new liquor policy
-
మళ్లీ మందు.. దందా
చంద్రబాబు పాలనలో మద్యం సిండికేట్ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే... చంద్రబాబు ఓ వైపు మద్యం రేటు తగ్గించి... తద్వారా మద్యం క్వాలిటీ తగ్గించి... తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి.. డిస్టలరీలకు మాత్రం వ్యాల్యూమ్స్ పెంచి లంచాల రూపంలో తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ... మరోవైపు ప్రభుత్వ రంగంలో ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి ఆ షాపులను కట్టబెట్టారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు సీఎం చంద్రబాబు తెర తీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు కట్టి నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారానికి తెరతీసిన చంద్రబాబు ఇప్పుడు అదే మద్యాన్ని ఎమ్మార్పీకి మించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. చంద్రబాబు హయాంలో అయినా.. వైఎస్సార్సీపీ హయాంలో అయినా.. మళ్లీ ఇప్పుడు బాబు హయాంలో అయినా.. అవే డిస్టిలరీస్.. లిక్కర్లో అవే స్పెసిఫికేషన్స్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనేనని గుర్తుచేశారు. మిగిలిన 6 లైసెన్సులు కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినవేనని, వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్సు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ఆ బ్రాండ్లన్నీ బాబు తెచ్చినవే..చంద్రబాబు హయాంలో తెచ్చిన మద్యం బ్రాండ్లను ఒకసారి పరిశీలిస్తే.. బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, పవర్ స్టార్ 9999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హాంగర్, నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్ హెవెన్, హైదరాబాద్ బ్రాండ్ విస్కీ, వీరా, బ్లామ్ డే, 999 పవర్ స్టార్, హైఓల్టేజీ బోల్డ్ బోర్, ఎస్ఎన్జీ బీర్లు... ఇలా రకరకాలున్నాయి. చంద్రబాబు పోతూపోతూ.. 2019 మే 14వ తేదీన కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారు. అలా వచ్చిందే బూమ్ బూమ్ బీర్. పైగా వైఎస్సార్సీపీ హయాంలో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చామంటూ దుష్ప్రచారం చేశారు.డిస్టిలరీస్‌లో మార్పు ఉండదు. లిక్కర్‌లోనూ మార్పు ఉండదు.. బ్రాండ్లు మారతాయి అంతే. రేపొద్దున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేష్‌బాబు, బాలకృష్ణ సినిమా బ్రాండ్.. అంటూ కొత్త బ్రాండ్లను కూడా తీసుకొస్తారేమో? బ్రాండ్లేవైనా సరే ఆ మద్యం ఏ డిస్టిలరీ నుంచి వస్తోంది..? అది నోటిఫైడ్ డిస్టిలరీనేనా? అనేది ముఖ్యం. చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి మా హయాంలో విక్రయించిన మద్యం తక్కువ క్వాలిటీది అంటారు. తన హయాంలో వచ్చిన మద్యం మంచిదంటారు. ఇదెక్కడి విచిత్రమో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తోంది. అవే మద్యం బ్రాండ్లు, అదే క్వాలిటీతో సరఫరా చేయడం వాస్తవం కాదా? మరోవైపు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెరతీశారు. సొంత మాఫియా సభ్యులకు, సిండికేట్‌కు షాపులన్నీ కట్టబెట్టారు.మంచి పాలసీ అయితే కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు?చంద్రబాబు హయాంలో మద్యం మాఫియాను చూస్తుంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతోందో అర్థమవుతోంది. ఒకవైపు మద్యం రేట్లు తగ్గిస్తామని చెబుతూ క్వాలిటీతోపాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం.. అదే సమయంలో డిస్టిలరీస్‌కు వాల్యూమ్స్ పెంచి లంచాల రూపంలో దండుకుంటూ సొంత ఆదాయాన్ని పెంచుకోవడమే చంద్రబాబు కొత్త మద్యం పాలసీ! గతంలో మద్యం షాపులను ప్రభుత్వం నడిపినప్పుడు ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లో జమయ్యేది. అదే ఈ రోజు మాఫియా ఖాతాల్లోకి వెళ్తోంది. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న షాపులను రద్దు చేసి ఇప్పుడు తమ మాఫియాకు కట్టబెట్టారు. పైగా 30 శాతం ఇస్తారా? 20 శాతం ఇస్తారా అంటూ కమీషన్ల కోసం దౌర్జన్యం.. కిడ్నాప్‌లు.. సిండికేట్‌కు సంబంధించిన వారు మాత్రమే షాపులు దక్కించుకోవడం! ఇతరులు ఎవరైనా బిడ్లు దాఖలు చేసినా.. పోలీసులే స్వయంగా వారిస్తూ.. మీరు అమ్ముకోలేరు.. మీపై దొంగ కేసులు పెడతారని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబుకు ఇంత.. ఎమ్మెల్యేలకు ఇంత.. మాఫియా ముఠాకు ఇంత.. ! అని పంచుకునే పరిస్థితి ఉంది. నిజంగా వీళ్ల లిక్కర్ పాలసీ మంచిదే అయితే ఎమ్మెల్యేలు కిడ్నాప్‌లు, దాడులు ఎందుకు చేయాలి? ఎందుకు ఈ మాదిరిగా బెదిరిస్తున్నారు?చీప్ లిక్కర్ స్కామ్! మరో రెండు రోజులు పోతే గతంలో మాదిరిగా పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇంకో నాలుగు రోజులు పోతే బెల్ట్‌షాపులు పుట్టుకొస్తాయి. గ్రామ స్థాయిలోకి మద్యం మాఫియా సామ్రాజ్యాన్ని తీసుకెళ్తారు. రెండు నెలలు ఆగితే ఎమ్మార్పీకి మించి అమ్ముతారు. ఆ మొత్తంలో కూడా నీకు ఇంత.. నాకు ఇంత! అని పంచుకుంటారు. మా హయాంలో రూ.120కి అమ్మిన చీప్ లిక్కర్‌ను రూ.99కే ఇస్తానన్న చంద్రబాబు ఈరోజు రూ.130కి అమ్ముతున్నారు. కొద్దిరోజులు ఆగితే చీప్ లిక్కర్ స్కామ్ బయటికొస్తుంది. రూ.120కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? లేక రూ.99కే సరఫరా చేసే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? సారాయిలో ఇంత రంగు నీళ్లు పోసి బాటిళ్లలో నింపి అమ్ముతారేమో? ఇదో పెద్ద స్కామ్. ప్రజల జీవితాలతోనే కాదు ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? మద్యం స్కామ్‌ను వ్యవస్థీకృతం చేసేందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. నియంత్రించి.. నిరుత్సాహపరిచాంవైఎస్సార్సీపీ హయాంలో ఏం చేశామో ఒక్కసారి పరిశీలించండి. మద్యం తాగాలనుకునేవారిని నిరుత్సాహపరిచే విధంగా అడుగులు వేశాం. గతంలో 4,380మద్యం షాపులుంటే మేం 2,934 దుకాణాలకు కుదించాం. దాదాపు 30శాతం షాపులు తగ్గించాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిమితంగా షాపులు నడిపేలా పాలసీ తీసుకొచ్చాం. టైమింగ్స్ పెట్టాం. రాత్రి 9 తర్వాత లిక్కర్ షాపులు నడపకూడదని రూల్ తీసుకొచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో లిక్కర్ షాపు వద్ద పర్మిట్ రూమ్లుండేవి. అక్కడ 10–20 మంది కూర్చొని తాగుతుండేవారు. దీంతో మహిళలు అటువైపు వెళ్లేందుకు భయపడేవారు. ఇక చంద్రబాబు హయాంలో 43వేల బెల్ట్ షాపులు ఉంటే మా హయాంలో వాటిని రద్దు చేశాం. షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు లేకుండా చేశాం. పరిమిత వేళల్లో మద్యం దుకాణాలను నిర్వహించాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచాం. ఇలా మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరుస్తూ, నియంత్రిస్తూ ముందుకెళ్లాం. వినియోగాన్ని తగ్గించి.. ప్రభుత్వానికి ఆదాయం పెంచాంఒకసారి మద్యం విక్రయాల వాల్యూమ్స్ (సంఖ్య) గమనిస్తే ఎవరి హయాంలో ఎంత వినియోగం జరిగిందో అర్థమవుతుంది. గతంలో 2014–15లో చంద్రబాబు హయాంలో 2.88 కోట్ల కేసుల ఐఎంఎల్ విక్రయాలతో మొదలైతే.. ఆయన దిగిపోయే 2019 నాటికి 3.84 కోట్ల కేసుల ఐఎంఎల్‌కు మద్యం అమ్మకాలు పెరిగాయి. అనంతరం వైఎస్సార్సీపీ హయాంలో 3.08 కోట్ల కేసులతో విక్రయాలు ప్రారంభం కాగా, పాలన చివరి ఏడాది నాటికి 3.32 కోట్ల కేసులకు మద్యం విక్రయాలను పరిమితం చేశాం. అదేవిధంగా బీరు అమ్మకాలు చూస్తే 2014–15లో 1.74 కోట్ల కేసుల నుంచి 2018–19 నాటికి 2.77 కోట్ల కేసులకు చంద్రబాబు హయాంలో పెరిగాయి. వైఎస్సార్సీపీ హయాంలో 2019 నాటికి 2.12 కోట్ల బీరు కేసులతో మొదలు కాగా, చివరి నాటికి 1.12 కోట్ల కేసులకు బీరు విక్రయాలను తగ్గించాం. అంటేచంద్రబాబు పాలన చివరి ఏడాదితో పోలిస్తే మా హయాంలో వినియోగం గణనీయంగా తగ్గింది. మరొక పక్క రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచగలిగాం. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రూ.17,682 కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు తీసుకెళ్లగలిగాం. మద్యాన్ని నియంత్రించడం ద్వారా పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి చేయగలిగాం. -
అడుసు తొక్కనేల.. చంద్రబాబు లిక్కర్ పాలసీపై సీపీఐ నారాయణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్‌కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు -
మద్యంపై కూటమి సర్కారు పన్నుల మోత
-
మా కడుపులు కొట్టి ఆదాయం పెంచుతావు అనుకోలేదు... బాబుపై మహిళలు ఫైర్
-
కొత్త మద్యం పాలసీ.. చెత్త పాలసీ
-
మద్యంపై మహిళల ఉద్యమం
-
బాబుకు మహిళా సంఘాల వార్నింగ్..
-
KSR Live Show: విద్య వద్దు.. మద్యం ముద్దు
-
బాబు కొత్త మద్యం పాలసీ పై వరుదు కళ్యాణి సెటైర్లు
-
అమ్మకు వందనం అన్నారు.. వందకు మద్యం మాత్రం ఇస్తున్నాడు
-
ఇక ప్రైవేట్ మద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3,736 దుకాణాల్లో గీత కారి్మకులకు 10 శాతం షాపులను కేటాయించనున్నారు. ఈమేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా సంపాదనే లక్ష్యంగా ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసిందని విమర్శించారు. మద్యం కొత్త విధానంపై సబ్ కమిటీ సిఫారసులను తాజాగా మంత్రి మండలిలో ఆమోదించినట్లు చెప్పారు. 180 ఎంఎల్ మద్యాన్ని రూ.99కే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు మద్యం షాపులు వస్తాయన్నారు. రెండేళ్ల కాల వ్యవధిలో ప్రైవేటు వ్యక్తులకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నట్లు చెప్పారు. ఇందుకు రూ.2 లక్షలు (నాన్ రిఫండబుల్) దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబుల్లో రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలుగా ఉంటుందన్నారు. 20 శాతం ప్రాఫిట్ మార్జిన్‌తో పాటు జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఐదేళ్ల కాల వ్యవధితో 12 ప్రీమియర్ మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.15 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ.కోటి లైసెన్స్ ఫీజు చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం గురించి మంత్రి మండలిలో చర్చకు రాలేదని, అజెండాలో ఆ అంశాలు లేవని ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన వలంటీర్, సచివాలయ వ్యవస్థల కొనసాగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎస్ఆర్ఎం వర్సిటీ డీమ్డ్ టూబీ వర్సిటీగా రూపాంతరం చెందేందుకు ఎన్ఓసీ జారీని మంత్రి మండలి ఆమోదించిందన్నారు. వచ్చే రబీకి కొత్త కౌలు కార్డులు కౌలు రైతులకు మేలు చేసేలా నిబంధనల్లో మార్పులు తెస్తున్నట్లు మంత్రి చెప్పారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. ప్రస్తుతం కౌలు కార్డులపై రైతు (భూ యజమాని) సంతకం తప్పనిసరి చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాస్తవ భూ యజమానులు సంతకాలు చేయకపోవడంతో కౌలు రైతులకు ఆర్థిక సాయం, రుణాలు దక్కడం లేదన్నారు. రైతు సంతకం అవసరం లేకుండా 2011లో నాటి ప్రభుత్వం అమలు చేసిన నమూనాలో కౌలు కార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతుల భూమి హక్కుకు నష్టం లేకుండా వచ్చే రబీకి కార్డులు అందజేస్తామన్నారు. పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్..» రెండున్నరేళ్లలో కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి చెప్పారు. దెబ్బతిన్న డయా ఫ్రంవాల్ స్థానంలో రూ.990 కోట్లతో పాత కాంట్రాక్టర్ ద్వారానే కొత్తది నిర్మించేందుకు మంత్రి మండలి ఆమోదించిందన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. » బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు మంత్రిమండలి ఆమోదం. » భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం. » ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ‘స్టెమీ’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం. దీని ద్వారా కాన్సర్, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం. పాఠశాల విద్యార్థులకు కేంద్రం సహకారంతో ఆరోగ్య ఐడీ కార్డుల జారీ. » ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి. సీజీటీఎస్‌ఎంఈ ద్వారా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోసం రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ఆమోదం. » మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.10 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఇచ్చేందుకు ఆమోదం. » కేంద్ర ప్రభుత్వ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం లబ్ధిని ఎంఎస్ఎంఈలకు అందించేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం. కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్ఎంఈలకు రూ.5 వేల కోట్ల మేర ఋణ సౌకర్యం. » కడప జిల్లా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులు అమరావతిలో రెండో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం. -
మద్యం అమ్మకాల్లో తగ్గేదే లే!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ఇదేం పని చంద్రబాబు..
-
పక్కా స్క్రిప్టు.. దోపిడీ కిక్కు!
సాక్షి, అమరావతి : కొత్త మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీశారు. అందుకోసం తన ట్రేడ్ మార్కు శైలి అయిన ‘కన్సల్టెన్సీ ఎంపిక’ పేరుతో ఎత్తుగడ వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ నేతల సిండికేట్ గుత్తాధిపత్యం కిందకు తీసుకువచ్చేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఈ కుట్రకు రాజ ముద్ర వేయించి, అనంతరం మద్యం విక్రయాల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడాలన్నది ఆయన వ్యూహం. అందుకే మద్యం విధానం రూపకల్పన కోసం కన్సల్టెన్సీ ఎంపిక పేరిట డ్రామా ఆడుతున్నారు. మద్యం పాలసీ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఎక్సైజ్ శాఖ ద్వారా కాకుండా ‘ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించడం విడ్డూరం. మద్యం విధానం రూపకల్పనలో ఏపీయూఐఏఎంఎల్‌కు ఎలాంటి అనుభవం లేదు. కేవలం ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్ ద్వారా కథ నడిపించాలని ఎత్తుగడ వేశారు. తమ అస్మదీయ కన్సల్టెన్సీకి అనుకూలంగా నిబంధనలను రూపొందించి, పక్కాగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ సాగిస్తున్న కుతంత్రం ఇలా ఉంది. చంద్రబాబు ట్రేడ్‌మార్కు కన్సల్టెన్సీ కుట్ర 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి, రాష్ట్రంలో యథేచ్ఛగా మద్యం దోపిడీకి పాల్పడిన విషయం అందరికీ గుర్తుంది. మద్యం దుకాణాలన్నింటినీ టీడీపీ నేతలు గుప్పెట పట్టడంతోపాటు పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలదని.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే 25 శాతం అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడ్డారు. ఏటా రూ.2.50 లక్షల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.12.50 కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. దాంతో మద్యం దోపిడీకి అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతానికి మించి, మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి పాల్పడేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం చంద్రబాబు అండ్ కో ఇప్పటికే ఓ విధానాన్ని రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్ పాలసీపై సమీక్ష పేరుతో చంద్రబాబు ఇప్పటికే కొత్త మద్యం విధానాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. కాగా శంఖంలో పోస్తేగానీ తీర్థం కాదన్నట్టు.. తాము రూపొందించిన విధానాన్ని ఓ కన్సల్టెన్సీయే ప్రతిపాదించిందని కనికట్టు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూఐఏఎంఎల్ ద్వారా టెండర్లను ఆహ్వానించారు.బిడ్ల దాఖలుకు నాలుగు రోజులే గడువు» తమ అస్మదీయ కన్సల్టెన్సీకే రాష్ట్రంలో మద్యం విధానాన్ని రూపొందించే కాంట్రాక్టు దక్కేలా స్క్రిప్ట్ రూపొందించారు. కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీయూఐఏఎంఎల్ రూపొందించిన అర్హత నిబంధనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. » టెండర్ల ప్రక్రియలో పాల్గొనే కన్సల్టెన్సీకి గత మూడేళ్లలో సగటున ఏటా రూ.100 కోట్లు టర్నోవర్ ఉండాలని నిబంధన పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోగానీ, విదేశాల్లోగానీ ఆ మేరకు టర్నోవర్ ఉండొచ్చన్నారు. ఇంత భారీగా టర్నోవర్ ఉండాలనడానికి ఇది రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టు కాదని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.» కేవలం ఓ పాలసీ రూపొందించాల్సిన కన్సల్టెన్సీకి ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ కన్సల్టెన్సీకి ఇతర కన్సార్షియం ద్వారా రూ.100 కోట్లు టర్నోవర్ ఉందని రికార్డులు సృష్టించి ఉంటారు. అందుకే ఆ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. » కన్సల్టెన్సీ ఎంపిక కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ప్రభుత్వ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. సాధారణ టెండర్లకు 21 రోజులు, ఎంతటి స్వల్ప కాలిక టెండరుకు అయినా కనీసం 14 రోజులు గడువు ఇస్తారు. ఏపీయూఐఏఎంఎల్ మాత్రం ఆ నిబంధనను పట్టించుకోలేదు. » ఈ నెల 13న టెండరు నోటిఫికేషన్ ఇచ్చి.. బిడ్లు దాఖలు చేసేందుకు 16 వరకు తొలుత గడువు విధించింది. తర్వాత మరో రోజు పొడిగించి 17లోగా బిడ్లు సమర్పించాలని పేర్కొంది. కేవలం నాలుగు రోజుల గడువు ఇవ్వడమంటే ఇతర కన్సల్టెన్సీలు ఏవీ పోటీకి రాకూడదని వేసిన ఎత్తుగడేనన్నది స్పష్టమవుతోంది. అంతేకాకుండా బిడ్లను స్వయంగా వచ్చి దాఖలు చేయాలని పేర్కొంది. ఆన్లైన్లో దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వ లేదు. పైగా బిడ్లు దాఖలు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది.» దూరప్రాంతంలో ఉన్న కన్సల్టెన్సీ సంస్థలు కేవలం నాలుగు రోజుల్లోనే బిడ్లను రూపొందించి.. తమ ప్రతినిధులను అమరావతికి పంపించి దాఖలు చేయడం.. అనంతరం ఒక్క రోజులోనే ప్రజెంటేషన్ ఇవ్వడం.. అన్నది మామూలుగా సాధ్యం కాదు. కేవలం ఇతర కన్సల్టెన్సీలు బిడ్లు దాఖలు చేయకుండా ఉండేందుకే ఇటువంటి అసంబద్ధ నిబంధనలు విధించారు. తద్వారా తమ అస్మదీయ కన్సల్టెన్సీకే అడ్డగోలుగా కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారని ఎక్సైజ్ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
Delhi Liquor Policy Case: ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ కార్యాలయానికి పిలవగా గరువారం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు మరో తేదీతో సమన్లు జారీచేసే అవకాశముంది. విచారణకు పిలిచి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న ఆప్ ఆరోపణల నడుమ గురువారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట పెద్దసంఖ్యలో ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నివారణ కోసం ముందస్తుగా కేంద్రం పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను ఈడీ ఆఫీస్, బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మోహరించింది. ఈ కేసును వచ్చే 6–8 నెలల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ వారికి సూచించిన నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశముంది. చట్టవ్యతిరేకం, కక్షపూరితం ఈడీ ఆఫీస్‌కు గైర్హాజరైన సందర్బంగా దర్యాప్తు సంస్థకు కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ‘ నాకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్ధం. కక్షపూరితం. రాజకీయ ప్రేరేపితం. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించింది. వీటిని ఉపసంహరించుకోండి. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇçప్పుడీ సమన్లు పంపారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం ఉందని సమన్లు పంపారు? సాక్షిగానా లేక నిందితుడిగానా అనేది అందులో లేదు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు పంపారా? లేదంటే ఆప్ కన్వీనర్ అయినందుకు పంపారా?’ అని లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘కేజ్రీవాల్‌కు సమన్లు పంపి అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు అక్టోబర్ 30న అన్నారు. అదేరోజు సాయంత్రం యాధృచ్ఛికంగా ఈడీ సమన్లు ఇచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఈడీ ఆఫీస్‌కు రాకుండా కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి సింగ్రౌలీ నియోజకవర్గంలో ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ‘నన్ను అరెస్ట్‌చేస్తారని ఢిల్లీ కోడైకూస్తోంది. ఈడీ అధికారులు నన్ను అరెస్ట్ చేయగలరుగానీ నా ఆలోచనలను అరెస్ట్ చేయలేరుకదా. నా సిద్ధాంతాలతో ఏకీభవించే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది, కోట్లాది అభిమాన కేజ్రీవాల్‌లను అరెస్ట్ చేయలేరు’ అని ర్యాలీలో కేజ్రీవాల్ అన్నారు. ‘ఇండియా’ కూటమిని దెబ్బతీసేందుకు యత్నం: ఆప్ ‘ఇండియా’ కూటమిని దెబ్బ కొట్టాలంటే ఢిల్లీలో కొరకరాని కొయ్యలా ఉన్న కేజ్రీవాల్‌ను ముందు అరెస్ట్చేయాలనేది బీజేపీ ప్రణాళిక. అలా అయితేనే ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ బలహీననమై సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతుందని బీజేపీ కుట్ర పన్నుతోంది’ అని ఆప్ ఆరోపించింది. నిజాన్ని ఎదుర్కోలేక పారిపోయారు: బీజేపీ కేజ్రీవాల్ గైర్హాజరుపై బీజేపీ ఎద్దేవాచేసింది. ‘ ఎక్సైయిజ్ పాలసీ విధానంలో నిజాలను వెల్లడించే ధైర్యం లేకనే కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాకుండా పారిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింగ్ ఆయనే’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ‘ సాక్ష్యాలు, ఆధారాలుంటేనే ఈడీ సమన్లు జారీచేసి విచారణకు పిలుస్తుంది. మద్యం విధానం గురించి బాగా కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. నిజాలు కప్పిపుచ్చే సమర్థత లేకనే, భయంతోనే ఆయన ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు’ అని ఆయన ఆరోపించారు. -
Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23 ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్ హోమ్ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్ దుకాణాలను నడుపుతున్నాయి. ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం -
కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం విధానంపై ప్రస్తుతానికి ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే బార్ లైసెన్సుల మంజూరు కొనసాగించవచ్చని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం, వాటి రద్దు చాలా అరుదుగా జరుగుతుందని, మధ్యంతర ఉత్తర్వుల జారీ కూడా అంత సులభంగా ఉండదని ధర్మాసనం తెలిపింది. కొత్త మద్యం పాలసీ, నిబంధనలను సవాలు చేస్తూ దాదాపు 535 మంది బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఒ.మనోహర్‌రెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2017లో ఐదేళ్లకు ప్రభుత్వం బార్ లైసెన్సులు మంజూరు చేసిందని, వీటి కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగిసిందని చెప్పారు. కొత్త విధానం అమలుకు లైసెన్సుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించిందని తెలిపారు. కొత్త విధానంలో దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, ఇది నాన్ రిఫండబుల్ అని వివరించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, శివారు ప్రాంతాలకు ఒకే రకమైన లైసెన్సు ఫీజు చెల్లించాలని, ఇది అన్యాయమని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ‘అలా అయితే దరఖాస్తు చేసుకోకండి. ఎవరూ బలవంతం చేయడంలేదుగా? ఇందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదు. మీకు లాభసాటి కాదనుకుంటే ఆగిపోండి. మద్యం వ్యవహారాల్లో సమానత్వపు హక్కు ఏంటి? అందరికీ సమాన అవకాశాలు ఎలా సాధ్యం’ అంటూ ప్రశ్నించింది. మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరు కొత్త పాలసీలో 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, పర్యాటక కేంద్రాల్లోని బార్లను 2017 నిబంధనల ప్రకారం కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించిందని, మిగిలిన బార్లను లైసెన్స్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని చెబుతోందని న్యాయవాదులు చెప్పారు. ఇది వివక్షేనని అన్నారు. అది వివక్ష కిందకు రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత అన్ని విషయాలను పరిశీలిస్తామంది. తమ లైసెన్సులు కూడా 2017 నిబంధనల ప్రకారం కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. లేని పక్షంలో లైసెన్సులు రాని వారంతా రూ.10 లక్షలు నష్టపోతారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, మద్యం వ్యాపారంలో ఏ వ్యాపారీ నష్టపోరని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ సమయంలో అన్నీ పరిశీలిస్తాం కొత్త విధానం ప్రకారం లైసెన్సుల మంజూరు బుధవారం నుంచి ప్రారంభమవుతుందని, ఆ ప్రక్రియను ఖరారు చేయకుండా ఆదేశాలివ్వాలని న్యాయవాదులు కోరగా.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. మద్యం ఆరోగ్యానికి హానికరమే కాక, మత్తును కూడా ఇస్తుందని, అందువల్ల ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ, రెస్టారెంట్లు లేని వారు కూడా దరఖాస్తు చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఇలాంటి వారు అనర్హులని, వారిని అడ్డుకునే దిశగా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. తదుపరి విచారణ సమయంలో ఈ విషయాలన్నీ పరిశీలిస్తామని చెప్పింది. -
ఢిల్లీలో ‘బార్’లా తెరుచుకున్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మద్యం మాఫియా ఆగడాలను అరికట్టేందుకు, కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా కేజ్రీవాల్ సర్కార్ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. నూతన పాలసీ ప్రకారం వినియోగదారులకు ఇప్పుడు మద్యం షాపులలో వాక్–ఇన్ అనుభవం లభిస్తుంది. అంతేగాక హోటళ్ళు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లను ఇకపై తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకొనేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు బాల్కనీలు, టెర్రస్ల వంటి ఓపెన్ స్పేస్‌లలో సీటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన రెస్టోబార్లలోను మద్యం సరఫరా చేసేందుకు అవకాశం కల్పించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో, రాష్ట్ర ప్రభుత్వమద్యం దుకాణాల సంఖ్య తగ్గడంతోపాటు, ప్రైవేట్ మద్యం సంస్థలకు లాభం చేకూరనుంది. అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రపంచంలోని 28వ నగరంగా ఢిల్లీ ఉంది.ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆదాయాన్ని పెంపేక్ష్యంగామద్యం పాలసీలో మార్పులు చేసినట్లుగా తెలిసింది. నూతన మద్యం పాలసీ ప్రభావం: కొత్త పాలసీ ప్రకారం మద్యం రిటైల్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేస్తారు. దుకాణాలకు మద్యం ఏకరీతి పంపిణీ కోసం ప్రతి మునిసిపల్ వార్డులో కనీసం 2 ఎయిర్ కండిషన్డ్ వెండ్స్, 5 సూపర్ ప్రీమియం దుకాణాలు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 దుకాణాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 849 మద్యం రిటైల్ స్టోర్స్ ఉంటాయి. మద్యం అమ్మకం నుంచి ప్రభుత్వం దూరం: ఢిల్లీ కన్సూ్యమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ లిమిటెడ్ (డిసిసిడబ్లు్యఎస్), ఢిల్లీ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (డిఎస్ఐఐడిసి) వంటి సంస్థల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకం వ్యాపారం నుంచి ప్రభుత్వం నిష్క్రమిస్తుందని ఈ విధానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ విక్రేతల లైసెన్సులు సెప్టెంబర్ 30 వరకు చెల్లుతాయి. అయితే రిటైల్ దుకాణాల నుంచి ఇన్పుట్స్ తీసుకొని, పొరుగు రాష్రాల ఉత్పత్తి ధరను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మద్యం బ్రాండ్ల ధర నిర్ణయించనున్నట్లు కొత్త విధానం పేర్కొంది. ఢిల్లీతో పోలిస్తే హరియాణాలో మద్యం చౌకగా ఉన్న కారణంగా, మద్యం అక్రమ రవాణాకు దారితీస్తోంది. మద్యం దుకాణాల్లోకి వాక్ ఇన్ అనుభవం: ప్రతి మద్యం దుకాణం తన వినియోగదారులకు వాక్–ఇన్ అనుభవాన్ని కల్పించాల్సి ఉంటుంది. దుకాణంలోకి వెళ్ళిన కస్టమర్ నచ్చిన బ్రాండ్ మద్యం ఎంచుకోగలుగుతారు. వెండింగ్ మెషీన్ వద్ద కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. అలాంటి రిటైల్ దుకాణాలన్నీ ఎయిర్ కండిషన్డ్‌గా, మాల్స్‌లో ఉండే షాపుల మాదిరిగా తయారవుతాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు అవకాశం: ఇకపై లైసెన్స్ పొందిన బార్లలో బీరు సరఫరా చేయడానికి మైక్రో బ్రూవరీస్ అనుమతించనున్నారు. హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం తాగేందుకు అనుమతించారు. ఎల్–38 పేరుతో ప్రభుత్వం కొత్త లైసెన్స్‌ను ప్రవేశపెట్టింది. బాంకెట్ హాళ్లు, పార్టీ చేసుకొనే ప్రదేశాలు, ఫామ్ హౌస్‌లు, మోటల్స్ లేదా వివాహాలు వంటి కార్యక్రమాల్లోదేశీ, విదేశీ మద్యం సేవించడానికి వన్ టైమ్ వార్షిక ఫీజు వసూలు చేస్తారు. -
మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు. లాటరీ పద్ధతి ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్ కమిషనర్‌కు పంపనుండగా, 13న జీహెచ్ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనైతే కమిషనర్ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు సులభం ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్ లైసెన్స్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. -
ఏపీలో గణనీయంగా తగ్గిన మద్యం అమ్మకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన నూతన మద్యం విధానం సత్ఫలితాలిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఏపీలో మద్యం వినియోగం, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 నవంబర్‌లో 29లక్షల 62వేల కేసుల లిక్కర్‌ను విక్రయించగా.. ఈ ఏడాది నవంబర్‌లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయింది. దీంతో 24.67 శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గినట్టయింది. బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో 17లక్షల 80వేల కేసులు అమ్ముడుపోగా, ఈ ఏడాది నవంబర్‌లో 8లక్షల 13వేల కేసులను మాత్రమే విక్రయించారు. దీంతో బీర్ల అమ్మకాల్లో తగ్గుదల 54.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500లకు తగ్గించారు. అంతేకాకుండా మద్యం అమ్మకం సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపుదల, అమ్మకాల్లో నియంత్రణ విధిస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ మార్పు సాధ్యమైంది. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరమితమవుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్ షాపులను తొలగించడంతో గ్రామాల్లో మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా నిఘా ఉంచడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆదాయం తగ్గలేదు.. అయితే నూతన మద్యం విధానం వల్ల ఆదాయం మాత్రం తగ్గలేదని అధికారులు తెలిపారు. భారీగా రెట్లు పెంచడంతో.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అలాగే ఉందన్నారు. మద్యం వినియోగం మాత్రం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. -
9 నుంచి ‘మద్యం’ దరఖాస్తులు
సాక్షి, జనగామ: ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురాగా ఈ నెల తొమ్మిదో తేదీన గెజిట్ విడుదల చేసి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుడుతుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 మద్యం షాపులతో పాటు మరో దుకాణం రఘునాథపల్లికి షిఫ్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మునిసిపల్ మినహా ఆయా మండలాల పరిధిలోని నేషనల్ హైవేలకు 221 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలన్నారు. దేవాలయం, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. నాలుగు స్లాబులు సిస్టంకు బదులుగా ప్రభుత్వం ఈ సారి ఆరు స్లాబుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రెండేళ్లకు లైసెన్స్ ఫీజు రూ. కోటి (రెండు దుకాణాలు), 5001 నుంచి 50 వేల వరకు రూ.1.10 కోట్లు (25 దుకాణాలు), 50 వేల నుంచి లక్ష వరకు రూ.1.20 కోట్లు (12), లక్షా ఒక్కటి నుంచి 5 లక్షల వరకు రూ.1.30 కోట్లు (జనగామలో లేవు), 5 లక్షల ఒక్కటి నుంచి 20 లక్షల వరకు రూ.1.70కోట్లు (02), 20 లక్షల పైన రూ.2.20కోట్లకు (జనగామలో లేవు) సంబంధించి ఆరు స్లాబులను ప్రకటించారన్నారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న వ్యాపారులు రెండేళ్ల కాలంలో ఎనిమిది వాయిదా పద్ధతుల్లో చెల్లించాలన్నారు. 18న డ్రా తీయనున్న కలెక్టర్ ఈ నెల 18వ తేదీన తేదీన సిద్దిపేట రోడ్డు షామీర్పేట శివారులోని బాలాజీ కన్వెన్షన్ హాలులో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సమక్షంలో డ్రా తీయనున్నట్లు చెప్పారు. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫీజు రూ. రెండు లక్షలకు సంబంధించి డీడీ లేక చలాన్ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సారి రూ.ఐదు లక్షల ఈఎండీ మినహాయించినట్లు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ 67 శాతం నుంచి 50 శాతానికి ప్రభుత్వం తగ్గించిందన్నారు. క్లస్టర్లుగా విభజన మద్యం దుకాణాల దారులకు కొంతమేర ఊరటకలిగించే విధంగా ఈ సారి కొత్తగా మునిసిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. షాపు ఏర్పాటు కోసం మూడు నుంచి నాలుగు వార్డులను కలిపి దుకాణం(100 మీటర్ల దూరంలో గుడి, బడి) మినహాయించి ఎక్కడైనా వ్యాపారం చేసుకునేలా వెసలుబాటు కల్పించామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో 1, 2, 3, 10 (1వ క్లస్టర్), 5, 7, 8 (2వ క్లస్టర్), 17, 18, 21, 22 (3వ క్లస్టర్), 23, 24, 25, 26 (4వ క్లస్టర్)గా విభజించినట్లు చెప్పారు. మరో కొత్త షాపు జిల్లాలో ప్రస్తుతం 41 మద్యం దుకాణాలు ఉండగా.. ఒకటి పెరగనుంది. రాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న వైన్స్ షాపును రఘునాథపల్లికి షిప్టింగ్ చేసినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం జిల్లాలో 1280 దరఖాస్తులు రాగా, ఈ సారి ఈఎండీ మినహాయించడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎక్సైజ్ సీఐలు నాగేశ్వర్రావు, బ్రహ్మానందరెడ్డి, ముకుందరెడ్డి, ఎస్సై సుధీర్ ఉన్నారు. -
నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు
సాక్షి, బాల్కొండ: మద్యం సిండికేట్ ఇష్ట్యారాజ్యానికి కొందరు ఎక్సైజ్ అధికారులు మద్దతునిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు కావడానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో పాత వైన్సులకే లైసెన్స్‌ను ఒక నెల రెన్యూవల్ చేసిన విషయం విదితమే. అక్టోబర్ మాసానికి లైసెన్స్ ఫీజు చెల్లించిన మద్యం వ్యాపారులు ప్రతి సీసాపై రూ.10 ధర పెంచి వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నారు. అక్టోబర్ నెలకు మద్యం సిండికేట్ చెప్పిన ధరకే వినియోగదారులు మద్యంను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం సిండికేట్‌పై పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే ఒక్కో మద్యం సీసాపై ప్రత్యేక ధరను వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరల ప్రకారమే మద్యంను విక్రయించాల్సి ఉంది. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సదరు వైన్స్‌లను సీజ్ చేసే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. కానీ అక్టోబర్ నెల అంతా ప్రత్యేక ధరకే మద్యం విక్రయిస్తామని మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. నవంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఒక నెల లైసెన్స్ ఫీజు చెల్లించి మద్యం విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖచ్చితంగా రెన్యూవల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. అయితే ఈ నెల కోసం అదనంగా లైసెన్స్ ఫీజును చెల్లించే సమయంలో మద్యం వ్యాపారులు కొందరు మొండికేయడంతో వారిని బుజ్జగించడంలో భాగంగా ధర పెంచుకోవడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో సీసాపై రూ.10 పెంచి విక్రయించుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మద్యం సీసాల పరిమితితో తేడా లేకుండా ప్రతి సీసాపై రూ.10 ధర హెచ్చింపు చేయడం ద్వారా రూ.లక్షల్లో అదనపు ఆదాయం మద్యం సిండికేట్‌కు సమకూరనుంది. ఎక్సైజ్ అధికారులు నోరు మెదపకుండా ఉండటానికి మద్యం సిండికేట్ నుంచి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.10 ధర పెంపు ఈ నెలకోసమే అని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. రెండు దుకాణాలకు జరిమానా విధించినా.. ఎంఆర్పీ ధరలకు కాకుండా మద్యం ధరలను పెంచి విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానా కూడా విధించారు. అయినా మద్యం వ్యాపారులు తమ తీరును మార్చుకోలేదు. రూ.10 ధర పెంచి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఎంఆర్పీకే విక్రయించాలి మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి. – డేవిడ్ రవికాంత్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
బెల్ట్‌షాపులపై ఉక్కుపాదం: డిప్యూటీ సీఎం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో మద్యం షాపుల సంఖ్యను 20 శాతం తగ్గించామని.. దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయన్నారు. ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్ షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇకపై ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించారు. అవినీతి లేని పాలన అందించటమే ధ్యేయంగా వైఎస్ జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ నవరత్నాలు అమలు చేస్తున్నారని చెప్పారు. (చదవండి: అమల్లోకి కొత్త మద్యం పాలసీ) -
ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్ వైజర్లు,17 మంది నైట్ వాచ్మెన్లు, 41మంది సేల్స్‌మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. పుత్తూరు పట్టణంలో.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్‌గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు. చదవండి: రాత్రి 8 వరకే మద్యం -
లబ్ధిదారుల ఎంపికకు ఏటా 8 గ్రామ సభలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రజల మధ్యే చర్చ జరిపేందుకు ఇక గ్రామాల్లో ప్రతి ఏటా తప్పనిసరిగా 8 విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సచివాలయ విధులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని బుధవారం సీఎం జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. దశల వారీగా మద్య నియంత్రణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ అమలు కోసం సంబంధిత శాఖతో సచివాలయ ఉద్యోగులు కలిసి పని చేయనున్నారు. బాల కార్మికుల నియంత్రణ చట్టం, కుటుంబ వేధింపుల చట్టం, బాల్య వివాహాలు నిషేధ చట్టం, వాల్టా చట్టం వంటివి కూడా సంబంధిత శాఖ సహకారంతో గ్రామ పరిధిలో పటిష్టంగా అమలు చేయడంలో సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయనున్నారు. సచివాలయం మొత్తం చేపట్టాల్సిన విధులతో పాటు అందులో పనిచేసే ఒక్కో రకమైన ఉద్యోగికి ఒక్కో రకం జాబ్ చార్టును విడుదల చేశారు.