IT Development
-
ఆయనదే విజన్.. ఇతరులది భజన్ భజన్!
ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.విజన్ అంటే ఇది.. 1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు. బాబు విజన్.. వాస్తవం ఎంత?‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.ఎస్ఎం కృష్ణకి నివాళిగా.. -
ఆ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 మధ్య పరిశ్రమలకు జరిగిన భూ కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహా వివిధ పరిశ్రమల అభివృద్ధికే సర్కార్ రాయితీ, ప్రోత్సాహకాలు కల్పించిందని స్పష్టం చేసింది. అయితే భూ కేటాయింపు జరిగినా, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి, స్టార్‌గేజ్, అనంత టెక్నాలజీ, జేటీ హోల్డింగ్స్.. కంపెనీల నుంచి దాదాపు 850 ఎకరాలను నాలుగు నెలల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సీజే ధర్మాసనం తీర్పు ఇస్తూ వాదనలను ముగించింది. ఎలాంటి టెండర్లు, ప్రకటనలు లేకుండా పలు కంపెనీలకు ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన ఛత్రి స్వచ్ఛంద సంస్థతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో 2007లో పిటిషన్ దాఖలు చేశారు. గత పదేళ్లలో జరిపిన భూ కేటాయింపులపై సమీక్ష జరిపి మార్కెట్ విలువ ప్రకారం వసూలు చేయాలని, కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీల నుంచి భూమి వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లీజు/అమ్మకం జరిపే ముందు టెండర్లు పిలిచిన తర్వాతే కేటాయింపులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై 17 ఏళ్లకుపైగా విచారణ కొనసాగగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తాజాగా 72 పేజీల తీర్పు వెలువరించింది. వేలాది మందికి ఉద్యోగావకాశాలు.. ‘పిటిషనర్ వాదనల మేరకు.. çసహజ వనరులైన భూమి, గాలి, నీరు అత్యధిక ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలి. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) ఏర్పాటైంది. 2001 నుంచి 2006 మధ్య నామినేషన్ ప్రాతిపదికన టెండర్లు లేకుండా 4,156.81 ఎకరాలను కార్పొరేషన్ పలు కంపెనీలకు కేటాయించింది. అభివృద్ధి ముసుగులో వేల ఎకరాలను ప్రభుత్వం ప్రైవేట్‌కు కారుచౌకగా కేటాయించింది. ప్రభుత్వ వాదన మేరకు.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి భూ కేటాయింపులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో హైదరాబాద్‌లోనూ పరిశ్రమల ఏర్పాటు సహకరించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ రంగ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి పెంపొందించడానికి ప్రభుత్వం పలు విధానాలను రూపొందించింది. ఈ కేటాయింపులు చేసిన ఏడాది తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో ఉండగా, అనేక పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఆ భూమికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుంది. ఈ దశలో జోక్యం చేసుకొని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అన్ని కంపెనీలపైనే కాదు దానిపై ఆధారపడిన వారిపైనా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు భూ కేటాయింపుపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం. అయితే, భూ కేటాయింపులు జరిగినా ఇప్పటివరకు కార్యకలాపాలు ప్రారంభించని ఐదు కంపెనీల నుంచి దాదాపు 840 ఎకరాలను అధికారులు నాలుగు నెలల్లో వెనక్కి తీసుకోవాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిశ్రమల అభివృద్ధికి ఏపీఐఐసీ... ‘పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం 1973, సెపె్టంబర్ 26న ఏపీఐఐసీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో భాగంగా పరిశ్రమలను ఆకర్షించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంలోని ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రభుత్వ ఆస్తుల కేటాయింపు విషయంలో విధానం పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలి (ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది). భూకేటాయింపులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ 2000, మే 25న జీవో 3 విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐటీ రంగానికి ప్రోత్సాహకాలు కల్పించడంలో అర్హతలు, విధివిధానాలు, దరఖాస్తులు, వాటి పరిశీలనా విధానం, షరతులు తదితరాలతో ప్రభుత్వ విధానానికి రూపకల్పన జరిగిందని చెప్పింది. రాష్ట్రంలో ఐటీ రంగం 2004–05లో 64.05 వృద్ధి సాధించగా, జాతీయ సగటు 34 శాతమే. 2007–08లో పరిశ్రమల ఎగుమతి రూ.8,270 కోట్లతో 41 శాతం ఉండగా జాతీయ సగటు 33.88 మాత్రమే.. ఐటీ రంగానికి సంబంధించి 1997 నుంచి 2007–08 దాకా 1584 యూనిట్లు ఏర్పాటు కాగా, రూ.26,122 కోట్ల ఎగుమతులు, రూ.10,101 కోట్ల పెట్టుబడులు, 2.39 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొంది. 2002–05, 2005–10 మధ్య ఐటీ పాలసీ కారణంగా హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ పరిశ్రమలు మాదాపూర్‌లో, బహుళ జాతీయ సంస్థలు, మైక్రో సాఫ్ట్, సీఏ, కాన్బో, యుబీఎస్, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, విప్రో, హనీవెల్, అమెజాన్, తదితర బహుళజాతి కంపెనీలు ఏర్పాటయ్యాయి. రూ వందల కోట్ల పెట్టుబడులతో వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది’అని పేర్కొంది. భూ కేటాయింపుల్లో వివక్ష లేదు.. ‘భూకేటాయింపుల్లో దురుద్దేశాలు, వివక్ష ఉన్నట్టు పిటిషనర్ చెప్పలేదు. ఇవి లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షమని చెప్పలేం. ఈ కారణంగా పారిశ్రామిక అభివృద్ధికి రాయితీ మీద భూకేటాయింపులో ప్రభుత్వ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భూకేటాయింపులపై చర్యలు తీసుకోంటోంది. భూకేటాయింపులకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేం అంటూ పిటిషన్లో విచారణ ముగిస్తున్నాం’అని స్పష్టం చేసింది. -
ఐటీ ఉద్యోగులకు ‘భారీ జీతాలు’ కొన్నిరోజులే..!
ఇటీవల పెరుగుతున్న లేఆఫ్‌లు, మందగించిన నియామక పరిస్థితులతో ఐటీ రంగం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టెక్, నాన్-టెక్ రంగాలలో అనుభవం ఉన్న ఓ టెక్ నిపుణుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘రెడ్ఢిట్’లో ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందంటూ చర్చను ప్రారంభించారు."డెవలపర్ /ఐటీ మార్కెట్ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన ఆ ఎక్స్పర్ట్ త్వరలో ఐటీ పరిశ్రమలో వేతనాలు ఇతర రంగాల్లో జీతాలకు దగ్గరగా కావచ్చని అంటే తగ్గిపోవచ్చని సంకేతాలిచ్చారు. ఈ ప్రకటన భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ జాబ్ మార్కెట్ ప్రస్తుత, భవిష్యత్తు స్థితికి సంబంధించి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!టెక్, నాన్-టెక్ ఉద్యోగుల మధ్య ఉన్న జీతం అంతరాన్ని ఆయన విపులంగా వివరించారు. నాన్-టెక్ ఉద్యోగాలలో నైపుణ్యం కలిగినవారు సగటున ఏడాదికి 10-15 లక్షలు సంపాదిస్తున్నారని, ఇక టెక్ డెవలపర్లు, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారు కూడా 30-40 లక్షలు వార్షిక వేతనం అందుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం బుడగ లాంటిదని, ఎన్నో రోజులు ఉండదని రాసుకొచ్చిన ఆయన ఈ భారీ జీతాలు త్వరలో సర్దుబాటు కావచ్చని అభిప్రాయపడ్డారు.ఇక అనేక మంది డెవలపర్లు చాట్ జీపీటీ వంటి సాధనాలను ఉపయోగిస్తున్నందున డెవలపర్ల డిమాండ్ మరింత తగ్గుతుందని సూచించారు. దీని ఫలితంగా వారి పనిభారం 50% తగ్గింది. ఇదే సమయంలో జాబ్ మార్కెట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. "జనరేటివ్ ఏఐ ఉద్యోగాలను తీసివేయదని కొందరు వాదించవచ్చు, కానీ ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మా కంపెనీలో ప్రస్తుతం జూనియర్ పాత్రలకు మాత్రమే ఓపెనింగ్లు ఉన్నాయి. సీనియర్ స్థానాలకు కాదు" అంటూ జోడించారు.Posts from the developersindiacommunity on Reddit -
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది. ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు, ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటువంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది. -
ఏపీలో ఐటీని అభివృద్ధి చేసింది ఎవరు ?..ఈ నిజాలు రాసే దమ్ముందా రామోజీ
-
ఏపీలో ఐటీ రంగంలో అభివృద్ధిని ఓర్చుకోలేకపోతోన్న రామోజీ
-
వావ్..విశాఖ!
సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్మెంట్ సెంటర్లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని.. ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్ఎక్సే్ఛంజ్లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్‌ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు. బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ.. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ఐటీ డెవలప్మెంట్ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి..!
-
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
తుర్కయాంజాల్: రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని మున్సిపల్, ఐటీ, చేనేత శాఖ మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. ఆ సంకీర్ణ సర్కారులో తమ పాత్ర తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సోమవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేనేత గురించి, నేత కార్మికుల గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు ఇప్పటివరకు అందిస్తున్న పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని ఎద్దేవా చేశారు. హ్యండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, మహాత్మాగాంధీ బీమా బంకర్ యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి పథకాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. చేనేత వద్దు–అన్నీ రద్దు అనే నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని విమర్శించారు. సంకీర్ణంలో ఉంటే రాష్ట్రానికి సంస్థలు, అదనపు నిధులు.. కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటేనే రాష్ట్రంలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఏర్పాటు ద్వా రా చేనేతకు మంచి రోజులు సాధ్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా నిధులు తెచ్చుకోవచ్చన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న కన్వెన్షన్, ఎక్స్‌పోలో ఏడాదంతా చేనేత ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేనేత స్టాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కష్టకాలంలో చేనేత కార్మికులను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే నేత కార్మి కుల బతుకుల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. నేత కార్మికులకు వరాలు... చేనేత మిత్ర పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికీ రూ. 3 వేలు అందిస్తామని, 75 ఏళ్లలోపున్న చేనేత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, రూ. 25 వేల పరిమితితో హెల్త్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గుంట మగ్గాల స్థానంలో 10,652 ఫ్రేమ్లూమ్స్ మగ్గాలు తెస్తామని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ. 40.50 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. చేనేత, అనుబంధ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇస్తున్న రూ. 12,500 మొత్తాన్ని రూ. 25 వేలకు పెంచుతామని చెప్పారు. డీసీసీబీల సహకారంతో పెట్టుబడి సాయం అందిస్తామని, ఇంటి వెనక మగ్గాల షెడ్ ఏర్పాటు చేసుకొనేందుకు గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కులవృత్తులకు జీవం... నేతన్నకు, గీతన్నకు అవినాభావ సంబంధం ఉందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులు పూర్తిగా నష్టపోయాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ జీవం పోసుకుంటున్నాయని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తోందని శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌తోపాటు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్‌కు భూమిపూజ ఉప్పల్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ భగాయత్‌లో చేనేత భవన్ నిర్మాణంతోపాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలసి మంత్రి కేటీఆర్ సోమవారం భూమిపూజ చేశారు. 2,576 చదరపు గజాల్లో నిర్మించనున్న చేనేత భవన్‌కు దాదాపు రూ. 50 కోట్ల వ్యయం కానుండగా 500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న మ్యూజియానికి రూ. 15 కోట్లు ఖర్చు కానుంది. కాగా, ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి కారిడార్ పనులు త్వరలో పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాలు కేటాయించాలని, 100 పడకల అసుపత్రి నిర్మాణం చేపట్టాలని మంత్రి కేటీఆర్‌కు బేతి సుభాష్ రెడ్డి వినతిపత్రం అందించారు. -
AP: ఐటీ ఎగుమతుల్లో బూమ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గత నాలుగేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. స్టాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), వీసెజ్ల్లో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా 2022–23లో రాష్ట్రంలో రూ.1,649.25 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఎస్టీపీఐలో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా రూ.972.43 కోట్ల ఎగుమతులు జరగగా వీసెజ్ కంపెనీల ద్వారా రూ.676.82 కోట్ల ఎగుమతులు జరిగాయి. రూ.5,000 కోట్లపైనే! 2019–20లో ఏపీ నుంచి రూ.1,087.4 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు కాగా నాలుగేళ్లలో 34 శాతం పెరిగాయి. నాలుగేళ్లలో ఎస్టీపీఐ కంపెనీల ద్వారా ఎగుమతులు రూ.846.77 కోట్ల నుంచి రూ.972.43 కోట్లకు పెరిగితే వీసెజ్ ద్వారా ఎగుమతులు రూ.240.63 కోట్ల నుంచి రూ.676.82 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా పలు ఐటీ కంపెనీల ఆడిటింగ్ పూర్తికాలేదని, ప్రాథమిక సమాచారం మేరకు 2022–23 ఐటీ ఎగుమతుల అంచనాలను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ లేకపోవడంతో మన రాష్ట్ర పరిధిలోకి రావడం లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రం నుంచి కనీసం రూ.5,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్నెళ్లలో వరుసగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ కంపెనీలు విశాఖతోపాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా ఇప్పుడు 372కి చేరుకోవడం గమనార్హం. గత ఆర్నెళ్ల వ్యవధిలో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, బీఈఎల్, ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనుకుపైగా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూపు సీఈవో ఎస్.కిరణ్ కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇవికాకుండా మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీల ద్వారా అదనంగా 20,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. విస్తరిస్తున్న కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో ఇప్పటికే ఏర్పాటైన పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖకు పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్‌లో 120 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆథారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. 2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్ఎస్ సీఈవో కేశవ్.ఆర్.మురుగేష్ ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలతోపాటు విస్తరణ ద్వారా గత మూడేన్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019 నాటికి రాష్ట్రంలో 35,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు (అపిటా) గ్రూపు సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో మిలియన్ టవర్ రెండో దశ నిర్మాణ పనులు పూర్తి కాగా తాజాగా రూ.300 కోట్లతో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అదనంగా అదానీ డేటా సెంటర్లో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. -
రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 2.20 లక్షల కోట్లు!
రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి. ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే.. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్‌లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్‌తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా.. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు 2013–14 57,258 3,23,396 2014–15 66,276 3,71,774 2015–16 75,070 4,07,385 2016–17 85,470 4,31,891 2017–18 93,442 4,75,308 2018–19 1,09,219 5,43,033 2019–20 1,28,807 5,82,126 2020–21 1,45,522 6,28,615 2021–22 1,83,569 7,78,121 -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్ అగర్వాల్‌ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
ఎన్డీటీవీ వాటా కొనుగోలు: కొనసాగుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో గల వాటాను గతంలో ఐటీ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ చేపట్టిన నేపథ్యంలో ఈక్విటీ మార్పిడికి ఐటీ శాఖ నుంచి అనుమతులు పొందవలసి ఉంటుందని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఆదాయపన్ను శాఖ అధికారులకు దాఖలు చేస్తున్న అప్లికేషన్‌కు జత కలవమంటూ అదానీ గ్రూప్ సంస్థ వీసీపీఎల్‌ను ఆహ్వానించింది. అయితే ఈ వివాదాన్ని వీసీపీఎల్ తప్పుపట్టింది. చెల్లించని రుణాలకుగాను వారంట్లను వెనువెంటనే ఈక్విటీగా మార్పు చేయమంటూ ఆర్ఆర్పీఆర్ను మరోసారి డిమాండ్ చేసింది. వారంట్లను ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ 99.5 శాతం వాటాను పొందేందుకు నిర్ణయించుకుంది. తద్వారా మీడియా సంస్థ ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌కుగల 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్డీటీవీ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ. 294 ధరలో రూ. 493 కోట్లు వెచ్చించేందుకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. -
పల్లెకు పోదాం చలో చలో.. రివర్స్ మైగ్రేషన్‌కు మోడల్‌గా నిలిచిన మన్దీప్ కౌర్
పట్టణాల్లో ఉపాధి వెదుక్కుంటూ చాలామంది పట్నం బాట పడుతుంటే, పల్లెకళ మాయమవుతోంది. ఏ మూల చూసినా నిరుపేద నిశ్శబ్దం. అలాంటి పల్లెల్లో పంజాబ్‌లోని తంగ్రా కూడా ఒకటి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామం గురించి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు తెలుసో తెలియదుగానీ మన్‌దీప్‌కౌర్ పుణ్యమా అని ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. ‘రివర్స్ మైగ్రేషన్’కు మోడల్‌గా నిలిచింది. ‘రూరల్ ఐటి మోడల్’ కాన్సెప్ట్‌కు అపారమైన బలాన్ని ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మన్దీప్ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ‘మన జీవితాలు మారాలంటే చదువు తప్ప మరోదారి లేదు’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన మన్‌దీప్‌కు రహేజా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పాతికవేలు. ఆ తరువాత... బ్యాంకాక్‌కు చెందిన ప్రసిద్ధనగల కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్కడ మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. వివాహం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లింది కౌర్. భర్త ఐటీ ప్రొఫెషనల్. అక్కడ ఉన్నప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేసింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంటే ఆయన సానుకూలంగా స్పందించారు. అలా ‘శింబాక్వార్జ్’ రూపంలో తొలి అడుగుపడింది. ఈ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన కౌర్ తన స్వగ్రామం తంగ్రాలో ‘శింబాక్వార్జ్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లెటూరిలో ఐటీ కంపెనీ ఏమిటి! అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాలేదు. మౌలిక వసతుల లేమి అనేది మరో సమస్య. అయితే ఆమె సంకల్పబలానికి ఇవేమీ అడ్డుకాలేదు. తన సేవింగ్స్‌తో కంపెనీ మొదలుపెట్టింది. ప్రారంభంలో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. ఐఐటీ, ఐఐఎంఎస్ క్యాంపస్‌లలో నుంచి చురుకైన స్టూడెంట్స్‌ను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. తంగ్రా గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతీ,యువకులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ ఊళ్లోనే, తమ దగ్గరి ఊళ్లోనే ఐటీ కంపెనీ మొదలైందని తెలిసి కొద్దిమంది చేరారు. అలా కంపెనీ ప్రస్థానం మొదలైంది. కొద్దికాలంలోనే మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కన్సల్టేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్...మొదలైన విభాగాల్లో ‘శింబాక్వార్జ్’ దూసుకుపోయింది. ఉద్యోగుల సంఖ్య వందకు పెరిగింది. కంపెనీ పుణ్యమా అని ఊళ్లో సందడి పెరిగింది. కొత్త కళ వచ్చింది. అయితే కరోనా కఠోర సమయంలో పెద్ద సవాలు ఎదురైంది. పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలిగిస్తూనో, జీతాలు బాగా తగ్గిస్తూనో ఉన్న కాలం అది. ‘శింబా’ కంపెనీ సంక్షోభంలోకి వెళ్లింది. ‘అలాంటి కఠిన సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేయాలని, జీతం తగ్గించాలనుకోలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అవసరం అయితే జీరో నుంచి మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్. గడ్డుకాలం పూర్తయిన తరువాత... కంపెనీ మళ్లీ ఊపందుకుంది. ‘స్మైల్స్ కేర్’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి గ్రామాలలోని అట్టడుగువర్గాల ప్రజలకు సేవ చేస్తుంది కౌర్. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖీ సమావేశం అయిన మన్‌దీప్‌కౌర్, ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. -
‘గ్రిడ్’తో రాజధాని అంతటా ఐటీ గుబాళింపు
దేశానికి ఐటీ హబ్‌గా ఎదు గుతూ ప్రపంచస్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతోంది హైదరాబాద్ నగరం. ఈ నేప థ్యంలో నగరం నలుదిశలా అభివృద్ధి చెందేందుకు ‘గ్రోత్ ఇన్ డిస్పర్షన్ ’(గ్రిడ్) పాలసీకి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం మాదా పూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాం గూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే 90 శాతానికి పైగా నెల కొని ఉంది. ఫలితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కూడా ఇలాగే అభివృద్ధి చేయడం కోసం ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలను స్థాపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రిడ్ పాలసీకి రూపకల్పన చేసింది. హైదరాబాద్ ఒకప్పుడు పరిశ్రమలకు కేంద్రంగా ఉండేది. అయితే, కాలక్రమంలో వీటిలో కొన్ని మూత బడ్డాయి. ఇలా మూతబడిన పరిశ్రమలు ఉన్న స్థలా లన్నీ గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా మారాయి. ఈ స్థలాల్లో ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. నగరం బయటకు వెళ్లిన పరిశ్రమల స్థానం లోనూ ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. నగరంలోని 11 పారిశ్రామికవాడలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, కాటేదాన్, పటాన్చెరు, రామచంద్రాపురం, సనత్ నగర్, బాలానగర్, గాంధీనగర్, కూకట్పల్లి పారిశ్రా మిక ప్రాంతాలను క్రమంగా ఐటీ పార్కులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రిడ్‌లో భాగంగా ఏర్పాటయ్యే సంస్థలకు ప్రోత్సాహకంగా విద్యుత్ పైన సబ్సిడీగా యూనిట్ ఇన్సెంటివ్స్ ఇస్తోంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యూనిట్లను యాంకర్ యూనిట్లుగా పరిగణించి యాంకర్ ఇన్సెంటివ్‌లను అందిస్తోంది. 50 శాతం భూమిని ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ఏర్పాటుకు, మిగతా 50 శాతం భూమిని నివాస, వాణిజ్య అవసరా లకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. హైదరాబాద్ తూర్పు వైపున ఐటీ, ఐటీ అను బంధ రంగాల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఇప్పటికే పలు సంస్థలు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఉప్పల్ కేంద్రంగా నగరానికి తూర్పు వైపున ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉప్పల్‌కు మెట్రో కనెక్టివిటీ ఉంది. కొత్తగా భారీ స్కైవే నిర్మాణం జరుగుతోంది. అధునాతన స్కైవాక్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రభుత్వ కృషితో సమీప భవిష్యత్తులోనే ఉప్పల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపు రేఖలు మారనున్నాయి. అలాగే హైదరాబాద్ ఉత్తరం వైపున ఉన్న కొంపల్లి, బహదూర్‌పల్లి, పటాన్చెరు, బౌరంపేట, కండ్లకోయ ప్రాంతాల్లో కూడా ఐటీ సంస్థల ఏర్పా టుకు అనువైన పరిస్థితులను కల్పిస్తోంది ప్రభుత్వం. కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్క్ పేరుతో రెండు భారీ ఐటీ టవర్ల నిర్మాణం జరగనుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ దీనికి శంకు స్థాపన చేశారు. ఇక్కడ 10 వేల మంది యువతకు ఐటీ, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి లభించ నుంది. ఇదే విధంగా హైదరాబాద్ దక్షిణ వైపున ఆదిభట్ల, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో నగరం నలువైపులా ఐటీ వెలుగులు విరజిమ్మనున్నాయి. వ్యాసకర్త: ఎన్. యాదగిరిరావు జీహెచ్ఎమ్సీ అదనపు కమిషనర్ మొబైల్: 97044 05335 -
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
-
ఐటీశాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైస్ జగన్ సమీక్ష
-
తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ, డిజిటల్ లైబ్రరీపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు.. గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతోపాటు.. అన్ని రకాల పోటీల పరీక్షలకు అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉండాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆగస్టు 15న పనులు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. '' విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలి. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యం. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇక 2020-21కి సంబంధించిన ఐటీశాఖ వార్షిక నివేదికను పారదర్శకత కోసం విడుదల చేశాం. క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సాధించాం.అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికం. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశాం'' అని తెలిపారు. చదవండి: భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
‘వారు ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు’: కేటీఆర్
ఖమ్మం: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్దగా సహకారం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. విభజన చట్టంలో ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఏ ఒక్క మాటా నిలుపు కోలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీ పేటలో కోచ్ ఫ్యాక్టరీ కావొచ్చు.. మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కావొచ్చు. మన దగ్గర నుంచి తీసుకోవడమే తప్ప.. తిరిగి ఇచ్చింది లేదు. ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లో.. సీఎం నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ఖమ్మం నగరంలో రూ.25 కోట్లతో ఆధునిక బస్టాండ్‌ను నిర్మించుకున్నాం. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం ఉండ టంతో దేశవృద్ధి రేటు కన్నా రెట్టింపు వేగంతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.49 లక్షల కోట్లకు పెరిగాయి’అని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో రూ.423.26 కోట్లకు సంబంధించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, నిర్మాణం చేయనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరంలో నూతన ఆర్టీసీ బస్టాండ్, 1,004 డబుల్ బెడ్రూం ఇళ్లు, వైకుంఠధామం, మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన 45 వేల మంచినీటి కనెక్షన్లతోపాటు ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. రెండో ఐటీ హబ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్స వం చేయడంతోపాటు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట రవాణా మంత్రి పువ్వాడ అజయ్, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఐటీ హబ్ ప్రాంతం, నూతన బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ బాట.. దేశంలోనే బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, పుణే వంటి నగరాలను కాదని ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాట పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్, నిజామా బాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఐటీ హబ్‌లు వచ్చాయని, త్వరలో నల్లగొండ, సిద్దిపేట, రామగుండం ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత హైదరాబాద్‌కో.. బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీ ఫైబర్ ప్రాజె క్టుతో రాష్ట్రంలోని కోటి ఇళ్లకు రానున్న కాలంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్, ఎడ్యుకేషన్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం స్వయంగా పూనుకుని ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం వచ్చి నేర్చుకోవాలి.. ఏ ప్రభుత్వమైనా, ప్రజాప్రతినిధి అయినా కోరుకునేది ప్రజల కోసం తపించడమేనని, మంత్రి పువ్వాడ కూడా అలాగే చేస్తున్నారన్నారు. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి నేర్చుకోవాలన్నారు. ముందు చూపుతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ఖమ్మం రూపురేఖలే మారాయన్నారు. మిగిలిన పనులు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన పనులు చెప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు
సాక్షి, బెంగళూరు : బెంగళూరు.. భారతదేశ ఐటీ రాజధాని. ఈ పేరును ఉద్యాన నగరి మరోసారి సార్థకం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఐటీ రంగం వృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఐటీ రంగం అభివృద్ధి విషయంలో యూరోపియన్ నగరాలు లండన్, మ్యూనిచ్, బెర్లిన్లను సైతం వెనక్కి నెట్టి బెంగళూరు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. బెంగళూరు తర్వాత దేశీ నగరాల్లో ముంబై ఆరోస్థానంలో ఉంది. డీల్‌రూమ్.సీవో సమాచారాన్ని ది మేయర్ ఆఫ్ లండన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, పెట్టుబడుల ఏజెన్సీ సంస్థ లండన్ అండ్ పార్టనర్స్ విశ్లేషించి ఈ ర్యాంకింగులను ప్రకటించింది. 2016 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించి బెంగళూరుకు అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. 2016–2020 మధ్య కాలంలో బెంగళూరులో ఐటీ పెట్టుబడులు 5.4 రెట్లు పెరిగాయి. 2016లో 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉండగా 2020 నాటికి 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చదవండి: ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం మహారాష్ట్ర ముంబైలో 1.7 రెట్లు మేర పెట్టుబడులు పెరిగాయి. 2016లో 0.7 బిలియన్ డాలర్లు ఉన్న పెట్టుబడులు ఆ తర్వాత 2020 నాటికి 1.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక లండన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 2016లో 3.5 బిలియన్ డాలర్లు ఉండగా 2020లో 10.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. లండన్‌లో వృద్ధి రేటు మూడు రెట్లుగా ఉంది. ప్రపంచ సాంకేతికత వెంచర్ క్యాపిటలిస్టు (వీసీ) పెట్టుబడుల్లో కూడా బెంగళూరు దూసుకుపోతుండడం విశేషం. వీసీ పెట్టుబడుల్లో బెంగళూరులో ప్రపంచంలోనే ఆరోస్థానంలో నిలిచింది. అయితే వీసీ పెట్టుబడుల ర్యాంకింగుల్లో బీజింగ్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షాంఘై, లండన్ నగరాలు బెంగళూరు కన్నా ముందుగా ఉన్నాయి. ఇక ముంబై ఈ విషయంలో 21వ స్థానంలో ఉంది. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్‌లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్‌లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్‌లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్‌లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
ఐటీ వృద్ధిరేటు రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఐటీ రంగం అద్భుత ప్రగతిని సాధించిందని, జాతీయ సగటుకు మించి ఐటీ సేవలను ఎగుమతి చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు జాతీయ సగటు 8.09 శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రం 17.97 శాతం వృద్ధిని సాధించిందన్నారు. రాష్ట్రానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు సైతం వచ్చాయన్నారు. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాయని గుర్తుచేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ విస్తరణకు ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమయ్యాయని, టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు వరంగల్‌లో తమ కేంద్రాలను ప్రారంభించాయన్నారు. వరుసగా ఆరో ఏడాది శనివారం ఆయన ఇక్కడ రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక ప్రగతి నివేదిక–2019–20ను ఆ విష్కరించారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ కీలక సేవలందిం చిందని కేటీఆర్ ప్రశంసించారు. కరోనా రో గులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని గుర్తించే ందుకు, హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిపై నిఘా ఉంచేందుకు, వలంటీరింగ్ వంటి విషయాల్లో ఐటీ శాఖ సాంకేతిక సేవలందించిందని, పలు డిజిటల్ సొల్యూషన్లు అందించేందుకు భాగస్వామిగా నిలిచిందన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. ► 2018–19తో పోలిస్తే 2019–20లో దేశ ఐ టీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 % నుంచి 11.58 శాతానికి పెరిగింది. ► ఐటీ ఉద్యోగాల వృద్ధిరేటు జాతీయ సగటు 4.93 శాతం ఉండగా, తెలంగాణలో 7.2%గా నమోదైంది. ► తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఆధ్వర్యంలో మీ–సేవ కేంద్రాల ద్వారా రోజూ లక్షమంది 600కుపైగా సేవలు పొందుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు, ఇతర సేవల కోసం తీసుకొచ్చిన టీ–యాప్ఫోలియో మొబైల్ యాప్‌ను 7లక్షలకుపైగా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీని ద్వారా 225 రకాల సేవలను 32 శాఖల భాగస్వామ్యంతో అందిస్తున్నారు. -
ఐటి అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది