Jayashankar
-
అనసూయ ‘అరి’కోసం వినూత్న ప్రచారం
పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన రెండో చిత్రం అరి. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, సూర్య పురిమెట్ల, వినోద్ వర్మ, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో తిమ్మప్ప నాయుడు, శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా..ఈ చిత్రం ప్రమోషన్స్‌ని వినూత్నంగా ప్లాన్ చేశారు మేకర్స్. కరీంనగర్లో ఉన్న స్థానిక సింగర్స్‌లో ఈ సినిమాలోని ‘చిన్నారి కిట్టయ్య’సాంగ్‌ని పాడిస్తూ ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ పాటను ప్రముఖ గాయని మంగ్లీ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనూబ్ రూబెన్స్ సంగీతం అందించారు. -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్‌ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్‌కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
అదను దాట లేదు... ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ అదను దాటలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు భరోసా ఇచ్చింది. పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీచేశారు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఈ నెల ఒకటిన కేరళను తాకవలసిన రుతుపవనాలు 8వ తేదీకి వచ్చాయని, ఈ సమయంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన తుపాను వల్ల మన రాష్ట్రానికి రుతుపవనాల రాక ఆలస్యమైందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడతాయన్న ఆయన.. పంటలవారీగా రైతులకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఏ పంట? ఎప్పటివరకు ? వరి: ఇప్పుడు నార్లు పోసుకోవాలనుకునే రైతులు కేవలం స్వల్పకాలిక (125 రోజుల కన్నా తక్కువ) వరి రకాలను మాత్రమే విత్తుకోవాలి. నేరుగా విత్తే పద్ధతులపై (దమ్ముచేసి లేదా దమ్ము చేయకుండా) రైతాంగం శ్రద్ధ పెట్టాలి. పత్తి: జూలై 20 వరకు విత్తుకోవచ్చు.ౖ తేలిక నేలల్లో 50–60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60–75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. పత్తిలో అంతరపంటగా కంది మంచి లాభాలు ఇస్తుంది. కాబట్టి అంతర పంటగా కందిని సాగు చేపట్టాలి. కంది పంట: సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగష్టు 15 వరకు కందిని విత్తుకోవచ్చు. పెసర, మినుము, వేరుశనగ, పత్తి, ఆముదం సహా ఇతర పంటలతో అంతర పంటగానూ విత్తుకోవచ్చు. సోయాచిక్కుడు: జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే జూలై మొదటి వారంలో విత్తినా సోయాలో మంచి దిగుబడులు సాధించవచ్చు. మొక్కజొన్న: జూలై 15 వరకు విత్తుకోవచ్చు. నీటి ఎద్దడిని మొక్కజొన్న తట్టుకోలేదు. కాబట్టి బోదె, సాళ్ళ పద్ధతి ఆచరించడం ద్వారా పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంచవచ్చు. పెసర, మినుము: ఈ పంటలనుౖ జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం ద్వారా ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఇతర ఆరుతడి పంటలైన ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలను జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఆందోళన పడవలసిన అవసరం లేదు. -
ఆ పాటని మంగ్లీ చేత పాడించడానికి కారణం...
-
‘అరి’కి ఇస్కాన్ ప్రశంసలు
`పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘అరి’. అనసూయ, ఆమని, సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మంగ్లీ ఆలపించిన పాటతో పాటు ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌పై ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్( ఇస్కాన్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిత్ దాస ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవిత వైవిధ్యం గురించి ఈ సినిమాలో ప్రస్తావించడంపై అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ మూవీ ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామి సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో కృష్ణతత్వం తేలియజేసే ‘చిన్నారి కిట్టయ్య’పాటని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ విడుదల చేశారు. మంగ్లీ ఆలపించిన ఆ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. మొత్తంగా విడుదలకు ముందే ‘అరి’ చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. -
డబల్ బెడ్ రూమ్ ఇల్లు మొత్తం డొల్లే...!
-
2నుంచి కోటంచ బ్రహ్మోత్సవాలు
టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మార్చి రెండు నుంచి కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కోటంచలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో 24గంటలు నిరంతరం విద్యుత్‌ను అందించాలని.. అఽధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. భక్తులకు నీటిసౌకర్యాన్ని కల్పించి, నిరంతరం నీటిట్యాంకులను పర్యవేక్షించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. జాతరకు వచ్చే రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పీఆర్ అధికారులను ఆదేశించారు. ములుగు, భూపాలపల్లి, పరకాల, టేకుమట్ల నుంచి భక్తుల కోసం ఎక్కువగా బస్సులను కల్పించి రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పరకాల, భూపాలపల్లి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రత్యేక పూలతో అలంకరణ.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి ముస్తాబు చేయాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నూతన అనుభూతి కలిగేలా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను పండుగగా జరుపాలని చెప్పారు. అనంతరం జాతర వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్ఓ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ఆలయ చైర్మన్ మాదాడి అనితకరుణాకర్‌రెడ్డి, ఈఓ బిల్ల శ్రీనివాస్, ఎంపీపీ పున్నం లక్ష్మీ, జెడ్పీటీసీ సాయిని విజయ, మండల ప్రత్యేకాధికారి శామ్యూల్, తహసీల్దారు షరీఫ్ మొహినోద్దీన్, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రాంప్రసాద్‌రావు, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్రావు, ఆలయ కమిటీ సభ్యులు పోగు సుమన్ పాల్గొన్నారు. అధికారులు సమష్టిగా పనిచేయాలి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
రామప్ప దేవాలయం అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని బెల్జియం, అమెరికాకు చెందిన పలువురు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శనివారం 30మంది బెల్జియం దేశస్తులు సందర్శించారు. వారు రామలింగేశ్వర స్వామిని దర్శించుకోగా పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్ విజయ్‌కుమార్‌లు ఆలయ విశిష్టత గురించి విదేశీయులకు వివరించారు. ఈ సందర్భంగా బెల్జియం దేశస్తులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే తమకు ఇష్టమని తెలిపారు. వరంగల్‌లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరై రామప్ప ఆలయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. -
ఎమ్మార్పీఎస్ నాయకుల నినాదాలు
ఎస్సీ వర్గీకరణ చేపట్టడంలో కేంద్రం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బట్టు విజయ్ అధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ సమావేశాన్ని అడ్డకునే ప్రయత్నం చేశారు. సమస్యలు ఉంటే విన్నవించాలే తప్పా, సమావేశాల్లో ఇలా చేయడం సరికాదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, రేగొండ సర్పంచ్ నిశిధర్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపయ్య, చాడ రఘునాథరెడ్డి, బట్టురవి, రాంచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డి, కొరె సుధాకర్, బీఎంఎస్ నాయకులు అప్పాని శ్రీనివాస్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఆదాయపన్ను ఎగవేత!
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వేతన జీవులను ఆదాయపన్ను (ఐటీ) కలవరపెడుతోంది. ఈ నెలలో చేతికి ఏమైనా జీతం వస్తుందా? లేక పన్ను చెల్లింపులకు సరిపోతుందా? అని లెక్కలు వేసుకుంటారు. ఈ ఏడాది పీఆర్సీ అమలుతో వేతనాలు పెరిగాయి. ఫలితంగా ఆఫీసు సబార్డినేటు మొదలుకొని ప్రతీ ఉద్యోగి పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సాకుగా చూపి పన్ను తప్పించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 3500 మందిపైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెల వేతనం రావాలంటే డీడీఓల ద్వారా ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్నులు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులకు జతచేయాల్సి ఉండటంతో పలువురు దొడ్డిదారి బిల్లులు సమర్పించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు తెరలేపుతోంది. ముఖ్యంగా దంపతులు ఉద్యోగులుంటే వారు ఇటు హెచ్ఆర్ఏ పేరిట పన్ను ఎగవేస్తూ.. మరోవైపు బదిలీ సమయంలో స్పౌజ్ కేటగిరి కింద హెచ్ఆర్ఏ అధికంగా ఉన్నచోటుకు బదిలీ కావడం రెండు విధాలా మెజార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే విషయమై నాన్‌స్పాజ్ సంఘం ఉపాధ్యాయులు స్పౌజ్ కేటగిరిని ఎత్తేయాలని కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకే ఇంట్లో ఉంటూ.. భార్యాభర్తలు వేర్వేరు మండలాలు, గ్రామాల్లో ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఆయా పాఠశాలలకు రాకపోకలు చేస్తున్నారు. ఉండేది సొంతింట్లో అయినా.. విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఒక్కొక్కరు రూ.లక్షపైనే బిల్లులు సమర్పించారు. ఆదాయ పన్ను భారం తప్పించుకోవాలని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతుల్లో చాలామంది ఇదే దారిని ఎంచుకుని పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. రాకపోకలు సాగిస్తూ.. జిల్లాల విభజన తర్వాత చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇది వరకు ఉంటున్న జిల్లాను వదిలి మరో జిల్లాకు బదిలీ అయినా.. అలా బదిలీ అయిన వారంతా జట్టుగా ఏర్పడి కారులో నిత్యం సొంతింటికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ.. పనిచేస్తున్న చోట ఇంటి అద్దె చెల్లిస్తున్నామని వేలకు వేల బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసుకుంటూ ఆదాయపన్ను శాఖకు ఎగనామం పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. పెరిగిన వేతనాలతో ఉద్యోగులపై భారం తప్పించుకునేందుకు తప్పుడు పత్రాలు ఉద్యోగులను భయపెడుతున్న ఆదాయపన్నుఅక్రమార్జనకు అవకాశం..వేతన స్థిరీకరణ సందర్భంలో, ఇప్పుడు పన్ను మినహాయింపు బిల్లుల సమర్పణకు డీడీఓలకు, ట్రెజరీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా బిల్లుల సమర్పణకు వెళ్లిన డీడీఓల నుంచి ట్రెజరీ ఉద్యోగులు కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సాకుతో అసలు విషయం తెలిసిన డీడీఓలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అందినంత దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. -
పిచ్చి ప్రేలాపణలు మానుకో..
భూపాలపల్లి: కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలని, లేదంటే అతడికి ప్రజల చేతిలో దెబ్బలు తప్పవని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ హెచ్చరించారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు ఓడినా సత్యనారాయణరావుకు బుద్ధి రాలేదని, మూడోసారి ఓడాలని తహతహలాడుతున్నాడని అన్నారు. తమ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చట్టబద్ధంగా, న్యాయంగా భూములు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని పార్టీలు మారిన అతడికి తమ నేతను విమర్శించే అర్హత లేదని చెప్పారు. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్లో చేరితే సత్యనారాయణరావుకు కాంగ్రెస్ ప్లాట్‌ఫాం దొరికిందన్నారు. ఒక్కసారి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందితేనే జీవితానికి సరిపడా సంపాదించుకున్నాడని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక అన్నీ అమ్ముతాడని విమర్శించారు. నీ భాష, వ్యవహార శైలి ప్రజలకు తెలుసని, రానున్న ఎన్నికలే నీకు చివరి ఎన్నికలన్నారు. మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. సత్యనారాయణరావు ఒక బ్లాక్‌మెయిలర్ అని, అతడి మాటలు ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ కళ్లెపు శోభ, మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, బీఆర్ఎస్ నాయకులు నూనె రాజు, గండ్ర హరీశ్‌రెడ్డి, పైడిపెల్లి రమేష్, బద్ది సమ్మయ్య, మాదాసు తిరుపతమ్మ, చల్ల రేణుక, మురళి, లట్ట రాజబాబు పాల్గొన్నారు. టపాసులు పేల్చి సంబురాలు.. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. లేదంటే ప్రజల చేతిలో దెబ్బలు తప్పవు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ -
ఆట వస్తువులు అందజేత
పలిమెల: శ్రేయోభిలాశి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పంకెనలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆట వస్తువులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. చదువుతో పాటు, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శరీర ధారుడ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేష్, శ్రేయోభిలాశి సేవా ట్రస్టు చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవ్వాది తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్ కనకలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రావు, ప్రకాశ్, మనోహర్, సత్యనారాయణ, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు. బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలిములుగు రూరల్: సమస్యల పరిష్కారానికి బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డెపల్లి రఘుపతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్లో నిరుపేదలు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 5,700 మంది దరఖాస్తులు చేసుకొని రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు రాజకీయాల్లో 58 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈబీఎస్ నిధుల కోటను పెంచాలన్నారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన కన్వీనర్‌గా బట్టు మురళీకృష్ణను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య నియమించగా నియామక పత్రాన్ని రఘుపతి అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
● ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసీంపల్లి గ్రామంలో గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మతల్లి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ ప్రహరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దమ్మతల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్తహరిబాబు, టీఆర్ఎస్ నాయకులు సిద్దు, గండి శ్రీనివాస్, మేనం రాజేందర్, తాటి అశోక్, మోకిడి అశోక్, బేతు రమేష్, జనగాం శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, ముదిరాజ్ పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు తూటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
Kothapalli Jayashankar: తెలంగాణ ఆచార్య!
తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. 1952లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం నుంచి ఆయన కన్నుమూసే వరకూ సాగిన తెలంగాణ అస్తిత్వ పోరాటాలన్నిం టికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో తెలం గాణ వాదాన్ని బలంగా వినిపించారు. విద్యావేత్తగా, మేధావిగా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ప్రజల మనసులోని సందేహాలను, అనుమానాలను ధైర్యంగా తెలియజేశారు. తెలంగాణ ప్రాంత భవిష్యత్ సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన గట్టిగా వాదించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపితే నీళ్ళు, నిధులు, సమస్యలు తలెత్తుతాయని ఆ కమిషన్ ముందు వాదించారు. ఆయన వెలిబుచ్చిన భయ సందేహాలు తర్వాత కాలంలో నిజమయ్యాయి. నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భవానికీ తెలం గాణ ఉద్యమం ఊపందుకోవడానికీ ఇవే కారణాలయ్యాయి. ఉమ్మడి రాష్టంలో తెలంగాణ దోపిడీకి గురవ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు చివరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమానికి అగ్రభాగాన నిలిచారు జయశంకర్. తాను కన్న కల నెరవేరకుండానే 2011 జూన్ 21న గొంతు కేన్సర్‌తో తుది శ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను యాభై ఏళ్ళుగా బతికించి విజయ తీరాలకు తీసుకుపోయిన తెలంగాణ సేనాని ఆయన. – కొలనుపాక కుమారస్వామి, వరంగల్ (ఆగస్టు 6న కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
అనసూయ ‘అరి’పై మైత్రీ మూవీ మేకర్స్ కన్ను!
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’. శ్రీమంతుడు సినిమాతో మొదలైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం.. మూడు హిట్లు, ఆరు సక్సెస్‌లతో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. స్టార్ హీరోలతో పాటు అప్ కమింగ్ హీరోలతో ఇంట్రస్టింగ్ కంటెంట్ ప్రజెంట్ చేస్తుంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా.. కొత్త కంటెంట్ ఎక్కడ దొరికినా.. మైత్రీ మేకర్స్ దానిని తెలుగు ప్రేక్షకులకు అందజేస్తుంది. తాజాగా మైత్రీ వాళ్ల కన్ను ‘అరి’చిత్రంపై పడిందట. `పేపర్ బాయ్`లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జయశంకర్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో తాజాగా విడుదలైంది. (చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక) టైటిల్ లోగో ఈవెంట్‌కి మైత్రీ మైత్రీమూవీస్ రవిశంకర్ కూడా హాజరయ్యారు. లోగోతో పాటు కాస్సెప్ట్ కూడా బాగా నచ్చడంతో ‘అరి’రైట్స్ తీసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నారట. నిర్మాతల్లో ఒకరైన శేషు మైత్రీ నవీన్‌కు మంచి స్నేహితుడు. దీంతో అరి రైట్స్ కచ్చితంగా మైత్రీ మూవీ మేకర్స్‌కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్ర దర్శకుడు జయశంకర్‌పై కూడా మైత్రీ మూవీస్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనతో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తోందట. మంచి స్క్రిప్ట్ తీసుకొని రమ్మని దర్శకుడికి చెప్పినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ‘అరి’ తర్వాత జయశంకర్ నయనతారతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. అన్ని కుదిరితే.. ఈ చిత్రం తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో జయశంకర్ కొత్త సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. -
అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ..
యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో ఉంది. ‘అరి’ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిజాయితీగా పని చేస్తే సినిమా రంగంలో సక్సెస్ వస్తుంది.. అయితే రావడం ఆలస్యమైనా రావడం మాత్రం పక్కా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? అనేది సినిమాలో చెప్పాను’’ అన్నారు జయశంకర్. ‘‘మనిషి ఎలా బతకకూడదో మా సినిమా చూపిస్తుంది’’ అన్నారు శేషు మారంరెడ్డి. ‘‘మా సినిమా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రామిరెడ్డి. ‘‘అరి’లో మంచి వినోదం కూడా ఉంది’’ అన్నారు అనసూయ. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? -
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్ధిపేటలోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవింతాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. జయశంకర్ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోశారని చెప్పారు. జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు ► ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ► ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలకు ఎంపీలు బండ ప్రకాష్, బీబీ పాటిల్, కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు. ► హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, సింగరేణి కార్మికసంఘం నేతలు ప్రొ. జయశరంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీష్ రావు ► అడిషనల్ డీజీ పర్సనల్ శివధర్ రెడ్డి, వెల్ఫేర్ ఉమేష్ ష్రాఫ్, ఆర్గనైసేషన్ రాజీవ్ రతన్, ఏ.ఐ.జి. రాజేంద్ర ప్రసాద్. ఇతర అధికారులు, సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ► ఆచార్య కొత్తపల్లిలో జయశంకర్ చిత్ర పటానికి డీజీపీ కార్యాలయంలో పోలీసులు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. -
టీజేఎస్‌కు శ్రీశైల్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) పొలిటికల్ అఫైర్స్ కమిటీకి, జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శ్రీశైల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజం కోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్ ఆ దిశగా ముందుకు పోవడంలేదని, ఇంకా ఉద్యమ పంథా తప్ప రాజకీయ ధోరణి లేదనే తీవ్ర అసంతృప్తి, బాధతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లోతైన, సునిశితమైన ఆలోచన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కు పంపిన లేఖలో పేర్కొన్నారు -
పెళ్లి చేసుకోను.. దిక్కున్న చోట చెప్పుకో..
సాక్షి, జయశంకర్ : ప్రేమ, పెళ్లి పేరుతో ఓ ఆర్మీ జవాను యువతిని మోసం చేశాడు. నమ్మి వచ్చిన అమ్మాయిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. టేకుమట్లకు చెందిన ఆర్మీ జవాన్ కొలుగూరి కార్తీక్ తన బంధువైన రేగొండ మండలం జగ్గయ్య పేట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. శారీరకంగా కూడా లొంగదీసుకున్నాడు. దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా పెళ్లి ఊసెత్తలేదు. చివరకు ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేశాడు. ( తండ్రిని చంపి, పొలంలో పాతిపెట్టి..) ‘‘పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అని బెదిరించాడు. అంతేకాకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కార్తీక్‌తో పెళ్లి జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని టేకుమట్ల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
స్వరాష్ట్ర కాంక్ష.. అభివృద్ధే ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వసంతంలోకి అడుగు పెడుతోంది. నిధులు, నీళ్లు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఉద్యమ పార్టీ తన 14వ ఏట లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉద్యమ పార్టీకే ప్రజలు అధికారం అప్పగించడంతో టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివృద్ధి మంత్రంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర సాధన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరుకున్నాయి. అటు ఉద్యమ సంస్థగా, ఇటు అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానంపై ‘సాక్షి’కథనం. జలదృశ్యంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాటి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీడీపీతోపాటు తన పదవులకు రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది జూలైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సానుకూల ఫలితాలు సాధించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సెప్టెంబర్ 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఏపీ అసెంబ్లీకి 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయగా, పార్టీ అధినేత కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్రంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినా, ప్రణబ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తేల్చక పోవడంతో రాష్ట్రంలో ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. వరంగల్, పోలవరంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి శరద్‌పవార్, శిబు సోరెన్ వంటి నేతలను ఆహ్వానించి జాతీయ స్థాయిలో తెలంగాణను చర్చనీయాంశంగా మార్చారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ రాజీనామా తెలంగాణ ఏర్పాటు అంశంలో కేంద్రం నాన్చివేత ధోరణికి నిరసనగా కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2006 డిసెంబర్ లో జరిగిన కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో 2.01లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉండేలా వ్యూహాన్ని అనుసరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమితో టీఆర్ఎస్ పొత్తుకుదుర్చుకుని నిరాశజనకమైన ఫలితాలను సాధించింది. కేవలం పది మంది ఎమ్మెల్యేలతో పాటు మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి టీఆర్ఎస్ పక్షాన ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ ఎత్తుగడగా మలిచారు. 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ద్వారా తిరిగి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ కీలకంగా పనిచేసింది. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న జయశంకర్, విద్యాసాగర్ తదితరులు తెలంగాణ బిల్లుకు ఆమోదం ఉద్యమ ఫలితంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా, 2014 డిసెంబర్ 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగ్గా, 2014 మే 16న ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 63, 11 లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావంతో పాటుగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ ఇకపై ఫక్తు రాజకీయ పార్టీగా పనిచేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. 2018 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొంది రెండోసారి అధికారంలోకి రాగా సీఎంగా కేసీఆర్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం విలీనం ఉద్యమ కాలంలో 2010 తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహిస్తూ వచ్చిన టీఆర్ఎస్ 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వలసలకు పెద్దపీట వేసింది. 2014లో టీడీపీ తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది టీఆర్ఎస్లో చేరడంతో శాసనసభా పక్షం విలీనమైంది. దీంతో టీడీపీ తెలంగాణలో తన ఉనికిని కోల్పోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అనుసరించడంతో కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న కేసీఆర్ (ఫైల్) ఆమరణ దీక్షతో కొత్త మలుపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత ఆమరణ దీక్షకు దిగడం ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు మార్గమద్యంలో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన చేసినా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కోదండరాం చైర్మన్‌గా జేఏసీని ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ పెద్దన్న పాత్ర పోషించింది. 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వ హించిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరు కావడం మైలురాయిగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత 2011 జనవరి నుంచి టీఆర్ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. -
ఉప్పొంగుతున్న బొగత; కాస్త జాగ్రత్త!
సాక్షి, ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగతా అందాలను వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతూ 5 అడుగుల పై నుంచి దూకుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో పర్యాటకులు స్నానాలు చేయకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి దిగేందుకు కూడా అనుమతి నిలిపివేశారు. పర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులను అప్రమత్తం చేస్తున్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. హరీశ్ ఎక్కడ?
సాక్షి, సిద్దిపెట : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని రంగాదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన హరీశ్.. అనంతరం రంగనాయ సాగర్ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే హరీశ్ రావు యోగా డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగామవ్వాలని సూచించారు. యోగా చేస్తూ ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రొ. జయశంకర్‌కు నివాళలర్పించిన హరీశ్ ప్రొ. జయశంకర్ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు జయశంకర్ సార్‌కు నివాళర్పించారు. సిద్ధిపేటలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్ అని గుర్తుచేశారు. బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్మ అని కొనియాడారు. సార్ స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నట్లు తెలిపారు. జయహో జయశంకర్ సార్. పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్ అని పేర్కొన్నారు. అందుకే కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు : కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎం కేసీఆర్ మినహా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలందరూ వారి వారి నియోజకవర్గాల్లోనే కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభపక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హారీశ్ రావు సైతం సిద్దిపేటలో జరుగుతున్న కాళేశ్వరం సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అందుతున్నాయని, అందుకే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఎంపీలు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయామని వివరించారు. కాగా కాళేశ్వరం ప్రారంభ ఉత్సవాలను టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో వెంకటేశ్వరస్వామి, దుర్గమాతకు పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. -
లండన్‌లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
లండన్ : ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. జయశంకర్, అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేశారని తెలిపారు. అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకై జయశంకర్ చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య జయశంకర్ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. జయశంకర్ కలలు కన్న తెలంగాణ కేవలం కేసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శులు హరి నవాపేట్, సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, లండన్ ఇంచార్జిలు గణేష్ పాస్తం, భాస్కర్ మొట్టా, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ ప్రశాంత్ కటికనేని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్లతో పాటు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని, టీ.డీ.ఎఫ్ అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి ప్రతినిధులు, స్థానిక తెలంగాణ వాదులు కిషోర్ మునగాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. -
ఏసీబీ వలలో చిల్పూరు ఆలయ ఈవో
సాక్షి, వరంగల్ : లంచం తీసుకుంటూ వరంగల్ రూరల్ జిల్లా చిల్పూర్ దేవాదాయ శాఖ ఈవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఈవో జయశంకర్ అధికారులకు పట్టుబడ్డాడు. గ్రాట్యుటీ చెక్ ఇచ్చేందుకు జయశంకర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ ఈవో కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. -
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..