Om Namo venkatesaya
-
ముగ్గురు దర్శకులు.. ముగ్గురు హీరోయిన్లలతో!
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR’ అంటూ ట్వీట్ చేశారు రాఘవేంద్ర రావు. 2017లో రిలీజ్ అయిన ఓం నమో వేంకటేశాయ సినిమా తరువాత రాఘవేంద్ర రావు మరో సినిమా చేయలేదు. ఒక దశలో ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్టే అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబందించిన ఎనౌన్స్మెంట్ రావటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR pic.twitter.com/pJoD8vSFYD — Raghavendra Rao K (@Ragavendraraoba) 28 May 2019 -
అలౌకికానందం
వేయి నామాల శ్రీనివాసుడి వైభోగం... నిత్య కళ్యాణం... పచ్చ తోరణం... కనులారా వీక్షించడం తప్ప వర్ణించతరమా? తిరుమలేశుడు కరుణిస్తే... అనుగ్రహిస్తే... వర్ణించ తరమే. అడుగడుగునా ఏడు కొండల్లో ప్రతిధ్వనించే వేంకటేశ్వరడి విశిష్టతలు వర్ణిస్తే.. సాక్షాత్తు స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తే... ఎలా ఉంటుంది? ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలా ఉంటుంది. ‘అన్నమయ్య’లో శ్రీవారి భక్తుడి గురించి చెప్పిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ‘ఓం నమో వేంకటేశాయ’లో హాథీరామ్ బావాజీ భక్తుడి చరిత్రతో పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం జరిగే కైంకర్యాల వెనుక కథను చెప్పారు. కథేంటి?: దేవుణ్ణి చూడాలనే తపనతో చిన్నప్పుడే దైవాన్వేషణలో ఊరూరు తిరగడం మొదలుపెడతాడు రాజస్థాన్ వాసి రామ (నాగార్జున). అనుభవానంద స్వామి (సాయికుమార్) వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి అతడికి విద్యాబుద్ధులతో పాటు పాచికలు ఆడటం నేర్పిస్తారు. స్వామి దర్శనం కావాలంటే తపస్సు చేయాలని చెబుతారు. రామ తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి బాలుడి రూపంలో రామ దగ్గరికి వస్తారు. స్వయంగా శ్రీవారే బాలుడి రూపంలో వచ్చారని గుర్తించని రాము, అతణ్ణి వెళ్లిపొమ్మని ఆగ్రహిస్తాడు. గురువు ద్వారా ఆ బాలుడే ఏడుకొండలవాడని తెలుసుకుని, తిరుమలకు చేరతాడు. అక్కడ స్వామి దర్శనం ఎలా అయింది? రామ నుంచి హథీరామ్ బాబాజీగా ఎలా మారారు? స్వామివారి నిత్య కైంకర్యాలను ఎలా జరిపించారు? స్వామి చేతుల మీదుగా సజీవ సమాధి ఎందుకయ్యారు? అనేది మిగతా చిత్రకథ. విశ్లేషణ: తెరపై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్లముందు ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ తెరపై కనిపిస్తున్న దృశ్యంలో మమేకమై చూసేలా స్వామివారికి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన ఏడు కొండలపై ఎందుకు వెలిశారు?... ఇలా స్థల పురాణంతో పాటు భక్తులకు తెలియని ఎన్నో విషయాలను కమర్షియల్ హంగులు జోడించి రాఘవేంద్రరావు ఈ సినిమా తీశారు. రచయిత జేకే భారవి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి, విజువల్ ఎఫెక్ట్స్ బృందం.. ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. తెర వెనుక బృందం పడిన కష్టం ఒకెత్తయితే... తెరపై నటీనటుల అభినయం మరో ఎత్తు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, అస్మిత, రావు రమేశ్.. అందరూ చక్కగా నటించారు. కానీ, ప్రేక్షకుల కళ్లన్నీ నాగార్జున, సౌరభ్ జైన్.. పైనే ఉంటాయి. స్వామివారు నిత్య యవ్వనుడు, అంద గాడు. సౌరభ్ జైన్‌ని ఆ పాత్రలో చూడగానే అచ్చంగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. హాథీరామ్ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతు డికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్ జైన్లు జీవించారు. థియేటర్లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది. -
'ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ
టైటిల్ : ఓం నమో వేంకటేశాయ జానర్ : చారిత్రక భక్తిరస చిత్రం తారాగణం : నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్, రావూ రమేష్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన నాగార్జున, కే. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను తిరుమల కొండ విశేషాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఆలోచనలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను, భక్తజనులను ఎంత వరకు అలరించింది..? నాగ్ మరోసారి పరమ భక్తుడిగా ఆకట్టుకున్నాడా..? డివోషనల్ చిత్రాలను తెరకెక్కించటంలో తనకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దర్శకేంద్రుడు మరోసారి మెప్పించాడా..? కథ : రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ(నాగార్జున) చిన్నతనం నుంచి దేవుణ్ని చూడాలనే కోరికతోనే పెరుగుతాడు. ఆ ఆశయంతోనే ఇళ్లు విడిచి వెళ్లి అనుభవానంద స్వామి ( సాయికుమార్)దగ్గర శిష్యరికం చేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఓంకార జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తాడు. అలా ఏళ్లు గడిచిపోతాయి. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు, వటపత్రశాయిగా వచ్చి బాలుడి రూపంలో రామ తపోభంగం చేస్తాడు. అయితే బాలుడి రూపంలో వచ్చినది ఆ దేవదేవుడే అని గుర్తించ లేని రామ ఆగ్రహంతో వెళ్లిపొమ్మని శాసిస్తాడు. ఆ బాధలో ఇంటికి వెళ్లిన రామానికి, మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు పెద్దలు. కానీ భగవంతుడిని దర్శించటమే తన జీవితాశయం అని భవానికి నచ్చజెప్పి తన ప్రయాణం మొదలు పెడతాడు. గురువు ద్వారా ఆ రోజు తన తపోభంగం చేసిన ఆ బాలుడే తాను చూడాలనుకుంటున్న బాలాజీ అని తెలుసుకొని తిరుమల కొండపైకి చేరుకుంటాడు. కొండమీదే ఆశ్రమంలో ఉండే కృష్ణమ్మ (అనుష్క) సాయంతో అధికారం చెలాయిస్తూ వెంకటేశ్వరుని సొమ్మును దోచుకుంటున్న గోవిందరాజులు (రావూ రమేష్) ను ఎదిరిస్తాడు. కొండపైన జరుగుతున్న అన్యాయాలను మహారాజు (సంపత్ రాజ్)కు వివరించి గోవిందరాజులను పదవి నుంచి తప్పించి తిరుమల బాధ్యతలు స్వీకరిస్తాడు. అలా ఆ వేంకటేశుడి సేవకుడిగా మారిన రామ, హాథీరాం బాబాజీగా ఎలా మారాడు. కొండ మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. స్వామిని స్వయంగా చూడాలన్న రామ కోరిక ఎలా తీరింది అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే అన్నమయ్య, రామదాసుగా అలరించిన నాగార్జున హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ తరంలో భక్తుడి పాత్రలకు తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్థాయిలో ఉంది నాగ్ నటన. అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బుల్లితెర మీద ఇప్పటికే దేవుడిగా కనిపిస్తున్న సౌరభ్ జైన్, వెండితెర మీద మరింత అందంగా కనిపించాడు. లుక్స్ పరంగా అద్భుతం అనిపించిన సౌరభ్, నటన విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. కొండకు చేరిన భక్తుడికి సరైన మార్గం చూపించే పాత్రలో హుందాగా కనిపించింది. విలన్ గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రఘుబాబు, సాయికుమార్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : నాగార్జునను అన్నమయ్య, శ్రీ రామదాసుగా చూపించి మెప్పించిన రాఘవేంద్రరావు, ఈ సారి హాథీరాం బాబాజీగా చూపించారు. చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా కల్పిత పాత్రలను జోడించిన రచయిత భారవి, చరిత్రలో ఔచిత్యం ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డారు. రాఘవేంద్రుడి ఆలోచనలను మరింత అందంగా తెరమీద ఆవిష్కరించాడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా వందల ఏళ్లనాడు తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇతర సాంకేతికాంశాలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా ఓం నమో వేంకటేశాయ, తిరుమల విశిష్టతను, హాథీరాం బాబా గొప్పతనాన్ని తెలిపే భక్తిరస చిత్రం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఓం నమో వెంకటేశాయ ప్రీమియర్ షో
-
అఖిలాండ కోటి..వీడియో సాంగ్ హల్చల్
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున లీడ్ రోల్ పోషించిన ప్రతిష్టాత్మక ప్రాజక్టు ఓం నమో వెంకేటేశాయ మూవీలో తొలి వీడియో సాంగ్ విడుదలైంది. స్టార్ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా’ పూర్తి వీడియో సాంగ్‌ను లహరి మ్యూజిక్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసింది. దీంతో నాగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శరత్ సంతోష్, శ్రీనిధి ఆలపించిన ఈ సాంగ్ అందరినీ అలరిస్తోంది. అలాగే అన్నమయ్యతో అలరించిన నాగ్.. హథీరాం బాబాగా మరోసారి పౌరాణిక పాత్రలో మరింత ఎలివేట్ అయ్యారన్న కమెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా అక్కినేని నాగార్జున.. కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓం నమో వెంకేటేశాయలో వెంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బాబాగా నాగార్జున నటించగా, కృష్ణమ్మగా అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్ మరో కీ రోల్ పోషించారు. జగపతి బాబు ఈ చిత్రంలో సప్తగిరుల ప్రాంతాన్ని పరిపాలించిన రాజుగా కనిపిస్తుండగా , ఎంఎం కీరవాణి సంగీత సారధ్యం వహించారు. హథీరాంబాబా జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ రేపే (ఫిబ్రవరి 10) థియేటర్లను పలకరించనున్న సంగతి తెలిసిందే. -
నిజామాబాద్‌లో నాగార్జున ప్రత్యేక పూజలు
నర్సింపల్లి : నిజామాబాద్ జిల్లాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున సందడి చేశారు. నర్సింపల్లిలోని ఇందూరు తిరుమల దేవాలయాన్ని నాగార్జున, నిర్మాత దిల్‌రాజుతో పాటు ఓం నమో వెంకటేశాయ చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వేంకటేశ్వరుని పరమ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న హథీరాం బాబా జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. నాగార్జునతో పాటు అనుష్క, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా కనిపించడం మరో విశేషం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. -
నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది : నాగార్జున
‘‘కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. అటువంటి సినిమాలు సుమారు 90 చేశా. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తిరస సినిమాల్లో నటించే ఛాన్సులు అందరికీ దక్కవు. నాకు ఈ ఛాన్సులు రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘దేవుణ్ణి చూడాలనుకున్న ఓ వ్యక్తి తిరుమల చేరుకున్న తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక భావనకు లోనయ్యా డనేది ఈ సినిమా. ఎంత వసూలు చేస్తుంది? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి టెన్షన్లు లేకుండా హ్యాపీగా నటించాను. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనేది పక్కన పెడితే... ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఓ క్రమశిక్షణ వస్తుంది. రాఘవేంద్రరావుగారి దర్శకత్వం, కీరవాణి సంగీతం, జేకే భారవి రచన, సాహిత్యం... అన్నీ నన్నో భక్తిభావంలోకి తీసుకువెళ్లాయి. రిలీజ్ తర్వాత వీళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కుదరదు. అందుకే, ఇప్పుడు చెబుతున్నా. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ సంతోషంతో ఓ కొత్త అనుభూతికి లోనవుతారు’’ అన్నారు. కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నాగార్జున కళ్లతోనే నటించాడు. ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక..’ పాటలో అయితే నాగ్ నటన అద్భుతం. కృష్ణమ్మగా నటించిన అనుష్కతో పాటు చిత్ర బృందమంతా భక్తి భావంతో పనిచేశారు. సినిమా చూస్తుంటే.. రెండున్నర గంటలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టే ఉంటుంది. విడుదల తర్వాత థియేటర్లన్నీ దైవక్షేత్రాలుగా మారతాయి’’ అన్నారు. నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. మేమంతా ఓ కుటుంబంలా కలసి పనిచేశాం. శ్రీనివాసుడే మా అందర్నీ కలిపాడనుకుంటున్నా. భగవంతుడు, భక్తుడు కలసి ఆడే ఆటే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా నాగార్జున గడ్డం తీయలేదు. ఒకవేళ ఏవైనా సన్నివేశాలు మళ్లీ చిత్రీకరించాలంటే ఇబ్బంది అవుతుందని అలాగే ఉన్నారు. రాఘవేంద్రరావుగారు ఈ వయసులోనూ రోజుకి 14 గంటలు పనిచేశారు. శ్రీనివాసుడి భక్తులకు, నాగార్జున అభిమానులకు ఈ సినిమా ఓ అద్భుతమైన బహుమతిగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు విమలా రామన్, అస్మిత, సౌరభ్ జైన్, రచయిత జేకే భారవి, పాటల రచయితలు వేదవ్యాస, అనంత శ్రీరామ్, కళా దర్శకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
కట్ చెప్పడం మరచిపోయా.. కన్నీటితో ఆనందపడ్డా!
‘‘ఒక కథ విన్నప్పుడు ఎప్పుడెప్పుడు చిత్రీకరణ మొదలుపెట్టాలా? అనే ఉద్వేగం కలగాలి. నేను తీసే సినిమాలన్నింటికీ దాదాపు ఇలానే జరుగుతుంది. హాథీరామ్ బాబా గురించి భారవి చెప్పినప్పుడు వెంటనే షూటింగ్ మొదలుపెట్టేయాలన్నంత ఎగై్జట్‌మెంట్ కలిగింది’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. నాగార్జున టైటిల్ రోల్లో ఆయన దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు చెప్పిన విశేషాలు.. ► టీటీడీ బోర్డ్ మెంబర్‌గా, ఈ సినిమా కారణంగా దాదాపు రెండేళ్లుగా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నాను. నిర్మాత మహేశ్‌రెడ్డి సంకల్ప బలం వల్లే ‘నమో వేంకటేశాయ’ సాధ్యమైంది. నాతో ఆయన ‘శిరిడిసాయి’ తీసిన తర్వాత, ‘మళ్లీ మీరు నాగార్జునతో ఆధ్యాత్మిక సినిమా చేయాలంటే నాకే చెప్పండి’ అన్నారు. అప్పుడే.. అంటే నాలుగైదేళ్ల క్రితమే జేకే భారవి ఈ హాథీరామ్ బాబా గురించి చెప్పారు. ఇప్పటివరకూ ఈ పాయింట్‌ని ఎవరూ టచ్ చేయలేదు. ఎన్టీ రామారావుగారు ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’లో చిన్న సీన్లో హాథీరామ్ బాబా గురించి చెప్పారు. నేటి తరానికి, భవిష్యత్ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ తీశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా అందుకే తీశాం. ► 600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రతో ఈ సినిమా తీశాం. అప్పట్లో తిరుమల ఎలా ఉండేది? అని ఊహించి, సెట్స్ వేశాం. కొంత గ్రాఫిక్స్ వర్క్ చేశాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన కొన్ని మహిమల గురించి చెబితే, ఆశ్చర్యపోతారు. మేం సెట్స్ వేసిన ప్రదేశానికి కొంత దూరంలో భారీగా వర్షం కురిసేది. మా దగ్గర మాత్రం ఉండేది కాదు. వింతగా అనిపించేది. బ్రహ్మోత్సవాల సీన్స్ తీసేటప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే, అనుష్క చేసిన దుర్గా దేవి సీన్స్ చిత్రీకరణ అప్పుడు దుర్గాష్టమి పండగ. ఇవన్నీ చూసి, నాస్తికులు కూడా ఉంటే ఆస్థికులుగా మారిపోతారేమో అనిపించింది. ► భక్తి సినిమా తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మొత్తం యూనిట్ అంతా చాలా నిష్టగా ఉండేవాళ్లం. ఉదయం ప్రసాదం తిన్న తర్వాతే టిఫిన్ తినేవాళ్లం. సాయంత్రం ప్యాకప్ చెప్పగానే.. ఏడుకొండలవాడా.. గోవిందా.. గోవిందా అని అందరూ అంటుంటే, తిరుమల క్షేత్రంలో ఉన్న భావన కలిగేది. ► ‘అన్నమయ్య’ కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగార్జున కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పారు. ఇక, నటన అంటారా? అద్భుతం. ఎమోషనల్ సన్నివేశాల్లో గ్లిజరిన్ అవసరం లేకుండా ఆయనకు కన్నీళ్లు వచ్చేసేవి. అంతగా లీనమైపోయారు. ఒక్కోసారి కెమేరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డి కెమేరా ఆన్‌లోనే ఉంచి.. అలా చూస్తుండిపోయేవారు. నేను ‘కట్’ చెప్పడం మరచిపోయేవాణ్ణి. అంత ఉద్వేగానికి గురయ్యేవాణ్ణి. కన్నీటితో ఆనందపడేవాణ్ణి. వెంకటేశ్వరుని పాత్ర చేసిన సౌరభ్ జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ గెటప్‌లో తనని చూస్తే, నిజమైన తిరుమలేశుడేమో అనిపిస్తుంది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో జగపతిబాబు కాసేపే కనిపించినా, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చిత్రానికి ‘సోల్’ కీరవాణి పాటలు, భారవి రచన. ► ఏడు కొండలు అంటాం కానీ, వాటి ప్రాశస్త్యం గురించి చాలామందికి తెలియదు. అది ఈ సినిమాలో చెప్పాం. ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాం. ఇప్పటివరకూ తిరుమల వెళ్లినవాళ్లు ఈ సినిమా చూశాక వెళితే అక్కడి పరిసర ప్రాంతాలను వేరే దృక్పథంతో చూస్తారు. ‘ఇక్కడ ఇలా జరిగిందా? ఇలా ఉండేదా?’ అని ఆసక్తిగా చూస్తారు. అలాగే, దేవుణ్ణి చూసే విధానంలో కూడా మార్పొస్తుంది. భక్తి సినిమాలను యూత్ కూడా చూస్తున్నారు. తిరుమలకు కాలి నడకన వెళ్లేవాళ్లల్లో యూత్ ఎక్కువగా ఉన్నారు. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో... స్వామివారిని దర్శించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా యూత్ ఎంత ముందున్నా.. చరిత్ర కూడా తెలుసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సినిమాల వల్ల అవి తెలుస్తాయి. ► భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావుగారే తీయాలంటుంటారు. ఆ మాటతో ఏకీభవించను. నేటి తరం దర్శకులూ తీయగలరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు వాళ్లు ఏడాదికి ఈ తరహా సినిమా ఒకటి తీస్తే యూత్‌కు మన మూలాల గురించి చెప్పినట్టవుతుంది. పురాణాలకు సంబంధించిన పుస్తకాల్లో పది పేజీలు చదివినా చాలు.. భక్తి సినిమాలు తీసే అవగాహన వచ్చేస్తుంది. ► ఈ మధ్య కొరటాల శివ తీసిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ నచ్చాయి. ఒక కమర్షియల్ సినిమాలో సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పాడు. తీసే సినిమాలో ప్రయోజనాత్మక అంశం ఉంటే బాగుంటుందంటున్నా. ► ‘ఇదే నా చివరి సినిమా’ అనడం లేదు. ముందు చెప్పినట్లు కథ వినగానే ఎగై్జట్ అయితే చేసేయడమే. భక్తి సినిమా అనే కాదు.. ఏ సినిమా అయినా చేస్తాను. ‘రావణ’ మోహన్‌బాబు మాత్రమే చేయగలరు మోహన్‌బాబు టైటిల్ రోల్లో ‘రావణ’ ప్లాన్ చేసింది నిజమే. ఆయన ఎప్పుడంటే అప్పుడు చేయడానికి నేను రెడీ. ఒక్క మోహన్‌బాబు మాత్రమే చేయగల సినిమా అది. ఆ రెండు సినిమాలు చేయలేదని బాధ! దాదాపు 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ, రెండు సినిమాలు చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఒకటి ‘గాంధీ’, మరొకటి ‘భాగ్ మిల్కా భాగ్’. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ జీవిత చరిత్రను మనం తీయలేదు. దర్శకుడు రిచర్డ్ అటన్‌బరో ఇంగ్లిష్‌లో తీశారు. ‘మనల్ని బానిసలను చేసినవాళ్లే అంత బాగా తీస్తే మనం ఎందుకు తీయలేదు’ అని బాధపడ్డాను. అలాగే, మిల్కా సింగ్ జీవిత చరిత్రతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చూసి, ‘మనం ఎందుకు చేయలేకపోయాం’ అని ఆలోచించాను. ప్లాన్ చేసి తీసేవాణ్ణి నేను బాపు, విశ్వనాథ్గార్లకన్నా గొప్ప దర్శకుణ్ణి అనను. అయితే వాళ్లందరికీ రాని ఛాన్స్ నాకు ‘అన్నమయ్య’ రూపంలో వచ్చింది. భక్తిరసాత్మక చిత్రాలు తీయడం మాటల్లో చెప్పలేని తృప్తినిస్తుంది. 40 ఏళ్ల కెరీర్లో మొదట్లో ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాలు తీసేవాణ్ణి. ఎన్టీఆర్‌తో ‘అడవిరాముడు’ వంటి సూపర్ హిట్ తీశాక, మళ్లీ అదే జానర్ అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తారు కాబట్టి, ‘జ్యోతి’ తీశా. చిరంజీవితో ‘జగదేక వీరుడు–అతిలోక సుందరి’ తీశాక, మోహన్‌బాబు హీరోగా ‘అల్లుడుగారు’ తీశాను. కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు. ఆ సినిమా నాన్నగారు చూడలేదని ఫీలయ్యా! ‘అన్నమయ్య’ సినిమా ప్రారంభించినప్పుడు మా నాన్నగారు (దర్శకుడు కేయస్ ప్రకాశ్‌రావు) ఉన్నారు. పూర్తయ్యేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ సినిమా చూసి, ‘మా అబ్బాయి మంచి భక్తి సినిమా తీశాడు’ అని నాన్నగారు మెచ్చుకోవాలన్నది నా కోరిక. కానీ, అది నెరవేరలేదు. -
ఆయన గురువు... ఈయన కులదైవం
‘‘శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో ‘శిరిడిసాయి’ తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మాహాభక్తుడైన హథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించా. నాకు ఈ అవకాశాలు కల్పించిన రాఘవేంద్రరావు, నాగార్జునలకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి. ‘శిరిడిసాయి’ తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కలయికలో ఆయన నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ నెల 10న రిలీజవుతోంది. మహేశ్‌రెడ్డి చెప్పిన విశేషాలు.... ► తిరుపతి కొండపై హాథీరామ్ బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది? స్వామివారికి చేసే తోమాల సేవ, వెన్న సేవ తదితర అంశాల గురించి చిత్రంలో చూపించాం. స్వామివారికీ, హాథీరామ్ బాబాకీ మధ్య జరిగిన సంభాషణలు, ఆయన చరిత్రే ఈ సినిమా. స్వామివారిపై సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది. ► ఇప్పుడున్న యువతకి స్వామివారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. స్వామికి జరిగే పూజలు, విశిష్ఠత గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ‘ఓం నమో వేంకటేశాయ’ అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగింది. ► ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఈ ఆధ్యాత్మిక చిత్రం చేయడం నాగార్జున గొప్పతనం, మా అదృష్టం. వేరే చిత్రాలు అంగీకరించకుండా గడ్డం పెంచి, భక్తి శ్రద్ధలతో నాగార్జున ఈ చిత్రం చేశారు. తెరపై ఆయన్ని చూడగానే భక్తి భావంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా నటించారాయన. థియేటర్లో చూసిన ప్రేక్షకులకూ అదే భావన కలుగుతుంది. ► 500 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉండేదో... తెరపై ఆ వాతావరణం ప్రతిబింబించేలా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాం. డీఓపీ ఎస్. గోపాల్‌రెడ్డి చిక్ మంగుళూరు, మహాబలేశ్వరంలలో లొకేషన్లు ఫైనలైజ్ చేశారు. కీరవాణి అద్భుతమైన స్వరాలందించారు. నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో భక్తి చిత్రమనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సహజం. వాటిని అందుకునే విధంగా దర్శకేంద్రులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం విడుదల తర్వాత తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది. ► వ్యాపార దృక్పథంతో కాకుండా ఓ భక్తుడిగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించా. సాధారణంగా భక్తి చిత్రాలపై ఎవరూ ఇంత ఖర్చుపెట్టరు. మా ఎ.ఎం.ఆర్. గ్రూప్ సంస్థల్లో 4,000 మంది పనిచేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తగా నేను కొందరికి తెలుసు. ‘శిరిడిసాయి’ విడుదల తర్వాత నా పేరు అందరికీ తెలిసింది. టీవీలో ఆ చిత్రం ప్రసారమైన ప్రతిసారీ 50, 60 ఫోనులు వస్తాయి. ఈ ‘ఓం నమో వేంకటేశాయ’కి ఇంకా మంచి పేరొస్తుంది. మా సంస్థ నిర్మించిన రెండూ భక్తి చిత్రాలే. మంచి కథలు లభిస్తే కమర్షియల్ చిత్రాలు కూడా నిర్మించాలనుంది. -
'ఓం నమో వేంకటేశాయ' సెన్సార్ పూర్తి
కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉత్తరాది నుంచి తిరుమలకు వచ్చి వేంకటేశ్వరుని పరమ భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న హథీరాం బాబా జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 10న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భక్తిరస చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ను ఇచ్చింది సెన్సార్ బోర్డ్. నాగార్జునతో పాటు అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమాలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా కనిపించనున్నాడు. -
నా లెక్క వేరే ఉంది : నాగార్జున
సీనియర్ స్టార్లలో ఫుల్ ఫాంలో ఉన్న హీరో కింగ్ నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్ హీరో పాత్రలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సై అంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. త్వరలో మరోసారి భక్తుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ్. ఇది నాగ్ తెర మీద కనిపిస్తున్న 98వ సినిమా. ఈ 98 చిత్రాల్లో కొన్ని నాగ్ అతిథి పాత్రల్లో కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా తరువాత నాగ్ చేయబోయే రెండు సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 2' సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా.. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాకు ఓకె చెప్పాడు. ఇదే నాగ్ నటించే వందో సినిమా. దీంతో అభిమానులు బంగార్రాజు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ నాగ్ మాత్రం బంగార్రాజు తన వందో సినిమా కాదని చెపుతున్నాడు. తాను అతిథి పాత్రల్లో నటించిన సినిమాలు తన లెక్కలోకి రావని.. అందుకే తన వందో సినిమా విషయంలో తన లెక్కవేరని చెపుతున్నాడు. త్వరలోనే ఆ లెక్క అభిమానులకు చెప్తానంటున్న కింగ్.. వందో సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలు తమ మైల్ స్టోన్ చిత్రాలను భారీగా అభిమానుల ముందుకు తీసుకురాగా.. నాగ్ మూవీ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు ఎదురుచూస్తున్నారు. -
అంతా కలలా అనిపించింది!
‘‘మన్మథుడి పక్కన యాభై వేల దీపకాంతులు, పూలు, పళ్ల మధ్య ధగధగ మెరిసే బంగారు రంగు గౌనులో నేను. టిపికల్ రాఘవేంద్రరావు స్టైల్లో సాగే శృంగారభరిత గీతంలో నటించడం మధురమైన జ్ఞాపకం. సినిమాలో అమ్మాయి కలగనే పాట అది. ఆ పాటలో నటించడం నాకూ కలలానే అనిపించింది’’ అన్నారు ప్రజ్ఞా జైశ్వాల్. హాథీరామ్‌బాబా కథతో నాగార్జున హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. ఇందులో హాథీరామ్ బాబా టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించిన భవాని పాత్రలో ప్రజ్ఞ నటించారు. ఫిబ్రవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ప్రజ్ఞ చెప్పిన సంగతులు... ► చిన్నప్పట్నుంచీ భవానీకున్న ఏకైక కల ఒక్కటే. రామ్‌బాబా (నాగార్జున పాత్ర)ని పెళ్లి చేసుకోవడం! కొంచెం రొమాన్స్, కొంచెం లవ్ ఉన్న పాత్ర. అయితే... పెళ్లి కుదిరిన తర్వాత ‘ఎప్పుడూ దేవుణ్ణి చూడాల’నే కోరికతో రామ్‌బాబా తిరుగుతున్నాడని తెలుస్తుంది. భగవంతుడి కంటే ఏదీ పెద్దది కాదని భవాని అర్థం చేసుకుని, తన ప్రేమని త్యాగం చేస్తుంది. భగవంతుడి దగ్గరకి అతణ్ణి పంపిస్తుంది. ►చిత్రంలో నాది చిన్న పాత్రే కానీ చాలా ముఖ్యమైన పాత్ర. నాగార్జున–కె. రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’ ‘శ్రీ రామదాసు’ చిత్రాలు చూశా. అలాంటి క్లాసిక్స్ తీసిన కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం కావడంతో నా పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా అంగీకరించా. భక్తిరస చిత్రమైనా ఇందులో వాణిజ్య హంగులన్నీ ఉన్నాయి. భగవంతుడంటే నాకు నమ్మకముంది. కానీ, ప్రతిరోజూ గుడికి వెళ్లాలి, ఉపవాసం చేయాలనే నియమాలు పాటించను. ఈ కాలంలో అవన్నీ కష్టం కదా! ► కృష్ణవంశీ ‘నక్షత్రం’లో నా పాత్ర ‘ఓం నమో వేంకటేశాయ’లో చేసిన పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుంది. పగలు ఓ సినిమా, రాత్రి మరో సినిమా.. ఈ రెండు సినిమాల షూటింగ్... ఒకేరోజు చేయడం ఓ సవాల్ అనిపించింది. ఈ రెండిటి తర్వాత మనోజ్‌కి జోడీగా నటించిన ‘గుంటూరోడు’ పక్కా కమర్షియల్ సినిమా. -
ఫిబ్రవరిలో సినిమా సందడి
సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కలకలలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్‌గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్‌తో పాటు మంచు విష్ణు హీరోగా రూపొందిన లక్కున్నోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాదు ఆసక్తికరంగా తమ్ముడి మీద పోటికి బరిలో దిగుతోంది మంచు లక్ష్మి. లక్ష్మి లీడ్ రోల్లో తెరకెక్కిన లక్ష్మీబాంబ్ సినిమా కూడా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కింగ్ నాగార్జున మరోసారి భక్తాగ్రేసరుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ, ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు హథీరాం బాబాగా కనిపించనున్నాడు. అదే రోజు మంచు మనోజ్ మాస్ అవతారంలో కనిపిస్తున్న గుంటూరోడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రానా నావీ కమాండర్‌గా నటిస్తున్న ఘాజీ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 1971లో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో అదృశ్యమైన సబ్ మెరైన్ ఘాజీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే రోజు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెంపుడు కుక్కల దొంగగా కనిపించనున్నాడు. ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అయిన 24న కూడా సినిమా సందడి కొనసాగుతోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ ఫిబ్రవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ కేశవను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
వేంకటేశ్వరుణ్ణి నా స్నేహితునిగానే చూస్తా
– నాగార్జున ‘‘వేంకటేశ్వరునితో నా అనుబంధం గురించి చెప్పాలి. చిన్నతనంలో అమ్మతో కలసి తొలిసారి తిరుపతి వెళ్లా. అయితే.. ‘అన్నమయ్య’ తర్వాత స్వామితో పరిచయం ఎక్కువ. ఆయన్ను స్నేహితునిగానే చూస్తా. కానీ, ఎప్పుడూ ఏమీ అడగలేదు. మొదటిసారి బాధతో ఒకటి అడిగా. సుస్తీ చేయడంతో అమ్మ చాలా బాధపడింది. అప్పుడు చూడడానికి వెళితే... నన్ను గుర్తు పట్టలేదు. ఏమీ చేయలేక నాన్న ముఖం తెల్లబోయింది. మరునాడు ‘స్వామీ... అమ్మని తీసుకువెళ్లు’ అనడిగితే తీసుకు వెళ్లారు. రెండోసారి నాన్న చివరి చిత్రం ‘మనం’ హిట్టవ్వాలని అడిగా. అదీ జరిగింది. అడిగినవన్నీ ఇస్తుంటే కోరికలు పెరుగుతాయి కదా! ‘నా అబ్బాయిలను బాగా చూసుకోండి’ అనడిగా. నెల తిరిగేలోపు వాళ్లిద్దరికీ స్వామి పెళ్లి కుదిరేలా చేశారు. ఆయనెప్పుడూ నాతోనే, మా ఇంట్లోనే ఉంటారు’’ అన్నారు అక్కినేని నాగార్జున. ఆయన హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన పాటల సీడీలను నాగచైతన్య, అఖిల్ విడుదల చేశారు. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘కీరవాణిగారి సంగీతం వింటుంటే కంట్లోంచి నీళ్లు అలా వస్తాయి. ఇందులో ‘కమనీయం..’ పాట చేస్తున్నప్పుడు నా ముందు వేంకటేశ్వరస్వామి, ఆయన సతీమణులు ఉన్నట్టు.. వాళ్లకి పెళ్లి చేస్తున్నట్టు కలలు వచ్చాయి. అదంతా పాట మహత్యం. హీరోగా అటూ ఇటూ అడుగులు వేస్తున్నప్పుడు ‘ఆఖరి పోరాటం’తో నేను నిలదొక్కుకునేలా చేశారు రాఘవేంద్రరావుగారు. ఆ తర్వాత ‘శివ’, ‘గీతాంజలి’ రకరకాల సినిమాలు చేశా. ‘వాళ్లందరూ గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా? నేను అంత కంటే గొప్ప సినిమా తీస్తా’ అని ‘అన్నమయ్య’ తీశారు. తర్వాత ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’, ఇప్పుడీ ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం నాకు ఎంత ముఖ్యమంటే... మళ్లీ ఆయనతో పని చేస్తానో లేదో తెలీదు. ‘ఇది నా ఆఖరి చిత్రం’ అని ఆయన నాతో అన్నారు. అది అబద్ధమని అనుకుంటా. నాన్నగారికి ‘మనం’ హిట్టవ్వాలని మనసులో ఎంత కోరుకున్నానో... ఈ చిత్రం కూడా అంత క్లాసిక్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘అన్నమయ్య’, ‘రామదాసు’, ‘పాండురంగడు’ చిత్రాలు నేను చేస్తాననుకోలేదు. అంతా స్వామి దయే. ఆయన దగ్గరకు వెళ్లినప్పుడల్లా... ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ భక్తుడి కథలే. స్వామి గురించి ఏం తీయలేదనే బాధ ఉండేది. అప్పుడే ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చేయాలని పించింది’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘వేంకటేశ్వర స్వామి మా కులదైవం. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు స్వామివారి గురించి చెబుతున్నాం. ఇది మరో ‘అన్నమయ్య’. అంత కన్నా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు ఏ. మహేశ్‌రెడ్డి. ‘‘ఈ చిత్రంలో చేసింది చిన్న పాత్రే. కానీ, బంపర్ ఆఫర్ ఏంటంటే... చాలాకాలం తర్వాత నాపై ఓ పాట, అదీ అనుష్కతో చిత్రీకరించారు’’ అన్నారు జగపతిబాబు. ‘‘నాన్నగారి కెరీర్ చూస్తుంటే... ట్రెండ్‌ని పట్టించుకోకుండా, ఆయన ట్రెండ్‌లో ఆయన వెళ్తుంటారు. అదో ట్రెండ్‌లా సెట్ అవుతుంది. నటుడిగా నాకు ఆయనే స్ఫూర్తి’’ అన్నారు నాగచైతన్య. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ‘శాంతా బయోటెక్’ వరప్రసాద్, అక్కినేని అమల, చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, నటీనటులు అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, సౌరభ్‌జైన్, విమలా రామన్, అస్మిత, ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్‌రెడ్డి, రచయిత జేకే భారవి పాల్గొన్నారు. -
బ్రహ్మాండ నాయకునికి భక్తితో..
‘‘వెంకన్న కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా... ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుడి సాక్షిగా, పదివేల పడగల బుస బుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను’’ అంటున్నారు నాగార్జున. వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా ఆయన నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టీజర్‌లోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..’ పాట, పైన చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘హాథీరామ్ బాబాగా నాగార్జున, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్‌జైన్, కృష్ణమ్మగా అనుష్క, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల లుక్స్ విడుదల చేశాం. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. ఫిబ్రవరి 10న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జేకే భారవి, కూర్పు: గౌతమ్‌రాజు, కెమేరా: ఎస్. గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీరవాణి. -
ఓం నమో వేంకటేశాయ ఫస్ట్‌లుక్ టీజర్
కింగ్ నాగార్జున.. మరోసారి భక్తాగ్రేసరుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా., ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తొలి డైలాగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగ్‌ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్‌తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
కృష్ణమ్మతో రాజుగారి పాట!
మహారాజు తలచుకుంటే ఏ పనైనా క్షణాల్లో జరుగుతుంది. కానీ, రాజుగారి తలపులకు కృష్ణమ్మ దగ్గర తలుపులు మూసుకున్నాయి. కోరుకున్నది జరగని తరుణంలో రాజులకు కోపం రావడం సహజమే. మరి, ఈ రాజు ఏం చేశారో? ఫిబ్రవరి 10న రిలీజవుతోన్న ‘ఓం నమో వేంకటేశాయ’ చూసి తెలుసుకోవాలి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్కలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కృష్ణమ్మపై మనసుపడిన మహారాజు పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ‘‘జగపతిబాబుది కాస్త ప్రతినాయక ఛాయలున్న పాత్ర. మహారాజుగా ఆయన ఆహార్యం అద్భుతంగా ఉంటుంది. జగపతిబాబు, అనుష్కలపై దర్శకులు రాఘవేంద్రరావు ఓ పాటను కూడా చిత్రీకరించారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సౌరభ్ జైన్, విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, సంగీత దర్శకుడు: యం.యం. కీరవాణి. -
నాగ్ రిలీజ్ డేట్ చెప్పేశాడు
ప్రస్తుతం సీనియర్ హీరోలందరూ తమ సినిమాలతో రెడీ అయిపోతున్నారు. అసలు నలుగురు సీనియర్లు సంక్రాంతి బరిలోనే దిగుతారని భావించినా.. ముఖాముఖి పోటి నుంచి తప్పుకొని కాస్త అటు ఇటుగా సర్దుకున్నారు. ఇప్పటికే చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలు సంక్రాంతి బరిలో పోటి పడటం కాయమైపోయింది. ఇక కాస్త ఆలస్యంగా వస్తున్న విక్టరీ వెంకటేష్, తన గురు సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఒక్క నాగార్జున విషయంలోనే ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగార్జున, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమా రిలీజ్ డేట్ ను ముందే చెప్పలేమని ప్రకటించాడు. అయితే ఇప్పటికే షూటింగ్ తో పాటు కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావటంతో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. చారిత్రక కథతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. బాలీవుడ్ నటుడు సౌరబ్ జైన్ వేంకటేశ్వరునిగా నటిస్తున్న ఈసినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
14 కేజీల బంగారు లెహంగా
రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఓం నమో వేంకటేశాయ సినిమాకు సంబంధించి రోజు వార్త సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నటిస్తున్న ప్రగ్యా ట్విట్టర్ పేజ్‌లో తన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఫస్ట్ లుక్‌లో మరో విశేషం కూడా ఉంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న లెహంగాలో కనిపించిన ప్రగ్యా, తన కాస్ట్యూమ్స్ కు సంబంధించిన హింట్ ఒకటి ఇచ్చింది. కామెంట్లో ఏమీ చెప్పకపోయినా తాను యాడ్ చేసిన ట్యాగ్స్‌లో మాత్రం 14 కేజీల బంగారు లెహంగా అనే ట్యాగ్ ఇచ్చింది. దీంతో పోస్టర్లో ప్రగ్యా వేసుకున్న బంగారు వర్ణ లెహంగా 14 కేజీల బరువు ఉంటుందని తెలుస్తోంది. లోకేషన్, ప్రగ్యా కాస్ట్యూమ్స్, లుక్స్ చూస్తుంటే ఇది దర్శకేంద్రుడి మార్క్ రొమాంటిక్ సాంగ్ అయి ఉంటుందనిపిస్తుంది. And heres my #FirstLook from #OmNamoVenkatesaya! Glad to be a part of this project!#grace #beauty #14kggoldlehengahttps://t.co/MRn6CCiOtj — Pragya Jaiswal (@itsmepragya) November 21, 2016 -
విశిష్ట భక్తుడిగా నాగార్జున
అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ఈ సినిమాలో నాగార్జున.. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను ఆదివారం ఉదయం విడుదల చేశారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన పాత్ర ప్రీ-లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. G morning friends check this prelook of #OmNamoVenkatesaya.. https://t.co/lPHw3Lriel — Nagarjuna Akkineni (@iamnagarjuna) 21 August 2016 -
అప్పుడు జేజెమ్మ ఇప్పుడు కృష్ణమ్మ
ఆహార్యంలో ఆధ్యాత్మికం.. అలంకరణలో ఆకర్షణీయం.. కృష్ణమ్మగా అనుష్క రూపం కమనీయం అంటున్నారు నెటిజన్లు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. అక్కినేని నాగార్జున హాథీరామ్ బాబాగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనున్నారు. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల తర్వాత అనుష్కకు అంత మంచి పేరు తీసుకొచ్చే పాత్ర ఇదని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలోని కృష్ణమ్మ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ని శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ప్రగ్యా జైశ్వాల్, సౌరభ్ జైన్, విమలా రామన్, అస్మిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జే.కే.భారవి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి. -
కృష్ణమ్మ పాత్రలో అనుష్క
-
కృష్ణమ్మ పాత్రలో అనుష్క
అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో అలరించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్ లోగో, నాగార్జున లుక్‌తో పాటు ఏడు కొండలవాడిగా కనిపిస్తున్న ఉత్తరాధి నటుడు సౌరబ్ జైన్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. చాలా రోజులుగా ఈ సినిమాలో అనుష్క ఓ సన్యాసి పాత్రలో కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అనుష్క నటిస్తుందంటూ హింట్ ఇచ్చిన చిత్రయూనిట్ సన్యాసి పాత్ర అని మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా ఓం నమో వేంకటేశాయా సినిమాలో అనుష్క ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చూపించారు. కృష్ణమ్మ పాత్రలో కనిపిస్తున్న అనుష్క లుక్‌ను శనివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. తొలి సారిగా అనుష్క ఓ భక్తిరస చిత్రంలో నటిస్తుండంతో పాటు హిట్ కాంబినేషన్‌గా పేరున్న నాగార్జున సినిమా కావటం, గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రాలన్ని ఘనవిజయం సాధించంటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కృష్ణమ్మ గా అనుష్క... #OmNamoVenkatesaya https://t.co/0qDvNabRca pic.twitter.com/S5eMs1Ng1z — Raghavendra Rao K (@Ragavendraraoba) 6 August 2016 -
స్వామి ఆవిష్కరణ..
అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న భక్తిరస ప్రధాన చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. స్వామి ఆవిష్కరణ అంటూ వేంకటేశ్వరుడి పాత్ర పోషిస్తున్న నటుడు సౌరభ్‌ను పరిచయం చేశారు. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్న విషయం తెలిసిందే. రేపే శ్రీవారి దర్శనం అంటూ శుక్రవారం రాఘవేంద్ర రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎప్పటికప్పుడు చిత్ర షూటింగ్ విశేషాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'ఓం నమో వెంకటేశాయ' శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. -
మరోసారి వెంకన్న కొలువులో నాగార్జున!
‘నమో వెంకటేశాయ’ షూటింగ్ ప్రారంభం హైదరాబాద్: అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి చిత్రాలతో ప్రేక్షకులను భక్తితన్మయత్వంలో ముంచెత్తిన అక్కినేని నాగార్జున మరోసారి భక్తుడిగా ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమోవెంకటేశాయ’ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా శనివారం తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దయతో ఈరోజు ఉదయం షూటింగ్ ప్రారంభమైందని, ఈ అనుభవం ఎంతో బాగుందని పేర్కొంటూ.. సెట్లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. గతంలో ‘అన్నమయ్య’లో వెంకన్న భక్తుడిగా ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజా చిత్రంలోనూ వెంకటేశ్వరస్వామి భక్తుడైన హథీరామ్‌బాబా పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ కథానాయికలుగా నటించనున్నట్టు తెలుస్తోంది. With the blessings of Lord Venkateswara started the shoot for#OmNamoVenkatesaya this morning/loving the experience!! pic.twitter.com/gvfCjvT6ih — Nagarjuna Akkineni (@iamnagarjuna) 2 July 2016