Kavitha Kalvakuntla
-
HYD: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్ -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. ఆమెను కలిసిన తర్వాత కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. -
కవితకు బెయిల్? ఢిల్లీ హైకోర్టులో విచారణ
-
కవిత రిమాండ్ పొడిగింపు?
-
కవితకు బెయిల్‌పై 8న తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఈనెల 8వ తేదీ సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింíఘ్వీ, ఈడీ తరఫున జొహెబ్ హొస్సేన్‌లు వాదనలు వినిపించారు. తల్లి పర్యవేక్షణ అవసరం: సింఘ్వీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సింఘ్వీ పేర్కొన్నారు. తల్లి అరెస్టుతో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందిన పరిస్థితిని మనం చూడాలన్నారు. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు ప్రస్తావిస్తూ.. తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరని, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పారు. తల్లి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపారు. కవితకు బెయిల్ ఇచ్చినా ఈడీకి వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆమెను తిరిగి సుల భంగానే అదుపులోకి తీసుకోవచ్చని అన్నారు. తండ్రి ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తున్నారని కుమారుడు తెలంగాణలో ఉన్నారని సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో ప్రధాని ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాలు ఇస్తున్నారని, ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని వ్యాఖ్యానించారు. అన్నీ చూసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి: హొస్సేన్ సెక్షన్ 45 నిబంధనలు సింఘ్వీ నొక్కి చెబుతున్నారని, అయితే ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలికి అవి వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ అన్నారు. ఈ కేసులో లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలున్న ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నామని, ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారని వాదించారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ విషయం చెప్పడం లేదని, సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తన దగ్గర ఉన్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో నిరూపిస్తుందన్నారు. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారని, మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు నాశనం చేశారని ఆరోపించారు. ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నామని, తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని, ప్రజలను కూడా ఆమె ప్రభావితం చేస్తారన్నారు. సాక్షుల్ని పిలిచి వారి వారి వాంగ్మూలాలు మార్చుకోవాలని బెదిరించే అవకాశం ఉందంటూ హొస్సేన్ వాదించారు. ఈ దశలో కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరోసారి జోక్యం చేసుకొని కవిత కుమారుడికి 12 పేపర్లలో ఏడు పూర్తయ్యాయని భారతీయతలో తల్లి ఒకరే తగిన సాన్నిహిత్యాన్ని అందించగలరని తెలిపారు. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. -
మరోసారి కస్టడీనా.. బెయిలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ! కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు. కవితను కలసిన భర్త అనిల్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్‌రావు, పీఏ శరత్‌లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్‌రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు -
మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
-
ఎమ్మెల్సీ కవిత సోషల్‌మీడియా అకౌంట్స్ హ్యాక్!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు నా సోషల్ మీడయా ఖాతాల హ్యాకింగ్‌కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు’ అని ఆమె పేర్కొన్నారు. My social media account experienced a brief unauthorized access. The suspicious activities and contents during this time do not reflect our values. Security measures have been reinforced, and we will observe a downtime to ensure security and we appreciate your understanding as my… — Kavitha Kalvakuntla (@RaoKavitha) January 17, 2024 అయితే వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ.. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చదవండి: Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్ -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
-
పథకాల అమలులో కాలయాపన చేసే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హనుమకొండ: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. సంయమనం పాటించి, ఓపికతో ఉండాలని చెప్పారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు కవిత శనివారం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బస్సు ఫ్రీ విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు. చదవండి: ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండు మారదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుందని. అయితే ఎంక్వైరీ రిపోర్టు రాకముందే మంత్రులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కృషి చేయాలని తెలిపారు. కొత్త కార్ల విషయాన్నిప్రభుత్వం రహస్యంగానే ఉంచుతుందని చెప్పారు. భద్రత దృష్ట్యా సీక్రెట్‌గా ఉంచాలని ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రకారం ఈ విషయాలు రహస్యంగా ఉంచుతారని అన్నారు. ఎవరూ అధికారంలో ఉన్నా అదే పద్దతి ఉంటుందన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని పేర్కొన్నారు. దీన్ని పెద్ద అంశంగా చూపి వెటకారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుందని కవిత పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మిక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అందుకే AITUC మద్దతు ఇచ్చామని చెప్పారు. సింగరేణికి అనేక పనులు చేశామన్నా ఆమె.. ఆత్మ ప్రమోధానుసారం ఓటు వేయమని కోరినట్లు తెలిపారు. -
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
ప్రజలతో మాది పేగు బంధం.. కాంగ్రెస్‌ది చేదు బంధం: ఎమ్మెల్సీ కవిత
‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరిన క్రమంలో ప్రజల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆదరణ కనిపిస్తోంది. బీఆర్ఎస్కు ప్రజలతో ఉన్నది పేగు బంధం అయితే, కాంగ్రెస్‌తో ఉన్నది చేదు బంధం. కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో సృష్టించే అయోమయం, చెప్పే అబద్ధాల నడుమ బీఆర్ఎస్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. బీజేపీ గత ఎన్నికల్లోనూ 105 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఈసారి కూడా అంతకంటే గొప్పగా ఏమీ ఉండదు. కాంగ్రెస్ మాకు చాలా దూరంలో ఉన్నా ఎంతో కొంత పోటీనిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఆలోచన సరళి, అహంకారం, అజ్ఞానం గురించి ప్రజలకు విడమరిచి చెప్తున్నాం’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పదేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్యారంటీల పేరిట కాపీ కొట్టి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటోందని ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేస్తున్న విమర్శల సంగతేంటి? ప్రజాదరణ ఉన్న కేసీఆర్‌ను అందుకోలేని విపక్ష నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించేలా దిగజారి మాట్లాడుతున్నారు. కష్టపడేతత్వం లోపించిన విపక్షాలు ఏది పడితే అది మాట్లాడుతున్నాయి. తెలంగాణకు భౌగోళికంగా, రాజకీయంగా గుర్తింపు తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న వారు మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రజల గొంతు వినిపించి రాష్ట్రాన్ని, అనేక రక్షణలు తెచ్చామనే విషయాన్ని గమనించాలి. లక్ష సవాళ్లు, విష ప్రచారాలను ఛేదించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను గతంలో ప్రజలు దీవించారు. ఇప్పుడూ అదే జరుగుతుంది. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. మీ కష్టం ఎంత మేర ఫలిస్తుంది? కేసీఆర్ పెద్ద మనసుతో తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నా, అమలు చేసే శక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మాకు ఆత్మబంధువులు. సంపదను సృష్టించి తెలంగాణ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని పెట్టిన పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే 50 ఏళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను దూరదృష్టితో అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ది మాకు రెండు కళ్ల లాంటివి. మళ్లీ అధికారంలోకి వస్తే దిగువ, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. యువత విషయానికి వస్తే ఈ తరం చాలా తెలివైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పోలిస్తే కొత్త తరానికి సమాచారం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే బాగుంటుందనే విషయంలో కొత్త తరానికి స్పష్టత ఉంది. కేసీఆర్ కమిట్మెంట్ను వీరు గుర్తిస్తారు. మహిళా రిజర్వేషన్ చట్టంపై మీ తదుపరి కార్యాచరణ ఏంటి? 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా భారత జాగృతి తరఫున సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతాం. డిసెంబర్ 3 తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తాం. జాతీయ పార్టీల అగ్రనేతల ప్రచారం మీ పార్టీపై ప్రభావం చూపిందా? విపక్షాలకు పీఎంలు, సీఎంలు ఉంటే తెలంగాణకు కేసీఆర్ ఉన్నారు. కర్ణాటకలో బీజేపీ ఫెయిల్ కావడంతోనే కాంగ్రెస్ గెలిచింది. మా సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ నేతలు చెప్పడం లేదు. సీల్డ్ కవర్ సీఎంల చేతిలో రాష్ట్ర భవిష్యత్‌ను పెట్టలేము. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు, పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు. వ్యక్తిగత ప్రయోజనం తప్ప, ప్రజల కోసం పనిచేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయి. కేసీఆర్‌ను గెలిపించడంలో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. రైతుబంధును నిలిపివేయాలనే కాంగ్రెస్ ఫిర్యాదుపై ఏమంటారు? రైతు కష్టాలను తీర్చేందుకు రైతుబంధు అమలు చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ రైతుల నోటి ముందు ముద్దను లాక్కొంటున్నది. వీరికి రైతులు, ప్రజల విషయంలో ఎలాంటి పట్టింపు లేదు. -
కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత.. కార్యకర్తల్లో న్యూ జోష్..
-
ఏది ఫ్యామిలీ పాలిటిక్స్..ప్రియాంక గాంధీకి కవిత కౌంటర్
-
గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్సీ కవిత
-
కొన్నేళ్లుగా మహిళా బిల్లు కోసం పోరాడుతున్నాం: కవిత
-
పదేళ్లలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ మాట్లాడారా?
-
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు
-
ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియా గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళ బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం రోజున ఎక్స్ (ట్విట్టర్)లో కవిత పోస్ట్ చేశారు. చదవండి: ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం Saddened to see that the urgency for discussing Women's Reservation Bill was completely ignored in Congress Parliamentary Party Chairperson and MP Smt. Sonia Gandhi Ji's letter to the Prime Minister. Mrs. Gandhi Ji, the nation awaits your powerful advocacy for gender equality.… https://t.co/RHlQAbLPz8 — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2023 -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసుకొని బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం రోజున ఆమె రాసిన లేఖ అపూర్వ స్పందన లభించింది. కవిత రాసిన లేఖ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆవశ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఆమె లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల నాయకులు స్పందించారు కవిత విజ్ఞప్తిని అంగీకరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతిస్తామని ప్రకటించడమే కాకుండా కవిత చేస్తున్న కృషిని ప్రశంసించారు. కవిత లేఖపై ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు తక్షణమే స్పందించాయి. జాతీయ మీడియాలో కవిత లేఖపై తీవ్ర చర్చలు జరిగాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందిస్తూ... చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్ధతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీకి మహిళా బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ... మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. లేదంటే మరో 25 ఏళ్ల పాటు వాటి కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పారు.రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్ధతిస్తుందని చెప్పారు. సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా స్పందిస్తూ...తమ పార్టీ ఎప్పుడూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతుందని, మహిళలకు అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. మహిళా బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని అభినందించారు. తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ... తమ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోందని, అనేక సందర్భాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆ అంశాన్ని ప్రస్తావించారని వివరించారు. తమ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా బిల్లు కల్వకుంట్ల కవిత లేఖ రాశారని, తప్పకుండా మద్ధతిస్తామని స్పష్టం చేశారు. -
Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ?
దెబ్బ తిన్న చోటే పోరాడి గెలిచి చూపించాలన్నది సీఎం కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు స్థానానికి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. కవిత రాజకీయ భవితవ్యంపై అప్పట్లో ఓ రకంగా సంధిగ్దత నెలకొంది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మండలిలో అడుగు పెట్టారు కవిత. జగిత్యాల ? నిజామాబాద్ .?? గత రెండేళ్లుగా కవిత ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఒకటి నిజామాబాద్ అర్బన్ కాగా, మరొకటి జగిత్యాల. బతుకమ్మ వేడుకల నుంచి ప్రతీ చిన్న కార్యక్రమానికి ఈ రెండు చోట్ల కవిత హాజరు కావడంతో ఈ రెండింటిలో ఏదో ఒక చోట కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కూడా తనకు టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానాల్ని నిన్నటి వరకు కూడా వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంచి కవితకు టికెట్ ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే సీఎం కెసిఆర్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. తాజా జాబితాలో కవితకు చోటివ్వలేదు. Dumdaar Leader - Dhamakedaar Decision !! Our leader KCR Garu announced 115 exceptional candidates for the forthcoming Assembly elections out of 119 seats. It truly is a testament to the people's faith in CM KCR Garu's courageous leadership and the impactful governance of the… pic.twitter.com/G3czjqZeNK — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 మళ్లీ ఢిల్లీకే.! ఓడిన చోటే కవిత ఘనవిజయం సాధించాలన్నది కెసిఆర్ పట్టుదలగా కనిపిస్తోంది. నిజామాబాద్‌లో కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవడం కెసిఆర్ పొలిటికల్ కెరియర్లో ఇబ్బంది పడ్డ క్షణం. ఓ రకంగా రాజకీయంగా ఉద్ధండుడైన కెసిఆర్.. తన బిడ్డను గెలిపించుకోలేకపోయాడన్న ప్రచారం జరిగింది. టార్గెట్ పార్లమెంట్ 2024 ఎండాకాలంలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం కవితను సీఎం కెసిఆర్ సిద్ధం చేస్తున్నట్టు తాజా టికెట్ల ప్రకటనతో తేలింది. నిజామాబాద్ నుంచే కవితను బరిలో దించి ఘనవిజయం సాధించేలా అడుగులు కదపాలన్నది కెసిఆర్ వ్యూహాంగా కనిపిస్తోంది. The spirit of Telangana and the celebration of “Car and KCR Sarkar”! ✊🏻 This Padyatra today reflects on the tremendous energy and enthusiasm towards BRS Government led by CM KCR Garu. Jai Telangana! Jai KCR! pic.twitter.com/5dVkm3NaSJ — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 16, 2023 -
కుల, మతాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం: ఎమ్మెల్సీ కవిత
-
కరెంటు ఉందో లేదో ఒకసారి తీగలు పట్టుకొని చూడు..
-
వీజే సన్నీ 'సౌండ్ పార్టీ'.. పోస్టర్ రిలీజ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
వీజే సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంటర్టైన్ చేయనుందని టైటిల్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , చిత్రబృందానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. (ఇది చదవండి:83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ..' ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వస్తోన్న మొదటి సినిమా `సౌండ్ పార్టీ` పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత లాంఛ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన సౌండ్ పార్టీ టైటిల్‌కు రెస్పాన్స్ బాగా వచ్చింది. మా యూనిట్ అంతా ఎంతో శ్రమించి అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.'అని అన్నారు. హీరో వీజే సన్ని మాట్లాడుతూ...' ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయింది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగొచ్చింది' అన్నారు. దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ...'సౌండ్ పార్టీ' పోస్టర్‌ను కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని' అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!) -
నిజామాబాద్ అర్బన్ బరిలో ఎమ్మెల్సీ కవిత!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలు, టిక్కెట్ల ఆశావహులు కా ర్యాచరణను ముమ్మరం చేశారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఎంఐఎం సైతం నిర్ణయాత్మక ప్రాబల్యం కలిగి ఉన్నాయి. దీంతో పలుచోట్ల బహుముఖ పోటీ, కొన్ని చోట్ల త్రిముఖ, ద్విముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఆయా పార్టీలు ఏఏ స్థానాల్లో పోటీచేస్తే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయనే విషయమై లెక్కలు వేసుకుంటున్నాయి. నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్‌కు అవకాశాలు ఉండడంతో పార్టీల్లో గుబులు నెలకొంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎప్పటికప్పుడు వరుస సర్వేలు చేస్తూ ప్రజల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి పక్షం రోజులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోతుండడంతో వివిధ వర్గాల ప్రజల ఆలోచన సరళి అంతుబట్టడంలేదని పార్టీల నాయకులు చెబుతు న్నారు. దీంతో అన్నిరకాలుగా బలమైన అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, బీజేపీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బీఫారాలు కేటాయించే సమయంలోనూ జంపింగ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా అభ్యర్థులు తామున్న పార్టీలో ప్రయత్నాలు చేస్తూనే ఇతర పార్టీల కీలక నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలు సైతం తమకు గట్టి అభ్యర్థి లభించని పక్షంలో ప్రత్యర్థి పార్టీలో టిక్కెట్టు ఆశించి భంగపడిన గట్టి అభ్యర్థిని చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఆటు పార్టీలు, అటు అభ్యర్థులు ప్లాన్ ఏ,ప్లాన్ బీ, ప్లాన్ సీ అనేలా ముందుకు వెళుతున్నారు. ► నిజామాబాద్ రూరల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. అయితే ఆయన తన కుమారుడు, ధర్పల్లి జెడ్పీటీసీ జగన్‌ను నిలబెట్టేందుకు కేసీఆర్‌ను అడుగుతున్నారు. బీజేపీ నుంచి దినేశ్ కులాచారి అభ్యర్థిగా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి టిక్కెట్టు ఖ రారైనట్లు సమాచారం. ఈ టిక్కెట్టును పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి ఆశిస్తున్నారు. సినీ హీరో తన మేనల్లుడు నితిన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మళ్లీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ► బోధన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఉండగా ఈసారి టిక్కెట్టును ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాకు ఇస్తారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మేడపాటి ప్రకాష్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ► ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉ న్నారు. బీజేపీ నుంచి పార్టీలో ఇటీవల చేరిన పైడి రాకేష్‌రెడ్డి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రొద్దు టూరి వినయ్‌రెడ్డి బీజేపీ టిక్కెట్టు రేసులో ముందు న్నారు. కాంగ్రెస్ పార్టీ వినయ్‌రెడ్డిని చేర్చుకుని బరి లోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు, పలువురు రైతులు కోరుతుండడం గమనార్హం. ► బాల్కొండలో మంత్రి వేముల బీఆర్ఎస్ సిట్టింగ్గా ఉన్నారు. బీజేపీ నుంచి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి తగిన ఏర్పాట్లలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి టిక్కెట్టుకు గట్టి ప్ర యత్నాలు చేస్తున్నారు. అయితే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నెల 20న లేదా నెలాఖరులో సునీల్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా నడు స్తోంది. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ టిక్కెట్టు రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహే శ్ కుమార్‌గౌడ్‌కు టిక్కెట్టు ఖరారైనట్లు పార్టీ వర్గా ల్లో చర్చసాగుతోంది. ఈ టిక్కెట్టు కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నగర అ ధ్యక్షుడు కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సర్వేల మేరకే టిక్కెట్లు అని పీసీసీ నాయకత్వం ఇప్పటి కే ప్రకటించింది. ఈ స్థానం నుంచి ఎంఐఎం బరిలో ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంఐఎం తరుపున టిక్కెట్టు కోసం బొబ్బిలి నర్స య్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు షకీల్‌పాషా, మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్ ఫయీమ్, మాజీ కా ర్పొరేటర్ రఫత్‌ఖాన్ రేసులో ఉన్నారు. ఆయా పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను బట్టి ఓట్ల క్రాసింగ్ ఉండనుండడంతో నిజామాబాద్ అర్బన్ సీటు పై ప్రత్యేక రాజకీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆయా పార్టీల, అభ్యర్థుల పరిస్థితులను బట్టి ఫలితం తారుమారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బహుముఖ పోటీ ఉంటే ఓట్ల చీలిక తీవ్ర ప్రభావం చూపనుంది.