Narayan Rane
-
పీఎం విశ్వకర్మ పథకానికి 1.4 లక్షల దరఖాస్తులు
న్యూఢిల్లీ: పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ఈ నెల 17న ప్రారంభించగా, పది రోజుల్లోనే 1.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల సమగ్రాభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కోల్పోయిన వారి గుర్తింపు తిరిగి పూర్వపు స్థతికి చేరుకుంటుందన్నారు. చేతి పనివారి సామర్థ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కు తీసుకెళ్లడం ఈ పథ కం లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 విభాగాల చేతివృత్తుల పనివారు, కళాకారులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. వీరికి ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడంతోపాటు, శిక్షణాకాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫెండ్ కూడా లభిస్తుందన్నారు. టూల్‌కిట్స్ కొనుగోలుకు రూ. 15,000 అందజేస్తామన్నారు. లబి్ధదారులు హామీ లేని రూ.3 లక్షల రుణానికి అర్హులని చెప్పారు. -
'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్‌ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్‌ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్‌ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్‌ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు -
థాక్రేకు బిగ్ షాక్.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!
ముంబై: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే. ‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు భారీ షాక్
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు షాక్ ఇచ్చింది ముంబై హైకోర్టు. జుహు ప్రాంతంలోని రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముంబై అధికారులను ఆదేశించింది. ఆ నిర్మాణాలు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన ధర్మాసనం. నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలంటూ రాణా కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని ఆదేశించింది ధర్మాసనం. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయటం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని బీఎంసీకి సూచించింది కోర్టు. ఆ తర్వాత వారం లోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించటంతో పాటు కేంద్ర మంత్రి నారయణ్ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ విభాగంలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని, దాంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకు ముందు ఈ ఏడాది జూన్‌లో అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా బీఎంసీ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది సంస్థ. ఇదీ చదవండి: ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ! -
ఎంఎస్ఎంఈలకు మరింత ప్రోత్సాహం!
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పురోగతి లక్ష్యంగా కేంద్రం జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ పారిశ్రామిక ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, లాభాలను పెంచడం, పర్యావరణంపై హానికరమైన పద్దతులను నియంత్రించడం, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంబంధించి తాజా పథకం ప్రయోజనకరంగా ఉంటుంనది మంత్రి రాణే తెలిపారు. ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకంలో భాగమైన జెడ్ఈడీ ధృవీకరణ పథకం ద్వారా వ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చని, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చని, పర్యావరణ స్పృహపై అవగాహన పెరుగుతుందని, సహజ వనరులను అత్యుఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని, మార్కెట్ విస్తరించుకోవచ్చని మంత్రి వెల్లడించారు. బహుళ ప్రయోజనం... అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కాంస్య, వెండి, బంగారంతో సహా మూడు ధృవీకరణ స్థాయిలను కలిగి ఉంటుంది. ఎంఎస్ఎంఈలు ఏదైనా ధృవీకరణ స్థాయికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన ప్రమాణాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. పథకం కింద దాదాపు 20 మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంఎస్ఎంఈలు జెడ్ఈడీ మార్గర్శకాల దిశగా చర్యలు తీసుకోవాలి. జెడ్ఈడీ ధృవీకరణ వ్యయంపై ఎంఎస్ఎంఈలు సబ్సిడీని పొందుతాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ధృవీకరణ ఖర్చులో 80 శాతం వరకు సబ్సిడీ మొత్తం ఉంటుంది, అయితే చిన్న, మధ్యస్థ యూనిట్లకు ఇది వరుసగా 60 శాతం, 50 శాతంగా ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలకు 10 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా మంత్రిత్వ శాఖ యొక్క స్పూర్తి లేదా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ–సీడీపీ) భాగమైన ఎంఎస్ఎంఈలకు 5 శాతం అదనపు సబ్సిడీ ఉంటుంది. ఇంకా, జెడ్ఈడీ మార్గదర్శకాలు, ప్రమాణాలు పాటించడం ప్రారంభించిన తర్వాత ప్రతి ఎంఎస్ఎంఈకి పరిమిత ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 10,000 రివార్డు ప్రదానం జరుగుతుంది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ సొల్యూషన్స్ వైపు వెళ్లేందుకు ప్రోత్సాహకరంగా వారికి జెడ్ఈడీ సర్టిఫికేషన్ కింద హ్యాండ్‌హోల్డింగ్, కన్సల్టెన్సీ మద్దతు కోసం ఎంఎస్ఎంఈకి రూ. 5 లక్షల వరకూ కేటాయింపు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్థిక సంస్థలు మొదలైన వాటి ద్వారా జెడ్ఈడీ సర్టిఫికేషన్ కోసం అందించే అనేక ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. ఎంఎస్ఎంఈ కవచ్ (కోవిడ్–19 రక్షణ నిమిత్తం) చొరవ కింద ఉచిత ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘వచ్చే మార్చి నాటికి బీజేపీ చేతికి అధికారం’
Narayan Rane BJP Government In Maharashtra By March: బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహారాష్ట్రలో త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని.. వచ్చే ఏడాది నాటికి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఓ కేంద్ర మంత్రి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శుక్రవారం రాజస్తాన్ జైపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘మహారాష్ట్రలో 2022, మార్చి నాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే మీరు భారీ మార్పులు చూడబోతున్నారు. అధికారంలోకి రావడం.. ప్రభుత్వాన్ని కూల్చడం ఇవ్వన్ని రహస్యంగా జరిగే పనులు’’ అన్నారు నారాయణ్ రాణె. (చదవండి: ‘ముందు జైల్లో పెట్టేది తిను.. నీ వల్ల కాకపోతే అప్పుడు చూద్దాం’) #WATCH | "Change will be seen in Maharashtra very soon. The change will be seen by March. To form a government, to break a govt, some things have to be kept secret," Union Minister Narayan Rane in Jaipur (25.11) pic.twitter.com/GAlDtDr1xO — ANI (@ANI) November 26, 2021 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. 2019కి ముందు మిత్రపక్షం శివసేనతో కలిసి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణాలు మారాయి. శివసేన, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) పేరుతో కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. (చదవండి: పెట్రో ధరల తగ్గింపు: శరద్‌పవార్ స్పందన) పదవిలోకి వచ్చిన ప్రారంభంలో.. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని.. చీలికలు చోటు చేసుకుని.. బీజేపీ చేతికి తిరిగి అధికారం దక్కుతుందని విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. ఎంవీఏ రెండేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. చదవండి: మహారాష్ట్రలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ.. -
రాణె యాత్ర పునఃప్రారంభం త్వరలో
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం తరువాత కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని వారు పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలి తెలిపారు. గతంలో ప్రకటించిన మార్గంలోనే యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చదవండి: Shiv Sena-Narayan Rane: రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తం ఇటీవలే కేంద్ర కేబినెట్లోకి చేరిన రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్‌లో ముగియాల్సి ఉంది. అయితే, సోమవారం రాయ్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. ఆయనపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. శివసేన కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆయనకు మహాడ్‌లోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చదవండి : నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె -
నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నారాయణ్ రాణె మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెవరికీ భయపడను. నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదు. దేశానికి స్వాతంత్యం ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోలేని ఒక ముఖ్యమంత్రిపై నేను చేసిన వ్యాఖ్యలు.. నాలోని ఆగ్రహానికి అక్షరరూపాలు. నేనేమన్నానో మీడియా మిత్రులకూ తెలుసు. చదవండి: చిన్న పార్టీల జోరు..అధిక సీట్ల కోసం బేరసారాలు అదెలా నేరమవుతుంది?. నిజానికి ఠాక్రే.. కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఇంతకంటే దారుణమైన మాటలతో విమర్శించారు. అమిత్ షాను ‘సిగ్గులేని వాడు’ అని, సీఎం యోగిని చెప్పులతో కొట్టాలని ఠాక్రే గతంలో దుర్భాషలాడారు’’ అని రాణె విమర్శించారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయాలని చూసే వారి దవడలు పగలగొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఠాక్రే గతంలో ఆదేశించారని రాణె గుర్తుచేశారు. నాసిక్ కేసులో అరెస్ట్ చేయబోం నాసిక్‌లో నమోదైన ‘రాణె వ్యాఖ్యల’ కేసులో ఆయనపై సెప్టెంబర్ 17తేదీ వరకు అరెస్ట్ లాంటి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రాణె పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమిత్ దేశాయ్ హాజరయ్యారు. కాగా, అరెస్ట్ సమర్థనీయమేనని మంగళవారం రాత్రి బెయిల్ సందర్భంగా మహాడ్ కోర్టు జడ్జి ఎస్ఎస్ పాటిల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ నిమిత్తం సెప్టెంబర్ రెండున తమ ముందు హాజరవ్వాలని రాణెను నాసిక్ పోలీసులు నోటీసులు జారీచేశారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ -
రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం
సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్
ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారి తీసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. రాణెపై మహారాష్ట్రలో పలు చోట్ల కేసులు నమోదవడంతో.. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న రాణెను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏకంగా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సంవత్సరం గుర్తులేకపోవడం సిగ్గుచేటు జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని రత్నగిరిలో రాణె పర్యటించారు. ఈ సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశిస్తూ ఆగస్ట్ 15న సీఎం ఠాక్రే చేసిన ప్రసంగాన్ని రాణె ప్రస్తావించారు. ‘ఏ ఏడాదిలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందో సాక్షాత్తూ సీఎంకు తెలీకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రసంగాన్ని మధ్యలో ఆపి ఆయన వెనక వైపున్న సిబ్బందిని ఏడాది గురించి అడిగి తెల్సుకున్నారు. ఆ రోజు నేనే అక్కడ ఉండి ఉంటే గట్టిగా సీఎం చెంప పగలగొట్టేవాడిని’అని రాణె వ్యాఖ్యానించారు. దీంతో రాణె వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, థానె, అమరావతిసహా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాలను ధ్వంసంచేశారు. మరోవైపు, నాసిక్ సిటీలో, రత్నగిరి జిల్లాసహా పలు పట్టణాల్లో శివసేన, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ముంబైలోని రాణె నివాసం వద్ద బీజేపీ, శివసేన కార్యకర్తలు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారందరినీ చెదరగొట్టారు. 50 మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. రాణెను కేబినెట్ నుంచి తొలగించాలంటూ ప్రధాని మోదీకి శివసేన ఎంపీ వినాయక్ రౌత్ లేఖ రాశారు.. వెనువెంటనే అరెస్ట్ రాణెపై పుణె, నాసిక్, మహాడ్ సహా పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదవడంతో రాణెను అరెస్ట్చేయాల్సిందిగా నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాణె రత్నగిరిలోని సెషన్స్ కోర్టును కోరారు. నాసిక్‌లోని కేసు.. తమ పరిధిలోది కాదంటూ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు రాణెను మంగళవారం మధ్యాహ్నం గోల్వాలీలో అరెస్ట్‌చేసి సంగమేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు రాయ్‌గఢ్ జిల్లాలోని మహాడ్‌కు తీసుకొచ్చారు. దీంతో రాణె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ రాణె తరపు న్యాయవాది అనికేత్ నికమ్ హైకోర్టును కోరారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించబోమని, ముందుగా రిజిస్ట్రీ ముందు కేసు ఫైల్ చేయండంటూ జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్‌ల డివిజన్ బెంచ్ రాణె లాయర్‌ను ఆదేశించింది. తనపై పలుచోట్ల దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ రాణె హైకోర్టులో మరో పిటిషన్ దాఖలుచేసే ప్రయత్నంచేయగా... సాంకేతిక కారణాల వల్ల మంగళవారం అది సాధ్యపడలేదు. నేనంటే భయం.. అరెస్ట్ తర్వాత రాణె ఇండియాటుడేతో మాట్లాడారు. ‘‘వారు (మహారాష్ట్ర ప్రభుత్వం) నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే ఇదంతా చేస్తున్నారు. నేనేమీ తీవ్రమైన వ్యాఖ్యలేవీ చేయలేదు. ‘నేనక్కడ ఉంటే చెంప మీద కొట్టేవాడిని’అని అన్నాను. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వివాదంలో సీఎం కుమారుడు ఆదిత్య ఇరుక్కున్నారు. అయినా అరెస్ట్ చేయలేదు. నన్ను ఎందుకు అరెస్ట్‌చేశారు?అని వ్యాఖ్యానించారు. ఓర్వలేకే ఈ అరెస్ట్: నడ్డా బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, అందుకే ఓర్వలేక శివసేన ప్రభుత్వం ఇలా అరెస్ట్‌లకు పాల్పడుతోందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాత్రికి బెయిల్ మహాడ్ కోర్టు నారాయణ్ రాణెకు మంగళవారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరినా మహాడ్ కోర్టు జడ్జి షేక్బాబాసో పాటిల్ నిరాకరించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరిగిందేమోననే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది భూషణ్ సాల్వి కోరారు. దీనిని రాణె లాయర్లు గట్టిగా వ్యతిరేకించారు. రాణె వయసు 69 ఏళ్లని, షుగర్, బీపీ సమస్యలు ఉన్నాయని కోర్టును నివేదించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద రాణెకు ఎలాంటి సమన్లు ఇవ్వలేదని, అందువల్ల అరెస్టు చట్టవిరుద్ధమని రాణె న్యాయవాది అనికేత్ నికమ్ వాదించారు. కస్టడీ అనవసరమన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి పాటిల్ కేంద్రమంత్రిని పోలీసు కస్టడీకి అప్పగించానికి నిరాకరించారు. రూ.15 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ప్రారంభించిన జన్ ఆశీర్వాద్ యాత్ర రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణం అవుతోంది. గురువారం మహరాష్ట్రలో తన యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన దాదర్‌లోని శివాజీ పార్క్ మైదానంలోని దివంగత బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన నగరంలోని పలు వీధుల్లో తిరుగుతూ తన యాత్రను కొనసాగించారు. అయితే, బాల్ ఠాక్రే స్మతి స్థలాన్ని రాణే సందర్శించడం పట్ల మండిపడిన కొందరు శివసైనికులు, శుక్రవారం బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని శుద్ధి చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించడంతో అది అపవిత్రమైందని శివసైనికులు ఆరోపించారు. స్మృతి స్థలాన్ని తొలుత గోమూత్రంతో శుభ్రం చేసి, తరువాత పాలతో అభిషేకం చేశారు. బాల్ ఠాక్రే రాణేను ఎంతో ప్రోత్సహించారని, అండగా నిలిచారని, రాజకీయాల్లో ఉన్నత పదవులివ్వడంతో పాటు ముఖ్యమంత్రిని చేశారని శివసైనికులు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై, ఆయన కుటుంబంపై రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక ఆరోపణలు చేశారని శివసైనికులు మండిపడ్డారు. రాణే సందర్శనతో స్మృతి స్థలం అపవిత్రమైందని శివసేన ఎమ్మెల్యే మనీషా కాయందే ధ్వజమెత్తారు. పాలతో అభిషేకం చేసిన శివసైనికులను ఆమె ప్రశంసించారు. ‘రాణేకు నచ్చింది ఆయన చేశారు. మాకు నచ్చింది మేం చేశాం’అని మనీషా స్పష్టం చేశారు. ‘2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన నారాయణ్ రాణేకు ఇప్పటివరకు బాల్ ఠాక్రే గుర్తుకు రాలేదు. ఆయన ఇప్పటివరకు బాల్ ఠాక్రే స్మృతి స్థలాన్ని సందర్శించలేదు. ఇప్పుడు జన్ ఆశీర్వాద్ యాత్ర పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాణేకు బాల్ ఠాక్రే గుర్తుకొచ్చారు’అని మనీషా కాయందే ఎద్దేవా చేశారు. ‘బాల్ ఠాక్రేపై అంత అభిమానం ఉంటే ఆయన కుటుంబంపై ఎందుకు నిప్పులు కక్కుతున్నారు? ఘాటైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు?’అని ఆమె ప్రశ్నించారు. చదవండి: నాన్ పార్కింగ్ జోన్: మనిషితో సహా బైక్‌ని ఎత్తి వ్యాన్‌లో వేశారు శివసైనికులు చేసింది తప్పు: ఫడ్నవీస్ నాగ్‌పూర్: రాణే సందర్శనతో బాల్ ఠాక్రే స్మృతి స్థలం అపవిత్రమైందని పేర్కొంటూ శివసైనికులు ఆ స్థలాన్ని శుద్ధి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. స్మృతి స్థలం శుద్ధి సంఘటన గురించి కొందరు విలేకరులు నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఇది సంకుచిత మనస్తత్వం గల వాళ్లు చేసే పని అని విమర్శించారు. ఆ పని చేసిన శివసైనికులకు అసలు శివసేన అంటే ఏంటో తెలియదన్నారు. అప్పట్లో బాల్ ఠాక్రేను జైలుకు పంపించాలని అనుకున్న పార్టీలతోనే ఇప్పుడు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. అలాంటి పారీ్టలతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా లేనిది, ఒక పాత శివసైనికుడు వెళ్లి నివాళులు అర్పిస్తేనే అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పేనని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశారని మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఆరోపించారు. దిశా అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల మరకలున్నాయని వెల్లడైందని పేర్కొన్నారు. దిశా, రాజ్‌పుత్‌ల మరణాల కేసుల్లో దోషులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత రాణే ఆరోపించారు. దిశా కుటుంబంపై ఒత్తిడి తెస్తుండటంతో వారు ఆమె మృతిపై విచారణ కోరడం లేదని రాణే పేర్కొన్నారు. జూన్ 13 రాత్రి నటుడు దినోమోరియా నివాసంలో పార్టీ జరిగిందని, ఆ తర్వాత పార్టీకి హాజరైన వారు సుశాంత్ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు. ఈ పార్టీకి ఓ రాజకీయ నేత కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా విశ్వసనీయ సమాచారం ఉండటంతోనే తన తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటారని ఆయన కుమారుడు, బీజేపీ నేత నితీష్ రాణే అన్నారు. త్వరలోనే తాము ఈ వివరాలను సంబంధిత అధికారుల ఎదుట వెల్లడిస్తామని చెప్పారు. సుశాంత్ మృతిపై వాస్తవాలు వెలుగులోకి రాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా జూన్ 14న సుశాంత్ విషాదాంతానికి ముందురోజు సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందనే ఆరోపణలను ముంబై పోలీస్ చీప్ పరంవీర్ సింగ్ గతంలో తోసిపుచ్చారు. మరోవైపు సుశాంత్ మృతిపై అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ముంబై చేరుకున్న బిహార్ పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి : సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం -
గవర్నర్‌తో మాజీ సీఎం రాణే భేటీ
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో పాటు భవిష్యత్‌లోనూ మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు. కరోనా వైరస్ సంక్షోభంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు గవర్నర్‌తో భేటీ అవడం గమనార్హం. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఇటీవల గవర్నర్‌తో సమావేశమై కరోనా కట్టడి సహా పలు అంశాలపై చర్చించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకూ 50,231 కరోనా కేసులు నమోదవగా 1635 మంది మరణించారు. చదవండి : మహా కలకలం -
‘కాంగ్రెస్‌లో చేరడం పొరపాటో లేక తప్పిదమో చెప్పలేను’
సాక్షి, ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌రాణెపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివనేన నుంచి రాణె కాంగ్రెస్‌లో చేరడాన్ని పొరపాటు అనాలో లేక ఘోర తప్పిదం అనాలో చెప్పలేనని వ్యాఖ్యానించారు. నారాయణ్‌రాణె ఆటోబయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2005లో రాణె శివసేన నుంచి బయటికి వద్దామనుకున్నారు. అప్పుడాయనకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి ఎన్సీపీ. రెండోది కాంగ్రెస్. అయితే, ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. అది పొరపాటు నిర్ణయమో. లేక తప్పిదమో చెప్పలేను’అన్నారు. ‘కాంగ్రెస్‌లో చేరితే సీఎం పదవి ఇస్తానన్నారని రాణె చెప్పారు. కానీ, అప్పుడే చెప్పాను. ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కాంగ్రెస్ నైజంలో లేదు అని. వినలేదు. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌లోనే గడిపాను కదా’అన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తదితరులు పాల్గొన్నారు. ఆవేశపరుడిగా పేరున్న రాణె కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేన పార్టీలోనారాయణ్‌రాణె చాలాకాలం పనిచేశారు. బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో బాల్ థాకరే ఆయనకు 1999లో మహారాష్ట్ర సీఎంగా అవకాశమిచ్చారు. అయితే, రాజ్‌థాకరేకి పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో నారాయణ్‌రాణె అసమ్మతి గళం వినిపించారు. దాంతో ఏడాది కాలానికే రాణె సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2005లో కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లపాటు పనిచేశారు. అయితే, కాంగ్రెస్‌లో నాయకులతో ఆయనకు పొసగక పోవడంతో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు. సోనియా కనికరించడంతో తిరిగి పార్టీలో చేరారు. చివరికి ‘మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష’ పేరుతో 2018లో పార్టీ పెట్టారు. -
మరాఠాలకు రిజర్వేషన్లు ఎందుకు ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తమకూ రిజర్వేషన్లు కావాలంటూ అన్ని రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న మరాఠాలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారు నిజంగా సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నామని భావిస్తున్నారా? వారు ఉద్యమ బాట పట్టడానికి మరేమైన కారణాలు ఉన్నాయా? మహారాష్ట్రలో మంగళవారం, బుధవారాల్లో మరాఠాలు నిర్వహించిన ఆందోళన విధ్వంసకాండకు దారి తీసిన విషయం తెల్సిందే. మహారాష్ట్రలో మరాఠాలు 33 శాతం మంది ఉన్నారు. వారికీ రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రధానంగా రెండు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు అన్నీ కలిపి యాభై శాతం మించరాదంటూ సుప్రీం కోర్టు ఇప్పటికే ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు నిర్దేశించిన దానికన్నా ఇప్పటికే రెండు శాతం ఎక్కువ అంటే, 52 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. రెండోది సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకే రిజర్వేషన్లు కల్పించాలి. మరాఠాలు వెనకబడిన వర్గాల కేటగిరీ కిందకు రారని, వారు ఫార్వర్డ్ కులమని మండల కమిషన్ ఎప్పుడో స్పష్టం చేసింది. రాజకీయంగా కూడా ఎంతో ఎదిగిన మరాఠా కులాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చలేమని జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ 2003లో స్పష్టం చేసింది. ఆ తర్వాత 2008లో మహారాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ తన 22వ నివేదికలో కూడా మరాఠాలను ఓబీసీ కేటగిరీలో చేర్చలేమంటూ చేతులెత్తేసింది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ సరాఫ్ నాయకత్వాన ఓ కమిషన్ వేసింది. ఆ కమిషన్ మనుగడలో ఉండగానే మహారాష్ట్ర ప్రభుత్వం నారాయణ రాణె నాయకత్వాన మరో కమిషన్ వేసింది. 2014లో రాష్ట్ర ఎన్నికలకు కొంత కాలం ముందు నారాయణ రాణె కమిషన్ మరాఠాలకు రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది. అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఆదరాబాదరా సమావేశమై మరాఠాలకు ప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసింది. దాన్ని నిలిపివేస్తు అదే సంవత్సరం నవంబర్ నెలలో బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ-శివసేన ప్రభుత్వం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టమే తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా బాంబే హైకోర్టు అడ్డుకుంది. మరాఠాలు రిజర్వేషన్లకు అర్హులు కారని అన్ని కమిషన్లు, కోర్టులు ఎందుకు తేల్చాయి? 1960లో మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రానికి సీఎం పదవిని 18 మంది నిర్వహించగా, వారిలో పది మంది మరాఠాలే. 1962 నుంచి 2004 మధ్య 2,430 మంది శాసన సభ్యులు ఎన్నిక కాగా వారిలో సగానికన్నా ఎక్కువ అంటే 1,366 మంది మరాఠాలే ఎన్నికయ్యారు. జిల్లా సహకార బ్యాంకుల్లో, విద్యా సంస్థల్లో, వైద్య, ఇంజనీరింగ్ యూనివర్శిటీల్లో వారిదే పైచేయి. వారికే ఎక్కువ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పాల సహకార సంఘాలపై వారిదే ఆధిపత్యం. అన్నింటికంటే వారి చేతుల్లో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఒక విధంగా గ్రామీణ సామ్రాజ్యం వారిదే. అందుకే ప్రధానంగా వారి వృత్తి వ్యవసాయం అయింది. ఈ కారణాల వల్లనే వివిధ కమిషన్లు వారి డిమాండ్‌ను తిరస్కరిస్తూ రాగా, ఓట్ల రాజకీయాల కోసం నాడు దిగిపోతున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, నేటి బీజేపీ-శివసేన ప్రభుత్వాలు రిజర్వేషన్లను అనుమతించాయి. మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా మరాఠా యువకులు వ్యవసాయ రంగానికి దూరం అవుతూ వచ్చారు. వారికి చదువుకునే స్థోమత ఎక్కువగా ఉన్నా చదువులో పెద్దగా రాణించలేక పోయారు. సామాజికంగా వెనకబడిన వర్గాల వారు ముందుకు దూసుకెళుతుంటే తాము విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడి పోయామన్న భావం యువతలో పేరుకుపోయింది. అసహనం పెరిగిపోయింది. కేవలం రిజర్వేషన్ల కారణంగానే బీసీలు, ఓబీసీలు, దళితులు ముందుకు తీసుకుపోతున్నారన్న అక్కసు వారిలో పుట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది నగర్లో 2016, సెప్టెంబర్ 20వ తేదీన 11 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక అత్యాచారం జరిపి దారుణంగా చంపేశారు. దోషులు దళితులు కావడంతో మరాఠాలు నాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నేరస్థులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సకాలంలోనే పోలీసులు దళితులను అరెస్ట్ చేయగా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆ కేసును త్వరితగతిన విచారించి ఏడాదిలోగానే ముగ్గురు దోషులను మరణ శిక్ష విధించింది. అయినా మరాఠాల కోపం చల్లరలేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేశారు. తమకు రిజర్వేషన్లు కావాలనే డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకొచ్చారు. -
బాల్‌ఠాక్రేను వేధించడం కళ్లారా చూశా
సాంగ్లి: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నోరు మూసుకోపోతే ఆయన బండారం మొత్తం బయటపెడతానని మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణె హెచ్చరించారు. తాను బాల్‌ఠాక్రేను వేధించినట్టు ఉద్ధవ్ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మహారాష్ట్రలోని సాంగ్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్‌ఠాక్రే బతికుండగా ఆయనకు తాను తాను ఎటువంటి సమస్యలు సృష్టించలేదన్నారు. ఉద్ధవ్, ఆయన కుటుంబమే ‘పెద్దాయన’పై వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు. ‘బాబాసాహెబ్‌ను ఉద్ధవ్, ఆయన కుటుంబ సభ్యులు వేధించడం నా కళ్లారా చూశాను. ఉద్ధవ్ నోరుమూసుకుని, నాపై కుట్రలు కట్టిపెట్టకపోతే ఆయన బండారం బయటపెట్టేందుకు వెనుకాడను. బాబాసాహెబ్ బతికుండగా ఆయనకు నేను ఏవిధంగానూ కష్టం కలిగించలేదు. బాల్‌ఠాక్రే నివాసంలో మాతృశ్రీలో జరిగిన అన్నింటికీ నేను ప్రత్యక్షసాక్షిని. వీటన్నింటినీ కచ్చితంగా వెల్లడిస్తా. నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. గతంలోనూ ఇదే చెప్పాన’ని నారాయణ్ రాణె పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం.. రాణెకు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన నాయకులు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. బాల్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడైన రాణె గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడి మహారాష్ట్ర స్వాభిమాన్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. తర్వాత కేంద్రం, మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలిపారు. -
ముందు నొయ్యి వెనుక గొయ్యి!
ఇటీవలే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన నారాయణ రాణే మంత్రివర్గంలో సీటు కాదు కదా.. ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో చిక్కుకు పోయారు. మాతృ సంస్థ శివసేన ఆయనపై పగ సాధింపుకు సిద్ధమైంది. నారాయణ్ రాణే ఉల్లాసకరమైన స్థితిలో కాలం గడుపుతున్నారు. బీజేపీకి తానిచ్చిన మాట ప్రకారం తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తన శాసనమండలి సభ్యత్వాన్ని కూడా వదిలేశారు. కొత్త మిత్రురాలి సహాయంతో ఆ స్థానాన్ని వెనువెంటనే దక్కించుకుంటానని తప్పుగా అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే, బీజేపీ రాణేపట్ల ఆసక్తి ప్రదర్శిస్తే దేనికైనా తెగిస్తానని రాణే మాజీ పార్టీ లేదా అతడి తొలి ప్రేమికురాలు అయిన శివసేన తీవ్రంగా హెచ్చరించింది. బీజేపీ సాధించిన 122 స్థానాలతో పోలిస్తే 63 స్థానాల్లో మాత్రమే గెలిచిన శివసేన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామి. శివసేన ఎప్పటికైనా తన కాళ్లకింది తివాచీని లాగేస్తుందన్న బీజేపీ భయాన్ని అర్థం చేసుకోవలసిందే. శివసేన నమ్మదగిన భాగస్వామి కాదు. ఒకవైపు బీజేపీతో అధికారం పంచుకుంటూనే కాంగ్రెస్, ఎన్సీపీల కంటే సమర్థంగా ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంలో ఉంటూ వచ్చే అన్ని ప్రయోజనాలనూ అందుకుంటూనే దానిపై నాలుగు రాళ్లు వేస్తూ ఉండటం దాని లక్షణం. రాణేపై శివసేనకు ఉన్న పట్టు చాలా గట్టిది. ఆ పార్టీకి చెందిన మనోహర్ జోషి స్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణేపై దాని పగ ప్రబలంగానే ఉంది. బహిరంగంగా అలా చెబుతోంది కూడా. ప్రజలు, రాజ కీయ వాదుల అవగాహన కూడా అదే మరి. రాణే తన ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తే, కాంగ్రెస్, బీజేపీ రెండూ శివసేనకు మద్దతు ఇవ్వవచ్చు, లేదా దాని మద్దతును అవి అంగీకరించవచ్చు. మాజీ శివసైనికుడు, ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ వాది అయిన రాణే తనను సభ్యుడిగా చేర్చుకున్న పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారవుతాడని చాలామంది వర్ణిస్తుంటారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న అశోక్ చవాన్‌ను లేదా పృథ్వీరాజ్ చవాన్‌ను తొలగించి తాను వారి స్థానాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం మద్దతును పొందడం చాలా సులువైన విషయమని రాణే భావించారు. అది బాల్ ఠాక్రేను ఒప్పించడమంత సులువైన అంశమని భావించారు. ఆయన అసహనం, పార్టీకిమించి తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వైఖరి వల్లే రాజకీయాల్లోనే కాకుండా సొంత నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు తనను చుట్టుముడుతూ వచ్చాయి. అందుకే 2014 ఎన్నికల్లో రాణే ఆయన కుమారుడు తమ కంచుకోటలను కోల్పోయారు. ఆ తర్వాత ముంబైలో అసెంబ్లీ స్థానాన్ని కూడా రాణే గెల్చుకోలేకపోయారు. ఇప్పుడు తన సంరక్షణలోని కొంకణ్ ప్రాంతంకోసం పోరాడుతున్నారు. ఇతరుల మద్దతుతో కాకుండా స్వయంగా దీనికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గెలిస్తే, అప్పుడు బీజేపీ అభినందనలను అందుకోవచ్చు. రాణేను తన చెంత చేర్చుకునే విషయమై బీజేపీ చాలా అప్రమత్తతతో ఉంది. రాణే ఆగ్రహ ప్రవృత్తి, ఉన్నట్లుండి ఆకస్మిక దాడిగా మారి తాను సొంత పార్టీ పెట్టుకుని చిన్న మిత్రపక్షంలా మారే అవకాశం ఉందని కూడా బీజేపీకి బాగా తెలుసు. నరేంద్ర మోదీ, అమిత్ షా పట్ల విశ్వాసం ప్రకటించేటట్లయితే ఎలాంటి భావజాలం నుంచి వచ్చిన వారికైనా సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. రాణే బీజేపీలో చేరడానికి గట్టిగానే లాబీయింగ్ చేశారు. కానీ తనకు కేబినెట్లో స్థానం ఇవ్వాలంటే బీజేపీకి మద్దతు ఇస్తున్న శివసేన ఆమోదం తప్పనిసరిగా మారింది. రాణే సభ్యుడిగా ఒకే మంత్రివర్గంలో తన సరసన కూర్చోవడానికి శివసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రాణేను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచీ దానివల్ల కలిగే పర్యవసానాల గురించి ఉద్దవ్ ఠాక్రే పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తన మాజీ శత్రువు (శివసేన నుంచి బయటకు వచ్చేటప్పుడు రాణే ఆ పార్టీని అత్యంత పరుషమైన రీతిలో దూషించాడు) ట్రంప్ కార్డును గట్టిగా పట్టుకోవడంతో రాణేకి చేదుమాత్ర మింగినట్లయింది. తన, తన కుటుంబ భవిష్యత్ అవకాశాలకు సంబంధించి రాణే సొంత చొరవతో చేయగలిగిందేమీ లేకుండా పోయింది. ఎక్కువ సీట్లు ఖాళీగా ఉండే శాసన మండలి ఎన్నికలలాగా కాకుండా, ఎమ్మెల్యేల నుంచి ఓట్ల కోటాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఉపఎన్నికలో పరిస్థితి అలాంటిది కాదు. రాణే తన స్థానాన్ని తిరిగి పొందాలంటే, ప్రస్తుతం శాసనసభలో ఉన్న మొత్తం సభ్యులలో సగంకంటే ఎక్కువ ఓట్లను తాను సాధించాల్సి ఉంటుంది. కానీ ఉన్నట్లుండి ఆయన మొత్తం ప్రతిపక్షాన్ని తనకు వ్యతిరేకంగా ఐక్యం చేసిపడేశారు. అందులోనూ శివసేన ఆయనపై పగ సాధించడానికి పొంచుకుని ఉంటోంది. ఈ మొత్తం దృశ్యాన్ని పరిశీలించినట్లయితే నారాయణ్ రాణే భారతీయ జనతాపార్టీకి ఇప్పటికయితే పెద్ద ఆస్తిగా కనిపించడం లేదు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
రాణే.. వేరు కుంపటి
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. గత నెల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే.. నేడు ’మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష‘ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోనూ, ఇతర పార్టీల్లొనూ కొనసాగుతున్న మిత్రులు, మరికొందరు తన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ యాక్షన్ ప్లాన్‌ను త్వరలో ప్రకటిస్తానని రాణే ప్రకటించారు. నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీనుంచి వైదొలిగాక.. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు భారీగా వెల్లువెత్తాయి. బీజేపీకి 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాణే చేరిక లాభిస్తుందని అందరూ అంచనాలు వేశారు. రాణే స్వస్థలమైన కొంకణ్ ప్రాంతంలో విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాణే బీజేపీలో చేరతారని అనుకున్నారు. -
‘కాంగ్రెస్, శివసేన అంతుచూస్తాను’
ముంబయి : కాంగ్రెస్ పార్టీ, శివసేన అంతు చూస్తానని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత నారయణ్ రాణే అన్నారు. ఇది వరకు శివసేన పార్టీలో సైతం ఉన్న ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని, అశోక్ చవాన్ దుర్యోదనుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇద్దరు కుమారులను కూడా బీజేపీలోకి చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన బీజేపీలోకి అడుగుపెట్టడం శివసేనకు ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని వీడినట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను నా రాజీనామా లేఖను సోనియాగాంధీకి మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో పంపించాను. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అందుకే నేను పార్టీని వీడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని, శివసేనను అంతం చేస్తాను’ అని చెప్పారు. -
బీజేపీలోకి మరో కీలక నేత!
మహారాష్ట్రలో అనూహ్య రాజకీయ పరిణామం ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ రాణే ఇంటిని సందర్శించడం.. ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెరలేపింది. వినాయక చవితి సందర్భంగా రాణే ఇంటిలో పూజకు మర్యాదపూర్వకంగా హాజరైనట్టు సీఎం ఫడ్నవిస్ మీడియాకు చెప్తున్నా.. రాణే బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైందన్న సంకేతాలు ఇది ఇస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం ఫడ్నవిస్ రాణే ఇంటిని సందర్శించిన ఫొటోను రాణే తనయుడు, ఎమ్మెల్యే నితేష్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. అంతకుముందు ఆయన ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక చవితి శుభాకాంక్షలను కూడా రీట్వీట్ చేసుకోవడం గమనార్హం. రాణే ఇంటికి తాను వెళ్లడం రాజకీయ పర్యటన కాదని, తాము రాజకీయాల గురించి చర్చించలేదని ఫడ్నవిస్ మీడియాకు చెప్పారు. రాణే బీజేపీలో చేరుతున్న సంగతి కూడా తనకు తెలియదన్నారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఆదివారం నారాయణ్ రాణే కలువబోతున్నట్టు వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు. గత కొన్నాళ్లుగా బీజేపీలో చేరేందుకు రాణే ప్రయత్నిస్తున్నారని, కానీ, ఇందుకు బీజేపీ షరతులు పెడుతోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఆయన దారే వేరు
విశ్లేషణ నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే శాక ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు. శివసేన ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకోవడమూ లేదు. రాణే స్వతం త్రంగా, సూటిగా వ్యవహరించే మనిషి. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ అశోక్ చవాన్‌కు ఆ పదవిని కట్టబెట్టింది. అసమ్మతిని వ్యక్తంచేసిన రాణేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన కాళ్లావేళ్లా పడి తిరిగి పార్టీలోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీలోని ఇతరులకు పెద్ద తలనొప్పిగా మారారు, ఆయనా సౌఖ్యంగా ఉన్నది లేదు. అయినా కాంగ్రెస్ ఆయనను పార్టీలోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉండటంతో రాణే భార తీయ జనతా పార్టీ వాకిటికి చేరారు లేదా దగ్గరయ్యారు. అయితే తలుపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఆయన ప్రవేశానికి ఆ పార్టీలో కొంత విముఖత ఉన్న దనిపిస్తోంది. పూర్తిగా ‘ఎన్నికలపరమైన ప్రతిభ’ లేదా ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఉన్నవారినే పార్టీలోకి తీసుకుంటామంటున్నా... అభ్యంతరకరమైన నేపథ్యా లున్న ఎందరికో బీజేపీ దేశవ్యాప్తంగా తలుపులు తెరి చింది. రాణేను అనుమతించడం జరిగి, ఒక్కసారి ఆయన పార్టీలోకి ప్రవేశించారూ అంటే క్రమశిక్షణకు కట్టుబడరనీ, తిరిగి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పద విని చేజిక్కించుకోవడానికి సమయం కోసం వేచి చూçస్తూ నిరంతరం ప్రకంపనాలను సృష్టిస్తుంటారనీ రాష్ట్ర బీజేపీలోని అత్యున్నతస్థాయి నాయకత్వ శ్రేణు లకు భయం ఉంది. మనోహర్ జోషి స్థానంలో బాల్ ఠాక్రే, రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిం చారు. అయితే 1999 ఎన్నికల్లో శివసేనను తిరిగి అధికా రంలోకి తేవటంలో ఆయన విఫలమయ్యారు. రాణే దేన్నీ లెక్కచేయని దురుసు మనిషి. తాను ఏమైనా మాట్లాడాలని నిర్ణయించుకుంటే చాలు, నీళ్లు నమలకుండా సూటిగా చెప్పేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే శివ సేనను నడుపుతున్న తీరును చూసి నిరాశచెంది ఆయన ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన తనపై భౌతిక దాడులు జరుగుతాయనే భయం లేదన్నారు. శివసేన అత్యున్నత నాయకత్వంతో ఘర్షణ పడి, పార్టీని వీడే తిరుగుబాటుదార్లకు తరచుగా పట్టే గతి అదే.‘‘సేనలో ఉన్నప్పుడు పార్టీ వీధి కార్య కలాపాలను నడిపినది నేనే’’ అన్నారు రాణే. కాంగ్రెస్ లోనూ ఆయన తనకు పరిస్థితి కాస్త సౌఖ్యంగా ఉండేలా చేసుకుంటున్నది లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ)తో ఎన్నికల అనంతరం చెలిమి చేస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం రైతులను కలుసుకునే కార్యక్రమాన్ని చేప ట్టింది. ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, దయ నీయస్థితిలోని రైతులు దాని పట్ల స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తృణీకారంతో ఆయన దానికి దూరంగా ఉన్నారు. ఆయన తనకు తోచిందే చేసే స్వతంత్ర వ్యక్తిత్వంగల మనిషి. తనకు మేలు చేసినందుకు ఆయన ఎవరికీ ఏవిధం గానూ రుణపడి లేరు. వీధుల్లోని శివ సైనికుని స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరారంటే అందుకు కారణం ఆయన నేర్పరితనమే. ముఖ్య మంత్రిగా విజయవంతమౌతూ వినమ్ర ప్రియభాషిగా పేరు తెచ్చుకుంటున్న జోషితో బాల్ ఠాక్రే అసౌకర్యంగా ఉన్నారని పసిగట్టడంతోనే ఆయన ఆ స్థానం కోసం కృషి మొదలెట్టేశారు. బహుశా ఆయన ఎవరితోనైనా ఒప్పందం అంటూ కుదుర్చుకుని ఉంటే అది ఒక్కసారే కావచ్చు. ఈ వైచిత్రి, రాణే వృద్ధిలో భాగమే. నేడు దారి తెన్నూ లేకుండా కొట్టుకుపోతున్నా, ఆయన తన సొంత జిల్లా సింధుదుర్గ్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన ఎంత ఆత్మవిశ్వాసం గల మనిషంటే శివసేనను వీడిన వెంటనే ఆయన ఒక ఉప ఎన్నికలో శాసనసభకు గెలిచి, తాను ముఖ్యుడిననే అంశాన్ని రుజువుచేసి చూపారు. ఆయన సామ్రాజ్యం కేవలం వ్యాపారానికే పరి మితం కాలేదు, ఒక రాజకీయ కుటుంబం ప్రారం భమైంది. ఆయన ఒక కుమారుడు నీలేష్ 2009లో రత్నగిరి–సింధుదుర్గ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు నితేష్ రాష్ట్ర శాసన సభ సభ్యునిగా ఉన్నారు. నితేష్ కార్మిక సమస్యలను కొంత మేరకు పట్టించుకునే ఒక ఎన్జీఓను నడు పుతున్నారు. అది కూడా శివసేనలాగే మాట్లాడుతుంది, అదే పద్ధతులను అనుసరిస్తుంది. రాణే తన ప్రయోజనా లను, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఒక మరాఠీ దినపత్రిక ‘ప్రహార్’ను (మృత్యు ఘాతం) ప్రారంభించారు. ఆ పత్రిక పేరే ఆయన శైలి రాజ కీయాలను సూచిస్తుంది. ఆ పత్రిక వృత్తినైపుణ్యంతోనే పని చేయాలని యత్నిస్తోంది. అయితే చాలా మంది రాజకీయవేత్తలు, రాజకీయపార్టీలు ఎంచుకున్న మార్గ మైన టెలివిజన్ రంగంలోకి రాణే ప్రవేశించలేదు, సమీప భవిష్యత్తులో అది జరిగేట్టూ లేదు. అయితేనేం, ఆయన సమరశీలత నిత్యం కనబడుతుంటూనే ఉంటుంది. మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
సీఎం ఫడ్నవిస్‌కు అంత సీన్ లేదు..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగతంగా మంచివాడే అయినా, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం, అనుభవం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొదటిసారి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఖడ్సే మినహా సమర్థులైన ఒక్కరూ లేరన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సామర్థ్యం ఫడ్నవిస్ నాయకత్వంలోని మంత్రివర్గానికి లేదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రచార కమిటీ చైర్మన్‌గా తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తిస్తారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని పేర్కొన్న ఫడ్నవిస్ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాటమార్చారని దుయ్యబట్టారు. ఒకవేళ ఆయన ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం శివసేన పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో అఫ్జల్ ఖాన్ సేన అంటూ బీజేపీని ఎద్దేవా చేసిన ఉద్ధవ్ ఇప్పుడు అధికారం కోసం ఆదే సేనలో చేరాలని ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో బాల్ ఠాక్రే ఉంటే అధికారాన్ని లాగి తన్నేవారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెన్నెస్, ఎంఐఎం పార్టీలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తండ్రి ఓడాడు.. కొడుకు గెలిచాడు..
నారాయణ్ రాణే కుటుంబానికి మిశ్రమ ఫలితం సాక్షి, ముంబై: కొన్ని దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నారాయణ్ రాణే ఓడిపోతే... అతడి కుమారుడు మాత్రం మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుడాల్-మాల్వాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నారాయణ్ రాణే ఓడిపోగా, కొంకణ్ నుంచి పోటీచేసిన అతడి తనయుడు నితేష్ రాణే సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ జఠార్పై విజయఢంకా మోగించాడు. దాంతో కుమారుడిని అభినందించేందుకు రాణే ఎన్నికల కేంద్రానికి రాగా, నితేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా రాణే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితం చరమదశకు చేరినా నితేష్ రాజకీయ జీవితంలో వెలుగు మొదలైందని అన్నారు. కాగా, తండ్రి ఓటమిని జీర్ణించుకోలేకపోయిన నితేష్ తన విజయోత్సవ ర్యాలీని రద్దు చేసుకోవడం గమనార్హం. -
తండ్రీ కొడుకులకు సవాల్
సింధుర్గ్ జిల్లాలో ‘రాణే’కు కష్టకాలం? కంకావ్లి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే, అతని కుమారుడు నితేష్ రాణేలకు సింధుర్గ్ జిల్లా సవాల్‌గా నిలిచింది. కుడాల్ నియోజకవర్గం నుంచి నారాయణ్ రాణే, కంకావ్లి నుంచి నితేష్‌లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాణే పెద్ద కుమారుడు నీలేష్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రత్నగిరి-సింధుర్గ్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక రాణేకు అత్యంత సన్నిహితులైన గణపత్ కదమ్, సుభాస్ బాణే, రాజన్ తేలీ, రవీంద్ర ఫాఠక్లు అతడిని వీడి బీజేపీ, శివసేనల్లో చేరడంతో ఈసారి తండ్రీకొడుకులు గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మాజీ సహాయ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే ఉదయ్ సామంత్ రాణేతో విభేదాల కారణంగా శివసేనలో చేరి రత్నగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆశలను అనేకసార్లు వెల్లడించిన రాణే కుడాల్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వాభిమాన్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న రాణే చిన్న కుమారుడు నితేష్ రాణే ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అయినప్పటికీ అదే పార్టీ అభ్యర్థిగా కంకావ్లి నుంచి బరిలోకి దిగారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు కాస్త సణుగుకున్నప్పటికీ బహిరంగంగా ఎవరూ ఆయన నామినేషన్‌ను వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీకి నేతృత్వం వహిస్తున్న నారాయణ్ రాణేకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరుగుతున్న నేపథ్యంలో గెలుపు ఎవరినైనా వరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రాణేపై పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన శివసేన అభ్యర్థి వైభవ్ నాయక్ మరోసారి కుడాల్లో రంగంలోకి దిగారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో శివసేనకు 22వేల ఓట్ల ఆధిక్యత లభించిందని, అందువల్ల గెలుపు తనదేనని నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పటికీ రాణే చేసిందేమీ లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక నితేష్‌పై సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ జాతర్ పోటీ చేస్తున్నారు. జాతర్ గత ఎన్నికల్లో కేవలం 34 ఓట్లతో గట్టెక్కారు. మాజీ ఎన్సీపీ నాయకుడు సుభాష్ మాయేకర్కు శివసేన ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ రెబెల్‌గా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ విజయ్సావంత్ నితేష్ ఓట్లకు గండి కొట్టవచ్చని భావిస్తున్నారు. -
షరతులతో పొత్తు కష్టమే: సీఎం
ముంబై: సాధ్యం కాని షరతులు విధిస్తే ఇక ఎన్సీపీతో పొత్తు కొనసాగించటం కష్టంగా మారగలదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను దూరంగా ఉంచేందుకు గాను ఎన్సీపీతో పొత్తును కొనసాగించాలన్నదే కాంగ్రెస్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అయితే అసాధ్యమైన షరతులు విధించడం వల్లనే పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని అన్నారు. షరతులు లేకండా చర్చలు ప్రారంభించి ఉంటే ఇప్పటికి అన్ని సమస్యలూ పరిష్కారమై ఉండేవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కరద్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సగం కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీ కోరిందన్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు చవాన్ నిరాకరించారు. అయితే ఈ అంశాన్ని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే ధ్రువీకరించారు. ఎన్సీపీ డిమాండ్‌పై ముఖ్యమంత్రి చవాన్ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తున్నారని చెప్పారు. కరద్‌లో తన మద్దతుదారులతో మాట్లాడిన చవాన్, తాను పోటీ చేయాలనుకుంటున్న నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరద్ తన స్వస్థలమని, ఈ పట్టణాన్ని తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు.