Mickey Arthur
-
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఒకేసారి తప్పుకున్న ముగ్గురు కీలక వ్యక్తులు
పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు. తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది. మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్‌గా.. బ్రాడ్‌బర్న్ ఎన్సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్‌గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్‌గా, బ్రాడ్‌బర్న్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్‌ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో తలపడనుంది. -
Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి! అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అతడు కాస్త భిన్నం నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్.. రిజ్వాన్ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్‌ను ట్రోల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. భారత్- పాక్ మ్యాచ్ అంటే వినోదం మాత్రమే కాదు ఇందుకు బదులుగా.. భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా కాదు బీసీసీఐ ఈవెంట్‌లా అనిపిస్తోందని విమర్శించాడు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. పాక్ ఆటగాళ్లు స్పందించనే లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్‌కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్ తప్ప పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ స్పందించలేదు. అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. శ్రీలంక విషయంలో ఎందుకిలా? సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు? హైదరాబాద్‌లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్‌లో జీతేగా భాయ్ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్ జీతేగా అని పాక్ టీమ్‌కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు. అఫ్గనిస్తాన్‌కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్ జలేబి గురించి ఇంగ్లండ్ కంప్లైట్ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
పాకిస్తాన్ క్రికెట్లో వినూత్న ప్రయోగం.. చరిత్రలో తొలిసారి..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు రికార్డుల్లోకెక్కనుంది. ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ (ఆస్ట్రేలియా).. నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్ హెడ్ కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పాక్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పీసీబీ బాస్ నజమ్ సేథీ గతవారం ఓ క్లూ వదిలాడు. ఆర్థర్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని సేథీ గతవారం ఓ ప్రెస్మీట్లో వెల్లడించాడు. ప్రస్తుత పాక్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో నూతన హెడ్ కోచ్‌ను నియమించుకునేందుకు పీసీబీ వేగంగా పావులు కదుపుతోంది. ఆర్థర్.. పీసీబీ తొలి దశ ప్రయత్నాల్లో పాక్ కోచ్‌గా వ్యవహరించేందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆర్థర్.. మెజార్టీ శాతం పాక్ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని సమాచారం. కాగా, మిక్కీ ఆర్థర్ ఆథ్వర్యంలో పాకిస్తాన్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఆన్లైన్ కోచ్ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్‌లు లేకనా అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. -
హార్ధిక్.. కల్లిస్ లాంటోడు, అతను జట్టులో ఉంటే 12 మంది ఆటగాళ్లు ఉన్నట్టే..!
ఆసియా కప్ 2022లో భాగంగా పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యాపై పాకిస్థాన్ మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత క్రికెట్లో హార్ధిక్‌కు మించిన ఆల్‌రౌండర్ లేడని కొనియాడాడు. హార్ధిక్‌ను లెజెండరీ ఆల్‌రౌండర్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్ కల్లిస్తో పోలుస్తూ ఆకాశానికెత్తాడు. హార్ధిక్ జట్టులో ఉంటే, టీమిండియా 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్టేనని అన్నాడు. జట్టులోని ఓ ఆటగాడు టాప్-5లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్ట్రయిట్ సీమ్ బౌలర్‌గా ఉంటే, ఆ జట్టు అదనపు ఆటగాడితో బరిలోకి దిగినట్టేనని హార్ధిక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. గత కొద్ది నెలలుగా హార్ధిక్ ఆటలో చాలా పరిణితి ప్రదర్శిస్తున్నాడని, ఒత్తిడిని ఎదుర్కోవడంలో అతను పూర్తిగా సఫలీకృతుడయ్యాడని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించడం ఇందుకు నిదర్శనమని అన్నాడు. కాగా, హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో పాక్‌తో హోరాహోరీగా సాగిన సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్ధిక్ బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 17 బంతుల్లో అజేయమైన 33 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హార్ధిక్‌తో పాటు భువీ, కోహ్లి, జడేజాలు కూడా రాణించడంతో టీమిండియా దాయాదిపై అపురూప విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ 'తోపు'.. టీమిండియా కెప్టెన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు -
శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!
Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. “మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
లంక కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మికీ ఆర్థర్
Mickey Arthur To Resign As Sri Lanka Head Coach.. శ్రీలంక కోచ్ పదవి బాధ్యతల నుంచి నుంచి మికీ ఆర్థర్ తప్పుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ మికీ ఆర్థర్‌కు లంక కోచ్‌గా చివరిది కానుంది. కాగా ఆర్థర్ డెర్బీషైర్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆర్థర్ తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలిసింది. కాగా లంక బోర్డు ఆర్థర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆర్థర్ తన ఈమెయిల్లో రాజీనామా విషయాన్ని ప్రకటించాడు. ''లంక క్రికెట్‌తో నా బంధం త్వరలో ముగియనుంది. డెర్బిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు డైరెక్టర్‌గా కొనసాగేందుకు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నా. వెస్టిండీస్‌తో జగరనున్న రెండు టెస్టుల సిరీస్ లంక్ కోచ్‌గా నాకు ఆఖరిది కానుంది. ఇంతకాలం నాకు సహకరించిన లంక క్రికెట్ బోర్డుతో పాటు సపోర్ట్ స్టాప్‌కు నా కృతజ్క్షతలు. ఇక లంక క్రికెటర్లతో నాకు మంచి అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో శ్రీలంకకు కోచ్‌గా పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మికీ ఆర్థర్ ఫిబ్రవరి 2020న లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
'వరల్డ్‌కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి'
కొలంబొ: క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్ అనే పదం చాలాసార్లు వింటుంటాం. ఒక స్పిన్ బౌలర్ బంతిని వేర్వేరు తన చేతితో వివిధ యాంగిల్స్‌లో విడుదల చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేయడమే వీరి పని.. అందుకే ఇలాంటి వారిని మిస్టరీ స్పిన్నర్స్ అంటారు. అజంతా మెండిస్, సునీల్ నరైన్, సయీద్ అజ్మల్.. తాజగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్లుగా గుర్తింపు పొందారు. అన్‌ఆర్థడాక్స్ బౌలింగ్ వేరియేషన్‌తో క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్ బంతులను వేస్తూ బ్యాట్స్మన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. మెండిస్(శ్రీలంక), నరైన్(వెస్టిండీస్) లాంటి ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో రెండు మూడేళ్ల పాటు వారి జట్టులో కీలకపాత్ర పోషించారు. తాజాగా మెండిస్ తరహాలోనే శ్రీలంకకు మరో మిస్టరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. అతనే మహీష్ తీక్షణ. చదవండి: బీసీసీఐదే తప్పు.. ధోనిని మెంటార్ చేయడం నిరాశపరిచింది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన తీక్షణ తన మిస్టరీ బౌలింగ్‌తో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా క్యారమ్ బాల్స్, ఆఫ్ బ్రేక్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన తీక్షణ ఫలితాన్ని రాబట్టాడు. ఈ నేపథ్యంలో తీక్షణ బౌలింగ్ వేరియేషన్స్‌పై ఇంప్రెస్ అయిన ఒక అభిమాని అతని బౌలింగ్ యాక్షన్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ''తీక్షణ బౌలింగ్ చూస్తుంటే అతని చేతిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక క్యారమ్ బాల్ వేయడానికి మణికట్టును విభిన్న శైలిలో చూపించాడు. మన కాళ్లను ఎలా షేక్ చేస్తామో.. తీక్షణ తన చేతులను అలా చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''నీ అనాలిసిస్‌కు కృతజ్ఞతలు.. ముందు మాకు వరల్డ్ కప్ ఉంది.. దయచేసి ప్రతీ విషయాన్ని భూతద్ధంలో చూడడం ఆపండి'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మహీష్ తీక్షణ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే లంక మొదట క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న నుంచి ఒమన్ వేదికగా జరగనున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పాల్గొననుంది. -
Ind Vs Sl: కొంతమంది ఇడియట్స్ ఉంటారు: శ్రీలంక కోచ్
కొలంబో: టీమిండియాపై శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండోపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ ప్రశంసలు కురిపించాడు. ఫిట్నెస్ లోపాల కారణంగా వారిద్దరు కొన్ని మ్యాచ్‌లు మిస్పయ్యారని, అయితే ఇప్పుడు గాడిలో పడ్డారని పేర్కొన్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇరువురి ప్రదర్శన తనకెంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. భానుక మంచి కోసమే, కొన్నిసార్లు తన పట్ల కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని మికీ ఆర్థర్ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రపు మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టును ఓడించి ఆతిథ్య శ్రీలంక జట్టు ఓదార్పు విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 10 మ్యాచ్‌ల తర్వాత స్వదేశంలో టీమిండియాపై గెలుపొంది.. వరుస పరాజయాలకు చెక్ పెట్టగలిగింది. ముఖ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మికీ ఆర్థర్ లంక జర్నలిస్టులతో మాట్లాడుతూ... ఎట్టకేలకు భారత్‌పై గెలుపొందడం సంతోషంగా ఉందన్నాడు. ఇక వరుస ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్‌ను ఉద్దేశించి... దయచేసి సామాజిక మాధ్యమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘కొంతమంది ఇడియట్స్ ఉంటారు. వాళ్లకే అంతా తెలుసనని భావిస్తారు. నిజానికి వాళ్లకు అసలేమీ తెలియదు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది’’ అంటూ మికీ ఆర్థర్ వ్యాఖ్యానించాడు. కాగా రెండో వన్డేలో ఓటమి దిశగా పయనిస్తున్నపుడు ఆర్థర్, లంక కెప్టెన్ దసున్ శనక గొడవ పడటం.. అదే విధంగా చివరిదైన మూడో వన్డేలో 23వ ఓవర్లో డీఆర్ఎస్ విషయంలో దసున్ సేన తత్తరపాటుకు గురికావడం వంటి అంశాల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. -
IND Vs SL: ఓటమి జీర్ణించుకోలేక కెప్టెన్‌తో కోచ్ గొడవ; వీడియో వైరల్
కొలంబో: శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. క్రమంగా చహర్ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యలోనే మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తుంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వెలుగు చూసింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్ చేశారు. '' మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ'' పేర్కొన్నారు. pic.twitter.com/sUBY43Sk1x — cric fun (@cric12222) July 20, 2021 -
శ్రీలంక జట్టు హెడ్ కోచ్‌గా ఆర్థర్
కొలంబో: ఈ ఏడాది ప్రపంచకప్‌లో పేలవమైన ఆటతీరుతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న శ్రీలంక క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. ఆ జట్టు హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం నియమించింది. అతనితో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, ఆ్రస్టేలియాకు చెందిన డేవిడ్ సకేర్ను బౌలింగ్ కోచ్‌గా, షేన్ మెక్‌డెర్మట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. -
వారిద్దరూ నమ్మక ద్రోహం చేశారు..
కేప్‌టౌన్: తనను పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న మిస్బావుల్ హక్ కూడా ఒక కారణమంటూ మికీ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను తప్పించడంలో మిస్బావుల్తోపాటు వసీం అక్రమ్ కూడా కీలక పాత్ర పోషించారంటూ ఆర్థర్ పేర్కొన్నాడు.. వీరిద్దర్నీ తాను ఎంతగానో నమ్మితే తనకు అన్యాయం చేశారన్నాడు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆర్థర్ పేర్కొన్నాడు.వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ వైఫల్యం తర్వాత పీసీబీ ఒక కమిటీని నియమించింది. దీనిపై సదరు కమిటీ విచారణ చేపట్టిన తర్వాతే మికీ ఆర్థర్ కాంట్రాక్ట్‌ను పొడిగించడానికి పీసీబీ మొగ్గు చూపలేదు. ఇందులో మిస్బావుల్ హక్‌తో పాటు వసీం అక్రమ్‌లు సభ్యులుగా ఉండటాన్ని ఆర్థర్ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ కమిటీ రిపోర్ట్ తనకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. ఈ క్రమంలోనే మిస్బావుల్, వకార్‌లను టార్గెట్ చేశాడు. ‘ నేను ఎందుకు పదవి కోల్పోయానో ఊహించగలను. అందుకు కారణం నేను నమ్మినవారే. మిస్బావుల్, అక్రమ్‌లు కమిటీ సభ్యులిగా ఉన్నప్పటికీ నా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. నేను పాకిస్తాన్ క్రికెట్‌కు పూర్తిస్థాయిలో సేవలందించాను. దాంతోనే మిస్బావుల్-అక్రమ్‌లు నాకు అనుకూలంగా నివేదిక ఇస్తారనుకున్నా. కానీ నాకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాంతో నేను కోచ్ పదవి నుంచి వైదొగాల్సి వచ్చింది’ అని ఆర్థర్ పేర్కొన్నాడు. మరొకవైపు కొత్తగా హెడ్ కోచ్‌గా నియమించబడ్డ మిస్బావుల్ హక్ సక్సెస్ కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశాడు. ‘ మిస్బావుల్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అతనొక ఉన్నతమైన వ్యక్తి.. అందుకోసమే పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ బాధ్యతల్ని అప్పజెప్పింది. కానీ నేను ప్రతీ సెకండ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినా నన్ను తప్పించడం బాధించింది’ అని ఆర్థర్ తెలిపాడు. -
పాక్ క్రికెట్లో ఇమ్రాన్ ‘గేమ్’ మొదలైందా?
కరాచీ: ‘నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో చర్యలకు శ్రీకారం చుడతాం. ఎక్కడైతే టాలెంట్ ఉందో వారిని కచ్చితంగా సానబెడతాం. ఇక నుంచి పాక్ క్రికెట్ జట్టు ఎలా ఉండాలనేది నేను సెట్ చేస్తా. పాక్ జట్టు ఉన్నత శిఖరాలు తీసుకు వెళ్లాలని నేను డిసైడ్ అయ్యా’ అని మాజీ క్రికెటర్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు చేరకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్ పై విధంగా స్పందించారు. కాగా, తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తే పాక్ క్రికెట్లో ఇమ్రాన్ ఖాన్ ‘గేమ్’ మొదలైనట్లే కనబడుతోంది. మొన్నటి వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మికీ ఆర్థర్‌ను తప్పించడం వెనుక ఇమ్రాన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీబీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆర్థర్‌కు ఉద్వాసన చెప్పడానికి ఇమ్రానే ప్రధాన కారణమట. మరో రెండేళ్ల పాటు ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని పీసీబీ పెద్దలు భావించినప్పటికీ ఇమ్రాన్ జోక్యంతో అతనికి స్వస్తి పలికాల్సివచ్చిందట. దాంతో సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా తొలగించడానికి ఇమ్రాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను మరో రెండేళ్ల పాటు ప్రధాన కోచ్‌గా కొనసాగించాలని ఆర్థర్ విన్నవించినప్పటికీ దాన్ని పీసీబీ తిరస్కరించడంతో పాక్ క్రికెట్ ప్రక్షాళనను ఇమ్రాన్ సీరియస్‌గానే తీసుకున్నారనే దానికి నిదర్శనంగా కనబడుతోంది. స్వదేశీ కోచ్‌వైపే మొగ్గు ప్రస్తుత పరిణామాల్ని బట్టి చూస్తే విదేశీ కోచ్ ఎంపికకు పీసీబీ సానుకూలంగా లేదు. విదేశీ కోచ్ కంటే కూడా స్వదేశీ క్రికెటర్‌నే కోచ్‌గా ఎంపిక చేయాలనే యోచనలో పీసీబీ ఉంది. మికీ ఆర్థర్ పర్యవేక్షణలో పాక్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంపై స్వదేశీ కోచ్ ఎంపికకు ఎక్కువ మొగ్గు కనబడుతోంది. ఈ రేసులో పాక్ మాజీ క్రికెటర్లు మొహిసిన్ ఖాన్, మిస్బావుల్ హక్‌లు ఉన్నారు. వీరిలో మిస్బావుల్ హక్ ముందు వరుసలో ఉండగా, మొహిసిన్ ఖాన్ కూడా ప్రధాని కోచ్ పదవిపై ధీమాగా ఉన్నారు. -
కోచ్ మికీ ఆర్థర్‌కు పాక్ గుడ్‌బై
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మికీ ఆర్థర్‌కు పొడిగింపు ఇవ్వరాదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. అతనితో పాటు బౌలింగ్ కోచ్ అజహర్ మహమూద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, ఫిట్నెస్ ట్రైనర్ ల్యూడెన్‌లను కూడా పీసీబీ తప్పించనుంది. ఈ నలుగురి కాంట్రాక్ట్ ఈ నెల 15తో ముగుస్తుంది. అయితే ఎవరినీ కొనసాగించకుండా వీలైనంత త్వరలో కొత్త సహాయక సిబ్బందిని ఎంపిక చేస్తామని బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించారు. వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో 5 గెలిచిన పాకిస్తాన్ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమంగా నిలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడటంతో సెమీస్ అవకాశం చేజార్చుకుంది. ఆర్థర్ 2016 టి20 ప్రపంచ కప్ తర్వాత పాక్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పదవీకాలంలో పాక్ వన్డేల్లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం పెద్ద ఘనత కాగా, టి20ల్లో నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. ‘పాక్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నా శక్తిమేరా ప్రయత్నించాను. తాజా నిర్ణయంతో చాలా బాధపడుతున్నాను’ అని ఆర్థర్ స్పందించాడు. -
బలిపశువును చేశారు.. పాక్ కోచ్ ఆవేదన
ఇస్లామాబాద్ : ‘కోచ్‌గా పాకిస్తాన్ జట్టును నా భుజస్కంధాలపై మోశాను. కష్టకాలంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాను. విజయాల బాట పట్టించాను. యువ ఆటగాళ్లకు అండగా నిలిచాను. అయితే నా కోచ్ కాంట్రాక్టు ముగుస్తుండటంతో మరో రెండేళ్లు పొడగించమని కోరాను. కానీ వాళ్లు ప్రపంచకప్ ఓటమికి బాధ్యుడిని చేస్తూ నన్ను బలిపశువును చేశారు. నన్ను తప్పించడం తీవ్ర నిరాశ, బాధను కలిగించాయి. అయితే ఒక్కటి మాత్రమ గర్వంగా చెప్పగలను. కోచ్‌గా పాక్ జట్టును అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాను’అంటూ పాక్ తాజా మాజీ కోచ్ మికీ అర్థర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కోచ్ మికీ అర్థర్‌కు ఉద్వాసన పలికింది. దీంతో పైవిధంగా ఆర్థర్ స్పందించాడు. అతడితో పాటు సపోర్టు స్టాఫ్ కాంట్రాక్టులను కూడా పొడిగించేందుకు పీసీబీ సుముఖంగా లేదని తెలిసింది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి అనంతరం పీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమిపై నివేదిక కోరుతూ వసీం ఆక్రమ్, మిస్బావుల్ హక్‌లతో కూడిన ఓ కమిటీని నియమించింది. రెండ్రోజుల క్రితం అర్థర్‌తో భేటి అయిన ఈ కమిటీ కోచ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఇక ఇదే భేటిలో సర్ఫరాజ్ అహ్మద్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలని కమిటీకి అర్థర్ సూచించారు. గత రెండేళ్లుగా సర్ఫరాజ్ సారథిగా విఫలమవుతున్నాడని, జట్టును ఏకతాటిపై నడిపించడంలో విఫలమయ్యాడని వారికి వివరించారు. అయితే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని భావిస్తున్నట్లు పీసీబీ అధికారికంగా తెలిపింది. దీంతో ఆర్థర్ దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. -
‘ప్రధాన కోచ్‌ను కొనసాగించే ముచ్చటే లేదు ’
ఇస్లామాబాద్: ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్ని వైపుల విమర్శలు వస్తుండటంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15తో ముగుస్తున్న కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుంది. దీంతో 2016 నుంచి పాక్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్‌కు ఉద్వాసన పలకనుంది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్‌లో పాక్ వైపల్యానికి కోచింగ్ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ విశ్వసిస్తోంది. దీంతో వారిపై వేటు వేయనుంది. ఇక జట్టును విజయపథంలో నడిపించే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. 2016 నుంచి పాక్ జట్టుకు మికీ అర్థర్ విశేష సేవలందిస్తున్నాడు. అతడి కోచ్‌గా ఉన్న సమయంలోనే 2017 చాంపియన్ ట్రోఫీని పాక్ గెలుచుకుంది. ఇక అర్థర్ కూడా పాక్ జట్టుకు కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి కనబర్చటం లేదని తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితమే ప్రపంచకప్ ఓటమిపై సమీక్ష జరగగా పీసీబీ ఏర్పాటు చేసిన కమిటీకి అర్థర్ కెప్టెన్సీ మార్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడని సమాచారం. గత రెండేళ్లుగా సారథిగా సర్ఫరాజ్ అహ్మద్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీకి అర్థర్ సూచించినట్టు సమాచారం. -
సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!
కరాచీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది. ప్రధానంగా కోచ్, కెప్టెన్లను మార్చాలనే యోచనలో ఉంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాక్ క్రికెట్ ఆట తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక నుంచి పాక్ క్రికెట్‌ను తీర్చిదిద్దే బాధ్యత తానే తీసుకుంటానని హామి ఇచ్చారు కూడా. అయితే పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ సమర్పించిన నివేదికలో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌నే టార్గెట్ చేశారంట. అసలు కెప్టెన్‌గా సర్ఫరాజ్ వద్దంటూ బోర్డుకు తేల్చిచెప్పారు పీసీబీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా సర్పరాజ్ అహ్మద్‌లో పలు నెగిటివ్ విషయాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక తాను కోచ్‌గా ఉండేందుకు మరో రెండేళ్లు పొడిగించాలని ఆర్థర్ కోరినట్లు సమాచారం. తన పర్యవేక్షణలో పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించిందని స్పష్టం చేశారట. తన కోచ్ పదవిపై పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ నుంచి హామీ లభించిందని ఆర్థర్ ధైర్యంగా ఉన్నాడట. అయితే అదే సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్‌గా సేవలందించేందుకు కూడా ఆర్థర్ దరఖాస్తు చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2016లో పాకిస్తాన్ కోచ్‌గా ఆర్థర్ స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో పాకిస్తాన్ జట్టు చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత అతని హయాంలో భారీ ఘనతలు ఏమీ లేకపోకపోయినప్పటికీ, టీ20ల్లో పాక్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఇక టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రం పాక్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారా.. లేదా అనేది సందిగ్థంలో ఉంది. కోచ్‌గా ఆర్థర్‌ను కొనసాగించేందుకు కొంతమంది పాక్ మాజీలు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది మాత్రం అతను వద్దనే అంటున్నారు. (ఇక్కడచ చదవండి: చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?) -
చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను తిరిగి కొనసాగించాలా.. వద్దా అనే దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థర్‌కు మరో చాన్స్ ఇవ్వాలంటూ పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పేర్కొనగా, ఆ దేశానికే స్పిన్ లెజెండ్ అబ్దుల్ ఖాదిర్ మాత్రం విభేదించాడు. ఇంకెంత కాలం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆర్థర్ ఏమి చేశాడంటూ నిలదీశాడు. అదే సమయంలో అక్రమ్ సూచనను తప్పుబట్టాడు. తన దృష్టితో చూస్తే ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగించాలని అక్రమ్ పీసీబీకి చెప్పడం న్యాయం కాదన్నాడు. పీసీబీ కమిటీలో సభ్యుడిగా ఉన్న అక్రమ్.. ఆర్థర్ అండగా నిలవడం బాలేదన్నాడు. తానైతే ఆర్థర్ సేవలు ఇక పాకిస్తాన్‌కు అవసరం లేదనే చెబుతానన్నాడు. ఆర్థర్ వచ్చిన తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు నష్టమే జరిగిందే కానీ లాభం చేకూరలేదన్నాడు. కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, సొహైల్ ఖాన్ వంటి క్రికెటర్లు దూరం కావడానికి ఆర్థరే కారణమని విమర్శించాడు. వహాబ్ రియాజ్ వంటి ఒక స్టార్ పేసర్ పాక్ క్రికెట్‌కు రెండేళ్లు దూరం కావడానికి ఆర్థరే కారణమన్నాడు. వరల్డ్‌కప్‌కు చివరి నిమిషంలో గత్యంతరం లేక ఒత్తిడితో రియాజ్‌కు చోటు ఇవ్వడానికి ఆర్థర్ ఒప్పుకున్నాడని ఖాదిర్ విమర్శించాడు. ఇక ఆర్థర్ సేవలకు స్వస్తి పలకాలని సూచించాడు. పాక్ జాతీయ క్రికెట్ జట్టును ముందుకు తీసుకు వెళ్లడానికి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నాడు. -
ఓడిపోవడం నిరాశ కలిగించింది : పాక్ కోచ్
లండన్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో దాయాది జట్టు పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు సన్నగిల్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ఆ జట్టు గెలుపొందినా.. బుధవారం జరిగే ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాక్‌ను దెబ్బతీసేందుకే టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయిందని పాక్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన క్రీడానీతి పాటించలేదంటూ పాక్ దిగ్గజ ఆటగాడు వకార్ యూనిస్ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆతిథ్య జట్టుతో తలపడనున్న కివీస్ తమ కోసం గెలిచితీరుతూందంటూ పాక్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వాళ్లు(ఇండియా) ఎలా ఆడాలన్న విషయాన్ని మేము కంట్రోల్ చేయలేం కదా. ఫలితం కోసం ఆ మ్యాచ్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాం. మెగాటోర్నీలో నిలవాలంటే మాకు ముఖ్యమైన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం నిరాశ కలిగించింది. మాకోసం న్యూజిలాండ్ జట్టు గెలిచితీరుతుందని భావిస్తున్నా. ఒకవేళ ఆ జట్టు గనుక ఓడిపోయి.. ఇంగ్లండ్ భారీ తేడాతో గెలుపొందితే మా నెట్రన్ రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టంతో కూడుకున్నదే’ అని ఆర్థర్ పేర్కొన్నాడు. ఇక మెగాటోర్నీలోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి తనను ఇప్పటికీ వెంటాడుతుందని విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో విజయాలు సాధించామని చెప్పుకొచ్చాడు. కాగా ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు తమ చివరి మ్యాచ్ వరకు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌లో అడుగుపెట్టేందుకు మోర్గాన్ సేన నేడు (బుధవారం) జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్‌పై విజయంతో కోలుకున్న ఇంగ్లండ్... ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్ చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే.. పాక్ సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ బంగ్లా చేతిలో పాక్ ఓడిపోతే.. ఇంగ్లండ్‌కు అవకాశాలు ఉంటాయి. -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్
లండన్ : భారత్‌తో ఓటమి అనంతరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘోర పరాజయం అనంతరం తమ జట్టుపై అన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌తో తనపై నెలకొన్న ఒత్తిడి తట్టుకోలేకపోయానని తెలిపాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తేరుకున్న పాక్ తమ తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో బుధవారం ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆర్థర్ మీడియాతో ముచ్చటించాడు. ‘ పోయిన ఆదివారం నేను చచ్చిపోవాలనుకున్నాను. చూస్తుండగానే మ్యాచ్‌ను కోల్పోయాం. ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది. ఒక్క మంచి ప్రదర్శన చేస్తే అన్నీ సర్దుకుంటాయని ఆలోచించా. ఇది ప్రపంచకప్ కాబట్టి.. మీడియా సమీక్షలు, అభిమానులు అంచనాలు అన్ని సాధారణమే. సరిగ్గా వారం తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆడారు. ఈ విజయం మాపై ఒత్తిడి తగ్గించింది. ఈ గెలుపుతో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా. ఇంకా మేం టైటిల్ రేసులో ఉన్నాం. మా తదుపరి మ్యాచుల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. వాటిలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా అన్ని జట్లలాగే మా జట్టు కూడా బలంగా ఉంది’ అని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్థర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఓ ఫ్రొఫెషనల్ కోచ్‌గా ఉండి ఒక్క ఓటమికే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చాయా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపాల్సిన కోచ్ ఇలా డీలా పడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పాక్‌కు దక్షిణాఫ్రికా విజయం ఊరటనిచ్చింది. బుధవారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. చదవండి : వైరల్: భారత్-పాక్ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’ నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా! -
‘కొంతమంది నోళ్లు మూయించాం’
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా కొంతమందితోనైనా నోర్లు మూయించామని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్థర్ పేర్కొన్నాడు. పాక్ తప్పక గెలవాల్సిన సమిష్టింగా పోరాడి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థర్.. తమను విమర్శించిన వాళ్లకు ఇదొక హెచ్చరిక అని వ్యాఖ్యానించాడు. ‘ మా ఆటగాళ్లు ఆడతారని నాకు తెలుసు.వారు తిరిగి గాడిలో పడడంతో రాణించారు. గతవారం టీమిండియాతో ఓటమి కారుణంగా వారిపై అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో ప్రస్తుతం కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ఈ విజయంతో తమ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయన్నాడు. తాము తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉందని, వాటిలో కచ్చితంగా గెలుస్తామన్నాడు. మిగతా అన్ని జట్లలాగే తమ జట్టు కూడా బలంగా ఉందన్నాడు. -
‘మా జట్టుకు ఓటమి భయం పట్టుకుంది’
దుబాయ్: ప్రస్తుత ఆసియాకప్‌లో టీమిండియాతో తలపడిన రెండు సందర్భాల్లోనూ పాకిస్తాన్‌ను ఘోర పరాజయం వెక్కిరించింది. దాంతో పాకిస్తాన్ కోచ్ మికీ ఆర్థర్ తమ జట్టు పేలవ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌పై పాక్ ఆటతీరు పట్ల పెదవి విరిచిన ఆర్థర్.. తమ జట్టు చేసిన చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని విమర్శించాడు. ‘మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించింది. మా ఆటగాళ్లకు ఓటమి భయం పట్టుకుంది. క్రికెట్ జట్టుగా మేం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సి ఉంది’ అని ఆర్థర్ తెలిపాడు. ‘భారత్‌లో చాలా మంచి ఆటగాళ్లున్నారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు, బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలి. మాకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తే ఆధిపత్యం చెలాయిస్తారు. మేం వాస్తవికంగా ఆలోచించాలి. అద్భుతమైన భారత జట్టు చేతిలో ఓడాం. మా ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు కనబడుతున్నారు’ ఆర్థర్ ఎద్దేవా చేశాడు. చదవండి: మరీ ఇంత దారుణంగా ఓడిపోతారా? -
ఆసీస్‌పై మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు
కరాచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్ క్రికెట్ జట్టుపై మాజీ కోచ్ మికీ ఆర్ధర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఆసీస్ సిగ్గుమాలిన క్రికెట్ ఆడుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లదీ ఒక దారైతే, ఆసీస్‌ది మరొకదారి అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ట్యాంపరింగ్ వ్యవహారం రోజు రోజుకూ క్రికెట్ సంస్కృతి ఎంతో పరిణితి సాధిస్తున్నప్పటికీ ఆసీస్ మాత్రం తన పంథాను మార్చుకోకుండా నియంతలా ప్రవర్తిస్తుందనడానికి తాజా ఘటనతో నిరూపితమైందన్నాడు. గత కొన్నేళ్లుగా ఆసీస్ క్రికెట్ ప్రవర్తన అహంకారపూరితంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ప్రపంచ ముందు దోషిగా నిలబడిన ఆసీస్ క్రికెట్‌కు ఇదొక గుణపాఠంగా ఆర్ధర్ అభివర్ణించాడు. ట్యాంపరింగ్‌పై ఫన్నీ స్పూఫ్ 2013లో యాషెస్ సిరీస్ తర్వాత ఆర్ధర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించిన క్రికెట్ ఆస్ట్రేలియా..ఆపై డారెన్ లీమన్‌కు ఆ బాధ్యతలు అప్పచెప్పింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్ధర్.. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేస్తున్నాడు. బయటపడ్డ మరో నిజం -
కోహ్లి.. అక్కడ ఒక్క సెంచరీ చేయలేడు..!
కరాచీ: ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడని చెప్పవచ్చు. వన్డేల్లో ఇప్పటికే 33 శతకాలు చేసిన కోహ్లికి.. సచిన్ 49 శతకాల రికార్డును బద్ధలు కొట్టడం అంత కష్టమేమీ కాదు. కానీ కోహ్లికి తమ దేశంలో సెంచరీ ఎప్పటికీ కలేనని, అతడు ఇక్కడ ఒక్క శతకం కూడా బాదలేడని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ అంటున్నాడు. కోహ్లి ఆట గురించి మికీ ఆర్థర్ కొన్ని విషయాలు ప్రస్తావించాడు. 'భారత క్రికెటర్ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మెనే కానీ అతడు పాకిస్తాన్ గడ్డమీద పాక్ జట్టుపై సెంచరీ మాత్రం చేయలేడు. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డమీద సఫారీలపై తొలి శతకం చేశాడు. అయితే పాక్‌లో మాత్రం కోహ్లికి మా బౌలర్లు అంత అవకాశం ఇవ్వరు. ఇక్కడ ఒత్తిడిని ఎదుర్కొని సెంచరీ చేయడం కోహ్లికి అంత సులభం కాదని' పాక్ కోచ్ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు కోహ్లికి పాక్ జట్టు మీద మంచి రికార్డు ఉంది. 12 వన్డేల్లో పాక్‌పై రెండు సెంచరీల సాయంతో 45.90 సగటుతో 459 పరుగులు చేశాడు. 6 టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లి 84.66 సగటుతో 254 పరుగులు సాధించాడు. పాక్‌తో ఇప్పటివరకూ కోహ్లి ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, దినేశ్ కార్తీక్ లాంటి కొందరికి మాత్రమే పాక్ గడ్డమీద, లేదా పాక్ జట్టుతో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. 2007-08 సీజన్ తర్వాత పాక్-భారత్ ద్వైపాక్షిక వన్డే, టెస్ట్ సిరీస్‌లు ఆడలేదు. కానీ, అతికష్టమ్మీద చివరగా 2012-13లో పొట్టి ఫార్మాట్లో దాయాది జట్ల మధ్య భారత్‌లో ఓ సిరీస్ నిర్వహించారు. -
వరల్డ్ కప్ వరకూ అతనే పాక్ కోచ్
కరాచీ:ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ కోచ్ గా సేవలందిస్తున్న మికీ ఆర్థర్ పదవీ కాలాన్ని వరల్డ్ కప్ వరకూ పొడిగించారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మికీ ఆర్థర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత పాకిస్తాన్ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో ఆర్థర్ పని తీరుపై సంతృప్తి చెందిన పీసీబీ అతని పదవీ కాలాన్ని మరి కొంతకాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2019 వరల్డ్ కప్ వరకూ పాక్ జట్టు కోచ్ ఆర్థర్ కొనసాగుతాడని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. 2016 మే నెలలో ఆర్థర్ పాక్ క్రికెట్ ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలానికి ఆర్థర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరో కొన్ని నెలల్లో ఆర్థర్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు దాన్ని పొడగించింది. , ,, -
'నన్ను కోచ్ దూషించాడు'
కరాచీ:తనను క్రికెట్ కోచ్ మైక్ ఆర్థర్ తీవ్రంగా దూషించాడంటూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆరోపిస్తున్నాడు. లాహోర్ లో జాతీయ క్రికెట్ అకాడమీలో తమ మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా తనపై ఆర్థర్ దూషణలకు పాల్పడ్డాడని అక్మల్ పేర్కొన్నాడు. ఇందుకు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తో పాటు ముస్తాక్ అహ్మద్ లే సాక్ష్యమన్నాడు. 'నాతో వాగ్వాదం సందర్భంగా ఆర్థర్ చాలా పేలవమైన భాష మాట్లాడాడు. అదే క్రమంలో దూషణలకు దిగాడు. మా క్రికెట్ పెద్దలు ఇంజమామ్, ముస్తాక్ లు సాక్షిగా నాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ శిక్షణకు హాజరైన క్రమంలో క్లబ్ క్రికెట్ ఆడుకో అని ఆర్తర్ సహనాన్ని కోల్పోయాడు. అదే క్రమంలో తీవ్రస్థాయిలో దూషణలకు దిగాడు'అని ఉమర్ అక్మల్ తెలిపాడు. ఆ తరహా వ్యాఖ్యల్న ఒక కోచ్ నుంచి తాను ఊహించలేదన్నాడు.