Government welfare schemes
-
జగన్ వెంటే జనం!
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి 99 శాతానికి పైగా అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం జగన్ ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందినదే అని చెప్పడంలో అతిశ యోక్తి లేదు. విలువలు గల కమిట్ మెంట్ రాజకీయాలు నడపడంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక మార్పులు తీసుకురావడంలోనూ జగన్ చేసిన ఈ ఐదేండ్ల కృషి అద్వితీయం, అనుపమానం. ఈ రోజు నిరుపేద కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లలు, ఈ దేశం లోని పేద బహుజనుల చిర కాల స్వప్నమైన ఇంగ్లీషు మీడి యం విద్యను అభ్యసిస్తు న్నారు. లక్షలాదిమంది విద్యా ర్థులకు విదేశీస్థాయి కార్పొరేట్ విద్య ఉచితంగా లభిస్తోంది. అలాగే వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం మరో అద్భు తమైన, విప్లవాత్మకమైన చర్య. దీంతో అధికార వికేంద్రీకరణ జరిగింది. చంద్రబాబు తన ఐదేండ్ల పాలనలో విభజన హామీల సాధన కోసం ఏ ప్రయత్నం చేయకపోగా, ఆంధ్రప్రదేశ్‌కు పెన్నిధి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయలేకపోయారు. అమరావతి పేరు చెప్పి పాలనను నిర్లక్ష్యం చేశారు. దాంతో పోలవరం ఒక్కడుగు కూడా ముందుకు నడు వలేదు. ఈ అవకతవకలన్నీ సరిచేసి కొత్త టెండర్లనాహ్వానించి వేలకోట్ల ప్రజాధనాన్ని కాపాడారు జగన్. వైద్యరంగంలోనూ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన మౌలిక మార్పులు దేశానికే ఆదర్శప్రాయం. అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దవాఖానాలు తెరిచి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. ఆరోగ్యశ్రీ సేవలను మరిన్ని జబ్బులకు వర్తింపజేసి, ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయికి పెంచడం ముదావహం. ఇలా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికీ, అనేక మౌలిక మార్పులకూ.... ముఖ్యంగా దళిత, బహుజన, పేదవర్గాల్లో ఆత్మగౌరవం పెంచడానికీ, సామాజికన్యాయం చేయడానికీ తన ఐదేండ్ల కాలాన్ని పూర్తిగా వినియోగించారు జగన్. రాజ శేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చింతర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వతంగా తెరపడ్డట్టే... జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనకు శాశ్వత తెరపడుతుంది. ఈ భయంతోనే చంద్రబాబు జనసేన, బీజేపీలతో అనైతిక పొత్తు పెట్టుకొని ఎన్నికలల్లో గెలవాలని చూస్తున్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అను భవం ఉన్న సీని యర్ నాయకుడు తాను ప్రజలకేమైనా చేసి ఉంటే అవి చెప్పుకోవచ్చు కదా! అది మాని అనైతిక పొత్తులతో జగన్‌తో ఎన్నికల రణరంగంలో తలపడు తున్నారు చంద్ర బాబు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా జగన్ ఒంటరిపోరే చేస్తున్నారు. తానే ప్రజల కోసమైతే పని చేస్తున్నారో, అద్భుత పథకాల ద్వారా వాళ్ల మనసులు గెలుచుకున్నారో ఆ ప్రజలే తనను గెలిపి స్తారన్న దృఢ విశ్వాసముంది కాబట్టే ఒంటరిగా పోరాడు తున్నారు. జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెబుతుంది ఒకే ఒక మాట ‘అన్నలారా! అక్కలారా! మీకు నా ఈ ఐదేళ్ల పాలన నచ్చితేనే మీ జగనన్నను గెలిపించండి’ అని. ఇంతకంటే వినయ సంపన్నత రాజకీయాల్లో మరేముంటుంది? జగన్ ఒంటరివాడు కాదు. ఏడున్నరకోట్ల ఆంధ్ర ప్రజలు ఆయన వెంటున్నారు. వాళ్లే ఆయనను కాపాడుకుంటారు. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ రచయిత ‘ 91829 18567 -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
విశాఖపట్నం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విశాఖ నగరంలో 10 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ నజీర్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పని చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ ఆర్.భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయాల సేవలు అమోఘం!
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వం, దాని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకు ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఆవిర్భవించింది. ఏ మాత్రం అవినీతికీ, వివక్షకూ తావు ఇవ్వకుండా పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ సచివాలయ వ్యవస్థకు నాలుగేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. అద్భుతమైన ఫలితాలిస్తున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిశీలనా బృందాలను పంపించటం గమనార్హం. కాగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలు అందుబాటులోకి వచ్చాయి. పింఛన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్ పనులకు సంబంధించిన పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవిన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలు ఇందులో ఉన్నాయి. ఈ సేవల కోసం ప్రజలు గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సదాశయంతో నెలకొల్పిన ఈ గ్రామ, వార్డు సచివాలయాలు వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకూ; ప్రజాసమ స్యలు ప్రభుత్వానికీ తెలియజేసి ప్రజలకూ– ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఈ వలంటీర్లు వ్యవహరిస్తున్నారు. అర్హత ఉన్నవారెవరైనా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని సందర్భంలో వలంటీర్ ద్వారా ప్రయత్నించి çపొందవచ్చు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో ఈ సచివాలయాల పాత్ర అనన్యం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ బాధ్యత తీసుకునే విధంగా ఈ గ్రామ, వార్డు సచివా లయ వ్యవస్థ రూపొందించబడింది. సమస్త ప్రభుత్వ సేవలూ, పథకాలను వలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ప్రజల గడప ముందుకు తీసుకువెళ్లడం దేశాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మహమ్మారి కరోనా సమయంలో వలంటీర్లు చేసిన సేవలను ఎవరూ మరచి పోలేరు. వీరి సేవలు గుర్తించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి కొత్తగా చట్టం తీసుకొస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఆంధ్రప్రదేశ్ మున్సి పాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం తరహా లోనే సచివాలయ వ్యవస్థకు కూడా చట్టం రానుంది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూళ్లలో పేర్కొన్న ప్రకారం ప్రజలు కేంద్రంగా ప్రభుత్వ సేవలు, ఇతర సదుపాయాలను అందించేందుకు ఈ చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ఆర్డినెన్స్ పేర్కొంటోంది. ఈ ఆర్డినెన్స్‌తో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేసే ప్రభుత్వ సేవలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా జారీచేసే ఉత్త ర్వులు శాసనాధికారంతో కూడినవయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియా మకానికి చట్టబద్ధత లభించింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండు వేల జనాభాకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రతి 4 వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏర్పాటయ్యాయి. అయితే ఈ వ్యవస్థపై కొందరు అనవసర విమర్శలు చేయడం శోచనీయం. చలాది పూర్ణచంద్రరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 94915 45699 -
ఆరు నెలల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పూర్తి స్థాయిలో వేగంగా అందించేందుకు ప్రధాని మోదీ ఆరు నెలలు గడువు విధించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో మెగా డ్రైవ్ చేపట్టనుంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ‘రథా’ల్లో దేశంలోని మొత్తం 2.7 లక్షల పంచాయతీల్లోని అర్హులైన లబ్ధిదారులను కలుసుకుని, వారి పేర్లను నమోదు చేయనుంది. ఈ బృహత్తర కార్యక్రమం వచ్చే నెలలో దీపావళి తర్వాత ప్రారంభమై కొన్ని వారాలపాటు కొనసాగుతుందని శనివారం అధికారవర్గాలు తెలిపాయి. -
‘సురక్ష’కు నీరాజనం
‘అన్ని వివరాలు సక్రమంగా ఉన్నప్పటికీ కుల, ఆదాయ, ఫ్యామిలీ.. ఇతరత్రా సర్టిఫికెట్లు పొందాలంటే అంత సులువు కాదన్న విషయం అందరికీ అనుభవమే. విద్యా సంవత్సరం ప్రారంభంలో అయితే మరీ కష్టం. సర్టిఫికెట్లు కొంచెం త్వరగా కావాలనుకుంటే రోజుల తరబడి పనులు మానుకుని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు మీకు ఏవైనా సర్టిఫికెట్లు కావాలా? అని ఇంటి వద్దకే వచ్చి వివరాలు తీసుకెళ్తున్నారు. వారం తిరక్కుండానే సర్టిఫికెట్ చేతిలో పెడుతున్నారు. జయహో జగనన్న సురక్ష’ అంటూ ఊరూరా ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి నెట్వర్క్ : ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తరఫున వలంటీర్లు ఇంటికే వచ్చి ఏవైనా సమస్యలున్నాయా.. సర్టిఫికెట్లు కావాలా.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. అని అడిగి తెలుసుకోవడం తొలిసారిగా చూస్తున్నామని జనం చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలందించేందుకు జల్లెడ పడుతుండగా మరో పక్క క్యాంపుల ద్వారా అక్కడికక్కడే అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేసే కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో సమస్యలను పరిష్కరించి రికార్డు సృష్టిస్తోంది. రాష్ట్రంలో అర్హత ఉండీ కూడా ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరూ ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ పాఠశాలలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సురక్ష శిబిరాల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలను కూడా మంజూరు చేయిస్తోంది. వివిధ శాఖలు జారీ చేసే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ చార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. వారంలోగా ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అందించారని విశాఖ జిల్లా వాసి సాసబోయిన దాసు ఆనందంగా చెప్పాడు. ఇంటికే వచ్చి వివరాలు తీసుకుని బర్త్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చారని అనంతపురం జిల్లా వాసి అభిదా సంతోషం వ్యక్తం చేసింది. అత్త, మామల పేర్లను రేషన్ కార్డు నుంచి వేరు చేసి, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చారని పల్నాడు జిల్లాకు చెందిన దుడ్డు ఇందు సంబరపడిపోతూ తెలిపింది. ప్రజల ఇంటికే వచ్చి మీకు ఏ సమస్యలున్నాయని అడుగుతున్న తొలి సర్కారు ఇదేనని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వినతుల పరిష్కారం ► ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజు 1,305 సచివాలయాల పరిధిలో 4,73,441 వినతులు వస్తే, వాటిలో 4,57,642 అక్కడికక్కడే పరిష్కరించారు. 17వ తేదీ నాటికి 9,721 సచివాలయాల పరిధిలో 53.24 లక్షల వినతులు వస్తే, అందులో 51.14 లక్షల వినతులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. 11వ తేదీ ఒక్క రోజే 6.5 లక్షలకు పైగా వినతులు పరిష్కారం కావడం విశేషం. ► ఇప్పటిదాకా 1,69,891 మంది వలంటీర్లు జగనన్న సురక్ష శిబిరాల కోసం తమ క్లస్టర్లలోని 84.11 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించారు. అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 4,56,147 అభ్యర్థనలు రాగా, అధికారులు 4,37,509 పరిష్కరించారు. అత్యల్పంగా పార్వతీపురం జిల్లా నుంచి 89,303 అభ్యర్థనలు రాగా, 62,312 పరిష్కారమయ్యాయి. ► ఇప్పటిదాకా 25,39,136 ఇంటిగ్రేటెడ్ సరిఫికెట్లు, 23,25,388 ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 4,154 ఓబీసీ సర్టిఫికెట్లు, 2,764 మ్యారేజ్ సర్టిఫికెట్లు, 9,968 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, 45,930 అడంగల్ సర్టిఫికెట్లు, 1, 08,005 వన్ బీ సర్టిఫికెట్లు జారీ చేశారు. ► ఆరోగ్య శ్రీ కార్డులు 3,224, కొత్త బియ్యం కార్డులు 9,378, బియ్యం కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించిన సేవలు 8,263, ఆధార్‌తో మొబైల్ అనుసంధానం చేసిన సేవలు 1,78,499 ఉన్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల సేవలు 2,841 ఉన్నాయి. ► ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాక ఇబ్బందులు పడే రోజులు పోయాయని, జగనన్న ప్రభుత్వంలో ఏ పని అయినా సులభంగా పూర్తవుతోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండీ కూడా పథకాలు అందకపోతే వెంటనే స్థానికంగా ఉన్న వలంటీర్‌ను కానీ గ్రామ, వార్డు సచివాలయాల అధికారులను కానీ సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. సర్టిఫికెట్ ఇంటికి తెచ్చిచ్చారు.. నాకు బర్త్ సర్టిఫికెట్, కులం, ఆదాయం సర్టిఫికెట్ అవసరమైంది. వీటి కోసం గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పనికాలేదు. ఇప్పుడు మా ఇంటికే వలంటీర్ వచ్చి నాకేం కావాలో మరీ అడిగి తెలుసుకున్నాడు. కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే బర్త్ సర్టిఫికెట్, కుల, ఆదాయం సర్టిఫికెట్లు తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – అభిదా, కణేకల్లు క్రాస్, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా తొమ్మిదేళ్ల తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫ్యామీలీ మెంబర్ సర్టిఫికెట్ లేకపోవడంతో కుటుంబ ఆస్తుల కోసం తగాదాలు చోటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం తొమ్మిదేళ్ల క్రితం ఆఫీసుల చుట్టూ తిరిగినా అది ఇక రాదని ఆశ వదులుకున్నాం. ఇక మా కుటుంబం బతుకింతే అనుకున్నాం. కొద్ది రోజుల కిందట మా ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది, వలంటీరుకు మా పరిస్థితి వివరించాం. వివరాలు తీసుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకు సురక్ష క్యాంపులో ఫ్యామిలీ సర్టిఫికెట్ అందించారు. తొమ్మిదేళ్ల మా ఇబ్బందులకు పరిష్కారం చూపించారు. – సాసబోయిన దాసు, ప్రైవేటు ఉద్యోగి, గెడ్డవీధి, జ్ఞానాపురం, విశాఖ జిల్లా కొత్త రేషన్ కార్డు వచ్చింది మాది వ్యవసాయ కూలి కుటుంబం. మా తెల్లరేషన్ కార్డులో నేను, నా భర్త సాగర్, మా అత్తమామలు యాకోబు, రాణి, మరిది మధు ఉన్నాం. గతంలో ఎన్నోసార్లు రేషన్‌కార్డు డివైడ్ చేయాలని కోరినా ఫలితం లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వారం క్రితం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మా ఇంటికొచ్చారు. సమస్య చెప్పాం. నాకు, నా భర్తకు కలిపి వేరే కార్డు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – దుడ్డు ఇందు, ఎండుగుంపాలెం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా -
సారీ.. సారా
వెంకటనగరం వంటి ఆదర్శ గ్రామాలెన్నో.. ప్రభుత్వ యంత్రాంగం కృషితో రాజమండ్రి సమీపంలోని వెంకటనగరం గ్రామం పూర్తి సారా రహిత గ్రామంగా మారింది. ఈ గ్రామం ఒకప్పుడు నాటుసారాకు అడ్డాగా ఉండేది. 741 కుటుంబాలున్న ఆ గ్రామంలో 55 కుటుంబాలు నాటుసారా తయారీనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయి. 30 ఏళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలు చేసిన వీరిలో మూడున్నరేళ్లుగా మార్పు మొదలైంది. ఎస్ఈబీ పరివర్తన–2 కార్యక్రమంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోడుకావడంతో గతేడాది ఏప్రిల్ నుంచి సారా రహిత గ్రామంగా మార్పుచెందింది. నిజానికి.. రాష్ట్రంలో నాటుసారా స్థావరాలకు తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. గోకవరం, రాజానగరం, గండేపల్లి, కాతేరు, రామవరం, శాటిలైట్ సిటీ, కోరుకొండ, సీతానగరం వంటి 240 గ్రామాల్లో నాటుసారా ఏరులై పారేది. దీని నియంత్రణకు ప్రభుత్వం ‘పరివర్తన 2.0’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేసింది. దీంతో పది గ్రామాలు మినహా 230 గ్రామాలు ఇప్పుడు సారాకు టాటా చెప్పి సంక్షేమబాట పట్టాయి. ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధి మరోవైపు.. సామాజిక రుగ్మతగా మారిన సారాపై ప్రభుత్వం సంధించిన సంక్షేమాస్త్రం మంచి ఫలితాలిస్తోంది. మూడు దశాబ్దాల పూర్వం నుంచి ‘తూర్పు’న సాగిన సారా ప్రవాహానికి మూడున్నరేళ్లలో అడ్డుకట్ట పడటంతో ఆ గ్రామాల్లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. సారా మహమ్మారి నుంచి బయటపడిన అనేక కుటుంబాల స్వయం ఉపాధికి ప్రభు త్వం ఊతమిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ‘నవరత్నాలు’ ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందుతున్నాయి. దీనికితోడు డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమల శాఖలు కూడా అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆదుకుంటున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పలు శాఖలను సమన్వయంతో వారి జీవనోపాధికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 128 కుటుంబాలకు రూ.1.47 కోట్ల సబ్సిడీ రుణాలు అందించారు. ఫలితంగా.. వారు గేదెలు, కోళ్ల పెంపకం, కిరాణా, పాన్‌షాప్, హోటల్ వంటి వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమల శాఖ ద్వారా చిన్న తరహా యూనిట్ల ఏర్పాటు నిమిత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.1.01కోట్లు మంజూరు చేశారు. వారంతా పేపర్ప్లేట్లు, అప్పడాల తయారీ, ఎంబ్రాయిడరీ వర్క్, సెంట్రింగ్ వర్క్, టెంట్‌హౌస్, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో స్వీటు కొట్టు పెట్టుకున్నా.. ప్రభుత్వం నాకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఆ డబ్బుతో స్వీటు కొట్టు పెట్టుకుని పూతరేకులు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ప్రమోదకు ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ ఇస్తోంది. అమ్మఒడి కూడా వస్తోంది. నన్ను ఆర్థికంగా ఆదుకుని నా కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మేలు ఎప్పటికీ మరిచిపోం. – పల్లి అంబేడ్కర్, మద్దూరులంక గ్రామం కొంతమూరుకు చెందిన సాలా జోగమ్మ కుటుంబం పదేళ్లకు పైగా సారా తయారీ, విక్రయాలపైనే ఆధారపడి బతికేది. ఆమె పెద్ద కొడుకు బలరామ్‌పై ఏడు కేసులు, చిన్న కొడుకు వెంకన్నపై నాలుగు కేసులు ఉండేవి. సారా తయారీపై వచ్చిన డబ్బులు కేసులు, బెయిల్ ఖర్చులకే సరిపోయేవి. చివరకు ఆ కుటుంబం అప్పులపాలైంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారుల కౌన్సెలింగ్‌లో సారాకు స్వస్తిపలికి చిన్నబడ్డీ పెట్టుకుని జోగమ్మ జీవిస్తోంది. భర్త శ్రీను, కొడుకు బలరామ్లు పందుల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిపై ఉన్న సారా కేసులను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. డ్వాక్రా ద్వారా సాయం అందింది. సారా విక్రయాలు ఆపేసిన తనకు బతుకుదెరువు కోసం అధికారులు రూ.3 లక్షల సాయం అందించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు జోగమ్మ చెప్పింది. కవలగొయ్యికి చెందిన తీగిరెడ్డి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి సారా విక్రయించేవాడు. చదువుకు స్వస్తిచెప్పి సారా తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాడు. అతనిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సారాపై ప్రధాన దృష్టిసారించి ‘పరివర్తన’ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో సారా తయారీ, విక్రయాలకు శ్రీనివాస్ స్వస్తి పలికాడు. ప్రభుత్వం అందించిన రూ.50వేల సాయంతో టిఫిన్ బండి పెట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. అతని భార్య గంగాభవానీకి ప్రభుత్వం రూ.5 లక్షలు (రూ.1.50లక్షలు సబ్సిడీ) లోను ఇవ్వడంతో టైలరింగ్ చేసుకుంటోంది. అంతేకాదు.. డ్వాక్రాలో ఉన్న ఆమెకు ఏటా రూ.10వేలు ప్రభుత్వ సాయంతోపాటు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందుకుంటోంది. వీరి కుమారులకు జగనన్న విద్యా దీవెన, విద్యా కానుకలు మూడేళ్లుగా అందుతున్నాయి. ఇలా.. సర్కారు అందిస్తున్న సంక్షేమంతో శ్రీనివాస్ సారాకు సారీ చెప్పేశాడు. వీరే కాదు.. వెంకటనగరం గ్రామానికి చెందిన గుమ్మడి నాగరాజు (నాని) పది గేదెలను పెంచుతూ పాలవ్యాపారం చేస్తున్నాడు.. ♦ అదే గ్రామానికి చెందిన మగ్గం రాంబాబు తాపీ పనికి, వెళ్తున్నాడు.. ♦ రాజమండ్రి రాజీవ్ గృహకల్ప శాటిలైట్ సిటీకి చెందిన మార్గాని వీర్రాజు హోటల్ నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ♦ శాటిలైట్ సిటీ ‘బీ–బ్లాక్’కు చెందిన బచ్చు అంజిబాబు కిరాణా, కిళ్లీ షాపుతోపాటు కోళ్ల పెంపకం చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నాడు.. ♦ లాలా చెరువు కాలనీకి చెందిన గరుగుమిల్లి శ్రీనివాసరావు రెండు గేదెలు, ఆవులు, 40 కోళ్లను పెంచుతూ నెలకు దాదాపు రూ.40వేలు సంపాదిస్తున్నాడు.. ♦ రాజీవ్ గృహకల్ప నివాసి పసల సూర్యచంద్రరావు పాన్‌షాపు నిర్వహిస్తూ గౌరవంగా జీవిస్తున్నాడు. ♦ ఇలా అనేకమంది నాటుసారా విష వలయం నుంచి బయటకొచ్చి స్వయం ఉపాధితో ఆనందంగా జీవిస్తున్నారు. - తూర్పుగోదావరి నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు -
మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలోగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మే 9వతేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నమోదైన సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ సేవలు, పథకాలపై ఆరా తీయడం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారని, సేవల్లో సమస్యలు, సలహాలను నేరుగా తెలియచేయవచ్చని వెల్లడించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉద్దేశం, ఆశయాలు, లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. హెల్ప్‌లైన్ నంబర్ 1902 మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశ పెడుతున్నాం. ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశాం. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి అయిన నా పేరు జోడించారంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే ‘జగనన్నకు చెబుదాం..’! సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సమస్యను నమోదు చేసుకుంటే అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి. సీఎంవో నుంచి మండలాల వరకూ పర్యవేక్షణ యూనిట్లు సీఎంవో, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి. వీటిని కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. సమస్య పరిష్కారంలో క్వాలిటీ పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంవో కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదవుతాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సమస్యల పరిష్కారంపై ప్రజలకు అప్డేట్స్ తమ సమస్యల పరిష్కారంపై ఐవీఆర్ఎస్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రజలకు క్రమం తప్పకుండా అప్డేట్స్ అందుతాయి. అంతేకాకుండా ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా వలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి చెబుతారు. ప్రతేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్‌లు సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును కలెక్టర్లతో కలసి పర్యవేక్షిస్తారు. సమస్యల పరిష్కారాల తీరును ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును గమనిస్తారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి చెందకుంటే తిరిగి ఓపెన్ చేస్తారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు. పరిష్కారం తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు. చీఫ్ సెక్రటరీ, సీఎంవో, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది. ప్రతి కలెక్టర్‌కు తక్షణం రూ.3 కోట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అధికారులపై ఆధారపడే విధులను నిర్వహిస్తారు. మీరు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధంగా పని చేసినట్లే. అప్పుడే ఈ కార్యక్రమం చక్కగా సాగుతున్నట్లు లెక్క. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశం. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్లను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది. అవసరమైన చోట ఈ డబ్బులను ఖర్చు చేయవచ్చు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం. గ్రామ స్థాయిలో అన్ని అంశాలపై దృష్టి కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెడతారు. దీనివల్ల వేగంగా గ్రీవెన్స్ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్.. అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు. గ్రామాలలో ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారిస్తారు. ఇవి సక్రమంగా పనిచేస్తే గ్రామస్ధాయిలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. అవి సమర్థంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే మానిటరింగ్ కమిటీలతో పాటు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్‌బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, సెర్ఫ్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ నివాస్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్‌బాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, డీఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి కేంద్ర బృందం కితాబు.. దేశమంతటా సచివాలయాలు
గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమైన, వినూత్న చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూనే ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం ఒక సాహసోపేతమైన ప్రయోగం. మొత్తంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. – కేంద్రానికి నిపుణుల బృందం నివేదిక నిన్న ఆర్బీకేలు.. నేడు గ్రామ సచివాలయాలు!.. వ్యవసాయ ఉపకరణాల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల దాకా.. అవసరం ఏదైనా సరే ఆగమేఘాలపై సేవలు అందిస్తున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం సాకారమైంది.. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలన్నీ సర్వత్రా ప్రశంసలు అందుకోగా దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నదాతలకు ఆర్బీకేలు అందిస్తున్న సేవల పట్ల ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభినందనలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు సమర్ధంగా ప్రజలకు చేరే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిఫుణుల కమిటీ సూచించింది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ కార్యదర్శి ఆరుణాశర్మ, తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ నేతృత్వంలో సామాజిక, ఆర్థికాభివద్ది, సోషల్ ఇంజనీరింగ్ తదితర రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది ఓ కమిటినీ నియమించింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఫిబ్రవరి 17 – 27వ తేదీల మధ్య నలుగురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీల్లో పర్యటించింది. క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సొంత పథకాలతో మరింత సాయం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సహా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న విధానాలను అనుసరిస్తూ ప్రత్యేక స్థానంలో నిలిచిందని కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. రెండు విధానాలు మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ఆంధ్రప్రదేశ్ పలు సొంత పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం ఇందులో ఒకటి. ఇక రెండోది.. కేంద్ర పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించే ఆర్థిక సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరింత అదనపు సాయాన్ని జోడిస్తోంది. తద్వారా కేంద్రం నిర్దేశించిన దానికంటే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నట్లు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. పింఛన్ల పంపిణీ విధానం అనుసరణీయం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే రూ.2,500 – రూ.10,000 చొప్పున వివిధ కేటగిరీల వారికి సామాజిక పింఛన్లను టంచన్‌గా పంపిణీ చేయడాన్ని నిపుణుల కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో సైతం లేని విధంగా భారీ స్థాయిలో ప్రతి నెలా దాదాపు 62 లక్షల మందికి సక్రమంగా పింఛన్ల పంపిణీ జరుగుతున్న విషయాన్ని నివేదికలో ఉదహరించింది. పేదలకు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తోందని తెలిపింది. ప్రతి నెలా ఒకటవ తేదీ సాయంత్రం 3 – 4 గంటలకే 90 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతోందని, ఎలాంటి పడిగాపులు లేకుండా వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే డబ్బులు అందిస్తున్నారని ప్రశంసించింది. వివిధ కారణాలతో మిగిలిపోయిన మరో పది శాతం మందికి రెండు మూడు రోజుల్లోగా ఇళ్ల వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీలో ఈ విధానాన్ని అమలు చేయడం పేదలకు ఎంతో ప్రయోజనకరమని కమిటీ కేంద్రానికి సూచన చేసింది. సచివాలయ ఉద్యోగుల సేవలతో.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల తరహాలో దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలు కోసం సిబ్బంది నియామక నిష్పత్తిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో కేంద్రానికి సూచించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో దాదాపు పది మంది ఉద్యోగులు పని చేస్తుండడాన్ని కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం, కార్యక్రమాన్ని అమలు చేసినా క్షేత్రస్థాయిలో సమర్ధంగా అందాలంటే గ్రామ స్థాయిలో తగినంత మంది సిబ్బంది అవసరమని కమిటీ పేర్కొంది. ‘పంచాయతీల స్థాయిలో సచివాలయ భావనతోపాటు ఉద్యోగులు రోజూ నిర్ణీత సమయం కార్యాలయంలో అందుబాటులో ఉండడం వల్ల ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్మెంట్లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది. ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట. సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్‌కంటాక్స్ పేయర్స్ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట. ఈ కార్పొరేట్ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఇన్‌కంటాక్స్ పేయర్స్‌కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు) ఇంతకీ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్‌మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ కథారచయిత, విమర్శకులు -
మీ వెంటే మేమంతా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజా సంక్షేమానికై అహర్నిశలూ శ్రమిస్తున్న జగనన్న వెంటే తామంతా నడుస్తామని నాయకులతో ప్రజలు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
పథకాలకు దూరమైన వారికీ సువర్ణావకాశం
-
దుష్ప్రచారం చేసిన వ్యక్తిని విచారించిన సీఐడీ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు షేర్ చేసి, వైరల్ చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లా బోరుబద్ర రామాలయం గుడి ప్రాంతానికి చెందిన ఎ.వెంకటేష్‌ను గురువారం సీఐడీ గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేసే అతను సోషల్ మీడియా ద్వారా పలువురికి పంపించినట్లు గుర్తించారు. దీంతో అతనికి నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ గుంటూరు అధికారి ఒకరు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అతనికి సూచించినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం చేసిన పలువురిని గుర్తిస్తున్నామని వివరించారు. -
గడప గడపనా ఆదరణ
సాక్షి నెట్వర్క్: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. బుధవారం ఎనిమిదవ రోజు అన్ని జిల్లాల్లో కార్యక్రమం కొనసాగింది. మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రజలకు కలిగిన లబ్ధిని వివరిస్తూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు సాగారు. తమకు ఏమేరకు లబ్ధి కలిగిందో ప్రజలు సైతం ఉత్సాహంగా వివరించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో ఈ కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై పలు సమస్యలను పరిష్కరించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. -
ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న జనసేన సర్పంచ్
మొగల్తూరు: పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందుతున్నాయనడానికి నిదర్శనమే పేరుపాలెం వెంకన్న. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామ సర్పంచ్‌గా జనసేన పార్టీ మద్దతుతో వెంకన్న ఎన్నికయ్యారు. ఆయన, కుటుంబసభ్యులు వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750, వైఎస్సార్ చేదోడు కింద రూ.10 వేలు, రైతు భరోసా కింద రూ.16,500 లబ్ధిపొందారు. గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గ్రామ సర్పంచ్‌కి ప్రభుత్వం అందిస్తున్న వివరాలు తెలిపే బ్రోచర్‌ను సోమవారం అందించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం వెల్లడించారు. -
ఎందుకీ కడుపుమంట? తాగుబోతు రాతలేల?
ఏది నిజం? గతంలో కనిష్టంగా 180 మిల్లీలీటర్ల మద్యం బాటిళ్లు మాత్రమే దొరికేవి. ఇప్పుడు దాన్ని సగానికి.. అంటే 90 మిల్లీలీటర్లకు తగ్గించి, రేటు కూడా తగ్గించి అమ్ముతున్నారు. కానీ ఇలా చెయ్యటం ‘ఈనాడు’కు అస్సలు నచ్చటం లేదు. బీరు బాటిళ్లూ అంతే! ఇప్పుడు విక్రయిస్తున్న 650 ఎంఎల్ సైజు సగానికి తగ్గించి..330 ఎంఎల్ టిన్లను విక్రయిస్తున్నారు. ఇది కూడా ‘ఈనాడు’కు నచ్చటం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది.. ఎక్కువ బాటిళ్లు కొనుక్కుని తాగేస్తారట? నిజానికి రామోజీరావుకో, ‘ఈనాడు’కో నచ్చనిది మద్యం బాటిల్ సైజు తగ్గించటమో, దాని ధర తగ్గించటమో కాదు!!. తన సహచరుడు, తన సామాజిక వర్గానికి చెందిన బాబు... ఏపీ ముఖ్యమంత్రి కాకపోవటమే!. పైపెచ్చు మద్య నియంత్రణ చేపడతానన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ వెళుతుండటమే. ఓ వైపు మద్యం వినియోగం గణనీయంగా తగ్గుతున్నా.. దానిపై ప్రభుత్వానికొచ్చే ఆదాయం తగ్గకపోవటమే!. ఆదాయం తగ్గి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతే... అప్పుడైనా తన చంద్రబాబుకు కాలం కలిసొస్తుందన్న ఆశ రామోజీది!. అది నెరవేరటం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఫలితమే పతాక శీర్షికన ‘మద్య నిషాధ’ రాతలు. మరి ఈ నిషా రాతల్లో వాస్తవమెంత? ఏది నిజం? సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని దశలవారీ పూర్తిగా నియంత్రించాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికి తగ్గట్టే అధికారం చేపట్టాక చర్యలు మొదలెట్టారు. 43 వేల బెల్ట్ షాపులపై వేటు వేశారు. 4,408 పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. దుకాణాల సంఖ్యను ఈ రెండేళ్లలో మూడోవంతు తగ్గించారు. అవి తెరిచి ఉంచే వేళలనూ కుదించారు. కల్తీలకు చోటు లేకుండా దుకాణాల్ని నేరుగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ఫలితం.. మద్యం అమ్మకాలు ఏకంగా 40 శాతం తగ్గాయి. బాబు పాలనలో 2018 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలో 3.12 కోట్ల కేసుల లిక్కర్ విక్రయిస్తే.. ఆ తరువాతి 12 నెలల్లో విక్రయించింది కేవలం 1.88 కోట్ల కేసులు. ఆ తరువాతి ఏడాది... అంటే 2020–21 అక్టోబర్ మధ్య ఈ సంఖ్య 1.72 కోట్ల కేసులకు తగ్గింది. మరి ఇంతలా తగ్గుతుంటే రామోజీకి కడుపుమంట ఎందుకట? మద్యం విక్రయాలు పెంచేస్తున్నారంటూ గగ్గోలు ఏల? ఎందుకంటే అధికారంలో ఉన్నది వైఎస్ జగన్ కాబట్టి!!. సైజు తగ్గించటం జనం మంచికి కాదా? 180 ఎంఎల్ మద్యం సీసాలు మాత్రమే దొరికితే... పేదలు, మద్యం ప్రియులు స్థోమత లేకున్నా వాటినే కొనేవారు. కొన్నందుకు తాగేవారు. బీరు కూడా 650 ఎంఎల్ సీసాలే విక్రయిస్తున్నారు. తాగేవారు స్థోమత లేకున్నా వీటినే కొని తాగాల్సి వస్తోంది. తక్కువ తాగితే ఆరోగ్యం, జేబు బాగుంటాయన్న ఉద్దేశంతోనే 90 ఎంఎల్ సీసాలు, 330 ఎంఎల్ బీర్ టిన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అందరికీ ఈ నిర్ణయం మంచిదే అనిపిస్తున్నా... ‘ఈనాడు’కు మాత్రం నచ్చటం లేదు. అందరూ 180 ఎంఎల్ లిక్కర్, 650 ఎంఎల్ బీరు తాగాల్సిందేనని ‘ఈనాడు’ చేస్తున్న వాదన లోగుట్టు అందరికీ తెలిసిందే. కుర్చీలో ఉన్నది తమవాడు కాకుంటే పాజిటివ్‌లు కూడా నెగిటివ్ అయిపోతాయన్నది అర్థమవుతున్న కథే. వాకిన్ షాపులు... ఫిలిం సిటీలోనే ఉండాలా? మద్యంతో నిరుపేదల ఇళ్లు, ఒళ్లు గుల్ల కాకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రతిరూపమే ‘వాకిన్ స్టోర్స్’. నిజానికి రామోజీ హోటళ్లలో ఉండే బార్లు ఒక రకంగా వాకిన్ స్టోర్లే. అక్కడకు వెళ్లిన వారు నచ్చిన మద్యాన్ని కొనుక్కోవచ్చు!. రాష్ట్రంలోని మాల్స్‌లో ఇలా వాకిన్ స్టోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయటం మాత్రం రామోజీకి నచ్చటం లేదు. ఇది కూడా మద్యం విక్రయాలను పెంచటానికేనన్నది ‘ఈనాడు’ భాష్యం. ఫుల్ బాటిళ్లనే విక్రయించే ఈ స్టోర్లకు ఎగువ మధ్యతరగతి, ఉన్నతవర్గాల వారే వెళతారని, పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల వారు వాటి జోలికెళ్లేందుకు సాహసించరని రామోజీకి తెలియదా? దీనివల్ల ఆయా వర్గాల్లో మద్యపానం తగ్గుతుందనేది వేరే చెప్పాలా? బాబు మాదిరి విచ్చలవిడిగా బెల్టు దుకాణాల్ని పెంచటమే మంచిదా? మద్యం విక్రయాలు తగ్గాయని చెబుతున్న అధికారిక లెక్కలు వీళ్లకు కనిపించవా? వాస్తవాలు అక్కర్లేదా? ఎందుకీ సా‘రాతలు’? సారా విక్రయాలు పెరిగితే మాత్రం నష్టమేంటన్న రీతిలో రాసిన ‘ఈనాడు’ రాతలు దాని దిగజారుడుకు పరాకాష్టే. వారిని సారాకు దూరం చేయటానికే 90 ఎంఎల్ సీసాలు తెస్తున్నారనే వాదనా బాధ్యతారాహిత్యమే. ఒకప్పుడు సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర రామోజీది. కాకపోతే అదంతా తన వ్యాపార ప్రయోజనాల కోసమేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఇప్పుడాయన సారాను ప్రోత్సహించినా ఆశ్చర్యపోవటం లేదెవ్వరూ!. 1994కు ముందు ఎన్టీఆర్‌తో కలిసి మద్య నిషేధం ఎందుకు అవసరమో రెచ్చిపోయి మరీ అచ్చేసిన ఘనత ‘ఈనాడు’ది. 1995లో బాబుతో కలిసి మద్యం ఎందుకు అవసరమో రాసి మరీ చెప్పింది కూడా రామోజీయే. ఈ రామోజీ మార్కు రాజకీయంలో మోసపోయింది రాష్ట్రమే. కాకుంటే ముఖ్యమంత్రి జగన్ తీరు అది కాదు. చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లటమే ఆయన నైజం. ఇదే నిజం!!. కొన్ని వాస్తవాలివిగో... ► 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండేవి. ఈ రెండేళ్లలో వీటి సంఖ్య 33% అంటే 1,433 దుకాణాలు తగ్గాయి. ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. ► టీడీపీ హయాంలో రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,408 పర్మిట్ రూమ్‌లు ఉండేవి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ రద్దు చేసింది. ►గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేవారు. దాన్ని మార్చి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే తెరుస్తున్నారిప్పుడు. ► టీడీపీ అధికారంలో ఉన్న 2019 మేతో పోలిస్తే 2021, ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గగా... బీర్ అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి. అప్పట్లో ఏడాదికి 3.12 కోట్ల లిక్కర్ కేసులు విక్రయించగా... ఇప్పుడది 1.72 కోట్ల కేసులకు తగ్గింది. ► బాబు హయాంలో ఏటా 2.44 కోట్ల బీరు కేసుల్ని విక్రయించగా... ఇప్పుడా సంఖ్య 52 లక్షల కేసులకు చేరింది. ఏకంగా 78శాతం తగ్గాయి మరి. -
వడివడిగా ‘ఈ పంట’ నమోదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి ఏ రాయితీ పొందాలన్నా ‘ఈ క్రాప్’ తప్పనిసరి కావడంతో రైతు భరోసా కేంద్రాల వద్ద పంటల నమోదుకు రైతన్నలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రతీ ఎకరం వివరాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పంట నమోదును చేపట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుతోపాటు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా పొందేందుకు ఈ క్రాపే ప్రామాణికం. అన్నిటికీ అదే ఆధారం కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ పంట నమోదు వేగం పుంజుకుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 92.21 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 57.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 22.05 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టారు. ఇప్పటివరకు ఈ క్రాప్ ఇలా.. వ్యవసాయ పంటల విషయానికి వస్తే 13 లక్షల ఎకరాల్లో వరి, 2.17 లక్షల ఎకరాల్లో ముతక ధాన్యాలు, 2.80 లక్షల ఎకరాల్లో అపరాలు, 9.91 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 6.74 లక్షల ఎకరాల్లో ఇతర పంటల వివరాల నమోదు (ఈ క్రాపింగ్) పూర్తి చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 34.62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలతో పాటు 7.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో కలిపి మొత్తం 42.15 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ పూర్తయింది. ఆర్బీ యూడీపీ యాప్‌లో ఎన్నో ప్రత్యేకతలు మరింత సాంకేతికత జోడించి కొత్తగా తెచ్చిన రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. యూడీపీ యాప్ ద్వారా ఈ–కేవైసీ చేస్తున్నారు. ఏ పంట వేశారు? ఎప్పుడు కోతకు వస్తుందో కూడా తెలిసేలా యాప్‌ను డిజైన్ చేశారు. పంట వివరాలను నమోదు చేయగానే డిజిటల్ కాపీని రైతులకు అందిస్తున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. ముందుగానే రైతులు వివరాలను నమోదు చేసుకోవడం వలన ఎన్ని సర్వే నెంబర్లలో ఈ పంట నమోదు చేశారు? ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో వెంటనే తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ పంట నమోదుకు దూరంగా ఉన్న భూముల వివరాలను కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేనివి, పూర్వీకుల నుంచి డాక్యుమెంట్ల ద్వారా వారసులకు దాఖలైనవి, నోటిమాట ఒప్పందాల ప్రకారం వారసులు సాగు చేస్తున్నవి, కౌలు, దేవదాయ, చుక్కల భూముల వివరాలను సైతం ఈ పంటలో నమోదు చేస్తుండడంతో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎలా నమోదు చేసుకోవాలంటే.. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యాప్‌పై రైతు భరోసా కేంద్రాల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. విత్తనం వేయగానే ప్రతీ రైతు ఆర్బీకేలో పంట వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న 15 రోజుల తర్వాత గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల్లో ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల ఫొటోలను తీస్తున్నారు. ఆ వివరాలతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ను రైతు స్మార్ట్ ఫోన్‌కు పంపిస్తున్నారు. గ్రామ పరిధిలో ఎంతమంది రైతులున్నారు? ఎవరు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో యా‹ప్లో కనిపిస్తుంది. ఈ క్రాప్‌పై అవగాహన కల్పించి దశల వారీగా నమోదును పెంచడానికి వ్యవసాయ శాఖ వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. ఈ క్రాప్ ఆవశ్యకతపై దండోరా వేయిస్తున్నారు. యాప్‌లో ఒకసారి నమోదు చేస్తే సీజన్ ముగిసే వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపకరిస్తుంది. పంట నమోదు తప్పనిసరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు పొందాలంటే పంటల నమోదు (ఈ క్రాప్) తప్పనిసరి. ఈ సారి కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆర్బీ యూడీïపీ యాప్‌లో నమోదు చేసుకుంటే రసీదు కూడా ఇస్తారు. ఈ రసీదు ఉంటే చాలు పంట రుణం, పంటల బీమా, పరిహారం ఏదైనా పొందొచ్చు. కనీస మద్దతు ధరకు దర్జాగా అమ్ముకోవచ్చు. ఖరీఫ్‌లో రైతులందరూ విధిగా తమ పంట వివరాలను ఆర్బీకే సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
'సంక్షేమ' వ్యయాలను నిర్దేశించలేరు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి.. వాటికి ఎలా ఖర్చు చేయాలన్న విషయాలను న్యాయస్థానాలు నిర్దేశించజాలవని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఆదాయ, వ్యయాల వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వాల పరిధిలోని అంశాలని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాలన్నీ సంచితనిధికే వెళతాయని వివరించారు. ఆదాయాలను సంచితనిధిలో జమ చేయకుండా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)కు బదలాయిస్తున్నామంటూ పిటిషనర్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకే ఏపీఎస్డీసీని తీసుకొచ్చారని వివరించారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అయితే ఆ తీర్పుల కాపీలు తమ ముందుకు రాకపోవడంతో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎస్డీసీ చట్టంలోని సెక్షన్ 12(1)(4), (5)లను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యజమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ, ఆదాయాలను సంచితనిధిలో జమ చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రూ.25వేల కోట్ల రుణం కోసం విశాఖపట్నంలోని ప్రభుత్వ భూములు, భవనాలను తనఖా పెట్టేందుకు వీలుగా వాటిని ఉచితంగా ఏపీఎస్డీసీకి బదలాయిస్తోందని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ వాదనలను తోసిపుచ్చారు. ఆదాయ, వ్యయాల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందన్నారు. చట్ట ప్రకారం చేసే వ్యయాలపై ఆడిట్ ఉంటుందని తెలిపారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
శభాష్ వలంటీర్... సేవా సైన్యం..
అది కృష్ణా జిల్లా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని వరలక్ష్మీపురం, తులసీ నగర్ ప్రాంతం. అక్కడ మొత్తం 123 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో మెజారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులవే. అక్కడి వలంటీరు ఇంటింటి సర్వేకి వెళితే వలంటీర్ల సేవలు మాకేమీ వద్దంటూ వారి వివరాలు కూడా ఇవ్వలేదు. అయినా వలంటీర్ తన పని తాను చేసుకుంటూ పోయారు. ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా వలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి ఆ ప్రాంతంలోని తెలుగుదేశం కుటుంబాలు విస్తుపోయాయి. వారిలో మార్పు వచ్చింది. తమ వివరాలు వారే స్వయంగా వలంటీర్‌కు అందజేశారు. ఇప్పుడు తమకు ఏ సమాచారం కావాలన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఏ పని ఉన్నా వలంటీర్‌కు ఫోన్ చేస్తున్నారు. వలంటీర్లంటే జన్మభూమి తమ్ముళ్ల మాదిరిగా ఉంటారనుకుని పొరపాటుపడ్డామని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. వ్యవస్థలో వస్తున్న మార్పునకు ఇదో సూచిక.. అది గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామం. ఈ గ్రామంలో నివాసముంటున్న పదర నాగేశ్వరరావు కుటుంబానికి అమ్మ ఒడి డబ్బు రెండుసార్లు అందింది. రైతు భరోసా పథకానికి కూడా అర్హత ఉండడంతో స్థానిక రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా వలంటీర్ సమాచారమిచ్చారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ఇటీవలి ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికలలో ఆయన పోటీ చేశారు కూడా. ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రమాణంగా ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ.. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ అద్వితీయమైన సేవలందిస్తోంది. అనతికాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక ఇది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాన్ని చేపట్టి వారికి నిర్దిష్టమైన బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారమైనా.. సెలవు రోజైనా.. ఎండైనా, వానైనా లెక్క చేయకుండా వలంటీర్లు పూర్తి సేవా దృక్పథంతో విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. కులమతాలు, రాజకీయాలు, ప్రాంతాలు, పార్టీలు, పైరవీలు, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయి. సంతృప్తస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయి. గడచిన రెండేళ్లలో 31 రకాల సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధిదారులకు చేరాయి. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావులేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలు, ప్రభుత్వ సహాయం వారికి చేరే వరకు అంతా పారదర్శకమే. ప్రభుత్వ సమాచారం.. గంటలోనే అందరికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ► వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకున్నా, ప్రకటించినా కేవలం గంట వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ చేరుతోంది. ప్రతి వలంటీరు తమ పరిధిలోని కుటుంబాలన్నింటితో వాట్సాప్, టెలిగ్రామ్‌లతో అనుసంధానమై ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం కేవలం 5 నిమిషాల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిపోతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఆ సమాచారాన్ని వెంటనే వలంటీర్లకు చేరవేస్తున్నాయి. ఆ తర్వాత ఆ సమాచారం రాష్ట్రంలోని 1.48 లక్షల కుటుంబాలకు చేరిపోతుంది. స్మార్ట్ ఫోను లేని కుటుంబాలకు వలంటీర్లు నేరుగా వెళ్లి తెలియజేస్తున్నారు. ► కరోనా విపత్తు నేపథ్యంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జ్వరాలతో బాధపడే వ్యక్తులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, కేవలం మూడు రోజుల వ్యవధిలో జర్వాలతో బాధపడే వారిని గుర్తించడంతో పాటు, వారందరికీ కరోనా టెస్టు చేయించే ప్రక్రియ పూర్తి చేశారు. ► వలంటీర్ల వ్యవస్థ కారణంగా అందరికీ సమాచారాన్ని తెలియజేసి ఒకే రోజు రాష్ట్రంలో 6.28 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలే గానీ, రాష్ట్రంలోని 5 కోట్ల మందికి కేవలం నెల రోజుల వ్యవధిలో ఒక విడత వ్యాక్సినేషన్ పూర్తి చేసే సామర్థ్యం వలంటీర్ల వ్యవస్థకు ఉందని అధికారులు తెలిపారు. గడప వద్దకే ప్రభుత్వ సేవలు.. ఒకప్పుడు ప్రభుత్వంతో ఏ చిన్న పని ఉన్నా మండలాఫీసుల చుట్టూనో, జిల్లా కార్యాలయాల చుట్టూనో తిరగాల్సిన పరిస్థితి. వలంటీర్లు వచ్చిన తర్వాత ఆ తిప్పలు తప్పాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా.. వలంటీరే ఆ వివరాలు ప్రతి ఇంటికి వచ్చి చెప్పి, ఆ కుటుంబంలో ఎవరన్నా ఆ ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే వారే దరఖాస్తు కూడా పూర్తి చేసి, మంజూరయ్యాక ఆ వివరాలు చెప్పి వెళ్తున్నారు. ► అర్హత ఉంటే, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల కల్లా పింఛను, రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డును వలంటీరే దగ్గర ఉండి మంజూరు చేయిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు చేస్తున్నారు. ► ఒకప్పుడు అవ్వాతాతలు ప్రతి నెలా వారి పింఛన్ డబ్బులు తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు.. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ► కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ► పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా వలంటీర్ల వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం అడిగి తీసుకున్నాయి. తమ రాష్ట్రాలలోనూ అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నారు. ► వలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో వేగంగానూ, కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సేకరించిన తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ► అంతర్జాతీయంగానూ ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేసే యూఎన్ వలంటీర్ల విభాగం రాష్ట్రంలో అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థ పనితీరు నచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. సేవలకు తగిన గుర్తింపు.. వలంటీర్లు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 12న ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించారు. మూడు కేటగిరీలలో మొత్తం 2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం సత్కరించింది. మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు అవార్డులు అందించింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వలంటీర్లు అందిస్తున్న సేవలివీ.. వలంటీర్లు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ నెల మొదటి రోజే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం, సంక్షేమ పథకాల కోసం నవశకం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, కోవిడ్–19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే (ఇప్పటికి ఐదుసార్లు పూర్తిచేశారు), మాస్క్‌లు, మందులు, నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం, దిశ చట్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామ, వార్డు సచివాలయాలకు సహాయ సహకారాలు అందించడం, ప్రధానంగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కానుక, ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ బీమా, పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలాంటి కార్యక్రమాలను గ్రామ, వార్డు వలంటీర్లు నిర్వహిస్తున్నారు. రీస్టార్ట్‌తో తప్పిన కష్టాలు నేను, నా భర్త నాలుగేళ్ల క్రితం బూదవాడలో హర ఎక్స్‌పోర్ట్స్ పేరుతో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను రూ.1.50 కోట్లతో ప్రారంభించాం. 14 మంది పని చేస్తున్నారు. రాయితీ కోసం గత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయలేదు. కరోన వల్ల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ పథకం మమ్మల్ని గట్టెక్కించింది. 2020లో రూ.22.91 లక్షలు, విద్యుత్ రాయితీ రూ.17 లక్షలు విడుదలైంది. దీంతో కష్టాలు తప్పాయి. – నుసుం సుజాత, బూదవాడ, ఒంగోలు ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కోవిడ్–19 లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ)పరిశ్రమలను ఆదుకోవడానికి వైఎస్ జగన్ రూ.1,100 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. జగన్ పుణ్యమా అని.. నేను ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణిని. నా భర్త కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ (ప్రీ ప్రై మరీ) కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద అందిస్తున్న బలవర్థక ఆహారం నా లాంటి పేదోళ్లకు ఉపయోగ పడుతోంది. – తిరుమలశెట్టి శాంతి, చెన్నూరు హరిజనవాడ–3, గూడూరు రూరల్, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సంపూర్ణ పోషణ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోంది. నిలదొక్కుకుంటున్నాం నేను న్యాయవాది కావాలని, మా కుటుంబానికి అండగా ఉండాలని ‘లా’ చదివి 2018 నుంచి న్యాయవాదిగా కాకినాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. జూనియర్ న్యాయవాదిగా ఉండడంతో ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం కింద 2019 డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్ వస్తోంది. సీఎం జగనన్న పాదయాత్రలో మాకు ఇచి్చన హామీని నెరవేర్చినందుకు జూనియర్ న్యాయవాదులందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ స్టైఫండ్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – సాదే విష్ణు ప్రసన్న కుమారి, వాకలపూడి, కాకినాడ రూరల్ మండలం, తూ.గో వైఎస్సార్ లా నేస్తం న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వచ్చి, ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ న్యాయవాదులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 3న ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మూడేళ్లు, అంతకన్నా తక్కువ ప్రాక్టీస్ ఉన్న యువ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం యువ న్యాయవాదులకు నెల నెలా ఇలా స్టైఫెండ్ ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. దాదాపు 1,600 మంది యువ న్యాయవాదులు ఈ పథకం కింద ప్రతి నెలా లబ్ధిపొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.12.24 కోట్లు వెచ్చిందింది. కాగా, న్యాయవాదుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 కోట్లు బార్ కౌన్సిల్‌కు ఇచ్చింది. వైద్యం తర్వాతా సాయం నేను కూలి పనులు చేసుకుంటూ, వితంతు పింఛన్ సాయంతో జీవనం సాగిస్తుండేదానిని. నా భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేశాను. ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరిలో పక్షవాతం వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. మా ఊరికి చెందిన వారు నన్ను విజయవాడ తీసుకెళ్లి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పది రోజుల పాటు ఉచితంగా చికిత్స అందించారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాక నేను ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఆరు నెలల పాటు మొత్తంగా రూ.30 వేలు సాయం అందించారు. ఇది నా జీవనానికి ఎంతో భరోసా ఇచ్చింది. సీఎం జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటా. – బి.సీతమ్మ, పురిటిగడ్డ, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కుటుంబ పెద్ద ఏదైనా జబ్బుకు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాక కొంత కాలం పాటు పనులు చేసుకోలేడు. దీంతో ఆ కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఈ విషయంలో రోగులకు సహాయంగా ఉండేందుకు 2019 డిసెంబర్ 1న ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభించింది. చికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున, లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున సహాయం చేస్తోంది. అర్చకులకు తోడ్పాటు ఊళ్లో ఆంజనేయ స్వామి ఆలయ అర్చకునిగా పని చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అర్చకులకు తగిన గౌరవం ఇస్తూ.. వారి బాగోగుల పట్ల దృష్టి సారించింది. అర్చకుల వంశ పారంపర్యం హక్కును పునరుద్ధరించింది. కనీస గౌరవ వేతనాల్ని పెంచింది. – వైపీ ఆంజనేయులు, బసినేపల్లి, సీకే పల్లి మండలం, అనంతపురం జిల్లా మాకు మంచి రోజులు ఇమామ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. ప్రస్తుతం ఎంతో హుందాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని పెంచి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసింది. కరోనా సమయంలోనూ సాయం చేసింది. – హాఫిజ్ షబ్బీర్ అహమ్మద్, ఫిర్దోస్ మస్జిద్, పాతూరు, అనంతపురం పాస్టర్లకు భరోసా ఎంతో మంది పాస్టర్లు పేదరికంలోనూ సేవలందిస్తున్నారు. మా ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేలు వేతనం ఇస్తుండటం చాలా సంతోషం. దీంతో చర్చిలో మరింత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మాకూ భరోసా కల్పించింది. – మనుష్యే, రేమా చర్చి పాస్టర్, అనంతపురం అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లు, పాస్టర్లకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆలయాలు, మసీదులు, చర్చిలో పనిచేసే సిబ్బందికి గౌరవ వేతనాలను పెంచింది. లాక్డౌన్లో ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33,083 మంది అర్చకులకు, 13,646 మంది ఇమామ్, మౌజన్లకు, 29,841 మంది పాస్టర్లకు మొత్తం రూ.37.71 కోట్లను పంపిణీ చేసింది. వివక్ష చూపకుండా సాయం నా భర్త బొబ్బిలి రమణ పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా కత్తి జారి తలపై పడి మెదడుకు తీవ్ర గాయం కావడంతో 2020 డిసెంబర్ 1న మరణించాడు. దీంతో మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని వైఎస్సార్ బీమా పథకం ఎంతో ఆదుకుంది. మా కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటున్నప్పటికీ ఎటువంటి వివక్ష చూపకుండా రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు. – బొబ్బిలి సన్యాసమ్మ, రైవాడ, దేవరాపల్లి మండలం, విశాఖ జిల్లా వైఎస్సార్ బీమా కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులనే ఖర్చు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో 1.32 లక్షల (బియ్యం కార్డు ఉన్న) కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం అమలు చేస్తోంది. -
అవాంఛనీయ ఘటనల వెనుక రాజకీయ శక్తుల ప్రోద్బలం
సాక్షి, అమరావతి: రాజకీయ శక్తుల ప్రోద్బలంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రచారం రాకుండా, దారి మళ్లించడమే కొన్ని రాజకీయ శక్తుల లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం, వైఎస్ జగన్ లక్ష్యంగా కుట్రలు చేసిన శక్తులే ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు, వెనువెంటనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో నిమ్మగడ్డ రమేష్ సృష్టించిన రగడ ఈ అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. నిమ్మగడ్డ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారంటే.. ప్రజల దృష్టి మరల్చడానికే కుట్రపూరిత ఎత్తుగడలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రతిసారీ, ప్రజల దృష్టి మరల్చడానికి కొన్ని శక్తులు కుట్రపూరిత ఎత్తుగడలు వేస్తున్నాయి. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 31 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడం, 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి పునాది వేస్తున్న నేపథ్యంలో వెల్లువెత్తిన అక్కచెల్లెమ్మల ఆనందాన్ని, ప్రజా స్పందనను టీడీపీ ఓర్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ, దానికి ఏజెంట్లుగా ఉండే మరికొన్ని పార్టీలూ కలసి కుట్రపన్నాయి. ఆ కుట్రలో భాగంగానే.. ప్రజల సున్నితమైన మనోభావాలను దెబ్బతీసేలా దేవాలయాల్లో అపచారాలకు పాల్పడటం, విగ్రహాలను ధ్వంసం చేయడం, నష్టం కల్గించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పట్టాల పంపిణీ జరిగినంత కాలం ఇవి కొనసాగడం గమనించవలసిన విషయం. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకుని అమ్మ ఒడిపై కుట్ర పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం రెండో ఏడాది అమ్మ ఒడి అమలు చేస్తున్న తరుణంలో.. దేవాలయాలపై దాడులు ఆగిపోయాయి. ‘నిమ్మగడ్డ’ను అడ్డం పెట్టుకుని కొత్త ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు. గతంలో జేడీ లక్ష్మీనారాయణ మాదిరి ఇప్పుడు ఎల్లో మీడియా నిమ్మగడ్డను నెత్తికెత్తుకుంది. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం దక్కకుండా చేయడమే వీరి లక్ష్యం. నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం దురుద్దేశపూరితమే. మా ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధపడితే... మండల ఎన్నికలు రద్దు చేయడం, తిరిగి మధ్యలో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి కాకుండా.. పంచాయతీ ఎన్నికలకు కొత్తగా తేదీలు ప్రకటించడం ఎవరి ప్రయోజనం కోసం? కోవిడ్ వ్యాక్సిన్‌కు యావత్ దేశంతో పాటు రాష్ట్రం సన్నద్ధమవుతుంటే, ఉద్యోగులూ భయంతో ఎన్నికలు వద్దంటుంటే నిమ్మగడ్డకు ఎందుకీ పంతం? బాబు కోసం రాజ్యాంగ పదవిని దిగజార్చాలా? ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం ప్రజా సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం. దేవుడిపై ఆయనకు అత్యంత విశ్వాసం ఉంది. మతం వ్యక్తిగతం.. రాజకీయం ప్రజా సంక్షేమాన్ని కోరేదై ఉండాలన్న మా నేత మార్గదర్శకత్వంలో పార్టీ ముందుకెళ్తోంది. మతాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఈ దిశగా కుయుక్తులకు దిగే శక్తులను ఉపేక్షించబోం. 2024 ఎన్నికల నాటికి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో పరిపాలనను విశాఖకు తరలించే వీలుంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పాలన రాజధాని అనే నిర్ణయం ఎప్పుడో జరిగింది. కోర్టు కేసుల వల్లే ఆలస్యమవుతోంది. ఎన్నికల సంఘం ఉద్యోగులు కొందరిని నిమ్మగడ్డ తొలగించడం సమంజసం కాదు. -
సంకల్పం సాక్షిగా మార్పు
సాక్షి నెట్వర్క్ : ‘నిన్నటి కంటే ఈ రోజు బావుండాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా బావుండాలి. అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యం. మీ అందరి చల్లని దీవెనలతో రేపు ఆ మార్పు సాధిస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. 17 నెలలు తిరక్కుండానే ఆ మార్పును సాకారం చేశారు’ అని ఊరూరా ప్రజలు వైఎస్సార్సీపీ నేతల ఎదుట ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించాయి. ‘ప్రజల్లో నాడు–ప్రజల కోసం నేడు’ అంటూ భారీ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్ని ఆరా తీశారు. సమస్యలను ఆలకించారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గుంటూరులో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్సీ జంగా, ఎమ్మెల్యే ఎం. గిరిధర్ ► అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాదవ్, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ప్రజలు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్ జిల్లా రాయచోటిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లా– లక్ష్మీపురం మధ్య పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ర్యాలీలు చేపట్టారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్ ఇన్ని హామీలు నెరవేరుస్తారని అనుకోలేదని పలుచోట్ల ప్రజలు తెలిపారు. కృష్ణా జిల్లా వెణుతురుమిల్లిలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామ, గ్రామాన ప్రజలను కలుసుకున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రులు ఆళ్ల నాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాదయాత్రలో పాల్గొన్నారు. ► విజయనగరం జిల్లా మెట్టపల్లిలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాకలో ఎంపీ సత్యనారాయణ పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాదయాత్ర చేపట్టారు. -
దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు
చిలకలూరిపేట: దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ శ్మశానవాటికను ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అంతర్వేది వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు అంతర్వేది కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆపత్కాలంలో అండగా..
అనకాపల్లి: అనకాపల్లి.. గ్రామీణ విశాఖ జిల్లాలో ఓ ముఖ్య వ్యాపార కూడలి. జాతీయ స్థాయిలో బెల్లం మార్కెట్‌కు ప్రసిద్ధి. ఆధ్యాత్మికంగానూ పేరున్న చిన్న పట్టణం. అయితే ఆ పట్టణంలో కరోనా వైరస్ కలకలం రేపింది. లాక్డౌన్ నిబంధనలు సడలించాక కూడా జనతా కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితొచ్చింది. ఇలాంటి ఆపత్కాలంలో అనకాపల్లి ప్రజలకు వలంటీర్లు వెన్నంటి నిలిచారు. కరోనా నుంచి కాపాడే రక్షణ కవచాలయ్యారు. మార్చి 20వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. (దుర్గగుడి సిబ్బందికి కరోనా సెగ) కరోనా పాజిటివ్ వ్యక్తులకు వైద్యుల ద్వారా సకాలంలో వైద్యం అందిస్తుండటంతో రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. మొదట్లో కరోనా అంటే భయపడిపోయిన ప్రజలను వలంటీర్లు చైతన్యపరిచారు. తరచూ చేతుల శానిటేషన్, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తే మన దరిదాపులకు కూడా కరోనా రాదంటూ ధైర్యం చెప్పారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు వలంటీర్లు కూపన్లు ఇవ్వడం, ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి. ► ఐదుగురికి పాజిటివ్ రావడంతో వలంటీర్ మజ్జి ధనుంజయ్ అప్రమత్తమయ్యారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడంతో పాటు వారి కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్లో ఉంచారు. ఇంటింటికీ తిరుగుతూ కరోనా లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. నిత్యం బ్లీచింగ్ చల్లిస్తూ పారిశుద్ధ్య సమస్యల్లేకుండా చూస్తున్నారు. ► నలుగురికి పాజిటివ్ రావడంతో వలంటీర్ పొలమరశెట్టి జ్యోతి.. వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా చూశారు. ఇరుగుపొరుగులో ధైర్యం నింపి.. శానిటైజేషన్, మాస్క్‌లు, భౌతిక దూరం ఆవశ్యకతపై వారిని చైతన్య పరిచారు. ప్రస్తుత వర్షాకాలంలో విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదుకోవడంలో ముందున్నారు.. కరోనా సమయంలో మమ్మల్ని ఆదుకోవడంలో వలంటీర్లు ముందున్నారు. ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. సంక్షేమ పథకాలను ఇంటికే తెచ్చి అందిస్తున్నారు. – మజ్జి సూర్యకాంతం, కోట్నివీధి, అనకాపల్లి రేషన్ తీసుకోవడానికి సాయం.. కరోనా సమయంలో పెద్దవాళ్లు అస్సలు బయటకు రాకూడదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్లు బాగా అక్కరకొస్తున్నారు. పింఛన్ కూడా ఇళ్లకే తెచ్చిస్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇళ్లకొచ్చి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఏ ఇబ్బందీ లేకుండా రేషన్ తీసుకోవడంలో సాయపడుతున్నారు. – పల్లేల పద్మ, కుంచంగి గ్రామం, అనకాపల్లి మండలం -
భళా వలంటీర్!
కర్నూలు(అర్బన్): కరోనాను విజయవంతంగా ఎదుర్కొన గలుగుతున్నామంటే అది వలంటీర్ల పుణ్యమే. తరచూ ఇళ్లకు వచ్చి ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి ఆస్పత్రికి తరలించడంలో కీలకపాత్ర వారిదే. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం దగ్గర్నుంచి.. పరీక్షలు చేయించడం, క్వారంటైన్ చేయడం వరకూ ఇతర సిబ్బందితో కలిసి వీరు చేస్తున్న కృషి అభినందనీయం.. అంటూ ప్రజలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2,70,000 మంది వలంటీర్లు కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి అదనపు బలంగా మారారు. ట్రాకింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్లలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ కష్ట కాలంలో ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో జాతీయ మీడియా కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఈ నెల 15తో ఏడాది పూర్తయిన సందర్భంగా వారి సేవలు, కరోనా కష్టకాలంలో ఎలా పనిచేస్తున్నారన్న విషయాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఆదివారం కర్నూలు జిల్లా లద్దగిరిలో పర్యటించింది. వలంటీర్ల సేవలపై స్థానికులను ప్రశ్నించింది. ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ‘కరోనా నుంచి రక్షణ కవచాల్లా వలంటీర్లు మమ్మల్ని కాపాడుతున్నారు.. ప్రభుత్వ పథకాలను సైతం ఇళ్ల వద్దకే చేరుస్తూ మాకు కొండంత అండగా నిలుస్తున్నారు’ అని. ► గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఎలాంటి లక్షణాలూ లేకున్నా పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వలంటీర్ పి.స్వాములు ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆరోగ్య సిబ్బందికి తెలియజేస్తున్నారు. ► ఇటీవలే ఒకరికి పాజిటివ్ రావడంతో ఇరుగుపొరుగు భయపడిపోయారు. అయితే వలంటీర్ రేష్మా పర్వీన్ వారిని చైతన్య పరిచి ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బంది సాయంతో ఆయనను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వలంటీర్లు ఉన్నారనే ధైర్యం పొలం పనులకు వెళ్లేప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలని వలంటీర్లు చెబుతున్నారు. వారు చెప్పినట్టుగానే మాస్క్ ధరిస్తున్నాం. దగ్గు, జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఆశా వర్కర్లతో వైద్యం చేయిస్తున్నారు. వలంటీర్ల వల్ల మాకు ధైర్యంగా ఉంది. –ఖాజాబీ, గృహిణి కరోనా సమయంలో అండగా.. వలంటీర్లే ఇంటికొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంతో పాటు ప్రస్తుత కరోనా సమయంలో అండగా నిలుస్తున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లిస్తున్నారు. ఆరోగ్య సమస్య తలెత్తితే ఫోన్ చేయాలన్నారు. – చిన్న దస్తగిరి, రైతు -
180.54 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ స్థాయిలో ఉత్పత్తి సాధించడం ఇదే ప్రథమం. ఆహార భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, అనుసరించిన పద్ధతులతో ఈ రికార్డు సాధ్యమైంది. 2019–20 సంవత్సరానికి నాలుగవ, తుది ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో 180.54 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి (వాణిజ్య పంటలు, నూనె గింజలు మినహా) వచ్చింది. ► గత ఏడాది కంటే ఇది 30.98 లక్షల టన్నులు ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2015–16 నాటి కంటే 36.76 లక్షలటన్నులు ఎక్కువ. ► నాలుగో ముందస్తు అంచనా ప్రకారం 2019–20 ఖరీఫ్‌లో వరి దిగుబడి హెక్టార్‌కు 5,248 కిలోల చొప్పున మొత్తం 79,98,000 టన్నులు.. రబీలో హెక్టార్‌కు 5,846 కిలోల చొప్పున 59,75,000 టన్నులు.. మొత్తం 1,39,73,000 టన్నుల వరి దిగుబడి వచ్చింది. ► వరి, చిరుధాన్యాలు, తృణధాన్యాలు అన్నీ కలిపి 1,68,67,000 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 11,87,000 టన్నులు వచ్చాయి. మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి 1,80,54,000 టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ► నూనె గింజల దిగుబడి 28,47,000 టన్నులుగా, పత్తి 25,12,000 బేళ్లుగా అంచనా వేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో ఇటువంటి దిగుబడి రాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► 2019–20లో మొత్తం 42.15 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు సాగయ్యాయి. నూనె గింజలు 8.53 లక్షల హెక్టార్లో, ఇతర పంటలు 9.85 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ఇదే స్ఫూర్తి కొనసాగాలి విభజనానంతర ఏపీలో ఈ స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి రావడం సంతోషకరం. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కలిసివచ్చిన వాతావరణం, వానలు, రుతుపవనాలతో రైతులు సాధించిన విజయం ఇది. తెలంగాణ రాష్ట్రం కన్నా అధిక దిగుబడి నమోదైంది. ఇదే స్ఫూర్తితో అధికారులు పని చేయాలి. రైతులకు తలలో నాలుకలా ఉండాలి. ప్రభుత్వ ఆశయాన్ని సాధించాలి. అన్నదాతలకు అధిక ఆదాయం వచ్చేలా చూడాలని కోరుతున్నా. –అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్