Nishith Narayana
-
నిషిత్ కేసు:బెంజ్ ప్రతినిధుల వితండ వాదన
హైదరాబాద్: బెంజ్ కంపెనీ ప్రతినిధుల వితండ వాదనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో బెంజ్‌కారు నడుపుతూ మితిమీరిన వేగంతో వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కేడ మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఘటనలో బెంజ్ కంపెనీ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదు. అయితే దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారం క్రితం బెంజ్ ప్రతినిధులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మెయిల్ పంపారు. ఇందుకు స్పందించిన పూణేలోని బెంజ్ కంపెనీ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీసులకు తిరుగు సమాధానం ఇస్తూ నిశిత్ నారాయణ పోస్టుమార్టం నివేదికలతో పాటు అక్కడి సీసీ పుటేజీలు, పిల్లర్ వద్ద నుంచి కారును తొలగించినప్పుడు ఏమైనా వీడియో తీశారా? తదితర వివరాలు ఇస్తేనే తాము నివేదిక ఇస్తామంటూ వెల్లడించారు. నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాస్తూ సీటు బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అవుతాయా, పెట్టుకోకున్నా ఓపెన్ అవుతాయా అన్న వివరాలతో పాటు ఎంత స్పీడ్‌లో వెళ్తే మృతి చెందే అవకాశాలున్నాయో చెప్పాలంటూ కోరగా గత నెల 16వ తేదీన బెంజ్ ప్రతినిధులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కారును కూడా పరిశీలించారు. అయితే ఇప్పటివరకూ నివేదిక మాత్రం ఇవ్వలేదు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
అప్పుడు వాహన వేగం 146 కి.మీ.
♦ నిషిత్ నారాయణ ప్రమాదంపై ట్రాఫిక్ బృందం అధ్యయనం ♦ మెట్రో పిల్లర్స్‌పై జీహెచ్ఎంసీతో కలసి స్టడీ సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఈ నెల 10న జరిగిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పి.నిషిత్ రోడ్డు ప్రమాదాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో నిషిత్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మరణించిన విషయం విదితమే. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని నిర్థారించినప్పటికీ... ఆ సమయంలో వాహన వేగం ఎంత అనేది ట్రాఫిక్ పోలీసులు గుర్తించలేదు. సీసీ ఫుటేజ్‌ను సాంకేతికంగా అధ్యయనం చేసిన అధికారులు నిషిత్ వాహనం గంటకు 146 కి.మీ. వేగంతో ఉన్నట్లు నిర్థారించారు. అయితే ప్రమాదం తర్వాత ఇంజన్ రైజ్ స్పీడో మీటర్ 205 కి.మీ. వద్ద లాక్ అయినట్లు భావిస్తున్నారు. సిటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రతాప్, నర్సింగ్‌రావుతో కూడిన బృందం ఘటనాస్థలంలో అధ్యయనం చేసింది. ఒక సెకను సీసీ కెమెరా ఫీడ్‌ను ఫొటోలుగా (ఫ్రేమ్స్) విభజిస్తే 24 ఫ్రేమ్స్ వస్తాయి. అయితే నిషిత్ ప్రమాదానికి సంబంధించి వాహనం కేవలం 4 ఫ్రేమ్స్‌లోనే చిక్కింది. దీనికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు చెప్తున్నారు. నిషిత్ నారాయణ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా ఉన్న మెట్రో పిల్లర్లను అధ్యయనం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం మొదలెట్టిన ఈ స్టడీ శనివారం కూడా జరుగనుంది. ఏఏ ప్రాంతాల్లో పిల్లర్లు ప్రమాదకరంగా ఉన్నాయో ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ నివేదికను జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ అథారిటీలకు అందించనున్నామని ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రాథమికంగా అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. -
కారు బీభత్సం, యువతి పరారీ
-
కావూరి హిల్స్ వద్ద కారు బీభత్సం, యువతి పరారీ
హైదరాబాద్ : ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే కావూరి హిల్స్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో రాంగ్ టూర్లో వచ్చిన ఓ యువతి తన మినీ కూపర్ కారును వెనుక నుంచి ఓ టాటా సఫారీని వేగంగా ఢీకొట్టింది. అయితే ఆ సమయానికి ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి బర్త్‌డే పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువతి కారు వదలి అక్కడ నుంచి అదృశ్యమైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బెంజ్ యాజమాన్యానికి పోలీసుల లేఖ
సందేహాలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున మెర్సిడస్ బెంజ్ కారు అతివేగంగా వెళ్తూ మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మెర్సిడస్ బెంజ్ ఇంపోర్టెడ్ జి– 63 మోడల్ కారుకు సంబంధించి పోలీసులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న మెర్సిడస్ బెంజ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పోలీసులు ఈ లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి.. నిశిత్ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి.. అన్న సందేహాలను లేవనెత్తారు. మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా..? అని ప్రశ్నించారు. స్పీడోమీటర్ ఎంతవరకు లాక్ చేయాలి.. ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయో తెలపాల్సిందిగా కోరారు. సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా కోరారు. -
అక్కడ ఎందుకలా జరిగింది..!
♦ నిషిత్ ప్రమాదంతో కదిలిన పోలీసు యంత్రాంగం ♦ ప్రమాదాల కారణాలపై లోతైన విశ్లేషణ సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో బుధవారం మెట్రో రైలు పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా ప్రాణా లు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో వాహనం గంటకు 205 కి.మీ వేగంతో ప్రయా ణిస్తోంది. ఈ అతి వేగమే ప్రమాదానికి కారణ మని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేవలం అదొక్కటే కారణం కాకపోతే... ఇలాంటి ప్రమాదాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద గత ఏడాది జరిగిన చిన్నారి రమ్య ఉదంతం సంచలనం సృష్టిం చింది. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి కార ణం ఎదుటి వాహన చోదకుడు మద్యం మత్తు లో మితిమీరిన వేగంతో దూసుకురావడమే అని భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయని, రోడ్ ఇంజనీరింగ్‌లో లోపాలు కీలక కారణమని నిర్థారించారు. సాధారణంగా రహదారిపై ఏ ప్రమాదం జరిగినా... పెద్ద వాహనం నిర్లక్ష్యంగా, అతివేగంగా దూసుకువచ్చి చిన్న వాహనాన్ని ఢీ కొట్టిందంటూ పోలీసులు ‘నిగ్గు తేల్చేస్తారు’. యాక్సిడెంట్ కేసుల్లో సరైన, పూర్తి స్థాయి దర్యాప్తు లేని కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా నగరంలోని అనేక రహదారులపై ఉన్న ‘బ్లాక్ స్పాట్స్’వెలుగులోకి రాక నిత్యం ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్ని మార్చాలని నిర్ణయించిన నగర పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదాలపై దర్యాప్తును బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం కీలక కేసుల దర్యాప్తులో శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీసుల్నీ భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నారు. ‘బ్లాక్‌స్పాట్స్’పైనా సమగ్ర అధ్యయనం... నగర వ్యాప్తంగా 80కి పైగా బ్లాక్ స్పాట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గడిచిన మూడేళ్లలో ఓ ప్రాంతంలో చోటు చేసుకున్న ప్రమాదాల గణాంకాల ఆధారంగా వీటిని కనుగొన్నారు. ఇతర విభాగాలతో కలసి ఉమ్మడి పర్యటనలు చేయడం ద్వారా ఈ స్పాట్స్‌లో అసలు కారణాలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలు నిర్దేశించడం, వీటిని అమలు చేయాల్సిందిగా సంబంధిత విభాగాలను కోరడంతో పాటు పని తీరును పర్యవేక్షించడం తప్పనిసరి చేస్తున్నారు. దర్యాప్తులో ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యం! నగరంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే... దానిపై పూర్తి స్థాయి దర్యాప్తు శాంతిభద్రతల విభాగం చేతిలోనే ఉంటుంది. దీనివల్ల అనేక క్షేత్ర స్థాయి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రమాదాల కేసుల దర్యాప్తులో ట్రాఫిక్ పోలీసులనూ భాగస్వాముల్ని చేయాలని యోచిస్తున్నారు. అయితే సిబ్బంది సంఖ్య నేపథ్యంలో ప్రతి కేసులోనూ కాకపోయినా... కీలక కేసుల్లో మాత్రం వీరి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన రవాణా అధికారులు... నిషిత్ నారాయణ ప్రమాద స్థలిని గురువారం రవాణా శాఖాధి కారులు పరిశీలించారు. ఎంవీఐ జి.సాయిరాం రెడ్డి, మాజీ రవాణాశాఖాధికారి జి.విజయ్‌పాల్‌రెడ్డి అక్కడ ప్రమాద కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. వాహనం ఎటు నుంచి ఎంత వేగంతో వచ్చింది? ఇక్కడే ఎందుకు ప్రమాదానికి గురైంది? మెట్రో పిల్లర్‌కు రేడియం స్టిక్కర్లు వేశారా? లేదా? అనేది పరిశీ లించారు. మలుపు వద్ద హెచ్చరిక, సూచీ బోర్డులు లేకపో వడాన్ని గుర్తించారు. నిషిత్ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాం తాల్లో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సమగ్ర సర్వే చేసి సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు. -
కన్నీటి పర్యంతమైన మంత్రి నారాయణ
-
నారాయణను ఫోన్ లో పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన మంత్రి నారాయణను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిషిత్ మృతిపట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు అతని అంత్యక్రియలు నెల్లూరులో నిర్వహించారు. -
నిషిత్ అంత్యక్రియలు పూర్తి
నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రమాదం జరిగిన రాత్రి తన కుమారుడు నిషిత్‌తో ఫోన్లో మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుమారుడికి ఫోన్ చేశారు. ’నాన్న నిషీ ఎక్కడున్నావ్... టైమ్ పదకొండు అవుతోంది, ఇంకా ఇంటికి వెళ్లలేదా?. భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. రెండురోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు కారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త’ అంటూ ఫోన్లో మాట్లాడారు. అవే తన కొడుకుతో మంత్రి మాట్లాడిన చివరి మాటలు. ...మరికొద్ది గంటల్లోనే కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చింది. తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి వెళుతున్న నిషిత్ కారు అతివేగంగా మెట్రో ఫిల్లర్‌ను ఢీకొట్టిన విషయంత తెలిసిందే. ఈ దుర్ఘటనలో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం చెందారు. మరోవైపు కుమారుడి మరణవార్త విన్న మంత్రి నారాయణ హుటాహుటీన లండన్ నుంచి గురువారువారం తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నారు. నిషిత్ మృతదేహాన్ని చూసి ఆయన భోరున విలపించారు. పెన్నానది తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికలో నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు చితికి మంత్రి నారాయణ నిప్పంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు నెల్లూరులో నారాయణ కళాశాల నుంచి నిషిత్ అంతిమ యాత్ర కొనసాగింది. -
ఎగసిపడ్డ కన్నీటికెరటం
-
ఎగసిపడ్డ కన్నీటికెరటం
నెల్లూరు(టౌన్) : రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ ఏకైక కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు , బంధువులు తల్లడిల్లి పోయారు. చిన్న తనం నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న నిషిత్ అకాల మరణ వార్తను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో పాటు నారాయణ విద్యాసంస్థల íసిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు. నిషిత్ మరణ వార్త తెలుసుకున్న పలువురు టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కి తరలివెళ్లారు. 22 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ విలపించారు. మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండటంతో పార్టీ మంత్రులు, నాయకులు సంఘటనస్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చురుకైనవాడు మంత్రి పొంగూరు నారాయణకి ఒక్క కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. చిన్నవాడైన కుమారుడు నిషిత్ 1994 జూలై, 4న నెల్లూరులో జన్మించాడు. విద్యావిషయాలతో పాటు అన్నిరంగాల్లో చురుగ్గా వ్యవహరించేవాడు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కాన్సెప్ట్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివారు. ఆరు నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం ఇంటర్మీడియట్‌ను బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ కళాశాలలో పూర్తి చేశాడు. సింగపూర్‌లో బ్యాచిలర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితమే డైరెక్టర్‌గా బాధ్యతలు తండ్రి నారాయణ బాధ్యతలు పంచుకోవడంలో నిషిత్ ఎప్పుడూ ముందుండేవాడు. అటు కుటుంబ సభ్యులు ఇటు బంధువులతో కలివిడిగా ఉంటూ అందరివాడుగా మన్ననలు పొందాడు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి యజమాని కంటే కూడా తోటి సభ్యుడిగా ఉంటూ వారి బాధలను పంచుకుంటారని చెబుతున్నారు. బీబీఎం కోర్సు చదువుతున్న సమయంలోనే వారంలో ఐదు రోజులు కళాశాలకి వెళ్లి మిగతా రెండు రోజులు సంస్థ బాధ్యతలు నిర్వహించేవాడు. తండ్రి నారాయణ రాజకీయాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో విద్యాసంస్థల బాధ్యతలను నిషిత్ స్వీకరించాడు. రెండేళ్ల క్రితం నుంచి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడిప్పుడే వృద్ధిచెందుతున్న నిషిత్ అకాల మరణం చెందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
5.4 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం
- ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రత్యేకతలివీ - 5,461 సీసీ ఇంజన్.. 230 కి.మీ. వేగంతో దూసుకుపోగల సామర్థ్యం - ఎయిర్ బ్యాగులు సహా ఎన్నో భద్రతా ప్రమాణాలు - ప్రపంచంలోని అత్యుత్తమ కార్లలో ఇదీ ఒకటి - నగరంలో మరో 4 ఇదే మోడల్ కార్లు సాక్షి, హైదరాబాద్: అమిత వేగంతో కారు నడిపిన మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రమాదానికి గురైనది మెర్సిడెస్ కంపెనీకి చెందిన బెంజ్ ఏఎంజీ జీ63 మోడల్ కారు. ఐదు నెలల క్రితమే గతేడాది డిసెంబర్ 12న ఈ కారు అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో ఇదీ ఒకటి. దీని ధర సుమారు రూ.1.9 కోట్లకు పైగానే ఉంటుంది. కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న ఇన్నోవా, ఫార్చునర్ వంటి కార్ల ఇంజన్ సామర్థ్యం 2,400 సీసీ నుంచి 2,600 సీసీ వరకు ఉండగా.. బెంజ్ ఏఎంజీ జీ63 ఇంజన్ సామర్థ్యం ఏకంగా 5,461 సీసీ. అది కూడా 5.5 లీటర్ సూపర్ చార్జ్డ్ పవర్ఫుల్ ఇంజిన్. ఈ కారు గరిష్ట వేగం గంటకు సుమారు 230 కిలోమీటర్ల పైనే ఉంటుంది. కారు ఎత్తు 1.9 మీటర్లు, బరువు సుమారు 2,550 కిలోలు. యూరో–6 ప్రమాణాలకు అనుగుణంగా జర్మనీలో తయారు చేశారు. భద్రత కోసం ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్తోపాటు అత్యుత్తమ ఏర్పాట్లూ ఇందులో ఉంటాయి. ప్రీసేఫ్ బ్రేకింగ్ సిస్టమ్ మెర్సిడెస్ బెంజ్ కార్లలో ప్రీసేఫ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. డిస్ట్రోనిక్ ప్లస్‌గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు 40 శాతం వరకు ఆటోమేటిక్‌గానే బ్రేకింగ్ సిస్టమ్ పని చేస్తుంది. ఇక ఈ వాహనాల్లో రాత్రివేళ రోడ్లు స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ‘నైట్ వ్యూ అసిస్టెంట్ ప్లస్’టెక్నాలజీ కలిగిన ప్రత్యేక కెమెరాలు, ఇన్విజిబుల్ ఇన్ఫ్రారెడ్ బీమ్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. డ్రైవర్‌కు రక్షణనిచ్చే ఎయిర్ బ్యాగ్స్, సీట్‌బెల్టుతో పాటు కారులో ఉండే మిగతా ప్రయాణికులకు కూడా రక్షణ కల్పించేలా సీటు బెల్టులు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. హైదరాబాద్‌లో మరో 4 వాహనాలు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 మోడల్ కార్లు హైదరాబాద్‌లో మరో 4 మాత్రమే ఉన్నాయి. సినీహీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వద్ద, జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్.గౌతమ్‌కుమార్, బంజా రాహిల్స్కు చెందిన ఎంజీబీ కమోడిటీస్, మాదాపూర్‌కు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అనే సంస్థ వద్ద ఈ మోడల్ కార్లు ఉన్నాయి. -
మృత్యువేగం
200 కి.మీ. స్పీడ్.. మెట్రోపిల్లర్‌కు ఢీ జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం సాక్షి, హైదరాబాద్: మితిమీరిన వేగం మరో ప్రముఖుడి వారసుడిని బలితీసుకుంది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బెంజ్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో రైలు పిల్లర్‌ను బలంగా ఢీకొంది. ఆ ధాటికి ఐదారు అడుగులు ఎగిరిపడిన కారు.. తుక్కుతుక్కుగా మారింది. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో జరిగిన ఈ దుర్ఘటనలో నారాయణ విద్యా సంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్ (23) దుర్మరణం పాలయ్యారు. నిశిత్ అమిత వేగంతో నడుపుతున్న కారు అదుపుతప్పి మెట్రోరైలు పిల్లర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో నిశిత్ స్నేహితుడు కామని రాజారవిచంద్ర (23) కూడా దుర్మరణం పాలయ్యారు. వారం క్రితమే హైదరాబాద్‌కు వచ్చి.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని ప్లాట్ నంబర్ 905లో మంత్రి నారాయణ నివాసం ఉంది. నారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నిశిత్ సింగపూర్‌లో మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేశారు. ఇటీవలే నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత శనివారం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిశిత్.. మరో మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలోనే నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించడం, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడం, రిక్రూట్మెంట్ల అంశంపై దృష్టిపెట్టారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో మూడు రోజులుగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిశిత్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా ఉంటున్నారు. ముగ్గురు డ్రైవర్లు ఉన్నప్పటికీ.. మంగళవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిశిత్.. హైదరాబాద్‌లోని పలు నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో డ్రైవర్ రమేశ్ కారును నడిపారు. సాయంత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకున్న నిశిత్.. రాత్రి 9.30 గంటల సమయంలో రవిచంద్రతో కలసి బయటకు వెళ్లినట్లు సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. నారాయణ ఇంటి వద్ద ముగ్గురు డ్రైవర్లు ఉంటారు. నారాయణ భార్య కారు డ్రైవర్ ఒకరుకాగా.. మిగతా ఇద్దరు అవసరాన్ని బట్టి పనిచేస్తుంటారు. మంగళవారం రాత్రి నిశిత్ బయటకు వెళుతున్న సమయంలో ఆ ముగ్గురు డ్రైవర్లు ఉన్నా కూడా.. తానే కారు నడుపుకొంటూ వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన నిశిత్ తల్లి రమ డ్రైవర్లను మందలించారు. ఒకటి రెండు సార్లు కుమారుడితో మాట్లాడి.. నిద్రపోయారు. నారాయణగూడలో చివరి సమావేశం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అనంతరం పలు బ్రాంచీలకు వెళ్లిన నిశిత్.. చివరిగా నారాయణగూడ బ్రాంచి నుంచి తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో బయలుదేరారు. నిశిత్ కారు నడుపుతుండగా రవిచంద్ర పక్కన కూర్చున్నారు. 2.40 గంటల సమయంలో వారి కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనం గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఉంది. 9వ నంబర్ మెట్రో రైలు పిల్లర్ వద్ద రోడ్డు మలుపు ఉండటం, మెట్రో పనులకు సంబంధించి కంకర, ఇసుక పడి ఉండటంతో అతివేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పింది. నేరుగా మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొంది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ జీ63 (రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117) కారు ఏకంగా గంటకు 205 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్లు గుర్తించారు. ఈ ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా.. కారు వెనుక భాగం దాదాపు ఐదారు అడుగులు పైకి లేచి కింద పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోకపోవడంతో నిశిత్, రవిచంద్ర అక్కడికక్కడే మరణించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మెట్రో వర్కర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాల వెలికితీతకు రెండు గంటలు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో నిశిత్, రవిచంద్ర అందులో ఇరుక్కుపోయారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఉపకరణాలు, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనాల నుంచి తీసుకున్న పరికరాలతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వారిని బయటకు తీశారు. వారిని అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో నిశిత్ వినియోగించిన వాహనం ఆయన సోదరి సింధు భర్త పునీత్ కోటప్పకు చెందిన సంస్థ పేరిట రిజిస్టరై ఉంది. అతివేగం వల్లే ప్రమాదం ‘‘నిశిత్, రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనం అత్యంత వేగంగా దూసుకెళ్తుండగా అదుపు తప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో నారాయణగూడ నుంచి పెద్దమ్మగుడి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని మంత్రి నారాయణ ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..’’ – వెంకటేశ్వరరావు, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ పరామర్శించిన ప్రముఖులు ప్రమాద ఘటన గురించి తెలిసిన మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయమే అపోలో ఆస్పత్రికి వెళ్లారు. నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోస్టుమార్టం తదితర వ్యవహారాలతో పాటు మృతదేహాలను అంబులెన్స్‌లోకి చేర్చేదాకా పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సుజనాచౌదరి, సీపీఐ నారాయణ, నామా నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, చిరంజీవి, చినరాజప్ప, సినీనటుడు పవన్‌కల్యాణ్ తదితరులు కూడా అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. కాగా.. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ నేత కె.నారాయణ సంతాపం ప్రకటించారు. నారాయణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముక్కలైన కాలేయం బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుమారుడి మరణవార్త విన్న తల్లి రమ కుప్పకూలిపోయారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. నిశిత్, రవిచంద్రల మృతదేహాలకు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అపోలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదం జరిగిన తర్వాత పది నిమిషాల్లోనే వారు చనిపోయి ఉంటారని చెప్పారు. బలమైన దెబ్బలు తగలడం వల్లే ప్రాణాలు కోల్పోయారని.. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిశిత్ ఛాతీకి స్టీరింగ్ బలంగా తాకడంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతోపాటు కాలేయం ముక్కలైందని తెలిపారు. ఇక నిశిత్ మృతదేహాన్ని బుధవారం సాయంత్రం నెల్లూరు తరలించారు. షెడ్యూల్ ప్రకారం నిశిత్ బుధవారం విజయవాడలో నారాయణ విద్యా సంస్థల సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు బుధవారం ప్రమాదంలో మరణించిన నిశిత్, రాజా రవిచంద్ర ఇద్దరూ ప్రాణ స్నేహితులు. నిశిత్ తండ్రి నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తుండగా.. రవిచంద్ర తండ్రి కామని చిన బాలమురళీ మోహనకృష్ణ ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పొగాకు వ్యాపారి. హైదరాబాద్ శివార్లలోని ఇండస్ స్కూల్లో 5వ తరగతిలోనే నిశిత్, రవిచంద్రల స్నేహం మొదలైంది. అప్పటి నుంచి కాలేజీ వరకూ కలిసే చదువుకున్నారు. అంతేకాదు ఇద్దరూ రెండేళ్ల క్రితం సింగపూర్ వెళ్లి ఒకే కాలేజీలో చేరారు. అక్కడ చదువు పూర్తి చేసుకుని.. ఒకేసారి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట్‌లోని బాలంరాయి ప్రాంతంలో రవిచంద్ర నివాసం ఉంటుండగా.. నిశిత్ జూబ్లీహిల్స్‌లో తండ్రి నివాసంలో ఉంటున్నారు. రవిచంద్ర సొంత వ్యాపారం పెట్టుకోగా.. నిశిత్ తన తండ్రికి చెందిన నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇంతకాలం కలసి ఉన్న ఈ స్నేహితులు ఇప్పుడు కలిసే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధిక వేగంపై ఇప్పటికే మూడు ఈ–చలాన్లు ► ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ కారు (టీఎస్07ఎఫ్‌కే7117) గతంలోనూ పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది. మూడుసార్లు అత్యధిక వేగంతో దూసుకుపోతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ లేజర్ గన్‌కు చిక్కింది. ఈ మూడు ఘటనలు ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్ఆర్)పై నమోదైనట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్పై వేగం పరిమితి గంటకు 120 కిలోమీటర్లు మాత్రమే. ఈ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా మొత్తం రూ.4,305 ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ► ఈ ఏడాది జనవరి 24న శంషాబాద్ పరిధిలోని హిమాయత్‌సాగర్ వద్ద మొదటి ఉల్లంఘన నమోదైంది. ఆ రోజు ఉదయం 9.15 గంటలకు ఈ కారు గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతూ లేజర్ గన్‌కు చిక్కింది. ► రెండో ఉల్లంఘన ఈ ఏడాది మార్చి 1న హిమాయత్‌సాగర్ వద్దే నమోదైంది. ఆ రోజు ఉదయం 11.27 గంటలకు 154 కి.మీ. వేగంతో దూసుకుపోతూ లేజర్ గన్‌కు చిక్కింది. ► మార్చి 10న ఉదయం 10 గంటలకు మూడో ఉల్లంఘన నమోదైంది. నార్సింగి పరిధిలో ఓఆర్ఆర్పై 125 కి.మీ. వేగంతో వెళ్తుండగా లేజర్ గన్ఫొటో తీసి ఈ–చలాన్ జారీ చేసింది. -
నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి
-
నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాధాలు నివారించండి.. సాధరణంగా ట్రాఫిక్ పోలీసులు సామాన్య పౌరులకు అర్థమయ్యే రీతిలో ఈ నినాదంతో ప్రచారం చేయడంతోపాటు అక్కడక్కడా రాసి ఉంచుతుంటారు. అయితే, ట్రాఫిక్ నిబంధనలు అంటే కేవలం కూడళ్ల వద్ద సిగ్నల్ లైట్లను మాత్రమే పట్టించుకోవడం అని కాదు.. కార్లను నడిపే విధానం కూడా అందులో భాగం అని మరువకూడదు.. అలా మరిచి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు ముందు నుంచే కారు వేగంగా నడిపే అలవాటు ఉందని తెలుస్తోంది. గతంలో కూడా ఆయన వేగంగా కారు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధించారు. ఒక్క ఈ ఏడాదిలోనే అతి వేగం కారణంగా నిషిత్‌కు జరిమానా వేశారు. ఈ ఏడాది తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో నిషిత్ కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కారు. అందులో ఆయన కారు వేగం 150 కిలోమీటర్లుగా చూపించింది. అలాగే, మార్చి 1, 2017న మరోసారి గండిపేట వద్ద అదే 150 కిలోమీటర్ల వేగంతో, మార్చి 10, 2017న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్లో అతివేగంతో కారు నడిపారు. అతి వేగం కారణంగా ఆయన నడిపిన కారు టీఎస్ 07 ఎఫ్‌కే7117 కారుపై రూ.4305 జరిమానాను ట్రాఫిక్ పోలీసులు వేశారు. తాజాగా జరిగిన ప్రమాదాన్ని బట్టి నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి. -
నిషిత్ డ్రైవ్ చేసిన కారు వివరాలు ఇవిగో..
హైదరాబాద్: మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి స్నేహితుడు రాజా రవివర్మ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. బెంజ్‌కారులో వెళుతున్న వీరు వేగంగా వెళ్లి పిల్లర్‌ను ఢీకొట్టడం వల్లే బలమైన గాయాలయ్యి చనిపోయారు. అయితే ప్రమాదానికి గురైన ఆ కారు వివరాలు ఒకసారి పరిశీలిస్తే అది మెర్సిడెస్ ఏఎంజీ జీ63 మోడల్‌కు చెందిన బెంజ్ కారు. కేవలం 5.4సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రత్యేకత ఈ మెర్సిడెస్ కారు ప్రత్యేకత. మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు హార్స్పవర్ 571గా ఉండి ఇంజిన్ ఎనర్జీ 420 కిలోవాట్స్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రెండున్నర కోట్లు. మోస్ట్పవర్ఫుల్, టఫెస్ట్ సేఫెస్ట్ ఎస్యూవీ కారు ఇది. 5.5లీటర్ సూపర్ ఛార్జ్డ్ పవర్ఫుల్ ఇంజిన్ ఈ కారు సొంతం. దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఎనిమిది సిలిండర్లు ఉండి ,6400 ఆర్పీఎంను కలిగి ఉంటుంది. కారు పొడవు 4.6 మీటర్లు, ఎత్తు 1.9 మీటర్లు, బరువు 3200 కిలోలు. యూరో 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారును జర్మనీలో తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో మెర్సిడెస్ ఏఎంజీ జీ63ని భావిస్తారు. ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్తోపాటు వరల్డ్ బెస్ట్ సేఫ్టి మెజర్స్ ఈ కారుకు ఉంటాయి. -
మితిమీరిన అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది
-
మృత్యువులోనూ వీడని బంధం
హైదరాబాద్ : మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ఉండే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, రాజా రవివర్మ.. రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. రవివర్మ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. వ్యాపారవేత్త కామని బాల మురళీకృష్ణ కుమారుడే రాజ రవివర్మ. నిషిత్, రవివర్మ క్లాస్మేట్స్. అదికాస్తా ప్రాణ స్నేహంగా మారింది. మరోవైపు రాజా రవివర్మ కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణవార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విగతజీవిగా మారిన రవివర్మ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు భోరున విలపించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున నిషిత్, రవివర్మ ప్రయాణిస్తున్న కారు మెట్రో ఫిల్లర్‌ను బలంగా ఢీకొనటంతో వారిద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
శత్రువుకు కూడా ఈ కష్టం రాకూడదు: చిరంజీవి
హైదరాబాద్ : మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి పట్ల ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. మంత్రి నారాయణ ఎదిగివచ్చిన కొడుకును పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషాదం నుంచి మంత్రి నారాయణ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. కాగా అంతకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా నారాయణ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. అపోలో ఆస్పత్రికి వెళ్లిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. నిషిత్ మృతిపట్ల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, చినరాజప్ప, బోండా ఉమా, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్, హరీశ్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు కూడా మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు. -
మితిమీరిన అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది
చిన్ని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ విషయంలోనూ అదే జరిగింది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు సీట్ బెల్ట్ ధరించలేదని తెలుస్తోంది. కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపే మృత్యువు కబళించింది. ఖరీదైన కారులో అత్యంత ఉత్తమమైన భద్రతా ప్రామాణికాలు. ప్రమాద సమయంలో ట్రాఫిక్ కూడా లేదు, ఎంతోకాలంగా కారు నడిపిన అనుభవంతో పాటు పక్కన మిత్రుడు... ఎన్ని ఉన్నా లాభం లేకపోయింది. ప్రాణాన్ని కాపాడలేనంత వేగం, సీట్ బెల్టు పెట్టుకోలేని కారణంగా నిషిత్ కూడా సెలబ్రిటీ దుర్మరణాల జాబితాలో చేరిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా అదే వెల్లడి అయింది. బుధవారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్, రవివర్మ మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనంతరం... మితిమీరిన అతివేగం వల్లే మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. అయితే వారు మద్యం తాగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు తెలిపారు. రవివర్మ కన్నా...నిషిత్‌కే ఎక్కువగా గాయాలు అయ్యాయని, అతడి పక్కటెముకల విరిగాయని తెలిపారు. కారు బలంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో స్టీరింగ్ నిషిత్ ఛాతి భాగంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా పోస్ట్‌మార్టం అనంతరం అపోలో మెడికల్ కళాశాల నుంచి నిషిత్ మృతదేహాన్ని నెల్లూరు తరలించారు. -
నిషిత్ వెలికితీతకు 2గంటల సమయం!
-
‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’
-
‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’
హైదరాబాద్: కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మంత్రి నారాయణ కుమారునికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. కారు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరికృష్ణ తనయుడు జానకిరామ్ మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద 2014, డిసెంబర్ 6న జరిగిన ప్రమాదంలో జానకిరామ్ ప్రాణాలు కోల్పోయారు. మంత్రి నారాయణ కుమారుడి ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. -
నిషిత్ వెలికితీతకు 2గంటల సమయం!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడి నిషిత్ మృతికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిషిత్ తన స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మతో కలిసి గతరాత్రి బెంజ్ కారులో రైడ్‌కు వెళ్లాడు. అయితే హైదరాబాద్‌లో గతరాత్రి ఈదురు గాలులతో భారీవర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో వారిద్దరూ వర్షం తెరిపి ఇచ్చేవరకూ కొద్దిసేపు ఓ స్నేహితుడి ఇంట్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం స్నేహితులు ఇద్దరూ కారులో బయల్దేరారని, అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. తెల్లవారుజామున రెండు, రెండున్నర సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతివేగంగా పిల్లర్‌ను ఢీకొనడంతో కారు ముందుభాగం మధ్యలోకి వచ్చేయడంతో పాటు బెలూన్స్ కూడా పగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో వారిద్దరూ చిక్కకుపోవడంతో ఛాతీ, పొట్ట భాగంగా చిధ్రమైనట్లు తెలిపారు. వారిని కారులో నుంచి బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు చెబుతున్నారు. అలాగే ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. నిషిత్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మలో కొద్దిగా కదలికలు కనిపించాయని, దీంతో 108కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వారిద్దర్ని అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. -
నిషిత్ మృతిపై నేతల దిగ్భ్రాంతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిషిత్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆవాస విభాగం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు కెన్యా రాజధాని నైరోబీ వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రమాదం గురించి తెలియగానే నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, తదితరులు సంతాపం ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. నారాయణ కుటుంబసభ్యులకు విషాద సమయంలో బాసటగా నిలిచేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు వెళుతున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన నారాయణ కుటుంబానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.