karti chidambaram
-
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్‌ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
‘రాహుల్ కంటే మోదీ పాపులర్’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం
చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి. చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు -
ఈడీ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్‌లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్‌సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్‌సభ శుక్రవారం వాయిస్ ఓట్‌తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
పది నిమిషాలు సరే.. ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది ?
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఆకాశమే హద్దుగా విస్తరిస్తోన్న డెలివరీ బిజినెస్‌పై దృష్టి సారించాలని, అవసరమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. గిగ్ ఎకానమీలో జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా ఎన్నో కంపెనీలు వేగంగా డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయని, అయితే ఈ క్రమంలో డెలివరీ బాయ్ సెక్యూరిటిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పార్లమెంటులో ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. జోమాటో, స్విగ్రీ, డూన్జో ఇలా అనేక కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. జోమాటో అయితే ఏకంగా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చేసేప్పుడు ఆ కంపెనీలుకు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. డెలివరీ బాయ్ పర్సనల్ వెహికల్స్‌ను కమర్షియల్‌గా వాడుకుంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని కార్తి చిదంబరం అన్నారు. ఇక డెలివరీ బాయ్‌లను కంపెనీలు తమ ఉద్యోగులుగా పరిగణించడం లేదు. కనీసం వారికి ఇన్సురెన్సు చేయించడం లేదు. కానీ పది నిమిషాల్లె డెలివరీ అందిస్తామని చెబుతున్నాయి. ఈ వేగాన్ని అందుకునే క్రమంలో డెలివరి బాయ్స్ ప్రమాదాలకు గురైతే బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఎంతోమంది డెలివరి బాయ్స్ ఎటువంటి రక్షణ లేకుండా పని చేస్తున్నారు. This is absurd! It’s going to put undue pressure on the delivery personnel, who are not employees & who have no benefits or security, who have no bargaining power with @zomato I have raised this in Parliament & have written to the Govt. Will pursue this further. https://t.co/fH8yflloiY pic.twitter.com/PfQIe2nfR4 — Karti P Chidambaram (@KartiPC) March 21, 2022 టెక్నాలజీ రావడంతో గిగ్ ఎకానమీ ఊపందుకుంది. ఈ స్వింగ్‌ని ఇలా కొనసాగిస్తూనే డెలివరీ బాయ్స్ రక్షణ విషయంలో, వారి హక్కుల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. డెలివరీ సంస్థలకు కచ్చితమైన నియమ నిబంధనలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే -
చిదంబరం కోడలి వీడియోతో బీజేపీ ప్రచారం
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కోడలు, ఎంపీ కార్తీ చిదంబరం సతీమణి శ్రీనిధి భరత నాట్యం బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. బీజేపీ ప్రచార ట్విట్లో తన వీడియో కనిపించడంతో శ్రీనిధి తీవ్రంగా ఖండించారు. తమిళనాట ఎన్నికల ప్రచారం వేడెక్కి ఉన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతోంది. ఆ దిశగా బీజేపీ విడుదల చేసిన ప్రచార వీడియోలో ఓ మహిళ భరత నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయితే, ఆ నాట్యం చేస్తున్న మహిళ కాంగ్రెస్ సీనియర్, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కోడలు శ్రీనిధి కావడంతో వివాదానికి దారి తీసింది. తన వీడియోను ఉపయోగించి బీజేపీ ప్రచారం చేయడాన్ని పరిశీలించిన ఆమె ఇది ఖండించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు, కుస్తీలు పట్టినా, కమలంకు తమిళనాట చోటు లేదని, పాదం మోపడం కష్టతరమేని అదే ప్రచార ట్వీట్లో శ్రీనిధి కామెంట్లు పెట్టారు. అయితే, కొన్నేళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయయంలో జరిగిన సెమ్మోళి మహానాడులో చిత్రీకరించిన వీడియోగా ఆ నాట్య ప్రదర్శనను గుర్తించారు. దీనిని పరిశీలించకుండానే బీజేపీ వర్గాలు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం గమనార్హం. చదవండి: 66 ఏళ్ల ఆంటీ.. నోరు అదుపులో పెట్టుకో! -
ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడినట్లు సోమవారం తెలిపారు. ‘నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా’అని ట్విటర్లో పేర్కొన్నారు. (సీఎం కుమార్తెకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక) I have just tested positive for #Covid. My symptoms are mild and as per medical advice I am under home quarantine. I would urge all those who have recently been in contact with me to follow medical protocol. — Karti P Chidambaram (@KartiPC) August 3, 2020 ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా, ఆయన భార్యకు శనివారం కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ శర్మ కూడా ఇటీవల కరోనా బారినపడ్డారు. -
శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!
సాక్షి, వేలూరు: జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. ఆయన బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వచ్చారు. ఆ సమయంలో ఆంబూరు బస్టాండ్ ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కార్తీ చిదంబరం విలేకరులతో మాట్లాడారు. కందశష్టి కవశాన్ని అవమానం పరచడాన్ని మత నమ్మకం ఉన్న వారు ఎవరూ వదిలి పెట్టరన్నారు. మురుగుడి భక్తుడిగా ఉన్న తానే వాటిని అంగీకరించనన్నారు. ఒక మతానికి చెందిన దేవున్ని అవమాన పరిచడం సరికాదు. దేవుళ్లను అవమాన పరిచేందుకు పూనుకోకూడదన్నారు. (సీఎం నివాసంగా వేద నిలయం..) శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అ«ధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. టీటీవీ దినగరన్ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారన్నారు. వారి కుటుంబం అదుపులోనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ ఇదివరకే తెలిపిన విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందజేసి ఉండాలన్నారు. అయితే రూ. 1000 మాత్రమే అందజేశారని చెప్పారు. బాధితులకు అదనంగా నివారణ సాయం అందజేయాలన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున నిబంధనలుకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు జిల్లా అధ్యక్షులు ప్రభుతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. (వేదనిలయంలోకి దీపక్) -
కార్తీ ..మీరు ఆ 20కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం అత్యున్నత న్యాయస్థానం వద్ద డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం గతంలో రూ.20 కోట్ల డిపాజిట్ తీసుకొని సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ డిపాజిట్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. గత సంవత్సరం మే, జూన్ నెలల మధ్యలో విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టును అనుమతి కోరగా.. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ సొమ్మును డిపాజిట్ చేశారు. కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్ మనీల్యాండరింగ్ కేసుల్లో కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చదవండి: కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి.. -
పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీతో కలిపి మొత్తం 13మంది పేర్లను సీబీఐ చార్జీషీటులో చేర్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 310కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీటు నమోదు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారుల సమక్షంలో కస్టడీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌సిబాల్ బెయిల్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై చార్జీషీటు నమోదు కావడం ఇదే మొదటిసారి. కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోద్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పూజారి, అదనపు కార్యదర్శి సిద్దుశ్రీ కుల్హర్, చెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా సీబీఐ అధికారులు చార్జీషీటులో నమోదు చేశారు. చార్జీషీటు నమోదు కావడంతో కేసు మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. (చదవండి : ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ ) -
మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం తిహార్ జైలులో గడుపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి పీ చిదబంరం. ఈ క్రమంలో జైలులోనే తన 74వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు చిదంబరం. ఈ సందర్భంగా చిందబరం తనయుడు కార్తీ తండ్రి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక చిదంబరం జైలు పాలైన నాటి నుంచి జరిగిన సంఘటనల గురించి వివరిస్తూ.. రెండు పేజీల లేఖ రాశారు. దానిలో కశ్మీర్ పునర్వ్యస్థీకరణ, ఆర్థిక మందగమనం, దానిపై ఆర్థిఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు, గురుత్వాకర్షణ గురించి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు, అస్సాం ఎన్ఆర్సీ, మోదీ ప్రభుత్వం 100 రోజుల వేడక గురించి ప్రస్తావించారు. అంతేకాక ‘మీరు 76వ ఏట అడుగుపెట్టడం.. మోదీ ప్రభుత్వం వంద రోజుల వేడుక చేసుకోవడం రెండు ఒకేలాంటి అంశాలు కాదు. తన అనాలోచిత నిర్ణయాలతో బీజేపీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింద’ని కార్తీ ఆరోపించారు. దాంతో పాటు ‘మీరు లేకుండా మీ పుట్టిన రోజు వేడుకలు జరపుకోవడం చాలా లోటుగా ఉంది. మీరు లేకపోవడం మా హృదయాలను కదిలించింది. మీరు తిరిగి వచ్చి మాతో పాటు పుట్టిన రోజు వేడకల్లో పాల్గొంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ అలా జరగదని తెలుసు’ అంటూ కార్తీ లేఖలో పేర్కొన్నారు. -
వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకులు ఇంద్రాణీ ముఖర్జీ–పీటర్ ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్లుగా మారడంతో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మెడకు ఉచ్చు బిగుసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) కోసం అనుమతులు ఇవ్వాలంటే తన కుమారుడు కార్తీకి వ్యాపారంలో సహకరించాలని 2008లో అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కోరినట్లు ఇంద్రాణీ, పీటర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన కుమారుడికి సాయం చేస్తే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతులు వచ్చేస్తాయని చిదంబరం చెప్పారన్నారు. దీంతో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తాము కార్తీతో సమావేశమయ్యామనీ, ఈ సందర్భంగా తనకు 10 లక్షల డాలర్లు చెల్లిస్తే ఎఫ్‌ఐడీల కోసం అనుమతులు లభిస్తాయని కార్తీ చెప్పినట్లు ఇంద్రాణి ముఖర్జీ వెల్లడించారు. కార్తీకి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కంపెనీ ఖాతాలో రూ.10 లక్షలు జమచేసినట్లు పీటర్ ముఖర్జీ వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభివర్ణించింది. అయితే 10 లక్షల డాలర్లలో మిగతా మొత్తాన్ని ఇంద్రాణీ–పీటర్లు కార్తీకి చెల్లించారా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇంద్రాణీ–పీటర్ ముఖర్జీలు ఎవరో తెలియదు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ అధికారులు పి.చిదంబరాన్ని అరెస్ట్ చేశారని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం తెలిపారు. చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్న కార్తీ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీలను కలుసుకోలేదు. సీబీఐ విచారణలో భాగంగా ఓసారి బైకుల్లా జైలులో కలిశా. అలాగే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)లో ఎవ్వరితోనూ నేను భేటీకాలేదు. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
చిదంబరానికి మధ్యంతర ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో అరెస్ట్ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఎఫ్‌డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్ఐపీబీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి. -
వెళ్లి నియోజకవర్గం మీద శ్రద్ధపెట్టండి!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విదేశాల్లో పర్యటించడానికి పూచీకత్తుగా గతంలో తాను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు సమర్పించిన రూ. 10 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అప్పు తెచ్చి సుప్రీంకోర్టుకు డబ్బు కట్టానని, దానిపై ప్రస్తుతం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని, కాబట్టి రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలని కార్తీ చిదంబరం అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా.. వెళ్లి తన నియోజకవర్గంపై దృష్టి సారించాలని కార్తీకి సూచించింది. తమిళనాడులోని శివగంగ నియోజకవర్గం నుంచి 3లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో కార్తీ చిదంబరం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ద్వారా ఇప్పించిన అనుమతుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కార్తీ ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచన మేరకు రూ. 10 కోట్లు పూచీకత్తు చెల్లించి.. కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందారు. -
కార్తీ మరో రూ. 10 కోట్లు కట్టి వెళ్లండి..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం కొడుకు కార్తీకి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మే, జూన్ నెలల మధ్యలో ఆయన విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. గతంలోవి కాకుండా పూచీకత్తు కింద మరో రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల బెంచ్ కార్తీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులకు సంబంధించి సీబీఐ, ఈడీ సంస్థలు ప్రస్తుతం కార్తీని విచారిస్తున్నాయి. అయితే టోటస్ టెన్నిస్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ల కోసం తాను అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లాల్సి ఉందని కోర్టుకు కార్తీ తెలిపారు. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి భారీ ఊరట
సాక్షి,న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరంకు మరోసారి ఊరట లభించింది. ఈయనతోపాటు కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా మార్చి 8 వరకు అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులలో ప్రశ్నించడానికి మార్చి 5, 6, 7, 12 తేదీల్లో సీబీఐ కోర్టుముందు హాజరు కావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. అనంతరం కోసును మార్చి12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసును వాయిదా వేయడాన్ని అక్కడే కోర్టులో ఉన్నచిదంబరం వ్యతిరేకించారు. ఈడీ కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. కాగా 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌కు సంబంధించి విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) ఆమోదం విషయంలో కార్తి చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో విచారణ నిమిత్తం మార్చి తొలివారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. చట్టంతో చెలగాటమాడరాదని ఆయనను సర్వోన్నత న్యాయస్ధానం హెచ్చరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించే షరతుల్లో భాగంగా రూ పది కోట్లను కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 21-28 తేదీల్లో తన ఫ్రాన్స్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కార్తీ గత ఏడాది నవంబర్‌లో అప్పీల్ చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లదలుచుకుంటే అక్కడికి వెళ్లవచ్చు..ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చు.. అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దు..విచారణకు సహకరించకుంటే మాత్రం తాము తీవ్ర చర్యలకు వెనుకాడబో’ మని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ కార్తీపై మండిపడింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ కేసుల్లో కార్తీ చిదంబరం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్ధల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం కార్తీ చిదంబరం ముడుపులు స్వీకరించారని దర్యాప్తు ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. -
కార్తీ చిదంబరం ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో దేశ, విదేశాల్లో ఉన్న రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్‌లలో ఉన్న సాగు భూమి, బంగళా, ఢిల్లీలో కార్తీ, అతని తల్లి నళిని పేరిట ఉన్న రూ.16 కోట్ల ఖరీదైన ఫ్లాట్, బ్రిటన్‌లోని సోమర్సెట్లో ఉన్న రూ.8.67 కోట్ల కాటేజీ, ఇల్లు, స్పెయిన్‌లోని బార్సిలోనాలో రూ.14.57 కోట్ల టెన్నిస్ క్లబ్‌లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ప్రకారం జప్తు చేస్తున్నట్లు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై బ్యాంకులోని కార్తీకి, అతనికి చెందినదిగా భావిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్) పేరుతో ఉన్న రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. ’అటాచ్మెంట్ ఉత్తర్వు చట్ట విరుద్ధం..హాస్యాస్పదం, అనాగరికం. వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి ఊహాగానాలతో తీసుకున్న చర్య. వార్తల్లోకి ఎక్కటమే దీని వెనుక ఉద్దేశం’ అని కార్తీ అన్నారు. -
కార్తీ చిదంబరం ఆస్తులు అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన సంస్థకు చెందిన భారత్, బ్రిటన్, స్పెయిన్లలో రూ 54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్ చేసింది. ఈ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా గత ఏడాది మే 15న కార్తీని చెన్నైలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి రూ 305 కోట్ల నిధులు సమకూర్చేందుకు ఎఫ్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ లభించడంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ లభించేలా చేసినందుకు కార్తీ చిదంబరం రూ పది లక్షల ముడుపులు స్వీకరించారని ఆరోపించిన సీబీఐ ఆ తర్వాత ఆ మొత్తాన్ని 100 మిలియన్ డాలర్లుగా సవరించింది. -
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో మలుపు
-
కార్తీ బెయిల్‌పై సుప్రీంకు సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి కార్తీకి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను హైకోర్టు సరిగ్గ పరిశీలించలేదని ఆరోపిస్తూ ఇది కేసు విచారణను ప్రభావితం చేస్తుందని సీబీఐ పేర్కొంది. ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న క్రమంలో కార్తీ చిదంబరం బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ప్రోత్సహించడం సరైంది కాదని సీబీఐ తన అప్పీల్లో పేర్కొంది. కార్తీకి బెయిల్ మంజూరు చేసే క్రమంలో కోర్టు ఆయనపై ఉన్న అభియోగాల తీరు, ఆధారాలు, సాక్ష్యాలపై ప్రభావం చూపే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు వ్యవహరించిందని సీబీఐ ఆక్షేపించింది. మార్చి 23న ఢిల్లీ హైకోర్టు కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
కార్తీ చిదంబరానికి ఎదురు దెబ్బ?
-
కార్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో ఆయనపై ఈడీ తాజా చార్జిషీట్‌ను నమోదు చేసేందుకు సంసిద్ధమైంది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఎదుట తాజా అభియోగపత్రాన్ని ఈడీ నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌లో కార్తీ చిదంబరం సహా ఇతరుల పాత్రను ఈ చార్జిషీట్లో ఈడీ ప్రముఖంగా ప్రస్తావిస్తుందని సమాచారం. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని రెండు సార్లు ప్రశ్నించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ)2006లో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై కార్తీని ఈడీ ప్రశ్నించింది. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించిన కొద్దిరోజులకే కార్తీకి చెందిన సంస్థగా భావిస్తున్న ఏఎస్‌సీపీఎల్‌కు ఎయిర్‌సెల్ టెలివెంచర్స్ లిమిటెడ్ రూ 26 లక్షలు చెల్లించడంపై ఈడీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. కార్తీపై తాజా చార్జిషీట్ ఎప్పుడో దాఖలు కావాల్సి ఉందని, చిదంబరానికి సన్నిహితులైన అధికారులు ఆయనకు సాయపడేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈడీ, సీబీఐలపై ఎవరి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. -
తీహార్ జైలుకు కార్తీ
సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 24తేదీవరకు కార్తీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మూడు-రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత మరో15 రోజుల కస్టడీ కోరిన సీబీఐ ప్రతిపాదనకు కోర్టు నో చెప్పింది. అంతేకాదు కార్తీ ముందస్తు బెయిల్ పీటిషన్‌ను తోసిపుచ్చింది. జైలులో ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చి చెప్పింది. మార్చి 15కార్తీ బెయిల్ పీటిషన్‌ను విచారించనున్నట్టు తెలిపింది. అయితే భద్రతాకారణాల రీత్యా తనకు ప్రత్యేక సెల్ కేటాయించాలని కార్తీ అభ్యర్థించారు. 1995 లో బిస్కట్ బారన్ రాజన్ పిళ్ళై మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసిన కార్తీ చిదంబరం తాను అలా కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తనకు ఏమైనా జరగవచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేకగది, బాత్ రూం కావాలని కార్తీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ఇంటిలో వండిన ఆహారం, మందులు, కళ్లజోడు లాంటి కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థికమంత్రిగా తన తండ్రి చిదంరబం పనిచేసిన సమయంలో ఉగ్రవాద కేసులను నిర్వహించారని ఆయన వాదించారు. అయితే మందులు, కళ్లజోడుకు అంగీకారం తెలిపిన కోర్టు మిగిలినవాటిని తోసి పుచ్చింది. ఆయన భద్రతకు ఢోకాలేదని చెప్పింది. ఈ సమయంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కోర్టులో ఉన్నారు. కాగా యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధుల కోసం కుమారుడు కార్తీకి లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇంద్రాణీ ముఖర్జీ వాంగ్మూలం నేపథ్యంలో ఫిబ్రవరి 28 న చెన్నై విమానాశ్రయంలో కార్తీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.