Kolkata High Court
-
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ నిరసన హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కోట్టివేసింది. ఈ క్రమంలో బెంగాల్ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ ఇది బెయిల్ ఇచ్చే కేసు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే విషయంలో విద్యార్థి నేత తల్లి దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తెలిపింది’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.‘‘చలో సెక్రటేరియట్’’ మార్చ్ నిర్వహించిన రోజు రాత్రి ఛత్ర సమాజ్ నిర్వాహకుల్లో ఒకరైన సయన్ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
కోల్‌కతా వైద్యురాలి కేసు : సందీప్ ఘోష్ ఇళ్లపై సీబీఐ దాడులు!
కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి దుర్ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆదివారం 15 ప్రాంతాల్లో సందీష్ ఘోష్ పాటు ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సందీప్ ఘోష్‌తో పాటు ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్,టాక్సాలజీ విభాగానికి చెందిన డాక్టర్ డెబాషిస్ సోమ్ ఇంటికి సైతం సీబీఐ అధికారులు వెళ్లారు.మూడురోజుల ముందు ఆర్జీకార్ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు, డెబాషిస్ సోమ్‌పై ఆరోపణలు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో శనివారం సందీప్ ఘోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సందీష్ ఘోష్ ఇల్లు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో చేస్తున్న తనిఖీలు కొనసాగుతున్నాయి. -
కోల్‌కతా హత్యోదంతం వేళ.. సందీప్ ఘోష్‌కు దీదీ రాసిన లేఖ వైరల్
కోల్‌కతా : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 30న ఆర్జీకార్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ లేఖతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్ ఘోష్ సైతం ఉన్నారని సమాచారం. ఇక ఆ లేఖపై దీదీని బీజేపీ టార్గెట్ చేసింది. సందీప్ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్జీకార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని, బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. ‘ఆర్జీ కార్ ఆసుపత్రిలో అవకతవకలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలగించలేదు. ప్రిన్సిపల్‌గా కొనసాగారు’ అని తిబ్రేవాల్ చెప్పారు.రాజీనామా అంతలోనే పోస్టింగ్ వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండురోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.సందీప్ ఘోష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఅదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సందీష్ ఘోష్ చుట్టు ఉచ్చు మరింత బిగిసేలా.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ కార్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు సైతం ఆగ్రహంఈ వారం ప్రారంభంలో అక్తర్ అలీ డాక్టర్ సందీష్ ఘోష్ మార్చురీలోని అనాధ శవాలతో వ్యాపారం చేశారని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సందీష్ ఘోష్‌ను విచారణకు ఆదేశించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ఎవరు టచ్‌లో ఉన్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు ఆలస్యం అయ్యింది?అని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు ప్రశ్నించింది. -
కోల్‌కతా డాక్టర్ కేసు : నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్!
కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం (ఆగస్ట్20న) సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోంది. రోజులు గడిచే కొద్ది రోజుకో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెపై సామూహికంగా దారుణం జరిగి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతదేహంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు తేలడంతో ఈ దారుణంలో తలెత్తుతున్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో రోజులు గడస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్ట్ 13న కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోల్‌కతా హైకోర్టను సీబీఐ కోరింది. తాజాగా అందుకు అంగీకరించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది. -
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 25 వేల మందికి పైగా ఉపాధ్యాయుల నియామకాల్ని రద్దు చేస్తూ ఇచ్చిన కోలకత్తా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సీబీఐ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని, అయితే అభ్యర్థులపై లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది.25 వేలకుపైగా ఉపాధ్యాయుల2016లో మమతాబెనర్జి ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 వేలకుపైగా ఉపాధ్యాయులను నియమించింది. స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ ద్వారా ఈ నియామకాలు చేపట్టింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కేసు కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ కోల్‌కతా హైకోర్టు ఆ నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. ఆ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు వారు అందుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.ప్రజల విశ్వాసం కోల్పోతేకోల్కతా హైకోర్టు తీర్పుపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవకతవకలు జరిగితే.. వ్యవస్థలో ఇంకేం మిగులుతుందని ప్రశ్నించింది. ప్రజల విశ్వాసం కోల్పోతే ఇంకేమీ మిగలదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర అధికారులను నిలదీసిన కోర్టుమొత్తం రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు కొత్త పోస్టులను ఎలా విడుదల చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను ఎలా నియమిస్తారంటూ రాష్ట్ర అధికారులను కోర్టు నిలదీసింది. సరైన రికార్డులు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌లు లేకపోవడంపై సుప్రీం కోర్టు సంబంధిత అధికారులను మందలించింది. -
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
‘సందేశ్‌ఖాలీ’ ఘటనలో కీలక పరిణామం
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫిబ్రవరి 29న సందేశ్‌ఖాలీ గ్రామంలో దుర్మార్గాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్‌ను పశ్చిమ్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సందేశ్‌ఖాలీలో ఏం జరిగింది? 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ పెద్ద ఎత్తున రేషన్ కుంబకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, షాజహాన్ షేక్ యథేచ్ఛగా స్థానికుల భూమల కబ్జాకు, దళిత మహిళలపై లైంగిక దాడులు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రేషన్ కుంబకోణం గురించి సీఎం మమతా బెనర్జీకి తెలిసినా పట్టించుకోలేదంటూ బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు తమ నిరసన గళం విప్పాయి. దీంతో పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయలో జగ్దీప్ ధన్‌ఖడ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2వేల మంది ప్రైవేట్ సైన్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో గత ఏడాది రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నించింది. ఆ సమయంలో రెండు వేల మంది షాజహాన్ షేక్ ప్రైవేట్ సైన్యం ఈడీ అధికారులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడంతో ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. సీబీఐ అదుపులో షాజహాన్ తమ్ముడు ఈడీ అధికారులపై జరిగిన దాడిపై షాజహాన్‌ను సీబీఐ అధికారులు విచారించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించారు. తాజాగా, షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్‌ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. -
'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్
సందేశ్‌ఖాలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ ప్రభుత్వం విముఖత చూపింది. ఇవాళ సాయంత్రం లోపు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర హైకోర్డు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది బెంగాల్ ప్రభుత్వం. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, జైదీప్ గుప్తా, గోపాల్ శంకరనారాయణన్ ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ముందు సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ చేసిన పిటిషన్ వేశారు. అయితే ఆ పత్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది బెంచ్. రేషన్ బియ్యానికి సంబంధించిన కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. ఈ ఘటన జరిగిన తరువాత షాజహాన్ పరారయ్యాడు. మరోవైపు షాజహాన్ దురాగతాలపై అప్పుడే వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. తమపై అత్యచారాలు జరుగుతున్నాయంటూ సందేశ్‌ఖాలీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సుమారు 50 రోజులకు పైగా పరారీలో ఉన్న షాజహాన్‌ను పోలీసులు ఫిబ్రవరి 29న అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు సామాన్యుడు కాదని.. ప్రజాప్రతినిధి అని.. దర్యాప్తు అనేది సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే తప్ప కేసుకు సంబంధించిన నిజాలను దాచి పెట్టడానికి కాదని చెబుతూ.. సిట్ ఏర్పాటును సైతం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు బెంగాల్ పోలీస్ శాఖను ఆదేశించింది. -
అనిల్ అంబానీకి అనుకూలంగా.. గెలుపు నాదే!
రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్‌కి భారీ ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) పై చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కోల్కత్తా హైకోర్టు డీవీసీ మధ్యవర్తిత్వం కింద అనిల్ అంబానీకి రూ.405 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీ కింద రూ.354 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా అనిల్ అంబానీ రూ.1,354 కోట్లను దక్కించుకోనున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే 10 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ వెస్ట్ బెంగాల్‌లోని రఘునాథ్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3,750 కోట్లతో థర్మల్ వపర్ ప్రాజెక్ట్ నిర్మించే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. అయితే, అన్వేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పట్టాలెక్కలేదు. దీనిపై ప్రభుత్వ సంస్థ అభ్యంతరం తెలిపింది. నష్టపరిహారం కింద తమకు కొంత చెల్లించాలని కోరింది. కోర్టు మెట్లెక్కిన అనిల్ అంబానీ దీంతో అనిల్ అంబానీ కోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. ఈ అంశంపై పలు దఫాలుగా కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కోల్కత్తా హైకోర్టు అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పిచ్చింది. తక్షణమే డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్కు రూ.405 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బ్యాంకు గ్యారెంటీ కింద మరో రూ.354 కోట్లు. మొత్తం రూ. 1,354 కోట్లు అనిల్ అంబానీ పొందనున్నారు. -
‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’కి భారీ ఊరట
ప్రముఖ దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ సంస్థకు భారీ ఊరట లభించింది. ‘రెడ్ లేబుల్ నేచురల్ కేర్ టీ’ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ హెచ్‌యూఎల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసును కోల్‌కతా హైకోర్టు కొట్టిపారేసింది. సంస్థ యాజమాన్యం నిర్ధోషులని తీర్పిచ్చింది. కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ హిందుస్థాన్ యూనిలివర్ సంస్థపై, ఆ కంపెనీ (ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు) యాజమాన్యం రెడ్ లేబుల్ టీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందంటూ క్రిమినల్ కేసు నమోదు చేశారు. హెచ్‌యూఎల్ సంస్థ ఆహార కల్తీ నిరోధక చట్టం సెక్షన్ 38, సెక్షన్ 39ని ఉల్లంఘించందని ఆరోపించారు. దీంతో తప్పుగా బ్రాండింగ్ చేస్తున్నందుకు హెచ్‌యూఎల్ ఉన్నతాధికారులు దోషులని మునిసిపల్ మేజిస్ట్రేట్ నిర్ధారించింది. రూ. 5,000 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ శిక్షను కోల్‌కతా జిల్లా కోర్టు (సెషన్స్ కోర్టు) కొట్టివేసింది. అయితే, తీర్పును మళ్లీ పరిశీలించాలని మున్సిపల్ మేజిస్ట్రేట్‌కు తిరిగి పంపించింది. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హిందుస్తాన్ యూనిలివర్ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీపై తప్పుడు ప్రచారం చేసిందనే మున్సిపల్ కార్పొరేషన్ అభిప్రాయంపై స్పందించింది. తప్పుడు ప్రచారం అంటూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నిరూపించడానికి ట్రయల్ కోర్టు (అప్పీలేట్ కోర్టు) ముందు కేఎంసీ విభాగం ఎప్పుడూ హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పైగా హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తిని ఎందుకు తప్పుగా బ్రాండ్ చేసిందనే కారణాల్ని వివరించలేదని కోర్టు తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్, ఆ సంస్థ అధికారులపై నమోదైన కేసులో సరైన ఆధారాలు లేవని జస్టిస్ సుభేందు సమంతా గుర్తించారు. కేసును కొట్టివేసి నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ తరఫున న్యాయవాదులు సబ్యసాచి బెనర్జీ, అనిర్బన్ దత్తా, అభిజిత్ చౌదరి, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ తరపున న్యాయవాదులు గౌతమ్ దిన్హా ,అనింద్యసుందర్ ఛటర్జీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇమ్రాన్ అలీ, దేబ్జానీ సాహులు తమ వాదనల్ని వినిపించారు. -
36 వేల టీచర్ల నియామకం రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఏడేళ్ల క్రితం ఉపాధ్యాయ నియా మక ప్రక్రియలో నిబంధనావళి ఉల్లంఘన ద్వారా ఉద్యోగాలు పొందిన 36వేల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 3 నెలల్లోపు ఆ పోస్టులను భర్తీచేయాలని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌ను జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ‘ఇంతటి అవినీతిని పశ్చిమబెంగాల్ లో ఏనాడూ చూడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన ప్రైమరీ టీచర్లు 4 నెలలపాటు విధుల్లో కొనసాగవచ్చు. అప్పటిదాకా పారా టీచర్ల స్థాయిలో తక్కువ జీతమే తీసుకోవాలి’ అని జడ్జి జస్టిస్ అభిజిత్ సూచించారు. ‘నాటి రాష్ట్ర ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, బోర్డ్ సభ్యులు ఈ నియామకాల ప్రక్రియను ఒక లోకల్ క్లబ్ మాదిరిగా మార్చే శారు’ అని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2016 నాటి బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కుంభకోణాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు విచారణచేపట్టిన విషయం విదితమే. ‘2016లో రిక్రూట్ అయిన 42,500 మందిలో 36వేల మంది ఆప్టిట్యూట్ పరీక్ష అర్హత లేకుండా, శిక్ష ణ లేకుండా ఉద్యోగాలు పొందారు. అందుకే వీరి నియామకం మాత్రమే రద్ద యింది’ అని ఓ న్యాయవాది చెప్పారు. చదవండి: కేరళలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో.. -
అత్యుత్తమ గణాంకాలు.. షమీపై సంచలన ఆరోపణలు! అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో
Mohammed Shami- Hasin Jahan: ఐపీఎల్-2023లో అదరగొడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీని వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. షమీ అరెస్టును అడ్డుకునే స్టేను ఎత్తివేయాలంటూ అతడి నుంచి విడిగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. కాగా స్త్రీ లోలుడు అంటూ మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ తమ కుమార్తెతో కలిసి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు నెలవారీ భరణంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ గతంలో కలకత్తా కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ ఊరట అయితే, న్యాయస్థానం మాత్రం షమీ ప్రతినెలా 1,30,000 రూపాయలు చెల్లిస్తే చాలంటూ క్రికెటర్‌కు ఊరటనిచ్చే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్.. మరోసారి షమీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా ‘‘మిస్టర్ షమీ దగ్గర వ్యక్తిగత అవసరాల కోసం +4........6 నంబర్‌తో సెకండ్ మొబైల్ ఫోన్ ఉండేది. ఈ డివైజ్‌ను ఉపయోగించి అతడు తన వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడు. పడుపు వృత్తి చేసుకుని బతికేవాళ్లతో టచ్‌లో ఉండేవాడు. ఈ ఫోన్‌ను కోల్‌కతాలోని లాల్ బజార్ పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే, షమీ ఇప్పుడు కూడా తన లైంగిక అవసరాల కోసం యథేచ్ఛగా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు’’ అని హసీన్ జహాన్ పిటిషన్లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అదే విధంగా వరకట్నం కోసం షమీ తనను వేధించాడని హసీన్ ఆరోపించినట్లు సమాచారం. అతడిని అరెస్టు చేయాలి! అంతేగాక.. టీమిండియాతో విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు సైతం షమీ అక్కడి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునేవాడంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తి నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడని వెంటనే అతడిని అరెస్టు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని ఆమె అత్యుత్తమ న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023లో అత్యుత్తమంగా ఈ మేరకు షమీ అరెస్టుకు వ్యతిరేకంగా కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా గతంలో షమీ అరెస్టుకై హసీన్ పిటిషన్ దాఖలు చేయగా వెస్ట్ బెంగాల్ సెషన్స్ కోర్టు అందుకు సానుకూలంగా స్పందించింది. అయితే, షమీ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్‌పై స్టే విధించింది. అయితే, ఇప్పుడు ఆ ఆదేశాలను సవాలు చేస్తూ హసీన్ సుప్రీంను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు షమీ. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ క్రమంలో అదేరోజు అతడికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయి..! కోహ్లి, గంభీర్‌లను సస్పెండ్ చేసి పాడేయండి.. ఓవరాక్షన్ ఎక్కువైంది..! -
West Bengal Post Poll Violance: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఇద్దరు నిందితుల పేర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో సీబీఐ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. తీవ్రమైన నేరాల దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన తర్వాత ఇదే మొదటి ఛార్జ్‌షీట్ అని అధికార వర్గాలు తెలిపాయి. రాంపూర్హాట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో బీజేపీ కార్యకర్త హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితుల పేర్లు చేర్చారు. కాగా ఆగస్టు 19న కోల్‌కతా హైకోర్టు హత్య, అత్యాచారం కేసులను సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. చదవండి: రూ.23 లక్షల కోట్లు ఏమయ్యాయి?: రాహుల్ గాంధీ కేసులపై సీబీఐ దర్యాప్తును ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీజేపీ కార్యకర్తలపై హత్య, ఇతర దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై మొత్తం 34 ఎఫ్ఐఆర్లను దాఖలు చేసింది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సీబీఐ అధికారుల బృందం నగరంలోని కంకుర్గాచి ప్రాంతంలో మరో బీజేపీ పార్టీ కార్యకర్త హత్యకు పాల్పడిన నిందితులను విచారించడానికి ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌ని సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
కలకత్తా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
-
హై కోర్ట్ తీర్పు పై తృణముల్ కాంగ్రెస్ అసంతృప్తి
-
బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్
-
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించాలని కోల్కత్తా హైకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యాచారం, హత్య కేసులన్నీ సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో సిట్, సీబీఐ తమకు నివేదిక అందించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మద్ధతుదారులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అదే విధంగా బీజేపీ సానుభూతిపరులపై హింసకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను గవర్నర్ పర్యటించి కేంద్రానికి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో భారీస్థాయిలో ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకుందని నివేదికలో వెల్లడైంది. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ. 5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు. -
‘నన్ను కొట్టారు.. నా దుస్తులు చించేశారు’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవహక్కుల కమిషన్ విచారిస్తుంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో టీఎంసీ కార్యకర్తలు తమను ఎలా చిత్రహింసలకు గురి చేశారో బాధితులు ఇండియాటుడేకి వెల్లడించారు. ఫలితాల అనంతరం టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్లు, దుకాణాల మీద పడి దాడి చేశారని.. విచక్షణా రహితంగా కొట్టారని తెలిపారు. వారికి భయపడి చాలామంది ఇప్పటికి ఇళ్లకు రావడం లేదన్నారు. రాఖీ రావంత్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘మే 2 ఆదివారం నాడు ఫలితాలు వెల్లడైన అనంతరం టీఎంసీ కార్యకర్తలు మా ఇంటి మీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చితకబాది.. నా బట్టలు చించేశారు. అంతటితో ఆగక నన్ను అసభ్యకరంగా తాకుతూ.. తెల్లవారేసరికి ఊరు విడిచి వెళ్లాలని.. లేదంటే అదే మాకు చివరి రాత్రని హెచ్చరించారు. సోమవారం ఉదయం మరోసారి వచ్చి నా పిల్లల్ని కొట్టారు. ఊరు విడిచి పోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు. వారి భయంతో మేం వేరే గ్రామానికి వెళ్లాం. ఆ తర్వాత పోలీసులు సెక్యూరిటీ కల్పించడంతో తిరిగి మా ఇంటికి వచ్చాం’’ అని తెలిపింది. మరో బాధితురాలు మాముని సాహా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు మార్చిలో టీఎంసీ కార్యకర్తలు 10 కేజీల చికెన్ కొట్టాల్సిందిగా ఆదేశించారు. డబ్బులు అడిగితే లేవన్నారు. దాంతో మేం చికెన్ ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఫలితాల తర్వాత మా ఇంటి మీద దాడి చేశారు. కోళ్లఫారానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. మా ఇంటి ముందు బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నన్ను నా భర్తను కొట్టారు’’ అని తెలిపింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్హెచ్ఆర్సీని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను రీకాల్ చేయాలంటూ బెంగాల్ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. చదవండి: దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా -
హైకోర్టులో మమతకు చుక్కెదురు
కోల్‌కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్హెచ్ఆర్సీని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను రీకాల్ చేయాలంటూ బెంగాల్ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. కాగా, హైకోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా కేసుల విచారణకు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా ఓ కమిటీని ఏర్పాటుచేసినట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
నారద కేసు: టీఎంసీ నేతలకు ఊరట
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో నలుగురు టీఎంసీ నేతలకు కలకత్తా హైకోర్టు శుక్రవారం తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. రూ.2 లక్షలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. టీఎంసీ నేతలు ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీ, సోవన్ ఛటర్జీలను మే 17న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి వీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన కోర్టు.. నిబంధనలు ఉల్లఘింస్తే బెయిల్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక కేసుకు సంబంధించి కోర్టుకు ఏమైనా అవసరం వస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దర్యాప్తులో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే సంస్థకు వ్యాపార ప్రయోజనాలు కల్పించేందుకు వీరు నగదును తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపించారు. స్టింగ్ ఆపరేషన్ చేయడం కోసమే ఈ కల్పిత సంస్థను శామ్యూల్ సృష్టించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినవారిలో ముకుల్ రాయ్, సౌగత రాయ్, కకోలీ ఘోష్ దస్తిదార్, ప్రసూన్ బెనర్జీ, సువేందు అధికారి, అపరుప పొద్దార్, సుల్తాన్ అహ్మద్, మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఇక్బాల్ అహ్మద్, షంకు దేబ్ పాండా సహా ఐపీఎస్ అధికారి హెచ్ఎంఎస్ మీర్జా ఉన్నారు. చదవండి: నారద కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలి: సీబీఐ నారదా స్టింగ్ ఆపరేషన్: మంత్రులకు బెయిల్ -
చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే హక్కు
కోల్‌కతా : చనిపోయిన భర్త వీర్యంపై పూర్తి హక్కులు విధవరాలైన భార్యకు మాత్రమే ఉంటాయని కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తుది తీర్పును వెలువరించింది. 2020 మార్చిలో ఓ తండ్రి.. ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో దాచిన చనిపోయిన కుమారుడి తాలూకూ వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ వీర్యం ధ్వంసమైనా లేదా నిరుపయోగమైనా తమ వంశం నాశనం అవుతుందని పిటిషన్లో పేర్కొన్నాడు. జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య జనవరి 19న దీనిపై విచారణ చేపట్టారు. ‘‘ తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నంత మాత్రాన పిటిషనర్( చనిపోయిన వ్యక్తి తండ్రి) వీర్యాన్ని పొందటానిక ఎలాంటి ప్రాథమిక హక్కులను కలిగిలేరు. చనిపోయిన వ్యక్తి వీర్యం కేవలం అతడి భార్యకు మాత్రమే సొంతం. ఆమెకు మాత్రమే దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ విషయంలో కోర్టు ఆమెను ఏ విధంగానూ ఆదేశించలేదు’’ అని స్పష్టం చేశారు. ( ఈ సమయంలో పేమెంట్స్ చేయొద్దు ) కాగా, కోల్‌కతాకు చెందిన పిటిషనర్ కుమారుడు తలసేమియాతో బాధపడేవాడు. ఢిల్లీ హాస్పిటల్లో ఇందుకు చికిత్స కూడా తీసుకునేవాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2018లో అతడు మరణించాడు. అయితే మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచారు. ఈ నేపథ్యంలో స్పెర్మ్ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పందకాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్ బ్యాంక్.. వీర్యాన్ని అతడి భార్య గర్బం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం వాడాలన్నా.. పాడేయాలన్నా అది కేవలం భార్య అనుమతితోటే సాధ్యమవుతుందని తెలిపింది. దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వవల్సిందిగా కోరారు. ఇందుకు ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. -
'షమీ భార్యకు భద్రత కల్పించండి'
కోల్‌కత : టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్ జహాన్‌కు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగ్గా.. హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వివాదం రేపింది. దీనిపై సోషల్ మీడియా కొందరి నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని.. తన కూతురుకు,తనకు ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా) తాజాగా కలకత్తా హైకోర్టు మంగళవారం హసీన్ పిటీషన్‌ను పరీశీలించింది. హసీన్ తరపు లాయర్ ఆశిష్ చక్రవర్తి.. ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన బెదిరింపులతో పాటు పోలీసులకు అందించిన ఫిర్యాదును రిపోర్టు రూపంలో కోర్టుకు సమర్పించారు. హసీన్ తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కాగా సీనియర్ న్యాయవాది అమితేష్ బెనర్జీ చక్రవర్తి వాదనలను తోసిపుచ్చుతూ.. హసీన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ దేబాంగ్సు బసక్.. హసీన్ జహాన్ ఆస్తికి, ఆమె జీవితానికి ఎటువంటి హాని జరగకుండా రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ మంగళవారం తెలిపారు. అంతేగాక హసీన్ ఫిర్యాదుతో తీసుకున్న చర్యలను రిపోర్టు రూపంలో కోర్టుకు అందించాలంటూ పోలీసులను ఆదేశించింది. కాగా కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు అనంతరం జస్టిస్ పేర్కొన్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఆడేందుకు దుబాయ్‌లో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున షమీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. (చదవండి : మాకు రక్షణ కల్పించండి: షమీ భార్య) -
మైలార్డ్ అనకండి.. ‘సర్’ చాలు
కోల్‌కతా: ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాక్రిష్ణన్ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్’ అనే సంబోధించాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్’అని సంభోదించాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు. (హైకోర్టు జడ్జికి కరోనా రావాలి: లాయర్) -
జడ్జికి కరోనా రానూ: లాయర్ శాపనార్థం
కోల్‌కతా: తనకు అనుకూలంగా తీర్పు రాలేదన్న కోపంతో జడ్జికి కరోనా వైరస్ సోకాలంటూ ఓ న్యాయవాది శపించిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.. కరోనా విజృంభిస్తున్న వేళ కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా న్యాయవాది బిజోయ్, బ్యాంకుకు లోన్ చెల్లించిని వ్యవహారంలో ఓ పిటిషనర్ తరపున కేసు వాదిస్తున్నారు. అయితే లోన్ చెల్లించకపోవడంతో పిటిషనర్‌కు చెందిన బస్సును జనవరి 15న బ్యాంకు వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సదరు వ్యక్తి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇప్పుడు దీన్ని అత్యవసర విషయంగా పరిగణించి విచారణ చేపట్టలేమని, వేసవి సెలవుల అనంతరం విచారణ జరుపుతామని న్యాయమూర్తి దీపంకర్ దత్తా ఆదేశాలు ఇస్తున్నారు. (బాధితుల కోసం వెళ్తే.. లాయర్ అరెస్టు) ఈ సమయంలో కోపం కట్టలు తెంచుకున్న లాయర్ బిజోయ్ మైక్రోఫోన్‌ను విసిరికొట్టడమే కాక ఎదురుగా ఉన్న టేబుల్‌పై గట్టిగా చరుస్తూ అతనికి అంతరాయం కలిగించారు. పైపెచ్చు జడ్జికి కరోనా సోకుతుందంటూ శాపనార్థం పెట్టారు. దీంతో షాక్‌కు గురైన జస్టిస్ దత్తా వెంటనే తేరుకుని కోర్టు ధిక్కారం కింద సదరు న్యాయవాదిపై చర్యలకు ఆదేశించారు. న్యాయవాది మాటల వల్ల తన భవిష్యత్తు గురించి భయపడట్లేదని, కోర్టు ప్రాధాన్యతే తనకు అన్నింటికన్నా ముఖ్యమైన అంశమని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. (వీడియో కాన్ఫరెన్సింగ్)