Palani Swami
-
అమ్మ డీఎంకే పేరుతో సెల్వం కొత్తపార్టీ..!
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు. ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది. ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం. -
Tamilnadu: ఢిల్లీలో చక్రం తిప్పే తమిళ తంబి ఎవరో..?
డీఎంకే అధ్యక్షుడు, సీఎంగా ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎంగా పళణిస్వామి జాతీయ రాజకీయాల్లో రాణించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను ఈ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో పళణి స్వామికి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చునే అవకాశం రావడం అన్నాడీఎంకే వర్గాల్లో అమితానందాన్ని నింపింది. ఇక బెంగళూరులో జరిగిన ఐ.ఎన్.డి.ఐ.ఎ భేటీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడంతో పాటు జాతీయ స్థాయి ప్రతిపక్షాల కూటమిలో స్టాలిన్‌కు సముచిత స్థానం దక్కడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనే చర్చ జోరందుకుంది. సాక్షి, చైన్నె: జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర ఎప్పుడూ కీలకంగానే ఉంటున్నాయి. దివంగత నేతలు కామరాజర్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి వారు జాతీయ రాజకీయాలలో రాణించిన వారే. అయితే, జాతీయ రాజకీయాలను శాసించిన ఘనత మాత్రం దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి, మాజీ సీఎం జయలలితలకే దక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో కుప్ప కూలడంలో జయలలిత కీలక పాత్రే పోషించారు. ఇక, యూపీఏ అధికారంలోకి రావడంతో పాటు, ఆ కేబినెట్లలో అత్యధిక స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో తమిళ ఖ్యాతిని చాటిన నేత మాత్రం కరుణానిధి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ జీవించి లేరు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే ముక్కలు కావడం ,నాయకత్వ లోటు నెలకొనడం వంటి పరిణామాలలో ఆ పార్టీని తన గుప్పెట్లోకి తీసుకుని బల నిరూపణలో పళణి స్వామి సఫలీకృతులు అవుతున్నారు. అదే సమయంలో కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టి గత లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను స్టాలిన్ చాటుకున్నారు. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తాజాగా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహానాయకులు ప్రస్తుతం జీవించి లేకున్నా, ఆ పార్టీల బలాన్ని అస్త్రంగా చేసుకుని ఢిల్లీ పెద్దలు స్టాలిన్, పన్నీరు సెల్వంకు ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పళణికి మోదీ అభయం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టమే కాకుండా, తన బలాన్ని చాటే ప్రయత్నాలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఎన్డీఏ కూటమిలోని అన్నాడీఎంకేకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన్యం ఇవ్వడమే కాకుండా, ఢిల్లీలో జరిగిన సమావేశానికి తనను ఆహ్వానించడం పళణి స్వామిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే కూర్చోవడమే కాకుండా, సమావేశానికి హాజరైన నేతలందరినీ కలిసి తన ఉనికి చాటుకునే విధంగా పళణి జోరు పెంచడం గమనార్హం. ఈ సమావేశం ముగించుకుని బుధవారం చైన్నెకు చేరుకున్న పళణిలో మరింత ఉత్సాహం తొణికిసలాడడం.. ప్రత్యర్థి పన్నీరు సెల్వాన్ని మరింత షాక్‌కు గురి చేసింది. రానున్న ఎన్నికల ద్వారా జాతీయ స్థాయిలో సత్తాచాటాలంటే అత్యధిక ఎంపీ స్థానాల కైవసం చేసుకోవాలని పళణి భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమికి నేతృత్వం వహించి అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా తన బలాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇక, రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఉంటుందని పళణి స్పష్టం చేయడం విశేషం. జాతీయ స్థాయిలో తాము ఎన్డీఏతోనే ఉంటామని, రాష్ట్రానికి వచ్చేసరికి అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన డీఎంకేకు మున్ముందు అన్నీ ఓటములే ఎదురుకానున్నాయంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తిరుగులేని స్టాలిన్.. స్టాలిన్‌కు జాతీయస్థాయి నేతలతో ఎప్పటి నుంచో పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరుణానిధి ప్రతినిధిగా అప్పట్లో ఆయన అనేక పార్టీల నేతలను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో రాణించే ప్రయత్నాలకు కలిసి వస్తోంది. దేశంలో కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ డీఎంకే. ఇది వరకు కాంగ్రెస్ కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే, ప్రస్తుతం రెండు రోజుల సమావేశానంతరం బెంగళూరు వేదికగా కొత్తగా ఆవిర్భవించిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఐఎన్డీఐఏ–ఇండియా)లోనూ అదే ఊపును కొనసాగించే వ్యూహాలకు పదును పెట్టింది. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పక్కనే కూర్చోవడమే కాకుండా, సోనియా, మమత, నితీష్‌కుమార్ , శరద్ పవార్, కేజ్రీవాల్ వంటి నేతలతో స్టాలిన్ కలిసి పోవడం గమనార్హం. తన ప్రసంగంలోనూ జాతీయ స్థాయి అంశాలను పదే పదేస్టాలిన్ ప్రస్తావించడాన్ని బట్టి మున్ముందు ఢిల్లీలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఆయన ఏ మేరకు సఫలీకృతులు అవు తారో 2024 వరకు వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటుగా తమిళనాడులోని 40 స్థానాలను కై వశం చేసుకుని జాతీయ స్థాయిలో తన బలాన్ని చాటేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అన్నా డీఎంకే, బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సమావేశంలో పళణి స్వామిని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇకపై వారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా..? ఇదే హాస్యాస్పదం అని స్టాలిన్ చమత్కరించడం గమనార్హం. -
నాయకుడొచ్చాడు..! అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి
అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు. నూతనోత్సాహంతో.. సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్‌ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి. అంగీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు. ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్‌కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం. -
పళణి కేసులో సాక్షిగా పన్నీరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది. సేలం సబ్ రిజిస్టార్, బ్యాంక్ మేనేజర్‌తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్ హోదాలో పళణి స్వామి నామినేషన్‌ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రెండేళ్లలో 30 వేల కోట్లు మింగేశారు
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లు కొల్లగొట్టిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. రాష్ట్రం హత్యలతో అట్టుడుకుతోందని , రోజుకు కనీసం ఆరేడు హత్య ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆదివారం చైన్నె నుంచి సేలంకు పళణి స్వామి వెళ్లారు. ఆయనకు కొంగనాపురంలో పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పాలనలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులు, అనేక పనులు ప్రస్తుతం ముగిశాయని, వాటిని డీఎంకే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినట్లు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సేలం జిల్లాను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని, తాను ఈ జిల్లా వాడిననే కారణంతో ఇక్కడి ప్రజలపై సవతి తల్లి ప్రేమను డీఎంకే పాలకులు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే పాలకులు కొత్త చేపట్టిన పనులు ఏ ఒక్కటీ లేవని, కపట నాటకాలు, కళ్లబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజుకు ఆరేడు హత్య ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయని వివరించారు. యువత మత్తుకు బానిసయ్యే విధంగా గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలు రాష్ట్రంలో జోరందుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్రీడా మైదానాలు, కల్యాణ వేదికలలోకి మద్యం సరఫరా అంటూ , రాష్ట్రాన్ని మత్తులో ముంచే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచిత్ర పాలన సాగుతోందని, ఈ అసమర్థ సీఎం కారణంగా ప్రజలు మున్ముందు అష్టకష్టాలు పడే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయన్నారు. రెండేళ్ల పాలనలో రూ. 30 వేల కోట్లను మింగేశారని ఆరోపించారు. పాలకుల అవినీతి అక్రమాలపై ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ చేసినట్టుగా ప్రచారంలో ఉన్న ఆడియో గురించి సీఎం స్టాలిన్ స్పందించక పోవడం శోచనీయమని విమర్శించారు. -
పళనికి అమిత్ షా అభయం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ఎడపాడి కే పళనిస్వామి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా పళనికి తన అభయాన్ని అమిత్ షా ఇస్తూ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీరుసెల్వం మధ్య జరుగుతున్న వార్ క్లైమాక్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పూర్తిగా పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం ఢిల్లీకి పళని వెళ్లారు. ముందుగా సేలంలోని తన స్వగ్రామం శిలువం పట్టిలోని మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన కుంభాభిషేక ఉత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. అనంతరం కోయంబత్తూరు చేరుకున్న పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు కోయంబత్తూరు విమానాశ్రయంలో అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. పార్టీ నేతలు తంగమణి, ఎస్పీ వేలుమణిలతో కలిసి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి పళనిస్వామి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, ఎంపీలు సీవీ షణ్ముగం, తంబిదురై, చంద్రశేఖర్ పళనికి ఆహ్వానం పలికారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య అర గంటకు పైగా తమిళ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించే విధంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరచూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై అమిత్ షాకు పళణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే, లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. ఈసందర్భంగా పళని స్వామికి అమిత్ షా అభయాన్ని ఇచ్చినట్టు తెలిసింది. అన్ని వ్యవహారాలను తాను చూసుకుంటానని, తమిళనాడులో కూటమి అధిక స్థానాల్ని కై వసం చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా పళనికి సూచించినట్టు తెలిసింది. -
పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పదవికి ఎసరు పెట్టేందుకు పళణి శిబిరం సిద్ధమైంది. బుధవారం స్పీకర్ అప్పావును కలిసి అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి కోర్టు తీర్పుపై చర్చించారు. వివరాలు.. అన్నాడీఎంకే ఆధిపత్య సమరంలో కోర్టు తీర్పుతో పళణి స్వామి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం పార్టీపై పట్టు బిగించే పనిలో పళణి నిమగ్నం అయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పన్నీరును బయటకుపంపించడం, కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం వంటి అంశాలను పళణి శిబిరం పరిగణనలోకి తీసుకుంది. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది వరకే పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే శాసన సభాపక్షం తీర్మానం చేసినా, స్పీకర్ అప్పావు ఇంత వరకు స్పందించ లేదు. పన్నీరును తప్పించి ఆ పదవిలో తమ శిబిరం నేత ఆర్బీ ఉదయకుమార్‌ను నియమించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో సభలో పళణి, పన్నీరు పక్క పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈసారి వదలి పెట్టం.. ఇది వరకు వ్యవహారం కోర్టులో ఉండడంతో స్పీకర్ ఉప నేత పదవి విషయంగా ఆచీ తూచీ స్పందించారు. పన్నీరును ఆ సీటులో కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవహారంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం,ప్రధాన కార్యదర్శి పదవిని తమ నేత పళని స్వామి స్వీకరించడంతో ఇక, పన్నీరును ఆ సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీశాతం ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి బుధవారం స్పీకర్ అప్పావును కలిసి విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎలా ఉప నేత సీటులో కూర్చోబెడుతారని, తక్షణం ఆయన్ని తప్పించి, ఆర్బీ ఉదయకుమార్ ఆ స్థానంలో నియమించాలని కోరారు. స్పీకర్ ఒకటి రెండు రోజుల్లో స్పందించని పక్షంలో ఎమ్మెల్యేలతో సభను స్తంభింప చేయడానికి పళణి స్వామి సిద్ధం అవుతుండడం గమనార్హం. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం అసెంబ్లీలో పళణిస్వామి అడుగుపెట్టగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది మరీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం వెలువడ్డ తీర్పునకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్‌లు సైతం వేర్వేరుగా పళణికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. అందుకే బుధవారం జరగాల్సిన విచారణ ఒక రోజు వెనక్కి వెళ్లింది. -
రాజకీయరంగంలో సంచలనంగా పళని ప్రస్థానం
తెల్ల చొక్కా, తెల్ల పంచె, నుదుటున విభూదితో కనిపించే పళణి స్వామి ప్రస్థానం తమిళ రాజకీయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. 1954లో సేలం జిల్లా శిలువం పాళయం అనే గ్రామంలో ఆయన జన్మించారు. కోనేటి పట్టిలో బెల్లం వ్యాపారంలో రాణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైన సమయంలో 1989లో జయలలిత శిబిరం ఎమ్మెల్యేగా ఎడపాడి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటి నుంచి ఎడపాడి ఆయన ఇంటి పేరుగా మారింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయాలతో దూసుకొచ్చిన పళణి స్వామి 2011లో తొలిసారి మంత్రి అయ్యారు. 2016లో మరో మారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అనూహ్యంగా పళణి స్వామి శాసన సభ పక్ష నేతగా మారారు. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తూ, తన ప్రతినిధిగా పళని స్వామిని ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తదుపరి పళనిస్వామి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ, ఎత్తుకు పై ఎత్తులతో శశికళ శిబిరాన్నే పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వంను అక్కున చేర్చుకుని జంట నాయకత్వంతో ముందుకెళ్లారు. ఎంత కాలం ఈ ప్రభుత్వం కొనసాగుతుందో అని అనుమానం వ్యక్తం చేసిన వారికి తన మార్కు పాలనతో సమాధానం చెప్పారు. ప్రజల మన్ననలే కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, గౌరవప్రదంగా 65కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టి.. తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక చివరికి అన్నాడీఎంకేలో తిరుగు లేని నేతగా మారి జయలలిత తర్వాత ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. :: సాక్షి, చైన్నె ప్రతినిధి -
తమిళనాట ట్విస్ట్.. పళనిస్వామి సంచలన నిర్ణయం?
సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీతో తెగదెంపులకు పళని శిబిరం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు రెండాకుల గుర్తు దక్కినా..దక్కకున్నా ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని నిలబెట్టి తీరుతారలని పళని స్వామి భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలతో ఆదివారం జరిపిన చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పరుగులు.. మరోవైవు ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా డీఎంకే దూసుకెళ్తోంది. 50 వేల ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా 11 మంది మంత్రులు, 22 మంది ముఖ్య నేతలు ఇంటింటికీ వెళ్లి ఓట్ల వేటలో ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎండీకే కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పనులు ప్రారంభించారు. అయితే అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ చర్చలు, సమీక్షలు, సమావేశాలకే పరిమితమైంది. ప్రధానంగా జాతీయ పార్టీ బీజేపీ మద్దతు కోసం అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళణి స్వామి శిబిరాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు ముఖ్య నేతలను ఇప్పటికే ఇరు శిబిరాల ప్రతినిధులు వేర్వేరుగా కలిసి మద్దతు కోరారు. అధికారికంగా బీజేపీ నుంచి ఇంత వరకు ఏ శిబిరానికీ మద్దతు దక్కలేదు. దీంతో తమ అభ్యర్థిని ప్రకటించాలని పళని శిబిరం నిర్ణయించింది. తీవ్ర ప్రయత్నాలు.. రెండాకుల గుర్తు కోసం సోమవారం సుప్రీంకోర్టులో పళని స్వామి శిబిరం చివరి ప్రయత్నం చేయనుంది. కేంద్రం మద్దతు ఉన్న పక్షంలో ఎన్నికల యంత్రాంగం ద్వారా గుర్తుతో పాటు, బీఫాంలో సంతకం పెట్టే అధికారం తనకు దక్కుతుందని ఇన్నాళ్లూ పళని స్వామి భావించారు. అయితే బీజేపీ ఏ విషయాన్నీ స్పష్టం చేయకపోవడం ఆయన్ని కలవరంలో పడేసింది. దీంతో, ఆదివారం ఈరోడ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో రెండాకుల చిహ్నం కోసం చివరి వరకు ప్రయత్నిద్దామని, అది దక్కని పక్షంలో స్వతంత్రంగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికకు గాను.. మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఈరోడ్ కార్పొరేషన్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శివకుమార్ వ్యవహరించనున్నారు. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులకు కఠిన ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు కార్యాలయంలోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఊరేగింపుగా వచ్చే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే ఆపేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సైతం తమ వాహనాలను అక్కడే ఆపేసి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఎన్నికల ఖర్చు తదితర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం మంగళవారం ఈరోడ్‌కు రానుంది. ఇప్పటికే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎంకే వర్గాలపై పదుల సంఖ్యలో కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తూర్పు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా రూ. 2 వేలు, రూ. 500 నోట్ల చెలామణి పెరగడం గమనార్హం. -
ప్లాన్ మార్చిన పళణి స్వామి.. జంబో జట్టుతో వ్యూహరచన!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేడయమే లక్ష్యంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలో జంబో జట్టును గురువారం రంగంలోకి దించారు. ఇందులో పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే మంత్రులు 11 మందితో పాటుగా ముఖ్య నేతలు 31 మంది ఓట్ల వేటలో ఉన్నారు. వీరంతా ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తానేమి తక్కువ కాదని చాటే విధంగా తన సొంత జిల్లా సేలంకు పొరుగున ఉన్న ఈరోడ్ తూర్పు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం రూపంలో ఏదేని చిక్కులు , సమస్యలు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ తూర్పులో గెలుపే లక్ష్యంగా ఎన్నికల కోసం జంబో జట్టును రంగంలోకి దించారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలోని ఈ జట్టులో పార్టీ ప్రిసీడియం చైర్మన్, మాజీమంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వీరందరితో గురువారం ఈరోడ్‌లో పళణి స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీ పెద్దలే కారణం.. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు ఢిల్లీ పెద్దలే కారణం అని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన పార్టీని చిన్నాభిన్నం చేయడంలో ఢిల్లీ పాత్రే ఎక్కువగా ఉందని గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఇక ఉప ఎన్నికల విషయంపై పన్నీరుసెల్వం మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మిత్రులను కలిసి మద్దతు వేటలో ఉన్న ఆయన శిబిరం నేతలు ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గం వైపుగా వెళ్లక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈవీకేఎస్‌కు మద్దతు ప్రకటించిన మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్, స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల పాటు పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా రు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. అలాగే ఎన్నికల విధుల్లోకి రానున్న 550 మంది టీచర్ల జాబితాను సిద్ధం చేసి ప్రకటించారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు షాకిచ్చిన సీఎం నితీశ్ కుమార్ -
తమిళనాట కోల్డ్‌వార్: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. ఏం జరుగనుంది?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య జరుగుతున్న వార్ గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈనెల 11వ తేదీ చెన్నైలో పళనిస్వామి నేతృత్వంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని పన్నీరు సెల్వం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఈ సమావేశం వేదికగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీని రద్దు చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపికయ్యారు. అలాగే అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం అండ్ బృందాన్ని సాగనంపే విధంగా తీర్మానాలు చేశారు. దీంతో ఈ సమావేశానికి, ఇందులో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ సమావేశం నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పళని స్వామి తరఫున కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీమంత్రి ఎస్పీ వేలుమణి గురువారం సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో తమ వాదన వినాలని కోరారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి ఉన్న ప్రాధాన్యత, అధికారాల గురించి ఆ పిటిషన్లో వివరించారు. ఇది కూడా చదవండి: ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు -
అన్నాడీఎంకే పంచాయతీ: ఢిల్లీలో పళని.. గల్లీలో పన్నీర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేపై పట్టు సాధించిన పళనిస్వామి ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు నేతలను కలుసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పార్టీ అంతర్గత పోరులో వెనుకబడిన పన్నీరు సెల్వం చెన్నైలో ఉంటూ పిటీషన్ల పర్వం కొనసాగిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య భగ్గుమన్న విబేధాలు అన్నాడీఎంకే చీలికదిశగా సాగు తు న్నాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఎన్నికైన∙వెంటనే పనిలోపనిగా ఓపీఎస్ పనిపట్టడం ప్రారంభించారు. పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు రవీంద్రనాథ్, జయప్రదీప్ ఇతర మద్దతుదారులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశారు. అంతేగాక కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తప్పించి, అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీర్ కుమారుడైన తేనీ లోక్‌సభ సభ్యుడు రవీంద్రనా«థ్‌కు అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత హోదా నుంచి కూడా తప్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎడపాడి ఇటీవల లేఖ రాశారు. పార్టీ కార్యాల యం ధ్వంసం చేసి, ఖరీదైన వస్తువులను, కొన్ని పత్రా లను అపహరించినట్లుగా ఎడపాడి మద్దతుదారైన సీవీ షణ్ముగం ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఓపీఎస్, వైద్యలింగం, మనోజ్‌పాండియన్ సహా 9 మందిపై చర్య తీసుకోవాలని కోరుతూ చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బిజీబిజీగా ఓపీఎస్ రాష్ట్రంలో పరిస్థితులను పక్కనబెట్టి.. ఎడపాడి పళనిస్వామి దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఈపీఎస్ శనివారం ఢిల్లీ పెద్దలను కలవడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. అలాగే, శుక్రవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు విందులో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. ఎడపాడి ఢిల్లీలో మరో రెండురోజులుండి పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, పన్నీర్ వైఖరిని మోదీకి వివరించనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ సభలకు ఎడపాడిని మాత్రమే కేంద్రం ఆహ్వానించినట్లు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఆర్బీ ఉదయ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని కేంద్రం అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్పీకర్‌కు ఓపీఎస్ లేఖ తనను అన్నాడీఎంకే నుంచి తొలగించినట్లుగా ఎడపాడి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ పన్నీర్‌సెల్వం, తేనీ ఎంపీ రవీంద్రనాథ్ శనివారం ఓ లేఖ పంపారు. ఈపీఎస్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదనే వివాదం న్యాయస్థానంలో విచారణ దశలో ఉందని, ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఓపీఎస్ రాసిన ఉత్తరం పరిశీలనలో ఉందని అందులో పేర్కొన్నారు. ఈసీ రికార్డుల్లో పార్టీ కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వమే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన అనుమతి లేకుండా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 11వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చట్టబద్ధత లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలి కాగా అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని ఆ పార్టీ కన్వీనర్ హోదాలో ఓ పన్నీర్‌సెల్వం రిజర్వు బ్యాంకు చెన్నై మండల డైరెక్టర్‌కు శనివారం లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చే వరకు అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయాలని కోరారు. ఈసీ రికార్డుల్లో తానే కన్వీనర్, కోశాధికారినని, ఇందుకు సంబంధించిన రికార్డులను ఇప్పటికే ఈసీకి సమర్పించానని అందులో స్పష్టం చశారు. -
తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళనిస్వామికి సన్నిహితుడైన కాంట్రాక్టరు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఎడపాడికి.. మదురైకి చెందిన మురుగవేల్, ఆయన కుమారులు అత్యంత సన్నిహితులు. ఎడపాడి ద్వారా 2016 నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు పొంది భారీస్థాయిలో ఆర్జించారు. అయితే ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. తవ్వేకొద్దీ అవినీతి బయటపడటంతో రెండోరోజైన గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. మదురై, దిండుగల్లు జిల్లాల్లో 15కు పైగా భవన నిర్మాణ కంపెనీల నుంచి రూ.27 కోట్ల నగదు, 3 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
బాహుబలి క్లైమాక్స్ కూడా తక్కువే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!
ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది. సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్ చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్‌సెల్వం కోపం కట్టలు తెంచుకుంది. ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్‌సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఇరువర్గాలు ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్‌సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్‌సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. చదవండి: సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! -
‘నేనే నెంబర్ వన్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కో–కన్వీనర్ పదవీ కాలం చెల్లిపోయినందున ఇకపై తాను పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శినని ఎడపాడి పళనిస్వామి తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్‌తో అన్నాడీఎంకేలో అంతర్గత పోరు మరో మలుపు తిరిగింది. జయ మరణం తరువాత కన్వీనర్, కో–కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి వ్యవహరించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి వర్గీయులు తెరపైకి తేవడంతో ఓపీఎస్, ఈపీఎస్ మధ్య నిప్పురాజుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఎడపాడి ఈనెల 11వ తేదీ జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన అనుమతి లేకుండా నిర్వహించే జనరల్‌బాడీ సమావేశం, అందులో చేసే తీర్మానాలు చెల్లవని ఓపీఎస్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎడపాడి తనను తాను పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడం చర్చకు దారితీసింది. కన్వీనర్‌గా పన్నీర్‌సెల్వం గడువు ముగిసిపోయినందున కోశాధికారి పదవి నుంచి సైతం అతడిని తప్పించేందుకు ఎడపాడి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. కో కన్వీనర్‌గా ఉన్న ఎడపాడి పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ప్రకటించుకోవడంతో పన్నీర్ చేతిలోని కోశాధికారి పదవిపై పలువురు పోటీపడుతున్నారు. ఎడపాడి వర్గీయులైన సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్ కోశాధికారి పగ్గాలు చేపట్టేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా సర్వసభ్య సమావేశ కార్యవర్గం ఎడపాడికి మద్దతు పలుకుతూ ఉత్తరం రాసింది. అంతేగాక జిల్లాల్లో మద్దతు తీర్మానాలు చేయడం ప్రారంభించింది. -
ఎస్ఈసీ చెంతకు అన్నాడీఎంకే పంచాయితీ.. పన్నీరు సెల్వం ఫిర్యాదు, పళని స్వామి వ్యూహాలు
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్‌కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు. పెరిగిన బలం పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్‌ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్ -
ఢిల్లీలో ‘రెండాకుల’ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు ముదిరింది. ఆ పార్టీలో నెలకొన్న రాజకీయ పంచాయితీ హస్తినకు చేరుకుంది. ఎడపాడి ఎత్తుగడలను అడ్డుకునేలా ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న ధ్వంధ నాయకత్వానికి తెరదించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి పళనిస్వామి తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని పన్నీర్‌సెల్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సుమారు పదిరోజులకు పైగా సాగిన ఈ ఆధిపత్యపోరు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విశ్వరూపం దాల్చింది. మెజారిటీ కార్యవర్గం ఎడపాడికి మద్దతుగా నిలవడంతో పన్నీర్ వేసిన పాచికలు పారలేదు. తనకు అనుకూలంగా ఓపీఎస్ రూపొందించిన 23 తీర్మానాలు ఆమోదం పొందక వీగిపోయాయి. ప్రిసీడియం శాశ్వత చైర్మన్‌గా తమిళ్‌మగన్ హుస్సేన్ ఎంపికైనట్లు గురువారం నాటి సమావేశంలో ఈపీఎస్ ప్రకటించారు. జూలై 11 వ తేదీన మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ఈపీఎస్ వర్గానికి చెందిన మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన విజ్ఞప్తిని ప్రిసీడియం చైర్మన్ గురువారం నాటి సమావేశంలో అనుమతించారు. ఏక నాయకత్వంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీవీ షణ్ముగం అదే వేదికపై ప్రకటించారు. రాజధానికి చేరుకున్న ఓపీఎస్ సర్వసభ్య సమావేశం మొత్తం ఈపీఎస్‌కు అనుకూలంగా మారడంతో కినుక వహించిన పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో కలిసి వాకౌట్ చేశారు. అందరూ కలిసి గురువారం రాత్రే ఢిల్లీ విమానం ఎక్కేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి పార్టీలో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతేగాక జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరుపకుండా స్టే విధించాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్‌గా ఉన్న తన అనుమతి లేకుండా ప్రిసీడియం చైర్మన్‌ను ఎన్నుకున్నారని, ప్రధాన కార్యదర్శి పదవి లేనందున కన్వీనర్, కో కన్వీనర్ పదవులను ఏర్పాటు చేసుకున్నామని అందులో వివరించారు. ప్రధాన కార్యదర్శి పదవిని చట్టవిరుద్ధంగా పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఈసీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. రాజీకి ససేమిరా వివాదాలను పక్కనపెట్టి సామరస్యం దిశగా ముందుకు సాగేలా ఓపీఎస్ వర్గం చేసిన ప్రతిపాదనను ఈపీఎస్ వర్గం తోసిపుచ్చింది. ఏక నాయకత్వాన్నే కోరుతున్నామని మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి పావులు కదిపేలా పన్నీర్‌సెల్వం చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టేందుకు ఎడపాడి పళనిస్వామి చెన్నైలో చట్ట నిపుణులతో శుక్రవారం చర్చలు జరిపారు. ఎత్తుకు పైఎత్తువేసి పన్నీర్‌ను పడగొట్టాలని మద్దతుదారులతో సమావేశమయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ల పదవీకాలం ముగిసినందున ప్రిసీడియం చైర్మన్ మాటే పార్టీలో చెల్లుబాటు అవుతుందని సీవీ షణ్ముగం మీడియాతో శుక్రవారం అన్నారు. పన్నీర్‌సెల్వం ప్రస్తుతం పార్టీ కన్వీనర్ కాదు, కోశాధికారి మాత్రమేనని వ్యాఖ్యానించారు. జనరల్‌బాడీ సభ్యుల నుంచి ఐదుశాతం హాజరీ ఉంటే సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఎడపాడి అనుమతిస్తే ఓపీఎస్‌ను కలిసి చర్చలు జరుపుతానని ప్రిసీడియం చైర్మన్ చెప్పారు. చదవండి: EPS - OPS Clash: పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు విసిరిన ఈపీఎస్ వర్గీయులు -
అన్నాడీఎంకేలో ముదిరిన ఆధిపత్య పోరు.. నేనంటే నేనని..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంపై సర్వాధికారం తనదేనని, ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం పట్టుదలతో ఉన్నారు. మెజారిటీ శ్రేణులు తనవైపే ఉంటే పన్నీర్‌సెల్వం నాయకత్వం ఎలా సాధ్యమంటూ ఎడపాడి పళనిస్వామి మెట్టుదిగలేదు. ఎవరికివారు చేసుకుంటున్న సన్నాహాలతో అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది. అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీ రామచంద్రన్ ఆ పార్టీ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన మరణించిన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ గౌరవార్థం అధ్యక్ష పదవిని అలాగే ఉంచి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జయ మరణం తరువాత ఎడపాడి, పన్నీర్‌సెల్వం సమ ఉజ్జీవులుగా మారారు. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి పార్టీ బాధ్యతలను సమానంగా పంచుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయిన తరువాత పార్టీలో ఏక నాయకత్వం నినాదం తెరపైకి వచ్చింది. ఈనెల 23వ తేదీ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగనున్న తరుణంలో ఎడపాడి పళనిస్వామికి అనుకూలంగా ఏక నాయకత్వం వివాదం విశ్వరూపం దాల్చింది. తిరువణ్ణామలైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం వెళ్లగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుకూలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పార్టీ ప్రధాన కార్యదర్శికి స్వాగతం’ ‘పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శి’ ‘అన్నాడీఎంకేకు వందేళ్లు మార్గదర్శకంగా నిలిచే నేత’ తదితర నినాదాలతో ఎడపాడి అనుచరులు ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపాయి. అలాగే ఎడపాడి పళనిస్వామి సొంతూరైన ఎడపాడిలో ఓపీఎస్ నాయకత్వాన్ని బలపరుస్తూ పోస్టర్లు వెలిశాయి. పార్టీ జిల్లా కార్యదర్శులు, నిర్వాహకులను ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా ఆహ్వానించి సమాలోచనలు జరిపేందుకు సన్నాహలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి తమను ఆహ్వానించడమే పార్టీకి శ్రేయస్కరమని కొందరు హితవుపలికారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని మిత్రపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమ వైఖరిని స్పష్టం చేశారు. జయకు ద్రోహం చేస్తున్న ఎడపాడి: ఓపీఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఎవరు చేపట్టినా అది జయలలితకు చేసిన ద్రోహమే అవుతుందని పరోక్షంగా ఎడపాడిని ఉద్దేశిస్తూ పన్నీర్‌సెల్వం గురువారం సాయంత్రం మీడియా ముందు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతేగాక పార్టీకి తానే శాశ్వత ప్రధాన కార్యదర్శినని ప్రకటించినట్లుగా తెలిపారు. జయలలిత హయాంలో ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు ఎదుర్కోగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తానే ప్రభుత్వాన్ని నిలబెట్టానని పన్నీర్‌సెల్వం గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ఏక నాయకత్వాన్నే కోరుకుంటే అందుకు తానే అర్హుడినని పన్నీర్‌సెల్వం వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏక నాయకత్వం అవసరం లేదని అన్నారు. అదే జరిగితే ఎలాంటిæ కారణాల చేత తనను పక్కనపెట్టేందుకు వీలులేదని చెప్పారు. పార్టీ చీలిపోకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అంగీకారం లేనిదే పార్టీ సమావేశాల్లో చేసే ఎలాంటి తీర్మానం చెల్లదని ఎడపాడిని ఓపీఎస్ స్పష్టం చేశారు. అదే జరిగితే చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని హెచ్చరించారు. స్పందించొద్దు: ఎడపాడి పన్నీర్ వైఖరి ఇలా ఉండగా ఎడపాడి పళనిస్వామి మరో కోణంలో నింపాదిగా అడుగులు వేస్తున్నారు. ఏక నాయకత్వం వ్యవహారం, పన్నీర్ చేస్తున్న ఆరోపణలపై స్పందించొద్దని తన అనుచరులను ఆదేశించారు. 23వ తేదీ జరిగే జనరల్‌బాడీ సమావేశంలో చూసుకుందామని అన్నారు. పార్టీలో పూర్తిస్థాయి పెత్తనం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య అన్నాడీఎంకేలో 4 రోజులుగా రగులుతున్న రచ్చ రసకందాయంలో పడింది. ఎడపాడి దూకుడుకు కళ్లెం వేసేందుకు పన్నీర్‌సెల్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీపై తన వైఖరిని పన్నీర్‌సెల్వం మీడియా సమావేశం ద్వారా స్పష్టతనిచ్చారు. ఇరువురి మధ్య క్యాడర్ నలిగిపోతుండగా మాజీ ఎంపీ తంబిదురై ద్వారా సామరస్యపూర్వక సంధికి కొందరు పూనుకున్నారు. -
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్‌సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్‌సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్‌సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్‌సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వమే చినమ్మ, దినకరన్‌కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట
సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. వానతీ శ్రీనివాసన్ గెలుపు బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్ విచారణను తిరస్కరించింది. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
అమ్మకు ఘన నివాళి.. మెరీనా తీరంలో ఉద్రిక్తత
సాక్షి, చెన్నై(తమిళనాడు): దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఐదో వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడల్లో అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ సమాధి సాక్షిగా కుట్రలను భగ్నం చేస్తామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పెద్దలు పన్నీరు సెల్వం, పళని స్వామి ప్రతిజ్ఞ చేశారు. గెలుపే లక్ష్యంగా అందరం ఏకం అవుదామని చిన్నమ్మ శశికళ పిలుపునిచ్చారు. ఇరు వర్గాలు అమ్మ సమాధి సాక్షిగా బల ప్రదర్శనకు దిగడంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీ.. అన్నాడీఎంకే నేతలు వాడవాడల్లో జయలలిత విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. సమాధి వద్ద నివాళులు మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్దకు నేతలు క్యూకట్టారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం(తాత్కాలిక) చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. నల్ల చొక్కాలు ధరించిన నేతలు అమ్మ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అమ్మ సేవలను గుర్తు చేస్తూ ఆమె ఆశయ సాధన లక్ష్యంగా అందరి చేత పన్నీరు సెల్వం ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు పగటి కలలు కంటున్న వారి కుట్రలను భగ్నం చేస్తామని అమ్మ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అమ్మకు నివాళులర్పించినానంతరం ఎంజీఆర్ సమా«ధి వద్దకు నేతలు వెళ్లడం సహజం. అయితే ఈసారి ఎంజీఆర్‌ను మరిచారు. అటు వైపుగా వెళ్లకుండానే నేతలు వెళ్లిపోవడం గమనార్హం బల ప్రదర్శనకు వేదికగా.. మెరీనా తీరంలోని అమ్మ సమాధి సాక్షిగా వర్ధంతి కార్యక్రమాన్ని అన్నాడీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నాయి. దీంతో మెరీనా తీరంలో ఉద్రిక్తత నెలకొంది. పన్నీరు, పళని నివాళులర్పించి వెళ్తున్న సమయంలో ఏఎంఎంకే నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీశాయి. పళని స్వామి వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దినకరన్ మద్దతుతో కొందరు దాడులకు ప్రయత్నించారని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దినకరన్ ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా మద్దతుదారులతో తరలిరావడం గమనార్హం. కన్నీటితో చిన్నమ్మ ప్రతిజ్ఞ జయలలిత నెచ్చెలి శశికళ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెన్నంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఓడించడం కోసం అందరం ఏకం అవుదామని అమ్మ సమాధి వద్ద ప్రతిజ్ఞ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలకు పరోక్షంగా చిన్నమ్మ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి గురై కన్నీటి నివాళులర్పించారు. అనంతరం అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్ సమాధి వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. -
మదురైలో మంతనాలు .. వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్‌టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది. భేటీపై ఆసక్తి తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. చెన్నైకు పళని స్వామి.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్‌తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం. చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
AIADMK: ‘ఓపీఎస్.. ఒకే నాయకత్వం’
అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. జంట నాయకత్వం వద్దు, ఒకే నాయకత్వం కావాలి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం వర్గం మరోసారి నిరసన గళం విప్పి వివాదానికి తెరదీసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అన్నాడీఎంకే పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. జయలలిత మరణం తరువాత పార్టీ ఇద్దరి (ఓపీఎస్, ఈపీఎస్) సారధ్యంలోకి వెళ్లింది. మూడోసారి గెలవడం ద్వారా హాట్రిక్ కొట్టగలమని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగినా అధికారం డీఎంకే చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి ఓటమితో కుంగిపోయిన పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్నికల అనంతరం జరిగిన తొలి సమావేశంలో అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఉప సమన్వకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మధ్య అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కోసం పోటీ నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ప్రధాన ప్రతిపక్షనేతగా ఎడపాడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉప నేతగా పన్నీర్‌సెల్వం పేరును ఎడపాడి ప్రతిపాదించారు. అధికారంలో ఉన్నా లేకున్నా నెంబర్ టూగా ఉండాలా అంటూ నిరాకరించిన పన్నీర్‌సెల్వం సీనియర్ నేతల బుజ్జగింపుల తరువాత ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీగా భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పన్నీర్, ఎడపాడి సమక్షంలో అంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఓపీఎస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ‘పార్టీకి ఏక నాయకత్వం ఉండాలి’ అంటూ ఆయన వర్గం నేతలు నినాదాలు చేయడం కలకలం రేపింది. ఈ నినాదాలు చేసిన తన వర్గం నేతలను పన్నీర్‌సెల్వం వారించనూ లేదు, ప్రోత్సహించనూ లేదు. అందరికీ నమస్కరిస్తూ లోనికి వెళ్లిపోయారు. ఆరు తీర్మానాలు కాగా సంస్థాగత ఎన్నికలు, పార్టీ పరంగా భవిష్యత్ కార్యాచరణపై కొద్దిసేపు చర్చించిన పార్టీ అధినేతలు ఈ సందర్భంగా ఆరు తీర్మానాలు చేశారు. కావేరి నదీజలాల వాటా విషయంలో తమిళనాడు హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి, మేఘధాతు ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవాలి, వరి ధాన్యాల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ జాప్యానికి ఖండన, కుటుంబ పెద్దకు రూ.1000ల హామీని నెరవేర్చకుంటే పోరాటం తదితర తీర్మానాల ఆమోదంతో సమావేశం ముగిసింది. -
AIADMK: ఉపనేత ఎంపికపై ఉడుంపట్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై : శాసనసభాపక్ష ఉప నేత ఎన్నికపై తలెత్తిన భిన్నాభిప్రాయాలతో అన్నాడీఎంకేలో మరోసారి రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఎప్పటిలాగే పార్టీ కో–ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, డిప్యూటీ కో–ఆర్డినేటర్ ఎడపాడి పళనిస్వామి పరస్పరం ఢీకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఏర్పాటైన సమావేశంలో ఎడపాడి, పన్నీర్ పోటీపడ్డారు. నాలుగేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించిన ఎడపాడినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు బహిరంగంగా గళం విప్పారు. పార్టీ అధినేతను కాబట్టి తానే సీఎం అభ్యర్థినని పన్నీర్‌సెల్వం పట్టుబట్టారు. పార్టీ ద్వితీయశ్రేణి నేతలు పన్నీర్‌సెల్వంను కలిసి పదిరోజులపాటు బుజ్జగించడంతో పట్టువీడారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడపాడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పన్నీర్‌సెల్వం తీవ్ర మనస్థాపం చెంది ఎడపాడిని అభినందించకుండానే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల్లో 65 సీట్లకే పరిమితం కావడంతో అన్నాడీఎంకేలో స్తబ్దత నెలకొంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తుండడంతో అన్నాడీఎంకేలో కదలిక వచ్చింది. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమయంలో మళ్లీ ఎడపాడి, పన్నీర్ మళ్లీ పోటీపడ్డారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిపోయింది. కొన్నిరోజుల తర్వాత నిర్వహించిన సమావేశంలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎడపాడి వైపే నిలవడంతో ఆయన పేరునే ఖరారు చేశారు. ‘టూ’ ఎంపికలో వన్ అండ్ టూ మళ్లీ ఢీ ఎన్నికలకు ముందు ఒకసారి, ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి విభేదాలతో రచ్చకెక్కిన ఎడపాడి, పన్నీర్‌సెల్వం శాసనసభాపక్ష ఉప నేత ఎంపిక విషయంలో మూడోసారి పరోక్షంగా ముష్టియుద్దం సాగిస్తున్నారు. ఉప సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంను ఎంపిక చేసుకోవాలని ఎడపాడి ఆశించారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, నేడు ప్రతిపక్షంలో ఉపనేత, తర్వాత పార్టీలో సైతం తనను ద్వితీయ స్థానానికి నెట్టే ప్రమాదం ఉందని అనుమానించిన పన్నీర్ సెల్వం అందుకు అయిష్టతను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో శాసనసభాపక్ష ఉప నేత పదవికి ద్వితీయశ్రేణి నేతల్లో పోటీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే వైద్యలింగం పట్ల పన్నీర్‌సెల్వం సుముఖుత వ్యక్తం చేస్తుండగా, దీన్ని ఎడపాడి వర్గీయులు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, నత్తం శ్రీనివాసన్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరూ ఎడపాడికి రబ్బర్‌స్టాంప్‌లా మారుతారనే విమర్శ రావడంతో మాజీ మంత్రి విజయభాస్కర్ పేరును సూచించారు. వైద్యలింగం మినహా మరెవరినీ అంగీకరించేది లేదని పన్నీర్‌సెల్వం భీష్మించుకుని కూర్చున్నారు. సీనియార్టీతోపాటు సామాజిక సమతుల్యం కూడా పాటించాలని కొందరు పేర్కొనడంతో కేపీ మునుస్వామి తదితరుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఏకాభిప్రాయానికి వస్తేగానీ ఉప నేత ఎంపిక వ్యవహారం కొలిక్కివచ్చే పరిస్థితి లేదు. చదవండి: ‘అన్నాడీఎంకే’ నా ఊపిరి: శశికళ