love cheating
-
ప్రేమించాడు.. పెళ్లి అన్నాడు.. ఆపై తిరస్కరించాడు..?
జ్యోతినగర్(రామగుండం): యువతీ, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే మనస్పర్థలు రావడంతో వారి ప్రేమకు పెద్ద మనుషులు వెలకట్టిన ఉదంతం ఎన్టీపీసీ రామగుండం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎన్టీపీసీ రామగుండం పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ యువతి, యువకుడు కులాలు వేరైనప్పటికీ మనసులు కలిసి ప్రేమించుకున్నారు. మూడేళ్లుగా తమ ప్రేమను పంచుకుని పెళ్లి చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంతలోనే వారి మధ్యలో కొంత మనస్పర్థలు రావడంతో యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో బాధితురాలు యువకుడి ఇంటి ఎదుట నిరసన సైతం చేపట్టింది. ఇరువురి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ వారిద్దరి పెళ్లి జరుగకపోగా వారి ప్రేమను విడగొట్టడానికి కొంతమంది పెద్దలు రూ.9 లక్షలుగా నిర్ధారించినట్లు తెలిసింది. ప్రేమకు వెలకట్టిన క్రమంలో రూ.4లక్షలు సైతం యువతి బంధువులకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెళ్లి చేసుకోవాలని యువకుడిని యువతి వేడుకున్నా.. యువకుడిది ఉన్నత కుటుంబం కావడంతో ఎట్టకేలకు యువతి ప్రేమకు వెలకట్టారు. -
మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..
తాడిపత్రి/రూరల్: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్. పెళ్లి చేసుకోమని నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి సెల్‌ఫోన్‌కు పంపింది. వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు. వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. దీంతో యువతి కుమిలికుమిలి ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు?
సాక్షి, వరంగల్: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్మెంట్ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్మెంట్కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే! -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీరతండా గ్రామ పంచాయతీ పరిధి దారావత్‌తండాకు చెందిన భూక్య అనూష(18) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనూష మహబూబాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే తండాకు చెందిన దారావత్ శేఖర్ ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అనూష, శేఖర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలో శేఖర్ పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈవిషయం ఇటీవల యువతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శేఖర్ తల్లిదండ్రులతో మాట్లాడారు. అనూష తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేద్దామన్నారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా కోపోద్రుక్తులై దుర్భాషలాడారు. ఇదే విషయంపై యువకుడిని నిలదీయగా.. అతను కూడా ముఖం చాటేశాడు. దీంతో తాను ప్రేమికుడి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా.. తన బిడ్డ చావుకు కారణమైన శేఖర్, అతడి కుటుంబీకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ జే నరేందర్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని వెయిట్ లాస్ క్లినిక్‌లో బాధితురాలు పనిచేస్తుంది. తిరుపతి తిమ్మినాయుడుపాలెంకు చెందిన వేలం శివతేజ 2016లో తన శరీర బరువును తగ్గించుకునేందుకు ఈ క్లినిక్‌కు వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలి ఫోన్ నంబరుతీసుకున్నాడు. తరచు ఆమెతో చాటింగ్ చేస్తూ స్నేహం పెంచుకున్నాడు. తాను కెనడాలో ఉద్యోగం చేస్తున్నానని, తిరుపతిలో భారీగా ఆస్తులున్నాయని నమ్మబలికాడు. ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొన్ని నెలలు గడిచాక.. ఆమెకు తెలియకుండా మరో మహిళలను వివాహమాడాడు. ఈ క్రమంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శివతేజ.. బాధితురాలి నుంచి డబ్బు గుంజాలని పథకం వేశాడు. గతేడాది ఏప్రిల్‌లో ఆమెను సంప్రదించి.. తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయని, వీసా ప్రాసెసింగ్, భవన నిర్మాణం, మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో బాధితురాలిని డబ్బు అడిగాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.7,13,053 నిందితుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోమని బాధితురాలు బలవంతం చేయడంతో స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు శివతేజను తిరుపతిలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచి్చ, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్, రెండు సిమ్‌కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు -
అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ..
సాక్షి, హైదరాబాద్: అతని వయసు 50 సంవత్సరాలు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ని ఓ మాట్రిమోనియల్ సైట్లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఓ అందమైన 23 ఏళ్ల యువతి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టింది. అమ్మాయి కావడంతో యాక్సెప్ట్ చేసి మాట కలిపాడు. తాను నగరంలోని ఓ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఫైనలియర్ చదువుతున్నానని పరిచయం చేసుకుంది. మీ ప్రొఫైల్‌ని ‘మాట్రిమోనియల్’ సైట్లో చూశాను..నాకు నచ్చారని చెప్పింది. అందమైన యువతి తనకు తానే పలకరించడంతో ఆ వ్యక్తి పరవశించిపోయాడు. ఇద్దరి మధ్య కొద్దిరోజుల పాటు సాన్నిహిత్యంగా బాగా సాగింది. నాకంటే మీరు 25 ఏళ్లు వయసులో ఎక్కువ అయినా..మీ ఆచారాలు, పద్ధతులు నచ్చి ఇష్టపడ్డానన్నది. ఈలోపే ఇతగాడు ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. నిమిషాల కొద్దీ కాల్స్..గంటల కొద్దీ చాటింగ్ నడిచింది. సడన్‌గా ఒకరోజు ఫైనలియర్ ఫీజుకు డబ్బు అవసరమని కోరింది. కొంత ఇచ్చాడు. ఆ తర్వాత కోవిడ్ వచ్చిందని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పింది. మరో రూ.10 లక్షలు ఇచ్చాడు. కొద్దిరోజులు గడిచాక మా అమ్మకు కోవిడ్ వచ్చిందని చెప్పి మరో రూ.10 లక్షలు లాగేసింది. తన లగ్జరీ ఖర్చులు, ఇతర అవసరాల కోసం అతగాడి నుంచి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.46 లక్షలు కాజేసింది. ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాక గానీ ఆ వ్యక్తి తాను మోసపోయానని గుర్తించలేకపోయాడు. చివరకు తేరుకుని శుక్రవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. చదవండి👉 ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్ -
స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి!
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం చేసి, యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డికి చెందిన మైనర్ బేతి స్నేహను పట్టణానికి చెందిన రఘుపతి గత యేడాది మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశారు. ఆమె తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రేమ విషయం తెలిసేట్లు చేశాడు. తర్వాత మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని స్నేహను మోసం చేశాడు. తాను ప్రేమ పేరుతో మోసపోయాయని భావించి మనో వేధనతో ఈనెల 1న ఇంట్లో ఉరివేసుకుని స్నేహ ఆత్మహత్య చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసిన నిందితుడు రఘుపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో -
ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లోని ఓ యువతితో ఆరు నెలల నుంచి వీరేందర్ (29) పరిచయం ఏర్పరుచుకొని పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా కలిసి పెళ్లి చేసుకోకుండా మోసగించాడు. చదవండి: (కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!) వినాయక్‌నగర్‌లో ఉంటు వీరేందర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా వీరేందర్ మాటదాట వేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా తనని వీరేందర్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వీరేందర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) -
ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని.. పెళ్లి ప్రస్తావన తేవడంతో..
సాక్షి, పహాడీషరీఫ్(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి యువతిని లోబర్చుకున్న యువకుడిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకుంట సాదత్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్లా బావజీర్(22) ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానంటూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. చదవండి: ఫోన్ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి.. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడుని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని చెప్పి.. -
ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్‌పై బీటెక్ స్టూడెంట్ ఫిర్యాదు
హయత్‌నగర్: ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని (22) చంపాపేట్‌కు చెందిన రబ్లావత్ శంకర్(24) అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించింది. రెండేళ్ల పాటు తనను వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత యువతి బుధవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. -
ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య
సాక్షి, శామీర్‌పేట్: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది. ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు వివాహేతర సంబంధం.. యువకుడిపై హత్యాయత్నం ఘట్కేసర్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్‌నగర్ జవహర్‌నగర్‌కు చెందిన ఎడ్ల దేవ(30) కూలీ. చక్రిపురం కుషాయిగూడకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న వివాహిత సోదరుడు నవీన్ అతడిని చంపాలని రాంపల్లికి తీసుకొచ్చి మద్యం సేవించారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ అనంతరం ఘట్కేసర్–ఘనాపూర్ సర్వీస్ రోడ్డు చెట్లపొదల్లో మరొక వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోశారు. వెంటనే దేవ వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తగా ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్సత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్‌కు తీసుకెళ్లి
సాక్షి, బంజారాహిల్స్: పెళ్లై పిల్లలున్న విషయాన్ని దాచి పెట్టి తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించిన యువకుడు తనతో పాటు పని చేస్తున్న యువతిని మోసగించిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి మెయిన్ ఓపీ ఫార్మసీలో జూనియర్ సూపర్వైజర్గా పని చేస్తున్న కొండబాబు ఓ యువతితో 2018 మార్చిలో పరిచయం ఏర్పడింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించిన కొండబాబు ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. 2020 జూలైలో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఫార్చున్ వల్లభ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత కొండబాబుకు పెళ్లై పిల్లలు కూడా ఉన్న విషయాన్ని బాధితురాలు తెలుసుకొని నిలదీసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ మరోసారి వంచించడమే కాకుండా పలుమార్లు అదే హోటల్లో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. ఈ నెల 6వ తేదీన బాధిత యువతి పెళ్లి మాట ఎత్తేసరికి కులం పేరు ఎత్తాడు. తాను కేవలం శారీరక వాంఛల కోసమే ఇన్నాళ్లు తిరిగానని, పెళ్లి కోసం కాదన్నాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండబాబుపై ఐపీసీ సెక్షన్ 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడిన మిస్టరీ: నీటి కుంటలో శవమై తేలిన జయశీల్‌రెడ్డి 80 ఏళ్ల వృద్ధుడి హత్య: ‘రూ.10 వేలు ఇస్తా.. నీ భార్యను పంపు’ -
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు; యువతిని నమ్మించి.. ఆపై
సాక్షి,గుంటూరు(అమృతలూరు): రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో అవివాహిత (22)ను ఏడాది గా మభ్యపెట్టి చివరకు పురుగుల మందు తాగించి పరారైన సంఘటన ఇంటూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. ఇంటూరు గ్రామానికి చెందిన దాసరి ఉమామహేశ్వరరావు (38) సుమారు పదేళ్ల కిందట వివాహం చేసుకోగా కొంతకాలానికి భార్య ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు కూడా నడిచింది. అనంతరం రెండో వివా హం చేసుకున్నాడు. అయితే తన రెండో భార్యతో కూడా గొడవలు వస్తున్నాయని అవివాహిత అయిన మౌనికకు మాయమాటలు చెప్పి ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు. బాధితురాలు వివాహం చేసుకుందామని ఒత్తిడి చేయడంతో మన పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, ఇద్దరం చనిపోదామని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితురాలిని కారులో గోవాడ శివాలయం రోడ్డుకు తీసుకువచ్చాడు. సిద్ధం చేసుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ముందుగా బాధితురాలికి తాగించాడు. ఆ మార్గంలో వస్తున్న వ్యక్తులు జంటను చూసి ప్రశ్నించగా ఉమామహేశ్వరరావు పరారయ్యాడు. విష యం తెలుసుకున్న బంధువులు కె.మౌనికను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో బాధితురాలిని అమృతలూరు ఎస్ఐ ఎం.వాసు విచారించారు. సీఐ కల్యాణ్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువతిని ఇంట్లోనే నిర్బంధించి..
సాక్షి, పశ్చిమ గోదావరి: తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రియుడిని నిలదీయాలని ఓ యువతి బెంగళూరు నుంచి పశ్చిమగోదవరికి వచ్చింది. ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆ యువతిని సదరు యువకుడు ఇంట్లో నిర్బంధిచాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేశ్ అనే యువకుడు బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం కొన్ని రోజులకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు బెంగుళూరు నుంచి ప్రియుడి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ప్రియుడు రమేష్, అతని తల్లిదండ్రులు ఆ యువతిని ఇంట్లోనే నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న వీరవాసరం పోలీసులు నిర్బంధంలో ఉన్న అమ్మాయిని విడిపించారు. ఆమె ప్రియుడు రమేష్, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రియుడు రమేష్, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
మోసం చేశాడని ఉపాధ్యాయుడిపై యువతి కేసు
సాక్షి నాంపల్లి: ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేసిన ఓ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ యువతి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా, రామోజీపేట గ్రామానికి చెందిన మంజుల ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. 2016లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌లోని ఓయూకు వచ్చింది. టెట్‌కు సిద్ధమవుతున్న ఆదిలాబాద్ జిల్లా వాగాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి రాజుతో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత రాజుకు ఉద్యోగం రావడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీసింది. అతను పట్టించుకోకపోవడంతో ఓయూ, ఇచ్చోడ, వాగాపూర్ ఠాణాల్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడమే కాకుండా తనను అసభ్య పదజాలంతో దూషించారని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తిప్పారెడ్డి రాజుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు తన ఫిర్యాదులో కోరింది. -
ప్రేమ పేరుతో మోసం
సాక్షి, కావలి: మూడేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకొంటానని చెప్పి తన వద్ద నుంచి మూడు వజ్రాల ఉంగరాలు, రూ.40,000 విలువ చేసే టచ్ స్క్రీన్ ఫోన్, రూ.10 లక్షలు నగదు కాజేసిన ప్రియుడు తనను పెళ్లి చేసుకోనంటున్నాడని భాధిత యువతి సోమవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాధుపై అప్పటికప్పుడు భాధిత యువతి, ఆమె తల్లి, వారికి అండగా ఉన్న మహిళా సంఘం నాయకురాలు చాకలికొండ శారదలతో డీఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసందర్భంగా క్రిస్టియన్‌పేటలోని 2వ లైన్లో నివాసం ఉంటున్న స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలైన శెట్టిపల్లి సునీత సెలీనా మూడో కుమారుడైన ప్రేమ్ రంజన్‌తో స్థానిక కో ఆపరేటీవ్ కాలనీకి చెందిన యువతి ప్రేమించుకొన్నారు. మూడేళ్ల ప్రేమాయణంలో ప్రేమ్ రంజన్ ఎటూ మనం పెళ్లి చేసుకొంటున్నామని, తాను ఐఏఎస్ సాధించడానికి ప్రిపేర్ అవుతున్నానని యువతిని నమ్మబలికాడు. అందుకే పెళ్లి తర్వాత నాకు ఇచ్చే డబ్బును ఇప్పుడే ఇస్తే నేను స్థిరపడటానికి ఉపయోగపడుతుందని ఆశలు కల్పించాడు. దీంతో యువతి పెళ్లి కోసం ఆమె తండ్రి బ్యాంక్‌లో భద్రపరచిన నగదు వివరాలను తెలుసుకొని, ఆమెపై ఒత్తిడి చేసి రూ.10 లక్షలు నగదును తీసుకొని జల్సాలు చేసుకొన్నాడు. అలాగే ప్రేమ కానుకగా వస్తువులు తీసుకొన్నాడు. ఇటీవల యువతి పెళ్లి చేసుకోమని కోరడంతో ప్రియుడు కులాల పేరుతో వివాదాన్ని రేకిత్తించాడు. యువతి గిరిజన సామాజిక వర్గాన్ని ఉద్ధేశించి చులకనగా మాట్లాడి దుర్భాషలాడాడు. ఈ విషయంలో టూటౌన్ సీఐకు న్యాయం చేయమని కోరి ఫిర్యాదు చేస్తే, మోసం చేసిన ప్రియుడుకు సంబంధించిన దళారులను కూర్చొపెట్టుకొని తమ పట్ల హేళనగా మాట్లాడుతున్నాడని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం చేసిన ప్రేమ్ రంజన్, అతని కుటుంబసభ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. సబ్ కలెక్టర్, తహసీల్దార్లకు అర్జీలు కావలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అలాగే కావలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ‘స్పందన’లో తహశీల్దార్ రామకృష్ణ ప్రజల సమస్యలను తెలసుకొన్నారు. కాగా బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయన ఆధ్వర్యంలో కొందరు రోజుల బిడ్డను తీసుకొచ్చి తహసీల్దార్ ఎదుట ఉన్న టేబుల్‌పై పడుకోబెట్టి, బాలకృష్ణారెడ్డి నగర్ వివాదంలో తాము చెప్పినవి పరిష్కరించాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో ఉలిక్కిపడిన తహసీల్దార్ వెంటనే తేరుకొని బాలకృష్ణారెడ్డి నగర్ వివాదానికి, టేబుల్‌పై పసి బిడ్డను పడుకోబెట్టడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించి, బిడ్డను తీయమని చెప్పారు. బీజేపీ నాయకులు అలాగే మాట్లాడతుండటంతో తహశీల్దార్ పోలీసులకు ఫోన్ చేసి అర్జెంట్‌గా తన కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో బీజేపీ నాయకులు తాము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పోలీసులకు ఫోన్ చేయడమేమిటని తహసీల్దార్‌ను అడిగారు. ఇక పోలీసులు వచ్చేస్తారేమోనని బీజేపీ నాయకులు తమ వెంట ఉన్న వ్యక్తులను తీసుకొని తహశీల్దార్ కార్యాలయంలో నుంచి బయటకు వచ్చేశారు. కాగా టీడీపీ నాయకుడు సబ్ కలెక్టర్ కార్యాలయ వద్ద ర్యాలీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏసీటీ కేబుల్ కనెక్షన్లను ప్రజలు రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
అమ్మా.. నాన్న చంపేస్తాడు.. వెళ్లిపోదాంపద!
సాక్షి, గుంటూరు, విజయవాడ : ప్రేమించి పెళ్లాడిన భర్త ఆరేళ్ల తర్వాత వదిలేసి మరొక యువతితో సహజీవనం చేస్తున్న వ్యవహారాన్ని భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఘటన తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. భర్త మరో యువతితో సహజీవనం చేస్తూ, తాడేపల్లి పట్టణ పరిధిలోని గౌతమి అపార్టుమెంట్లో అద్దెకుంటున్న ఇంటివద్ద తన కూతురితో కలిసి రెండు గంటల పాటు ధర్నా చేసింది. బాధిత యువతి చెప్పిన వివరాల ప్రకారం... విజయవాడలో నివసించే సూరపనేని చైతన్య, సరితకు 6 సంవత్సరాల కిందట పరిచయమయ్యాడు. పరిచయమైన నెలరోజులకే వివాహం చేసుకుంటానంటూ వెంటబడి, తన తల్లి శైలజతో ఇంటికొచ్చి పెద్దలను ఒప్పించి, 13–08–2013న వివాహం చేసుకున్నాడు. అనంతరం ఓ పాప పుట్టగానే కట్నం డబ్బులతో పాటు ఒంటిమీద ఉన్న బంగారాన్ని సైతం వ్యాపారం పెట్టాలని తీసుకొని ఉడాయించాడని సరిత కన్నీరుమున్నీరుగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. నెల రోజుల క్రితం విజయవాడలో ఓ అమ్మాయితో కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టామని, నా పక్కన ఎటువంటి అమ్మాయి లేదని బుకాయించాడని, తిరిగి మరలా తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని గౌతమి అపార్ట్మెంట్లో వేరే అమ్మాయితో నివాసం ఉంటున్నాడని తెలిసి, ఇక్కడకొచ్చి చూడగా ఇక్కడే ఉన్నాడని తెలిపింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటే రావడంలేదంటూ సరిత తెలియచేసింది. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నా నిర్వహిస్తున్న సరితను విరమించి, పోలీస్‌స్టేషన్‌కు రావాలని కోరగా, ముందు ఇంట్లో ఉన్న చైతన్యను, సహజీవనం చేస్తున్న మహిళను బయటకు తీసుకురావాలంటూ డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా చైతన్యను అరెస్టు చేస్తేనే ఇక్కడ నుంచి కదులుతానంటూ భీష్మించుకుకూర్చోడంతో పోలీసులు చేసేదేం లేక సూరపనేని చైతన్యను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ సమయంలో సరిత ఇట్లాంటి మోసగాడ్ని చెప్పులతో కొడితే తప్ప బుద్ధిరాదని, కోటి రూపాయల కట్నం తీసుకొని, ఒక కూతుర్ని కన్నతర్వాత ఇద్దరి జీవితాలను నాశనం చేసాడని, చెప్పు తీసుకొని చైతన్య వెంట పడింది. పోలీసులు ఆమె ప్రయత్నాన్ని నిలువరించారు. అమ్మా... నాన్న చంపేస్తాడు... వెళ్లిపోదాంపద... సరితతోపాటు ధర్నా చేస్తున్న ఆరేళ్ల పాప అమ్మా, నాన్న చంపేస్తాడు. మనం ఇక్కడ నుంచి పారిపోదాంపద. నాన్న ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు. నాకు కనిపించాడు. నాకు వేలు చూపిస్తున్నాడు. అంతకుముందు కొట్టినట్టు నిన్ను, నన్ను ఇద్దర్నీ కొడతాడు. నువ్వు ఏడుస్తుంటే అందరూ మన వంకే చూస్తున్నారు. అలా నువ్వు ఏడవకు. మనిద్దరం వేరే ఉందాం పద అంటూ కూతురు తల్లిని పట్టుకొని బతిమిలాడుతుంది. తల్లి సరిత కూతురితో దిగిన ఫొటోలను మీడియా వారికి చూపిస్తుంటే, ఆ ఫొటోలు చూపించవద్దంటూ ఆ పాప మారాం చేసింది. చివరకు తండ్రి రాకను గమనించిన ఆ చిన్నారి తల్లిని విడిచిపెట్టి పరుగులు తీస్తూ కారెక్కి కూర్చుంది. అక్కడున్న వారందరూ పాప భయాన్ని చూసి ఒక్కసారిగా ఆందోళన చెందారు. చిన్న పాపను ఏ విధంగా హింసించాడో దీన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. -
అన్న స్నేహితుడే.. ప్రేమ పేరుతో మోసం
సాక్షి, కర్నూలు, గుంటూరు : ప్రేమ పేరుతో తమ కుమార్తెతో ఓ యువకుడు పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తర్వాత కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడని కర్నూలు జిల్లాకు చెందిన దంపతు లు బుధవారం అర్బన్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన రైమాపురం మద్దిలేటి, బాలనాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుమార్తెను గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న బండ్లమూడి హనుమాయమ్మ కళాశాలలో డిగ్రీలో చేర్పించారు. మూడు సంవత్సరాలుగా అక్కడే హాస్టల్లో ఉంటోంది. మద్దిలేటి పెద్దకుమారుడు మధు కూడా గుంటూరులోని టీజేపీయస్ కళాశాలలో డిగ్రీ చదువుతుండేవాడు. అదే కశాశాలలో వినుకొండ ప్రాంతానికి చెందిన మద్దుల బాలయోగశ్వరరావు అలియాస్ మద్దుల బాలు చదువుతుండేవాడు. అతడి ఫోన్ నుంచి మధు తరచూ చెల్లెలితో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో బాలు కూడా అదే నంబర్‌కు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకోవడం ప్రారంభించారు. నిత్యం ఫోన్లో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని మద్దిలేటి, బాలనాగమ్మ దంపతులు కుమార్తెను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు. బాలు అక్కడకు వెళ్లి ఆమెను వివాహం చేసుకుంటానని, తన పెద్దలను ఒప్పిస్తానని నమ్మించాడు. దీంతో మరలా గుంటూరుకు పంపారు. 15 రోజుల కిందట ఇద్దరూ బాలుకు వివాహం విషయం గుర్తు చేశారు. రూ.20లక్షలు కట్నంతో పాటు రెండు ఎకరాల పొలం కూడా కావాలని, లేనిపక్షంలో చేసుకునే ప్రసక్తే లేదని చెప్పి వెళ్లిపోయాడు. దీనిపై పది రోజుల క్రితం అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. బాలు స్థానిక బీజే పీ నాయకులతో ఒత్తిడి తేవడంతో పోలీసులు పట్టించుకోలేదు. మద్దిలేటి, బాలనాగమ్మలకు దిక్కుతోచక అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
ప్రేమ వ్యవహారం టీడీపీ ప్రతినిధి కుమారుడు అరెస్ట్
శంకర్పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్‌రెడ్డి కుమారుడు సామ తేజ్పాల్రెడ్డి(27)ని శంకర్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మోకిల గ్రీన్ విల్లా ప్రాంతానికి చెందిన సాయిసింధూరి(27) ఇంటీరియర్ డిజైనర్. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ప్రాంతానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్‌రెడ్డి కుమారుడు సామ తేజ్పాల్రెడ్డి ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇటీవల యువతి తేజ్పాల్రెడ్డి వివాహం విషయమై ప్రస్తావించగా నేడురేపు అంటూ దాటవేస్తున్నాడు. ఈ విషయమై గత డిసెంబర్ నెలలో సాయిసింధూరి శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం తేజ్పాల్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఇదే నెలలో తేజ్పాల్రెడ్డి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
కోటపల్లి(చెన్నూర్): ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. కోటపల్లి మండలంలోని పుల్లగామ గ్రామంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పుల్లగామకు చెందిన నిమ్మల స్వప్న, అదే గ్రామానికి చెందిన ఎతం సమ్మయ్య గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. స్వప్న, సమ్మయ్యది వేర్వేరు కులాలు. స్వప్న అన్నయ్య స్నేహితుడు కావడంతో సమ్మయ్య నిత్యం ఇంటికి వచ్చే వాడు. ఈ క్రమంలో స్వప్న, సమ్మయ్య మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవల స్వప్న పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు సమ్మయ్య నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ స్వప్న మంగళవారం సమ్మయ్య ఇంటి ఎదుట పురుగల మందు డబ్బాతో బైఠాయించింది. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రేమ పేరుతో సమ్మయ్య తనను లొంగదీసుకున్నాడని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొంది. స్వప్నకు తెలంగాణ రజక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. స్వప్నకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల మధుకర్ తెలిపారు. కాగా ప్రియుడు సమ్మయ్యతో పాటు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య.. యువకుని ఇంటి ముందు ధర్నా
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : ప్రేమ పేరుతో మోస పోయానని మనస్థాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఘటన జయశంకర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధుజా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొండ బత్తుల రమేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో సింధుజాను మోసం చేశాడు. దీంతో మనస్థాపం చెందిన సింధుజా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతుర్ని మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పార్థివ దేహంతో యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం..విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న గుర్రం ప్రవీణ్ వృత్తిరీత్యా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతున్న యువతిని మోసం చేస్తూ ఇన్ని రోజులు కాలం వెల్ల దీశాడు. ఆ యువతిని పీకల్లోతూ ప్రేమలోకి దించేశాడు. చివరికి పెళ్లి ప్రస్తావనను ఆ యువతి తీసుకొచ్చేసరికి తనకు అప్పటికే పెళ్లైన విషయం చెప్పడంతో మోసానికి గురయినట్లు భావించింది. దీంతో మనస్థాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
నమ్మించి నయవంచన
యశవంతపుర: ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని మోసం చేసిన యువకుణ్ని యశవంతపుర పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన నరేశ్‌ను నిందితునిగా గుర్తించారు. వివరాలు... యశవంతపుర ప్రాంతానికి చెందిన అమ్మాయికి– నరేశ్‌కు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నరేశ్ కర్నూలు నుంచి యశవంతపురకు వచ్చాడు. అమ్మాయితో కలిసి అనేకసార్లు నగరంలో షికార్లు చేశాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకొంటానని నమ్మిం చాడు. ఇద్దరూ మైసూరు, విజయవాడ, వైజాగ్, అనంతపురం, అదోని ప్రాంతాలలో విహారయాత్రలు చేశారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ప్లేటు ఫిరాయింపు : అమ్మాయినే పెళ్లి చేసుకొంటానంటూ కర్నూలుకు తీసుకెళ్లి అతడు తన కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేశాడు. తరువాత కొద్దిరోజులకే ప్లేటు ఫిరాయించాడు. ఇద్దరివీ వేరువేరు కులాలు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేనంటూ నరేశ్ మొండికేశాడు. అతని తల్లిదండ్రులు కూడా మరో అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. బాధిత యువతి తనకు జరిగిన అన్యాయంపై యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నరేశ్‌ను అరెస్టు చేశారు. -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
కేతేపల్లి(నకిరేకల్) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో గురువారం జరగింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి నకిరేకల్‌లోని ట్రాక్టర్ షోరూంలో కం ప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి పత్తి తీసేందుకు ఇదే మండలంలోని కొత్తపేట గ్రామం నుంచి కొండకిందిగూడెం వస్తున్న మంద మౌనిక, చంటి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చంటి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడు. దీంతో బాధితురాలు ఇటీవల కేతేపల్లి పోలీసులను సం ప్రదించింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వటంతో చంటి మూడు రోజులు గడువు కావాలని, తదనంతరం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. పది రోజులుగా మౌనిక ఫోన్ చేస్తుండగా ఎత్తకుండా ముఖం చాటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌనిక చంటి ఇంటి ఎదుట ఆదోళనకు దిగింది. ఇది గమనించిన చంటి కుటుంబ సభ్యులు ఉదయమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మౌనికకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.