Gagan Narang
-
పక్కా ప్రణాళికతోనే పతకాలు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటర్లు పతకాలతో సత్తా చాటుకున్నారు. సమర్థవంతమైన మౌలిక వసతులు, ప్రణాళికబద్ధమైన కృషి వల్లే ఇది సాధ్యమైందని షూటింగ్ బృందం నిరూపించింది. సమయానుకూలంగా మారాల్సిన ఆవశ్యకతను ఈ విజయాలు తెలియజేశాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో ఒక్క పతకం లేకుండానే భారత షూటర్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ పతకాలతో 12 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో మన షూటర్లు చరిత్ర సృష్టించారు. మను ఖాతాలో రెండు పతకాలున్నాయి. మూడో పతకం గెలిచేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. దురదృష్టం వల్లే అర్జున్ బబూతాకు కాంస్యం చేజారింది. దీన్ని వైఫల్యంగా చూడలేం. నిజానికి అతను అత్యుత్తమ ప్రదర్శనే చేశాడు. కాకపోతే ఏం చేస్తాం ఆ రోజు తనది కాదు! ఈ ఒలింపిక్స్‌లో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది. పతకాలు ఏలా సాకారమయ్యాయంటే మాత్రం యువ షూటర్ల ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణం. క్రీడాగ్రామంలో నేను వారితో పోటీలకు ముందే భేటీ అయ్యాను. నేనో చెఫ్ డి మిషన్‌గా కాకుండా ఓ షూటర్‌గానే వాళ్లతో సంభాíÙంచాను. అప్పుడు వాళ్ల విశ్వాసం, పట్టుదల ఏంటో నాకు అర్థమైంది. ఓ సీనియర్ షూటర్‌గా నేను వారికి చెప్పేదొకటే... గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్రీడలపైనే దృష్టి సారించాలని చెప్పాను. ప్రస్తుత బృందంలోని 21 మందిలో 10 మంది ‘ఖేలో ఇండియా’ ద్వారా వెలుగులోకి వచ్చారు. మరో 11 మంది టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) అండదండలతో విశ్వక్రీడలకు అర్హత సాధించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడాకారులకు ఉన్న ఆరి్థక కష్టాలను తొలగించి ఆటపై దృష్టి పెట్టేలా పెద్ద ఎత్తున కృషి చేశారు. క్రీడాకారులకు సంబంధించి ప్రత్యేక, వ్యక్తిగత శిక్షణ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్చ కూడా కల్పిం చడం గొప్ప విషయం. విదేశీ కోచ్‌లు, విదేశాల్లో శిక్షణ వీటన్నింటి మీద క్రీడా శాఖ సమన్వయంతో పనిచేయడం వల్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి. ఆరంభంలోనే రెండు పతకాలు (షూటింగ్) రావడంతో ఈ విశ్వక్రీడల్లో భారత్ మరిన్ని పతకాలు గెలిచేందుకు పారిస్ ఒలింపిక్స్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. -
Paris 2024 Olympics: పతాకధారిగా సింధు
న్యూఢిల్లీ: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకంపై గురి పెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గొప్ప గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు నేతృత్వం వహించనుంది. విశ్వ క్రీడల్లో పతాకధారిగా వ్యవహరించనున్న సింధు భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. మరో ఫ్లాగ్ బేరర్‌గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరిస్తాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 41 ఏళ్ల శరత్‌ను పతాకధారిగా గత మార్చి నెలలోనే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. విశ్వ క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ప్రారం¿ోత్సవ వేడుకల్లో ఆయా దేశాలు పురుష ఫ్లాగ్ బేరర్‌తోపాటు ఒక మహిళా ఫ్లాగ్ బేరర్‌కు కూడా అవకాశం ఇవ్వాలనే నిబంధనను అమల్లోకి తెచి్చంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ పతాకధారులుగా వ్యవహరించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల సింధు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా గౌరవం పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ క్రీడల్లోనూ సింధు పతకం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా సింధు రికార్డు సృష్టిస్తుంది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలుసాధించాడు. చెఫ్ డి మిషన్‌గా గగన్ నారంగ్ మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్‌గా తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరిస్తాడు. ముందుగా మేరీకోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా ప్రకటించినా వ్యక్తిగత కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. దాంతో గగన్ నారంగ్‌కు చెఫ్ డి మిషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. చెఫ్ డి మిషన్ హోదాలో గగన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. 4: భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి, మేరీకోమ్లకు మాత్రమే దక్కింది. అథ్లెట్ షైనీ విల్సన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో... లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో... బాక్సర్ మేరీకోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్స్‌గా ఉన్నారు. -
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్
భారత స్టార్ షూటర్.. ఒలింపిక్ అథ్లెట్ గగన్ నారంగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా గగన్ నారంగ్ ఎన్నికయ్యాడు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్‌ను ద్రువీకరించారు. ఇక గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. -
‘మిషన్ ఒలింపిక్ సెల్’లో గగన్ నారంగ్
న్యూఢిల్లీ: భారత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కీలక బాధ్యతలు అప్పగించింది. ‘సాయ్’ ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ)లో సభ్యుడిగా నారంగ్‌ను ఎంపిక చేసింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి వారిని ఒలింపిక్స్‌కు సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా 2014 నుంచి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పని చేస్తోంది. ‘టాప్స్’ కోసం ఆటగాళ్లను గుర్తించడం, వారి సన్నాహకాలకు ఆర్ధికపరంగా సహకారం అందించే విషయంలో తగిన సూచనలు, సలహాలు అందించడం, ఫలితాలను పర్యవేక్షించడమే ‘మిషన్ ఒలింపిక్ సెల్’ బాధ్యత. 2024 పారిస్, 2028 లాస్ ఎంజెలిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లను ఎంపిక చేయడంలో తాను భాగస్వామిని కాబోతున్నట్లు హైదరాబాద్ షూటర్ గగన్ వెల్లడించాడు. ‘స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని డెవలప్మెంట్ గ్రూప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎంఓసీ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఆయా ఆటగాళ్ల అవసరాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ కోసం నిధులు అందేలా చూడటంతో పాటు అత్యుత్తమ స్థాయి కోచింగ్ సౌకర్యం, ఫిట్నెస్ తదితర అంశాలపై కూడా ఎంఓసీ దృష్టి పెడుతుంది. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని గగన్ వెల్లడించాడు. -
షూటింగ్ రేంజ్లో చెలరేగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో షూటింగ్ రేంజ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, గగన్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్ భారత బృందానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ నుంచి అయిదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. గగన్ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి మరింత మంది షూటర్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సెంట్రల్ యూనివర్సిటీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టగానే చెలరేగారు. అలవోకగా .22 వాల్తర్ పిస్టల్‌ను అందుకుని ప్రొఫెషనల్ తరహాలో పలు షాట్స్‌ను ఫైర్ చేశారు. మంత్రి టార్గెట్‌ను గురిపెట్టి ఫైర్ చేయడంతో ఒలింపిక్ మెడల్ విజేత, ఏస్ షూటర్ గగన్ నారంగ్ సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పిస్టల్‌తోనే కాకుండా రైఫిల్, షాట్ గన్, ఎయిర్ రైఫిల్‌తో పది మీటర్ల రేంజ్లో సైతం చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. షూటింగ్ అంటే ఇప్పటికీ తనకు ఆసక్తి అధికమని, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)లో తాను లైఫ్ మెంబర్‌నని, తనకు లైసెన్డ్ గన్ ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. pic.twitter.com/CQkIQUZICK — V Srinivas Goud (@VSrinivasGoud) July 21, 2021 -
గగన్ అకాడమీలోకి వరద నీరు
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒలింపిక్ మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ (జీఎఫ్జీ) అకాడమీ’లోకి వరద నీరు వచ్చి చేరింది. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తన షూటింగ్ రేంజ్‌లోకి వరద నీరు చేరడంతో దాదాపు రూ. 1.3 కోట్లు విలువైన షూటింగ్ సామగ్రి పాడైనట్లు నారంగ్ గురువారం వెల్లడించాడు. ‘ 24 గంటల్లో అంతా నాశనమైంది. భారీ వరద మా షూటింగ్ రేంజ్‌ను ముంచెత్తింది. కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్‌తో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా పాడు చేసింది. జీఎఫ్జీ సిబ్బంది 9 ఏళ్ల కష్టం వరద నీటిలో కొట్టుకుపోయింది’ అని ఆవేదనతో నారంగ్ పోస్ట్ చేశాడు. ఇప్పటికే కరోనా వల్ల ఏర్పడిన నష్టం చాలదన్నట్లు... తాజా వరదలు జీఎఫ్‌జీని ఆర్థికంగా దెబ్బ తీశాయని నారంగ్ వ్యాఖ్యానించాడు. జీఎఫ్‌జీని ప్రపంచస్థాయి షూటింగ్ అకాడమీగా మార్చేందుకు తాము రాత్రింబవళ్లు కష్టపడ్డామని, ఇకపై అకాడమీని మునపటిలా మార్చడానికి వీలవుతుందో లేదో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. -
గ‘ఘన్’ విజయం
‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 80 శాతం మంది ఆటగాళ్లు తమ తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలు గెలుచుకుంటారు’... షూటర్ గగన్ నారంగ్‌తో అతని కోచ్ చెప్పిన మాట ఇది. ఈ వ్యాఖ్య గగన్ ఆత్మ స్థైర్యాన్ని కొంత దెబ్బ తీసింది. ఎందుకంటే అప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నా అతనికి పతకం దక్కలేదు. దీనికి తోడు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తన కేటగిరీనే అయిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అభినవ్ బింద్రా సాధించిన స్వర్ణంతో అంచనాలు, ఒత్తిడి కూడా పెరిగాయి. ఇలాంటి స్థితి నుంచి అతను మరో ఒలింపిక్స్ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో గగన్ సాధించిన కాంస్యంతోనే భారత్ పతకాల బోణీ కొట్టింది. గగన్ నారంగ్‌కు అంతర్జాతీయ విజయాలు కొత్త కాదు. అప్పటికే ప్రపంచ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన ఎన్నో పతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ఏదో వెలితి...! ప్రతీ క్రీడాకారుడు కలలుగనే ఒలింపిక్ మెడల్ మాత్రం అతని దరి చేరలేదు. సుదీర్ఘ కెరీర్లో పలు ఘనతల తర్వాత కూడా అది మాత్రం సాధించలేకపోయాననే భావం అతడిని వెంటాడుతూనే ఉంది. ఏథెన్స్లో త్రుటిలో ఆ అవకాశం పోయింది, బీజింగ్‌కు వచ్చేసరికి క్వాలిఫయింగ్‌లోనే ఆట ముగిసింది. కానీ లండన్‌లో మాత్రం ఈ హైదరాబాద్ షూటర్ గన్ గురి తప్పలేదు. అంచనాలు లేకుండా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనే నాటికి గగన్ నారంగ్ చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించలేదు. సొంత నగరంలో హైదరాబాద్‌లోనే జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నా... వాస్తవంగా ఆ పతకానికి అంత విలువేమీ లేదు. అందుకే 21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌కు వెళ్లిన గగన్పై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే గగన్ గట్టిగానే పోరాడాడు. 47 మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 593 పాయింట్లతో 12వ స్థానంతో అతను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పదును పెరిగినా... ఏథెన్స్ వైఫల్యం గగన్‌ను పెద్దగా కుంగదీయలేదు. మరింత పట్టుదలతో తన సత్తా చాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వరుసగా పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ పతకం సాధిస్తూ వచ్చాడు. 2005 కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ఇది మొదలై ఆ తర్వాత 2006లో గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ కప్‌లో స్వర్ణం వరకు సాగింది. ఆ తర్వాత మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు వచ్చాయి. ఇక్కడ ఏకంగా 4 స్వర్ణాలతో తన జోరు కొనసాగించిన గగన్ ఏడాది చివర్లో జరిగిన దోహా ఆసియా క్రీడల్లో 3 కాంస్యాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఫామ్ చూస్తే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనిపించింది. కానీ చివరకు అసలు వేదికపై అతను చేతులెత్తేశాడు. ఈసారి క్వాలిఫయింగ్‌లో 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు త్రుటిలో అర్హత కోల్పోయాడు. 600కుగాను ఐదుగురు షూటర్లు 595 పాయింట్లు స్కోర్ చేయగా... కౌంట్‌బ్యాక్‌లో దురదృష్టవశాత్తూ గగన్ 0.1 పాయింట్ తేడాతో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. తన 42వ షాట్లో అతను 8.9 పాయింట్లు సాధించగా, మరో షూటర్ 9 పాయింట్లు స్కోరు చేసి ముందంజ వేశాడు. పతక సమయం... బీజింగ్ పరాజయం షాక్ నుంచి కోలుకునేందుకు గగన్‌కు చాలా సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. పడుకున్నా నిద్రలోనూ అవే పీడ కలలు. దాంతో కొంత కాలం గన్ను పక్కన పడేశాడు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి జరిగిన ప్రపంచకప్‌లో 703.5 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం అతనికి కావాల్సిన స్ఫూర్తిని అందించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో తన ప్రధాన ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌తో పాటు వేర్వేరు ఈవెంట్లలో కలిపి ఏకంగా 6 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. ఆపై ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 4 స్వర్ణాలు, గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో 2 రజతాలు అతనికి మళ్లీ జోష్‌ను అందించాయి. దీనికి తోడు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యంతో గగన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరకు ఇదే లండన్ ఒలింపిక్స్‌లో కనిపించింది. ఈసారి వచ్చిన అవకాశాన్ని అతను వదిలి పెట్టలేదు. పాత చేదు అనుభవాలను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. క్వాలిఫయింగ్‌లోనే మెరుగైన ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్లో సరైన దిశలో అతని గన్ పేలింది. ఓవరాల్‌గా 701.1 పాయింట్లతో కాంస్యం సొంతమైంది. బహుమతి ప్రదానోత్సవ సమయంలో ఎగురుతున్న భారత జెండాను చూసిన నారంగ్ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. -
ముందుగా షూటింగే ప్రారంభమవుతుంది: గగన్
న్యూఢిల్లీ: మిగతా క్రీడాంశాలతో పోలిస్తే షూటింగ్ క్రీడా కార్యక్రమాలే ముందుగా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లతోనే క్రీడా పరికరాలు ఉండటంతోపాటు, ఒకరిని మరొకరు తాకే వీలు లేని ఆట కాబట్టి షూటింగ్ శిక్షణా కార్యక్రమాల్ని పునరుద్ధరించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘కోవిడ్–19 తీవ్రత తగ్గిన తర్వాత సరైన నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కార్యక్రమాల్ని తిరిగి మొదలు పెడితే బావుంటుంది. యూరప్ దేశాల్లో కొన్ని చోట్ల అవి ఇప్పటికే మొదలైనట్లు నేను విన్నాను. ఇది జరగొచ్చు. ఎందుకంటే షూటింగ్ రేంజ్‌లలో సామాజిక దూరం పాటిస్తూ శిక్షణలో పాల్గొనవచ్చు. మనిషికి మనిషికి మధ్య ఎడం ఉండే ఆటల్లో షూటింగ్ ఒకటి. 10 మీటర్ల రేంజ్లో ఇద్దరు షూటర్ల మధ్య 1–1.5మీ. ఎడం ఉంటుంది. 50 మీటర్ల రేంజ్లో 1.25 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అన్ని క్రీడలతో పోలిస్తే షూటింగ్ కార్యకలాపాలే ముందుగా ప్రారంభమవుతాయని అనుకుంటున్నా’నని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ అన్నాడు. -
మా ఇలవేణి బంగారం; ఈ పసిడి ప్రత్యేకం!
రియో డి జెనిరో : భారత షూటర్ ఇలవేణి వలరివన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకం సాధించింది. బుధవారం రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించింది. తద్వారా షూటింగ్ ప్రపంచ కప్ సిరీస్‌లో అంజలీ భగవత్, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్ రైఫిల్) మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. ఈ నెల(ఆగస్టు 2)లోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం. కాగా బుధవారం నాడు జరిగిన పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవేణి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక బ్రిటన్‌కు చెందిన సియోనాయిడ్ కింటోష్(250.6), తైపీకి చెందిన లిన్ మాంగ్ చిన్(229.9) వరుసగా రజత, కాంస్య పతకాలతో ఇలవేణి తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా సీనియర్ షూటర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ వద్ద ఇలవేణి షూటింగ్లో మెళకువలు నేర్చుకుంది. విజయానంతరం ఆమె మాట్లాడుతూ..‘మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఒలింపిక్ పతకం సాధించాలని మూడేళ్ల కిందటే లక్ష్యం పెట్టుకున్నాను. ప్రస్తుతం ఈ విజయం నాలో విశ్వాసం నింపింది. మా అకాడమీ గన్ ఫర్ గ్లోరీకి జాతీయ అవార్డు వచ్చిన రోజే నేను పసిడి సాధించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైనది’ అని సంతోషం వ్యక్తం చేసింది. తాను ఈ పతకం సాధించడం వెనుక ఎందరో ప్రోత్సాహం ఉందని, వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పతకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు పేర్కొంది. కాగా గత కొన్నేళ్లుగా దేశంలోని పలు నగరాల్లో షూటింగ్ కేంద్రాలను నెలకొల్పి..యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్న గగన్ నారంగ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇలవేణి వలరివన్.. కడలూరు జిల్లా తారామణికుప్పంకు చెందిన ఇలవేణి వలరివన్ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే. అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ (ఇంగ్లిçషు) చదువుతున్న ఇలవేణికి రైఫిల్ షూటింగ్లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. జూనియర్ పోటీల్లో రాణించే ప్రయత్నం చేసింది. అనేకమార్లు వెనక్కి తగ్గినా, ఏ మాత్రం ఢీలా పడకుండా ముందుకు సాగిన ఇలవేణి ప్రస్తుతం తమిళనాట బంగారంతో మెరిసింది. బ్రిజిల్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో తన సత్తాని ఇలవేణి చాటుకుంది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 251.7 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని తమిళ ఖ్యాతిని బ్రెజిల్ వేదికగా చాటింది. మా బంగారం ఇలవేణి.. తమ కుమార్తె పతకం సాధించడటం పట్ల వలరివన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని ఏదో ఒక క్రీడపై దృష్టి పెట్టే రీతిలో చర్యలు తీసుకోవాలని, అందులో వారిని ప్రోత్సహించాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఇలవేణి తల్లిదండ్రులు సూచించారు. తన కుమార్తె ఒలింపిక్స్‌లో రాణించాలన్న లక్ష్యంతో ఉన్నదని అది సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, తారామణి కుప్పంవాసులు అయితే, తమ గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ఇలవేణి నిలబెట్టినట్టు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అక్కడి యువత బాణసంచాలు పేల్చుతూ ఇలవేణికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడి ఇలవేణి కుటుంబీకులు, అత్త, అవ్వ మా ఇలవేణి బంగారం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. First senior World Cup GOLD for @elavalarivan as India wins 3 of the four women’s 10m Air Rifle in all @ISSF_Shooting world cups this year. Incredible talent and phenomenal achievement. Many congratulations! #issfworldcuprio2019 pic.twitter.com/FN9DUurVJk — NRAI (@OfficialNRAI) August 28, 2019 -
అద్భుతంపై నా గురి: గగన్
న్యూఢిల్లీ: వరుసగా ఐదోసారి ఒలింపిక్స్ బరిలో నిలువాలనుకుంటున్నట్లు వెటరన్ షూటర్ గగన్ నారంగ్ చెప్పారు. టోక్యో కోసం సన్నాహాలు ప్రారంభించిన తను ‘అద్భుతం’పై గురిపెట్టినట్లు చెప్పాడు. ‘నేను ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. టోక్యో వెళ్లేది లేనిది త్వరలో ప్రారంభమయ్యే పోటీలే చెబుతాయి. వచ్చే నెలలో మాకు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నాయి. అక్కడ అద్భుతం జరిగితే ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికవుతా. అక్కడ్నుంచి ఒలింపిక్స్ దాకా మరెంతో దూరం ప్రయాణించాల్సి వుంటుంది’ అని లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత నారంగ్ అన్నాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఈ తెలంగాణ సీనియర్ షూటర్ ‘గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్’ ద్వారా యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పలు నగరాల్లో షూటింగ్ కేంద్రాలను నెలకొల్పారు. ఎట్టకేలకు నారంగ్ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌ను తొలగించడంతో బాయ్‌కాట్ ప్రతిపాదనను నారంగ్ తప్పుబట్టారు. అది సరైన నిర్ణయం కాదన్నాడు. కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ప్రతి దశలోని కోచ్‌లకు ఇవ్వాలన్నాడు. -
షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించి నంత మాత్రాన షూటింగ్‌కు వచ్చే నష్టమేమీ లేదని 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, షూటర్ గగన్ నారంగ్ అభిప్రాయ పడ్డాడు. 2022లో బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్‌ను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఒలింపిక్ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం స్పందించిన గగన్ ‘ఇదేమీ షూటింగ్‌కు ఎదురుదెబ్బ కాదు. ఉదాహరణకు క్రికెట్‌నే చూడండి. అదేమీ ఒలింపిక్స్‌లో లేదు.. అలాగే కామన్వెల్త్ గేమ్స్‌లోనూ లేదు. అయినా అది ఎదగలేదా.. అలాగే స్క్వాష్ కూడా.. జరిగిందేదో జరిగింది. కామన్వెల్త్లో షూటింగ్ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి 2022లో జరిగే ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి సారించండి’ అంటూ హితవు పలికాడు. అలాగే భవిష్యత్తులో షూటింగ్ తిరిగి కామన్వెల్త్ గేమ్స్‌లో రీ ఎంట్రీ ఇస్తుందనే నమ్మకం తనకుందని నారంగ్ అన్నాడు. -
నాన్న ఇల్లు అమ్మి.. రైఫిల్ కొనిచ్చాడు!
న్యూ ఢిల్లీ: ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రఖ్యాత షూటర్, ఒలింపిక్ మెడల్ సాధించిన గగన్ నారంగ్ తన తండ్రి గొప్పతనాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. షూటింగ్లో బాడా ఆడి దేశానికి గొప్ప పాత్రినిథ్యం వహించి పలు జాతీయ, అంర్జాతీయ పతకాలు సాధించాలని తన తండ్రి ఆకాంక్షించారని తెలిపారు. 20 ఏళ్ల క్రితం సొంతింటిని అమ్మి తనకు షూటింగ్ ప్రాక్టిసుకు ఇబ్బంది కలగకూడదని ‘రైఫిల్’ కొనిచ్చారని గుర్తుచేసుకున్నాడు. ‘ఏదో రోజు నేను భారతదేశానికి గొప్ప మెడల్స్ సాధిస్తాననే నమ్మకం నాన్నకు ఉండేది. అందుకే నా కోసం సొంతింటిని అమ్మి.. రైఫిల్‌ను కొనిచ్చారు’ అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ‘షూటింగ్లో ప్రపంచ రికార్డును నెలకొల్పుతానని, ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధిస్తానని నేను ఏనాడూ ఊహించలేదు. కానీ ఓ తండ్రిగా మా నాన్న నా ప్రతిభ మీద అపార నమ్మకం కలిగి ఉండేవారు’ అని తెలిపారు. ‘నా విజయాల వెనుక మా నాన్న సహకారం ఎంతో ఉంది. తండ్రిగా నా ప్రతిభను తెలుసుకోవడంతోపాటు, నా ముఖంలో సంతోషాన్ని నింపాలని తాపత్రయ పడిన గొప్పతండ్రి ఆయన.. హ్యాపి ఫాదర్స్ డే నాన్న’ అని పోస్ట్ చేశారు. -
చిరుతో టాప్ షూటర్ మీటింగ్!
మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ కలిసినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే వీరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు గగన్ నారంగ్. చిరుతో చిత్ర విశేషాలు, షూటింగ్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడినట్టు తెలిపారు. చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడిగా నటిస్తున్నందున... గగన్ నారంగ్ వద్ద షూటింగ్‌కు సంబంధించిన మెలుకువల గురించి చిరు చర్చించారు. ఇటీవలె జార్జియా షెడ్యుల్‌ను కంప్లీట్ చేసుకుంది చిత్రయూనిట్. తదుపరి షెడ్యుల్‌లో యాక్షన్ సన్నివేశాల్లో షూటింగ్‌కు సంబంధించిన మెలుకువలు తెలుసుకునేందుకు గగన్ నారంగ్‌ను కలిశారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుధీప్ కీలక పాత్రలు నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. Had great fun talking about Shooting ..Both Kinds 🎬📽🔫🎯 with the ever humble #megastar #Chiranjeevi Garu...and also enlightened with his views about society #SyeRaaNaraSimhaReddy pic.twitter.com/Wz4XabDfn0 — Gagan Narang (@gaGunNarang) October 31, 2018 -
గ‘గన్’ గురికి రజత పతకం
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీల మూడో రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ రజతం నెగ్గగా... యువ షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్యం సాధించాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అన్నురాజ్ సింగ్ కాంస్యం కైవసం చేసుకుంది. ఫైనల్లో గగన్ 246.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించగా... స్వప్నిల్ 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘వచ్చే ఏడాది ఇక్కడే జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు ఇది టెస్ట్ ఈవెంట్. ఈ పోటీల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగింది. ఫైనల్లో నేనింకా ఎక్కువ పాయింట్లు సాధించాల్సింది’ అని లండన్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం నెగ్గిన గగన్ వ్యాఖ్యానించాడు. 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అన్నురాజ్ 28 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ ఐదో స్థానంలో, రాహీ సర్నోబాత్ ఆరో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం పది పతకాలు లభించాయి. -
గగన్ నారంగ్ కు రజతం
గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు కూడా భారత షూటర్ల హవా కొనసాగింది. తొలుత 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో భారత షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని కైవసం చేసుకోగా, ఆపై అదే ఈవెంట్ లో మరో భారత షూటర్ స్వప్నిల్ సురేశ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సాంప్సన్ కు స్వర్ణ పతకం సాధించాడు. ఇక మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత షూటర్ స్నురజ్ సింగ్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నిన్నటి షూటింగ్ పోరులో భారత ఖాతాలో ఐదు పతకాలు చేరిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్ రిజ్వీ, ఓంకార్ సింగ్, జీతూ రాయ్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పూజా ఘాట్కర్ స్వర్ణం, అంజుమ్ మౌద్గిల్ రజతం గెలిచారు. -
కైనన్, గగన్, రష్మీలకు చోటు
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీకి భారత జట్టు ఎంపిక న్యూఢిల్లీ: తొలిసారి భారత్ ఆతిథ్యమివ్వనున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇటీవలే పుణేలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీలతోపాటు రెండు సెలెక్షన్ టోర్నీలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ జట్టు ఎంపిక జరిగింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తెలంగాణ షూటర్లు గగన్ నారంగ్ (రైఫిల్ ప్రోన్), కైనన్ షెనాయ్ (ట్రాప్)లతోపాటు మహిళల స్కీట్ ఈవెంట్లో జాతీయ చాంపియన్ రష్మీ రాథోడ్‌లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. -
ఇంకా నిరీక్షణే...
పతకం కోసం భారత్ ఎదురుచూపులు గత నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (లండన్, బీజింగ్, ఏథెన్స్, సిడ్నీ) పోటీలు మొదలైన నాలుగు రోజుల్లోపే భారత్ పతకాల బోణీ చేసింది. కానీ రియో ఒలింపిక్స్‌లో మాత్రం వారం రోజులు గడిచినా మనోళ్లు ఇంకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయారు. కచ్చితంగా పతకం తెస్తారనుకున్న వారంతా ఒక్కొక్కరుగా నిష్ర్కమిస్తుండటంతో... పతకం కోసం భారత్ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ‘గన్’ గురి సరిపోలేదు లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం బోణీ చేసిన షూటర్ గగన్ నారంగ్ ఈసారి తడబడుతున్నాడు. తన తొలి ఈవెంట్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైన ఈ హైదరాబాద్ షూటర్... రెండో ఈవెంట్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలోనూ విఫలమయ్యాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గగన్ నారంగ్ 623.1 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 47 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన మరో షూటర్ చెయిన్ సింగ్ 619.6 పాయింట్లు సాధించి 36వ స్థానంలో నిలిచాడు. పురుషుల స్కీట్ ఈవెంట్లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక మేరాజ్ అహ్మద్ ఖాన్ 72 పాయింట్లతో 10వ స్థానంలో... 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు ముగిశాక గుర్ప్రీత్ సింగ్ 289 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు. అతాను ఆదుకోలేదు ఆర్చరీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో అతాను దాస్ 4-6తో (28-30, 30-28, 27-27, 27-28, 28-28) ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ సెయుంగ్ యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆర్చరీలో భారత పోరు ముగిసింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో... లక్ష్మీరాణి తొలి రౌండ్లో నిష్ర్కమించారు. లీ సెయుంగ్ యున్‌తో జరిగిన పోటీలో ఇద్దరూ చెరో సెట్ గెలిచాక స్కోరు 2-2తో సమమైంది. మూడో సెట్లో మూడో బాణంపై 9 పాయింట్లు సాధిస్తే అతాను సెట్ గెలిచేవాడు. కానీ ఎనిమిది మాత్రమే రావడంతో స్కోరు సమమై ఇద్దరికీ ఒక్కో పాయింట్ లభించింది. నాలుగో సెట్‌ను కోల్పోయిన అతాను ఐదో సెట్లో స్కోరును సమం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీకాంత్ శుభారంభం మరోవైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. గ్రూప్ ‘హెచ్’ తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 21-17తో లినో మునోజ్ (మెక్సికో)పై గెలుపొందాడు. జ్వాల-అశ్విని జంట అవుట్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ ఈవెంట్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కథ ముగిసింది. నాకౌట్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో ఈ భారత నంబర్‌వన్ జోడీ ఓడిపోయింది. ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) ద్వయంతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 16-21, 21-16, 17-21తో ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లోనూ జ్వాల జంట ఓడిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్‌లో రెండేసి విజయాలు సాధించిన మిసాకి-అయాక (జపాన్), ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి-మను అత్రి జోడి పోరాటం కూడా ముగిసింది. ఈ భారత జంటకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో సుమీత్-మను అత్రి 13-21, 15-21తో బియావో చాయ్-వీ హాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
ఫైనల్లో బింద్రా ఓటమి..
రియో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. భారత హాకీ పురుషుల జట్టుతో పాటు షూటర్ అభినవ్ బింద్రా తీవ్రంగా నిరాశపరిచాడు. 2-1 తేడాతో భారత్‌పై జర్మనీ హాకీ జట్టు విజయం సాధించింది. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్లో బింద్రా ఓటమి పాలయ్యాడు. దీంతో భారత్ షూటింగ్ విభాగంలో ఏ పతకాన్ని సాధించలేకపోయింది. బింద్రా 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటలీ ఆటగాడు కెంప్రైనీ 206.1 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో ఉక్రెయిన్ ప్లేయర్ కూలిష్, మూడో స్థానంలో రష్యా ఆటగాడు మస్లిన్నికోవ్ నిలిచారు. అంతకు ముందు బింద్రా ప్రాథమిక రౌండ్లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
గురితప్పని బింద్రా.. నిరాశపర్చిన నారంగ్
రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా భారత్‌కు విశ్వక్రీడల వేదికలో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ షూటర్ అభినవ్ బింద్రా సత్తా చాటాడు. ప్రాథమిక రౌండ్లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణపతకాన్ని అందించిన అభినవ్ బింద్రానే ఈసారి కూడా భారతీయుల ఆశలను మోస్తున్నారు. 10.3, 10.4, 10.3, 10.8, 10.8, 10.3, 10.8, 10.4. పాయింట్లతో బింద్రా ఏడోస్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరగనుంది. మరోవైపు భారత హాకీ పురుషుల జట్టు ఈరోజు ఒలింపిక్స్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. -
వెంకన్న సేవలో షూటర్ గగన్ నారంగ్
తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వీరవాణి, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డి, షూటర్ గగన్ నారంగ్, అసెంబ్లీ కమిటీ చైర్మన్ పెందుర్తి వెంకటేష్, విజయాబ్యాంకు ఈడీ రామారావు లు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
గగన్‌కు నిరాశ
రియో డి జనీరో: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత స్టార్ షూటర్లు గగన్ నారంగ్, చెయిన్ సింగ్ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. క్వాలిఫయింగ్‌లో చెయిన్ 617.1 పాయింట్లతో 45వ... గగన్ 615.5 పాయిం ట్లతో 48వ స్థానంలో నిలిచి నిరాశ పరిచారు. -
టాప్ ర్యాంక్ చేరిన గగన్ నారంగ్
ఒలింపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్ ఇవాళ విడుదల చేసిన ఆసియన్ షూటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్ధానాని చేరుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ విభాగంలో 971 పాయింట్లతో నారంగ్ ఫస్ట్ ర్యాంక్ స్వంతం చేసుకోగా.. చైనాకు చెందిన షెంగ్బో జో 896 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. మరో వైపు అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 5 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.. ఈ విభాగంలో నారంగ్ ఏడో స్థానంలో ఉన్నాడు. -
ఒలింపిక్ బెర్త్‌పై గగన్, బింద్రా గురి
ప్రపంచకప్ బరిలోకి స్టార్ షూటర్లు న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో కొరియాలో ప్రారంభంకానున్న ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్‌కప్‌లో రాణించి రియో ఒలింపిక్స్-2016 బెర్త్‌లను దక్కించుకోవాలని భారత మేటి షూటర్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ భావిస్తున్నారు. ఈ ఏడాది ఒలింపిక్ కోటా కోసం జరుగుతున్న తొలి పోటీలు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే నెలకొంది. పురుషుల విభాగంలో 14, మహిళల విభాగంలో 10 బెర్త్‌లు ఉన్నాయి. గతేడాది స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గి జీతూ రాయ్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, ఆసియా క్రీడల తర్వాత బింద్రా పాల్గొంటున్న మొదటి అంతర్జాతీయ ఈవెంట్ ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. లండన్ గేమ్స్ కాంస్య విజేత నారంగ్‌తో పాటు అయోనికా పాల్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంపై దృష్టిసారించారు. మాజీ నంబర్‌వన్ హీనా సిద్ధు కూడా ఒలింపిక్స్ బెర్త్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రైఫిల్, పిస్టల్ షూటర్లకు ఈ ఈవెంట్ అతి పెద్ద పరీక్ష అని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ అన్నారు. షూటర్లందరూ ఆశించిన మేరకు రాణించి దేశానికి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
నగరంలో గ‘గన్’ అకాడమీ
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత షూటర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ తొలిసారి హైదరాబాద్‌లో సొంత షూటింగ్ అకాడమీతో ముందుకొచ్చాడు. పుణేలోని తన అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’ పేరుతోనే జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో 10 మీటర్ల రేంజ్‌ను అతను ఏర్పాటు చేశాడు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అకాడమీని ఘనంగా ప్రారంభించారు. ఈ అకాడమీలో ప్రాథమికంగా లెవల్-1, లెవల్-2లలో శిక్షణ ఇస్తారు. 12 ఏళ్లకు పైబడినవారు నిర్ణీత రుసుము చెల్లించి శిక్షణ పొందవచ్చు. ఈ 10 మీటర్ల రేంజ్లో (ఎనిమిది టార్గెట్లు) ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ విభాగాల్లో శిక్షణ లభిస్తుంది. ముఖ్యమంత్రితో మాట్లాడతా: కేటీఆర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) మాట్లాడుతూ... గగన్ నారంగ్ పూర్తి స్థాయిలో సొంత అకాడమీ ఏర్పాటు చేయడం కోసం గతంలో కూడా ప్రతిపాదనలు ఇచ్చాడని, దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. షూటింగ్లాంటి క్రీడలకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోందన్న మంత్రి, చిన్నదే అయినా రేంజ్ ఏర్పాటుతో అడుగు ముందుకు వేసిన నారంగ్‌ను అభినందించారు. గతంలో విదేశాల్లోనే అత్యుత్తమ స్థాయి షూటింగ్ రేంజ్లాంటివి తాము చూసేవాళ్లమని, ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఇలాంటిది ఏర్పాటు కావడం సంతోషకరమని నాగార్జున వ్యాఖ్యానించారు. గగన్ నారంగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా ఈ అకాడమీని నిర్వహిస్తామని నారంగ్ చెప్పాడు. పుణేలో తమ వద్ద ఆరు వేలకు పైగా షూటర్లు శిక్షణ పొందారని, 87 మంది అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నాడు. హైదరాబాద్‌లో పూర్తి స్థాయి అకాడమీ గురించి కూడా ఆలోచన ఉందని, అయితే ఇప్పుడు తొలి అడుగుగా దీనిని భావిస్తున్నానని నారంగ్ అన్నాడు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, చాముండేశ్వరీనాథ్, ఎఫ్ఎన్సీసీ అధ్యక్షు డు కేఎస్ రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. -
జీతురాయ్ ఇతర క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రశంసలు
న్యూఢిల్లీ: గ్రాస్గోవ్ లో జరుగుతున్న 20వ కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలను సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం అభినందించారు. రాష్ట్రపతి అభినందించిన వారిలో జీతు రాయ్, గుర్పాల్ సింగ్, గగన్ నారంగ్ లు షూటింగ్, వికాస్ ఠాకూర్ కు వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో పతకాలు సాధించారు. కామన్ వెల్త్ లో భారతీయ పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులను రాష్ట్రపతి అభినందించినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ వ్యక్తిగతంగా సందేశాలు పంపారని అధికారులు తెలిపారు. జీతురాయ్ బంగారు, గుర్పాల్ సింగ్ రజత, నారంగ్ రజత పతకాలు సాధించారు.