expelled
-
హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్
చండీగఢ్: ఈరోజు(శనివారం) హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఇంతలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. నలుగురు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన నలుగురూ హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ కూడా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతల్లో ఉన్నారు. ఈమెతో పాటు గౌతమ్ సర్దానా, తరుణ్ జైన్, అమిత్ గ్రోవర్‌లను పార్టీ బహిష్కరించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన నలుగురు నేతలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురికావడంపై విలేకరులు సావిత్రి జిందాల్‌ను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తెలిస్తే చెబుతానని అన్నారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. 2009లో సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్ ఓటు వేసేందుకు గుర్రంపై స్వారీ చేసుకుంటూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రపు స్వారీ చేయడం శుభపరిణామంగా భావిస్తారని, మా అమ్మ సావిత్రి జిందాల్ హిసార్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, హిసార్ అభివృద్ధికి ఆమె పాటుపడాలనుకుంటున్నారన్నారు. కాగా నవీన్ జిందాల్ బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే తన తల్లి నిర్ణయాన్ని సమర్థించారు. తన తల్లికి మద్దతు ఇస్తానని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా? -
ముఖ్యమంత్రిపై పోటీ.. 8 మంది రెబల్స్‌పై వేటు
న్యూఢిల్లీ: అక్టోబరు 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు హర్యానా బీజేపీ ఎనిమిది మంది రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీతో సహా ఇతర బీజేపీ నాయకులపై పోటీ చేసేందుకు రెబల్స్ ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అధిష్టానం వారిని పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ జాబితాలో మాజీ మంత్రి రంజిత్ చౌతాలా సైతం ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ చౌతాలా తన పదవికి రాజీనామా చేశారు. లాడ్వా నియోజక వర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన సందీప్ గార్గ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.బహిష్కరణకు గురైన ఇతర ఆరుగురు నాయకులు అసంధ్ స్థానం నుండి పోటీ చేస్తున్న జిలే రామ్ శర్మ, సఫిడో నుండి మాజీ మంత్రి బచన్ సింగ్ ఆర్య, మెహమ్ నుండి రాధా అహ్లావత్, గుర్గావ్ నుండి నవీన్ గోయల్, హతిన్ నుండి కెహర్ సింగ్ రావత్, మాజీ ఎమ్మెల్యే దేవేంద్ర కద్యన్ ఉన్నారు.రంజిత్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రానియా నుండి ఎన్నికల టిక్కెట్ నిరాకరించడంతో పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Sanjay Nirupam: కొంప ముంచిన విమర్శలు.. ఆరేళ్లపాటు బహిష్కరణ
ముంబై: లోభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్పై వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ‘సంజయ్ నిరూపమ్ క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణు గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి కూడా పేరును కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మాజీ లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పనిచేసిన సంజయ్ నిరూపమ్.. ఇటీవల సీట్ల పంపిణీ విషయంలో ‘మహావికాశ్ ఆఘాడీ కూటమి’లోని శివసేన(యూబీటీ) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఎక్స్ వేదికగా సంజయ్ నిరూపమ్ స్పందించారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవడానికి మరింత శక్తిని కూడదీసుకోవాలి. నేను పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. తదుపరి నా కార్యాచరణను తెలియజేస్తాను’ అని ట్వీట్ చేశారు. మహావికాశ్ ఆఘాడీ కూటమిలో భాగంగా ముంబైలోని ఆరు స్థానాల్లో నాలుగు సీట్లను శివసేన (యూబీటీ)కి కేటాయించటంపై కాంగ్రస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను పోటీ చేద్దామని భావిస్తున్న ముంబై నార్త్ వెస్ట్ స్థానం శివసేన (యూబీటీ) దక్కటంపై సొంతపార్టీపైనే విమర్శల దాడికి దిగారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలో పోటీ చేసిన సంజయ్ నిరూపమ్ సమీప బీజేపీ అభ్యర్థి గోపాల్‌శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు. -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలందరూ ఆమెకు మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | "This is vendetta politics of BJP. They killed democracy....It is injustice. Mahua will win the battle. The people will give justice. They (BJP) will be defeated in the next election," says TMC chairperson Mamata Banerjee. pic.twitter.com/Y88F8YhNwK — ANI (@ANI) December 8, 2023 ఇక ఈ వ్యహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని మండిపడ్డారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని దుయ్యబట్టారు. బీజేపీ తమ పార్టీ ఎంపీపై వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అన్నారు. మహువా మెయిత్రా మళ్లీ గెలిచి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ప్రజలు న్యాయం చేస్తారని చెప్పారు. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు. -
కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి..
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా దౌత్యకార్యాలయంలోని భారతీయ ఏజెంట్ ప్రమేయముందని ఆరోపిస్తూ ఆయనకు బహిష్కరించిన కొద్దీ సేపటికే భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్‌కు సంబంధమున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ప్రకటించారు. ఆయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. The High Commissioner of Canada to India was summoned today by GOI and informed about it’s decision to expel senior Canadian diplomat and to leave India within the next five days! pic.twitter.com/wgJdvpLnzE — Prof.N John Camm (@njohncamm) September 19, 2023 ఇది కూడా చదవండి: గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ -
కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..
గౌహతి: కిసాన్ మోర్చా నాయకురాలు ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న ఓ నాయకుని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అసోం బీజేపీ. గత శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన ఓ మహిళ గౌహతిలో తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళా నాయకురాలు ఇతర పార్టీ నాయకునితో ఉన్న అశ్లీల ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితునిగా ఉన్న పార్టీ నాయకుని సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: 50 శాతం కమిషన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై కేసు.. -
బెంగాల్ కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ బర్తరఫ్
-
Partha Chatterjee: పార్థా ఛటర్జీపై సీఎం మమత బెనర్జీ వేటు
కోల్‌కత: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్స్ట్రక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. (చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు) అవన్నీ చెప్పలేం ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. కాగా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు స్కామ్‌లో పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు గుర్తించిన ఈడీ కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని రికవరీ చేసింది. ఇవేకాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్చేంజీకి సంబంధించిన పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. (చదవండి: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్) -
కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో బీజేపీ విజయకేతనం ఎగురవేయగా.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. కానీ కాంగ్రెస్‌కి హర్యానాలో ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో రెండు స్థానాలకు ఎన్నికలకు జరగగా.. బీజేపీ నుంచి కృష్ణలాల్ పన్వార్ విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అజయ్ మాకెన్ ఓటమిని ఎదుర్కొన్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఆయన శర్మకు ఓటేయడంతో ఆ ఓటును అనర్హతగా ప్రకటించారు. కుల్దీప్ వేసిన ఎత్తుగడ అజయ్ మాకెన్ ఓటమికి దారి తీయడంతో పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీ పదవుల నుంచి తక్షణమే బహిష్కరించింది. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
అనూహ్య నిర్ణయం తీసుకున్న అఖిలేష్!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు దగ్గరైన కొందరు నాయకులపై వేటు వేశాడు అఖిలేష్. దీంతో శివపాల్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘాజీపూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే, కైలాష్ సింగ్, ఘాజీపూర్ జిల్లా మాజీ పంచాయతీ అధ్యక్షుడు విజయ్ యాదవ్ సహా పలువురు పార్టీ సభ్యులను బహిష్కరించారు. ఇదిలా ఉండగా, పార్టీ మిత్రపక్షాలైన అప్నాదళ్ (కె), సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) నాయకులతో యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి జస్వంత్ నగర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేసిన అఖిలేష్ బాబాయ్ , ఎమ్మెల్యే, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (పీఎస్పీ) నేత శివపాల్ యాదవ్ హాజరుకాలేదు. ఆయనతోపాటు అప్నాదళ్ (కె) నేత పల్లవి పటేల్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. అఖిలేష్ యాదవ్‌తో జరిగిన సమావేశానికి ఎస్‌బిఎస్‌పి అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఆర్ఎల్డి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్‌పాల్ బలియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓటిమికి గల కారణాలు, సామాన్యుడి సమస్యలు, నిరుద్యోగం తదితర విషయాల పై చర్చించారు. అయితే సమావేశానికి శివపాల్ యాదవ్ గైర్హాజరు కావడంపై ప్రశ్నించగా.. ఎలాంటి గొడవలు లేవని.. అందరం కలిసి ఉన్నామని అఖిలేష్ చెప్పారు. (చదవండి: బీజేపీపై ఉమ్మడి పోరు ) -
మంత్రాల నెపంతో 3 కుటుంబాల వెలి
గూడూరు: మంత్రాల నెపంతో మూడు కుటుంబాలను తండా నుంచి బహిష్కరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు మాజీ ఎంపీటీసీ జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల కిందట తండా మధ్యలో బొడ్రాయి ప్రతిష్టించాలని తండావాసులంతా నిర్ణయించారు. మరో రెండ్రోజుల్లో బొడ్రాయి ప్రతిష్టాపన ఉందనగా తండా వీధులన్నీ శుభ్రం చేసే పని మొదలు పెట్టారు. దీంతో అందరూ నిర్ణయించిన చోట బొడ్రాయి ప్రతిష్టించకూడదని జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్న చెప్పారు. తమ మాటను వ్యతిరేకించారని తండావాసులంతా కలిసి ఆ మూడు కుటుంబాలు మంత్రాలు వేస్తున్నాయంటూ నిందించి, వారితో ఎవరూ మాట్లాడరాదంటూ, వారి ఇళ్లు ఉండే వీధికి ఎవరూ వెళ్లకూడదని, వారు తండాలోకి రాకూడదని నిర్ణయించి దారికి అడ్డుగా ముల్లకంప, రాళ్లు వేశారు. వారు ఉపయోగించే బోర్వెల్ను పాడుచేశారు. దీంతో బాధిత కుటుంబాలు రెండ్రోజుల కిందట గూడూరు పోలీసులను ఆశ్రయించాయి. స్థానిక ఎస్సై సతీశ్‌గౌడ్ తండావాసులకు నచ్చచెప్పి వచ్చారు. అయినా తండావాసులు ఆ మూడు కుటుంబాలను కలుపుకోకుండా శనివారం బొడ్రాయి ప్రతిష్టాపన జరపాలని నిర్ణయించారు. దీంతో మానసికంగా మరింత కుంగిన బాధిత కుటుంబాలు శుక్రవారం గ్రామపంచాయతీ పెద్దలు, ఇతర తండా పెద్దలతో గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ఐరాసలో రష్యా దౌత్యాధికారుల బహిష్కరణ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 12 మంది దౌత్యాధికారులను అమెరికా బహిష్కరించింది. వీరంతా గూఢచర్య కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆరోపించింది. అమెరికాది రెచ్చగొట్టే చర్యన్న రష్యా, ఐరాసకు కేంద్రకార్యాలయం ఉన్న దేశంగా అమెరికా ఈ విధంగా చేయడం ఐరాస నిబద్ధతకు వ్యతిరేకమని విమర్శించింది. ఐరాసలో రష్యా శాశ్వత రాయబార బృందానికి, ఐరాస కేంద్ర కార్యాలయానికి బహిష్కరణ విషయాన్ని తెలియజేశామని ఐరాసలో అమెరికా రాయబారి ప్రతినిధి ఓలివియా డాల్టన్ తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని వీరిపై చర్య తీసుకున్నామని, ఐరాస కేంద్రకార్యాలయ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే వారిని బహిష్కరించామని వివరించారు. అమెరికా చర్య నిబంధనలకు వ్యతిరేకమని రష్యా రాయబారి వాస్లీ నెబెంజియా విమర్శించారు. అమెరికా చర్యకు తప్పక ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన భద్రతామండలి సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఎజెండాలో రాయబారుల బహిష్కరణ అంశం లేదని నెబెంజియాను యూఎస్ ప్రతినిధి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌లో మానవీయ సంక్షోభాన్ని చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటైందన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ బీజేపీలో చేరారు. ఆయన డెహ్రాడూన్‌లోని పార్టీ కార్యాలయంలో.. గోవా బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్, కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఆధ్వర్యంలో బీజేపీ కండువ కప్పుకున్నారు. కిషోర్ ఉపాధ్యాయను బీజేపీ నాయకులు సాదరంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా కిషోర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు నచ్చి పార్టీలో చేరానని తెలిపారు. కాగా, బుధవారం కిషోర్ ఉపాధ్యాయను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయన కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్ ఎన్నోసార్లు మందలించింది. ఆయన ప్రవర్తనలో మార్పురాకపోవటం వలన బహిష్కరణ విధిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బుధవారం ఆయనను.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ చార్జ్ దేవేందర్ యాదవ్ బహిష్కరిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే బీజేపీలో చేరడం ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో చర్చకు దారితీస్తోంది. చదవండి: గోవా రాజకీయాల్లో కీలక మార్పు.. పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి -
వంద పేజీల లేఖ.. ఇదేం లవ్ రా సామి!
100 Pages Harassment Letter.. Indian Origin Student Sahil Bhavnani Expelled From UK University For Stalking: ఆ యువకుడు ఆ అమ్మాయి ఒకే కాలేజ్‌లో చదువుతున్నారు. ఓరోజు లవ్ ప్రపోజ్ చేశాడు. జీవితాన్ని పంచుకుంటానని బతిమాలాడాడు. ఆసక్తి లేదని చెప్పింది. అయినా ప్రయత్నాలు మానలేదు. ‘ఛీ కొట్టింది’. కోపంలో ‘వెరైటీ’గా బెదిరింపులకు దిగాడు. వాయిస్ మెసేజ్‌లతో వేధించాడు. స్నేహితులతో భయపెట్టించాడు. ఏకంగా వంద పేజీల లేఖ రాసి ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. కానీ, యువతి ధైర్యం చేసి ఫిర్యాదు చేసింది. ఆ ప్రేమోన్మాదికి సరైన శిక్షే పడింది!. ఓ యువతి(26)ని వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థికి తగిన శిక్షే పడింది. సాహిల్ భవ్నానీ(22) అనే స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో ఓ నర్సింగ్ విద్యార్థిని(విదేశీ యువతి!)ని వేధించిన కేసులో బహిష్కరణ శిక్షకు గురయ్యాడు. నాలుగు నెలల శిక్షతో పాటు రెండేళ్ల వేటు, ఐదేళ్ల పాటు బహిష్కరణ శిక్షను ప్రకటించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు కోర్టు. ఒకవేళ తీర్పును ఉల్లంఘిస్తే.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని కోర్టు అతన్ని స్ట్రాంగ్‌గానే హెచ్చరించింది. ఇదిలా ఉంటే సాహిల్‌కు కాలేజ్‌లోనే కిందటి ఏడాది ఆ యువతితో పరిచయం అయ్యింది. లవ్ ప్రపోజ్ చేస్తే.. ఆమె ఒప్పుకోలేదు. ఓరోజు ఆరు నిమిషాల వాయిస్ సందేశం పంపాడు. ఆ వాయిస్ సందేశంలో ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, పిల్లలను కని సంతోషకరమైన జీవితం గడుపుదామని కోరాడు. ఆమె ససేమీరా అంది. అక్కడితో ఆగకుండా వంద పేజీల లేఖతో ఓ బెదిరింపు లేఖను కొరియర్ చేశాడు. దీంతో ఆమెలో భయం మొదలైంది. ఆపై తన స్నేహితులతోనూ లొంగిపోవాలని, లేకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయని ఆమెకు దమ్కీ ఇప్పించాడు. దీంతో సాహిల్ లైంగిక దాడికి పాల్పడతాడనే భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వెంటపడి వేధించిన నేరం ఒప్పుకోవడం, యువతికి నిందితుడు ఎలాంటి హాని చేయలేదన్న వాదనతో శిక్ష మోతాదును తగ్గించింది ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు. ఇక తన నేరాన్ని ఒప్పుకున్న సాహిల్.. మూడు నెలలపాటు గూగుల్‌లో కవితల్ని చదివి.. ఆపై ఆ వంద పేజీల రాక్షస ప్రేమ లేఖను సిద్ధం చేశాడట!. నిజానికి కిందటి నెలలోనే ఈ కేసులో వాదనలు పూరైనప్పటికీ.. తీర్పు ఆలస్యం(జనవరిలో)గా వెలువడుతుంది అంతా అనుకున్నారు. అయితే భవ్నానీ శనివారం తన తండ్రితో కలిసి హాంకాంగ్‌కు వెళ్తున్నాడన్న సమాచారం తెలియడంతో న్యాయమూర్తి నిగెల్ డాలీ ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో తీర్పును ప్రకటించారు. ‘ఇప్పటికైనా ఆ అమ్మాయి వెంటపడవనే అనుకుంటున్నా’ అంటూ జడ్జి భవ్నానీని ఉద్దేశించి సున్నింతగా మందలించారు. మరోవైపు యూకే యూనివర్సిటిల్లో విద్యార్థినులపై వేధింపుల ఘటనలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. చదవండి: విదేశాలకు చెక్కేస్తున్న దేశ మిలియనీర్లు..! -
టీమిండియాపై పాక్ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్ తొలగింపు
Teacher Expresses Joy Over Pakistan Win Against India Gets Expelled: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియాపై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టింది. ఇందులో 'మేం గెలిచాం' అంటూ పాక్ ఆటగాళ్ల ఫోటోలు ఉంచింది. ఇది గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లోని ఒకరు మీరు పాక్‌కు మద్దతిస్తున్నారా అని నఫీసాను ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు..నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్షాట్లను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును జారీ చేసింది. ఇది కూడా వైరల్ కావడంతో సర్వత్రా దీనిపై చర్చ నడుస్తుంది. చదవండి: T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రేమ వివాహం.. 36 ఏళ్లుగా కుటుంబం వెలివేత
కోవెలకుంట్ల: ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని కుల పెద్దలు ఆ సామాజిక వర్గం నుంచి వెలివేయడంతోపాటు సినిమాలో పెదరాయుడు తరహాలో ఇచ్చిన తీర్పును మూడు దశాబ్ధాల నుంచి కొనసాగిస్తున్నారు. తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకోవాలని బాధితులు గత 36 సంవత్సరాల నుంచి న్యాయపోరాటం చేస్తున్నా ఫలితం దక్కలేదు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం రాముడు, ఓబుళమ్మ కుమారుడు పెద్దరాముడు 1985వ సంవత్సరంలో రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామంలో మరో కులానికి చెందిన రాధమ్మను ప్రేమించి పెళ్లాడాడు. వేరే కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో కుల పెద్దలు ఆగ్రహించి ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్లు పంచాయితీ తీర్పు ఇచ్చారు. కులానికి చెందిన వ్యక్తులు పెద్దరాముడు కుటుంబానికి అన్నం పెట్టినా, మంచినీరు ఇచ్చినా, వారితో మాట్లాడినా, బాగోగులు, శుభకార్యాలకు వెళ్లినా రూ. 5వేలు జరిమాన విధిస్తామని అప్పట్లో కట్టుబాటు విధించారు. 36 ఏళ్లుగా న్యాయ పోరాటం: ఇలాంటి సంఘటన మరే ఇతర ప్రేమ జంటకు జరగకూడదని ఆ ప్రేమ జంట చేస్తున్న పోరాటానికి మూడున్నర దశాబ్ధాల కాలమైనా న్యాయం జరుగలేదు. వేరే కులానికిచెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ కులపెద్దలు పూసల కులం నుంచి వెలివేయడంతో తిరిగి కులంలో చేర్చుకోవాలని ఆ జంట గత 36 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ తిరగని పోలీస్స్టేషన్లేదు. చిన్న కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కని కోర్టులేదు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. పోలీస్స్టేషన్లు, కోర్టులు, పంచాయితీల రూపంలో రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక పట్టణంలో స్టేట్‌బ్యాంక్ రోడ్డులో రూ. కోటి విలువ చేసే ఇంటిని ఇరవై ఐదు ఏళ్ల క్రితం రూ. 20 లక్షలకే విక్రయించాడు. ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మినా న్యాయం జరగకపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతోంది. పూసల వ్యాపారం, రికార్డ్ డ్యాన్సర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి రాము సంతానం కాగా నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో ఫోటో స్టూడియో నడుపుకుంటూ కులం నుంచి వెలివేయడంతో ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 12 ఏళ్ల నుంచి పెద్దకర్మలకు దూరం: కులం నుంచి వెలివేయడంతో 12 ఏళ్ల నుంచి పెద్దరాముడు కుటుంబం పెద్ద కర్మలకు దూరంగా ఉంటోంది. 2009 సంవత్సరంలో తండ్రి, తర్వాత ఆరు నెలలకు తల్లి, తర్వాతి ఏడాది సోదరుడు మృతి చెందారు. పూసల కులంలో తొమ్మిది, 11 రోజుల్లో పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంది. ఇదే కులానికి చెందిన గూడేగాడు(పూజారి) ఆధ్వర్యంలో పెద్దకర్మలు చేయాలి. కులం నుంచి వెలివేయడంతో గూడేగాడు పెద్దకర్మలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు మృతి చెందిన ఏ ఒక్కరికి పెద్దకర్మ చేయలేదు. పెద్దకర్మలు చేయని కారణంగా ఆ కుటుంబం ఆలయాలకు, ఇతర శుభకార్యాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పూజలు, తదితర శుభ కార్యాలయాలకు దూరమైంది. 1985వ సంవత్సరానికి ముందూ కోవెలకుంట్ల, వెలగటూరు, అమడాల, బిజనవేముల, ముక్కమల్ల, గుళ్లదూర్తి, తదితర గ్రామాల్లో 100 పూసల కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం 350కిపైగా చేరింది. ఈ కుటుంబాలు వృత్తిరీత్యా కోవెలకుంట్ల పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, వైఎస్ఆర్, అనంతపురం జిల్లాల్లో స్థిరపడ్డారు. మూడు జిల్లాల్లో ఉన్న పూసల కులంలో పెద్దరాముడు కుటుంబానికి విధించిన కట్టుబాటు ఇప్పటికి కొనసాగుతుండటం గమనార్హం. తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధిత కుటుంబాన్ని పట్టించుకోని అధికారులు: కులంలో చేర్చుకోవాలని గత 36 ఏళ్లుగా బాధిత కుటుంబం పోరాటం చేస్తోంది. 1998వ సంవత్సరం హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ స్వీకరించిన కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అప్పటి అధికారులు, గ్రామ పెద్దలు పెద్దరాముడిపై తప్పుడు నివేదిక ఇవ్వడంతో కోర్టు కేసు కొట్టివేసింది. తదనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంశాఖ మంత్రులు మాధవరెడ్డి, దేవేంద్రగౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో సబితాఇంద్రారెడ్డి, 2018వ సంవత్సరంలో నిమ్మకాయల చిన రాజప్పను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వీరితోపాటు తమకు న్యాయం చేయాలని పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను కలిశారు. మంత్రులు, జిల్లా అధికారులు స్పందించి సంఘటనపై పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినా రెవెన్యూ, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించకపోవడంతో న్యాయం జరుగలేదు. పంచాయితీల పేరుతో కరిగిపోయిన ఆస్తి: ఎస్సీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా కుల పెద్దలు పెద్దరాముడు కుటుంబాన్ని కులం నుంచి వెలివేయడంతోపాటు పంచాయితీల పేరుతో ఉన్న ఆస్తినంతటని కాజేశారు. పూసల కులంలో పంచాయితీ నిర్వహిస్తే ఇరు వర్గాలు చెరో రూ. లక్ష పెద్దల సమక్షంలో జమ చేయాల్సి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని చిన్న సమస్యను పెద్దదిగా సృష్టించి 1991వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఏడు పర్యాయాలు కోవెలకుంట్ల, తాడిపత్రి, బేతంచెర్ల, అవుకు, ఒంటి వెలగల, ఆళ్లగడ్డ, తదితర ప్రాంతాల్లో పంచాయితీలు నిర్వహించారు. కులంలో కలవాలన్న తాపాత్రయంతో ప్రతి పంచాయితీకి రూ. లక్ష డిపాజిట్ చేయడంతోపాటు తనకు మద్దతుగా ఇతర కుల సంఘాల నాయకులను తీసుకెళ్లడం, రోజుల తరబడి పంచాయితీలు జరగడంతో వాహనాలు సమకూర్చుకోవడం, భోజన, ఇతర ఖర్చులకు ఒక్కో పంచాయితీకి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కొన్ని పంచాయితీలు నెలల తరబడి కొనసాగాయి. ఈ పంచాయితీల్లో ఒక పంచాయితీ ఏకంగా ఏడాదికాలంపాటు జరిగింది. పంచాయితీలకు వెళ్లే సమయంలో చేతితో డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్వ్యక్తుల వద్ద లక్షలాది రూపాయాలు అప్పులు చేయాల్సి వచ్చింది. కోవెలకుంట్ల పట్టణంలో పెద్దరాముడు కుటుంబానికి రూ. లక్షలు విలువ చేసే ఇళ్లు ఉండటంతో అప్పుదారులు అడిగినంతా అప్పులు ఇచ్చారు. పంచాయితీల్లో న్యాయం జరుగకపోగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఓ ఇంటిని అమ్మి అప్పులు తీర్చినా అప్పులు తీరలేదు. కులంలో కలిసే వరకు పోరాటం: పెద్దరాముడు, బాధితుడు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా 1985వ సంవత్సరంలో నా కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. ఆ ఏడాది నుంచి కులానికి చెందిన వ్యక్తులెవరైనా తమతో మాట్లాడినా, సహకరించినా రూ. 5వేలు జరిమాన విధించేలా కుల పెద్దలు కట్టుబాటు విధించారు. తన కుటుంబాన్ని కులంలో కలుపుకోవాలని గత 36 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. కులంలో కలుపుకోవడంతోపాటు తల్లిదండ్రులు, సోదరుడి పెద్దకర్మలు జరిపే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాను. పదిరోజుల క్రితం కూడా కలెక్టర్, పోలీసు అధికారులను కలిసి విన్నవించుకున్నా స్థానిక అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి కాలయాపన చేస్తున్నారు. -
నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్ నేత గణేశ్ షా వెల్లడించారు. ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్ నేపాల్‌ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్ కమిటీ జనవరి 15న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్ షా తెలిపారు. -
విజయవాడలో రౌడీ షీటర్ నగర బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్‌పై నగర బహిష్కరణ వేటు పడింది. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం అతన్ని నగరం నుంచి ఆరునెలల పాటు బహిష్కష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూసఫ్ పఠాన్‌పై ఇదివరకే గన్నవరం పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. అతని నేరప్రవృత్తిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో పోలీసులు అతడిపై బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఇప్పటికే ఇద్దరు రౌడీ షీటర్లను విజయవాడ నుంచి బహిష్కరించారు. ఈ వరుస బహిష్కరణల పర్వం రౌడీ షీటర్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. (విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు) చదవండి: (విశాఖ గ్యాంగ్‌వార్.. పోలీసులు సీరియస్..) -
సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ
న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఈ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాశంగా మారింది. ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం పేరుతో బాధితురాలిని హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ ఇదంతా చేయించారన్న ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంతేకాకుండా సెంగార్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ సెంగార్‌పై చర్యలకు ఉపక్రమించింది. సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించింది. కొద్ది రోజుల కిందట సెంగార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపిన బీజేపీ.. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నది మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు తప్పుపట్టిన కొన్ని గంటల్లోనే బీజేపీ సెంగార్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. మరోవైపు బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సెంగార్ ఇంటికి ఉద్యోగం కోసం వెళ్లిన తనపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం ఆమె తండ్రిని అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన చనిపోవడంతో బాధితురాలు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి సిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్ అరెస్ట్ చేసి.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఏడాది గడిచిన కూడా ఈ కేసులో ఎటువంటి చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్ : ఎమ్మెల్యేపై వేటు
హరిద్వార్ : మద్యం సేవిస్తూ గన్స్‌ను చేతబట్టి డ్యాన్స్‌లు చేస్తూ కెమెరాకు చిక్కిన ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్టు బీజేపీ బుధవారం వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో కున్వర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు మూడు పిస్టల్స్, రైఫిల్స్ చూపుతూ డ్యాన్స్ చేయడం దుమారం రేపింది. తాను చేస్తున్న ఈ ఫీట్‌ను దేశంలో ఏ ఒక్కరూ చేయలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈ వీడియోలో అనుచరులతో చెప్పడం వినిపించింది. ఎమ్మెల్యే చర్యపై పార్టీ వివరణ కోరగా ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో చర్య తీసుకున్నామని బీజేపీ జాతీయ మీడియా ఇన్చార్జి అనిల్ బలూనీ తెలిపారు. అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించాలని బీజేపీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించిందని చెప్పారు. -
‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’
జైపూర్ : బహిష్కృత జేడీ(యూ) నేత శరద్ యాదవ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజెను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అంటూ ప్రత్యర్దులు విరుచుకుపడ్డారు. వసుంధర రాజె లావయ్యారని, ఆమెకు విశ్రాంతి అవసరమని శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఆమెకు కొంత విశ్రాంతి ఇవ్వండి..మధ్యప్రదేశ్ బిడ్డ అయిన వసుంధర రాజె ఈ మధ్య లావయ్యారు..అలిసిపోతున్నా’రని బుధవారం ఆల్వార్‌లో జరిగిన ఓ ప్రచార సభలో పేర్కొన్నారు. శరద్ యాదవ్ వసుంధర రాజెపై చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. -
మీటూ : సీనియర్ బీజేపీ నేతపై వేటు
డెహ్రాడూన్ : మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఉదంతం తర్వాత మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరో సీనియర్ బీజేపీ నేతపై ఆ పార్టీ వేటు వేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర శాఖ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌ను లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి పార్టీ కేంద్ర నాయకత్వం తప్పించింది. పార్టీ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్‌పై బీజేపీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం ఉత్తరాఖండ్ రాష్ట్ర నేతలకు తెలిపారు. సంజయ్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లడైనప్పటి నుంచీ ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల నేపథ్యంలో సంజయ్‌ను ఢిల్లీ పిలిపించిన అధిష్టానం ఆయనను పార్టీ పదవి నుంచి తప్పిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని వివరించింది. ఉత్తరాఖండ్‌కు పార్టీ త్వరలోనే నూతన ప్రధాన కార్యదర్శిని ప్రకటిస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ గతంలో తాను పత్రికా సంపాదకుడిగా ఉన్న సమయంలో జర్నలిస్ట్ ప్రియా రమణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
శబరిమల వెళ్లినందుకు బహిష్కరణ..!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళ హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె ప్రవర్తించారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫాతిమాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ (సీఎంజే) ఎర్నాకులం కౌన్సిల్‌ను ఆదేశించింది. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మోజో టీవీ జర్నలిస్ట్ కవిత జక్కలతో కలిసి రెహానా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అనేక ఘర్షణలో నడుమ పోలీసు బందోబస్త్‌తో ఇరుముడితో ఇద్దరూ కొండపైకి చేరుకున్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గుడిని ముసివేస్తామని ప్రధాన అర్చకుడు హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారు వెనుదిరిగారు. కొండపైకి వీరి ప్రవేశం తీవ్ర అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ భక్తుల సాంప్రదాయలకు భంగం కలిగే విధంగా రెహానా వ్యవహించిందని.. ఆమెతో పాటు వారి కుటుంబాన్ని కూడా ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ ప్రకటించింది. రెహానా కొండపైకి చెరిన సమయంలో గుర్తుతెలియని కొంతమందివ్యక్తులు ఆమె ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. కాగా వ్యక్తిగతంగా సామాజిక కార్యకర్త అయిన రెహానా గతంలో కేరళలో వివాదస్పదంగా మారిన కిస్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయనికి వ్యతిరేకంగా ఆమె కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొన్నారని జమాత్ కౌన్సిల్ గతంలో ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. -
బొట్టు పెట్టుకొని మదర్సా వెళ్లిందని..!
తిరువనంతపురం : మత సంప్రదాయాలు, కట్టుబాట్లు మంటగలిపిందనే కారణంగా ఐదో తరగతి విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించిన ఘటన ఉత్తర కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కేరళకు చెందిన ఉమర్ మలయిల్ అనే వ్యక్తి కూతురు మదర్సాలో విద్యనభ్యసిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆమె ఒక షార్ట్ ఫిలింలో నటించేందుకు సిద్ధపడింది. నటనలో భాగంగా నుదటిపై గంధాన్ని బొట్టుగా ధరించింది. దీంతో ఆగ్రహించిన మదర్సా యాజమాన్యం.. ముస్లిం అయివుండి ఇలాంటి చర్యకు పాల్పడడం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొంటూ ఆమెను బహిష్కరించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి తన కూతురి పట్ల మదర్సా వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఫేస్బుక్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. ‘ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందు ఉండే నా కూతురు అనేక బహుమతులు పొందింది. ఎంతో ప్రతిభావంతురాలైన నా కూతుర్ని మదర్సా నుంచి తొలగించారనే వార్త తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. నుదుటన గంధపు తిలకం ధరించడమే ఆమె చేసిన పొరపాటు అని వారు చెప్పారు. ఆ సమాధానానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదంటూ’ ఉమర్ మలయిల్ వాపోయారు. కాగా ఆయన పోస్టుకు స్పందించిన నెటిజన్లు మదర్సా తీరును తప్పు పట్టగా.. మరికొంత మంది మాత్రం ‘నీ కూతురికి సరైన శిక్ష పడింది. ఇస్లాంను, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ’ నెగటివ్ కామెంట్లు చేశారు.