Krishnapatnam port
-
కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
-
పోర్టు సిబ్బందిపై సోమిరెడ్డి దాడి
సాక్షి ప్రతినిధి నెల్లూరు/ముత్తుకూరు: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాడికి తెగబడిన వైనం కలకలం రేపింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునద్ధరణ పనులపై యాజమాన్యంతో చర్చించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమవారం తన అనుచరులతో వెళ్లారు. పోర్టు ప్రధానద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ డీజీఎం ఎమ్మెల్యే కారుతోపాటు కొన్ని వాహనాలను లోనికి అనుమతించారు. మిగిలిన వాహనాలను తనిఖీచేయాలని నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన సోమిరెడ్డి కారునుంచి దిగివచ్చి కోపంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో తిట్లదండకం అందుకున్నారు. సెక్యూరిటీ డీజీఎంపై దాడికి తెగబడి ఆయన్ని వెనక్కి నెట్టివేశారు. తనకు జరిగిన అవమానాన్ని పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసకువెళ్లే క్రమంలో పోలీసులు, నాయకులు డీజీఎంను వారించారు. ఇదే అంశంపై పోర్టు అడ్మిన్ భవనం వద్ద కూడా సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.సీఈఓతోనూ దురుసు ప్రవర్తనఎన్నికలముందు పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలను పునరుద్ధరిస్తామని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటివరకు పోర్టు యాజమాన్యంతో చర్చలు జరపకపోవడం, కార్యాచరణ చేపట్టకపోవడంతో సీఐటీయూ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి అఖిలపక్షం పేరుతో పోర్టు అధికారులతో మాట్లాడేందుకు సోమవారం వెళ్లిన సోమిరెడ్డి పోర్టు కార్యాలయంలోకి వెళ్లి సీఈఓతోనూ వాగ్వాదానికి దిగారు. ఆయనతో దురుసుగా ప్రవర్తిస్తూ కేకలు వేశారు. ఖండించిన కాకాణి కృష్ణపట్నం పోర్టులో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేయిచేసుకోవడాన్ని మాజీమంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డి అఖిలపక్షం పేరిట డ్రామాలు ఆడుతూ, కూటమి పార్టీల నేతలను పోర్టుకు తీసుకెళ్లడం ఏమిటని నిలదీశారు. అత్యంత భద్రత ఉండే ప్రధానమైన పోర్టులో తనిఖీచేసి వాహనాలను అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినకుండా దాడి చేశారన్నారు. పోర్టు కార్యాలయంలోనూ సోమిరెడ్డి కేకలు వేసి సీఈఓతో దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు. ఎమ్మెల్యే వీధిరౌడీలా మారి నేరుగా దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. -
వీడియో: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జన్యం..
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సోమిరెడ్డి ప్రతీ చోటా దుసురుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి కృష్ణ పోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి కొట్టేందుకు ప్రయత్నించారు.వివరాల ప్రకారం.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సోమవారం పోర్టు వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. తనతో వచ్చిన ఓ కారును అనుమతించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో, వెంటనే కారు దిగి.. సెక్యూరిటీపై తన ఆధిపత్యం చూపించారు. సెక్యూరిటీని నెట్టేసి.. అతడికి కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రౌడియిజంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. అదాని పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి అక్కడి సెక్యూరిటీపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటు. రౌడీయిజం చేసి పరిశ్రమలను వెళ్లగొట్టాలని సోమిరెడ్డి కుట్రలు చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలను బెదరగొట్టి సోమిరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారు. గత పది ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రౌడీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
కృష్ణపట్నం పోర్టుపై అనవసర రాజకీయం చేస్తున్నారు: కాకాణి
-
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎల్లో మీడియా పని
-
KP Port: అదంతా ఎల్లో మీడియా సృష్టే: మంత్రి కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఎల్లో మీడియా, టీడీపీపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. కృష్ణపట్నం పోర్టు టెర్నినల్‌పై ఎల్లో దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు. కాగా, మంత్రి కాకాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ కొత్త ఫేక్ ప్రచారానికి తెరలేపింది. కేపీ పోర్ట్ తరలి పోతుందని ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు, కేపీ పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చింది. కొత్త వ్యాపారంతో ఏపీకి ఆదాయం వస్తోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే, అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి ప్రచారం చేస్తున్నారు. పోర్టు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయ. కానీ, పోర్టు పురోగతికి ఎలాంటి ఢోకా లేదు. కేపీ పోర్టులో ఎలాంటి సర్వీసులు రద్దు కాలేదు. ఎక్కడికి తరలిపోలేదు. పోర్టు ఎలాంటి సర్వీస్ కూడా తొలగించలేదు. గతంలో పవర్ పొల్యూషన్‌పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్ముక్కయ్యారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’
ముత్తుకూరు: గంగపుత్రుల సంక్షేమం కోసమే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పరిశీలించడానికి ఆయన శనివారం చెన్నై నుంచి ప్రత్యేక నౌకలో నెల్లూరు జిల్లాలోని అదాని కృష్ణపట్నం పోర్టుకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పోర్టు సీఈవో జీజే రావు స్వాగతం పలికారు. రూపాల పోర్టులో పర్యటించి అక్కడ జరుగుతోన్న అభివృద్ధి, ఎగుమతి దిగుమతుల వివరాలను తెలుసుకున్నారు. సముద్రతీర ప్రాంతంలో ఫిషింగ్ జెట్టీల నిర్మాణాన్ని చేపట్టినట్టు మంత్రి కాకాణి ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మత్స్యకార భరోసాపై మంత్రి అప్పలరాజు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందు ఎంపీ బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిçషనర్ కన్నబాబు, ఎంపీ జీవీఎల్‌తో కలిసి కృష్ణపట్నం ఆర్కాట్పాళెంలోని మత్స్యకార గ్రామాలను రూపాల సందర్శించారు. -
ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!
పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్ నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ అకాల మరణం నాన్ ఫిషర్మెన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు. నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. నాకు నాన్‌ఫిషర్‌మెన్ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు. – కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు. – సుబ్బరాయుడు, దొరవులపాళెం కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు. -
విద్యుత్ రంగంలో మరో ముందడుగు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యుత్ రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో నిర్మించిన 3వ యూనిట్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల ఖాతాల్లో మత్స్యకారేతర పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును మీ అందరి సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (నాన్న గారు) 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ పవర్‌స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత శ్రీకారం చుట్టగా, నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దానిని ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాణ్యమైన, నిరంతర విద్యుత్ ►రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ►మననందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు రూ.3,200 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేశాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ►ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది. భూములిచ్చిన రైతులకు అభివాదం ► ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్లాంటు.. ఈ రెండూ ఈ ప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నా. ► వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను ఈ నవంబర్ పూర్తయ్యేలోగా ప్రారంభించాలని ఆదేశించాం. నెరవేరిన మరో ఎన్నికల హామీ ► ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఎన్నికల వేళ ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడుకు మేమంతా గుర్తుకు వస్తామని ఆ రోజు మీరందరూ చెప్పారు. ► ఆయన ఐదేళ్ల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మీ అందరి కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు నేను చెప్పాను. ► ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్ల పరిహారాన్ని వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఆ వేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకు మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా, మిగిలిపోయిన 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ, అందరికీ ఈ ప్యాకేజీ ఇస్తున్నాం. ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే ► నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరిక మేరకు ఈ కాజ్వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా. ► ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా అడుగుతున్నా, పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే నీటిని ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్‌నూ ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ప్రారంభించిన నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీ ► ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి కోసం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. మరో హైలెవల్ బ్రిడ్జి.. నెల్లూరు నక్కలవాగు – కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు (వయా బ్రహ్మదేవం) వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నా. ► ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మనం గర్వించాల్సిన రోజు మనం నిజంగా గర్వించాల్సిన రోజిది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ కోసం ప్రతి వాగ్దానం చేయడం, అమలు చేయకపోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తామని, వైఎస్సార్సీపీ వారిని పక్కనపెట్టండని చెప్పి.. ఎవరికీ ఇవ్వలేదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో కేవలం 7 పంచాయతీలు మాత్రమే ప్యాకేజీకి ఎంపిక చేశారు. మన ప్రభుత్వం 20 పంచాయతీలతో పాటు, పోర్టుకు, థర్మల్ విద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ రూ.36 కోట్ల ప్యాకేజీ ఇస్తోంది. జగనన్న ఏమి అడిగినా ఇస్తున్నారు. ఉప్పుకాలవ మీద రూ.12 కోట్లతో బ్రిడ్జి, కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ.9.40 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయాలని అడుగుతున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 3వ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ స్టేషన్ దేశంలోనే మొదటిది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అడ్డగోలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో చంద్రబాబు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాల్లోకి తోశారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ట్రాన్స్‌కో అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో ఎన్నో చర్యలు తీసుకున్నారు. రూ.40 వేల కోట్ల ఆర్థిక సాయంతో డిస్కంల ఆదుకుంటున్నారు. ఇవాళ మనం 45 శాతం విద్యుత్‌ను జెన్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా పలు విధాలా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయం దు్రష్పచారం చేస్తోంది. నిత్యం అసత్యాలు వల్లించే ఈ పచ్చ పత్రికలు చదవద్దని, పచ్చ టీవీలు చూడద్దని విజ్ఞప్తి చేస్తున్నా. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
ఇక వేగంగా సరకు రవాణా
సాక్షి, అమరావతి: పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాన్ని సరకు రవాణాకు (లాజిస్టిక్‌కు) కేంద్ర బిందువుగా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పోర్టులను అనుసంధానిస్తూ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఆరు రహదారులకు కేంద్రం ఆమోదం తెలపగా, తాజాగా కృష్ణపట్నం పోర్టును అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారులకు ఆమోదం లభించింది. రూ. 2,308.31 కోట్ల అంచనాతో వీటి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి తూర్పు కానుపూరు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తారు. తద్వారా కృష్ణపట్నం పోర్టును నాయుడుపేటతో అనుసంధానిస్తారు. మొత్తం 34.88 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,398.84 కోట్లు ఖర్చవుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ రహదారి. రెండోది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని చిలకూరు క్రాస్ నుంచి తూర్పు కానుపూరు వరకు నిర్మిస్తారు. ఇది నాలుగు లేన్ల రహదారి. కృష్ణపట్నం పోర్టు దక్షిణ గేటు నుంచి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నిర్మించే ఈ మార్గం గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు, అప్రోచ్ రోడ్లతో సహా మొత్తం 36.05 కి.మీ. ఉంటుంది. రూ.909.47 కోట్లతో దీనిని నిర్మిస్తారు. వీటికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. 2024 జనవరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 13 రహదారులకు ప్రతిపాదన ఆగ్నేయాసియా దేశాలతో సరకు రవాణాకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఈ మూడు పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ 277 కిలోమీటర్ల మేర 13 రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపింది. సీఎం వైఎస్ జగన్ 2019లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మూడు పోర్టుల అనుసంధానానికి 8 రహదారులకు ఆమోదం తెలిపింది. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఈ రెండు రహదారులతో కృష్ణపట్నం పోర్టు నుంచి వాహనాలు చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి సులువుగా చేరుకోవచ్చు. దాంతో పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు మరింత వేగం పుంజుకుంటాయి. ప్రధానంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇప్పటికే ఎస్పీఆర్ఎస్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్ఈజెడ్లలో తయారీ పరిశ్రమలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పరిశ్రమల నుంచి సరకు రవాణాకు ఈ రహదారులు మరింతగా తోడ్పడతాయి. మరోవైపు కృష్ణపట్నం పోర్టు ద్వారా తూర్పు కర్ణాటక ప్రాంతానికి సరకు రవాణా మరింతగా పెరుగుతుంది. దాంతో రాయలసీమ లాజిస్టిక్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
CM YS Jagan: బొగ్గు కొరత రానివ్వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించడానికి సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్‌లోగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ (పీహెచ్‌ఎస్‌పీపీ)పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం అన్ని రకాలుగా ప్రయత్నం.. ► కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండటం వల్ల ఓడల ద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్ స్వాపింగ్ (ఇచ్చిపుచ్చుకోవడం) లాంటి వినూత్న ఆలోచనలు అమలు చేయాలి. ► విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. మీటర్ల ఏర్పాటుపై రైతులకు లేఖలు ► వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు కోసం రైతులకు లేఖలు రాయాలి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో, దానివల్ల రైతులకు జరిగిన మేలేంటో కూడా వివరించాలి. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియాజేయాలి. ► మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటుందనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి. ► ఈ సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్కాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి, డిస్కంల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మా జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోగా టెండర్లు ► పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్నారు. ► ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌లోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(పీఎస్పీ)లపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ► కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ యూనిట్–3 సెప్టెంబర్ నుంచి, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజ్ 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. -
కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సహకరిస్తాం
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు లోడింగ్, ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించారు. మెస్సర్స్ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్ అభివృద్ధి అవకాశాలపై రైల్వే జీఎం శనివారం చర్చించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర ముఖ్యాంశాలను రైల్వే జీఎంకు పోర్టు అధికారులు వివరించారు. పోర్టు వద్ద కోస్టల్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రైల్వే జీఎం అక్కడ మొక్కలను నాటారు. అనంతరం కృష్ణపట్నం స్టేషన్ – విజయవాడ సెక్షన్ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి పలు రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. గూడూరు–విజయవాడ సెక్షన్ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం లేదు రైల్వే అధికారులు టెక్నాలజీని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం లేదని, దానికితోడు క్రమశిక్షణతో కూడిన విధులు లేవని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అసహనం వ్యక్తం చేశారు. జీఎం తన పర్యటనలో భాగంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారంపై ఉన్న ఆహారం, పండ్ల రసం స్టాల్స్‌ను తనిఖీ చేసి అక్కడి విక్రయదారులతో మాట్లాడారు. విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని జీఎం అడిగిన ప్రశ్నకు ఓ కూల్‌డ్రింక్ షాపు యజమాని సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టడంతో.. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేయిస్తుంటే ఏమి చేస్తున్నారని కమర్షియల్ రైల్వే విభాగం అధికారులను జీఎం నిలదీశారు. రైల్వే ఆస్పత్రిలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం, రైల్వేస్టేషన్‌లోని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌లోనూ సాంకేతిక సమస్యలు ఉండటం గుర్తించిన జీఎం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతున్నారని, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే జీఎం పర్యటనలో విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ శివేంద్రమోహన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి
ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు. ఈ బియ్యం బస్తాలను ఈస్ట్ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్ ఆఫ్రికాలోని బెనిన్ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. -
గంగవరం పోర్టులో.. ప్రభుత్వ వాటా ఉపసంహరణపై పిల్
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై దర్యాప్తు జరిపేలా ఏపీ లోకాయుక్తను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రొప్రయిటీ ఆడిట్ కూడా నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన డాక్టర్ వైజా సత్యభూపాల్‌రెడ్డి, బొంత పూర్ణచంద్రారెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాల విక్రయం, కృష్ణపట్నం పోర్టు స్వాధీనం తదితరాల వ్యవహారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని తెలిపారు. వాటాల విక్రయ వ్యవహారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని, అందుకు సంబంధించిన జీఓలను సైతం అందుబాటులో లేకుండా చేసిందని చెప్పారు. వాటాల ఉపసంహరణకు అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానించి ఉంటే మరింత ఆదాయం ప్రభుత్వానికి వచ్చి ఉండేదన్నారు. లబ్ధిదారులను ప్రతివాదులుగా చేర్చాలి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధిదారులుగా ఉన్న కంపెనీలను ప్రతివాదులుగా చేయలేదన్నారు. వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే వాటాల ఉపసంహరణ జరిగిందని చెప్పారు. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
ఆనందయ్య మందుకు ‘ఆయుష్’ అంగీకారం
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్‌కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
సముద్రంలో చెన్నై పడవకు అగ్ని ప్రమాదం!
ముత్తుకూరు: చెన్నై హార్బర్ నుంచి గురువారం 10 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్(ఐఎస్‌జీఎస్) వెంటనే సముద్రంలోకి వెళ్లి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసి, ఆర్పివేశారు. ఐఎస్‌జీఎస్ అధికారుల కథనం ప్రకారం..చెన్నై కాసిమేడుకు చెందిన 10 మంది మత్స్యకారులు మరపడవలో చేపల వేటకు బయలు దేరారు. కృష్ణపట్నం పోర్టుకు సుమారు 12.5 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ మరపడవలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు పడవను చుట్టు ముట్టాయి. ఇందులోని మత్స్యకారులంతా నీటిలోకి దూకి, మరో పడవలోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెన్నైలోని ‘మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్’ ద్వారా ఈ ప్రమాద విషయం కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్ కు చేరింది. ఐఎస్‌జీఎస్ సీ–449 నౌక ద్వారా కోస్టుగార్డులు సముద్రంలోకి వెళ్లి, పడవ నుంచి వెలువడే మంటలను ఆర్పివేశారు. వీరికి సహాయంగా చెన్నై నుంచి ఐఎస్‌జీఎస్ సీ–436 నౌక ప్రమాద స్థలికి చేరింది. అతికష్టంపై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
ముత్తుకూరు: ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. మందు పేరు ‘ఔషధ చక్రం’ తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు. సోమిరెడ్డి విమర్శలు సరికాదు: ఆనందయ్య నెల్లూరు(సెంట్రల్): కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్సైట్ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు. తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు/నెల్లూరు (సెంట్రల్): కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మందును భారీగా తయారుచేసి 13 జిల్లాలకు పంపి కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. మందు తయారీ, పంపిణీ క్యాంపును కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ కోసం ఒక బ్లాక్ కేటాయించారు. భారీ గ్రైండర్, వంటపాత్రలు, మందు తయారీకి దినుసులను సమకూరుస్తున్నారు. 60 వేలమందికి సరిపడా మందును ఆదివారం రాత్రి తయారు చేసి, 13 జిల్లాలకు సోమవారానికి పంపాలని యోచిస్తున్నారు. అవసరమైతే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి తేనె సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మందుకోసం ఇతర జిల్లాల వారెవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందును అవసరమైన వారి చిరునామాకుగానీ, లేదా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారాగానీ అందించేలా చూస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో మందును పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం నాటికి మందు పంపిణీని ప్రారంభించి రానున్న రోజుల్లో మరింతగా నిల్వలను సిద్ధం చేసి అన్ని జిల్లాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపాలని నిర్ణయించారు. మందు తయారీ కోసం సొంత భవన నిర్మాణానికి ఆనందయ్య భూమిపూజ ఆయుర్వేద మందు తయారీకి కావాల్సిన భవన నిర్మాణానికి ఆనందయ్య కృష్ణపట్నంలోని తన స్థలంలో బుధవారం భూమిపూజ చేశారు. భగవాన్ వెంకయ్యస్వామి అనుచరుడైన సైదాపురం మండలం తలుపూరు ఆశ్రమానికి చెందిన నారాయణదాసు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో రోగులకు వైద్యసేవలు అందించడం, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం కోసం ‘ఆనందయ్య సేవా ట్రస్టు’కూ శ్రీకారం చుట్టారు. దుష్ప్రచారాలొద్దు: నారాయణ ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేయవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కృష్ణపట్నంలో ఆనందయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఆనందయ్య ఆయుర్వేద మందును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. పుత్తూరు ఎముకల కట్లు, హైదరాబాద్‌లో చేపమందు వలే ఆనందయ్య మందు ప్రజల ఆదరణ పొందిందని చెప్పారు. -
పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ)/ముత్తుకూరు: విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకుంది. రైలు మార్గం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది ఏడోది. ఇది నాలుగు ట్యాంకర్లలో 76 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో ఒడిశాలోని రూర్కెలాలో బయలుదేరి 22 గంటల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు 20 ట్యాంకర్లలో మొత్తం 395 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి అయ్యింది. డీఆర్ఎం పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రీన్ చానల్ ద్వారా ఈ ఆక్సిజన్ రైళ్ల కదలికలను పర్యవేక్షిస్తూ సకాలంలో గమ్యస్థానానికి చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు శుక్రవారం ఒడిశా నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ద్వారా రెండు ట్యాంకర్లలో నింపిన 60.66 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి తరలించారు. ఈ రైలు 1,305 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల వ్యవధిలో ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఇప్పటివరకు విజయవాడ డివిజన్‌కు వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది నాలుగోది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 275 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ఎమ్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా ఇవి గమ్యస్థానాలకు చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
ఏపీసెజ్–కృష్ణపట్నం పోర్టు డీల్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: అదానీ కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) మరో 25 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఏపీసెజ్‌కు ఇప్పటికే పోర్టులో 75% వాటాలు ఉన్నాయి. మిగతా వాటాల కొనుగోలుతో 100% వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. కృష్ణపట్నం పోర్టులో విశ్వసముద్ర హోల్డింగ్స్‌కి ఉన్న 25% వాటాలను రూ. 2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏప్రిల్‌లో ఏపీసెజ్ వెల్లడించింది. -
Andhra Pradesh: 'ఆక్సిజన్' రైలొచ్చింది..
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టుకు శనివారం సాయంత్రం ఆక్సిజన్ రైలు వచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ఉన్న రెండు ట్యాంకర్లు పోర్టుకు చేరుకొన్నాయి. ఈ ప్రత్యేక రైలుకు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో అవినాష్‌చంద్ రాయ్, నెల్లూరు జేసీ హరేందిరప్రసాద్, జేసీ (ఆసరా) బాబిరెడ్డి, చిత్తూరు జేసీ మార్కండేయులు, పోర్టు సెక్యూరిటీ జీఎం రాకేష్ కృష్ణన్, స్థానిక తహసీల్దార్ సోమ్లానాయక్‌లు స్వాగతం పలికారు. ఇప్పటికే రైల్లో వచ్చిన ట్యాంకర్ల నుంచి ఆక్సిజన్‌ను స్థానిక ట్యాంకర్లలోకి నింపుకొనే ప్రక్రియ చేపట్టారు. వీటిని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు తరలించనున్నారు. -
కృష్ణపట్నం.. అదానీ పరం
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది. ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్ సోమవారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టులో వాటా 75 శాతం నుంచి 100 శాతం వరకు చేరినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ నెలలో 75 శాతం వాటాను కొనుగోలు చేసినప్పుడు ఆర్థిక ఏడాది 2021 ఎబిట్టాకు(చెల్లించాల్సిన పన్నులు, వడ్డీలు, తరుగుదల వంటివన్నీ లెక్కలోకి తీసుకొని లెక్కించే ఆదాయం) 10.3 రెట్లు అధికంగా కృష్ణపట్నం పోర్టు విలువను రూ.13,765 కోట్లుగా మదింపు వేసినట్లు తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్ టన్నుల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా రూ.1,840 కోట్ల ఆదాయం, ఎబిట్టా రూ.3,125 కోట్లుగా పేర్కొంది. విస్తరణ దిశగా కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగివున్న కృష్ణపట్నం పోర్టును భారీగా విస్తరించనున్నట్లు ఏపీసెజ్ సీఈవో కరన్ అదాని తెలిపారు. 2025 నాటికి ప్రస్తుత పోర్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీప్‌వాటర్ పోర్టు కావడం, 6,800 ఎకరాలు ఉండటం మాస్టర్ ప్లాన్ ప్రకారం పోర్టు సామర్థ్యం 300 మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లే అవకాశం ఉండటం కలిసొచ్చే అంశాలుగా పేర్కొన్నారు. దక్షిణాంధ్రప్రదేశ్‌కు కృష్ణపట్నం పోర్టును ముఖద్వారంగా తీర్చిదిద్దుతామని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఎంతో కీలకంకానుందని చెప్పారు. తూర్పు తీరంపై ప్రత్యేక దృష్టి 2025 నాటికి ఏపీసెజ్ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టపల్లి, ఎన్నోర్ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ, మన రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది. అదాని గ్రూపు రాష్ట్రంలోని ఈ రెండు పోర్టులో కొనుగోలు చేయడం కోసం రూ.20,354 కోట్లు వ్యయం చేసింది. రాష్ట్ర ఆదాయంలో మార్పు ఉండదు కృష్ణపట్నం పోర్టులో ఏపీసెజ్ 100 శాతం వాటాను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎటువంటి ప్రభావం చూపదని ఏపీ మారిటైమ్ బోర్డు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్టు ఆదాయంలో 2.6 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందని, ఇప్పుడు 100 శాతం వాటా తీసుకున్నా అదే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీథరన్ ‘సాక్షి’కి తెలిపారు. -
సామాజిక బాధ్యత అభినందనీయం
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సహకారంతో కొవిడ్ క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు చొరవతో కృష్ణపట్నం పోర్టు ట్రస్టు యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు సామాజిక బాధ్యతను కలెక్టర్ అభినందించారు. పారిశ్రామిక సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పారిశ్రామిక వాడలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించనున్నారు. తొలిదశలో 100 ఐసోలేషన్ బెడ్లు, 20 బెడ్లు ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి క్లినిక్ లో బెడ్ల సామర్థం పెంచనున్నారు. వైద్యులు, సిబ్బందిని కూడా కృష్ణపట్నం పోర్టు ట్రస్టు నియమించినట్లు వైద్య ఆర్యోగ శాఖ వెల్లడించింది. -
ఆంధ్రా టు ఆఫ్రికా
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చేరాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం (పీడీఎస్ బియ్యం) కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకు భారీ ఎత్తున తరలిస్తున్న గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. 1,645 టన్నుల బియ్యం కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా నిల్వ ఉంచారంటే.. ఈ స్కామ్‌లో ఎంత పెద్ద నెట్వర్క్ నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖలు, పోర్టు సిబ్బంది సైతం కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్స్‌పోర్టర్లకు సంబంధించిన నలుగురు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆఫ్రికా దేశానికి రవాణా చేసేందుకు తరలిస్తున్నట్లు బయటపడింది. నెల్లూరు (క్రైమ్): కృష్ణపట్నం పోర్టులో సీబార్డ్ గోదాముల్లో భారీ ఎత్తున ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. 1,645 టన్నుల బియ్యం అక్రమ నిల్వలు బయట పడిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో బియ్యం నిల్వ చేయడం వెనుక ప్రభుత్వ శాఖల హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయిలో నిల్వ చేయాలంటే సుమారు ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని సరఫరా చేసే సప్లయిర్లు నేరుగా ఎక్స్‌పోర్టర్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక సమాచారం. రేషన్ షాపులకు పంపే బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే నేరుగా లారీల్లో రైస్ మిల్లలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం గోతాలను మార్చి అనువైన బ్రాండ్స్‌తో కొత్తగా ప్యాకింగ్ చేసి లారీల్లో పోర్టులోని గోదాములకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడకు చేరిన లారీలకు వే బిల్లులు, అధికార పూర్వకంగా ఉండాల్సిన పత్రంలో ఏ వివరాలు లేవని తేలింది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ సంబంధిత శాఖల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం. పోర్టుకు చేరిన అనంతరం అక్కడ జరగాల్సిన తంతు పోర్టు సిబ్బంది చూసుకుంటారు. షిప్మెంట్ జరిగే సమయంలో మాత్రమే సంబంధిత వే బిల్లులు, క్వాలిటీ, ఎన్ని రోజులు నిల్వ ఉంచారన్న అంశాలపై కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్రమ నిల్వలు బయట పడ్డాయని అధికారులు వెల్లడించారు. అయితే పోర్టు, సంబంధిత ప్రభు త్వ అధికారుల నడుమ ఒప్పందాలు బహిర్గతం కావడంతో అసలు విషయం బయటకు పొక్కిందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకుని పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చింది. బియ్యం సేకరణ ఇలా.. దాడుల్లో ప్రధానంగా బియ్యం తరలించే నలుగురు సప్లయిర్స్, నలుగురు ఎక్స్‌పోర్టర్లను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉండటం గమనార్హం. సప్లయిర్స్‌లో కర్ణాటకకు చెందిన శ్రీవీరభద్రేశ్వర ఇండస్ట్రీ నుంచి రాధిక బ్రాండ్ పేరుతో 30 టన్నుల బియ్యాన్ని రాజస్థాన్‌కు చెందిన రాధికా ఎంటర్ ప్రైజస్ ఎక్స్పోర్టర్కు సీషల్ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేశారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పోర్టు సిబ్బంది వరకు భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారకపోతే ఇంత పెద్ద రాకెట్ దందాకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ►గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ నుంచి ఓషన్ బ్రాండ్ పేరుతో 1263.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ–వేబిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్‌లు చెల్లించకుండా చేర్చినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ఫ్లోర్ మిల్ నుంచి ఈగల్ బ్రాండ్ పేరుతో రెండు దఫాలుగా 63 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ►చెన్నైకు చెందిన శివకేశవ ట్రేడర్స్ నుంచి సలోని బ్రాండ్ పేరుతో 3,900 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన సిస్టర్ కన్సైన్మెంట్ కాకినాడ అండ్ సరలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ నుంచి ఏవీకే లాజిస్టిక్స్‌కు సరఫరా చేశారు. ►విజయవాడకు చెందిన ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ నుంచి సూపర్ టైగర్ బ్రాండ్ పేరుతో 11,225 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన ఎంఓఐ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ సీవేస్ షిపింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేసినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు. సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్ వివరాల సేకరణ అసలు ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అనే వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కస్టమ్స్ అధికారుల నుంచి 2016–17 నుంచి 2019–20 వరకు సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్, ట్రాన్స్పోర్టర్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. బయటపడిందిలా.. బియ్యం బ్యాగ్‌లు మార్చి, పేర్లు మార్చి, బిల్లులు లేకుండా పోర్టు గోదాముకు చేరిన బియ్యం అమ్మిన ధరను తెలిపే బిల్లులు అక్రమాల పుట్టను బయట పెట్టాయి. బియ్యం రూ.25, రూ.20 ఇలా తక్కువ ధరలకు కొని విదేశాలకు ఎగుమతి చేయడం ఎలా సాధ్యమవుతుందని తొలుత కస్టమ్స్ అధికారుల్లో రేగిన ఆలోచనలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. శ్రీవీరభద్రా ఇండస్ట్రీస్ కేజీ బియ్యం రూ.25కు కొనుగోలు చేసినట్లు, సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్‌మిల్లు కేజీ రూ 21.40లకు కొనుగోలు చేసినట్లు, శివకేశవ ట్రేడర్స్ రూ.25, ఎస్ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ రూ.20.60 కేజీకి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ వే బిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్ చెల్లించనట్లు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విజయవాడ, కాకినాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 లారీల ద్వారా పోర్టులోని సీబోర్డ్ గోదాముకు తరలినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను విజిలెన్స్ అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశారు. అదే క్రమంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.