ISRO scientists
-
ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
-
ఇస్రో శాస్త్రవేత్తలకు వర్క్‌షాపు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనలు, వాటి ఫలితాలు, సాకేంతికత, మెటీరియల్స్ మొదలగు వాటిని భారత ఆటోమోటివ్ పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చు అనే అంశంపై ఈనెల 11న అంతరిక్ష ప్రధానకేంద్రమైన బెంగళూరులో నిర్వహించామని శనివారం ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఇన్‌స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇస్రో, ఇన్‌స్పేస్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రాకెట్ పరికరాలు, ఉపగ్రహాలకు చెందిన పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్స్ కూడా ఈ సెమినార్లో పాల్గొన్నాయి.రోజు రోజుకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అప్డేట్ అవుతోంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాల్సి అవసరం వుందని ఈ రెండు సంస్థల ఛైర్మన్లు అన్నారు. ఆటోమోటివ్ రంగంలోని కెమెరా ఇమేజింగ్ సెన్సార్లు, ఉష్ణోగ్రత, పీడన సెన్సార్లు, అకౌస్టిక్, వైబ్రేషన్ సెన్సార్లు, గైరోస్కోప్‌లు, యాక్సిలరోమీటర్లు, ప్రత్యేకమైన పూతలు, అడ్హెసివ్‌లు, యాంటీ వైబ్రేషన్, నాయిస్ సప్రెషన్ టెక్నాలజీలు, ఇన్సులేషన్ టెక్నాలజీలు, భద్రతా వ్యవస్థలు అనే వాటిపై కూలకషంగా సెమినార్లో చర్చించారు.ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ పారిశ్రామిక అనువర్తనాల కోసం భారత అంతరిక్ష కార్యక్రమం నుంచి జ్ఞానాన్ని బదిలీ చేయడం ప్రాముఖ్యత గురించి వివరించి మరీ చెప్పారు. స్పేస్–గ్రేడ్ టెక్నాలజీలు, వాహన భద్రత, పనితీరు స్థిరత్వాన్ని ఎలా మెరుగు పరుస్తాయో అన్వేషించమని ఆటోమోటివ్ పరిశ్రమలలోని వారికి సూచించారు. ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. వర్క్షాప్ద్వారా ఉత్పన్నమయ్యే వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం గురించి వివరించారు. రాకెట్ ప్రయోగాల్లో వాణిజ్యపరమైన విస్తరణ కోసం ఆటోమోటివ్ పరిశ్రమలో కన్సార్టియం విధానం నేతృత్వంలో రాకెట్ పరికరాలను అందించే ప్రయివేట్ పార్టనర్లు పని చేయాల్సి వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో అన్ని సెంటర్లుకు శాస్త్రవేత్తలు, ప్రయివేట్ పార్టనర్లు పాల్గొన్నారు. -
ఇస్రో అమ్ములపొదిలోకి మరో రాకెట్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమ్ముల పొదిలోకి మరో రాకెట్ చేరింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3 ప్రయోగాన్ని శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ అనే రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి శుక్రవారం తెల్లవారుజామున 2.47 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఆరున్నర గంటలపాటు కౌంట్‌డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు ఎస్ఎస్ఎల్వీ డి–3 రాకెట్ నింగివైపునకు దూసుకెళ్లింది. రాకెట్‌లోని మొత్తం నాలుగు దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్ష్యలోకి విజయవంతంగా ఉప గ్రహాలను ప్రవేశపెట్టారు. మొదట ఈవోఎస్–08ను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది. ఇవీ ఉపయోగాలు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–08లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం–రిప్లెక్టోమెట్రీ, ఎస్ఐసీ యూవీ డొసిమీటర్ అనే మూడు రకాల పేలోడ్స్‌ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు(¿ౌగోళిక–పర్యావరణం)పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యయనాలకు సంబం«ధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం ఒక్క ఏడాదే సేవలు అందిస్తుంది. వాణిజ్యపరంగా కూడా వినియోగిస్తాంఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ ఇస్రోలో సరికొత్తగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ చేరిందని చెప్పారు. ఇప్పటిదాకా ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లు మాత్రమే ఉండేవని తెలిపారు. 2022 ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డి–1 రాకెట్ విఫలం కావడంతో అందులో ఏర్పడిన లోపాలను సరిచేసి.. ముందస్తు పరీక్షలు నిర్వహించి ఎస్ఎస్ఎల్వీ డి–3 ప్రయోగానికి సిద్ధమయ్యామన్నారు. దీనికోసం అహరి్నశలు పనిచేసిన ఇస్రోలోని అన్ని విభాగాలకు అభినందనలు తెలిపారు. వాణిజ్యపరంగా కూడా ఈ రాకెట్‌ను వినియోగిస్తామని చెప్పారు. వెహికల్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్, శాటిలైట్ డైరెక్టర్ ఎ.ఆవినాష్ మాట్లాడుతూ ఉపగ్రహం నుంచి నిర్దేశించిన విధంగా సిగ్నల్స్ అందాయని తెలిపారు.ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలుసాక్షి, అమరావతి: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) డి–3ని విజయవంతంగా ప్రయోగించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–08), ఎస్ఆర్–0 డెమోశాట్ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఈ విజయం ఇస్రోను ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. EOS-08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి. -
ఎస్ఎస్ఎల్వీ డీ–3 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ డీ3) ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రయోగాన్ని 16.56 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తి చేసే పనిలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్న మయ్యారు.ఏదైనా వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ సమయం కొద్దిగా మార్పు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. మధ్యా హ్నం ఒంటి గంటకు మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి ఏడు గంటల ముందు అంటే శుక్రవారం వేకువజామున 2.17 కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ ఏడు గంటల కౌంట్ డౌన్ ప్రక్రియలో నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపడంతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమవుతారన్నమాట. అయితే ఈ ప్రయోగంలో మూడు దశలూ ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ సమయాన్ని అతికొద్ది గంటలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ప్రయోగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ వివరాలు.. ప్రయోగమిలా..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ 34 మీటర్లు పొడువు రెండు మీటర్లు వెడల్పు 119 టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని 16 (994 సెకన్లు) నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లకు పూర్తి చేయనున్నారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 808 సెకన్లకు 175.5 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ) ఈఓఎస్–08) మొదటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్ఆర్–0 డెమోశాట్ అనే ఉపగ్రహాన్ని 994 సెకన్లు భూమికి 475 కిలో మీటర్లు ఎత్తులోని లియో అర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. కౌంట్‌డౌన్ వ్యవధి తక్కువ..ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్‌కు కౌంట్‌డౌన్ సమయాన్ని తక్కువగా అంటే ఏడు గంటల వ్యవ«ధి మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాకెట్ మొదటి మూడు దశలు ఘన ఇంధనాన్ని ఉపయోగించి చేయనున్నారు. అంటే ఘన ఇంధనాన్ని ముందుగానే నింపి రాకెట్‌ను అనుసంధానం చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపేందుకు మాత్రమే కౌంట్‌డౌన్ సమయాన్ని తీసుకున్నారు. ఈ ప్రయోగంలో నాలుగోదశలో 0.05 టన్నులు మాత్రమే ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. అందుకే ఏడు గంటల కౌంట్‌డౌన్ సమయం వ్యవధిలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి ఈ తక్కువ సమయాన్ని తీసుకున్నారు. ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగమిది. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగం కావడం విశేషం. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలుతిరుమల శ్రీవారి సన్నిధిలో ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలకు ఇస్రో అధికారులు గురువారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోదతో కలసి శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ డీ–3, ఈఓఎస్–08 నమూనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఇస్రో టీమ్ కు సీఎం జగన్ అభినందనలు
-
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
ఇస్రోలో తీవ్ర విషాదం
చెన్నై: దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా..కొందరి గొంతు మాత్రమే ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి గుర్తుండిపోయే గొంతుక మేడమ్ వలార్మతిది. మన ఇస్రో ప్రయోగించిన పదుల సంఖ్యలో రాకెట్లకు కౌంట్‌డౌన్ చెప్పింది ఈమెనే. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జని్మంచిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. ఇస్రో ప్రయోగించిన రాకెట్లకు లాంఛింగ్ కౌంట్‌డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఈమె విలక్షణమైన కంఠం దేశప్రజలకు సుపరిచితం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో ఈమె అందుకున్నారు. చివరిసారిగా చంద్రయాన్–3 మిషన్ రాకెట్‌కు వలార్మతినే కౌంట్‌డౌన్ చెప్పడం విశేషం. ఇస్రో నుంచి రిటైరైన ఈమె శనివారం సాయంత్రం గుండెపోటుకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో కన్నుమూశారు. -
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్‌ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దించి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ISRO Employees Salary Structure: ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఇప్పటికి కూడా చంద్రుని మీద ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా భూమిపైకి చేరవేస్తూనే ఉంది. ఇంత ఘన విజయం సాధించిన చంద్రయాన్-3 సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉందని అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 విజయం వెనుక ప్రధానంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి అండ్ చైర్పర్సన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పి వీరముత్తువేల్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి ఉన్నారు. కాగా ఈ కథనంలో ఇస్రో ఉద్యోగులు జీతాలు ఎంత? ఎక్కువ జీతం పొందేదెవరు అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు & ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా.. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు & సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 👉: టెక్నీషియన్-B L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: టెక్నికల్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ.142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: లైబ్రరీ అసిస్టెంట్ 'A' L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (సౌండ్ రికార్డింగ్) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 ( రూ. 44900 - రూ. 142400) 👉: టెక్నికల్ అసిస్టెంట్ (వీడియోగ్రఫీ) డీఇసీయూ అహ్మదాబాద్ L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: ప్రోగ్రామ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, డీఇసీయూ అహ్మదాబాద్ - ఎల్-8 (రూ. 47600 - రూ. 151100) 👉: మీడియా లైబ్రరీ అసిస్టెంట్-A, డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సైంటిఫిక్ అసిస్టెంట్- A (మల్టీమీడియా), డీఇసీయూ అహ్మదాబాద్ - L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: జూనియర్ ప్రొడ్యూసర్ L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సామాజిక పరిశోధన అధికారి-C L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: సైంటిస్ట్/ ఇంజనీర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: మెడికల్ ఆఫీసర్-SC - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: మెడికల్ ఆఫీసర్-SD - L-11 (రూ. 67700 - రూ. 208700) 👉: రేడియోగ్రాఫర్-A - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: ఫార్మసిస్ట్-A L-5 (రూ. 29200 - రూ. 92300) 👉: ల్యాబ్ టెక్నీషియన్-A L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: నర్సు-B L-7 (రూ. 44900 - రూ. 142400) 👉: సిస్టర్-A L-8 (రూ. 47600 - రూ. 151100) 👉: క్యాటరింగ్ అటెండెంట్ 'A' L-1 (రూ. 18000 - రూ. 56900) 👉: క్యాటరింగ్ సూపర్వైజర్ - L-6 (రూ. 35400 - రూ. 112400) 👉: కుక్ - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: ఫైర్‌మ్యాన్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: డ్రైవర్-కమ్-ఆపరేటర్-A - L-3 (రూ. 21700 - రూ. 69100) 👉: లైట్ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: హెవీ వెహికల్ డ్రైవర్-A - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: స్టాఫ్ కార్ డ్రైవర్ 'A' - L-2 (రూ. 19900 - రూ. 63200) 👉: అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అసిస్టెంట్ (రాజ్‌భాష) - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అప్పర్ డివిజన్ క్లర్క్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: స్టెనోగ్రాఫర్ - L-4 (రూ. 25500 - రూ. 81100) 👉: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: అకౌంట్స్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: పర్చస్ & స్టోర్ ఆఫీసర్ - L-10 (రూ. 56100 - రూ. 177500) 👉: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- L-6 (రూ. 35400 - రూ. 112400) -
సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశో«ధనలే లక్ష్యంగా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగవేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి వున్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుపాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? ► ఆదిత్య–ఎల్1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్సి) అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. ► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించ డం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. ► ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్) అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. ► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అ«ధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోదనలు చేస్తుంది. ► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. ► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. ఆదిత్య–ఎల్1లో పేలోడ్స్ ఇవే.. సుమారుగా 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) ఉంటాయి. -
బెంగుళూరు పర్యటన.. సీఎం రాకపోవడంపై స్పందించిన మోదీ
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని నేడు నేరుగా బెంగుళూరు చేరుకొని భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జాబిల్లిపై ల్యాండర్ తీసిన తొలి ఫోటోను ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీకి బహుమతిగా అందించారు. అనంతరం ప్రధాని ఢిల్లీకి పయనమయ్యారు. తాజాగా ప్రధాని బెంగళూరు పర్యటనపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ హాజరుకాలేదు. ప్రధాని మోదీ సీఎంను ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. The Prime Minister is scheduled to directly land in Bengaluru tomorrow at 6 am after his latest foreign jaunt to congratulate ISRO. He is apparently so irritated with the CM and Deputy CM of Karnataka for felicitating the scientists of ISRO before him, that he has purportedly… pic.twitter.com/6EvN68A4oT — Jairam Ramesh (@Jairam_Ramesh) August 25, 2023 దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం తనకంటే ముందు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంతో ప్రధాని చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వాళ్లను విమానాశ్రయంలో ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇది చిల్లర రాజకీయం తప్ప మరొకటి కాదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రయాన్-1 ను విజయవంతంగా ప్రయోగించిన వేళ.. 2008 అక్టోబర్ 22న అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌ను నాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ మోదీ సందర్శించారు. ఈ విషయం ఇప్పటి ప్రధాని మర్చిపోయారా?’’ అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. చదవండి: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. బెంగళూరుకు తాను సరిగ్గా ఏ సమయానికి చేరుకుంటారో స్పష్టత లేని కారణంగా మంత్రులకు ఇబ్బంది కలిగించకూడదని భావించినట్లు తెలిపారు. బెంగుళూరు ఎయిర్నపోర్టుకు చేరుకున్న తర్వాత ప్రజలను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళతాను. బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానన్నది నాకు తెలియదు. కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, గవర్నర్‌కు చెప్పాను. నాకు స్వాగతం పలికేందుకు ముందుగా వచ్చి ఇబ్బంది పడొద్దని కోరాను. ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని నేనే వారిని అడిగాను.’’ ప్రధాని పేర్కొన్నారు. #WATCH | Bengaluru: On PM Modi's visit, Karnataka Deputy CM DK Shivakumar says, "I fully agree with whatever the Prime Minister has said. We were supposed to go and receive him but since we had the information from the Prime Minister's Office officially, we wanted to respect… pic.twitter.com/jWYq5Ne6c0 — ANI (@ANI) August 26, 2023 ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానిని స్వీకరించేందుకు తానును, సీఎం సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చిందని, దానిని గౌరవించాలని పేర్కొన్నారు. -
ఇస్రోలో మనోడు
నంద్యాల: చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు. అలాంటి శాస్త్రవేత్తల్లో కూడా మన జిల్లాకు చెందిన వారు ఉండటం విశేషం. బేతంచెర్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ముళ్ల మీరం సాహెబ్, వాహిదా దంపతుల పెద్ద కుమారుడు డాక్టర్ సలీం బాషా ప్రస్తుతం ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. ఈయన 5వ తరగతి వరకు పట్టణంలోని సర్వస్వతి విద్యామందిర్, ఆ తర్వాత శేషారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. అనంతపురం జేఎన్టీయూ పాలిటెక్నిక్, జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వ విద్యాలయంలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 2006లో ఇస్రోలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పీహెచ్డీ డాక్టరేట్ 2021 పొందారు. ప్రస్తుతం లీడ్ సైంటిస్టుగా ఇస్రోలో కొనసాగుతున్నారు. ఎన్నో ఇస్రో మిషన్స్‌లో పాత్ర పోషించిన సలీం బాషా చంద్రయాన్ –2, చంద్రయాన్–3లో థర్మల్ డిజైనింగ్ లీడ్ సైంటిస్టుగా పాత్ర పోషించారు. దేశం కోసం కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్న శాస్త్రవేత్తల్లో బేతంచెర్ల వాసి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు మహబూబ్ బాషా, ఉసేన్ బాషా, రూహిద్ అక్రం, వాసిమ్ అక్రమ్‌తో పాటు పట్టణ ప్రజలు, పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు. శభాష్ ఇండియా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 నాడు విమర్శించిన వారే.. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం. Dear Endia; instead of wasting money on insane missions as of Chandrayyan or sending idiots like #abhinandan for tea to across LoC concentrate on poverty within, your approach on #Kashmir ll be another Chandrayyan just price tag ll be far bigger. — Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019 Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed — Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019 ప్రపంచ దేశాలు సైతం.. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
చంద్రయాన్-3 ప్రయోగం.. సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. చదవండి: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. ఈ మిషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి నాలుగేళ్ల నాటి చంద్రయాన్–2 వైఫల్యం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని ఇస్రో పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగంపైనే నిలిచాయి. చదవండి: కూకట్పల్లి: మామకు మనమూ చుట్టాలమే My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 -
చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. చదవండి: బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్
సూళ్లూరుపేట: చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటార్‌ను ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్ మూడో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. సైంటిస్టులు ఏర్పాట్లను దాదాపు పూర్తిచేశారు. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల వల్ల ఆర్బిటార్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చంద్రయాన్–3లో మూడింటినీ ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. 2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి. దాంతో ఆ ప్రయోగం పాక్షిక విజయం మాత్రమే సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత చంద్రయాన్–3 పేరుతో మూడోసారి ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్–3లో ప్రపొల్షన్ మాడ్యూల్లో రెండు పేలోడ్స్, ల్యాండర్లో 4 పేలోడ్స్, రోవర్లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి పంపించనున్నారు. రూ.1,600 కోట్ల వ్యయం ► చంద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం చేస్తున్నారు. ► చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది. ► చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. ► చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.425 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పదేళ్లు సమయం పట్టడంతో ఖర్చు అదనంగా రూ.173 కోట్లు పెరిగింది. అంటే చంద్రయాన్–2కు రూ.598 కోట్లు వ్యయం చేశారు. ► చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
-
ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ప్రయోగానికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యాన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. రాకెట్ వివరాలు... ప్రయోగం ఇలా... ఎస్ఎస్ఎల్వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు. మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్–యూఎస్ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇది షార్ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ–డి1 సిరీస్‌లో రెండోది కావడం విశేషం. ఎస్ఎస్ఎల్వీ–డీ2కు ప్రత్యేక పూజలు తిరుమల: ఎస్ఎస్ఎల్వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్ఎస్ఎల్వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్ నమూనాకు పూజలు నిర్వహించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన ఎల్వీఎం3-ఎం2ను విజయవంతంగా ప్రయోగించటం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. ఇదీ చదవండి: ఇస్రో దీపావళి ధమాకా -
ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదవండి: పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. -
నేడు జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీఐఎల్), కేంద ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–వీ వీఏ257 రాకెట్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్ఎస్సీ)లో రూపొందించిన 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్–24 ఉపగ్రహాన్ని గత నెల 18న ఫ్రాన్స్‌కు పంపించిన విషయం విదితమే. ఈ ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చారు. డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చేందుకు పాన్ ఇండియా కవరేజీతో ఈ ఉపగ్రహాన్ని రోదసీలో పంపుతున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ జీశాట్–24 ఉపగ్రహాన్ని టాటాప్లే అనే సంస్థకు లీజుకిచ్చింది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్‌కు చేరుకుని రాకెట్ ప్రయోగం పనులను పరిశీలిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 4,000 కిలోలకుపైన బరువున్న భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తుండగా.. ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహాలను వారు మన దేశం అంటే ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్‌లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేయండిలా.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ సూచనలు చదివి ఈ–మెయిల్ క్రియేట్ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్ అప్లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతుంది. రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు వీరే.... ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్‌లలో సభ్యుడై ఉండాలి. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగా పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. చదవండి: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం