Nageshwar Rao
-
లోకేష్‌కు ఢిల్లీ టూర్లో ఒరిగిందేంటి?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి, జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14వ తేదీన ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ . అక్టోబర్ 5 వరకు దేశ రాజధానిలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండటంపై లోకేష్ చెబుతున్న మాటలు రెండే రెండు. ‘‘ఒకటి బాబు అరెస్ట్‌పై జాతీయ నేతల మద్దతు కోరడం, రెండు న్యాయకోవిదులతో చర్చలు’’. ఢిల్లీ మకాంపై విమర్శలు అయితే లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో గడపడం రాజకీయంగా తప్పుడు వ్యూహమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అరెస్ట్ అయి జైలులో ఉంటే.. రాష్ట్రంలో ఉండి పార్టీని, పార్టీ కార్యకలాపాలను ముందుండి నడిపించాల్సిన నేత దేశ రాజధానిలో మకాం వేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీకి ఒక నాయకుడిగా, ప్రత్యామ్నాయ నేతగా ఎదగడానికి వచ్చిన అవకాశాన్ని కూడా లోకేష్ వదులుకుంటున్నాడనే చెబుతున్నారు. ఇక ఏపీకి వస్తే సీఐడీ అరెస్ట్ చేస్తుందనే భయంతో లోకేష్ ఢిల్లీకి పరారయ్యరనేది కూడా మరో విమర్శ. ఈ విషయంలో లోకేష్ వాదన మరోలా ఉంది. "ఢిల్లీకి వచ్చి కూడా CID అరెస్ట్ చేస్తుంది కదా అన్నది". సాంకేతికంగా ఇది తప్పుబట్టకపోయినప్పటికీ ఢిల్లీలో అరెస్టయితే దేశవ్యాప్తంగా కొంత మైలేజీ లభిస్తుందన్న ఆశ తెలుగుదేశంలో ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఢిల్లీలో అరెస్టయినా, అమెరికాల అరెస్టయినా.. లోకేష్‌కు కవరేజ్ ఇవ్వాల్సింది తెలుగు మీడియానే తప్ప మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు. ఆ కోణంలో ఆలోచిస్తే.. కీలక సమయంలో ఏపీలో ప్రజల మధ్య ఉంటే నాయకుడిగా లోకేష్‌కు మరింత పేరు వచ్చేదన్నది వీరి భావన. రెంటికి చెడ్డ రేవడి టీడీపీ తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ నేతలు స్పందించలేకపోవడం, లోకేష్ ఢిల్లీ పర్యటనపై ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏ జాతీయ నాయకులు కలిసి, బాబుకు అనుకూలంగా నిరసన తెలిపిన దాఖలాలు లేవని అన్నారు. ఎందుకంటే టీడీపీ ఏ కూటమిలో లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. అటు బీజేపీతోనూ, ఇటు ప్రతిపక్షాల ఇండియా కూటమిలోనూ లేదు. మమతాబెనర్జీ వంటి వారు స్పందించినా, పెద్ద ఎత్తున రాజకీయ స్పందన రావడానికి అవకాశమే లేదన్నారు. కారణం బాబు చేసుకున్న స్వయంకృతాపరధమేనని చెప్పారు. ఒకప్పుడు మోదీని విమర్శించి.. ఇప్పుడు.. 2019కు ముందు ఎన్డీయేను వదిలి బీజేపీయేతర పార్టీలతో కలిసి నానా హడావిడీ చేశారని,. 2019 తర్వాత పొరపాటున బీజేపిని ఏ మాటున విమర్శించకుండా, ఏ ప్రతిపక్ష మీటింగ్‌కు వెళ్లకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలిపారు. ఇక ఇటీవలి కాలంలో మోదీ విజనరీ అంటూ పొగడటం మెదలు పెట్టాడంతో.. ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు ప్రశంసించడంతో బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికీ బాబును విశ్వసించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. చదవండి: నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం రాష్ట్రంలో ఉండి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు మరోవైపు ఇప్పటికీ బీజేపీతో కలవడానికి ఆరాటపడుతున్న చంద్రబాబును కలుపుకోవడానికి ఇండియా కూటమి రెడీగా లేదని చెప్పారు దీంతో దేశ రాజధానిలో బాబు అరెస్ట్‌పై భారీ స్పందన రావడం లేదని తెలిపారు. జాతీయ మీడియాలో బాబు అరెస్ట్‌ను ఎక్స్పోస్ చేయడానికి లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్, విజయవాడలో కూర్చొని జాతీయ మీడియాతో ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని తెలిపారు. దీనివల్ల లోకేష్ ఢిల్లీలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ చేసే పరిస్థితి లేదన్నారు. లోకేష్ సలహాలు ఇచ్చే అవసరం లేదు లోకేష్ చెబుతున్న రెండో పాయింట్.. న్యాయ కోవిదులతో చర్చలు.. లాయర్లతో లోకేష్ చర్యలు జరిపే అవకాశమే లేదన్నారు. లేదు. ఎందుకంటే లీగల్‌గా బాబు తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లుథ్రా, హరీష్ సాల్వే ప్రముఖ లాయర్లని, వీరికి లోకేష్ సలహాలు ఇచ్చే అవసరం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీకి కమిటెడ్ లాయర్లు, లీగల్ సెల్ ఉండనే ఉందని.. వారే సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడుతుంటారని తెలిపారు. అంతేగాక చంద్రబాబు తన లాయర్లు కలిసి మాట్లాడేందుకు వీలు కూడా ఉండటంతో వీళ్లతో లోకేష్ చర్చించేది ఏం ఉండదని.. కావున రోజుల తరబడి ఢిల్లీలో ఉండాల్సిన పనిలేదని చెప్పారు. అరెస్ట్‌కు భయపడి డిల్లీలో.. ఇక సీఐడీ అరెస్ట్‌కు భయపడి లోకేష్ ఢిల్లీలో ఉంటున్నాడనే విమర్శలపై నాగేశ్వరరావు స్పందిస్తూ.. ఏపీ పోలీసులు ఢిల్లీ వెళ్లి కూడా లోకేష్‌ను అరెస్ట్ చేయొచ్చని..కానీ లోకేష్ మాత్రం ఇప్పటి వరకు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నాడనే దానిపై సరైన సమాధానం లేదని అన్నారు. పొలిటికల్‌గా, లీగల్‌గా ఢిల్లీలో లోకేష్ చేసే పని లేదన్నారు. రాష్ట్రంలో లోకేష్ అవసరం పార్టీకి ఉందని, ఈ సమయంలో ఢిల్లీలో ఎందుకు ఉంటున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు,. అందుకే అరెస్ట్‌కు భయపడి ఢిల్లీలో ఉన్నడనే వాదనకు బలం చేకూరుతుందని తెలిపారు. అరెస్ట్ అయితే నెగిటివిటీ ఏం రాదు ఒకవేళ అరెస్ట్‌కు భయపకుండా ఎలాగైనా అరెస్ట్ చేస్తారని భావించిన లోకేష్.. ఒకవేళ ఢిల్లీలో అరెస్ట్ చేస్తే జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చనే ఆలోచన ఏమైనా ఉండవచ్చని పేర్కొన్నారు. అరెస్ట్ అయితే నెగిటివిటీ ఏం రాదని.. జయలలిత, లాలూ ప్రసాద్, అమిత్‌షా, వాజ్‌పేయ్ వంటి వారు అరెస్ట్ అయినా గొప్ప పదవులను చేపట్టారని ఉదాహరించారు. అలాగే అరెస్ట్‌కు భయపడితే ప్రధాన నాయకుడు ఎప్పుడూ కాలేరని విమర్శించారు. -
కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ జాతి నమ్మదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణ జాతి ఎన్నటికీ నమ్మదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ గురువారం తెలంగాణ భవన్లో హరీశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మత కలహాలు, కరెంటు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. అంబేడ్కర్ చూపిన మార్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తోందని, కాంగ్రెస్, బీజేపీలకు దళితులు, గిరిజనులపై ఏ మాత్రం ప్రేమలేదన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంఆర్పీఎస్ నాయకులు జే.ఆర్.కుమార్, శ్రీనివాసులు, సతీష్ ఉన్నారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
అర్ధరాత్రి నాగేశ్వర్ రావు గారు వచ్చి ఓ మాట అన్నారు..
-
జాకీతో బిల్డింగ్‌ను లేపాలని ప్రయత్నించి...
కుత్బుల్లాపూర్: రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ వేశాడో ఇంటి యజమాని. అది బెడిసికొట్టి.. భవనం అదుపుతప్పి పక్క భవనంపైకి ఒరిగింది. పక్క భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ సీఎస్కే స్కూల్ గల్లీలో నాగేశ్వరావు అనే వ్యక్తి 2001లో ఇంటిని నిర్మించాడు. తరువాత రోడ్డు వేయడంతో జీ ప్లస్2 భవనం.. రోడ్డు కంటే కిందకు అయ్యింది. అయితే పలువురు సూచించారని చెప్పి.. హైడ్రాలిక్ మెషీన్ పెట్టి బిల్డింగ్‌ను పైకి లేపాలని ప్లాన్ వేశాడు. శనివారం మధ్యాహ్నం హైడ్రాలిక్ మిషన్ తెప్పించి ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం 10 ఇంచుల వరకు జరిగి, పక్క భవనంపైకి ఒరిగింది. దీంతో ఇంట్లో ఉన్నవారు పరుగులు పెట్టారు. పక్క భవనం యజమాని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రభావతి, డీఆర్ఎఫ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వచ్చారు. ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపించి బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం కావడంతో బిల్డింగ్‌ను తొలగించాలా? లేదా? అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. 2001లో నిర్మించినట్టు భవన యజమాని చెబుతున్నా.. 1990లోనే నిర్మించారని ఇరుగుపొరుగు అంటున్నారు. పాత భవనం, సరైన కండిషన్లో లేనందున భవనాన్ని కూల్చడమే మంచిదని అసిస్టెంట్ సిటీ ప్లానర్ సాంబయ్య మీడియాకు తెలిపారు. -
మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రేప్ అండ్ కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. మొత్తం ఆరు వందల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. ఛార్జ్‌షీట్‌లో అన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు నెలలపాటు జైల్లోనే ఉన్న నాగేశ్వరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక పోలీస్ విభాగం ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంటూ.. నాగేశ్వరరావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. సర్వీసు నుంచి తొలగించారు. ఛార్జ్‌షీట్‌లో సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్.. ఇలా మొత్తం వివరాలను నమోదు చేశారు. నాగేశ్వరరావుకు శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించింది పోలీస్ శాఖ. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
డైవర్షన్ డ్యాం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం
ముంచంగిపుట్టు (విశాఖపట్నం): ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం డైవర్షన్ డ్యాం(డుడుమ డ్యాం)కు చెందిన రెండో నంబర్ పవర్ గేట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పవర్ గేట్‌కు చెందిన బ్యాలెన్సింగ్ రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో డ్యాం నుంచి భారీగా నీరు వృథా అవుతోంది. డుడుమ డ్యాం నుంచి టన్నెల్ పాండ్ డ్యాంకు వెళ్లే నీటి మార్గంలో కెనాల్ మీద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కెనాల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువున ఉన్న బలిమెల డ్యామ్‌లోకి చేరుతోంది. దీనిపై డ్యాం సిబ్బంది వెంటనే స్పందించి.. తెగిపోయిన బ్యాలెన్సింగ్ రోప్‌ను తొలగించి దాని స్థానంలో కొత్తది అమర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. బ్యాలెన్సింగ్ రోప్‌ను బుధవారం రాత్రికే పునరుద్ధరిస్తామని మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఎస్ఈ కేవీ నాగేశ్వరరావు చెప్పారు. -
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ దుకాణం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరాడు. దీంతో టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో టీడీపీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్ వెలువడనుంది. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా సమావేశమయ్యారు. తాజాగా టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు మెచ్చా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి లేఖ అందించారు. అనంతరం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్తో కలిసి ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర తాజాగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా తీసుకొచ్చారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
పట్టభద్రుల పోటీ... రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోటీ రసవత్తరంగా మారనుంది. హేమాహేమీలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’తో పాటు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’లో గురువారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పొలిటికల్ జోష్ మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓ వైపు ఓటరు నమోదుపై దృష్టి పెడుతూనే, అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. మండలి ‘నల్లగొండ–ఖమ్మం–వరంగల్’స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మళ్లీ టీఆర్ఎస్ పక్షాన అవకాశం దక్కుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కు చెందిన జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వంటి వారు టికెట్‌ను ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’స్థానం నుంచి హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, గత ఎన్నికల్లో కొద్దిఓట్ల తేడాతో ఓడిన పీఎల్ శ్రీనివాస్, వికారాబాద్‌కు చెందిన విద్యార్థి నేత శుభప్రద్ పటేల్ కూడా టీఆర్ఎస్ టికెటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ పోటాపోటీ..! ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్ నగర్’ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎస్.సంపత్‌కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల సంఘం నేత, విద్యావేత్త గౌరీసతీశ్ కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను కలిశారు. విద్యాసంస్థల అధిపతి ఏవీఎన్ రెడ్డి, , టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల వంటి వారు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్’స్థానం నుంచి టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నేత కోటూరి మానవతారాయ్ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మరోమారు బరిలోకి రాంచందర్‌రావు? ‘రంగారెడ్డి– హైదరాబాద్– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రస్తుతం బీజేపీ నేత ఎన్.రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’స్థానం నుంచి బీజేపీ నేతలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, పేరాల శేఖర్‌రావు తదతరులు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. వరంగల్ బరిలో కోదండరాం ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’ నుంచి గతంలో రెండు పర్యాయాలు గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరితోపాటు యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి, సూదగాని ట్రస్టు చైర్మన్ సూదగాని హరిశంకర్ గౌడ్ కూడా పట్టభద్రుల కోటా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
‘బాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నాడు’
సాక్షి, విజయవాడ: అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని.. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నైతికంగా మండలి రద్దు ఒప్పుకున్నారని తెలిపారు.1985లో ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించలేదని నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మండలి అవసరం లేదని.. అనవసరపు ఖర్చని ఆనాడు చంద్రబాబు అన్నాడని మండిపడ్డారు. సలహాలు, సూచలనలు ఇవ్వాల్సిన పెద్దలసభను చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. రౌడీ ప్రవర్తన ఉన్న తన ఎమ్మెల్సీలతో చంద్రబాబు మండలిని నింపారని నాగేశ్వరరావు ఆరోపించారు. బిల్లును మండలికి పంపితే వెనక్కి పంపుతూ ప్రజాస్వామ్యం విలువలను దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ చరిత్రలో మాజీ సీఎం శాసనమండలి గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్‌ను ప్రభావితం చేసిన సంఘనలు ఎక్కడా చూడలేదన్నారు. చదవండి: బినామీలను కాపాడుకునేందుకే బాబు తాపత్రయం ప్రజలకు మంచి చట్టాలను తీసుకురావడంలో జాప్యాన్ని గ్రహించిన సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. మండలి నిర్వహణ రాష్ట్రనికి అనవసర ఖర్చుతో పాటు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ప్రజలకు ఉపయోపడే బిల్లులను మండలిలో అడ్డుకోవడం హేయమైన చర్య అని నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీ రాజకీయ ఉగ్రవాదంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజాకీయ నిరుద్యోగిగా మారి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. చంద్రబాబు 23 సీట్లుకే కాకుండా 23 పంచాయతీలకు నాయకుడిగా పరిమితమయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: అందుకే చంద్రబాబు సభకు రాలేదు 151 సీట్లు ఉన్న ప్రభుత్వం చేస్తున్న చట్టాలను మండలిలో వ్యతిరేకించడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమే అని నాగేశ్వర రావు మండిపడ్డారు. శాసన మండలి నిర్వహించటం అంటే రాజకీయ నిరుద్యోగులను ప్రోత్సహించడమే అని ఆయన పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజలు శాసనసభ మండలి రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు శాసనసభ మండలి రద్దును గ్రహించి.. సభ్యులకు అవినీతితో సంపాదించిన సొమ్ము జీతం రూపంలో ఇస్తానని హామీ ఇచ్చారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ హామీతో చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మండలి రద్దును బలపపిర్చిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. -
'టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు'
సాక్షి,విజయవాడ : శాసన మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు గురువారం విజయవాడలో పేర్కొన్నారు. శాసన మండలిలో నిష్ణాతులైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారని.. కానీ టీడీపీ సభ్యులు ఒక వీధి రౌడీల్లా వ్యవహరించారని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా నడుచుకోవడం దారుణమని పేర్కొన్నారు. బాబు గ్యాలరీలో కూర్చుని టీడీపీ సభ్యుల చేత స్పీకర్‌ను ప్రభావితం చేయించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారని తెలిపారు. కృత్రిమ ఉద్యమం ద్వారా బలహీన పడే పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని, రాష్ట్రంలో ఉన్న 23స్థానాలను కూడా పోగొట్టుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న ఉద్యమం ద్వారా తాత్కాలికంగా ఆటంకాలు సృష్టించగలిగారే తప్ప ప్రజాస్వామ్యమైన విధానాలను ఆటంకపరచలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తుందని బుద్దా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
మహిళలపై నేరాలకు మద్యమే కారణం
పంజగుట్ట: మహిళలపై జరుగుతున్న నేరాలకు మద్యమే కారణమని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. మద్యం కారణంగా రాష్ట్రానికి ఏటా రూ.11 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వాలు దీనిని ఒక ఆర్థిక వనరుగానే చూస్తున్నాయి కానీ.. దానివల్ల కలిగే నష్టం గురించి ఆలోచించడం లేదన్నారు. ‘మహిళలపై హింస ఎవరిదెంత పాత్ర–మన కర్తవ్యం’అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ ఆఫ్ కన్సర్స్ సిటిజన్స్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, వీ అండ్ షీ, వందేమాతరం ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, గ్రామ వికాస్ భారత్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, వికాస్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాక్షి’దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతోన్న దారుణాలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వక్తలు మాట్లాడిన అంశాలపై ప్రణాళిక రూపొందించి.. ఆచరణలోకి తెచ్చేందుకు కృషిచేద్దామని సూచించారు. -
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి నామా రాజీనామా
-
టీడీపీకి నామా గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఖమ్మం మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వర్రావు టీడీపీని వీడారు. పొలిట్‌బ్యూరో సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని, పార్టీకి పునర్వైభవం కల్పించేందుకు అనేక ఇబ్బందులకు ఓర్చి కష్టపడ్డా తెలంగాణ గడ్డపై టీడీపీ మనుగడ సాగించే అవకాశాలు లేవని లేఖలో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నానన్నారు. 2004లో టీడీపీలో చేరి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన నామా... కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో మరోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. 2009 నుంచి 2014 వరకు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన నామా... టీడీపీకి గుడ్‌బై చెబుతారని అప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒక దశలో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయించుకున్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నామాతోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య సైతం టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరనున్నారు. -
కోర్టులో ఓ మూలన కూర్చోండి
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా ఓ అధికారిని బదిలీ చేసిన ఘటనలో కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అంతేకాదు సాయంత్రం కోర్టు సమయం ముగియక ముందే మరోసారి వెళ్లేందుకు అనుమతి అడగ్గా.. రేపటి వరకూ కోర్టులోనే ఉంటారా.. అంటూ ఆగ్రహించింది. బిహార్‌లోని వసతిగృహాల్లో బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలపై విచారణ జరుపుతున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను అప్పటి సీబీఐ డైరెక్టర్ అయిన ఎం.నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే ఆయన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమి తులైన సమయంలోనే ఎటువంటి బదిలీలు చేయడానికి వీల్లేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. అయితే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి ఆయన బదిలీ చేశారు. దీనికి సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టులో సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు తమ ఉత్తర్వులను ధిక్కరించారని, ఇందుకు గాను ఆయనకు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. నాగేశ్వరరావుతోపాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని పేర్కొంటూ ఆయనకూ జరిమానా విధించింది. అలాగే కోర్టు సమయం పూర్తయ్యే వరకు కోర్టు ప్రాంగణంలోనే ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ఎన్ రావు, సంజీవ్ కన్నాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు వారిరువురు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సైతం న్యాయస్ధానం తోసిపుచ్చింది. కోర్టుకు ఏదైనా చెప్పుకునే అవకాశం ఇస్తామని, అయితే దీనికోసం వారు 30 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చని అని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఏమైనా చెబుతారా అంటూ వారిద్దరిని ప్రశ్నించింది. ఈ సమయంలో సీబీఐ తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇందుకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయకూడదని నాగేశ్వరరావుకి తెలుసని, తాను ఏది అనుకున్నానో అదే చేశాను అనేలా ఆయన ధోరణి ఉందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాయంత్రం వరకూ కోర్టులోనే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరామ్‌లు సాయంత్రం కోర్టు వేళలు ముగిసే వరకు కోర్టులోనే గడిపారు. అనంతరం కోర్టు నుంచి వెళ్లి పోయారు. -
క్షమించండి.. తప్పుచేశా!
న్యూఢిల్లీ: సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పా రు. బిహార్ ఆశ్ర మ పాఠశాలల్లో బాలికల వేధింపులపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేయడంపై గురువారం సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో సోమవారం ఆయన కోర్టుకు క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కోర్టు అనుమతి తీసుకోకుండానే బదిలీ చేయడం పొరపాటని అందులో అంగీకరించారు. ‘నా తప్పును అంగీకరిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నా. ఏకేశర్మ బదిలీ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం, ఉల్లంఘన అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కోర్టు అనుమతి లేకుండా ఆ బదిలీ చేసి ఉండాల్సింది కాదు’అని అందులో తెలిపారు. -
‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు
న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్‌ట్యూబ్ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు. ‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనీ, డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు. -
నాన్న ఎప్పుడొస్తాడు..?
మృతుడు నాగేశ్వరరావు ఇంట్లో విషాదం అనాథలైన భార్య, పిల్లలు నాన్న డ్యూటీకెళ్లాడు.. వచ్చేస్తాడు.. వచ్చినప్పడు రోజూ పప్పలు తెస్తాడు... చిన్నారుల ఎదురుచూపు. అమ్మ హడావిడిగా వెళ్లింది.. అమ్మమ్మ ఏడుస్తోంది.. ఇంటి నిండా జనం..వారికి ఏం జరిగిందో తెలీదు పాపం. నాన్న ఇక రాడని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అర్థం చేసుకోలేని వయసు వారిది. అంత చిన్నతనంలోనే ఎంత కష్టమొచ్చిందో అంటూ కుటుంబ సభ్యుల కన్నీరు.. అచ్యుతాపురం: పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అచ్యుతాపురం మండలం ఖాజీపాలేనికి చెందిన పీలా నాగేశ్వరరావు (28) ఇంట్లోని హృదయవిదారక దృశ్యమిది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగేశ్వరరావు పరవాడ ఫార్మా సిటీ పరిశ్రమకు పనికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. నాన్నను కోల్పోయి అనాథలైన ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఖాజీ పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగేశ్వరరావుకు భార్య మంగ, పాప జగదీశ్వరి (5), బాబు సంతోష్‌కుమార్ (3) ఉన్నారు. నాగేశ్వరరావు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలు రైతుగా కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. నష్టాలు రావడంతో వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత వ్యవసాయ కూలీగా గ్రామంలో పనులకు వెళ్లేవాడు. ఏడాది పొడవునా గ్రామంలో కూలిపని లభించకపోవడంతో ఫార్మా సిటీలో పనికివెళుతున్నాడు. అతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. తండ్రి కోసం ఎదురుచూపు పిల్లలు ఉదయం నిద్ర లేచేసరికి తండ్రి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చేస్తాడని ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. నాన్న డ్యూటీకి వెళ్లాడు.. వచ్చేస్తాడని ఆ చిన్నారులు చెబుతున్నప్పుడు అక్కడున్నవారు కంటతడిపెట్టారు. ఇక ఆ పిల్లలకు దిక్కెవరని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన
చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలు..చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో నాగేశ్వరరావు(35) అనే వ్యక్తిని సోమవారం రాత్రి పాము కాటేసింది. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును చికిత్సనిమిత్తం చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కాసింత ఆలస్యం చేసి బందరుకు రిఫర్ చేశారు. బందరులో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే నాగేశ్వరరావు మృతిచెందాడని, వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని మంగళాపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. -
జూన్ మొదటి వారంలో ఏపీ డీఎస్సీ ఫలితాలు..?
గుంటూరు: జూన్ మొదటి వారంలో డీఎస్సీ ఫలితాలను వెలువరించి, సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలపై ఆయనను ఇటీవల పీడీఎఫ్ ఎమ్మెల్సీలంతా కలసి విన్నవించగా ఈ విషయం తెలిపారని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ఎమ్మెల్సీలతో సమావేశం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారని చెప్పారు. ఈనెల 9, 10,11వ తేదీల్లో ఏపీ డీఎస్సీ-2014 జరిగిన విషయం విదితమే. -
ఇవి ప్రజా కంటక ప్రభుత్వాలు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ పాతగుంటూరు: ప్రజలు బీజేపీ, టీడీపీలను నమ్మి కేంద్రం, రాష్ట్రంలో పూర్తి మెజార్టీని ఇస్తే అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల సభ జరిగింది. ఈ సభకు ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి టి.శివయ్య అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే భవిష్యత్తులో నెలకొనే సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి ఎన్.భవన్నారాయణ, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, రాజేష్, అయ్యన్నస్వామి, పూర్ణ తదితరులున్నారు. -
సర్కారు పరువుపోవడం ఖాయం
పాతగుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయకుంటే సర్కారు పరువు పోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలు చేయాలని మంగళవారం గుంటూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాలు వచ్చాయని, వర్షాలు పడుతున్నయని రైతులు సాగు చేస్తున్న నేపథ్యంలో పంట రుణాలు అందక, రీషెడ్యూల్ కాక అన్నదాతలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పరువు పోకముందే కళ్ళు తెరవాలని సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలురైతులున్నారని, రీషెడ్యూల్ ఆలస్యం కావటంతో రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నరిశెట్టి గురవయ్య మాట్లాడుతూ రుణాల రద్దు, రీషెడ్యూల్ కాకుంటే రైతులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. స్వయాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే రూ.30 లక్షల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారని చెప్పారు. నకిలీల బెడదను అటకట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులలో ఉన్న రూ.9 వేల కోట్ల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా ధరను రెట్టింపు చేయడానికి కంకణం కట్టుకోవటం శోచనీయమని విమర్శించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బ్యాంకు కార్యనిర్వాహణాధికారి ఎం మురళీకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పచ్చల సాంబశివరావు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, కోటేశ్వరరావు, రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పోరు బిడ్డ.. మన దొడ్డా
చిలుకూరులో ఏర్పాటుచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య కాంస్య విగ్రహాన్ని ఆది వారం ఆవిష్కరించారు. నర్సయ్య పేదల పక్షాన నిలబడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. చిలుకూరు, న్యూస్‌లైన్: తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలిచి దొడ్డా నర్సయ్య పోరుబిడ్డగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కొనియాడారు. నాడు భూస్వామ్య, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నర్సయ్య 15 వ వర్ధంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎందరో కమ్యూనిస్టు నాయకులను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదల పక్షాన నిల బడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడని అన్నారు. అంతటి మహనీయుడిని ప్రతి కయ్యూనిస్టు ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి దొడ్డా నర్సయ్య ఆదర్శప్రాయుడని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో బలంగా ఉన్నదంటే దొడ్డా నర్సయ్య లాంటి నేతల ఉద్యమ ఫలితమేనన్నా రు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి అనాడు ఎంతో స్ఫూర్తినిచ్చి పేదల కోసం పరితపించిన డీఎన్ (దొడ్డా నర్సయ్య), బీఎన్‌లు స్టెన్‌గన్ లాంటివారని అన్నారు. ముందుగా సీపీఐ జెండాను, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీపీఐ నల్లగొండ, కృష్ణా జిల్లాల కార్యదర్శులు మల్లేపల్లి ఆదిరెడ్డి, అక్కినేని వనజ, సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నరసింహారెడ్డి, సీపీఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి చలసాని రాఘవేందర్రావు, నల్లగొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డా నారాయణరావు, వివి ద పార్టీల నాయకులు బద్దం బద్రారెడ్డి, గన్నా చంద్రశేఖర్, ఉప్పల కాంతారెడ్డి, నంద్యాల రామిరెడ్డి, రత్నాకర్‌రావు, పశ్య పద్మ, ముత్తవరపు పాండు రంగారావు, కేవీఎల్, పోటు ప్రసాద్, కొండా కోటయ్య, దొడ్డా పద్మా, పుట్టపాక శ్రీని వాస్ యాదవ్, మేకల శ్రీను, బెజవాడ వెంకటేశ్వర్లు, బజ్జూరి వెంకట్ రెడ్డి, వివిద పార్టీల నాయకులు చింతకుంట్లు లక్ష్మినారాయణరెడ్డి, వాడపల్లి వెంకటేశ్వర్లు, డేగబాబు, కందిబండ సత్యం, పాలకూరి బాబు, ధనుంజయనాయుడు, కంబాల శ్రీను పాల్గొన్నారు. తల్లి మరణవార్తతో వెనుదిరిగిన కె.నారాయణ దొడ్డా నర్సయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ మాతృమూర్తి మరణవార్తతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగి వెళ్లిపోయా రు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన జిల్లాలోని నార్కట్‌పల్లి వద్దకు చేరుకోగానే తల్లి మరణవార్త తెలి సింది. దీంతో ఆయన హాజరు కాలేకపోయారు.