Pigeon
-
పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి ఆదేశాలైనా ఇస్తారనడానికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రాష్ట్రంలోని ముంగేలీ జిల్లాలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి, బీజేపీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి పున్నులాల్ మోహ్లేతో పా టు కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్‌లకు పావురాలు అందజేశారు. ఎమ్మె ల్యే, కలెక్టర్ వదిలిన పావురాలు రివ్వుమంటూ ఎగిరిపోయాయి. ఎస్పీ విడిచిపెట్టింది మాత్రం నేలపై పడిపోయిందట! సదరు వీడియోను సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘‘ఛత్తీస్‌గడ్‌లో పంచాయత్–3 (వెబ్ సిరీస్) రిపీటైంది. పంద్రాగస్టు సందర్భంగా ఎస్పీ ఎగరేసిన పావు రం కింద పడిపోయింది. వీడియో చూడండి’’ అని రాసుకొచ్చారు. దాంతో తన పరువు పో యిందని భావించిన పోలీస్ బాసు, సంబంధి త అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఏకంగా లేఖ రాశారు! ‘‘పావురం అనారోగ్యంతో ఉండటమే దీనికి కారణం. అది ఎగరకుండా కింద పడిపోయిన వైనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలై జిల్లా యంత్రాంగం పరువు తీసింది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చారట. 'Panchayat' Pigeon scene comes alive in ChhattisgarhThe video of the pigeon, which was released by Superintendent of Police (SP) Girija Shankar Jaiswal, went viral after it showed the bird falling to the ground instead of flying away. The event, meant to symbolize freedom and… pic.twitter.com/sc1lRJvtRO— The NewsWale (@TheNewswale) August 21, 2024 -
డ్రాగన్‌కు పావురంతో పనేంటి?
కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక చైనీస్ అక్షరాలున్న ఒక పావురాన్ని గత మే నెలలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘అనుమానాస్పదమైన సమాచారం’ లభించకపోవడంతో విడుదల చేశారు. చివరకు అది తైవాన్ నుంచి తప్పిపోయి వచ్చిన రేసు పావురం అని తేలింది. ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎగరగలవు. భారత అధికారులు ఒక పావురాన్ని బంధించటం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2020లో కూడా ఇలా జరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో పావురాలను నిఘా కోసం ఉపయోగించారు. కానీ గూఢచర్యం కోసం ఇప్పుడు అనేక అత్యాధునిక సాధనాలు ఉన్నప్పుడు, చైనా ఒక రేసు పావురాన్ని వదిలిపెడుతుందా? తరచూ మన దేశంలో చిత్ర విచిత్రాలు, అద్భుతమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. అసలలా ఉండటమే ఇండియాను ఉత్సుకతను రేకెత్తించేలా, ఉత్తేజం కలిగించేలా, అనేకసార్లు ఊహాతీత మైనదిగా చేస్తుంటుంది. అయితే ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ఇవేవీ కానటువంటి పూర్తి భిన్నమైన కొత్త కోణాన్ని ఇండియాకు జోడించింది. నిజం చెప్పాలంటే, ఆ కొత్త కోణాన్ని నేను ఏ విధంగానైనా వివరించగలనేమో నాకు తెలియటం లేదు. మీకే వదిలేస్తాను. ‘ద పోస్ట్’లో వచ్చిన కథనం ఇలా మొదలౌతుంది: ‘‘చైనా తరఫున గూఢచర్యానికి వచ్చి వాలిందన్న అనుమానంపై ఎనిమిది నెలల పాటు బందీగా ఉంచిన ఒక పావురాన్ని చివరికి అది గూఢచారి ఏజెంట్ కాదనీ, దిక్కుతోచక దారి తప్పి వచ్చిన తైవాన్ రేసింగ్ పక్షి అనీ నిర్ధారించుకున్న భారత అధికారులు దానికి విముక్తి కల్పించారు.’’ కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక ఈకల చాటున చైనీస్ అక్షరాలు కలిగి ఉన్న ఈ పావురాన్ని గత మే నెలలో ముంబైలోని ఒక ఓడరేవు సమీపంలో కనిపెట్టిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘‘లోతైన మరియు సరైన దర్యాప్తుతో పాటుగా, అనేక విచా రణలను’’ జరిపిన అనంతరం ‘‘అనుమానాస్పదమైన సమాచారం గానీ, తగిన సాక్ష్యాధారాలు గానీ’’ తమకు లభించలేదని ముంబై పోలీసులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. తదనుగుణంగా – ఇప్పటికి దాదాపు మూడు వారాల క్రితం – విడుదలైన ఆ పక్షి మంచి ఆరోగ్యంతో ఉంది. ‘ద పోస్ట్’ పత్రిక సంప్రదించిన నిపుణులు చెప్పటం ఏమిటంటే– బహుశా ఆ పావురం పరుగు పందేల్లోని పక్షి అయుండి, ‘‘తైవాన్ తీరానికి సమీపంలో జరిగిన రేసింగ్ పోటీల నుంచి దారి తప్పి, అక్కడి నుంచి పడవలో దాదాపు 3,000 మైళ్లు ప్రయాణించి’’ ఉండొచ్చని! అయితే రేసు పావురాల వ్యాపారం చేస్తుండే తైవాన్ కంపెనీ ‘నైస్ పీజన్’ యజమాని యాంగ్ త్సంగ్–టే ‘‘ఒక రేసు పావురం ఒక రోజులో 1,000 కిలోమీటర్ల వరకు ఎగరగలదనీ, అయితే అది ఇండియా వరకు ఎగురుతూ వెళ్లగలిగిందీ అంటే మధ్యలో కొన్ని మజిలీలు చేసి ఉంటుందనీ’’ అన్నారు. ‘‘ఏమైనా, కొన్ని పావురాలు తైవాన్ తీర ప్రాంతం నుంచి యూఎస్, కెనడా వరకు కూడా వచ్చిన ఉదంతాలు ఉన్నాయి’’ అని ఆ పత్రిక రాసింది. తైవాన్, ఉత్తర అమెరికాల మధ్య విస్తారమైన మహా సముద్ర జలం తప్ప వేరే ఏమీ లేనందున, పక్షులు అంతదూరం ఎలా వెళ్లగలిగాయో నాకైతే అంతు పట్టటం లేదు. ఒకవేళ పావురాలకు ఈత కొట్టటం గానీ తెలిసి ఉంటుందా? భారత అధికారులు ఒక పావురాన్ని పట్టి బంధించటం ఇదే మొదటిసారి కాదు. ‘ద పోస్ట్’ చెబుతున్న దానిని బట్టి 2015లో,మళ్లీ 2020లో ఇలా జరిగింది. ఆ సందర్భంలోనే... ‘‘భారీ సైనిక మోహరింపులతో ఉండే సరిహద్దుల మీదుగా ఎగిరొచ్చిన ఒక పాకి స్తానీ మత్స్యకారుడి పావురాన్ని పోలీసులు స్వల్పకాలం పాటు అదుపులోకి తీసుకున్నారు.’’ ఇప్పుడు మీరు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్న ముంబై పోలీసులను చూసి పరిహసించే ముందు, చరిత్రలో పక్షుల గూఢ చర్యం నిజంగానే ఉండేదని ఆ పత్రిక రాసిన విషయాన్ని గమనించాలి. ‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ... పావురాల ఛాతీకి కెమెరాలను కట్టి శత్రు దేశాల గుట్టుమట్లను కనిపెట్టేందుకు వాటిని ప్రయోగించేది. పక్షి కంటే కూడా ఆ పక్షికి కట్టిన కెమెరా పెద్దదిగా ఉండేదని నేను రూఢిగా చెప్పగలను. ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు (జర్మనీని వ్యతిరేకించే బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మొదలైన దేశాలు) తమ మధ్య రహస్య సందేశాల బట్వాడాకు పక్షులను ఉపయోగించాయి.’’ దీని వెనుక ఉండే కారణానికి పెద్ద వివరణేమీ అక్కర్లేదు. ‘‘పావురాలు సాధారణ పక్షి జాతులు. కెమెరా కట్టి ఉన్న పావురాలైనా సరే, గూఢచారి పక్షుల్లా ప్రత్యేకంగా కాక, వేలాది ఇతర పక్షుల కార్యకలాపాల మధ్య దాగిపోయేవి’’ అని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చెప్పడమే కాకుండా, అలాంటి ఒక రహస్య కెమెరాను సైతం వృద్ధి చేసింది. స్వయంగా సీఐఏనే ఈ విషయాన్ని వెల్లడించింది కనుక అది నిజమే అయి వుంటుంది. అయితే ‘ద పోస్ట్’ సంప్రదించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్నేమీ కలిగి లేరని తెలుస్తోంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ‘ద గ్లోబల్ పీజన్’ పుస్తక రచయిత కాలిన్ జరోల్మాక్కు ఇందులో భారతదేశ అసంబద్ధ పరిస్థితే కనిపించింది. ఆ స్థితిని సరిగ్గా చెప్పాలంటే, ‘చాలా హాస్యాస్పదం’ అన్నారు. ‘‘గూఢచర్యం కోసం చైనా అనేక అత్యాధునిక సాధనాలను కలిగి ఉందనీ, వాటిని విజయవంతంగా భారత్‌పై ప్రయోగిస్తుంది తప్పితే, రేసు పావురాలనైతే వదిలిపెట్టదు కదా’’ అని కాలిన్ జరోల్మాక్ వ్యాఖ్యానించారు. కావొచ్చు! నేను కిటికీ దగ్గర కూర్చొని, పావురాల ‘గూ.. గూ’ లను వింటు న్నప్పుడు, అవి నాపై నిఘా పెట్టేందుకు రాలేదు కదా అని అనుకోకుండా అయితే ఉండలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో మన ప్రియమైన ప్రభుత్వం ఈ విధంగానే తెలుసుకుంటుందా? పావురాలు తరచూ కిటికీ అంచులపైన కనిపించడానికి కారణం అవి తమ రెట్టలను అక్కడ వదిలి వేయడానికే అయుంటుందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే వాటి చిన్నికళ్ల లోతుచూపులను బట్టి, అక్కడ అవి వదిలిన దాని కన్నా ఎక్కువగా తీసుకుని ఉంటాయా అని యోచిస్తాను. కాబట్టి, ఈసారి ఒక పక్షి మీ తలపైన ఎగురుతూ ఉండటాన్ని, లేదా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని కిందికి చూస్తూ ఉండటాన్ని మీరు గమనించినప్పుడు అది ఏదైనా ప్రయోజనం కోసం అక్కడికి వచ్చి వాలిందా అని ఆలోచించండి. బహుశా అంతదూరంలోని బీజింగ్ నుండి కాకపోయినా, దగ్గర్లోని ‘సౌత్ బ్లాక్’ (ప్రధానమంత్రి కార్యా లయం ఉండే చోటు) నుండి అది వచ్చి ఉండొచ్చు. అలాంటి పక్షులకు మేత మాత్రం వేయకండి. మనం వాటికి అందించే ఆహారపు తునకలు అవి తమ యజమానుల నుండి పొందే ప్రతిఫలాల ముందు పెద్ద విషయమేం కాదు. చివరిగా, ఈ వ్యాసం పక్షులకు సంబంధించినదని మీరనుకుంటే కనుక మీరలా అనుకోవటం సరైనదే కావచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చిట్టి పావురాల్లో కృత్రిమమేధ..!
పావురాలు సహజంగానే తెలివైనవి. శిక్షణ ఇస్తే ఏదైనా నేర్చుకుంటాయి. అందుకే పాతకాలంలో వీటిని సమాచారం చేరవేయడానికి ఉపయోగించేవారు. అయితే మనం ఊహించినదానికన్నా ఇవి ఎంతో తెలివైనవనీ.. శిక్షణ ఇస్తే కృత్రిమ మేధలానే ఏ విషయాన్నయినా నేర్చుకుంటాయనీ ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. కృత్రిమ మేధలాగే పావురాలు కొన్ని సమస్యలను పరిష్కరిస్తాయని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. మానవులకు ఇబ్బంది కలిగించే కష్టమైన పనులను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించేలా పరిశోధనలు జరగాలని తెలిపారు. సెలెక్టివ్ అటెన్షన్, స్పష్టమైన నియమాలను అనుసరించడంలో పావురాలు దిట్ట అని తేలింది. ఏఐ మోడల్‌ల్లో సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. కృత్రిమ మేధతో పనిచేసే కంప్యూటర్, పావురం రెండూ కూడా ఒకే రకమైన పద్ధతిలో నేర్చుకుంటున్నాయని వాళ్ల పరిశీలనలో వెల్లడైంది. ఇందుకోసం వీళ్లు సుమారు 24 రకాల పావురాలను ఎంపికచేసి వాటికి రకరకాల ఆకారాలూ, వలయాల్లాంటి వాటిల్లోంచి వెళ్లి బటన్‌ను ప్రెస్ చేయడం... వంటి టాస్క్‌లను ఇచ్చారట. వాటికిచ్చిన పరీక్షలో విజయం సాధిస్తే బహుమతిగా ఆహారాన్ని అందించారు. ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల పరీక్షలు నిర్వహించగా అవి చాలా త్వరగా ఆ పనులు నేర్చుకుని టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. అంతేకాదు, కొన్ని విషయాల్ని అవి మనిషికన్నా సమర్థంగా నేర్చుకోగలిగాయట. పైగా అవి నేర్చుకునే విధానం కూడా కృత్రిమ మేధను పోలి ఉందనీ, కాబట్టి పావురం న్యూరోబయాలజీని అధ్యయనం చేస్తే కృత్రిమమేధను మరింత సమర్థంగా అభివృద్ధి చేయగలమనీ చెబుతున్నారు. లెక్కించడం నుంచి రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం వరకూ పావురాలు అన్ని పనులూ చేయగలవని పరిశోధకులు తెలిపారు. -
అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం
పావురం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పూర్వం వాటిని సమాచారాన్ని చేరే వేసే సాధనాలుగా ఉపయోగించేవారు. ఇటీవల ఈ పావురాలను పెంచేందుకు భయపడే పరిస్థితులు తలెత్తాయి కూడా. వాటి విసర్జకాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని పలువురు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒకరకంగా వాటిని పెంచడం, ఆహారం వేయడం తగ్గించారు ప్రజలు. వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇలా ఉండగా గూలాబీ రంగులో ఉన్న ఓ పావురం ప్రజల ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలోని గ్రేట్ మాంచెస్టర్ వద్ద టౌన్ సెంటర్ సమీపంలో వాకింగ్ చేసేవాళ్లు ఓ పక్క, మరోవైపు పోలీసుల పెట్రోలింగ్‌తో జన సందోహంగా ఉన్న ప్రదేశంలో ఈ పక్షి కనువిందుఉ చేసింది. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి పావురాలు తెలుపు, నలుపు, బుడిద రంగులోనే ఎక్కువగా ఉంటాయి. అవేమి కాకుండా పింక్ రంగులో ఉండడం అనేది అత్యం అరుదు అనే చెప్పాలి. మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురమే ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనే అనుకున్నారు అంతా. కాసేపటికి గానీ అర్థకాలేదు అది పింక్కలర్లో ఉన్న ఓ పావురమేనని. ఇదిలా ఉండగా గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అట్రాక్షన్ కోసం అని ఓ పావురానికి గూలాబిరంగు వేసి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించడమే గాక అది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాన్ని వైల్డ్ బర్డ్ ఫండ్‌కు తరలించారు. అలానే ఈ పక్షికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని సందేహిస్తున్నారు. అయితే ఈ పావురం బంధింపబడలేదు. మిగతా పావురాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. ఎందువల్ల ఆ పావురం ఇలా గూలాబీ రంగులో ఉందనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో చూసిన యూకేలోని స్థానికులు, పోలీసు అధికారులు తాము కూడా ఈ వింత పావురాన్ని చూసినట్లు తెలపడం విశేషం. Has anyone else seen this pink pigeon in Bury and does anyone know why it is pink?! #Bury #pinkpigeon #pigeon #pink #bird pic.twitter.com/wrx63R21TP — Harriet Heywood (@Heywoodharriet_) September 9, 2023 (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
కలకలం రేపిన ’సందేశ’ పావురం.. అది ఎక్కడిదో.. ఎవరిదో?
సాక్షి, ఎర్రుపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరుకు గురువారం చేరిన ఓ పావురం కలకలం రేపింది. గ్రామంలోని గంతాల లక్ష్మణరావు ఇంట్లో వాలిన పావురాన్ని పరిశీలించగా, ఒక కాలికి టీఎన్–999 అని, మరో కాలికి 7417 నంబర్‌తో కూడిన స్టిక్ట్కర్ ఉంది. రెక్కలకు డెల్టా 1000 కేఎం అని స్టాంప్ వేసి ఉండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఎం.సురేశ్ పరిశీలించి ఇది బెట్టింగ్ పావురం అయి ఉండొచ్చని, ప్రజలు అపోహలకు గురికావొద్దని సూచించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పావురాల కోసమే తన్నుకున్నారు!
అనంతపురం: పావురాల కోసం బుధవారం రాత్రి బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు...కొత్తూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ అదే గ్రామానికి చెందిన శివప్ప, హేమంత్, భూపతి బంధువులు. ఇరు కుటుంబాలలో పావురాలు పెంచుకుంటున్నారు. ఇటీవల పావురాలు తారుమారు కావడంతో రోజూ అడ్డపేర్లు పెట్టుకుని తిట్టుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో ఓ వర్గంలోని బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ, మరో వర్గంలోని భూపతికి గాయాలయ్యాయి. ఇరువురూ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వైరల్ వీడియో: ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావ్!
-
ఎవడ్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావ్!
వైరల్ వీడియో: ఇంటర్నెట్ తెరిస్తే చాలూ.. జంతువులకు సంబంధించి బోలెడన్ని సరదా వీడియోలు, వాటి విచిత్రమైన ప్రవర్తనకు సంబంధించినవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూడబోయేది కూడా అలాంటి వీడియోనే. పావురాల మధ్య ఓ కపోతం.. తన ప్రత్యేకతతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్‌ఫ్లిప్స్(వెనకాలకు జంప్)తో . అఫ్కోర్స్.. ఇది పాత వీడియోనే అనుకోండి!. Pigeon doing backflips.. pic.twitter.com/fx51KYL522 — Buitengebieden (@buitengebieden) February 12, 2023 -
శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని
సాక్షి, దొడ్డబళ్లాపురం: సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఇప్పుడయితే మొబైళ్లు, ఈ మెయిళ్లు ఉన్నాయి. కొన్నేళ్లక్రితం ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉండేవి. అయితే అంతకంటే ముందు మహారాజుల కాలంలో ఇవేవీ ఉండేవి కావు. అందుకే పావురాళ్లను ఉత్తరాలు చేరవేసే పోస్టుమ్యాన్లుగా ఉపయోగించేవారు. కాలం మారినా పావురాళ్ల తెలివిలో తేడా రాలేదు. ఇందుకు చక్కటి ఉదాహరణగా చిత్రదుర్గ జిల్లా మొళకాళ్మూరు తాలూకా మేగలహట్టి గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవచ్చు. మేళగట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇటీవలే అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చాడు. దర్శనం తరువాత తనతోపాటు తీసుకువచ్చిన పావురాన్ని గత డిసెంబరు 30న శబరిమలెలో వదిలేశాడు. ఆశ్చర్యంగా పావురం గురువారం గ్రామాన్ని చేరుకుని యజమాని వెంకటేశ్ ఒడిలో వాలిపోయింది. పెంచిన రుణాన్ని మర్చిపోలేని పావురం ఇలా గ్రామానికి తిరిగి రావడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..) -
140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్ పీసాంట్ పీజియన్‌ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది. 10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం -
పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి
మాలూరు: పావురాలు కొనడానికి వచ్చిన వ్యక్తి ఒకే కుటుంబంలోని ఏడుగురిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోలారు జిల్లా మాలూరు పట్టణంలోని పటాలమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న రాము, భార్య హేమావతి, నాగవేణి, రాజేశ్వరి, రూపా, నాగరాజ్,మరొకరు కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి ఎందుకు వచ్చావనడంతో వివరాలు.... నాగరాజ్ తమ్ముడు రాము పావురాల వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పావురాలు ఖరీదు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఇమ్రాన్‌ను చూసిన నాగరాజ్ రాత్రి సమయంలో ఎందుకు వచ్చావని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఇమ్రాన్‌ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసి ఏడుగురిని గాయపరిచాడు. చుట్టుపక్కల వారు వచ్చి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మాలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. దాడి వెనుక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అని విచారణ చేపట్టారు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది. (చదవండి: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు.. రంగంలోకి పోలీసులు) -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
Viral Video: పావురం బ్యాక్ జంప్!..చూస్తే అవాక్కవ్వాల్సిందే
ఇంతవరకు పక్షులకు సంబంధించిన పలు వీడియోలు చూశాం. కొన్ని పక్షులు మనుషుల వలే మాట్లాడటం వంటివి కూడా విన్నాం. నిపుణుడి పరివేక్షణలోనూ లేదా ఏ సర్కస్‌లోనూ ఆయా సంరక్షకుల సమక్షంలో విన్యాసాలు చేయడం చూసి ఉంటాం. అంతే గానీ వాటంతట అవి చేయడం జరగదు. కానీ ఈ పావురం తనంతట తాను విచిత్రమైన విన్యాసం చేసింది. వివరాల్లోకెళ్తే... ఒక తెల్లటి పావురం తనంతట తానుగా ఒక్కసారిగా రెక్కలు విప్పుతూ.. అనుహ్యంగా వెనుకకు జంప్ చేస్తుంది. ఏదో అనుకోకుండా చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది అలా మూడుసార్లు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వావ్ భలే జిమ్నాస్టిక్స్ చేసింది అంటూ ఆ పావురాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Wow🕊😍 pic.twitter.com/jpq2f4VDhJ — Hana (@magicthings7) July 28, 2022 (చదవండి: వీడియో: రియల్ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి) -
పోస్ట్ కోవిడ్ .. పావురం!
సాక్షి, హైదరాబాద్: మూడు దశల కరోనా కాలంలో వైరస్ బారిన పడిన కొందరు ఇప్పటికీ ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏడాది, రెండేళ్ళు గడిచిన తర్వాత కూడా గుండె, ఊపిరితిత్తులు సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ నటి మీనా భర్త కోవిడ్ అనంతరం (పోస్ట్ కోవిడ్) ఊపిరితిత్తులు పాడవ డం కారణంగా చనిపోయినట్లు వార్తలు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది. పోస్ట్ కోవిడ్ సమస్యలున్న వారు పావురాల వ్యర్థాల నుంచి విడుదలయ్యే వాయువులు, ధూళిని పీల్చడం వల్ల మరింత హాని జరుగుతుందనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. పావురాల వ్యర్ధాల నుంచి విడుదలయ్యే వాయువులు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం ముందు నుంచే ఉంది. పావురాలకు ఫీడింగ్ పేరిట వాటికి దగ్గరగా వెళ్లడం వల్ల బ్రాంకై ఆస్థమా, క్రానిక్ బ్రాంకైటీస్, హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటీస్, హిస్టోప్లా స్మాసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం ఉందని కూడా చెబుతున్నారు. పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా వస్తున్న సమస్యలు ►పోస్ట్ కోవిడ్‌లో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ►కొందరిలో ఇన్ఫెక్షన్లు, టీబీ వంటివి వస్తున్నాయి. పక్షవాతం కేసులు కూడా భారీగా పెరుగు తున్నాయి. ►మానసిక సమస్యలు, ఒత్తిడి, నిద్రపట్టక పోవడం, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎముకలకు రక్త సరఫరా తగ్గిపోతోంది. ►హెపటైటిస్, వర్టిగో, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఆలస్యం వల్లే అనర్ధం కరోనా వచ్చాక ఆలస్యంగా డాక్టర్ వద్దకు రావడం, చికిత్స తీసుకో వడం వల్ల ఇలా జరుగుతుంది. డయాబెటిస్, ఆర్థరైటీస్, హెచ్ఐవీ ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశం ఉంది. – డాక్టర్ సీహెచ్ రాజు, పల్మనాలజిస్ట్ సోరియాసిస్ సమస్యలు వస్తున్నాయి కోవిడ్ సమయంలో అనేక మం దులు వాడి ఆపేస్తారు. తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలు వస్తున్నా యి. కొందరిలో చర్మంపై సోరియా సిస్ (బొల్లి), బొబ్బలు, మొటి మలు వంటివి వస్తాయి. వెంట్రుకలు కూడా ఊడి పోతాయి. చర్మం పొడిబారుతుంది. – డాక్టర్ రవళి యలమంచిలి, హైదరాబాద్ -
Sakshi Cartoon: భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం
భారత్‌లోకి పాక్ ‘గుఢాచారి’పావురం -
Photo Feature: విరబూసిన ‘గాంధర’ అందాలు
సాక్షి, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల కురుస్తున్న వర్షాలకు మన్యం కొత్త అందాలను సంతరించుకుంటోంది. చల్లని వాతావరణంలో పచ్చని సోయగాలు కనువిందుచేస్తున్నాయి. వీటికి తోడు శ్వేతవర్ణంలోని గాంధర పూలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఇవి ఏటా ఏప్రిల్ నెలలో విరబూస్తాయి. స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి ఆనుకుని ఉన్న అటవీప్రాంతంలో విరబూసిన ఈ పూలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. గుంటసీమ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహన చోదకులకు ఇవి కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉన్న గాంధర పూల తోట కొమ్మకొమ్మకు కపోతం సాక్షి, పాడేరు: ప్రేమకు, శాంతికి చిహ్నమైన పావురాలు గుంపులు గుంపులుగా ఎగురుతూ పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి పంచాయతీ పెద్దగొందిలో స్థానికులకు కనువిందుచేస్తున్నాయి. గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి తన ఇంటి వద్ద 40 పావురాలు పెంచుకుంటున్నాడు. వీటి కువకువలు, రెక్కల చప్పుళ్లతో ఆ ప్రాంతంలో ఆహ్లాదమైన వాతావరణం నెలకొంది. కపోతాలన్నీ ఓ చెట్టు వద్ద చేరి సందడి చేస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. చెట్టుపై కనువిందు చేస్తున్న పావురాలు -
కపోత విషాద గీతిక!
చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోందనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మాంజా ఓ వ్యక్తిని బలిగొనడం విషాదాన్ని నింపింది. సోమవారం నగరంలోని నెక్లెస్ రోడ్డులోని విద్యుత్ స్తంభానికి చిక్కుకుపోయిన మాంజా.. పావురం మెడకు చుట్టుకుని నిలువునా దాని ప్రాణాలను తీసింది. ఊపిరి పోతుండగా అది స్తంభంపైనుంచి విగతజీవిగా నేలపై పడుతూ అకటా.. దయలేని వారు ఈ మానవులు! అనే విషాద గీతికను ఆలపిస్తున్నట్లు.. ఆ కపోతం కన్నీరు కారుస్తున్నట్లు కనిపించిందీ దృశ్యం. -
ప్రకాశం: చీమకుర్తిలో పావురానికి రబ్బర్ ట్యాగ్
-
పావురం కలకలం.. కాలికి జియోట్యాగ్.. గూఢచర్యం కోసమేనా?
సాక్షి, ప్రకాశం: చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్‌లో రబ్బరు ట్యాగ్‌తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్‌మెంట్‌లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని పాదానికి చైనా అక్షరాలతో రబ్బర్‌ట్యాగ్‌ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లో తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక వీఆర్వో, పోలీసులకు సమాచారం అందించాడు. వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పావురాన్ని పరిశీలించారు. కాగా, గతంలో కూడా ఒడిస్సా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కేంద్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలో దశరథ్‌పుర్, పూరి జిల్లా హరికృష్ణాపూర్‌లోకూడా ఇదే తరహా పావురాలు పట్టుబడ్డాయి. ఇక్కడ పట్టుబడ్డ పావురాల కాలికి వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉన్నాయి. గత సోమవారం పూరి జిల్లాలో లభించిన పావురం. ఒక పాదానికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం, మరో కాలికి 37 కోడ్ అంకెలతో కూడిన ట్యాగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. చదవండి: గుట్టుగా వ్యభిచారం.. ఇల్లు అద్దెకు తీసుకుని.. -
ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!
లండన్: ఈ మధ్యకాలంలో చాలామంది విన్నూత్న రీతిలో రకరకాల డ్యాన్స్‌లు లేదా ఫీట్లు లేదా రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలతో ప్రజలను ఆకర్షించడం చూస్తునే ఉన్నాం. ఆఖరికీ అసాధ్యమనే వాటిని కూడా సుసాధ్యం అనిపించేలా చేసి ప్రజలందరీ మనస్సులను గెలుచుకున్న వాళ్ల గురించి విని ఉన్నాం. కానీ కొంతమంది తమ వెర్రి చెష్టలు చూస్తే మనకు గందరగోళంగా అనిపిస్తుంది. (చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు) అలా అని వాళ్లు తెలివిలేని అమాయకులా అంటే ఆది కాదు. ఎందువల్ల కొంత మంది ఈ విధంగా అర్ధంకాని రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు కానీ. వాటికి కూడా ఏదైనా అర్థం ఉంటుందేమో. ఏదిఏమైనా వారే నేరుగా చెబితే గానీ మనకు తెలియదు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే. ఆహారం పై ఉప్పు చల్లడం, నమ్మశక్యం కానీ వస్తువులతో మాంసాన్ని కోసి చూపించే వీడియోలతో సాల్ట్ బేగా ప్రసిద్ధిగాంచిన టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే ఇప్పుడు సరికొత్త వీడియోతో ప్రజలను విస్మయానికే గాక గందరగోళానికి గురి చేస్తున్నాడు. అయితే ఆ వీడియోలో సాల్ట్ బేగా పిలుసున్న చెఫ్ నస్రెట్ పైన డస్ట్‌బిన్ కవర్‌ను టీ షర్ట్‌లా ధరించి, కింద ఒక షార్ట్ వేసుకుని వినూత్నరీతిలో కనపడతాడు. అంతేకాదు నస్రెట్ ఒక పార్క్‌లో ఉడుతలకు, పావురాలకు ఆహారం తినిపిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నట్లు కనిపిస్తాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో తోపాటుగా "ప్రకృతి ప్రేమికులు ఆనందంగా ఉంటారు" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవ్వడమే కాక నస్రెట్ ఎందుకలా చెత్త సంచిని టీషర్ట్గా ధరించాడు అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెర తీస్తారు. పైగా నస్రెట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తన రెస్టారెంట్లో అధిక ధరల నేపథ్యంలో ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) -
పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా?
ప్రపంచంలో సమస్యాత్మక సరిహద్దులలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఒకటి. ఈ ప్రాంతంలో సైన్యం కాకుండా వేరేవారు కనపడితే ఇబ్బందుల్లో పడినట్లే. అయితే ప్రజలే కాదు జంతువులు, పక్షులు కూడా అనుమానాస్పదంగా కనపడినా అదుపులోకి తీసుకుంటారని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ వద్ద కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పావురం అతని భుజంపై వచ్చి వాలింది. ఈ ఘటన ఏప్రిల్ 17న జరిగింది. ఆ పావురం కాళ్లకు ఏదో కట్టి ఉన్నట్లు గమనించిన కానిస్టేబుల్ అనుమానం వచ్చి వెంటనే పావురాన్ని పట్టుకుని, పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం అధికారులు పావురాన్ని స్కాన్ చేశాడు. ఒక తెల్ల కాగితం కనిపించగా, దానిపై ఒక సంఖ్య కూడా ఉంది. ఇదేదో కోడ్ భాష లాంటిదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పావురాన్ని ఉగ్రవాదులు గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ( చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం ) -
బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అసలే ఎండాకాలం.. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మనుషులం.. మనమే ఎండవేడికి తాళలేకపోతున్నాం. ఇక నోరులేని జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు మాత్రం ఓ పక్షి దాహార్తి తీర్చి మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒక పిల్లవాడు తన ఇంటి బాల్కనీ పక్కన ఒక పావురాన్ని చూశాడు. చాలాసేపటి నుంచి అది ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది. పైగా అది చాలా నీరసంగా కనిపించింది. ఇది చూసిన ఆ బాలుడు చలించిపోయాడు. పాపం.. ఎంత దూరం నుంచి ఎగురుతుందో, ఆ పక్షికి కాసిన్ని నీళ్లు ఇద్దాం అనుకున్నాడు. అలా ఒక చిన్న స్పూన్‌ను నీటితో నింపి ఇనుప చువ్వల సందులో నుంచి పావురం ముందు పెట్టాడు. మొదట పావురం నీరు తాగడానికి తటపటాయించింది. దీంతో బాలుడు కొంత నీరు కింద పోశాడు. ఆ వెంటనే పావురం గాబరాగా ఆ నీరు తాగటం మొదలుపెట్టింది. కాసేపటికి చెంచాలో ఉన్న నీళ్లన్నీ తాగి తన దాహార్తిని తీర్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ బాలుడు చేసిన పనికి ‘హ్యట్సాఫ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
జాగ్రత్త.. పావురాలతో సెల్ఫీలొద్దు!
సాక్షి, హైదరాబాద్: నగరం లక్షల పావురాలకు ఆవాసం. రోజూ కొన్ని వేల మంది వీటికి తిండి గింజలు వేస్తుంటారు. 500 ప్రాంతాల్లో ప్రత్యేకంగా తిండి గింజలు వేసే కేంద్రాలున్నాయి. చాలా మందికి ఇలా తిండి గింజలు వేసి.. వాటితో సెల్ఫీ దిగడం అలవాటు. కొద్ది రోజుల వరకు ఈ అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో పక్షి ప్రేమికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించనప్పటికీ ఆ వ్యాధి ఉన్న ప్రాంతం నుంచి వచ్చే పక్షుల వల్ల వైరస్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల పాటు జనం జాగ్రత్తతో ఉండాలని చెబుతున్నారు. పావురాల గుంపులోకి వెళ్లొద్దు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వృద్ధి చెందుతున్న పావురాలతో సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. హైదరాబాద్ సహా సమీప ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పావురాలున్నాయి. వలస పక్షుల ద్వారా ఈ పావురాలకు బర్డ్‌ఫ్లూ సోకి.. వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెపుతున్నారు. పావురాలకు నిత్యం తిండి గింజలు వేయడం చాలా మందికి అలవాటు. ఇది మంచిదే అయినా.. కొందరు పావురాల గుంపుల్లోకి వెళ్లి సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఆ సమయంలో పావురాలు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్దమొత్తంలో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఒకవేళ బర్డ్‌ఫ్లూ సోకిన పావురాలు వాటిల్లో ఉంటే ఆ దుమ్ము ద్వారా వైరస్ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిత్యం ఫిర్యాదులు.. ప్రస్తుతం ఎక్కడైనా పక్షి చనిపోతే ప్రజలు బర్డ్ ఫ్లూ అనుమానంతో భయపడుతున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పశుసంవర్థక శాఖ అధికారులకు, జీహెచ్ఎంసీకి, పక్షుల స్వచ్ఛంద సంస్థలకు ఫిర్యాదులు వస్తున్నాయి. తమ ఇంటి సమీపంలో చెట్టుపై నుంచి పక్షి పడి చనిపోయిందని, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటూ మాకు నిత్యం పది వరకు ఫోన్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు. - సంజీవ్ వర్మ, యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ అప్రమత్తత అవసరం.. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో పావురాలు పది లక్షలకు చేరువవుతున్నాయి. ఈ విషయంలోనే జనంలో అప్రమత్తత అవసరం. పావురాల గుంపులకు చేరువగా వెళ్లొద్దు. పక్షులు ఎక్కువగా వాలే చెట్ల కింద అధిక సమయం ఉండకపోవడం మంచిది. వాటి రెట్టలు కూడా వైరస్‌ను ప్రబలేలా చేస్తాయి. - వాసుదేవరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, పక్షి విభాగం అధిపతి, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం -
పావురాల యందు ‘న్యూకిమ్ పావురం’ వేరయా
చూస్తా ఉంటే.. హైదరాబాద్ సిటీలో గల్లీగల్లీలో తిరిగే పావురంలాగే ఉంది కదా.. కానీ న్యూకిమ్ అనే ఈ రెండేళ్ల రేసు పావురం ధర వింటే.. మనం కిమ్మనం.. ఎందుకంటే.. దీని ధర రూ.8 కోట్లకు పైనే.. ఈ మధ్యే బెల్జియంకు చెందిన రేసు పావురాల పెంపకందారుడు తన దగ్గర ఉన్న పావురాలను ఆన్లైన్లో వేలం వేస్తే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి న్యూ కిమ్‌కు ఈ వెల చెల్లించి పాడుకున్నాడు. రెండేళ్లే కానీ.. ఈ పావురం చాలా రేసుల్లో పాల్గొని గెలిచిందట.. దీని అమ్మ, అక్క కూడా రేసుల్లో గెలిచినవేనట.. అయితే ఇంత ధర ఇచ్చి.. దీన్ని రేసుల్లో వాడకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. అక్కడ గాయపడినా.. ఏం జరిగినా.. ఇంత సొమ్మూ బూడిదలో పోసినట్లు అవుతుందని.. ఇలాంటి మేలు జాతి పావురాల పునరుత్పత్తికి దీన్ని వినియోగించవచ్చని చెబుతున్నారు. ఏ ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్ గొంతులో చేప ముల్లు ఇరుక్కోవడం కామనే.. కానీ ఏకంగా చేపే ఇరుక్కుంటే.. ఏమవుతుంది? ఏమో మనకేం తెలుస్తుంది.. ఈజిప్టుకు చెందిన మత్స్యకారుడిని అడిగితే తెలుస్తుంది.. శ్వాస అందక.. మాట రాక.. తెగ ఇబ్బందిపడిపోయాడట.. కాస్త ఆగితే.. పోయేటట్లు ఉన్నాడని వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన బెనీ సుయిఫ్ పట్ట ణంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అలీ అల్ హజ్రీ అనే డాక్టరుగారు.. మంచి హస్తవాసి.. ఆయనే ఎండోస్కోపీ సాయంతో ఇదిగో ఇలా గొంతులోని చేపను బయటకు తీశారు.. కొంచెం లేటైనా.. ఇతడి ఫొటోకు దండ పడేదని.. సమయానికి తేవడంతోనే ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్‌గారు చెప్పారు. ఇంతకీ ఇతడి గొంతులోకి చేప ఎలా వెళ్లిందో తెలుసా? నైలు నది ఒడ్డున ఎర వేసి చేపలు పడుతున్న మనోడికి ఈ చిన్న ఫిష్ చిక్కిందట. దాన్ని ఓ చేత్తో పట్టుకుని.. ఉన్నంతలోనే మరో ఎరకు కూడా చేప చిక్కిందట.. దీన్ని చేత్తో పట్టుకుని.. తీయాలంటే అవడం లేదు.. దాంతో ఆ చేపను మిస్ చేయకూడదని.. ఈ చేపను అలా నోట్లో పెట్టుకున్నాడట.. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో.. మేం మీకు చెప్పాలా ఏంటి.. ఈ చిన్నది చిక్కదు దొరకదు వలలో ఎంత పెద్ద చేప పడితే.. అంత గొప్ప.. మరీ చిన్న చేప పడిందనుకోండి.. ఇక చిన్నతనమే అన్నట్లు.. జపాన్‌లో మాత్రం అలా కాదు.. అక్కడ ఎంత చిన్న చేప పట్టగలిగితే.. అంత గొప్ప అన్నట్లు.. ఎందుకంటే.. సూక్ష్మ కళలో జపానోళ్లు సుప్రసిద్ధులు కదా.. గార్డెనింగ్ నుంచి ఇటు ఆర్కిటెక్చర్ వరకూ.. అందరికీ తెలిసిందే.. అలాగే చేపలు పట్టడం విషయంలోనూ.. అక్కడ నువ్వు ఎంత చిన్న చేపను పట్టగలిగితే.. నీకు అంత నైపుణ్యం ఉన్నట్లన్నమాట. దీన్ని టనాగో ఫిషింగ్ అంటారు.. చేపలు పట్టడంలో జపాన్‌లో ఇదో పురాతన ప్రక్రియ. అలాగని.. వీటిని పట్టడం అంత ఈజీ కానే కాదు.. అందుకే వీటికి ప్రత్యేకమైన ఎరలు సిద్ధం చేస్తారు. బోలెడంత ఓపిక, నైపుణ్యం అవసరం.. ఇక్కడెలా ఉన్నా.. అతి చిన్న చేప పట్టావంటే.. నువ్వక్కడ తోపు అన్నట్లే.. సో.. స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ -
వెలుగులోకి 100 ఏళ్లనాటి పావురాయి సందేశం
పారిస్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సందేశాలు చేరవేయడంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయాలంటే మనుషులు వందల మైళ్లు ప్రయాణం చేసి అక్కడకి వెళ్లి సమాచారం తెలిపేవారుల. కానీ ప్రస్తుత కాలంలో కూర్చున్న చోట నుంచే సెకన్ల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా మెసేజ్‌ని పంపగల్గుతున్నాం. ఈ మెయిల్, వాట్సాప్, ఫేస్బుక్ ఇంకా రకరకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఓ వందేళ్ల క్రితం సందేశాలు పంపాలంటే పావురాలే ప్రధాన ఆధారంగా ఉండేవి. అప్పటికి పోస్టు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికి కీలక సమాచారాన్ని చేరవేయడం కోసం పావురాల మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే దాదాపు వందేళ్ల క్రితం అంటే మొదటి ప్రపంచ యుద్ధం నాటి పావురాయి సందేశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తూర్పు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జంట వాకింగ్ కోసం బయటకు వెళ్లారు. వారికి ఓ చిన్న క్యాప్సిల్స్ కనిపించింది. వింతగా ఉండటంతో దాన్ని తెరిచి చూశారు. (చదవండి: పాకిస్తాన్ పావురం విడుదల) ఆశ్చర్యం.. అందులో ఓ చిన్న ఉత్తరం ఉంది. దాదాపు వందేళ్ల క్రితం ఓ ప్రష్యన్ సైనికుడు పావురం ద్వారా పంపిన సందేశం ఇది. కానీ దురదృష్టం కొద్ది అది తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయింది. ఇక తూర్పు ఫ్రాన్స్‌లోని ఓర్బీలోని లింగే మ్యూజియం క్యూరేటర్ డొమినిక్ జార్డి మాట్లాడుతూ.. ‘ఇది మొదటి ప్రపంచ యుద్ధ (1914-10)కాలానికి చెందిన సందేశం. ఇంగర్‌షీమ్‌లోని ఒక పదాతిదళ సైనికుడు తన ఉన్నతాధికారిని ఉద్దేశిస్తూ జర్మన్ భాషలో స్వయంగా తన చేతితో రాసిన ఉత్తరం ఇది. దీనిలో అతడు కీలకమైన సైనిక విన్యాసాల గురించి వివరించాడు’ అని తెలిపారు. ప్రస్తుతం తూర్పు ఫ్రాన్స్‌లో భాగమైన ఇంగర్‌షీమ్ ఒకప్పుడు జర్మనీలో భాగంగా ఉండేది. ఇక ఈ ఉత్తరం ఈ ఏడాది సెప్టెంబర్‌లో సదరు దంపతుల చేతికి చిక్కింది. వారు దీన్ని జార్డికి అందించారు. అతడు ఓ జర్మన్ స్నేహితుడి సాయంతో ఈ మెసేజ్‌ని డీకోడ్ చేశాడు. ఇక ఈ ఉత్తరాన్ని అపూర్వమైనదిగా పేర్కొన్న జార్డి దాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు.