Google CEO
-
బర్త్‌డే స్పెషల్.. 'సుందర్ పిచాయ్' సక్సెస్ జర్నీ & లవ్ స్టోరీ (ఫొటోలు)
-
గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'సుందర్ పిచాయ్' టెక్ దిగ్గజంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఏప్రిల్ 26 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.''2004 ఏప్రిల్ 26 గూగుల్ కంపెనీలో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ మాత్రమే కాకుండా.. మా ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. సంస్థలో పనిచేస్తున్నందుకు ఇప్పటికీ నన్ను నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను'' అంటూ సుందర్ పిచాయ్ పోస్ట్ చేశారు. సుందర్ పిచాయ్ చేసిన ఈ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 1,42,999 కంటే ఎక్కువ లైక్స్ పొందిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామంది సుందర్ పిచాయ్ విజయాన్ని గొప్పగా అభినందించారు. సుందర్ పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్‌గా చేరాడు. ఆ తరువాత దినదినాభివృద్ధి చెందుతూ ఆ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన పిచాయ్ నేడు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారంటే దాని వెనుక ఉన్న ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. View this post on Instagram A post shared by Sundar Pichai (@sundarpichai) -
'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్సైట్ ఇదే..
సాధారణంగా చాలా మందికి రోజు ఎలా ప్రారంభమవుతుందంటే.. ఇష్టమైన పనులు చేయడంతో ప్రారంభమవుతందని చెబుతారు. కానీ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' రోజు మాత్రం వార్తాపత్రికలను తిరగేయడం, సోషల్ మీడియాను చెక్ చేయడం మాదిరిగా కాకుండా ఒక 'వెబ్సైట్' చూడటంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ ప్రతి రోజూ నిద్ర లేవగానే 'టెక్‌మీమ్' అనే వెబ్సైట్లో లేటెస్ట్ టెక్ న్యూస్ చదవడంతో ప్రారంభమవుతుందని సమాచారం. టెక్‌మీమ్ అనే వెబ్సైట్ 2005లో గేబ్ రివెరా స్థాపించారు. ఇందులో చిన్న సారాంశాలతో సేకరించిన హెడ్‌లైన్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి యాడ్స్ ఇబ్బంది లేకుండా కీలక అంశాలను త్వరగా చూసేయొచ్చు. టెక్‌మీమ్ వెబ్‌సైట్‌ను సుందర్ పిచాయ్ మాత్రమే కాకుండా.. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరితో పాటు మరికొంత మంది సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఈ వెబ్సైట్ తరచుగా సందర్శిస్తుంటారు. టెక్‌మీమ్ అనేది ప్రత్యేకించి టెక్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం రూపొందించినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కోరుకునే ఎగ్జిక్యూటివ్ సారాంశాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఈ వెబ్సైట్లో ఎలాంటి క్లిక్‌బైట్స్, పాప్అప్లు, వీడియోలు లేదా అనుచిత ప్రకటనలు కనిపించవు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై త్వరలో నిర్ణయం - ఇదే జరిగితే పదేళ్లలో.. -
ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేషన్ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్! ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్కి బాధ్యత వహించే హార్డ్‌వేర్ టీమ్‌లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. -
ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్ వెనుక భార్య..
సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచమే గుర్తించదగిన స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. అంతే కాకుండా ఈ రోజు ఆ స్థాయిలో ఉండటానికి పిచాయ్ భార్య అంజలి కూడా కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుందర్ పిచాయ్, అంజలి ఇద్దరూ కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్. దీంతో వారిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది. గూగుల్ సీఈఓగా.. ఎంత దూరంలో ఉన్నా ప్రేమకు పెద్ద దూరం కాదన్నట్లు.. చివరికి వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా కీలకమైన జాబ్ ఇస్తామని ఆఫర్ చేసింది. గూగుల్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్స్ స్వీకరించాలనుకుని ఆ జాబ్ వదిలేయాలనుకున్నాడు, ఈ విషయాన్ని తన భార్యకు చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా? రోజుకు రూ. 5 కోట్లు.. ఈ రోజు గూగుల్ కంపెనీ సీఈఓగా రోజుకు రూ. 5 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అంటే.. దానికి కారణం భార్య ఇచ్చిన సలహా పాటించడమనే చెబుతున్నారు. అర్థం చేసుకునే భార్య ఉంటే.. మగవారి జీవితంలో సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. -
దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్
ఇటీవల జరిగిన దీపావళి సమయంలో గూగుల్‌లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఐదు విషయాలను సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) రివీల్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దీపావళి జరుపుకునే అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ ప్రశ్నలను ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇందులో ఐదు అంకెలతో కూడిన ఒక దీపాన్ని సూపించే ఫోటో కూడా షేర్ చేశారు. ఈ అంకెల ద్వారానే ప్రశ్నలను తెలియజేసారు. సుందర్ పిచాయ్ హైలైట్ చేసిన ఐదు ప్రశ్నలు 👉భారతీయులు దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? 👉దీపావళి సమయంలో మనం రంగోలీని ఎందుకు వేస్తారు? 👉దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు? 👉దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? 👉దీపావళి సమయంలో ఆయిల్ బాత్ ఎందుకు? ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! ఈ ప్రశ్నలను గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకునేవారు పండుగ అర్థం, సంప్రదాయం వంటి వివరాలను తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో తెలుస్తోంది. దీపావళి జరుపుకుంటున్న చాలా మందికి ఆ పండుగ విశిష్టత గురించి తెలియదు, అలాంటి వారు ద్వారా సర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Happy Diwali to all who celebrate! We’re seeing lots of interest about Diwali traditions on Search, here are a few of the top trending “why” questions worldwide: https://t.co/6ALN4CvVwb pic.twitter.com/54VNnF8GqO — Sundar Pichai (@sundarpichai) November 12, 2023 -
గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫోటో వైరల్!
భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE — Sid Puri (@PuriSid) September 25, 2023 -
25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్!
ఆధునిక కంప్యూటర్ యుగంలో గూగుల్ (Google) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ సంస్థ ప్రారంభమై ఇప్పటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) తన అనుభవంలోని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తాను (సుందర్ పిచాయ్) అమెరికాలో చదువుకునే రోజుల్లో ఈ-మెయిల్ అందుబాటులోకి వచ్చిందని.. ఆ సమయంలో చాలా సంతోషించినట్లు తెలిపాడు. అయితే తన తండ్రికి పంపిన మెయిల్‌కి రిప్లై (డియర్ మిస్టర్. పిచాయ్, ఈమెయిల్ అందింది. అంతా బాగానే ఉంది) రావడానికి రెండు రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజు నా కొడుకు నాతో మాట్లాడటానికి కనీసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని.. ఎదుగుతున్న టెక్నాలజీ గురించి వెల్లడించాడు. నేడు ఏది కావాలన్నా సమాధానం గూగుల్ చెబుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఒక నీటి కుళాయి బాగు చేసుకోవడం దగ్గర నుంచి.. పెద్ద పెద్ద ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారి వరకు గూగుల్ చాలా ఉపయోగపడుతోంది. అంతే కాకుండా తాను గూగుల్ సంస్థలో ఇంటర్వ్యూ ఎలా పేస్ చేయాలి అనే ప్రశ్నలకు కూడా గూగుల్ సమాధానమిచ్చినట్లు వెల్లడించాడు. కాలక్రమంలో వచ్చిన మార్పులు తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చెందటంతో పాటు.. యూజర్ల నమ్మకాన్ని పొందటంతో గూగుల్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. వినియోగదారుల సమాచారం, ప్రైవసీకి ప్రాధాన్యత కల్పిస్తూ ఏఐ విప్లవంలో మరింత అభివృద్ధి చెందాలని వెల్లడించాడు. రాబోయే రోజుల్లో యూజర్లకు సహాయకారిగా మారటం, దానిని బాధ్యతాయుతంగా అమలు చేయడమే లక్ష్య,మని తెలిపారు. -
ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..
ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాయి. అయితే ఈ 'ఏఐ' టెక్నాలజీ మానవాళికి ముప్పు తీసుకువస్తుందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ స్మిత్ హెచ్చరించారు. తప్పకుండా దీనిని నియంత్రించాలి. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల వార్డ్రోట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమావేశంలో ఎరిక్ స్మిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎంతో మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి హెచ్చరించారు. సరైన మార్గంలో ఉపయోగించుకునేంత వరకు దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఒక్కసారి అనవసర విషయాల్లో ఉపయోగించడం మొదలుపెడితే అది చాలా ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అణు సాంకేతికతతో సమానమని, ఒక స్థాయిలో దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలైన ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్ అధినేతలతో పాటు బ్రిటన్ ప్రధాని పాల్గొన్న ఈ సమావేశంలో ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎరిక్ స్మిత్ గూగుల్ సంస్థకు 2001 నుంచి 2011 వరకు సీఈఓగా పనిచేసి, ఆ తరువాత 2015 నుంచి 2017 వరకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. (ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో తప్పకుండా దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సాంకేతికత వల్ల భవిష్యత్తులో కలిగే దుష్ప్రభావాలను తలచుకుంటే నిద్ర రావడం లేదని పిచాయ్ అన్నాడు. బిల్ గేట్స్ కూడా దీనినే అంగీకరించాడు. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న. -
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీరుపట్ల ఆ సంస్థ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉద్యోగులకు కాస్ట్ కటింగ్ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో సీఈవో భారీ ఎత్తున వేతనాలు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉద్యోగులు సైతం ఇంట్రర్నల్ ఫోరమ్‌లో సంస్థను ప్రశ్నిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గూగుల్ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో సుందర్ పిచాయ్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్.. సీఈవోకు మాత్రం 2022 సంవత్సరానికి రూ.1,850 (226 మిలియన్ డాలర్లు) కోట్ల పారితోషికం ఇచ్చింది. గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ జనవరిలో గ్లోబుల్ వర్క్ ఫోర్స్‌లో 6 శాతంతో సుమారు 12 వేల మందిని విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? సుందర్ పిచాయ్ వర్సెస్ టిమ్‌కుక్ సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. దీంతో సీఈవోకి చెల్లించే వేతనాల విషయంలో గూగుల్ ఉద్యోగులు పిచాయ్ వేతనాన్ని, యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వేతనంతో పోల్చుతూ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. టిమ్‌కుక్ గత ఏడాదిలో సుమారు 40 శాతం వేతనంలో కోత విధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకున్నప్పటికీ సుందర్ పిచాయ్ వేతనాల పెంపుపై గూగుల్ ఇంట్రర్నల్ ఫోరమ్‌లో ఉద్యోగులు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీపీఎస్, సీఈవో మినహా అందరికీ వర్తిస్తుంది మార్చి నెలలో గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ ఉద్యోగులకు మెమో పంపారు. సంస్థ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అందులో ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. సంస్థ కోసం కష్టపడే వైస్ ప్రెసిడెంట్ సీఈవోకి మినహాయింపు ఉంటుందని గూగుల్ ఎంప్లాయిస్ ఫోరమ్‌లో పోరట్ స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టేలా జీతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ రిక్వెస్ట్!
గూగుల్ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది. బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్‌ను రూపొందించినట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్ ఉద్దేశం. అయితే సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు. గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. గూగుల్ ఇటీవల తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌తో సంబంధం లేకుండా గూగుల్‌కు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్‌ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్‌లో పిచాయ్ అభ్యర్థించారు. (ఇదీ చదవండి: రిషి సునాక్, బిల్‌గేట్స్‌ను ఇంటర్వ్యూ చేసిన చాట్‌బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?) -
మహిళా స్టార్టప్‌లపై గూగుల్ ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల సారథ్యంలో నడిచే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంపై టెక్ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెట్టనుంది. 75 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే, 100 పైచిలుకు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్‌ను సపోర్ట్ చేసే వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. భారత పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. భారతీయ స్టార్టప్స్‌లో 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు, ఇందులో నాలుగో వంతు భాగం (సుమారు 75 మిలియన్ డాలర్లు) మహిళల సారథ్యంలోని ప్రారంభ దశ అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. భారీ స్థాయిలో విస్తరించిన టెక్నాలజీ .. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను స్పృశిస్తున్న నేపథ్యంలో నియంత్రణలనేవి బాధ్యతాయుతమైనవిగా, సమతూకం పాటించేవిగా ఉండాలని పిచాయ్ పేర్కొన్నారు. ఎగుమతుల విషయంలో భారత్ అతి పెద్ద దేశంగా ఎదగగలదని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2020లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు)తో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లతో జియోలో 7.73 శాతం, భారతి ఎయిర్‌టెల్‌లో 700 మిలియన్ డాలర్లతో 1.2 శాతం వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ .. పర్యటన సందర్భంగా పిచాయ్ కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ‘మీ సారథ్యంలో భారత్ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం స్ఫూర్తిదాయకమైన విషయం‘ అని మోదీతో భేటీ అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. సమావేశంలో ఏయే అంశాలు చర్చించారనేది వెల్లడించలేదు. అయితే, ‘గూగుల్ చిన్న వ్యాపారాలు .. స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం, సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం, విద్య..నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడం, వ్యవసాయం.. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేథను వినియోగిస్తుండటం వంటి అంశాల‘ పై ప్రధానితో చర్చించనున్నట్లు పిచాయ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. అలాగే, స్పీచ్ టెక్నాలజీ, వాయిస్, వీడియో సెర్చ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు ప్రాజెక్టులను బ్లాగ్‌లో ప్రస్తావించారు. తాను భారత్‌లో పర్యటించిన ప్రతిసారి భారత స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుండటాన్ని గమనిస్తున్నానని ఆయన తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా తమ అనువాదం, సెర్చ్ టెక్నాలజీ సేవలను మెరుగుపర్చుకునేందుకు దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో జట్టు కట్టినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఐఐటీ మద్రాస్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటు కోసం 1 మిలియన్ డాలర్ల గ్రాంటును అందించనున్నట్లుపేర్కొంది.వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాత టెక్నాలజీలపై పని చేసేందుకు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా వాధ్వానీ ఏఐకి 1 మిలియన్ గ్రాంటు అందిస్తున్నట్లు గూగుల్ వివరించింది. ‘మీతో నవకల్పనలు, టెక్నాలజీ వంటి ఎన్నో విషయాలను చర్చించడం సంతోషం కలిగించింది. మానవజాతి పురోగతికి, సుస్థిర అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించడంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’. – ప్రధాని మోదీ ట్వీట్ చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే : సుందర్ పిచాయ్
-
ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్‌కు అంతమెన్నడో తెలియడం లేదు.. రెండు వేవ్‌లతో సతమతమైన జనాలపై మూడో వేవ్ విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఓ విధంగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. కుబేరులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది కోవిడ్. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్. మహమ్మారి తనను కూడా మానసికంగా బాధించిందన్నారు. బీబీసీకిచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడితో సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ బదులిస్తూ... ‘‘కోవిడ్ వేళ ప్రపంచవ్యాప్తంగా నిలిపి ఉంచిన మోర్గ్ ట్రక్కులను చూసినప్పుడు.. రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాను’’ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భాగంగా ఏప్రిల్-మే నెలల్లో భారత దేశంలో వేలాది మంది మరణించారు. గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ పరిస్థితులు తనను ఎంతో బాధించాయన్నారు పిచాయ్. అంతేకాక ‘‘నేను అమెరికన్ పౌరుడిని. కానీ నాలో భారతీయత ఎంతో లోతుగా పాతుకుపోయింది. నేను ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుంది. నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. సాంకేతికతలో చోటు చేసుకుంటున్న మార్పులు నాపై ఎంతో ప్రభావం చూపేవి. నా బాల్యంలో చూసిన రోటరి ఫోన్.. పాత స్కూటర్ ఇవన్ని నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి’’ అని సుందర్ పిచాయ్ తెలిపారు. ‘‘నా తండ్రి ఏడాది మొత్తం జీతం ఖర్చు చేస్తే నేను అమెరికా చేరుకోగలిగాను. కాలీఫోర్నియాలో దిగినప్పుడు నేను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించాను. అమెరికా చాలా ఖరీదైనది. ఇక్కడ ఓ బ్యాక్‌పాక్ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. సాంకేతికత మీద నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది’’ అని తెలిపారు సుందర్ పిచాయ్. పాస్వర్డ్ మార్చను ఎందుకంటే.. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ తాను పాస్‌వర్డ్‌ను తరచూ మార్చనని వెల్లడించారు. వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌లను తరచూ మార్చడానికి బదులుగా “రెండు-కారకాల ప్రామాణీకరణ” (టూ ఫాక్టర్ అథెంటికేషన్)ఎంచుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. ‘‘పాస్‌వర్డ్‌ను పదేపదే మార్చడం కంటే రెండు-కారకాల ప్రామాణీకరణ మార్గం ఎంతో సురక్షితం. ఎందుకంటే పాస్‌వర్డ్‌లను చాలా తరచుగా మార్చినప్పుడు, వాటిని గుర్తుంచుకోవడంలో మీకు ఇబ్బంది తలెత్తుతుంది. కనుక రెండు-కారకాల ప్రామాణీకరణను ఎంచుకోవడం ఎంతో మంచిది’’ అన్నారు. అంతేకాక తాను ఒకేసారి 20కి పైగా ఫోన్లను ఉపయోగిస్తానని తెలిపారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఫోన్‌ని పరీక్షిస్తాను అని సుందర్ పిచాయ్ తెలిపారు. . -
భారత్‌కు గూగుల్ దన్ను!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఏర్పాటును ప్రకటించారు. ’గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత్‌పైనా, భారత డిజిటల్ ఎకానమీ భవిష్యత్‌పైనా తమ కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు ప్రతిబింబిస్తాయని పిచాయ్ తెలిపారు.‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీని ద్వారా వచ్చే 5–7 ఏళ్లలో భారత్‌లో రూ. 75,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తాం. ఈక్విటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన తదితర మార్గాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయి‘ అని పిచాయ్ తెలిపారు. నాలుగు ప్రధానాంశాలపై దృష్టి... భారత్ డిజిటలీకరణకు తోడ్పడేలా ప్రధానంగా నాలుగు విభాగాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయని సుందర్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తమ తమ ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా చూసే ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటని వివరించారు. అలాగే, ప్రత్యేకంగా భారత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసుల రూపకల్పనపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు డిజిటల్‌కు మళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. చివరిగా సామాజిక శ్రేయస్సుకు తోడ్పడేలా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు మరింత మెరుగుపడేలా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని మరింత వినియోగంలోకి తేవడంపై దృష్టి పెడతామని సుందర్ తెలిపారు. భారత్ ప్రత్యేకం... ప్రస్తుతం భారతీయులు టెక్నాలజీ తమ దాకా వచ్చేంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం ఉండటం లేదని.. కొత్త తరం టెక్నాలజీలు ముందుగా భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని సుందర్ తెలిపారు. ‘భారత్‌తో పాటు యావత్ ప్రపంచం ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోందని అనడంలో సందేహం లేదు. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థలకు ఎదురైన పెను సవాళ్లు.. మన పనితీరును, జీవన విధానాలను పునఃసమీక్షించుకునేలా చేశాయి. అయితే, ఇలాంటి సవాళ్లే కొంగొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఆవిష్కరణలతో ప్రయోజనం పొందడం మాత్రమే కాదు.. వాటి రూపకల్పనలోనూ భారత్ ముందుండేలా చూడటం తమ లక్ష్యమని సుందర్ చెప్పారు. ముందుగా భారత్ కోసం ఉత్పత్తులు తయారు చేయడమన్నది.. మిగతా ప్రపంచ దేశాలకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించే దిశలో గూగుల్‌కు ఎంతగానో ఉపయోగపడిందని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పిచాయ్ భేటీ... డేటా భద్రత, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై చర్చ ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. డేటా భద్రత, గోప్యతపై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘డేటా భద్రతపై సందేహాలను పారద్రోలేందుకు టెక్ కంపెనీలు మరింతగా కృషి చేయాలని ప్రధాని సూచించారు. అలాగే, సైబర్ దాడుల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ముప్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు ఆలోచన గురించి ప్రస్తావించారు‘ అని పీఎంవో తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలను ప్రధాని వివరించారు. కరోనా వైరస్ సంబంధ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను అందించడంలోనూ .. అపోహలు, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడంలోనూ గూగుల్ క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘సుందర్‌పిచాయ్‌తో భేటీలో రైతులు, యువత, ఔత్సాహిక వ్యాపారవేత్తల జీవితాలను మార్చగలగడంలో టెక్నాలజీ వినియోగం గురించి చర్చించాం‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సమావేశానికి సమయం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. డిజిటల్ ఇండియాకి సంబంధించి మీ విజన్‌ను సాకారం చేసే దిశగా మేము కూడా కృషి చేయడం కొనసాగిస్తాం‘ అని ప్రతిగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మరిన్ని భాగస్వామ్యాలు.. భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్‌లో ఎడ్యుటెయిన్‌మెంట్ సిరీస్‌ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్‌లో 22,000 పైచిలుకు పాఠశాల్లో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్ఈతో జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది. ఇక గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ ద్వారా అల్పాదాయ వర్గాల కోసం కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా మిలియన్ డాలర్లు గ్రాంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. చిన్న సంస్థల డిజిటలీకరణ.. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పట్టడంలో గూగుల్ గణనీయంగా తోడ్పాటు అందిస్తోందని సుందర్ చెప్పారు. ప్రస్తుతం 2.6 కోట్లకు పైగా ఎస్‌ఎంబీలను (చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు) సెర్చి, మ్యాప్స్‌లో చూడవచ్చని, వీటికి ప్రతి నెలా 15 కోట్ల మంది పైగా యూజర్లు ఉంటున్నారని ఆయన వివరించారు. కరోనా వల్ల డిజిటల్ సాధనాల వినియోగం మరింత పెరిగిందన్నారు. ‘మా బామ్మకు కూరగాయల వాళ్లతో బేరాలడటం కుదరకపోవడం అనే ఒక్క లోటు తప్ప..లాక్డౌన్ వేళ వివిధ ఉత్పత్తులు, సర్వీసులను పొందేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం బాగా ఉపయోగపడింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. -
పిచాయ్ని టచ్ చేసిన అమ్మాయ్!
ఆ ట్వీట్ దగ్గర సుందర్ పిచాయ్ కళ్లు ఆగిపోయాయి! గూగుల్ సీఈవో ఆయన. అంతటి మనిషిని పట్టి ఆపిన ట్వీట్ అంటే.. అది మామూలు ట్వీట్ అయి ఉండదు అనుకుంటాం. కానీ అతి మామూలు ట్వీట్ అది. ‘నాలుగేళ్ల క్రితం.. క్వాంటమ్ ఫిజిక్స్ పరీక్షలో నాకు జీరో మార్కులు వచ్చాయి. వెంటనే మా ప్రొఫెసర్ని కలిశాను. సర్, ఫిజిక్స్‌ని వదిలేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకోనా అని అడిగాను. అదే నయమేమో అన్నట్లు ఆయనా చూశారు. కానీ ఈరోజు నేను ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెడ్.డి. పూర్తి చేశాను. రెండు అధ్యయన పత్రాలు సమర్పించాను. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఎవరికైనా కొరుకుడు పడనిదే. గ్రేడ్ తక్కువ వచ్చినంత మాత్రాన వదిలేయనవసరం లేదు’ అని శారాఫినా నాన్స్ అనే యువతి చేసిన ట్వీట్ అది. పిచాయ్ని ఆకట్టుకుంది. వెంటనే ‘‘వెల్ సెడ్ అండ్ సో ఇన్స్పైరింగ్’’ అంటూ ఆమెను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. ఓటమి అంటే గెలవలేకపోవడం కాదు. గెలిచేవరకు ప్రయత్నించక పోవడం. -
గూగూల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి మరో అవార్డు
-
సుందర్ పిచాయ్‌కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..! జీఎస్ఎంఏ అంచనా న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది. -
అప్పట్లో నేలపై పడుకునేవాడ్ని : సుందర్ పిచాయ్
న్యూయార్క్ : ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాల్యంలో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు. చెన్నైలో తన చిన్ననాట గడిపిన రోజులను న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాము నిరాడంబర జీవితం గడిపేవారమని, సాదాసీదా ఇంటిలో కొంత భాగం అద్దెకు ఇచ్చి మరో భాగంలో తాము సరిపెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. లివింగ్ రూమ్‌లో నేలపైనే తాము నిద్రించేవారమని, తాను పెద్దయ్యే క్రమంలో తీవ్ర కరువు వెంటాడిందని వెల్లడించారు. అప్పట్లో తమకు ఫ్రిజ్ లేదని, ఎన్నో రోజుల తర్వాత తాము ఫ్రిజ్‌ను కొనడంతో సంబరపడిపోయామని చెప్పారు. తాను బాల్యంలో విపరీతంగా పుస్తకాలు చదివేవాడినని, స్నేహితులతో సరదాగా వీధుల్లో క్రికెట్ ఆడేవాడినని అప్పటి రోజుల్లో తాము ఎలాంటి చీకూచింతా లేకుండా జీవితాన్ని ఆస్వాదించామని అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా అవేమీ తమకు అవరోధాలుగా కన్పించలేదని చెప్పుకొచ్చారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసే ముందు పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. అప్పట్లో ల్యాబ్స్, కంప్యూటర్స్ అందుబాటులో ఉండేవి కావని, కానీ ఇంటర్నెట్ ద్వారా భారీ మార్పులు చోటుచేసుకుంటాయని తనకు అంతగా అవగతం కాలేదని అన్నారు. పిచాయ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. 2004లో గూగుల్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను అభివృద్ధి చేసే బృందంలో ఒకరిగా పిచాయ్ చేరిన పిచాయ్ పదేళ్ల తర్వాత కంపెనీ ఉత్పత్తులు, సెర్చ్, యాడ్స్, అండ్రాయిడ్‌లతో కూడిన ప్రోడక్ట్స్, ప్లాట్‌ఫామ్స్‌కు ఇన్చార్జ్గా ఎదిగారు. 2015లో సీఈవోగా అత్యున్నత పదవిని చేపట్టిన సుందర్ పిచాయ్ గత ఏడాది గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో స్ధానం పొందారు. -
అల్ఫాబెట్ బోర్డులోకి సుందర్ పిచాయ్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా కంపెనీ మాతృసంస్థ అల్ఫాబెట్ బోర్డులో డైరెక్టరుగా చోటు దక్కించుకున్నారు. గూగుల్ సీఈవోగా సుందర్ అద్భుతమైన పనితీరు కనపరుస్తున్నారని, వృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని అల్ఫాబెట్ సీఈవో ల్యారీ పేజ్ వెల్లడించారు. అల్ఫాబెట్ బోర్డులోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకి చెందిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్‌లో చేరారు. కంపెనీ సహ వ్యవస్థాపకులు పేజ్, సెర్గీ బ్రిన్‌లతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన అనంతరం 2015 ఆగస్టులో గూగుల్ సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది గూగుల్‌కి పేరెంట్ హోల్డింగ్ కంపెనీగా ఆల్ఫాబెట్ ఏర్పాటైంది. సుందర్ సారథ్యంలో గూగుల్ ప్రధానమైన ప్రకటనలు, యూట్యూబ్ వ్యాపారాల విభాగాల నుంచి ఆదాయాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. -
గూగుల్ సీఈవో మరో ఘనత
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు తన ఖాతాలో మరో విశిఫ్టతను చేర్చుకున్నారు. గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు తెలిపింది. అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది. ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదుకానుందని అంచనా. ఫేస్బుక్ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది. కాగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు -
నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ కామెంట్
-
అబే సాలే.. అంటే అర్థమేంటి?
'అబే సాలే..' అంటే ఏంటో ఓ మాదిరిగా హిందీ వచ్చినవాళ్లందరికీ బాగా తెలుసు. ఎవరినైనా తిట్టాలంటే ముందుగా ఆ పదాన్ని ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం గూగుల్ లాంటి సెర్చింజన్ దిగ్గజ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సుందర్ పిచాయ్ మాత్రం.. అదేదో స్నేహపూర్వకంగా పిలిచే పలకరింపు అనుకున్నారట. అయితే అది ఇప్పటి విషయం కాదు.. 23 ఏళ్ల క్రితం ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే సమయంలో. చెన్నైలో పుట్టిన పిచాయ్.. ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థులకు ఈ విషయం చెప్పి నవ్వుకున్నారు. తాను స్కూల్లో హిందీ చదువుకున్నా, పెద్దగా మాట్లాడేవాడిని కానని.. ఎవరైనా మాట్లాడుతుంటే వినేవాడినని సుందర్ పిచాయ్ చెప్పారు. అందరూ అలాగే పిలుచుకుంటారని భావించి ఒకరోజు మెస్‌లో ఓ స్నేహితుడిని పిలవడానికి తాను 'అబే సాలే..' అన్నానని తెలిపారు. ఆయన ఆ మాట అనగానే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. మొదటి రెండు వారాల పాటు తాను అలాగే అనుకున్నానని, క్రమంగా అర్థమైందని తెలిపారు. తన భార్య అంజలిని కూడా క్యాంపస్‌లోనే కలిసిన సుందర్.. అమ్మాయిల హాస్టల్లోకి వెళ్లడం మాత్రం అంత సులభం కాదన్నారు. ఎవరో ఒకళ్లు బయట నిలబడి, గట్టిగా.. 'అంజలీ, నీకోసం సుందర్ వచ్చాడు' అని చెప్పాల్సి వచ్చేదని, అది అంత బాగుండేది కాదని తన ప్రేమ వ్యవహారాన్ని కూడా తెలిపారు. టెక్నాలజీ.. అందునా మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయిందని, కానీ ఐఐటీలో తన గది మాత్రం పాతికేళ్ల నుంచి అలాగే మారకుండా ఉందని జోక్ చేశారు. అందరు కాలేజి కుర్రాళ్లలాగే తాను కూడా నైటవుట్లు చేసి, పొద్దున్నే క్లాసులు ఎగ్గొట్టేవాడినన్నారు. 2004లో తనకు గూగుల్‌లో ఇంటర్వ్యూ వచ్చిందని, అప్పట్లో వాళ్లు జీమెయిల్ గురించి చెబుతుంటే అదేదో తనను ఏప్రిల్ ఫూల్ చేయడానికి చెబుతున్నారని అనుకున్నానని తెలిపారు. అది వాస్తవమన్న విషయం చాలా కాలం వరకు నమ్మలేదన్నారు. కాలేజిలో చదివే రోజుల్లో నారాయణమూర్తి తనకు హీరో అని, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతుంటే చూడటాన్ని ఇష్టపడేవాడినని అన్నారు. -
నోట్ల రద్దుపై సుందర్ పిచాయ్ కామెంట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై టెక్నో దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు. ఈ అంశంలో తాను నిపుణుడిని కాకపోయినా ఇది సాహసోపేతమైన నిర్ణయమని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో గూగుల్ సంస్థ ఏ విధంగానైనా సాయం చేసే అవకాశముంటే అందుకు తాము సిద్దమని ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నోట్ల రద్దుపై స్పందించాలని కోరగా.. ‘పెద్ద వేదికలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు విశేషమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ప్రజలకు ఫోన్లు ఉండి.. వాటిలో లోకేషన్ గుర్తించే వీలుండటం రైడ్-షేరింగ్ (క్యాబ్) సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రవాణా వ్యవస్థలో విశేషమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును నేను తక్కువ అంచనా వేయను. భారత్‌లో ఇలాంటి వాటి వల్ల విశేషమైన బహుళ ప్రభావాలు ఉంటాయి. ఇతర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే భారత్ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ల్యాండ్ లైన్లకు బదులు సెల్ఫోన్లు వాడుతున్నాం. అదేవిధంగా డిజిటల్ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రజలు అనుకుంటున్న దానికన్నా మెరుగైన మౌలికవసతులు దేశంలో ఉన్నాయి’ అని ఆయన అన్నారు.