excise policy
-
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సిసోడియా పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది. माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU— Manish Sisodia (@msisodia) December 11, 2024 మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితంఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. -
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్.. విచారణ బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసు విచారణ బెంచ్ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ జూలై 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ బెయిల్ పిటిషన్లను మరోబెంచ్ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకుందిన. దీంతో ఆయన ఢిల్లీ కేబినెట్‌కు ఫిబ్రవరి 28న రాజీనామా చేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై సస్పెన్స్
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి డుమ్మా కొట్టనున్నారా?.. అవుననే అంటున్నాయి అప్ వర్గాలు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఆయన గోవాకు వెళ్లనున్న నేపథ్యంలో ఈడీ సమన్లను మరోసారి దాటవేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌కి గత వారం నాల్గవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 18న ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లాల్సి ఉన్నందున ఈడీ ముందు ఆయన హాజరుకావడానికి అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ జనవరి 11న గోవాకు వెళ్లాల్సి ఉండగా, గణతంత్ర దినోత్సవం కోసం ఢిల్లీలో సన్నాహాలను పర్యవేక్షించేందుకు వాయిదా వేశారని వెల్లడించాయి. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే సన్నాహాలను ఉటంకిస్తూ జనవరి 3న ఈడీ సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ మూడుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఈడీ సమన్లను కేజ్రీవాల్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈడీ చర్యల వెనక రాజకీయ ప్రేరణ ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారమే ఈడీని ఎదుర్కొంటామని అన్నారు. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్‌విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్‌పై 8 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్‌లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్‌కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్‌తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..సిసోడియాపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. ‘సిసోడియాను ఈ విధంగా మీరు సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. ఇప్పటిదాకా మీరు వాదనలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు మొదలవుతాయి? మాకు ఈ విషయం రేపటి(మంగళవారం) కల్లా చెప్పండి’అని ధర్మాసనం ఎస్వీ రాజును ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, రాజు అవునని బదులిచ్చారు. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మార్చి 9వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
Satyendar Jain: ఆప్ మంత్రిని విచారించిన సీబీఐ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎట్టకేలకు సీబీఐ విచారించింది. ఈ విషయమే విచారణ సంస్థ గత శుక్రవారమే ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ముందుకు దరఖాస్తును తరలించగా..దానికి అనుమతి కూడా లభించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సోమవారం ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను విచారించినట్లు న్యాయవాది మొహ్మద్ ఇర్షాద్ తెలిపారు. ఇదే కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ కమ్యూనికేషన్ ఇన్జార్జ్ విజయ నాయర్‌ను కూడా సీబీఐ ప్రశ్నంచిందని న్యాయవాది తెలిపారు. అయితే ఆయనకు గతంలో ఎక్సైజ్ స్కామ్‌లో బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చేసిన దర్యాప్తులో ఢిల్లీ 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని పెద్ద మొత్తంలో ప్రయోజనాలను పొందేందుకే ఆప్ అగ్రనేతలు రూపొందించినట్లు వెల్లడైంది. ఈ అక్రమ నిధులు వారిమధ్య చేతులు మారినట్లు పేర్కొంది. అదీగాక మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ మంత్రి జైన్ ఫిబ్రవరి 14, 2015, నుంచి మే 31, 2017 మధ్య కాలంలో తన ఆదాయానికి పొంతన లేని విధంగా ఆస్తులు సంపాదించినట్ల సీబీఐ తెలిపింది. -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఓన్లీ మచ్ కంపెనీ సీఈవో విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ముంబైకి చెందిన విజయ్ నాయర్‌ను లిక్కర్ కేసులో సీబీఐ తన ఎఫ్ఐఆర్లో ఏ-5గా చేర్చింది. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుట్ర.. క్విడ్ ప్రోకో!
సాక్షి, హైదరాబాద్: కుట్ర, క్విడ్ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్ టెండర్లు దక్కేలా సిండికేట్ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్లైతో పాటు ఆయన సంస్థ రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్, ఆడిటర్ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. వెలుగులోకి సంచలనాత్మక విషయాలు... రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రెండు దఫాలుగా నోటీసులు.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్‌సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్ స్కామ్‌లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్‌లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
వేధింపులాపి.. మంచి పనులు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు. ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
లిక్కర్ స్కాంలో ‘హైదరాబాద్’ లింకులను కోర్టులో అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో హైదరాబాద్‌కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. గతంలో తాము చేసిన ఆరోప ణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ అక్కడే చెబుతామన్నారు. ఎంపీ సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌గుప్తాలతో కలిసి గురువారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంజిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని సుధాంశు త్రివేది, ఆదేశ్గుప్తా ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తా అని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా చేశారని, బ్లాక్ దందా అంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే సప్లయ్ అయిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని, నిందితుడు అమిత్ అరోరాపై జరిగిన స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్లి.. మద్యం పాలసీపై నిర్ణయాలా?: భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మద్యం పాలసీపై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ‘మద్యాన్ని విచ్చలవిడిగా, అవినీతిపరులతో విక్రయాలు జరుపుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు మద్యం పాలసీని రూపొందించటం విచిత్రం. ప్రభుత్వ పాలసీలపై సచివాలయంలో లేదా కేబినెట్లో నిర్ణయాలు జరుగుతాయి. ప్రభుత్వ పాలసీలపై హోటల్లో నిర్ణయాలేంటి? ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వచ్చి.. మద్యం పాలసీలపై నిర్ణయాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఇదీ చదవండి: లిక్కర్ స్కాం కేసు: బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత -
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ: కుంభకోణంలో కేసీఆర్ కుటుంబీకుల పాత్ర: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ‘‘పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్‌లోని హయత్ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్ హోటల్లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్ చేశాడు. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు. లిక్కర్ మాఫియా కమిషన్‌ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్‌కు లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్‌లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్ విధానాన్నే అక్కడ కేసీఆర్ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్‌కు సంకెళ్లే
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ‘‘ఎక్సైజ్ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక మోదీ వర్సెస్ కేజ్రీ: సిసోడియా కేజ్రీవాల్ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మరిన్ని హైదరాబాద్ లింకులు? ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన పలు హోల్‌సేల్, రిటైల్ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్ కమేడియన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
కేంద్రం, ఆప్ కుస్తీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఉదంతం కేంద్రానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ఆప్ నేత, ఢిల్లీ విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. గురుగ్రాం, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ, బెంగళూరు... ఇలా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 చోట్ల ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా ఏకకాలంలో దాడులు చేసింది. మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో సోదాలు చేసింది. రాత్రి 11 గంటల దాకా సిసోడియా నివాసంలో సోదాలు కొనసాగాయి. తన లాప్టాప్, ఫోన్ తీసుకెళ్లారని ఆయన మీడియాకు తెలిపారు. పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ ఉదంతంపై బుధవారమే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సిసోడియా, నలుగురు ప్రభుత్వాధికారులతో పాటు మొత్తం 15 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ అభియోగాలు మోపింది. ‘‘సిసోడియా తదితరులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేశారు. తద్వారా లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఖజానాకు రూ.144.36 కోట్ల మేరకు నష్టం చేకూర్చారు. బదులుగా భారీగా ముడుపులు అందుకున్నారు’’ అని ఆరోపించిది. ఈ ఉదంతంపై ఆప్ మండిపడింది. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు జరిగాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీ సర్కారుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తుండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో కథనం ప్రచురించిన రోజే సీబీఐని ఉసిగొల్పారన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా శాఖ మంత్రిపై కక్షపూరిత చర్యలకు దిగారు. సీబీఐకి మేం పూర్తిగా సహకరిస్తాం. మా మంత్రులపై గతంలో చేసిన దాడుల్లో తేలిందేమీ లేదు. ఇప్పుడూ తేలేదేమీ లేదు’’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని జత చేశారు. ‘‘మంచి చేయబోయిన వారందరినీ 75 ఏళ్లుగా ఇలాగే వెనక్కు లాగుతున్నారు. ఇందుకే దేశం వెనకబడింది. ఎవరేం చేసినా ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగదు’’ అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని సిసోడియా అన్నారు. ‘‘సీబీఐకి స్వాగతం. ఈ కుట్రలు నన్నేమీ చేయలేవు. నిజం నిలకడ మీద తేలుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు. మోదీ సర్కారుకు దడ కేజ్రీవాల్‌కు, ఆయన ఢిల్లీ మోడల్ పాలనకు సర్వత్రా పెరుగుతున్న పాపులారిటీని చూసి మోదీ ప్రభుత్వం బెదిరిపోతోందని ఆప్ ఆరోపించింది. సిసోడియా ఇంట్లో సీబీఐకి జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు తప్ప మరేమీ దొరకవంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెణుకులు విసిరారు. సిసోడియాను ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని సీబీఐకి ఆదేశాలున్నాయని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. వీటిని బీజేపీ తిప్పికొట్టింది. ఎక్సైజ్ మంత్రి కాస్తా ఎక్స్క్యూజ్ మంత్రిగా మారారంటూ కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను మే 30న ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. ఏమిటీ కేసు? 2021 నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగేలా గోల్మాల్ చేశారంటూ ఆరోపణలొచ్చాయి. వీటికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదించారు. దాంతో సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో ఆదేశించారు. పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని గత నెలలో ఢిల్లీ సర్కారు పక్కన పెట్టింది. ఎఫ్ఐఆర్లో ఏముందంటే... ► లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగే పలు నిర్ణయాలను ఎక్సైజ్ మంత్రి సిసోడియా తీసుకున్నారు. ► కరోనాతో అమ్మకాలు తగ్గాయనే సాకుతో లైసెన్సు ఫీజులో ఏకంగా రూ.144.36 కోట్ల మేరకు రాయితీ ఇచ్చారు. ► లైసెన్స్ ఫీజు రాయితీ/తగ్గింపు, అనుమతి లేకుండానే ఎల్–1 లైసన్సు పొడిగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ► ఈ గోల్‌మాల్‌లో విజయ్‌నాయర్, మనోజ్ రాయ్, పెర్నాడ్రిచర్డ్, అమన్‌దీప్ ధాల్, సమీర్ మహేంద్రు తదితర మద్యం లైసెన్సుదారులు, వ్యాపారుల పాత్ర ఉంది. ► వారి నుంచి సిసోడియా సన్నిహితులకు నుంచి కోట్లలో ముడుపులందాయి. మహేంద్రు వారికి రెండు విడతల్లో కోట్లు చెల్లించారు. ► సిసోడియాకు అతి సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండే వసూళ్లకు పాల్పడ్డారు. ► దినేశ్ అరోరాకు చెందిన రాధా అసోసియేట్స్ కు మహేంద్రు నుంచి రూ.కోటి అందింది. ► విజయ్ నాయర్ తరఫున మహేంద్రు నుంచి పాండే కూడా రూ.2 నుంచి 4 కోట్ల దాకా వసూలు చేశారు. ► మహేంద్రు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై లంచాలు వసూలు చేసి నిబంధనల తారుమారుకు సాయపడ్డ ప్రభుత్వాధికారులకు ఇచ్చారు. హైదరాబాద్ వ్యాపారిపైనా.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లోనూ సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్ కోకాపేటతో పాటు బెంగళూరులో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, డిస్టిలరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలున్నాయి. కాకరేపిన కథనం ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక గురువారం తన అంతర్జాతీయ ఎడిషన్‌లో మొదటి పేజీలో ప్రముఖంగా కథనం ప్రచురించింది. ‘‘ఆప్ పాలనలో ఢిల్లీ విద్యా విధానంలో సమూలమైన మౌలిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు’’ అంటూ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీ మోడల్ విద్యా విధానంపై దృష్టి పెట్టాయని పేర్కొంది. విద్యార్థినులతో సిసోడియా ఉన్న ఫొటోను కూడా ప్రచురించింది. ఆకస్మిక పర్యటనలు తదితరాల ద్వారా విద్యా మంత్రిగా ఆయన బాగా పని చేస్తున్నారని రాసింది. బీజేపీ, ఆప్ మాటల యుద్ధానికి ఈ కథనమే ప్రధాన ఆయుధంగా మారింది. అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడాన్ని ఓర్వలేకే సిసోడియాపైకి మోదీ ఇలా సీబీఐని ఉసిగొల్పారని ఆప్ నేతలంతా ఆరోపించారు. ‘‘సిసోడియా ఫొటోను న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో వేసి మెచ్చుకుంది. కేంద్రం వెంటనే ఆయన ఇంటికి సీబీఐని పంపింది’’ అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ తీరు సిగ్గుచేటని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. బీజీపీ మాత్రం ఇది కచ్చితంగా ఆప్ డబ్బులిచ్చి రాయించుకున్న కథనమేనంటూ ఎదురుదాడికి దిగింది. ప్రచారం కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించింది. ‘‘ఆప్ సర్కారు కీర్తి కండూతికి న్యూయార్క్ టైమ్స్ కథనమే తాజా ఉదాహరణ. ఈ కథనం అదే రోజు ఖలీజ్ టైమ్స్ అనే పత్రికలోనూ యథాతథంగా వచ్చింది’’ అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. పెయిడ్ ఆర్టికల్ కాదు: న్యూయార్క్ టైమ్స్ పెయిడ్ ఆర్టికల్ ఆరోపణలను న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. అది తాము క్షేత్రస్థాయిలో పరిశోధించి పూర్తి నిష్పాక్షికంగా రాసిన కథనమని స్పష్టం చేసింది. ఇదే కథనాన్ని ఖలీజ్ టైమ్స్ వార్తా పత్రిక కూడా అదే రోజు యథాతథంగా ప్రచురించడంపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను కొట్టిపారేసింది. ‘‘మా లైసెన్సున్న పలు వార్తా సంస్థలు మా కథనాలను ప్రచురించుకోవడం మామూలే’’ అని పేర్కొంది. -
Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23 ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్ హోమ్ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్ దుకాణాలను నడుపుతున్నాయి. ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం -
సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్‌గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. 'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్‌ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చదవండి: 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం -
మద్యం పాలసీలో పెను మార్పులు చేసిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం పాలసీలో పెను మార్పులు తీసుకువచ్చింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి మనిష్ శిశోడియా కొత్త మద్యం పాలసీపై మాట్లాడుతూ.. మందు తాగే చట్టబద్ధమైన వయసును 25 నుంచి 21 మార్చటానికి ప్రభుత్వం నిశ్చయించిందని అన్నారు. కొత్త నియమాల ప్రకారం రాజధానిలోని పేర్లులేని మద్యం షాపులు ఇకపై పనిచేయటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పాత మద్యం షాపులకు కూడా ఈ నియమం వర్తిస్తుందని అన్నారు. రాజధానిలోకి అక్రమ మద్యం రాకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్ర రెవెన్యూను 20 శాతం పెంచుతామని పేర్కొన్నారు. మంత్రుల సంఘం సూచనల మేరకు రాష్ట్ర కేబినేట్ ఈ కొత్త పాలసీలను ఆమోదించిందని తెలిపారు. రాజధానిలో కొత్తగా ఏ మద్యం షాపు తెరవటానికి వీల్లేదని, ప్రభుత్వం ఏ మద్యం షాపును నడపబోదని వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలోని 60 శాతం మద్యం షాపులను ప్రభుత్వం నడుపుతోందని చెప్పారు. నకిలీ మద్యాన్ని గుర్తించటానికి నగరంలో ఓ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చదవండి : ఆ ప్రాజెక్ట్‌తో బుందేల్‌ఖండ్ రూపురేఖలు మారతాయి -
నెలరోజుల్లో కొత్త పాలసీ!
సాక్షి, వికారాబాద్: వచ్చేనెల 30తో మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాత మద్యం పాలసీని కొనసాగిస్తుందా.. లేదా కొత్త విధానాన్ని తీసుకొస్తుందా.. అని మద్యం వ్యాపారులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సర్కారుకు ఎక్సైజ్‌శాఖ నుంచి భారీగా ఆదాయం సమకూరుతోంది. త్వరలో మద్యం లైసెన్సుల గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈసారి టెండర్లు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడనున్నారు. కొత్తవారు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు జిల్లాలోని వ్యాపారులతోపాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు సైతం మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ వ్యాపారం చేసేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయా జిల్లాల వ్యాపారులు మద్యం టెండర్లలో పాల్గొనడంతోపాటు దుకాణాలు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. 2017 కంటే ఈ దఫా మరింత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుండడంతో రాజకీయ నాయకులతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్యం వ్యాపారులు, సిండికేట్లు సైతం మన జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మద్యం దుకాణాల టెండర్లు దక్కించుకునేందుకు ఈసారి పోటీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 446 దరఖాస్తులు, రూ.43.70 కోట్లు గతంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్లను రెండేళ్లకు ఖరారు చేసింది. 2017–2019 పాలసీ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు మద్యం లైసెన్సుల గడువు పూర్తి కానుంది. అంతకు ముందు టెండర్లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన ధరావత్తు తక్కువ మేర ఉండేది. 2017లో దానిని లక్ష రూపాయలకు పెంచారు. ఆలాగే ఆయా ప్రాంతాలను బట్టి దుకాణాలను నాలుగు స్లాబ్‌లుగా విభిజించి లైసెన్స్‌లు కేటాయించారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 45 మద్యం దుకాణాలు ఉండగా గ్రామీణ ప్రాంతంలోని 29 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజు రూ.90 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని 16 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును రూ.1.10 కోట్లుగా నిర్ణయించారు. గతంలో 45 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించిన ఎక్సైజ్ శాఖకు మొత్తం 446 దరఖాస్తులు అందాయి. 2017 సెప్టెంబర్‌లో జిల్లాలోని 45 మద్యం దుకాణాల టెండర్లను లాటరీ పద్ధతిలో నిర్వహించి లైసెన్స్‌లు జారీ చేశారు. టెండర్ ప్రక్రియ ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.43.77 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం దుకాణాల్లో ఏడు మద్యం షాపులు లైసెన్స్‌లు అప్పట్లో మహిళలకు దక్కడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్ వచ్చేనెల 30తో ముగియనుంది. దీంతో మద్యం వ్యాపారులంతా నిరీక్షిస్తున్నారు. దుకాణాలు పెరుగుతాయా..? వచ్చేనెల మొదటి వారంలో ఎక్సైజ్ శాఖ నుంచి విధివిధానాలు వెలుబడే అవకాశం ఉంది. గత రెండేళ్లలో జిల్లాలోని 45 మద్యం దుకాణాల్లో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే, మద్యం విక్రయాలు జిల్లాలో లక్ష్యానికి మించి జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్జైజ్ శాఖ మద్యం దుకాణాల సంఖ్యను పెంచే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న 45 మద్యం దుకాణాలకు అదనంగా మరో ఏడు నుంచి పది షాపులను పెంచవచ్చని విశ్వసనీయ సమాచారం. అలాగే కొత్త మున్సిపాలిటీల్లోనూ బార్ల కోసం లైసెన్స్‌లు జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలైన పరిగి, కొడంగల్‌లో బార్లు ఏర్పాటు కానున్నాయి. కాగా, పట్టణాల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న పర్మిట్ రూమ్ లైసెన్స్‌లను ఎత్తివేయొచ్చని తెలుస్తోంది. -
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
-
బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు మద్య నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్ననే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. తాజాగా అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘బెల్టుషాపులపై ఉక్కుపాదం. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది. అక్టోబర్ నుంచి 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. (చదవండి: ఉద్వేగానికి లోనవుతున్నా) -
‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’
సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు. మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.