Parakala Prabhakar
-
నిర్మలా సీతారామన్ అల్లుడు.. మోదీకి బాగా దగ్గర!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు వాంగ్మయి వివాహం ఆడంబరాలకు దూరంగా జరిగింది. గురువారం బెంగళూరులో ఓ హోటల్లో వాంగ్మయి, ప్రతీక్ దోషీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ ప్రముఖులెవరినీ నిర్మలా సీతారామన్ ఈ వివాహానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుకున్న వాంగ్మయి.. మింట్ లాంజ్స్ బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఇక గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషి నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. నరేంద్ర మోదీకి ప్రతీక్ చాలా దగ్గర. అయితే అది చుట్టరికంగా కాదు.. మోదీతో సుదీర్ఘకాలంగానే ప్రతీక్ ప్రయాణం కొనసాగడం ద్వారా. ► గుజరాతీ అయిన ప్రతీక్ దోషి.. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయంలో(CMO)లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ప్రతీక్ పని చేశాడు. ► అటుపై 2014 నుంచి ప్రధాని కార్యాలయం(PMO) అనుబంధంగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో దోషికి జాయింట్ సెక్రటరీ ర్యాంక్ దక్కింది. ► ప్రస్తుతం ఆయన పీఎంవోలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ-OSD)గా హోదాలో కొనసాగుతున్నారు. రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ వింగ్‌లో ఆయన పనిచేస్తున్నట్లు పీఎంవో వెబ్సైట్లో ఉంది. ► పరిశోధన & వ్యూహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. భారత ప్రభుత్వ (వ్యాపార కేటాయింపు) నియమాలు, 1961 ప్రకారం.. ప్రధానమంత్రికి కార్యదర్శిగా సలహాలు ఇవ్వడమూ చేస్తున్నారు ప్రతీక్. ► ప్రతీక్.. పెద్దగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అలాగే.. చెన్నైలో పుట్టి పెరిగిన వాంగ్మయి కూడా మీడియా కంట పెద్దగా పడింది లేదు. ► వాంగ్మయి-ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ హోటల్లో ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ::: సాక్షి వెబ్‌డెస్క్ -
న్యూ ఇండియాలోకి ‘పరకాల ప్రవేశం’!
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్‌లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం. యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో! ఇటీవల నేను పరకాల ప్రభాకర్‌ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది. ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’ ‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు. ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు. మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు. పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు. మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన. ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను. ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది. ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్కు తెలిసి ఉండటం వల్లనా? ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల గుడ్‌బై
-
పరకాల రాజీనామా
సాక్షి, అమరావతి: ఢిల్లీ కేంద్రంగా బీజేపీతో లాలూచీ వ్యవహారం బట్టబయలు కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామా పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల వల్లే పరకాల రాజీనామా చేసినట్లు చెప్పుకోవడం ద్వారా బీజేపీ–టీడీపీ లాలూచీపై వ్యక్తమవుతున్న విమర్శల నుంచి కొంతవరకైనా తప్పించుకోవచ్చని, ప్రజల దృష్టిని కూడా మరల్చవచ్చనేది చంద్రబాబు వ్యూహమని తెలిసిపోతోంది. పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. ప్రతిపక్ష నాయకులు తనపై ఆరోపణలు చేస్తుండడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పరకాల పేర్కొన్నారు. ఒకపక్క రాష్ట్ర హక్కుల సాధన కోసం బీజేపీ, కేంద్రంతో పోరాడుతూ మరోవైపు తనను సలహాదారుగా కొనసాగించటంపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రెండు మూడు రోజులుగా కొందరు నేతలు దీని గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదని, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం తనను బాధించిందన్నారు. తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించాలని ప్రయత్నించడం, తెరవెనుక మంతనాలు, బేరసారాలకు సీఎం వీటిని వినియోగిస్తున్నారని విపక్ష నేత ఆరోపించారన్నారు. మరోవైపు పరకాల రాజీనామాను ఆమోదించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మిగిలింది మరో 15 రోజులే.... వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పరకాల పదవీకాలం జూలై 4నాటికి పూర్తి కానుంది. ఇంతలోనే ఆయన హఠాత్తుగా రాజీనామా నిర్ణయానికి రావటం వెనుక టీడీపీ–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని భావిస్తున్నారు. ఇక్కడ విమర్శలు.. అక్కడ వినయం కేంద్రంపై భీకరంగా పోరాడుతున్నట్లు రాష్ట్రంలో తొడగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్ర«ధాని మోదీ ఎదుట సాగిలపడడంతో వారి బంధం బట్టబయలైన విషయం తెలిసిందే. చంద్రబాబు దాగుడు మూతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మ పోరాటం పేరుతో రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టి హడావుడి చేస్తూ మోదీని, కేంద్రాన్ని అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకుని కొద్దిరోజులుగా చంద్రబాబు కాలం గడుపుతున్నారు. ఇప్పుడు బాబు ఢిల్లీ పర్యటనతో ఇదంతా ఉత్తదేనని తేలిపోయింది. పోరాటం పేరుతో డ్రామాలు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి మోదీ ఎదుట వంగిపోయి కరచాలనం చేయడంతోనే కేంద్రంపై చంద్రబాబు వైఖరి ఏమిటనేది చెప్పకనే చెప్పినట్లయింది. కేంద్రాన్ని నిలదీస్తానని చెప్పి పాత విషయాలనే ప్రస్తావించడం, వాకౌట్ చేస్తానని మౌనం దాల్చడాన్ని ప్రజలంతా గమనించారు. చంద్రబాబు పైకి కేంద్రాన్ని విమర్శిస్తున్నా అంతర్గతంగా బీజేపీతో సంబంధాలు నెరపుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారనే విషయం బహిర్గతమైంది. సోషల్ మీడియాలో కూడా బాబు గోడమీది పిల్లి వ్యవహారాన్ని నెటిజన్లు దుమ్ముదులిపేశారు. ఇది కాదా కుమ్మక్కు? సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పలుసార్లు తీవ్రంగా ఎండగట్టారు. బాబు ఇక్కడ పోరాటం చేస్తానని చెబుతూ ఢిల్లీలో మోదీ ఎదుట సాగిలపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ సలహాదారుగా ఉంటారని, మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించారని ఇదంతా బీజేపీ–టీడీపీ లాలూచీ కాదా? అని నిలదీశారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇది నిజమేనని తేలిపోవటంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు పరకాల ప్రభాకర్‌తో వ్యూహాత్మకంగా రాజీనామా చేయించినట్లు భావిస్తున్నారు. -
ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా
-
పరకాల ప్రభాకర్ రాజీనామా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. ఎన్డీయే నుంచి వైదొలగినట్టు పైకి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే త్వరలో పదవీ కాలం ముగుస్తున్న పరకాలతో రాజీనామా చేయించినట్టు చెబుతున్నారు. జూలై మొదటి వారంతో పరకాల పదవీ కాలం పూర్తి కానుంది. అయితే, ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు పరకాల తన లేఖలో పేర్కొన్నారు. తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు భంగం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు పరకాల తెలిపారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉండటం, అందులోనూ తనకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారం నేపథ్యంలోనే సలహాదారు పదవిని వదులుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. బాబు రాజకీయం? కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగినప్పటికీ తెరవెనుక బీజేపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు కేబినెట్ నుంచి వైదొలగినప్పటికీ పరకాలను చంద్రబాబు కొనసాగించారు. నాలుగేళ్ల పాటు పరకాల ప్రభుత్వంలో కొనసాగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న పరకాల టీడీపీలో చేరాలని కొంతమంది సూచించినప్పటికీ బీజేపీ నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆవిషయంపై చంద్రబాబు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం సాఫీగానే సాగినప్పటికీ పరకాల సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పదవిలో ఉండటం, చంద్రబాబు తెరవెనుక కొందరు సీనియర్ బీజేపీ నేతలతో సంబంధాల కొనసాగించడం వంటి చర్యలపై విపక్షాలు వేలెత్తి చూపేలా చేసింది. ఆ కోణంలోనే, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై యుద్ధం చేస్తామంటూనే చంద్రబాబు.. పరకాలను మీడియా సలహాదారుగా కొనసాగించడం, మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణిని టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విమర్శల నేపథ్యంలో పరస్పర అవగాహన మేరకు తాజా పరిణామం చోటుచేసుకున్నట్టుగానే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొసమెరుపు: పదవీ కాలం పూర్తవడానికి 15 రోజుల ముందు పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం చేయడం విశేషం. జూలై 5తో ఆయన పదవీ కాలం పూర్తికానుంది. -
పొమ్మనలేక.. పరకాలకు బాబు పొగ!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు హోదాలో నాలుగేళ్లపాటు కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు కార్యాలయం పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగిన అనంతరం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరకాలను దూరం పెట్టినట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా పరకాల ప్రాధాన్యాన్ని తగ్గించిన చంద్రబాబు ముఖ్యమైన అంశాల్లో ఆయన్ను సంప్రదించడంలేదని తెలిసింది. ఇటీవల కలెక్టర్ల సదస్సు సందర్భంగా పరకాల అక్కడ ఉండగానే సీఎం చంద్రబాబు ‘ఎం’ గ్రూపునకు చెందిన సంజయ్ అరోరాను ప్రభుత్వ మీడియా సలహాదారుగా పరిచయం చేశారు. తద్వారా పరకాలను పక్కనపెట్టినట్లేనని భావిస్తున్నారు. తనంతట తానే వెళ్లిపోయే వ్యూహం ఇన్నాళ్లూ కీలకంగా ఉన్న పరకాల ప్రాధాన్యాన్ని చంద్రబాబు కొద్దిరోజుల నుంచి అనూహ్యంగా తగ్గించేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఇక ఆయనతో అవసరం లేదనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుండడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. పరకాల ప్రభుత్వంలో ఉంటే తమకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, ఇతర వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన్ను పక్కనపెడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పొమ్మనకుండా పొగ బెడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన స్థానంలో సంజయ్ అరోరాను మీడియా సలహాదారుగా చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఒకటికి రెండుసార్లు పరిచయం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం, మీడియా మేనేజ్మెంట్ గురించి సంజయ్ ఆరోరాతో ప్రజెంటేషన్ ఇప్పించారు. మీడియా సలహాదారు, సమాచార శాఖ కమిషనర్‌ను కాదని కొద్దిరోజులుగా చంద్రబాబు ప్రచార వ్యవహారాలు చూస్తున్న సంజయ్‌తో ప్రజెంటేషన్ ఇప్పించడం, ఆయన్ను కమ్యూనికేషన్ సలహాదారుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. పరకాల ప్రభాకర్‌ను 2014లో ప్రభుత్వ మీడియా సలహాదారుగా సీఎం చంద్రబాబు నియమించారు. పరకాల అప్పటి నుంచి మీడియా విషయాలే కాకుండా ప్రభుత్వ, టీడీపీ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంటూ వచ్చారు. -
ఏపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలు ఆమోదం పొందాయా.. లేదా అనేది తమకు తెలియదని పరకాల చెప్పారు. 'ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు. కాగా, నేటి ఉదయం కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిని విషయం తెలిసిందే. ఆ మేరకు తమ రాజీనామా లేఖలను బీజేపీ నేతలు గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు తమ అధికారిక వాహనాలు, ఐడీ కార్డులను సంబంధిత అధికారులకు అప్పగించారు. -
ప్రజారోగ్యం కోసం ప్రపంచబ్యాంకు రుణం
-
ప్రజారోగ్యానికి ప్రపంచబ్యాంకు రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రి మండలి నిర్ణయాలను విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లతో కలసి సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. - రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.4,807 కోట్లు అవసరమని, వాటిలో ప్రపంచబ్యాంకు నుంచి 70 శాతం (రూ.3,365 కోట్లు) రుణంగాను, మిగిలిన 30 శాతం (రూ.1,442కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. - టాటా ట్రస్ట్‌కు బాలామృతం కార్యక్రమంలో పౌష్టికాహారాన్ని అందించే బాధ్యత అప్పగింత. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ట్రస్టు ద్వారా మహిళలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుంది. - రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రూ. 38,265 కోట్లతో 5 లక్షల ఇళ్ల నిర్మాణం. ఈ హౌజింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,035 కోట్లు, కేంద్రం రూ.7,500 కోట్లు భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు సమకూర్చుకుంటాడు. -
దావోస్‌లో 25 ద్వైపాక్షిక సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రపంచ ఆర్థిక వేదిక ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఈసారి బాబు 25 ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఐదు సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గాను మూడు ఒప్పందాలపై సంతకాలు చేస్తారన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా ప్రారంభ ప్లీనరీలో పాల్గొంటారని వివరించారు. రెండో రోజు ఏపీ లాంజ్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని, అదేరోజు మధ్యాహ్నం నుంచి స్థానిక ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల సీఈవోతో సమావేశమవుతారని తెలిపారు. సీఐఐ రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారని చెప్పారు. ఈనెల 25 వరకు ఈ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. సీఎం వెంట తనతో పాటు మంత్రులు యనమల, లోకేశ్, వ్యవసాయ సలహాదారుడు విజయకుమార్, ఈడీబీ సీఈవో జె.కృష్ణ్ణకిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులుంటారని తెలిపారు. -
18 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ముఖ్యమంత్రి మూడు దేశాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతుల ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్‌లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు. ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజులు అమెరికాలో, 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో, చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజులు యూకేలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో భాంగా చంద్రబాబు నాయుడుకు యూకేలో గోల్డెన్ పీకాక్ అవార్డు బహుకరించనున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. -
అంతర్గత విషయాలు బయటకు చెబుతారా?
-
అంతర్గత విషయాలు బయటకు చెబుతారా?
కృష్ణారావుది విపరీత ధోరణి: పరకాల సాక్షి, హైదరాబాద్: ఐవైఆర్ కృష్ణారావు చాలా పెద్ద మనిషి అని, అయితే ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. పరకాల హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వీసుల్లో 30 ఏళ్లకుపైగా ఐవైఆర్ అత్యుత్తమ సేవలందించారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగే విషయాలను బయటకు చెప్పరాదనే నియమాన్ని పాటించలేదన్నారు. ఆరు నెలలుగా సీఎం తనను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ఐవైఆర్ విమర్శల్లో నిజం లేదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టింగ్‌లు విపరీత ధోరణిని సూచిస్తున్నాయని, ఇలా వ్యవ హరించడాన్ని ప్రభుత్వం అత్యంత అభ్యంతరక రంగా భావించిందన్నారు. -
ఐవైఆర్ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల
-
ఐవైఆర్ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఐవైఆర్ కృష్ణారావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సీఎంను ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, ఐవైఆర్ అలా మాట్లాడతారని తాము ఊహించలేదన్నారు. పరకాల ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ కృష్ణారావు అంటే మాకు చాలా గౌరవం. రాష్ట్రానికి మీ సేవలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబుకు ఐవైఆర్‌పై చాలా నమ్మకం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చాలా పద్ధతిగా నడుస్తోంది. లోటు బడ్జెట్ ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక నిదులు కేటాయించాం. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అనుసరించి మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం. పార్టీకి భజన చేయాలని ఎవరూ అడగలేదు. అడగరు కూడా. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేయాలనే అడుగుతారు. అయితే ప్రభుత్వానికి, శాసనసభ, శాసనమండలికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై అభ్యంతరం తెలిపాం. అంతేతప్ప కృష్ణారావుపై ప్రభుత్వపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినవారిని ఐవైఆర్ సమర్థించడంలో ఔచిత్యం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి, సోషల్ మీడియా గురించి ఆయన అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐవైఆర్ నిబద్ధత, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి 'సందేహాలు లేదు. ఇప్పటికీ ఆయనపై అమితమైన గౌరవం ఉంది.’ అని అన్నారు. -
రాజధానిపై ఏప్రిల్‌లో నిష్ణాతుల కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: ఏపీ సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో నిక్షిప్తం చేయడానికి ఏర్పాటైన ‘నిష్ణాతుల కమిటీ’ ఏప్రిల్ మొదటి వారంలోగా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించింది. మలి విడత సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన ఈ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఎవరెవరు ఏయే బాధ్యతలను గడువులోగా పూర్తి చేయాలో కమిటీ నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు కుడ్యాలు, కూడళ్లు, భవంతులు, ప్రాకారాల నమూనాలను వేర్వేరుగా వర్గీకరించి తుది ఆకృతులకు దృశ్య రూపకల్పన చేసే బాధ్యతను ప్రముఖ సినీ ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్‌సాయికి అప్పగించింది. కమిటీ చేసే సూచనలు, సలహాలను అమరావతి నగర రూపశిల్పిగా ఉన్న నార్మన్ పోస్టర్ సంస్థకు త్వరలో అందించాల్సి ఉందని కమిటీ సారథి పరకాల ప్రభాకర్ తెలిపారు. -
పెట్టుబడుల కోసమే సీఎం దుబాయ్ టూర్
తిరుపతి రూరల్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలిపారు. ఈ బృందంలో తనతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. 15న మంత్రివర్గ సమావేశం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 15న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరగనుంది. -
రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం
తిరుపతి కల్చరల్ : మీడియా చాలా శక్తివంతమైందని, రాష్ట్ర వికాసానికి తన శక్తిని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కోరారు. ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్దిలో మీడియా పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఏ జర్నలిస్టు సంఘం పని చేయని విధంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఏపీజేఎఫ్ ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా, అసంబంద్ధంగా జరిగిందన్నారు. తెలంగాణకు ఆస్తులు, అంధ్రకు అప్పులు ఇచ్చారని, రాష్ట్ర విభజన నాటికి 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌ను మిగిల్చారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020 నాటికి కూడా రూ. 2500 కోట్లు లోటు బడ్జెట్లోనే మన రాష్ట్రం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పాలనాదక్షుడైన చంద్రబాబు సీఎం కావడంతో విభజన జరిగిన ఆరు నెలల్లోనే విభజన సమస్యలను మరిచిపోగలిగామన్నారు. 2050 నాటికి భావితరాలు గర్వించేలా గొప్ప రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలపాత్ర పోషిస్తోందన్నారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృపవరం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు. –––––––––– -
'కావాలనే మాపై బురద జల్లుతున్నారు'
హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం విజయవాడలో పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కావాలనే మాపై బురద జల్లుతున్నారని తెలంగాణ మంత్రిపై ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోర్టల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవిలు జరిగాయని పరకాల ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు చెప్పాలని పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
'హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి'
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే సరిపోదు.... ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడారు. ఆగస్టు 25న ముఖ్యమంత్రి చంద్రబాబు.... ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్నాళ్లు జనం మధ్యకు రావడానికే ఇబ్బంది పడిన నేతలు ఇప్పుడు టీడీపీని విమర్శించడం తగదంటూ కాంగ్రెస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. అప్రజాస్వామిక పద్దతిలో రాష్ట్రాన్ని చీల్చినవారికి ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదని పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. -
సీఎం నాలుగు రోజులు... మంత్రులు మూడు రోజులు
సాక్షి, విజయవాడ బ్యూరో: వారంలో నాలుగు రోజులు విజయవాడ నుంచే రాష్ట్ర పరిపాలన నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ నిర్ణయాలకు సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఇకపై మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు కూడా వారంలో మూడ్రోజులు విజయవాడలోనే ఉంటారన్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందులోని ఆదాయ, వ్యయాలపై ఆర్థిక రంగ నిపుణులతో సమీక్షించారన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ, అందులోని సమస్యలు, పరిష్కారాలపై కూడా అధికారులతో సమీక్షించారని తెలిపారు. -
ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం పట్టిసీమ మొదటి దశను ప్రారంభిస్తారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో మీభూమి - మీ ఇంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజున షియోమి ఫోన్ల కంపెనీ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ, మరికొన్ని జిల్లాల్లో పర్యటిస్తారని పరకాల చెప్పారు. -
పాసు పుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు
హైదరాబాద్: ఇక మీద రైతులు పట్టాదారు పాసుపుస్తకం లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు 13 వేల ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలియజేశారు. వాటి ద్వారానే రైతుల భూములు అప్లోడ్ చేస్తామన్నారు. భూ యజమానుల వివరాలతో పాటు పంటల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు. రైతుల భూమి రికార్డుల సమస్యలన్నింటినీ గ్రామసభల్లో పరిష్కరిస్తామన్నారు. అందుకోసం ఆగస్టు నెల 10 నుంచి 30 వరకు రాష్ట్రంలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ తెలిపారు. -
అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన
హైదరాబాద్: అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమవారం ప్రభుత్వానికి రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందుతుందని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సీఎం చంద్రబాబునాయుడికి ఆ ప్లాన్ అందజేస్తుందని చెప్పారు. ఆ ప్లాన్ వచ్చాక క్యాపిటల్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు.