five died
-
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే అయిదుగురు మృతి..
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును డీకొట్టింది. ఈఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గిరిదిహ్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం వెలుగుచూసింది. బాధితులంతా థోరియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా శుక్రవారం తికోడిహ్ ప్రాంతంలో పెళ్లికి హాజరయ్యారు. అక్కడే భోజనం చేసి రాత్రి స్కార్పియో వాహనంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున బాగ్మారా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కారులో మొత్తం పది మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాద స్థలంలోనే అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అయిదుగిరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తొలిసారి.. ఇక్కడ పోలింగ్ భారమంతా మహిళలదే #WATCH | Jharkhand: 5 people died after their car collided with a tree in Baghmara, Giridih. The injured have been admitted to hospital. They were returning after attending a wedding function: Kamlesh Paswan, station in-charge, Mufassil police station, Giridih pic.twitter.com/pBLLnin0jR — ANI (@ANI) November 18, 2023 -
ఘోర ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
క్రిష్ణగిరి: కృష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీని కారు ఢీనడంతో ఏడాది చిన్నారితో పాటు ఐదుగురు మృతి చెందారు. వివరాల మేరకు... బెంగళూరుకు చెందిన రమేష్ కుటుంబ సభ్యులు 8 మంది కలిసి తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో బంధువుల శుభకార్యానికి కారులో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం ఉదయం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. క్రిష్ణగిరి-హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద కారు అదుపుతప్పి పక్కనే నిలిపి ఉన్న ఖాళీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడాది బాలిక అంజలితో పాటు ఐదుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా డీఎస్పీ రాజు, రవాణాశాఖాధికారి బాలమురుగన్, కందికుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం
సితాల్‌కుచీ/సిలిగురి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అతిపెద్ద హింసాకాండ శనివారం చోటుచేసుకుంది. కూచ్‌బెహార్ జిల్లాలో రెండు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. క్యూఆర్టీ వాహనం ధ్వంసం ఓట్లు వేయడానికి వచ్చినవారిపై తొలుత కొందరు రాళ్లు రువ్వారని, విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారని తెలిపారు. కేంద్ర బలగాలకు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్(క్యూఆర్టీ) వాహనాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదని, భద్రతా సిబ్బందిపైకి దూసుకొచ్చారని, తుపాకులు లాక్కొనేందుకు ప్రయత్నించారని వివరించారు. ఆత్మరక్షణతోపాటు పోలింగ్ బూత్‌ను, ఎన్నికల సిబ్బందిని రక్షించడానికి అల్లరి మూకపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారన్నారు. నలుగురు మరణించగా, మరో నలుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ మొత్తం ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4 మృతదేహాలను అధికారులు సమీప ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో ఓటర్ కాల్చివేత కూచ్‌బెహార్ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్ పోలింగ్ బూత్ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్ మరణించాడు. 126/5 బూత్‌లో పోలింగ్ నిలిపివేత సితాల్‌కుచీ నియోజకవర్గంలోని 126/5 పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరగడం, నలుగురు మరణించడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర బలగాలు ఒక వ్యక్తిని కాల్చి చంపాయన్న పుకారు కార్చిచ్చులా వ్యాపించడంతో దా దాపు 400 మంది వెంటనే 126/5 పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారని, కేంద్ర జవాన్లను ఘెరావ్ చేశారని కూచ్‌బెహార్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పోలింగ్ బూత్ వద్ద ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతే భద్రతా సిబ్బంది సపర్యలు చేశారని అన్నారు. కానీ, అతడిని కాల్చి చంపారని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు ఎన్నికల సందర్భంగా బెంగాల్లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు. హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్ నియోజకవర్గంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటిదాకా 8 మంది అరెస్టు కూచ్‌బెహార్ జిల్లాలో రెండు హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి అరీఫ్ అఫ్తాబ్ చెప్పారు. రెండు ఘటనలపై కూచ్‌బెహార్ జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. సితాల్‌కుచీ అసెంబ్లీ స్థానం పరిధిలో జోర్పాట్కీ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొందన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయన్నారు. పఠాన్‌తులీలో యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నాలుగో దశలో 76.16 శాతం ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో నాలుగో దశలో 44 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. 15,940 పోలింగ్ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్ íపీరియడ్’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, నలుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి. -
హాంకాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి
హాంకాంగ్ : హాంకాంగ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న డబుల్ డెక్కర్ బస్సు అదుపుతప్పి చెట్టును బలంగా డీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, 12 మంది మృత్యువాత పడ్డారు. బస్సు చెట్టును బలంగా ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ఒంగిపోవడంతో పాటు అద్దాలు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు కూర్చున్న సీట్ల పక్కకు కుంచించికపోవడంతో చిందర వందరగా తయారైంది.దీంతో ప్రయాణికులను బయటికి తీయడం సాధ్యం కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బస్సు పైభాగం ద్వారా లోపలికి ప్రవేశించి మృతదేహాలను బయటికి తీశారు.ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారని, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో చనిపోయిన ఐదుగురుని బ్లాక్బాక్స్ల్లో పెట్టి చైనాకు దగ్గర్లోని క్వాతుంగ్ ఆసుపత్రి మార్చురికీ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన రవాణామార్గం కలిగిన హాంకాంగ్‌లో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. ఇంతకుముందు ఇదే తరహాలో ఫిబ్రవరి 2018లో అతివేగంతో వెళుతున్న డబుల్‌డెక్కర్ బస్సు ప్రమాదానికి గురవడంతో 19మంది మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కశ్మీర్లో మరోసారి ఉగ్రపంజా; ఐదుగురు మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బెంగాల్‌కు చెందిన ఐదుగురు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరొక కూలీ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరందరూ పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దినసరి కూలీలని కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. తమ పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని సోపోర్ బస్టాండ్‌కు వచ్చిన సమయంలో ఉగ్రవాదులు వీరిపై దాడికి తెగబడ్డారని డీజీపీ తెలిపారు. కాగా, ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ట్రక్కు డ్రైవర్‌ను పొట్టన బెట్టుకున్న మరుసటి రోజే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. చనిపోయిన ఐదుగురిలో షేక్ కమ్రూద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ గా గుర్తించినట్లు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జహోరుద్దీన్‌ను చికిత్స కోసం అనంత్‌నాగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన రోజే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మరోవైపు ఈ దాడిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను బలిగొంటున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చనిపోయిన ఐదుగురికి తన ప్రగాడ సానభూతిని ప్రకటించిన మమత వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఐదుగురిని తొక్కేసిన ఏనుగు..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఏనుగు దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృతిచెందారు. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. ఒకే రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో ఒకే ఏనుగు దాడికి పాల్పడింది. తాల్చేర్ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు నిద్రిస్తున్న వారిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కేసింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత సంత్ పద అనే గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసి చంపింది. ఏనుగు దాడితో ఆ ప్రాంతంలోని ప్రజలంతా భయాందోళలను గురవుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషీయా అందే విధంగా చూస్తామని అధికారులు తెలిపారు. -
బ్యాంక్‌లో కాల్పులు.. ఐదుగురి మృతి
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సెబ్రింగ్ నగరానికి చెందిన జావర్ అనే దుండగుడు సన్ ట్రస్ట్ బ్యాంక్‌లో కాల్పులకు తెగబడ్డాడు. జావర్ విచక్షనారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా, చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ బ్యాంక్ రక్తపుమడుగులతో భయానకంగా మారింది. అనంతరం జావర్ పోలీసులకు ఫోన్ చేసి ఐదుగురిని చంపానని చెప్పి పరారయ్యాడు. అనంతరం ముమ్మరంగా గాలింపులు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు జావర్ను అదుపులోకి తీసకొని విచారిస్తున్నారు. కాల్పులకు గల కారణాలను పోలీసులు అతడి నుంచి రాబడుతున్నారు. ఇక ఫ్లోరిడాలో వరుస కాల్పుల ఘటనలు జరగడం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
నెత్తురోడిన నల్గొండ రహదారులు
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన బాణావత్ రూప్లా(37), దామరచర్ల మండలం కొండ్రపోలు శివారు మాన్‌తండాకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అద్దంకి–నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కిష్టాపురం వద్ద నెల్లూరు నుంచి హైదరబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న రూప్లా అక్కడికక్కడే మృతిచెందగా, ఐదు కిలోమీటర్ల వరకు బైక్‌ను ఇడ్చుకుపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సైదాబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలానికి వెళ్లి బస్సును స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శాంతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. యాదగిరిగుట్ట (ఆలేరు) : చౌటుప్పల్ మండలం వెలిమినేడుకు చెందిన రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.వరంగల్ నుంచి భువనగిరి వైపు శనివారం వేకువజామున వెళ్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మండలం రామాజీపేట స్టేజీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడా.. లేక మరో లారీ ఎదురుగా ఢీ కొట్టిందా తెలియలేదు. భువనగిరి వైపు వస్తున్న లారీలో ఉన్న రమేష్ అందులో ఇరుక్కుని మృతిచెంది ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. దేవరకొండ : పట్టణానికి చెందిన శివకార్ ఈశ్వర్‌జి(50) తన భార్యతో కలిసి టీవీఎస్ మోటర్‌సైకిల్‌పై ఇంటి నుంచి మార్కండేస్వామి దేవాలయానికి వెళ్తున్న క్రమంలో భార్యను రోడ్డు పక్కన దింపాడు. అనంతరం స్థానిక భారత్ ఫిల్లింగ్ స్టేషన్లోకి పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా కొండమల్లేపల్లి వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్‌జి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. గేదె కళేబరాన్ని ఢీకొని వ్యక్తి.. మేళ్లచెరువు (హుజూర్నగర్) : చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర్లు (24) కొంతకాలంగా మేళ్లచెరువులో ఉంటూ స్థానిక మైహోం సిమెంట్ పరిశ్రమలో రైల్వేట్రాక్ పాయింట్ మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి తన దగ్గరి బంధువు అంబడిపూడి శ్రీనివాస్‌తో కలిసి కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురి పునరావాసకేంద్రంలో ఓ వివాహానికి హాజరై తిరిగి మేళ్లచెరువు వస్తుండగా కందిబండ సమీపంలోని రోడ్డుమీద పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ఇదే సమయంలో లారీ వెంకటేశ్వర్లు తలపై నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి కొండలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జయకర్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మరొకరు.. నాంపల్లి(మునుగోడు) : మండల పరిధిలోని దామెర గ్రామానికి అబ్బనబోయిన స్వామి (25), తన సోదరుడు అబ్బస్వామితో కలిసి శనివారం మండలంలోని లింగోటం గ్రామంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యాడు. అనంతరం తిరిగి స్వగ్రామం వస్తుండగా వడ్డెపల్లి శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న అబ్బస్వామికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, స్వామికి 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పండుగ ముందు విషాదం
దేవరకొండ: ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తీసిన గుంత ఐదుగురు చిన్నారుల ప్రాణాలు బలితీసుకుంది. చిన్న గుంతనే.. అనుకున్న 8 ఏళ్లలోపు చిన్నారులు ఈత కొట్టేందుకు అందులోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల పంచాయతీ పరిధిలోని గుడితండాలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. గుడితండాకు చెందిన నేనావత్ ఓంకారం, సరస్వతి దంపతుల ఇద్దరు కుమారులు సంతోష్(7), రాకేష్(5), అదే తండాకు చెందిన నేనావత్ హన్మా, కుమారి దంపతుల ఇద్దరు కుమారులు నవదీప్ (6), సాత్విక్ (7), సర్దార్ అనే వ్యక్తి కుమారుడు శివ ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్ననికే ఇంటికి వచ్చారు. భోజనం చేశాక పెండ్లిపాకల ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో బండ్ నిర్మాణం కోసం తీసిన గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. ఓ వైపు మూడు, మరో వైపు ఏడెనిమిది అడుగులలోతు ఉన్న ఆ గుంత లో దిగాక నీట మునిగి ఊపిరాడక ఐదుగురూ మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవర కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంతోష్, కొండమల్లేపల్లిలోని గౌతమి పాఠశాలలో 2వ తరగతి, రాకేష్ ఎల్కేజీ చదువుతున్నాడు. నవదీప్ కొండమల్లేపల్లిలోని విజయ మేరి స్కూల్లో ఫస్ట్ క్లాస్, సాత్విక్ కూడా అదే పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. మరో చిన్నారి శివ గౌతమి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. కొడుకులనూ బలితీసుకుంది.. ‘‘పెండ్లిపాకల ప్రాజెక్టు కోసం కూడుపెట్టే పొలాన్ని ఇచ్చేశాం... సర్వస్వం పోయి కూలి పనులు చేసి బతుకుతున్నాం... ఇప్పుడదే ప్రాజెక్టు మా పిల్లలనూ బలితీసుకుంది. ఉన్న పొలం.., కన్న కొడుకులు పోయాక ఇక మేం బతికి మాత్రం లాభం ఏముంది... మేమూ చచ్చిపోతాం’’అంటూ పిల్లల తల్లిదండ్రులు ఆస్పత్రివద్ద రోదించారు. -
ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం
ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర కాశీలో వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
రాయదుర్గం: పిడుగుపాటు అయిదుగురు బడుగుజీవులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఆదివారం జరిగింది.గ్రామానికి చెందిన గొల్లపల్లి ఓబన్న (40), జయణ్ణ (55), కరీం(32) గొర్రెలు మేపడానికి పొలంలోకి వెళ్లారు. రైతు శివప్ప (25) పొలంలో పని చేసేందుకు వెళ్లాడు. ఇక గిరిరెడ్డి (32) రాళ్ల కోసం చెరువులోకి వెళ్లాడు. మరో నలుగురు పొలం పనుల్లో ఉన్నారు. సాయంత్రం వేళ వర్షం రావడంతో వారంతా అక్కడే వేపచెట్టు వద్దనున్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో అయిదుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. -
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
= ఘాట్ రోడ్డు ప్రమాద మృతులకు పొస్టుమార్టం పూర్తి = ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలింపు పెద్దదోర్నాల : ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుల్లో పెద్దదోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్న నీలమ్మ (50), కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారి స్వరూప (6) ఉన్నారు. మండల పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్లో చింతల సమీపంలో జరిగిన ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని దొంగర్‌గావ్‌కు చెందిన విజయ్‌కుమార్ (40), రాజేశ్వరి శ్రీదేవి (45), నాగం (45)లు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నలుగురి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక నుంచి పెద్దదోర్నాలకు చేరుకున్న బంధువులకు మృతదేహాలు అప్పగించారు. కర్నూలులో మృతి చెందిన చిన్నారి స్వరూప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అక్కడికి వెళ్లిన బంధువులకు అప్పగించారు. పెద్దదోర్నాల నుంచి నాలుగు మృతదేహాలతో ప్రత్యేక వాహనంలో కర్నూలు బయల్దేరిన బంధువులు అక్కడ స్వరూప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఐదు మృతదేహాలనూ స్వగ్రామానికి తరలించారు. -
విషాదంతో ఆరంభం
నూతన సంవత్సరం జిల్లాలో విషాదంతో ఆరంభమైంది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన యువకులు ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. రాయదుర్గం పట్టణంలోని పైతోటకాలనీ వద్ద రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇక హిందూపురం మండలం సంతేబిదనూరు గేటు సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో చౌళుకు చెందిన యువకుడు చనిపోయాడు. తాగునీటి ట్యాంకర్ (ట్రాక్టర్) గోతిలో పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణం కోల్పోయాడు. రోడ్డు ప్రమాద మృతుడిని చూసేందుకు ద్విచక్రవాహనంలో బయల్దేరిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందాడు. నూతన సంవత్సరం తొలిరోజున జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. రాయదుర్గంటౌన్ : నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు మునిసిపల్ పరిధిలోని పైతోట కాలనీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గల రాయదుర్గానికి శివప్ప (24), రవి (21) ఒక ద్విచక్రవాహనంపై, మరో బైక్‌పై వన్నూరుస్వామి (18), మహేష్ (18), తిమ్మప్ప(22) వచ్చారు. బైక్‌లపై కలియదిరుగుతూ హ్యాపీ న్యూయర్ ఇంటూ కేరింతలు కొట్టారు. 12 గంటల సమయంలో శివప్ప, రవి ఇంటికి తిరుగుపయనమయ్యారు. పైతోటలోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనంపై వస్తున్న వన్నూరుస్వామి, మహేష్, తిమ్మప్పలను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శివప్ప, వన్నూరుస్వామి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ముగ్గురికీ తీవ్ర గాయాలు కావడంతో రాయదుర్గం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. తిమ్మప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులు అందరూ భవన నిర్మాణ కార్మికులే. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన సోదరులు కావడం గమనార్హం. మృతి చెందిన శివప్పకు భార్య ఉన్నారు. రోడ్డు ప్రమాద ఘటనతో పైతోట కాలనీ శోకసంద్రంగా మారింది. మద్యం మత్తులో అజాగ్రత్తగా ద్విచక్రవాహనాలు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు పరామర్శ రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆదివారం ఉదయం ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతి చెందిన శివప్ప, వన్నూరుస్వామి మృతదేహాలను మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పైతోటకు వెళ్లి బంధువులను పరామర్శించి, ఆర్థికసాయం అందజేశారు. కాపుతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు మాధవరెడ్డి, పైతోట సంజీవప్ప, రఘు, మండల కన్వీనర్ మల్లికార్జున, నాగిరెడ్డిలు కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు.. హిందూపురం రూరల్ : చౌళూరు గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసులు, ఉమాదేవి దంపతుల కుమారుడు భాస్కర్ (23) శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు హిందూపురం వచ్చాడు. వేడుకల అనంతరం ఆదివారం వేకువజామునే తన ద్విచక్రవాహనంలో చౌళూరుకి తిరిగి పయనమయ్యాడు. సంతేబిదనూరు గేటు సమీపంలో హిందూపురం–బెంగళూరు రహదారిపైకి రాగానే అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్ ఎంబీఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ట్యాంకర్ అదుపుతప్పి మరొకరు.. ధర్మవరం రూరల్ : తాగునీటి ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి లింగుట్ల రామకృష్ణ నాయుడు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు, స్థానికులు తెలిపిన మేరకు.. నడిమిగడ్డపల్లి పంచాయతీ బలిజమడి తండాలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆదివారం ఉదయమే తండాకు నీటిని సరఫరా చేసేందుకు రామకృష్ణనాయుడు ట్యాంకర్‌తో బయల్దేరాడు. మార్గం మధ్యలో ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న రామకృష్ణ నాయుడుపై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఏఎస్ఐ నాగప్ప సంఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. బైక్ అదుపుతప్పి ఇంకొకరు.. శెట్టూరు : ద్విచక్రవాహనం అదుపుతప్పి అనుంపల్లికి చెందిన నాగప్ప (58) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. కుందుర్పి సమీపంలో శనివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో నాగప్ప బంధువు సోమశేఖర్ మృతి చెందాడు. అనుంపల్లికి చెందిన మరొక వ్యక్తితో కలిసి నాగప్ప ద్విచక్రవాహనంలో కుందుర్పికి బయల్దేరాడు. బొమ్మజ్జిపల్లి సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి గోతిలోకి దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడ్డ నాగప్పను బంధువుల సాయంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ హనుమంతరాయుడు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు తిప్పేస్వామి, ఆయకట్టు సంఘం ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు మహాబలి, రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వీరాంజినేయులు మృతునికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. -
లోయలో పడిన జీపు, ఐదుగురు మృతి
మడ్లక్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మడ్లక్ లో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
బాణసంచా పేలుడులో ఐదుగురు మృతి
బాణసంచా పరిశ్రమలో మళ్లీ పేలుడు చోటు చేసుకుంది. సాత్తూరులోని పరిశ్రమలో జరిగిన ఈ పేలుడులో ఐదుగురు బలి అయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. సాక్షి, చెన్నై: విరుదునగర్ జిల్లా బాణసంచా తయారీకి పెట్టింది పేరు. ఇక్కడి శివకాశి మినీ జపాన్‌గా పేరు గడించింది. ఇక్కడ బాణసంచా తయారీలో నిమగ్నం అయ్యే కార్మికులకు దినదిన గండమే. ఎప్పడు ఏ పరిశ్రమలో పేలుడు చోటు చేసుకుంటుందోనన్న ఆందోళన ఆ పరిసరవాసుల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సాత్తూరు సమీపంలోని దైవపాండికి చెందిన పరిశ్రమలో పేలుడు ఆ పరిసరవాసుల్ని ఆందోళనలో పడేసింది. విరుదునగర్ జిల్లా సాత్తూరు ముత్తాండిపురంలో దైవ పాండికి చెందిన పరిశ్రమ ఉంది. ఇక్కడ వంద మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. ఉదయం యథా ప్రకారం సిబ్బంది విధులకు వెళ్లారు. వారికి కేటాయించిన గదుల్లో బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మూడో నెంబరు గదిలో ముడి పదార్థాలను సిద్ధం చేస్తున్న సమయంలో చెలరేగిన నిప్పు రవ్వలు పెను ప్రమాదానికి దారి తీశాయి. అక్కడ సిద్ధం చేసిన బాణసంచా పేలడంతో ఆ పరిసరాల్లో ఆందోళన నెలకొంది. ఇతర గదుల్లో ఉన్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆ పరిసరాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. పేలుడు శబ్దంతో ఆ పరిసరాలకు చెందిన జనం పరుగులు తీశారు. అయితే లోనికి వెళ్లేందుకు సాహసించ లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ఈ పేలుడు దాటికి మూడు నెంబరు గది నేలమట్టమైంది. ఇక్కడి మంటలు ఇతర గదులకు వ్యా పించని దృష్ట్యా, మరింత పెను ప్రమా దం తప్పినట్టు అయింది. సంఘటనా స్థలంలోనే ఎలుమచ్చం పట్టికి చెందిన మునియాండి భార్య సరస్వతి(44), మునుస్వామి భార్య సుబ్బుతాయ్(55), మాడస్వామి భార్య సెల్వి(25) మరణించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ముత్తుమారి, మునిరాజ్, సూర్యనారాయణ, సెల్వం, వీరమ్మలను చికిత్స నిమిత్తం సాత్తూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంతో అధికార వర్గాలు సాత్తూరుకు ఉరకలు తీశాయి. ప్రమాద ఘటనపై విచారణ సాగిస్తున్నాయి. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. -
విషాదం మిగిల్చిన విందు
-
రన్ వేపై కూలిపోయిన విమానం
వల్లెట్టా: మాల్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిన్నపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. సోమవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. లుఖా విమానాశ్రయం నుంచి లిబియాకు బయల్దేరిన ఈ విమానం కాసేపటికే కుప్పకూలింది. మృతుల వివరాలు తెలియాల్సివుంది. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విమానంలో యూరోపియన్ యూనియన్ బోర్డర్ ఏజెన్సీకి చెందిన అధికారులు ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే తమ సిబ్బంది ఎవరూ లేరని ఆ ఏజెన్సీ తెలియజేసింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే దిశ మార్చుకుని రన్ వే కూలినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. -
యూపీలో గోడ కూలి ఐదుగురు మృతి
-
ఘోర రోడ్డుప్రమాదం : ఐదుగురి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును టిప్పర్ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పాత గుంటూరుకు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డు అధికారి మాచర్ల వీరాస్వామి తన మనవరాలు నిత్య(9 నెలలు) పుట్టు వెంట్రుకలు తీయించేందుకు 12 మంది కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులోని ముగ్గురు కిందికి దిగి ముందుకు తోసేందుకు యత్నిస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కిందనున్న ముగ్గురూ త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందులోని నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను కృష్ణ(3), నిత్య(1), చిన్నికృష్ణ(4), వాసవి(4) గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
రోడ్డుప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌ల్లోని రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కావలి: నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తుని: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తుని మండలం జగన్నాథపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. గండేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సింహాచలం, రమణమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాధమిక వైద్యం అందించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నంద్యాల: కర్నూలు జిల్లాలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. తిరుపతికి చెందిన మేఘన ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు ప్రయాణికులతో వెళుతోంది. తెల్లవారుజామున ఆ బస్సు నంద్యాల శివారులోని మిల్స్ డెయిరీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ యోగానందరెడ్డి అక్కడికక్కడే చనిపోగా బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు చనిపోయారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో కారు డ్రైవర్, ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
తూర్పుగోదావరిలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమాన హీరోలకు ఫ్లెక్సీలు కట్టడానికి రెండు మండలాల్లో కొందరు అభిమానులు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. రెండు మండలాల్లో జరిగిన ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 7 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. రంగంపేట మండలం వడిశలేరులో ఇద్దరు మృతిచెందారు. మండపేట మండలం మారేడుబాకలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి
మృతుల్లో నలుగురు కూలీలు.. ప్రకాశం జిల్లా వాసులు వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం చిన్న డేగర్లమూడికి చెందిన 11 మంది పొగాకు గ్రేడింగ్ పనిచేసే కూలీలు. వీరు మైసూరులోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు రేణిగుంట వరకు రైల్లో వచ్చారు. అక్కడ నుంచి బైపాస్ రోడ్డుకు చేరుకొని ఆ మార్గంలో వస్తున్న గ్రానైట్ బండల లోడు లారీ ఎక్కారు. క్యాబిన్లో ఐదుగురు, ట్రక్కులో క్యాబిన్‌కు బండలకు మధ్య ఖాళీలో ఆరుగురు కూర్చున్నారు. తరువాత నాయుడుపేట వద్ద ఓజిలి మండలం కురుగొండకు చెందిన ముగ్గురు నెల్లూరులో ఓ వివాహానికి వెళ్లేందుకు అదే లారీ ఎక్కి క్యాబిన్‌కు, బండలకు మధ్య కూర్చున్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపానికి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో లారీ కుదుపునకు గురై గ్రానైట్ బండలు ముందుకు పడిపోయాయి. దీంతో క్యాబిన్‌కు, రాళ్లకు మధ్య కూర్చుని ఉన్న తొమ్మిదిమందిలో డేగర్లమూడికి చెందిన రమాదేవి (45), వీరలక్ష్మి (30), సుబ్బాయమ్మ (30), నాగేంద్రమ్మ (47) దుర్మరణం చెందారు. ఓజిలి మండలం కురుగొండకు చెందిన పుల్లయ్య (47) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మిగిలిన వారు గాయపడ్డారు. బాధితుల్ని 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కురుగొండకు చెందిన రమణయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగుర్ని కబళించిన కొండవాగు
- ఒకరు గల్లంతు మృతులంతా కృష్ణా జిల్లా వాసులే - ‘పశ్చిమ’ ఏజెన్సీలో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద దుర్ఘటన బుట్టాయగూడెం: కొండవాగు పొంగింది. గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లినవారిని ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామ శివారులోని అడవిలో ఆది వారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుం ది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లపూడి గ్రామం, విజయవాడ నగరంలోని మధురానగర్, పటమట ప్రాంతాలకు చెందిన 45 మంది వ్యాన్, ఆటోల్లో మంగమ్మ దర్శనానికి వచ్చారు. 7 గంటల సమయంలో గర్భగుడిలో పూజల్లో నిమగ్నమై ఉండగా.. తెల్లవారుజాము నుంచి కొండల్లో కురుస్తున్న వర్షంతో అకస్మాత్తుగా వాగు పొంగింది. ఆలయం గుహ పైనుండి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఊహించని ఘటనతో భక్తులు హాహాకారాలు చేస్తూ తలోదిక్కూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అప్పటికే పూజలు ముగించుకున్నవారితో పాటు మరికొందరు గట్టుపైకి చేరుకోగా సుమారు 20 మంది వాగులో కొట్టుకుపోయారు. స్థానిక వ్యాపారస్తులు ప్రాణాలకు తెగించి 5 మృతదేహాలను వెదికి పట్టుకున్నారు. విజయవాడకు చెందిన ఏనుగుల మాధవి (22), వేముల లోకేష్ (13), కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన మారీదు నరసమ్మ (62), ఆకుల కళ్యాణి (38) ఉప్పలపాటి దీపక్‌సాయి (15) మరణించగా, విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి (40) గల్లంతయ్యారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. వరద ఉధృతికి తోడు వాగులో ఉన్న బండరాళ్ల వల్ల తగిలిన గాయాలు మరణాలకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళతో పాటు మరో ఇద్దర్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగుకు ఎగువున చెక్ డ్యామ్ కూలిపోవడంతో వరద ఒక్కసారిగా విరుచుకుపడిందని అంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లి.. మధురానగర్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఏనుగుల మంగమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు లారీ కొనుగోలు చేయడంతో మంగమ్మ కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, మనమళ్లు శనివారం రాత్రి బయలుదేరి మంగమ్మ దర్శనానికి వచ్చారు. వాగు పొంగిన ఘటనలో మంగమ్మ కుమార్తె వేముల ఉమాదేవి (34) గల్లంతయింది. ఈమె కోసం పొద్దుపోయేవరకు గాలింపు కొనసాగుతుండగా ఆమె కుమారుడు లోకేష్ (14), మంగమ్మ కోడలు కళ్యాణి మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదవాతావరణం అలుముకుంది. -
వడదెబ్బకు రాలిన ప్రాణాలు
మృతుల్లో ఇద్దరు రైతులు, ఒక ఉపాధి కూలీ, ఉపాధ్యాయుడు, వృద్ధుడు బాధిత కుటుంబాల్లో విషాదం వర్గల్/పాపన్నపేట/చిన్నకోడూరు/ తూప్రాన్ /ములుగు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన రైతు గడ్డం నర్సయ్య (68) తనకున్న మూడున్నర ఎకరాల పొలంలో వరిని సాగు చేశాడు. బుధవారం మిషన్‌తో వరి కోయించాడు. అదేరోజు కొడుకు స్వామితో కలిసి పొలంలో వరిగడ్డిని కట్టలుగా కట్టి ఇంటికి తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రి ఇంటికి చేరిన నర్సయ్య వడదెబ్బ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడు.గురువారం ఉదయం వరకు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యు లు అతడిని 108లో గజ్వేల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య యాదమ్మ, కుమారుడు స్వామిలు ఉన్నారు. పాపన్నపేట మండలం బాక్యా తండాకు చెందిన దేవసోత్ కిషన్ (56) వారం రోజులుగా గ్రామశివారులోని మాచిరెడ్డికుంటలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా పనులు హాజరయ్యాడు. అయితే మధ్యాహ్నం ఒ క్కసారిగా.. కిషన్ వడదె బ్బతో కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని ఇం టికి తీసుకువచ్చే సారికి అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య పెంటి, కు మార్తె చాంగును, కుమారులు మోహన్, వసంత్, శ్రీనివాస్‌లు ఉన్నా రు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన కొమ్మెర మల్లారెడ్డి (65) వ్యసాయ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గురువారం ఉద యం పనులకు వెళ్లి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కు టుంబీకులు ఆస్పత్రికి తరలించే క్రమం లో మల్లారెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య శాంతవ్వ, కుమారుడు రవీం దర్‌రెడ్డిలు ఉన్నారు. మృతుడి కుటుం బాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పరకాల వజ్రమ్మ, ఎంపీటీసీ భూంరెడ్డిలు కోరారు. తూప్రాన్ పట్టణానికి చెందిన గడ్డం శ్రీనివాస్ (33) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పాఠశాలలకు సెలవులు కావడంతో బుధవారం బంధువుల శుభ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఎండలో బాగా తిరిగి అదేరోజు సాయంత్రం ఇంటికి వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం ఉదయం బంధువులు ఇంటికెళ్లగా అక్కడ శ్రీనివాస్ విగతజీవుడై పడి ఉన్న విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య అనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ములుగుకు చెందిన తీగుళ్ల కిష్టయ్య (60) ప్రతి రోజూ పశువులను మేతకు తిప్పుకువస్తుంటాడు. గురువారం కూ డా పశువులను మేతకు వెళ్లిన కిష్టయ్య ఎండ వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య చం ద్రమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వడదెబ్బతో వివాహితకు అస్వస్థత రామాయంపేట మండలం కోనాపూర్ చిన్నతండాకు చెందిన సునీత గురువారం వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. వివరాలిలా ఉన్నాయి.. వారం రోజులుగా సునీత వ్యవసాయ పనుల కు వెళుతోంది. ఇటీవల కాలంలో ఎండల ప్రభావం పెరగడంతో గురువారం వడదెబ్బకు గురైంది. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. -
దౌల్తాపురంలో ప్రబలిన విషజ్వరాలు: ఐదుగురు మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా చిత్తగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయి. ఇప్పటికే ఐదుగురు గ్రామస్థులు మృతి చెందారు. మరో వందమంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామంలో విషజ్వరాల ప్రబలడంపై గ్రామస్థులు... ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో గ్రామస్థులు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.