nominations
-
పుష్పా సరే పాయల్ని చూడండి
మన తెలుగు పుష్పా– 2 రికార్డు బద్దలు కొడుతోంటే అదే సమయంలో మన భారతీయ మహిళా డైరెక్టర్ 80 ఏళ్ల చరిత్ర గల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్స్ సాధించి రికార్డు స్థాపించింది. బెస్ట్ డైరెక్టర్ (మోషన్ పిక్చర్) బెస్ట్ మోషన్ పిక్చర్ (నాన్ ఇంగ్లిష్) కేటగిరీల్లో ఆమె దర్శకత్వం సినిమా ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ నామినేషన్ పొందింది. ఇంతకు ముందు ఇలాంటి ఘనత సాధించిన మన దేశపు మహిళ మరొకరు లే రు.‘సినిమా తీయాలంటే అందరికీ ఫిల్మ్ స్కూల్ అక్కర్లేదు. కాని నాకు ఉపయోగపడింది’ అంటారు పాయల్ కపాడియా. ముంబైలో, ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీలో బాల్యం, కౌమారం గడిచిన పాయల్ పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చదివి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకురాలు అయారు. 2014 నుంచి సినిమాలు తీస్తున్నా 2021లో తీసిన డాక్యుమెంటరీ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’తో ఆమె ప్రతిభ లోకానికి పరిచయం కాసాగింది.ఎవరికీ లేని ఘనతఆస్కార్ అకాడెమీ అవార్డ్స్‌తో సమానమైన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం పోటీ పడే భారతీయ సినిమాలు చాలా తక్కువ. 1994 లో చివరిసారిగా ఒక భారతీయ సినిమా నామినేషన్ పొందింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అదీ ఒక మహిళా దర్శకురాలిగా పాయల్ కపాడియా తాను తీసిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’తో 2024 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగం కింద రెండు నామినేషన్స్ పొందారు. ఇప్పటికే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డును (గ్రాండ్ ప్రి) పొందిన డింపుల్ కపాడియా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా సాధిస్తే ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది.సినిమాలు చూస్తూ...పాయల్ కపాడియా బాల్యంలో రిషి వ్యాలీలోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ‘మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పుడు ప్రగతికాముక సినిమాలు చూపించేవారు. రష్యన్, ఫ్రెంచ్ సినిమాలు... ఆనంద్ పట్వర్థన్ తీసిన డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత పూణెలో డైరెక్షన్ కోర్సులో చేరాక వేరు వేరు ప్రాంతాల, నేపథ్యాల నుంచి వచ్చిన బ్యాచ్‌మేట్స్ సినిమాల గురించి ఎన్నో చర్చలు సాగించేవారు. రోజూ స్క్రిప్ట్‌లు వినడమే సరిపోయేది.అదంతా చిన్న ఎక్స్పోజర్ కాదు. అలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రాక్టికల్స్ ఉండేవి. అవి చేసే ముందు కష్టంగా ఉన్నా చేశాక ఏదో తెలుసుకున్నాం అనే సంతృప్తి ఉండేది. ఉదాహరణకు అందరూ తప్పనిసరిగా 4 నిమిషాల లాంగ్‌షాట్ తీయాలి మా ప్రాక్టికల్ ఫిల్మ్స్‌లో. ఎవరు ఎలా తీస్తారనేది ఒక అనుభవం. మా ్ర΄పొఫెసర్లు కూడా ఎంతో బాగా పాఠాలు చెప్పారు. అవన్నీ నేను దర్శకురాలు కావడానికి సాయం చేశాయి’ అంటారామె.ముగ్గురు స్త్రీలు, ఒక నగరంమూడు నాలుగేళ్లుగా రాసుకున్న స్క్రిప్ట్ ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ను తీయడానికి కావలసిన బడ్జెట్ కోసం ఫ్రాన్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఇండియా, నెదర్లాండ్స్‌లోని ్ర΄పొడక్షన్ సంస్థలను ఆశ్రయించి వారి సహ భాగస్వామ్యంతో పూర్తి చేశారు పాయల్. కేరళ నుంచి ముంబైకి భుక్తి కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ ఇది. వీరు పనిచేసే ఆస్పత్రిలోనే వంటమనిషిగా చేస్తున్న మహారాష్ట్ర మహిళ వీరితో కలుస్తుంది.ఆ నర్సుల్లో ఒకామె భర్త ఆమెను విడిచిపెట్టి జర్మనీ వెళ్లిపోయి ఉంటాడు. మరో నర్సు అవివాహితగా ఉంటూనే ఒక యువకునితో రిలేషన్లో ఉంటుంది. ఇక వంటామె ఇరవై ఏళ్లుగా తాను ఏ చాల్ (చిన్న కొట్టం)లో అయితే నివసిస్తోందో ఆ చాల్ను బిల్డర్ కూల్చడానికి వస్తే దానిని సొంతం అని చెప్పుకోవడానికి ఏ పత్రమూ లేక కలిగే నిస్పృహ... ఈ ముగ్గురి జీవితం ఎక్కడకు చేరుతుంది... ఏ వెలుతురికీ ప్రస్థానం అని చూపేదే కథ.లోతైన కథనంపాయల్ కపాడియా ఈ కథలో ఎన్నో ΄పొరలు ఉంచి కథకు బహుముఖ పార్శా్వలు ఇవ్వడమే ప్రపంచ విమర్శకులను ఆకర్షించి అవార్డుల పంట పండేలా చేస్తోంది. ఈ కథలో మూడు పాత్రలతో పాటు ముంబై నగరం కూడా ఒక పాత్రగా ఉండటం విశేషం. ఒక నగరం పెరిగే కొద్దీ పేదవాళ్లను దూరంగా నెట్టేస్తూ ఉంటుందని ఈ సినిమా చూపుతుంది. ఒకప్పటి మామూలు ఏరియా ఖరీదైన భవంతులతో నిండిపోతే అప్పటివరకూ అక్కడ ఉన్నవారు ఎక్కడకు వెళ్లి వుంటారు? ఎవరూ ఆలోచించరు.‘ఈ నగరం కలల నగరం అని కొందరు అనుకుంటారు. ఇది భ్రాంతుల నగరం. కలా నిజమా... తెలుసుకునే లోపే జీవితం గడిచిపోతుంది’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ‘నువ్వు జీవితాన్ని తప్పించుకోలేవు’ అనే డైలాగ్ కూడా ఉంది. తప్పించుకోలేని జీవితంలో తగిన ఆనందాలు వెతుక్కోవడం ఎలాగో ప్రతి జీవికీ తెలుస్తుంది. ఈ కథలోని ముగ్గురు స్త్రీలు ఆ ఆనందాలను వెతుక్కుని వెలుతురు పొందుతారు. జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ ఉంది. చూద్దాం మన అదృష్టం. -
భారతీయ చిత్రం అరుదైన ఘనత.. రెండు విభాగాల్లో నామినేట్!
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్‌కు ఎంపికైంది. తాజాగా ఈ ఏడాది అందించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.ఈ చిత్రానికి పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. గతనెల నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుడా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్‌లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ను కూడా అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అందజేయనున్నారు. తాజాాగ 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ నామినేషన్ జాబితాను జ్యూరీ ప్రకటించింది. భారత్ నుంచి కేవలం ఈ మూవీ మాత్రమే రెండు విభాగాల్లో నామినేట్ అయింది.Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Non-English Language Motion Picture:✨ ALL WE IMAGINE AS LIGHT | USA / FRANCE / INDIA✨ EMILIA PÉREZ | FRANCE✨ THE GIRL WITH THE NEEDLE | POLAND / SWEDEN / DENMARK✨ I’M STILL HERE | BRAZIL✨ THE SEED OF THE… pic.twitter.com/xzfsib2iov— Golden Globes (@goldenglobes) December 9, 2024Congratulations to the 82nd #GoldenGlobes nominees for Best Director Motion Picture:✨ JACQUES AUDIARD | EMILIA PÉREZ✨ SEAN BAKER | ANORA✨ EDWARD BERGER | CONCLAVE✨ BRADY CORBET | THE BRUTALIST✨ CORALIE FARGEAT | THE SUBSTANCE✨ PAYAL KAPADIA | ALL WE IMAGINE AS LIGHT pic.twitter.com/gTtCCMUCTp— Golden Globes (@goldenglobes) December 9, 2024 -
సంప్రదాయానికి తూట్లు
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.ఆనవాయితీకి చెల్లుచీటీపీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది. నామినేషన్ దాఖలులో హైడ్రామా మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే.. 2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు. సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది. -
పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 8లో పదోవారం కూడా అయిపోయింది. హరితేజ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఎప్పటిలానే సోమవారం వచ్చేసింది. దీంతో నామినేషన్స్ హంగామా మొదలైంది. హౌస్ట్ నాగార్జున ఇప్పటికే కన్నడ బ్యాచ్ చేసిన తప్పుల్ని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు. హౌస్‌లో మాత్రం అలా సాగదు కదా! తేజ, గౌతమ్ వాళ్లకు ఇచ్చిపడేశారు. ఈ ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు.11వ వారానికి సంబంధించిన నామినేషన్ వేసేందుకు ఈసారి హౌస్మేట్స్ పెయింటింగ్స్‌ని స్మాష్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ.. గౌతమ్ ఫొటోని స్మాష్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడిచింది. నిఖిల్ వంత వచ్చేసరికి.. గతవారం తేజ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత తేజ వదల్లేదు. నేను చేసింది తప్పు సరే, యష్మీ చేసింది తప్పు కాదా అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానం చెప్పను అని నిఖిల్ మాట దాటవేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)అలా నిఖిల్-తేజ మధ్య చాలాసేపు గొడవ జరిగింది. ఇదంతా చూస్తుంటే హోస్ట్ నాగార్జున.. వీకెండ్ వచ్చి మిగతా వాళ్లు చేసిన తప్పుల్ని చెబుతున్నాడు. అదేదో పెద్ద పాపం అన్నట్లు రచ్చ చేస్తున్నాడు. సోమవారం వచ్చేసరికి దాన్నే కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ వారం కూడా అదే జరిగేలా ఉంది. అలా ఈ వారం దాదాపు ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తోంది.నామినేట్ అయినవాళ్లలో పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు సమాచారం. లిస్ట్ చూస్తుంటే నిఖిల్, ప్రేరణ లేరు కాబట్టి వాళ్ల ఫ్యాన్స్.. కన్నడ బ్యాచ్‌లో భాగమైన పృథ్వీ, యష్మీకి సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్లలో ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లకు ఉంది. కానీ ఈసారి ఎందుకు విష్ణుప్రియ మీద దెబ్బపడుద్దా అనే సందేహం వస్తోంది. చూడాలి మరి ఈ వారం ఎవరు బలైపోతారో?(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
మహారాష్ట్ర ఎన్నికలు.. బరిలో 7,995 మంది
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. మొత్తం 288 స్థానాల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లకు ఆఖరు రోజైన అక్టోబర్ 29న దాదాపు 4,996 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.దీంతో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది దాదాపు స్పష్టమైందని చెప్పవచ్చు. కాగా మహాయుతితోపాటు మహావికాస్ అఘాడిలపై పలువురు నాయకులు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. తిరుగుబాటు చేసిన అభ్యర్థుల్లో గోపాల్ శెట్టి (బోరివలి), రాజు పారవే (ఉమరేడ్), స్వీకృతి శర్మ (తూర్పు అంధేరి), నానా కాటే (చించ్వడ్) తదితరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు నాలుగో తేదీ వరకు గడువు ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు... ప్రధాన కూటములైన బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల కలయికతో ఏర్పడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల కలయికతో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటముల అభ్యర్థులు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో అత్యధికంగా బీజేపీ తరఫున 148 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 103 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 164 స్థానాల్లో, కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేశాయి. కానీ ఈసారి రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రధాన కూటముల్లో సీట్ల పంపకాలు ఆలస్యమయ్యాయి. ఇక మిగిలిన పార్టీలైన శివసేన (యూబీటీ) 89, శివసేన (శిందే) 80, ఎన్సీపీ (ఎస్పీ) 87, ఎన్సీపీ (ఏపీ) 53 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మహిం’లో ఎమ్మెన్నెస్‌కే మద్దతు -
వయనాడ్ ఉపఎన్నికల అభ్యర్థిగా ఇవాళ ప్రియాంక వాద్రా నామినేషన్
-
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్‌హాట్‌గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్‌ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్‌బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్‌ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో మరెంత హాట్‌హాట్‌గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?
ఆదివారం ఎపిసోడ్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అలా బిగ్‌బాస్ షో ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. సోమవారం వచ్చింది కాబట్టి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. ఈసారి ఫొటోని మంటల్లో వేసే కాన్సెప్ట్‌తో నామినేషన్స్ సాగింది. ఎప్పటిలానే మణికంఠ టార్గెట్ అయ్యాడు. సీత అయితే మణిని ఓ రేంజులో రెచ్చగొట్టి వదిలేసింది.(ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?)ప్రోమో ప్రకారం మణికంఠ.. సరిగా ఆడట్లేదని నైనికని నామినేట్ చేశాడు. అలానే యష్మిని మళ్లీ టార్గెట్ చేశారు. నైనిక-నబీల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. సీత-మణికంఠ మధ్య అయితే చిన్నపాటి యుద్ధమే జరిగింది. గత వారాల్లో జరిగిన పాయింట్స్ తెచ్చేసరికి మణి సైలెంట్ అయిపోయాడు. ఓ సందర్భంగా అతడిలా సీత ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. దీంతో మణికంఠకి మెంటలెక్కిపోయింది.బాడీ లాంగ్వేజ్ మార్చుకో అని సీతతో మణికంఠ చెప్పగా.. ఇది నా బాడీ లాంగ్వేజ్, నేను ఎలా అయినా చేసుకుంటా అన్నట్లు సీత అంతే ధీటుగా సమాధానమిచ్చింది. ఇలా హోరాహోరీగానే సాగినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్‌లో ఉన్నారు. అలానే ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?) -
రాజ్యసభ అభ్యర్థిగా నామినేష్ దాఖలు చేసిన అభిషేక్ సింఘ్వి
-
YSRCP ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్
-
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
శ్రీనగర్: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇప్పటికి రెండు దశల్లో పూర్తయింది. ఈనెల 7న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు, ఐదో దశల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ 'ఒమర్ అబ్దుల్లా' జమ్మూ కాశ్మీలోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.నేషనల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ షమ్మీ ఒబెరాయ్, జమ్మూ & కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జీఎన్ మోంగాతో పాటు ఒమర్ అబ్దుల్లా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈయన పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్‌తో పోటీపడనున్నట్లు తెలుస్తోంది. పీడీపీ ఈ స్థానం నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ మీర్ ఫయాజ్ను బరిలోకి దింపింది.నామినేషన్ వేయడానికి మే 3 చివరి తేదీ. కాగా మే 20న పోలింగ్ జరగనుంది. బారాముల్లాలో విలేకరులతో మాట్లాడుతూ.. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంటే.. తాను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు.నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడైన ఒమర్ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు. దీంతో సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్ళీ లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టారు. -
నేడే ఆఖరి తేదీ.. వివరాలు వెల్లడించిన ఈసీ
-
271 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 271 మంది అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. తిరస్కరణకు కారణాలెన్నో: నామినేషన్ పత్రా ల్లోని అన్ని కాలమ్స్ పూరించాల్సి ఉండగా, కొందరు అభ్యర్థులు కొన్ని కాలమ్స్‌ను భర్తీ చేయకుండా వదిలివేయడం, పత్రాలపై కొన్నిచోట్లలో సంతకాలు చేయకపోవడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కనీసం 10 మంది ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులను ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ఓటర్లు కూడా ప్రతిపాదించకపోవడంతో వారి నామినేషన్లను సైతం జిల్లా ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఎస్పీ తరఫున మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇటీవల అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీఎస్పీకి సంబంధించి బీఫాం అందజేయకపోవడంతో నామినేషన్ తిర్కరణకు గురై¯ంది. నామినేషన్ పత్రాల్లో నో అబ్జెక్షన్పత్రం అందజేయకపోవడం, గడువులోగా సమర్పించాల్సి ఉన్నా సమరి్పంచకపోవడంతో నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అయితే బీఎస్పీ తరఫున మరో అభ్యర్థి యోసేఫ్ నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ బీఫాంను అతనికి అందజేసింది. -
నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇక, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
-
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్
-
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
-
టీడీపీ దిగజారుడు రాజకీయం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు ఈస్ట్: ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు, లోకేశ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి, వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించాలన్న కుట్రతో మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న మహిళలతో నామినేషన్లు వేయించారు. మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో ఓ దళిత మహిళ పేరిట నామినేషన్ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆ దళిత మహిళ స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది.గుంటూరు పశ్చిమలో కుట్ర బెడిసి కొట్టిందలా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళ పేరిట నామినేషన్ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడదల రజిని ఇంటికి వెళ్లి నామినేషన్ వేసేలా ప్రలోభ పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పొటు సొంత ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసే వరకూ తమతోనే ఉండాలని, స్కూృటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేళంగిణి మాత టెంపుల్‌కు పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకూ అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమెను తీసుకువెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్మెంట్లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లడాన్ని చూసిన మహిళ తండ్రి దేవరాజ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథం, సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్లిపోవడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆమెను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీసు స్టేషన్ ముందు హడావుడి చేశారు. అప్పటికే ఆమె నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకున్న టీడీపీ నాయకులు ఆమె తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న వైఎస్సార్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, లీగల్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఝాన్సి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, ఇతర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని దళిత మహిళ రజినిని కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.రాజకీయాల్లోకి తనను లాగొద్దన్న దళిత మహిళఈ రాజకీయాల్లోకి తనను లాగొద్దని దళిత మహిళ విడదల రజిని కోరారు. ఈమేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్ వేయడం ఇష్టంలేదని, టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.మంగళగిరిలో ఇద్దరు లావణ్యలతో నామినేషన్లుఈసారి మంగళగిరిలో గెలుస్తానంటూ లోకేశ్ ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఆయనపై రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన బీసీ వర్గాలకు చెందిన మురుగుడు లావణ్య పోటీ చేస్తుండటంతో ఆయన ఓటమి ముందే ఖాయమైపోయింది. దీంతో ఓటర్లను గందరగోళానికి గురి చేసేందుకు అదే పేరు ఉన్న మరో ఇద్దరు మహిళలతో ఇండిపెండెంట్లుగా చివరిరోజున నామినేషన్లు వేయించారు. వీరిలో ఓ మహిళ ఇంటిపేరు కూడా మురుగుడే కావడం గమనార్హం. రాజీవ్ గృహకల్పలో ఉండే బంగారం పని చేసే మురుగుడు సాంబశివరావు భార్య మురుగుడు లావణ్య గురువారం నామినేషన్ వేశారు. లావణ్య అనే పేరుతో ఉన్న మరో మహిళతో కూడా నామినేషన్ వేయించారు. -
Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపే లాస్ట్ డేట్
హైదరాబాద్, సాక్షి: ‘‘సమయం లేదు మిత్రమా’’.. అంటూ రాజకీయ నేతలు త్వరపడాల్సిన టైం వచ్చింది. ఇటు తెలంగాణ లోక్‌సభ, అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి తేదీ. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. నాలుగో దశలో తెలంగాణ(17), ఏపీ(25) లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటిదాకా(మంగళవారం నాటికి) 415 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏప్రిల్ 18వ తేదీన నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. రేపటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. ఎల్లుండి.. అంటే 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
టీడీపీ అభ్యర్థులు కళ్లుచెదిరే ఆస్తిపరులు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థుల్లో కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తమకు ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అలాగే తమపై నమోదైన కేసుల వివరాలను కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు. మాధవీరెడ్డి ఆస్తి రూ.325.61 కోట్లుటీడీపీ కడప అభ్యర్థి ఆర్.మాధవీరెడ్డి ఆస్తుల విలువ రూ.133.3 కోట్లు కాగా, భర్త శ్రీనివాసులరెడ్డికి రూ. 192.61 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.12.62 లక్షలు ఉండగా, రూ.2.27 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.5.4 కోట్ల విలువ చేసే 6,438 గ్రాముల బంగారు, డైమండ్ ఆభరణాలున్నాయి. రూ.76 కోట్లు విలువ గల నివాస గృహాలు, రూ.12.70 కోట్లు విలువ గల కమర్షియల్ భవనాలు, రూ.2.02 కోట్లు విలువ గల స్థలాలు కలిగి ఉన్నారు. రూ.42.57 కోట్ల విలువైన 47. 33 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు తెలిపారు. మాధవీరెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తి రూ.3.36 కోట్లు! అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు వాహనం కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన దగ్గర నగదు, ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్ పథకం, ఇతరులకు ఇచ్చిన అప్పులు, బంగారు తదితర ఆభరణాలు, చరాస్తులు అన్నీ కలిపి రూ.3,35,84,334 ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఆయన సతీమణికి వివిధ రూపాల్లో రూ.6,90,14, 921 ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం తన స్థిరాస్తులు రూ.62,12,37,500గా కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలÔౌరి ఆస్తి రూ.101.25 కోట్లు జనసేన తరఫున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలÔౌరి తనకు రూ.101,25,39,817 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.37,85,00,723, స్థిరాస్తుల విలువ 63,40,39,094 కాగా ఆయన సతీమణి వల్లభనేని భానుమతి పేరున మొత్తం రూ.32,46,74,747 ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై రెండు కేసులు నమోదయ్యాయని బాలÔౌరి తెలిపారు. సీఎం రమేష్ ఆస్తి రూ.445.65 కోట్లుబీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తన పేరిట రూ.445.65 కోట్ల ఆస్తులు, రూ.101.63 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున రూ.39,39,24,681, భార్య సీఆర్.శ్రీదేవి పేరున రూ.12,53,30,719 విలువైన చరాస్తులు చూపించారు. అలాగే ఆయన పేరిట రూ.252,66,21,246, భార్య పేరిట రూ.193,01,48,350 స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు సీఎం రమేష్‌పై కేసు నమోదైంది. అలాగే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పాదయాత్ర నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి.కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులపై దాడికి సంబంధించి మరో కేసు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భూ వివాదం కేసు, లక్డీకాపూల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసు అధికారిని దూషించిన కేసు, అంబర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించనందుకు కేసులు ఉన్నాయి. థామస్ ఆస్తి రూ.124 కోట్లు టీడీపీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌పై 2017లో చెన్నై సెండియం పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు, 2018లో ఆరింబాకం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు, 2018లో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదయ్యాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.124 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. టీజీ భరత్ ఆస్తి రూ.243.57 కోట్లు కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.243.57 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరిట రూ.89.50 కోట్లు, ఆయన భార్య టీజీ శిల్పా పేరిట రూ.141 కోట్లు, కుమార్తె శ్రీ ఆర్య పేరిట రూ.10.99 కోట్లు, కుమారుడు టీజీ విభు పేరిట రూ.1.60 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆస్తి రూ.46.76 లక్షలు ఉన్నాయి. అయితే టీజీ భరత్ సమరి్పంచిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉంది. వారికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలపలేదు. అలాగే టీజీ భరత్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ.15,88,83, 622 విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడించారు. నారాయణ ఆస్తి రూ.824.05 కోట్లునెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ, ఆయన భార్య రమాదేవి పేరిట రూ.824.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరిట రూ.189.59 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. నారాయణ పేరిట బ్యాంకులో నగదు నిల్వ, వివిధ డిపాజిట్లు, వాహనాలు, బంగారు ఆభరణాల తదితరాలు కలిపి రూ.78.66 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య రమాదేవి పేరిట రూ.100.87 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.నారాయణ పేరిట మొత్తం రూ.207.50 కోట్లు, భార్య పేరిట రూ.437.02 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే నారాయణ తనపై ఎనిమిది కేసులున్నట్లు తెలిపారు. నారాయణ తమ్ముడి భార్య పెట్టిన వరకట్నం వేధింపుల కేసు, ప్రశ్నపత్రాలు లీక్ చేశారన్న అభియోగాలతో చిత్తూరులో మరో కేసు, నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య కేసు ఇందులో ఉన్నాయి. మిగిలిన ఐదు కేసులు రాజధాని అమరావతి వ్యవహారంలో సీఐడీ నమోదు చేసింది. వేమిరెడ్డి ఆస్తి రూ.716.31 కోట్లుటీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.716.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరుతో రూ.639.26 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.77.05 కోట్లు ఉన్నట్లు తెలిపారు.అలాగే అప్పులు రూ.197.29 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రూ.6.96 కోట్ల విలువైన రూ.19 కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రూ.1.28 కోట్ల ఖరీదైన 1,888.6 గ్రాముల బంగారం, 5.25 క్యారెట్స్ వజ్రాలు, రూ.66.80 లక్షల చేసే రెండు వాచ్‌లు, రూ.5.90 లక్షల వెండి వస్తువులు ఉన్నా యి. వేమిరెడ్డిపై 6 కేసులు కూడా నమోదయ్యాయి.