Meenakshi Chaudhary
-
టాలీవుడ్‌ను రూల్ చేయనున్న హీరోయిన్స్ విలే..
-
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఆ టైమ్‌లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్‌తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్‌ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘మెకానిక్ రాకీ ’లో బర్నింగ్ పాయింట్‌ని టచ్ చేశాం: విశ్వక్ సేన్
‘మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇందులో గత నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్‌ని టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్‌ని ఎందుకు టచ్ చేయలేదని ఆడియన్స్ ఫీల్ అవుతారు’అని అన్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మెకానిక్ రాకీ రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్ తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్ కి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు.→ ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి జోనర్ మారుతుంది. సెకండ్ హఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మేటర్ ఉంది. మేము ట్రైలర్ లో కథని పెద్దగా రివిల్ చేయలేదు. సినిమాలో చాలా కథ ఉంది. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.→ రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్ ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.→ సినిమా లో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్, అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్ తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్ కి చాలా మంచి పేరు వస్తుంది. → కొత్త సినిమాల విషయాలకొస్తే..లైలా 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్ గా జరుగుతాయి. కల్ట్ మార్చ్ లో మొదలుపెడతాం. ఏమైయింది నగరానికి 2 రైటింగ్ జరుగుతోంది. -
'మెకానిక్ రాకీ' 2.O ట్రైలర్.. భారీగానే ప్లాన్ చేసిన విశ్వక్
'మెకానిక్ రాకీ'గా విశ్వక్సేన్ వస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్ విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో 'మెకానిక్ రాకీ'కి మరింత బజ్ క్రియేట్ అయింది.మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. గతంలో విశ్వక్ చెప్పినట్లుగా సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం విశ్వక్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. -
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
‘మట్కా’ మూవీ రివ్యూ
టైటిల్: మట్కానటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులునిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిదర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: జీవీ ప్రకాశ్సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటంటే..బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు. హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.-రేటింగ్: 2.25/5 -
ఈ నెల నాకు చాలా ప్రత్యేకం
‘‘అమ్మ, సిస్టర్, ప్రేయసి, భార్య... ఇలా ఏదో ఒక విధంగా ప్రతి అబ్బాయి జీవితంలో ఓ మహిళ ఉంటుంది. ఆ అబ్బాయి జీవితానికి ఎంతో ముఖ్యంగా ఉంటూ, అతని లైఫ్‌కి ఓ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. అలా వాసు (‘మట్కా’ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర) జీవితానికి సుజాత (మీనాక్షీ చౌదరి పాత్ర) ఓ వెలుగు వంటిది. సుజాత పాత్రలోని పాజిటివిటీ వాసు జీవితంపై ఉంటుంది. ఈ పాజిటివిటీకి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘మట్కా’లో వాసు ప్రేయసి సుజాతగా నటించాను. సుజాత పాత్రకు మూడు గెటప్స్ ఉంటాయి. ఈ గెటప్స్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ చూపించడం కొత్తగా అనిపించింది. ‘మట్కా’ విజయంపై నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ చిత్రం ఆల్రెడీ విడుదలై, విజయం సాధించింది. ‘మట్కా’ విడుదలవుతోంది. ఇదే నెలలో ‘మెకానిక్ రాకీ’ చిత్రం విడుదలవుతోంది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఈ నెల చాలా ప్రత్యేకం. ఓ స్పెషల్ మూమెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు. -
గోదారి గట్టు మీద...
హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కుదిరింది. వెంకటేశ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘లక్ష్మి’కి సంగీతం అందించిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘గోదారి గట్టుమీద...’ అంటూ సాగే తొలి పాట త్వరలో రిలీజ్ కానుంది. ‘‘ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్‌తో కాకుండా పెక్యులియర్ వాయిస్‌తో ఈ పాట పాడించాలని అనిల్ రావిపూడి చెప్పారు. దీంతో రమణ గోగులతో పాడించాం. ఆయన ప్రత్యేకమైన వాయిస్‌తో పాడిన ఈ సాంగ్ మూవీకి ఎక్స్ట్రా మ్యాజిక్ యాడ్ చేయడం ఖాయం. త్వరలో ఈ పాటను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, వీకే నరేశ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్ రెడ్డి. -
విశాఖపట్నం : ‘మట్కా’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అది నా అదృష్టం : వెంకీ అట్లూరి
‘నా మొదటి సినిమా 'తొలిప్రేమ' విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ 'లక్కీ భాస్కర్'కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను’అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ వెంకీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'లక్కీ భాస్కర్' కథ విని అందరూ బాగుంది అన్నారు. కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు.→ నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.→ సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.→ మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ నిర్మాత వంశీ ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.→ బ్యాంకింగ్ నేపథ్యం సాగే కథ ఇది. దీని కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.→ సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. ఎడిటర్ నవీన్ నూలితో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.→ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ఏది ఒప్పుకోలేదు. ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను. -
లక్కీ భాస్కర్‌తో 'మీనాక్షి చౌదరి' రొమాన్స్.. షూటింగ్ ఫోటోలు చూశారా..?
-
గ్లామరస్ మీనాక్షి చౌదరి.. ఏడు వారాల నగలతో ఆషిక!
నాభి అందాలతో కేక పుట్టించేస్తున్న మీనాక్షి చౌదరిఏడు వారాల నగలతో కుందనపు బొమ్మలా ఆషికా రంగనాథ్పారిస్ హనీమూన్ ట్రిప్‌లో యంగ్ హీరోయిన్ ఐశ్వర్యక్యూట్ పోజులతో మనసు దోచేస్తున్న ప్రియాంక మోహన్చీరలో కొంటెచూపుతో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్'క' ఫేమ్ నయన్ సారిక క్యూట్ అండ్ స్వీట్ స్టిల్స్నిక్కీ తంబోలి హాటెస్ట్ ఆఫ్ ద హాట్ పోజులు View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Soha (@sakpataudi) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Alaya F (@alayaf) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Shree bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by VDeviyaniSharma (@vdeviyanisharma) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Nargis Fakhri (@nargisfakhri) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
నాన్న చనిపోయిన నెలకే అమ్మ తీసుకున్న నిర్ణయంతో బంధువులు దూరమయ్యారు: మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
దిల్ రాజు సినిమా చాన్స్ ఇస్తే.. చేయనని చెప్పేశా: దుల్కర్ సల్మాన్
‘మంచి మనసున్న మనుషులంతా కలిస్తే గొప్ప సినిమా తెరకెక్కించవచ్చని నేను నమ్ముతా. దానికి ‘లక్కీ భాస్కర్’ చిత్రమే ఓ మంచి ఉదాహరణ. ఈ సినిమాలో పని చేసినవారంతా గొప్ప వ్యక్తులు. వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది.తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇకపై కూడా మంచి కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాను’అని అన్నారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ‘సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. వారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఓకే బంగారం’ విడుదలయ్యాక నిర్మాత దిల్‌రాజు నాకొక అవకాశం ఇచ్చారు. తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ సినిమా అంగీకరించలేకపోయా. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదనే చెప్పాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. ‘పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. -
రూట్ మార్చిన మీనాక్షి చౌదరి
-
వరుణ్ తేజ్ 'మట్కా' ట్రైలర్ రిలీజ్
'మట్కా' మూవీ ట్రైలర్ రిలీజైంది. చాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మెగాహీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది. 'మట్కా' అనే గేమ్ నేపథ్య కథతో దీన్ని తెరకెక్కించారు. మూడు విభిన్న గెటప్స్‌లో వరుణ్ కనిపించాడు. వేరియేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?)నవంబర్ 14న థియేటర్లలోకి 'మట్కా' రానుంది. అదే రోజు సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' కూడా థియేటర్లలోకి రానుంది. అయితేనేం ట్రైలర్ చూస్తుంటే వర్కౌట్ అయ్యే బొమ్మలా అనిపిస్తుంది. ట్రైలర్లో వరుణ్ తేజ్ చెప్పిన 'నాకు ఇక్కడ (మెదడు).. ఇక్కడ (గుండె)... ఇక్కడ (ఇంకా ఇంకా కిందకు) కంట్రోలు ఉంది కాబట్టే ఇలా వున్నాను' అనే డైలాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. (ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య) -
'లక్కీ భాస్కర్' కలెక్షన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తోంది. మిగిలిన మూవీస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దుల్కర్ చిత్రానికి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. బ్యాంకింగ్ రంగంలోని మోసాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ తీసిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు రూ.12.7 కోట్లు గ్రాస్ రాగా, రెండో రోజు కూడా అంతే స్టడీగా వచ్చాయి. కాస్త రూ.13.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.దుల్కర్‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి రచన-దర్శకత్వం ఒకెత్తయితే, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 'లక్కీ భాస్కర్' నెమ్మదిగా పికప్ అవుతోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల వసూళ్లు మార్క్ చేరుకుంటుదేమో చూద్దాం!(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)Our Baskhar is 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 at the box office, 𝟐𝟔.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 worldwide in 2 Days! 🔥💰#BlockbusterLuckyBaskhar 💥💥𝑼𝑵𝑰𝑽𝑬𝑹𝑺𝑨𝑳 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🏦 #LuckyBaskhar In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3… pic.twitter.com/KHw1GjC2kL— Dulquer Salmaan (@dulQuer) November 2, 2024 -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 3మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
'లక్కీ భాస్కర్' అలాంటి సంతృప్తిని కలిగించింది: నాగవంశీ
ప్రతి ఏడాది చాలా సినిమాలు రిలీజ్ చేస్తుంటాం. అయితే వాటిలో కొన్ని మాత్రమే మంచి సినిమాలు చేశామని సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్’కలిగించింది’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘లక్కీ భాస్కర్’ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాం. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.→ జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాం. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాం.→ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.→ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.→ ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.→ ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. -
నన్ను నేను సవాల్ చేసుకుంటాను
‘‘ఫలానా పాత్రలే చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని నేనేం పరిమితులు పెట్టుకోలేదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నాకే కాదు... స్క్రీన్‌పై నన్ను చూసే ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా ఎప్పటికప్పుడు నన్ను నేను సవాల్ చేసుకుంటుంటాను. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో తొలిసారిగా నేను అమ్మ పాత్ర చేశాను. ఇక ‘మట్కా, మెకానిక్ రాకీ’ చిత్రాల్లోనూ డిఫరెంట్ రోల్స్ చేశాను’’ అన్నారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి చెప్పిన విశేషాలు. ⇒ ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి గృహిణి సుమతి పాత్ర చేశాను. ప్రేమను పంచే కుటుంబం, జీవించడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలనుకునే స్వభావం భాస్కర్ (దుల్కర్ పాత్ర)ది. కానీ ఎక్కువ డబ్బు, దురాశల కారణంగా భాస్కర్–సుమతిల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకప్పుడు మాది మధ్యతరగతి ఫ్యామిలీయే. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉంటారో తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా ఈ పాత్ర చేశాను. సుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననుకుంటున్నాను. ⇒ నేను నటించిన ‘మట్కా, మెకానిక్ రాకీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్‌గారితో ఒక సినిమా చేస్తున్నాను. -
ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)