inspire
-
AP: మన బడికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి : సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 10 నుంచి మూడో స్థానానికి.. నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్ఓలో ప్రసంగించిన విషయం తెలిచిం దే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్స్పైర్ విద్యారు్థలు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు. జాతీయ పోటీలకు ఏటా 40 మంది.. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్స్పైర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది. ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్.. గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే.. ► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది. ► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు. ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు. -
ఓ పక్క అద్భుతమైన మోడల్‌గా..మరోవైపు క్యాట్‌లోనూ సత్తా చాటింది
అందం, అద్బుతమైన తెలివితేటలు ఆమె సొంతం. ఒక పక్క తనకు ఇష్టమైన అభిరుచిలో రాణిస్తూనే మరోవైపు చదువులోనూ సత్తా చాటి ..తనకు తానే సాటి అని నిరూపించుకుంచి. 'బ్యూటీ విత్ బ్రెయిన్'కి ఉదాహరణగా నిలిచింది. ఓ మనిషి రెండింటింలోనూ రాణించగలడని నిరూపించించి మోడల్ ఆకాంక్ష చౌదరి. ఆకాంక్ష చౌదరి పేరుకు తగ్గట్టుగానే తన ఆకాంక్షలని నెరవేర్చుకుని అందర్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె 2016లో మిస్ ఇండియా ఎలైట్ విజేత. ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు అదోక ప్యాషన్ కూడా. ఒకపక్క మోడలింగ్‌పై దృష్టి పెడుతూనే తన కెరియర్ని మంచి గాడిలో పెట్టుకుంది. ఆమె క్యాట్‌లో 98.12 పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించి ఆశ్చర్యపరిచింది. ఆమె మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేస్తున్నప్పుడే మిస్ ఇండియా ఎలైట్ పోటీకి ఎంపికైంది. అతన అభిరుచిని అనుసరించి అందాల పోటీలో విజేతగా నిలిచింది. అదే సమయంలో క్యాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యింది. ఆమె ఐఐఎం అహ్మాదాబాద్‌లో 2017-2019 బ్యాచ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ . ప్రస్తుతం ఆమె మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆకాంక్ష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను మోడల్‌గా ఈ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానని అనుకోలేదు. మోడలింగ్ మారబోతున్నాను. మోడలింగ్ నన్ను ఫిట్‌గా ఉండేలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేసింది. చదువు తోపాటు మోడలింగ్‌లోనూ రాణించేందుకు తాను టైం షెడ్యూలను చాలచక్యంగా నిర్వహించాల్సి వచ్చేదని చెబుతోంది ఆకాంక్ష. నిజానికి ఆకాంక్ష మోడలింగ్, కాంపిటీటవ్ ఎగ్జామ్ రెండింటికి ఏకాకాలంలో సన్నద్ధమైంది. చక్కగా బ్యాలెన్స్ చేసి అనుకున్నది సాధించింది. ఒక వ్యక్తి తన అభిరుచిని అనుసరిస్తూనే బిజినెస్ రంగంలో కూడా రాణించగలడిని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: రష్యాలో వాగ్నర్ గ్రూప్ మాదిరిగా..చరిత్రలో వెన్నుపోటు పొడిచిన నాయకులు వీరే!) -
Neeta: కష్టాలే ఇంధనంగా..
నీతా గత జీవితంలోకి తొంగిచూస్తే ‘బాధలు’ ‘కష్టాలు’ తప్ప ఏమీ కనిపించనంత చీకటి. నీతా చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి తాగుబోతు. ఆయన పెట్టే హింస భరించలేక అమ్మమ్మ వాళ్ల ఇంటికి పారిపోయి అక్కడే ఉంది. 14 సంవత్సరాల వయసులో 22 ఏళ్ల వ్యక్తితో నీతాకు పెళ్లి జరిగింది. పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భర్త తాగుబోతు. రకరకాలుగా హింస పెట్టేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక అతడి నుంచి వేరుపడింది. ముగ్గురు పిల్లలు తనతో పాటే ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తూనే ఆగిపోయిన చదువును కొనసాగించింది. పిల్లలతో పాటు చదువుకుంది. ‘నీకు ఏ పనీ చేతకాదు’ అని భర్త ఎప్పుడూ తిట్టేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూటర్ నడపడం నేర్చుకుంది. ఆ తరువాత వ్యాన్, బస్ డ్రైవింగ్‌లను నేర్చుకుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముంబయిలో 13 బస్సులకు యజమాని అయింది. ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కుమారుడు కెనడాలో ఉంటున్నాడు. స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ నీతా స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ ఇన్స్పైరింగ్ స్టోరీ వైరల్‌గా మారింది. ‘నేను ఎన్నోసార్లు నీతా ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేశాను. ఆమె వెనుక ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలియదు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చే స్టోరీ ఇది’ అని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు స్పందించారు. -
ప్రియురాలితో పెళ్లి కోసం.. టీవీ షో చూసి దొంగతనం.. చివరకు
న్యూఢిల్లీ: సాధారణంగా టీవీలలో, సీరియల్స్లలో కల్పిత పాత్రలతో క్రైమ్ వార్తలను ప్రసారం చేస్తుంటారు. దొంగతనాలు, కిడ్నాప్‌లు ఆయా ఘటనలకు సంబంధించి కల్పిత పాత్రలను.. ప్రేక్షకుల కంటికి కట్టినట్లు చూపించడానికి టీవీలలో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల వలన నేరం చేస్తే.. పడే శిక్షలను పరోక్షంగా చూపిస్తుంటారు. కొందరు వీటిని చూసి తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటే.. మరికొందరు కేటుగాళ్లు మాత్రం టీవీలలో చూపించే కల్పిత దృశ్యాలను అనుసరించి అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొహమ్మద్ ఫహీముద్దీన్ అనే వ్యక్తి లాహోరి గేట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతను జనవరి 18న వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రాత్రికి ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి మెయిన్ గేట్ తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించాడు. వెంటనే షాక్‌కు గురైన ఫహీముద్దీన్.. అదే రోజు తన ఇంట్లో డబ్బు, బంగారం పోయినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆ ప్రాంతాలలోని దాదాపు 200ల సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు నిందితుడిని కాట్రా హిందు ప్రాంతంలో కనుగొన్నారు. నిందితుడిని ఫయాజ్గాను.. అతడికి 20 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో నుంచి దాదాపు 2,15,000 డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రెండు బంగారు గొలుసులు, ఒక రింగ్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. స్థానిక టీవీ క్రైమ్ షో ‘సావధాన్ ఇండియా’ స్ఫూర్తితో చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. ఆ షోలో చోరీచూసి ఎలా తప్పించుకోవచ్చో చూశానని .. అలానే చేశానని తెలిపాడు. తాను.. నెలకు 8వేలను సంపాదిస్తున్నానని.. అది చాలకే చోరీల బాట ఎంచుకున్నట్లు వివరించాడు. వచ్చే ఫిబ్రవరి 14న తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలిపాడు. అతగాడి సమాధానాలు విని పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
ఈజీ లిఫ్ట్.. ఎంతో సాఫ్ట్!
బంజారాహిల్స్: నిత్యజీవితంలో తనకు ఎదురైన సమస్యనే అనుభవంగా మార్చుకొని కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (విద్యాశ్రమం)లో 8వ తరగతి చదువుతున్న సింగం రవికర్‌రెడ్డి సత్తా చాటాడు. ఇన్స్పైర్ (2019– 20) రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. తన అమ్మమ్మ రంగలక్ష్మి అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఇబ్బందులకు గురవుతున్న దయనీయ పరిస్థితిని గమనించాడు రవికర్‌రెడ్డి. అన్నం తింటే బాత్రూంకు వెళ్లాల్సి వస్తోందని.. తనను పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు అవసరమవుతున్నారని ఆమె బాధపడుతూ భోజనం చేయడమే మానేసింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందింది. ఇవన్నీ ఆ చిన్నారిని ఆలోచనలో పడేశాయి. ఇబ్బందులను తొలగించి రోగులను సులువుగా బాత్రూంకు తీసుకెళ్లే యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. నెల రోజుల పాటు శ్రమించి సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ‘ఈజీ లిఫ్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేషెంట్స్’ పేరుతో యంత్రాన్ని తయారు చేసి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించాడు. ఈ యంత్రం సహాయంతో రోగులకు సులువుగా సేవలు చేయొచ్చని, వేరొకరి అవసరం లేకుండా కాలకృత్యాలు తీర్చుకునేందుకు సహాయకారిగా ఉపయోగపడుతుందని రవికర్‌రెడ్డి చెప్పాడు. ఈ ఆవిష్కరణలో బీవీబీపీ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణశ్రీ, ఇతర ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. -
భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే
- హెచ్‌సీయూ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, రామాచార్యులు - సైన్స్ ఇన్స్పైర్ - ఆసక్తి రేకెత్తిస్తోందంటున్న విద్యార్థులు కర్నూలు(ఆర్యూ): భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ రామాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న సైన్స్ ఇన్స్పైర్ క్యాంపు రెండో రోజులో భాగంగా శనివారం వారు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నానో పదార్థాలు, వాటి ఉపరితల దృగ్విషయాలు సైజు తగ్గే కొలది ఉపరితల వైశాల్యం పెరిగి విలక్షణమైన స్వభావాన్ని కల్గి ఉంటాయన్నారు. ఆధునిక ప్రపంచంలో నానో మెడిసిన్, నానో బయో టెక్నాలజీ, నానో దుస్తులు, నానో జెల్స్ ఇలా మానవుని దైనందిన వస్తువుల తయారీ ఉపయోగాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. రాబోయే తరం నానో తరంగా భావించవచ్చని ఉద్ఘాటించారు. హెచ్‌సీయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామాచార్యులు మాట్లాడుతూ కర్బణ రసాయన శాస్త్రంలో మందుల తయారీ, వాటిని తయారు చేసే సంశ్లేషణా పద్ధతులు మానవాళికి వాటి ఉపయోగాల గురించి వివరించారు. శనివారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతిక, మానవీయ విలువల పరీక్ష ఉండటంతో సైన్స్ ఇన్సై్పర్కు చాలామంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నేటి కార్యక్రమాలు న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ భూ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్. జనార్దన్‌రాజు పాల్గొని, భూ రసాయన శాస్త్రం, నీరు పర్యావరణం, కాలుష్యం తదితర అంశాల గురించి వివరించనున్నారు. అలాగే హెచ్‌సీయూ ప్రొఫెసర్ దయానంద బయో రెమిడేషన్ మీద ప్రసంగిస్తారు. మానవ శరీరంలో జీన్స్ ప్రోటీన్స్ తదితర వాటిపై వివరిస్తారు. -
స్ఫూర్తి స్వరాలు..చైతన్య గీతికలు
- అలరించిన నందినాటకోత్సవాలు - నటనకు జీవం పోసిన బాలలు - సామాజిక రుగ్మతలను రూపుమాపే ఇతివృత్తాలు కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో స్థానిక సి.క్యాంపులోని టిజివి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు సోమవారానికి ఆరోరోజుకు చేరుకున్నాయి. ఆదివారం లాగే సోమవారం సైతం బాలల నాటికలే ప్రదర్శించారు. పవిత్ర భారత దేశాన్ని కులమత, వర్గ, వర్ణ విభేదాల నుంచి ఎలా రక్షించుకోవాలని చెప్పే ‘పవిత్ర భారతదేశం’. భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులే అని చెప్పే ‘సత్యస్వరాలు’. చిన్ననాటి స్నేహాన్ని ఎంత ఎత్తుకు ఎదిగినా మరిచిపోకుండా ఉండే ‘స్ఫూర్తి’ నాటిక, ఓ చిన్న నాటకం ద్వారా చెడు అలవాట్లకు బానిసైన తండ్రిని సన్మార్గంలో పెట్టే కుమారుని కథ ‘స్వయంకృతం’ ప్రేక్షకులను అలరించాయి. సామాజిక అంశాల ఇతివృత్తాలతో రచించిన ఈ నాటికలు అటు పిల్లలనే కాదు పెద్దలనూ ఆలోచింపజేస్తున్నాయి. పవిత్ర భారతదేశాన్ని రక్షించుకుందాం ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ దేశం. అయితే కొందురు స్వార్థం కోసం, వారి అవసరాల కోసం ఈ దేశాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇందులో కొన్ని కోట్ల ప్రజలు బలైపోతున్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అనేదే ‘పవిత్ర భారత దేశం’ నాటిక ఇతివృత్తం. ఈ నాటికకు రచన, దర్శకత్వం సుంకరి శరత్(సిద్ధిపేట), నిర్వహణ శ్రీమాలి ఎడ్యుకేషనల్ సొసైటీ(సిద్ధిపేట). సంగీతం వర్మ, మేకప్, కాస్ట్యూమ్స్ డి. ప్రశాంతి. పాత్రల్లో కీర్తి, శ్రావ్య, సనా, లాస్య, భార్గవి, నవ్య హృద్యంగా నటించారు. భావిభారత నిర్మాతలు ఉపాధ్యాయులే.. కుల, మత, ప్రాంతీయ, వర్గ విషబీజాలను బాల్యంలోనే తొలగించాలనది ‘సత్యస్వరాలు’ నాటిక ఇతివృత్తం. మనుషులంతా ఒక్కటేనన్న సత్యభావనను పాఠశాల స్థాయిలోనే బాలలకు కలిగించాలని..ఇందుకు ఉపాధ్యాయులు నడుంబిగించాలనేది ఇందలో సందేశం. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బాలల సాంఘిక నాటికను ప్రదర్శించారు. రచయిత భారతుల రామకృష్ణ , దర్శకత్వం హస్తవరం ఆనందకుమార్, సంగీతం పీడీ ప్రసాద్, పాత్రదారులుగా ఎస్. విష్ణుదుర్గారెడ్డి, ఎం. శివనారాయణ, కె. కమలనాథ్యాదవ్, ఆర్. ధర్మేంద్రసింగ్, ఎస్. హాసిఫ్అల్లి, జి. దినేష్, సీఎస్.శశిధర్ తదితరులు నటించారు. నాటకం వేపగుంట సాంరాజ్ పర్యవేక్షణలో జరిగింది. రెండు కుటుంబాల కథ ‘స్ఫూర్తి’ ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. ఒక కుటుంబం పేదది. తండ్రి ప్రమాదంలో మరణిస్తే తల్లి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి కుమారున్ని ఉన్నతంగా చదివించి కలెక్టర్‌ను చేస్తుంది. ఇక రెండో కుటుంబం జమీందారి కుటుంబం. తండ్రి డబ్బు అహంకారంతో పేదపిల్లలతో స్నేహానికి కూడా తన కుమారున్ని ఒప్పుకోని మనస్తత్వం కలవాడు. ఆయన భార్య మహాస్వాధ్వి. వీరి కుమారుడు బాగా చదువుకుంటాడు కానీ డబ్బు వల్ల దురలవాట్లకు లోనై చివరకు మెకానిక్‌గా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. తాను చదువుకున్న పాఠశాల ఉండే జిల్లాకే సోము కలెక్టర్‌గా వస్తాడు. అక్కడి ఉపాధ్యాయులే ఆయనను సన్మానిస్తారు. అక్కడే మెకానిక్ జీవితాన్ని అనుభవిస్తున్న తన చిన్ననాటి మిత్రుడు రవికి(జమీందారి కుమారుడు) తన చెల్లినిచ్చి వివాహం చేస్తాడు కలెక్టర్. స్నేహానికి చక్కని నిర్వచనాన్ని ఇచ్చే ఈ ‘స్ఫూర్తి’ నాటికను పాలేం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. రచన డి. పార్వతమ్మ, దర్శకత్వం బి.బ్రహ్మచారి, పర్యవేక్షణ గాడి సురేందర్, కూర్పు పల్లెగోపాల్, పాత్రదారులుగా రాజేశ్వరి, దక్షిత, కళ్యాణి, మహేశ్వరి, మణికుమార్, అరుణజ్యోతి, విజయ్, స్వప్న, బాలీశ్వరి, శివకుమార్ తదితరులు బాగా నటించారు. తండ్రిని సన్మార్గంలో పెట్టే కొడుకు కథ ‘స్వయంకృతం’ నేటి బాలలే రేపటి పౌరులు అనేది దేశానికే కాదు ప్రపంచానికే అవసరమైన నినాదం. నిజానికి మంచిపౌరులుగా బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపైనా ఉంది. ఒక కుటుంబాన్ని తీసుకుని తల్లిదండ్రులు బాధ్యత కోల్పోయి సోమరులుగా ఉంటే పిల్లలు ఏ విధంగా చెడిపోతారో తండ్రి పాత్రలో నటించిన పరశురాం ఒదిగిపోయారు. సోమరిగా, తాగుబోతుగా ఉన్న తండ్రిని ఓ చిన్న నాటకం ద్వారా కుమారుడు మేల్కొలిపే సన్నిశేశం ఆలోచింపజేస్తుంది. తద్వారా తండ్రి తన తప్పు తెలుసుకోవడమే గాక సమాజంలోని తల్లిదండ్రులకు మేలుకొలుపుగా సందేశాన్ని ఇచ్చారు మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులోని జ్ఞాన వికాస భారతి వారి స్వయంకృతం బాలల నాటికలో. రచన బి.సోమయ్య, దర్శకత్వం జి. బ్రహ్మాచారి, సంగీత సహకారం ప్రసాదాచారి, ఆర్గనైజర్ ఎం. జంగయ్య. పాత్రదారులుగా దేవి, నూతనసాయి, ఇక్ష్వాక్, మణి, విజయ్, బాలీశ్వరి నటించారు. నేటి ప్రదర్శనలు.. ఉదయం 9 గంటలకు ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య వారి ‘కొత్తబానిసలు’, ఉదయం 10.30 గంటలకు అమెచ్యూర్ ఆర్ట్స్ వారి ‘మార్గదర్శి’. మధ్యాహ్నం 12 గంటలకు మహతి క్రియేషన్స్ వారి ‘నియతి, మధ్యాహ్నం 2 గంటలకు మహతి క్రియేషన్స్ వారి ‘మిస్టరీ’, సాయంత్రం 4.30 గంటలకు సత్కళాభారతి వారి ‘నాయకురాలు నాగమ్మ(సాంఘిక నాటకం), రాత్రి 7 గంటలకు కళారాధన (నంద్యాల) వారి ‘సైకత శిల్పం’ నాటికలు ప్రదర్శిస్తారని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
అద్భుతాల ఆవిష్కర్తలు
భవిష్యత్ టెక్నాలజీకి వారసులు విశేషంగా ఆట్టుకుంటున్న ఇన్స్పైర్ కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలం వాకలపూడి హంసవాహిని విద్యాలయ వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఇన్ స్పైర్–2016 అలరిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు ఈ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అక్కడే ఉండి సిబ్బందికి, విద్యార్థులకు వసతి తదితర ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. . జిల్లాలోని 122 పాఠశాలల నుంచి 13,500 మంది విద్యార్థులు శనివారం ప్రదర్శనను తిలకించారు. ప్రదర్శనలో ఉంచి నమూనాలను ఎన్సీఈఆర్టీ సంచాలకులు ఎం.వి.రాజ్యలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు తిలకించారు. విద్యార్థుల్లో సజనాత్మకత వెలికి తీసే విధంగా వినూత్నంగా అనేక పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ విశేషంగా అరించాయి. ఉప విద్యాశాఖాధికారులు ఆర్ఎస్ గంగాభవాని, దడాల వాడపల్లి, డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవర జెడ్పీ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు బందోబస్తు నిర్వహించారు. -
సృజనకు హ్యాట్సాప్
-
15, 16 తేదీల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు, ఆదోని డివిజన్లకు సంబంధించి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు ఎంపిక చేసిన విద్యార్థులను తప్పకుండా ప్రదర్శనకు తీసుకురావాలని ఆదేశించారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు సంబంధిత విద్యార్థి, గైడ్‌తో పాటు ప్రదర్శన వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. -
15,16 తేదీల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి కర్నూలు, ఆదోని డివిజన్ల విద్యార్థులకు ఆక్టోబర్ 15,16 తేదీల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీవైఈఓలు సమన్వయంతో విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేసుకోవడానికి సహకారం అందించాలన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
‘ఇన్స్పైర్’ను సందర్శించిన ఆర్జేడీ బాలయ్య మహబూబాబాద్ రూరల్ : విద్యార్థులు విద్య, శాస్త్ర, సాంకేతిక తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య అన్నారు. మండలంలోని అనంతారం మోడల్ స్కూల్లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. పలు ఎగ్జిబిట్లను పరిశీలించి వాటి గురించి విద్యార్థులను అడిగారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు దేశంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపుతాయని అన్నారు. రెండో రోజు కేయూ నుంచి వచ్చిన న్యాయ నిర్ణేతలు డాక్టర్ ఎం.రామచంద్రారెడ్డి, డాక్టర్ టి.లక్ష్మణరావు, డాక్టర్ బి.విజయపాల్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, బి.సత్యనారాయణ, డాక్టర్ డి.శ్యామ్‌ప్రసాద్, ప్రొఫెసర్లు గోపికృష్ణ, సమ్మయ్య, దేవదాస్, మారాములు ప్రాజెక్టుల జడ్జిమెంట్ నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి పరిశీలకురాలిగా వచ్చిన రజినీశర్మ కూడా ప్రాజెక్టులను పరిశీలించారు. డిప్యూటీ ఈవో తోట రవీందర్, ఎంఈవోలు వివేకానంద, వెంకన్న, లచ్చిరాం, బిక్షపతి, రత్నమాల, సృజన్‌కుమార్, ఇన్స్పైర్ జిల్లా రిసోర్స్పర్సన్లు వి.గురునాథరావు, టి.శ్రీనాథ్, బి.అప్పారావు పాల్గొన్నారు. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ఇన్స్పైర్ తిలకించేందుకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో వచ్చారు. -
సృజనాత్మక సమ్మేళనం
ప్రతిభా పాటవాలకు వేదికగా ‘ఇన్స్పైర్’ ప్రదర్శనలతో అలరించనున్న విద్యార్థులు నేటి నుంచి మూడు రోజుల పాటు పోటీలు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 330 ఎగ్జిబిట్ల ప్రదర్శన మహబూబాబాద్ రూరల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇన్స్పైర్ ప్రదర్శనలు, ప్రాజెక్టుల పోటీలు ఎంతో దోహదపడుతున్నాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు అందరికీ తెలి యాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌కు రంగం సిద్ధమైంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థ పాఠశాల విద్యాశాఖ జిల్లా ఇన్నోవేషన్ ఇన్ సైన్స ఫర్ ష్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్) జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన–2016ను మహబూబాబాద్ మండలం అనంతారం మోడల్ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం ప్రాంగణంగా వేదికను తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు మహబూబాబాద్ డివిజన్‌తోపాటు ఖమ్మం జిల్లాలో ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు హాజరై తాము తయారు చేసిన ఎగ్టిబిట్లను ప్రదర్శించనున్నారు. మొత్తం 330 వరకు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, మహబూబాబాద్ డివిజన్ ఉపవిద్యాధికారి తోట రవీందర్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో పాల్గొనే విద్యార్థులు, గైడ్ టీచర్లకు భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్స్పైర్ ఎగ్జిబిట్ల నిర్వహణకు మండల విద్యాశాఖ అధికారులను కన్వీనర్లుగా, పీజీ హెచ్ఎంలను కో కన్వీనర్లుగా నియమించడంతో పాటు 16 కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్స్పైర్ రిసోర్స్ పర్సన్లుగా వి.గురునాథరావు, టి.శ్రీనాథ్, బి. అప్పారావు వ్యవహరించనున్నట్లు డిప్యూటీ ఈఓ రవీందర్ తెలిపారు. 2008లో ప్రారంభం.. వినూత్న కార్యక్రమంగా పేర్కొనే ఇన్‌స్పైర్‌ను 2008 డిసెంబర్లో ప్రారంభించారు. 2009–10 ఏడాది నుంచి పాఠశాల స్థాయి మొదలుకుని పరిశోధన స్థాయి వరకు అవార్డులు అందజేస్తున్నారు. 2015–16లో ఇన్స్పైర్ ఆవార్డులు పొందిన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లాస్థాయి పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఒక నిర్ధిష్ట అంశాన్ని ఎంచుకుని వినూత్నంగా ప్రాజెక్టులు తయారు చేయడంతో పాటు సృజనాత్మకత, ఆలోచనలు, భావనలతో నమూనాలు తయారుచేసి విద్యార్థులు ప్రదర్శించనున్నారు. ముఖ్యాంశాలు.. చిన్నతనంలోనే విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థులకు సృజనాత్మకత వైపు ఆసక్తిని కలిగించి తద్వారా పరిశోధన, అభివృద్ధి ఆధారంగా శాసీ్ర్తయ, సాంకేతిక విధానాలను తెలియజేయడం ఇన్స్పైర్ ఉద్దేశం ఇన్‌స్పైర్‌లో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, స్వస్్థభారత్ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులను రూపొందించవచ్చు. రెడీమేడ్ ఎగ్జిబిట్లు ప్రదర్శించవద్దు. ప్రాజెక్టు నిరే్ధశిత, శాసీ్ర్తయ సూత్రం ఆధారంగా అభివృద్ధి చేయాలి. ప్రాజెక్టు సాధారణ రూపం, అందుకు సంబంధించిన వివరాలు పొందు పర్చాలి. ప్రాజెక్టు అయినా సరే అందులోని భౌతిక రూపం కంటే శాసీ్ర్తయ సృజనాత్మకత భావనకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానిక, శాస్త్ర, సాంకేతిక, ప్రాంత అవసరాలకు సంబంధించిన అంశంగా> జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు రూపొందిస్తే ఎంతో మేలు. -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రీయ వేదిక.. నైపుణ్యాల మాలిక
జిల్లాలో మెుదలైన సైన్స్ సంబురాలు ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్న విద్యార్థులు ప్రతిభా పాటవాలను వెలికితీస్తున్న ఉపాధ్యాయులు మానుకోటలో వచ్చేనెల 15, 16, 17 తేదీల్లో ఇన్స్పైర్ అక్టోబర్‌లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నవంబర్ నెలలో సైన్స్‌ఫేర్ మహబూబాబాద్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సైన్స్ కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రస్తుత ఆగస్టు నుంచి నవంబర్ వరకు పాuý శాల నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించనున్న సైన్స్ సెమినార్, ఇన్స్పైర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, సైన్స్ఫేర్లతో సందడి నెలకొంది. ఆయా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులు ఇప్పటì నుంచే కృషి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విద్యార్థుల్లో శాస్త్రీయ అన్వేషణ, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేందుకు సైన్స్ మ్యూజియాల జాతీయ మండలి ప్రతి ఏటా సైన్స్ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆగస్టులో పాఠశాల నుంచి మొదలై జిల్లా వరకు సుమారు 20 రోజుల పాటు విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లాలో సైన్స్ సెమినార్లు నిర్వహించారు. సుస్థిర ఆహారభద్రతకు ‘పప్పు ధాన్యాలు, అవకాశాలు–సవాళ్లు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. మానుకోటలో ఏర్పాట్లు వచ్చే నెల 15 నుంచి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో జిల్లా స్థాయి ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మానుకోటలో 15, 16, 17 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో అర్హత పొందిన 564 మంది విద్యార్థులతో పాటు నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇన్స్పైర్ అవార్డులతో రెండు డీఎల్పీఈలు (జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు–ప్రాజెక్టుల పోటీలు) నిర్వహించనున్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు నిర్వహించే ఇన్స్పైర్తో విద్యార్థులను శాస్త్రీయ పరిశోధన వైపు మళ్లించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. కాగా, ఇన్స్పైర్ అవార్డు కింద ఎంపికైన విద్యార్థికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ డబ్బులను విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించుకోవడం, దాన్ని ప్రదర్శించడం, రవాణా ఖర్చులకు వినియోగించుకోవాలి. రెండు దశాబ్దాలుగా ‘ఎన్సీఎస్సీ’ కేంద్ర విజ్ఞానశాస్త్ర మండలి, తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విద్యాశాఖ సహకారంతో రెండు దశాబ్దాలుగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ మూడో వారంలో జిల్లాస్థాయి ఎన్సీఎస్సీ నిర్వíß ంచేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లా నందిగామలో నవంబర్ రెండో వారంలో రాష్ట్రస్థాయి ఎన్సీఎస్సీని నిర్వహించనున్నారు. సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో గైడ్ టీచర్లకు 24వ ఎన్సీఎస్సీ ప్రధానాంశం‘సుస్థిర అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలు’ అంశంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో విద్యార్థులు జట్టుగా ఏర్పడి స్థానిక సమస్యలకు శాస్త్రీయ అన్వేషణతో పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, విద్యార్థుల్లో క్షేత్రస్థాయి పరి శీలన, సమాచార సేకరణ, విశ్లేషణ సామర్థ్యాన్ని, సృజ నాత్మకతను పెం పొందిస్తూ వారు పరిశోధనలు చేపట్టేలా ఎన్సీఎస్సీ ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘సైన్స్‌ఫేర్’ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో నవంబర్‌లో సైన్స్‌ఫేర్ కార్యక్రమాలు కొనసాగుతాయి. గణిత, శాస్త్రీయ విషయాలపై విద్యార్థుల్లో సహజమైన అభిరుచి, ఆసక్తులు, సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి ఏటా జవహ ర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్ర్డన్ పేరిట నాలుగు దశాబ్దాలకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతాయి. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా నూతన బోధనలు, ప్రదర్శనలు నిర్వహించడమే సైన్స్‌ఫేర్ ఉద్దేశం. సృజనాత్మకతను వెలికితీసేందుకే.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ కార్యక్రమాలు దోహదపడుతాయి. సైన్స్ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన, వినూత్నమైన ప్రదర్శనలు, ప్రాజెక్టులను రూపొందించేందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిపుణులతో విస్తరణోపాన్యాసాలు, వర్క్‌షాపులు నిర్వహించాలి. ముఖ్యంగా విద్యార్థి కేంద్రంగా ఆవిష్కరణలు జరిగేలా చూడాలి. – వి.గురునాథరావు, సైన్స్ కమ్యూనికేటర్ -
సెప్టెంబర్ 15నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్
విద్యారణ్యపురి : జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లను సెప్టెంబర్ 15 నుంచి నిర్వహించబోతున్నారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ఆదేశాల ప్రకారం వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల విద్యార్థులకు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ సోమవారం తెలిపారు. ఈ విద్యాసంవత్సరం వరంగల్ జిల్లాలో 564మంది విద్యార్థులకు ఇన్‌సె్పౖర్ అవార్డులు రాగా, ఖమ్మం జిల్లాలో 130మంది, నల్లగొండ జిల్లాలో 30 మందికి అవార్డులు వచ్చాయి. ఈ మేరకు మూడు జిల్లాల విద్యార్థులను రెండు గా విభజించి వరంగల్‌లోనే ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలి పారు. సెప్టెంబర్ 15, 16, 17వ తేదీల్లో మహబూబాబాద్ డివిజ న్, ఖమ్మం జిల్లా విద్యార్థులకు కలిపి మహబూబాబాద్ డివిజన్ కేంద్రంలో మొదటి ఇ¯Œæస్పైర్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 19, 20, 21వ తేదీల్లో వరంగల్, జనగామ, ములుగు డివిజన్లు, నల్లగొండ జిల్లా విద్యార్థులకు కలిపి వరంగల్‌లో రెండో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని డీఈఓ తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, స్వస్త్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంశాలతో పాటు ఇతర ప్రాజెక్టుల నమూనాలు ప్రదర్శించాల్సి ఉంటుం దని డీఈఓ తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : వచ్చే విద్యాసంవత్సరం ఇన్‌సె్పౖర్ అవార్డుల కో సం అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజీవ్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 30లోగా విద్యార్థుల దరఖాస్తులను ఇ¯Œæస్పైర్ వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ఆయన సూచించారు. వివరాలకు జిల్లా సై న్స్ అధికారి(99490 38628)తో పాటు ఎంఈవోలు, డిప్యూటీ డీ ఈవోలు, రిసోర్స్ పర్సన్లను సంప్రదించాలని డీఈఓ కోరారు. -
26, 27వ తేదీల్లో ఓరియంటేషన్ తరగతులు
విద్యారణ్యపురి : జిల్లాలో ఇన్‌సె్పౖర్ అవార్డు పొందిన విద్యార్థులు, గైడ్ టీచర్లకు ఈనెల 26, 27వ తేదీలల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ తెలిపారు. జిల్లాలో 564 మంది విద్యార్థులు ఇన్‌సె్పౖర్ అవార్డులు పొందారని, వీరితో పాటు గైడ్ టీచర్లకు సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు ఓరియంటేషన్‌కు పంపించాలని సూచించారు. ఈ నెల 26న వరంగల్ డివిజన్ విద్యార్థులు, గైడ్ టీచర్లకు కాజీపేటలోని బిషప్ బెరట్టా హైస్కూల్లో, జనగామ డివిజన్ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు స్టేషన్ ఘ¯Œæపూర్ శివునిపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఓరియంటేషన్ ఉంటుందని తెలిపారు. ఈనెల 27న మహబూబాబాద్ డివిజన్ విద్యార్థులు, గైడ్‌టీచర్లకు అక్కడి ఫాతిమాహైస్కూల్‌లో, ములుగు డివిజన్ విద్యార్థులు, గైడ్ టీచర్లకు ఆత్మకూరు మండలం ఊరుకొండ అబ్యాస్ హైస్కూల్లో ఓరియంటేషన్ ఏర్పాటుచేశామని డీఈఓ వివరించారు. -
రేసుగుర్రాలు
అథ్లెటిక్స్‌లో అలరిస్తున్నఓరుగల్లు ముద్దుబిడ్డలు ఉదయం, సాయంత్రం వేళల్లో మైదానంలో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ గుర్తింపు కోసం అలుపెరుగని పోరాటం ఆన్ యువర్ మార్క్.. గెట్.. సెట్.. గో.. అనగానే అథ్లెటిక్స్ ట్రాక్‌పై వారు ఒక్క ఉదుటున కదులుతారు.. అడవిలో జింకను వేటాడే చిరుతలా మెరుపు వేగంతో పరుగెత్తి అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంటారు.. గ్రీకు దేశంలో పురుడు పోసుకున్న అథ్లెటిక్స్‌లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమదైన ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు. వరంగల్ స్పోర్ట్స్ : రన్నింగ్ రేస్ పోటీలు సాధారణంగా పాఠశాలలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో పిల్లలకు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో చురుకుదనం పెరిగి, కండరాలు బలిష్టంగా తయారవుతాయని వ్యాయామ ఉపాధ్యాయుల అభిప్రాయం. వాస్తవంగా అథ్లెటిక్స్ అనే పేరు చెప్పగానే భారతదేశ ప్రజలకు టక్కున గుర్తుకొచ్చే క్రీడాకారులు పీటీ ఉష, అశ్విని నాచప్ప. సినీ నిర్మాతలు వారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకు సినిమాలు కూడా తీశారంటే సదరు క్రీడాకారుల ప్రాధాన్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. పీటీ ఉష తర్వాత 36 ఏళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున 100 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అథ్లెట్ ద్యుతీచంద్. అనేక ఒడిదొడుకుల అనంతరం తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్్సకు చేరుకున్న ద్యుతీచంద్ కృషి, శ్రమ, పట్టుదల మాటల్లో చెప్పలేనివి. ఈ సారి ఆమె పతకాలు సాధించి ఇం డియా పేరును నిలబెడుతుందని ఓరుగల్లు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చే స్తున్నారు. అన్ని దేశాల్లో ప్రాచుర్యం క్రీస్తు పూర్వం 776లో గ్రీకు దేశంలో అథ్లెటిక్స్ పురుడు పోసుకుంది. అయితే 19, 20వ శతాబ్దాల్లో పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు అథ్లెటిక్స్ నియమాలు, నిబంధనలు రూపొందించి పోటీలు నిర్వహించాయని చరిత్ర చెబుతోంది. తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లో అథ్లెటిక్స్ ప్రాచుర్యం పెరిగింది. అథ్లెటిక్స్ అనగానే ప్రధానంగా రన్నింగ్, వాకింగ్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్, తదితర క్రీడలు ఉంటాయి. అలరిస్తున్న అశ్విని వరంగల్‌కు చెందిన కె. అశ్విని అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరుస్తూ శభాష్ అనిపించుకుంటోంది. వరంగల్ స్పోర్ట్స్ అకాడమీలో పదేళ్లుగా శిక్షణ పొందుతున్న ఆమె ఇప్పటివరకు పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధిం చింది. 2013, 2014, 2015లో పంజాబ్‌లోని పాటియాల, మహారాష్ట్ర, మంగళూరులో సీనియర్స్ ఇంటర్ యూనివర్సిటీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అద్భు త ప్రదర్శన ఇచ్చింది. కాకినాడలో 2014 లో జరిగిన సౌత్ ఇండియా జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలతోపాటు వరంగల్, హైదరాబాద్‌లో 2013లో జరిగిన పోటీల్లో 50కి పైగా పతకాలు సాధించింది. పతకాల శ్రీకాంత్ వరంగల్ స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్న ఎ. శ్రీకాంత్‌నాయక్ ఐదేళ్లుగా అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. జూనియర్స్ విభాగంలో ఆయన 30 వరకు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని 40 వరకు బంగారు, వెండి, రజత పతకాలు సాధించాడు. ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో రాంచి లో 2014లో జరిగిన 400 మీటర్ల పరుగులో సిల్వర్, గుడివాడలో 2015లో జరిగిన 400 మీటర్ల పరుగులో సిల్వర్, కాకినాడలో 2014లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ 100 మీటర్ల పరుగులో సిల్వర్ పతకాలను సాధించాడు. వరంగల్ అకాడమీలో శిక్షణ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్లు పీటీ ఉష, అశ్విని నాచప్పను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు వరంగల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా కొన్నేళ్ల నుంచి ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ మేరకు కోచ్ శ్రీమన్నారాయణ హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వారికి నిత్యం 100, 200, 400 మీటర్ల పరుగు పందెంతోపాటు లాంగ్‌జంప్, హైజంప్‌లో మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రధానంగా వంద మీటర్ల పరుగు పందెంను 12 సెకన్లలో పూర్తి చేయాలనే పట్టుదలతో అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అకాడమీలో శిక్షణ పొందుతున్న పలువురు అథ్లెట్లు ఇప్పటికే అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు. ‘శ్రావణ’ భరితం జిల్లాలోని కొత్తగూడ మండలానికి చెందిన టి. శ్రావణ్ డిగ్రీ ఫైనలియ ర్ చదువుతూ అథ్లెటిక్స్‌లో రాణిస్తూ వస్తున్నాడు. వరంగల్ స్పోర్ట్స్ అకాడమీలో 8 ఏళ్లుగా శిక్షణ పొందుతున్న ఆయన 100, 400 మీటర్ల పరుగులో 30 వరకు జాతీ య, రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొని 40 వరకు బంగారు పతకాలు సాదించాడు. అలాగే హైజంప్‌లో కూడా ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. -
'ఆ ఆల్బమ్‌కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'
లాస్ఏంజిల్స్: బ్రిటన్ పాప్ సింగర్ రీటా ఓరా తన రాబోయే ఆల్బమ్‌కు ప్రేరణ తన లవ్ ఫెయిల్యూరే అని చెబుతోంది. ఒకప్పుడు స్కాంట్లాండ్ డీజే కాల్విన్ హారిస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు అతనికి బైబై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే హారిస్‌తో బ్రేకప్.. తన రాబోయే ఆల్బమ్‌లో రెండు పాటలకు ప్రేరణనిచ్చిందని ఓరా వెల్లడించింది. హ్యారిస్‌తో బ్రేకప్ అనంతరం ప్రముఖ డిజైనర్ టామి హిల్ఫింగర్ కుమారుడు రిక్కితో డేటింగ్ చేసిన ఓరాకు ఆ రిలేషన్ కూడా కలిసిరాకపోవడంతో 2015 చివర్లో అతనితోనూ విడిపోయింది. 'హ్యారిస్‌తో బ్రేకప్ తరువాత చాలా కోపానికి, ఉద్వేగానికి గురయ్యాను. అతనంటే అసహ్యం కలిగింది. ఆ తరువాత మాత్రం నన్ను నీను నియంత్రించుకున్నాను. రాబోయే ఆల్బమ్‌లో ఈ హార్ట్ బ్రేకప్ గురించి రెండు పాటలుంటాయి' అని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రీటా ఓరా తెలిపింది. -
వరంగల్‌లో 'ఇన్స్పైర్' కార్యక్రమం
వరంగల్: వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇన్స్పైర్ కార్యక్రమంలో డీఈవో చంద్రమోహన్, అసోసియేషన్ నేత వెంకటేశ్వర్లు, రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇక ఇన్స్పైర్ కావాలె...
నేటి నుంచి రాష్ట్రస్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శన ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ఎగ్జిబిట్లతో తరలివస్తున్న విద్యార్థులు, గైడ్ టీచర్లు సందడిగా మారిన బిషప్ బెరెట్టా స్కూల్ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు 432 ఎగ్జిబిట్ల నమోదు మొత్తం 763 ఎగ్జిబిట్ల ప్రదర్శన పర్యవేక్షణకు ఎన్సీఈఆర్టీ ప్రొఫెసర్ విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కాజీపేటలోని బిషప్ బెరెట్టా హైస్కూల్లో బుధవారం వరకు జరగనున్న ఈ సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్స్పైర్ నిర్వహణకు ఐదు కమిటీలను ఏర్పాటుచేయగా... ఆదివారం నుంచి ఎగ్జిబిట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి ఏడు గంటల వరకు వివిధ జిల్లాల నుంచి 432 ఎగ్జిబిట్లతో విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు వచ్చి నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి హాజరుకానున్న విద్యార్థులు, గైడ్టీచర్ల కోసం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లు బిషప్ బెరట్టా హైస్కూల్‌కు వాహనాల్లో తీసుకువస్తున్నారు. 763 ఎగ్జిబిట్లు.. 1800 మంది విద్యార్థులు, టీచర్లు రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు పది జిల్లాలకు చెందిన విద్యార్థులు 763 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. విద్యార్థులు, వారి గైడ్ టీచర్లు కలిపి 1800 మంది అవకాఆలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు 432 ఎగ్జిబిట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. హాజరైన విద్యార్థులు వారి ఎగ్జిబిట్ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు నుంచి ఎనిమిది వరకు సబ్‌థీమ్స్‌లో ఎగ్జిబిట్లు ప్రదర్శించనుండగా.. ఇందులో పవర్ జనరేషన్, న్యూట్రిషన్ ఫుడ్, హెల్త్, పొల్యూషన్, వ్యవసాయరంగం, సోలార్ ఎనర్జీ ఇలా సైన్స్, సోషల్‌కు చెందిన వివిధ ఎగ్జిబిట్లు ఉంటాయి. ఇన్స్పైర్ నిర్వహణకు ప్రధాన వేదిక కాజీపేలోని బిషప్ బెరట్టా కాగా, పక్కనే ఉన్న బీఈడీ కళాశాలలో కలిపి మొత్తం 37 గదుల్లో ఎగ్జిబిట్ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఇన్‌స్పైర్‌కు వరంగల్ జిల్లా నుంచి 129 ఎగ్జిబిట్లు, ఖమ్మం నుంచి 40, కరీంనగర్ నుంచి 118, ఆదిలాబాద్ నుంచి 30, నిజామాబాద్ నుంచి 32, మహబూబ్‌నగర్ నుంచి 76, మెదక్ నుంచి 75, నల్లగొండ నుంచి 30, రంగారెడ్డి నుంచి 135, హైదరాబాద్ నుంచి 98 చొప్పున ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. పర్యవేక్షణకు ప్రొఫెసర్లు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ఇన్స్పైర్ ఇన్స్పైర్ ఏర్పాట్లు, నిర్వహణ పరిశీలన కోసం రాష్ట్ర విద్యాపరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ)నుంచి ప్రొఫెసర్ వేణయ్య జిల్లాకు చేరుకున్నారు. ఆయనతో పాటు సైన్స్ సూపర్వైజర్ ఉమాదేవి, డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈఓలు రవీందర్‌రెడ్డి, అబ్దుల్‌హై, కృష్ణమూర్తి, ఎంఈఓలు వీరభద్రనాయక్, ప్రేమేందర్‌రెడ్డి బిషప్బెరట్టా హైస్కూల్‌కు ఆదివారం సాయంత్రం చేరుకుని వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. ఆహ్వాన కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీతో పాటు ఇన్స్పైర్ నిర్వహణకు 250మంది హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కలిపి 22 కమిటీలను ఏర్పాటుచేసిన అధికారులు, 300 మంది ఎన్సీసీ వలంటీర్లకు కూడా అందుబాటులో ఉంచారు. ఏదైనా అవసరమున్న వారు వీరిని సులువుగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన టోపీలు, టీషర్ట్లు అందజేశారు. వివిధ ప్రాంతాల్లో వసతి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు, గైడ్‌టీచర్లకు నగరంలోని అవంతి, న్యూత్రివి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల విద్యార్థులకు గ్రీన్వుడ్, విజ్ఞాన్ స్కూళ్లలో బసకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులకు సెయింట్ పీటర్స్, గ్యాబ్రియల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల వారికి శ్రీనిధి, లయోలా, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల వారికి స్టేషన్ ఘన్‌పూర్‌లోని సెయింట్ థామస్, హోళీక్లాస్ హైస్కూళ్లలో వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు సాయంత్రం బిషప్ బెరట్టా హైస్కూల్ నుంచి వాహనాల్లో విద్యార్థులు, టీచర్లుకు వారి బసకు పంపించి ఉదయమే తీసుకొస్తారు. అలాగే, సాయంత్రం పూట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, , కాజీపేట రైల్వేస్టేషన్లో లయన్స్‌క్లబ్ హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటుచేసినట్లు నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయికి 40 నుంచి 45 ఎగ్జిబిట్లు వరంగల్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ నుంచి జాతీయ స్థాయికి 40 నుంచి 45 ఎగ్జిబిట్లను ఎంపిక చేయనున్నారు. ఇక్కడి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించే ఎగ్జిబిట్లను 16మంది జడ్జిలతో మొదటి ప్యానల్ పరిశీలిస్తుంది. మొత్తం 763 ఎగ్జిబిట్లలోని ఎనిమిది శాతం ఎగ్జిబిట్లను వీరు ఎంపిక చేయనుండగా, ఆ తర్వాత ముగ్గురు నిట్ ప్రొఫెసర్లు పరిశీలించి అందులోని నుంచి ఐదు శాతం ఎగ్జిబిట్లను అక్టోబర్ 6నుంచి ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ఖరారు చేస్తారు. ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు - డాక్టర్ ఎస్.విజయకుమార్, డీఈఓ తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ నిర్వహించే అవకాశం వరంగల్‌కు దక్కింది. దీంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాజీపేటలోని బిషప్ బెరట్టా హైస్కూల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జిబిట్లతో వచ్చే విద్యార్థులు, టీచర్లుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు 22 కమిటీలను ఏర్పాటుచేశాం. కాగా, వరంగల్, కాజీపేట, హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 22, 23వ తేదీలోల సెలవులు లేవని, వారితో పాటు ప్రైవేటు,ఎయిడెడ్ ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ఇన్‌స్పైర్‌కు తీసుకురావాలి. జిల్లాలోని మిగతా చోట్ల నుంచి కూడా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తీసుకొస్తే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించినట్లవుతుంది. సోమవారం ఉదయం జరిగే ఇన్స్పైర్ ప్రారంభోత్సవ సభకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షత వహించనుండగా, డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు సీతారాంనాయక్, కడియం శ్రీహరి, కలెక్టర్ జి.కిషన్, ఎమ్మెల్యే చందూలాల్ తదితరులు పాల్గొంటారు. -
వేదిక మారింది
ఫాతిమా హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ 22 నుంచి 24వ తేదీ వరకు కార్యక్రమం నేడు 22 కమిటీల సభ్యులతో సమావేశం డీఈఓ విజయకుమార్ విద్యారణ్యపురి : వర్ధన్నపేట మండలం పున్నేలులోని ఏకశిల హైస్కూల్లో నిర్వహించాలనుకున్న తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కార్యక్రమం వేదిక మారింది. కాజీపేటలోని ఫాతిమా బాలికల హైస్కూల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనను నిర్వహించనున్నట్టు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ వెల్లడించారు. పలు కారణాలతో వేదికను మార్చినట్టు ఆయన తెలిపారు. 22,23,24 తేదీల్లో ఫాతిమా హైస్కూల్లో నిర్వహించనున్న ‘ఇన్స్పైర్’ కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. ఇన్స్పైర్ నిర్వహణ కోసం 22 కమిటీలను నియమించామని, అయితే నిర్వహణ వేదిక మారడంతో తక్కువ సమయంలోనే అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున శుక్రవారం 19న ఉదయం పది గంటలకు ఫాతిమా గర్ల్స్ హైస్కూల్లో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నామన్నారు. బాధ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ఏర్పాట్లపై డీఈఓ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మొత్తం వెయ్యి సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. పది జిల్లాల విద్యార్థులు తమ గైడ్ టీచర్లతో కలిసి ఇక్కడికి రానున్నట్టు చెప్పారు. వీరంతా 21వ తేదీనే వచ్చి తమ పేర్లతోపాటు ఎగ్జిబిట్లకు సంబంధించిన అంశాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోనూ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే బిషప్ బెరట్టా, సెయింట్ గేబ్రియల్ స్కూళ్లను కూడా ఉపయోగించుకుంటామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో ఐదుశాతం ఎగ్జిబిట్లను త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికచేస్తామన్నారు. -
కళకళలాడిన ‘ఇన్స్పైర్’
ఎగ్జిబిట్లను తిలకించిన 40వేలమంది విద్యార్థులు రేపటితో ముగియనున్న కార్యక్రమం నెక్కొండ : మండలకేంద్రంలోని విద్యోదయ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఇన్స్పైర్ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండోరోజైన ఆదివా రం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. దీంతో పాఠశాల ప్రాం గణం కిక్కిరిసిపోయింది. విద్యార్థులతో కళకళలాడింది. నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మహబూబాబా ద్, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పాఠశాలలకు చెందిన దాదాపు 40వేలమందికిపైగా విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లను తిలకిం చారు. విద్యార్థులు ఒక్కో ఎగ్జిబిట్‌ను సునిశి తంగా పరిశీలిస్తూ ముందుకుసాగారు. కార్యక్రమంలో ప్రదర్శించిన 550కిపైగా ఎగ్జిబిట్లను పరిశీలించేందుకు ఒక్కో విద్యార్థికి రెండుగంట లకుపైగా సమయం పట్టింది. పాఠశాల బస్సు లు, డీసీఎంలలో తరలివచ్చిన విద్యార్థులు ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉండడం గమనార్హం. మహబూబాబాద్ డిప్యూటీ డీఈవో రవీందర్‌రెడ్డి, ఎంఈ వో రత్నమాల, విద్యోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా నాగార్జున్రెడ్డిఎగ్జిబిట్లను సందర్శించారు. ఎగ్జిబిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నిజజీవితంలోనూ సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు, టీయూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బూర్గుపల్లి శ్రావణ్, వడుప్సా నాయకుడు కోడూరి అశోక్‌కుమార్, ఉపాధ్యాయులు గ్రేస్మణి, అనంతుల మురళీధర్, రామారపు రవి, లక్ష్మణ్‌రావు, అనిల్‌కుమార్, పీఈటీలు కొమ్ము రాజేందర్, బిక్షపతి, అయిలయ్య, ఆర్.బిక్షపతి, శంకర్, కైలాష్, విజయ్, ప్రవీణ్‌రెడ్డి, సంపత్, సారంగపాణి, సుధీర్, మాధవి తదితరులు పాల్గొన్నారు.