర్ పెంచే క్రమంలో షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి లాంఛనమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్(153; 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి తోడు బెయిర్ స్టో(51; 50 బంతుల్లో 6 ఫోర్లు), జోస్ బట్లర్(64; 44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. తాజా మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహిదీ హసన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్తజా, ముస్తాఫిజుర్‌లకు చెరో వికెట్ లభించింది.