Girl Sexual assault
-
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి.. చిన్నారిపై దారుణంగా..
సాక్షి, ఆదిలాబాద్: బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసి న నిందితుడికి నిర్మల్ కోర్టు జీవితఖైదీ, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీస్ అధికారుల వివరాల ప్రకారం.. సోన్ మండల కేంద్రానికి చెందిన తోకల ప్రవీణ్‌కుమార్ మేనకోడలు, అదే గ్రామానికి చెందిన బాలిక (10) ఇద్దరు పాఠశాల మిత్రులు. 16 జూన్ 2018వ తేదీన మధ్యాహ్నం ప్రవీణ్‌కుమార్ ఇంటికి బాలిక వచ్చింది. ఆ సమయంలో స్నేహితురాలు ఇంట్లో లేకపోవడంతో ప్రవీణ్‌కుమార్ ఎందుకు వచ్చావని బాలికను అడిగాడు. సదరు బాలిక విరోచనాలు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లాలని చెప్పింది. దీంతో ప్రవీణ్‌కుమార్ నేను ఆ వైపే వెళ్తున్నాని బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటికే ఆస్పత్రి బంద్ చేయడంతో తిరిగి వస్తుండగా కూచన్‌పెల్లి గ్రామ సమీపంలోని పాతబడిన భవనం వద్దకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో ఇటుకతో తలమీద దారుణంగా కొట్టడడంతో కిందపడిపోయింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తండ్రి గ్రామంలో గాలించగా ప్రవీణ్‌కుమార్ బైక్‌పై తీసుకుని వెళ్లాడని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ప్రవీణ్‌కుమార్‌పై సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై సోన్ ప్రేమ్‌దీప్ కేసు నమోదు చేశాడు. విచారణ నిమిత్తం అప్పటి సీఐ రమేష్‌బాబు, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డికి అప్పగించారు. ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వై.రామరావు, వై.విశ్వష్రెడ్డి 21మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేశారు. దీంతో జీవిత ఖైదీ, రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.కర్ణకుమార్ గురువారం తీర్పునిచ్చారు. ఎస్పీ అభినందనలు.. నేరాలకు పాల్పడితే ఏనాటికై నా శిక్షలు తప్పవని ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు, కోర్టు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇవి చదవండి: ఓ వ్యక్తి మ్యాట్రిమోనీని అడ్డుపెట్టుకొని మోసాలు..! అసలేం చేశాడంటే? -
తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: కిక్ ఎక్కి.. దోస్తును చంపేశారు! -
నారాయణ స్కూల్ వాచ్‌మన్ పైశాచికం
విశాఖపట్నం: ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... కూర్మన్నపాలెం నారాయణ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం తోటి స్నేహితులతో ఆడుకుంటూ వేచి ఉంది. అదే స్కూల్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన అలకోటి పోచన్న (48) బాలికను మాయమాటలతో స్కూల్లో ఉన్న బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక గట్టిగా అరవడంతో వాచ్‌మన్ అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండడంతో కోపోద్రోక్తులైన బాలిక తల్లిదండ్రులు వాచ్‌మన్‌ను పట్టుకునేందుకు ప్రయతి్నంచారు. కానీ అప్పటికే స్కూల్ మూసివేయడం, తరువాతి రోజు ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో అతడు దొరకలేదు. సోమవారం స్కూల్ తెరిచిన వెంటనే వాచ్‌మన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు స్కూల్ వెనుక ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక టీచర్ వికృతక్రీడ.. పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పెదగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఆమె పాలిట కీచకుడయ్యాడు. ఓ టీచర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆందోళన చెందిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పింది. వివరాల ప్రకారం.. పెదగొల్లగూడెంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్యా అనే గణితం టీచర్.. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, చాలా రోజులుగా పిచ్చయ్య.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. సదరు కీచక టీచర్‌పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు స్పందించి.. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
కూతురిపైనే పలు మార్లు అత్యాచారం.. మాట వినలేదని ఆమె శరీరాన్ని..
భోపాల్: ఎన్ని చట్టలు తెచ్చినా దేశంలో యువతులు, మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులే మృగాలుగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వావి వరసలు మరచిన ఓ తండ్రి క్రూర మృగంలా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లాలోని సాక్తాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి(14) తన తండ్రి త్రిలోక్‌చంద్(55)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తన కూతురిపైనే కన్నేసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురునే బెదిరింపులకు గురిచేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన త్రిలోక్‌చంద్ ఆమెపై దాడి చేశాడు. ఆమెను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టేశాడు. అనంతరం తన బంధువు సాయంతో గోనె సంచిని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న అజ్మన్ నదిలో పారేశాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు వ్యక్తలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేశ్ పెండ్రో తెలిపారు. -
బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి...
Two women who lured A Girl Into Prostitution: ఓ బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలో దింపిన ఇద్దరు మహిళలను బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ డివిజన్ ఏసీపీ భిక్షం రెడ్డి, బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ వివరాలు వెల్లడించారు... కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. నవంబర్ 20న సోదరితో గొడవ పడిన మైనర్ బాలిక అర్థరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకుంది. ఫిష్ బిల్డింగ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వెంబడించారు. దీంతో అదే ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్ ఆమెను తమ ఆటోలో ఉప్పర్‌పల్లికి తీసుకెళ్లారు. బుస్రా సుల్తానా, ఆయేషా బేగం అనే మహిళలకు బాలికకు పరిచయం చేసి, ఇక్కడే ఉంటుందని తెలిపారు. అనంతరం డిసెంబర్ 26న బాలికను మైలార్‌దేవ్‌పల్లిలోని అలీనగర్ హ్యాపీ హోమ్స్‌కు మార్చారు. అదే రోజు సమీర్, హఫీజ్ బాలికకు మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందుకు బుస్రా సుల్తానా, ఆయేషా బేగం వారికి సహకరించారు. అనంతరం బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపి బయటి నుంచి విటులను రప్పించారు. వీరి చెర నుంచి బయట పడేందుకు ప్రయత్నించిన బాధితురాలు ఆయేషా బేగం సెల్‌ఫోన్ ద్వారా తన అత్త ఇన్‌స్ట్రాగామ్‌కు తాను ఉంటున్న లోకేషన్ షేర్ చేసింది. బాలిక మిస్సింగ్‌పై డిసెంబర్ 1న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు పంపించిన లోకేషన్‌ను డిసెంబర్ 31న బహదూర్‌పురా పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. ఉప్పర్‌పల్లికి చెందిన బుస్రా సుల్తానా, ఆయేషా బేగంలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు సమీర్, హఫీజ్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు -
Serial Molester: చిన్నారులను అపహరించి లైంగికంగా వేధిస్తున్న అగంతకుడు ఎట్టకేలకు అరెస్ట్!!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చిన్నారులపై వరుస వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టకేలకు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ బృందం అరెస్ట్ చేసింది. ఈ వరుస వేధింపులతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం.. 5వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన యష్ ( 27)గా గుర్తించారు. నిందితుడు యశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. నవంబర్ 23న 10 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికను నేరస్థుడు బలవంతంగా అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసులో నేరస్థుడిని విచారించగా, అతనిపై ఇప్పటికే ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోక్సో చట్టం కింద అనేక కేసులు నమోదైనట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు నేరస్థుడిపై ఐపీసీ సెక్షన్ 363, 354, 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..
యాదాద్రి (నల్లగొండ): యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. అదే తండాకు చెందిన నవీన్ అనే యువకుడు రెండేళ్ల పసిపాపపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రుకు తెలవడంతో నవీన్ తండా నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ శివార్లలో భారీగా పేకాట -
లైంగిక వేధింపుల కేసులో పాప్ సింగర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
ప్రాశ్చాత్య దేశాల్లో పాప్ సింగర్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. సింగర్స్ అంటే పిచ్చి అభిమానంతో ఊగిపోతుంటారు. కొందరు సెలబ్రిటీలు ఆ పాపులారిటీని మంచికి వాడుకుంటుంటే, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. అనంతరం నేరం రుజువై కటాకటా పాలవుతుంటారు. అమెరికా పాప్ సింగర్ రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ (ఆర్ కెల్లీ) విషయంలో అలాగే జరిగింది. ‘ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై’ పాటతో పాపులర్ అయిన ఆర్.కెల్లీపై 2019లో లైగింక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. అప్పటి నుంచి అతను కస్టడీలోనే ఉన్నాడు. అయితే సుదీర్ఘకాలంగా జరిగిన విచారణ తర్వాత సోమవారం (సెప్టెంబర్ 27న) మొత్తం తొమ్మిది అభియోగాల్లో దోషిగా తేల్చింది. తన పాపులారిటీని ఉపయోగించుకుని మహిళలు, బాలికలని వంచించనట్లు కోర్టు తెలిపింది. కెల్లీ తనను బంధించి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశాడని ఓ మహిళ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో అతని బండారం మొత్తం బయట పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను మైనర్ బాలికలు, బాలురను సైతం లైగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ కేసులో తుది తీర్పును కోర్టు వచ్చే ఏడాది మే నెలలో వెలువరించనున్నది. -
బాలికపై లైంగికదాడి.. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
కర్నూలు(హాస్పిటల్): వలస వచ్చి కూలీ పనిచేసుకుంటున్న ఓ బాలికపై ఓ అగంతకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంజిహల్లి గ్రామానికి చెందిన షేక్షావలి కల్లూరు ప్రాంతంలో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ సైతం తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి పనిచేస్తోంది. శుక్రవారం ఆ బాలికకు కడుపునొప్పి అని చెప్పడంతో చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భిణిగా నిర్ధారించారు. షేక్షావలి తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని బాలిక తల్లికి వివరించింది. దీంతో తల్లి స్థానిక దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం.. బయటకు రాకుండా..
సాక్షి, దామెర (వరంగల్): వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల పరిధి ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు తండ్రి లేడు తల్లితో కలిసి పూరి గుడిసెలో ఉంటున్న ఆ బాలికను ఓ వ్యక్తి ప్రేమపేరుతో మోసం చేసి వారం రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొందరు సెటిల్మెంట్ చేసి బాధిత కుటుంబం నోరు మూయించారని తెలుస్తోంది. ఆనోటా.. ఈనోటా విషయం బయటికి పొక్కింది. వాస్తవాలు వెలికితీయడానికి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం చైర్పర్సన్ వసుధ ఈ విషయాన్ని కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మికి సోమవారం ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలితోపాటు ఆమె తల్లి జరిగిన సంఘటన గురించి నోరు విప్పకపోవడంతో మిగిలిన మార్గాల ద్వారా ఈ కేసు విచారణను ఓ కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. బాధితులు తమ గ్రామపరిధి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారా.. లేదా అని తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించాలని ఇప్పటికే ఓ ప్రత్యేక బృందానికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఒకవేళ బాధితులు స్టేషన్‌కు వచ్చినట్టుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా నిందితుడి సెల్‌ఫోన్ కాల్‌డేటాతో పాటు పంచాయితీని సెటిల్మెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న ప్రజాప్రతినిధుల కాల్‌డేటాను కూడా ఈ బృందం పరిశీలించనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. సంబంధిత స్టేషన్ విభాగాధిపతిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అసలు బాధితులు పోలీస్‌స్టేషన్‌కే రాలేదని బదులిచ్చారు. హెచ్ఆర్సీ దృష్టికి కూడా.. ఈ కేసుపై ఓ పత్రికలో వచ్చిన కథనంతోపాటు ఆ గ్రామంలో పర్యటించిన సందర్భంలో స్థానికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జతపరిచి బాలల సంరక్షణ కమిటీ సభ్యులు హెచ్ఆర్సీ దృష్టికి పంపారు. దీనిని సుమోటోగా తీసుకొని కేసు విచారించాలని కోరారు. -
వీడని దళిత బాలిక కేసు మిస్టరీ.. లైంగికదాడి, హత్యకేసుగా..
సాక్షి, కేతేపల్లి(నల్లగొండ): మండలంలోని కొప్పోలులో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దళిత బాలిక కేసు మిస్టరీ వీడలేదు. బాలిక హత్యకు గురై వారం రోజులు కావొస్తున్నా కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నల్లగొండలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు చదువుతున్న ప్రీతి (17) ఘటన జరగడానికి మూడు రోజుల ముందు గ్రామానికి వచ్చింది. ఈనెల 12న రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిద్రపోయిన బాలిక అర్ధరాత్రి తర్వాత కనిపించలేదు. 13న ఉదయం గ్రామశివారులోని వ్యవసాయ భూముల్లో బాలిక మృతదేహం కనిపించింది. ఆమె మెడచుట్టూ చున్నీ బిగించి లాగిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో కొన్నాళ్లుగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న అదే గ్రామానికి చెందిన యువకుడే ఆమెను బలవంతగా ఎత్తుకెళ్లి లైంగికదాడి జరిపి హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని పోలీసులు 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఆందోళలు చేశారు. బాలిక దారుణ హత్యకు గురైతే, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నకిరేకల్‌తో పాటు కేతేపల్లిలో ధర్నాలు చేశారు. లైంగికదాడి, హత్యకేసుగా మార్పు.. పోలీసుల విచారణ తీరుపై నిరసనలు వ్యక్తం కావంతో జిల్లా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును లైంగికదాడి, హత్య కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడంతో ఎస్పీ రంగనాథ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎస్ఐ రామకృష్ణను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు పారదర్శక విచారణకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్, ఏఎïస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. మృతదేహానికి రీపోస్టుమార్టం.. కొప్పోలు గ్రామంలో ఖననం చేసిన బాలిక మృతదేహాన్ని కేసు దర్యాప్తులో భాగంగా ఏఎస్పీ సతీష్, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో శనివా రం బయటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఈకేసు ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అదుపులో నిందితులు..? బాలిక హత్య ఘటనలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు యువకులకు ప్రమే యం ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన అనుమానిత నిందితుడి ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా సూర్యాపేట మండలానికి చెందిన బ్యాండుమేళం వాయించే మరో ముగ్గురు యు వకులు ఈ ఘటనకు సహకరించినట్లు పోలీ సుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఘటన జరిగిన రెండో రోజే పోలీ సులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. బాలిక హత్యకు మాత్రమే గురైందా.. లేక సామూహిక లైంగికదాడి కూడా జరి గిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఘోరం: మృగాళ్లకు బాలిక బలి
రాయచూరు రూరల్: పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం కర్నాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా హుణిసిగిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హుణిసిగిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక (16) అదే పట్టణంలో పీయూసీ చదువుతోంది. కరోనా నేపథ్యంలో కళాశాలకు సెలవు కావడంతో ఇంటివద్దనే ఉంటోంది. ఈనెల 9వ తేదీ ఆదివారం ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బలవంతంగా పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. అయితే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకుని గాలింపు చేపట్టగా పట్టణ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కామాంధుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అదే పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (18) అరెస్ట్ చేశారు. అతడితోపాటు 16, 17 ఏళ్ల వయసున్న బాలురు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు సురపుర సీఐ శివయ్య హిరేమఠ్ తెలిపారు. చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
హైదరాబాద్ విద్యార్థినిపై అమెరికాలో దారుణం
వాషింగ్టన్ : 19 సంవత్సరాల ఇండో-అమెరికన్ విద్యార్ధినిని దుండగుడు లైంగికంగా వేధించి హత్య చేసిన ఘటన అమెరికాలోని తెలుగు రాష్ట్రాల వారిని కలవరపాటుకు గురిచేసింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో హానర్స్ స్టూడెంట్ అయిన హైదరాబాద్‌కు చెందిన యువతి శనివారం క్యాంపస్ గ్యారేజ్‌లోని కారు వెనక సీటులో విగతజీవిగా కనిపించారు. బాధిత విద్యార్థిని కుటుంబం అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు డొనాల్డ్ తుర్మన్ (26)ను చికాగో మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడికి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేదని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని యూనివర్సిటీ పోలీసులకు శనివారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితురాలికి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో హల్స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజ్‌లోని తన కారు బ్యాక్ సీటులో విగతజీవిగా పడిఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు డొనాల్డ్ దుశ్చర్యను పసిగట్టి చికాగో మెట్రో స్టేషన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. హెల్త్ ప్రొఫెఫషనల్‌గా మారి ఎందరికో సాయం చేయాలని కలలు కన్న యువతి విషాదాంతం తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్ మైఖేల్ డీ అమిరిడిస్ పేర్కొన్నారు. ఇక ఆమె స్మృతి చిహ్నంగా యువతికి ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను క్యాంపస్ అంతటా ఎగురవేసినట్టు సహచర విద్యార్ధి చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే స్వీట్ గర్ల్‌ను మిస్ అయ్యామని ఆమె జిమ్నాస్టిక్స్ మాజీ కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కన్నకూతురిపైనే అఘాయిత్యం
సాక్షి, అనంతపురం: కనురెప్పే కాటేసిన చందాన కన్న కూతురిపై ఓ తండ్రి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలో ఓ కాలనీలో నివాసముంటున్న వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె(16)ను గత కొంతకాలంగా లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై బాధిత బాలిక 1098 చైల్డ్‌లైన్‌ను ఆశ్రయిచింది. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్‌కమిటీ ముందు హాజరుపరిచారు. జరిగిన విషయాన్ని తెలియజేయడంతో సీడబ్ల్యూసీ అధికారులు కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి నిందితుడిపై ఫోక్సోయాక్టు కింద కేసు నమోదు చేశారు. నిందితున్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఇది చదవండి : సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే.. -
కర్కశత్వానికి చిన్నారుల బలి
సాక్షి, ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి): ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గానీ.. కంటికి కనరాడు!’ అంటూ ఓ కవి సమాజంలో అమానుషాలను ఎలుగెత్తిచాటాడు. మానవత్వపు ఛాయలు మరుగునపడిపోతూ.. ఆధునిక పోకడలతో క్రూరత్వాన్ని నింపుకుంటున్న మృగాళ్లు సమాజంలో పెరిగిపోతున్నారు. చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలను దేవతలుగా కొలిచే పవిత్ర భారతంతో మానవమృగాలు అపవిత్ర కార్యాలకు పాల్పడుతున్నాయి. తల్లిగా.. చెల్లిగా.. చెలియగా.. సగభాగంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచాల్సిన వేళ కర్కశత్వంతో నిండు జీవితాలను బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అభం శుభం తెలియని పసితనం.. ముద్దులొలికే మాటలతో మురిపిస్తూ మైమరపించిన చిన్నారుల నుంచి బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి వస్తారా? అనే భయం వెంటాడుతోంది. ఆడపిల్లలుగా పుట్టటమే శాపమా అనే బాధ వారి మనసులను కలచివేస్తోంది. పసిపిల్లలపైనా లైంగిక దాడులు పెరిగిపోవటం సమాజంలో నైతిక విలువలు ఎలా మంటకలిసిపోతున్నాయో అద్దంపడుతున్నాయి. వావీవరసలు మరచి మృగాల్లా మారుతూ మానవ సంస్కృతికే మాయని మచ్చలా చెలరేగిపోతున్నారు. చిన్నారులపై అత్యంత పాశవికంగా అఘాయిత్యాలకు పాల్పడుతూ తల్లిదండ్రుల గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. పేగు బంధాన్ని మరిచి.. పేగు బంధాన్ని మరిచాడు.. సభ్య సమాజం సిగ్గుపడేలా కన్నకూతురినే కాటేశాడు.. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు.. కొంతకాలం తన కామవాంచను తీర్చుకుంటూ తనలోని కర్కశత్వాన్ని చూపించాడు. 12 ఏళ్ల చిన్నారిపై ఓ మృగాడు అఘాయిత్యానికి పాల్పడుతున్న సంఘటన బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. బాలిక నుంచి భయంకరమైన చేదు నిజాన్ని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది.. ఇలాంటి నీచుడిని కటకటాల వెనక్కి నెట్టాలని నిర్ణయించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుమరాలి వయసున్న బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఇలాంటి కీచకపర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. పుస్తకాల కోసం తన స్నేహితురాలి ఇంటికి సైకిల్‌పై వెళుతున్న బాలికను 60 ఏళ్ల వృద్ధుడు అటకాయించాడు. ఆ బాలికపై అఘాయిత్యం చేసేందుకు నిర్జన ప్రదేశంలో షెడ్డులోకి లాక్కెళ్లాడు. బాలిక గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు వస్తున్నారనే భయంతో శివయ్య అనే వృద్ధుడు ఉడాయించాడు. పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నించిన అతడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 2015 జూన్ 18న ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరాకాలనీలో ఘోరం జరిగింది. ఏడేళ్ల చిన్నారి తన తల్లి గుడ్లు తీసుకురామ్మా అంటే కిరాణా కొట్టుకు వెళ్ళి రాక్షసుడి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారి పసిమొగ్గను చిదిమేసిన మృగాడు ఇంట్లోని ట్రంకు పెట్టెలో కుక్కేశాడు. తల్లి గుండెలు అవిసేలా రోధిస్తూ ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. ఇంటి పక్కన ఉన్న కిరాణా కొట్టు సురేష్‌పై అనుమానం ఉన్నా బాలిక ఆచూకీ మాత్రం లభించలేదు. చివరికి సురేష్ తండ్రే వచ్చి మీ పాప మృతదేహం మా ఇంటిలోని ట్రంకు పెట్టెలో ఉంది.. బట్టల కోసం వెతుకుతుంటే కన్పించిందని చిన్నారి తల్లి్లదండ్రులకు చెప్పడంతో ఓ రాక్షసుడి అకృత్యం బయటపడింది. 2015 అక్టోబర్ 23న అభం శుభం తెలియని చిన్నారిపైన, ఆమె తల్లిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఈ ఉన్మాది వీరిని, అడ్డువచ్చిన బాలిక తండ్రిని హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. ఇంటి వెనుక ఉన్న గడ్డివాముకు నిప్పుపెట్టి అందులో బాలికను పడవేసి సజీవదహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం హనుమాన్‌గూడెం గ్రామంలో 2015 అక్టోబర్ 23న జరిగింది. 2017 మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరకుతోటలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఇంట్లో ఆయువతికి పెళ్లి జరగాల్సి ఉండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి బహిర్భూమికి వెళ్లగా ఐదుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా చెరకు తోటలోకి లాక్కుపోయారు. వారిలో ఒక యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువులు గ్రామశివారున ఉన్న పొలాల వెంట యువత కోసం వెతకగా ఓ చెరకు తోటలో యువతి అపస్మారక స్థితిలో పడి కనిపించింది. 2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ ఆవరణలో ఆధ్యాత్మిక సభలకు వచ్చిన బాలికను యువకుడు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో పంచాయతీ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయారు. 2017 జూలై 30న బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన తాడిచర్ల పోతురాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018 ఏప్రిల్ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో 5 ఏళ్ల మైనర్ గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మానసిక, శారీరక అసమతుల్యత మనిషిలో టెస్టోస్టిరాన్, మెదడులో హార్మోన్ల అసమతుల్యత కారణంగా విపరీతమైన లైంగిక కోరికలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు వావీవరసలు, నైతిక విలువలు, పరిసరాలు ఇవేమీ పట్టించుకోకుండా లైంగిక దాడులకు తెగబడుతూ ఉంటారు. వీటిని మానసిక రుగ్మతగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక వ్యక్తి చిన్ననాటి నుంచీ పెరిగిన పరిస్థితులు, వాటి ప్రభావం కూడా మానసిక స్థితిపై ఆధార పడుతుంది. ఎదుటివారి ఇష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. బాలికలను ఒంటరిగా వదిలివెళ్లకూడదు, ఎప్పుడూ చిన్నారులను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఎప్పుడైనా బాలలు డిప్రెషన్, అనాలోచితంగా, మౌనంగా ఉంటే వెంటనే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సున్నితమైన మనస్తత్వంతో పిల్లలను పెంచటం సరికాదు, సమాజం పట్ల అవగాహన కల్పించేలా తల్లిదండ్రి బాధ్యత వహించాలి. –అక్కిశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, తణుకు లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చెడు ప్రభావాలకు లోనవుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. వెబ్సైట్లు, సోషల్‌మీడియా ప్రభావం ప్రస్తుతం అధికంగా ఉంది. విద్యార్థి దశ నుంచే లైంగిక విద్యపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువతులకు రక్షణ కల్పించేందుకు శక్తి టీమ్‌లను ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ఏర్పాటుచేశారు. ఎక్కడైనా ఆకతాయిలు ఈవ్‌టీజింగ్, ఇతరత్రా ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే శక్తి టీమ్‌లకు సమాచారం ఇవ్వచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. వారు ఏదైనా దారితప్పితే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. –పైడేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ, ఏలూరు జీవనశైలిలో విపరీత మార్పులు సమాజంలో మారుతున్న ఆధునిక పరిస్థితుల ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడటం మానసిక రుగ్మతగానే చూడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడలు, యువతను పెడదారి పట్టిస్తున్నాయి. వారిలో మానసిక పరివర్తన తీసుకురావడంతోనే మార్పు వస్తుంది. అవసరమైతే అటువంటి వారికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. కొందరిలో శారీరకంగా వచ్చే మార్పులు కాగా, కొందరిలో సామాజికంగా వారు పెరిగిన వాతావరణం కూడా కారణం కావచ్చు. కొందరు పెద్ద వయసున్న వ్యక్తులు కూడా ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. –డాక్టర్ హరికృష్ణ, మానసిక వైద్యనిపుణులు -
సరదగా జెట్ స్కై రైడ్‌కు వెళ్లిన బాలికపై...
సాక్షి, ముంబై : సరదాగా గడపడానికి విహార యాత్రకు వెళ్లిన తల్లీ కూతుళ్లకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన మహిళ తన ఏడేళ్ల కుమార్తెతో మాల్ధీవులకు సరదాగా గడిపేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారు జెట్ స్కై రైడ్‌కి వెళ్లాలనుకున్నారు. అయితే స్కైరైడ్‌కి ఒకేసారి ఇద్దరు వెళ్లాడానికి వీలు లేకపోవడంతో ఆ మహిళ తన కుమార్తెను డ్రైవర్ వెంట పంపించింది. రైడింగ్‌లో బాలిక ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ తన వక్రబుద్ది చూపించి, బాలికను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత జెట్ నుంచి తిరిగి వస్తున్న బాలిక ఆందోళనగా కనిపించడంతో తల్లి అనుమానించింది. దీంతో మహిళ కుమార్తెను ప్రశ్నించగా ‘జెట్ స్కై డ్రైవర్ తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని’ బాలిక తెలిపింది. డ్రైవర్ నిర్వాకంపై వారు మాల్దీవుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు బాలిక తల్లికి తెలిపారు. అయితే ఆరోజే వారు తిరిగి ముంబై రావాల్సి ఉండటంతో వైద్య పరీక్షలు ముంబైలో నిర్వహిస్తానని పోలీసులకు చెప్పి ఫిర్యాదు పత్రాన్ని తిసుకుని తిరిగి ముంబైకి బయలుదేరారు. మాల్దీవుల నుంచి ఇంటికి చేరుకున్న మహిళ శనివారం ఉదయం జూహులోని కూపర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తన కుమార్తెను తీసుకుని వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లాక వారిని గంటల కొద్ది వేచిఉంచారని, పరీక్షల కోసం అటు ఇటు తిప్పి చివరకు మైనర్ బాలికకి వైద్య పరీక్షలు చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని వారితో చెప్పినట్లు బాలిక తల్లి తెలిపింది. తన వద్ద మాల్దీవ్ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం ఉన్నప్పటికి ఆస్పత్రి వారు మహిళా కానిస్టేబుల్ లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని బుకాయించినట్లు ఆమె తెలిపింది. అయితే మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురై ఆస్పత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల బాధిత బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. -
బాలిక శీలానికి వెల..!
సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన ఇది.. అభం శుభం తెలియని ఓ బాలికపై మానవమృగం ఐదు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఉదంతమిది. చివరకు ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. బాధితులు పెద్దమనుషులను ఆశ్రయించడంతో బాలిక శీలానికి వెలకడుతూ అంతో ఇంతో ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా ఆదివారం రాత్రి విశ్వసనీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. పెన్‌పహాడ్(సూర్యాపేట) : మండల పరిధిలోని నాగులపహాడ్ గ్రామానికి చెందిన ఓ బాలిక(14)పై అదే గ్రామానికి చెందిన పక్క ఇంటికి చెందిన తేరపంగి అలేందర్ కన్నేశాడు. బాలిక తల్లి ఐదు నెలల క్రితం కూలి పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లింది. బాలిక తన తండ్రితో కలిసి ఉంటోంది. టీవీ చూసి వస్తుండగా.. ఐదు నెలల కిత్రం సదరు టీవీ చూసి వస్తుండగా అలేందర్ ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లి నోట్లోగుట్టలు కుక్కి లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు. అప్పటినుంచి ఆ మానవ మృగం ఆ మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. తండ్రి చనిపోవడంతో.. గత పక్షం రోజుల క్రితం ఆ బాలిక తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆమె తల్లి స్వగ్రామానికి వచ్చింది. అప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. అయితే నాలుగురోజుల క్రితం బాలిక అనారోగ్యం బారిన పడడంతో గ్రామానికి వచ్చిన వైద్య సిబ్బందికి చూపించింది. వారు గర్భవతి అని తేల్చడంతో కంగుతింది. ఈ దారుణానికి కారకులు ఎవరని నిలదీయంతో అభాగ్యురాలు జరిగిన పాశవిక దాడిని తల్లికి వివరించి బోరుమంది. రూ.ఐదు వేలు ఇస్తా.. అబార్షన్ చేయించుకో.. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు గ్రామంలోని పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు ఆ మృగాన్ని పిలిపించి మాట్లాడితే ‘‘ రూ. ఐదు వేలు ఇస్తా.. అబార్షన్ చేయించుకో’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. అయితే నిందితుడిని పోలీసులకు పట్టించి బాలికకు న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులే ఆ అభాగ్యురాలి శీలానికి వెలకడుతూ అంతో ఇంతో ఇప్పిస్తామని చర్చలు సాగిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : బాలికపై మానవమృగం ఐదు నెలలుగా లైంగిక దాడి -
బస్సులో అసభ్యకరంగా వ్యవహరిస్తూ..
పనాజీ : దేశవ్యాప్తంగా మీటూ ప్రకంపనలు సాగుతుంటే గోవాలోని బస్సులో ఓ వ్యక్తి తన జననాంగాలు చూపుతూ ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు. బస్సులో బాధిత బాలికకు దగ్గరగా వచ్చిన సదరు వ్యక్తి తన మర్మాంగాలను చూపుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడు. బాలిక పక్కనే మరో మహిళ కూర్చుని ఉన్నా లెక్కచేయని నిందితుడు తనను తాకుతూ వికృతానందం పొందాడని బాధితురాలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత చేసి పట్టుబడిన అనంతరం పొరపాటుగా ఇదంతా జరిగిందని ఆ వ్యక్తి చెబుతున్నాడని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ ఎస్ఎం కోఆర్డినేటర్ హసిబా అమిన్ ట్వీట్ చేశారు. సిగ్గుమాలిన పనిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరారు. -
ఆరునెలలుగా పైశాచికం..
ముజఫర్‌నగర్ : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కీచక తండ్రి కన్నకూతురిపై సాగించిన పైశాచిక దాడి వెలుగుచూసింది. బుధానా పట్టణంలో ఆరు నెలలుగా మైనర్ కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ బాధితురాలి తల్లి కంటపడ్డాడు. కంటికిరెప్పలా కాపాడాల్సిన కూతురుపై తాను చేస్తున్న ఘోరం బయటపడటంతో నిందితుడు తల్లీకూతుళ్లను బెదిరించాడు. దారుణానికి తెగబడ్డ తండ్రిపై బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపడతామని ముజఫర్‌నగర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు. -
సవతి తండ్రే కామాంధుడై..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, నేరాలు మరింత తీవ్రం కావడం ఆందోళన పుట్టిస్తోంది. ముఖ్యంగా బాలికలు, యువతులపై అత్యాచారాల సంఘటనల్లో బాధితులకు తెలిసినవారు, సమీప బంధువులే ఎక్కువగా లైంగికంగా హింసిస్తున్నారనేది ఒక చేదు నిజం. తాజాగా హైదరాబాదులో ఇలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి లైంగికంగా దాడిచేశాడో సవతి తండ్రి. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తీవ్రంగా హింసించాడు. చివరకు ధైర్యం చేసి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. వివరాల్లోకి వెళితే ఎనిమిది సంవత్సరాల క్రితం వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు నిందితుడు. ఈమెకు మొదటి భర్తతో సృజన( పేరు మార్చాం) అనే కూతురు ఉంది. భార్య ఇంట్లోలేని సమయంలో సవతి కూతురుపై లైంగిక దాడి చేయడంతోపాటు తల్లితో చెప్పవద్దని బెదిరించాడు. భయంతో బాధితురాలు మౌనం వహించింది. కానీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత, ఆమె తల్లి పని కోసం బయలుదేరబోతుండగా భయంతో వణికి పోయింది. తనను విడిచి వెళ్లొద్దంటూ భోరున విలపించింది. కూతురు ద్వారా విషయం తెలుసుకున్న మహిళ భర్తను నిలదీసింది. అయితే.. ముందు బుకాయించినా, గట్టిగా నిలేయడంతో మద్యం మత్తులో తప్పు చేశాననీ, క్షమించమంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ ఆ కామంధుడిని క్షమించేశారు. కానీ నెల రోజుల తరువాత మళ్లీ లైంగిక దాడికి తెగబడ్డాడు. తప్పించుకుని బాత్ రూంలోకి పారిపోయి తలుపు వేసుకుంది. తలుపు పగల గొట్టి మరీ ఆమెపై దాడిచేశాడు. బెల్ట్‌తో చితకబాదాడు. భర్త క్రూరత్వం గురించి తెలిసిన ఆమె కూతురి స్థితిని గమనించి విషయాన్ని అర్థం చేసుకుంది. నేరుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే కేసు నమోదు చేయడానికి వారు మూడు పోలీస్స్టేషన్లు తిరగాల్సి రావడం.. సంఘటన తరువాత పారిపోయిన నిందితుడు, మళ్లీ రాజీకోసం ప్రయత్నించాడు. కేసు ఉపసంహరించుకోవాలని, అమ్మాయి పేరుతో డబ్బులు డిపాజిట్ చేస్తానని, చదువుకు సాయం చేస్తానంటూ బేరసారాలు మొదలు పెట్టాడు. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వద్దు డాడీ.. మొత్తుకున్నా.. ఆ కామాంధుడు కనికరించలేదని, తాను గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టినా.. చుట్టుపక్కల వారు ఎవరూ ముందుకురాలేదని బాధితురాలు వాపోయింది. అసలు ఆయన తన తండ్రి కాదనే విషయం ఎవరికీ తెలియదనీ, చివరికి తన తమ్ముడికి కూడా తెలియదని చెప్పింది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్లనని స్పష్టం చేసింది. ఇంట్లో తనకు రక్షణలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే తాను హాస్టల్లో ఉండి చదువుకుని పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెప్పింది. ఇంటా, బయట ఆడబిడ్డలపై జరిగే అఘాయిత్యాలపై మొదటినుంచీ తన తల్లి హెచ్చరిస్తూ వుండేదని బాధిత బాలిక చెప్పింది. అదే తనకు ఈ ధైర్యాన్నిచ్చిందని పేర్కొంది. -
లైంగిక వేధింపులు.. భవనం నుంచి దూకిన బాలిక
ముంబై : లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక(12) నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం ముంబయిలోని పాల్ఘార్ జిల్లా ఆల్కాపూరి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బాలిక దగ్గరకు వచ్చి కాగితం చూపించి చిరునామా అడిగాడు. అంతేకాక ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అడ్రస్ చూపించమని తన వెంట తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి ఓ భవనంపైకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిగటించిన బాలిక అతని నుంచి తప్పించుకోవటానికి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైనా ఆ బాలికను నగరంలోని నాయర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారని..
జబల్పూర్ : కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారన్న బాధతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్లో ఏడోతరగతి చదువుతున్న బాలికను గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం ఆ యువకుడు బాలిక చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టి.. తనకు కాల్ చేయాలని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు అతడి ఇంటికి వెళ్లారు. తమ కూతురిని వేధిస్తున్న సంగతి వారు యువకుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని నమ్మకపోగా బాలిక కళ్లముందే ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని బాలిక ఆవేదనకు గురై ఇంటికి వెళ్లిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో వారు గుండెలు బాదుకున్నారు. యువకుడిపై, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ అల్పానారాయణ్ మిశ్రా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడైన యువకుడి వయస్సు 17 ఏళ్లు అని, అతడు మైనర్ తల్లిదండ్రులు చెప్తుండగా... ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి
సాక్షి, మదనపల్లి: చిత్తూరుజిల్లా మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన ఓ కుటుంబంలోని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో మదనపల్లికి వచ్చి బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ స్థానిక ఎస్ బి ఐ కాలనీలో రోడ్డు పక్కన గుడారం వేసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో బెంగళూరుకు చెందిన గంగాధర(42) అనే వ్యక్తి అటుగా వచ్చాడు. అక్కడున్న 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి గంగాధరకు దేహశుద్ధి చెయ్యగా అతను పరారయ్యాడు. మదనపల్లి 2వ పట్టణ పోలీసు స్టేషన్లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.