Heart disease
-
ప్రియురాలి తల్లి కోసం చోరీలు!
బొమ్మనహళ్లి: ప్రియురాలి తల్లికి వైద్య ఖర్చుల కోసం ప్రియుడు చోరీలకు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఖాకీలకు దొరికాడు. ఈ సంఘటన బెంగళూరుఽ దక్షిణలోని జిగణి పరిధిలో జరిగింది. గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని మల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ అలీ బాలాసాహెబ్ నదాఫ్ (25) నిందితుడు. ఇతడు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసేవాడు. నదాఫ్ ప్రియురాలి తల్లికి గుండె జబ్బు ఉంది. ఆమె వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. దీంతో ప్రియురాలి అభ్యర్థన మేరకు నదాఫ్ డబ్బు కోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. ఆగస్టులో జిగణిలో రత్నమ్మ అనే మహిళ నడిచి వెళ్తుండగా బుల్లెట్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కెళ్లాడు. మరో మహిళ మెడలో తాళి బొట్టును ఎత్తుకెళ్లాడు. ఈ చోరీలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా, జిగణి పోలీసులు విచారణ జరిపి వీర ప్రేమికున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 3 బంగారం చైన్లు, 2 బైకులు, ఒక మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
గుండె జారిపోతోంది!
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్‌లలో గుండె చికిత్సల క్లెయిమ్‌ల వాటా దాదాపు 12 శాతం. ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. యువతలో పెరుగుతున్న జబ్బులు కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్‌లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్‌లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్లుఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%(కోల్‌కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది) -
విస్తరిస్తున్న స్టెంట్ మార్కెట్
దేశంలో హృద్రోగ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నాయి. 1990లో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధి (సీవీడీ) కేసులు 25.7 మిలియన్లు ఉండగా.. 2023 నాటికి అవి 64 మిలియన్లకు పెరిగినట్లు అంచనా. ఇలా గుండె జబ్బులు ఎక్కువవుతుండడంతో కరోనరీ స్టెంట్ చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో కరోనరీ డ్రగ్–ఎలుటింగ్ స్టెంట్ మార్కెట్ 2024 నుంచి 2033 వరకూ నాలుగు శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధిస్తుందని ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా అంచనా వేసింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2024లో ఆసియా పసిఫిక్ మార్కెట్లో భారత్ దాదాపు 32 శాతం వాటా కలిగి ఉందని వెల్లడించింది. గత ఏడాది స్టెంట్ మార్కెట్ పరిమాణం 1,303.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. - సాక్షి, అమరావతి32.4 శాతం మరణాలు..ఇక రాష్ట్రంలో 3.8 మిలియన్ల మంది గుండె సీవీడీ బాధితులున్నారు. అంటే మొత్తం వ్యాధులలో 17 శాతం. అంతేకాక.. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం మరణాలకు సీవీడీ కారణంగా ఉంటోందని వైద్యశాఖ చెబుతోంది. గుండెపోటుకు సంబంధించిన అత్యంత ప్రాణాంతకమైన ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (స్టెమీ) నుంచి ప్రజలను రక్షించడం గత ప్రభుత్వంలో కీలక అడుగువేశారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో స్టెమీ కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో గుండెపోటు బారినపడిన వారికి గోల్డెన్ హవర్లోనే చికిత్సలు అందిస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో గుండె జబ్బులకు చికిత్సలు పెరుగుదల ఇలా..» 2019- 2023,797» 2020- 2124,24» 2021- 2236,724» 2022- 2366,333» 2023- 2471,474 -
టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!
గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి. విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే. బాదంపప్పు, అక్రోటు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. -
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యంగానూ, వెజ్, నాన్‌వెజ్ కూరల్లోనూ, పచ్చళ్లల్లోనూ వాడుకుంటాం. అలాగే పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో ముందు ముద్దలో తీసుకోవడం కూడా పెద్దవాళ్లకి అలవాటు. అంతేకాదు కాల్చిన వెల్లుల్లిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం! వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగడంతోపాటు, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయట. విటమిన్ B6, విటమిన్ సీ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలోని క్వెర్సెటిన్ , కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలే దీనికి కారణం.వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కారకాలు బీపీని తగ్గించడంలో సాయపడతాయి.షుగర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది సున్నాగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్స్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల కేన్సర్ల బారినుంచి రక్షిస్తుంది. కడుపు కేన్సర్, పెద్దప్రేగు కేన్సర్ , పేగు కేన్సర్ , రొమ్ము కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ల నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్ , అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండడమే దీనికి కారణం. పురుషుల్లో లైంగిక పటుత్వానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.బాలింతల్లో పాలు సమృద్ధిగా రావడానికి కూడా వెల్లుల్లిని వాడతారు. -
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
కొలెస్ట్రాల్ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?
ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో΄ాటు హెచ్‌డీఎల్ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?చెడు కొవ్వు తగ్గడానికి...ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్ . డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
జంక్‌ఫుడ్.. 32 ఆరోగ్య సమస్యలు!
జంక్ ఫుడ్ తింటే అనారోగ్యం...!! ఊబకాయం వస్తుంది... గుండెజబ్బులకు.. మరెన్నో ఇతర వ్యాధులకూ కారణమవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ... మొత్తం ఎన్ని సమస్యలకు జంక్ ఫుడ్ కారణమవుతుందన్నది మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు. తాజా అధ్యయనం ఈ కొరతనూ తీర్చేసింది!జంక్ ఫుడ్‌తో అక్షరాలా... 30 రకాల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి అంటోంది ఈ అధ్యయనం. వివరాలేమిటో చూసేద్దామా...??? ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు, నిపుణుల చెబుతూంటారు. బాగా శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి అందించే తిండి పదార్థాలను జంక్‌ఫుడ్ అని పిలుస్తూంటాం మనం. బేకరీ పదార్థాలు, చిరుతిళ్లు, తీపి కలిగినవి, కార్బొనేటెడ్ పానీయాలు (కోలా డ్రింక్స్), చక్కెర కలిపిన కార్న్‌ఫ్లేక్స్ వంటివి, రెడీ టు ఈట్ పదార్థాలు.. ఇలా జంక్ ఫుడ్ జాబితా చాలా పొడవుగానే ఉంటుంది. సౌకర్యం కోసమో.. తీపిపై ఉండే ఆకర్శణ కారణంగానో కొన్ని దశాబ్దాలుగా మనిషి ఈ జంక్‌ఫుడ్‌కు బాగా దగ్గరయ్యాడు. ఆరోగ్య సమస్యలూ అంతే స్థాయిలో మనకు పెరుగుతూ పోయాయి. ఈ సమస్య గురించి చాలామందికి తెలిసినప్పటికీ పూర్తిస్థాయి అవగాహన తక్కువ మందికే ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొందరు జంక్‌ఫుడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలను స్థూల స్థాయిలో అర్థం చేసుకునేందుకు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇప్పటికే జరిగిన దాదాపు 45 మెటా అనాలసిస్ (అధ్యయనాల) వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ మెటా అనాలసిస్లన్నీ గత మూడేళ్లలో ప్రఖ్యాత పరిశోధన జర్నళ్లలో ప్రచురితమైనవే. ఈ పద్ధతి కారణంగా దాదాపు కోటి మంది జంక్‌ఫుడ్ అలవాట్లు, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యల వివరాలు తెలిశాయి. జంక్‌ఫుడ్‌కు ఆరోగ్య సమస్యకు ఉన్న సంబంధానికి చూపిన సాక్ష్యాలను కూడా నిశితంగా విశ్లేషించారు. మూడు వర్గాలుగా విభజించారు. ఎక్కువ అవకాశం ఉండటం, ఓ మోస్తరు.. సాక్ష్యాలు లేకపోవడం అన్నమాట. మొత్తమ్మీద చూస్తే జంక్‌ఫుడ్ ఎంత ఎక్కువ తింటున్న వారికి రాగల ఆరోగ్య సమస్యలు కనీసం 32 వరకూ ఉన్నట్లు స్పష్టమైంది. కేన్సర్, మరణం, మానసిక, ఊపిరితిత్తుల, గుండె, జీర్ణకోశ, జీవక్రియల సంబంధిత ఆరోగ్య సమస్యలన్నింటికీ జంక్‌ఫుడ్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇంకా... గుండెజబ్బులతో మరణించే అవకాశం 50 శాతం ఎక్కువ.-యాంగ్జైటీ తదితర మానసిక సమస్యలు వచ్చేందుకు 48 నుంచి 53 శాతం అవకాశం. టైప్-2 మధుమేహం బారిన పడేందుకు కనీసం 12 శాతం అవకాశం. ఏ కారణం చేతనైనా మరణం సంభవించేందుకు 21 శాతం వరకూ అధిక అవకాశాలు ఉన్నాయి. ఊబకాయం, నిద్రలేమి, గుండె జబ్బులతో మరణం వంటివాటికి 40 నుంచి 60 శాతం అవకాశాలున్నట్లు స్పష్టమైంది. ఉబ్బసం, జీర్ణకోశ సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, మంచి కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలకు జంక్‌ఫుడ్‌కు మధ్య సంబంధానికి సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్థ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియ¯న్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్ధ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. నానాటికీ పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియ¯న్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పన్నులు విధించాలి..పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, ప్రీ ప్యాకేజ్డ్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీ ఉత్పత్తులు, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం గమనార్హం. కాగా వీటి వినియోగాన్ని నియంత్రించేలా, నిరుత్సాహ పరిచేలా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు!
నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్ఎటాక్ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం! సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు. ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది. యువకుల్లోనూ.. ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం అధిక రక్తపోటు ఉంటే, నియంత్రణలో ఉంచుకోలేకపోవడం చెడు కొలె్రస్టాల్ అంటే ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపిడ్స్) ఉండటం శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్) శాతం వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం కుటుంబ చరిత్ర ప్రభావం కాపాడుకోవాలి ఇలా రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి చేయించడం చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వ్యాయామమే శ్రీరామరక్ష గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్ చేయాలి. కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. –డాక్టర్ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వెద్యం ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. – డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు (చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అలా వాడితే..) -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్ సర్జరీ కూడా..
సాక్షి, అమరావతి: గుండె జబ్బుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలుస్తోంది. చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం హృద్రోగ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 1.71 లక్షల మందికి వైద్యం 2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. బైపాస్ సర్జరీలు, స్టెంట్లు..యాంజియోగ్రామ్, గుండె మార్పిడి సహా వివిధ చికిత్సలను పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు. హృద్రోగ బాధితులకు వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.695.15 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచిత వైద్యం కేవలం హృద్రోగ చికిత్సలే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం పొందిన అనంతరం చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. గత సర్కారు హయాంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తల తాకట్టు పెట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. దేవుడిపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నాడు నెలకొన్నాయి. ఈ అవస్థలకు తెరదించుతూ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కి పెంచి ఉచిత వైద్య సేవలను సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీకి గత సర్కారు బకాయిపెట్టిన రూ.630 కోట్లను చెల్లించడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని సదుపాయాలతో బలోపేతం చేశారు. దీంతో సగటున రోజుకు 3,300 మంది నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏకంగా రూ.9,025 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 40 లక్షల మంది వైద్య సేవలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా బైపాస్ రక్త నాళాలు దెబ్బతినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో నాకు అంత స్థోమత లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం చేసిన మేలు ఈ జన్మలో మరువలేను. – దొంతాల రాఘవయ్య, మామడూరు, నెల్లూరు జిల్లా ఆపద్బాంధవిలా ఆదుకుంది గుండె రక్తనాళాలు దెబ్బ తినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్థారించారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత నెల 26న సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువలేను. – కొరివి కిశోర్, గుంటూరు పెద్ద జబ్బులకు సైతం.. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత పెద్ద జబ్బులకు సైతం చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్నాయి. ప్రొసీజర్ల సంఖ్య భారీగా పెరిగాయి. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. – హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా హృద్రోగ చికిత్సలు ఇలా సంవత్సరం రోగులు ప్రొసీజర్లు వ్యయం రూ.కోట్లలో 2019–2020 23,797 24,027 79.69 2020–2021 24,243 24,599 77.06 2021–2022 36,725 37,646 116.09 2022–2023 65,813 85,558 301.82 2023–2024 21,251 32,208 120.49 (ఇప్పటి వరకూ) మొత్తం 1,71,829 2,04,038 695.15 అన్నదాతకు ప్రాణదాత వ్యవసాయదారుడైన చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి హృద్రోగం బారిన పడటంతో ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది! గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఖర్చును భరించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తారని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో 2021 ఏప్రిల్‌లో బెంగళూరులోని నెట్వర్క్ ఆస్పత్రిని సంప్రదించారు. మైసూర్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను కృష్ణారెడ్డికి అమర్చి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.11 లక్షలు చెల్లించి ఆ కుటుంబ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. ‘నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నానంటే ఆరోగ్యశ్రీనే కారణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు కూడా అందచేశారు’ అని కృష్ణారెడ్డి చేతులు జోడించి చెబుతున్నారు. -
డయాబెటిస్ ఉన్నవాళ్లు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్‌షిప్‌లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
షూటింగ్లో పాల్గొనడం సంతోషం
‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్ కోసం జైపూర్‌కు వచ్చాను. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు నటి సుష్మితాసేన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్కు ఓ మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లోని మూడో సీజన్ కోసం సుష్మితాసేన్ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్ సిరీస్‌కు రామ్‌మద్వానీ, సందీప్ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్ ‘తాలి’ అనే మరో వెబ్‌సిరీస్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్‌ని గత నెలలో పూర్తి చేశారామె. -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు ఫౌండేషన్ల సహకారంతో.. చిన్నారులకు పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడ తూర్పు): గుండె జబ్బులతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు పునర్జన్మ లభించింది. ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు, వసుధ, మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ల సహకారంలో బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా వారికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. బ్రిటన్ వైద్యులు డాక్టర్ మహ్మద్ నిస్సార్, డాక్టర్ రమేశ్‌కుమార్, బ్రోచు, చెల్సీ, రాచెల్, ఆయులీష్‌తో పాటు ఆంధ్రా హాస్పిటల్ వైద్యులు దిలీప్, కె.విక్రమ్‌లు.. ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 20 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు తమ హాస్పిటల్లో 3 వేల మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీస్ సౌజన్యంతో ఇప్పటివరకు 25 సార్లు శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్రిటన్ వైద్యుల బృందం, ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు జె.శ్రీమన్నారాయణ, డాక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
Health: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో..
Health Tips- Mammogram- Heart Disease: నలభై ఏళ్లు దాటాక మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పును ముందే తెలుసుకునేందుకు మామోగ్రామ్ చేయించుకొమ్మని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టి రిస్క్ ఉన్న చాలామంది ఇటీవల డాక్టర్ల సిఫార్సుతో ఏడాదికో లేదా రెండేళ్లకో ఈ పరీక్ష చేయించుకోవడం పరిపాటి అయ్యింది. ఇక కొద్దిరోజుల్లోనే మామోగ్రామ్ చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్ ముప్పుతో పాటు... గుండెజబ్బుల ముప్పు అందునా ప్రత్యేకంగా గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు బిరుసుగా మారే అథెరో స్క్లిరోసిస్ కార్డియో వాస్క్యులార్ డిసీజ్ గురించి కూడా తెలిసిపోయే అవకాశం రానుంది. ఫలితంగా కేవలం ఒకే పరీక్షతో రెండు మూడు రకాల సమస్యల గుట్టుమట్లు తెలిసిపోనున్నాయి. ఆ వివరాలివి... మన దేశంలో ప్రతి వేయి మంది మహిళల్లో ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రతి వందమందిలో 11 మందికి రొమ్ముల్లోని రక్తనాళాలు సైతం గట్టిగా బిరుసుబారిపోయి బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్ జరిగే అవకాశముంది. అలాగే రొమ్ముల్లోని రక్తనాళాలతో పాటు ఇతర రక్తనాళాల్లోనూ క్యాల్షియమ్ చేరడంవల్ల, అవి ఫ్లెక్సిబుల్‌గా కాకుండా గట్టిగా, బిరుసుగా మారే అవకాశాలుంటాయి. ఇలా జరగడం వల్ల ‘కార్డియో వాస్క్యులార్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ఆర్టరీల్లో ఈ పరిణామం చోటు చేసుకుంటే అవి బిరుసెక్కిపోయి గుండెకు సరిగా రక్తం అందనందున ‘గుండెపోటు’ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా రక్తనాళాలు బిరుసుబారడాన్ని ‘అథెరోస్లి్కరోటిక్ కార్డియో వాస్కులార్ డిసీజ్’ అని కూడా అంటారు. రెండు జబ్బుల గురించి తెలిసేది ఇందుకే/ఇలాగే... మామోగ్రామ్‌తో రొమ్ముక్యాన్సర్ ఎలాగూ తెలుస్తుంది. దాంతోపాటు గుండెజబ్బుల ముప్పు ఎలా తెలుస్తుందో తెలియాలంటే రక్తనాళాల గురించి కాస్త అవగాహన అవసరం. రక్తనాళం ఎటుపడితే అటు ఒంగిపోయేలా చాలా మృదువుగా, సరళంగా ఉంటుంది. రక్తప్రవాహానికి వీలుగా రక్తనాళం అలలు అలలుగా కదులుతుంటుంది. మణికట్టు దగ్గర నాడి పట్టుకుని చూసినప్పుడు తెలిసే విషయం నిజానికి అలలు అలలుగా కదిలే రక్తనాళమే. దీన్నే ‘పల్స్’గా మనం చెప్పుకుంటాం. రక్తనాళం ఇలా మృదువుగా ఉండితీరాలి. అప్పుడే రక్తప్రవాహంలోని ఒడిదుడుకులకు తట్టుకోవడం, ఒక్కోసారి రక్తప్రవాహ వేగం పెరిగినా చాలావరకు తట్టుకోవడం జరుగుతుంది. ఈ రక్తనాళం మూడు పొరలతో నిర్మితమై ఉంటుంది. రక్తం ప్రవహించే లోపలి పొరను ‘ఇంటిమా’ అనీ, మధ్యపొరను ‘మీడియా’ అనీ, బయటి పొరను ‘అడ్వంటీషియా’ అని అంటారు. రక్తం ప్రవహించే సమయంలో జరిగే ప్రమాదాల వల్ల అప్పుడప్పుడూ ‘ఇంటిమా’ దెబ్బతింటుంది. కానీ మన శరీరంలో ఏ భాగమైనా దెబ్బతింటే దాన్ని రిపేరు చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది. ఈ క్రమంలో ఇలా రిపేర్ జరిగే సమయంలో ఒకవేళ ఇంటిమాలోని దెబ్బతిన్న భాగం కొవ్వులతో (లైపిడ్స్తో) రిపేర్ అయితే అక్కడ క్రమంగా కొవ్వు పాచిలా పేరుకుపోయి, ఉండలాగా మారి రక్తప్రవాహానికి అడ్డుపడవచ్చు. ఒకవేళ పీచు కణాలతో రిపేర్ జరిగితే, అక్కడ సన్నబారి పోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. ఒకవేళ రిపేర్ సమయంలో ఆ భాగంలో క్యాల్షియమ్ పేరుకుపోతే... మృదువుగా ఉండాల్సిన రక్తనాళం గట్టిగా బిరుసెక్కి ఎటూ వంగని గట్టి పైప్‌లా మారుతుంది. వీటిల్లో ఏది జరిగినా రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలా వచ్చే రక్తనాళాల సమస్యనే అథెరోస్కి›్లరోసిన్ అంటారు. ఒకవేళ ఇవి గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ఆర్టరీలో జరిగితే... గుండెకండరానికి పోషకాలు, ఆక్సిజన్ అందక గుండెపోటు వస్తుంది. మామోగ్రామ్తోనే గుండె, రక్తనాళాల పరీక్షలిలా... మామోగ్రామ్ సహాయంతో రొమ్ములోని రక్తనాళాల్లో క్యాల్షియమ్ చేరడాన్ని (బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్) కూడా గుర్తించవచ్చు. నిజానికి... రొమ్ము కండరాల్లోని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగే క్యాల్సిఫికేషన్ను అంచనా వేసేందుకు అవకాశముందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరిగాయి. దానివల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండటంతో పాటు, కేవలం ఒక పరీక్షకు అయ్యే ఖర్చుతోనే రెండుమూడు అంశాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ వైద్యశాస్త్రవేత్తలు, అధ్యయనవేత్తలు ఈ ప్రయత్నాలు చేశారు. మామోగ్రామ్ నిర్వహించినప్పుడు ఆ పరీక్ష తాలూకు స్కోర్స్తోనే... రాబోయే ముప్పు ఏదీ లేదు అనీ, హానికరం కాని గడ్డలు రావచ్చనీ, క్యాన్సర్ ముప్పు ఉందనీ.. ఇలా అంచనా వేస్తుంటారు. అయితే అదే పరీక్షతో వచ్చే క్యాల్షియం స్కోర్ ఆధారంగా కొన్ని దేశాల్లో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని క్యాల్సిఫికేషన్ను సైతం తెలుసు కున్నారు. రక్తనాళాలు గట్టిబారడం వల్ల వచ్చే కార్డియోవాస్క్యులార్ డిసీజ్, అథెరో స్క్లిరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్‌తో పాటు గుండెపోటుకు గల అవకాశాలనూ లెక్కగట్టారు. ఈ లెక్కల ద్వారా ఇప్పటికే స్వీడన్లో ఒక్క మామోగ్రామ్ పరీక్షతోనే ఇటు రొమ్ముక్యాన్సర్ ముప్పునూ, అటు కార్డియో వాస్క్యులార్ జబ్బు / గుండెపోటు ముప్పునూ తెలుసుకోగలుగుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యక్తులూ, మరెన్నో దేశాల ప్రజల్లో అందరికీ సరిపోయేలాంటి ప్రామాణికత ఇంకా సాధించనందున ఈ పరీక్షలు అన్ని దేశాల్లోనూ జరగడం లేదు. కానీ ప్రామాణికతలు రూపొందించడం కోసం విరివిగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇవి నేడో, రేపో సాకారం కానున్నాయి కూడా. ఇదే జరిగితే... కేవలం మరికొద్ది రోజుల్లోనే మన దేశంలోనూ కేవలం మామోగ్రామ్ అనే ఒక్క పరీక్షతోనే రొమ్ముక్యాన్సర్ ముప్పులూ, రక్తనాళాల ఆరోగ్య పరిస్థితి, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల ఆరోగ్యం, గుండెపోటుకు గల రిస్క్... ఇవన్నీ తెలిసిపోనున్నాయి. రక్తనాళం ఆరోగ్యాన్ని తెలుసుకునే పరీక్షలివి... కెరోటిడ్ డాప్లర్ అనే పరీక్షతో దేహంలోని రక్తనాళాల పరిస్థితిని, ఇంటిమా తాలూకు ఆరోగ్యాన్ని పరోక్షంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. మూత్రపిండాల వంటి అతి సున్నితమైన, దేహంలో చాలా లోపలికి ఉండే కీలక అవయవాల రక్తనాళాల కండిషన్‌ను నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే మెడకు ఇరువైపులా ఉండే ‘కెరోటిడ్’ రక్తనాళాలను పరీక్షించడం ద్వారా లోపలి కీలక అవయవాల్లోని రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. అలాగే ఇక గుండెకు రక్తాన్ని అందించే నాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు యాంజియోగ్రామ్... ఇందులోనూ రేడియేషన్ వల్ల తెలుసుకునే సీటీ యాంజియో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అటు కెరోటిడ్ డాప్లర్గానీ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలను తరచూ చేయించడానికి అంతగా అవకాశం ఉండదు. కానీ మహిళల విషయానికి వస్తే వారిలో మామోగ్రామ్ పరీక్ష మాత్రం తరచూ చేయించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... కొన్ని ఒకేలాంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఇటు క్యాన్సర్‌కూ, అటు గుండెజబ్బులకూ కారణమవుతాయి. ఉదా: పెరిగే వయసు, స్థూలకాయం, హైబీపీ, అదుపులో లేని డయాబెటిస్ లాంటివి... ఇటు క్యాన్సర్‌నూ, అటు గుండెజబ్బులనూ తెచ్చిపెట్టవచ్చు. పెరిగే వయసు లాంటి మన ప్రమేయం లేని వాటిని మినహాయించి, మిగతా అంశాలను నివారించడం లేదా అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్‌నూ, గుండెపోటునూ, రక్తనాళాల సమస్యలనూ నివారించుకోవచ్చు. మిగతా సమస్యలెలా ఉన్నా రెండో దశ దాటిపోతే క్యాన్సర్ ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఒకవేళ అది రొమ్ముక్యాన్సర్ అయితే దాన్ని మొదటి లేదా రెండో దశలో తెలుసుకుంటే దాన్ని సమూలంగా నయం చేసుకునే వైద్యపరిజ్ఞానం ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. అందుకే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ చరిత్ర ఉండటం, అందునా తల్లి లేదా తల్లిగారి అక్కచెల్లెళ్లలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం, బీఆర్సీఏ వంటి జన్యుపరీక్షల్లో క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు తేలడం వంటివి జరిగితే... నిర్దిష్ట సమయాల్లో మామోగ్రామ్ పరీక్ష చేయించుకొమ్మంటూ డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు మహిళలు తరచూ ఆ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. -డాక్టర్ సురేశ్ ఏవీఎస్, సీనియర్ మెడికల్ , ఆంకాలజిస్ట్ చదవండి: What Is Varicose Veins: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే దుర్వాసన లేకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి.. -
భారతీయుల్లో స్వతహాగా గుండెజబ్బులు ఎక్కువే : వైద్యులు
-
మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గుండెలో రంధ్రం ఉండటంతో జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. సునీత భర్త కూలి పనులు చేస్తుంటారు. మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. చదవండి: మురిసిన మానవత్వం గత నెల 29న కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చిన సీఎంను ఈ పేద దంపతులు కలిసి తమ పరిస్థితిని వివరించారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. వెంటనే వారిని ఆదుకునే బాధ్యతను కలెక్టరు కృతికా శుక్లాకు అప్పగించారు. మరుసటి రోజే కలెక్టర్ కృతికా శుక్లా ఆ దంపతులను తన వద్దకు పిలిపించుకున్నారు. సాయం అందాక కలెక్టర్ కృతికా శుక్లాను కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న సునీత కుటుంబం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రూ.10 వేలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. దీంతో భార్యాభర్తలిద్దరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్ కృతికా శుక్లాను కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.