exploded
-
స్నానం చేస్తుండగా పేలిన గీజర్..నవ వధువు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లో గీజర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు తన అత్తమామల ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలుడులో ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. బరేలీలోని మీర్గంజ్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.బులంద్‌షహర్‌లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్సనా గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లిన అమ్మాయి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో ఆమె నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. గీజర్ పేలిపోయింది.వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, జగిత్యాల జిల్లా: కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఎలక్ట్రిక్ బైక్ పేలిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఛార్జింగ్ పెడుతుండగా ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది.బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమవ్వగా, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు లక్షా 90 వేల రూపాయలున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.కాగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పేలుడుపై టీవీఎస్ మోటార్ డీలర్‌తో బాధితుడు వాగ్వాదానికి దిగారు. ఇన్సూరెన్స్ ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ డీలర్ తెలిపారు. వరసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో టెన్షన్ కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘ఈవీ’లు... టైంబాంబులు! -
స్టార్‌షిప్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం
టెక్సాస్: చంద్రుడితోపాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘స్టార్‌షిప్’ రాకెట్‌కు సంబంధించిన ఆరో ప్రయోగాన్ని మంగళవారం టెక్సాస్‌లో నిర్వహించారు. ఇందులో ఒక దశ విఫలం కాగా, మరో దశ విజయవంతమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తోపాటు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. దాదాపు 400 అడుగుల(121 మీటర్లు) పొడవైన స్టార్‌షిప్ రాకెట్‌ను స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పేస్ఎక్స్ లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇందులోని 33 శక్తివంతమైన రాప్టర్ ఇంజన్లను మండించడంతో స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. భూమివైపు తిరుగు ప్రయాణం ఆరంభించింది. Booster 13 splashdown in the Gulf of Mexico. Tower was go, but booster was not. pic.twitter.com/RwhZDxPaQU— Chris Bergin - NSF (@NASASpaceflight) November 19, 2024షెడ్యూల్ ప్రకారం మళ్లీ లాంచ్సైట్ వద్దకే చేరుకోవాలి. అక్కడున్న మర చేతులు బూస్టర్‌ను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కానీ, ఇంతలో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియను నిలిపివేశారు. బూస్టర్‌ను నింగిలోనే దారి మళ్లించారు. దాంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయింది. ఖాళీగా ఉన్న స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే 90 నిమిషాలపాటు భూమిచుట్టూ చక్కర్లుకొట్టింది. Starship preparing to splash down in the Indian Ocean pic.twitter.com/EN9jibr07l— SpaceX (@SpaceX) November 19, 2024చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. స్టార్‌షిప్ రాకెట్ప్రయోగ దృశ్యాలను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గత నెలలో చేపట్టిన స్టార్‌షిప్ ఐదో ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. లాంచ్ సైట్ వద్దకు బూస్టర్ క్షేమంగా తిరిగొచ్చింది. మర చేతులు దాన్ని జాగ్రత్తగా అందుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. -
నైజీరియాలో పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 90 మందికి పైగా మృతి
నైజీరియా దేశంలో పెను విపత్తు చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఉత్తర జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.కాగా కనో నుంచి బయల్దేరిన ఓ పెట్రోల్ ట్యాంకర్ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది.దీంతో పెట్రోల్ అంతా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.ఈ ఘటనలో 94 మంది మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 50 మంది వరకు గాయపడిన్టలు బుధవారం పోలీసు ప్రతినిధి లావాన్ షిసు ఆడమ్ వెల్లడించారు.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందారు. -
కుక్కలతో ఈ డేంజర్ కూడా ఉంది, ఈ వీడియో చూడండి!
పెంపుడు జంతువు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కుక్క. విశ్వాసానికి మారు పేరు. యజమానికోసం, కుటుంబ రక్షణ కోసం తన ప్రాణాల్ని ఫణంగా పెడుతుంది. కానీ ఇవి తెలిసీ తెలియక కొన్ని ప్రమాదాలను కొన్ని తెచ్చుకుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికాలోని అగ్నిమాపక విభాగం ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అసలు విషయం ఏమిటంటే.. సాధారణగా పెంపుడు కుక్కలు ఇంట్లో ఏదో ఒక వస్తువును నములుతూ ఉంటాయి. రబ్బర్ వస్తువులు, చెప్పులను కొరికి, కొరికి అవతల పాడేస్తాయి. ఆఖరికి పరుపులు, దిండ్లను కూడా నాశనం చేస్తాయి. అలాగే వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలను నోట్లో పెట్టుకుని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాయి. అమెరికాలోని, ఓక్లహోమా రాష్ట్రంలోని తుల్సా నగరంలో అలాంటిదే జరిగింది. ఒక గదిలో రెండు కుక్కలు, పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఆడలాడుకుంటూ గలాటా సృష్టించింది. ఒక్కసారిగా ఆ బాటరీ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలంటుకున్నాయి. దీంతో భయపడిన మిగిలిన రెండూ అక్కడినుంచి తప్పించుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.NEW: Dog starts a house fire in Tulsa, Oklahoma after chewing through a portable lithium-ion battery. The Tulsa Fire Department released the following video to warn people about the "dangers of lithium-ion batteries." Two dogs and a cat were filmed hanging out before one… pic.twitter.com/skTb8YEzJ6— Collin Rugg (@CollinRugg) August 6, 2024 "లిథియం-అయాన్ బ్యాటరీల ప్రమాదాల" గురించి ప్రజలను హెచ్చరించడానికి తుల్సా అగ్నిమాపక విభాగం క్రింది వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. వీటిని పవర్అనియంత్రితంగా విడుదలైతే, వేడిని ఉత్పత్తి చేస్తుంది, మండే , విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తుంది ,పేలుళ్లకు కూడా దారితీస్తుందని హెచ్చరించింది. కాగా లిథియం అయాన్ బ్యాటరీ అనేది రీచార్జ్ చేసుకొనే బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు. సో.. బీ కేర్‌ఫుల్. -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిపోయిన స్టార్‌షిప్ రాకెట్
టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది. -
గృహంలో బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. వీడియో వైరల్..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. పిట్స్‌బర్గ్‌లో బాంబు పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. పిట్స్‌బర్గ్‌లో పగటిపూటనే బాంబు పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అదే సమయంలో పేలుడుకు పక్కనే ఉన్న నలుగురు యువకులు ఓ చిన్నారి మంటల్లో కాలి మృతి చెందారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. Four Adults And A Child Have Passed Following A House Explosion In Pennsylvania. Three People From Surrounding Homes Were Rushed To Hospitals, One Of Which Is Currently In Critical Condition. 😳🤯 pic.twitter.com/LYyw5QZDDD — 🚘BrutalCams🎥 (@BrutalCams) August 15, 2023 పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన -
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు
-
జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కేరళలో వరుసగా నమోదవుతున్నమొబైల్ ఫోన్ బ్లాస్ట్ సంఘటనలు ఆందోళన రేపుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్‌లో 70 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొబైల్ పేలుడు సంభవించడం ఇది మూడోది. ఇటీవల ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం యూజర్లను కలవర పెడుతోంది. (టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు) మనోరమ న్యూస్ వివరాల ప్రకారం పెద్దాయన ఇలియాస్ టీ షాపులో టీ తాగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీ తాగుతుండగానే సడెన్‌గా షర్ట్ జేబులో ఉన్న ఫోన్‌కు మంటలు వ్యాపించాయి. చొక్కా మీద మంటలు వ్యాపిస్తున్న షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని,ఇది ఫీచర్ ఫోన్ అని బాధితుడు ఇలియాస్ పోలీసులకు తెలిపాడు. ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు లేవని కూడా వెల్లడించాడు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్నట్టుండి స్మార్ట్ ఫోన్ పేలింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయినట్టు సమాచారం. అలాగే త్రిసూర్‌లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి అసువులు బాసిన సంగతి తెలిసిందే. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) -
రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు
మంగళూరు: రహదారిపై ఒక్కసారిగా ఆటో రిక్షా పేలిపోయింది. దట్టమైన పొగ కమ్ముకోవటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మంగళూరు పోలీస్ చీఫ్ ఎన్ శశికుమార్ తెలిపారు. ‘ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయటం తొందరపాటు అవుతుంది. ఆటోలో మంటలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్, ప్రయాణికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రూమర్స్ వ్యాప్తి చేయకూడదని ప్రజలను కోరుతున్నాం. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. బాధితులతో మాట్లాడిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం.’ ఎని తెలిపారు శశికుమార్. రోడ్డుపై ఆటో రిక్షా పేలిపోయిన సంఘటన స్థానికంగా ఉండే ఓ దుకాణం సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు.. ఆటోలోని ప్రయాణికుడు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్తున్నాడని, ముందుగా దానికి మంటలు అంటుకుని వ్యాపించాయని భావిస్తున్నారు. Blast reported inside an auto rikshaw in #Mangaluru City, reportedly two people injured. Investigations ON. pic.twitter.com/6yureZ5n7D — Sumit Chaudhary (@SumitDefence) November 19, 2022 ఇదీ చదవండి: నెల ఆగితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేది.. ఇంతలోనే ఘోర ప్రమాదం.. -
ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
లక్నో: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. దాదాపుగా అన్ని ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలే ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని వినియోగించటంలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాలపైకి వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని ఓ ఇంటిలో ఎల్ఈడీ టీవీ పేలిపోయి 16 ఏళ్ల అమరేందర్ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. తన స్నేహితులతో కలిసి బాధితుడు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడలు సైతం బీటలువారాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. ఈ ఘటనలో బాధితుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా టీవీలు పేలిన సంఘటనలు చాలా అరుదు. దీనికి గల కారణాలపై నిపుణులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడకు బిగించిన ఎల్ఈడీ టీవీ పేలటం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.’ అని గాజియాబాద్ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. టీవీ పేలిపోవటంతో గోడలకు ఏర్పడిన పగుళ్లు ఎల్ఈడీ టీవీ బ్లాస్ట్‌కు కారణాలు.. ►పాత, నకిలీ కెపాసిటర్: ఎల్ఈడీ టీవీలు పేలడానికి ప్రధానంగా పాత లేదా నకిలీ కెపాసిటర్ కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన స్థాయిలో కెపాసిటర్ విద్యుత్తును సరఫరా చేస్తుంది. అయితే, కెపాసిటర్ వల్ల ఆ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు. ► ఓల్టేజ్ హెచ్చుతగ్గులు: విద్యుత్తు ఓల్టెజ్ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయి. ► ఓవర్ హీట్: టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్లతో కనెక్ట్ చేస్తే ఓవర్ హీట్ అవుతుంది. నకిలీ కెపాసిటర్ లాగే ఓవర్ హీట్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ►నిర్వహణ లేకపోవటం: టీవీని గోడకు బిగించామంటే దానిని పట్టించుకోరు. నిర్వహణ సరిగా లేకపోవటం, రిపేర్లు సరైన రీతిలో చేయించకపోవటం వంటివి సైతం పేలడానికి దారితీస్తాయి. రిపేర్ వచ్చినప్పుడు సరైన సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాలి. రిపేర్ కోసం నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలి. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ హక్కుల గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
పూజ చేస్తుండగా పేలిపోయిన బుల్లెట్ బండి
-
ఒకే సిలిండర్‌కు 3 గ్యాస్ కనెక్షన్లు.. నానక్‌రామ్‌గూడలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: నానక్‌రామ్ గూడలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే సిలిండర్‌కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఒక కనెక్షన్లో గ్యాస్ లీకేజీ కావడంతో.. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో లైట్స్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంగా యూపీ, బీహార్‌కు చెందినవారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. -
భీతావహం.. పేలిన దీపావళి బాంబులు
టెక్కలి: ఒక అరుగు ధ్వంసమైపోయింది. పరిసరాలన్నీ రక్తసిక్తమయ్యాయి. వీధంతా భీతావహంగా కనిపించింది. ఇద్దరు ఒళ్లంతా గాయాలతో రోదిస్తున్నారు. టెక్కలిలోని కచేరీ వీధిలో బుధవారం కనిపించిన దృశ్యాలివి. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.20 వరకు ఈ ప్రాంతం భయానకంగా మారింది. దీపావళి కోసం బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అవి పేలడంతో ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్కలి గొల్లవీధికి చెందిన వాకాడ హరి అనే బాలుడు, సందిపేట మూర్తి, సందిపేట సాయిగోపాల్‌తో కలిసి స్థానిక కచేరీ వీధిలోని ఓ మారుమూ ల ప్రాంతంలో బాణసంచా తయారు చేస్తున్నారు. దీని కోసం ఒడిశాలోని పర్లాఖిముడి నుంచి ముడి సరుకులు తెప్పించారు. వీధి అరుగుపై కూర్చుని బాంబులు తయారు చేస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. ఆ ధాటికి బాలుడు హరి, యువకుడు మూర్తి అరుగు మీద నుంచి కిందకు తుళ్లిపోయారు. మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. అరుగంతా ధ్వంసమైపోయింది. పక్క భవనంలోని అద్దాలు సైతం పగిలిపోయాయి. దీపావళి రోజులు కావడంతో బాంబులు పేలిన శబ్దం విని అంతా ఎక్కడో బాణసంచా కాలుస్తున్నారనే అనుకున్నారు. అయితే ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో హరి, మూర్తిలు గట్టిగా ఏడవడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సపర్యలు చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని 108 సాయంతో క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి తల్లిదండ్రులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. హరి, మూర్తిలను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. స్వల్పంగా గాయపడిన సాయిగోపాల్ నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీమ్ టెక్కలి చేరుకుని వివరాలు సేకరించారు. బాంబు పేలిన సంఘటన పై టెక్కలి పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....!
వాషింగ్టన్: అంతరిక్షాన్ని జయించడం కోసం మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే నాసా, పలు దేశాల అంతరిక్ష సంస్థలు అంతరిక్షాన్ని జయించాయి. నాసా, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. అమెరికాకు చెందిన ఫైర్‌ఫై కూడా స్పేస్ రేసులో నిలిచేందుకు ఊవిళ్లురుతుంది. అందులో భాగంగా ఫైర్‌ఫ్లై తొలి రాకెట్ ఆల్ఫాను సెప్టెంబర్ 2న ప్రయోగించింది. చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు ఆల్ఫా రాకెట్ లాంచ్ చేసిన కొద్ది సేపటికే ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. కాగా ఫైర్‌ఫ్లై చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. ఫైర్‌ఫ్లై పేలుడుకు సంబంధించిన వీడియోను అధికారికంగా కంపెనీ రిలీజ్ చేసింది. రాకెట్ ప్రయోగంలో చోటుచేసుకున్న లోపాలను సోషల్‌మీడియాలో ఫైర్ ఫ్లై పేర్కొంది. ఫైర్‌ఫ్లై ఒక ప్రకటనలో రాకెట్ లాంచ్ ఐనా రెండు నిమిషాల తరువాత రాకెట్‌లోని ఒక ఇంజన్ పనిచేయడం నిలిచిపోయినట్లు పేర్కొంది. దీంతో ఒకసారిగా రాకెట్ తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు పోయి ఒక్కసారిగా పేలిపోయిందని కంపెనీ పేర్కొంది. ఆల్ఫా రాకెట్ భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టనప్పటికీ, కంపెనీ భవిష్యత్తులో మరిన్నీ ప్రయోగాలను చేపట్టే నమ్మకం తమలో ఏర్పడిందని ఒక ప్రకటనలో పేర్కొంది. రాకెట్లను నిర్మించగల, ప్రయోగించగల కంపెనీగా ఫైర్‌ఫ్లై నిరూపించిందని కంపెనీ తెలిపింది. -
వాషింగ్ మెషీన్ ఆన్ చేసి లైట్ తీసుకోకండి!
మనం తరుచూ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిందని, గ్యాస్ లీకై పేలిందనే వార్తలు వింటుంటాం. కానీ మీరెప్పుడైనా వాషింగ్ మెషీన్ పేలిందని విన్నారా. అవును ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాషింగ్ మెషీన్ పేలే అవకాశం ఉంది. చాలా మంది వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అలా చేయడం ముమ్మాటి తప్పే. కొన్ని చిట్కాలు పాటిస్తే వాషింగ్ మెషీన్‌ను ఎక్కువ కాలం వినియోగించుకోవడమే కాదు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఇటీవల స్కాట్లాండ్ కు చెందిన లూరా బిరెల్ అనే మహిళ వాషింగ్ మెషీన్ లోలో బట్టలు వేసి, ఇంట్లోనే మరో పనిలో నిమగ్నమైంది. వాషింగ్ మెషీన్ బటన్ ఆన్ చేసిన కొద్ది సేపటి తర్వాత ఇంట్లోనే బాంబు పేలిన శబ్ధం వినిపించింది. దీంతో ఆందోళనకు గురైన లూరా.. ఏం జరిగిందోనని వాషింగ్ మెషీన్ వైపు చూడగా.. అది పేలి పొగలు రావడం గమనించింది. వెంటనే వాషింగ్ మెషీన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే తనకు జరిగిన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. వాషింగ్ మెషీన్ ఆన్ చేసి బయటకు వెళ్లి ఉంటే ఏమయ్యేదోనని ఊహించుకుంటే భయమేస్తుందంటూ నెటిజన్లతో షేర్ చేసుకుంది. వాషింగ్ మెషీన్ పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాషింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేయండి. జాగ్రత్తగా ఉండొచ్చు. ♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్, మెమరీ ఫోమ్ దిండ్లు,స్నీకర్ షూస్, లెదర్ బ్యాగ్స్, జిప్పర్ లు ఎక్కువగా ఉన్న దుస్తుల్ని వాహింగ్ మిషన్ లో వేయడం వల్ల దుస్తులు పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల్ని అప్లయ్ చేస్తే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ♦ ట్యాప్ నుంచి వాషింగ్ మెషీన్‌లోకి వాటర్‌ను పంపే పైపుల్ని మార్చుకోవాలి. ఆ పైపులు పగిలినా, లేదంటే వాటర్ లీక్ అయినా లోపల ఉండే మిషనరీ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ♦ వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉన్నప్పుడు వింత శబ్ధాలు వస్తుంటే వెంటనే దాన్ని మార్చుకోవడం ఉత్తమం. లేదంటే లేని పోని తలనొప్పిల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కరెంట్ షాక్ తగలడం, మెషీన్ బ్లాస్ట్ అవ్వడంలాంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ♦ వాషింగ్ మెషీన్ చుట్టూ మీ పిల్లలు, లేదంటే పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలి. వాషింగ్ మెషీన్ ఆన్ లో ఉండగా ఫ్రంట్ డోర్ సరిగ్గా వేశామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని లోపల వేస్తే..లోపల బట్టల్ని వాష్ చేసే చక్రాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ♦ వాషింగ్ సమయంలో ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవాలి. మీకు సూచించిన విధంగా మెషీన్ ను ఆపరేట్ చేయాలి. ♦ వాషింగ్ మెషీన్ ను నీట్ గా కడగాలి. వాషింగ్ మెషీన్ క్లీనర్ లేదా వేడి నీళ్లు, వెనిగర్, బేకింగ్ సోడాల్ని వినియోగించాలి. వాటిని వినియోగిస్తే లోపల ఉన్న సర్ఫ్, సబ్బు ముక్కలు తొలగిపోతాయి. ఎలాంటి మరమ్మత్తులు రాకుండా చూసుకోవచ్చు. -
విషాదం: 20 అడుగుల ఎత్తుకు ఎగిరి..
జలుమూరు (శ్రీకాకుళం జిల్లా): ట్రాక్టర్ టైరుకు అధికంగా గాలి నింపడంతో పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. సూర్యనారాయణ టైర్ డిస్‌్కతో పాటు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ గోవిందరావును 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాంక్ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ -
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..
సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు. ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్
సాక్షి, అన్నానగర్: చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెలివిజన్‌లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకర్ చేసి ప్రసిద్ధి గాంచిన మణిమేఘలై 2017 నటన మాస్టర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఒంటరిగానే నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో మణిమేఘలై ఇంట్లో వంట చేసేతను రాకపోవడం వల్ల కుక్కర్లో మణిమేఘలై వంట చేసింది. కుక్కర్ విజిల్ రాకుండా కొద్ది సేపటికే పేలిపోయింది. చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. దీనిని మణిమేఘలై ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేశారు. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. చదవండి: ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి? View this post on Instagram Ellam correcta panniyum indha cooker edhuku vedichuthu nu enaku ipo therinjaaganum ☝️ Enna paatha indha cooker ku epdi therithu 🤷♀️ namaku varadha oru vishayatha ini try eh panna kudathu 😕 Kitta nindrundha enna ayirukum 🤯 Athum ivlo kashtathula help pannama video edukara indha Hussain maari aala vachutu onnum panna mudiyathu 🚶♀️ Atleast 1 year ku cooking pakkam pogavey kudathu 🐒 Veedu fulla clean panra kashtam kuda paravaala 🙃 without makeup la indha hussain paiya video record pannadhudhan manavaruthama iruku 😛 @mehussain_7 A post shared by Mani Megalai (@iammanimegalai) on Feb 18, 2020 at 3:57am PST -
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లికొడుకు మృతి
-
బీఎండబ్ల్యూ కారు ఎయిర్ బ్యాగ్ పేలుడు కలకలం
టకాటా ఫాల్టీ ఎయిర్‌బ్యాగ్ మరోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీసింది. బీఎండబ్ల్యూ కారులో ఎయిర్ బ్యాగ్ అకస్మాత్తుగా పేలడంతో కారు యజమానురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన కలకలం రేపుతోంది. జూన్ 18న ఈ పేలుడు సంభవించింది. సంస్థ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్ పేలుడుతో అడిలైడ్‌కు చెందిన జార్జియా బెక్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్ ఒక్కసారిగా పేలి కారు స్టీరింగ్ నుండి, విండి స్క్రీన్‌లోంచి పై కప్పుకు ఎగిసింది. దీంతో జార్జియా గడ్డంకింద, చేతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల సంస్థ చేపట్టినభారీ రీకాల్‌లో భాగంగా ప్యాసింజెర్ వైపు ఎయిర్‌బ్యాగ్‌ను రీప్లేస్ చేసినట్టు ఆమె తెలిపారు. అయితే డ్రైవర్ వైపు ఎయిర్ బ్యాగును పెద్దగా పట్టించుకోలేదు. అదే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినపుడు నల్లటి పొగ అలుముకుందని, గన్ పౌడర్ వాసన వచ్చిందంటూ భయంకరమైన తన అనుభవాన్ని జార్జియా బెక్ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీఎండబ్ల్యూఅంతర్జాతీయ దర్యాప్తునకు ఆదేశించింది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎయిర్‌బ్యాగ్‌ను జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి పంపింది. అయితే 2009 లో ప్రమాదానికి గురైన ఈ కారును పాత యజమాని ఆ విషయాన్ని దాచిపెట్టి , జార్జియాకు విక్రయించినట్టుగా సంస్థ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా టకాటా ఎయిర్ బ్యాగు లోపాల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించడంతో హోండా, బీఎండబ్ల్యూ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే లక్షలాది కార్లను రీకాల్ చేశాయి. కానీ, ప్రాణాంతకమైన ఎయిర్‌బ్యాగ్‌లతో 7లక్షల కార్లు ఇప్పటికీ రోడ్లపై ఉన్నట్టు తెలుస్తోంది. -
పేలిన రెడ్మీ ఫోన్
సాక్షి, శంషాబాద్ : చైనా కంపెనీకి చెందిన షావోమికి చెందిన రెడ్మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. గతంలో విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరుల్లో రెడ్మీ ఫోన్లు పేలిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని శంషాబాద్‌కు చెందిన ఓ యువకుడు రెడ్మీ 4ఏ పేలుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌కు చెందిన చిట్టిబాబు ఇటీవలే రెడ్మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగడంతో మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. అయితే దాన్ని నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే ఫోన్‌ను కిందికి విసిరేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనసైన చిట్టిబాబు సదరు సెల్‌ఫోన్ కంపెనీ ఫిర్యాదు చేశాడు. -
సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
సంతమాగూలూరు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొత్తరం గ్రామంలో గురువారం ఉదయం సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధమైంది. మేస్త్రీగా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీమ్ ఉదయం కూలీపనికు వెళ్లాడు. ఆయన భార్య ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించాయి. గమనించిన ఇరుగుపొరుగువారు ఇబ్రహీమ్ భార్యను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. పేలుడు దాటికి పూరిల్లు కుప్పకూలి దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు రెండు లక్షల రూపాయల ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.