Indian Overseas Bank
-
ఐవోబీ అకౌంట్ పోర్టబిలిటీ
చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీని ఆన్లైన్లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ సెక్షన్‌కు వెళ్లాలి. అకౌంట్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి. -
ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!
గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. సిటీ బ్యాంక్ (City Bank) ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు. -
వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు
ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్‌నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్‌నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఎస్బీఐ డిపాజిటర్లకు తీపికబురు రుణ రేటును బుధవారం 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
ఐవోబీ లాభం ప్లస్.. క్యూ3లో రూ. 555 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 22 శాతం ఎగసి రూ. 555 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 454 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 5,317 కోట్ల నుంచి రూ. 6,006 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 44 శాతం జంప్‌చేసి రూ. 2,272 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.71 శాతం బలపడి 3.27 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు 10.4 శాతం నుంచి 8.19 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.63 శాతం నుంచి 2.43 శాతానికి బలహీనపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 937 కోట్ల నుంచి రూ. 711 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 27.15 వద్ద ముగిసింది. -
ఐఓబీ ఎండీ, సీఈఓగా అజయ్ కుమార్ శ్రీవాస్తవ
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (ఎండీ, సీఈఓ) అజయ్ కుమార్ శ్రీవాస్తవను కేంద్రం నియమించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐఓబీ చీఫ్ డైరెక్టర్‌గా శ్రీవాస్తవ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు దాదాపు 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్‌రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్ డీడ్లను, గడువు ముగిసిన ఎల్ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్‌లో సీబీఐ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్ 2003 నుంచి జనవర్ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్‌కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఐఓబీ రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచింది. అన్ని కాలపరిమితులపై ఈ రేటు 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 10వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణ రేటుకు ప్రధానంగా ప్రామాణికంగా ఉండే ఏడాది రుణ రేటు 7.45% నుంచి 7.55%కి చేరింది. రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 7.55% కి చేరింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 నుంచి 7.50% శ్రేణిలో ఉన్నాయి. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బైటపడ్డ ఐఓబీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్) నుంచి ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) బయటపడింది. బ్యాంక్ లావాదేవీలు, వ్యవస్థాగత, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఐఓబీ మెరుగైన ఫలితాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. కనీస మూలధన నియమావళిని అనుసరించాలని కూడా ఐఓబీకి ఆర్బీఐ సూచించింది. 2015 నుంచీ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. ఈ నెల ప్రారంభంలో యుకో బ్యాంక్‌ను ఈ పరిధి నుంచి ఆర్బీఐ తొలగించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా పీసీఏ పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హం. కాగా ఐఓబీ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్ మార్కెట్ ముగిసిన తర్వాత ఐఓబీ దిద్దుబాటు చర్యల చట్రం పరిధి నుంచి బయటకు వచ్చిన ప్రకటన వెలువడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో బుధవారం ఐఓబీ షేర్ ధర 0.49 శాతం పెరిగి 20.45 వద్ద ముగిసింది. చదవండి: అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే -
నిధుల సేకరణకు బ్యాంకులు బలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్, నిధుల సేకరణ పేరుతో మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. పెట్టుబడుల ఉపసంహారణకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే బాధ్యతలను బాధ్యతలను నీతి ఆయోగ్‌కి అప్పగించింది. ఈ ప్రక్రియలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. వేగవంతమైన ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహారణకు అత్యున్నత స్థాయి కమిటీ (సీజీఎస్) నీతి అయోగ్ నియమించింది. ఇందులో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ, కార్పొరేట్ వ్యవహారాలు, లీగల్ వ్యవహారాలు తదితర విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్, సీజీఎస్లు ప్రైవేటీకరణకు సూచించిన లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ఇందులో సెంట్రల్ బ్యాంకు, ఐవోబీలలో పెట్టుబడులు ఉపసంహరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని క్యాబినెట్ ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రైవేటీకరించేందుకు నిబంధనల్లో తగు మార్పులు, చేర్పులు చేపడతారు. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా పీఎస్‌బీల ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు జరుపుతోంది. వ్యతిరేకిస్తున్న యూనియన్లు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో.. మార్చిలో రెండు రోజుల పాటు సమ్మెకు దిగాయి. పెద్ద నోట్ల రద్దు, జన ధన యోజన, ముద్ర యోజన వంటి ప్రభుత్వ స్కీముల విజయవంతంలో ప్రభుత్వ బ్యాంకులు ఎంతో కీలకపాత్ర పోషించాయని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. డిజిన్వెస్ట్మెంట్లో భాగం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సుమారు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 2.10 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువ. బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ఎల్ఐసీ సారథ్యంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకు నుంచి కూడా కేంద్రం తప్పుకోనుంది. బ్యాంకులో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ గత నెలలో సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీకి 94% వాటా ఉంది. ప్రస్తుతం ప్రమోటరయిన ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకులో 49.21 శాతం వాటా ఉంది. చదవండి: ఆ బ్యాంకు ఉద్యోగులకు వీఆర్ఎస్.. -
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం
మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ ఈ విషయాలు వెల్లడించారు. మరిన్ని వివరాలు.. పీసీఏ నుంచి ఎలా బైటపడబోతున్నారు? ఐవోబీ 2015లో పీసీఏ పరిధిలోకి వచ్చింది. మొండిబాకీలు పేరుకుపోయిన బ్యాంకులపై పీసీఏపరమైన ఆంక్షలు విధించేందుకు ఆర్బీఐ ప్రధానంగా నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో లీవరేజీ అంశంలో మేం మెరుగ్గానే ఉన్నాం. మూలధన నిష్పత్తి విషయంలో సెప్టెంబర్ త్రైమాసికంలో గట్టెక్కాం. మొండిబాకీలు కూడా నిర్దేశిత 6 శాతం దిగువకి తగ్గనున్నాయి. ప్రొవిజనింగ్ క్రమంగా తగ్గుతుండటంతో డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లోనే మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశముంది. మొండిబాకీల రికవరీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొండిబాకీలను (ఎన్పీఏ) రాబట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. అన్ని ఎన్పీఏలను 16 అసెట్ రికవరీ మేనేజ్మెంట్ శాఖలకు (ఏఆర్‌ఎంబీ) బదలాయిస్తున్నాం. రికవరీ బాధ్యతలను వాటికే అప్పగిస్తున్నాం. ప్రత్యేక వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద రూ. 25 కోట్ల దాకా రుణాల సెటిల్మెంట్కు అవకాశం కల్పిస్తున్నాం. దీన్నుంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటి ఊతంతో నికర ఎన్పీఏలు 6 శాతం లోపు స్థాయికి దిగి రావొచ్చు. మొండిబాకీల పరిమాణం తగ్గే కొద్దీ ప్రొవిజనింగ్ కూడా క్రమంగా తగ్గనుంది. తద్వారా మళ్లీ స్థిరంగా లాభాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, డిఫాల్టర్ల ప్రాపర్టీల వేలం ప్రక్రియ కూడా చురుగ్గా నిర్వహిస్తున్నాం. ఇలాంటివి సుమారు 8,000 దాకా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రతి నెలా 1,000–1,500 దాకా వేలం నిర్వహిస్తున్నాం. గతేడాది జూలైలో ప్రారంభమైన తొలి విడత ఈ జనవరిలో పూర్తి కానుంది. దీనికి క్రమంగా మంచి స్పందనే వస్తోంది. రుణాల పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఎలా ఉంది? మేం ఎక్కువగా కార్పొరేట్ రుణాల జోలికి వెళ్లడం లేదు. ప్రధానంగా లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), రిటైల్ గృహ రుణాలు, వ్యవసాయ రుణాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎంఎస్ఎంఈ రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 30,000–35,000 కోట్ల స్థాయిలో ఉంది. దీనితో పాటు రిటైల్, వ్యవసాయ రుణాలన్నీ కలిపి రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉంటాయి. ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ప్రత్యేకంగా 200 శాఖలను గుర్తించాం. వీటిలో 20 శాఖలు తెలుగు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. ఎంఎస్ఎంఈల రుణావసరాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఈ శాఖల్లో ఉంటారు. జనవరి–మార్చి త్రైమాసికంలోనే ఈ వ్యూహాన్ని అమల్లోకి తేనున్నాం. ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణాల్లో పెద్దగా మొండిబాకీల సమస్య లేదు. నికర వడ్డీ మార్జిన్లు మెరుగ్గా ఉంటాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం తాజా నిధులు
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్ ఓవర్సీస్, అలహాబాద్ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్ బ్యాంకు గురువారమే ప్రకటించింది. -
ఏటీఎం పగులకొట్టి..
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : సమిశ్రగూడెం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) వద్ద ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు ఎస్సై టీవీ సురేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐఓబీ ఏటీఎంలో రూ.5 లక్షల నగదును పెట్టగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఒక వ్యక్తి చొరబడి ఏటీఎంను పగులకొట్టాడు. సీసీ కెమెరాలను గోడలవైపు తిప్పాడు. ఏటీఎంలోని నగదును దోచేయడానికి ప్రయత్నించగా లాకర్ తెరవకపోవడంతో దొంగ వెళ్లి పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో ఇంకా రూ.4.47 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ యాలంగి రాజేష్ ఫోన్‌కు శుక్రవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వద్ద ఘట నాస్థలాన్ని, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజ్‌ను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, నిడదవోలు సీఐ కేఏ స్వామి పరిశీలించారు. ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు వచ్చిన దొంగ ముఖానికి నలుపు గుడ్డ కట్టుకుని, చేతులకు తొడుగులు వేసుకుని లోపలికి వచ్చి ఏటీఎం పగుల కొట్టినట్లు తెలుస్తోంది. కొవ్వూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఏటీఎంలోని వేలిముద్రలను సేకరించారు. బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ చెప్పారు. -
అదనపు బ్యాంకు వచ్చేనా..?
సాక్షి, వంగూరు: మండల కేంద్రంలో ఒకేబ్యాంకు ఉండడంతో మండల ప్రజలు నిత్యం ఇబ్బందులకు గు రవుతున్నారు. పంట రుణాలు, పాల బిల్లులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, బంగారు రుణా లు తదితర లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరపాల్సి ఉండడంతో ఖాతాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వ్యవసాయ, వా ణిజ్య ఖాతాలు కలిపి దాదాపుగా పది వేల ఖా తాలు ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత.. నోట్ల రద్దు తర్వాత ప్రజలు బ్యాంకు లావాదేవీలు జరపడం తప్పని సరైంది. పది రోజులకోసారి వ చ్చే పాలబిల్లును బ్యాంకు నుంచి డ్రా చేసుకునేం దుకు పాడి రైతులకు ఒకరోజు టైం పడుతుంది. బంగారు రుణం తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడున్న తీవ్ర కరువు పరిస్థితులతో రై తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. పంట రుణం చెల్లిస్తే మళ్లీ రుణం తీసుకునేందుకు 15 నుంచి నెలరోజు ల సమయం పడుతుంది. మండలంలోని 17 పంచాయతీలు.. మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 17 పంచాయతీలు ఐఓబీ బ్యాంకుపరిధిలోనే లావాదేవీలు జరుపుతున్నారు. ఇంతకు మించి వృ ద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి పింఛన్ పొందడం కష్టంగా మారింది. ఇంత పెద్దమొత్తంలో లావాదేవీలు ఉన్నప్పటికీ ఇక్కడ అదనపు బ్యాంకు ఏర్పా టు చేసేందుకు నేతల కృషి శూన్యమయ్యింది. ఒకవైపు అంతా ఆన్లైన్ సేవలు, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతున్నప్పటికీ మండల కేంద్రంలో ఇతర ఏదైనా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు లావాదేవీలు జరపడం సులువవుతుంది. నిత్యం రద్దీగా ఉండడంతో.. బ్యాంకు నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండడంతో సబ్సిడీ రుణాలు, వాణిజ్య రుణాలు, ఇతర కా ర్పొరేషన్ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావడంలేదు. ఉన్న బ్యాంకు పక్కనే ఏర్పాటు చేసిన ఏటీఎం ఎప్పుడూ పని చేయదు. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు డ్రా చేయాలంటే రెండు గంటలకు పైగానే క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. కొందరు ఖాతాదారులు వామ్మో ఈ బ్యాంకులో లావాదేవీలు జరపడం కష్టమంటున్నారు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు గతంలో వంగూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉ పాధ్యాయుడు విష్ణుమూర్తి ఎస్బీఐ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కానీ ప్రజాప్రతినిధులు పెద్దగా ప ట్టించుకోకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి స్పందన కరువైంది. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చే స్తే మహిళా సంఘాలు, రైతులకు సులువుగా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉం టుందని కొందరు నాయకులు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం రావడంలేదు. పంచాయతీల తీర్మానాలతో.. మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పం చ్‌లు పంచాయతీ తీర్మానాలతో ఆయా బ్యాంకుల కేంద్ర కార్యాలయాలను సంప్రదిస్తే బ్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కానీ అటుగా ప్రయత్నం చేసే సర్పంచ్‌లు కనిపించడంలేదు. ఏదేమైనా వంగూరులో మరో శాఖకు సంబం«ధించిన బ్యాంకు ఏర్పాటు చేస్తే అదనపు రుణాలు దొరకడంతోపాటు బ్యాంకులో రద్దీ కూడా తగ్గుంది. వ్యాపారపరంగా కూడా మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది. మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి వంగూరు మండల కేంద్రంలో ఎస్బీఐ కానీ సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇందుకోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలో మరో బ్యాంకు ఏర్పాటు చేయాలి. – బాల్‌రెడ్డి, వంగూరు -
బ్యాంకులో అగ్ని ప్రమాదం
మేడ్చల్: మేడ్చల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆదివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకులో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలను ఆర్పివేయించారు. మంటల్లో బ్యాంకులో ఉన్న అన్ని కంప్యూటర్లు, కౌంటింగ్ మిషన్లు, రూటర్లు, కేబుళ్లు, పాస్‌బుక్ ప్రింటర్లు, ఫర్నిచర్, సీసీ కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. షార్ట్ సర్క్యుట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. అగ్ని ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెంట్రల్‌బ్యాంక్, ఐఓబీ రేటింగ్ పెంపు
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్‌లకు ఉన్న బీఏఏ3/పీ–3 రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది. గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్‌కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ.3,810 కోట్లు సమకూరాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించింది. -
రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓవర్‌నైట్, ఒక నెల మినహా మిగిలిన అన్ని రుణాలకు తగ్గింపు అమలవుతుందని, నూతన రేట్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 0.10% తగ్గి 8.70%కి చేరుకుంది. కన్జ్యూమర్ రుణాలన్నీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు ప్రకారం జారీ చేసేవే. రెండు, మూడేళ్ల కాల ఎంసీఎల్ఆర్ రేటు సైతం 0.10 శాతం తగ్గి 8.80 శాతం, 8.90 శాతానికి చేరాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గించింది. -
ప్రభుత్వ బ్యాంకులో దొంగలు హల్చల్: భారీ దోపిడీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశాలోని రూర్కెలాలో ఒక జాతీయ బ్యాంకులోకి సాయుధులైన దొంగలుబ్యాంకు దోపిడీకి తెగబడ్డారు. నగరంలో అత్యంత రద్దీగాఉండే మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శాఖలో పట్టపగలు చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. తుపాకులతో హల్చల్ చేశారు. మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు సిబ్బందిని, వినియోగదారులకు భయభ్రాంతులకు గురిచేశారు. క్యాషియర్‌ను బెదిరించి భారీ ఎత్తును సొమ్మును దోచుకుపోయారు. పోలీసులు, బ్యాంకు అధికారులు అందించిన సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం బ్యాంకు కార్యక్రమాలు ప్రారంభమైన కొద్దివసేపటికే దొంగలు బ్యాంకుపై ఎటాక్ చేశారు. ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి ఆరుగురు దోపిడీ దొంగలు మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. ముందు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు సిబ్బందిని, బ్యాంకులోని వినియోగదారులను తుపాకితో బెదిరించి వారినుంచి సెల్ఫోన్లను లాక్కుని, వారందరినీ ఓ గదిలో బంధించారు. అనంతరం కాషియర్ మంగరాజ్ జెన్నాను బెదిరించి లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.44 లక్షలు దోచుకున్నారు. అంతేకాదు అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లను కూడా తీసుకుని పరారయ్యారు. ఖజానా గదిని తెరిచేందుకు క్యాషియర్‌ను బలవంతం చేసి సొమ్ముని ఎత్తుకెళ్లిపోయారని బ్రాంచ్ మేనేజర్ సంజయ్ కుమార్ ఝా చెప్పారు. అధికారుల ఫిర్యాదుమేరకు పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టామని రూర్కెలా ఎస్పీ ఉమా శంకర్ దాస్ వెల్లడించారు. జార్ఖండ్‌కు చెందిన బ్యాంకు దోపిడీ ముఠా పనిగా భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
పీఎన్బీ డిపాజిట్ల సమీకరణపై హాంకాంగ్‌లో ఆంక్షలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్) నిర్దేశిత స్థాయి కన్నా తగ్గిపోవడంతో తమ దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల శాఖలు మరిన్ని డిపాజిట్లు సమీకరించకుండా హాంకాంగ్ మానిటరీ అథారిటీ (హెచ్‌కేఎంఏ) ఆంక్షలు విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి.. 2017 మార్చిలో 11.66 శాతంగా ఉండగా, 2018 మార్చి ఆఖరు నాటికి 9.2 శాతానికి తగ్గిపోయింది. అటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సీఏఆర్ కూడా అంతక్రితం ఆర్థిక సంవత్సరంలోని 10.50 శాతంతో పోలిస్తే 9.25 శాతానికి తగ్గిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం ఇది 11.5 శాతం పైగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే హెచ్‌కేఎంఏ తమ శాఖలపై నియంత్రణలపరమైన పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పీఎన్బీ, ఐవోబీ తెలిపాయి. వాణిజ్య రుణాలకు ప్రతిగా తీసుకున్న డిపాజిట్లకు తాజా ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నాయి. -
ఐఓబీ నష్టాలు రూ.3,607 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాల పరంపర కొనసాగుతోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నష్టాలు జనవరి– మార్చి త్రైమాసికంలో మరింత పెరిగాయి. 2016–17 క్యూ4లో రూ.647 కోట్లుగా ఉన్న నికర నష్టాలు తాజా త్రైమాసికంలో దాదాపు ఐదు రెట్లకు పైగా పెరిగి రూ.3,607 కోట్లకు ఎగిశాయి. ఆర్బీఐ నిబంధనలను మరింత కఠినతరం చేయడం వల్ల మొండి బకాయిలు భారీగా పేరుకుపోయాయని బ్యాంక్ తెలిపింది. ఈ మొండి బకాయిలకు కేటాయింపులు కూడా అదే స్థాయిలో చేయడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.5,662 కోట్ల నుంచి రూ.5,814 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.4,630 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.4,828 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిలకు, ఇతర అంశాలకు మొత్తం కేటాయింపులు రూ.1,790 కోట్ల నుంచి దాదాపు నాలుగింతలై రూ.6,775 కోట్లకు చేరుకున్నాయని బ్యాంకు తెలియజేసింది. మెరుగుపడ్డ రికవరీలు బ్యాంక్ రుణ నాణ్యత మరింత అధ్వానంగా మారింది. 2016–17 క్యూ4లో 22.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు తాజా ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25.28 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 13.99 శాతం నుంచి 15.33 శాతానికి చేరుకున్నాయి. అయితే మొండి బకాయిల రికవరీ మాత్రం మెరుగుపడిందని బ్యాంక్ తెలిపింది. రికవరీలు రూ.2,729 కోట్ల నుంచి రూ.5,726 కోట్లకు పెరిగాయని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,417 కోట్లుగా ఉన్న నికర నష్టాలు 2017–18లో రూ.6,299 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.3,650 కోట్ల నుంచి రూ.3,628 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.23,091 కోట్ల నుంచి రూ.21,662 కోట్లకు చేరింది. 2017–18 క్యూ4లో ప్రభుత్వం నుంచి రూ.4,694 కోట్ల మూలధన పెట్టుబడులు వచ్చాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్ 2.4 శాతం నష్టంతో రూ.16.25 వద్ద ముగిసింది. -
ఆ రుణాలపై వడ్డీరేటు తగ్గించిన ఐవోబీ
సాక్షి, చెన్నై: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఒబి) రుణాలపై వడ్డీరేట్టు తగ్గించింది. సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు ఊరట కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో వడ్డీ రేట్లను 15-90 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంతేకాదు, బ్యాంకు లెటర్ ఆఫ్ క్రెడిట్ , బ్యాంక్ గ్యారంటీలపై కూడా కమిషన్‌ను తగ్గించినట్టు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 25 లక్షల రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా. రూ.2 కోట్లకు పైన రుణాలపై ఆ యూనిట్ల రేటింగ్ ఆధారంగా వడ్డీరేటు 15 నుంచి 90 బేసిస్ పాయింట్లకు తగ్గించినట్టు పేర్కొంది. ఏప్రిల్ 1, 2018 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. తద్వారా దేశవ్యాప్తంగా 120మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు మద్దుతుగా నిలిచింది. కాగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఐవోబీని చెన్నైలో 1937 లో స్థాపించారు. డిసెంబరు 2017 నాటికి 3342 శాఖలు , 3278 ఎటిఎంలతో సేవలను అందిస్తోంది. -
అవినీతి పెండింగ్ కేసుల్లో ‘రైల్వే’ టాప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) శుక్రవారం తెలిపింది. రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో వరుసగా 128, 82 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
బ్యాంకు మేనేజర్‌పై టీచర్ ఫిర్యాదు
లేపాక్షి : స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్లపై ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తులసీనాయక్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని సోమవారం ‘మీ కోసం’లో తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌కు అందజేశారు. ఆ మేరకు వివరాలు... ఈనెల 2వ తేదీ డబ్బులు డ్రా చేసుకోడానికి తులసీనాయక్ బ్యాంకుకు వెళ్లారు. ఇంటి అవసరాలకు ఏ మాత్రం డబ్బుల్లేవని, నిబంధనల మేరకు రూ.4వేలు నగదు ఇవ్వాలని అక్కడి అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారు కనికరం చూపకుండా బ్యాంకులో డబ్బుల్లేవని చెప్పారు. వెనుదిరిగి వెళ్తుండగా.. తనకన్నా వెనుక వచ్చిన వారు డబ్బులు తీసుకెళ్లిపోవడం చూశారు. అదేమని అడిగితే తన ఇష్టం వచ్చిన వారికి ఇస్తానని, అడగడానికి మీరెవరని బ్యాంకు మేనేజరు పదిమందిలో అవమాపరిచేలా మాట్లాడారు. కావాలంటే నీ అకౌంటు ఇక్కడ తీసేసుకుని ఇంకోచోట చేసుకోమన్నారు. అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తులసీనాయక్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడురోజులు గడిచినా ఆ బాధ తగ్గకపోవడంతో అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘మీ కోసం’ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మీ కోసం కార్యక్రమంలో మరో 13 ఫిర్యాదులు అందినట్లు తహశీల్దార్ ఆనందకుమార్ తెలిపారు. ఇళ్లకు సంబంధించి 7, రేషన్‌కార్డులపై 6 ఫిర్యాదులు వచ్చాయన్నారు. -
రుణమాఫీ వాయిదా చెల్లించాలని రైతుల ధర్నా
రుణ మాఫీ పథకం కింద రైతులకు మొదటి విడత మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని మండలానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. దీంతో బ్యాంకు అధికారులు రైతులతో చర్చలు నిర్వహిస్తున్నారు.