peddireddy ramchandra reddy
-
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్
-
టీడీపీ, బీజేపీ పొత్తుపై పెద్దిరెడ్డి కౌంటర్
-
టీడీపీలో ఎంతమంది చేరిన సింహం సింగల్ గానే వస్తుంది
-
కనీవినీ ఎరుగని రీతిలో రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభ
-
సీఎం జగన్ హయాంలోనే కుప్పానికి నీరు అందింది
-
గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం
-
‘ప్రజలపై దాడులు నీతిమాలిన చర్య’.. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
సాక్షి, తిరుపతి: కుప్పంలో జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో ఇక గెలవలేమనే నిరాశతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 33 ఏళ్లుగా కుప్పానికి చంద్రబాబు చేసేందేమీ లేదని, ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్త సురేష్ ఇంటిపై దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొనేలా చంద్రబాబు ప్లాన్ చేసి.. బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి దాడులు చేయించారు. మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలతో కుప్పంలో గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య. రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ కుట్రలతో హంద్రీనీవా పనులకు ఆటంకం కల్గిస్తున్నారు. ఎన్నికల్లోపే కుప్పం కెనాల్ పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఇదీ చదవండి: నారా వెన్నులో ఓటమి వణుకు -
14 ఏళ్లు సీఎంగా వుండి చిత్తూరు జిల్లాకు ఏమీ చేయలేకపోయారు: మంత్రి పెద్దిరెడ్డి
-
kuppam: పెద్దాయన యంత్రాంగం.. మిథున్ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్‌సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా తోడయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్‌రెడ్డి కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్‌లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం. బాబు పతనం ఇలా.. ► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు. ► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు. ► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది. ► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ. ► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది. -
‘వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాదిమంది పేదల మేలు కోసమే వన్‌టైం సెటిల్మెంట్ స్కీం తీసుకువచ్చామని తెలిపారు. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో సాదకబాధకాలను కూలంకషంగా పరిశీలించాలని తెలిపారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు విడిపించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. తమ తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. -
‘25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు’
సాక్షి, అమరావతి: 25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కారించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. '' 315 మంది ఎంపీడీవోలకు 25 ఏళ్ళు ప్రమోషన్ లు లేవు. దీని వలన 18,500 మంది పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ప్రమోషన్లు రాలేదు. ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేయాలని సీఎం జగన్ భావించారు. ప్రమోషన్ల సమస్యలన్నీ పరిష్కరించాం. 255 మందికి 12 క్యాడర్ల వారికి ప్రమోషన్లే ఇచ్చాం.బయట శాఖల నుంచి ఇప్పుడు అధికారులను తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎవరు తీసుకోలేకపోయారు. సీఎం జగన్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ న్యాయం చేస్తారన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగింది. పంచాయితీరాజ్ శాఖలో ఇదొక చరిత్రగా నిలుస్తుంది. ఎంపీడీవోలందరికి ప్రమోషన్ లు వస్తాయి. గిరిజ శంకర్, కమిషనర్ ఎంపిడివోలు అభివృద్ధి లో చాలా కీలకం. ఇప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది .. కానీ ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చింది. అమర్ రాజాపై మేం ఎలాంటి రాజకీయం చెయ్యలేదు. అది వెళ్లిపోవాలని మేం కోరుకోలేదు. కానీ అమర్ రాజా నిబంధనలకు లోబడి పనిచేయాలి. చిత్తూరు జిల్లాలో 4,5 వేల ఎకరాలు భూములు తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదికలు ఆధారంగా వెళ్లాలి. వాళ్ళు హైకోర్టుకి కూడా వెళ్లారు.'' అని పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్‌కార్డు సేవలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు సీఎం జగన్ మానస పుత్రికలను పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రొబేషన్ ఎగ్జామ్‌లో ఎటువంటి రాజకీయాలు ఉండవని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి: మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు: సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గాలేరు నగరి ప్రాజెక్టుకు హంద్రీనీవాకు అనుసంధానం చేసి కుప్పం నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే రూ.550 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. తాగునీటి కోసం ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి సీఎం జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన యువతకు పలు సూచనలు చేశారు. దేశ భద్రత కోసం యువకులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైన్యంలో చేరడానికి యువకులు ఆసక్తి చూపాలని సూచించారు. సీఎం జగన్ కూడా యువకుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. యువతలో నైపుణ్య లక్షణాల అభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లాలో ఏర్పాటు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి యువకుడికి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
‘పంచాయతీ’లో విజయం మాదే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఉదారంగా ఆలోచించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చారని.. దాని ప్రకారం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ఎక్కువగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఎన్నిక ఏకగ్రీవమైన పంచాయతీలకు రెండు వేల వరకూ జనాభా ఉంటే రూ.5 లక్షలు, ఐదు వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల పైన జనాభా ఉంటే రూ.15 లక్షలు, ఆ పైన జనాభాను బట్టి రూ.20 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రజలంతా ఏకమై ఏకగ్రీవం చేసుకోవాలన్నారు. ఈ సారి చట్టంలో మార్పులు చేసి ధనం, మద్యం, డబ్బు, ప్రలోభాలతో ఎవరైనా ఎన్నికైతే అనర్హుల్ని చేయడమే కాకుండా రెండేళ్ల వరకూ శిక్ష పడేలా చట్టంలో మార్పులు తెచ్చామని పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ ప్రజలు గమనించి శాంతియుతంగా ఎన్నికలకు వెళదామనే ఆలోచన చేయాలన్నారు. కేంద్రానికి లేఖ రాస్తున్నాం సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం మేరకు కేంద్రానికి లేఖ రాస్తున్నామని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తరువాత కొంత అబ్జర్వేషన్ చేయాల్సిన పరిస్ధితి ఉందని, ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయాలి, ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే విషయాలను లేఖ ద్వారా కేంద్రానికి తెలియజేస్తామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సమాధానం మేరకు ముందుకెళతామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ తాపత్రయమని, ప్రజల భద్రత తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. -
లేకపోతే అమెరికాను మించిపోతాము
సాక్షి, చిత్తూరు : జిల్లాలో నిన్నటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉండిందని, కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్ రావటంతో ఆ సంఖ్య ఆరుకు చేరిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పాజిటివ్ కేసులలో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని, క్వారంటైన్లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితుల కోసం డాక్టర్లు 24 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. పోలీసులు కూడా బార్డర్లు లాక్ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎవరూకూడా తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లు కూడా కొత్త వ్యక్తులు ఊర్లోకి వస్తే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మారోమారు కరోనాపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. లేకపోతే అమెరికాను మించిపోతాము కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని, లేకపోతే అమెరికాను మించిపోతామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చరించారు. మైనారిటీలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, నేడు ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. కరోనా వైరస్‌కి మెడిసిన్ లేదని, స్వీయ నియంత్రణే మార్గమని చెప్పారు. అన్ని మతాల వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. -
ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : విధి నిర్వహణలో ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై అనుసరించాల్సిన చర్యలపై అధికారులకు ... ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. (21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?) గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు : గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టుషాపులు నడవకూడదని, అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టు షాపులు ఉండకూడదనే గ్రామాల్లో 11వేల మహిళా పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. బెల్టుషాపులు నిరోధమే మహిళా పోలీసులు ప్రాథమిక విధిగా పేర్కొన్నారు. వారందరికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చామని, వారిని శక్తివంతంగా వాడుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలని అధికారులకు వివరించారు. వీరితో పాటు గ్రామాల్లో మహిళా మిత్రలు కూడా ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. (26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు) సమన్వయంతో కలిసి పనిచేయండి : ఇక ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలంటు ముఖ్యమంత్రి జగన్ .. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనుల కోసం వినియోగించాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో కలిసి కట్టుగా పనిచేసి ఫలితాలు సాధించాలని తెలిపారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.(‘ఆయన చంద్రబాబు కోవర్ట్’) -
టీడీపీ హయాంలో పచ్చచొక్కాలకే పెన్షన్లు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కా వేసుకుంటే గానీ పెన్షన్లు ఇచ్చేవారు కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా పెన్షన్లు ఇస్తుంటే మాజీ సీఎం చంద్రబాబు భరించలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో భర్త ఉన్న వారికి కూడా వితంతు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. కనీస అర్హతలు కూడా చూడకుండా పెన్షన్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ కులం, మతం, ప్రాంతం చూడకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తున్నారని గుర్తుచేశారు. పెన్షన్లను తీసేస్తున్నారంటూ ప్రస్తుతం చంద్రబాబు గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక పెన్షన్ల మంజూరు విషయంలో గతంలో ఉన్న అర్హతలను కూడా సడలించి మరింత ఎక్కువ మందికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. వలంటీర్లు రేపటి నుంచి ఇంటివద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి ఒకే రోజు పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. -
పచ్చ బాబులకే.. ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: నీరు–చెట్టు నిధులను టీడీపీ దుర్వినియోగం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ‘పచ్చ’బాబుల జేబుల్లోకే ఉపాధి నిధులు వెళ్లాయన్నారు. తాను ముడుపులు తీసుకున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తున్నారని, దీన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు రాకుండా టీడీపీ లేఖలు రాస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేయిస్తామన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తాము వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని తెలిపారు. ఈ ఆరి్థక సంవత్సరంలో కూలీలకు వేతనాలను చెల్లించామన్నారు. పనులకు బిల్లులు చెల్లించాలని కేంద్రాన్ని మూడుసార్లు అడిగినా ఇవ్వలేదన్నారు. రూ.1,845 కోట్ల నిధులే వచ్చాయన్నారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సహా పలు ప్రాంతాల్లో రూ.46 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందన్నారు. స్పీకర్‌తో టీడీపీ సభ్యుల వాగ్వాదం టీడీపీ హయాంలో ఉపాధి హామీ నిధుల దురి్వనియోగంపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం ఇచి్చన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోనూ వాగ్వాదానికి దిగారు. చర్చ సందర్భంగా గత ప్రభుత్వ అవినీతిని అధికార పక్ష సభ్యులు గట్టిగా ప్రశి్నంచారు. సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఉపాధి హామీ నిధులను ఆ పార్టీ నేతలు ఇష్టానుసారం దోచేశారని విమర్శించారు. వీళ్లు చేసిన పాపానికి 417 మంది అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. 250 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. రోడ్ల నిర్మాణంలోనూ భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉదయభాను ఆరోపించారు. నారా లోకేశ్ నేతృత్వంలో ఉపాధి నిధులను పప్పు బెల్లాల్లా దోచుకున్న వైనాన్ని ప్రజల ముందుంచాలని జోగి రమేష్ కోరారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
నేతా.. కక్కిస్తా మేత!
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు–చెట్టు పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొందరు టీడీపీ నేతలు ఈ పథకాన్ని తమ జేబు సంస్థగా మార్చేశారు. చేసిన చోటే చేస్తూ.. తవ్విన చోటే తవ్వుతూ పథకాన్ని నీరుగార్చేశారు. లక్ష్యం ఎలా ఉన్నా ఇష్టారాజ్యం గా నిధులు భోంచేశారు. ప్రజాధనానికి తూట్లు పొడిచారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. మెక్కిన నిధులు కక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో చర్చించారు. దోచుకున్న నిధులను ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని స్పష్టం చేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కొందరు టీడీపీ నేతలు వణికిపోతున్నారు. సాక్షి, తిరుపతి: అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 2015 నుంచి 2018 వరకు జరిగిన నీరు–చెట్టు పనులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినీతిపరుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరి నుంచి ఎంత మొత్తం నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు. నిగ్గుతేల్చుతాం అసెంబ్లీలో గురువారం ప్రధానంగా నీరు–చెట్టు అవినీతి అంశంపైనే చర్చ సాగింది. టీడీపీ నేతలు మెక్కిన నిధులు కక్కిస్తామని పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులను విచారణకు ఆదేశిస్తామన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నేతల నుంచి నిధులు రికవరీ చేస్తామని చెప్పారు. గుండెల్లో రైళ్లు నీరు–చెట్టు పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర నివేదికకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అవినీతిపరులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి నుంచి నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు. చేసిన పనులే చేయడం.. వచ్చిన నిధులు మెక్కడం నీరు–చెట్టు పథకం ద్వారా 2015 నుంచి 2018 వరకు రూ.748 కోట్ల అంచనాలతో 7,937 పనులు చేపట్టారు. అందులో 5,490 పనులు పూర్తి చేశారు. 2,447 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నీరు–చెట్టు కింద చేపట్టే పనులకు ఎలాంటి టెండర్లు లేవు. నామినేషన్ పద్ధతిన టీడీపీ బినామీ నేతలు దక్కిం చుకున్నారు. టెండర్లు పిలవాల్సిన ఒక్కో పనిని రెండు, మూడుగా విభజించి తమ అనుచరులకు కట్టబెట్టారు. పనులు దక్కించుకున్న నేతలు పనులు చేయకనే బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన చెరువు పనులనే చూపెట్టి బిల్లులు చేసుకున్నవి కోకొల్లలు. అవసరం లేని ప్రదేశాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, సప్లైచానళ్లు నిర్మించారు. ఆ నిర్మాణాలు నాసిరకంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మామూళ్లకు ఆశపడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. చేపట్టిన పనుల్లో అధికశాతం చేసిన పనులనే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అగ్రిమెంట్ల నుంచే అవినీతి ఆరంభం నీరు–చెట్టు పనుల్లో అగ్రిమెంట్ల నుంచే అవినీతికి ఆజ్యం పోశారు. టీడీపీ నేతల ఒత్తిడి ఓ వైపు, కమీషన్ల కోసం కొందరు అధికారుల అత్యాశ వెరసి అవినీతి అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. పనుల కేటాయింపు విషయంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఒకే రోజు సుమారు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతకాల నుంచి ప్రారంభమైన అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్మేస్తాయి. అవినీతిలో హైలెట్ ప్రధానంగా శ్రీరంగరాజపురం మండలంలో జరిగిన అక్రమాలు జిల్లాలోనే హైలెట్‌గా నిలిచాయి. మండలంలో మొత్తం 312 పనులను గుర్తించారు. అందులో చెక్‌డ్యాంలు, చెరువు పూడికతీత పనులు చేపట్టేందుకు రూ.32 కోట్లు కేటాయించారు. పద్మాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రుద్రప్పనాయుడు రూ.2.12 కోట్లతో ఐదు చెక్‌డ్యాం పనులు చేపట్టారు. ఈ చెక్ డ్యాంలు కేవలం 30 మీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. నిబంధనల ప్రకారం అయితే ఒక్కో చెక్ డ్యాంక్కు కనీసం 500 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఆ నిబంధన తుంగలో తొక్కారు. ఆ పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఒండ్రు మట్టితో కలిసిన ఇసుక, కాలం చెల్లిన సిమెంటుతో చెక్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా పీలేరు నియోజకవర్గ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు వాటర్షెడ్ల పేరుతో భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారు. పనులే చేపట్టకుండా కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. చెరువు మరమ్మత్తులు, చెక్‌డ్యాంల పేరుతో రూ.13.5 కోట్లు స్వాహా చేశారు. వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం చెరువు కలుజు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. పాతగోడకు పైపైన మెరుగులు అద్ది కొత్తగా కలుజు నిర్మించినట్లు రికార్డులు సృష్టించారు. అదేవిధంగా ఏర్పేడు మండలంలోని పల్లం, పంగూరు, జంగాలపల్లి, వికృతమాల, గోవిందవరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేపట్టిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. రూ.లక్ష పనికి రూ.5 లక్షల వరకు బిల్లులు పెట్టుకున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు, ఇలగనూరు, ముచ్చివోలు, కమ్మకండ్రిగ పరిధి లో జరిగిన పనులు నాసిరకంగా ఉన్నా యి. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 574 చెరువులు ఉంటే.. 2016లో ఓ సారి చెరువుల సంరక్షణ పథకం కింద, మరో సారి జాతీయ ఉపాధిహామీ పథకం కింద, చివరి సారిగా నీరు–చెట్టు పథకంలో మొత్తం 555 చెరువు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లి పరిధిలోని రామసముద్రం మండలంలో చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు రికార్డులు తయారుచేసి సుమారు రూ.10 కోట్ల వరకు కొల్ల్లగొట్టారు. నగరి పరిధిలో 15 చెరువుల కింద 40 చెక్‌డ్యాంలు నిర్మించారు. అందులో 20కిపైగా నాసిరకంగా నిర్మించి నిధులు స్వాహా చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడేళ్లలో 808 పనులకు రూ.54.28 కోట్ల నిధులను మంజూరు చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం పనులు చెయ్యకనే నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులు, కాలువల మరమ్మతు లు, పూడికతీత, చెక్‌డ్యాం నిర్మాణాల పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. -
ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు వీరే..
సాక్షి, అమరావతి: ఈసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా గెలిచిన అన్నదమ్ములు సందడి చేయనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన, బొత్స సోదరులు, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి, రాంపురం సోదరులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనుండటం ఆసక్తికరంగా మారింది. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 ఎన్నికల్లో ఆయన అన్నయ్య కృష్ణదాస్ రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో 2004 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి, కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కూడా అవే నియోజకవర్గాల నుంచి వారిద్దరూ గెలవడం విశేషం. మళ్లీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆ రెండు నియోజకవర్గాల నుంచే పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సోదరులు వైఎస్సార్సీపీ తరఫున అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన పుంగనూరు నుంచి, ఆయన సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా.. ముగ్గురు అన్నదమ్ములు కాగా, ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం విశేషం. రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఈ ఘనత సాధించారు. వారిలో సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయంల నుంచి, వెంకటరామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. సాయిప్రసాదరెడ్డి 2004లో కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాలో బొత్స సోదరులు బొత్స సత్యనారాయణ 1999లో విజయనగరం జిల్లాలోని బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009ల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లోనే బొత్స తమ్ముడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ ఇప్పుడు బొత్స సోదరులిద్దరూ వైఎస్సార్సీపీ తరఫున చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. -
టీడీపీ, జనసేన ఇప్పటికి ఒక్కటే’
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోసం పోలీసు వ్యవస్థ దిగజారి వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సర్వే చేస్తున్న వారిని వదిలిపెట్టి, వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన తమ నేతలపై కేసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒక శాసన సభ్యుడు అని చూడకుండా అతన్ని ఇబ్బంది పెట్టారన్నారు. చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. తమ పార్టీని నేరుగా ఎదుర్కొలేక చంద్రబాబు ఓట్లు తీసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ చంద్రబాబుకు అండగా పనిచేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారన్నారు. దళితులను దూషించిన చింతమనేనిపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమాన్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం) చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు తమ పార్టీకి ఒంటరిగా పోటీ దమ్ముందని, చంద్రబాబులాగా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేయమని పెద్దిరెడ్డి అన్నారు. ‘ముసుగు రాజకీయాలంటూ చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మేము ఎవరితో కలిసి పోటీ చేయం. అనేక పార్టీలతో కలిసి పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుది. బీజేపీతో, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అనేక పార్టీలతో కలిసిన చరిత్ర చంద్రబాబుది. ముసుగు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. బీజేపీతో చంద్రబాబుకు ఇప్పటికీ లోపాయకారి ఒప్పందం ఉంది. టీడీపీ, జనసేన ఇప్పటికి ఒక్కటే. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ముసుగు రాజకీయాలు చేస్తున్నారు. ఒక్క మనిషికి 100 ముసుగులు ఉంటే.. ఆ మనిషి చంద్రబాబే అవుతారు’ అని ఎద్దేవా చేశారు. అవకాశ రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన నాయకులు లేరన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. (ముసుగులో సర్దుబాట్లు!) -
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు రాజకీయాలు
-
బీసీలకు బాబు చేసిందేమీ లేదు: పెద్దిరెడ్డి
-
బీసీల అభివృద్ధికి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు..
ఏలూరు: బీసీల స్థితిగతులను స్వయంగా తన పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ తెలుసుకున్నారని, వారు అన్నివిధాలా అభివృద్ధి చెందడానికే రేపు(ఆదివారం) బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని, రేపు(ఆదివారం) బీసీలకు సువర్ణ దినమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్థసారధి, జంగా కృష్ణ మూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషు బాబు తదితరులు పరిశీలించారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. నాడు బీసీలకు మేలు చేసిన మహానేత వైఎస్సార్ అని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్సార్ తనయుడిగా వైఎస్ జగన్ బీసీలకు మరింత మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా వైఎస్సార్, బీసీలకు మేలు చేశారని అన్నారు. బీసీల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. బీసీలకు బాబు చేసిందేమీ లేదు: పెద్దిరెడ్డి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు ఏమీ మేలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలను ఆదుకునే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదని చెప్పారు. బీసీలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని తెలిపారు. వైఎస్సార్ కులమతాలకతీతంగా తన పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ పథకాలతో ఎక్కువ మేలు జరిగింది బీసీలకేనని వెల్లడించారు. రేపటి సభలో వైఎస్ జగన్ చేయబోయే బీసీ డిక్లరేషన్‌తో బీసీలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరి చంద్రబాబు చేసిందేమిటి ?
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక,అవినీతి పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 30 యాక్టు,144 సెక్షన్ల ఎందుకు విధించారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటు కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీడీపీ పాలనపై ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. అప్పుడు కిరణ్.. ఇప్పుడు బాబు: పెద్దిరెడ్డి ‘ఎవరితోనైనా చంద్రబాబు పొత్తు పెట్టుకోవడానికి వెనకాడడు. గతంలో 600 హామీలు ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల్లో విపరీతంగా అప్పులు చేశారు. ఏ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేదు. కేంద్రం నిర్మిస్తానన్న పోలవరం, చంద్రబాబు తన సొంత వ్యక్తులకు కట్టబెట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కన్నా సొంత విషయాలపై శ్రద్ధ. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఒకరేమో 16 నెలలు జైల్లో పెట్టిస్తే, మరొకరు చంపే యత్నం చేశారు. ఇద్దరు ఈ జిల్లా వాళ్లే కావడం ఇబ్బందికరంగా ఉంద’ని పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జగనన్నకు మహిళాదరణ: రోజా ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళలకు గౌరవం ఇస్తోంది. ఎన్నో సమస్యలపై పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు ఎంత ఆదరణ ఇస్తున్నారో పాదయాత్ర ద్వారా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. ఎప్పుడూ చంద్రబాబు ఒంటిరిగా పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని బాబు ప్రయత్నం చేశారు. కేసులున్న క్రిమినల్ని ఎలా ఎయిర్‌పోర్టు రెస్టారెంట్లో పెట్టుకున్నారు. దాడి తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌పై ఏవిధంగా టీడీపీ నాయకులు మాటల దాడి చేశారో అందరూ చూశార’ని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బాబూ.. ఇప్పుడేమంటావ్: బొత్స ‘రాజకీయ చైతన్యమున్న జిల్లా చిత్తూరు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ఆర్ ఎంతమేరకు అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలకు తెలుసు. టీడీపీ నాయకులపై ఐటీ దాడులు చేస్తేనే బాబుకు దేశం గుర్తుకు వచ్చింది. రామాయపట్నం పోర్టు ప్రైవేట్ వారికి కట్టబెట్టే యత్నం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నా మాట మీదే జరిగిందన్నావు. మరి ఇప్పుడు ఏమంటారో చెప్పాల’ని చంద్రబాబు నుద్దేశించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. క్లిష్టంగా చంద్రబాబు పరిస్థితి: ఉమ్మారెడ్డి ‘మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు చాలా రాష్ట్రాలు వెళ్లి వస్తున్నారు. వారందరూ నాలుగేళ్లుగా మోదీకీ వ్యతిరేకంగా పోరాడుతున్నవారే. కొత్తగా మీరు కూడగట్టిన నాయకులెవరూ లేరు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. మరి చంద్రబాబు చేసిందేమిటి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందెవరు. రాజ్యాంగం కన్నా నీ పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లుంది. అసెంబ్లీ చరిత్రలోనే ఎక్కడా లేదు ఒక మహిళను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కినట్లుగా ఉందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. టీడీపీ పాలనలో జిల్లాలో పలు పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. మోదీ చర్యలకు భయపడి అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. కేవలం ఐటీ నోటీసులకే దేశంలోని అందరి కాళ్లు చంద్రబాబు పట్టుకుంటున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంటింటి సర్వే పేరుతో మోసాలు చేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. -
కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారీ ఒప్పందం
పుంగనూరు: కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు సిద్ధపడుతోందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో లాలూచీ పడిన చంద్రబాబు.. చిదంబరం సాయంతో కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని తనమీద ఉన్న కేసులు విచారణకు రాకుండా తప్పించుకున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్పై కోపంతో జగన్మోహన్రెడ్డిని జైలుకు పంపేందుకు సోనియా, చిదంబరంతో కలిసి బాబు కుట్రచేశారని దుయ్యబట్టారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించి, బెంగళూరులో రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన చంద్రబాబు వైఎస్సార్సీపీపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని వైఎస్సార్సీపీ ప్రకటిస్తున్నా బీజేపీతో కలిసి పోటీ చేస్తామనే తప్పుడు సంకేతాలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు మంత్రులుగా, ఆయనపై చెప్పులు వేయించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటం టీడీపీ దౌర్భాగ్యమన్నారు. టీడీపీకి అవసాన దశ ఆరంభమైందని, రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఎన్,రెడ్డెప్ప, నాగభూషణం, నాగరాజరెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, ఆవుల అమరేంద్ర, ఫక్రు ద్ధీన్షరీఫ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.