machine
-
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
జస్ట్ రెండు కుట్టు మిషన్లతో.. ఏకంగా వెయ్యి కోట్ల సామ్రాజ్యం!
మనం మనీష్ మల్హోత్రా, రీతూ కుమార్, సబ్యసాచి ముఖర్జీ, అబు జానీ సందీప్ ఖోస్లా, తరుణ్ తహిలియానీ వంటి అగ్రశేణి ఫ్యాషన్ డిజైనర్ల గురించి విన్నాం. వారికంటే ముందే ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలి అత్యంత ధనిక ఫ్యాషన్ డిజైనర్ పేరుగాంచిన మహిళ గురించి ఇంతవరకు వినలేదు. జస్ట్ రెండు కుట్టు మిషన్లతో ఏకంగా వెయ్యి కోట్ల ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యంత సంపన్న ఫ్యాషన్ డిజైనర్‌గా అవతరించింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 270 స్టోర్లతో వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఆమెను విజయం అంత తేలిగ్గా వరించలేదు. ఎన్నో అవమానాలు, చీత్కారాలు నడుమ నిరాశ నిస్ప్రుహలతో యుద్ధం చేసి విజయతీరాలను అందుకుంది. ఎవరామె అంటే..ఆమె పేరే ది రైజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే. ఆమె అక్టోబర్ 3, 1963న ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పుష్పా సావ్లానీకి కుట్టు పనిలో అపారమైన ప్రతిభ ఉంది. అదే ఆమెకు సంక్రమించి..ఫ్యాషన్ డిజైన్ పట్ల మక్కువ ఏర్పరుచుకుంది. ఈ రంగంలో తక్కువ భారతీయ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయని గ్రహించి..సరసమైన ధరల్లో లభించేలా డిజైనర్‌వేర్‌లను రూపొందించాలని నిర్ణయించుకుంది. అందుకోసం తండ్రి నుంచి కొద్ది మొత్తం రుణం తీసుకుని తన సోదరితో కలిసి పాశ్చాత్య శైలిలో ఉండే దుస్తుల మాదిరిగా డిజైన్ చేయడం ప్రారంభించారు. వాటిని ప్రధాన బ్రాండ్లకు విక్రయించడం ప్రారంభించారు. అయితే ఆ క్రమంలో ఎన్నో మాల్స్‌లోని బ్రాండ్ల నుంచి గట్టి స్థాయిలో తిరస్కరణలు ఎదురయ్యాయి. చాలా ఎదురదెబ్బలు తినాల్సి వచ్చింది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఆత్మవిశ్వాసంతో సాగింది. ఇక లాభం లేదని తానే అనితా డోంగ్రే అని తన పేరుతో స్వంత లేబుల్ ప్రారంభించింది. ఇది అనాధికాలంలోనే ప్రసిద్ధ బ్రాండ్‌గా మారింది. 2015లో ఏఎన్డీ పేరుతో డిజైన్లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత తన కంపెనీని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రేగా రీబ్రాండ్ చేసింది. అలా ఏఎన్డీ.. గ్లోబల్ దేశీ, అనితా డోంగ్రే బ్రైడల్ కోచర్, అనితా డోంగ్రే గ్రాస్‌రూట్, అనితా డోంగ్రే పింక్ సిటీ తోసహా పలు విజవంతమైన వెంచర్లతో భారతదేశంపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ఆమె ప్రస్థానం సాగింది. అంతేగాక నీతా అంబానీ, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా అంబానీ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే వంటి బాలీవుడ్ అగ్ర తారలకు డిజైనర్‌గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికీ..60 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ అనితా వ్యాపారవేత్త ప్రవీణ్ డోండ్రేని వివాహం చేసుకున్నారు. వారికి యష్ డోంగ్రే అనే కుమారుడు ఉన్నాడు. అతడు బెనైషా ఖరాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ నేపథ్యం గురించి పెద్దగా మీడియాకి తెలియదు ఎందుకంటే ఆమె కుటుంబం హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంది.సంపద పరంగా..భారతదేశంలో ఆమె కంపెనీకి సంబంధించిన 270కి పైగా స్టోర్లు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆమె రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లకు చేరుకుందని అనితా డోంగ్రే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఆమె ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లకు మించవ్చని అంచనా. అలాగే ఆమెను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యంత ధనిక మహిళా ఫ్యాషన్ డిజైనర్‌గా పేర్కొంది. (చదవండి: 80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!) -
మోటు సరసం !.. మద్యం మత్తులో బావబామ్మర్దుల పరాచకం
ఐనవోలు: బావబామ్మర్ధి పరాచకాలు.. ఆటపట్టించుకోవడాలు సాధారణంగా చూస్తుంటాం.. కానీ, ఏకంగా ఓ బావబామ్మర్ధుల జంట సరసం పరా కాష్టకు చేరింది. దీంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఒంటిమామిడిపల్లికి చెందిన ఓ మెకానిక్, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మంచి స్నేహితులు. ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (27) ఈ నెల 20వ తేదీన రాత్రి మెకానిక్ షెడ్డులో ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటున్నాడు. అదే సమయంలో మిగతా ఇద్దరు అక్కడకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆకతాయి తనంతో ఏం చేస్తున్నామో తె లియని స్ధితిలో ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను నువ్వు బక్కగా ఉన్నావు.. లావు కావాలి.. అంటూ గేలి చేస్తూ ఆట పట్టించారు. నీకు గాలి పె ట్టి దొడ్డయ్యేలాగా(లావు) చేస్తాం.. అంటూ పరా చకాలు అడుతూ చివరకు బలవంతంగా మెకానిక్ షాపులో ఉన్న హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ పైపు మలద్వారం వద్ద ఉంచి ఒక్కసారిగా గాలి వది లారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పొట్టలోకి గాలి చేరడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు టాక్టర్ డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పెద్ద పేగులోకి గాలి చేరి ఉబ్బిందని ఆపరేషన్ చేయడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే సదరు వ్యక్తి ఆహారం తీసుకుని.. మలవిసర్జన చేసే వరకు ఆస్పత్రిలోనే ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో అయ్యే ఖ ర్చంతా ఒంటిమామిడిపల్లికి చెందిన ఇద్దరు భరి స్తున్నారు. అయితే ఆరు రోజులైనా డిశ్చార్జ్ కాకపోవడంతో విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయి.. చర్చనీయాంశంగా మారింది. -
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అనంతపురంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేసింది. స్థానిక ఆదిమూర్తి నగర్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రాంగణంలో నిరుపేద మహిళలకు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలనేదే నాట్స్ ఆశయమని బాపు నూతి అన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ కృషి చేస్తుందన్నారు. అనంతపురం ఆర్డీటితో కలిసి నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన మహిళల కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బాపు నూతి తెలిపారు. ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల అధినేత ఆంజనేయులు, నాయుడు, సాయి, అనిల్ కుమార్ నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం నాట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చేయూత అందిస్తున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్ -
గీతా ప్రెస్‌కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్‌లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్‌లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!
ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. మృతుడిని పితోర్‌గఢ్ జిల్లా గోవింద్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్‌తో వీరిని బయటకు తీసుకువచ్చారు. -
ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్
వెరైటీ ఫుడ్ ఇష్టం ఉండనిదెవరికి? కానీ చేసుకోవడమే మహాకష్టం. చేసిపెట్టే మెషిన్స్ ఉంటే ఆ టెన్షన్ ఎందుకు? ఈ ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ ఇంట్లో ఉంటే ఆ టెన్షనే ఉండదిక. ఇందులో 3 రకాల నూడుల్స్ చేసుకోవచ్చు. అలాగే మురుకులు, సన్న జంతికలనూ తయారు చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీల సాయంతో పోర్టబుల్ వైర్లెస్ మెషిన్‌గా పని చేస్తుంది ఇది. డివైస్‌కి ముందు వైపు పవర్ ఆన్/ఆఫ్ బటన్ ఉంటుంది. దాని సాయంతో దీన్ని వినియోగించుకోవడం చాలా తేలిక. ఇది వైర్లెస్ కావడంతో ఎక్కడికైనా ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు. మూడు వేరు వేరు మోల్డ్స్(హోల్స్‌తో కూడిన రేకులు) లభిస్తాయి. వాటిని మార్చుకుని ఈ డివైస్‌ని వినియోగించుకోవచ్చు. దీని ధర 72 డాలర్లు (రూ.5,968) ఇవి చదవండి: వినియోగదారుల డిమాండ్‌లో.. మల్టీఫంక్షనల్ కుకింగ్ వేర్! -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..
క్లైమేట్‌తో సంబంధం లేకుండా ఇష్టపడే రుచుల్లో ఐస్‌క్రీమ్ ఎవర్గ్రీన్! అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్‌కి ఈ మెషిన్ తెగ నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో.. ఎక్కువ మోతాదులో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. ఇది ఒక్కసారికి సుమారు ఆరు కప్పుల ఐస్‌క్రీమ్‌ని తయారు చేయగలదు. దీనిలోని సుపీరియర్ ఫంక్షన్స్ యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తాయి. ఇందులో రొటేటెడ్ లేడల్ (గరిటె) ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే కనెక్షన్‌తో రెండు గరిటెలుగా విడిపోయి.. లోపలున్న పదార్థాలను కలపడానికి సహకరిస్తుంది. ఇక దీని లోపల ఐస్‌క్రీమ్ స్పష్టంగా కనిపించడానికి ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. ఈ మేకర్ని క్లీన్ చేసుకోవడం.. వినియోగించుకోవడం చాలా ఈజీ. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం! ) -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్‌క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్‌క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్‌క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
భారత్‌లో రెట్టింపు రేడియో థెరపీ మెషీన్లు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020లో కొత్తగా 13.25 లక్షల కొత్త కేసులు రాగా 8.5 లక్షల మంది క్యాన్సర్ సంబంధ సమస్యలతో మరణించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సకాలంలో సరైన చికిత్స అందించేందుకు రేడియో థెరపీ మెషీన్ల సంఖ్య రెట్టింపు స్థాయికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎలెక్టా ఇండియా ఎండీ మణికందన్ బాలా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 650 పైచిలుకు మెషీన్లు ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం జనాభారీత్యా 1,400 వరకు అవసరమని ఆయన చెప్పారు. నివేదికల ప్రకారం తెలంగాణలో 2025 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 53,000 పైచిలుకు ఉండనుందన్నారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు, చికిత్స వ్యయాలను తగ్గించి .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నామని బాలా చెప్పారు. ఎంఆర్–లినాక్ వంటి అధునాతన మెషీన్లను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి దేశీయంగా తమ మెషీన్లు 500 పైచిలుకు ఉన్నట్లు వివరించారు. ఎలెక్టాకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాల్లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. -
రిమోట్ ఓటింగ్ మెషిన్ ను సిద్ధం చేసిన ఈసీ
-
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్
ముంబై: సంతకాలను అచ్చుగుద్దినట్టుగా కాపీ చేసే కేటుగాళ్లను చూశాం. ఫోర్జరీ సంతకాలతో అవతలి వాళ్లకే కాదు, ఆ సంతకంగల వారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా అనేక లావాదేవీలతో భారీ మోసాలకు పాల్పడే నేరగాళ్లు మన చుట్టూ చాలామందే అన్నారు. తాజాగా సిగ్నేచర్లను కాపీ చేస్తున్న మెషీన్ ఒకటి ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. సంతకాల రోజులు పోయాయి ..ఈ మెషీన్ సంతకాన్ని ఖచ్చితంగా కాపీ చేయగలదు అంటూ ట్వీట్ చేశారు. పెన్ను పట్టుకుని అక్కుడున్న సంతకాన్ని అచ్చంగా దించేస్తున్న వైనంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అయితే ఈ మెషీన్‌లోని టెక్నాలజీ ఏంటి, ఏ కంపెనీ మెషీన్ అనే దానిపై క్లారిటీ లేదు. ఇది చాలా ప్రమాదకరమని కొందరు, నిశానీ (వేలిముద్రల) రోజులే బావున్నాయని కొందరు, ఓటీపీ ఉందిగా అంటూ మరికొందరు కమెంట్ చేశారు. కానీ సాధారణంగా సంతకంలోని స్ట్రోక్ ఒక సంతకానికి మరో సంతకానికి భిన్నంగా ఉంటుంది, కాబట్టి సంతకాన్ని మాత్రమే యంత్రం కాపీ చేయగలదు కానీ, స్ట్రోక్‌ను కాపీ చేయలేదని ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే మరో యూజర్ దమ్ముంటే దీన్ని కాపీ చేయండి అంటూ సినీనటుడు, బాలకృష్ట సంతకాన్ని షేర్ చేయడం నవ్వులు పూయిస్తోంది. GONE are the days of signatures ..This machine can copy a signature exactly pic.twitter.com/mNQI0v8fbc — Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2022 Try copy this pic.twitter.com/vAwoT5jVsq — Mr.an's (@anildicon) October 22, 2022 But a machine can copy a signature but generally the stroke in a signature is different from one signature to another signature, the machine can follow only one signature but can’t copy the stroke of the signature who is signing, machines can’t — CA MSR (@MUNAGAS) October 22, 2022 -
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
స్టాంప్ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్’ తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో ఫ్రాంకింగ్ మిషన్ సేవలు అందని ద్రాక్షగా తయారయ్యాయి. డిజిటలైజేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు ఫ్రాంకింగ్ మిషన్లు అందుబాటులో తెచ్చినప్పటికీ ఆచరణలో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది. పాత మిషన్లు మొరాయిస్తుండటంతో ఆధునిక యంత్రాల సరఫరా జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో వినియోగంలోకి తేవడం లేదు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మొక్కుబడిగా పనిచేస్తుండగా, మరికొన్నింటిలో మూలన పడిపోయాయి. ఫలితంగా దస్తావేజుదారులు ప్రైవేటు ఫ్రాంకింగ్ మిషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. స్టాంప్ డ్యూటీ కడితేనే.. ఇళ్లు, వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నవారు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి 0.5 శాతం హైపోతిక్ చార్జీ (స్టాంప్ డ్యూటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించిన తర్వాతనే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాన్ని విడుదల చేస్తాయి. రూ.1000 లోపు అయితే స్థానికంగా ఉండే లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ల వద్ద చెల్లించవచ్చు. అంతకన్నా మించి అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా ముట్టినట్టు స్టాంప్ వేసి ఇస్తారు. నిండా నిర్లక్ష్యం.. ఫ్రాంకింగ్ మిషన్‌లో డిపాజిట్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దస్తావేజుదారులు ఆరోపిస్తున్నారు. చిన్న డిజిటల్ యంత్రమైన ఫ్రాంకింగ్ మిషన్‌ను ఎప్పటికప్పుడు రీచార్జి చేయించాల్సి ఉంటుంది. రూ.20 లక్షలను ప్రభుత్వానికి ముందస్తుగా డిపాజిట్ చేస్తే అంత విలువైన స్టాంపుల స్టాంపింగ్‌కు కావాల్సిన ముడిసరుకును (ఇంక్) సరఫరా అవుతోంది. అయిపోతే మళ్లీ చార్జీ చేసుకోవాలి. ప్రైవేటు స్టాంప్ వెండర్ల విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఆయితే వారి దగ్గర రూ. వెయ్యికి మించి స్టాంపింగ్‌కు వీలు లేదు. రిజిస్ట్రేషన్ అధికారులు మిషన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే మరమ్మతు చేయించకపోవడమే కాకుండా రీచార్జి చేయించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆదాయం సమకూరుతున్నా.. ప్రస్తుతం రూ.100 మించిన స్టాంపులను అమ్మడం లేదు. స్టాంప్ డ్యూటీకి సరిపడా స్టాంపులను కొనుగోలు చేయడం కష్టమవుతోంది. ఆ మొత్తాన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లిస్తే అందుకు సరిసమానమైన స్టాంప్‌ను ఈ ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా వేస్తారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నెలకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ రుణాల మంజూరుకు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద నెలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయినప్పటికీ అవసరమైన ఫ్రాంకింగ్ మిషన్ల నిర్వహణపై శ్రద్ధ కనబర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
నిమిషాల్లో వంటలు చేసే రోబో మెషిన్
ఎంతటి టెక్నాలజీ అయినా, ఎలాంటి సౌకర్యమైనా.. అందరికీ సులభంగా, సౌలభ్యంగా ఉండే మెషిన్స్‌కి ఓ రేంజ్లో డిమాండ్ ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న మేకరే ఈ రోబో మెషిన్(ఆటోమెటిక్ డ్రమ్ కుకింగ్ మెషిన్). ఇది 360 డిగ్రీస్ గిర్రున తిరుగుతూ ఎలాంటి వంటకాన్నైనా నిమిషాల్లో చేసేస్తుంది. ఈ నాన్ స్టిక్ పాట్ రోబో కమర్షియల్ ఫ్రైయింగ్ కుకర్.. అడుగు భాగంలో రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. చిత్రాన్ని గమనించినట్లైతే.. ఇరువైపులా స్టాండ్‌కి పైభాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ చాలా టేస్టీగా వండేస్తుంది ఈ గాడ్జెట్. 85 డిగ్రీల నుంచి 230 డిగ్రీల వరకూ 7 లెవల్స్‌లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. ఈ ఇంటెలిజెంట్ రోలింగ్ మెషిన్ ప్రత్యేకమైన పాత్ర(నాన్ స్టిక్ డ్రమ్) కలిగి ఉంటుంది. దాన్ని మేకర్ నుంచి సులభంగా వేరు చేసుకుని.. క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన మూత ఉంటుంది. దాంతో 360 డిగ్రీస్ తిరిగినా దీనిలోని ఆహారం సురక్షితంగా ఉంటుంది. మూతకు పైభాగంలో యాంటీ-స్కాల్డింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాని పక్కనే ఎయిర్ వాల్వ్ ఉండటం వల్ల ఇందులో వంట వేగంగా కుక్ అవుతుంది. చదవండి: ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మాయదారి మహమ్మారి విజృంభణ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం ఈ మూడు విషయాలు అత్యంత కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా మాస్క్‌లు. జేబులో రూపాయి లేకున్నా బయటకు వెళ్లవచ్చేమో కానీ ముఖానికి మాస్క్ లేకుండా మాత్రం అడుగు బయట పెట్టలేం. మాస్కుల్లో.. సర్జికల్, ఎన్ 95, కుట్టిన మాస్కులు, లేదా చేతి రుమాళ్ల వంటి వివిధ రకాల వాటిని వాడుతున్నారు ఇటీవల బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ప్రజలకు మాస్కులు పెట్టే యంత్రానికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో యంత్రం ముందు ఓ వ్యక్తి కూర్చొని ఉంటే కొన్ని సెకన్లకు యంత్రం దానంతట అదే మనిషి కూర్చున్న దిశగా ముఖానికి మాస్కును విసురుతుంది. ఈ మాస్కు వ్యక్తి ముఖానికి సరిగ్గా ఇముడుతుంది. ఈ యంత్రాన్ని అలెన్ పాన్ అనే వ్యక్తి తయారు చేశాడు. దీనికి ది కరేనేటర్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది దాకా వీక్షించగా అనేక మంది కామెంట్ చేస్తున్నారు. (మాస్కు.. మరిచితిరా!) My man invented “The Karenator”. A machine to blast masks onto mask-less people. Hilarious...🤣🤣🤣pic.twitter.com/bzSsy7vhXy — Rex Chapman🏇🏼 (@RexChapman) August 17, 2020 -
వరి నాట్లేసే పరికరం
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పట్టభద్రుడైన ఓ యువకుడు చిన్న కమతాల్లో వరి సాగు చేసే రైతుల ఇబ్బందులు, ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు అందిస్తున్నారు. అతని పేరు యడ్ల ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గున్నతోట వలస స్వస్థలం. దేశ విదేశాల్లో వాడుతున్న యంత్రాలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేశాడు. చిన్న రైతులకు ఉపకయోగపడే వరి నాటే పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాడు. సాక్షి, బొబ్బిలి :ప్రయోగాలకు అవసరమైన పట్టుదల, ఆలోచన ఉన్నాయి కానీ చేతిలో డబ్బు లేదు. ఇతరు సహాయం కోసం ఉమామహేశ్వరరావు ఎదురు చూడలేదు. ఆరు నెలలు ప్రైవేటు ఉద్యోగం చేసి కూడబెట్టిన రూ. 30 వేలతో వెల్డింగ్ మెషిన్, ఇనుప సామగ్రిని కొనుగోలు చేసి, ప్రయోగాలు కొనసాగించారు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. వెల్డింగ్ పనిలో తన స్నేహితుడు మెండి సత్యనారాయణ సహాయపడ్డారన్నారు. ఒక మనిషి ఈడ్చుకుంటూ వెళ్తూ వరి నాట్లు వేసే చిన్న పరికరం సిద్ధం అయింది. దీనికి ఎటువంటి ఇంజిన్ లేదు. పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. తమ గ్రామంలోనే ఇటీవల ఓ రైతు పొలంలో తాను తయారు చేసిన పరికరంతో ఇటీవలే తొలిసారి వరి నాట్లు వేసి అందరితోనే శెభాష్ అనిపించుకున్నారు. విత్తనాలను ట్రేలో వేసి మొలక గడ్డి రీతిలో వరి నారు పెంచి, ఈ పరికరంతో నాట్లు వేసుకోవచ్చు. ఈ పరికరాన్ని నడపడానికి ఒక మనిషి చాలు. ఎకరా పొలంలో నాలుగు గంటల్లో నాట్లు పూర్తి చేశానని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. వరుసల మధ్య 14 సెం.మీ. దూరం ఉంటుంది. వరుసల్లో మొక్కల మధ్య 7 సెం.మీ. దూరం పెట్టామని, దీన్ని రైతు వసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని అన్నారు. ఈ వరుసల మధ్య పెరిగే కలుపు తీసే ఇనుప పరికరలను కూడా రూపొందించటం విశేషం. వరి నాటే పరికరం పనితీరును పరిశీలించిన బొబ్బిలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మాల కొండయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న కమతాల్లో వరి నాట్లు వేసే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వరి నాట్లు వేసే పరికరాన్ని రైతులకు రూ.10 నుంచి 15వేల మధ్య విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇతరులెవరయినా తోడై పెట్టుబడి పెడితే స్టార్టప్ కంపెనీని నెలకొల్పి చిన్న రైతులకు ఉపయోగపడే పరికరాలను పెద్ద సంఖ్యలో తయారు చేసి రైతులకు అందించాలన్నది తన అభిమతమని ఉమామహేశ్వరరావు(93989 02285) తెలిపారు. – రేగులవలస వ్యాస్‌బాబు, సాక్షి, బొబ్బిలి -
ఇక.. చూస్తుండగానే బూడిద!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్–19 మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే 650కిపైగా మరణాలు నమోదయ్యాయి. కోవిడ్‌తో వ్యాధి తీవ్రమైన వారు ఎక్కువ మంది నగరానికే వస్తుండటం.. ఇక్కడ మరణించిన వారిని తిరిగి తమ స్వగ్రామాలకు తీసుకెళ్లలేక చాలామంది అంత్యక్రియల భారాన్ని ఆస్పత్రులపైనే వదిలివేస్తున్నారు. వీరి అంత్యక్రియలకు ఆయా ప్రాంతాల్లో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటమే కాక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం వీలైనన్ని దహన వాటికలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న గ్యాస్ ఆధారిత దహన వాటికను గత నెలలో ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రయోగాత్మకంగా వాడి చూశారు. పలు లోపాలుండటంతో వాటిని సరిచేస్తామని సంబంధిత ఏజెన్సీ తెలిపింది. కానీ.. దానివల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటాన్ని దృష్టిలో ఉంచుకొని విరమించుకున్నారు. ఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో వాడుతున్న దహనవాటికలను పరిశీలించిన అధికారులు అవి ఉపయోగకరంగా ఉన్నాయని భావించి అలాంటివి నాలుగు తెప్పించారు. ఒక్కో విద్యుత్ దహన వాటికకు దాదాపు రూ. 45 లక్షలు వ్యయం కాగా, అవసరమైన షెడ్డు, ఇన్స్టలేషన్ పనులు తదితరమైన వాటికి వెరసి రూ. 88 లక్షలవుతుంది. వీటిని చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాటి అమరిక పనులు జరుగుతున్నాయి. ఈ వారాంతంలోగా ఇన్స్టలేషన్ పనులన్నీ పూర్తిచేసి, వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేస్తున్నారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌తో పనిచేసే వీటికి ఒక్కో మృతదేహానికి ఒక గ్యాస్ సిలిండర్ సరిపోతుందని, దాదాపు 75 నిమిషాల్లో మృతదేహం దహనం అవుతుందని అధికారులు తెలిపారు. దహనం చేయాల్సిన మృతదేహాలు పెరిగే కొద్దీ.. ఈ సమయం 45 నిమిషాలకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. గతంలో మూతపడ్డ అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఎర్రగడ్డ శ్మశానవాటికల్లోని విద్యుత్ దహన వాటికలను కూడా వినియోగంలోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ఈ పరికరంతో కరోనా వైరస్.. మటాష్
నిజాంపేట్: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రగతినగర్‌లోని ఎలీప్ పారిశ్రామికవాడలో ఓ స్టార్టప్ కంపెనీ జెర్మీబ్యాన్ పరికరాన్ని తయారు చేసింది. నియో ఇన్వెంట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఈ పరికరం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలాంటి వైరస్‌నైనా 15 నిముషాల్లో నాశనం చేస్తుంది. ఈ పరికరంలో అల్ట్రా వైలెట్ కిరణాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈ పరికరం 99.9 శాతం వరకు ఉపరితలం, వాయువులో ఉన్న ఎలాంటి సూక్ష్మ జీవులనైనా చంపేస్తుంది. దీంతో కరోనా వైరస్‌కు సైతం చెక్ పెట్టే సామర్థ్యం ఈ పరికరానికి ఉందని సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ జెర్మీబ్యాన్ను ఐసోలేషన్ కేంద్రాలు, ఆస్పత్రులు, ఇతర సాధారణ ప్రదేశాల్లో ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని రిమోట్ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది. జెర్మీబ్యాన్ను ఆన్ చేసినపుడు పరిసర ప్రదేశాల్లో మనుష్యులు ఉండకూడదు. పరికరాన్ని ఆఫ్ చేసిన 15 నిముషాల తరువాత మాత్రమే వెళ్లాలి. నియో ఇన్వెంట్రానిక్స్ సంస్థకు చెందిన శిరీష చక్రవర్తి ఈ పరికరాన్ని అటల్ ఇంక్యూబేషన్ సెంటర్, ఎలీప్ వీహబ్ సహకారంతో తయారు చేశారు. ఈ జెర్మీబాన్ పరికరాన్ని మార్చి రూపొందించిన నిర్వాహకులు ఏప్రిల్ నెలలో బ్యాక్టీరియా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం వీరుకున్న సామర్థ్యంతో రోజుకు 10 జెర్మీ బాన్లు తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే రోజుకు 50 వరకు పరికరాలను తయారు చేస్తామంటున్నారు. అదే విధంగా రోబొటిక్ జెర్మీబాన్, డొమాస్టిక్ ఎయిర్ స్టెరిలైజర్ లను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించాలి.. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఈ జెర్మీబ్యాన్ లను కరోనా నియంత్రణకు విరివిగా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్కొ జెర్మీబ్యాన్ రూపకల్పనకు రూ.75 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతోంది. అదే విధంగా ఇళ్లల్లో వాడుకునేందుకు డొమెస్టిక్ స్టెరిౖలైజర్ను తయారు చేస్తున్నాం. మనుషుల అవసరం లేకుండా సంబంధిత ప్రదేశంలో వైరస్‌ను నాశనం చేసే రొబొటిక్ జెర్మీబ్యాన్ లను తయారు చేస్తాం. – శిరీష చక్రవర్తి, నియో ఇన్వెంట్రానిక్స్ నిర్వాహకురాలు -
25 రోజులు.. వేలమార్లు ప్రయోగం..
రెండు నెలల క్రితం మాస్క్, శానిటైజర్ అంటే తెలియని వారు సైతం.. ప్రస్తుతం అవి లేకుండా ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిత్యం జాగ్రత్తలు తప్పనిసరిగా మారింది. కరోనాను అడ్డుకునేందుకుఏకమైన మార్గం ఫిజికల్ డిస్టెన్స్ – హ్యాండ్ శానిటైజేషన్ మాత్రమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే మన చేతులతో వస్తువులనుతాకుతుంటాం. అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో మనం చెప్పుకుంటున్న హ్యాండ్ శానిటైజర్ల వినియోగం సందర్భంలోనే మన చేతులతో హ్యాండ్ శానిటైజర్ పంపును తాకడమో లేక మరోవ్యక్తి దాన్ని చేతులకు అందించే క్రమంలోమన దగ్గరకు రావడమో జరుగుతోంది. కొన్నిచోట్ల లెగ్ ప్రెషర్ డిస్పెన్సర్ ఉన్నా అవి కొన్ని ప్రెస్‌ల తర్వాత పనిచేయకపోవడంతో చేతికి పనిచెప్పాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన ఓ యువ ఇంజినీర్ ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులోలేని పూర్తి ఆటోమేటెడ్ శానిటైజేషన్ డిస్పెన్సర్‌ను రూపొందించాడు. కుత్బుల్లాపూర్ :మన చేతులతో ఏమాత్రం తాకకుండా డిస్పెన్సర్‌కు దగ్గరగా చేతులను తీసుకెళ్లినప్పుడు ఆటోమెటిక్‌గా 4 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ చేతుల్లో పడటమే దీని ప్రత్యేకత. ఇందులో జెల్ బేస్డ్ శానిటైజర్‌తో పాటు లిక్విడ్ బేస్డ్ శానిటైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు. పది లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ డిస్పెన్సరీని ఒక్కసారి ఫిల్ చేస్తే దాదాపు రెండు వేలసార్లు లిక్విడ్‌ను పొందవచ్చు. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ ఉపకరణానికి నెలకు ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చు కావడం విశేషం. ఉమ్మడి కుటుంబాలు, అధిక సంఖ్యలో సిబ్బంది ఉండే కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పలుచోట్ల దీన్ని ఉపయోగించవచ్చు. ఆలోచన వచ్చింది ఇలా.. నగరంలోని సాగర్‌రోడ్డు గుర్రంగూడకు చెందిన మెకానికల్ ఇంజినీర్ రాయంచి అభినవ్ కుమార్ లాక్డౌన్ సందర్భంలో ఓసారి బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన వారికి బ్యాంక్ సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేస్తూ కనిపించారు. ఈ సందర్భంలో సంబంధిత వ్యక్తులు దగ్గరగా రావడం, ప్రత్యేకంగా శానిటైజర్‌ను అందించేందుకు ఏకంగా ఓ వ్యక్తిని కేటాయించడం గమనించి ఆటోమేటెడ్ డిస్పెన్సరీని రూపొందించే ఆలోచనకు కార్యరూపం దాల్చాడు. తొలుత ఇంట్లో ఉన్న పాత ఆయిల్ క్యాన్‌తో ఈ ప్రయోగం మొదలు పెట్టారు అభినవ్ కుమార్. పలుమార్లు చేసిన ప్రయత్నాల్లో పలు రకాల నీటి పంప్‌లను, సబ్మెర్సిబుల్ పంప్‌లను వినియోగించి విఫలమయ్యాడు. చివరకు ఫుడ్‌గ్రేడ్ డీసీ పంప్, ఇండస్ట్రీయల్ గ్రేడ్ సెన్సార్, ఇతర పరికరాలతో విజయవంతంగా రూపొందించాడు. 25 రోజులు.. వేలమార్లు ప్రయోగం.. ఈ పరికరంలో ప్రధానమైన హార్డ్‌వేర్ డిజైన్‌ను రూపొందించేందుకు 25 రోజుల సమయం పట్టింది. అనంతరం రోబొటెక్ సహాయంతో సెన్సార్, మోటార్లను వేలమార్లు పరీక్షించి చూశాను. ఇప్పటి వరకు మార్కెట్ రకాల డిస్పెన్సరీలు రూ.8 నుంచి రూ.18 వేల వరకు ధర ఉన్నప్పటికీ అవి కేవలం లిక్విడ్ బేస్డ్ డిస్పెన్సరీలు మాత్రమే. వినాగో ఇన్నోవేషన్ బ్రాండ్ పేరిట ‘శాని–సెన్స్’ పేరుతో ఈ కాంటాక్ట్ లెస్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీని కేవలం రూ.6 వేలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఇండిపెండెంట్ ఇళ్లకు స్మాల్ డిస్ ఇన్స్పెన్షన్ టెన్నల్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. – రాయంచి అభినవ్ కుమార్, శాని–సెన్స్కాంటాక్ట్ లెస్హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీ రూపకర్త -
తొలి దేశీ కరోనా టెస్టింగ్ పరికరం..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్ 6800 టెస్టింగ్ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్-19 టెస్ట్‌ల కోసం దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ పరికరాన్ని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు పీపీఈ కిట్లను దేశీయంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు భారత వాయుసేన ఆధ్వర్యంలో భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. చదవండి : ఫాసీ వ్యాఖ్యలతో ఏకీభవించను: ట్రంప్ -
పదివేల రూపాయలకే ఆక్సిజన్ యంత్రం!
కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు.