HUZURNAGAR
-
హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
-
పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యపేట: తెలంగాణలో ప్రజల హక్కులు కాపాడుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడు పోరాడలేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో నేడు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రపంచంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. రైతు బంధు మంచిదని యూఎన్వో, ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసిస్తుంటే.. దాన్ని తీసేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధును తీసేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని తెలిపారు. నవంబర్ 30న ఓట్లు వేస్తే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దనే నాయకుడు కావాలా..? రైతు బంధు ఇచ్చే సైదిరెడ్డి కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కరెంట్ మూడు గంటలు చాలు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. అసలు వ్యవసాయం చేస్తే కదా ఎన్ని గంటలు కరెంట్ ఉండాలో తెలిసేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధరణి తీసేస్తా అని రాహుల్, రేవంత్, భట్టి విక్రమార్క అంటున్నారు.. ధరణి తీసేస్తే వీఆర్వో లాంటి వ్యవస్థలు మళ్లీ వస్తాయని అన్నారు. రైతుబంధు పదహారు వేలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పింఛన్లు ఐదు వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఇంటికి బీఆర్ఎస్ మేనిఫేస్టో తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆనాడు నోరు మెదపలేదు.. 'పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలని సీఎం కేసీఆర్ అన్నారు. దళితులు అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ దళితుల అభ్యున్నతి గురించి ఆలోచిస్తే ఇవాళ పరిస్థితి వేరే ఉండేది. తండాల్లో మా పాలనే ఉండాలని గిరిజనులు కోరుకున్నారు. ఓటు అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు. నాగార్జున సాగర్ నిర్మించాల్సిన ప్రాంతంలో నిర్మిస్తే నల్లగొండ అన్ని ప్రాంతాలకు నీరు అందేది. 1956 లో తెలంగాణను ఆంధ్రాలో కలపిన సమయంలో అందరూ వ్యతికించారు. ఆనాడు కాల్పులు జరిపినా కాంగ్రెస్ నేతలు నోరుమూసుకున్నారు. తొమ్మిదేళ్లలో నాగార్జున సాగర్ నుంచి పద్దెనిమిది పంటలు పండించుకున్నాం. టెయిల్ ఎండ్ కు నీళ్లు రాకపోతే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదు. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నారు. పదవులు, కాంట్రాక్టులు ముఖ్యమనే రీతిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.' అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు పైసా కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం మాట్లాడలేదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజల బాగోగులు వద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ కాదా?అని మండిపడ్డారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు కూర్చుంటే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి -
అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్
సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్‌పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్ఎస్ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్‌పోర్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్ అన్నారు. కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు. కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ -
హుజుర్నగర్లో పొలిటికల్ హీట్.. బీజేపీకి బలమైన నేత దొరికాడా?
తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకు పెరిగిపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాషాయ పార్టీకి అనేక చోట్ల కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షతో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే అనేక మందికి కాషాయ తీర్థం ఇచ్చింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత బీజేపీనీ వేధిస్తోంది. అయితే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్లో కూడా అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సరితూగే అభ్యర్థిని రెడీ చేసుకుంటోంది. క్రమంగా జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కొంతమేర పట్టు బిగించింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కీలకంగా ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. గత ఉప ఎన్నికల్లో పోయిన పరువును రాబట్టుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. కమలం ఎందుకు తలకిందులయింది? హుజూర్ నగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైదిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే వారికి పోటీనిచ్చే స్థాయి నేత లేక ఇన్నాళ్లు బీజేపీ తల పట్టుకుంది. గత ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే హుజూర్ నగర్లో పట్టు సాధించేందుకు శ్రీకాంత్ రెడ్డి రూపంలో కాషాయ పార్టీకి బలమైన నేత దొరికినట్లు అయింది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అనుచరవర్గం ఉండటంతో పాటు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతను ధీటుగా ఎదుర్కొన్న అనుభవం కూడా శ్రీకాంత్‌రెడ్డికి ఉంది. ఇది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే నియోజవర్గంలో పట్టు సాధించేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ.. అక్కడ కార్యక్రమాలు సాగిస్తూ వస్తోంది. మఠంపల్లి మండలం గుర్రంబోడు గిరిజన తండా భూముల విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చను తీసుకురావడంతో పాటు... దాని వెనుక ఎవరి పాత్ర ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఉద్యమించింది. ఇది గిరిజన రైతుల్లో ఆ పార్టీ పట్ల సానుభూతిని పొందేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నారు. బండి సంజయ్ ధాన్యపు రాశుల పరిశీలన పేరుతో చేసిన హంగామా కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. అయితే ఎటొచ్చి దీన్ని కొనసాగించేందుకు ఇన్నాళ్లు ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. సవాల్ ప్రతి సవాల్ ఇన్నాళ్లు అక్కడ ద్విముఖ పోరు మాత్రమే సాగింది. ఇప్పుడు ఒక్కసారిగా ముక్కోణపు పోరుగా మారింది. ఇప్పటికే మరోసారి గెలవాలని సైదిరెడ్డి, ఎలా అయినా గెలవాలని ఉత్తమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా పనిచేసుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల 30 వేల ఓట్లలో 55 నుంచి 60 వేలు ఓట్లు తెచ్చుకుంటే చాలు అన్నట్లు ఆయన ప్లాన్ చేసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలనే ప్లాన్‌లో శ్రీకాంత్ రెడ్డి ఉన్నారట. అయితే శ్రీకాంత్ రెడ్డికి బొబ్బా భాగ్యారెడ్డి అనే నేత రూపంలో తలనొప్పులు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా టికెట్ ఆశిస్తుండటంతో తనకు సహకరిస్తారో లేదో అని శ్రీకాంత్ రెడ్డి అనుమానపడుతున్నారని సమాచారం. మొత్తానికి కాంగ్రెస్, కారు పార్టీలకు గట్టి పట్టున్న హుజూర్ నగర్లో ఎలక్షన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి. ఆ రెండు పార్టీలకు బీజేపీ పోటీ ఏ రేంజ్లో ఉంటుంది? ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ
సాక్షి, హుజూర్నగర్/ఖమ్మం: సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు తేలింది. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సోమవారం సీఐ రామలింగారెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతులు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు. వీరి కుమారుడు సాయినాథ్ (26) మద్యం, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తల్లిదండ్రులను వేధిస్తుండగా, ఆయనను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. రాణిబాయి తమ్ముడైన మిర్యాలగూడకు చెందిన సహదేవుల సత్యనారాయణను సంప్రదించడంతో ఆయన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన రమావత్ రవి, పానుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, ధరావత్ సాయికి రూ.8లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో రూ.1.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఈక్రమంలో రెండు సార్లు సాయినాథ్‌పై హత్యాయత్నం చేసినా విఫలమయ్యారు. మూడోసారి.. సాయినాథ్ మేనమామ సత్యనారాయణ సహకారంతో సుపారీ గ్యాంగ్ సభ్యులు ఆయనను అక్టోబర్ 17న రాత్రి ఖమ్మం నుంచి మిరాల్యగూడకు తీసుకొచ్చారు. మరుసటి రోజు కల్లేపల్లి శివారు మైసమ్మ గుడి వద్ద మద్యం తాగించి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అదేరోజు రాత్రి మృతుడి కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి పాలకవీడు మండలంశూన్యంపహాడ్ శివారు మూసీ నదిలో వేసి వెళ్లిపోయారు. కాగా, 19వ తేదీన మృతదేహం తేలడంతో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం నంబర్ ఆధారంగా... ఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఓ కారు వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వాహనం నంబర్ ఆధారంగా పరిశీలించి సాయినాథ్ కారుగా తేలడంతో ఆచూకీ కోసం ఆరా తీస్తుండగానే, ఆయన తల్లిదండ్రులు అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చారు. దీంతో అనుమానించిన పోలీసులు రామ్‌సింగ్ – రాణిబాయిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. సాయి తల్లిదండ్రులతో పాటు పాత్రధారులైన ఐదుగురిని అరెస్ట్ చేసి, నాలుగు కార్లు, రూ.23,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై సైదులు, సిబ్బంది అంజయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, జానీ పాషాను సీఐ అభినందించారు. -
తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది
హుజూర్నగర్ రూరల్/గరిడేపల్లి: గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు లేకున్నా.. మద్యం ఏరులై పారుతోందని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మిషన్ భగీరథ ట్యాంకులున్నా చుక్క నీరు రావడం లేదని, ప్రజలు మంచినీళ్లకు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరం, గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలు, రేషన్, మద్యం మాఫియా గురించి మాట్లాడితే తమ పార్టీ నాయకులపై, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దాడులను నిరసిస్తూ తాను మూడు గంటలు వర్షంలో కూర్చొని ధర్నా చేస్తే గానీ సర్కార్ లొంగలేదన్నారు. రేపు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తాం అంటూ పోలీసులు బెదిరించారని, అయితే బుధవారం ఎలా చేయనివ్వరో చూద్దాం అని తాను పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నార -
మొన్న పిల్లి.. నేడు ఆబోతు..
చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీసులు కొద్దిరోజుల క్రితం పిల్లిపోరును తీర్చగా, తాజాగా సోమవారం చిలుకూరు పోలీసులు ఓ ఆబోతు పంచాయితీని పరిష్కరించారు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామస్తులు ఆరేళ్ల క్రితం రామాలయం నిర్మించి గుడిపేరిట ఓ ఆబోతును వదిలేశారు. నెల రోజులుగా అది కనిపించకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల చిలుకూరులో ఆ ఆబోతును గంగిరెద్దు మాదిరిగా ఆడిస్తుండటంతో గమనించిన గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పోలీసులు పంచాయితీ నిర్వహించారు. గంగిరెద్దులవారు రూ. 30 వేల జరిమానా చెల్లించి ఆబోతును అప్పగించారు. -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
హుజూర్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉన్నా కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపడితే గ్రామాలకు తాగునీరు అందడంలేదు కానీ కేసీఆర్ కుటుంబం దాహార్తి తీరడానికి ఉపయోగపడిందని విమర్శించారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ప్రశ్నించడానికి బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల సంపద కేసీఆర్ కుటుంబం గుప్పెట్లో బందీ అయిందని, బీఎస్పీ అధికారంలోకి వస్తే వారు దోచుకున్నదంతా పేదలకు పంచుతామని, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో..
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): గురుశిష్యుల సంబంధానికి మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు సదరు హెచ్ఎంను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బడితపూజ చేశారు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కొందరు విద్యార్థులు పక్క గ్రామమైన తమ్మారం ప్రాథమిక పాఠశాలకు కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు. చదవండి: ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్ఎం అనిల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో వారు హెచ్ఎంను నిలదీయండంతో నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆయనపై దాడిచేశారు. హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. చదవండడి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
రైతు బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్’ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్నొవేషన్ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్ అశోక్ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు. విత్తనం వేసుకునే చేతి పరికరం: పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడే పరికరం అశోక్ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. బహుళ ప్రయోజనకర యంత్రం అశోక్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్ యుటిలిటీ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా! ashokgorre17@gmail.com -
నిరుద్యోగంపై వైఎస్ షర్మిలకు తొలి విజయం
నేరేడుచర్ల / హుజూర్నగర్/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు. నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) స్టేట్ కో ఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు -
కిడ్నాప్ తరహాలో జర్నలిస్ట్ అరెస్టా?: సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు జర్నలిస్ట్ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్‌ను కిడ్నాప్ తరహాలో అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జర్నలిస్ట్ రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత అని, అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని సంజయ్ హితవు పలికారు. హుజూర్నగర్ జైలుకు జర్నలిస్ట్ రఘు.. 14 రోజుల రిమాండ్ హుజూర్నగర్: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్లో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరోజు చోటుచేసుకున్న ఘటనలపై నమోదైన కేసులో జర్నలిస్ట్ రఘు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మఠంపల్లి పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని హుజూర్నగర్ కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంటనే హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. -
కాంగ్రెస్ ఎంపీలను అవమానిస్తున్నారు
మఠంపల్లి (హుజూర్నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై ఇటీవల ప్రారంభమైన వంతెనను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 2013లో రూ.50 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించానని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అప్రోచ్‌రోడ్డు పనులు మాత్రమే చేసి కనీస ఆహ్వానం కూడా లేకుండా తనను అవమానపరచిందన్నారు. అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు కొన్ని హక్కులు, ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని, కానీ ఉన్నతాధికారులు వాటిని పాటించకుండా కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులతో నామమాత్రపు సమాచారమిచ్చి శిలాఫలకం కిందిభాగంలో పేరు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్రిడ్జికి సంబంధించి పూర్తిస్థాయి నిధులను తానే మంజూరు చేయించి, పనులను కూడా పూర్తిచేయించానని వెల్లడించారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనలతోనే రాష్ట్రాలకు మంజూరవుతాయన్నారు. ఈ నిధులతో చేపట్టిన పథకాల ప్రారంభ కార్యక్రమాలకు ఎంపీలను పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను అవమానపరుస్తున్నారన్నారు. ఈ ఉల్లంఘనలు క్రోడీకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, అలాగే హక్కుల కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. (చదవండి: ఖమ్మంలో బండి సంజయ్ వ్యాక్సిన్లు పనిచేయవు) -
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
-
నకిలీ హిజ్రా జుట్టు కత్తిరించారు..
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని హుజూర్ నగర్లో హిజ్రా వేషంలో తిరుగుతున్న ఓ వ్యక్తికి స్థానిక హిజ్రాలు దేహశుద్ది చేశారు. హుజుర్ నగర్ పట్టణంలో పొట్టి శ్రీరాములు సెంటర్ సమీపంలో అతని జుట్టు కత్తిరించి ఊరేగింపు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు మహిళా వేషం వేసుకొని స్థానికంగా ఉన్న తమను కత్తులతో చంపుతామని బెదిరిస్తున్నారని హిజ్రాలు పోలీసులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇక్కడ హిజ్రాల వేషం వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారు ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఆ నింద తమ సమాజంపై పడే అవకాశం ఉందని హిజ్రాలు వాపోయారు. అందుకే ఆ వ్యక్తిని దేహశుద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
హుజూర్‌నగర్‌లో హరితహారం కార్యక్రమం
-
సూర్యాపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్
సాక్షి, సూర్యాపేట: సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు సూర్యాపేటలో పర్యటించి హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో హరితహారం మొక్కలు నాటి, నూతనంగా ఏర్పాటైన హుజూర్నగర్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తున్నామన్నారు. ప్రతి నెల మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత దెబ్బతిన్నప్పటికీ వేగంగా పుంజుకుందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రైతు బంధు పథకం రైతులకు ఆసరాగా నిలిచిందన్నారు. అర్హులైన వారందరికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పనులను త్వరలోనే పూర్తి చేసిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ దీపికా, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటా: ఈటల
సాక్షి, హుజురాబాద్‌రూరల్: ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటానని, నేనున్నంత వరకు ఎంత గొప్ప వైద్యమైనా అందించే ప్రయత్నం చేస్తాన ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పురపాలక సంఘం తొలి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ర్యాలీగా కార్యాలయానికి వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ తదితరులు మంత్రిని గజమాలతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడం సు లువని, కౌన్సిలర్‌గా గెలవడం తేలికకాదన్నారు. వార్డు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి చే యించానని తెలిపారు. పట్టణంలో రూ.50 కో ట్ల నిధులతో భగీరథ పనులు మరోమూడునెలల్లో పూర్తవుతాయని తెలిపారు. నిరుపేదలకు చిరకాల ఆకాంక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గణేశ్‌నగర్‌లో, బోర్నపల్లిలో నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, త్వరలో ప్రజలకు అందిస్తామని తెలి పారు. శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని తెలిపారు. హుజురాబాద్‌లో వందపడకల ఆసుపత్రితో మినీ ఎంజీఎంలా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తుందని తెలిపారు. రూ.12 వేల కోట్లతో ఆసరా పింఛన్లకోసం ప్ర భుత్వం ఖర్చు చేస్తోందని తెలి పా రు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర సహా య కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. -
టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా: ఉత్తమ్
హుజురాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటముల కారణంగానే టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక తాను ఆ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు వార్తలు వినిపించాయి. చదవండి: రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా! అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది. రాజీనామా తర్వాత హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరికొన్నిరోజుల్లో అధ్యక్ష పదవిని త్యజిస్తున్నానని కార్యకర్తలతో చెప్పారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేశారు. కాగా, ఉత్తమ్ కుమార్ ప్రకటనపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తున్నది ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: 'పౌరసత్వ చట్టం నచ్చని వారు సముద్రంలోకి దూకండి' -
ఎగిరిపడే వాళ్లకు ఎన్నికలతోనే సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికలు ఈ నెలలో లేదా.. కోర్టు తీర్పు కొంత ఆలస్యమైతే వచ్చే నెలలో జరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైవిధ్యంగా, భిన్నంగా ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవతలి పార్టీ అభ్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతోనూ ఓడిన సందర్భాలున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి..’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఇన్‌చార్జీలుగా పనిచేసిన పార్టీ రాష్ట్ర నేతలు, నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం తెలంగాణభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించే దుర్మార్గులు పక్క పార్టీల్లో ఉన్నారు. విపక్ష పార్టీల నేతల తరహాలో బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఎగిరిపడే వారికి ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలి’అని అన్నారు. బీజేపీది ఓవరాక్షన్.. ‘హుజూర్నగర్ ఎన్నికల్లో బీజేపీ ఓవరాక్షన్ చేసి.. నిన్న మొన్నటిదాకా బిల్డప్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల తర్వా తే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంది. హుజూర్నగర్ ఎన్నిక జరగకుండా బీజేపీ అడ్డుకునే ప్రయ త్నం చేసిందనే సమాచారం ఉంది. హుజూర్నగర్ ఉపఎన్నికతో బీజేపీ ప్రచార పటాటోపం బయటపడింది.’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాలు గాలివాటమే అని తేలిపోవడంతో పాటు, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న అసలైన బలమేమిటో ప్రజలు ఓట్లు వేసి మరీ తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలయ్యాయి. హుజూర్నగర్ ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలమేంటో తేలిపోయింది. స్వయానా టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ప్రజాభిమానం ముందు ప్రతిపక్షాల ప్రచార ఆర్భాటం చిన్నబోయింది’అని వ్యాఖ్యానించారు. కారు గుర్తును పోలిన చిహ్నాలతో నష్టం ‘హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి 50వేలకు పైచిలుకు మెజారిటీ వచ్చేది. పార్టీ చిహ్నం కారు గుర్తును పోలిన ఇతర చిహ్నాలతో నష్టం జరిగింది. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాం టి తప్పులు జరగకుండా పరిష్కారం చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెప్తున్నాం. హుజూర్నగర్ ప్రజల రుణం తీర్చుకునేందుకు, ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే సైదిరెడ్డిపై స్థానిక నేతలు ఒత్తిడి తేవాలి. అధికారం, దుర్వినియోగం కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా, ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్లోకి వస్తే తీసుకుని పార్టీని బలోపేతం చేయాలి’ అని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్.. సంస్థాగత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కృషి చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ అభినందించారు. కంచుకోట కాదు.. కరుగుతున్న మంచుకొండ హుజూర్‌నగర్‌ను కాంగ్రెస్ కంచుకోట అంటూ మీడియా ప్రచారం చేసిందని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట.. అక్కడ కరుగుతున్న మంచుకొండ అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల విజయం సీఎం కేసీఆర్ నాయకత్వానికి, కేటీఆర్ వ్యూహానికి దక్కిన ఫలితంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. ‘కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే హుజూ ర్‌నగర్ ప్రజలకు లాభం అని కేటీఆర్ ఇచ్చిన నినాదానికి అక్కడి ప్రజలు ఓట్లేశారన్నారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత తెలంగాణభవన్‌లో కేటీఆర్ ఇచ్చిన విందు లో నల్లగొండ జిల్లా, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు, పార్టీ ఉప ఎన్నిక ఇన్చార్జీలు.. మొత్తం 300 మంది పాల్గొన్నారు. -
నీళ్లేవో.. పాలేవో తేల్చారు
సాక్షి, సూర్యాపేట: ‘హుజూర్నగర్ ముద్దుబిడ్డలకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు అందిం చిన విజయం తప్పకుండా మాలో ఉత్సాహాన్ని, సేవా భావాన్ని పెంచడంతోపాటు మరింత అంకితభావంతో పనిచేసే స్ఫూర్తి కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాపనిందలు అన్నింటినీ విశ్లేషణ చేసి మీరు నీళ్లేవో.. పాలేవో తేల్చిచెప్పారు. బల్లగుద్ది మరీ హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’అని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహిం చిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్డు మార్గం ద్వారా హుజూర్నగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంట వెయ్యికిపైగా వాహనాలు వచ్చాయి. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మీరిచ్చిన ఫలితానికి సరిసమానంగా అభివృద్ధి.. హుజూర్‌నగర్‌లో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు మండల కేంద్రాలను తీసేస్తే 134 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎలా అయితే ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితం ఇచ్చారో దానికి సరిసమానంగా సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్ అద్భుతమైన నియోజకవర్గం అనే పరిస్థితి రావాలి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. రేపో, ఎల్లుండో జీఓ విడుదల చేస్తాం. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్నగర్ మున్సి పాలిటీకి సీఎంగా నా నిధుల నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నా. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొంత పోడుభూముల సమస్య ఉంది. దీనిపై అన్ని జిల్లాలకు నేనే వెళ్తున్నా. మొత్తం మంత్రివర్గం వచ్చి ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది. 3 ఫీట్లు జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు.. హుజూర్‌నగర్‌ను అభివృద్ధి బాటలో పెట్టడానికి వచ్చా. మాటలు మాట్లేడేవారు దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి మూడు ఫీట్లు లేడని మాట్లాడారు. ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉన్నడు. కానీ ఇక్కడ ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చాలా మంది చేసింది చెబితే మీరు (ప్రజలు) నవ్వుతారు. కానీ ఇవ్వాళ మూడు ఫీట్లు ఉన్న మంత్రి 300 కి.మీ. దూరాన ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్ మండలంలోని చివరి గ్రామాలు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు జిల్లా భూములను పునీతం చేస్తుండు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్ల మండలానికి తెచ్చాడు. ఇది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుంది. సాగర్ ఆయకట్టును కాపాడుకుంటాం.. నాగార్జునసాగర్ ఆయకట్టును నల్లగొండ జిల్లాలో కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును తీసుకున్నాం. దీని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు తొలగుతాయి. నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలి. దీనికోసం గోదావరి నీళ్లు సాగర్ ఎడమ కాలువలో పడాలి. ఈ నీళ్లతో రెండు పంటలు ఏటా పండాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నాలుగేళ్లు అహోరాత్రాలు పనిచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ సాగర్ ఆయకట్టుపై పడుతుంది. కచ్చితంగా తిరుగుతా. ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వచ్చే 15–20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటన చేస్తా. ప్రజలను, రైతులను కలుస్తా. ఈ బడ్జెట్లో, వచ్చే బడ్జెట్లో కొన్ని నిధులు మంజూరు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. ఏ ఎత్తిపోతలు కావాలో అన్నీ మంజూరు చేస్తాం. కాలువల లైనింగ్‌లు చేస్తాం. ఈ పనుల్నీ త్వరలో జరుగుతాయి. నవంబర్ మొదటి వారంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ నిపుణులు, నాగార్జునసాగర్ సీఈ నర్సింహతో తిరిగి పరిశీలించాలి. ఎత్తిపోతల రైతాంగానికి శుభవార్త.. ఐడీసీ, నీటిపారుదలశాఖ కింద ఎత్తిపోతల బాధ్యతలు సొసైటీలు, ఎన్జీఓల పరిధిలో ఉన్నాయి. రైతులపై పైసా భారం లేకుండా వాటన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుంది. అందులోని సిబ్బందినీ ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 600 ఎత్తిపోతలకు ఈ ఉపశమనం ఉంటుంది. రైతాంగమంతా సంతోషిస్తుంది. హుజూర్నగర్ ప్రజా కృతజ్ఞత సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి ఈ శుభవార్త చెబుతున్నా. కర్రు కాల్చి వాత పెట్టారు.. సైదిరెడ్డికి మీరు (ప్రజలు0 40 వేలకుపైగా మెజారిటీ ఇచ్చారు. కొందరు దుర్మార్గులు ఆయనది గుంటూరు జిల్లా అన్నారు. ఆయనది గుంటూరు జిల్లా కాదు కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టారు. మీ అందరి దీవెనలు ఇలానే ఉంటే ఎవరు ఏమన్నా భయపడకుండా, వెరవకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తాం. మళ్లీ వచ్చినప్పుడు జానపహాడ్ దర్గా, మట్టపల్లి ఆలయం దర్శనం చేసుకుంటా. ఈ రెండు పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తాం. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి సైదిరెడ్డికి విజయం చేకూర్చి కేసీఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్ అని చెప్పిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తాం. -
ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు
-
హుజూర్‌నగర్‌కు కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నియోజకవర్గ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద హుజూర్‌నగర్‌కు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇస్తామని అన్నారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. (చదవండి : కారుకే జై హుజూర్!) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేస్తాం. హుజూర్‌నగర్‌లో బంజారా భవన్ మంజూరు చేస్తున్నా. ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తాం. హుజూర్‌నగర్‌లో కోర్టు కూడా ఏర్పాటు చేసేలా చూస్తాం. ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తాం, ప్రజా దర్బార్లు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తాం’ అన్నారు. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొందిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్లో హుజూర్ జోష్
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో 43వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి, నియోజకవర్గ కేంద్రంలో శనివారం ‘కృతజ్ఞత సభ’పేరిట బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17న పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొనాల్సిన బహిరంగ సభ వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. సుమారు పది రోజులక్రితం నిర్మించిన సభా వేదికను తొలగించక పోవడంతో శనివారం జరిగే బహిరంగ సభను అదే ప్రదేశంలో నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉప ఎన్నిక ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌కు చేరుకుని, సాయంత్రం ఐదు గంటలకు జరిగే ‘కృతజ్ఞత సభ’లో ప్రసంగిస్తారు. హుజూర్నగర్ విజయంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి, పార్టీ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఫోన్లో అభినందించిన కేసీఆర్, తనను కలిసేందుకు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, శనివారం జరిగే సభకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న కేసీఆర్‌కు భారీ స్వాగతం చెప్పేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సమన్వయ కమిటీలు..సామాజిక కోణాలు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి వరుసగా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ పోటీ చేసినా.. పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం రూపొందించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెప్టెంబర్ చివరివారంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కొందరు ఎంపిక చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రచార వ్యూహం అమలు, సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ సుమారు 70 మంది ఇన్‌చార్జీలకు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలతో పాటు కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయిలో తొమ్మిది మందితో కూడిన కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు కమిటీల ఏర్పాటు వ్యూహం టీఆర్ఎస్కు కలిసి వచ్చింది. పార్టీ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ అభినందించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులను శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మున్సిపోల్స్‌లోనూ ఇదే తరహా వ్యూహం క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఇతర పార్టీల నుంచి చేరికలు తదితరాలతో భారీ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తమ నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు లేని ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు మున్సిపాలిటీల వారీగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ప్రచారం, సమన్వయం బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను గుర్తించి.. వారిని పార్టీ గూటికి చేర్చే బాధ్యతను కూడా ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై కేటీఆర్ పార్టీ మున్సిపల్ ఇన్‌చార్జీలతో త్వరలో సమావేశం కానున్నారు. -
కారుకే జై హుజూర్!
సాక్షి, హైదరాబాద్ /సూర్యాపేట: విపక్షాల మాటలను హుజూర్నగర్ ప్రజలు విశ్వసించలేదు.. కాంగ్రెస్ నేతలు కలిసి కట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేసినా పట్టించుకోలేదు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావమూ కని పించలేదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియోజ కవర్గ అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తక్కువ మెజార్టీతో గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్ సర్వే లను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ తొలిసారిగా కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,358 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు సృష్టించారు. సైదిరెడ్డికి 1,13,095 ఓట్లు రాగా పద్మావతిరెడ్డికి 69,737 ఓట్లు వచ్చా యి. ఇండిపెండెంట్ సపావత్ సుమన్ 2,697 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటా రామారావుకు 2,639 ఓట్లు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయికి 1,827 ఓట్లు, సీపీఎం మద్దతు ఇచ్చిన దేశగాని సాంబశివ గౌడ్‌కు 885 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 894 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,00,754 ఓట్లలో 28 మంది అభ్యర్థులకు 2,00,248 ఓట్లు పడగా, నోటాకు 506 ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ సహా 24 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని రౌండ్లలో గులాబీ హవా... కౌంటింగ్ మొదలైన తర్వాత ఒకటో రౌండ్ నుంచి చివరిదైన 22వ రౌండ్ వరకు అన్నింటా గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 15వ రౌండ్లో అత్యధికంగా 3,014 ఓట్ల మెజార్టీ రాగా, అత్యల్పంగా 22వ రౌండ్లో 748 ఓట్ల మెజార్టీని దక్కించుకుంది. నియోజకవర్గంలోని ఏడు మండ లాలు, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలి టీల్లోనూ కారు జోరు కొనసాగింది. రెండు, మూడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. బీజేపీ, టీడీపీ సర్వశక్తులొడ్డినా ఆశించిన స్థాయిలో వారికి ఓట్లు పడలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి కేవలం 1,084 ఓట్లు మాత్రమే పెరిగాయి. గత ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, సైదిరెడ్డికి 85,530 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బొబ్బా భాగ్యారెడ్డికి 1,555 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 7,466 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో దెబ్బతిన్నామని భావించిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో జాగ్రత్తపడింది. దీంతో భారీ మెజార్టీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్లో జోష్.. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్‌పై హుజూర్నగర్ ప్రజలు చూపిన విశ్వాసం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా వచ్చిందేమీ కాదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించడం ద్వారా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించాలనే కోణంలోనే అక్కడి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేశారని వారంటున్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సైదిరెడ్డిపై కూడా కొంత సానుభూతి వచ్చిందని, అనేకసార్లు ఉత్తమ్‌కు ఓటు వేసిన వారు కూడా ఈ ఒక్కసారి స్థానికుడైన సైదిరెడ్డికి వేద్దామనే ఆలోచనతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ‘చే’జారిన కీలక స్థానం హుజూర్నగర్ ఫలితం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యాన్ని నింపింది. ఏర్పాటైన నాటి నుంచి తమకు అండగా నిలుస్తూ వచ్చిన కీలక స్థానం చేజారిపోవడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడంలేదు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల ఐక్యతారాగం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని, సాంప్రదాయ బద్ధంగా ఉన్న పార్టీ బలం తమను విజయతీరాలకు చేరుస్తుందని ఆశించినా ఊహించని పరాభవం ఎదురుకావడం వారికి మింగుడు పడడంలేదు. కౌంటింగ్ ప్రారంభమై తొలి రౌండ్ ఫలితం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది. మంచి పట్టున్న నేరేడుచర్ల, పాలకవీడు, మేళ్లచెరువు, మఠంపల్లి వంటి మండలాల్లో కూడా భారీ నష్టం జరగడం, పార్టీ తరఫున ప్రచారం సరిగా నిర్వహించకలేపోవడంతో కాంగ్రెస్ పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు చెదరలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత అతి తక్కువగా తమకు 2014 ఎన్నికల్లో 69, 879 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో 69,737 ఓట్లు వచ్చాయని, అంటే తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయని, బీజేపీకి ఎక్కడా బలం లేదని నిరూపించగలిగామని అంటున్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న సైదిరెడ్డి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జేసీ సంజీవరెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్యల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం సైదిరెడ్డిని విజేతగా ప్రకటిస్తూ ఆయనకు ధ్రువీకరణపత్రం అందజేశారు. సైదిరెడ్డి వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌లు ఉన్నారు. ఇది హుజూర్నగర్ ప్రజల విజయం అరాచకవాదాన్ని తీసేసి అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి గెలిపించారు. ముందే ఊహించినట్టు భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో వారే గెలిచారు. నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా. అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. హుజూర్నగర్ అభివృద్ధి కోసం కలిసొస్తానంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలుపుకొని పోతాం. రైతులు, మహిళల అభివృద్ధే ఎజెండాగా ముందుకెళ్తాం. యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా సాధికారత, లిఫ్ట్‌లు, రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ తదితర పనులు చేయిస్తా. నా గెలుపు కోసం కృషి చేసిన ఓటర్లు, ప్రజలు, పార్టీ కేడర్‌కు, నేతలకు అభినందనలు తెలుపుతున్నా.– శానంపూడి సైదిరెడ్డి రీపోలింగ్ నిర్వహించాలి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. ఉత్తమ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటు వేసినా ట్యాంపరింగ్‌తో మాయ చేశారు. మా పార్టీ, బీజేపీకి రావాల్సిన ఓట్లు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి వారి కుటుంబాల ఓట్లు కూడా వారికి పడలేదు. అందుకే ఆ అభ్యర్థులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లను టీఆర్ఎస్ భయబ్రాంతులకు గురిచేసింది. రీపోలింగ్‌ను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో పెట్టాలి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. న్యాయపోరాటానికైనా సిద్ధం. – నలమాద పద్మావతిరెడ్డి