Interim budget
-
ఈ రైల్వే షేర్లు కొంటే దశ తిరిగినట్లేనా..?
-
డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్... రూ. 50,000 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024–25) డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 50,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించారు. వెరసి ఈ ఏడాది (2023–24)కి రూ. 30,000 కోట్ల సవరించిన అంచనాలకంటే అధికంగా డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను ప్రభుత్వం నిర్దేశించుకుంది. నిజానికి గతేడాది ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆరి్ధక శాఖ రూ. 51,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించింది. అయితే ఆపై ప్రభుత్వం రూ. 30,000 కోట్లకు లక్ష్యాన్ని సవరించింది. కాగా.. 2024–25 ఏడాదికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌ను ప్రతిపాదించకపోవడం గమనార్హం! తద్వారా నిధులను సమకూర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలనూ ప్రకటించలేదు. గత బడ్జెట్ అంచనాలలో ఈ మార్గంలో రూ. 10,000 కోట్లను అందుకోవాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇదీ తీరు.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 7 సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 12,504 కోట్లను సమకూర్చుకుంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ దిగ్గజాలు కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా తదితరాలున్నాయి. మార్చికల్లా వాటాల ఉపసంహరణ(డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా మొత్తం రూ. 30,000 కోట్లను అందుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. 2018–19, 2017–18ని మినహాయిస్తే.. ప్రతి బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను చేరుకోకపోవడం గమనార్హం! 2017–18కి బడ్జెట్ అంచనాలు రూ. లక్ష కోట్లు కాగా.. అంతకుమించి రూ.1,00,056 కోట్లను సమీకరించడం ద్వారా ప్రభుత్వం రికార్డు నెలకొలి్పంది. ఈ బాటలో 2018–19లోనూ బడ్జెట్ అంచనాలు రూ.80,000 కోట్లను అధిగమిస్తూ సీపీఎస్ఈల లో వాటాల విక్రయం ద్వారా రూ. 84,972 కోట్ల నిధులు అందుకుంది. -
దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘వికసిత భారత్’నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను మరింత శక్తివంతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అని కొనియాడారు. గురువారం బడ్జెట్ అనంతరం ఆయన టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’పునాదిని బలోపేతం చేసే హామీని ప్రస్తుత బడ్జెట్ ఇస్తోందని చెప్పారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సమగ్రంగా, వినూత్నంగా ఉందని, దేశ పురోభివృద్ధిపై పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు. భారతదేశ యువ త ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం బడ్జెట్లో రూ.లక్ష కోట్లు కేటాయించిన ట్లు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ప్రకటించినట్లు గుర్తుచేశారు. గ్రామాలు, నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. తొ లుత 2 కోట్ల మంది మహిళలను ’లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించకున్నామని, ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇకపై అంగన్వాడీ సభ్యు లు, ఆశావర్కర్లు సైతం లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తాజా బడ్జెట్లో ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయాలను భారీగా పెంచినట్లు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించారని, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ఇది తీపి కబురేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల 21వ శతాబ్దంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని, కోట్లాది మంది యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘వందేభారత్ స్టాండర్డ్’కింద 40 వేల ఆధునిక కోచ్‌లను తయారుచేసి, సాధారణ ప్యాసింజర్ రైళ్లలో చేర్చాలని బడ్జెట్లో ప్రకటించారని, ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే మార్గాల్లో లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ పేద, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని అన్నారు. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయపు పన్ను ఉపశమన పథకంతో దాదాపు కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లబ్ధి కలుగుతుందన్నారు. నానో డీఏపీ వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు. -
అభివృద్ధి నినాదంతో బడ్జెట్: నిర్మలా సీతారామన్
-
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
పద్దు.. పొడిచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మధ్యంతర సమీక్షకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆశించిన మేరకు ఈ ఏడాది రాబడులు రాని కార ణంగా బడ్జెట్‌ను సమీక్షించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో శాఖల వారీగా అంచనాలు, రాబడులు,ఖర్చులు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చు పద్దులపై అంచనాలను సవరిం చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. తొలి ఆరు నెలల ఆర్థిక పరిస్థితులు, రాబోయే 6 నెలల అంచనాలను విశ్లేషి స్తున్న ఆర్థిక శాఖ అధికారులు.. 2020–21 బడ్జెట్ ప్రతిపాదనల్లో 15–20% రాబడి రాకపోవచ్చన్న అంచనాలతో శాఖల వారీ సవరణ ప్రతిపాదనలను రూపొం దించే పనిలో పడ్డారు. ఈ మేరకు త్వరలోనే అన్ని శాఖలకు నోట్ పంపి ఆయా శాఖల కచ్చిత ప్రతి పాదనలకు అనుగుణంగా సవరించిన అంచనాల బడ్జెట్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.1.30 లక్షల కోట్ల వరకు.. వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.1,76,393 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ ప్రతిపాదించిన దానికి కొంచెం అటుఇటుగా రాబడులు, ఖర్చులు ఉంటాయి. ఇంతకుముందు మూడేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే 2019–20లో 96 శాతం, 2018–19లో 75 శాతం, 2017–18లో 79 శాతం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఈసారి కరోనా ప్రభావంతో ఇది మరికొంత తగ్గి 75 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తొలి ఆరు నెలల్లో వచ్చిన రూ.63,970 కోట్లకు తోడు మరో 70 వేల కోట్లు కలిపి రూ.1.30 లక్షల కోట్లు రావచ్చని భావిస్తోంది. ఇందులో రూ.40 వేల కోట్లకు పైగా పన్ను ఆదాయం, రూ.20 వేల కోట్ల వరకు రుణాలు, మరో రూ.5 వేల కోట్లకు పైగా ఇతర ఆదాయం కలిపి ఆ మేరకు సమకూరుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటు గత మూడేళ్ల రాబడులు పరిశీలించినా చివరి ఆరు నెలల ఆదాయం రూ.70 వేల కోట్లు దాటలేదు. ఖర్చులు కూడా ఆ మేరకు.. ఆదాయ పరిస్థితి అలా ఉంటే.. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వరకు అనివార్య చెల్లింపులు జరపాల్సి ఉంది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.25 వేల కోట్లు, అప్పుల వడ్డీ లేకుండా రూ.7 వేల కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.14 వేల కోట్లు, పింఛన్లకు రూ.8 వేల కోట్లు, సబ్సిడీల కింద రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. ఇందులో సబ్సిడీ ఖర్చులు తగ్గించుకున్నా రూ.3 వేల నుంచి 4 వేల కోట్లే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేతిలో పెద్దగా నిధులు మిగిలే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లోనే బడ్జెట్ అంచనాలను సవరించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకోవాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇందులో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే రూ.10–15 వేల కోట్లు అదనంగా వచ్చే అవకాశముంది. ఇక ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రజలపై పన్ను భారం వేయలేదు. కొంతమేరకు పన్నులు పెంచడం, భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవడం ద్వారా నిధుల వెసులుబాటు కలగనుంది. మరి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది.. రాబడులు పెంచుకునే దిశలో ముందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా..? వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకుని ప్రభుత్వ శాఖల అదనపు ఖర్చులను తగ్గించుకునే దిశలో బడ్జెట్ అంచనాలను సవరిస్తారా అన్నది భవిష్యత్ అవసరాలను తేల్చనున్నాయి. -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్‌బీఎఫ్‌సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడం లక్ష్యంగా.. వారికి 20 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇచ్చేందుకు నిర్ణయించింది. దీన్ని 2018 జూలై ఒకటి నుంచి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు కాకుండా వచ్చే జూన్‌లో చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు మీడియాకు వెల్లడించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలివీ... ► అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలననుసరించి సత్వరం చెల్లింపులు చేయాలని నిర్ణయం. ► వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై చర్చ జరిగింది. తక్కువ ధరకు ఎవరు టెండర్లు వేస్తే వారికిచ్చేయాలని నిర్ణయం. ► జేఎన్టీయూ అమరావతి పేరిట కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం. దీన్ని మోడల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.10 లక్షల చొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా రూ.కోటి చొప్పున అకార్డ్ యూనివర్సిటీకి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► హెల్త్ సైన్సెస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టేందుకు ఆమోదం. డిగ్రీ కళాశాల కూడా ఇవ్వాలని నిర్ణయం. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం. ► అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ► జలవనరుల శాఖకు చెందిన భూముల్లో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అంగీకారం. ► కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడు దగ్గర 20 ఎకరాల భూముల్లో పేదలకు పట్టాలివ్వడానికి ఆమోదం. ► కాకినాడ వెంకట్‌నగర్‌లోని 1,040 చదరపు గజాల భూమిని కల్యాణమండపం నిర్మాణంకోసం వీవర్స్ కమ్యూనిటీకి 25ఏళ్ల లీజుకివ్వాలని నిర్ణయం. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో పరిగి, సెరికొలెం గ్రామాల్లోని 256.61 ఎకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు అంగీకారం. ► రాజమహేంద్రవరంలోని రామకృష్ణ మఠానికి రూ.23,49,981 విలువ గల ప్రాపర్టీ టాక్స్ బకాయిల నుంచి మినహాయింపు. ► విశాఖ జిల్లా ఎండాడలో అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మిస్తున్న భవనానికి సంబంధించి రూ.48,36,273 విలువ గల బిల్డింగ్ లైసెన్స్ ఫీజు మినహాయింపునకు ఆమోదం. ► ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లిలో 48.53 ఎకరాల ప్రభుత్వభూమిని అఫర్డబుల్ హౌసెస్ నిర్మాణంకోసం విజయవాడలోని రాజీవ్ స్వగృహæ కార్పొరేషన్ సీఎండీకి అప్పగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేటలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు 6.96 ఎకరాల అగ్రి భూమి గుంటూరు టెక్స్టైల్ పార్క్ యాజమాన్యానికి కేటాయింపు. ఎకరాకు రూ.18,15,000 చెల్లించే షరతుపై కేటాయింపు. ► కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 20 ఎకరాలు కేటాయింపు(కేవలం సంస్థ పేరులో స్వల్ప మార్పు)నకు ఆమోదం. ► ప్రకాశం జిల్లా కొండెపి మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి ఎం.కళ్యాణికి ఒంగోలులో ఉచితంగా స్థలం కేటాయింపుకు నిర్ణయం. ► కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 50 ఎకరాల భూమిని.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయింపు. సమగ్ర ఇంటెలిజెన్స్ శిక్షణ అకాడమీకోసం భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం ► ఏపీ ఎకనమిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు విజయవాడ గ్రామీణ మండలం.. జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమి కేటాయింపు. దీనిలో వేమవరంలో 60 ఎకరాలు, జక్కంపూడిలో 93 ఎకరాలున్నాయి. జక్కంపూడిలో మార్కెట్ ధర ఎకరాకు రూ.కోటి, వేమవరంలో మార్కెట్ ధర ఎకరా రూ.50 లక్షల చొప్పున ధర నిర్ధారణ. ► విజయనగరం జిల్లా కవులవాడ, రావాడ, ముంజేరు, కంచేరుపాలెం, గూడెపువలస, కంచేరు గ్రామాల్లో 500.14 ఎకరాల భూమిని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కేటాయింపు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు 70.18 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా అప్పగించేందుకు నిర్ణయం. ► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచిలో కియా మోటార్స్ ఆర్వోబీ, వై జంక్షన్ ఏర్పాటుకు 5.89 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలోనే ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయింపు. ► విశాఖ జిల్లా పాడేరు ఏరియా ఆసుపత్రి 100 పడకల స్థాయి నుంచి 200 పడకల జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంపు. ► ల్యాండ్ హబ్(భూసేవ) ప్రాజెక్టు నిమిత్తం అవసరమైన సిబ్బందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు అంగీకారం. ► కృష్ణా జిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం. ► చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాలలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఆమోదం. ► నంద్యాలలో ప్రస్తుతమున్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు ఆమోదం. మొత్తం 46 పోస్టులు మంజూరు. -
ఎన్నికల చక్రం
చూస్తుండగా కాలం గిర్రున తిరిగొచ్చింది. ఎన్నికలు మళ్లీ రానే వస్తున్నాయ్. నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లు నూటికి నూరు శాతం ఓట్ల బడ్జెట్‌గానే అంతా నిర్ధారించారు. అయినా జనం మాయలో పడు తూనే ఉంటారు. భ్రమలోపడి, ఆ మాటలు నమ్మి మీటనొక్కి వస్తుంటారు. వేలికి నల్లమచ్చ పొడిపించుకుని గంపెడాశతో బయటకొస్తారు. అక్కడ నుంచి నెలా రెండు నెలలు ఇంకో డ్రామాకి తెర లేస్తుంది. అంకాల వారీగా అది పూర్తవుతుంది. పదవుల్ని పంచుకుంటారు. అంతా సంకల్పాలు చెప్పి కంకణాలు ధరిస్తారు. కొత్త చాంబర్లు, కొత్తకార్లు అన్నీ ప్రజాసేవలోకి దిగుతాయ్. అసంతృప్తులు కూడా తొంగి చూడటం ప్రారంభం అవుతుంది. ఇక్కడికి ఆరు నెలల పుణ్యకాలం గడిచిపోతుంది. మళ్లీ చలికాలం మొదలవుతుంది. పది పన్నెండుసార్లుగా కోటి ఆశలతో ఓట్లు వేస్తున్న వారికి అవే అవే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయ్. ప్రజా సమస్యల మీద నుంచి ప్రభుత్వాలు దృష్టి మళ్లించి నాలుగైదు నెలలు దాటింది. పాత మాటలు పక్కనపెట్టి సర్కార్లు కొత్త వాగ్దానాలు చేస్తున్నాయ్. ఈ మధ్య ఒక పెద్దాయన, ‘ఇప్పుడు జనాభాకి మునుపటిలో అయోమయంగానీ తికమకగానీ లేదండీ. స్పష్టంగా అనుకునే ఓట్లు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘మంచి ధరకి ఓటు వేస్తున్నారు కొందరు, మనవాడని వేస్తున్నారు కొందరు. అందుకని మాయ మాటల్లో పడే సమస్యే లేదు’ అని ముక్తాయించారు. ఓటర్ ప్రజకు వడ్డించాల్సిన భక్ష్యాలన్నీ ప్రభుత్వాలు బడ్జెట్ విస్తట్లో వడ్డించాయ్. వాళ్లకి అందులో తినేవి ఏవో ఉత్తుత్తివేవో అర్థం కాలేదు. ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడింకా కొత్త జల్లులు పడే అవకాశం లేదు. సమయం దాపురించేసింది. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపాలో తేల్చుకున్నారని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థి తేలితే అంతా ఖరారేనంటున్నారు. అన్ని వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయ్. అన్నింటినీ ప్రజ సమభావంతోనే స్వీకరిస్తోంది. మన దేశంలో నేతల ఆరోపణలన్నీ సీరియస్‌గా తీసుకోవడం జనం మానేసి చాలా కాలమైంది. అవి చాలాసార్లు కాలక్షేపం, కొన్నిసార్లు వినోదంగా మారాయి. స్వతంత్రం రాకముందు నుంచి రైతు సమస్యల గురించి మన నాయకులు ఉద్ఘోషిస్తున్నారు. గాంధీ గ్రామ స్వరాజ్యం మీద కలలు కన్నారు. గ్రామసీమలు చూస్తుండగా దివాళా తీశాయి. రైతుకి సిమెంటు రోడ్డు కంటే నీరు పారే పంటకాలువ, మురుగు కాలువ ముఖ్యం. వాటిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. పట్టించుకున్నా వాటికి కమిటీలు వేసి, రాజకీయం చేసి వదులుతారు. ఏదో వంకన అస్మదీయుల్ని పెంచి పోషించడమే అవుతుంది. ప్రభుత్వం పెట్టే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా, ముందు విధిగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం. గ్రామాలు అనేక కారణాల వల్ల మరుగున పడిపోయాయి. ఆదాయాలు లేవు, బతుకు తెరువులు లేవు. పట్నవాసంతో సమంగా ఖర్చులు పెరిగాయి. విద్య, వైద్య సౌకర్యాలు పూజ్యం. వలసలకి ఇదే కారణం. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, డాక్టర్లో ఇతర చిరుద్యోగులు గ్రామంలో ఉండరు. దగ్గర బస్తీలో మకాం పెడతారు. గుళ్లో పూజారి సైతం నగరంవైపు పరుగులు పెడతాడు. వాళ్ల పిల్లలకీ చదువులు కావాలి. వారి పెద్దలకీ వైద్యం కావాలి. వాళ్లకీ వ్యాపకం, వినోదం కావాలి. ఈ తరుణంలో ఓట్ల ప్రస్తావనలు వచ్చి, అందరికీ పల్లెలు గుర్తొస్తాయి. నివాసయోగ్యంగా సకల సదుపాయాలతో ఉన్న గ్రామాలు చాలా తక్కువ. గడిచిన నాలుగైదు దశాబ్దాలలో పల్లెలు కళా విహీనమయ్యాయి. అన్నీ పట్టించుకునే మీడియా కూడా గ్రామ ప్రాంతాలను పట్టించుకోదు. గ్రామంలో కుక్కని మనిషి కరిచినా అది వార్త కాదు. జానపద కళల అభివృద్ధికి, కొన్ని క్రీడలకి గ్రామాలు ఆటపట్టుగా నిలుస్తాయ్– అభివృద్ధి చేస్తే. అన్ని క్రీడలకు పుట్టిల్లు పల్లెటూళ్లేనని మర్చిపోకూడదు. పల్లెని విస్మరించడమంటే తల్లిని విస్మరించడమే! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘చంద్రబాబు మరో డ్రామాకు సిద్ధమయ్యారు’
సాక్షి, విజయవాడ : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేయాలేని చంద్రబాబు మళ్లీ రైతుల కోసం రూ.5000 కోట్లు అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మరో డ్రామాకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఒకవైపు కేంద్రం సహకరించలేదంటారు, మరోవైపు రాష్ట్రం అభివృద్ధి పథంలోనడుస్తుందని చంద్రబాబు చెపుతుంటారని చెప్పారు. కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. -
ఆర్బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈ వారంలో కూడా స్టాక్ మార్కెట్‌పై ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయం దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనుందని భావిస్తున్నారు. ఈ ప్రధాన అంశానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి, క్యూ3 గణాంకాలపై ఈవారం ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరల్ బెరవాలా విశ్లేషించారు. విదేశీ నిధుల ప్రవాహం కూడా ఈవారంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పారాయన. ‘కేంద్ర ప్రభుత్వ పరిమిత ద్రవ్యోల్బణ వైఖరిని బడ్జెట్ వెల్లడించిన నేపథ్యంలో ప్రత్యేకించి గ్రామీణ వ్యవసాయ రంగం.. రిటైల్, గృహా రుణాల కార్పొరేట్ ఆదాయాలు పెరిగేందుకు అవకాశం ఉంది.’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్థికవేత్త ధనన్జయ్ సిన్హా పేర్కొన్నారు. ఫార్మా ఫలితాలు.. పలు దిగ్గజ ఫార్మా కంపెనీలు ఈవారంలో వెల్లడికానున్నాయి. బుధవారం లుపిన్, సిఫ్లా.. గురువారం అరబిందో ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్ క్యూ3 గణాంకాలను ప్రకటించనున్నాయి. ఇతర దిగ్గర కంపెనీల్లో సోమవారం (4న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎక్సైడ్ ఫలితాలను ప్రకటించనుండగా.. మంగళవారం (5న) టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్‌పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, డీఎల్ఎఫ్, అపోలో టైర్స్, టాటా గ్లోబల్, డిష్ టీవీ గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం (6న) అదానీ పోర్ట్స్, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అలహాబాద్ బ్యాంక్.. గురువారం (7న) టాటా మోటార్స్, బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, కాఫీ డే, గ్రాసిమ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం (8న) మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌హెచ్‌పీసీ, బీపీసీఎల్, ఇంజనీర్స్ ఇండియా ఫలితాలను ప్రకటించనున్నాయి. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ జనవరి డేటా మంగళవారం వెల్లడికానుంది. అంతర్జాతీయ అంశాల పరంగా.. అమెరికా ఉద్యోగ గణాంకాలు, జీడీపీ గణాంకాలు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈవారంలోనే వెల్లడికానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, వెనిజులాలో సంక్షోభం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలతో ముడిపడి.. ముడిచమురు, రూపాయి కదలికలు ఆధారపడి ఉండగా.. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండనుందని తెలిపారు. గత నెల్లో 30 శాతం పతనాన్ని నమోదుచేసిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మళ్లీ ఎగువస్థాయిల వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాయి. 62 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ధరలు మరింత పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ‘మళ్లీ క్రూడ్ ధరల జోరు కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ 71కి చేరుకుంది. 70.80 వద్దనున్న కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో ఆ తరువాత రెసిస్టెన్స్ 72.60 వద్ద ఉంది. సమీపకాలంలో రూపాయి విలువపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కీలక మద్దతు స్థాయి 70.40– 69.90 వద్ద కొనసాగుతోంది.’ అని అబియన్స్ గ్రూప్ చైర్మన్ అభిషేక్ బన్సల్ విశ్లేషించారు. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,300 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,264 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.97 కోట్లను జనవరిలో వెనక్కి తీసుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా.. ఎఫ్‌పీఐలు వేచిచూసే వైఖరిని ప్రదర్శిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. -
కేంద్ర బడ్జెట్ ట్రైలర్ మాత్రమే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ట్రైలర్ మాత్రమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ జనరంజకంగా ఉందని, ఇదే ఇంత బాగా ఉంటే.. జూలై లో ఉండే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పారు. శనివారం నిజా మాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా పేదలకు పది శాతం రిజర్వేషన్లు అందించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. రూ.5 లక్షల ఆదాయం పన్ను మినహాయింపు నిర్ణయంతో దేశంలో నాలుగు కోట్ల మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అసంఘటితరంగ కార్మికులకు రూ.3 వేల పెన్షన్ పథకంతో సుమారు 30 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ బడ్జెట్లో రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టారనే విమర్శలను రాంమాధవ్ ఖండించారు. కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి.. విమర్శించడం తగదన్నారు. రాష్ట్రం ఇచ్చే పెట్టుబడి సాయం తోపాటు, కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా రైతులకు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది బంపర్ ఆఫర్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని ప్రశ్నించగా.. ఏపీ ప్రజా ప్రతినిధులకు నిరసన తెలపడం తప్ప వేరే పనిలేదన్నారు. మోదీ భయంతోనే కేసీఆర్ ముందస్తుకు.. ప్రధాని మోదీ హవాలో ఓటమి పాలవుతామనే భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని రాంమాధవ్ విమర్శించారు. మోదీకి దీటైన నాయకులు ఏ పార్టీలో లేరన్నారు. ఫ్రంట్ల పేరుతో విజయవాడ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి ఒకరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. 13న రాష్ట్రానికి అమిత్‌షా.. ఈ నెల 13న నిజామాబాద్‌లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరుకానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ఫిబ్రవరి 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించి బూత్ ఇన్చార్జిల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్‌సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్‌గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్‌ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్‌చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్‌రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్‌లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
రైతులపై వరాల జల్లు
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిసింది. ముఖ్యంగా రైతులకు అగ్ర తాంబూలం ఇచ్చారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేసేందుకు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ని ప్రవేశపెట్టింది. దీనికితోడు పంట రుణాలపై రెండు శాతం వడ్డీ మాఫీని ప్రకటించింది. అంగన్వాడీల వేతనాలను యాభై శాతం పెంచాలనే నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడానికి ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్’ స్కీంను ప్రవేశపెట్టారు. వేతనజీవులకు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇస్తుండటంతో వారికి మరింత మేలు చేకూరనుంది. సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులపై వరాలు కురిపించింది. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల ఆర్థిక సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే రైతు బంధు పథకం అమలు చేస్తుండగా కేంద్రం ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి. ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,03,788 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.122.27 కోట్ల నిధులు మూడు విడతల్లో జమ కానున్నాయి. ఈ పథకం 1 డిసెంబర్ 2018 నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో మొత్తం 2,18,747 మంది రైతులు ఉన్నారు. వీరిలో 2.5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్నకారు రైతులు 51,885 మంది ఉన్నారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలోపు వ్యవసాయ సాగుభూమి ఉన్న సన్నకారు రైతులు 1,51,903 మంది ఉన్నారు. ఐదు ఎకరాలలోపు వ్యవసాయసాగు భూమి ఉన్న 2,03,788 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి చేకూరనుంది. ఏడాదికి రూ.6వేల చొప్పున జిల్లాలోని 2,03,788 మంది రైతులకు రూ.122.27 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. తొలి విడత ఆర్థిక సహాయం రూ.40.75 కోట్లు మార్చిలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎకరాను యూనిట్‌గా తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటిస్తే రైతులకు మరింత మేలు జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పటంతోపాటు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంది. అలాగే జిల్లాలో పంటరుణాలపై 2 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో ఏటా లక్ష మందికిపైగా రైతులు రుణాలు తీసుకుంటున్నారు. వీరిలో సగానికిపైగా రైతులు సకాలంలో రుణాలు చెల్లించటం జరుగుతుంది. దీంతో 50వేల మంది రైతులకు 2 శాతం వడ్డీ మాఫీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గోవుల ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. మత్స్యకార్మికులు కిసాన్ క్రెడిట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపితే 2 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. ఇదికూడా జిల్లాలోని మత్సకార్మికులకు లాభం చేకూర్చనుంది. ఆనందంలో అంగన్వాడీలు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల వేతనం 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 865 మంది అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెరగనుంది. జిల్లాలో మొత్తం 885 అంగన్వాడీలు ఉండగా వీటిలో 865 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరికి రూ.10,500 వేతనం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.4500 కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6వేల తనవాటాగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచి తన వాటాగా ఉద్యోగులకు ఇకపై రూ.6750 చెల్లించనుంది. దీంతో అంగన్వాడీలకు ఇకపై ప్రతినెలా రూ.12,750 వేతనం అందనుంది. అసంఘటిత రంగ కార్మికులకు మేలు కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు వరం ప్రకటించింది. 60 ఏళ్ల వయస్సుదాటిన వారికి ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపింది. ‘ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్’ పేరిట అసంఘటిత రంగ కార్మికులకు రూ.3 వేల పింఛన్ ఇస్తుంది. ఇందుకోసం రూ.15వేల లోపు ఆదాయం ఉన్న అసంఘటితరంగ కార్మికుల నుంచి ప్రతినెలా రూ.100 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 4,300 మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారు. వీరందిరికీ పింఛన్ పథకం వర్తిసుంది. అయితే జిల్లాలో పదివేల మందికిపైగా అసంఘటితరంగ కార్మికులు ఉన్నట్లు అంచనా. సర్వే చేసి వీరి పేర్లను నూతన పథకంలో చేర్చాలని సీఐటీయూ నేతలు కోరుతున్నారు. పన్ను మినహాయింపు.. వేతన జీవులకు కేంద్రం బడ్జెట్లో ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ప్రకటించింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 1,500 మంది ఉద్యోగులకు మేలు జరనుంది. మెదక్ జిల్లాలో మొత్తం 6,400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 1500 మంది ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరందరికీ మేలు జరనుంది. -
2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర సర్కారు వరాల వర్షం కురిపించింది. మరోసారి గెలుపే లక్ష్యంగా సాగిన ఈ బడ్జెట్లో వేతన జీవులకు, రైతాంగానికి భారీగా తాయిలాలు ప్రకటించింది. ఆర్థిక మంత్రి పీయూష్‌గోయల్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత ఇచ్చింది. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గృహ కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. అసంఘటిత కార్మికులకు అండ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం దిశగా అడుగులు పడ్డాయి. 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇవ్వన్నుట్లు బడ్జెట్లో పొందుపర్చారు. అయితే ఈ కార్మికులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయసు 60 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయి. రియల్ రంగం జోరుమీదుండటంతో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలోని సుమారు 1.60 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఊరట వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఊహించనిరీతిలో పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వేతనజీవులకు వెసులుబాటు కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తుండగా..వీరందరికి తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపు బాధల నుంచి విముక్తి కలుగనుంది. జిల్లాలోని ఐటీ హబ్‌లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఐటీ నిపుణులకు కూడా కొంతమేర పన్ను మినహాయింపు దక్కనుంది. వీరేగాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణసంస్థల్లో పనిచేస్తున్న మరో లక్ష మందికి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపుతో రాయితీ లభించనుంది. ఇంకోవైపు ప్రవేటు రంగ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు కూడా ఈ నిర్ణయం కలిసి రానుంది. 2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా కేంద్రం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా 2,13,208 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై రూ.127.92 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అంగన్వాడీలకు మేలు మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీ టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. వారి వేతనాలను 50 శాతం పెంచారు. ప్రస్తుతం ప్రతి అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ. 10,500 గౌరవ వేతనాన్ని అందజేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 వేలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోంది. బడ్జెట్లో పొందుపర్చిన మేరకు ఇకపై కేంద్రం వాటా రూ.6 వేలు ఉండనుంది. అంటే టీచర్లకు రూ.13,500 వేతనం అందనుంది. ఫలితంగా జిల్లాలో సుమారు 1,580 మంది అంగన్వాడీ టీచర్లకు మేలు ఒనగూరనుంది. -
అన్నదాతకు..భరోసా!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ జిల్లారైతుల్లో ఆశలు నింపింది. సాగు భారంగా మారి, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలను ఆశ్రయించిన రైతుల సంఖ్య తక్కువేం కాదు. ఈ నేపథ్యంలోనే సాగును పండగ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేర రెండు పంట సీజన్లకు కలిపి ఏటా ఎకరాకు రూ.8వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని రూ.10వేల వరకు పెంచుతున్నామని ప్రకటించింది. తాజాగా, శుక్రవారం కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రైతుబంధును పోలిన పథకాన్నే ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ప్రతి ఎకరాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయమే రూ.16వేలు అవుతుంది. దీంతో రైతుల పెట్టుబడి కష్టాలు తీరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, ఐదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతి ఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల రైతులు, రైతు సంఘాల నేతలు హర్షం ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లకూ తీపి కబురు అంగన్వాడీ టీచర్లకూ కేంద్ర బడ్జెట్ తీపి కబురే అందించింది. వారు ప్రస్తుతం తీసుకుంటున్న వేతనాలను 50 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ప్రతిఏటా జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు అదనంగా రూ.19.41కోట్లు చెల్లింపులు జరగనున్నాయి. జిల్లాలో 2093 అంగన్వాడీ కేద్రాలు ఉండగా, వాటిలో 261 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే టీచర్లకు ప్రతినెలా రూ.6700 వేతనం అందుతోంది. అంటే ఏటా రూ.2,09,84,400 వేతనాలు అవుతుండగా 50 శాతం పెంపుతో అదనంగా మరో రూ.1,04,92,200 లభించనున్నాయి. మరో 1,832 కేంద్రాల్లో అంతే సంఖ్యలో ఉన్న ఆయాలకు ప్రతినెలా రూ.6700 వేతనం లభిస్తోంది. వీరికీ ఏటా అదనంగా రూ.1,04,92,200 ముట్టనున్నాయి. ఇదే కేంద్రాల్లో పనిచేస్తున్న 1832 మంది అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.10వేల వేతనం అందుతోంది. ఇక నుంచి ఈ వేతనం రూ.15వేలు కానుంది. రూ.10వేల చొప్పున ఏటా రూ.21,98,40,000 ఖర్చు అవుతుండగా, ఇపుడు అదనంగా మరో రూ.10,99,20,000 అందనున్నాయి. మొత్తంగా అంగన్వాడీ టీచర్లకు ఏటా రూ.19,40,58,600 వేతనాల రూపంలో కేంద్రం అందించనుంది. ఒక్కసారిగా యాభై శాతం పెరిగిన వేతనాలతో అంగన్వాడీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హర్షం కేంద్ర బడ్జెట్ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపింది. ఇదివరకటి ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో ఎక్కువ మంది ఉద్యోగులు పన్నుల భారంనుంచి బయట పడుతున్నారు. గతంలో రూ.2.50లక్షల రూపాయల వార్షిక వేతన ఆదాయం ఉన్న ప్రతిఉద్యోగి ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తాన్ని ఈసారి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్ మినహాయించే రూ.5లక్షల సీలింగ్ పెట్టడంతో ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 41,500 మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు సగానికిపైగానే ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు. -
వరాల..వాన
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వరాల జల్లు కురిసింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఊరట నిచ్చింది. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజలందరినీ ఆకట్టుకునేలా.. అందరికీ ప్రయోజనం కలిగించేలా పలు అంశాలను ఈ 2019–20 తాత్కాలిక బడ్జెట్లో చేర్చారు. అందరికీ మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ‘ఎన్నికల’ల బడ్జెట్‌ను పీయూష్ గోయల్ ద్వారా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుకు తోడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఊరట. అలాగే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కోసం కేంద్రం పద్దుల్లో పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్‌పై మొత్తంగా అన్నివర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమవుతుండగా.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఓట్లను రాబట్టే ఎన్నికల బడ్జెట్‌గా వర్ణిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుంట నుంచి 1.25 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 2,74,368 మంది కాగా, 1.25 నుంచి 2.5 ఎకరాలున్న వారు 1,72,669 మంది, 2.5 నుంచి 5 ఎకరాలున్న వారు 1,45,008 మంది రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6000 నగదు బదిలీ పథకం వల్ల మొత్తం 5,92,045 మందికి లబ్ది చేకూరనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు రూ.750 కోట్ల కేటాయించగా, దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ లభించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనుండటం శుభపరిణామం. అసంఘటిత కార్మికులకు అండ... అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ పథకం ప్రకటించింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పింఛన్ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన వారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ రానుంది. ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున కార్మికులు ప్రీమియం చెల్లించాలి. దీనిద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12,45,806 మందికి మేలు జరుగనుంది. ఇందులో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కూలీల సంఖ్య 5,84,654 మంది ఉండగా, భవనాలు, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో 6,61,052 మంది కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తోంది. వేతనజీవులకు ఊరట... వేతన జీవులకు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ పరిమితి రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు. మహిళలు, మహిళా ఉద్యోగులకు భరోసా... మహిళల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారి అనేక రాయితీలను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే 6కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన కేంద్రం మరో రెండు కోట్ల కనెక్షన్లను ప్రకటించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 వేల వరకు కనెక్షన్లు రానున్నాయి. మాతృత్వయోజన పథకం కింద మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవులు ఇవ్వడం హర్షనీయం. సుమారు 23,478 మంది మహిళ ఉద్యోగులకు 26 వారాల సెలవు దినాలు వర్తించనున్నాయి. అంగన్వాడీలకు పెరగునున్న వేతనం మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళా టీచర్లు, ఆయాలకు వేతనాలను 50 శాతం పెంచడం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,235 మంది వేతనాలు పెరగనున్నాయి. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వస్తుండగా రూ.1,500 పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అమల్లోకి రావడం లేదు. అదేవిధంగా ఆయాలకు రూ.7,500లకు అదనంగా రూ.750 పెంచినట్లు ప్రకటించినా, ప్రస్తుతం రూ.7,500 వస్తోంది. కొత్తపల్లి–మనోహర్‌బాద్ లైన్‌కు రూ.200 కోట్లు... ఈ బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.64,587 కోట్లు కేటాయించినట్లు పేర్కొనగా... గతంతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బాగానే విదిల్చారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ 150 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్‌ను 2006–07లో ప్రతిపాదించారు. ఆ సమయంలో దాని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. గడిచిన నాలుగేళ్లుగా ప్రతీ ఏటా రూ.137 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 32 కిలోమీటర్ల దూరం వరకు మనోహరాబాద్–గజ్వేల్ మధ్య పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. కాజీపేట–బల్హర్షా మధ్య 202 కిలోమీటర్ల దూరం వరకు మూడవ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని 2015–16వ ఆర్థిక సంవత్సరంలోనే నిర్ణయించి రూ.2,063 కోట్లు అంచనా వేశారు. గడిచిన నాలుగేళ్లుగా రూ.360 కోట్లు కేటాయించగా ప్రస్తుత పనుల నిమిత్తం రూ.265 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే రాఘవపూర్ నుంచి మందమర్రి వరకు మూడవ రైల్వే ట్రాక్ వినియోగంలోకి రాగా రాఘవపూర్–పొత్కపల్లి–బిజిగిరిషరీఫ్–ఉప్పల్ మధ్య రెండవ విడత పనులు చేపట్టేందుకు నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ బడ్జెట్ ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రాజకీయ లబ్దికి ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్లో చెప్పిన అంశాలు అమలు కావడం సాధ్యం కాదని తెలిసినా ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలులో ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఐదేళ్లలో చాలా సాధించాం. చట్టంలో లేకపోయినా తెలంగాణకు ఎయిమ్స్ సాధించాం. ఇంకా చాలా అంశాలకు సంబంధించి గెజిట్ విడుదల కావాల్సి ఉంది. – బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్ ఎంపీ కేసీఆర్ పథకాలను ఫాలో అయిన కేంద్రం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లాభం జరుగుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎకరానికి, ఫసల్‌కు రూ.5వేలు ఇస్తున్నం. కేంద్రం మాత్రం రెండున్నర హెక్టార్లకు అంటే 5 ఎకరాలకు రూ.6వేల చొప్పున ఇచ్చేలా బడ్జెట్లో ప్రవేశపెట్టింది. సంస్కరణలు చేపట్టాం.. సంక్షేమం చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నరు. కానీ నల్లధనం ఎంత మేరకు వెనక్కి తీసుకువచ్చారో... నోట్ల రద్దు తర్వాత ఎన్ని డబ్బులు తిరిగి వచ్చాయో చెప్పలేని పరిస్థితి. అయితే సంక్షేమం అని చెప్పి తెలంగాణ మోడల్ మొత్తం తీసుకున్నరు సంతోషం. – కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపీ ఓట్ల కోసమే మభ్యపెట్టే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తుంటే ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చేసిన ప్రయత్నంగా కనబడుతోంది. నాలుగున్నరేళ్లుగా రైతాంగం సమస్యలపై ఊసేత్తని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రైతుల కోసం ఎకరాకు రూ.6వేలు అంటూ వరాలు కురిపించడం రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని అర్థమవుతోంది. మోడీ అధికారంలోకి వచ్చాక వంటనూనె, చక్కెర, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఈ దిగుమతులు వ్యవసాయరంగ సంక్షోభాన్ని తెలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడితే మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. –కటుకం మృత్యుంజయం, డీసీసీ అధ్యక్షుడు సామాన్యులకు లాభం లేదు.. ఇది ఓట్ల బడ్జెట్ మాత్రమే. దీంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.6వేలు మూడు విడతలుగా చెల్లించడం కంటి తుడుపు మాత్రమే. ఉద్యోగాలివ్వడంలో విఫలమయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ నిర్వీర్యం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కార్‌పై ప్రజలు సర్జికల్ స్ట్రయిక్ చేస్తారు. –అంబటి జోజిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు -
కిసాన్.. ముస్కాన్!
సాక్షి వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తుండిపోయేలా వరమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలోనే సమ్మాన్ నిధి పేరుతో రెండు హెక్టార్లు (5 ఎకరాలు) ఉన్న రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతులకు మేలుచేసే బడ్జెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ శుక్రవారం ఉదయం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినవిషయం విధితమే. ఈ బడ్జెట్ ఇన్నాళ్లూ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రైతాంగానికి ఊరటనిచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రూ.8వేలు అందిస్తోంది. మరో అడుగు ముందుకేస్తూ ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం తరహాలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్లో 2 హెక్టార్ల లోపు అంటే 5 ఎకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు మాత్రమే ఏడాదికి మూడు పర్యాయాలు రెండు ఎకరాల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తామని ప్రకటించింది. రైతుబంధు స్ఫూర్తితో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. ఈ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వారివారి రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలను ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఇదే అంశంపై మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంలో రైతుబంధు పథకం కీలకంగా మారింది. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా అధిక శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడ్డారు. కిసాన్‌కు సమ్మాన్ ఎన్నికల ముందు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం సర్వసాధారణం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతుల మద్దతు పొందడానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ‘కిసాన్ సమ్మాన్ నిధి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఎకరానికి రూ.6 చొప్పున సంవత్సరంలో మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఐదు ఎకరాలున్నవారికే.. భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం జిల్లాలో 1,52,621 మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో 1,21,839 మంది రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రూ.125 కోట్ల 16 లక్షలను పంపిణీ చేశారు. అదే రబీ సీజన్లో 1,07,528 మంది రైతులకు రూ.117 కోట్ల 51 లక్షల 66 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 85,944 , రెండు హెక్టార్ల లోపు ఉన్న రైతులు 31,474 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకానికి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులే అర్హులుగా ప్రకటించగా నిజానికి జిల్లాలో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే అధికంగా ఉన్నారు. 4 హెక్టార్లలోపు భూమి ఉన్న వారు 15,557 మంది, 10 హెక్టార్ల లోపు ఉన్న వారు 4,002 మంది, 10 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న వారు 350 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో.. జిల్లాలో ఒక హెక్టారు భూమి ఉన్న రైతులు 1,42,416 మంది ఉన్నారు. అలాగే రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులు 67,658 మంది ఉన్నారు. అదేవిధంగా 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతుల 33,672 , 4 నుంచి 10 హెక్టార్లలోపు 8563 మంది, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 841 మంది రైతులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ఒక హెక్టారు 1,80,328, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 77,611 మంది, 4 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులు 38,264, 4 నుంచి 10 హెక్టార్లలోపు 11,618, 10 హెక్టార్లకు పైగా ఉన్న వారు 1263 మంది ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో.. ఈ జిల్లాలో ఒక హెక్టారు ఉన్న రైతులు 76,414 మంది, రెండు హెక్టార్లు ఉన్న రైతులు 39,038 మంది ఉన్నారు. అలాగే నాలుగు హెక్టార్ల లోపున్నవారు 20,267 మంది, 4 నుంచి 10 హెక్టార్లలోపు 6,026, 10 హెక్టార్లకు మించి భూమి కలిగి ఉన్న వారు 620 మంది రైతులు ఉన్నారు. -
వైఎస్ అభయహస్తం బాటలో కేంద్ర పింఛన్ పథకం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అమలు చేసిన ఒక పథకానికి అచ్చుగుద్దినట్టు అలానే ఉండే పథకాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశమంతటా అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి డ్వాక్రా మహిళలందరికీ 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఎంతో కొంత పింఛను అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం తీరునే ఇప్పుడు దేశంలోని అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి 60 ఏళ్ల తర్వాత పింఛన్లు అందించే పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన మహిళలు సభ్యులుగా ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అనేక అంక్షలు అమలు చేస్తున్న విషయాన్ని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకు రాగా వారి కోసం అభయహస్తం పేరుతో పింఛన్ల పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మహిళ పేరున ఏడాదికి రూ.365 చొప్పున చెల్లిస్తుంది. మహిళ వాటా, ప్రభుత్వ వాటా రెండు కలిపి ప్రభుత్వమే ఆ డబ్బులను ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో పింఛన్ల స్కీంలో పెట్టుబడిగా పెడుతుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి పింఛన్లు చెల్లిస్తోంది. సభ్యులు పథకంలో చేరిన సంవత్సరాల ఆధారంగా రూ.500 నుంచి రూ.2,600 మధ్య పింఛను చెల్లించాలి. మహిళలకు 60 ఏళ్లు రాకమునుపే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పు ఇవ్వడం.. ఒక వేళ దుర్మరణం వంటి విషాదకర సంఘటన జరిగితే బీమాగా కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేయడం ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 34 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకంలో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో 3,21,703 మంది ఈ పథకం ద్వారా ప్రతి నెలా ప్రస్తుతం పింఛన్లు అందుకుంటున్నారు. వైఎస్ ముందు చూపుతో ఆనాడే ఆదర్శ పథకం అసంఘటిత కార్మికుల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో సభ్యులుగా చేరిన వారు ఏడాదికి రూ.100 జమ చేస్తే.. ప్రభుత్వం కూడా వంద రూపాయలు అతని పేరిట జమ చేస్తూ.. అతనికి 60 ఏళ్ల తర్వాత రూ.3 వేల వరకు పింఛను ఇస్తుంది. ఇది అభయహస్తం పథకానికి అచ్చుగుదినట్టుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో ఇలాంటి విన్నూత పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పుడు అవి దేశానికి ఆదర్శంగా మారాయని అంటున్నారు. అయితే, అభయహస్తం పథకానికి చంద్రబాబు ప్రభుత్వం ‘అన్న అభయహస్తం’ అని పేరు మార్చిందే గానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి మరింత మంది డ్వాక్రా మహిళలకు పింఛన్ల లబ్ధి కలిగేలా చేయడానికి మాత్రం అసక్తి చూపడం లేదనే విమర్శ ఉంది. -
ఏపీకి తీరని అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరును బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసింది కేవలం ఈ ఒక్క బడ్జెట్లో మాత్రమే కాదని, గత నాలుగేళ్లు బీజేపీ మిత్రపక్షంగా టీడీపీ ఆమోదించిన నాలుగు బడ్జెట్లలో జరిగిన అన్యాయమే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశంలో 2018 నాటికి బ్యాంకులకు రూ.10 లక్షల కోట్ల మొండిబకాయిలు ఉంటే.. 25 శాతం కూడా రికవరీ చేయని దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థలో చెలామణిలోకి రాని నల్లధనం రూ.70 లక్షల కోట్లు ఉంటే.. రూ.1.3 లక్షల కోట్లు పన్నుల రూపంలోకి తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అంటున్నారని, అయితే ఇందులో 30 శాతం పన్ను, 30% పెనాల్టీ పోనూ వచ్చింది కేవలం 50% నుంచి 60% ఆదాయం మాత్రమే అన్నారు. మొత్తంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయడంతో పాటు విభజన చట్టంలో పొందుపరచిన హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. -
ఏపీకి మళ్లీ మొండిచేయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తాజా మధ్యంతర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు యథావిధిగా మొండిచేయి చూపింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా ఏపీకి నిరాశే మిగిల్చింది. కనీసం జాతీయ విద్యా సంస్థలకూ కేటాయింపుల్లేకుండా చేసింది. కేవలం ఏపీ సెంట్రల్ వర్సిటీకి, గిరిజన విశ్వవిద్యాలయానికే నిధులు కేటాయించారు. ఇక చట్టబద్ధమైన హామీల ప్రస్తావనగానీ, ప్రత్యేక హోదా ఊసుగానీ ఈ బడ్జెట్లో లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద 2018–19 బడ్జెట్ అంచనాలను రూ.100 కోట్లుగా చూపారు. కానీ సవరించిన అంచనాల్లో సున్నాగా చూపారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించలేదు. అలాగే 2019–20కి కూడా ఈ పద్దు కింద నిధులు కేటాయించ లేదు. పూర్తిస్థాయి బడ్జెట్లో జాతీయ సంస్థలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొన్ని జాతీయ సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకే కేటగిరీలో కలిపి చూపారు. ఏపీ వాటా రూ.36.3 వేల కోట్లు కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా అయిన 4.305 శాతం కింద రూ.36,360.26 కోట్లు రానున్నాయి. ఇందులో కార్పొరేషన్ టాక్స్ రూ.11,775.31 కోట్లు, ఆదాయ పన్ను రూ.9,893.51 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.11,004.42 కోట్లు, కస్టమ్స్ టాక్స్ రూ.2284.72 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.1402.62 కోట్లుగా ఉన్నాయి. సంపద పన్నును – 0.32 కోట్లుగా చూపారు. గతేడాది కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.32,738.03 కోట్లు ఉండగా ఈ ఏడాది దాదాపు రూ.3,582 కోట్లు అదనంగా రానున్నాయి. -
బడ్జెట్ తయారీ ఇలా..
బడ్జెట్ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి! సెప్టెంబర్‌లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్‌లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్ ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ఫోన్ ట్యాపింగ్ బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. మూడో కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ప్రత్యేకం బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుం డా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆహారంపైనా.. ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ఫిబ్రవరి 1న.. ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు. బడ్జెట్ లీక్.. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పట్నుంచీ మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. -
సామాజిక న్యాయ, సాధికారతకు రూ.7,800 కోట్లు
న్యూఢిల్లీ: సామాజిక, న్యాయ సాధికారత శాఖకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. 2018–19లో రూ.7,750 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.7,800 కోట్లకు పెంచారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.1,144.90 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే(రూ.1,070 కోట్లు) ఇది ఏడు శాతం అధికం. ‘షెడ్యూల్ క్యాస్ట్‌కు సంబంధించి 2018–19 బడ్జెట్ అంచనాలు రూ.56,619 కోట్లు కాగా.. 2019–20కి వచ్చేసరికి రూ.76,801 కోట్లకు పెరిగింది. మొత్తంగా ఇది 35.6 శాతం అధికం’ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, సఫాయీ కర్మచారీస్ తదితర ఐదు జాతీయ కమిషన్ల కోసం గత బడ్జెట్లో రూ.33.72 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.39.87 కోట్లకు పెంచారు. జాతీయ స్కాలర్షిప్ పథకాలకు కేటాయింపులు తగ్గించారు. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.390.50 కోట్లకు పరిమితం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర ఆర్థిక, అభివృద్ధి బోర్డులకు రూ.215 కోట్లు కేటాయించారు. డీవోపీటీకి 241 కోట్ల నిధులు న్యూఢిల్లీ: అధికారులకు జాతీయంగా, అంతర్జాతీయంగా శిక్షణ ఇచ్చేందుకు గానూ డీవోపీటీకి ఈ బడ్జెట్లో రూ. 241.8 కోట్లను కేంద్రం ప్రకటించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ).. గతేడాది రూ. 194.76 కోట్లు కేటాయించగా.. దీనికి ఈ ఏడాది కేటాయింపులను 24% నిధులను పెంచారు. ఇందులో రూ. 79.06 కోట్లతో ఢిల్లీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఎస్టీమ్), ముస్సోరీలో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) లను నిర్మించనున్నారు. ఈ రెండు కేంద్రాల్లో ఐఏఎస్ అధికారులకోసం పలు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తారు. మిగిలిన రూ.162.75కోట్లను శిక్షణ అవసరాలకోసం ఖర్చు చేస్తారు. అటు.. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకు వేరుగా రూ. 30.26కోట్లు కేటాయించారు. గతేడాది ఈ రెండు విభాగాలకు కలిపి రూ.29.27కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అధికారుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించింన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ (క్యాట్)కు రూ.119.46 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి రూ. 239.97కోట్లను తాజా బడ్జెట్లో ప్రకటించారు. పర్యావరణానికి రూ.3,111 కోట్లు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.2,586.67 కోట్లు కేటాయించింది. గత ఏడాది మాదిరిగానే పులులను సంరక్షించే ‘ప్రాజెక్టు టైగర్’కు రూ.350 కోట్లు, ఏనుగుల కోసం అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. పులుల సంరక్షణ ప్రాజెక్టులో భాగంగా ఉన్న నేషనల్ టైగర్ కాన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ)కి గత ఏడాది కంటే రూ.కోటి ఎక్కువగా రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ కేటాయింపులపై ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిశాంత్ వర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్ కమిషన్ ఫర్ గ్రీన్ ఇండియాకు గత ఏడాది కంటే రూ.30 కోట్లు ఎక్కువగా రూ.240 కోట్లు కేటాయించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)కి గత ఏడాది మాదిరిగానే రూ.100 కోట్లు ప్రత్యేకించిన ప్రభుత్వం, కాలుష్య నివారణ కార్యక్రమాలకు గత ఏడాది కంటే సగానికి తగ్గించి రూ.10 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామంపై స్పందించేందుకు సీపీసీబీ అధికారులు నిరాకరించారు. లోక్‌పాల్‌కు, సీవీసీకి అంతంతే న్యూఢిల్లీ: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కు 2019–20 మధ్యంతర బడ్జెట్లో నామమాత్రపు నిధులనే కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లోక్‌పాల్‌కు రూ.4.29 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో కూడా అంతే మొత్తం కేటాయించారు. సీవీసీకి మాత్రం గతేడాది కేటాయింపుల కంటే ఈసారి స్వల్పంగా నిధులను పెంచారు. 2018–19 బడ్జెల్లో సీవీసీకి రూ.34 కోట్లు కేటాయించగా ఈసారి రూ.35.5 కోట్లు కేటాయించారు. సీబీఐకి రూ.777 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ.777.27 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి కొంచెం తగ్గించారు. గతేడాది బడ్జెట్లో రూ.778.93 కోట్లు కేటాయించారు. దేశ, విదేశాల్లో చాలా సున్నితమైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేపడుతుంది. భారత్‌లో సంచలనం రేపిన అగస్టా వెస్ట్‌లాండ్ స్కాం, పోంజీ కుంభకోణం, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, నకిలీ ఎన్కౌంటర్ల వంటి వాటి గుట్టురట్టు చేసింది. అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జతిన్ మెహతా, మెహుల్ చోస్కీ తదితరులు ఆర్థిక నేరగాళ్ల బండారం బయటపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను సీబీఐ ఈ–గవర్నెన్స్, శిక్షణ కార్యాలయాల ఆధునీకరణ, పలు సాంకేతిక, ఫొరెన్సిక్ యూనిట్ల పెంపు, కార్యాలయాల భవనాల కోసం భూ కొనుగోలు, నిర్మాణం తదితరాల కోసం సీబీఐ వినియోగించనుంది. -
రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని పీయూష్ గోయల్ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ చారిత్రకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40–50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్లో గోయల్ ప్రస్తావించిన విషయాలు.. ► రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్–విద్యుత్ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ► ఢిల్లీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ► రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు. ► బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది. ► కోల్‌కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది. ► రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది. ► సిక్కింలోని పాక్యాంగ్ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది. ► స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం: 64,587కోట్లు రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ: 1,58,658 కోట్లు ► అరుణాచల్‌ప్రదేశ్‌లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి. ► ఈ మేరకు ఈశాన్య భారత్‌లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి. ► వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం. ► 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. ► ఈసారి పీఎంజీఎస్‌వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు. ► 2014–18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు. -
దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: నాలుగు నెలలకు ప్రవేశపెట్టే బడ్జెట్లో వరాలు, పథకాలు ప్రవేశపెడుతూ ప్రలోభాలకు దిగడాన్ని చూస్తుంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్డీ తీసుకున్నారని అర్థమవుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న నాయకులతో ప్రతిపక్ష నేత హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘ఈ చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన లేదు. ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ’ అని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడని గుర్తు చేశారు. ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్లచొక్కాలతో వస్తే.. మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈరోజు చంద్రబాబు నల్లచొక్కాలు వేసుకొచ్చారని జగన్ మండిపడ్డారు. హత్య చేసినవాడే శాంతి ర్యాలీ చేసినట్లు బాబు వైఖరి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు తమ ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చారని, ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి తనకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని జగన్ గుర్తు చేశారు. ఈరోజు ఎవరూ లేకుండా చూసి అసెంబ్లీలో చంద్రబాబు భారీ డైలాగులు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదు. 2017 జనవరి 27న ఇదే వ్యక్తి ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారో చెప్పండి అంటూ వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రం ఏపీకి అద్భుతంగా సహాయం చేసిందని ఇదే చంద్రబాబు చెప్పారు. హత్యచేసిన వాడే ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు డైలాగుల్ని చూసినా అలాగే ఉంది. నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్‌మీట్ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చెప్పారు. నాలుగేళ్లుగా ఏ బడ్జెట్‌ను కూడా చంద్రబాబు గాని, కేంద్రంలోని ఆయన మంత్రులు గానీ వ్యతిరేకించలేదు. విశాఖ మెట్రో రైల్‌కు రూ.1 లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారు? ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పదు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.