man dies
-
సమీరా వచ్చేస్తున్నా!.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..!
శ్రీకాళహస్తి: ‘సమీరా వచ్చేస్తున్నా... మరో 15 నిమిషాల్లో నీ ముందుంటా.. నువ్వేం కంగారుపడకు.. బాబు తిన్నాడా..! నువ్వు భోజనం చేసి పడుకో.. ఐ యామ్ ఆన్ది వే..’ అన్న భర్త తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడం ఆమె గుండెల్ని పిండేసింది. ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం.. బుచ్చినాయుడుకండ్రిగ మండలం, జోగికండ్రిగకు చెందిన కొప్పల ధర్మయ్య కుమారుడు కొప్పల నారాయణ(25) డిగ్రీ వరకు చదివి రౌతుసూరమాల సమీపంలో ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నారాయణకు పెళ్లకూరు మండలం, నెలబల్లి దళితవాడకు చెందిన సమీరాతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య సమీరా కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసేందుకు నారాయణ రెండు రోజుల కిందట నెలబల్లి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తికి వెళ్లాడు. తిరిగి వస్తూ తన మేనత్త ఊరైన తాటిపర్తికి చేరుకున్నాడు. రాత్రి పది అవుతున్నా నారాయణ ఇంటికి రాకపోవడంతో సమీరా భర్తకు ఫోన్ చేసింది. తాను తాటిపర్తిలో ఉన్నానని, మరో 15 నిమిషాల్లో నీ ముందుంటానని సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో నెలబల్లికి మార్గమధ్యంలో నాయుడుపేట–మదనపల్లి జాతీయ రహదారికి అతి సమీపంలో రామానాయుడు ఎస్టీ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బండరాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. బండరాయిని ఢీకొన్న సమయంలో నారాయణ బైక్‌తో పాటు ముళ్లపొదల్లో పడిపోవడంతో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఇప్పుడే వస్తానన్న భర్త తెల్లారైనా ఇంటికి రాకపోవడంతో సమీరా తాటిపర్తిలోని తమ బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు ఆరా తీయగా ముళ్లపొదల్లో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరుమన్నారు. తొట్టంబేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. -
అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్లో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx — Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024 -
సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?
లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్ -2 సినిమాను చూసుందుకు థియేటర్లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్ తివారీగా గుర్తించారు. प्रदेश के लखीमपुर खीरी के एक मॉल में चलते–चलते एक युवक को हर्ट अटैक आ गया, युवक नीचे गिरा और मर गया।#lakhimpurkheri pic.twitter.com/jmQpfWvO9w — Aviral Singh (@aviralsingh15) August 28, 2023 అయితే, తివారీ.. థియేటర్ వద్ద ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు -
గేమ్‌లో ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. మితిమీరి తాగడంతో..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్ స్ట్రీమింగ్‌లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు! చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్ 'డౌయిన్'(చైనా టిక్‌టాక్)లో ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్‌లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్‌లో భాగంగా లైవ్‌లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‌లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా. మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్‌లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చేరాడని తెలిపాడు. 'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్ఫామ్లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
ఘోరం.. కళ్ల ముందే మరిగే జావలో పడిన వ్యక్తి
వైరల్: అంతా చూస్తుండగా కళ్ల ముందు ఘోరం జరిగింది. పొయ్యి మీద వేడి వేడి జావ మరుగుతుండగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు రక్షించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ మరిగే జావ నుంచి అతను బయటపడగలిగాడు. కానీ.. కడకు ఈ ఘటన విషాదంగా ముగిసింది. తమిళనాడు మధురైలో జులై 29న ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇవాళ(మంగళవారం) బాధితుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన.. ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడులో ‘ఆడి వెల్లి’ జాతర సందర్భంగా అమ్మవారి గౌరవార్థం జావను వండి.. ప్రజలకు పంచుతారు. గత శుక్రవారం మధురై పలగనాథంలో ముత్తు మారియమ్మ ఆలయం సమీపంలో భక్తులు కొందరు ఇళ్ల ముందరే మీదే పెద్ద పెద్ద వంట పాత్రల్లో జావను మరిగిస్తున్నారు. ఆ సమయంలో ముత్తుకుమార్ అనే ఓ వ్యక్తి మైకంతో అక్కడికి వచ్చాడు(తాగి ఉన్నాడని స్థానికులు చెప్తున్నారు). తూలిపోతూనే ఆ గంజులో పడిపోయాడు. అతను పడిపోయే టైంలోనే చూసి కొందరు అరుస్తూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. జావ వేడిగా ఉన్నా.. ముత్తుకుమార్ మైకంలో ఉండిపోయిన ముత్తుకుమార్ కదలకుండా అలాగే ఉండిపోయాడు. చివరికి తమ వల్ల కాకపోవడంతో స్థానికులు జావ గంజునే బోర్లించారు. కాలిన గాయాలతో పైకి లేచిన ముత్తుకుమార్‌ను స్థానికులు రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 65 శాతం గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. video disclaimer: ఈ వీడియో ఘటనకు సంబంధించింది.. కొందరికి ఇబ్బందికరంగా అనిపించొచ్చు -
ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం
అనంతపురం సిటీ: ఏ ఊరో.. ఏం పేరో తెలియదు.. పట్టుమని 30 ఏళ్లు కూడా ఉండవు. తనంతట తాను రైలు కిందే పడ్డాడో.. లేక రైలొచ్చి ఢీకొందో ఏమో గానీ శరీర భాగాలన్నీ ఎక్కడికక్కడ వేరయ్యాయి. కాళ్లు, చేతులు, తల మాయం కాగా పట్టాల మధ్యలో మొండెం మాత్రమే పడి ఉంది. మోకాళ్ల నుంచి నడుం భాగం మాత్రమే మిగిలింది. చూడ్డానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ భయంకరమైన దృశ్యం అనంతపురంలోని రాంనగర్ ఫ్లై ఓవర్ నుంచి ప్రసన్నాయపల్లి వైపు నగరానికి సుమారు కిలోమీటరు దూరంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి, భయంతో పరుగులు తీశారు. చదవండి: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. సమాచారం అందుకున్న జీఆర్పీ సీఐ నాగరాజు, ఎస్ఐ విజయ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖరరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటలోపు ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం వద్ద లేత నీలం రంగు చెప్పులు పడి ఉన్నాయి. తల, కాళ్లు, చేతులు మాయమై ఉండడాన్ని బట్టి చూస్తే కుక్కలో, పందులో లాక్కెళ్లి ఉంటాయని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పరిసరాల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని సర్వజనాస్పత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ సీఐ నాగరాజు తెలిపారు. కాగా, మృతుడు ఎవరు, ఏం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో శనివారం రాత్రి ఓ ఫంక్షన్ జరిగిందని, మృతుడికి ఆ ఫంక్షన్‌కు సంబంధాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
మనోహరబాద్(తూప్రాన్): భార్య కాపురానికి రావడంలేదని తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చెట్లగౌరారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెట్ల గౌరారం గ్రామానికి చెందిన డ్రైవర్ బాబర్(30)తో తూప్రాన్‌కు చెందిన నూర్జహాన్ బేగంతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలలుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్తతో గొడవపడి నూర్జహాన్ బేగం పుట్టింకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబర్ మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈనెల 2న డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంటిలో చెప్పి తిరిగిరాలేదు. మక్సాని కుంటబావిలో ఆదివారం శవమై తేలాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతుడి తండ్రి మౌలానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకి పని వత్తిడి పెరగడం.. మరోవైపు చేసిన అప్పు ఎలా కట్టాలని మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్ పాతబస్తీలో నివాసం ఉంటున్న బొల్లి అశ్వినికి బొల్లి వెంకటేష్ (31)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంకటేష్ హిమాయత్‌నగర్‌లో ఉన్న కర్ణాటక బయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అశ్విని స్ధానికంగా ఓ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. గురువారం భర్త వెంకటేష్ ఇంట్లో ఉన్న సమయంలోనే అశ్విని పనికి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటి తలుపులు కొట్టినప్పటికి వెంకటేష్ తీయకపోవడంతో కిటికీ నుంచి చూడగా వంటగదిలో ఉన్న ఫ్యాన్‌రాడ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చుట్టు పక్కలవారి సహాయంతో తలుపులు తెరిచి వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే అశ్విని పోలీసులకు సమాచారం అందించింది. ‘ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నా... నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ వెంకటేష్ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు శిబిరం వద్ద యువకుడి అనుమానాస్పద మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రైతు నిరసన శిబిరం వద్ద అనుమానాస్పద మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నిహాంగ్ సిక్కులే ఆ వ్యక్తిని హతమార్చారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిపై ఒకప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి : తగ్గేదే..లే అంటున్న వరుణ్: బీజేపీకి షాక్, సంచలన వీడియో సోనిపట్ జిల్లా కుండ్లిలోని రైతు నిరసన వేదిక వద్ద యువకుడి మృతదేహం పోలీసు బారికేడ్‌కు వేలాడుతూ కనిపించింది. బాధితుడిని లఖ్వీర్ సింగ్‌గా గుర్తించారు. ఎడమ మణికట్టు తెగిపడి రక్తపు మడుగులో ఉన్న వైనం ఆందోళన రేపింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకు నిహాంగ్‌లు లఖ్బీర్ సింగ్‌ను కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చేతులు, కాళ్లు నరికివేసి ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసున్నతాధికారి హన్సరాజ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్ నిమిత్తం సోనిపట్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నామన్నారు. సుమారు గత ఏడాది కాలంగా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ వద్ద జరిగిన హింసలో రైతులు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతను రాజేసింది. రైతుల్ని కారుతో గుద్ది హత్య చేశారన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలంలో గురువారం పోలీసులు సీన్ రీక్రియేషన్ కార్యక్రమన్ని కూడా చేపట్టారు. At about 5 am today, a body was found hanging with hands, legs chopped at the spot where farmers' protest is underway (Kundli, Sonipat). No info on who's responsible, FIR lodged against an unknown person. Viral video is a matter of probe, rumours will linger: DSP Hansraj pic.twitter.com/IfWhC2wW4l — ANI (@ANI) October 15, 2021 -
విందుకు వెళ్లి వస్తూ.. కాసేపట్లో ఇంటికి ,అంతలో..
సాక్షి, పరిగి( హైదరాబాద్): ఎదురుగా వస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ పట్టణ కేంద్రంలోని వినాయకచౌక్ పసాలిగల్లికి చెందిన షేక్ అబ్రార్(23), సయ్యద్ ఉమర్ రిజ్వాన్‌లు ఆదివారం నగరంలోని ఓ విందుకు హజయ్యారు. సోమవారం తెల్లవారుజామున తాండూర్ బయలు దేరారు. ఉదయం 5:30గంటలకు మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలో కొడంగల్ నుంచి పరిగి వైపు అతివేంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌నడుపుతున్న షేక్ అబ్రార్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సయ్యద్ ఉమర్ రిజ్వాన్‌కు తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అక్కడికక్కడే మృతి చెందిన అబ్రార్ మృతదేహం రోడ్డుపై పడటంతో వెనుక వస్తున్న వాహనాలు మృతదేహంపై నుంచి వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుల బంధువు షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: Drugs Case: రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్..షాకైన పోలీసులు -
చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): చేను పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడనుకుంటే భర్త పిడుగుపాటుకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన జైనథ్ మండలం గూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట భగవాండ్లు(49), తన భార్య మల్లమ్మ, జీతగాడు(పాలేరు) దాగిరి సంతోశ్, మరో నలుగురు కూలీలతో కలసి శుక్రవారం తన పత్తి చేనులో కలుపు నివారణ, పురుగుల మందు పిచికారీ పనులకు వెళ్లారు. ఆ తర్వాత కూలీలతో కాలినడకన భార్య మల్లమ్మ ఇంటికి చేరుకుంది. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో పాలేరు సంతోశ్ ఎడ్ల బండి తోలుతుండగా, వెనుకాల నిల్చోని భగవాండ్లు వస్తున్నాడు. ఎడ్లబండిపై ఒకసారిగా పిడుగుపడి భగవాండ్లు అక్కడిక్కడే మృతిచెందాడు. సంతోశ్‌కు కాలి భాగంలో గాయాలయ్యాయి. ఎడ్లకు సైతం స్వల్ప గాయాలు కాగా, ఎటువంటి హాని జరుగలేదు. స్థానికులు సంతోశ్‌ను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి -
డ్రైనేజీ మృతుల కుటుంబాలకు డబుల్ ఇళ్లు
సాక్షి, ఎల్బీనగర్( హైదరాబాద్): బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లోని పద్మావతినగర్ కాలనీలో ఇటీవల డ్రైనేజీ పూడికతీత పనుల్లో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు చెరో డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం నగర మేయర్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మేయర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను శివకుమార్ భార్య ధరణి శ్రావణిగౌరి, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మకు అందచేశారు. వనస్థలిపురంలోని రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ప్లాట్లలో 701 నెంబర్‌ను భాగ్యమ్మకు, 702 ప్లాట్లును శ్రావణి గౌరికి కేటాయించారు. ఇప్పటికే వీరికి రూ.17 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో మల్లన్నసాగర్ నిర్వాసితుడు మృతి
గజ్వేల్‌రూరల్: పరిహారం అందలేదన్న మనస్తాపంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుడు గుండెపోటు కారణంగా గురువారం మృతిచెందాడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుడు ఆరె నరసింహులుకు భార్య సత్తమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో ఆయనకు 13 గుంటల వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నాయి. కాగా, తమ బంధువులకు పరిహారం అందగా, తమకు ఇంతవరకు ప్యాకేజీకానీ, ఇల్లు కానీ రాలేదని ఆరు నెలలుగా ఆయన మనస్తాపంతో ఉన్నాడు. ఇదే బెంగతో నరసింహులు గుండెపోటుతో మృతి చెందాడని ఆయన భార్య సత్తమ్మ గజ్వేల్ ఆర్డీఓకు రాసిన లేఖలో పేర్కొంది. భూమి, ఇల్లు కోల్పోయిన ఈ కుటుంబం ప్రస్తుతం సంగాపూర్‌లో అద్దెకు ఉంటోంది. -
వికటించిన ప్రయోగం: హెలికాప్టర్ తయారీ.. బ్లేడ్ పడి వ్యక్తి మృతి
ముంబై: విమానయానం ఇంకా సామాన్యులకు చేరువకాలేదు. ఆశగా ఆకాశంలోకి చూడటమే తప్ప.. ఆ రెక్కల విహంగంలో ఎక్కి ప్రయాణించడం నేటికి కూడా సామాన్యుడికి తలకు మించిన భారమే. ఈ క్రమంలో ఓ వ్యక్తి తానే హెలికాప్టర్‌ను తయారు చేద్దామని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది.. దాని బ్లేడ్ అతడి మీద పడి మరణించాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర యావత్‌మాల పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మహగావ్ తాలుకా ఫుల్సవంగా గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి మెకానిక్‌గా పని చేసుకుంటూ ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి విమానాలు, గాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఈ క్రమంలో ఇబ్రహీం తానే సొంతంగా ఒక హెలికాప్టర్ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన లోపం వల్ల బ్లేడ్ అతడి తలపై పడింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇబ్రహీం మృతి చెందాడు. -
వ్యాక్సిన్ సెంటర్లో పోలీసుల ఓవర్ యాక్షన్, యువకుడి ఆత్మహత్య
లక్నో: వ్యాక్సిన్ సెంటర్లో వివాదం విషాదాన్ని నింపింది. పోలీసులు తనను అవమానించి, దాడి చేశారనే క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్, బాగ్పట్ జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుగురు పోలీసులపై కేసు నమోదైంది. బాధితుల సమాచారం ప్రకారం పశ్చిమ యూపీ జిల్లాలోని ఒక టీకా కేంద్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ వివాదానికి తెర తీసింది. ఎలాంటి కారణంగా లేకుండానే టీకా కేంద్రంలోకి వెళ్లనీకుండా బాధిత యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. మెడికల్ సిబ్బంది వ్యాక్సీన్ తీసుకునేందుకు అతని పేరు పిలిచినా లోనికి వెళ్లనీయకుండా అడ్డుపడి, అతనిపై దాడి చేసి కొట్టారు. సోమవారం మధ్యాహ్నం బాగ్‌పట్‌లోని టీకా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు సంఘటన అనంతరం పోలీసులు ఇంటికి వెళ్లి మళ్లీ ఆ యువకుడిపై దాడి చేశారు. అడ్డొచ్చిన బాధితయువకుడి తల్లిపై కూడా దాడి చేశారు. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేని యువకుడు గ్రామానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. పోలీసులు తన కొడుకును టీకా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఘర్షణ మొదలైందని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు తన కొడుకును చుట్టుముట్టి, దారుణంగా కొట్టారని, ఆ తరువాత ఇంటికి వచ్చి తనపై భార్యపై కూడా దాడి చేశారని వాపోయాడు. దీంతో భయపడి తన కొడుకు పారిపోయి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని కన్నీంటి పర్యంతమయ్యాడు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు పదిమంది పోలీసులను విధులనుంచి తొలగించామనీ, బాగ్పట్ పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని, రు. -
16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం
సాక్షి, జగిత్యాల: జిల్లా వెల్గటూరు మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన మల్లవేని రాజు (35) గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య స్వప్న, కూతురు అవిఘ్నయ(2) ఉన్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు వ్యవసాయ భూమిలో పనికి వెళ్లాడు. అయితే ఆ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి స్తంభానికి విద్యుత్ లైన్ ఉంది. ఎన్నో ఏళ్లుగా తీగలు వేలాడుతూ ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో భూమి యజమాని తాత్కాలికంగా కర్రను సపోర్టుగా పాతాడు. పొలంలో రాజు ట్రాక్టరుతో పని చేస్తుండగా.. వేగంగా వీచిన గాలులకు కర్ర కింద పడిపోవడంతో ట్రాక్టరుకు తగిలిన తీగలు రాజుకు చుట్టుకుపోయాయి. దీంతో తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురైన రాజు అక్కడికక్కడే చనిపోయాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని రాజు భార్య స్వప్న ఆరోపిస్తోంది. 16 ఏళ్ల నుంచి ఆ సమస్య ఉందని రాజు సోదరుడు లక్ష్మణ్ చెప్పాడు. ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల క్రితం వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి నాలుగు గేదెలు చనిపోయినా విద్యుత్ సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు. చదవండి: మూగజీవాలపై యమపాశం -
నిరుద్యోగి సునీల్ మృతి, గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటించడం లేదని ఆవేదన చెంది మార్చి 27న సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి విదితమే. పురుగుల మందు తాగిన సునీల్‌ను విద్యార్థులు.. ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సునీల్ మరణించాడు. సునీల్ స్వస్థలం వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండా. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత సునీల్ మృతదేహాన్ని నిమ్స్ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ నేతలు, విద్యార్థులు, సునీల్ బంధువులు మార్చూరి ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి.. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్ సునీల్ నాయక్ కుటుంబాన్ని గాంధీ ఆసుపత్రి వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదని.. ఇది కేసీఆర్ సర్కార్ హత్య అంటూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునీల్.. కేసీఆర్ పేరు ప్రస్తావించాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కేసీఆర్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు తొందరపడి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యోగాలు కల్పిస్తామని బండి సంజయ్ అన్నారు. -
ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు
తరిగొప్పుల: పల్లెల్లో పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు మనుషుల ప్రా ణాలు బలికొంటున్నా యి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం వాల్యా తండాకు చెందిన బానోతు రాజు (22), అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి కోసం సదరు వివాహిత భర్త, బంధువులు వెతకగా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో దొరికారు. అనంతరం గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రూ.20 లక్షలు సదరు వివాహిత భర్తకు రాజు చెల్లించేలా తీర్మానించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు.. అదేరోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
వ్యాక్సిన్ రెండో డోసు : క్షణాల్లో విషాదం
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న ఆందోళన దేశ ప్రజలను మరింత వణికిస్తోంది. అయినా వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలామంది ఒకింత భయపడుతున్న తరుణంలో మహారాష్ట్రలో వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకొన్న కొద్ది సేపటికే ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. థానే జిల్లా భివాండిలోని ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ రెండవ మోతాదును ఇచ్చిన కొద్దిసేపటికే 45 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వైద్యుడి డ్రైవర్‌గా పనిచేస్తున్న సుఖ్‌దియో కిర్దిట్ నిన్న (మంగళవారం) ఉదయం 11 గంటల సమయంలో వ్యాక్సిన్ డోస్ స్వీకరించాడు. కొద్దిసేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మూర్ఛపోయాడు. వెంటనే అధికారులు కిర్దిట్‌ను సమీపంలోని ఐజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారన్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కిర్దిట్ మరణానికి కారణం తెలుస్తుందని భివాండి నిజాంపురా మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యం ఆఫీసర్ డాక్టర్ కేఆర్ ఖరత్ తెలిపారు. కిర్డిట్ మెడికల్ హిస్టరీ, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు మొదటి దశలో వ్యాక్సిన్‌ను అందించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తగా జనవరి 28 న కిర్దిట్ వ్యాక్సిన్ మొదటి మోతాదు తీసుకున్నారు. -
దారుణం: భార్య, పిల్లలు చూస్తుండగానే..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భామిని మండలం లోహరజోల గ్రామంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కుమారస్వామి అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి బైక్‌పై పర్లాకిమిడి వెళ్తుండగా, బైక్‌ను అడ్డగించిన నిందితుడు.. భార్య, పిల్లులు చూస్తుండగానే కుమారస్వామిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: వేధింపులకు తాళలేక టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య -
యువకుడి ప్రాణం తీసిన ఫోన్ సిగ్నల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ(22) తన స్మార్ట్ ఫోన్ లో త్రీజీ సిగ్నల్ సరిగా రాక పోవడంతో సిగ్నల్ కోసం పక్కనే ఉన్న గొరకలమడుగు గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఓ చింత చెట్టు కింద సిగ్నల్ రావడంతో దాని కింద నిల్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. చదవండి: జూరాలకు పోటెత్తిన వరద ఉధృతి.. అప్పటికే అక్కడ భారీ వర్షం పడుతుండటంతో అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. శంభునిగూడెం గ్రామంలో త్రీజీ సిగ్నల్ సరిగా రాదు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారంతా సిగ్నల్ కోసం గొరకలమడుగు గ్రామానికి వెళుతుంటారు. చాలా మంది యువకులు చాటింగ్ కోసం ఎక్కువగా ఆ చెట్టు కిందకే వెళుతుంటారు. సిగ్నల్స్ కోసం వెళ్లిన కృష్ణ పిడుగుపాటుకు గురై మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ! -
కరోనా రోగి ఆత్మహత్య : కానీ అంతలోనే
సాక్షి, పట్నా : కరోనా వైరస్ సోకిన వ్యక్తి (38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి బీహార్‌లోని ప్రభుత్వ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఆవేశం అనర్ధానికి మూలం అన్నట్టుగా.. చనిపోయిన కొద్ది క్షణాలకే అతనికి నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతని బంధువుల తీరని విషాదంలో మునిగిపోయారు. కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం బాధిత వ్యక్తి జూన్ 15 న కరోనా అనుమానిత లక్షణాలతో పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరాడు. అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు వ్యాధి నయం కాదనుకున్నాడో, ఏమో కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని డాక్టర్ కుమార్ వెల్లడించారు. బీహార్‌లో కరోనా బారిన పడ్డ రోగి ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇది అని తెలిపారు. కాగా సోమవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. -
‘రోడ్డుపై మరణిస్తే చెత్త వ్యాన్‌లో తరలించారు’
లక్నో : రోడ్డుపై విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని కరోనా వైరస్‌తో మరణించాడనే భయంతో మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో విసిరిపడేసిన ఘటన యూపీలోని బలరాంపూర్‌లో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్లో ఈ అనాగరిక చర్యను కొందరు చిత్రీకరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బలరాంపూర్‌కు చెందిన మహ్మద్ అన్వర్ (42) స్ధానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గేట్ వద్దే కుప్పకూలి మరణించారు. వీడియో ఫుటేజ్‌లో దృశ్యాల ఆధారంగా మృతదేహం కిందపడిఉండగా, పక్కనే వాటర్ బాటిల్ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు ఉండగా, పక్కనే అంబులెన్స్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. పోలీసుల ఎదుటనే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముగ్గురు చెత్తను తరలించే వాహనంలోకి మృతదేహాన్ని విసిరిన ఘటన రికార్డయింది. ఈ ఘటన అమానుషమని బలరాంపూర్ పోలీస్ చీఫ్ దేవరంజన్ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం దోషులపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కరోనా వైరస్‌తో ఆ వ్యక్తి మరణించాడనే భయంతోనే మున్సిపల్ సిబ్బంది ఈ చర్యకు పాల్పడిఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్స్ ధరించి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించాల్సి ఉందని అన్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరు సరైంది కాదని తప్పుపట్టారు. దీనిపై సీనియర్ అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా అన్వర్ మరణానికి కారణమేంటి, ఆయనకు కరోనా వైరస్ సోకిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. చదవండి : ‘ఇలాగైతే మళ్లీ లాక్డౌన్’ -
మహమ్మారి మందు తాగి మృత్యువాత..
చెన్నై : కోవిడ్-19 వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్సను కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో తమిళనాడులోని బయోటెక్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కోవిడ్-19 చికిత్స కోసం తాము కనుగొన్న దగ్గు మందు ఫార్ములాను సేవించి మృత్యువాత పడిన ఘటన వెలుగుచూసింది. కరోనా వైరస్‌కు మందును కనుగొనే క్రమంలో బయోటెక్ కంపెనీ జీఎంగా పనిచేసే శివనేసన్, యజమాని డాక్టర్ రాజ్‌కుమార్‌లు కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించేందుకు తాము కనుగొన్న దగ్గు మందు కాంబినేషన్ ఫార్ములాను సేవించారు. ఈ ద్రావకాన్ని తాగిన వెంటనే వారిద్దరూ శ్వాససంబంధిత సమస్యలతో బాధపడగా సమీప ఆస్పత్రికి తరలించారు. శివనేసన్ కాంబినేషన్ మందును అధిక డోస్ తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోగా, రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి : ఎస్బీఐ ఉద్యోగికి కరోనా: ఆఫీసు మూసివేత