fake calls
-
కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం. -
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
USA Presidential Elections 2024: అమెరికా ఎన్నికల్లోనూ డీప్‌ఫేక్
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఉపాధ్యక్షురాలు, సొంత పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విమర్శిస్తున్న వీడియో.. విమర్శకులను ఏకిపారేస్తూ, ఎల్జీబీటీక్యూలను తిట్టి పోస్తూ బైడెన్ ఫోన్ కాల్స్ రికార్డులు.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఫొటో..... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీప్ ఫేక్ హల్చల్కు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక అమెరికాలో జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. దానికి తోడు ఏకపక్షంగా సాగేలా కని్పంచిన పోటీ కాస్తా బైడెన్ స్థానంలో హారిస్ రంగప్రవేశంతో హోరాహోరీగా మారింది. ఈ నేపథ్యంలో ఓటర్లను గందరగోళపరచడానికి, ఉద్రిక్తతలను రేకెత్తించడానికి ఏఐ మరింతగా దురి్వనియోగం కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024 జనవరిలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ న్యూహ్యాంప్‌షైర్ ప్రజలకు ఫేక్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రైమరీల్లో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారంటూ ఓటర్లను ఆయన హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆ ఫేక్ కాల్స్ సంచలనమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ– ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. అలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా డీప్ ఫేక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. బైడెన్‌ను మూర్ఖుడన్న కమల కుబేరుడు మస్క్ ఎక్స్‌లో షేర్ చేసిన కమల డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బైడెన్ మూర్ఖుడని, దేశాన్ని నడపడం ఆయనకు తెలీదని కమల అన్నట్టు ఆ వీడియోలో ఉంది. ఒక్క స్మైలీ ఎమోజీని మినహాయిస్తే అది పేరడీ అనడానికి ఆ వీడియోలో ఎటువంటి సంకేతాలూ లేవు. ఇలాంటివాటి ప్రభావం తటస్థ ఓటర్లపై చాలా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విమర్శకులను తిట్టినట్టుగా... బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుని తనకు బదులుగా హారిస్‌ను అభ్యరి్థత్వాన్ని సమరి్థంచే క్రమంలో తన విమర్శకులను విపరీతంగా తిట్టిపోయడమే గాక ఎల్జీబీటీక్యూలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, ఓ మానిప్యులేటెడ్ వీడియో పీబీఎస్ మీడియా సంస్థ లోగోతో సహా తెరపైకి వచి్చంది. దాంతో పీబీఎస్ టెలివిజన్ సంస్థ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అసలు వీడియోను తమ చానల్లో లైవ్ ప్రసారం చేసింది. అది నిజానికి జూలై 13న ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత రాజకీయ హింసను ఖండిస్తూ బైడెన్ మాట్లాడిన వీడియో. వీక్షకులను మోసగించేందుకు తమ లోగోను వాడుతూ డీప్ ఫేక్ వీడియో చేసినట్టు పీబీఎస్ తేలి్చంది. ట్రంప్ అరెస్టు! పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల రికార్డులను తారుమారు చేసిన కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చాక పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసినట్లు కొన్ని వారాల క్రితం ఒక ఫొటో వైరలైంది. అది కూడా డీప్ ఫేక్ బాపతేనని డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణులు తేల్చారు. తప్పుడు ట్వీట్లతో.. వీటికి తోడు తప్పుడు ట్వీట్లను సృష్టించి ఓటింగ్‌నే తారుమారు చేసే ఏఐ చాట్‌బాట్ సామర్థ్యాన్ని సివ్ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకుడు లుకాస్ హాన్సెన్ ప్రదర్శించారు. అందులో అలెన్, టెక్సాస్ ‘పోలింగ్ కేంద్రాలు పార్కింగ్ కోసం ఛార్జ్ చేస్తున్నాయి’ అంటూ ఏఐ టూల్‌కు సందేశమిచ్చారు. అంతే...! అలెన్ అధికారులు చాలా పోలింగ్ కేంద్రాల్లో గప్‌చుప్‌గా 25 డాలర్ల పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ సెకన్ల వ్యవధిలోనే లక్షల మందికి ట్వీట్లు చేరిపోయాయి. సమస్యేనంటున్న అమెరికన్లుఇలాంటి మోసపూరిత చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఆగ్రహం రగిల్చే ప్రమాదముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఏఐ ఆధారిత అసత్యాలు ప్రభావితం చేస్తాయని 50 శాతానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్టు మీడియా గ్రూప్ ఆక్సియోస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మారి్నంగ్ కన్సల్ట్ గతేడాది చేసిన పోల్‌లో వెల్లడైంది. దీనిపై 200కి పైగా న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐ అసత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణం రంగంలోకి దిగాలంటూ టెక్ సీఈఓలకు ఏప్రిల్‌లో లేఖ రాశాయి. రాజకీయ ప్రకటనల్లో డీప్ ఫేక్స్ వాడకాన్ని నిషేధించాలని, వాస్తవిక ఎన్నికల కంటెంట్‌ను ప్రోత్సహించేలా అల్గారిథంను ఉపయోగించాలని కోరాయి. ఈ నేపథ్యంలో, ఏఐ కంటెంట్‌ను పక్కాగా లేబులింగ్ చేసే దిశగా కృషి చేస్తున్నట్టు టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి. ఆటో టెక్నాలజీ లేదు ఏఐ ద్వారా సృష్టించే ఫేక్ వీడియో కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మధ్య తేడాను ఆటోమేటిక్‌గా గుర్తించే టెక్నాలజీ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దాంతో ఏదైనా కంటెంట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసే లోపే అది వైరల్ అవుతోంది. అది ఫేక్ అని చివరికి తేలినా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేక్ వీడియో కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్‌కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.‘‘ కామెరాన్‌కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్‌కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్‌గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్‌లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్‌తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్‌ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది. -
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
-
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్ల మోసాలకు సంబంధించి ప్రభుత్వం మరో అలర్ట్ జారీ చేసింది. మోసపూరిత ఆన్లైన్ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ ( సీబీఐసీ)తాజాగా హెచ్చరిక చేసింది. భారతీయ కస్టమ్స్ నుండి వచ్చినట్లు , వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో కస్టమ్స్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోసపూరిత కాల్లు, ఇమెయిల్‌లు, సందేశాలుతో వచ్చే సోషల్ మీడియా పోస్ట్‌లకు బలైపోకండి అని ప్రకటించింది. నకిలీ ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్) రీఫండ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) భారత కస్టమ్స్ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ‘‘వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నుంచి కస్టమ్స్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కస్టమ్స్ విభాగం ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేయదు. ఎస్ఎంఎస్ పంపదు. దేశ కస్టమ్స్ శాఖ నుండి వచ్చే సమాచారం, సందేశాలు మొత్తం సీబీఐసీ వెబ్సైట్ ధృవీకరించబడే డీఐఎన్ (డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను కలిగి ఉంటాయి’ అని ఆర్థిక శాఖ ప్రకటన స్పష్టం చేసింది. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) -
అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..
గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్షాట్లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తున్నాయి. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం -
సైబర్ నేరగాళ్ల హైటెక్ దోపిడీ
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్లైన్లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు ♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు. ♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. ♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు. ♦ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు. వీటిని తరచూ గమనించాలి ♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్గా గుర్తించాలి. ♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి. ♦ తరచూ భద్రతా నోటిఫికేషన్లు, పాస్వర్డ్లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం. ♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్సైట్ యూఆర్ఎల్లో https:// అని ఉంటుంది. యూఆర్ఎల్లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్సైట్ అని భావించాలి. వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్సైట్లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
శబరి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్‌గా గుర్తింపు
-
వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!
ప్రస్తుత కాలంలో ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 4జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే భూగోళాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్ లో ఏది వెతికినా దొరికేస్తుందని మనకు తెలుసు. కానీ, కొన్నింటి సమాచారం గూగుల్‌లో వెతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంభందించి, కస్టమర్ కేర్ నంబర్లు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇలాంటి నంబర్ల కోసం సెర్చ్ చేయక పోవడమే మంచిది. తెలియకుండా సెర్చ్ చేస్తే అనవసరంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉంటుంది. సైబరాబాద్ పరిధిలో 1395 కేసుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉన్నాయి. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్, కొరియర్, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి సంస్థలకు చెందిన కస్టమర్ కేర్ నంబర్లు కోసం చాలానే మంది సర్చ్ చేస్తున్నారు. అయితే, సైబర్ మోసగాళ్లు గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి నకిలీ వివరాలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే, గూగుల్ సర్చ్ ఇంజిన్(ఎస్ఈఓ) ద్వారా సైబర్ నెరగాళ్లు వారి పేర్కొన్న మొబైల్ నెంబర్ మొదట వచ్చే విధంగా చేస్తున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) అందుకే గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు వెబ్సైట్ లేదా యాప్ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఇటువంటి మోసల గురుంచి బ్యాంకులు తమ ఖాతాదారులును అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇలాంటి స్కామ్స్ గురించి కొద్ది రోజుల క్రితం వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక వీడియోను ట్వీట్ చేసింది. మీరు చూడండి. Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/Q0hbUYjAud — State Bank of India (@TheOfficialSBI) September 18, 2021 -
యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?!
పూర్ణ (పేరుమార్చడమైనది) తన స్నేహితురాలికి మొబైల్ వాలెట్ యాప్ (ఫోన్ పే) ద్వారా రూ.2,800 చెల్లించింది. కానీ, అవి ఆ స్నేహితురాలి ఖాతాలో జమకాలేదు. దీంతో ఆ యాప్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ గూగుల్‌లో వెతికి, ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. వివరాలు అడిగాడు. ‘మీ మొబైల్లో ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల’ని సూచించాడు. పూర్ణ అలాగే డౌన్లోడ్ చేసుకుంది. అతను చెప్పిన విధంగా తన బ్యాంక్ ఖాతా వివరాలను అందులో నమోదు చేసింది. ఆ వివరాలను నమోదయిన వెంటనే, కస్టమర్ కేర్ అతను ఐదు సార్లు పూర్ణ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ ఖాతాకు రూ.4,72,000ను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ వెంటనే ఫోన్ కట్ అయ్యింది. అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్టుగా బ్యాంక్ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అవి చూశాక కానీ, తను మోసపోయానని పూర్ణకు తెలియలేదు. వెంటనే పూర్ణ పోలీసులను ఆశ్రయించింది. మరో మోసం.. వింధ్యకి ఎల్ఐసీ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ పాలసీలకు సంబంధించిన క్లెయిమ్‌లు కంపెనీల పేరుతో ఉన్నాయి మేడమ్, కొత్త రూల్స్ వచ్చాయి. మీ పేరు మీద త్వరగా మార్చుకోవాలి’ అని చెప్పాడు. పెండింగ్‌లో ఉన్న ఎల్ఐసీలు, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాలసీల గురించి వివరాలు ఇచ్చింది వింధ్య. ‘మేడమ్, అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలంటే అందుకు ఛార్జెస్ పరంగా కొంత మొత్తం చెల్లించాలి’ అన్నాడు. అతను చెప్పిన విధంగా వింధ్య తన బ్యాంకు ఖాతా నుంచి ఐదువేలు ట్రాన్స్ఫర్ చేయగానే ఆమె అకౌంట్ నుంచి దఫదఫాలుగా రూ.5.5 లక్షలు డెబిట్ అయ్యాయి. తను మోసపోయినట్టుగా గుర్తించి, పోలీసులను ఆశ్రయించింది. అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం గూగుల్, యాహూ, బింగ్, డక్ డక్ గో వంటి సెర్చి ఇంజిన్లలో కస్టమర్ కేర్ నెంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్ల కోసం శోధించడం మనందరికీ అలవాటు. ఈ అలవాటుకు మూల్యం చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ మోసగాడో ఉంచిన నకిలీ టోల్‌ఫ్రీ/ కస్టమర్ కేర్ నంబర్ల ఉచ్చులో చిక్కుకోవచ్చు. ఆ సదరు వ్యక్తి బాధితులను ఆకర్షించడానికి, మీ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించడానికి పొంచి ఉంటాడు. బెంగళూరులో ఒక మహిళ తన ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఫుడ్ అగ్రిగేటర్ యాప్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయాలని, గూగుల్ ఇంజిన్‌లో సెర్చ్‌చేసి, ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకుంది. యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?! సాధారణంగా మోసగాళ్లు యూపీఐ ఆధారిత యాప్‌లకు సంబంధించి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను ప్రముఖ వెబ్సైట్లలో ప్రదర్శిస్తారు. మనం సదరు కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ నకిలీ నంబర్ వస్తుంది. మోసగాళ్లు వినియోగదారుల నుండి వారి వ్యక్తిగత ఖాతా వివరాలన్నీ రాబట్టిన తర్వాత ఓటీపీ లేదా పిన్ సమాచారంతో పాటు పూర్తి వివరాలను తెలిపే గూగుల్ ఫామ్‌ను వాడమని చెబుతారు. సంభాషణ మధ్యలోనే ఓటీపీ/పిన్ నెంబర్ల సమాచారం తీసుకుంటారు. అందుకని, గూగుల్, బింగ్ లేదా యాహూ సెర్చ్‌లో వచ్చే నంబర్‌కు ఫోన్ చేయవద్దు. మీ వ్యక్తిగత వివరాలను ఫోన్లో ఎవరికీ షేర్ చేయవద్దు. అధికారిక వెబ్సైట్ల నంబర్లు మాత్రమే! మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల నెంబర్, సివివి, ఓటీపీ లేదా యుపిఐ.. వంటివి ఏ బ్యాంకులు, ప్రముఖ కంపెనీలూ అడగవు. క్రెడిట్ కార్డు, రసీదు, కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఉంచిన కస్టమర్ సర్వీస్ నంబర్‌కు మాత్రమే ఫోన్ చేయాలి. యాప్ లేదా వెబ్సైట్లో ఉంచిన ఇ–మెయిల్ లేదా మెసెంజర్ ద్వారా కూడా మీరు జరిపిన లావాదేవీల గురించి సంప్రదించవచ్చు. ఎందుకంటే, యూపీఐ ఆధారిత యాప్‌లలో కస్టమర్ కేర్ నంబర్ ఉండకపోవచ్చు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీ కస్టమర్ కేర్ నకిలీ నంబర్లతో మోసం చేసేవారు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనం ప్రతీది గూగుల్‌లో శోధించడం, ఆ నకిలీ నెంబర్లకు ఫోన్ చేయడం మానుకోవాలి. అధికారిక వెబ్సైట్లను లాగిన్ అయ్యి అందులో నంబర్లు తీసుకొని, ఫోన్ చేయాలి. మోసం జరిగిందని గ్రహించాక అరగంట, గంట వ్యవధిలో 155260 నెంబర్‌కి లేదా www.cybercrime.gov.in లో లాగిన్ అయి ఫిర్యాదు చేసినా పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంది. -
హైటెక్ "కాల్" కేయులు: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి..
సాక్షి,తిరుపతి క్రైం: తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నెట్‌వర్క్‌ల ఆదాయానికి గండికొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపిన వివరాలు..అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కొందరు సంస్థకు నష్టం కలిగిస్తున్నట్లు దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ టెలికం సంస్థ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేసరికి హైటెక్ ‘కాల్స్’ కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. వీరికి టెలికాం సంస్థలో పనిచేస్తున్న కొందరు మార్కెటింగ్ అధికారులు సహకరించినట్లు తేలింది. ఎలా చేశారంటే.. ఫోన్ వినియోగదారులకు తెలియకుండా వందల సంఖ్యలో వారి ఆధార్ కార్డులతో అక్రమంగా సిమ్ కార్డులు పొందారు. ఈకేవైసీ సరిగా పడలేదని ఎన్నోసార్లు వేలిముద్రలు వేయించారు. ఆ తర్వాత ఓటీపీ ద్వారా నగరంలోని కస్టమర్ల నుంచి నాలుగు నుంచి పది వరకు అక్రమంగా సిమ్ కార్డులు పొంది అక్రమాలకు తెరలేపారు. ఇలా పొందిన సిమ్‌లతో విదేశాల నుంచి +91 ఇన్కమింగ్ లోకల్ కాల్స్ ద్వారా మళ్లించి అధిక ఆదాయం పొందేవారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలా చేస్తుండడంతో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, వివిధ ప్రైవేటు సంస్థల సెల్యులర్ నెట్వర్క్ సంస్థల ఆదాయానికే కాకుండా ప్రభుత్వానికి జీఎస్టీ, టాక్స్‌ల రూపంలో తీవ్రం నష్టం వాటిల్లింది. టెలికం సంస్థ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాల్స్ కూపీ లాగితే డొంక కదిలింది. ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడిచేసి సుమారు 1000 సిమ్ కార్డులు, డిన్‌స్టార్ గేట్‌వే 64, సీపీయూ, ల్యాప్‌టాప్, మొబైల్, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కన్నం రవికుమార్, తిరుపతిలో నివసిస్తున్న హరిప్రకా‹Ù, నీలం కిరణ్‌కుమార్, శేషాఫణి, నారాయణ పార్థసారథి, ఓరుగొండ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. దీనికంతా వీరే సూత్రధారులని తేలింది. వీరంతా ఎంబీఎ, బీటెక్, డిగ్రీ చదివిన వారే. వీఓఐపీ టెక్నాలజీ సాయంతో వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి వినియోగదారులకు కనెక్టివిటీ ఇచ్చి పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు ఈ కేసులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణకు పూనుకుంటున్నారు. నిబంధనలు పాటించని సిమ్ కార్డు డీలర్లు, సంస్థలను గుర్తించి లీగల్ నోటీసులు ఇస్తామని టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ పాల్గొన్నారు. -
ఎల్ఐసీ పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్త!
దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా కాంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త రకాల స్కీమ్స్ అందిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్, లైఫ్ ప్లాన్స్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజల కోసం తీసుకొచ్చింది. అందుకే ప్రతి కుటుంభంలో ఒకరికైనా ఏదైనా ఒక ఎల్ఐసీ పాలసీ అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా దీనికి లక్షల్లో ఖాతాదారులు ఉన్నారు. అందుకే వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ కరోనా కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే సైబర్ నేరగాళ్ల దృష్టి బ్యాంక్ ఖాతాదారుల నుంచి ఎల్ఐసీ పాలసీదారులపై పడింది. ఎల్ఐసీ పాలసీదారులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. అందుకే మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎల్ఐసీ పాలసీదారులను అప్రమత్తం చేస్తోంది. ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మధ్య కొందరు మోసగాళ్లు ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ & ఐఆర్డీఏఐ అధికారులమని ఫోన్ చేసి పాలసీలు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చని చెప్పి మోసం చేస్తారని వివరించింది. పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఎల్ఐసీ వెబ్ సైట్‌కు వెళ్లి వివరాలు చెక్ చేసుకోవాలని కోరింది. pic.twitter.com/yWebSpP5fH — LIC India Forever (@LICIndiaForever) May 24, 2021 చదవండి: ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా -
నగ్న ఫొటోలు పంపాడు.. నాకేమీ తెలియదంటూ బోరుమంది
వైష్ణవి (పేరు మార్చడమైంది)కి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయత్నం చేద్దామని అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఓ వ్యక్తి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. సాయం చేస్తానని మాటిచ్చాడు. తగ్గట్టే తనకు తెలిసిన సినీపరివారాన్ని పరిచయం చేశాడు. ఉండాల్సిన చోటు చూపించాడు. నగరం అందాలను కళ్లకు కట్టాడు. నటిగా అవకాశం రావడంతో పొంగిపోయింది వైష్ణవి. అతన్ని గుడ్డిగా నమ్మి తన ఫొటోలు అతనికి ఇచ్చింది. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి తను చెప్పినట్టు చేయమని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని వేధించడం మొదలుపెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది వైష్ణవి. టెన్త్ క్లాస్ పూర్తయిన మీనా (పేరుమార్చడమైంది) ఈ మధ్యే పట్నంలో ఉంటున్న అన్నా వదినల వద్దకు వచ్చింది. ఇంట్లో బోర్ కొడుతుందని రోజూ నసుగుతుంటే మీనా వదిన తన సెల్‌ఫోన్ ఇచ్చింది. దాంతో మీనా ప్రపంచమే మారిపోయింది. రోజూ ఫొటోలు దిగడం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, వచ్చిన లైక్‌లు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు మురిసిపోవడం ఆ విషయాలను ఇంట్లో సంబరంగా చెప్పుకునేది. ఓ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిన మీనా కోలుకున్నాక చెప్పిన విషయం విని అన్నావదినలు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి తన న్యూడ్ ఫొటోలు పంపించాడని, అవేవీ తనకు తెలియదని బోరుమంది మీనా. ‘హాయ్!’తో మొదలయ్యే వేధింపులు అమ్మాయిలు అదీ పట్టణాల్లో ఉన్నవారితో పోల్చితే గ్రామాల్లో ఉంటున్న యువతులు సోషల్ మాధ్యమాల్లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నవారి సంఖ్య ఇటీవల పెరిగిందంటున్నారు సైబర్‌క్రైమ్ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయడంతో క్రమంగా చిట్చాట్లు... ఫొటోలు, వీడియోలు షేర్ చేయడాలు... వాటిని ఆసరాగా తీసుకుని ‘ఫేక్ వీడియో’లు సృష్టించి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. కొందరమ్మాయిలు ఆ అపరిచిత వ్యక్తులను బయట నేరుగా కలిసి స్నేహం పెంచుకుంటారు. వారు చెప్పే మాయమాటలకు మోసపోతుంటారు. బ్రేక్ తప్పనిసరి తమ ఫొటోలను అప్లోడ్ చేయడం, తెలియని వారి నుంచి వచ్చే కామెంట్స్‌కి మెసేజ్‌లు, చాటింగ్ చేయడం, వీడియో కాల్స్‌ని రిసీవ్ చేసుకోవడం, సదరు వ్యక్తులను బయట కలవడం .. వల్లే వేధింపుల సమస్యలు పెరుగుతుంటాయి. ఫ్రెండ్ లిస్ట్‌ను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. వర్చువల్ ఫేక్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోకుండా జాగత్తపడాలి. అపరిచిత వ్యక్తులు మన నెట్టింట్లోకి జొరబడకుండా ముందస్తు జాగ్రత్తలే తీసుకోవడమే సముచితం. ఇట్టే తెలిసిపోతుంది నెల క్రితం సోషల్‌మీడియా అంశం మీదే అవగాహనా కార్యక్రమం చేపట్టాం. అమ్మాయిలు సోషల్ మీడియాలో మోసానికి గురైతే, వెంటనే షీ టీమ్‌కు కంప్లైంట్ చేయచ్చు. సోషల్ మీడియాలోనే షీ టీమ్ వాట్సప్ నెంబర్, క్యూ ఆర్ కోడ్ ఉన్నాయి. దీని ద్వారా ఒక మెసేజ్ చేసినా చాలు. నిందితుడు దొరక్కపోవడం అనే సమస్యే ఉండదు. జాగ్రత్తపడాలంటే బాధితురాలు ఆ నిందితుడి పేజీ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవడం మరీ మంచిది. దీనివల్ల ఆ అకౌంట్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. – సుమతి, డిఐజి–ఉమన్ సేప్టీ వింగ్, తెలంగాణ జాగ్రత్తలే మందు కేసు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి నిందితులను పట్టుకునేవరకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కేసు పూర్తయ్యేవరకు పూర్తి గ్యారెంటీ ఉండదు. జాగ్రత్తలే దీనికి అసలైన మందు. సైబర్ క్రైమ్ ఇప్పటివరకు పరిష్కరించిన కేసులు చాలానే ఉన్నాయి. నేరం రుజువైతే క్రైమ్‌ని బట్టి... సెక్షన్ల బట్టీ శిక్ష ఉంటుంది. సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయడానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. రిపోర్ట్ చేయవచ్చు. ‘షీ టీమ్’కు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయచ్చు. – సందీప్ ముదల్కర్, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చదవండి: పైకి చూస్తే మైనర్.. పనులు మాత్రం ముదురే -
ఫేక్ కాల్స్.. మోసగాళ్లు ముంచేస్తారు
కరోనా కాలంలో కొలువులు కటకట! ఇదే అదనుగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగం కోసం క్యాంపస్ సెలక్షన్స్‌కు వెళుతుంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొలువు దక్కని ఫ్రెషర్స్.. మెరుగైన అవకాశాల కోసం సీనియర్స్... ఉద్యోగాలు కోల్పోయిన వారు.. జాబ్ పోర్టల్స్‌లో తమ వివరాలను అప్లోడ్ చేస్తుంటారు. ఇక్కడే టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకొని ఉద్యోగార్థులను ముంచుతున్నారు మోసగాళ్లు! జాబ్ పోర్టల్స్ డేటాబేస్ నుంచి అభ్యర్థుల సమాచారం తస్కరించి.. ప్రలోభాలకు గురిచేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జాబ్ ఆఫర్ మోసాలు గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం. అధికారిక మెయిల్స్ ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏ సమాచారమైనా కంపెనీ అధికారిక ఈమెయిల్ నుంచే పంపిస్తాయి. కంపెనీ మెయిల్స్ వచ్చినప్పుడు అందులో తమ సంస్థ గురించిన సమాచారం తప్పనిసరిగా పేర్కొంటారు. అందుకు అవసరమైన వెబ్సైట్, ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్‌తో సహా పొందుపరుస్తారు. అభ్యర్థుల వివరాలను కంపెనీ అధికారిక మెయిల్‌కే పంపాలని కోరతారు. స్కామర్ల నుంచి వచ్చే ఈమెయిల్స్ ప్రొఫెషనల్‌గా ఉండవు. అందులో చాలా తప్పులు కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఆఫర్ లెటర్’ పేరుతో అటాచ్మెంట్స్ కూడా మెయిల్లో వచ్చినట్టయితే.. వాటిని తెరవకపోవడమే ఉత్తమం. ఇలాంటి లింక్స్/అటాచ్మెంట్స్ ద్వారా కంప్యూటర్‌కు హాని కలిగించే మాల్వేర్ (వైరస్) కూడా పంపిస్తారు. టెలిఫోన్ నంబర్ లేదా కంపెనీ అడ్రస్ లాంటి సమాచారం లేకుండా మెయిల్ వచ్చిందంటే.. అది పూర్తిగా నకిలీదని గుర్తించాలి. ఫ్రీ మెయిల్స్ సంస్థలు ఎప్పుడూ ‘గూగుల్.కామ్/హాట్ మెయిల్.కామ్’ వంటి ఫ్రీ మెయిల్స్ నుంచి ఇంటర్వూ్యలు, ఆఫర్ లెటర్స్∙పంపించవు. స్కామర్లు చాలా తెలివిగా కంపెనీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడీలను తయారు చేసి.. మరీ మోసాలకు తెరతీస్తున్నారు. కానీ వారు సూక్ష్మమైన మార్పు చేస్తుంటారు. లెటర్స్, స్పెల్లింగ్ మార్చడం, ఐఫన్, అండర్ స్కోర్ వంటి వాటివి అదనంగా జోడించడమో, లేదా ఒరిజినల్లో ఉంటే వాటిని తీసివేసి కొత్త మెయిల్ ఐడీని సృష్టిస్తారు. వీటిని జాగ్రత్తగా గుర్తించాలి. వచ్చిన మెయిల్‌ను కాపీ–పేస్ట్ ద్వారా సెర్చ్ చేయాలి. ఆన్లైన్ చాట్ ఇంటర్వ్యూ మీకు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ వచ్చింది. మెసెంజర్‌పై ఇంటర్వూ్యకు హాజరు కావాలని కోరుతుంటారు. వాళ్లు చెప్పినట్టు చేస్తే అభ్యర్థి వ్యక్తిగత వివరాలను చోరీ చేస్తారు. అందుకోసం స్కామర్లు తరచుగా యాహూ ఐఎం ఖాతాను సెటప్ చేయడానికి కొన్ని సూచనలు చేస్తారు. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఇలాంటి చాట్ ఇంటర్వూ్యలు, ఆన్లైన్లో వివరాలు తీసుకోవని గర్తించాలి. కంపెనీలు సాధారణంగా అభ్యర్థిని ముఖాముఖి ఇంటర్వూ్య చేస్తాయి. మీరు కంపెనీ ఉన్న దేశంలో కాకుండా.. విదేశాల్లో ఉంటేనే స్కైప్ వీడియో చాట్ ఇంటర్వూ్య నిర్వహిస్తాయి. కంపెనీ వివరాలు తప్పనిసరి ఏదైనా కంపెనీ నుంచి ఇంటర్వూ్య ఉందని మెయిల్ వచ్చిందంటే.. ముందు ఆ సంస్థ వివరాలు తెలుసుకోవాలి. అది నిజమో కాదో పరిశీలించాలి. అందుకోసం మొదట సదరు సంస్థ అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని చూడాలి. కంపెనీ ఎంతకాలంగా పనిచేస్తుందో ఆరా తీయాలి. కొంతమంది స్కామర్లు ఆయా కంపెనీల వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. కానీ కొద్దిగా పరిశోధన చేస్తే అది నిజమైనదో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకోసం మోసపూరిత మెయిల్స్‌పై సమాచారం ఇచ్చే స్కామ్వార్నర్స్.కామ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక సంస్థ రిజిస్టర్ అయి ఏడాది మాత్రమే అయితే అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ వివరాలు అడిగితే ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఏవీ అభ్యర్థి బ్యాంక్ ఖాతా వివరాలు అడగవు. స్కామర్లు మాత్రం ఈ వివరాలనే అడుగుతారు. ఉద్యోగి వేతనం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమచేస్తామని.. పుట్టిన తేదీ వివరాలు, పాన్‌కార్డు, ఆధార్ వంటి సమాచారం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక్కోసారి మీ క్రెడిట్ కార్డ్ వివరాలు నింపాలని లింక్ పంపిస్తారు. ఈ వివరాలు చెప్పినట్టయితే మన ఖాతాను ఖాళీ చేసేస్తారు. ఆన్‌లైన్‌లోకి వెళ్లే ముందు వెబ్సైట్ సురక్షితమైనదో కాదో చూసుకోవాలి. వెబ్ అడ్రస్ ‘http://’ లిస్టెడ్ సైట్ అయి ఉండాలి. ఇంటర్వ్యూ పేరుతో నగదు డిమాండ్ స్కామర్లు ఇంటర్వూ్య పేరుతో కాల్ చేస్తారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఏవేవో ఫీజులు పేరుతో డబ్బులు చెల్లించాలని చెబుతారు. చెప్పిన మొత్తం చెల్లించకుంటే అవకాశం పోతుందని.. కొంత మొత్తమైనా చెల్లించి రిజర్వ్ చేసుకోమంటారు. ఇలాంటి మోసాలే ప్రస్తుతం అధికంగా జరుగుతున్నాయి. రిక్రూటర్ రిజిస్ట్రేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వంటివి చెల్లించాలంటారు. ఇంటర్వూ్య పూర్తయ్యాక డిపాజిట్ సొమ్ము తిరిగి ఇచ్చేస్తామని చెబుతారు. వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఇలాంటి ఫీజులు తీసుకోదని గుర్తించాలి. చాలావరకు కంపెనీలు వ్యక్తిని తమ కార్యాలయానికి రమ్మని ఫేస్ టు ఫేస్ ఇంటర్వూ్య మాత్రమే చేస్తాయి. పేరున్న జాబ్ పోర్టల్స్ ఉద్యోగ ఆఫర్లను కాల్ చేసి చెప్పవు. కేవలం ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలోనే సంప్రదిస్తాయి. భారీ వేతనం ఆఫర్ కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంటున్నప్పుడు ఉద్యోగికి కంపెనీ ఇచ్చే వేతనానికి సంబంధించిన అంశాలు మాత్రమే మెయిల్లో పేర్కొంటారు. ఇందులో బీమా, ఇతర సౌకర్యాల గురించి ప్రస్తావించరు. ఫేక్జాబ్స్ వేతనం కూడా భారీగా ఆశపెట్టే విధంగా ఉంటుంది. అర్హతకు మించి వేతనాలు, అతి ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంటే.. మోసమని అనుమానించాలి అంటున్నారు నిపుణులు! స్కామర్లు ఉద్యోగ అవసరాలను సరిగా చెప్పరు. వాళ్లు చెప్పే విధులకు, ఉద్యోగానికి ఎలాంటి సంబంధం ఉండదు. అప్లయ్ చేయకున్నా ఆఫర్లు మీ ఐడీకి చాలా జాబ్ ఇంటర్వూ్య మెయిల్స్ వస్తుంటాయి. కానీ వాటిలో మీరు దరఖాస్తు చేసింది ఏదీ ఉండదు. అలాంటి వాటికి స్పందించకపోవడమే మేలు. ఒకవేళ మీరు ఒకటికి మించి సంస్థలకు దరఖాస్తు చేసినట్టయితే.. ఆయా కంపెనీల పేర్లు గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేయకుండా ఆఫర్ వచ్చిందంటే.. అది మోసం చేసేందుకు స్కామర్లు వేసిన ఎరగా భావించాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన సంస్థ నుంచి ఇంటర్వూ్య పేరుతో కాల్స్ వస్తే.. సంస్థ గురించి, యజమాని గురించి వివరాలను అడగండి. వారు వివరాలు చెప్పేందుకు సంశయించినట్లయితే అది నకిలీగా భావించాలి!! -
ఆ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి: ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో అదే రీతిలో సైబర్ నేరాలు కూడా అధికమయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారంటూ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోమారు తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మెయిల్స్ ద్వారా తమ వినియోగదారులను టార్గెట్ చేస్తున్నారని వెల్లడించిన ఎస్బీఐ తాజాగా వాట్సాప్ ద్వారా కూడా కస్టమర్లకు వల వేస్తున్నారని పేర్కొంది. లాటరీ గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్స్ చేస్తారని, మోసపూరితమైన సందేశాలు పంపుతారని తెలిపింది. అనంతరం ఫలానా ఎస్బీఐ నెంబర్ ను సంప్రదించాలంటూ నమ్మబలుకుతారని, ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తన కస్టమర్లను హెచ్చరించింది. ఎస్బీఐ ఈమెయిల్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా ఎప్పుడూ ఖాతాదార్ల వ్యక్తిగత వివరాలు అడగదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు, లక్కీ కస్టమర్ గిఫ్టులు, లాటరీ స్కీములను తాము ఎక్కడా అమలు చేయడంలేదని, ఇలాంటి ప్రలోభాల్లో చిక్కుకునేముందు ఓసారి ఆలోచించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఖాతాదార్లు ఎప్పుడు తప్పు చేస్తారా అని సైబర్ నేరగాళ్లు కాచుకుని ఉంటారని ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని కస్టమర్లకు తెలిపింది. బ్యాంక్ లోపం కారణంగా వినియోగ దారుల డబ్బుపోతే బ్యాంక్ చెల్లిస్తుంది కానీ ఇలా వినియోదారుల నిర్లక్ష్యం కారణంగా పోతే బ్యాంక్‌కు సంబంధం ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. చదవండి: లోన్ కస్టమర్లకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ -
జొమాటో: రూ.146 కోసం 55 వేలు పోయాయి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన యువకుడిని గూగుల్‌లోని నకిలీ కాల్ సెంటర్ ముంచేసింది. తనకు జొమాటో నుంచి రావాల్సిన రూ.146 కోసం ప్రయత్నిస్తే.. రూ.55 వేలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ యువకుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వరంగల్‌కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం యూసుఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. చికెన్ బిర్యానీ తినాలని భావించిన ఇతగాడు శనివారం ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. తనకు చికెన్ బిర్యానీకి బదులుగా సాధారణ రైస్ పార్శిల్ వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి జొమాటో యాప్‌లో ఆ సంస్థ నంబర్ల కోసం వెతికాడు. అవి అందుబాటులో లేకపోవడంతో అవకాశం ఉన్న చాటింగ్ ద్వారా ఆ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా జొమాటో కాల్ సెంటర్ నంబర్ కోసం ప్రయత్నించాడు. అందులో ఉన్న ఓ నంబర్‌కు సంప్రదించిన బాధితుడు అవతలి వారు రెస్పాండ్ కాకపోవడంతో మిన్నకుండిపోయాడు. కొద్దిసేపటికి తాను ఫోన్ చేసిన నంబర్ నుంచి కాల్ బ్యాక్ రావడం.. ట్రూ కాలర్ యాప్ జొమాటో కాల్ సెంటర్ అంటూ చూపించడంతో స్పందించాడు. అవతలి వ్యక్తితో జరిగిన విషయం చెప్పి తనకు రూ.146 రిటర్న్ ఇవ్వాల్సిందిగా కోరాడు. బాధితుడు డబ్బును తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని అతడి నుంచే తెలుసుకున్న మోసగాళ్లు ఆ కార్డుకు రిటర్న్ రావని, గూగుల్ పే ఉన్న ఫోన్ నంబర్ చెప్పాల్సిందిగా కోరారు. తాను ఇప్పుడు కాల్ చేస్తున్న నంబర్‌కు అది ఉందని బాధితుడు చెప్పాడు. దీంతో ఇతడికి యూపీఐ కోడ్ పంపిన సైబర్ నేరగాళ్లు దాన్ని తాము సూచించిన నంబర్‌కు పంపాలంటూ అలా చేయించుకున్నారు. ఆపై తొలుత బాధితుడి ఖాతా నుంచి రూ.1 చెల్లించేలా చేసి.. మీ గూగుల్ పే ఖాతా తమ వద్ద యాడ్ అయిందని, 24 గంటల్లో డబ్బు రిటర్న్ వస్తుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా బాధితుడి గూగుల్‌పేతో లింకు అయి ఉన్న రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.4 లక్షలు కట్ అయ్యాయి. ఈ లావాదేవీని గుర్తించిన అతడి బ్యాంకు అనుమానించింది. తక్షణం బాధితుడిని సంప్రదించి విషయం తెలుసుకుంది. ఆపై రూ.85 వేలు రిటర్న్ చేయగలిగింది. మిగిలిన రూ.55 వేలు మాత్రం నేరగాళ్ల పరమైంది. ఈ విషయం గుర్తించిన బాధితుడు తనను సంప్రదించిన నంబర్లకు కాల్ చేయడానికి ప్రయత్నించగా ఫలితం దక్కలేదు. దీంతో అతడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. గూగుల్‌లో ఉన్న కాల్ సెంటర్ల నంబర్లలో చాలా నకిలీలు ఉంటున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
చిత్ర విచిత్ర వేధింపులూ ఎక్కువే...
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో చోరీనో,మరో నేరమో చోటు చేసుకుంది... హఠాత్తుగా దుండగులు హంగామా చేస్తూ దాడికి యత్నించారు... రహదారిపై మీ వాహనాన్నే ఢీ కొట్టిన వ్యక్తి మీతోనే గొడవకు దిగాడు. కళాశాలలో, ఉద్యోగానికో వెళ్తున్న అతివల్ని ఆకతాయిలు మితిమీరి వేధిస్తున్నారు.......ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్–100’కు ఆకతాయిల బెడదా తక్కువేం కాదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. నేరాలపై సమాచారం ఇవ్వడానికే కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ప్రజల కోసం నిత్యం పని చేసేలా... సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్నేళ్ల క్రితమే ‘100’ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ నాలుగేళ్ల క్రితం ‘డయల్–100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఫోన్‌కాల్‌ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఏటా లక్షల్లోనే ఫోన్‌కాల్స్... ‘డయల్–100’కు నగరం నలుమూలల నుంచి రోజుకు గరిష్టంగా 700 నుంచి 800 కాల్స్ వస్తుంటాయి. ఇలా వస్తున్న ఫోన్లలో బ్లాంక్ కాల్స్, న్యూసెన్స్ కాల్స్, అనవసర విషయాలను ప్రస్తావించే ఫోన్లూ వేల సంఖ్యలోనే ఉంటున్నాయి. సోషల్ మీడియా, పోలీసు అధికారిక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చినా..ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్ నెంబర్ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు వందల సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెప్తున్నారు. కొందరైతే సిటీ బస్సుల సమాచారం, చిరునామాలు కోరుతూ కాల్స్ చేస్తున్న వారూ ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారో, అక్కడ నుంచి వచ్చిన వారో ఇలాంటి కాల్స్ చేస్తే ఫర్వాలేదు. నగరంలో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చిత్ర విచిత్ర వేధింపులూ ఎక్కువే... ఈ కంట్రోల్ రూమ్‌లో పనిచేసే సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వేధింపులూ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగంతో సంబంధంలేని అంశాలు అడుగుతుంటారు. సిబ్బంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతుంటారు. అసభ్యపదజాలం కాకపోయినా..అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైతే వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. ‘బాక్సు’లతో పాటే తగ్గిన ‘బెదిరింపులు’... నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాయిన్ బాక్సులు ఉండేవి. దుకాణాల్లో ఉంచి నిర్వహించేవి కొన్నైతే..బహిరంగ ప్రదేశాల్లో ఉంచేసేవి మరికొన్ని ఉండేవి. వీటిని వినియోగించి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడకు ఫోన్లు చేస్తున్నారు? అనే అంశాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో వీటిని వినియోగించే ఆకతాయిలు ఫలానా చోట బాంబు ఉందనో, మరోటి జరుగుతోందనో చెప్తూ పోలీసుల్ని పరుగులు పెట్టించేవారు. ఈ కాయిన్ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్ సైతం పూర్తిగా తగ్గిపోయాయి. సెల్‌ఫోన్, ల్యాండ్లైన్ల నుంచి ఇలాంటి కాల్స్ చేస్తే బాధ్యుల్ని తేలిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ తరహా ఆకతాయిలు వెనుకడుగు వేస్తున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో ఉన్న కొన్ని కాయిన్ బాక్సుల్నీ ఈ తరహాలో వినియోగించడానికి ఆకతాయిలు ధైర్యం చేయట్లేదు. గతేడాది కాల్స్ ఇలా... ⇔ బాడీలీ అఫెన్సెస్–59,000 (21.99 శాతం) ⇔ న్యూసెన్స్–55,000 (20.5 శాతం) ⇔ మహిళలపై నేరాలు–34,000 (12.67 శాతం) ⇔ యాక్సిడెంట్స్– 26,000 (9.6 శాతం) ⇔ సొత్తు సంబంధ నేరాలు–12,000 (4.47 శాతం) ⇔ ఆత్మహత్యలు– 2,200 (0.82 శాతం) ⇔ ఇతర నేరాలు, ఎంక్వైరీలు–80,000 (29.82 శాతం) మొత్తం– 2,68,200 ⇔ ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు కూడా వస్తుంటాయి. అందుకే నగరంలో నేరాలు, ప్రమాదాల, ఆత్మహత్యల సంఖ్య కంటే వాటికి సంబంధించిన ఫోన్‌కాల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జోన్ల వారీగా కాల్స్ ఇలా... ⇔ వెస్ట్ జోన్– 91,150 (33.98 శాతం) ⇔ నార్త్ జోన్– 46,786 (17.44 శాతం) ⇔ ఈస్ట్ జోన్– 44,598 (16.62 శాతం) ⇔ సౌత్ జోన్– 43,914 (16.37 శాతం) ⇔ సెంట్రల్ జోన్– 41,752 (15.56 శాతం) -
టోల్‌ఫ్రీకి ఫేక్ బెడద
దిశ ఘటన అనంతరం పెరిగిన కాల్స్ దిశ ఘటన తరువాత డయల్ 100, 112లకు కాల్స్ గణనీయంగా పెరిగాయి. వాటిలో ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉండడంతో నిజమైన బాధితులకు ఫోన్లైన్లు బిజీ వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. డయల్ 112కు ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్(పీఆర్ఐ) రెండు లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో లైను ద్వారా సెకనుకు 30 కాల్స్ చొప్పున రెండు లైన్లకు మొత్తం 60 కాల్స్ మాట్లాడవచ్చు. అంతకు మించి వచ్చే కాల్స్‌తో లైన్స్ బిజీ అని వస్తోంది. పెరిగిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సాంకేతిక సమస్యను అధిగమించేలా మరో రెండు పీఆర్ఐ లైన్లు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లలో కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నుంచి నేరుగా డయల్ 112కు ఎమర్జన్సీ కాల్ వెళ్లేలా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం లేని వారు ఫోన్లోని పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్లి కట్ అవుతుంది. అనంతరం వారిలొకేషన్ సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. వారు తిరిగి కాల్ చేసి సమస్య కనుక్కుంటారు. బేసిక్ మోడల్ ఫోన్ కీ ప్యాడ్‌లో 2 లేదా 9 అంకెను నొక్కి పెడితే డయల్ 112కు కాల్ వెళ్లిపోతోంది. ►టోల్ ఫ్రీ నెంబర్లు 100, 112లు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. ►కొందరు ఆకతాయిలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టోల్‌ఫ్రీ నెంబర్లకు పెద్దఎత్తున వస్తున్న ఫోన్‌కాల్స్‌తో పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100, 112 నెంబర్లకు రోజూ లెక్కకు మిక్కిలి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో పోలీసులు పరిష్కరించదగ్గ అంశాలకు సంబంధించి కాల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. మిగిలిన ఫిర్యాదులన్నీ టోల్‌ఫ్రీ నెంబర్ పనిచేస్తుందా? ఫిర్యాదులు తీసుకుంటున్నారా? సమాచారం కోసం, అవినీతిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ వివరాలు అందించాలి? అనే వివరాలు తెలుసుకునేందుకే చేయడం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫేక్ కాల్స్ బెడద పెరగడంతో అసలు ఆపదలో ఉన్నవారికి లైన్ కలవక ఇబ్బంది పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. –సాక్షి, అమరావతి సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న మహిళలు, ప్రజలు తమ సమస్యలను ఈ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పిన అతి తక్కువ సమయంలో పోలీసులు స్పందిస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలను సది్వనియోగం చేసుకోవాలి. టోల్‌ఫ్రీ నెంబర్లపై అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం. –గౌతమ్ సవాంగ్, డీజీపీ అసలైన బాధితులు నష్టపోతారు టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్న మహిళలు తక్షణం పోలీసు సేవలు పొందే అవకాశం ఉంది. డయల్ 100, 112ను సద్వినియోగం చేసుకుంటేనే వాటి ఏర్పాటుకు సార్ధకత ఉంటుంది. దుర్వినియోగం చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం చేసినవారవుతాం. –ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి జాతీయ కమిషనర్ డిసెంబర్ 12న టోల్‌ఫ్రీ నెంబర్లకు నమోదైన ఫోన్కాల్స్విశ్లేషిస్తే ►16,207డయల్ 100కు వచ్చిన కాల్స్ ►533 వాటిలోపోలీసులు స్పందించదగినవి ►516 కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించినవి ►17 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులు 3.50లక్షలుడయల్ 112కు వచ్చిన కాల్స్ ►వాటిలో పోలీసులు స్పందించదగ్గవి1,779 ►కేసులు నమోదు చేసినవి2 ►రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు గత నెల 25న డయల్ 14400 నెంబర్‌ను ప్రారంభించారు ►డయల్ 14400కు తొలి రోజు వచి్చన కాల్స్ 5100 ►వాటిలో ఏసీబీకి వచి్చన ఫిర్యాదులు కేవలం 283 మాత్రమే -
అవాంఛిత కాల్స్‌పై అవగాహన పెంచండి
న్యూఢిల్లీ: అవాంఛిత టెలిమార్కెటింగ్ కాల్స్‌కు సంబంధించి అమల్లోకి వస్తున్న నిబంధనల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని టెలికం సంస్థలు కోరాయి. ఫిర్యాదులు, పరిష్కార విధానం పనిచేసే తీరు గురించి కస్టమర్లకు తెలిస్తే నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. ‘డు నాట్ డిస్టర్బ్’ విధానం పనితీరు, ఐచ్ఛికాలను, ఫిర్యాదులను నమోదు చేసే ప్రక్రియ, నియోగదారులకు వారి హక్కుల గురించిన అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఇందుకోసం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫండ్ నుంచి నిధులు ఉపయోగించవచ్చని మాథ్యూస్ చెప్పారు. అవాంఛిత కాల్స్‌పై కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, పెండింగ్‌లో ఉంచినవి, పూర్తి వివరాలు లేనందువల్ల తిరస్కరించినవి, విచారణ తర్వాత సహేతుకమైనవిగా పరిగణనలోకి తీసుకున్నవి తదితర అంశాలతో టెలికం సంస్థలు ప్రతి నెలా నివేదిక సమర్పించాలంటూ ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తోంది. -
దారి తప్పిన క్రికెటర్
-
ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు
గిద్దలూరు: రియల్ వ్యాపారులకు మధ్యవర్తిగా వ్యవహరించే ఓ వ్యక్తి ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి లక్షా 78వేల రూపాయలు మాయం చేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని గడికోట గ్రామానికి చెందిన సంకుల కాశీరావు కుమారునికి వ్యాపారం పెట్టించేందుకు నగదు సిద్ధం చేసుకున్నాడు. సుమారు రూ.2.50 లక్షల వరకు నగదును బ్యాంకు ఖాతాలో భద్రపరచుకున్నాడు. కాగా మంగళవారం కాశీరావుకు గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ చేసి తాను సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని.. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగాడు. పిల్లలు పెద్దవారయ్యారని.. ఉద్యోగం రాకపోవడంతో వ్యాపారం పెట్టించాలని ప్రయత్నిస్తున్నానని కాశీరావు అతనికి బదులిచ్చాడు. మాటలు కలిపిన గుర్తు తెలియని వ్యక్తి కాశీరావు కుటుంబ వివరాలు తెలుసుకుని బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. దీంతో కాశీరావు తన బ్యాంకు అకౌంట్ నంబర్, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్‌తో పాటు, సీవీవీ నంబర్ చెప్పేశాడు. అన్నీ తెలుసుకున్న ఫోన్‌చేసిన వ్యక్తి నీ సెల్‌కు మెసేజ్ వస్తుందని.. ఆ నంబర్ చెప్పాలనడంతో వెంటనే చెప్పేశాడు. దీంతో సదరు వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫ్లిప్ కార్డులో వస్తువులు రూ.12వేలు, రూ.18వేలు చొప్పున ఒక్క రోజే రూ.90 వేలు డ్రా చేశాడు. అయినప్పటికీ తాను మోసపోయానని గుర్తించని కాశీరావు ప్రశాంతంగానే ఉన్నాడు. తిరిగి బుధవారం ఫోన్ చేసి మరోసారి ఓటీపీ చెప్పాలన్నాడు. ఇన్ని పర్యాయాలు ఎందుకు ఫోన్ చేస్తున్నాడోనన్న అనుమానం వచ్చిన కాశీరావు ఓటీపీ చెప్పలేదు. దీంతో కాశీరావు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదులో మరో రూ.88 వేలు గుర్తు తెలియని వ్యక్తి తన పేటీఎంలో వేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.1.78 లక్షలు కాశీరావు ఖాతాలోంచి మళ్లించాడు. తాను మోసపోయానని గుర్తించిన కాశీరావు బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌బుక్‌లో ప్రింటింగ్ వేయించుకోగా నగదు ఖాళీ అయింది. దీంతో ఆయన స్థానిక ఎస్సై సమందర్‌వలిని ఆశ్రయించాడు. కాశీరావు ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై కాశిరావు ఖాతాలోని నగదు ఎక్కడెక్కకు వెళ్లిందో గుర్తించి నిందితుడు ఫ్లిప్‌కార్డులో కొనుగోలు చేసిన ఆర్డర్లను క్యాన్సిల్ చేయాలని సంస్థ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. పే టీఎం సంస్థ యాజమాన్యం, బ్యాంకు అధికారులతో మాట్లాడి నగదును బ్లాక్ చేయాల్సిందిగా ఎస్సై కోరారు. ఇలా కాశీరావు నగదు డ్రా కాకుండా అడ్డుకున్నాడు. రెండు లేదా మూడు రోజుల్లో కాశీరావు ఖాతాలోంచి డ్రా అయిన నగదు తిరిగి ఖాతాలోకి వస్తుందని ఎస్సై చెబుతున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సూచించారు. ఓటీపీ నంబర్ ఎవరికీ చెప్పవద్దని, అలా చెప్పడం వలన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. -
నమ్మించి.. ముంచేస్తారు
సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): ‘హలో నేను బ్యాంకు అధికారిని.. ముంబై నుంచి మాట్లాడుతున్నాను.. మీ బ్యాంకు అకౌంట్ నంబర్ చెప్పండి... వివరాలు సరిపోల్చుకోవాలి...’ అంటూ ఫోన్ రాగానే బ్యాంకు నుంచే కదా అని తణుకు పట్టణానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఠక్కున అక్కౌంట్ నంబర్ చెప్పారు. ఇంకేముందు క్షణాల వ్యవధిలో తన సెల్‌ఫోన్ నంబర్ రెండు దఫాలుగా రూ.20 వేలు చొప్పున నగదు మాయమైనట్టు మెసేజ్ వచ్చింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళ అక్కడే ఉన్న వ్యక్తిని నగదు డ్రా చేయమని అడిగింది. ఆమె ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎంలో చెక్ చేసి డబ్బులు లేవని చెప్పి ఆమెకు ‘మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి రద్దీగా ఉండే ప్రాంతానికి వచ్చి బండిపై నుంచి అదుపుతప్పి పడిపోతున్నట్లుగా నటిస్తాడు. ఇదే సమయంలో సమీపంలోని ఎవరైనా ఇతనికి సాయం చేయడానికి వస్తారు. ఇదే అదనుగా చూసుకుని అప్పటికే అక్కడ కాపుగాసిన వ్యక్తి సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి జేబులోని పర్సు లేదా సెల్‌ఫోన్ అపహరిస్తాడు. ఈ తంతంగం అంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి.. నేరాలు ఇలా జరుగుతున్నాయ్ మొదట ఖాతాదారుడికి ఫోన్ కాల్ వస్తుంది.. సమాధానం ఇవ్వబోతే ముంబై నుంచో చెన్నై నుంచో బ్యాంకు ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని... మీ అకౌంట్ నంబర్ ఇవ్వాలని... మా వద్ద దురదృష్టవశాత్తూ నంబర్ పాడైందని చెబుతున్నారు. ఇది నిజమని నమ్మిన ఖాతాదారుడు వెంటనే ఆ నంబర్ చెబుతున్నారు. కాసేపటికే సెల్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి వచ్చినట్లు మెసేజ్ వస్తుంది. అందులో ఏటీఎం నాలుగు అంకెల పిన్ నంబరు ఇవ్వమని కోరుతున్నారు. బ్యాంకు అధికారే కదాని ఇస్తున్నారు. పది నిమిషాల్లో డబ్బు డ్రా చేసినట్లు తిరిగి మెసేజ్ వస్తోంది. దీంతో నెత్తీనోరు బాదుకోవడం ఖాతాదారుడి వంతు అవుతోంది. ఆధార్ నంబరును బ్యాంకు అనుసంధానం చేయాలంటూ ఏటీఎం పిన్ నంబరు తెలుసుకుని తణుకు పట్టణానికి చెందిన రెడీమేడ్ దస్తుల వ్యాపారి మోటారాంచౌదరి బ్యాంకు ఖాతా నంబర్ తెలుసుకుని ఇదే తరహాలో రూ.16 వేలు కాజేసిన సంఘటన గతంలో చోటుచేసుకుంది. కొవ్వూరుకు చెందిన దోర్భల ప్రభాకరశర్మకు ఇదే తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆధార్ అనుసంధానం అంటూ ఏటీఎం పిన్ నెంబరు తెలుసుకుని సుమారు రూ.15 వేలు నగదు కాజేశారు. ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన వ్యక్తి గోవాకు వెళ్లేందుకు ముందుగా హోటల్ గదిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఇందుకు రూ.40 వేలు ఆన్లైన్ ద్వారా యాజమాన్యానికి చెల్లించారు. అయితే కొద్దిసేపటికే మరో హోటల్లో గది బుక్ అయినట్లు మెసేజ్ రావడంతోపాటు మరో రూ.40 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో సైబర్ నేరాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ చోరీలు ఎక్కువగా జరగడానికి ఖాతాదారుల అమాయకత్వం, అవగాహన లేకపోవడమే కారణం. ఏ బ్యాంకు అధికారులైనా మనం ఫిర్యాదు చేయకుండా మనకు సంబంధించిన లావాదేవీల గురించి మనతో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా ఖాతాకు సంబంధించిన నంబర్, పేరు, చిరునామా తదితర వివరాలన్నీ ఆయా బ్యాంకువారి వద్దే ఉంటాయి. ఇలాంటి నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్ చేస్తే బ్యాంకు ఖాతా నంబర్లు చెప్పడం మంచిది కాదు. మన ఖాతా నంబర్ ఎవరికైనా ఇచ్చే ముందు స్థానిక బ్యాంకు వారిని కూడా సంప్రదించడం మంచిది. –డీఎస్ చైతన్యకృష్ణ, సీఐ, తణుకు -
ఫేక్‌కాల్స్ నియంత్రణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్ రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌కు ఆడిట్ లావాదేవీల నిర్వహణకు