high schools
-
ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. వర్చువల్ విధానంలో మరో ఇంటర్న్‌షిప్.. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్ మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏటీఎల్ మెంటార్షిప్.. ‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్ టింకరింగ్ ల్యాబ్‌్స (ఏటీఎల్)’కు మెంటార్షిప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 హైస్కూళ్లలో ఏటీఎల్స్ను ఏర్పాటు చేసింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్ కాలేజీలతో మ్యాపింగ్ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్ ఆశ్రమ్‌కు చెందిన సోర్స్ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. ఈ కోర్సుల్లోనే శిక్షణ.. ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్ బోధించనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయంతో బేసిక్స్ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ పరికరాలపై విద్యా బోధన, హైçస్యూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొత్త కంటెంట్ ఇన్స్టాల్ చేసి అందించనున్నారు. చదువుతో పాటే సంపాదన దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లిటరసీ పెరుగుతోంది. పేదింటి విద్యార్థులు స్మార్ట్ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్స్, ఏటీఎల్స్ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండేషన్ పాఠశాలల నుంచి హైస్కూల్ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్ క్యాలెండర్‌లోని లెసన్ ప్లాన్ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది. జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 20/25, అక్టోబర్‌లో 19, నవంబర్‌లో 25, డిసెంబర్లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. స్క్లూళ్ల సమయాలివీ.. ఫౌండేషన్ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతులకోసం ఆప్షనల్ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు, 6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్ బెల్ ఉంటుంది. సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్ లవ్ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్సు, మాస్ డ్రిల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్, స్కూల్ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు. (క్లిక్: ఈ అమ్మఒడి భవితకు పెట్టుబడి) -
వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..
School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా. కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ ట్రైయినింగ్ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే...జపాన్‌లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జపాన్‌లోని యమనాషి ప్రిఫెక్చర్లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల 5 వేల మీటర్ల మారథాన్ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేశారు. దీంతో ఒక అథ్లెట్ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్ బాటిల్ తోపాటు శానిటైజర్ కూడా అదే ప్లాస్టిక్ బాటిల్‌తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా. (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
పదికొచ్చే సరికే ఫుల్స్టాప్..
సాక్షి, హైదరాబాద్: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మాదిరి పిల్లలను స్కూల్‌కే పంపని పరిస్థితులు లేకున్నా... కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు మాత్రం తెలంగాణలోకనిపిస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక సంగ్రహణ (తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ట్స్ అబ్స్ట్రాక్ట్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సా హం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. ఆఖరుకు జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయసు్కలుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్ (స్కూల్ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్ (హైసూ్కల్ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. -
‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన
పెద్దవూర/ఆదిలాబాద్ టౌన్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూత్రశాలల కొరతతో బాలికలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ మెయిన్‌లో గురువారం ‘174 మంది బాలికలకు ఒకటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు పాఠశాలలో మూత్రశాలలతో పాటు మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చారు. (174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం) హైదరాబాద్ మాదా పూర్‌కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్ యాజమాన్యం విద్యార్థులకు కావాల్సిన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చింది. తమ ప్రతినిధులను పాఠశాలకు పంపి.. ఎన్ని మూత్రశాలలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో నిర్మించి ఇస్తామని తెలియజేసింది. ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిం చి దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు ముందు కు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ♦ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ పాఠశాలలో రెడీమేడ్ మూత్రశాలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ♦ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ రామారావు తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలకు పది మరుగుదొడ్లు నిర్మించి ఇస్తామని, తమ ప్రతినిధులు పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు. ♦‘సాక్షి’లో వచ్చిన విద్యార్థినుల ఇబ్బందుల వార్త తనను కదిలించిందని ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్లెం వెంకట్‌రెడ్డి తెలిపారు. రెండో మూత్రశాల మరమ్మతులకు తనవంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ♦ ఇంకా, సికింద్రాబాద్‌కు చెందిన రోటరీ క్లబ్ సైతం పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపింది. పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న నులక వేణుగోపాల్‌రెడ్డి సైతం పాఠశాలలో అవసరమైన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ గండికోట శ్రీనివాస్ తమవంతు సహాయం చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ సేవా సమితి సభ్యులు కూడా ఆర్థిక సహాయం అందించటానికి ముందుకు వచ్చారు. -
హైస్కూళ్ల పరిధిలోకి 3, 4, 5 తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా వారికి ఉన్నత బోధనను అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఒకే ఆవరణలో ఉన్న లేదా 250 మీటర్ల లోపు దూరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ల 3, 4, 5 తరగతులను హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే 1, 2 తరగతుల విద్యార్థులకు ప్రైమరీ ఎస్జీటీలతో బోధన కొనసాగించి, ఇతర సీనియర్ ఎస్జీటీలను 3, 4, 5 తరగతుల బోధనకు వీలుగా సర్దుబాటు చేయనుంది. ప్రాథమిక తరగతుల్లో టీచర్, విద్యార్థులను 1:20 నిష్పత్తిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
హైస్కూళ్లు 9 నుంచి 4 గంటల వరకే
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్ ఉంటాయి. వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఎస్ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్ మాత్రమే. ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది. -
6,7,8 తరగతులు నేటి నుంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతుల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా 6, 7, 8 తరగతులకు సైతం ప్రత్యక్ష బోధనను నేటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 1వ తేదీలోగా ఆయా తరగతులను యాజమాన్యాలు విడతలవారీగా ప్రారంభించుకునేందుకు అనుమతించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, అదనపు డైరెక్టర్లు సత్యనారాయణరెడ్డి, రమేశ్ తదితరులతో మంగళవారం తన కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అవసరం ఉన్న చోట షిఫ్ట్ పద్ధతి... ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 17.10 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు చదివే 8,88,742 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నారు. అలాగే 10,275 ప్రైవేటు పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1,157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98,853 మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలకు వస్తారు కనుక తరగతి గదులు తక్కువగా ఉన్న చోట షిఫ్ట్ పద్ధతిలో బోధనను కొనసాగించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు వాటిని పర్యవేక్షించేలా చర్యలు చేపడుతోంది. తరగతి గదులు తక్కువ ఉన్న పాఠశాలల్లో ఉదయం 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించేలా, మధ్యాహ్నం 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. నిబంధనలు పక్కాగా పాటించేలా... స్కూళ్లలో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో విద్యార్థికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలని, తరగతి గదికి 20 మందికి మించి విద్యార్థులను కూర్చోబెట్టరాదని పేర్కొంది. అలాగే తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని తెలిపింది. ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలలకు హాజరు తప్పనిసరి కాదని, పాఠశాలలకు రాని విద్యార్థులకు ఆన్లైన్ బోధనను యథావిధిగా కొనసాగించాలని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేదని స్పష్టం చేసింది. వారికి ప్రత్యక్ష బోధన లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయనుంది. పరీక్షలకు హాజరవడమూ ఐచ్ఛికమే... పరీక్షలకు హాజరు కావాలంటే ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలనే నిబంధనను విధించవద్దని స్కూళ్లకు విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షల హాజరు కూడా విద్యార్థుల ఇష్టమేనని పేర్కొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయడానికి వీల్లేదని, నో డిటెన్షన్ పాలసీ అమల్లో ఉందని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పేర్కొంది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించవద్దని సూచించింది. పాఠశాలల్లో 70 శాతం సిలబస్ బోధననే చేపట్టాలని, మిగిలిన 30 శాతం సిలబస్‌ను ప్రాజెక్టు వర్క్, అసైన్‌మెంట్స్‌కే పరిమితం చేయాలని గతంలోనే స్పష్టం చేసినట్లు వెల్లడించింది. ఇబ్బందులు లేనందునే... రాష్ట్రంలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవు. అందుకే 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతంలోనే ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనుకున్నా పరిస్థితిని అంచనా వేసేందుకు ఆగాం. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోవడం, తల్లిదండ్రులు, సంఘాల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నింటిలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం నిబంధనలు పాటించాలి. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
హైస్కూళ్లలోనే ఇంటర్
గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతోంది. ప్రతిభతో ‘పది’ గట్టెక్కినా దూరాభారంతో ‘ఇంటర్’ చదువు ఇరుకున పెట్టేది. అందువల్లే ఇంటర్లో చేరినా డ్రాపౌట్స్ సంఖ్య ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు పట్టణాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారి వారి భవితే మారిపోయేది. ఇవన్నీ గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హైస్కూల్లోనే ఇంటర్ విద్య అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 37 హైస్కూళ్లను అప్‌గ్రేడ్ చేయనుండగా.. గ్రామీణ విద్యార్థులకు మేలు జరుగుతోంది. అనంతపురం విద్య: విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గత వారంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైనా ఇంటర్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు రాగా... దూరభారం వల్లే సమస్య తలెత్తుతోందని అందరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచవచ్చని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా...ఆయన కూడా వెంటనే ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలను ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జిల్లాలో అదనంగా 37 జూనియర్ కళాశాలలు జిల్లాలో 63 మండలాలుండగా.. 25 మండలాల్లో మోడల్ పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 37 ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. కార్పొరేట్ ,ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్ తరగతులు బోధించడం వల్ల అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించినట్లు అవుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. మండలాల్లోనే జూనియర్ కళాశాల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు వరంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నత పాఠశాలలను ఇంటర్ తరగతులను బోధించే వీలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే జిల్లాలోని ఆత్మకూరు, బత్తలపల్లి, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, గాండ్లపెంట, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మఘట్ట, హాల్కూర్, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, లేపాక్షి, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, నంబులపూల కుంట, ఓడీ చెరువు, పరిగి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రామగిరి, రాప్తాడు, రొద్దం, రొళ్ల, శెట్టూరు, శింగనమల, సోమందేపల్లి, తాడిమర్రి, తనకల్లు, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు తదితర మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
హైస్కూళ్లలో వృత్తి విద్య
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 12వ పంచవర్ష ప్రణాళిక అంచనా ప్రకారం 19 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు వారిలో వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారు 5 శాతం లోపే ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆ వయసు వారు అమెరికాలో 52% మంది, జర్మ నీలో 75% మంది.. దక్షిణ కొరి యాలో 96% మంది వృత్తి విద్యను అభ్యసిస్తున్న వారే ఉన్నారు. కానీ మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందుకే 2025 నాటికి దేశంలోని 50 శాతం మంది విద్యార్థులైనా వృత్తి కోర్సు లను అభ్యసించేలా చర్యలు చేపట్టాల్సిందే.. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య, యూనివర్సిటీల వరకు వృత్తి విద్యా కోర్సులను కచ్చితంగా ప్రవేశ పెట్టా ల్సిందే..’అని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్‌లో డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో నిపు ణుల కమిటీని నియమించింది. 2019 మే నెలలో తమ డ్రాఫ్ట్ పాలసీని ఆ కమిటీ కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖకు (ఎంహెచ్ఆర్డీ) అంద జేసింది. దానిపై ఎంహెచ్ఆర్డీ దేశవ్యాప్తంగా నిపు ణులు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరిం చింది. వాటిన్నింటినీ పరిగణన లోకి తీసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఫైనల్ కాపీని అం దుబాటులోకి తెచ్చింది. అందులో వృత్తి విద్యకు సంబంధించిన కీలక సిఫారసులు చేసింది. ఒకప్పుడు డ్రాపౌట్స్ కోసమే.. ఇతర దేశాలతో పోల్చితే వృత్తి విద్యా కోర్సులను చదువుతున్న యువత దేశంలో చాలా తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో వృత్తి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నూతన విద్యా విధానంలో కమిటీ సిఫారసు చేసింది. గతంలో వృత్తి విద్యా కోర్సులను కేవలం డ్రాపౌట్స్ కోసమే 8వ తరగతిలో కొనసాగించినా ఇప్పుడు దానిని పాఠశాల విద్య స్థాయి నుంచి కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాల్సిన అవసర ముందని పేర్కొంది. వొకేషనల్ సబ్జెక్టులతో 11–12 తరగతులు పూర్తి చేసే వారు ఉన్నత విద్యలోలోనూ వొకేషనల్ కోర్సులను చదువుకునేలా అవకాశాలను మెరుగుప ర్చాల్సిన అవసరముందని స్పష్టంచేసింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు.. ఇలా అన్ని స్థాయిల్లో వృత్తి విద్యను దశల వారీగా అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. ప్రాథమి కోన్నత పాఠశాల దశ నుంచే నాణ్యమైన వృత్తి విద్యను అందిస్తూ ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రతి విద్యా ర్థి ఒక వృత్తి విద్యా కోర్సును చది వేలా చర్యలు చేపట్టాలని వెల్ల డించింది. ఇలా 2025 నాటికి కనీసంగా 50 శాతం మంది వృత్తి విద్యా కోర్సులను చదివేలా చూడాలని వివరించింది. రెగ్యులర్ కోర్సులతో పాటు దూరవిద్యలోనూ.. రెగ్యులర్ కోర్సులతోపాటు దూ ర విద్యా విధానంలోనూ వీలైన న్ని కోర్సులను అమలు చేసేందు కు చర్యలు చేపట్టాలని ఎన్ఈపీ పేర్కొంది. మొత్తానికి వచ్చే పదేళ్లలోగా వృత్తి విద్యను ప్రధా న విద్యగా అన్ని సెకండరీ స్కూళ్ల లో అమలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే సెకండరీ స్కూళ్ల తో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్థానిక పరిశ్రమలను అనుసం ధానం చేయాలని, ఉన్నత విద్యా సంస్థలు సొంతంగా లేదా పారిశ్రామిక భాగస్వామ్యంతో వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని పేర్కొంది. ఉన్నత విద్యలో 2013లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ డిగ్రీని ప్రవేశపెట్టినా, అది సరిపోదని పేర్కొంది. అన్ని ఇతర డిగ్రీ కోర్సుల్లో వొకేషనల్ కోర్సులు ఉండేలా చూడాలని వెల్లడించింది. స్థానిక అవకాశాల మేరకు కోర్సులు.. ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్ స్కిల్ తదితర సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఎన్ఈపీ సిఫారసు చేసింది. దేశంలో ఏయే రంగాల్లో స్కిల్ గ్యాప్ ఉందో పరిశీలించి, స్థానికంగా ఉపాధి అవ కాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో చూసి అలాంటి కోర్సులను ప్రవేశ పెట్టాలని స్పష్టం చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్‌ను సమగ్ర విద్యా విధా నంలో భాగంగా చే యాల్సిందేనని తెలి పింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక భాగస్వా మ్యంతో నేషనల్ కమిటీ ఫర్ ది ఇంటి గ్రీషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఐవీఈ) ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందు కు అవసరమై న బడ్జెట్‌ను కూడా కేటాయించాలని పేర్కొంది. విద్యా సంస్థలు అవకాశాలు ఎక్కడెక్క డ ఉన్నాయో ఆలోచించి, పరిశీలించి ఎన్‌సీఐవీఈ సహకారంతో కొత్త కోర్సులను ప్రారంభించాలని స్పష్టంచేసింది. -
స్త్రీలోక సంచారం
సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూలులో ఆరో తరగతి చదువుతున్న బాలిక.. వార్మింగ్ అప్ (వ్యాయామానికి సిద్ధం చేసే) ఎక్సర్‌సైజ్‌లను సరిగా చేయడం లేదంటూ అందుకు శిక్షగా పి.ఇ.టి. (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) విధించిన 60 ల్యాప్‌లను (గ్రౌండ్లో రౌండ్లు) కొట్టలేక ఛాతీనొప్పితో, శ్వాస ఇబ్బందితో కుప్పకూలి ఆసుపత్రికి చేర్చవలసి వచ్చిన ఘటనకు నివ్వెరపోయిన ‘తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్’ తక్షణం ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. వ్యాయామ నియమాలను సరిగా పాటించడం లేదని చిన్న పిల్ల చేత అమానుషంగా పరుగులు తీయించినప్పటికీ, ఆ టీచర్‌పై చర్య తీసుకోని యాజమాన్యం.. అందరూ బాలికలే ఉండే పాఠశాలలో మగ టీచర్లు ఉండకూడదన్న నిబంధనను ఉల్లంఘించి, పురుష పి.ఇ.టి.ని నియమించడంపైన కూడా అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి బి.వెంకట నరసమ్మ ఈ పరిణామాలన్నిటిపై విచారణకు ఆదేశించారు ::: హైదరాబాద్ బాలిక చాందినీ శ్రీనివాసన్.. సెప్టెంబర్‌లో ఖజకిస్తాన్‌లో జరగబోతున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ – ఏసియన్ అండర్ 12 టీమ్ టెన్నిస్ ఫైనల్ పోటీలకు ఎంపికైంది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ అండర్ 12 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నం. 2లో ఉన్న ఎనిమిదేళ్ల చాందినీతో పాటు హరియాణా నుంచి శృతీఅహ్లావత్, ఢిల్లీ నుంచి దుర్గాంశ్ భారత జట్టు తరఫున ఫైనల్స్‌లో తమ సత్తా చూపించేందుకు సిద్ధమౌతున్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో 91 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ చేసిన తాజా సర్వేలో వెల్లడయింది. ‘ఫైట్ అనీమియా ఇన్ స్కూల్’ ప్రచారోద్యమంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1న ప్రారంభమై ఇటీవలే ముగిసిన తొలి విడత సర్వేలో (మలి విడత జూలై 31కి పూర్తవుతుంది) హైదరాబాద్ కలెక్టరేట్ çపరిధిలోని 156 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 16,238 మంది బాలికల్లో 70 శాతం మందికి రక్తహీనత, 21 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు ::: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 178 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 22 వేల మంది బాలికలకు రాష్ట్ర విద్యాశాఖ గత మూడు నెలలుగా మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పిస్తున్న శిక్షణ పూర్తి కావచ్చింది. రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో సుశిక్షితులైన పి.ఇ.టి. టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినులకు ఇప్పిస్తున్న ఈ శిక్షణకు ‘రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్.ఎం.ఎస్.ఎ) కింద కేంద్ర నిధులు అందుతున్నాయి ::: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పాకిస్తాన్లో తొలిసారి ఒక మహిళ పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు! హైకోర్టు తొలి మహిళా జడ్జిగా, బలూచిస్తాన్‌లో తొలి మహిళా సివిల్ జడ్జిగా, ఇంకా తను చేపట్టిన ప్రతి పదవిలోనూ తొలి మహిళగా ఇప్పటికే గుర్తింపు పొందిన జస్టిస్ సయేదా తహీరా సఫ్దర్.. ఈ ఆగస్టు 31న పదవీ విరమణ పొందుతున్న బలూచిస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలు స్వీకరించి, వచ్చే ఏడాది అక్టోబర్ 5 వరకు న్యాయసేవలు అందిస్తారు ::: విషంతో ఔషధాన్ని తయారు చేయడం కోసం ఆన్లైన్లో ఒక సర్పాన్ని తెప్పించుకున్న చైనా యువతి ఆ పాము కాటుకు గురై చనిపోయింది! ఆన్లైన్లో మూగప్రాణుల్ని డెలివరీ చేయడంపై చైనాలో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి జవాన్జువాన్ అనే ఆన్లైన్ మార్కెట్ నుంచి సర్పాన్ని కొనుగోలు చేసిన ఈ 21 ఏళ్ల మహిళ.. పాము కాటుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల తర్వాత మరణించింది. -
టీసీ కోసం తప్పని పడిగాపులు
సాక్షి, సిటీబ్యూరో: ‘యూసఫ్‌గూడకు చెందిన జోష్న రహమత్‌నగర్‌లోని న్యూటన్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఈ ఏడాది మరో స్కూలుకు మారాల్సి వచ్చింది. దీంతో రెండు నెలల క్రితం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ)కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమెకు టీసీ ఇవ్వలేదు. అదే మంటే డీఈఓ ఆఫీసు నుంచి ఇంకా రాలేదని చెప్పుతున్నారు. దీంతో ఇక్కడ చదవలేక..మరో స్కూల్లో అడ్మిషన్ పొందలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది’ ఇలా జోష్న మాత్రమే కాదు..ఇలా అనేక మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి విద్యాసంవత్సరం ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు ఒక స్కూ లు నుంచి మరో స్కూల్‌కు మారుతుంటారు. వీరంతా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు(టీసీ)ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోనే టీసీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అడ్మిషన్ చేజారిపోకుండాముందుజాగ్రత్తలు హైదరాబాద్ జిల్లా పరిధిలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 122510 మంది చదువుతుండగా, 294 ఎయిడెడ్ స్కూళ్లలో 56495 మంది చదువు తున్నారు. 2259 ప్రైవేటు స్కూళ్లు ఉండగా 579742 మంది చదువుతున్నారు. వీరిలో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీపై వెళ్తుంటారు. అద్దె ఇళ్లలో ఉంటున్న మరికొంత మంది ఒక కాలనీ నుంచి మరోకాలనీకి మారుతుంటారు. ఇంకొంత మంది ఉత్తమ బోధనను అందిస్తున్న స్కూళ్లలో చేరుతుంటారు. పదోతరగతి పాసైన వారు పై చదువులకు వెళ్తుంటారు. వీరంతా టీసీల కోసం ఇప్పటికే దర ఖాస్తు చేసుకున్నారు. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆయా విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపగా, మరికొన్ని నిరాకరిస్తున్నాయి. అదేమంటే పాఠశాల వద్ద టీసీ ధృ వపత్రాల బుక్ అయిపోయిందని, కొత్తబుక్ పంపించాల్సిందిగా ఇప్పటికే జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు కూడా చేశామని, వారి నుంచి ఇంకా రాలేదని చెప్పిత ప్పించుకుంటారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమస్య పెద్దగా లేనప్పటికీ....అడ్మిషన్ చేజారిపోకుండా అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కొనసాగుతున్న సహాయ నిరాకరణ: హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈటీఆర్ల జారీపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇప్పటికే కొంత మంది అరెస్టైన సంగతి తెలిసిందే. ఎవరో ఒక్కరు చేసిన తప్పులకు అందరినీ బలిచేస్తున్నారని పేర్కొంటూ కార్యాలయ సిబ్బంది సహా డీఐఓలు, డిప్యూటీ డీఈఓలు ఉన్నతాధికారులకు సహకరించడం లేదు. దీంతో టీసీ బుక్‌ల జారీ సహా కీలకమైన ఫైళ్లన్ని పెండింగ్‌లో పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు యాజామన్యాలే కాదు, ఉపవిద్యా శాఖాధికారులు కూడా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లేందుకు వెనుక డుగేస్తున్నారు. ఈ పరిణామాలు ఇటు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులకు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన జిల్లా విద్యాశాఖాధికారి మీటింగ్‌ల పేరుతోనిత్యం వారికి దూరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్ చేసినా కనీసంస్పందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. -
ఈ బడి.. చదువులమ్మ ఒడి
సాక్షి, హైదరాబాద్ : కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలను తెరిచింది. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగే ఈ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూళ్లు మాత్రం రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం గురుకులాలకు దీటుగా ఫలితాలు సాధించి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానికులు కలసి చేసిన వినూత్న ఆలోచనే ఈ విజయానికి కారణం. ఇంతకీ ఆ పాఠశాల ఏదో తెలుసా.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే పాఠ్యాంశాల బోధన కొనసాగించడం, గురుకులాల తరహాలో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ.. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇప్పుడీ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అల్పాహారం, చిరుతిళ్లు ఇవ్వడంతో.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో 85% మందికిపైగా పేదలే. ఉదయం బడికి వచ్చే సమయంలో ఎక్కువ మంది పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోకుండానే వస్తున్నట్టు పలు సంస్థల సర్వేల్లో తేలింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నా విద్యార్థులు ఉదయం ఆహారం తీసుకోకపోవడంతో... బోధన, అభ్యసనపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. సాయంత్రం ఇళ్లకు తిరిగి వెళుతున్న పిల్లలు.. ఇంటి వద్ద అభ్యసనపై దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన రాచర్ల గొల్లపల్లి పాఠశాల టీచర్లు.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందజేయాలని నిర్ణయించారు. పలువురు దాతలు కూడా విరాళాలు ఇవ్వడంతో.. గతేడాది అర్ధ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత తమ ప్రణాళికను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పాఠశాలలో 261 మంది విద్యార్థులు ఉన్నారు. అం దులో పదో తరగతిలో 60 మంది ఉన్నారు. పాఠశాలలోని విద్యార్థులందరికీ అల్పాహారం, చిరుతిళ్లు అందించడానికి డబ్బు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో.. 60 మంది విద్యార్థులున్న పదో తరగతిని మాత్రం ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేకంగా ప్రణాళికతో.. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ కంటే ముందుగా బోధన, అభ్యసన తరగతులు చేపట్టేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి.. పాఠ్యాంశాల పునశ్చరణ కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులకు పాలు, ఉప్మా, గుగ్గిళ్లు అందజేశారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి చదివించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చింది. ఏటా సగటున టెన్త్‌లో 70 శాతం ఉత్తీర్ణత నమోదు చేసిన ఈ పాఠశాల... 2017–18 విద్యా సంవత్సరంలో ఏకంగా 92 శాతం ఉత్తీర్ణత సాధించింది. అంతేకాదు పది మంది విద్యార్థులు ఏకంగా 9 పాయింట్లపైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించడం గమనార్హం. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా ఆలోచించాలి ‘‘కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పనిచేయాలంటే ప్రభుత్వ పాఠశాలలు కొత్త తరహాలో ఆలోచించాలి. పరిస్థితులను బట్టి ప్రణాళికను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో పేదలే ఎక్కువ. వారికి పాఠశాలల్లో బోధనతో పాటు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలి. అదే సమయంలో పౌష్టికాహారం కూడా అందించాలి. మేమం చేసింది అదే. ఈ ఏడాది ఈ కార్యచరణను మరింతగా విస్తరిస్తున్నాం..’’ – మీస రవి, సోషల్ టీచర్, రాచర్ల గొల్లపల్లి హైస్కూల్ -
15 నుంచి ఒంటి పూట బడులు
సాక్షి, హైదరాబాద్: వేసవి నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని వెల్లడించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న ఉన్నత పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలను కొనసాగించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒంటి పూట బడులు ఈ విద్యా సంవత్సరంలో చివరి పని దినం ఏప్రిల్ 12 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుంటాయి. జూన్ 1న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2న పాఠశాలల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తారు. అయితే జూన్‌లో కూడా ఎండల తీవ్రత ఉంటే.. ఆ నెల 15 వరకు ఒంటి పూట బడులను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ‘ఆప్షనల్ హాలీడే’అందరికీ.. ఆప్షనల్ హాలీడే రోజుల్లో ఉన్నత పాఠశాలలను మూసివేయకుండా 30 శాతం మంది టీచర్లే వాటిని వినియోగించుకోవాలని, మిగతా టీచర్లు పాఠశాలను కొనసాగించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ సవరించింది. పాఠశాల మొత్తానికి ఆప్షనల్ హాలీడే వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆప్షనల్ హాలీడే రోజుల్లో పాఠశాలతోపాటు టీచర్లకు సెలవు వర్తిస్తుంది. -
3,500 హైస్కూళ్లకు ఇంటర్నెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోజుకు 1 జీబీ డేటా సదుపాయం కల్పిస్తున్న రిలయన్స్ హాట్‌స్పాట్‌ను ఉన్నత పాఠశాలలకు అందిస్తోంది. దాన్ని స్కూళ్లలోని డెస్క్‌టాప్ కంప్యూటర్లకు అనుసంధానం చేయడంతోపాటు టీచర్లకు వైఫై సదుపాయం అందించనుంది. పాఠ్యాంశాల బోధనలో కొత్త విషయాలను తెలుసుకుని విద్యార్థులకు చెప్పేలా టీచర్లకు ఇది దోహదపడుతుందని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. కేవలం విద్యా విజ్ఞాన, బోధన సంబంధమైన విషయాలను అందించే 400 వెబ్‌సైట్స్, టీవీ ప్రసారాలను అందుబాటులో ఉంచింది. ప్రసుత్తం రాష్ట్రంలో 4,500 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. అందులో 130 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 3,500 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. తర్వాతి దశలో మిగతా పాఠశాలలకు అందించే యోచన చేస్తోంది. -
ఇంకా వివక్షేనా...!
పాఠశాల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న భాషా పండిత పోస్టులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివక్షత కొనసాగిస్తోంది. ఉన్నత పాఠశాల స్థాయిలో భాషకు పునాదులేసే ఈ పోస్టుల ప్రాధాన్యతను విస్మరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్హత, బోధనానుభవం ఉన్న గ్రేడ్–2 భాషా పండితులకు పదోన్నతుల్లో ప్రభుత్వం పదేళ్లుగా అన్యాయం చేసింది. ఉద్యమాలకు తలొగ్గి గత ఏడాది జీఓ నెం.144 ను విడుదల చేసి పదోన్నతులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ భాషలపై ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అధ్యయనంతో ప్రత్యేక డిగ్రీలు చేసి ప్రతిభ చూపిన వారికి అప్పట్లో పదోన్నతుల కల్పనలో తీరని అన్యాయం చేసింది. ఉద్యమాలు చేసి ఆ డిమాండ్లను సాధించుకున్నారు. తాజాగా ఉపాధ్యాయులకు నిర్మించిన ఏకీకృత సర్వీసు నిబంధనలో మరోసారి వివక్షత చూపారు. విజయనగరం అర్బన్: బోధనా తరగతులను నిర్వహిస్తున్న ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ భాషా సబ్జెక్టు పోస్టుల ఉపాధ్యాయులకు ఉన్నత విద్యలోని అధ్యాపక, పర్యవేక్షణ అధికార పోస్టుల పదోన్నతి అర్హత ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత సర్వీసు నిబంధనలకు స్కూల్ అసిస్టెంట్ భాషా పోస్టులు పదోన్నతులకు సంబంధించి అశాస్త్రీయమైన విద్యార్హతలు, ఫీడర్ క్యాడర్లను నిర్ధేశించిన భాషాలకు, భాషా బోధకులకు తీవ్ర అన్యాయం చేసింది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలోని భాషా పండిత ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వీరు 1200 మంది వరకు ఉన్నారు. వీరంతా దీన్నే ప్రధాన డిమాండ్‌గా చేసుకొని తాజాగా ఉద్యమాలకు సిద్దపడ్డారు. వచ్చేనెల 16 వరకు వివిధ స్థాయిలో నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. 9, 10 తరగతులకు బోధన సహాయ నిరాకరణ జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు బోధనలు చేసే గ్రేడ్–1 స్కూల్ అసిస్టెంట్ భాషా సబ్జెక్టు పోస్టులు భాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో దాదాపు 400 మంది భాషా పండిత గ్రేడ్–2 (సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హతలోని) ఉపాధ్యాయులు అదనపు బోధిస్తూ నెట్టుకొస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పది ఉత్తమ ఫలితాలను అందించడంలో వీరి కృషి శ్లాఘనీయంగా ఉండేది. తాజాగా రూపొందించిన ఏకీకృత సర్వీసు నిబంధనల్లో లభించే పదోన్నతుల ఫలాలు మొత్తం 1200 మంది భాషా పండిత ఉపాధ్యాయులకు అందడం లేదు. ఏకీకృత సర్వీసు నిబంధన జీవో నెం.73లోని క్లాజ్ 4 ప్రకారం కేటగిరి 1, ఎంఈఓ హెచ్ఎం పదోన్నతులకు సంబంధించి విద్యార్హతలలో సంబంధం లేకుండా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో సీనియరిటీ ప్రాతిపదికగా పదోన్నతి కల్పిస్తూ పండిత శిక్షణ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం భాషా పండిత ఉపాధ్యాయ వ్యవస్థకు కలుగుతున్న ఏకీకృత సర్వీసు నిబంధనల అన్యాయానికి మద్దతుగా వీరంతా ఉద్యమాలకు దిగారు. ఈ నెల 26న జిల్లా కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతారు. ఆ తరువాత మండల స్థాయిలో చైతన్యసభులు నిర్వహిస్తారు. వచ్చే నెల 16న విజయవాడలో చేపడుతున్న భారీ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భాషా పండితులు హాజరుకానున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే బోధనా తరగతులకు సహాయ నిరాకరణ చేట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. విజయవాడలో రాష్ట్ర కమిటీ నాయకులు ఆమరణ నిరాహార దీక్షలను చేపడతారు. ఈ మేరకు కమిటీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బంకురు గోవిందనాయుడు ఉద్యమాల షెడ్యూల్‌ని ప్రకటించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను సవరించి భాషా పండిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యమ కార్యక్రమాల్లో భాషా పండిత ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయం చేయకపోతే బహిష్కరణ భాషా పండిత ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది. పదేళ్ల పాటు ఎలాంటి పదోన్నతులకు కల్పించక అప్పట్లో అన్యాయం చేశారు. తాజాగా ఉపాధ్యాయులకు నూతనంగా రూపొందించిన సర్వీసు నిబంధనల్లో కూడా బాషతో పాటు బాషా బోధనకులకు పక్షపాతం వహించారు. వచ్చే నెల 16లోగా వివిధ స్థాయిలో ఉద్యమాలు చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే అదనంగా అందిస్తున్న బోధనా తరగతుల (9, 10వ తరగతులకు)కు సహాయ నిరాకరణ చేపడతాం. – బి.గోవిందనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ -
ఏప్రిల్ 13 నుంచే వేసవి సెలవులు
జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభం - పాఠశాల విద్యా కేలండర్ జారీ - 2018 ఫిబ్రవరి 28లోగా టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి - వచ్చే నెల 20 నుంచి అక్టోబరు 4 వరకు దసరా సెలవులు - ఉన్నత పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేల వినియోగంపై నిబంధనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్ జారీ అయింది. పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్ ప్రకారం.. 2017–18 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇక కేలండర్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా పాఠ్యాంశాల బోధన పూర్తి చేసి.. రివిజన్ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి. విద్యా కేలండర్లోని ప్రధాన అంశాలు ► ఉన్నత పాఠశాలలు ఆప్షనల్ హాలిడేస్ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్ హాలిడేస్ తీసుకుని.. పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీల్లేదు. ప్రధానోపాధ్యాయుడు గరిష్టంగా పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లకే ఆప్షనల్ హాలిడేస్‌ను మం జూరు చేయాలి. మిగతా వారితో పాఠశాలను కొనసాగించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు. ► అక్టోబర్‌లో జాతీయ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... సెప్టెంబర్ 2లోగా మండల, డివిజన్ స్థాయి, సెప్టెంబర్ 20లోగా జిల్లా స్థాయి గేమ్స్ పూర్తి చేయాలి. అక్టోబర్ 4వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో గేమ్స్ పూర్తి చేసి.. జాతీయ స్థాయికి ఎంపికైన టీములను పంపించాలి. ► పాఠశాల వార్షిక దినోత్సవాన్ని జనవరి/ఫిబ్రవరిలో, బాలసభను ప్రతి నెల 4వ శనివారం, మాస్ డ్రిల్/యోగాను ప్రతి నెల మొదటి, మూడో శనివారం నిర్వహించాలి. సెలవులివీ.. 20–9–2017 నుంచి 4–10–2017 వరకు దసరా సెలవులు 24–12–2017 నుంచి 28–12–2017 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు 12–1–2018 నుంచి 16–1–2018 వరకు మిషనరీ స్కూళ్లు మినహా ఇతర పాఠశాలలకు సంక్రాంతి సెలవులు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ఇదీ.. 10వ తరగతి : ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు 9వ తరగతి : ఉదయం 11:30 నుంచి 12:15 వరకు 8వ తరగతి : మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు 7వ తరగతి : 2:45 నుంచి 3:30 వరకు 6వ తరగతి : 3:40 నుంచి 4:20 వరకు పాఠశాలల వేళలు ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు. ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు. పరీక్షల షెడ్యూలు ఇలా.. 31–7–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 19–9–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 23–10–2017 నుంచి 28–10–2017 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–1 30–11–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–3 31–1–2018లోగా: టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 28–2–2018లోగా: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 2–4–2018 నుంచి 9–4–2018 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–2 10–4–2018న: జవాబు పత్రాల అందజేత 11–4–2018న: తల్లిదండ్రులతో సమావేశం, ప్రోగ్రెస్ కార్డుల అందజేత (పదోతరగతి వారికి 28–2–2018లోగా ప్రీఫైనల్ పరీక్షలు.. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు) -
గూడు లేని బడి!
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేక అవస్థలు - 3 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే గది - మరో 6 వేల స్కూళ్లలో 2 గదులతోనే సరి - ఒక్క గదీ దిక్కులేని స్కూళ్లు 68 - చెట్ల కిందే చదువులు.. వర్షమొస్తే సెలవులు - గోడలే బ్లాక్ బోర్డులు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. దాంతో వరండాలు, చెట్ల కిందే బోధించాల్సి వస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపా యాల కల్పనకు దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఈ పరిస్థితి ఉండడం ఆందోళనకరం. మౌలిక సదుపాయాల కోసం డిపెప్, సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వంటి పథకాల కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించినా విద్యార్థులకు నీడ కల్పించలేకపోతున్నారు. అంతేకాదు ఏటా ఎస్ఎస్ఏ కింద రూ.2 వేల కోట్లు, ఆర్‌ఎంఎస్‌ఏ కింద రూ.500 కోట్లు వెచ్చిస్తున్నా అవసరమైన చోట తరగతి గదులను నిర్మించడం లేదు. దీంతో వర్షాకాలం మొదలైందంటే పాఠశాలలకు సెలవులు తప్పడం లేదు. అవసరమైన చోట మాత్రం లేవు రాష్ట్రంలో 18 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 68 స్కూళ్లకు ఇప్పటికీ ఒక్క తరగతి గది కూడా లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదు గదులు ఉండాలి. కానీ అలాంటివి కేవలం 2,207 మాత్రమే ఉన్నాయి. ఒక్క గది ఉన్న స్కూళ్లు 2,992 ఉండగా, 2 గదులున్న స్కూళ్లు 6,362, మూడు గదులున్నవి 2,918, నాలుగు గదులున్న స్కూళ్లు 1,937 ఉన్నాయి. ఇక అవసరమైన ఐదు గదుల కంటే ఎక్కువ సంఖ్యలో గదులున్న స్కూళ్లు 1,678 ఉండటం గమనార్హం. ఉన్నత పాఠశాలల్లోనూ అంతే.. ప్రాథమిక పాఠశాలలే కాదు ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అవసరం లేని చోట ఇష్టానుసారం తరగతి గదులను మంజూరు చేసిన అధికారులు... అవసరమున్న చోట మాత్రం అదనపు తరగతి గదులను నిర్మించలేదు. దాంతో తరగతి గదుల కొరత ఉన్న హైస్కూళ్లు వేలల్లో ఉన్నట్లు విద్యాశాఖ అంచనా. ఇందుకు ఉదాహరణ నల్లగొండ జిల్లా మునుగోడు ఉన్నత పాఠశాల. 50 ఏళ్ల కింద నిర్మించిన ఈ పాఠశాల ప్రస్తుతం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. అందులో 420 మంది విద్యార్థులు చదువుతున్నా 4 తరగతి గదులు మాత్రమే బాగున్నాయి. పది తరగతులకు కనీసంగా పది గదులు ఉండాల్సి ఉన్నా.. అదనపు గదుల నిర్మాణాన్ని పట్టించుకోవడమే లేదు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్న ఈ స్కూళ్లో ఉన్న నాలుగు గదుల్లో నాలుగు తరగతులు, ఆరుబయట ఐదు తెలుగు మీడియం, ఐదు ఇంగ్లిషు మీడియం తరగతుల బోధనను కొనసాగించాల్సి వస్తోంది. అదేకాదు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం జెడ్పీ ఉన్నత పాఠశాలదీ అదే పరిస్థి«తి. అక్కడ మొత్తం 545 మంది విద్యార్థులుండగా.. సరిపడ గదుల్లేవు. వాస్తవానికి 16 గదులున్నా.. 8 గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మిగతా 8 గదులే విద్యా బోధనకు అనువుగా ఉండటంతో ఆరుబయట కూడా బోధన కొనసాగించాల్సి వస్తోంది. భద్రాద్రిలో అధికం.. విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క తరగతి గదీ లేని ప్రాథమిక పాఠశాలలు 68 ఉండగా.. అందులో 13 స్కూళ్లు భద్రాద్రి జిల్లాలోనే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 9 పాఠశాలలు, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో 6 చొప్పున ఒక్క తరగతి గదీలేని స్కూళ్లున్నాయి. ఇక ఒక్క తరగతి గదితోనే కొనసాగుతున్న స్కూళ్లు అత్యధికంగా నల్లగొండలో 236 ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 196, మహబూబాబాద్ జిల్లాలో 180 స్కూళ్లు ఉన్నాయి. భద్రాద్రిలో 141, రంగారెడ్డిలో 137 స్కూళ్లు ఒక్క తరగతి గదితోనే కొనసాగు తున్నాయి. 2 గదులతో కొనసాగుతున్న పాఠశాలలు అత్య«ధికంగా నల్లగొండ జిల్లాలో 382 ఉండగా, భద్రాద్రిలో 371, మహబూబా బాద్‌లో 319, మహబూబ్‌నగర్‌లో 311, ఖమ్మంలో 306, జయ శంకర్ జిల్లాలో 270 పాఠశాలలు ఉన్నాయి. ఇక మూడు గదులున్న పాఠశాలలు అత్యధికంగా నల్లగొండలో 223, సంగారెడ్డిలో 171, సూర్యాపేటలో 138, ఖమ్మంలో 134, భద్రాద్రిలో 131 స్కూళ్లున్నాయి. నాలుగు తరగతి గదులున్నవి అత్యధికంగా రంగారెడ్డిలో 121, సూర్యాపేటలో 109 స్కూళ్లు ఉన్నాయి. ఇక ఐదు తరగతి గదులున్న పాఠశాలలు అత్యధికంగా నిజమాబాద్‌లో 140 ఉండగా, సిద్దిపేటలో 123 ఉన్నాయి. ఐదు కంటే ఎక్కువ తరగతి గదులున్న స్కూళ్లు అత్య«ధికంగా హైదరాబాద్‌లో 153, సంగారెడ్డిలో 121, రంగారెడ్డిలో 111 ఉన్నాయి. బాలికల విద్యకు నిధులు పెంచాలి కేంద్రానికి కేబ్ సబ్‌కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యను ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించేం దుకు కేటాయింపులు పెంచాల్సిన అవసర ముందని కేబినెట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీ అభిప్రాయప డింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఈ సబ్ కమిటీ గువహటిలో రెండో సమావేశం శుక్రవారం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రాముఖ్యం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తు తం కేజీబీవీలకు 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోందని, వీటిని 12వ తరగతి వరకు విస్తరించి కేంద్రమే పూర్తిగా ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించింది. బాలికల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన అసవర ముందని అభిప్రాయపడింది. పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల కూడా డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని పేర్కొంది. బాలికలకు హెల్త్ చెకప్ చేయించి హెల్త్ కార్డులందించాలని, హెల్త్ కిట్లు ఇవ్వాలని సూచించింది. వచ్చే నెలలో ఢిల్లీలో బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లో బాలిక సంఖ్య తగ్గడానికి గల కారణాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు సీనియర్ అధికారులతో ఓ కమిటీ నియమించాలని నిర్ణయించింది. సమావేశంలో అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్, సభ్య కార్యదర్శి కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్, తెలంగాణ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కేంద్ర పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సావిత్రి పాల్గొన్నారు. -
హైస్కూళ్లలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5,111 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మస్థైర్యా న్ని పెంచేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) కింద ఈ శిక్షణ ఇవ్వనుంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కాగానే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను జారీ చేయనుంది. ఒక్కో స్కూల్‌కు రూ.8,500 చొప్పున మొత్తం రూ.4.34 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీనికి సంబంధించి జిల్లాల వారీ వివరాలతో డీఈవో లకు ఆర్‌ఎంఎస్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నిజమాబాద్‌లో 277 స్కూళ్లలో, తక్కువగా కుమ్రం భీం జిల్లాలో 70 స్కూళ్లలో ఈ శిక్షణ ఇవ్వనుంది. -
ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలు
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల చెందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి గ్రాండ్ టెస్ట్–1,–2, ప్రీఫైనల్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎంఈఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని కె.రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైటేబుల్, సిలబస్‌కు సంబంధించిన వివరాలు డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ పేర్కొన్నారు. -
100 పద్యాలు ఆలపించి రికార్డు సృష్టించారు
పోడూరు : మండలంలోని వెయ్యి మంది విద్యార్థులు ఒకే వేదికపై 45 నిముషాల్లో 100 పద్యాలు ఆలపించి 7 రికార్డులు నెలకొల్పారు. పోడూరు కల్నల్ డీఎస్ రాజు జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో పాలకొల్లు క్షీరపురి సాహితీ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోడూరు, పండితవిల్లూరు, కవిటం జెడ్పీ హైస్కూల్స్, జిన్నూరు ఐడియల్ స్కూల్ విద్యార్థులు వెయ్యి మంది ఈ ఆలాపనలో పాల్గొన్నారు. ముందు 100 నిమి షాల్లో 100 పద్యాలు పాడాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. కేవలం 45 నిముషాల్లోనే 100 పద్యాలు పాడి లక్ష్యాన్ని పూర్తి చేశారు. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరి తరువాత ఒక పద్యాలు ఆలపించారు. గర్వకారణం : ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇటువంటి రికార్డులు నెలకొల్పడం గర్వకారణమని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రికార్డుల ప్రదానం సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రపంచ రికార్డు సాధకుల సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు, భారత్ బుక్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ శ్యామ్ జాదూగర్‌తో ఎమ్మెల్యే కలసి క్షీరపురి సాహితీ సమితి ప్రతినిధులకు రికార్డులు ప్రదానం చేశారు. శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ రికార్డులు నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రికార్డుల సాధనకు నైపుణ్యం గల వ్యక్తులను, కళాకారులను, ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని కోరారు. రికార్డులు సాధించిన విద్యార్థులను, క్షీరపురి సాహితీ సమితి ప్రతినిధులను ప్రముఖులు అభినందించారు. శ్యామ్ జాదూగర్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణను ఎమ్మెల్యే పితాని చేతులమీదుగా నిర్వాహకులు సత్కరించారు. జెడ్పీటీసీ బొక్కా నాగేశ్వరరావు, సర్పంచ్ కుసుమె మోషేన్, ఏఎంసీ వైస్ చైర్మ¯ŒS రుద్రరాజు రవి, ఎంపీటీసీ సభ్యులు పోతుమూడి అనసూయ, ఐడియల్ స్కూల్ కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు, క్షీరపురి సాహిత్య సమితి ప్రతినిధి పెన్మెత్స జగపతిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పీడీ పోస్టులు భర్తీ చేయాలి
దేవరకద్ర : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ద¯Œæరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, గోపన్‌పల్లి, కౌకుంట్ల, పేరూర్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఆయన కలిశారు. రాష్ట్రంలో క్రీడలను ప్రత్యేకమైన పాఠ్యాంశంగా చేర్చి ప్రతి రోజు అన్ని సబ్జెక్టుల మాదిరిగా బోధించాలని కోరారు. ఈ పద్ధతి కేరళ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 600 పాఠశాలల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వీటిని భర్తీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. -
జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. కడియద్ద జిల్లా పరిషత్ హైస్కూల్లో గోదావరి విద్యా వికాస్ చైతన్య వేదిక సౌజన్యంతో బయోమెట్రిక్ విధానంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో డిజిటల్ విధానంలో విద్యాబోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి విద్యావికాస్ చైతన్య వేదిక చేస్తున్న విద్యాసేవలను ఆయన అభినందించారు. జిల్లాలోని 100 పాఠశాలలను దత్తత తీసుకుని ఆయా పాఠశాలలకు మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేయనున్నట్టు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంపీపీలు పరిమి రవికుమార్, పెదపోలు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ పాకనాటి నాగదీప్తి పాల్గొన్నారు. -
అన్ని హైస్కూళ్లలో డిజిటల్ తరగతులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హసన్‌పర్తి పాఠశాలలో ప్రారంభం హసన్‌పర్తి : రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో సేవ్ చిల్ర్డన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను మంగళవారం ఆయన ప్రారంభించారు. సంస్థ 20 ప్రొజెక్టర్లను మండలంలోని 20 ప్రాథమిక పాఠశాలలకు బహూకరించింది. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే డిజిటల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచి స్తోందని చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా దశల వారీగా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం టీసీఎస్, విప్రో కంపెనీల సహకారం తీసుకుంటామని వివరించారు. ప్రభుత్వ స్కూళ్లను బతికించుకోవాలి పభుత్వ స్కూళ్లను బతికించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్వచ్చంధ సంస్థలపై ఉందన్నారు. పాఠశాలలకు విడుదల చేస్తున్న కాంటీంజెన్సీ నిధులను రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచినట్లు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధి కింద విడుదలవుతున్న నిధుల్లో నుంచి రూ.కోటి ఇస్తే మరో రూ. 4 కోట్లు కలిపి మొత్తం రూ. 5 కోట్లతో పాఠశాల అభివృద్ది కోసం మంజూరు చేస్తామని చెప్పారు. హసన్‌పర్తిని ఇతర మండలాలు ఆదర్శంగా తీసుకోనేలా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని శ్రీహరి సూచించారు. మన బడి–మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ముందుకు వెళ్తున్నారని, ఆయనకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ‘వర్ధన్నపేట’లో ప్రణాళిక... వర్ధన్నపేట నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు నిర్వహించడాకి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. విద్యాభివృద్ధిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రధమ స్థానానికి తీసుకెళ్లడానికి శ్రమిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించినట్లయితే మిగతా కావాల్సిన వాటిని సమకూర్చుకుంటామని కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌ను డిజిటల్ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తొలుత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీపీ కె.సుకన్య, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, కార్పొరేటర్లు సర్వోత్తంరెడ్డి, కల్పన, ఆర్జేడీ బాలయ్య, డీఈఓ రాజీవ్, విద్యాకమిటీల చైర్మన్లు యాదగిరి, కుమార్, మల్లేశం, ఉదయ్‌కుమార్‌రెడ్డి, రవీందర్, శివరాం, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్రవు పాల్గొన్నారు. -
టీచర్లకూ ‘పరీక్ష’
– ఆన్లైన్ టెస్టు ఇప్పుడొద్దంటున్న టీచర్లు – పరీక్షలు సెలవుల్లో జరపాలని డిమాండ్ – 20,21 జరిగే ఆన్లైన్ పరీక్ష రద్దు చేయాలని విన్నపం – ఆందోళనలో ఉపాధ్యాయులు చిత్తూరు (ఎడ్యుకేషన్): రాష్ట్రంలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ప్రై వేటు యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న టీచర్లకు ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించే ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) ఇప్పుడొద్దని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం ఏపీ విద్యా ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు ఆ సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ (ఆర్ఎస్ఎంఏ) ద్వారా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించడానికి ట్రై నింగ్ నిడ్స్ ఐడింటిఫికేషన్ టెస్టు (టీఎన్‌ఐటీ) ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ, ప్రై వేటు యాజమాన్యాల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ టీచర్లందరూ ఈ పరీక్ష రాయాల్సిందేనని రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ద్వారా స్పష్టం చేశారు. ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఒకే ప్రశ్నాపత్రంతో కూడిన కామన్ పరీక్షలను జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో నిర్వహించే త్రై మాసిక (ఎస్ఏ–1), అర్థసంవత్సరం (ఎస్ఏ–2), వార్షిక పరీక్షలు (ఎస్ఏ–3) రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఒకే విధమైన ప్రశ్నాపత్రాలతో పరీక్షలను జరపనున్నారు. కేంద్రం నిర్వహించిన పలు సర్వేల్లో ఏపీలో విద్యాప్రమాణాల్లో చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆసర్వే ఆధారంగా తీసుకున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను గుర్తించి వారికి శిక్షణ ఇస్తే విద్యాప్రమాణాలు పెరుగుతాయని ఈ నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో టీచర్లు సామర్థ్యాల ముదింపునకు ప్రభుత్వం నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షపై టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విధానంపై టీచరదరూ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా విద్యాప్రమాణాల వెనుకబాటుకు టీచర్లను బాధ్యులను చేయడం తగదన్నారు. దశాబ్ధాల క్రితం అప్పటి సిలబస్ ఆధారంగా ఉత్తీర్ణులైన తమకు ఇంటర్మీడియట్ సిలబస్‌ను నిర్ణయించి పరీక్ష రాయమంటే ఎలా రాయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది టీచర్లకు కంప్యూటర్ పై అవగాహన లేకపోవడంతో ఈ పరీక్షపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆకస్మాత్తుగా పరీక్ష ఉంటుందని చెబితే ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు..? వార్షిక సెలవుల్లో జరపాల్సిన ఇటువంటి విధానాలు విద్యాసంవత్సరం జరిగే సమయంలో పెట్టడం అన్యాయమని చెబుతున్నారు. టీఎన్‌ఐటీ సెలవుల్లోనే నిర్వహించాలి – ఏహెసానుల్లా, ఆప్టా జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం జరపబోయే టీఎన్‌ఐటీ పరీక్షను సెలవుల్లోనే నిర్వహించాలి. ఆన్లైన్ పరీక్ష పేరుతో ప్రభుత్వం టీచర్లను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ విధానం వలన టీచర్లు తరగతులు చెప్పడంలో ఏకాగ్రతను కోల్పోతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించిన తరువాత ఇటువంటి పరీక్షలను పెట్టాలి. ఆన్లైన్ పరీక్ష వద్దు శ్రీకాళహస్తి టౌన్ : స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే అనేక పనులతో అవస్థలు పడుతుంటే వారిని అవమానించే విధంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లందుల గుణశేఖర్ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఒక వింత ఆలోచన చేస్తోందని, ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో దీన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రేషనలైజేషన్ పేరుతో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని, దీన్ని ఉపాధ్యాయులు ఎదుర్కోవాలని,సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాలని కోరారు. అలాగే ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.ఎస్.బి.సూర్యప్రకాష్, పట్టణ అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె,సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు.