opposition party
-
ప్రతిపక్షం లేకుండా బాబు కుట్ర..
-
పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయానికి బాబు తిలోదకాలు
-
Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
అజంగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎప్పటికీ రద్దు చేయలేరు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తేలి్చచెప్పారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్, జాన్పూర్, బదోహీ, ప్రతాప్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. సీఏఏ కింద కాందీశీకులకు భారత పౌరసత్వం కలి్పంచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వీరంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులేనని చెప్పారు. మతం ఆధారంగా భారత్‌ను విడగొట్టడంతో వీరంతా బాధితులుగా మారి మన దేశానికి వచ్చారని, చాలాఏళ్లుగా ఇక్కడే కాందిశీకులుగా బతుకుతున్నారని తెలిపారు. ప్రాణభయంతో వలస వచి్చన బాధితులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. ఈసారి మూడు డోసుల బుజ్జగింపు విధానాలు ‘‘ఉత్తరప్రదేశ్‌లో గతంలో భయానక పరిస్థితులు ఉండేవి. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసేవారు. ముష్కరులకు రాజకీయ ముసుగేసి కాపాడుతూ ఉండేవారు. దీనివల్ల ఉగ్రవాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయినా కొందరు విపక్ష నాయకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత మార్పు మొదలైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ అనేవి రెండు పార్టీలు. నిజానికి అవి ఒకే దుకాణం. అక్కడ బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబస్వామ్యం, అవినీతిని అమ్ముతుంటారు. ఈసారి వారు మూడు డోసుల బుజ్జగింపు విధానాలతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాజేసి ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టాలని ప్రయతి్నస్తున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో సగం దోచుకొని ఓటు బ్యాంక్‌కు అప్పగించాలని కుట్రలు పన్నుతున్నారు. దేశ బడ్జెట్లో ఏకంగా 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత రాహుల్, అఖిలేశ్ విదేశాలకు వెళ్లిపోతారు పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనను ఉత్తరప్రదేశ్‌లోనూ తీసుకురావాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. హిందువులను హత్య చేయడం, దళితులను, ఆదివాసీలను వేధించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడమే తృణమూల్ కాంగ్రెస్ పాలన. అలాంటి పాలన మనకు కావాలా? అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూన్ 4 తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పని చేస్తానని గ్యారంటీ ఇస్తున్నా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ), సమాజ్‌వాదీ పార్టీ యువరాజు(అఖిలేశ్ యాదవ్) విదేశాలకు వెళ్లిపోతారు. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన బడాబాబులు ఈ దేశాన్ని సమర్థంగా నడపలేరు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ‘‘ఈ లోక్‌సభ ఎన్నికలు మనకొక సువర్ణావకాశం. బలమైన ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ప్రజలు వేసే ఓటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నేరుగా నరేంద్ర మోదీ ఖాతాలోకి చేరుతుంది. ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తామంటున్నారు. నేను బతికి ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వను. ఎక్స్–రే యంత్రాలతో ప్రజల ఆస్తులను సర్వే చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ అజెండాను నేను బయటపెట్టా. దాంతో కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి’’. -
కాంగ్రెస్‌కు ఆ హోదా కూడా దక్కదు: ప్రధాని మోదీ
ఫుల్బాని (ఒడిశా): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు కూడా గెలవదని, ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఆయన ఒడిశాలోని కంధమాల్ లోక్‌సభ స్థానంలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతి తెలిసిన, అర్థం చేసుకున్న ఒడిశా బిడ్డనే రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున పోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా తమ ప్రభుత్వం దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు తెర దించిదని పేర్కొన్నారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో నాలుగు దశల్లో మే 13 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4 జరుగుతుంది. -
Maldives: మోదీకి క్షమాపణ చెప్పాల్సిందే!
మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. భారత్-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం!
మాల్దీవుల అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(PNC)పై తీవ్రమైన అసమ్మతి పెరుగుతోంది. దీంతో దేశ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జుకు చెందిన అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‌పై ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ మీడియా సోమవారం పలు కథనాలు ప్రచురించింది. ప్రతిపక్ష మాల్దీవీయన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ), మరో భాగస్వామ్య పార్టీకి చెందిన ఎంపీలందరితో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంట్లో సమర్పించలేదు. అయితే ఆదివారం మల్దీవుల పార్లమెంట్లో అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఘర్షణకు దారితీసింది. తీర్మానం ఓటింగ్‌ను ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా స్పీకర్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌లోనే తన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతిపక్ష పార్టీలు అన్ని మహ్మద్ మొయిజ్జు ప్రభుత్వంపై అభిశంసన తీర్మానం ప్రవేశపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. చదవండి: Maldives: మాల్దీవుల పార్లమెంట్లో ఎంపీల కొట్లాట -
స్పీకర్నే దించేసుకున్నారు!
వాషింగ్టన్: అమెరికాలో విపక్ష రిపబ్లికన్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్ పదవి నుంచి రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్ పారీ్టతో చేతులు కలిపారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్‌లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్ అనంతరం మెకార్తీ స్పీకర్‌గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొంప ముంచిన షట్‌డౌన్ కెవిన్ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్‌డౌన్‌ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్ చేతులు కలిపారన్నది గేట్జ్ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్‌కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు. రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే... గేట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ రిపబ్లికన్ సభ్యులకు నిజానికి కెవిన్ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్‌గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్‌కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్‌గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్ చేస్తుండటంతో రిపబ్లికన్ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది! ఇప్పుడేంటి? ► తదుపరి స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ► అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే. ► గత జనవరిలో జరిగిన ఓటింగ్‌లో గెట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్ అయ్యారు. ► అక్టోబర్ 11న కొత్త స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు. ► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది. ► ప్రస్తుతానికి రిపబ్లికన్ నేతలు స్టీవ్ స్కలైస్ (లూసియానా), టామ్ ఎమ్మర్ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. -
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు. ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. -
US presidential election 2024: రిపబ్లికన్ రేస్ షురూ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయముంది. 2024 నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కానీ రెండు ప్రధాన పక్షాల్లో ఒకటైన విపక్ష రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే బరిలో దిగింది. పార్టీ అభ్యర్థిని నిర్ణయించే సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియకు బుధవారమే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైతే వివాదాస్పద మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో అందరి కంటే ముందున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వైపే స్పష్టమైన మొగ్గుంది. అయినా సరే, ట్రంప్‌నకు ఎంతో కొంత పోటీ ఇస్తారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ డి శాంటిస్తోపాటు మరో ఏడుగురు ఆశావహులు బరిలో దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తొలి రౌండ్ డిబేట్ ఎప్పుడు? ► బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వేదిక: రాజకీయంగా అతి కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో ► రెండో రౌండ్ డిబేట్ సెపె్టంబర్ 27న కాలిఫోరి్నయాలో జరుగుతుంది. అర్హత... అంత సులభం కాదు రిపబ్లికన్ అభ్యరి్థత్వ బరిలో నిలవడం అంత సులువేమీ కాదు. అందుకు పార్టీ నేషనల్ కమిటీ పెట్టే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరెన్నో పార్టీపరమైన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. ► లేదంటే కనీసం రెండు నేషనల్ పోల్స్‌తో పాటు అయోవా వంటి ఒక అర్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► ప్రచారం కోసం కనీసం 40 వేల మంది నుంచి విడివిడిగా విరాళాలు సేకరించాలి. ► మూడు విడివిడి నేషనల్ పోల్స్‌లో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► అంతిమంగా నెగ్గి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే అభ్యరి్థకి పూర్తి మద్దతిస్తామని ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. అయితే రేసులో ముందున్న ట్రంప్ మాత్రం ఇలా సంతకం చేయకపోగా, తిరస్కరించడం విశేషం! డిబేట్లో వీరే... 1. టిమ్ స్కౌట్ (దక్షిణకరోలినా సెనేటర్) 2. డి శాంటిస్ (ఫ్లోరిడా గవర్నర్) 3. నిక్కీ హేలీ (ఐరాసలో అమెరికా మాజీ రాయబారి) 4. వివేక్ రామస్వామి (భారత సంతతి వ్యాపారవేత్త) 5. క్రిస్ క్రిస్టీ (న్యూజెర్సీ మాజీ గవర్నర్) 6. మైక్ పెన్స్ (మాజీ ఉపాధ్యక్షుడు) 7. డౌగ్ బర్గం (నార్త్ డకోటా గవర్నర్) 8. అసా అచిన్ సన్ (అర్కన్సాస్ మాజీ గవర్నర్) ఏం ఒరిగేను? రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌నకు మద్దతు వెల్లువెత్తుతోందనే చెప్పాలి. తమ అభ్యర్థి ఆయనేనని సీబీఎస్, యూగవ్ గత వారం చేసిన పోల్‌లో ఏకంగా 62 శాతం రిపబ్లికన్ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. అలాంటప్పుడు ఈ డిబేట్లతో పార్టీ సాధించేది ఏముంటుందని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఆశావహులు డిబేట్లలో ట్రంప్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలో సమర్థంగా చెప్పగలగాలని అదే సర్వేలో ఏకంగా 91 శాతం స్పష్టం చేశారు. కనుక ఏమైనా జరగొచ్చని, చివరికి అనూహ్యంగా ఎవరైనా అధ్యక్ష అభ్యర్థి కావచ్చని అంటున్న వారికీ కొదవ లేదు. కొసమెరుపు రేసులో అందరి కంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి రౌండ్ డిబేట్లో పాల్గొనడం లేదు. ‘నాకున్న పాపులారిటీకి ఇలాంటి పిల్ల పందాల్లో పాల్గొనడమా? నాన్సెన్స్! నేనెవరో, అధ్యక్షునిగా ఎంత సాధించానో పార్టీ ఓటర్లందరికీ బాగా తెలుసు’’ అంటున్నారాయన! అయితే, సరిగ్గా డిబేట్ల సమయానికే ప్రి రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన ప్రతిపక్షాల భేటీ.. మమతా బెనర్జీ ఏమన్నారంటే..
-
ఆంధ్రప్రదేశ్‌లో పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వచ్చే ఎన్నికల్లో 300 సీట్లు మావే
పట్నాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశం ఒక ఫొటో సెషన్‌కే పరిమితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. విపక్షాల మధ్య ఐక్యత అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జమ్మూలో ఒక ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా పట్నా సమావేశంతో ఒరిగేదేమీ లేదని బీజేపీ 300పైగా సీట్లతో భారీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు అసహనంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ జైల్లో పెట్టిన నాయకులు నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆమె మనవడు రాహుల్‌తో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సమావేశం ఒక స్వార్థ కూటమిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభివర్ణించారు. విపక్షాల కూటమిని తోడేళ్లతో పోల్చారు. ‘‘తోడేళ్లు మూకుమ్మడిగా వేటాడతాయని అంటారు. పట్నాలో రాజకీయ మూక కలిశాయి. వారికి ఎర మన దేశ భవిష్యత్’’ అని స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. -
ఫ్లెక్సీ వార్..! అధికార పక్షం హామీలపై ప్రతిపక్షాల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలు క్షేత్రస్థాయిలో నువ్వానేనా అనే విధంగా పోటాపోటీ నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష పోరాటాలు, ఘర్షణలు సైతం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీడి యా ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీల శ్రేణులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడా ది ఎన్నికలు జరుగనుండడంతో క్షేత్రస్థాయి పోరు లో సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధానికి దిగుతున్నారు. తెల్లారేపాటికి పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల వార్ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు నెలల కిందట పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు జిల్లాలోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ తాజాగా ఈ ఫ్లెక్సీల వార్ స్పీడందుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామం, మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తల్వేదలో వేసిన ఫ్లెక్సీలో హామీలు మరిచిన ఎమ్మెల్యే తమ గ్రామానికి ఎందుకొస్తున్నావంటూ రాశారు. దీంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పో లీసు బందోబస్తుతో గ్రామంలో పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఒక మహిళ జీవన్‌రెడ్డిని నిలదీసింది. పలు సమస్యలపై గ్రామ స్తులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ను పోలీసులు డిలీట్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బాడ్సిలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామ పర్యటన రద్దయ్యింది. ● మీడియా, సోషల్ మీడియా స్థాయి పోరు ఇప్పు డు ఫ్లెక్సీల వరకు రావడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల అంశాలు సైతం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుండడంతో ఈ రకమైన సంస్కృతికి పలువురు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీల పోరుకు అన్ని పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. -
విపక్షాల భేటీ వాయిదా!
న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పాట్నాలో ఈ నెల 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేయాలని జేడీ(యూ) నేతలు నిర్ణయించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటుకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ యత్నిస్తుండటం తెలిసిందే. -
దేశ మనోభావాలను కించపర్చారు
అజ్మీర్: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు. మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థ ‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగేది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు. అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
సీఎం కేసీఆర్ పై విపక్షాల విమర్శలు
-
రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్ బీజేపీ!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, అకాలీదళ్, మజ్లిస్ దూరంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 నుంచి 5 దాకా రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ‘‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మోదీ సర్కారు మరింత హాని చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి’’ అంటూ తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం విపక్షాల తరఫున పవార్ అభ్యర్థిత్వాన్ని పార్టీలన్నీ ముక్త కంఠంతో సమర్థించాయి. అయితే పోటీకి పవార్ సున్నితంగా నిరాకరించారు. భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. పవార్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని మమత మీడియాకు తెలిపారు. వ్యవస్థలన్నింటినీ పథకం ప్రకారం నాశనం చేస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు అందరూ ఒక్కతాటిపై రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ దృష్టిలో ఏ అభ్యర్థీ లేరని ఖర్గే చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించి ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. ‘‘దేశ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు విద్వేష, విభజన శక్తులను ఎదిరించగల వ్యక్తే రాష్ట్రపతి వంటి పదవిని అధిష్టించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీయేతర పార్టీలతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పవార్, మమత, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేలకు అప్పగించినట్టు డీఎంకే నేత టీఆర్ బాలు చెప్పారు. పోటీకి పవారే సరైన వ్యక్తని, ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. పవార్ నిరాకరణ అనంతరం ఎన్సీపీ నేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను కూడా మమత సూచించినట్టు ఆరెస్పీ నేత ప్రేమ్‌చంద్రన్ తెలిపారు. గోపాలకృష్ణ గాంధీ 2017లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. కానీ అదే సమయంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓటేసిన జేడీ(యూ), బీజేడీ మద్దతు పొందగలిగారు. విపక్షాల భేటీలో ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ఖర్గే, జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా (కాంగ్రెస్), దేవెగౌడ, కుమార్‌స్వామి (జేడీఎస్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్) పాల్గొన్నారు. జూన్ 20, లేదా 21న పవార్ సారథ్యంలో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. బీజేపీలో జోష్ మమత భేటీకి టీఆర్ఎస్, బీజేడీ, ఆప్ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండటం బీజేపీలో ఉత్సాహం నింపింది. బీజేడీ ఎప్పుడూ విపక్ష శిబిరానికి దూరం పాటిస్తూ వస్తోంది. పలు అంశాలపై ఎన్డీఏకే మద్దతివ్వడం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 48 శాతానికి పైగా ఓట్లున్నాయి. బీజేడీ తదితరుల మద్దతుతో తమ గెలుపు సునాయాసమేనని బీజేపీ భావిస్తోంది. విపక్ష భేటీలో నేతలంతా తమదే పై చేయి అని నిరూపించుకోజూశారని పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఈ భేటీలతో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచారు. మీ చాయిస్ చెప్పండి: బీజేపీ మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలను అధికార బీజేపీ ముమ్మరం చేసింది. ఈ బాధ్యతలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం రాజ్‌నాథ్ పలు విపక్షాల నేతలతో ఫోన్లో వరుస సంప్రదింపులు జరిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మమతకు కూడా ఆయన ఫోన్ చేయడం విశేషం. ఆమెతో పాటు విపక్షాల భేటీలో పాల్గొన్న పవార్, కాంగ్రెస్ నేత ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌లతోనూ ఆయన మాట్లాడారు. అలాగే బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరిపినట్టు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే వారికి అంగీకారమో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారని నేతలు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించినట్టు చెబుతున్నారు. నడ్డా కూడా ఫరూక్ అబ్దుల్లాతో ఫోన్లో చర్చలు జరిపారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ((ఏజేఎస్‌యూ), స్వతంత్ర ఎంపీలతోనూ మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దాంతోపాటే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. జూన్ 29 దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఉపసంహరణకు జూలై 2 తుది గడువు. జూలై 18న ఎన్నిక జరుగుతుంది. జూలై 21న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. తొలిరోజు 11 నామినేషన్లు దాఖలవగా ఒకటి తిరస్కరణకు గురైంది. చదవండి: విపక్ష నేతలకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్.. మద్ధతు ఇవ్వాలని విజ్ఞప్తి -
ఏయూపై విపక్షాల విషప్రచారం
-
అంకెలపై లంకెబిందె కథలు!
నిజం నిద్ర లేచేసరికి అబద్ధం దేశాన్ని చుట్టేస్తుందంటారు. మసాలా వేసి వండిన వంటకం కనుక అబద్ధపు ఘుమఘుమలు తొందరగా వ్యాపిస్తాయని ఈ సామెత ఉద్దేశం. అటువంటి అబద్ధాలు వ్యవస్థీకృత రూపం దాల్చితే? సమస్త వనరుల్ని తమ గుప్పెట పెట్టుకున్న శక్తిమంతులే ఆ వ్యవస్థ వెనుక నిర్దేశకులుగా నిలబడితే ఏమవుతుంది? – అబద్ధాలు సూపర్సోనిక్ రెక్కల్ని తొడుక్కుంటాయి. నిజాల తరంగదైర్ఘ్యాలు నిస్సహాయపు ముద్ర దాల్చవలసి ఉంటుంది. ఒకానొక చారిత్రక దుర్ముహూర్తంలో పాతికేళ్లకు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థీకృత అబద్ధాలకు విత్తనం పడింది. రాజకీయ వ్యవస్థలో వెన్నుపోటు అనే వినూత్న పద్ధతిలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజకీయ శక్తికి అసత్య ప్రచారాలను ఆక్సిజన్ మాదిరిగా ఎక్కించవలసి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాదారుల్లోంచి ఆ రాజకీయ శక్తి ‘క్రోనీ క్యాపిటలిజా’న్ని ప్రోది చేసింది. ఇంతింతై చెట్టంతైన ‘క్రోనీ కేపిటలిజమ్’ ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని పార్శ్వాల్లోనూ తన ఊడలను దించడం ప్రారంభించింది. ఫలితంగా ఆ రాజకీయ శక్తి చుట్టూ డబ్బూ, పలుకుబడి కలిగిన ఒక ముఠా వలయం మాదిరిగా అల్లుకున్నది. సకల వనరులతోపాటు ఈ ముఠా చేతిలో ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి. ఈ కార్ఖానాలు పందిని తయారుచేసి నందిగా బ్రాండింగ్ చేయగలవు. వినియోగదారుడు నమ్మి తీరవలసిందే! తనకు లాభసాటిగా ఉన్న రాజకీయ–ఆర్థిక–సామాజిక పొందికలో ఏ చిన్న మార్పునూ ఈ క్రోనీ ముఠా సహించలేదు. వారి కర్మఫలాన రెండున్నరయేళ్ల క్రితం రాజకీయ పొందికలో ఒక మార్పు జరిగింది. ఫాదర్ ఆఫ్ ఆంధ్రా క్రోనీ క్యాపిటలిజమ్ అధికారానికి దూరమయ్యాడు. అధికారంలోకి వచ్చిన రాజకీయ శక్తి సామాజిక–ఆర్థిక పొందికలోనూ మార్పులు చేయడం ప్రారంభించింది. నిర్భాగ్యులనూ, నిస్సహాయులనూ సాధికారం చేసే చర్యలకు ఉపక్రమించింది. ఈ పరిణామాలను క్రోనీ ముఠా ప్రాణాంతకంగా పరిగణించింది. దీనికి చెక్ చెప్పడానికి తమ చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయ ఉత్పత్తి కర్మాగారాలను మూడు షిప్టుల్లో నడపడం ప్రారంభించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన.. జరుగుతున్నంత ప్రచారం ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగి ఉండలేదు. ఈ ప్రచారానికి పునాదిరాళ్లు అబద్ధాలే. నందిని పందిగా, పందిని నందిగా జనం మదిలో ముద్రించడమే ఈ ప్రచార లక్ష్యం. ఇందుకోసం అన్నిరకాల మార్కెటింగ్ టెక్నిక్‌లనూ రంగంలోకి దించారు. ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కొంత కాలంపాటు కష్టపడ్డారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మలేదు. పైగా తిప్పికొట్టారు. దాంతో అమరావతి విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని శక్తులనూ ఏకం చేయడానికి ప్రయత్నించారు. పార్టీలను ఏకం చేయగలిగారు కానీ ప్రజలను ఒప్పించ లేకపోయారు. ఇసుక దోపిడీ చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేలు సైతం క్వారీల్లో చొరబడి మహిళా అధికారులపై కూడా దాడులు చేసిన ఆనాటి గాయాలు సలపడంతో తోక ముడిచారు. వరసగా ఓ అరడజన్ ప్రచారాలు బోల్తాకొట్టిన తర్వాత అప్పులు – అభివృద్ధి, పెట్టుబడులు అనే అంశాలతో కూడిన ఒక మెగా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మల్టీస్టారర్ షోగా దీన్ని మలిచారు. కొత్త ప్రభుత్వం వేలకోట్లు అప్పులు చేసిందనీ, ఇక అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనీ, దివాళా పరిస్థితి ఏర్పడింది కనుక ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలనీ డిమాండ్ చేసేదాకా ఈ ప్రచారాన్ని నడుపుతున్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి జాడే రాష్ట్రంలో కన్పించడం లేదని ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా–అనే చతురంగ బలాలను యుద్ధప్రాతిపదికపై నడిపిస్తున్నారు. ఈ దుమారంలో కొట్టుకొనిపోకుండా నిజా నిజాలను నిష్పాక్షికంగా దర్శించవలసిన అవసరం ఉన్నది. నిజాలకు నిలువుటద్దాల వంటి అంకెలన్నీ మనకు అందు బాటులోనే ఉన్నాయి. అవును. వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేసిన మాట నిజం. కరోనా కాలంలో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది ఆరో స్థానం. తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నది. ఇంతకుముందున్న ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు అప్పుచేసి, మరో 60 వేల కోట్ల బకాయిల భారాన్ని తలపై మోపి, ఏటా 20 వేల కోట్లు వడ్డీలే చెల్లించాల్సిన వారసత్వాన్ని ఏపీ కొత్త ప్రభుత్వానికి వదిలేసింది. కరోనా కాలంలో ఏపీ కంటే అధికంగా అప్పులు చేసిన ఐదు రాష్ట్రాలతో సహా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతటి ‘ఘనమైన’ వారసత్వ సంపద లేదు. చేసిన అప్పులతో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఖర్చు పెట్టిన పద్దులేమిటి? చేసిన అభివృద్ధి ఎంత? సంక్షేమం మాటేమిటి? అనే విషయాలను పరిశీలించాలి. అంతకు ముందు ఏపీ పరిణా మాలపై నిపుణులైన ఆర్థికవేత్తలు, సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పీఆర్ఎస్ ఇండియా అనే ఒక ప్రముఖ ఇండిపెండెంట్ సంస్థ ‘స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్’ అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో పేదవర్గాలను ఆదుకోవడానికి ఏ రాష్ట్రం ఎంతమేరకు బడ్జెట్ కేటాయింపులు చేసిందనే అంశాన్ని ఈ నివేదిక విశ్లేషించింది. జాబితాలో 13.1 శాతం బడ్జెట్ కేటాయింపుతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. 7.9 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో, 4.8 శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణ చేసింది. సంక్షేమానికే కాకుండా అభివృద్ధికి కూడా ఏపీ ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నదని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం బడ్జెట్లో మూలధన వ్యయంగా (Capital expenditure) 35 వేల కోట్లు కేటాయిస్తే రెండేళ్లు తిరిగేసరికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పద్దును 45 వేల కోట్ల రూపాయలకు పెంచింది. ఇది ఆర్బీఐ లెక్క. ఉద్యోగుల జీతభత్యాల కింద చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరంలో రూ. 32 వేల కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్లలో ఆ పద్దును వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లకు పెంచిందని ఆర్బీఐ వెల్లడించింది. సమ్మిళిత అభివృద్ధి(inclusive growth)లో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో తొలిస్థానమని ‘ఇండియా టుడే’ సర్వే (2021) తేల్చి చెప్పింది. 2003 సంవత్సరం నుంచి ప్రతియేటా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సర్వే ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ‘నీతి ఆయోగ్’ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్వయంగా కృష్ణాజిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటు విప్లవాత్మకమైన ఆలోచనగా ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లా కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన సందర్భంగా ఏఐఎల్ డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్ – సీఓఓ పంకజ్ శర్మ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. గతంలో ‘రావాలి జగన్... కావాలి జగన్’ అనే నినాదం రాష్ట్రమంతటా మార్మోగితే, ఇప్పుడు ‘జగన్ వచ్చాడు..అభివృద్ధి తెచ్చాడు’ అనే నినాదం వినిపిస్తోందని వ్యాఖ్యా నించారు. కొత్త కంపెనీలు శంకుస్థాపన సమయంలో విస్తరణ కార్యక్రమాలను వివరంగా ప్రకటించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి గుర్తు. ఇక్కడ ఫ్యాక్టరీని నడపలేక కియా మోటార్స్ కంపెనీ వెళ్లిపోతున్నదని మనవాళ్లు ఎంత ప్రచారం చేసినా, ఆ కంపెనీ మాత్రం రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సెంచురీ ప్లైవుడ్స్ తన పెట్టుబడిని నాలుగింతలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏటీజీ టైర్స్ కూడా తన పెట్టుబడిని రెండింతలకు పెంచింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వైద్య ఆరోగ్య రంగంలో ఒక పెద్ద సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని చాలామంది గుర్తించారు. ‘నాడు – నేడు’ కార్యక్రమంతోపాటు కొత్త వైద్యశాలల నిర్మాణం, ఉన్నవాటిని ఆధునీకరించడం, కొత్త సూపర్ స్పెషాలిటీల నిర్మాణం, వైఎస్ఆర్ విలేజి క్లినిక్స్ కోసం ప్రభుత్వం సుమారుగా రూ. 32 వేల కోట్లు కేటాయించింది. సగానికి పైగా ఇప్పటికే ఖర్చు చేశారు. ‘ఆరోగ్యశ్రీ’ కింద బడ్జెట్లో రెండువేల కోట్ల కేటాయింపు, 1,088 కొత్త అంబు లెన్స్‌ల ప్రారంభం... పైన చెప్పిన ఖర్చుకు అదనం. ఫలితంగా వైద్యరంగం వేగంగా తన స్వరూపాన్ని మార్చుకుంటున్నది. పేద – ధనిక, సామాజిక హోదా వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి గడపకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ వెళ్లే లక్ష్యం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక్క సంవత్సర కాలంలోనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల సంఖ్యలో 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపించింది. రెండేళ్ల కిందటి దాకా సుదూరంగా వుండే గిరిజన గూడేల్లోని మహిళలు కాన్పుకు వెళ్లాలంటే డోలీలే శరణ్యం. భగవంతునిపైనే భారం. ఇప్పుడు గర్భం దాల్చిన దగ్గర్నుంచీ క్రమం తప్పకుండా 104 వాహనం ఆమె ఇంటి ముందు ఆగి, మందులిస్తున్నది. కాన్పు సమయంలో అదే వాహనంలో తీసుకెళ్లి కాన్పు తర్వాత ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నారు. గిరిజన జీవితాలలో 104 అంబు లెన్స్ పెనుమార్పును తెచ్చింది. విద్యారంగంలో ‘నాడు–నేడు’కు 16 వేల కోట్ల రూపా యలు కేటాయించారు. ఇప్పటికే తొలిదశ పూర్తయింది. ఇప్పుడు నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం విద్య ప్రతి విద్యార్థికీ ధనిక–పేద తేడా లేకుండా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ రెండేళ్లలో ఐదున్నర లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లు వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు. వారు ఏటా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం వగైరాల కోసం చేసే కోట్లాది రూపాయలు తల్లిదండ్రులకు మిగిలిపోయాయి. ఈ సొమ్మును వారు మెరుగైన జీవితం కోసం ఉపయోగించుకోగలుగుతారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకురూ. 3,600 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కొత్త హార్బర్లలో 10 వేల మెకనైజ్డ్ బోట్లను నిలుపుకొనే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు లక్షల టన్నుల అదనపు మత్స్య సంపద లభిస్తుందని అంచనా ఉన్నది. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పదివేల కోట్ల అదనపు ఆదాయం ప్రతియేటా మత్స్యకారులకు లభిస్తుంది. గుజరాత్ సముద్ర తీరాల్లో పొట్టకూటి కోసం శ్రమదోపిడీకి గురయ్యే పరిస్థితి నుంచి మత్స్యకారులు సగర్వంగా నిలబడే స్థితికి చేరుకుంటారు. 31 లక్షల కుటుంబాలకు నిలువనీడ కల్పించే బృహత్తర కార్యక్రమం వైఎస్సార్ – జగనన్న కాలనీల ఏర్పాటు. ఏకబిగిన ఇన్ని ఇళ్లను నిర్మించిన కార్యక్రమం దేశ చరిత్రలో మరొకటి లేదు. ప్రభుత్వం యాభైవేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మహాయజ్ఞంలో మహిళా సాధికారత అనే సామాజిక న్యాయ సూత్రం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇళ్లన్నీ పూర్తయి అక్కడ కాలనీ జీవితం మొదలైన తర్వాత వాటి విలువ అథమపక్షం రూ. 3 లక్షల కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు. ఈ ఒక్క పథకంలో మూడు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించి మహిళల చేతిలో జగన్ ప్రభుత్వం ఉంచబోతున్నది. ప్రభుత్వరంగంలో విస్తారంగా ఆస్తుల కల్పన జరుగు తున్నది. రూ. 4,200 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణం, 2,300 కోట్లతో ఆర్బీకేల నిర్మాణం, 416 కోట్లతో బల్క్ మిల్క్ యూనిట్ భవనాల నిర్మాణం, 690 కోట్లతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. 13 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, భావన పాడు ఓడరేవుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన భారీ పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. 13,885 కొత్త ఎంఎస్ఎంఇ యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభిం చాయి. మరో 42 వేల కోట్ల పెట్టుబడులతో 72 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. 96 వేల కోట్ల వ్యయంతో ఐదు ప్రభుత్వరంగ యూనిట్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ రెండున్నరేళ్ల పరిపాలనా కాలంలో, అందులో రెండేళ్ల సమ యాన్ని 30 వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని, ఇంకెన్నో వేల కోట్ల ప్రజాధనాన్ని కోవిడ్ మహమ్మారి మింగేసిన కాలంలో స్థూలంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, అప్పులు, పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవి. ఉద్యోగాల కల్పన పెరిగింది, పనిదినాల కల్పన పెరిగింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి వస్తున్నది. ఆర్బీకేల ఏర్పాటు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చివేయబోతున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రెండున్నరేళ్లలో సాధించిన సమ్మిళిత అభివృద్ధితో మరే రెండున్నరేళ్ల కాలం కూడా పోటీపడలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంకెలు అబద్ధం చెప్పవు! -వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కరెంట్ కోతలపై పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: చట్టసభల సాక్షిగా ప్రతిపక్షం విద్యుత్ అంతరాయాలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అబద్ధాలు చెప్పడమే విపక్షానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బదులిచ్చారు. ఈ దశలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విపక్ష ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం జోక్యం చేసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘గతేడాది కన్నా ఈ ఏడాది మెరుగ్గా ఉందా లేదా అనేది వివరాలతో సహా చెబుతున్నాం. కనీసం ఇది కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవడంలేదు. విద్యుత్ అంతరాయాల వివరాలు ఎవరికి తెలుస్తాయి.. సంబంధిత మంత్రికి కాదా. చట్టసభలో మీరు పదేపదే అబద్ధాలు మాట్లాడుతుంటే వాస్తవాలు ఏంటో తెలుసుకోవడానికి సమాచారం తెప్పించి, సభ ముందు ఉంచాలనే నేను కల్పించుకుని మాట్లాడుతున్నాను’ అని అన్నారు. విద్యుత్ వ్యవస్థను అప్పుల్లోకి నెట్టారు మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ రంగాన్ని రూ.70వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. విభజన నాటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందనే విషయాన్ని వక్రీకరించారన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం విద్యుత్ లైన్లు, ఫీడర్లను పరిశీలించ లేదన్నారు. తాము ఈ పనిచేశామని, దీనివల్ల అక్కడక్కడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. గతేడాదితో పోలిస్తే తక్కువ ఫీడర్లు, తక్కువ గంటల్లోనే అంతరాయం నమోదైందన్న విషయాన్ని సభ ముందుంచారు. విద్యుత్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, 2021 నాటికి మరో 1600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి వస్తుందని తెలిపారు. -
సీఐ నారాయణరెడ్డిపై ఈసీ కొరడా
సాక్షి, తాడిపత్రి అర్బన్ : తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నందున ఆయనపై ఈసీ చర్యలు తీసుకుంది. రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారాయణరెడ్డి పనితీరు వివాదాస్పదంగానే ఉంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరునే పరిశీలించారు. ఎస్ఐల నుంచి సిఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కనపెట్టి నారాయణరెడ్డి ఏ స్టేషన్లో పనిచేశారో అక్కడే సీఐగా పోస్టింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు కూడాపెద్ద ఎత్తున వినిపించాయి. ఇందుకు ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఇందుకు కృతజ్ఞతగా సీఐ నారాయణరెడ్డి తన సొంత గ్రామమైన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో అప్పట్లో భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరగణంతో లావనూరుకు వెళ్లడం.. సీఐ ఘన స్వాగతం పలకడం జరిగింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఏది చెబితే దానికి తలూపడం, పాటించడం తప్ప లా అండ్ ఆర్డర్‌తో, న్యాయ, అన్యాయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం వివాదాస్పదమైంది. సీఐ ఏకపక్ష తీరుతోనే సమస్యలు ముందే తాడిపత్రి సమస్యాత్మక అతి సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ అధికార, విపక్ష పార్టీల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ప్రబోధాశ్రమం ఘటన ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో సీఐ అనే అధికారి చాలా పారదర్శకంగా పనిచేసి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇక్కడ సీఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలు పాటించడం తప్ప మరో విషయం తెలియదని, పూర్తిగా జేసీ సోదరులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైఎస్సార్సీపి నేతలు బాహాటంగా ఆరోపించారు. గతంలో ఇదే స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినపుడు కూడా నారాయణరెడ్డి వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరిగి సీఐగా ఇదే స్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వడంపై విపక్ష నేతలు అదే రీతిలో ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు మాత్రం జేసీ సోదరుల సిఫారస్సు లేనిదే ఇక్కడి నుంచి బదిలీ చేయలేరు, పోస్టింగ్ ఇవ్వలేరు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో సీఐ నారాయణరెడ్డిని బదిలీ చేయడంతో ఎన్నికల కమిషన్(ఈసీ)పై మరింత నమ్మకం కలిగినట్లైంది. ప్రతిపక్షపార్టీ నేతలే ఆయన టార్గెట్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి 2018 అక్టోబర్ ఆరో తేదీన పెద్దపప్పూరు మండలంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో నిరాకరించారు. సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తన అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పాడు. ఇందులో భాగంగానే రూరల్ పోలీసులు అప్పట్లో పెద్దారెడ్డి పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో పెద్దారెడ్డి ముచ్చుకోటకు రావడంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 2018 ఆగస్టు 29న జరిగిన చిన్నపాటి ఘర్షణకు వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని బాధ్యుడిని చేస్తూ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఏకపక్షంగా వ్యవహరించారు. 2018 సెప్టెంబర్‌లో జేసీ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారన్న నెపంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తాడిపత్రి మండలం ఆలూరులో వైఎస్సార్సీపీ నేత గోసు రాజగోపాల్‌రెడ్డి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లి సీఐ, నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐపై ఈసీ కొరడా ఝుళిపించింది. అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తోంది. ఈసీ చర్యలతో సదరు పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు స్పందించిన ఈసీ తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి ఏకపక్ష వ్యవహారంపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పలుమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఈసీ స్పందిస్తూ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. ఈయన స్థానం లో తిరుపతి క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న శరత్‌చంద్రను నియమిస్తూ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. -
దోపిడీని ఆపినందుకే మహాకూటమి
సిల్వస్సా/గాంధీనగర్/ముంబై: దేశాన్ని దోచుకోకుండా ఆపినందుకే ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘మహాకూటమి’గా ఏర్పడ్డాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమి దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అని మండిపడ్డారు. కోల్‌కతాలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సభకు హాజరైన విపక్షనేతలపై పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వస్సాలో శనివారం ప్రధాని మోదీ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ‘ప్రజాధనం దోపిడీకి, అవినీతిని అడ్డుకునేందుకు నేను తీసుకున్న చర్యలపై కొందరికి కోపం వచ్చింది. భయంతో వారంతా ఒక్కటయ్యారు’ అని మండిపడ్డారు. ‘మా పార్టీకి ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. దీంతో రక్షించండంటూ ఆ పార్టీ నేతలు కేకలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలను చంపేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. యుద్ధట్యాంకుల ఫ్యాక్టరీ ప్రారంభం ప్రైవేట్ రంగంలో దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టీ కంపెనీ ఏర్పాటు చేసిన కే9 వజ్ర–హొవిట్జర్ యుద్ధ ట్యాంకుల తయారీ కర్మాగారాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2017లో కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన రూ.4,500 కోట్ల ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ సంస్థ 42 నెలల్లో 100 కే9 యుద్ధట్యాంకులను అందించాల్సి ఉంది. ఇప్పటికే 10 ట్యాంకులను సైన్యానికి అందించింది. వీటి తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఆ సంస్థ దక్షిణ కొరియా హన్వ్హా కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, 50 టన్నుల బరువుండే కే9 ట్యాంకు 47 కేజీల బరువైన బాంబును 43 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలపైకి పేల్చగలదు. మాతృమూర్తితో ప్రధాని ప్రధాని మోదీ శనివారం ఉదయం తన తల్లి హిరాబా(90)ను కలుసుకున్నారు. రైసన్ గ్రామంలో సోదరుడు పంకజ్ ఇంట్లో ఉంటున్న మాతృమూర్తితోపాటు ఇతర కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు. సినిమా మాదిరిగా దేశమూ మారుతోంది భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ముంబైలో ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ ప్రారంభించిన అనంతరం పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరైన సభనుద్దేశించి మాట్లాడారు. ‘సినిమాలు, సమాజం పరస్పర ప్రతిబింబాలు. గతంలో పేదరికం, అసహాయతనే ఎక్కువగా చూపేవారు. నేడు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలనూ చూపుతున్నారు. లక్షల్లో సమస్యలుంటే కోట్లాది పరిష్కారాలు చూపుతున్నారు’ అని అన్నారు. ఈ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టే 30 గంటల నిడివి గల డిజిటైజ్డ్ ఫుటేజీ ఉందని వెల్లడించారు. -
పాక్‌లో ఇమ్రాన్‌కు షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికలు ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ ఇచ్చాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి పార్లమెంట్లో తన బలాన్ని‡ పెంచుకుంది. జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ ఐదు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఇమ్రాన్ గెలుపొందిన నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. లాహోర్, బన్ను స్థానాల్లో పీటీఐకి ఓటమి ఎదురైంది. పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎన్ఏ–124 లాహోర్ స్థానంలో పీటీఐ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. పీఎంఎల్–నవాజ్, పీటీఐలు చెరో నాలుగు జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయని పాక్ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. -
ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో విఫలం
గంభీరావుపేట : మండలంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమయిందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. గంభీరావుపేటలో కాంగ్రెస్, టీజేఏసీ, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బుధవారం అధికారుల తీరుపై నిరసన చేపట్టారు. రాత్రింబవళ్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు, అనుమతులు, ట్రాక్టర్లకు సంబంధించిన కాగితాల తనిఖీ చేపట్టకపోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఎగదండి స్వామి, దోసల చంద్రం, చేని వెంకటస్వామి, లక్ష్మీనారాయణగౌడ్, కొత్తపల్లి శ్రీనివాస్, గుడికాడి బాలయ్య, పెంటయ్య, జంగం రాజు, రాజ్‌కుమార్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
సర్వం స్వపక్షమే...
సాక్షి అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్షం లేకుండా జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పూర్తి ఏకపక్షంగా జరిగాయి. 12 రోజులపాటు ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తించిన అధికారపక్షం ఆత్మస్తుతి, పరనిందతో విసుగెత్తించింది. తమ పార్టీ నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన వారిపై వేటు వేసేంత వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం ఈ సమావేశాలను నిర్వహించింది. ప్రతిపక్ష పార్టీ సభలో ఉన్నప్పుడు నాలుగైదు రోజులు సభ జరిపేందుక్కూడా ఇష్టపడని రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షం లేకపోవడంతో 12 రోజులపాటు సమావేశాల్నినిర్వహించడం గమనార్హం. పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి సరైన చర్చ లేకుండా.. కేవలం తన సభ్యుల భజనతోనే వాటిని ఆమోదింపజేసుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఊకదంపుడు ఉపన్యాసాల హోరు.. ఈ సమావేశాల్లో 16 బిల్లుల్ని ఆమోదించగా వాటిలో పదికిపైగా బిల్లుల్ని ఒకేరోజు ప్రవేశపెట్టి ఆమోదించడం విశేషం. ఎంతో ముఖ్యమైన నాలా బిల్లు, భూసేకరణ బిల్లును సాదాసీదాగా ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించేసింది. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న కాపు రిజర్వేషన్ల బిల్లుపైనా తూతూమంత్రంగా చర్చ జరిపి ఆమోదించింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్న స్థితిలో కనీస చర్చ లేకుండా సంబంధిత బిల్లును ఆమోదించడంపై మేధావులు ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు. ఇంతటి కీలకమైన బిల్లును ప్రతిపక్షం లేని సమయం చూసి వ్యూహాత్మకంగా చివరిరోజు ప్రవేశపెట్టి, పూర్తిస్థాయి చర్చకు అవకాశం లేకుండా ఆమోదించడాన్ని బీసీ సంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించామని, తమ ఎమ్మెల్యేలతోనే ప్రజా సమస్యలు లేవనెత్తించి చర్చించామని చెబుతున్నా.. అది చర్చ కాదు కేవలం భజనేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ అంశాన్ని తీసుకున్నా సభ్యులందరూ సీఎం చంద్రబాబును, ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం తప్ప సమస్యలను ఎత్తిచూపిన సందర్భాల్లేవు. ఒకే అంశంపై ఐదారుగురు ఎమ్మెల్యేల ఊకదంపుడు ఉపన్యాసాలు, దానిపై సంబంధిత మంత్రి సమాధానం, తర్వాత సీఎం ఉపన్యాసం ఇలా.. ప్రతిరోజూ రొటీన్‌గా సాగిపోయాయి. ఓ అంశంపై మంత్రి సుదీర్ఘంగా జవాబిచ్చాక కూడా సీఎం మళ్లీ గంటకుపైగా అదే అంశంపై ప్రసంగించడం అధికారపక్ష సభ్యులకు బోరు కొట్టించింది. ఇలా చెప్పిన విషయాల్నే మళ్లీమళ్లీ గంటల తరబడి చెప్పుకుని సమయాన్ని వృథా చేయడం తప్ప అర్థవంతమైన చర్చ ఎక్కడ జరిగిందని కొందరు టీడీపీ నేతలే ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఈ ప్రసంగాలతో విసుగెత్తి చాలామంది అధికారపార్టీ సభ్యులు సభలోకి రాకపోవడం రివాజుగా మారింది. దీన్నిబట్టే సభ ఎంత సీరియస్‌గా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన నేపథ్యంలో వారిని సభకు తీసుకొచ్చేందుకు అధికారపక్షం ఎటువంటి ప్రయత్నం చేయలేదు సరికదా కనీసం ఆ ఆలోచన కూడా చేయకపోవడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. 67 గంటలు.. : శీతాకాల అసెంబ్లీ సమావేశాలు 67 గంటల 48 నిమిషాలపాటు జరగ్గా, మండలి సమావేశాలు 51 గంటలపాటు జరిగాయి. అసెంబ్లీలో 94 ప్రధాన ప్రశ్నలకు మంత్రులు సమాధానమివ్వగా, 13 స్వల్ప నోటీసు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 74వ నిబంధన కింద ఏడు అంశాలపై, 344వ నిబంధన కింద ఎనిమిది అంశాలపై చర్చలు జరిగాయి. 16 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు తీర్మానాలకు ఆమోదం లభించింది. సభ్యులు 382 ప్రసంగాలు చేయగా, బీసీ సంక్షేమంపై ఒక నివేదికను ప్రవేశపెట్టారు. పదంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో వంద ప్రధాన ప్రశ్నలకు మంత్రులు జవాబిచ్చారు.