prabash
-
టాలీవుడ్ ముందుకు... కథలు వెనక్కి..!
తెలుగు సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో ముందు ముందుకెళుతోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి’ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇలా వసూళ్ల పరంగా ముందుకు వెళుతున్న టాలీవుడ్ కథల పరంగా వెనక్కి వెళుతోంది. అవును... ఇప్పుడు పలువురు స్టార్ హీరోలు పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పదికి పైగా పీరియాడికల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. 20వ శతాబ్దపు కథలతో రూపొందుతున్న ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ఓ వైపు రాజాసాబ్...మరోవైపు ఫౌజీ యుద్ధానికి సరికొత్త నిర్వచనం ఇవ్వనున్నారు ప్రభాస్. ఇందుకోసం ఈ హీరో దాదాపు 80 ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటించనున్నారు. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లోప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం పోస్టర్‌పై కనిపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’, ‘హైదరాబాద్ చార్మినార్’, ‘ఆపరేషన్ జెడ్’, ‘పవిత్రాణాయ సాధూనాం’ వంటి అంశాలు సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. కొన్ని వాస్తవ ఘటనలకు కొంత కాల్పనికతను జోడించి ఈ సినిమా కథ తయారు చేశారట హను రాఘవపూడి. మాతృభూమి కోసం పోరాడే ఓ యోధుడి నేపథ్యంలో సాగే సినిమా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ‘ఆధిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయం అది. అలాంటప్పుడు ఆ యుద్ధానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు ఓ యోధుడు’’ అంటూ ఈ సినిమా కథ గురించి ఇటీవల పేర్కొన్నారు హను రాఘవపూడి. జయప్రద, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా 1990 నాటి కథేనని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ను చూపించ నున్నట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధీ కుమార్ మరో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.ఇటు డ్రాగన్... అటు దేవరఎన్టీఆర్ను ‘డ్రాగన్’గా మార్చారట ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 8న ఈ సినిమాప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్‌పై 1969, గోల్డెన్ ట్రయాంగిల్, చైనా, భూటాన్, కోల్‌కతా అని పేర్కొంది చిత్రయూనిట్.దీంతో 1969 నేపథ్యంలోనే ఈ సినిమా కథనం ఉంటుందని, ఆ సమయంలో జరిగిన ఓ వాస్తవ ఘటనకు కల్పిత అంశాలను జోడించి, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుంది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దేశంలో విస్మరణకు గురైన తీరప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తారు. రెండు భాగాలుగా ‘దేవర’ రిలీజ్ కానుంది. తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది.పెద్ది!రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో అన్నదమ్ముల్లా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కొంచెం బరువు పెరగాలనుకుంటున్నారు. రా అండ్ రస్టిక్‌గా ఆయన లుక్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.రాయలసీమ నేపథ్యంలో...హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్ మూవీగా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్, రాహుల్‌ల కాంబినేషన్లో మరో సినిమా రానుంది. రాయలసీమ నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రానుంది. ఈ పీరియాడికల్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే విజయ్ హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ సినిమా నిర్మించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది.అసాధారణ ప్రయాణంఓ సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అసాధారణ ఘటనల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. 1980 నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా ఉంటుంది. ఇందులో ఓ బ్యాంక్ క్యాషియర్‌గా దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది.క.. సస్పెన్స్కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడికల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ డ్రామా ‘క’. దర్శకత్వ ద్వయం సుజిత్– సందీప్ తెరకెక్కిస్తున్నారు. కృష్ణగిరి పట్టణం, అక్కడ ఉన్న ఓ పోస్ట్‌మేన్, అతని జీవితంలోని మిస్టరీ ఎపిసోడ్ అంశాల నేపథ్యంలో ‘క’ సినిమా కథనం ఉంటుంది. చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘క’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నాయి.బచ్చల మల్లి ‘బచ్చల మల్లి’గా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా యాక్షన్ చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ఓ ఊరి చుట్టూ ఉంటుందని తెలిసింది. ఇందులో ట్రాక్టర్ డ్రైవర్ మల్లి పాత్రలో కనిపిస్తారు ‘అల్లరి’ నరేశ్. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ఎదురు చూపు ఓప్రాంతం ఒకతని కోసం ఎదురు చూస్తోంది. అతని పేరు సాయి దుర్గాతేజ్. 1940 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌లో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. ‘హను–మాన్’ నిర్మాతలు చైతన్య, నిరంజన్‌రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రోహిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాలు పడుతున్న ఓప్రాంత వాసుల జీవితాలు ఓ వ్యక్తి రాకతో ఎలా మారతాయి? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.24 సంవత్సరాలు హీరో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ అంశాలతో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. 1958 నుంచి 1982... అంటే ఇరవై నాలుగు సంవత్సరాల టైమ్ పీరియడ్‌లో ‘మట్కా’ సినిమా కథనం ఉంటుంది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
టాలీవుడ్ స్నిప్పెట్లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్డేట్
-
ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్) కానీ తాజాగా కల్కి సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త అనే చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని మార్చేస్తున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ తేదీన ప్రేక్షకుల ముందుకు కల్కి రావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని సమాచారం. మే 9న 2024 సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిత్ర నిర్మాత అశ్విన్ దత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చినట్లు పలు మీడియాలలో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ సినిమా విడుదల తేదీలో మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విడుదల తేదీని మార్చడానికి కారణాలు కల్కి 2898 AD విడుదల తేదీని మార్చడానికి ప్రధాన కారణం VFX పనులే అని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ విలువలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా భారీ సీన్లన్ని VFX మీదే అధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే సినిమా విడుదల తేదీని పొడిగించారని సమాచారం. (ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) -
Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు. సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో సినిమాకు బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ చేసి ఉంటే.. ఈరోజు మూవీ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్స్ ఫాలో అవుతున్నారు. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) ప్రభాస్ ఎక్కడ టాలీవుడ్లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్ థియేటర్లలో చూసేవాడు. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి పెరిగిపోవడంతో ముంబయి వెళ్లి తన సినిమాను చూసేవాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడా ఇదే పరిస్థితి ఎదురుకావడం వల్ల ఇప్పుడు ఫారెన్‌లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాలో ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్ చూశాడట. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలికి ఏర్పడిన గాయం మళ్లీ ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్లో కూడా కాలి నొప్పితో ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట. అనంతరం కొన్నిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ మూవీ సెట్లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) -
ప్రభాస్ మొదటి సినిమాకు ఎంత లాభం వచ్చిందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్‌గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన) -
అలాంటి వారు థియేటర్ల వద్ద కనిపిస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. టీజర్ విడుదల సమయంలో సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాయి. తాజాగా సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. (ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?) జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి నుంచే టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు . ఉదయం నాలుగు గంటలకే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే వారికి ప్రభాస్ అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకొని వచ్చి మరీ రివ్యూలు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. అలాంటి వారి చేష్టలను చూస్తూ ఊరుకోం అని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ ఎవరైన హనుమంతుడు, రాముడు గెటప్‌లో వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం అలాంటి పనులు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి.. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకండి అంటూ వారు తెలిపారు. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే..) -
Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?
టాలీవుడ్ నుంచి బాలీవుడ వరకు అందరి చూపు ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ఎవరితను..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్ని సినిమాలు చేశాడు? అంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అతను ముంబయిలో పుట్టాడు.. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే) మొదట అతను బాల నటుడిగా పని చేశాడు, అలాగే కాలేజీలో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' అనేది ఆయనకు మొదటి సినిమా. ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి 'నీనా రౌత్ ఫిలిమ్స్' పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అతనికి వచ్చింది. మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ) ప్రభాస్‌తో ఓం రౌత్ పరిచయం ఎక్కడ జరిగిందంటే టి సిరీస్ సంస్థతో ప్రభాస్‌కు మంచి అనుబంధం వుంది. సాహో , రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్‌కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్‌లో విడుదల అయింది. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడంతో.. అలా ఆదిపురుష్‌కు అంకురార్పణ జరిగింది. ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఓం రౌత్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు అన్ని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
Adipurush: దశరథుడి పాత్రలో ఎవరు నటించారో తెలిస్తే...
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి దర్శకుడు ఓంరౌత్ 'ఆదిపురుష్' తెరకెక్కించాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తున్న సంగతే తెలసిందే. శ్రీరాముడి తండ్రి దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్ నటించారని ప్రచారం జరుగుతుంది. కొడుకుగా రాముడి పాత్రలో కనిపిస్తూనే, మొదటి కొంతసేపు తండ్రిగా దశరథుడు పాత్రలో కూడా ప్రభాస్ కనిపించి అలరించాడని, ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా టీజర్ విడుదల సమయంలో VFX పట్ల మేకర్స్‌పై భారీ ట్రోలింగ్ దెబ్బ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ అంటున్నారు. (ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విటర్ రివ్యూ) తెలంగాణలో ఆరు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రసాద్ ఐమ్యాక్స్‌లో షో వెశారు. అక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది. అక్కడ మొత్తం ఆరు స్క్రీన్స్‌లోనూ బెనిఫిట్ షోలు వేశారు. ‘ఆదిపురుష్’ మంచి విజయం అందుకోవాలని టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను, టాలీవుడ్లో కేవలం నటుడిగానే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అసిస్టెంట్‌గా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం తనపై వచ్చిన రూమర్స్ గురించి తాజాగా స్పందించాడు. సీనియర్ నటి తులసితో ఎఫైర్ ఉందని అప్పట్లో రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు. ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్ ప్రచారం చేశారు. తనకు తులసి అంటే తల్లితో సమానం అన్నాడు. 'డార్లింగ్' సినిమా షూటింగ్ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్ శ్రీను తెలిపాడు. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!) సినిమా షూటింగ్ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకున్నట్లు తెలిపాడు. తమపై రూమర్స్ వస్తున్నట్లు మొదట ఆవిడే మెసేజ్ పెట్టారని చెప్పుకొచ్చాడు. ' ఈ రూమర్స్ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఒక డాక్టర్ అని. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇలాంటి రూమర్స్ నమ్మదంటూ.. వాటిని చూసి నవ్వుకుని వదిలేశామని చెప్పాడు. (ఇదీ చదవండి: బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచిన అనుపమతో పోటీ పడుతున్న తమన్నా) -
‘ఆదిపురుష్’ థియేటర్లో అక్కడ ఎవరూ కూర్చోకండి
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ‘ఆదిపురుష్’ పోస్టర్లతో నిండిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతుండటంతో.. చివరి దశ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఆదిపురుష్ టీమ్ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఓ ప్రకటన చేసింది. ఆదిపురుష్ స్క్రీనింగ్ సమయంలో ప్రతి థియేటర్లో ఒక సీటు అమ్ముడుపోదు.. ఆ సీటులో ఎవరూ కూర్చోకూడదని మేకర్స్ చెప్పారు. ప్రజల విశ్వాసాలను కాపాడేందకు ఆ సీటును రామ భక్తుడు హనుమంతునికి అంకితం చేయబడుతుందని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్'!) అంతే కాకుండా వారు ఇలా ప్రకటించారు. "రామాయణం ఎక్కడ పఠించినా హనుమంతుడు కనిపిస్తాడు. ఇది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు అమ్మకుండా హనుమంతుడికి రిజర్వ్ చేయబడుతుంది. రాముని గొప్ప భక్తుడు హనుమంతుడి గురించి జూన్ 16న అందరూ తెలుసుకోండి.'' అని యూనిట్ తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడ ఐదు భాషల్లో ‘ఆదిపురుష్’ తెరపైకి రానుంది. చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్6)న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనుంది. (ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా: నటి) -
ఒకే టికెట్ పై రెండు సినిమాలు
-
వెయ్యి కోట్లు హంగామా
-
హనుమాన్ గుడి లో ఆదిపురుష్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు
-
సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీపై తాజాగా మాజీ ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. రీసెంట్గా సీఎం జగన్‌తో జరిగిన సినీ పెద్ద సమావేశం అభినందనీయమని పేర్కొన్నాడు. ఈ భేటీపై నరేశ్ హర్షం వ్యక్తం చేస్తూనే.. ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో వర్క్ షాప్ అవసరమని సోషల్ మీడియా వేదిక అభిప్రాపడ్డాడు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఈ మేరకు ‘సీఎం జగన్‌తో భేటీ ప్రశంసించదగ్గదని. కానీ ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రయోజనాల కోసం ఒక వర్క్ షాప్ పెట్టడం అవసరం. తెలుగు చిత్ర పరిశ్రమ ఐక్యతను ప్రతిబింబించే విధంగా.. ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపి అధికారికంగా తీర్మానాలు జారీ చేయాలి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చదవండి: ఆ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిందా? కాగా ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న సీఎం జగన్‌తో జరిగిన ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణ మొరళితో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల రేట్ల అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతి మేరకు సీఎం జగన్ ఏపీలో 5వ షోకు అంగీకారం తెలిపారు. ఇక ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ పెద్దలు.. త్వరలోనే పరిశ్రమకు శుభవార్త వస్తుందని చెప్పారు. The meeting with cm is laudable. But the need of the hour is a work shop led by FILM CHAMBER on larger interests of TFi,amicable solutions & resolutions passed OFFICIALY & democratically reflecting the unity of TFI & earning da respect of da govt & people. Hopefully soon — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 12, 2022 -
‘ఆదిపురుష్’ డైరెక్టర్ కండీషన్
ముంబయ్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలువురు బాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ‘ఆదిపురుష్’ టీమ్ సెట్లో కరోనా సోకకుండా ఉండేలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. షూటింగ్ స్పాట్లో పాతికమందికంటే ఎక్కువ సిబ్బంది ఉండకూడదని కండీషన్ పెట్టారు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్. అలాగే షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయిస్తున్నారు. ఇలా కరోనా కండీషన్స్, జాగ్రత్తల మధ్య ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ ఊపందుకుంది. ముంబయ్‌లో జరుగుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వచ్చే నెల రెండోవారం వరకూ జరుగుతుంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గా కృతీ సనన్, విలన్‌గా సైఫ్ అలీఖాన్, కీలక పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. -
రాధేశ్యామ్ స్టోరీలైన్ తెలిసిపోయింది!
రెబల్‌స్టార్ ప్రభాస్ తదుపరి సినిమా రాధేశ్యామ్. బాహుబలి తరువాత ప్రభాస్ తీస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. వరుస విడుదలవుతున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే డార్లింగ్ ఈ సినిమాలో తన లుక్‌తో అందరిని కట్టిపడేశాడు. ఇక డార్లింగ్ సరసన మన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజ కూడా తన అందంతో అందరిని మరోసారి ఆకట్టుకుంది. అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని చాలా మంది అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య జరిగే కన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సచిన్ కేడ్కర్ తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ప్రభాస్ భవిష్యత్తు పట్ల చాలా స్పష్టమైన ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనన్నుట్లు సచిన్ కేడ్కర్ తెలిపారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఎలా తెరపై చూపించనున్నారో సినిమా విడుదలైన తరువాత తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. చదవండి: ‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా? -
ఇటలీలో ఇస్టార్ట్
కోవిడ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ పనిలో పడ్డారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ ఇవాళ ఇటలీలో తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ ప్రేమకథ ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటలీలో నేడు ప్రారంభం కానుంది. చిత్ర బృందం మొత్తం ఇటీవలే ఇటలీ ప్రయాణం అయింది. ఈ షెడ్యూల్ సుమారు 20 రోజులపాటు సాగనుందని సమాచారం. ఈ చిత్రంలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. -
ప్రభాస్ సినిమాలో మరోసారి రానా!
రానా, ప్రభాస్ కలిసి నటించిన బాహుబాలి ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ తాజాగా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు) ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. బాహుబలిలో భల్లాల దేవగా ప్రభాస్‌తో కలిసి నటించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో గెస్ట్‌రోల్ చేయబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. అయితే కేవలం రెండు నిమిషాల పాటు మాత్రమే రానా ఈ సినిమాలో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటించనున్నారు. యువీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా కూడా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. (రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది అతడే?) -
నేనున్నాను!
‘బాధ అయినా, సంతోషం అయినా నాతో షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు’ అని బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ అంటే... ‘నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నారు ప్రభాస్. అంతేనా.. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై గన్స్‌తో ఎటాక్ జరుగుతున్నప్పుడు ‘అసలు ఎవరు వీళ్లు?’ అని శ్రద్ధ అడుగుతుంది... ‘ఫ్యాన్స్’ అని ప్రభాస్ సమాధానం. ఇంతలో శ్రద్ధ అక్కడి నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఫైరింగ్ సౌండ్ రెట్టింపు అవుతుంది.. ‘ఇంత వయొలెంట్‌గా ఉన్నారేంటి’ అని ప్రభాస్‌ను ఆమె అడిగితే.. ‘డైహార్డ్ ఫ్యాన్స్’ అని సమాధానం చెబుతాడు ప్రభాస్. ఈ డైలాగ్స్‌తో పాటు కొన్ని యాక్షన్ సీన్లతో గురువారం విడుదలైన ‘సాహో’ టీజర్ అదిరిపోయిందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇదివరకే ప్రభాస్, శ్రద్ధాకపూర్ లుక్స్‌ను రిలీజ్ చేసిన టీమ్ ఇటీవల ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోలను కూడా విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా దాదాపు 98 సెకన్లు నిడివి ఉన్న ‘సాహో’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి, నాగార్జున, రానా.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ‘సాహో’ టీజర్‌ను ప్రశంసించారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో ఆస్ట్రియాలో ప్రభాస్, శ్రద్ధాకపూర్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను తీయబోతున్నారని తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
బాహుబలి 2 ట్రైలర్ విడుదల
-
‘బాహుబలి 2’ లోగో ఆవిష్కరణ
-
దుబాయిలో గామా అవార్డ్స్
-
‘గరం’ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రభాస్
-
బాహుబలి వచ్చేస్తున్నాడు