Increasing
-
ఛత్తీస్‌గఢ్‌లో చలి విజృంభణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను చలిపులి చంపేస్తోంది. నవంబర్ రెండో వారం నాటికే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని సూరజ్‌పూర్, సుర్గుజా, మార్వాహి, కోర్బా, ముంగేలి, బిలాస్పూర్, రాజ్‌నంద్‌గావ్, బలోద్, కంకేర్, నారాయణపూర్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది.రానున్న మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణుడు హెచ్‌పీ చంద్ర తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.గత 24 గంటల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, బలరామ్‌పూర్ రామానుజ్గంజ్లో 29.4 డిగ్రీలు, సర్గుజాలో 28.9 డిగ్రీలు, జష్పూర్లో 29.9 డిగ్రీలు, కొరియాలో 29.4 డిగ్రీలు, మర్వాహిలో 28.9 డిగ్రీలు, కోర్బాలో 30.3 డిగ్రీలు, ముంగేలిలో 3.4 డిగ్రీలు, 3.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అదే సమయంలో, రాజ్‌నంద్‌గావ్‌లో 30.5 డిగ్రీలు, బలోద్‌లో 31.7 డిగ్రీలు, కంకేర్‌లో 30.7 డిగ్రీలు, నారాయణపూర్‌లో 29.4 డిగ్రీలు, బస్తర్‌లో 30.3 డిగ్రీలు, బీజాపూర్‌లో 30.9 డిగ్రీలు, దంతవాడలో 32 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని రాయ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి.. -
బీహార్‌లో డెంగ్యూ విజృంభణ.. ఒక్కరోజులో 90 కేసులు
పట్నా: బీహార్‌లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్నాలో వరుసగా మూడవ రోజు రికార్డు స్థాయిలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పాట్నాలో ఒక్కరోజులో అత్యధికంగా 90 మంది డెంగ్యూ బారినపడ్డారు.పాట్నా జిల్లాలో మొత్తం డెంగ్యూ బాధితుల సంఖ్య 1,147కి చేరింది. కంకర్‌బాగ్ ప్రాంతం డెంగ్యూ కేసులకు హాట్ స్పాట్‌గా మారింది. ఇక్కడ ప్రతీ ఇంటిలోనూ డెంగ్యూ బాధితులు కనిపిస్తున్నారు. తానాలోని కంకర్‌బాగ్, అజీమాబాద్ తర్వాత బంకీపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. 28 మంది కంకర్‌బాగ్‌లో డెంగ్యూతో బాధపడుతున్నారు. బంకీపూర్‌లో 23 మంది, పాటలీపుత్రలో 13 మంది, అజీమాబాద్‌లో ఏడుగురు డెంగ్యూ బారినపడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. బీహార్‌లో మొత్తం 2,419 మంది డెంగ్యూ బారినపడినట్లు వైద్యాధికారులు గుర్తించారు.డెంగ్యూతో ఇప్పటివరకు బీహార్‌లో ఎనిమిది మంది మృతిచెందారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఎంసీహెచ్‌లోని మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యుడు డాక్టర్ రాజన్ కుమార్, ఎన్ఎంసీహెచ్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ కుమార్ సిన్హా విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ సోకకుండా ఉండాలంటే దోమలను నివారించాలన్నారు. ఇది కూడా చదవండి: ఏడడుగుల గోడ దూకి మేకను ఎత్తుకెళ్లిన తోడేళ్లు -
కాలేజీలు తగ్గినా.. సీట్లు పైకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020–21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 2024–25 విద్యా సంవత్సరానికి అవి 174కు తగ్గాయి. 20–21లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఈ ఏడాది సీట్లు 1,12,069కు పెరిగాయి. ఇంజనీరింగ్‌లో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ, ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది. చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదని ప్రవేశాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యార్థులు ఇంటర్ నుంచే హైదరాబాద్‌లో చదివేందుకు వస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్‌లోనూ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి.ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే..రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.5 లక్షల మంది ఇంటర్మిడియట్ పాసవుతున్నారు. ఇందులో 75 శాతంపైగా ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఉంటున్నారు. వీరిలో లక్ష మంది వరకూ రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారు. ఎన్ఐటీలు, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో చేరేవాళ్లు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సంస్థల్లో చేరేవాళ్లు మరో 10 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి 2.40 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1.80 లక్షల మంది పాసయ్యారు. కనీ్వనర్ కోటా కింద 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కలిపి మొత్తం 86,943 సీట్లు ఉన్నాయి. వీటిలో 75,107 సీట్లు భర్తీ చేశారు. దాదాపు 31 వేల బీ కేటగిరీ సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల క్యాంపస్‌లలో కనీసం 10 వేల మంది చేరినట్టు అంచనా. బాసర ఆర్జీయూకేటీ, హెచ్‌సీయూలోని సీఆర్‌రావు విద్యా సంస్థతో పాటు తమిçళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ వర్సిటీల్లో మరో 10 వేల మంది చేరే వీలుంది. ఎందుకీ క్రేజ్ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాలన్నీ కంప్యూటర్ కోర్సులు చేసినవారితోనే జరుగుతున్నాయి. డిగ్రీ, ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్ప ఐటీ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో విద్యార్థుల డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రైవేటు కాలేజీలు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో పాటు అన్ని బ్రాంచీల్లోనూ మార్పు అనివార్యమవుతోంది. ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతోంది. అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్‌పై క్రేజ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ప్రభావమే మార్చేస్తోంది ఇంజనీరింగ్‌లోని అన్ని బ్రాంచీల్లోనూ ఆరి్టఫిíÙయల్ టెక్నా లజీ దూసుకొస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు... సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్‌లోనూ ఏఐ లేకుండా ముందుకెళ్లడం కష్టం. అందుకే బ్రాంచీ ఏదైనా ఏఐ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తూనే... ఏఐ నేర్చుకుంటున్నారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. – డాక్టర్ కె.విజయకుమార్‌రెడ్డి రెక్టార్, జేఎన్టీయూహెచ్ -
వివాహ‘బంధం’ తెగతెంపులు!
సాక్షి, హైదరాబాద్: వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడాకులకు సిద్ధమౌతున్న విచిత్రపరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. గతంలో భారత సెలబ్రిటీల్లోనే (సినిమా, క్రీడలు, వ్యాపార, ఇతర రంగాల వారు) ఈ ట్రెండ్ అధికంగా కనిపించగా, రానురాను దాదాపు అన్ని వర్గాల్లో ఈ ధోరణి సాధారణంగా మారుతోంది. గతంతో పోల్చితే... గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో విడాకుల శాతం గణనీయంగా పెరిగినట్టుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. విడాకులంటేనే ఏదో చేయరాని నేరం అని ఏళ్లుగా పేరుకుపోయిన భావన నుంచి నేటితరం బయటపడడంతో జీవితంలో నూతన అధ్యాయం కోసం యువతరం మొగ్గుచూపుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి పెరగడానికి వైవాహికపరమైన వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలోని వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు ఒత్తిళ్లకు గురికావడం, సామాజిక–సంప్రదాయ విలువలు, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ తదితర కారణాలతో విడాకులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి చూస్తే (2022 సంవత్సరం చివర్లో) దేశంలో విడాకుల శాతంలో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేశాక వివిధ దశలు దాటి తీర్పు వెలువడే నాటికి పదేళ్లకుపైగా పడుతున్న సందర్భాలు కూడా ఉండటంతో... అనధికారికంగా విడిపోతున్న జంటలు పెద్ద సంఖ్యలో ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఇండోర్‌లో... 👉 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 👉 దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 715 ఫ్యామిలీ కోర్టులున్నాయి. 👉 ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కోసమే కాగా... వాటిలో పెళ్లయిన ఏడాదిలో పెట్టిన కేసులు 3,000. 2018లో 2,250 కేసులు ఫైల్ కాగా, 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి. 👉 గత పదేళ్లలో...అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో 350 శాతం పెరిగిన విడాకులు. ఇదే సమయంలో పంజాబ్, హరియాణాల్లో 150 శాతం ఈ కేసుల వృద్ధి 👉 గత ఐదేళ్లలో ఢిల్లీలో విడాకుల శాతం రెండింతలు పెరిగింది. 👉 ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి జాగ్రత్తలు తీసుకుంటే... ‘ఈ మధ్య వారానికి ఏడెనిమిది కేసులైనా విడాకుల కోసం మా దగ్గరకు వస్తున్నాయి. వీరిలో 30 శాతం దాకా తమ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేందుకు మొగ్గుచూపుతుంటే, అధికశాతం మొండికేసి విడాకుల కోసం పట్టుపడుతున్నారు. తెగతెంపులకు 40 నుంచి 50 శాతం తల్లితండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటోంది. విడాకులు తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు. అదేదో డయోబెటిస్, థైరాయిడో వచ్చిందనేంత తేలికగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం దంపతుల మధ్య ఒకరిపట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుబాటు చేసుకోలేక ఘర్షణ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరిలోనూ స్వార్థం పెరిగిపోవడం, సహానుభూతి కొరవడడం, అనుమానాలు పెరగడం ప్రభావం చూపుతున్నాయి. తల్లితండ్రులు కూడా సర్దుబాటు అవగాహన కలి్పంచకపోగా, చదువుకున్నారు, సంపాదిస్తున్నారు మీకేమీ తక్కువ అనేలా రెచ్చగొడుతుండటంతో పరిస్థితులు తెగే దాకా వస్తున్నాయి. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపడం తగ్గిపోయి, పాత విషయాలను పదేపదే ప్రస్తావనకు తేవకపోవడం, గొడవలకు తల్లితండ్రులను మధ్యలోకి తెచ్చి బాధ్యులను చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇద్దరి మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయి. – అనిత, ఫ్యామిలీ కౌన్సెలర్, భాస్కర మెడికల్ కాలేజీ క్లినికల్ సైకాలజిస్ట్ వివాహబంధం అక్కర్లేదనే అంచనాకు.. ‘మన దగ్గరా విడాకులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత నుంచి చూస్తే... దేశంలో అమ్మాయిలకు మంచి విద్యతోపాటు ఉద్యోగావకాశాలు పెరగడంతో ఆర్థిక స్వాతంత్య్రం పెరిగింది. యూఎస్, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వృద్ధికావడంతో గిల్లికజ్జాలు, చికాకులు, సమస్యలతో వివాహబంధాన్ని తప్పక కొనసాగించాల్సిన అవసరం లేదనే అంచనాకు ఇటు అమ్మాయిలు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు పెరిగిపోవడంతో ఇంటాబయటా మహిళలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రోజూ సమస్యలు ఎదుర్కొంటూ బతకడం కంటే విడిపోయి సంతోషంగా జీవించవచ్చనే అభిప్రాయానికి అమ్మాయిలు వస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి ఇళ్లలోని పరిస్థితులు మారకుండా సంప్రదాయ పద్ధతుల్లోనే ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటున్న సందర్భాలున్నాయి. దీంతోపాటు వారిద్దరి మధ్య ప్రతీ చిన్న విషయంలో తల్లితండ్రులు కలగజేసుకోవడంతో ఘర్షణలు పెరుగుతున్నాయి. సమాజంలో ఇంకా పురుషాధిక్యత అనేది ఏదో ఒక రూపంలో కొనసాగడం, పిల్లలుంటే వారి భారమంతా తమపైనే పడుతుందని సంతానం వద్దనే నిర్ణయానికి 10 నుంచి 15 శాతం యువతులు వస్తున్నారు. ఈ మేరకు పెళ్లికి ముందే ఒప్పందం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడటం, దానిని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడంతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు. అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు. -
హైపర్‌టెన్షన్‌కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్‌టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్‌టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్‌టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్‌టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్‌టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్‌టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
ట్రేడింగ్‌లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్‌ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్‌వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే..
కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తలు మళ్ళీ భయాన్ని కలిగిస్తున్నాయి. జె.ఎన్ -1 సబ్ వేరియంట్ (ఉపరకం) ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాల్లో వ్యాప్తిలో వుంది. కేరళలో 300 కేసులు,తెలంగాణలో 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కేరళలో మూడు మరణాలు సంభవించినట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో మొదటి నుంచి కరోనా ఉధృతి ఎక్కువగానే వుంది. దేశంలోనే తొలి కేసు నమోదైంది కూడా అక్కడే. కరోనాను బాగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం విశేషం. చలి కాలం, పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకూ కేరళలో తప్ప, ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగుల వివరాలు మిగిలిన రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఐనప్పటికీ,కేంద్ర ప్రభుత్వం తను అప్రమత్తమవుతూ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఇది మంచి పనే. ఇది ముందు జాగ్రత్త చర్యల్లో భాగమే తప్ప,వేరు కాదు. చలికాలం కాబట్టి ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి కొంత జరుగుతోంది. దాని గురించి పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్న మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య కొంత పెరుగుతోంది. కొందరు జ్వరం బారిన కూడా పడుతున్నారు.ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. ఇదంతా సీజనల్ పరిణామాలుగానే భావించాలని ఎక్కువమంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం!. కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదు. వ్యాక్సినేషన్ బాగానే జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్లతో పాటు అనేక రకాల మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ జె.ఎన్-1 సోకినా ఈ మందులు, అందుబాటులో వున్న వైద్యం సరిపోతుందనే నిపుణులు ధైర్యాన్ని కలిగిస్తున్నారు.ఈ కొత్త వేరియంట్ కు మనిషిలోని రోగ నిరోధకశక్తిని అధిగమించే శక్తి వున్నప్పటికీ, ఆందోళన చెందాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే,ప్రభుత్వం,నిపుణులు చేసే హెచ్చరికలను పెడచెవినపెట్టరాదు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కూడా కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.పరీక్షలు పెంచడం,వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం కీలకం. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలి. తగినంత ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూడాలి. యాంటీబయోటిక్స్ వాడకంపై గతంలోనే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని పాటించాలి. యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ మునుపెన్నడో సూచించింది.అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెప్పింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అని గతంలో చెప్పింది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ వ్యాప్తి చెందుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికి మాటికీ యాంటీ బయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా వుండడం, శారీరక పరిశుభ్రత పాటించడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకొనే మార్గంలో వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం, ఆహారం, నిద్రాది అంశాల్లో క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. -మాశర్మ ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
‘గ్రాప్- 3’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తోంది?
దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా గ్రాప్- 3ని కూడా అమలులోకి తీసుకువచ్చారు. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ‘తీవ్రమైన’ కేటగిరీకి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్లో పలు నిర్మాణ పనులను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు నిలిపివేశారు. డీజిల్‌తో నడిచే ట్రక్కులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో గ్రాప్-3 అనేది మూడవ దశలో భాగం. ఇది చలికాలంలో ఢిల్లీ అంతటా అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిన వాయు కాలుష్య నిర్వహణ వ్యూహం. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 402గా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా కాలుష్య స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత పరిస్థితిని పరిశీలించడానికి జరిగిన సమావేశంలో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను రూపొందించే బాధ్యత చేపట్టిన సీఏక్యూఎం ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. గ్రాప్ అనేది నాలుగు దశలుగా విభజించిన విధానం. వీటిని ‘పూర్’ (ఏక్యూఐ 201-300), ‘వెరీ పూర్’ (ఏక్యూఐ 301-400), ‘తీవ్రమైన’ (ఏక్యూఐ 401-450), ‘మరింత తీవ్రమైన’ (ఏక్యూఐ >450)వర్గాలుగా పేర్కొన్నారు. గ్రాప్ స్టేజ్-3లో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులు, ముఖ్యమైన మైనింగ్, స్టోన్ బ్రేకింగ్ కార్యకలాపాలు మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తారు. ఢిల్లీకి బయట రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలతో పాటు డీజిల్‌తో నడిచే ట్రక్కులు, మధ్యస్థ, భారీ కంటెయినర్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధించారు. ఇది కూడా చదవండి: కాలుష్య భూతం: టెక్ కంపెనీల కీలక చర్యలు -
జీవన ప్రయాణంలో అవసరంగా మారిన వాహనం
ఒకప్పుడు ఎవరికైనా బైక్, కారు ఉందంటే వాళ్లు ధనవంతులు అని గుర్తింపు ఉండేది. గ్రామాల్లోకి బైకుల్లో, కార్లలో ఎవరైనా వస్తే ప్రజలు ఆసక్తిగా చూస్తుండేవాళ్లు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. మధ్య తరగతి ప్రజల్లో కార్ల వినియోగం కూడా పెరిగింది. మారిన జీవన శైలి.. ఉద్యోగ, ఉపాధి అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ మోటారు వాహనం తప్పనిసరి అయ్యింది. నంద్యాల: ఇళ్ల ముందు, దుకాణాలు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, టీకొట్ల ఎదుట.. ఇలా ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి ఒక మోటారు వాహనం ఉందంటే అతిశయోక్తి కాదేమే. జిల్లాలో వివిధ రకాల వాహనాలు 3,45,884 ఉండగా.. వీటిలో అత్యధికంగా 3,12,613 ద్విచక్ర వాహనాలు ఉండటం విశేషం. అవసరాల నిమిత్తం ఒక్కొక్కరు ఒక బైక్ ఉపయోగిస్తున్నారు. సాధారణ కూలీ పనులకు వెళ్లే వారితో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వర్గాల ప్రజలు ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున 45–50 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈకోవలో నెలకు వెయ్యికి పైగానే వాహనాలు రిజి్రస్టేషన్లు అవుతున్నాయి. వాహనాల అమ్మకాలు, విక్రయాలు, రిజి్రస్టేషన్లతో రవాణా శాఖకు ఆదాయం పెరుగుతోంది. ప్రతి రోజూ బైక్‌లు, కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు, అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులు తదితర వాహనాలు అన్నీ కలిపి భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి ఆధునిక మోడళ్లు.. వాహన తయారీ కంపెనీలు తరచూ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాహనాల మోడళ్లను విడుదల చేస్తున్నారు. దీంతో వినియోగదారులు కొత్త వాటిపై ఆసక్తి చూపుతున్నారు. బీఎస్–4 తర్వాత మార్కెట్లోకి బీఎస్–6 వాహనాలు వచ్చాయి. వీటి కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. నచ్చిన బైక్, కారు ముందుగానే బుకింగ్ చేసుకొని డెలివరీకి నెలల సమయం పడుతున్నా అంత వరకు వేచి చూస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. ఫలితంగా స్కూటర్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల కాలంలో చాలా మంది వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇవి కాలుష్య రహితంగా ఉండటంతోపాటు పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో ఈ వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ట్రాక్టర్ల సంఖ్య.. జిల్లాలో వ్యవసాయంపైనే ఎక్కువ భాగం రైతులు ఆధారపడ్డారు. గతంలో ఎద్దులతో వ్యవసాయం, ఇతర పనులు చేసేవాళ్లు. కాలక్రమేణా వ్యవసాయంలో సాంకేతిక విప్లవం రావడంతో రైతులు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్లతో తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే వెసులుబాటు ఉంటుంది. పైగా కూలీల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ట్రాక్టర్లతోనే సేద్యం, కలుపు మొక్కలు తొలగించడం తదితర పనులు చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. కుటుంబాలతో ప్రయాణించేందుకు.. సాధారణ, మధ్య తరగతి వర్గాల నుంచి మొదలు కొని ప్రతి ఒక్కరికి బైక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో బైక్ ఉంటే స్థానికంగా, ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేయడానికి ఉపయోగపడుతుందని కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలు, తీర్థయాత్రలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. లేటెస్ట్ కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం పట్టణాలతో పాటు పల్లెల్లో సైతం వాలిపోతున్నాయి. వ్యాపారులు, రైతులు ఎక్కువ భాగం కార్లను ఉపయోగిస్తున్నారు. కార్లు కొనుగోలు చేయాలంటే గతంలో మాదిరిగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కారు ధరలో కొంత మేర డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన సొమ్మును సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. బైక్ తప్పనిసరి ప్రస్తుతం బైక్‌లు, కార్లు ప్రతి ఒక్కరికీ అవసరమవుతున్నాయి. ఏచిన్న పనికి వెళ్లాలన్నా బైక్ లేనిదే బయటకు వెళ్లడం లేదు. మాకు గ్రామ సమీపంలో నాపరాతి గని ఉంది. అక్కడికి వెళ్లాలంటే తప్పక బైక్ అవసరం ఉంటుంది. అత్యవసర పనులతో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు జీపు కొనుగోలు చేశాం. – సుధాకర్, అంకిరెడ్డిపల్లె వాహనాల సంఖ్య పెరుగుతోంది జిల్లాలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వివిధ రకాల కొత్త వాహనాలు 45 నుంచి 50 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతుంటాయి. ఈ లెక్కన నెలకు 1200కు పైగానే ఉంటాయి. ఎక్కువ భాగం ద్విచక్రవాహనాలే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. – శివారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి -
విద్యార్థి హాస్టళ్లు, పీజీలకు పెరుగుతున్న గిరాకీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు. క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
గ్రేటర్ లో 17రోజుల్లో కోటి బీర్లు సేల్
-
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
రోజురోజుకు పెరుగుతోన్న ఫ్లూ బాధితుల సంఖ్య
-
భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కారణం ఇదే!
ఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోందా?. తాజాగా భారత్‌లో మళ్లీ కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియాలో 97 రోజుల తర్వాత 300కి పైగా తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 2,686కిపైగా పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో ఒకే రోజు 334 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళలో ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 5,30,775కి పెరిగింది. దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 4.46 కోట్లు, కాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, ఇప్పుడు యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 0.00 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,54,035కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.63 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. కాగా, మళ్లీ కరోనా కేసులు పెరగడానికి నిర్లక్ష్యమే కారణమా?. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు తప్పనిసరిగ్గా ధరించాలని నిపుణులు చెబుతున్నా కానీ, మాస్క్‌లు పెట్టుకోకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో మార్కెట్లుల్లో కూడా చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. చైనా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జీవితంలో సుడిగుండం.. మానసిక శక్తిని దెబ్బతీసిన కరోనా -
అప్పుడే వద్దు.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలివే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలతో పాటు లైంగిక హింస, బాల్య వివాహాలు.. ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘ కాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మార్పు రాకపోవడం విస్మయపరుస్తోంది. కూతురు రజస్వల కాగానే పెళ్లి చేస్తే సరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు చదువు, కెరీర్, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచిస్తూ 26 ఏళ్ల వరకూ వివాహం చేసుకోవడం లేదు.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూతురికి పెళ్లిచేస్తే తమ బాధ్యత తీరుతుందని, బరువు తగ్గుతుందని పదహారేళ్లకే కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇక్కడే కాదు రాయలసీమ జిల్లాల్లోనే చిన్న వయసులో తల్లులవుతున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యంగా కలుగక మానదు. పదహారేళ్లకే తల్లులుగా.. వివాహ అర్హత వయసే 18 ఏళ్లు ఉండగా పదహారేళ్లకే తల్లులవుతున్న పరిస్థితి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గడిచిన 11 మాసాల్లో అనంతపురం జిల్లాలో 105 మంది అమ్మాయిలు 16 ఏళ్ల లోపు వయసులోనే గర్భం దాల్చారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో మరో 433 మంది గర్భం దాలి్చన వారిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ 16 ఏళ్లలోపు వయసున్న 63 మంది అమ్మాయిలు తల్లులయ్యారు. 18 ఏళ్లలోపు ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు మరో 283 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలే. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వారికి మూడుముళ్ల బంధం వేసి వారి కెరీర్‌కు మధ్యలోనే సమాధి కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై అబ్బాయిలతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న పరిస్థితులూ ఉన్నాయి. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలు ►మెటర్నల్ మోర్టాలిటీ అంటే కాన్పు సమయంలో తల్లులు మృతి చెందే అవకాశం ఉంది ►నెలలు నిండక ముందే పుట్టే అవకాశం ►స్టిల్ బర్త్ అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం ►శిశువులు బరువు తక్కువగా పుట్టడం ►తీవ్రస్థాయిలో రక్తపోటు ►శిశువులు సరిగా శ్వాస తీసుకోలేక పోవడం చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. చర్యలు తీసుకుంటాం 1098.. ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. బాల్య వివాహం చేసినట్లు లేదా ఏర్పాట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే సదరు ప్రాంతానికి వెళ్తాం. అమ్మాయిని కేజీబీవీలో చేర్పించి చదివిస్తాం. చట్టపరంగా తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై చిన్న వయసులో అబ్బాయిలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. – శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..
ఇస్తాన్‌బుల్: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు. టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి. దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు. మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది. చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే!
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంతం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరిగిన వైద్యులు రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్ వైద్యులుండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెరి్వకల్ క్యాన్సర్) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్ హాస్పిటల్లలో క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు ఇవీ.. ► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం ► లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ► పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ► యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ► మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు ఇలా చేస్తే నివారణ సాధ్యం 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. –డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. –డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో..
Ram Gopal Varma Ladki Movie: పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ చిత్రం టి అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందింది. ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సక్సెస్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇక సినిమా విజయవంతంగా ప్రదర్శితం కావడంతో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన మా శ్రేయోభిలాషిగా ఈ సినిమా కోసం ఎంతో పని చేశారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పాను. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నాను. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త జానర్లో సినిమాను ప్రయత్నించాం. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్లీ ‘అమ్మాయి’ సినిమాతో నిరూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రాపర్ సక్సెస్ మీట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలుపారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అమ్మాయి లాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆర్జీవీ గారికి, వెనుకుండి సపోర్ట్ ఇచ్చిన మా అంజన్న గారిని అభినందిస్తున్నాను. మా అంజన్న ఐదు సినిమాలు తీశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఇక రేపటి నుంచి ఏపీలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారని చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆర్జీవీ. చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మొదటి రోజే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు. అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూజా బాగా నటించింది. ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆర్జీవీ గారు, అంజన్న గారికి థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఆయనతో నాది ఐదేళ్ల ప్రయాణం. ఈ చిత్రం ఆయనకు మానసిక పుత్రిక. సినిమాను చూస్తూ అందరూ చొక్కాలు చించుకుంటున్నారు. శివ తర్వాత ఈ సినిమానే అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని అంటున్నారు. ఆ చిత్రాన్ని కూడా నేనే నిర్మిస్తాను. ఎంతో పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కూడా ఆర్జీవీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. -
జూలైలో పుంజుకున్న ఉపాధి కల్పన
కోల్‌కతా: ఈ ఏడాది జూన్ నెలలో నిరుద్యోగ రేటు తగ్గిపోగా.. జూలైలో ఈ ధోరణి తిరిగి సానుకూలంగా మారినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. జూలై 12 నుంచి చూస్తే మూడు రోజుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చి 7.29 శాతానికి చేరుకుందని పేర్కొంది. ఈ నెల 12న 7.33 శాతంగా ఉండగా, 13న 7.46 శాతం, 14న 7.29 శాతంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జూన్ నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 7.80 శాతంగా ఉందని సీఎంఐఈ అంతకుముందు నెలవారీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 7.30 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.03 శాతం ఉన్నట్టు తెలిపింది.1.3 కోట్ల మందికి ఉపాధి కల్పన నష్టం జరిగిందని, సాగు రంగంలో పనులు లేకపోవడం వల్లేనని పేర్కొంది. తాజా గణాంకాలపై ఆర్థికవేత్త అభిరూమ్ సర్కార్ స్పందిస్తూ.. రుతువుల వారీగా ఏజెన్సీ సేకరించే గణాంకాల్లో లోపాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నారు. -
హైదరాబాద్‌లో ఓజోన్ కమ్మేస్తోంది.. అవస్థలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోంది. ఈ విపరిణామంతో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటిజన్ల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగలోని ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులకు ఊపిరిసలపడంలేదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిశీలనలో తేలింది. చదవండి: విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80–100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓజోన్‌తో అవస్థలు ఇవే.. ► అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ► ట్రాఫిక్ రద్దీలో వేలాది మంది తరచూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ► గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ► ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యం. చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’ ధూళి కాలుష్యం సైతం ► ఓజోన్తోపాటు మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పీఎం10, పీఎం 2.5, ఆర్ఎస్పీఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ► దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ► చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. ► తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి. ► ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది. ► ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని నిపుణులు అంటున్నారు.